శ్రీకాళహస్తి: ముక్కంటి క్షేత్రంలో పెళ్లి కళ ఉట్టిపడింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం వేకువజామున ఆదిదంపతుల కల్యాణం కమనీయంగా సాగింది.
మండపంలో స్వామి, అమ్మవార్లను బంగారు ఆభరణాలతో అలంకరించి వేదోక్తంగా పూజలు చేశారు. అనంతరం స్వామివారిని గజ వాహనంపై, అమ్మవారిని సింహ వాహనంపై అధిష్టింపజేసి పెండ్లి మండపం వద్దకు తీసుకొచ్చారు.
స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం సందర్భంగా 59 నూతన జంటలు ఏకమయ్యాయి. నూతన వధూవరులకు ముక్కంటి ఆలయం తరఫున మంగళ సూత్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, దుస్తులు అందజేశారు.


