87 ఏళ్ల ప్రముఖ న్యాయవాది, మిలియనీర్‌ దారుణ హత్య | Millionaire Lawyer In US found dead Under Mysterious Circumstances At Retirement Home | Sakshi
Sakshi News home page

87 ఏళ్ల ప్రముఖ న్యాయవాది, మిలియనీర్‌ దారుణ హత్య

Feb 18 2026 4:56 PM | Updated on Feb 18 2026 5:21 PM

Millionaire Lawyer In US found dead Under Mysterious Circumstances At Retirement Home

ప్రముఖ న్యాయవాది (87) కోటీశ్వరుడు, దాత రాబర్ట్ ఫుల్లర్ జూనియర్ దారుణ హత్య కలకలం రేపింది. అమెరికాలోని మేరీల్యాండ్‌ లోని పోటోమాక్‌లోని కోగిర్ పోటోమాక్ సీనియర్ లివింగ్  (Cogir Potomac Senior Living)) ఫెసిలిటీలో తన అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించారు.   ఆయన్ని గుర్తు తెలియని తుపాకీతో కాల్చి చంపినట్టు అదికారులు భావిస్తున్నారు.

న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం, ఉదయం 7:34 గంటల ప్రాంతంలో ఎమర్జెన్సీ రెస్పాండర్లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఫుల్లర్ తలకు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉండటం గమనించారు. ఆ గాయం తుపాకీ కాల్పులదేనని, ఇది హత్య అని ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు ప్రస్తుతం నిఘా కెమెరాల (surveillance footage) ఆధారంగా విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటివరకు ఎవరినీ అనుమానితులుగా గుర్తించలేదు, అరెస్టు చేయలేదు.

యాజమాన్యం స్పందన
ఆయన మరణంపై సంతాపం  ప్రకటించింది.  తమ నివాసితుల , సిబ్బంది భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత అని పేర్కొన్న కోగిర్ పొటోమాక్ యాజమాన్యం, భద్రతాపరమైన మార్పుల గురించి లేదా సిబ్బంది ప్రమేయం గురించి ఇంకా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.  

ఎవరీ రాబర్ట్ ఫుల్లర్ జూనియర్ 
అమెరికా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మెల్విల్ ఫుల్లర్ మునిమనవడు రాబర్ట్‌ ఫుల్లర్‌.  మైనే (Maine) రాష్ట్రంలో 35 ఏళ్లపాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. యు.ఎస్. నావల్ రిజర్వ్‌లో సీనియర్ అధికారిగా పనిచేశారు.

(జస్ట్‌ అప్పగింతల ముందు తెలిసింది, పెళ్లి రద్దు!)

ప్రముఖదాతగా గుర్తింపు  
ఆగస్టా నగరంలోని కోనీ హైస్కూల్ అథ్లెటిక్ సౌకర్యాల మెరుగుదల కోసం 1.64 మిలియన్‌ డాలర్ల భారీ విరాళం ఇచ్చారు. మైనే జనరల్ మెడికల్ సెంటర్, కెన్నెబెక్ హిస్టారికల్ సొసైటీ వంటి సంస్థలకు కూడా ఆయన మద్దతుగా నిలిచారు. రాబర్ట్‌ పుల్లర్‌ మరణానంతరం ఆగస్టా నగరం నివాళులర్పిస్తూ, ఫుల్లర్ కేవలం దాత మాత్రమే కాదు, ఆగస్టా ప్రజల పట్ల, నగర భవిష్యత్తు పట్ల గొప్ప  విశ్వాసం ఉన్న  గొప్ప వ్యక్తి అని కొనియాడింది. సిటీ కౌన్సిల్ , ప్రజల తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.

ఇదీ చదవండి: పెళ్లి కూతురిపై రూ. 8.5 కోట్ల వర్షం, కట్‌ చేస్తే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement