బ్లింకిట్‌కు షాకిచ్చిన ఢిల్లీ పోలీసులు | Delhi Police books Blinkit for selling illegal knives used to carry out 2 cases | Sakshi
Sakshi News home page

బ్లింకిట్‌కు షాకిచ్చిన ఢిల్లీ పోలీసులు

Feb 18 2026 5:39 PM | Updated on Feb 18 2026 5:46 PM

Delhi Police books Blinkit for selling illegal knives used to carry out 2 cases

క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్‌కు ఎదురుదెబ్బ తగిలింది.తన ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ ద్వారా నిషేధిత కత్తులను అమ్మకానికి అందిస్తున్నట్లు ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు ఆయుధ చట్టం కింద ప్రథమ సమాచార నివేదిక (FIR) నమోదు చేశారు.

ది టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం  ప్రకారం పశ్చిమ ఢిల్లీలోని ఖ్యాలా పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. ఫిర్యాదు ప్రకారం, ఖ్యాలా ప్రాంతంలో ఇటీవల జరిగిన రెండు హత్య కేసులు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కొనుగోలు చేసిన కత్తులను ఉపయోగించి జరిగాయని ఆరోపించారు. ఆ సంఘటనల తర్వాత, అధికారులు అమ్మకానికి ఉన్న కత్తులను జాబితా చేస్తూ ఇ-కామర్స్ , రాపిడ్-డెలివరీ సేవలను పరిశీలించారు.

ఇందులో  భాగంగానే కానిస్టేబుల్ ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 3.43 గంటలకు ఆన్‌లైన్ లావాదేవీ ద్వారా రూ. 710 చెల్లించి కత్తి కోసం ఆర్డర్ ఇచ్చాడు. డెలివరీ చిరునామాను ఉద్దేశపూర్వకంగా పోలీస్ స్టేషన్ అడ్రస్‌ ఇచ్చారు. ఆ వస్తువు అదే రోజు సాయంత్రం 4.05 గంటలకు స్టేషన్ ప్రాంగణంలో డెలివరీ  అయింది. కొనుగోలుకు సంబంధించిన పన్ను ఇన్‌వాయిస్ విక్రేతను ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌గా గుర్తించిందని, పశ్చిమ ఢిల్లీలోని తిహార్ గ్రామంలోని చిరునామాతో ఉంది. దీని ఆధారంగా ఆయుధ చట్టంలోని సెక్షన్ 25, 54 మరియు 59 కింద కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి : పెళ్లి కూతురిపై రూ. 8.5 కోట్ల వర్షం, కట్‌ చేస్తే!

బ్లింకిట్ ద్వారా ఆర్డర్  తమకు డెలివరీ అయిన ‘గరారిదార్’కత్తి  ప్రమాణాలునిర్ధిష్టప్రమాణాలకు మించి ( గరిష్ట బ్లేడ్ పొడవు 7.62 సెం.మీ  బ్లేడ్ వెడల్పు 1.72 సెం.మీ) కంటే  ఎక్కువగా ఉందని ప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (పశ్చిమ) దారాడే శరద్ భాస్కర్ తెలిపారు.కత్తి బ్లేడ్ పొడవు 8 సెం.మీ. వెడల్పు 2.5 సెం.మీ ఉది ఇది ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన చట్టవిరుద్ధమైన  చర్య అని పేర్కొన్నారు.  ఫిర్యాదు ప్రకారం, స్వాధీనం చేసుకున్న వస్తువులో స్టీల్ బ్లేడ్ ,స్టీల్ స్ట్రిప్ మెకానిజంతో అమర్చబడిన బ్లాక్ మెటల్ హ్యాండిల్ ఉన్నాయి.

అనంతరం ఢిల్లీ అంతటా ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన  అనేక స్టోర్‌లు,ఇతర అవుట్‌లెట్‌లపై దాడులు నిర్వహించిన పోలీసులు 16 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. మరుసటి రోజు దాడులు కొనసాగాయి. హర్యానాలోని గుర్గావ్‌లోని ఫరూఖ్‌నగర్‌లో ప్లాట్‌ఫామ్ నిర్వహిస్తున్న గిడ్డంగి నుండి 32 అదనపు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసుకు సంబంధించి మొత్తం 50 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత ఆయుధాల సోర్సింగ్, నిల్వ మరియు పంపిణీకి బాధ్యతను నిర్ణయించడానికి తదుపరి విచారణలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
ఈ పరిణామంపై బ్లింకిట్‌ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement