breaking news
Delhi police
-
విద్యార్థుల అణచివేతకు కుట్ర: అభిజీత్ దిప్కే
న్యూఢిల్లీ: పార్లమెంట్ ముట్టడి ఆందోళన సందర్భంగా జరిగిన హింసపై ‘కాక్రోచ్ జంతా పార్టీ’ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంట్ మార్చ్ సమయంలో బీజేపీ గూండాలే హింసను సృష్టించారని, విద్యార్థులను లక్ష్యంగా చేసుకునే ఉద్దేశపూర్వకంగా ఈ కుట్ర పన్నారని ఆయన విమర్శించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ఈ ఘర్షణల్లో గాయపడిన పోలీసు సిబ్బందికి ఆయన సానుభూతి తెలిపారు. అదే సమయంలో పోలీసులు విద్యార్థుల పట్ల వ్యవహరించిన తీరును తప్పుబట్టారు.మరోవైపు, ఈ ఘర్షణల్లో గాయపడిన నలుగురు పోలీసు అధికారుల కుటుంబ సభ్యులు న్యూఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. పోలీసుల హింసపైనే చర్చ జరుగుతోందని, తమ కుటుంబాలు అనుభవిస్తున్న క్షోభను, పోలీసులకు అయిన గాయాలను ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీపీ సతీమణి ఉప్నీత్ కౌర్ మాట్లాడుతూ.. ప్రతి యూనిఫాం వెనుక ఒక భార్య, పిల్లలు, వృద్ధులైన తల్లిదండ్రులు ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘర్షణల్లో 250 మందికి పైగా పోలీసులు గాయపడ్డారని, ప్రభుత్వ ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లిందని వారు తెలిపారు.కాగా అసహ్యకరమైన రీతిలో సోషల్ మీడియాలో తన తండ్రిని నేరస్థునిగా చిత్రీకరిస్తున్నారని ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థిని కుంజల్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో కూడా గాయపడిన పోలీసుల గురించి ఎలాంటి చర్చ జరగడం లేదని వాపోయారు. జూలై 20 నాటి ఈ ఘటనపై అటు పోలీసు కుటుంబాల నుంచి, ఇటు విద్యార్థుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.ఇది కూడా చదవండి: ‘నాన్న జ్ఞాపకం’ చోరీ.. తెచ్చిస్తే రూ. 5 లక్షలు, ఉద్యోగం! -
కాక్రోచ్లు ఏం చేశారో చూడండి.. ఢిల్లీ పోలీసుల కుటుంబాల ఆవేదన
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ విద్యార్థుల ఆందోళన సందర్భంగా పోలీసులు కర్కశంగా వ్యవహరించారంటూ విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. గాయపడిన పోలీసుల కుటుంబాలు మరో వాదనను తెరపైకి తీసుకొచ్చాయి. జంతర్ మంతర్ వద్ద జరిగిన ఘర్షణల్లో పోలీసులపై కూడా తీవ్ర దాడులు జరిగాయని ఆరోపిస్తూ బాధిత సిబ్బంది కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. తమవాళ్లపై జరిగిన దాడులకు కూడా న్యాయం కావాలని డిమాండ్ చేశారు.ఢిల్లీ పోలీసులు శుక్రవారం ఉదయం సంచలన ప్రెస్‌మీట్ నిర్వహించారు. జంతర్ మంతర్ ఆందోళనల్లో గాయపడిన పోలీసుల కుటుంబాలు ఘటనకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వాళ్ల కుటుంబ సభ్యులు.. అసాంఘిక శక్తులు చొరబడి హింసకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పటివరకు విద్యార్థులపై పోలీసుల చర్యల గురించే ఎక్కువగా చర్చ జరిగిందని, కానీ విధి నిర్వహణలో గాయపడిన పోలీసుల పరిస్థితిని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాయి.నా తండ్రిని ఈడ్చుకెళ్లి కొట్టారు.. ఢిల్లీ పోలీస్ ఏఎస్ఐ కుమార్తె మాట్లాడుతూ తన తండ్రిపై జరిగిన దాడిని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. తన తండ్రి గతంలో 15 ఏళ్ల పాటు భారత నౌకాదళంలో మెరైన్ కమాండోగా పనిచేశారని, అనంతరం ఢిల్లీ పోలీస్‌లో చేరారని తెలిపారు. #WATCH | Delhi | Daughter of a Delhi Police SI (Sub-Inspector) who sustained injuries during the clash between Police and protesters in Delhi, says, "...Before joining the police, my father served as a Marine Commando in the Indian Navy. He dedicated 15 years of his life to the… pic.twitter.com/aevnbcdNyQ— ANI (@ANI) July 31, 2026“జంతర్ మంతర్ వద్ద బ్యారికేడ్ల దగ్గర విధుల్లో ఉన్న సమయంలో ఓ గుంపు ఆయనను ఈడ్చుకెళ్లింది. దాదాపు మూక దాడికి గురయ్యారు. స్పృహ కోల్పోయి ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో నాలుగు గంటలు ఉన్నారు” అని ఆమె తెలిపారు. “రాత్రి 10 గంటలకు సహచర పోలీసులు ఇంటికి తీసుకొచ్చారు. ఆయన యూనిఫాం మొత్తం రక్తంతో తడిసిపోయింది. ఆ దృశ్యం మా కుటుంబానికి ఎప్పటికీ మర్చిపోలేని బాధ” అని చెప్పారు. తన తండ్రి తలకు నాలుగు కుట్లు పడ్డాయని, అయినప్పటికీ “ఇవి విధిలో భాగమే” అంటూ కుటుంబాన్ని ధైర్యం చెప్పారని ఆమె పేర్కొన్నారు.‘సోషల్ మీడియాలో మమ్మల్ని నేరస్థులుగా చూపిస్తున్నారు’పోలీసులపై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ.. “సోషల్ మీడియాలో నా తండ్రినే నేరస్థుడిగా చూపిస్తున్నారు. కానీ దాడికి గురైన మా కుటుంబానికి కూడా న్యాయం కావాలి. మాకు కూడా సమాన హక్కులు ఉన్నాయి” అని ఏఎస్ఐ కుమార్తె అన్నారు. గాయపడిన పోలీసుల కుటుంబాలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాయని తెలిపారు.‘రాళ్ల దాడిలో నా భర్త హెల్మెట్ పగిలిపోయింది’మరో ఏఎస్ఐ భార్య సీమ మాట్లాడుతూ.. 33 ఏళ్లుగా పోలీస్ శాఖలో పనిచేస్తున్న తన భర్త జులై 20న జంతర్ మంతర్ వద్ద విధుల్లో ఉన్నారని చెప్పారు. ఆందోళనకారుల సంఖ్య పెరిగిందని, కొందరు పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారని భర్త తనకు చెప్పారని తెలిపారు.VIDEO | Wife of a Delhi Police ACP who sustained injuries during the clash between police and CJP protesters in Delhi on July 20, says, "When he returned home late on the night of July 20 with injuries, it was an extremely painful and traumatic moment for me and my two-year-old… pic.twitter.com/l6YllUXHS3— Press Trust of India (@PTI_News) July 31, 2026“ఆందోళనకారులు పూల కుండీలు, చెప్పులు, రాళ్లతో పోలీసులపై దాడి చేశారు. నా భర్త ధరించిన హెల్మెట్ రాళ్ల దాడిలో పూర్తిగా ధ్వంసమైంది. హెల్మెట్ లేకపోతే ఆయన ప్రాణాలతో ఉండేవారు కాదేమో” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.‘సీనియర్ అధికారులను కాపాడుతూ గాయపడ్డారు’మరో ఏఎస్ఐ కుమారుడు లక్ష్య మాట్లాడుతూ.. తన తండ్రి సీనియర్ అధికారులను సురక్షిత ప్రాంతానికి తరలించే ప్రయత్నంలో రాళ్ల దాడికి గురయ్యారని ఆరోపించారు. “తలపై రాయి తగలడంతో నాలుగు కుట్లు పడ్డాయి. ఆన్లైన్లో చూస్తే పోలీసులపై మాత్రమే విమర్శలు కనిపిస్తున్నాయి. మా బాధను ఎవరూ పట్టించుకోవడం లేదు” అని అన్నారు.#WATCH | Delhi | A family member of a Delhi Police official who sustained injuries during the clash between Police and protesters in Delhi, says, "This was not a student protest; rather, there were mischievous elements who tried to sabotage and discredit the students' protest and… pic.twitter.com/qfyP8CawD4— ANI (@ANI) July 31, 2026రెండు వాదనలు.. వీడియోలు వైరల్జంతర్ మంతర్ ఆందోళనపై ఇప్పటివరకు ప్రధానంగా విద్యార్థులపై పోలీసులు అధిక బలప్రయోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి. లాఠీచార్జ్, అరెస్టులు, పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా పోలీసుల కుటుంబాలు విడుదల చేసిన వీడియోలు, చేసిన ఆరోపణలు ఘటనకు మరో కోణాన్ని చూపిస్తున్నాయి. ఆందోళన సమయంలో పోలీసులు కూడా దాడులకు గురయ్యారా? లేక బలప్రయోగం అంశం ఎంతవరకు సమంజసం? అన్నదానిపై మరోసారి చర్చ మొదలైంది. ఈ వ్యవహారంలో విద్యార్థులు, పోలీసులు ఇద్దరి వాదనలు పరిశీలించి నిష్పక్షపాత విచారణ జరగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
మోదీపై వ్యాఖ్యల వివాదం.. ఎవరీ రుచికా సింగ్?
ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో నీట్ నిరసనల సందర్భంగా రెచ్చిపోయిన యువతికి పెద్ద షాక్ తగిలింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆమెపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ‘‘రాజ్యాంగ పదవి గౌరవాన్ని ఆమె వ్యాఖ్యలు దెబ్బతీశాయని.. ప్రజా శాంతికి భంగం కలిగించే ఉద్దేశంతో ఉన్నాయని’’ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.కాక్రోచ్ పార్టీ నిరసనల్లో పాల్గొన్న ఆ యువతి.. జూలై 23-24 తేదీల మధ్య ఈ వీడియో తీసినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో ఆమె ప్రధాని మోదీపై అభ్యంతరకర భాష ఉపయోగించింది. మోదీని గద్దె దిగిపోవాలని.. యువత ఆ పని చేయాలంటూ అసభ్య పదజాలంతో దూషించింది. ఆ సమయంలో కొందరు ఆందోళనకారులు ఆమెను సెల్ఫోన్లతో వీడియోలు తీసిన మరింత రెచ్చిగొట్టినట్లు కనిపించింది. అవి విపరీతంగా వైరల్ కావడంతో పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్వచ్చందంగా ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు.జీరో ఎఫ్ఐఆర్ నమోదుసుప్రీంకోర్టు న్యాయవాది స్మృతి సింగ్ చందేల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జూలై 29న నోయిడాలోని ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 352, 353(1), 356(1) కింద కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా అవమానించడం ద్వారా ప్రజా శాంతికి భంగం కలిగించడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, పరువునష్టం వంటి అంశాలపై అభియోగాలు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదులో.. సదరు యువతి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ పదవి గౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా, ద్వేషాన్ని వ్యాప్తి చేసి ప్రజా శాంతికి విఘాతం కలిగించే ఉద్దేశంతో ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాదు.. ఆ వీడియోలో ఆమె ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పేరును కూడా ప్రస్తావించడం గమనార్హం. ఎవరీ అమ్మాయి?.. జంతర్ మంతర్ నిరసనల్లో ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసిన యువతిని నోయిడాకు చెందిన రుచికా సింగ్‌గా గుర్తించారు. 25 ఏళ్ల రుచిక.. విద్యార్హతలు ఏంటో స్పష్టత లేదు. అయితే ఆమె మోడల్‌గా, ఇన్ఫ్లుయెన్సర్గా రాణిస్తున్నట్లు సమాచారం. విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశాలు, విద్యార్థుల సమస్యలపై జరిగిన ఈ నిరసనలో భాగంగా ఆమె.. ఇలా అభ్యంతరక వ్యాఖ్యలతో దేశ ప్రధానిని తిట్టడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.ఢిల్లీ పోలీసులకు బదిలీజంతర్ మంతర్ ప్రాంతం ఢిల్లీ పోలీసుల పరిధిలో ఉండటంతో నోయిడాలో నమోదైన జీరో ఎఫ్ఐఆర్ను ఢిల్లీ పోలీసులకు బదిలీ చేశారు. ఈ కేసును ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఐఎఫ్ఎస్ఓ (Intelligence Fusion and Strategic Operations) పరిశీలిస్తోంది. నిరసనకు సంబంధించిన వీడియోలు, సోషల్ మీడియా పోస్టులను పోలీసులు పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆమెను అరెస్ట్ చేశారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.సోషల్ మీడియా ఖాతాలకు నోటీసులుఈ వ్యవహారంలో ఇప్పటికే పలు సోషల్ మీడియా ఖాతాలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అభ్యంతరకరమైన, పరువునష్టం కలిగించే కంటెంట్‌ను షేర్ చేశారన్న ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎక్స్ (X) వేదికకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి సంబంధిత పోస్టులను తొలగించడం లేదంటే వాటి యాక్సెస్‌ను నిలిపివేయడం, దర్యాప్తు కోసం ఎలక్ట్రానిక్ రికార్డులను భద్రపరచాలని కోరినట్లు సమాచారం. -
పెల్లెట్ గన్స్‌ను నిషేధించలేం
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఉద్యమించిన విద్యార్థులు, యువతపై ఢిల్లీ పోలీసులు పెల్లెట్ గన్స్ ప్రయోగించినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ప్రాణాంతక ఆయుధాలను ఉపయోగించడానికి వీల్లేదని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, పెల్లెట్ గన్స్‌ను నిషేధించలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. భద్రతా సంస్థలు అసాధారణ పరిస్థితుల్లో జన సమూహాన్ని అదుపు చేయడానికి పెల్లెట్ గన్లను ఉపయోగించవచ్చని ప్రస్తుత మార్గదర్శకాలు అనుమతిస్తున్నాయని పేర్కొంది. ఈ మార్గదర్శకాలు అమల్లో ఉన్నంతకాలం వాటిపై నిషేధం విధించలేమని స్పష్టం చేసింది. కానీ, పెల్లెట్ గన్స్ దుర్వినియోగానికి సంబంధించిన నిర్దిష్ట ఆరోపణలను ఒక్కో కేసును బట్టి పరిశీలించవచ్చని సూచించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ఆందోళనల సమయంలో మెటాలిక్ పెల్లెట్ గన్ల ప్రయోగాన్ని సవాలు చేయడంతోపాటు వీటిని పూర్తిగా నిషేధించాలని కోరుతూ మాజీ కేంద్ర సమాచార కమిషనర్ యశోవర్దన్ ఆజాద్, మరో ఇద్దరు బాధితులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనాలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. జంతర్‌మంతర్ వద్ద మోహరించిన రాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్)కు సంబంధించిన మందుగుండు సామగ్రి వివరాలను భద్రపరచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(బీపీఆర్డీ) మార్గదర్శకాల ప్రకారం.. అసాధారణ పరిస్థితుల్లో పెల్లెట్ గన్స్ ఉపయోగించే అధికారం పోలీసులకు ఉందని ధర్మాసనం వెల్లడించింది. వీటి వినియోగంపై పూర్తిగా నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లోని అభ్యర్థన అస్పష్టంగా ఉందని అభిప్రాయపడింది. అసాధారణ సందర్భాల్లో పోలీసు నిబంధనలు పెల్లెట్ గన్ల వాడకాన్ని అనుమతిస్తాయని గుర్తుచేసింది. ఒకవేళ పెల్లెట్ గన్స్‌ను దశలవారీగా తొలగించాలని భావిస్తే.. అది ఆరి్టకల్ 21(జీవించే హక్కు)కి విరుద్ధంగా ఉందని పేర్కొంటూ పోలీసు నిబంధనలను సవాలు చేయాల్సి ఉంటుందని తెలియజేసింది. జూలై 20న ఢిల్లీలో పెల్లెట్ గన్ గాయాలకు గురైన ప్రశాంత్ కుమార్, షేక్ ఇర్షాద్ మన్సూరీ, ఇతరులకు తగిన చికిత్స అందించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి, ఆర్ఏఎఫ్ ఐజీకి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలో నిరసనకారులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించడం పట్ల సమాధానం చెప్పాలని పేర్కొంది. పెల్లెట్ గన్స్ వంటి ఆయుధాల వాడకాన్ని అనుమతించే పోలీసు నిబంధనలను సవాలు చేయకుండా.. గుంపును చెదరగొట్టడానికి పెల్లెట్ గన్ల వాడకంపై నిషేధం విధించాలన్న అభ్యర్థన అస్పష్టంగా ఉందని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ అన్నారు. -
జంతర్ మంతర్ వద్ద జులై 31న మరో నిరసన
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ ర్యాలీ సమయంలో పోలీసులపై దాడులు జరిగాయని ఆరోపిస్తూ ఢిల్లీ మాజీ పోలీసు అధికారులు జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగనున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలో సంఘ వ్యతిరేక శక్తులు చొరబడి పోలీసు సిబ్బందిపై దాడి చేశాయని, ఆ ఘటనలో 100 మందికి పైగా పోలీసు సిబ్బంది గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.జులై 20న కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. జనాన్ని నియంత్రించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. భద్రతా సిబ్బంది హద్దులు దాటారని నిరసనకారులు ఆరోపిస్తుండగా, సంఘ వ్యతిరేక శక్తులు తమపై దాడి చేశాయని పోలీసులు చెబుతున్నారు.ఇప్పుడు.. పదవీ విరమణ చేసిన అధికారుల సంఘం ఢిల్లీ పోలీసు ఫెడరేషన్ జులై 31న జంతర్ మంతర్ వద్ద ఒక రోజు నిరసన చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని ఢిల్లీ పోలీసు కమిషనర్ అనురాగ్ కుమార్‌కు లేఖ రాసింది. తమ దరఖాస్తులో ఫెడరేషన్ ఇలా పేర్కొంది.. ‘‘జూలై 20న జంతర్ మంతర్ పరిసరాల్లో చట్టబద్ధ విధులు నిర్వహిస్తున్న సమయంలో పెద్ద సంఖ్యలో పోలీసు, పారామిలిటరీ దళాల అధికారులు, సిబ్బంది గాయపడ్డారు. పోలీసు దళానికి సంఘీభావం తెలియజేసేందుకు జులై 31న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా చేపట్టేందుకు అనుమతి ఇవ్వండి’’ అని కోరింది. శాంతి భద్రతలు కాపాడే సమయంలో భద్రతా సిబ్బంది చేసిన త్యాగాలను ప్రస్తావించేందుకు ఈ ధర్నాకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ ధర్నాను పదవీ విరమణ చేసిన ఢిల్లీ పోలీసు సిబ్బంది అంతా కలిసి చట్టాన్ని గౌరవించే పౌరుల తరఫున నిర్వహిస్తున్నామని, ఇది పూర్తిగా శాంతియుతంగా, అహింసాత్మకంగా సాగుతుందని ఫెడరేషన్ తెలిపింది.మరోవైపు, జులై 20న జరిగిన పోలీసు చర్యపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా మంగళవారం సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. "నిరసనల సమయంలో పోలీసులకు కొత్త ప్రోటోకాల్ అవసరం" అని సుప్రీంకోర్టు పేర్కొంది. కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలోని విద్యార్థుల నిరసనల సమయంలో పోలీసులు గతంలో నిర్దేశించిన నిబంధనలు పాటించలేదని కోర్టు సూచించింది. -
జంతర్ మంతర్‌లో విద్యార్థులపై లాఠీచార్జ్ : ఎన్హెచ్ఆర్సీ సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు మితిమీరిన బలప్రయోగానికి దిగారనే ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది. లాఠీ చార్జి ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించి కేసు నమోదు చేసింది. ఈ సందర్భంగా ఎన్హెచ్ఆర్సి కీలక వ్యాఖ్యలు చేసింది. జూలై 25న జారీ చేసిన ఆదేశాల ప్రకారం, ఎన్హెచ్ఆర్సి ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు నోటీసులు పంపుతూ, దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. ప్రజా నిరసనల సమయంలో ప్రాథమిక హక్కుల పరిరక్షణపై ఈ ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని కమిషన్ అభిప్రాయపడింది. దీని తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, కమిషన్ సుమోటోగా స్వీకరిస్తోందని ఎన్హెచ్ఆర్సీ తెలిపింది.శాంతియుత నిరసన ప్రాథమిక హక్కు, శాంతిభద్రతల దృష్ట్యా కొన్ని సహేతుక పరిమితులు మాత్రమే విధించాలి కానీ, నిరసనకారులపై మితిమీరిన బలప్రయోగం కూడదని కమిషన్ వ్యాఖ్యానించింది. లాఠీచార్జి అనంతరం వారికి అందించిన వైద్య సహాయం తదితర అంశాలపై నివేదిక ఇవ్వాలని కోరింది. ఈఘటనపై సీసీటీవీ ఫుటేజ్ రికార్డు అందజేయాలని కూడా ఆదేశించింది. అలాగే అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాల ప్రకారం భారత్ పాటించాల్సిన బాధ్యతలకు విరుద్ధం" అని ఆర్డర్లో పేర్కొంది. జులై 20వ తేదీన జరిగిన ఘటనపై రెండు వారాల్లో సవివర నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులకు ఎన్ హెచ్ ఆర్ సి నోటీసులిచ్చింది.ఇదీ చదవండి: గర్భిణీ సహా ముగ్గురిపై కత్తులతో దాడి: డ్యూటీ ఆఫీసర్‌కు హ్యాట్సాఫ్నిరసనకారులకు అయిన గాయాల వివరాలతోపాటు, గాయపడిన విద్యార్థులకు వైద్య సహాయం అందిందో లేదో తెలిపే సమాచారం. నిరసన సమయంలో గుంపును అదుపు చేయడానికి అనుసరించిన ప్రామాణిక కార్యాచరణ విధానాలు, ఇంకా ఉపయోగించిన బలప్రయోగం సమర్థనీయమైనదా మరియు పరిమితులకు లోబడి ఉందా అనినిర్ధారించడానికి ఏమైనా విచారణ ప్రారంభించారా అనే వివరాలు కూడా సమర్పించాలని పోలీసులను ఆదేశించింది.కాగా నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీలపై అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీఇచ్చిన పిలుపుతో జూన్ నెలలో జంతర్ మంతర్ వద్ద నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో జూలై 20న పార్లమెంట్‌కు "సంసద్ చలో" పిలుపు తీవ్ర ఘర్షణకు దారి తీసింది. దీనికి ఎలాంటి అనుమతి లేదంటూ ఢిల్లీ పోలీసులు విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ , ఇతర బలప్రయోగ చర్యలకు దిగారని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్గామారడంతో కమిషన్ స్పందించింది. ఇదీ చదవండి: రైల్వే ప్లాట్‌ఫాంమీద పడుకునే స్థాయినుంచి, రూ.1.69 లక్షల కోట్ల కంపెనీ! -
పెల్లెట్ గన్లు గురిపెట్టారు
న్యూఢిల్లీ: జంతర్‌మంతర్ వద్ద ఈ నెల 20వ తేదీన శాంతియుతంగా నిరసన వ్యక్తంచేస్తున్న విద్యార్థులపై పోలీసులు అమానుషంగా పెల్లెట్ గన్స్‌తో కాల్పులు జరిపారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. పెల్లెట్స్ ఉపయోగించారనడానికి ఈ విద్యార్థే నిదర్శనమంటూ సాహిల్ అనే యువకుడిని శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. విద్యార్థులపై కాల్పులు జరిపి, లాఠీచార్జి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని పునరుద్ఘాటించారు. సాహిల్ త్రివర్ణ పతాకం చేతబూని శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పుడు అతడిపై పెల్లెట్ గన్‌తో దాడి జరిగిందని, తీవ్రంగా గాయపడ్డాడని చెప్పారు. సాహిల్ కన్ను దెబ్బతి న్నదని, ఆ కంటితో అతనికి ఏమీ కనిపించడం లేదని తెలిపారు. సాహిల్ శరీరానికి తగి లిన గాయాలను సైతం రాహుల్ మీడియాకు చూపించారు. వేలాది మంది యువతకు ఇదే పరిస్థితి ఎదురైందని, వారిపై పెల్లెట్ గన్లతో కాల్పులు జరిపి, లాఠీలతో విచక్షణారహితంగా కొట్టారని ఆరోపించారు. నిరసనకారులు చేసిన నేరం ఏమిటని తీవ్రంగా ప్రశ్నించారు. ధర్మేంద్ర ప్రధాన్ ఒక ‘క్రిమినల్ ఎడ్యుకేషన్ మినిస్టర్’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. భారత విద్యా వ్యవస్థ పతనానికి ప్రతీకగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. -
సీజేపీ కార్యకర్తల ఆందోళన.. నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు : సీజేఐ
ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద సీజేపీ కార్యకర్తలు, విద్యార్థుల ఆందోళనలపై సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాలపై మీడియాలో వస్తున్న కథనాలపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. కోర్టు సమయంపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన స్పష్టం చేశారు.ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. దీని వెనుక ఉన్న అసలు సందర్భాన్ని వివరించారు. ఈ పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించిందంటూ వస్తున్న వార్తలను సీజేఐ పూర్తిగా కొట్టిపారేశారు. అత్యున్నత న్యాయస్థానం ఏనాడూ ఏ కేసు విచారణను కూడా తిరస్కరించదు. ప్రజలకు న్యాయం చేసేందుకు మేము 24 గంటలూ అందుబాటులో ఉంటాము అని ఆయన తేల్చి చెప్పారు.అసలు ఏం జరిగిందనే దానిపై వివరణ ఇస్తూ.. మా ముందుకు అధికారికంగా పిటిషనే రానప్పుడు, మేము దేనిపై విచారణ జరుపుతాము? కేవలం ఒక పేజీ లేఖ ఇచ్చి, దానిపై వెంటనే అత్యవసర విచారణ చేపట్టమంటే కుదరదు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి కొన్ని నిర్దిష్ట నిబంధనలు, ప్రక్రియలు ఉంటాయి. వాటిని మేము ఉల్లంఘించలేము. పిటిషన్‌ను సరైన పద్ధతిలో దాఖలు చేయాలని నేను వారికి చెప్పాను. కానీ వారు తక్షణమే విచారణ కావాలని పట్టుబట్టారు. అందుకే నిబంధనల ప్రకారం సరైన పిటిషన్ ఫైల్ చేయాలని వారికి స్పష్టం చేయాల్సి వచ్చింది అని సీజేఐ వివరించారు.చట్టం అందరికంటే ముందు సుప్రీంకోర్టుకు అత్యున్నతమైనదని, దానిని మనమందరం అనుసరించాల్సిందేనని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఈరోజు నిబంధనల ప్రకారం సరైన రూపంలో దాఖలైన ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరించిందని ఆయన తెలిపారు. నీట్ పేపర్ లీకేజీ, ఇతర పరీక్షల అక్రమాలపై నిరసన తెలుపుతున్న విద్యార్థులు, కార్యకర్తలపై పోలీసులు జరిపిన దాడిని సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లపై వచ్చే సోమవారం విచారణ జరపనుంది. -
పోలీసుల కాళ్లు పట్టుకున్న CJP అభిజిత్.. కారణం తెలిస్తే షాక్!
-
నిరసనకారులపై పెల్లెట్ల వర్షం
న్యూఢిల్లీ: లాఠీచార్జ్‌తో విద్యార్థులను పోలీసులు చితకబాదారన్న వార్తల నడుమ మరో దారుణోదంతం వెలుగులోకి వచ్చింది. పార్లమెంట్ సమీపంలో జూన్ 20వ తేదీన జరిగిన చలో సంసద్ ర్యాలో పోలీసులు చట్టవిరద్ధంగా పెల్లెట్ గన్లను ఉపయోగించినట్లు నిర్ధారణ అయింది. తాము వాటిని ఉపయోగించలేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నప్పటికీ పెల్లెట్ గాయాలతో ఆస్పత్రిలో శస్త్రచికిత్సచేయించుకున్న పలువురి మెడికల్ రిపోర్ట్లు బహిర్గతంకావడంతో ఈ ఖాకీ దుస్తుల కర్కోటక వైఖరి తేటతెల్లమైంది. నిరాయుధులైన ఉద్యమకారులు శాంతియుతంగా చేసే ర్యాలీల్లో పెల్లెట్లు ఉపయోగించకూడదని ఐక్యరాజ్యసమతి మానవహక్కుల విభాగం గతంలోనే ఎన్నోసార్లు మొత్తుకున్నా ఢిల్లీ పోలీసులు మొద్దనిద్రపోతూ ఇప్పుడు సీజేపీ కార్యకర్తలపై పెల్లెట్ల వర్షం కురిపించారని సామాజికమాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక కంట్లో చూపు కోల్పోయిన టీనేజర్ ర్యాలీలో పాల్గొన్న 19 ఏళ్ల సాహిల్ లోకాబ్ కుడి కంట్లోకి పెల్లెట్ దూసుకెళ్లింది. దీంతో ముఖమంతా రక్తసిక్తమైన అతడిని వెంటనే సమీప లేడీ హార్డింగ్ వైద్యకళాశాలకు తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి, అక్కడా సరైన పరిష్కారం లభించకపోవడంతో చివరకు ఎయిమ్స్ ట్రామా విభాగానికి 21వ తేదీన తరలించారు. వివరాలను అతని మేనమామ అజయ్ దుగ్గల్ ఏడుస్తూ చెప్పారు. ఇప్పుడెలా ఉందిరా అని లోకాబ్ను అడిగితే అతను చెప్పిన సమాధానంతో నోట మాట రాలేదు. మసగ్గా కాదుకదా కనీసం వెలుగు కూడా కన్పించట్లేదు. అంతా చీకటే’’అని సమాధానమిచ్చారు. ‘‘పెల్లెట్ ధాటికి అతని కుడి కంటి కారి్నయాకు రంధ్రం పడింది. కారి్నయల్ పెర్ఫోరేషన్ కారణంగా కుడి కంటితో చూడగలిగే అవకాశాలు కేవలం ఒక శాతం’’అని వైద్యులు చెప్పారు. మెడ, ఛాతి, భుజం, చేతిలోకీ పెల్లెట్లు దూసుకెళ్లాయి. ఒకటి కుడి కంట్లో ఉండిపోయింది. ఢిల్లీ వర్సిటీ దూరవిద్యా కోర్సులో సాహిల్ డిగ్రీ చేస్తున్నాడు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్షకు సిద్దమవుతున్నాడు. ఇప్పుడు ఇతని భవిష్యత్ ఏంటి? అని అతని కుటుంబం ఆవేదన వ్యక్తంచేసింది. సాహిల్లాగా మరెంతో మంది పెల్లెట్ల బారిన పడ్డారని మీడియాలో సాక్ష్యాధారాలతో సహా కథనాలు వెలువడుతున్నాయి. పలువురి ముఖం, ఛాతీ, మెడ, భుజాల్లోకి పెల్లెట్లు దూసుకెళ్లాయి. ఔట్లుక్ రిపోర్టర్, 25 ఏళ్ల షేక్ ఇర్షాద్ మన్సూరీ సైతం పెల్లెట్ల బారినపడి శస్త్రచిక్సిత చేయించుకోవాల్సి వచ్చింది. వివరాలను మన్సూరీ వెల్లడించారు. ‘‘ఆరోజు మధ్యాహ్నం మూడున్నరకు ఉద్యమకారులతోపాటు వెళ్తుంటే కన్నాట్ ప్లేస్‌లోని పాలికా బజార్ వద్ద సీఆర్పీఎఫ్లోని ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) జవాన్లు గాల్లోకి బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. తర్వాత నేరుగా ఏదో ఆయుధం గురిపెట్టారు. కొన్ని సెకన్ల తేడాతో ఏదో వచ్చి నా ఎడమ కనుబొమ్మకు గుచ్చుకుంది. తర్వాత ఇంకొన్ని ఇనుపముక్కల్లాంటి నుదురు, ముక్కు, గదమ వద్ద గుచ్చుకున్నాయి. మెడలోకీ దూసుకెళ్లాయి. బాధ తాళలేక వెంటనే ఆస్పత్రికి వెళ్లా. వైద్యులు వాటిని పెల్లెట్లుగా నిర్ధారించారు. మూడు పెల్లెట్లను వెంటనే తొలగించకపోతే ప్రమాదమని చెప్పారు. ఒకటి మెడలో ప్రధాన నరం, రక్తనాళం సమీపంలో ఇరుక్కుంది. ఇంకోటి ఎడమ కంటి కదలికలను నియంత్రించే కండరం వద్ద చిక్కుకుంది. ఇంకోటి ముక్కు సమీపంలో ముఖంలోకి వెళ్లింది. వీటిని తీయకపోతే ప్రమాదమని చెప్పారు. సర్జన్ అందుబాటులో లేకపోవడంతో తర్వాతి రోజు శస్త్రచికిత్స చేసి తొలగించారు’’అని మన్సూరీ వెల్లడించారు.ఏమిటీ పెల్లెట్లు? పెల్లెట్ గన్ను పంప్–యాక్షన్ గన్ లేదా షాట్‌గన్ అని కూడా పిలుస్తారు. వీటిని పేలిస్తే చాలా చిన్నగా ఉండే ఇనుపముక్కల్లాంటివి జల్లెడలా చుట్టూతా వేగంగా దూసుకెళ్తాయి. ఇవి సెకన్‌కు 1,000 అడుగుల వేగంతో దూసుకెళ్తాయి. వీటిని ఏదైనా ఖనిజంతో లేదా రబ్బర్‌తో తయారుచేస్తారు. గన్‌లోని ఒక్కో క్యాట్రిడ్జ్‌లో 600 వరకు పెల్లెట్లు ఉంటాయి. ది బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇతర నిబంధనల ప్రకారం ప్రామాణిక నిర్వహణ విధానం(ఎస్ఓపీ)ను పాటిస్తూ తొలుత పోలీసులు మైక్‌లో ఆందోళనకారులను శాంతించాలని హెచ్చరించాలి. తర్వాత జలఫిరంగులతో అడ్డుకోవాలి. బాష్పవాయుగోళాలు ప్రయోగించాలి. తప్పదనుకుంటే లాఠీచార్జ్ చేయాలి. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోతే పెల్లెట్లు ప్రయోగించాలి. అవి కూడా నడుం కిందకు గురిపెట్టి కాల్చాలి. కానీ ప్రభుత్వ సాయుధబలగాలు ఉద్యమకారులను తరమికొట్టేందుకు నేరుగా ముఖం, ఛాతికి గురిపెడుతున్నాయని చాన్నాళ్ల నుంచి ఆరోపణలున్నాయి. -
సీజేపీ ఆందోళనకారులకు పోలీసులు బిగ్ షాక్.. ఆ పని చేస్తే పాస్‌పోర్ట్‌లు రద్దు!
సాక్షి,న్యూఢిల్లీ: నీట్ లీకేజీ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలకు బిగ్ షాక్ తగిలింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన ఆందోళనల్లో.. హింసకు పాల్పడిన వారి పాస్‌పోర్ట్‌లను రద్దు చేసే యోచనలో ఢిల్లీ పోలీసులు ఉన్నట్లు పీటీఐ నివేదిక పేర్కొంది. నీట్ పేపర్ల లీకేజీలో ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న ఒక్కో విద్యార్థికి రూ.కోటి చెల్లించాలని సీజేపీ కార్యకర్తలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చలో సంసద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వారి నిరసనలకు సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష,ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ,ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు తోడవ్వడంతో ఉద్యమం ఊపందుకుంది.పలు చోట్ల ఆందోళనకారులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేయడం, పోలీసులపై ఆందోళన కారులు తిరగబడడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. యితే, ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు శాంతియుతంగా కాకుండా హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్దేశ పూర్వకంగా దాడులకు తెగబడిన వారి పాస్‌పోర్టులు రద్దు చేసే దిశగా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.ఢిల్లీ పోలీసుల వివరాల మేరకు.. ఆందోళనకు నిబంధనలు ఉల్లంఘించి పార్లమెంట్ వీధుల్లో ఏర్పాటు చేసిన బారీకేడ్లను దాటే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో 118మంది పోలీసులకు గాయాలయ్యాయి. 15 నుంచి 20 ప్రభుత్వ వాహనాలు ధ్వంసం కాగా.. 60మంది ఆందోళనకారులు గాయపడ్డారు. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో 65మందికి చికిత్స కొనసాగుతోంది. మరోవైపు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అసాధారణ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ గెజిట్ ప్రకారం.. జూలై 19 నుండి అక్టోబర్ 18 వరకు మూడు నెలల పాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్‌కు జాతీయ భద్రతా చట్టం, 1980 కింద ముందస్తు నిర్బంధ అధికారాలను కల్పిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని విచారణ లేకుండానే 12 రోజుల నుండి 12 నెలల వరకు నిర్బంధించవచ్చు.అయితే, ఈ ఉత్తర్వులు ప్రతి మూడు నెలలకొకసారి జారీ చేసే సాధారణ ప్రక్రియేనని, జూలై 7నే దీనికి సంబంధించిన ఫైల్ ప్రాసెస్ అయిందని పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుత సీజేపీ నిరసనలకు, ఈ ఆర్డర్‌కు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని వివరించారు.శాంతిభద్రతలను కాపాడేందుకు నిరసనకారులు సహకరించాలని, సమస్యపై చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. కాగా, ఈ పోలీసుల కఠిన చర్యలకు నిరసనగా జూలై 24, శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శాంతియుత నిరసనలు చేపట్టాలని సీజేపీ పిలుపునిచ్చింది. -
యూనిఫాంలో ఉన్నంత మాత్రాన..!
ఢిల్లీ: సీజేపీ నిరసనల్లో 118 మంది పోలీసులు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు సంచలన ట్వీట్ చేశారు. తమ సిబ్బందిపై జరిగిన దాడులను ఖండిస్తూ.. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులు కూడా తమ బాధ్యతలను నెరవేర్చే క్రమంలో బాధను అనుభవిస్తారని చెబుతూ.. పోలీసు వ్యవస్థలోని మానవీయ కోణాన్ని ఎక్స్ వేదికగా ఢిల్లీ పోలీసులు ఎత్తిచూపారు.‘‘యూనిఫాం ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తికి నొప్పి తక్కువగా అనిపించదు. ప్రతి బ్యాడ్జ్ వెనుక స్పందించే గుండె.. ఒక కుటుంబం, సేవ చేస్తామనే హామీ ఉంటాయి. విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడి జరగడం తీవ్రంగా కలిచివేస్తోంది. అభిప్రాయ భేదాలుంటే గళం వినిపించొచ్చు కానీ.. హింసకు మాత్రం చోటు ఉండకూడదన్న ఢిల్లీ పోలీసుల పోస్ట్.. వైరల్‌గా మారింది.సీజేపీ ఉద్యమం మరింత ఉధృతమైంది. దేశ రాజధానితోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో మద్దతుదారులు జంతర్‌మంతర్‌కు తరలివస్తున్నారు. బుధవారం సాయంత్రం అక్కడ ఉన్న పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ జై ప్రకాశ్‌కు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘర్షణల అనంతరం ఢిల్లీ పోలీసులకు, సీజేపీకి మధ్య మాటల యుద్ధం మొదలైంది.హింసను రెచ్చగొట్టారని ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. నిరసనకారులు రాళ్ళు రువ్వడం, పోలీసు వాహనాలను ధ్వంసం చేయడంతో సీనియర్ అధికారులతో సహా 118 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఏసీపీ (పంజాబీ బాగ్) జై ప్రకాష్, ఏసీపీ (కన్నాట్ ప్లేస్) వివేక్ భగత్, ఇన్స్పెక్టర్ నంద్ కిషోర్, ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు. -
సివిల్ డ్రెస్సుల్లో లాఠీఛార్జ్.. పోలీసులపై విమర్శల వెల్లువ
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్-యూజీ పేపర్ లీక్ ఆందోళనల సందర్భంగా సివిల్ దుస్తుల్లో ఉన్న కొందరు వ్యక్తులు లాఠీలతో నిరసనకారులపై దాడి చేయడం తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. విధుల నిర్వహణకు వచ్చే సిబ్బంది తప్పనిసరిగా పోలీసు యూనిఫామ్‌లోనే హాజరుకావాలని పోలీసు ప్రధాన కార్యాలయం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జూలై 20న పార్లమెంట్ ముట్టడికి తలపెట్టిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తతకు దారితీసింది. కొక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నీట్-యూజీ పేపర్ లీక్ అంశంపై శాంతియుతంగా నిరసన తెలపాలని తలపెట్టిన ఈ కార్యక్రమం హింసాత్మకంగా మారింది. బారికేడ్లను దాటుకుని ముందుకు వెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో భద్రతా సిబ్బందికి, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన వారు గాయపడ్డారు. Jantar Mantar: men in civvies walking the street with sticks. Students ask who they are. No answer. Riot police standing nearby.Police? Another agency? Someone private? That’s not a detail you shrug off. This needs a real investigation, not silence. pic.twitter.com/GX8vEnehdt— Dilip Ray 🇮🇳 (@dilipray) July 21, 2026సివిల్ డ్రెస్సుల్లోని వ్యక్తులపై తీవ్ర విమర్శలుసామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన వీడియోలలో సాధారణ దుస్తులు ధరించి, పోలీసు లాఠీలు పట్టుకున్న కొందరు వ్యక్తులు నిరసనకారులపై హింసకు పాల్పడినట్లు స్పష్టంగా కనిపించింది. మరికొన్ని వీడియోలలో యూనిఫామ్‌లో ఉన్న కొందరు సిబ్బంది ఎలాంటి నేమ్ట్యాగ్లు (పేరు గుర్తులు) ధరించలేదని వెల్లడైంది. గుంపును చెదరగొట్టే చర్యల్లో పాల్గొన్న ఆ వ్యక్తులు ఎవరనే దానిపై తీవ్ర ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. యూనిఫామ్ లేకుండా సివిల్ డ్రెస్సుల్లో ఉన్నవారు పోలీసు విధులను నిర్వర్తించడానికి చట్టపరమైన అనుమతి ఉందా అనే చర్చకు ఇది దారితీసింది. మంగళవారం రాత్రి ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి అన్ని యూనిట్లకు అంతర్గత ఆదేశాలు జారీ అయ్యాయి. జంతర్ మంతర్ వద్ద మోహరించిన అధికారులెవరూ సాధారణ దుస్తుల్లో కాకుండా పోలీసు యూనిఫామ్‌లోనే విధులకు హాజరయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. అయితే సివిల్ డ్రెస్సుల్లో ఉన్న వ్యక్తులు పోలీసు లాఠీలను ఉపయోగించడంపై వచ్చిన ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు వివరణ ఇవ్వలేదు. -
నేడు మళ్లీ ‘చలో సంసద్’!.. సీజేపీ ఆందోళనతో ఉత్కంఠ
న్యూఢిల్లీ: పార్లమెంట్ వైపు చేపట్టిన ‘చలో సంసద్’ మార్చ్ ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో.. మంగళవారం కూడా ఆందోళనలు కొనసాగిస్తామని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రకటించింది. సోమవారం జరిగిన నిరసనల్లో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకోవడంతో.. మరోసారి పరిస్థితులు అదుపుతప్పకుండా ఢిల్లీ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సోమవారం రాత్రి జంతర్ మంతర్ వద్ద మాట్లాడుతూ.. మంగళవారం కూడా పార్లమెంట్ మార్చ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘‘మేం ఈ నిరసన ప్రదేశాన్ని వదిలిపెట్టం.. మళ్లీ పార్లమెంట్ వైపు కదులుతాం’’ అని ఆయన తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని వెల్లడించారు.సోమవారం హైటెన్షన్.. టియర్ గ్యాస్, లాఠీచార్జ్పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజున CJP ఇచ్చిన ‘సంసద్ చలో’ పిలుపుతో వేలాది మంది కార్యకర్తలు జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.అయితే భద్రతా బలగాలు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీచార్జ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనల్లో పలువురు నిరసనకారులతో పాటు పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారు.పోలీసుల కీలక ప్రకటననిరసనల్లో 118 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఆందోళనకారుల దాడుల్లో 20 ప్రభుత్వ వాహనాలు ధ్వంసమైనట్లు తెలిపారు. ఘర్షణలకు సంబంధించిన వీడియోలు, సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నామని, హింస వెనుక కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.మరోవైపు జంతర్ మంతర్ పరిసరాల్లో కొంతకాలం పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. రాత్రి వరకు కూడా అక్కడ భారీగా పోలీసులు, ఆందోళనకారులు మోహరించారు.చర్చలకు ప్రభుత్వం ప్రయత్నంఘర్షణల మధ్య కేంద్ర ప్రభుత్వం కూడా చర్చలకు మార్గం సుగమం చేసింది. కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో రెండుసార్లు సమావేశమైనట్లు సమాచారం. తమ డిమాండ్లను లిఖితపూర్వకంగా అందించాలని మంత్రి సూచించగా.. అనంతరం మూడు ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించినట్లు తెలుస్తోంది.మంగళవారం మళ్లీ మార్చ్.. పోలీసుల వ్యూహంమంగళవారం మరోసారి పార్లమెంట్ వైపు మార్చ్ చేపడతామని సీజేపీ ప్రకటించడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. బారికేడ్లు, భద్రతా ఏర్పాట్లు కొనసాగుతాయని ఓ పోలీసు అధికారి తెలిపారు. పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.ఇప్పటికే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన వేళ.. విపక్షాల నిరసనలు, సీజేపీ ఆందోళనలతో ఢిల్లీలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. మంగళవారం ‘చలో సంసద్’ ఎలాంటి మలుపు తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
CJP చీఫ్ అభిజిత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న పోలీసులు..!
-
పార్లమెంట్ ఆవరణలో కాక్రోచ్ల కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే దేశ రాజధానిలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ‘చలో సంసద్’ మార్చ్‌తో పార్లమెంట్ పరిసరాలు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేయడంతో.. ట్రాఫిక్ ఆంక్షలు, రద్దీ కారణంగా సాధారణ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.నీట్ NEET పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం సీజేపీ మద్దతుదారులు పార్లమెంట్ వైపు ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఈ మార్చ్‌కు ఎలాంటి అనుమతి తీసుకోలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అనుమతి లేకుండా పార్లమెంట్ వైపు ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతించబోమని పేర్కొంటూ నిరసనకారులను అడ్డుకున్నారు.జంతర్‌మంతర్‌లో లాఠీచార్జ్.. ఉద్రిక్తతజంతర్మంతర్ నుంచి పార్లమెంట్ వైపు వెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించడంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాటిని దాటేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేసి పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా న్యూఢిల్లీ జిల్లాలో BNSS సెక్షన్ 163 కింద ఆంక్షలు అమల్లో ఉన్నాయని పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా ఐదుగురు.. అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడం, ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించడం నిషేధమని వెల్లడించారు.And it has finally begun. Security personnel using lathicharge to disperse crowd at CJP protest in Delhi. pic.twitter.com/JYTNKLq0Tj— Piyush Rai (@Benarasiyaa) July 20, 2026పార్లమెంట్ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్సీజేపీ నిరసన, భారీ భద్రతా ఏర్పాట్ల కారణంగా పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. పలు మార్గాల్లో వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ఎంపీలు, సిబ్బంది సైతం రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం.పని చేయని ఫోన్లు?ఇదే సమయంలో పార్లమెంట్ ఆవరణలో, పరిసర ప్రాంతాల్లో కొంతసేపు మొబైల్ ఫోన్లు సరిగా పనిచేయడం లేదన్న ఫిర్యాదులు కూడా వినిపించాయి. దీంతో కొందరు ఎంపీలు, ఇతరులు కమ్యూనికేషన్ సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిసింది. అయితే మొబైల్ సేవల అంతరాయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.మెట్రో స్టేషన్లు మూసివేత.. కట్టుదిట్టమైన భద్రతనిరసన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పార్లమెంట్, జంతర్‌మంతర్, ఇతర కీలక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. భద్రతా కారణాలతో రాజీవ్ చౌక్, జనపథ్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, సేవా తీర్థ్ మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు.నిరసన వెనుక కారణాలివేనీట్ సహా పోటీ పరీక్షల్లో జరుగుతున్నాయని ఆరోపిస్తున్న అవకతవకలపై చర్యలు తీసుకోవాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలన్న లక్ష్యంతో ఉద్యమం చేపట్టినట్లు ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రముఖ సామాజిక కార్యకర్త, పర్యావరణ వేత్త సోనం వాంగ్‌చుక్ ఇచ్చిన పిలుపు నేపథ్యంలోనే సీజేపీ ఈ ర్యాలీని చేపట్టింది.ఇటీవల వ్యంగ్య డిజిటల్ ఉద్యమంగా ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ.. సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆ సంస్థ చేపట్టిన ‘చలో సంసద్’ మార్చ్ పార్లమెంట్ సమావేశాల వేళ రాజకీయంగా వేడి పెంచింది. -
కేంద్రం..కాక్రోచ్ జనతా పార్టీ మధ్య చర్చలు
కేంద్రం సీజేపీల మధ్య చర్చలు కాక్రోచ్ పార్టీ బృందంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చర్చలు నడ్డాకు విజ్ఞాపన పత్రాన్ని అందించింన సీజేపీ జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా భేటీ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించాలని భేటీలో స్పష్టతలేదంటే తమ నిరసన కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పిన కాక్రోచ్ పార్టీ సీజేపీకి కేంద్రానికి మధ్య కొనసాగుతున్న చర్చలుప్రభుత్వంతో సీజేపీ చీఫ్ స్పోక్స్‌పర్సన్ సౌరవ్ దాస్ చర్చలు డిప్యూటీ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి సీజేపీ చీఫ్ స్పోక్స్‌పర్సన్ సౌరవ్ దాస్ ప్రభుత్వంతో సీజేపీ చీఫ్ స్పోక్స్‌పర్సన్ సౌరవ్ దాస్ చర్చలు అయితే,ప్రభుత్వం వైపు చర్చలు జరుపుతున్నట్లు రాని అధికారిక ప్రకటన కేంద్ర మంత్రి జేపీ నడ్డా తమను చర్చలకు పిలిచారు చర్చలకు తాను, మరో అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా చర్చలు జరుపుతామని సౌరవ్ దాస్ వెల్లడి సీజేపీ ఛలో పార్లమెంట్ మార్చ్‌లో ఎంపీ డింపుల్ యాదవ్ సీజేపీ ఛలో పార్లమెంట్ మార్చ్‌లో ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్ డింపుల్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారంటున్న ఎస్పీ నేతలు డింపుల్‌తో పాటు పలువురుని నిర్భందించారని ఆరోపణలు ఢిల్లీలో కొనసాగుతున్న ఉద్రిక్తత పార్లమెంట్‌ను ముట్టడించిన సీజేపీ కార్యకర్తలు పార్లమెంట్‌కు వెళ్లే మార్గాలలో సీజేపీ కార్యకర్తల భైటాయింపు కార్యకర్తలపై పోలీసుల టియర్ గ్యాస్ ప్రయోగం పలువురు ఆందోళన కారులకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు పోలీసుల అదుపులో దీప్కేపోలీసుల అదుపులో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేదీప్కే దీక్షను విరమింపచేసిన పోలీసులుఅనంతరం పోలీసుల అదుపులో దీక్కే పార్లమెంట్ ఉభయ సభలు వాయిదాపార్లమెంట్ ఉభయ సభలు వాయిదాప్రతిపక్షాల ఆందోళనతో లోక్‌సభ,రాజ్య సభ రేపటికి వాయిదా సీజేపీ ఆందోళనలో పాల్గొంటా పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొనేందుకు తనకు అనుమతి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ సీజేపీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళనకు స్వయంగా వెళ్లి మద్దతు తెలపాలని ఉందన్న సోనమ్ ఆస్పత్రి నుంచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సప్ధర్‌గంజ్ ఆస్పత్రి సూపరిటెండెంట్లేఖపార్లమెంట్ వద్ద హై అలర్ట్పార్లమెంట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్లమెంట్ గేట్లను మూసివేసిన సీఐఎస్ఎఫ్పెద్ద ఎత్తున పార్లమెంట్ వైపు దూసుకొస్తున్న కాక్రోచ్ కార్యకర్తలు. ప్రధాన గేటు వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలు. టియర్ గ్యాస్ ప్రయోగం.. To disperse protestors, security personnel lob tear gas shells at the crowd marching towards the parliament in Delhi. https://t.co/ltC8tB3Lht pic.twitter.com/WTqgbLSSrq— Piyush Rai (@Benarasiyaa) July 20, 2026బారికేడ్లను తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం. కాక్రోచ్ కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు. నిరసనకారులను చెదరగొడుతున్న పోలీసులు.. పార్లమెంట్ లోపల సెక్యూరిటీ అలర్ట్.. Security beefed up at Parliament gate. Quick response teams take position with assault rifles as CJP protesters marks towards the parliament. Video via @Elizasherine pic.twitter.com/1cTjbf919T— Piyush Rai (@Benarasiyaa) July 20, 2026 పార్లమెంట్‌ను ముట్టడించిన సీజేపీసీజేపీ కార్యకర్తలు పార్లమెంట్‌ను ముట్టడించారు. పార్లమెంట్ వద్ద హైటెన్షన్ చోటుచేసుకుంది. పార్లమెంట్ ప్రధాన గేటు వద్దకు భారీ సంఖ్యలో సీజేపీ కార్యకర్తలు. కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. నిరసనకారులను చెడగొడుతున్న పోలీసులు. మరోవైపు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీపార్లమెంట్ గేట్లను మూసివేసిన పోలీసులు. ఆందోళకారులపై టియర్ గ్యాస్ ప్రయోగం VIDEO | Delhi: As the CJP's march protest swells, a multi-tiered security lockdown has been put to place to prevent the thousands of marching protesters from breaching the area.Security personnel physically secured the massive iron gates of the Parliament complex. Red fire… pic.twitter.com/DbS6gWbRtX— Press Trust of India (@PTI_News) July 20, 2026 పార్లమెంట్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత..పార్లమెంట్ ప్రధాన గేటుకు చేరుకున్న సీజేపీ కార్యకర్తలు.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్పోలీసులు, సీజేపీ కార్యకర్త మధ్య తోపులాట.ఆందోళకారులపై టియర్ గ్యాస్ ప్రయోగం.సీజేపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు సీజేపీతో మేం చర్చలు జరపం: నడ్డాజేపీ నడ్డాతో చర్చలు ఉంటాయన్న సీజేపీసీజేపీ వ్యాఖ్యలను ఖండించిన నడ్డా.సీజేపీతో ఎలాంటి చర్చలు ఉండవన్న నడ్డాసీజేపీతో మేం చర్చలు జరపం: నడ్డా పార్లమెంట్ ముట్టడికి కాక్రోచ్ పార్టీ విఫలయత్నం.ప్రెస్‌క్లబ్ దగ్గర ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు. Cockroach Janta Party's March to Parliament Updates ll FOEJ Media ll pic.twitter.com/nIVfCdrYj2— FOEJ Media (@FoejMedia) July 20, 2026 పార్లమెంట్ వద్ద పనిచేయని ఫోన్స్..పార్లమెంట్ పరిసరాల్లో పనిచేయని మొబైల్ ఫోన్స్.సీజేపీ పార్లమెంట్ మార్చ్ పిలుపుతో మొబైల్ నెట్‌వర్క్‌పై నిషేధం.సెంట్రల్ ఢిల్లీలో మొబైల్ నెట్‌వర్క్‌పై నిషేధం.పార్లమెంట్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్.పార్లమెంట్‌కు వచ్చేందుకు ఎంపీల అవస్థలు.ఎక్కడికక్కడే భారీగా నిలిచిపోయిన వాహనాలు. बड़ी खबर,Jantar Mantar से संसद मार्च करने जा रहे युवाओं को Delhi Police खदेड़ रही है। https://t.co/CISITchlqB pic.twitter.com/3LF9DXoZfH— Neeraj Bhawani (@Neeraj_Bhawanii) July 20, 2026కేంద్రంపై విద్యార్థుల ఆగ్రహం.. జంతర్ మంతర్‌కు భారీగా తరలివచ్చిన యువతధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నినాదాలువిద్యా రంగాన్ని ప్రక్షాళన చేయాలని డిమాండ్నీట్ పేపర్ లీక్ సహా అనేక పోటీ పరీక్షల లీక్‌పై విద్యార్థుల ఆగ్రహంకేంద్ర ప్రభుత్వం స్పందించాలని నినాదాలునీట్ అక్రమాలకు నిరసనగా చల్ పార్లమెంట్ మార్చ్.. #WATCH | Delhi: Azad Samaj Party-Kanshiram President and MP, Chandrashekhar Azad and TMC MP Mahua Moitra at the CJP's protest march site.Protesters gathered for CJP's protest march clash with RPF personnel at Jantar Mantar; RPF personnel & police use lathis for crowd control. pic.twitter.com/UpZDIcbD5O— ANI (@ANI) July 20, 2026జంతర్‌మంతర్ వద్ద ఉద్రిక్తత..జంతర్‌మంతర్ వద్ద ఉద్రిక్తత..సీజేపీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు. సీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్. సీజేపీ ర్యాలీకి అనుమతి లేదన్న పోలీసులు.పోలీసులతో సీజేపీ కార్యకర్తల వాగ్వాదం#WATCH | Delhi | Protesters gathered for CJP's protest march clash with RPF personnel at Jantar Mantar; RPF personnel & police use lathis for crowd control pic.twitter.com/gijaCjJksW— ANI (@ANI) July 20, 2026ఢిల్లీ:జంతర్ మంతర్‌లో ఇంటర్నెట్ సిగ్నల్ నిలిపివేతకాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంట్ నేపథ్యంలో నెట్వర్క్ నిలిపివేతపనిచేయని ఫోన్ ఇంటర్నెట్ డేటామెట్రో స్టేషన్‌పై పోలీసులు ప్రత్యేక నిఘాఐదు మెట్రో స్టేషన్లు మూసివేత Govt closed the exits on Metro Stations near Jantar Mantar.People started jumping over and exiting.Now the Metros are not even stopping at these stations.This in itself proves that this movement is beyond our analysis.This is a Jan Andolan now 🔥🔥🔥 pic.twitter.com/t429dj25GT— Jatin (@ja3_bajaj) July 20, 2026 పోలీసుల తనిఖీలు..సీజేపీ మార్చ్ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ఢిల్లీకి వచ్చే అన్ని దారుల్లో తనిఖీలు.ఢిల్లీ-గురుగ్రామ్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్. #WATCH | Delhi Police continue their security checks in view of the CJP's call for a March to Parliament todayVisuals from the Delhi-Gurugram Border. pic.twitter.com/jmU7q0ysnc— ANI (@ANI) July 20, 2026 దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్‌లో ఉన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభ రోజున కాక్రోచ్ జనతా పార్టీ(CJP) తలపెట్టిన ‘చలో సంసద్’ మార్చ్ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా హై సెక్యూరిటీ జోన్లో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు.కాగా.. సీజేపీ జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు మార్చ్ నిర్వహించాలని పిలుపునిచ్చింది. నీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యా సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు 5 వేల మందికి పైగా సిబ్బందిని భద్రత కోసం రంగంలోకి దించారు. అదనంగా కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన 25కు పైగా బెటాలియన్లను కీలక ప్రాంతాల్లో మోహరించారు. మహిళా భద్రతా సిబ్బందిని కూడా విధుల్లో ఉంచారు.15 భద్రతా జోన్లుగా ఢిల్లీ విభజన.. భద్రతా చర్యల్లో భాగంగా న్యూఢిల్లీ ప్రాంతాన్ని 15 సెక్యూరిటీ జోన్లుగా విభజించారు. ప్రతీ జోన్‌కు సీనియర్ పోలీసు అధికారులను బాధ్యులుగా నియమించారు. ఇంటెలిజెన్స్ విభాగం, ఢిల్లీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్‌లు నిరసనకారుల రాకపోకలపై గంట గంటకు సమాచారం అందిస్తున్నాయి. సోమవారం ఉదయం 4 గంటల నుంచే పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.Thousands of supporters gather at Jantar Mantar ahead of the 'Chalo Sansad' march organised by the #CockroachJantaParty . Delhi Police have deployed heavy security, multi-layer barricading and traffic arrangements to maintain law & order.#ChaloSansad #JantarMantar #Delhi… pic.twitter.com/z8MdcUDt9E— Ram Naresh (@RamNareshindian) July 20, 2026 పలు కీలక ప్రాంతాల్లో ఆంక్షలువిజయ్ చౌక్, పార్లమెంట్ స్ట్రీట్, ప్రధానమంత్రి నివాసం, సేవా తీర్థ, ఇండియా గేట్ పరిసరాలు, రాష్ట్రపతి భవన్ తదితర హై సెక్యూరిటీ ప్రాంతాల్లో ఎలాంటి నిరసనలు, సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఢిల్లీలో సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. అనుమతి లేకుండా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడం, ర్యాలీలు నిర్వహించడం నిషేధించారు.VIDEO | Delhi: Heavy security has been deployed on Jantar Mantar, Raisina Road and Parliament Circle ahead of the Cockroach Janta Party's proposed march to Parliament today, to press for education reforms. pic.twitter.com/OWFvMhv05t— Press Trust of India (@PTI_News) July 20, 2026వాటర్ క్యానన్లు, బారికేడ్లు సిద్ధంనిరసనల సమయంలో పరిస్థితులు అదుపు తప్పకుండా పోలీసులు వాటర్ క్యానన్లు, వజ్రా యాంటీ రయట్ వాహనాలు, ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు, రిజర్వ్ బలగాలను కూడా అప్రమత్తం చేశారు. మెట్రో స్టేషన్లపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. అవసరమైతే కొన్ని స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సమీప ఆసుపత్రులను కూడా అత్యవసర పరిస్థితుల కోసం అప్రమత్తం చేశారు. ఢిల్లీకి వచ్చే అన్ని మార్గాల్లో వాహన తనిఖీలు పెంచారు. బారికేడ్లు, సీసీటీవీ నిఘా, యాంటీ సబోటేజ్ తనిఖీలు, నిరంతర పెట్రోలింగ్ కొనసాగుతున్నాయి.#WATCH | Delhi: Founding President of the Cockroach Janta Party, Abhijeet Dipke, says, "The biggest march in India's history is about to take place. For the past 10-12 years, attempts have been made to destroy democracy in this country. By sitting at Jantar Mantar for a month,… pic.twitter.com/9qjO1ACNtY— ANI (@ANI) July 20, 2026అభిజీత్ కీలక వ్యాఖ్యలు.. ‘చలో సంసద్’ మార్చ్‌కు దేశ చరిత్రలోనే అతిపెద్ద నిరసనగా నిలిచే స్థాయిలో ప్రజలు తరలివస్తున్నారని సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే తెలిపారు. జంతర్ మంతర్ వద్ద ఆయన మాట్లాడుతూ, గత 10–12 సంవత్సరాలుగా దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నెల రోజులుగా జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనల ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తి తిరిగి వచ్చిందని అన్నారు. “దేశం నలుమూలల నుంచి ప్రజలు ఢిల్లీకి చేరుకుంటున్నారు. నేను అమెరికాలో ఉన్నప్పుడు చాలామంది రోడ్లపైకి ఎవరూ రారని, ఇది కేవలం సోషల్ మీడియా ట్రెండ్గానే మిగిలిపోతుందని చెప్పారు. కానీ ఇప్పుడు జంతర్ మంతర్‌కు వచ్చే నాలుగు ప్రధాన రహదారులను చూడండి.. అవన్నీ పూర్తిగా నిండిపోయాయి” అని పేర్కొన్నారు. పార్లమెంట్‌కు వెళ్లే తమ మార్చ్‌ను ఎవరూ ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు శాంతియుతంగా నిరసనలో పాల్గొంటారని, తమ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యమని తెలిపారు. -
ఆస్పత్రికి తరలింపు సరైందే
సాక్షి, న్యూఢిల్లీ: నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను ఆగమేఘాల మీద పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదివారం సమరి్థంచింది. తరలింపు నిర్ణయంలో ప్రభుత్వ ఏకపక్ష ధోరణి కన్పించట్లేదని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మినీ పుష్కర్ణ వ్యాఖ్యానించారు. సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో వాంగ్చుక్కు అందిస్తున్న వైద్య చికిత్సలో జోక్యం చేసుకునేందుకు సైతం ధర్మాసనం నిరాకరించింది. ఆయన్ను ఆస్పత్రిలో చికిత్సపేరిట అక్రమంగా నిర్బంధించారన్న వాదనను కోర్టు తోసిపుచి్చంది. ఆయనను వెంటనే డిశ్చార్జ్ చేసి, కుటుంబం కోరుకున్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలంటూ ఆయన భార్య గీతాంజలి వేసిన పిటిషన్‌పై ఆదివారం అత్యవసర విచారణ చేపట్టింది. వాంగ్‌చుక్ ప్రస్తుతం వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నారని, ఎలక్ట్రోలైట్లను తీసుకునేందుకు ఆయన సమ్మతించారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన శారీరక స్వేచ్ఛ హక్కుకు ఎలాంటి భంగం కలగలేదని స్పష్టం చేశారు. వాంగ్‌చుక్ కుటుంబ సభ్యులకు రోజంతా ఆయనను కలిసే అవకాశం కల్పించామని కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ కోర్టుకు తెలిపారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ప్రస్తుతం ఎలాంటి మధ్యంతర ఆదేశాలు అవసరం లేదని తేల్చి చెప్పారు. వాంగ్‌చుక్ వైద్య నివేదికలను కుటుంబ సభ్యులకు అందజేయాలని కోర్టు ఆదేశించారు. అన్ని పక్షాలకు నోటీసులు జారీ చేసి కేసు తదుపరి విచారణను జూలై 24కు వాయిదా వేశారు. కాగా పరీక్ష పత్రాల లీకేజీలను నిరసిస్తూ 20వ తేదీన సీజేపీ పిలుపునిచి్చన ‘చలో పార్లమెంట్ ర్యాలీ’ని రెండో స్వాతంత్య్ర పోరాటంగా ఉద్యమకారుడు వాంగ్‌చుక్ అభివర్ణించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆస్పత్రిలో ఉన్న వాంగ్‌చుక్ సొంతంగా రాసి, సంతకం చేసిన లేఖను భార్య గీతాంజలి ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. -
కాక్రోచ్ పార్టీ ర్యాలీ: ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం
ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమవుతుండడంతో పాటు అదే రోజున కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) "చలో సంసద్" ర్యాలీ దృష్ట్యా న్యూఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ ఈ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఆదివారం ఎక్స్‌లో విడుదల చేసిన ప్రకటనలో న్యూఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ సచిన్ శర్మ.. ఇలాంటి నిరసన ర్యాలీకి అనుమతి కోరలేదు, ఇవ్వలేదని చెప్పారు. న్యూఢిల్లీ జిల్లా అంతటా బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 (గతంలో సీఆర్పీసీ సెక్షన్ 144) కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని డీసీపీ తెలిపారు. ఈ ఆంక్షల ప్రకారం జంతర్ మంతర్‌లో నిర్దేశించిన నిరసన స్థలం మినహా అదీ ముందస్తు అనుమతితో తప్ప, 5 లేదా అంతకంటే ఎక్కువ మంది పాల్గొనే నిరసన ర్యాలీలు, ఊరేగింపులు, ఆందోళనలు, సమావేశాలు నిషేధించారు. ప్రజలెవరు ర్యాలీలలో పాల్గొనొద్దని విజ్ఞప్తి చేశారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజల సహకరించాలని పోలీసులు కోరారు. -
వాంగ్‌చుక్ దీక్ష భగ్నం!
న్యూఢిల్లీ: సామాజిక ఉద్యమకారుడు, పర్యా వరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్షను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. నీట్–యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలని, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చే యాలన్న డిమాండ్‌తో దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆయన సాగిస్తున్న దీక్ష 21వ రోజుకు చేరుకోగా, ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండడంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం ఉదయం బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా దీక్షా వేదిక వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులను అడ్డుకొనేందుకు వాంగ్‌చుక్ మద్దతుదారులు ప్రయత్నించారు. వాంగ్‌చుక్‌తోపాటు జూన్ 28న నిరాహార దీక్ష ప్రారంభించిన ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ) సభ్యులు నేహా, అమీన్, మనీష్ ను సైతం అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. ముగ్గురూ యథాతథంగా దీక్ష కొనసాగిస్తున్నారు. మరో వైపు వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నిరాహార దీక్ష ప్రారంభించారు. జంతర్‌మంతర్ వద్ద ఆయనపై ఓ మహిళ సిరా చల్లడం సంచలనాత్మకంగా మారింది. వాంగ్‌చుక్ దీక్షను భగ్నం చేయడాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు తీవ్రంగా ఖండించారు. వాంగ్‌చుక్ నిరాహార దీక్షను విరమించలేదని, ఆసుపత్రి నుంచే దీక్షను కొనసాగిస్తారని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ‘ఎక్స్’లో పోస్టుచేసింది. నాటకీయ పరిణామాలు వాంగ్‌చుక్ దీక్షను భగ్నం చేసే విషయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనకు ఒక్కరోజు ముందే కేంద్ర హోంశాఖ ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీశ్ గోల్చాను ఆకస్మికంగా తప్పించి, ఆయన స్థానంలో అనురాగ్ కుమార్‌ను నియమించింది. కొత్త కమిషనర్ వెంటనే తన కార్యాచరణ ప్రారంభించారు. శుక్రవారం రాత్రి పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శనివారం తెల్లవారుజామున సిబ్బందితో సహా హాజరు కావాలని ఆదేశించారు. ‘పార్లమెంట్ వర్షాకాల సమావేశాల భద్రతా సన్నాహాల‘పేరుతో పోలీసులు ఉదయం 5 గంటలకు జంతర్‌మంతర్ వద్దకు చేరుకున్నారు. దీక్షలు జరుగుతున్న ప్రాంతంలో మొబైల్ ఫోన్ జామర్ ఏర్పాటు చేశారు. సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులు దీక్షా వేదిక చుట్టూ తెల్ల దుప్పట్లు ఏర్పాటు చేసి వాంగ్చుక్ను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాలను ఎవరూ ఫోన్లలో చిత్రీకరించకుండా తెల్ల దుప్పట్లను అడ్డంగా పెట్టారు. పోలీసులను అడ్డుకునేందుకు నిరసనకారులు మానవహారంగా నిలిచారు. అయినప్పటికీ దాదాపు ఐదుగురు పోలీసులు వాంగ్చుక్ను బలవంతంగా అంబులెన్స్‌లోకి చేర్చి, వెంటనే సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. కోర్టు ఆదేశాల మేరకే వాంగ్చుక్ను ఆసుపత్రిలో చేర్చామని, ఆయనకు వైద్య చికిత్స కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగరంలోని కీలక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చికిత్సకు అంగీకరించేలా కౌన్సెలింగ్ చికిత్సకు వాంగ్‌చుక్ నిరాకరిస్తున్నారని డాక్టర్లు చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని చికిత్సకు అంగీకరించేలా కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్, ఇతర ఔషధాలను తీసుకోవడానికి నిరాకరించారని పేర్కొన్నారు. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. 59 ఏళ్ల వాంగ్‌చుక్ 20 రోజులుగా ఘనాహారం తీసుకోలేదు. ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం స్పృహలోనే ఉన్నారని వైద్యులు తెలియజేశారు. అలాగే నాడి, రక్తపోటు, ఆక్సిజన్ స్థాయిలు స్థిరంగా ఉన్నాయని, డీహైడ్రేషన్ లక్షణాలు కనిపించాయని వివరించారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చికిత్సకు అంగీకరించేలా ఒప్పించాలని వాంగ్‌చుక్ కుటుంబ సభ్యులను డాక్టర్లు కోరారు. అసత్యం, హింస మోదీ ప్రభుత్వ సిద్ధాంతాలు: కాంగ్రెస్ జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొంటున్న సోనమ్ వాంగ్చుక్ను అక్కడి నుంచి తరలించడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని అత్యంత అప్రజాస్వామిక రాజకీయ పార్టీ పాలించడం సిగ్గుచేటు అని పేర్కొంది. ‘‘గంగా నదిని కాపాడేందుకు 111 రోజుల పా టు ఆమరణ నిరాహార దీక్ష చేసిన ప్రొఫెసర్ జి.డి. అగర్వాల్‌ను, హరియాణాకు చెందిన ఒలింపిక్ రెజ్లర్లను, దేశానికి అన్నం పెట్టే 750 మంది రైతులు, దళితులు, ఆదివాసీలను, పరీక్షా పత్రాల లీకేజీ బాధితులైన 25 మంది విద్యార్థులను, వారి కుటుంబాలను ఈ నియ ంతృత్వ ప్రభుత్వం వదిలిపెట్టలేదు’’అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా గొంతెత్తితే దేశద్రోహిగా లేదా పరాన్నజీవిగా ముద్ర వేస్తారని మండిపడ్డారు. ‘‘ఈ రోజు జంతర్‌మంతర్ వద్ద జరిగిన సంఘటన మన ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై మరో మరక’’అని ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అహింసాత్మక నిరాహార దీక్షలో ఉన్న వాంగ్చుక్ను జంతర్ మంతర్ నుంచి తొలగించడం ముమ్మా టికీ తప్పేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆక్షేపించారు. అసత్యం, హింస నేడు మోదీ ప్రభుత్వ సిద్ధాంతాలుగా మారాయని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలపై పోరాటం సాగించకుండా ఏ రకమైన బలప్రయోగం కూడా అడ్డుకోలేదని తేల్చిచెప్పారు. ఖండించిన విపక్ష నేతలు వాంగ్చుక్ను నిరసన స్థలం నుంచి తరలించడాన్ని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్, సీపీఎం నాయకురాలు బృందా కారత్, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్, ఎంపీలు సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా, ఎన్సీపీ(ఎస్పీ) నేత శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్æయాదవ్, డీఎంకే ఎంపీ కనిమొళి, శివసేన(ఉద్ధవ్) నాయకుడు ఆదిత్య ఠాక్రే తదితరులు తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా సాగుతున్న పోరాటాన్ని బలప్రయోగంతో అణచి వేయాలనుకోవడం దారుణం అంటూ మండిపడ్డారు. దీక్షలో నేను కూడా పాల్గొంటా: భగవాన్ దీప్కే పాకిస్తాన్ పౌరులు కాకుండా.. భారతీయ పౌరులైన విద్యార్థుల పట్ల మన ప్రభుత్వం ఇంతటి నిర్దయతో ఎలా వ్యవహరించగలదని అభిజిత్ దీప్కే తండ్రి భగవాన్ దీప్కే ప్రశ్నించారు. జంతర్‌మంతర్ వద్ద తన కుమారుడు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో విద్యార్థులు నిరవధిక నిరాహార దీక్షలు చేస్తు న్నారని చెప్పారు. ఎవరైనా చనిపోయే వరకు ప్రభుత్వం వేచి చూస్తుందా? అని ప్రశ్నించారు. విద్యార్థులు లేవనెత్తిన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తన కుమారుడు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షలో తాను కూడా పాల్గొంటానని తేల్చిచెప్పారు. వెంటనే డిశ్చార్జి చేయాలి: గీతాంజలి తన అనుమతి లేకుండా వాంగ్చుక్కు ఎలాంటి చికిత్స అందించవద్దని ఆయన భార్య గీతాంజలి జె.ఆంగ్మో అన్నారు. తన భర్తను ఆసుపత్రి నుంచి వెంటనే డిశ్చార్జి చేయాలని కోరారు. వైద్య సంరక్షణలో పారదర్శకత లోపించిందని ఆరోపించారు. ఈ మేరకు సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు. వాంగ్‌చుక్ మెడికల్ రిపోర్టుల కాపీలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిపై నమ్మకం సన్నగిల్లడం, చికిత్సలో పారదర్శకత లోపించడం వంటి కారణాలను ప్రస్తావిస్తూ ఆయనను తమ కుటుంబం ఎంపిక చేసుకున్న ఆసుపత్రికి తరలిస్తామని స్పష్టంచేశారు. వాంగ్‌చుక్ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని తెలియజేశారు. జూలై 20న తలపెట్టిన పార్లమెంట్ మార్చ్ కచ్చితంగా జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. అయితే, మెడికల్ రిపోర్టులు ఇచ్చేందుకు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నిరాకరించింది. అభిజిత్ దీప్కేపై సిరాతో దాడి మరోవైపు తాను నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నట్లు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు. జంతర్‌మంతర్ వద్ద ఓ మహిళ దీప్కేతో మాట్లాడుతూ తన చేతిలో ఉన్న సిరాను ఆయనపై చల్లడంతో ఒక్కసారిగా నిరసనలు మిన్నంటాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె వివరాలు, దాడికి గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. ఢిల్లీ పోలీసులు తనపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారని, జంతర్‌మంతర్ నిరసన ప్రాంగణంలోకి అనుమతించ లేదని దీప్కే ఆరోపించారు. ఈ చర్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఎవరు ఎంతగా అణచివేసినా తమ ఉద్యమం కొనసాగుతుందని, ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. -
జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. దీక్షకు దిగిన అభిజిత్ దీప్కే
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నా చౌక్ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ను పోలీసులు ఆస్పత్రికి తరలించిన ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నిరాహార దీక్షకు దిగాడు. “మా ఉద్యమం ఆగదు.. పోరాటం కొనసాగుతుంది” అంటూ ఆయన ప్రకటించారు.నీట్ పరీక్షలో అవకతవకలు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ జూన్ 20వ తేదీ నుంచి నిరసనలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఈ పోరాటానికి మద్దతుగా సోనం వాంగ్‌చుక్ జంతర్ మంతర్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష శనివారం నాటికి 21వ రోజుకు చేరుకుంది.దీక్ష కొనసాగిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఢిల్లీ పోలీసులు శనివారం ఉదయం ఆయనను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు, వైద్య నిపుణుల సూచనల మేరకే ఈ చర్య తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అయితే ఈ చర్యపై CJP నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వాంగ్‌చుక్ శాంతియుతంగా నిరసన చేస్తున్న సమయంలో పోలీసులు బలవంతంగా తరలించారని ఆరోపించారు.‘ఉద్యమం ఆగదు’.. దీక్షకు దిగిన అభిజిత్వాంగ్చుక్ తరలింపును వ్యతిరేకిస్తూ CJP చీఫ్ అభిజిత్ దీప్కే స్వయంగా నిరాహార దీక్ష ప్రారంభించాడు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకునే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘‘మా ఉద్యమం ఆగదు. ఈ పోరాటం కొనసాగుతుంది. ఎల్లుండి పార్లమెంట్ వరకు మార్చ్ నిర్వహించి తీరతాం. మా డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేదాకా ఇక్కడి నుంచి కదలం’’ అని అభిజిత్ దీప్కే ప్రకటించాడు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని, పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచాలని, నీట్ వివాదంపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన మరోసారి డిమాండ్ చేశాడు.పోలీసులపై ఆరోపణలుఇంతకుముందు కూడా అభిజిత్ దీప్కే పోలీసులపై ఆరోపణలు చేశారు. జంతర్ మంతర్‌కు తిరిగి వెళ్తున్న సమయంలో తనపై పోలీసులు దాడి చేశారని, తనను కొట్టి అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. “నన్ను కొట్టారు.. సోనం సర్‌ను బలవంతంగా తీసుకెళ్లారు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ధ్రువీకరించలేదు.పోలీసుల వివరణమరోవైపు ఢిల్లీ పోలీసులు మాత్రం వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే ఆస్పత్రికి తరలించామని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేయడమే తమ ఉద్దేశమని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం వాంగ్‌చుక్ ప్రస్తుతం స్పృహలో ఉన్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి.జంతర్ మంతర్ వద్ద..వాంగ్‌చుక్ ఆస్పత్రికి తరలింపు అనంతరం నిరసనకారులను జంతర్ మంతర్ నుంచి ఖాళీ చేయాలని పోలీసులు కోరారు. దీంతో కొంతసేపు అక్కడ వాగ్వాదం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పోలీసు బలగాలను మోహరించడంతో పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.నీట్ పరీక్షలో అవకతవకలు, పరీక్షల నిర్వహణలో లోపాలపై న్యాయ విచారణ జరపాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని CJP డిమాండ్ చేస్తోంది. ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు. సోనం వాంగ్‌చుక్ దీక్ష, పోలీసుల చర్య, అభిజిత్ దీప్కే తాజా నిరసనతో జంతర్ మంతర్ పరిణామాలు మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. -
నన్ను కొట్టారు.. సోనం సర్‌ను ఈడ్చుకెళ్లారు!
సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్ష భగ్నం అయిన వేళ.. జంతర్ మంతర్ వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ పోలీసులు ఆయనను శనివారం ఉదయం ఆస్పత్రికి తరలించారు. ఈ పరిణామంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు బలవంతంగా వాంగ్చుక్ను తరలించారని ఆరోపించారు.సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు చేశారు. తనపై పోలీసులు దాడి చేశారని, తనను కొట్టి అదుపులోకి తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. జంతర్ మంతర్ నిరసన ప్రదేశానికి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఇది జరిగిందని చెప్పారు. ‘‘నన్ను కొట్టి అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్‌లో పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ప్రజలను కొడుతున్నారు. సోనం సర్‌ను బలవంతంగా ఈడ్చుకెళ్లారు’’ అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. అయితే పోలీసులపై చేసిన ఈ ఆరోపణలను అధికారులు ధ్రువీకరించలేదు.21వ రోజు దీక్ష.. ఆస్పత్రికి వాంగ్చుక్నీట్ పరీక్షలో అవకతవకలు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ.. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోనం వాంగ్‌చుక్ జంతర్ మంతర్‌లో నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయనతో పాటు పలువురు విద్యార్థులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు.దీక్ష 21వ రోజుకు చేరుకోవడంతో వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఆయనను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన స్పృహలో ఉన్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి.కోర్టు ఆదేశాల మేరకే చర్యలు: పోలీసులువాంగ్చుక్ ఆరోగ్యం విషమిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ప్రతిరోజూ వైద్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన వైద్య సహాయం అందించాలని.. మరీ అవసరమైతే బలవంతంగా ఆహారం అందించాలని అధికారులను ఆదేశించింది.#BREAKING: The Delhi Police has stopped Abhijeet Dipke where he was staying. People are telling me that Sonam Wangchuk is being picked up from the protest site. Students are being lathicharged! pic.twitter.com/kkKtSI83hO— Saurav Das (@SauravDassss) July 18, 2026హైకోర్టు ఆదేశాలు, వైద్య నిపుణుల సలహా మేరకే వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా నిరసనకారులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడిందని, అయితే పోలీసులు సంయమనం పాటించారని న్యూఢిల్లీ డీసీపీ కార్యాలయం వెల్లడించింది.అభిజిత్ దీప్కే అదుపులో.. CJP ఆగ్రహంసీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు ధ్రువీకరించారు. అయితే తమ నేతను అక్రమంగా అడ్డుకున్నారని ఆయన మద్దతుదారులు ఆరోపించారు. వాంగ్‌చుక్ చేస్తున్న నిరసనను అణిచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, శాంతియుత ఆందోళనకు ఆటంకాలు కల్పిస్తున్నారని పార్టీ నేతలు ఆరోపించారు.ఇంతకు ముందు దాడి!ఇదే సమయంలో జంతర్ మంతర్ వద్ద వాంగ్చుక్పై గతంలో కొందరు వ్యక్తులు దాడికి ప్రయత్నించారని కూడా అభిజిత్ దీప్కే ఆరోపించారు. ఒక వస్తువు విసిరినా ఆయనకు ఎలాంటి గాయం కాలేదని తెలిపారు. నిరసనను భగ్నం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.జంతర్ మంతర్ వద్ద టెన్షన్వాంగ్చుక్ ఆస్పత్రికి తరలింపు అనంతరం.. నిరసనకారులను అక్కడి నుంచి ఖాళీ చేయాలని పోలీసులు కోరారు. అందుకు వాళ్లు నిరాకరించడంతో.. తీవ్ర వాగ్వాదం నడుమ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్నాం లోపు ఖాళీ చేయాలని పోలీసులు నిరసనకారులకు అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జంతర్ మంతర్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. -
సోనం వాంగ్‌చుక్ దీక్ష భగ్నం..
సాక్షి, ఢిల్లీ: ప్రముఖ పర్యావరణవేత్త సోనం వాంగ్‌చుక్ ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ ఉదయం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. సమాచారం అందుకున్న పోలీసులు.. జంతర్ మంతర్ వద్దకు చేరుకుని ఆయన్ని బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో నిరసనకారుల అడ్డగింత.. నినాదాలతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతవరణం నెలకొంది. విద్యా వ్యవస్థలో పటిష్టమైన సంస్కరణలు కోరడంతో పాటు ఇటీవలి పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ గత 21 రోజులుగా వాంగ్‌చుక్ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 9 కేజీల బరువు తగ్గగా.. ఆయన పరిస్థితిపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే.. #WATCH | Delhi: Activist Sonam Wangchuk, who was sitting on a hunger strike from last 20 days at Jantar Mantar, taken to the hospital by the police. More details awaited. pic.twitter.com/81DTO3cyh4— ANI (@ANI) July 18, 2026ఈ ఉదయం ఆయన దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలోనే ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టం చేశారు.సోనం వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి రోజు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించింది. “ప్రతి పౌరుడి జీవితం విలువైనది” అని కోర్టు వ్యాఖ్యానించింది.ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు, వైద్య నిపుణుల సూచనల మేరకు సోనం వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయనను అత్యవసర వైద్య సేవల కోసం ఆస్పత్రికి తరలించాం. ఈ చర్యను పోలీసులు పూర్తి సంయమనంతో, సురక్షితంగా చేపట్టారు. జంతర్ మంతర్ వద్ద ఉన్న నిరసనకారులు శాంతియుతంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలి అని స్థానిక డీసీపీ ఓ ట్వీట్ చేశారు.చకచకా పరిణామాలునీట్ అవకతవకల వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ జూన్ 20వ తేదీ నుంచి కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నేతృత్వంలో జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు నిర్వహిస్తోంది. ఈ పోరాటానికి మద్దతుగా సోనం వాంగ్‌చుక్ రంగంలోకి దిగారు. అయితే తొలుత ఆయన దీక్షకు పెద్దగా స్పందన రాలేదు. పోను పోను సినీ, రాజకీయ నేతలు వాంగ్చుక్కు సంఘీభావం ప్రకటించడంతో మద్దతు పెరుగుతూ వచ్చింది. ఎల్లుండి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అదే తేదీన (20న) ఛలో పార్లమెంట్ నినాదంతో ర్యాలీ చేపట్టాలని సీజేపీ భావించింది. ఈ కార్యక్రమానికి తరలి రావాలంటూ ఇటు దీక్షా వేదికగానే వాంగ్‌చుక్ కూడా పిలుపు ఇచ్చారు. సుమారు లక్షన్నర మందికి పైగా ఆ ర్యాలీలో పాల్గొంటారనే అంచనాలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల నడుమ.. ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధికారి అనురాగ్ కుమార్ ఢిల్లీ కమిషనర్‌గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే వాంగ్‌చుక్ దీక్ష భగ్నం కావడం గమనార్హం. -
పుట్టినరోజునే భార్యను నడిరోడ్డుపై కాల్చి చంపిన కానిస్టేబుల్
న్యూఢిల్లీ: భార్యాభర్తల బంధం అనేది నమ్మకం, ప్రేమ, పరస్పర గౌరవంపై నిలబడాలి. కానీ అదే బంధంలో కోపం, అనుమానం, అహంకారం ఉంటే ఏదో ఒక క్షణంలో జీవితం చీకటిగా మారుతుంది. ఒకప్పుడు జీవితాంతం తోడుగా ఉంటానని మాటిచ్చిన వ్యక్తే ప్రాణాలు తీసే స్థితికి చేరితే అంతకంటే హృదయవిదారకమైన విషాదం ఇంకొకటి ఉండదు. అలాంటి కన్నీరు తెప్పించే ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది.నడిరోడ్డుపై భార్యను కాల్చి చంపాడు ఓ కానిస్టేబుల్. సోమవారం తెల్లవారుజామున తూర్పు ఢిల్లీలోని కల్యాణ్‌పురి ప్రాంతంలో దంపతులు స్కూటర్‌పై వెళ్తున్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. భర్త మనీశ్ భాటి స్కూటర్‌ను ఆపగా ఇద్దరూ దిగిన తర్వాత కూడా వాగ్వాదం కొనసాగింది. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం.. భాటి తన భార్యపై కాల్పులు జరిపి ఆమెను రోడ్డుపైనే వదిలి అక్కడి నుంచి పారిపోయాడు.రోడ్డుపక్కన మహిళ మృతదేహాన్ని దారిన వెళ్లే ఓ డెలివరీ ఎగ్జిక్యూటివ్ గుర్తించి వెంటనే ఆమెను తూర్పు ఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి (ఎల్బీఎస్) ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.మనీశ్ భాటి ఇటీవల తూర్పు ఢిల్లీలోని యాంటీ ఆటో థెఫ్ట్ స్క్వాడ్ (ఏఏటీఎస్)లో విధుల్లో చేరాడు. మృతురాలు భాటి భార్య ప్రియాంక (26)గా గుర్తించారు. ఆమె ఉపాధ్యాయురాలిగా పని చేసేది. ఈరోజు ప్రియాంక పుట్టినరోజు. నిందితుడి ఆచూకీ కనిపెట్టి అరెస్ట్ చేసేందుకు గాలింపు కొనసాగుతోంది. -
ఢిల్లీలో ఉగ్ర కుట్ర భగ్నం.. డ్రోన్స్, విదేశీ గన్స్..
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రదాడి కుట్రను స్పెషల్ సెల్ పోలీసులు భగ్నం చేశారు. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి చెందిన నలుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నిందితుల వద్ద నుంచి భారీగా గన్స్, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.వివరాల మేరకు.. ఢిల్లీలో భారీ ఉగ్రదాడి కుట్రను స్పెషల్ సెల్ పోలీసులు చేధించారు. నిందితుల విచారణలో ఈ కుట్రకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) హ్యాండ్లర్ షెహ్జాద్ భట్టి ఆదేశాలు మేరకు కుట్ర జరిగినట్టు పోలీసులు గుర్తించారు. అరెస్టైన వారిలో ముగ్గురు పంజాబ్‌కు చెందినవారు కాగా, ఒకరు ఢిల్లీకి చెందిన వ్యక్తి అని అధికారులు తెలిపారు.కాగా, నిందితులు డ్రోన్ల ద్వారా ఆయుధాలు మరియు మాదకద్రవ్యాలు అందుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీలోని పోలీస్ స్టేషన్లు, ప్రార్థనా స్థలాల వద్ద రెక్కీ నిర్వహించినట్లు విచారణలో తేలింది. కాల్పుల ఘటనకు గగన్‌ప్రీత్‌ను బాధ్యుడిగా నియమించినట్లు కూడా సమాచారం బయటపడింది. ఈ కేసులో భారత శిక్షా స్మృతి (BNS), ఆర్మ్స్ యాక్ట్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అరెస్ట్ అనంతరం, నిందితుల వద్ద నుంచి రెండు విదేశీ పిస్టల్స్, 9 తూటాలు, అలాగే ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొబైల్ ఫోన్లలో విదేశీ నంబర్లతో నిరంతర సంప్రదింపులు జరిగినట్లు దర్యాప్తులో బయటపడింది. కాగా, ఉగ్ర నెట్‌వర్క్‌పై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. -
టీ దుకాణం పెట్టుకోవడమూ నేరమేనా?
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఢిల్లీ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 10 రోజులుగా నిరసన సాగిస్తున్న తమకు పోలీసులు కనీస సౌకర్యాలను కూడా అందనివ్వడం లేదని ఆరోపించారు. తమకు టీ అందజేస్తున్న అనికేత్ పటేల్ అనే వ్యక్తిని సైతం ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారన్నారు. నిరసనకారులకు ఆహారం, దుస్తులు తీసుకువచ్చే వారినీ వదిలిపెట్టడం లేదని దీప్కే చెప్పారు. అనికేత్ పటేల్ ఆహ్వానం మేరకు అతడి టీ దుకాణం వద్దకు, అతడి ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. టీ దుకాణం పెట్టుకోవడమూ నేరమేనా అంటూ పోలీసులను ప్రశ్నించారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు నిరసన వేదిక వద్ద బందోబస్తు విధుల్లో ఉండే పోలీసులకు తాను గులాబీలు, టీ అందజేస్తానన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యతలను నిర్వర్తించాలని వారిని కోరుతానని చెప్పారు. ఇదే వేదికపై నిరాహార దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్‌చుక్ కోసం పోర్టబుల్ టాయిలెట్ సౌకర్యం కల్పించాలని ఆదివారం రాత్రి నిరసన చేపట్టినట్లు వెల్లడించారు. జంతర్ మంతర్‌లోని పబ్లిక్ టాయిలెట్లకు నీటి సౌకర్యం లేదని చెప్పారు. పరీక్షపత్రాల లీకేజీలకు కేంద్రమే బాధ్యత వహించాలనే డిమాండ్‌తో ఆదివారం పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించడం తెల్సిందే. సీజేపీ నేతృత్వంలో ఇదే డిమాండ్‌తో జూన్ 20వ తేదీన దీప్కే సారథ్యంలో ఆందోళనలు మొదలయ్యాయి. ప్రజాస్వామ్య ఉద్యమానికి మచ్చు తునక ఈ సందర్భంగా సోనమ్ వాంగ్‌చుక్ మాట్లాడుతూ..జంతర్‌మంతర్‌లో విద్యార్థులు, వలంటీర్లు శాంతియుతంగా కొనసాగిస్తున్న నిరసన ప్రజాస్వామ్య తరహా ఉద్యమానికి ఓ ఉదాహరణ అని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో తమ వంతుగా భాగస్వాములయ్యారని చెప్పారు. పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్న వలంటీర్లు, సహకరిస్తున్న పోలీసులకు వాంగ్‌చుక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో దేశ వ్యతిరేక అంశమేదీ లేదని చెప్పారు. వీరంతా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మాత్రమే కోరుతున్నారని వివరించారు. ‘మీరు ఇలాగే మొండిగా వ్యవహరిస్తూ పోతే నష్టపోయేదీ మీరే. ప్రజలకు మీపై నమ్మకం పోతుంది. ఆ తర్వాత వారు మిమ్మల్ని తిరస్కరిస్తారు. ప్రజల బాధను మీరు అర్థం చేసుకున్నప్పుడే మిమ్మల్ని అంగీకరిస్తారు’అంటూ వాంగ్‌చుక్ వ్యాఖ్యానించారు. నీక్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ)కి చెందిన ఆరుగురు విద్యార్థి నేతలు ఇక్కడే మరో వేదికపై ఆదివారం నుంచి నిరాహార దీక్ష ప్రారంభించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, బృందా కారత్, సీపీఐ నేత డి.రాజా నిరసన చేపట్టిన విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. -
మాజీ ప్రధాని కుమారుడికి రూ.7.8 కోట్ల బురిడీ!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఒక భారీ సైబర్ ఫ్రాడ్ వెలుగులోకి వచ్చింది. భారత మాజీ ప్రధానమంత్రి ఇందర్ కుమార్ గుజ్రాల్ కుమారుడు, మాజీ రాజ్యసభ ఎంపీ నరేష్ కుమార్ గుజ్రాల్ సైబర్ నేరగాళ్ల చేతిలో ఏకంగా రూ. 7.80 కోట్ల మేరకు మోసపోయారు. ఆయనలాగే నటిస్తూ (ఇంపర్సనేషన్) దుండగులు ఆయన సిబ్బందిని బురిడీ కొట్టించి ఈ భారీ మొత్తాన్ని కాజేశారు. ఈ ఘోర సైబర్ దోపిడీపై ఢిల్లీ పోలీసు సైబర్ సెల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తును ముమ్మరం చేసింది.ప్రొఫైల్ పిక్చర్తో మాయాజాలంసైబర్ నేరగాళ్లు ఈ ఘరానా మోసానికి సరికొత్త పంథాను ఎంచుకున్నారు. నరేష్ కుమార్ గుజ్రాల్ ఫోటోను వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకుని, ఆయన ఆఫీస్ సిబ్బందికి మెసేజ్‌లు పంపారు. తాను ప్రస్తుతం ఒక ముఖ్యమైన సమావేశంలో ఉన్నానని, అర్జంట్‌గా ఆర్టీజీఎస్ ద్వారా నిర్దేశిత బ్యాంకు ఖాతాకు నిధులు బదిలీ చేయాలని సదరు ఉద్యోగిని నమ్మించారు. అవతలి ఉన్నది తన బాసేనని నమ్మిన ఆ ఉద్యోగి, సదరు ఖాతాకు రూ. 7.80 కోట్లు బదిలీ చేశాడు.అప్రమత్తతతో దక్కిన ఊరటఈ అనుమానాస్పద లావాదేవీపై సదరు ఉద్యోగి నరేష్ గుజ్రాల్ కుమార్తె దీక్షా గుజ్రాల్‌కు సమాచారం అందించడంతో అసలు విషయం బయటపడింది. వెంటనే ఆమె తన తండ్రిని సంప్రదించగా, తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. తాము సైబర్ మోసానికి గురయ్యామని గ్రహించిన దీక్షా గుజ్రాల్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా భారత సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ '1930'కు ఫిర్యాదు చేసి, ఈ-ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సైబర్ విభాగం అధికారులు తక్షణమే స్పందించి, ఆ అకౌంట్లను సీజ్ చేయడంతో దాదాపు రూ. 4 కోట్లు (మొత్తం సొమ్ములో 70 శాతానికి పైగా) ఫ్రీజ్ అయింది.ఎవరీ నరేష్ గుజ్రాల్?వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన నరేష్ గుజ్రాల్, శిరోమణి అకాలీదళ్ పార్టీలో కీలక సీనియర్ నేత. ఆయన 2007 నుండి 2022 వరకు పంజాబ్ తరఫున రాజ్యసభ సభ్యునిగా సేవలు అందించారు. అంతకుముందు 2004 లోక్‌సభ ఎన్నికల్లో జలంధర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఈయన తండ్రి ఇందర్ కుమార్ గుజ్రాల్ 1997-1998 మధ్యకాలంలో భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల సైబర్ సెల్ ఈ డబ్బు ఎక్కడికి చేరిందనే ‘మనీ ట్రైల్’ను గుర్తిస్తూ, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది.ఇది కూడా చదవండి: ‘తుఫాన్ వారియర్’గా మోహన్‌లాల్ -
కావాలనే నిప్పుపెట్టిన బాలిక.. 5 అంతస్తుల భవనం బూడిద
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని తుగ్లకాబాద్ ప్రాంతంలో ఇటీవల ఐదు అంతస్తుల భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. ఇది నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదం కాదని, వ్యక్తిగత కక్షతో ఉద్దేశపూర్వకంగా పెట్టిన నిప్పేనని ఢిల్లీ పోలీసులు ఆదివారం తెలిపారు.తుగ్లకాబాద్‌లోని టీకేడీ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో ఉన్న నివాస భవనంలో జూన్ 12న మంటలు చెలరేగాయి. తొలుత ఇది నిర్లక్ష్యం వల్ల జరిగిందని భావించారు. అయితే, తర్వాత పోలీసులు సేకరించిన ఆధారాలను విశ్లేషించారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టినట్టు తేలింది.మంటలు చెలరేగే ముందు ఓ మహిళ భవనంలోకి ప్రవేశించిన దృశ్యాలు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించడంతో వాటిని పరిశీలించిన తర్వాత భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.నిప్పు ఎందుకు అంటించింది? దర్యాప్తు సమయంలో గోవింద్‌పురిలోని నవజీవన్ క్యాంప్‌కు చెందిన 17 ఏళ్ల బాలికను కూడా పోలీసులు అరెస్టు చేశారు. గోవింద్‌పురిలోని గిరినగర్ నివాసి సరిత (27) ప్రేరేపించడంతో తాను ఈ పని చేసినట్టు బాలిక ఒప్పుకుందని పోలీసులు తెలిపారు.“5వ అంతస్తులో నివసించే దీపక్‌కు చెందిన స్కూటీకి నిప్పు పెట్టేందుకు సరిత పెట్రోల్, అగ్గిపెట్టె ఇచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. డబ్బు వివాదం కారణంగానే ఇలా చేయాలని చెప్పిందని” ఢిల్లీ పోలీసులు తెలిపారు.తదుపరి దర్యాప్తులో నవజీవన్ క్యాంప్ వాసులు నిరంజన్ (33), అతని సోదరుడు రాజ్‌కుమార్ (27) సూచనల మేరకు సరిత వ్యవహరించినట్టు తేలింది. వ్యక్తిగత కక్ష తీర్చుకునేందుకు ఈ ముగ్గురు కలిసి అగ్నిప్రమాదానికి కుట్ర పన్నినట్టు పోలీసులు తెలిపారు.నేరపూరిత కుట్ర, నిర్లక్ష్యం మరణానికి కారణం కావడం, నిప్పుతో నష్టం కలిగించడం, రహస్యంగా ఇంట్లోకి ప్రవేశించడం వంటి తీవ్రమైన అభియోగాలను కేసులో పోలీసులు చేర్చారు. బాలిక సహా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోంది.కాగా, ఈ ఘటనపై శుక్రవారం ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ, “జూన్ 11-12 అర్ధరాత్రి దాటాక 2.24 గంటలకు గోవింద్‌పురి పోలీస్ స్టేషన్‌కు తుగ్లకాబాద్ ఎక్స్‌టెన్షన్‌లోని 5 అంతస్తుల నివాస భవనంలో అగ్నిప్రమాదం జరిగినట్టు పీసీఆర్ కాల్ వచ్చింది. దట్టమైన పొగలో చిక్కుకున్న ఎనిమిది మందిని సహాయక బృందాలు బయటకు తీసి సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి, ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించారు. 22 ఏళ్ల యువకుడు, ఇద్దరు మహిళలతో కలిపి ముగ్గురు మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది” అని తెలిపారు.అగ్నిమాపక విభాగ అధికారి యశ్వంత్ మీనా మాట్లాడుతూ, “భవనం గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ప్రాంతంలో ఉన్న 3 స్కూటీలు, 2 బైకులు, ఓ సైకిల్లో మంటలు చెలరేగాయి. మంటలు, పొగ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 5 అంతస్తుల వరకూ వ్యాపించింది. గ్రౌండ్, ఒకటో, రెండో అంతస్తులు పూర్తిగా దగ్ధమయ్యాయి.మిగతా అంతస్తులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అగ్నిమాపక సిబ్బంది డాబాపైకి చేరుకుని, డాబా గేటు తాళం కత్తిరించి భవనంలోకి ప్రవేశించారు. ఇద్దరు బాలికలను రక్షించి క్యాట్స్, పీసీఆర్ సిబ్బంది ద్వారా ఆసుపత్రికి తరలించారు. మొత్తం ఎనిమిది మందిని రక్షించారు” అని చెప్పారు. -
రూల్స్ లేవ్.. ఢిల్లీలో ఇంతే: హోటల్ యజమాని
ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 2022లో 60 ఏళ్ల లవ్‌కేశ్ బజాజ్ దక్షిణ ఢిల్లీలోని హౌజ్ రాణి ఇరుకైన వీధుల్లో ఉన్న మూడు అంతస్తుల భవనాన్ని కొనుగోలు చేసి, దాన్ని బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ (బీ అండ్ బీ) సంస్థగా మార్చాలని నిర్ణయించాడు.ఆ భవనానికి త్వరలోనే ఫ్లోరిష్ స్టేస్ బీ అండ్ బీ అనే కొత్త పేరు పెట్టారు. ఆ తర్వాత అది ఐదు అంతస్తులు, ఒక బేస్మెంట్లో 26 గదుల ప్రాంగణంగా మారింది. అయితే, కేవలం 6 గదులకే అనుమతి ఉందని పోలీసులు తెలిపారు.బుధవారం అదే హోటల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 21 మంది అతిథులు మరణించారు. వారిలో 12 మంది విదేశీయులు. అదే రాత్రి బజాజ్‌ను అరెస్టు చేశారు.పోలీసులు ప్రశ్నించగా.. వ్యాపారం మంచి లాభాలు తెస్తుండటంతో హోటల్లో గదుల సంఖ్య పెంచానని, అలాగే ‘ఢిల్లీ మేన్ సబ్ చల్తా హై (ఢిల్లీలో అన్నీ చెల్లుతాయి)’ అనే భావనతో అలా చేశానని బజాజ్ చెప్పినట్టు ఓ అధికారి తెలిపారు. ఢిల్లీలో నిబంధనలు, పరిమితులు, ఆంక్షలు ఏమీ ఉండవనేలా, ఏదైనా చేసుకోవచ్చనేలా ఆ హోటల్ యజమాని మాట్లాడారు. పూర్తి సమయం హోటల్ నిర్వహణ చూసుకునే అవకాశం తనకు లేకపోవడంతో, అన్ని కార్యకలాపాలు నిర్వహించేందుకు సిబ్బందిని నియమించుకున్నానని కూడా బజాజ్ చెప్పినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అంశాలపై బజాజ్ భార్యను కూడా ప్రశ్నించినట్టు పోలీసులు తెలిపారు.ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఆరు గదులకే అనుమతి ఉంటే 26 గదులు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. అలాగే అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) లేదు. అంతేగాక, ఆ ప్రాంగణం అంతటా సులభంగా మంటలు అంటుకునే అలంకరణ సామగ్రి ఉన్నట్లు తేలింది.బుధవారం ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ (డీఎఫ్ఎస్) అధికారి మాట్లాడుతూ.. అలంకరణలో భాగంగా భవనం లోపల, బయట అనేక చెక్క, ప్లాస్టిక్ ఫ్రేమ్‌లు ఏర్పాటు చేశారని, దీంతో మంటలు వ్యాపించే ప్రమాదం పెరిగిందని చెప్పారు.బజాజ్ ఆ ప్రాంతంలో మరో రెండు ప్రాపర్టీలను కూడా నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. భద్రతా, నియంత్రణ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై ఇప్పుడు వాటినీ పరిశీలిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఢిల్లీలోని ఆ ఇంట్లో చేసేది ఏంటి?
దేశ రాజధాని నగరంలో మరో సెక్స్ రాకెట్ బట్టబయలైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... సెంట్రల్ ఢిల్లీలో, అజ్మేరీ గేట్ సమీపంలోని ఎస్.ఎన్. మార్గ్‌లో ఉన్న ఒక ఇంటిపై 12వతేదీన పోలీసులు మెరుపు దాడి చేశారు. అక్కడ ఎనిమిది మంది యువతులు, పలువురు పురుషులు అక్రమ అశ్లీల కార్యకలాపాలలో నిమగ్నమై ఉండటాన్ని కనుగొన్నారు. ఎనిమిది మంది మహిళల్లో ఒకరు 17 ఏళ్లు కూడా నిండని మైనర్ అని తేలింది. ఈ ముఠా సూత్రధారి రాహుల్, తన భార్య కుమారితో కలిసి ఈ మొత్తం కార్యకలాపాన్ని నడుపుతున్నాడు. మేనేజర్లు గోపీ రామ్ పరిహార్, లుమాకాంత్ పాండే, ఆలియా పింకీలను అరెస్టు చేశారు. ఈ ముగ్గురూ ఆ సంస్థ నిర్వహణను పర్యవేక్షించే బాధ్యత వహించారు. పోలీసులు ఆ ప్రాంగణంలో సోదాలు నిర్వహించగా, ఎనిమిది వేర్వేరు గదులలో పలువురు పురుషులు, మహిళలు అశ్లీల, చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ మొత్తంలో నగదు (సుమారు రూ.1.97 లక్షలు), విదేశీ కరెన్సీ, గంజాయి, లైంగిక సామర్థ్యాన్ని పెంచే క్యాప్సూల్స్, వందలాది మద్యం సీసాలు, బీర్ క్యాన్లు, కండోమ్‌లు, లావాదేవీల లెడ్జర్లు, కత్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పాల్గొన్న ఎనిమిది మంది మహిళల్లో ఒకరు 17 ఏళ్లలోపు మైనర్ అని సమాచారం.నగ్నంగా వచ్చెయ్.. నచ్చిన వారితో ఎంజాయ్ఆ ఇంటిలో నడుస్తున్న వ్యభిచారం మరింత కొత్త పుంతలు తొక్కినట్టు తెలుస్తోంది. ఇంట్లోకి అడుగుపెట్టగానే నగ్నంగా మారాలనేది నిబంధన కాగా అక్కడ అందరూ నగ్నంగానే సంచరిస్తారట. ఆ తర్వాత అక్కడ ఉన్న అమ్మాయిల్లో నచ్చిన వారితో ఎంజాయ్ చేయవచ్చునట. ఇక అక్కడ జరిగే తంతు పోర్న్ వీడియోలకు తీసిపోని రీతిలో ఉంటుందట. వీరి క్లయింట్లు అందరూ దేశవ్యాప్తంగా ఉన్న సంపన్నులు, భిన్న రంగాల ప్రముఖులు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలిందని సమాచారం. ఇప్పటి వరకూ దీనిపై పోలీసులు అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయనప్పటికీ సోషల్ మీడియా లో ఈ వార్త వైరల్ అవుతోంది.దేశరాజధానిలో విచ్చలవిడిగా...గత కొంత కాలంగా ఢిల్లీలో పెద్ద సంఖ్యలో వ్యభిచార అడ్డాలు, సెక్స్ రాకెట్లు వెలుగు చూస్తుండడం దేశ రాజధాని నగర ప్రతిష్టను మసకబారుస్తోంది. ఢిల్లీ–ఎన్ సిఆర్ ప్రాంతంలో నకిలీ డేటింగ్ యాప్ ప్రొఫైల్‌ల ద్వారా ప్రజలను లక్ష్యంగా చేసుకుని అశ్లీల చిత్రాల దందాలు ఆన్ లైన్ దోపిడీ (సెక్స్టార్షన్) పెరిగాయని పోలీసు రికార్డులు సూచిస్తున్నాయి, అలాగే ఢిల్లీ పోలీసులు, తరచుగా స్పా సెంటర్లు లేదా క్లబ్‌ల ముసుగులో నడుస్తున్న అక్రమ సెక్స్ రాకెట్లు బయటపడుతున్నాయి.గత ఏడాది మార్చి లో పహర్‌గంజ్ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు ఒక సెక్స్ రాకెట్‌ను ఛేదించారు. ఆ సమయంలో 10 మంది నేపాలీ జాతీయులు ముగ్గురు మైనర్లతో సహా 23 మంది మహిళలను రక్షించారు. మానవ అక్రమ రవాణాలో పాల్గొన్న ఏడుగురిని అరెస్టు చేశారు. అదే మార్చి నెలలో గ్రాండ్ ప్లాజాలోని బ్లిస్ వెల్నెస్ స్పాపై జరిపిన దాడిలో, విదేశీయులు మైనర్లతో కూడిన సెక్స్ రాకెట్‌ను నడుపుతున్నందుకు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణ ఢిల్లీలోని లజ్‌పత్ నగర్లో రెండు స్పా సెంటర్ల పేరిట నడుస్తున్న వ్యభిచార రాకెట్‌పై దాడి అనంతరం ఇద్దరు మేనేజర్లను అరెస్టు చేశారు.ఈ ఆపరేషన్ లో తొమ్మిది మంది మహిళలను రక్షించారు. ఇలా చెప్పుకుంటూ పోతే పోలీసులు దాడులు, అరెస్టులు కు దొరుకుతున్నవే పెద్ద జాబితా అవుతుంది. ఇక. దొరకని ముఠాలు ఎన్ని ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు చిరునామాగా ఉండాల్సిన దేశ రాజధాని నగరంలో ఇలాంటి పరిస్థితి ఉండడం అవాంఛనీయం. దీనిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి స్థాయిలో నివారించాల్సిన అవసరం కనిపిస్తోంది. -
ఢిల్లీలో ఉగ్ర కుట్ర భగ్నం.. భారీగా ఆయుధాలు సీజ్
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఉగ్ర కుట్ర భగ్నమైంది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, నేపాల్ నుంచి భారీ ఎత్తున ఆయుధాల భారత్‌కు స్మగ్లింగ్ అయినట్టు పోలీసులు గుర్తించారు. అనంతరం, ఆయుధాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
పోలీసు Vs పోలీసు.. కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్‌తో ఉద్రిక్తత
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు అరెస్ట్ కారణంగా ఢిల్లీ పోలీసులు, హిమాచల్ పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో, సిమ్లాలో బుధవారం అర్ధరాత్రి హైడ్రామా కొనసాగింది. చివరకు మేజిస్ట్రేట్ నుంచి రిమాండ్ ఆర్డర్ రావడంతో ఈ వివాదానికి తెరపడింది. ఇంతకీ ఏం జరిగిందంటే..ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన ఏఐ సమ్మిట్ యూత్ కాంగ్రెస్ నేతలు నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. వీరిలో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు యూత్ కాంగ్రెస్ ఉన్నారు. ఈ నేపథ్యంలో సిమ్లాలోని ఒక హోటల్లో ఉన్న సౌరభ్, సిద్ధార్థ్, అర్బాజ్‌లను అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ పోలీసులు.. బుధవారం హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం.. హిమాచల్ ప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ పోలీసులు మఫ్టీలో రావడంతో కిడ్నాప్ చేశారని ఆరోపించారు. అలాగే, ముగ్గురి అరెస్ట్‌కు సంబంధించి విధి విధానాలు పాటించలేదని హిమాచల్ పోలీసులు.. ఢిల్లీ పోలీసులను అడ్డుకున్నారు. దీంతో, ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. #WATCH | Additional Chief Judicial Magistrate (ACJM-II) court in Shimla granted transit remand to three accused arrested by the Delhi Police from Rohru in Shimla district.The three accused, Saurav, Arbaaz and Siddharth, were produced at around 1.00 am at the residence court of… pic.twitter.com/VSyEK2Mr1u— ANI (@ANI) February 25, 2026అనంతరం, ఢిల్లీ పోలీసులు.. ముగ్గుర్ని రాత్రి అదనపు చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా.. వారికి కోర్టు ట్రాన్సిట్ రిమాండ్ ఇచ్చింది. దీంతో ఢిల్లీ పోలీసులు వారిని రాజధానికి తీసుకెళ్లే అనుమతి పొందారు. అనంతరం, ఢిల్లీ వెళ్తున్న క్రమంలో గురువారం తెల్లవారుజామున మరోసారి వారిని హిమాచల్ పోలీసులు అడ్డుకున్నారు. చివరికి ఢిల్లీ పోలీసులు సీజ్ మెమో కాపీని చూపించడంతో హిమాచల్ పోలీసులు వెనక్కి తగ్గారు. అయితే, హిమాచల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కారణంగానే ఇలా జరిగిందని పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. Delhi police went to arrest IYC members from Shimla and Himachal police arrested them in the morning, they got court order and got released and again arrested in the evening 😂😂👏🏼pic.twitter.com/mSezH1H96b— Vijay Thottathil (@vijaythottathil) February 25, 2026VIDEO | Shimla: A jurisdiction dispute has erupted after the Delhi Police detained three Youth Congress workers in connection with an AI Summit protest pic.twitter.com/H7o7eaYOb8— Press Trust of India (@PTI_News) February 25, 2026 -
ఢిల్లీలో కాల్పుల కలకలం
ఢిల్లీ: ఉత్తర ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ ప్రాంతంలో కాల్పులు కలకలం సృష్టించాయి. పోలీసుల సమాచారం ప్రకారం, మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఐదు మంది ప్రయాణిస్తున్న ఒక కారుపై గుర్తు తెలియని వ్యక్తులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు.జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ రేంజ్) మధుర్ వర్మ సంఘటనా స్థలాన్ని సందర్శించి ఘటనను ధృవీకరించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఐదు మంది సియాజ్ కారులో ప్రయాణిస్తుండగా వెనుక నుంచి దాడి జరిగింది. సీటు వెనుక కూర్చున్న సందీప్ అనే వ్యక్తి భుజం దగ్గర బుల్లెట్ గాయమైనట్లు తెలుస్తోంది. కారులో ఉన్న మరో వ్యక్తి దీపక్ ఖత్రి, తాను గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు అడ్వకేట్ అని పోలీసులకు తెలిపాడు. అయితే విచారణలో ఆయన భార్య రాజ్‌ని ఖత్రి బిష్ణోయ్‌కు న్యాయవాది అని, సందీప్ ఓ ఎన్జీవోలో పనిచేస్తున్నట్లు తేలింది. ప్రాథమిక దర్యాప్తులో ముగ్గురు వ్యక్తులు స్కూటర్‌పై వచ్చి కాల్పులు జరిపినట్లు తెలిసింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.ప్రస్తుతం కారులో ఉన్నవారి వాంగ్మూలాలు, స్థానికుల స్టేట్మెంట్లు నమోదు చేస్తున్నారు. క్రైమ్, ఫోరెన్సిక్ టీమ్‌ను సంఘటనా స్థలానికి తరలించారు. స్థానికి సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. -
ఏఐ సమ్మిట్: దుమారం రేపుతున్న అర్ధనగ్న ప్రదర్శన
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని భారత్ మండపంలో జరిగిన ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇంపాక్ట్ సమ్మిట్’ వద్ద ఇండియన్ యూత్ కాంగ్రెస్ (ఐవైసీ) కార్యకర్తలు చేపట్టిన అర్ధనగ్న ప్రదర్శన ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఢిల్లీ పోలీసులు శనివారం పటియాలా హౌస్ కోర్టులో తమ వాదనలు వినిపించారు. ఈ నిరసనల వెనుక అంతర్జాతీయ స్థాయిలో దేశ పరువు తీసేందుకు భారీ కుట్ర ఉందని పోలీసులు ఆరోపించారు.శుక్రవారం ఏఐ సమ్మిట్ వద్ద యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు తమ చొక్కాలు విప్పి, ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు ఉన్న టీ-షర్టులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నలుగురు ఐవైసీ (ఐవైసీ) నేతలను పోలీసులు శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నిరసన కార్యక్రమం నేపాల్‌లో గతంలో జరిగిన ఒక భారీ ఆందోళనను పోలి ఉందని, ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన కుట్ర అని పోలీసులు కోర్టుకు వివరించారు. భారత్ మండపంలో అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్న సమయంలో ఇటువంటి నిరసన చేపట్టడం ద్వారా దేశ ప్రతిష్టను ప్రపంచ వేదికపై మసకబార్చేందుకు ప్రయత్నించారని పోలీసులు ఆరోపించారు.ఈ నిరసనల వెనుక ఉన్న కారణాలను వెలికితీసేందుకు తమకు ఐదు రోజుల రిమాండ్ కావాలని పోలీసులు కోర్టును కోరారు. నిందితుల తరపు న్యాయవాది పోలీసుల వాదనలను తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు అని ఆయన కోర్టులో వాదించారు. ‘ప్రతిపక్ష పార్టీగా నిరసన తెలిపే హక్కు నిందితులకు ఉంది. ఈ ఆందోళన శాంతియుతంగా జరిగింది. ఎక్కడా ఎటువంటి హింస జరిగినట్లు వీడియో ఆధారాలు లేవని న్యాయవాది పేర్కొన్నారు. నిందితులను పోలీసులు అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారని న్యాయవాది వాదించారు.ఇది కూడా చదవండి: కెనడా కాల్పులు: పసిగట్టిన ఏఐ.. ఆగని మారణకాండ -
బ్లింకిట్‌కు షాకిచ్చిన ఢిల్లీ పోలీసులు
క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్‌కు ఎదురుదెబ్బ తగిలింది.తన ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్ ద్వారా నిషేధిత కత్తులను అమ్మకానికి అందిస్తున్నట్లు ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు ఆయుధ చట్టం కింద ప్రథమ సమాచార నివేదిక (FIR) నమోదు చేశారు.ది టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం పశ్చిమ ఢిల్లీలోని ఖ్యాలా పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. ఫిర్యాదు ప్రకారం, ఖ్యాలా ప్రాంతంలో ఇటీవల జరిగిన రెండు హత్య కేసులు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కొనుగోలు చేసిన కత్తులను ఉపయోగించి జరిగాయని ఆరోపించారు. ఆ సంఘటనల తర్వాత, అధికారులు అమ్మకానికి ఉన్న కత్తులను జాబితా చేస్తూ ఇ-కామర్స్ , రాపిడ్-డెలివరీ సేవలను పరిశీలించారు.ఇందులో భాగంగానే కానిస్టేబుల్ ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 3.43 గంటలకు ఆన్లైన్ లావాదేవీ ద్వారా రూ. 710 చెల్లించి కత్తి కోసం ఆర్డర్ ఇచ్చాడు. డెలివరీ చిరునామాను ఉద్దేశపూర్వకంగా పోలీస్ స్టేషన్ అడ్రస్ ఇచ్చారు. ఆ వస్తువు అదే రోజు సాయంత్రం 4.05 గంటలకు స్టేషన్ ప్రాంగణంలో డెలివరీ అయింది. కొనుగోలుకు సంబంధించిన పన్ను ఇన్వాయిస్ విక్రేతను ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌గా గుర్తించిందని, పశ్చిమ ఢిల్లీలోని తిహార్ గ్రామంలోని చిరునామాతో ఉంది. దీని ఆధారంగా ఆయుధ చట్టంలోని సెక్షన్ 25, 54 మరియు 59 కింద కేసు నమోదు చేశారు.ఇదీ చదవండి : పెళ్లి కూతురిపై రూ. 8.5 కోట్ల వర్షం, కట్ చేస్తే!బ్లింకిట్ ద్వారా ఆర్డర్ తమకు డెలివరీ అయిన ‘గరారిదార్’కత్తి ప్రమాణాలునిర్ధిష్టప్రమాణాలకు మించి ( గరిష్ట బ్లేడ్ పొడవు 7.62 సెం.మీ బ్లేడ్ వెడల్పు 1.72 సెం.మీ) కంటే ఎక్కువగా ఉందని ప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (పశ్చిమ) దారాడే శరద్ భాస్కర్ తెలిపారు.కత్తి బ్లేడ్ పొడవు 8 సెం.మీ. వెడల్పు 2.5 సెం.మీ ఉది ఇది ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన చట్టవిరుద్ధమైన చర్య అని పేర్కొన్నారు. ఫిర్యాదు ప్రకారం, స్వాధీనం చేసుకున్న వస్తువులో స్టీల్ బ్లేడ్ ,స్టీల్ స్ట్రిప్ మెకానిజంతో అమర్చబడిన బ్లాక్ మెటల్ హ్యాండిల్ ఉన్నాయి.అనంతరం ఢిల్లీ అంతటా ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన అనేక స్టోర్లు,ఇతర అవుట్లెట్లపై దాడులు నిర్వహించిన పోలీసులు 16 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. మరుసటి రోజు దాడులు కొనసాగాయి. హర్యానాలోని గుర్గావ్లోని ఫరూఖ్‌నగర్‌లో ప్లాట్‌ఫామ్ నిర్వహిస్తున్న గిడ్డంగి నుండి 32 అదనపు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసుకు సంబంధించి మొత్తం 50 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత ఆయుధాల సోర్సింగ్, నిల్వ మరియు పంపిణీకి బాధ్యతను నిర్ణయించడానికి తదుపరి విచారణలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.ఈ పరిణామంపై బ్లింకిట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
నరవణే పుస్తకం లీక్: ‘పెంగ్విన్’ను విచారించిన పోలీసులు
న్యూఢిల్లీ: మాజీ సైన్యాధికారి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన స్వీయ చరిత్ర (మెమోయిర్) ఇంకా ప్రచురణ కాకముందే బయటకు రావడంపై ఆరా తీసేందుకు ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. గురువారం నాడు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ విభాగం ‘పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా’ ప్రతినిధులను ఈ అంశంపై విచారించింది. పుస్తకంలోని అంశాలు ఎలా బయటకు వచ్చాయన్న దానిపై వివరణ కోరుతూ పోలీసులు అంతకుముందే పబ్లిషర్లకు నోటీసులు జారీ చేశారు.విచారణలో భాగంగా పోలీసులు అడిగిన కొన్ని కీలక ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు పబ్లిషర్లు కొంత సమయం కోరారు. జనరల్ నరవణే రచించిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో తీవ్ర దుమారం రేపింది. 2020లో భారత్-చైనా సరిహద్దు ప్రతిష్ఠంభనపై ఒక మ్యాగజైన్లో ప్రచురితమైన ఈ పుస్తక సారాంశాన్ని ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే సదరు పుస్తకం ఇంకా అధికారికంగా విడుదల కాలేదని, అందుకే అందులోని అంశాలను కోట్ చేయడం నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ వివాదం ముదురుతున్న తరుణంలో ప్రచురణ సంస్థ ‘పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా’ సోషల్ మీడియా వేదికగా కీలక వివరణ ఇచ్చింది. 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తకానికి సంబంధించిన పూర్తి హక్కులు తమ వద్దే ఉన్నాయని, అయితే ఈ పుస్తకం ఇంకా ప్రచురణ దశకే చేరుకోలేదని సంస్థ స్పష్టం చేసింది. ప్రింట్ రూపంలో కానీ, డిజిటల్ రూపంలో కానీ ఎక్కడా ఈ పుస్తకాన్ని పంపిణీ చేయలేదని, విక్రయించలేదని ‘ఎక్స్’వేదికగా వెల్లడించింది. మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో వాస్తవాలను వెల్లడించేందుకే ఈ ప్రకటన చేస్తున్నట్లు పబ్లిషర్లు పేర్కొన్నారు.తన పుస్తకం చుట్టూ జరుగుతున్న చర్చపై మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే కూడా స్పందించారు. పబ్లిషర్లు ఇచ్చిన అధికారిక వివరణను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ, ప్రస్తుతం పుస్తకానికి సంబంధించిన వాస్తవ పరిస్థితి ఇదేనని నొక్కి చెప్పారు. అసలు ప్రచురణ కాని పుస్తకంలోని సున్నితమైన అంశాలు ఎలా లీక్ అయ్యాయి? దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందనే కోణంలో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. విచారణలో తేలే అంశాలను అనుసరించి తదుపరి చర్యలు ఉంటాయని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. -
యువతుల మిస్సింగ్ ఎపిసోడ్లో ట్విస్ట్
ఆపరేషన్ మిలాప్.. కనిపించకుండా పోయిన వాళ్లను గుర్తించి వాళ్ల ఇళ్లకు చేర్చేందుకు ఢిల్లీ పోలీసులు చేపట్టిన స్పెషల్ ఆపరేషన్. కిందటి ఏడాది ఈ ఆపరేషన్ ద్వారా 1,303 మంది జాడను గుర్తించగలిగారు. అందులో చిన్నపిల్లలు, అమ్మాయిల ఎక్కువగా ఉన్నారు. అయితే ఇప్పుడు కేవలం 15 రోజుల్లోనే వందల మంది ఆచూకీ లేకుండా పోయింది. వాళ్లను ట్రేస్ చేయడంలో పోలీసులు ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ఇలా అనుకుంటున్నలోపే పోలీసులు పెద్ద ట్విస్టే ఇచ్చారు.దేశ రాజధాని రీజియన్‌లో మిస్సింగ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుందని.. అందులో అమ్మాయిల సంఖ్యే అధికంగా ఉంటోందన్న కథనాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటి ఆధారంగా ఇటు మీడియా సంస్థలూ వరుస కథనాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో.. ఢిల్లీ పోలీసులు ఈ వార్తలను ఖండించారు. దీని వెనుక పెయిడ్ ప్రమోషన్ ముఠా ఉందని తేల్చేశారు.జనవరి 1 నుంచి 15వ తేదీల మధ్య ఏకంగా 800 కనిపించకుండా పోయారన్నది ఆ ప్రచార సారాంశం. వీటి ఆధారంగా కొన్ని ఇండిపెండెంట్ మీడియా సంస్థలు.. వాటి ఆధారంగా ప్రధాన వార్తా సంస్థలూ కథనాలు ప్రచురించాయి. అందులో.. ఢిల్లీలో మొత్తం 807 మంది కనిపించకుండా పోయారు. వీళ్లలో 509 మంది మహిళలు, అమ్మాయిలు.. 298 మంది పురుషులు ఉన్నారు. మొత్తంలో 191 మంది మైనర్లు, 616 మంది పెద్దలు ఉన్నారని తెలిపాయి. జనవరి 1 నుండి 27 వరకు 235 మందిని పోలీసులు గుర్తించగా, 572 మంది ఇంకా కనిపించలేదని.. రోజుకు సగటున 27 మంది మిస్సింగ్‌గా రిపోర్ట్ అవుతుండగా, 9 మందిని మాత్రమే పోలీసులు కనిపెడుతున్నారని మీడియా డాటా తెలిపింది. ఈ డాటా ఆధారంగా ప్రతిపక్ష ఆప్.. అధికార బీజేపీపై విరుచుకుపడింది.అయితే.. ఈ కథనాలతో ఆశ్చర్యపోయిన ఢిల్లీ పోలీసులు విచారణను లోతుగా దర్యాప్తు చేశారు. అందులో.. మిస్సింగ్ గర్ల్స్ సంఖ్య పెరిగిందన్న ప్రచారం స్పాన్సర్డ్ పోస్టుల ద్వారా వైరల్ అయ్యిందని గుర్తించారు. డబ్బు కోసం భయాన్ని సృష్టించడం సహించబోమని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ పోలీసులు ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు. ఇలాంటి వదంతులను నమ్మొద్దని.. నిర్ధారణ లేని సోషల్ మీడియా పోస్టులను పట్టించుకోవద్దని.. అదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ వాసులకు చెబుతున్నారు.After following a few leads, we discovered that the hype around the surge in missing girls in Delhi is being pushed through paid promotion. Creating panic for monetary gains won't be tolerated, and we'll take strict action against such individuals.— Delhi Police (@DelhiPolice) February 6, 2026గత సంవత్సరం గణాంకాలతో పోలిస్తే మిస్సింగ్ కేసులు పెరగలేదు. ఈ జనవరిలో కేసులు తగ్గాయి అని జాయింట్ కమిషనర్ సంజయ్ త్యాగి తెలిపారు. కాబట్టి నెట్టింట జరిగే ప్రచారం కేవలం వదంతులు మాత్రమేనని ఆయన అన్నారు.గత సంవత్సరం ఢిల్లీ పోలీసులు “ఆపరేషన్ మిలాప్” కింద మొత్తం 1,303 మంది కనిపించకుండా పోయిన వారిని గుర్తించి, వారి కుటుంబాలతో మళ్లీ కలిపారు. వీరిలో 434 మంది పిల్లలు, 869 మంది పెద్దలు ఉన్నారు. ఒక్క డిసెంబర్లోనే 102 మంది ఆచూకీకి గుర్తించగలిగారు. -
ఢిల్లీలో బంగభవన్ వద్ద ఉద్రిక్తత
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే పేరిట అధికారులు తమ రాష్ట్రంలో కుటుంబాలను వేధిస్తున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదే విషయమై ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను కలిసేందుకు ఢిల్లీకి వచ్చిన మమత సోమవారం బంగభవన్ వద్ద బందోబస్తు కోసం వచ్చిన ఢిల్లీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ఓటర్ల సమస్యలను ఈసీ ముందు ఏకరవు పెట్టేందుకు వచ్చిన తనను ధర్నా చేస్తాననే ఉద్దేశంతో అడ్డుకోవడం ఏమాత్రం సబబుగా లేదంటూ ఆమె ఢిల్లీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆ ప్రాంతంలో భారీ స్థాయిలో పోలీసులను మొహరించారు. తర్వాత అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధులతో మమత ఘటన వివరాలను వెల్లడించారు. బెంగాల్లో ఎస్ఐఆర్ బాధితులుగా మిగిలిపోయిన వారిలో దాదాపు 50 కుటుంబాలను మమత ఢిల్లీకి తరలించారు. కొందరు చాణక్యపురిలోని రాష్ట్ర ప్రభుత్వ భవనం అయిన బంగ భవన్లో, మరికొందరి వేర్వేరు చోట్ల విడిది ఏర్పాటుచేశారు. వీళ్లను కలిసేందుకు మమత బంగభవన్‌కు చేరుకోగానే అక్కడ మొహరించిన భారీ బందోబస్తును చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘బెంగాల్లో ఎస్ఐఆర్ బాధిత కుటుంబాలు మీడియాతో మాట్లాడకూడదా? వాళ్ల గోడు వెళ్లబోసుకోవద్దా?’’అని పోలీసులను మమత నిలదీశారు. ‘‘బంగభవన్‌కు పోలీసులొచ్చి బాధిత కుటుంబాలను బెదిరించారు. మా కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఎలక్షన్ కమిషన్‌తో మాకు సమావేశముంది. అధికారికంగా అపాయింట్మెంట్ తీసుకున్నాకే ఇక్కడికొచ్చాం. ఎస్ఐఆర్ వేధింపులకు బెంగాల్లో చాలా మంది చనిపోయారు. వాళ్ల కుటుంబాలు మీడియాతో మాట్లాడకూడదా?’’అని పోలీసులను మమత నిలదీశారు. అప్పుడెక్కడికి పోయారు? ‘‘బెంగాల్ కుటుంబాలు బసచేసిన ప్రతి చోటుకు పోలీసులు ఎందుకొస్తున్నారు? ఇప్పుడొచ్చిన ఇదే పోలీసులు ఎర్రకోటవద్ద బాంబు పేలినప్పుడు ఎక్కడికి పోయారు?. క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసులను నేను తప్పుబట్టంలేదు. పోలీస్‌బాస్‌లను నిలదీస్తున్నా. మీకు దమ్ములేదు. దేశాన్ని రక్షించే సత్తా లేదు. బెంగాలీలు, జనాన్ని పీడించడమే మీకు తెలుసు. ఎస్ఐఆర్ పేరిట అరాచకాలకు పాల్పడుతున్నారు. ఢిల్లీకి నేనొస్తే వీళ్లకు భయం పట్టుకుంటోంది. నేనేమైనా లక్షల మందిని వెంటేసుకొచ్చానా?. పేదలకు ఢిల్లీలో స్థలం లేదా? ఢిల్లీ జమీందారీలా తయారైంది. నేనేమీ ఇక్కడకు వీళ్లతో కలిసి ధర్నా చేపట్టేందుకు రాలేదు. మేమంతా న్యాయంకోసం ఇక్కడికొచ్చాం’’అని మమత అన్నారు. ఢిల్లీ పోలీసుల ప్రశ్నల పరంపర నుంచి కుటుంబాలను రక్షించేందుకు వాళ్లు ఉంటున్న ప్రాంతాలకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సాకేత్ గోఖలే, దోలా సేన్, కకోలీ ఘోష్ దస్తీదార్, బాపీ దల్దార్‌లు వెళ్లారు. ఢిల్లీ కైలాశ్ కాలనీలోని పశ్చిమబెంగాల్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గెస్ట్‌హౌస్‌లో ఉన్న 20 మందికి రక్షణగా సాకేత్ గోఖలే వెళ్లగా అక్కడికి చేరుకున్న పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. హేలీ రోడ్‌లోని బంగభవన్‌కు చేరుకున్న బాధితులతో తర్వాత మమత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ భేటీ అయి వాళ్ల సమస్యలను అడిగి తెల్సుకున్నారు. తర్వాత వాళ్లను వెంటబెట్టుకుని మమత ఈసీ కార్యాలయానికి వెళ్లారు. -
పోలీస్ కమెండోపై దారుణం.. డంబెల్‌తో దాడి చేసి..
న్యూఢ్లిల్లీ: ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. పోలీస్ స్పెషల్ సెల్లో స్వాత్ (SWAT) కమెండోగా పనిచేస్తున్న కాజల్ చౌదరి(27) భర్త చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఘజియాబాద్‌లోని ఆసుపత్రిలో ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి ఆమె కన్నుమూశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె భర్త అంకుర్ చౌదరి.. కాజల్‌పై డంబెల్‌తో దాడి చేసి, ఆమె తలను తలుపు ఫ్రేమ్‌కు బలంగా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘాతుకానికి పాల్పడని తర్వాత అంకుర్ స్వయంగా తన బావ నిఖిల్‌కు ఫోన్ చేసి, ‘నీ అక్కను చంపేశాను, వచ్చి శవాన్ని తీసుకెళ్లు’ అని చెప్పడం కలకలం రేపుతోంది.కాజల్, అంకుర్ 2022లో డిగ్రీ చదువుతున్న సమయంలో ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. కాజల్ 2023లో ఢిల్లీ పోలీసు విభాగంలో కమెండోగా ఎంపికయ్యింది. రక్షణ మంత్రిత్వ శాఖలో అంకుర్ క్లర్క్‌గా ఉద్యోగం సంపాదించాడు. అయితే పెళ్లయిన 15 రోజుల నుండే అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కారు ఇవ్వాలని, నగదు తేవాలని అంకుర్ కుటుంబం కాజల్‌ను శారీరకంగా, మానసికగా హింసించినట్లు సమాచారం.కాజల్ తండ్రి రాకేష్ తన కుమార్తె మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాజల్ ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణీ అని, అంకుర్ కేవలం తన కూతురుని మాత్రమే కాకుండా పుట్టబోయే బిడ్డను కూడా చంపి, రెండు హత్యలు చేశాడని ఆయన కన్నీరుమున్నీరయ్యారు. గణౌర్లో అత్తమామల వేధింపులు భరించలేక వారు ఢిల్లీలోని మోహన్ గార్డెన్‌కు మారినప్పటికీ, అంకుర్ తన ప్రవర్తన మార్చుకోలేదన్నారు. నిరంతరం డబ్బు కోసం వేధిస్తూనే ఉండేవాడని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.జనవరి 22న జరిగిన ఈ దాడి ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. తొలుత హత్యాయత్నం కేసుగా నమోదు చేసినప్పటికీ, కాజల్ మరణించడంతో దానిని హత్య కేసుగా (సెక్షన్ 302 కింద) మారుస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడు అంకుర్‌ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం, ఆ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఘజియాబాద్ పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: వందే భారత్ మెనూలో అదిరిపోయే మార్పులు -
ఏఐ అద్దాలతో రంగంలోకి పోలీసులు
న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకల సందర్భంగా ఈసారి ఢిల్లీ పోలీసులు తొలిసారిగా కృత్రిమ మేధతో పనిచేసే కళ్లద్దాలు ధరించనున్నారు! ఇంటిగ్రేటెడ్ ఫేషియల్ రికగ్నీషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్)తో పనిచేసే ఈ ఏఐ స్మార్ట్ కళ్లద్దాలను నేరాల డేటాబేస్‌తో అనుసంధానిస్తారు. దాంతో వేడుకకు హాజరైన వాళ్లలో గత నేరగాళ్ల ముఖాలను గుర్తించి వెంటనే బలగాలను హెచ్చరిస్తాయి! తద్వారా పాత నేరస్తులు, నిందితులు, అనుమానిత వ్యక్తులను తక్షణం అదుపులోకి తీసుకునే వీలుంటుంది. కార్యక్రమాలకు హాజరైన గుమిగూడిన జనంలోని వారిలో ఎవరి ముఖమైనా నేరచరితుల డేటాతో సరిపోలితే స్మార్ట్‌గ్లాస్ వెంటనే అప్రమత్తం చేస్తుంది. దాంతో జనం గందరగోళానికి గురికాకుండా కేవలం అనుమానితున్ని మాత్రమే జాగ్రత్తగా అదుపులోకి తీసుకోవచ్చని న్యూఢిల్లీ అదనపు పోలీస్ కమిషనర్ దేవేశ్ కుమార్ మాహ్లా వివరించారు.ఎరుపొస్తే పట్టివేత‘‘ ఏఐ స్మార్ట్‌గ్లాస్ ఆయా పోలీస్ ఉపయోగించే స్మార్ట్‌ఫోన్‌కు వెంటనే సందేశం పంపుతుంది. ఆ సందేశంలో గ్రీన్ బాక్స్ వస్తే ఆ వ్యక్తికి ఎలాంటి నేరచరిత్ర లేదు అని అర్ధం. ఒకవేళ ఎరుపు రంగు వస్తే అతనికి గత నేరాలతో సంబంధం ఉందని అర్థం. వెంటనే అతని గుర్తింపు కార్డ్‌లను పరిశీలించి అదుపులోకి తీసుకోవాలా వద్దా? అతడిపై గతంలో ఉన్న నేరాభియోగాలు తీవ్రమైనావా కావా? వెంటనే అదుపులోకి తీసుకోవడం అవసరమా కాదా? అనేవి పోలీసులు నిర్ణయించి తగు రీతిలో స్పందిస్తారు’’ అని ఏసీపీ దేవేశ్ వెల్లడించారు. ‘‘వ్యక్తుల చరిత్రను తక్షణం గుర్తించడం అనే ఈ ప్రక్రియ కారణంగా గతంలో మాదిరి ఒక్కో వ్యక్తిని మాన్యువల్‌గా తనిఖీచేయాల్సిన శ్రమ తగ్గుతుంది. దీనికితోడు విస్తృతంగా ఏర్పాటుచేసిన సీసీటీవీలు, డ్రోన్లతో పర్యవేక్షణ, ఏఐ ఆధారిత విశ్లేషణ విధానాలతో ఈ కార్యక్రమంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలనూ వేగంగా గుర్తించవచ్చు’’ అని ఆయన వెల్లడించారు.20 ఏళ్ల పాత ఫొటో అయినాసరే..‘‘ మా దగ్గర ఉన్న డేటాబేస్‌లో పాత నేరగాళ్లకు చెందిన 20 ఏళ్లక్రితంనాటి ఫొటో ఉన్నాసరే సంబంధిత నేరస్తుడు ఇవాళ కన్పించినా ఏఐ స్మార్ట్‌గాŠల్స్ అనేది సరిపోల్చుకోగలదు. అంతటి సామర్థ్యం ఇంటిగ్రేటెడ్ ఫేషియల్ రికగ్నీషన్ సిస్టమ్‌కు ఉంది. స్మార్ట్ గ్లాసెస్ చూపు నుంచి నేరస్తులు తప్పించుకోలేరు. ఈ అద్దాలకు థర్మల్ ఇమేజింగ్ సామర్థ్యమూ ఉంది. ఇనుము, ఉక్కు లోహాలు సహా పదునైన వస్తువులు, నిషేధిత ఆయుధాలతో సంచరించే వ్యక్తులనూ ఇవి గుర్తించగలవు. సబ్ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులకు ఈ కళ్లద్దాలను ఇస్తున్నాం. పోలీసు వాహనాల ముందుభాగంలోనూ వీటిని అమర్చుతాం. గణతంత్ర వేడుకల్లో వీటిని ఢిల్లీలో ఉపయోగించడం ఇదే తొలిసారి’’ అని అధికారి చెప్పారు. అయితే ఎన్నింటిని కొనుగోలు చేశారో, వాటి ధర తదితర వివరాలను ఆయన వెల్లడించలేదు. ‘‘ఈసారి గణతంత్ర దినోత్సవ కవాతు మార్గంతోపాటు సున్నితమైన ప్రదేశాల్లో మొత్తంగా 10,000 మంది పోలీసులను న్యూఢిల్లీ జిల్లా నుంచి రప్పిస్తున్నారు. వేడుకలకు వచ్చే ప్రతి వాహనం మూడంచెల భద్రతావలయాన్ని దాటుకుని రావాల్సి ఉంటుంది’’ అని ఆయన చెప్పారు. -
Viral Video: ‘జిగ్‌జాగ్’ డ్రైవింగ్.. షాక్ ఇచ్చిన పోలీసులు
ఢిల్లీ: ఎస్‌యూవీతో ప్రమాదకర విన్యాసాలు చేస్తున్న ఓ యువకుడికి ఢిల్లీ పోలీసులు షాక్ ఇచ్చారు. జాతీయ రహదారి-48పై అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఎస్యూవీ వాహనంతో అతివేగంగా 'జిగ్‌జాగ్' డ్రైవింగ్ చేసిన యువకుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిందితుడిని ఓఖ్లా ప్రాంతానికి చెందిన ఇగ్నో విద్యార్థి దావూద్ అన్సారీ (21)గా గుర్తించారు. నిందితుడు నడిపిన స్కార్పియో-ఎన్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనం అతని తండ్రి ముసాఫిర్ అన్సారీ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది.జనవరి 18న మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య జీటీ కర్నాల్ బైపాస్ రోడ్డు నుండి నరేలా వైపు వెళ్తున్న ఒక నల్లటి స్కార్పియో వాహనం, అద్దాలకు నల్లటి టింట్లు వేసుకుని, రహదారిపై వెళ్తున్న ఇతర వాహనదారులను భయపెట్టేలా అడ్డదిడ్డంగా వెళ్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జరిగింది. ఈ వీడియోను తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. నిందితుడిని వెంబడించి పట్టుకున్నారు. కేసు నమోదు చేయడంతో పాటు నిందుతుడి డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. Taking cognizance of a viral video circulating on social media, the team of PS Samaypur Badli, @dcp_outernorth took swift action .The offending vehicle, which was being driven recklessly & dangerously, has been seized and the driver has been arrested for rash & negligent… pic.twitter.com/FIr8HbR9Za— Delhi Police (@DelhiPolice) January 20, 2026 -
Delhi : మసీదు వద్ద కూల్చివేతలు పోలీసులపై రాళ్ల దాడి
-
ఆపరేషన్ ఆఘాత్ 3.0
న్యూఢిల్లీ: నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ ఢిల్లీ పోలీసులు నేరగాళ్లపై ఉక్కుపాదం మోపారు. శుక్రవారం వాయవ్య ఢిల్లీలో ‘ఆపరేషన్ ఆఘాత్ 3.0’పేరుతో చేపట్టిన దాడుల్లో భారీ సంఖ్యలో ఆయుధాలు, మాదకద్రవ్యాలు, మద్యంతోపాటు వాహనాలు పట్టుబడ్డాయి. ఈ సందర్భంగా పలు నేరారోపణలపై 966 మందిని అదుపులోకి తీసుకున్నారు. కొత్త సంవత్సర వేడుకల సమయంలో నివాస ప్రాంతాలు, మురికివాడల్లో నేరాలకు పాల్పడే వారిని, వీధి ఘర్షణలను అదుపు చేసేందుకే ఈ ఆపరేషన్ చేపట్టామన్నారు. ఆపరేషన్ ఆఘాత్ 3.0 సమయంలో 21 దేశవాళీ పిస్టళ్లు, 20 తూటాలు, 27 కత్తులను ఆయుధాల చట్టం కింద స్వా«దీనం చేసుకున్నామని వివరించారు. 12,258 క్వార్టర్ల అక్రమ మద్యం, 6కిలోల గంజాయితోపాటు రూ.2.36 లక్షల నగదును గ్యాంబ్లర్స్ నుంచి సీజ్ చేసినట్లు చెప్పారు. మొత్తం 310 సెల్ఫోన్లు, 6 ద్విచక్ర వాహనాలు, ఒక కారును పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో 600 మందికి పైగా పోలీసులు పాల్గొన్నారన్నారు. నేరాలకు పాల్పడినట్లు తేలితే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 11, 112 కింద కేసులు నమోదు చేసి బహిష్కరణ దండన వంటి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
భారీగా గంజాయి పట్టివేత
సాక్షి, ఢిల్లీ: రాజధాని విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. మత్తుపదార్థాలను తరలిస్తున్న ఇద్దరిని అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి గంజాయి సీజ్ చేశారు. పట్టుకున్న విదేశీ గంజాయి విలువ దాదాపు రూ. 15 కోట్లు ఉంటుందని తెలిపారు.గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న ఫలితం లేకుండా పోతుంది. అధికారులు ఎంతగా కట్టడి చేసినప్పటికీ నిందితులు ఎదో రకంగా మత్తు పదార్థాల స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో మరోసారి భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు విదేశీ గంజాయి తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు వారిని పట్టుకున్నారు. కాగా గతంలోనూ ఢిల్లీలో ఎయిర్ ఫోర్టులో పెద్ద మెుత్తంలో గంజాయి పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన స్మగ్లర్ల నుంచి కస్టమ్స్ అధికారులు దాదాపు రూ.47 కోట్ల విలువైన గంజాయి సీజ్ చేశారు. -
సోనియా, రాహుల్‌పై కేసు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని చిరకాలంగా వెంటాడుతున్న నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియాగాం«దీ, రాహుల్‌పై ఢిల్లీ పోలీసులు ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈడీ ఫిర్యాదు ఆధారంగా ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. వారితో పాటు ఈ కేసులో సహ నిందితులైన కాంగ్రెస్ నేతలు సుమన్ దుబే, శామ్ పిట్రోడాతో పాటు యంగ్ ఇండియన్, అసోసియేటెడ్ జర్నల్స్, దాని ప్రమోటర్ సునీల్ భండారీ తదితరులపై ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. వారిపై ఐపీసీ 120 బి (నేరపూరిత కుట్ర), 406 (నమ్మకద్రోహం), 403 (ఆస్తులు కాజేయడం), 420 (మోసం) సెక్షన్లు మోపారు. మనీ లాండరింగ్ నిరోధకచట్టంలోని 66(2) సెక్షన్ ప్రకారం దఖలు పడ్డ అధికారాలను ఉపయోగించుకుని ఎఫ్ఐఆర్ దాఖలు దిశగా ఈడీ చర్యలు తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎఫ్ఐఆర్ నమోదుపై కాంగ్రెస్, బీజేపీ పరస్పర దూషణలకు దిగాయి. బోగస్ కేసును అడ్డుపెట్టుకుని సోనియా, రాహుల్‌ను వేధించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చౌకబారు రాజకీయాలకు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, అభిషేక్ సింఘ్వీ, ప్రమోద్ తివారీ తదితరులు మండిపడ్డారు. వారు ఎంతటి అభద్రతా భావంలో ఉన్నదీ దీన్నిబట్టి మరోసారి రుజువవుతోందన్నారు. వారి ఆరోపణలను బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ తోసిపుచ్చారు. -
ఢిల్లీలో తెలంగాణ ఈగల్ టీం బిగ్ ఆపరేషన్
సాక్షి, హైదరాబాద్/ఢిల్లీ: తెలంగాణ ఈగల్ టీమ్ దేశ రాజధానిలో గురువారం భారీ ఆపరేషన్ చేపట్టి సూపర్ సక్సెస్ అయ్యింది. ఏకకాలంలో పలు చోట్ల సోదాలు నిర్వహించి.. 50 మందిని అదుపులోకి తీసుకుంది. వీళ్లంతా నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న నైజీరియన్లని తేలింది. ఢిల్లీ పోలీసుల(సీసీఎస్) సహకారంతో తెలంగాణ ఈగల్ టీం ఈ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. వంద మంది స్థానిక పోలీసులు, 124 మంది ఈగల్ టీం సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. సుమారు 20 ప్రాంత్లాలో సోదాలు జరిపింది. తనిఖీల్లో డ్రగ్ కింగ్‌పిన్, డ్రగ్ సేల్ గర్ల్స్, సెక్స్ వర్కర్స్, మ్యూల్ అకౌంట్ హోల్డర్లు పట్టుబడ్డారు. వీళ్ల నుంచి భారీగా మత్తు పదార్థాలు, డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. డ్రగ్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా ఈగల్ టీం వరుసగా మెరుపు దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు లింకుల నేపథ్యంలోనే తాజా ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో పాటు గ్రేటర్ నోయిడా, గ్వాలియర్, విశాఖలోనూ స్థానిక పోలీసుల సహకారంతో అంతరాష్ట్ర ఆపరేషన్స్ చేపట్టినట్లు సమాచారం. -
ఉగ్రవాదులుగా విద్యావంతులు, మేధావులు.. మరింత ప్రమాదకరం
ఢిల్లీ: 2020 దేశరాజధాని అల్లర్ల కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టులో ఢిల్లీ పోలీసులు కీలక వ్యాఖ్యలు చేశారు. మేధావులు ఉగ్రవాదం వైపు అడుగులేస్తే.. వాళ్లు మరింత ప్రమాదకరంగా మారతారని కోర్టుకు నివేదించారు. ఈ సందర్భంగా నిందితులు ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్ బెయిల్‌ను తిరస్కరించాలని కోరారు.సుప్రీం కోర్టులో నిందితుల బెయిల్ పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసుల తరఫున అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ‘‘వాళ్లు ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వకూడదు’’ అని విజ్ఞప్తి చేశారు. ‘‘ఈ మధ్య కాలంలో డాక్టర్లు, ఇంజినీర్లు తమ వృత్తులు వదిలి దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. మేధావులు ప్రభుత్వ సహాయంతో డాక్టర్లు, ఇంజినీర్లు అవుతారు. తర్వాత దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటారు. అలాంటి వారు సాధారణ ఉగ్రవాదుల కంటే మరింత ప్రమాదకరులు’’ అని అన్నారాయన.ఈ సందర్భంగా నిందితుడు షర్జీల్ ఇమామ్ 2019–2020లో సీఏఏకు వ్యతిరేకంగా ఇచ్చిన ప్రసంగాల వీడియోలు కోర్టులో ప్రదర్శించారు. ఈ అల్లర్లు సహజమైనవి కావని.. పక్కా ప్రణాళికతో జరిగిన కుట్ర అని వివరించారు. నిందితులు ఉపా చట్టం కింద అరెస్ట్ అయ్యారని.. బెయిల్ ఇవ్వడానికి కొత్త కారణాలు కనిపించడం లేవని పేర్కొన్నారు.అల్లర్ల నేపథ్యం..కేంద్ర ప్రభుత్వం 2019లో సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్(CAA)ను 2019లో ప్రవేశపెట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ దేశంలో పలు చోట్ల నిరసనలు జరిగాయి. ఢిల్లీలో జాఫ్రాబాద్, షాహీన్ బాగ్ వంటి ప్రాంతాల్లో మహిళలు దీక్షలు చేపట్టారు. వీటిని ఉద్దేశిస్తూ బీజేపీ నేత కపిల్ మిశ్రా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 23వ తేదీన మౌజ్‌పూర్ వద్ద జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ..‘‘నిరసనకారుల్ని అణచివేయాలి. లేకుంటే చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకుంటాం’’ అని పోలీసులకు అల్టిమేటం ఇచ్చారు. ఆ మరుసటి రోజు నుంచి మూడు రోజులపాటు ఉత్తర ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి.2020 ఢిల్లీ అల్లర్లలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువగా మైనారిటీలే ఉన్నారు. సుమారు 700 మందికి పైగా గాయపడ్డారు. అనేక ఇళ్లు, వ్యాపార సంస్థలు, మసీదులు, దేవాలయాలు ధ్వంసమయ్యాయి. దీంతో కపిల్ మిశ్రాపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. అదే సమయంలో ఈ అల్లర్ల వెనుక మేధావుల ముసుగులో ఉగ్రవాదులు ఉన్నారని.. రెజీమ్ చేంజ్ ఆపరేషన్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరం చేయాలనే కుట్ర చేశారని ఢిల్లీ పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. విద్యార్థి సంఘాల నేతలు అయిన ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు.ఫేక్ ఎవిడెన్స్‌పై విమర్శలు..2020 ఢిల్లీ అల్లర్లకు సంబంధించి మొత్తం 695 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీ కింది కోర్టుల్లో ఇవి విచారణ జరిగాయి. 116 కేసుల్లో ఇప్పటికే తీర్పులు వెలువడ్డాయి. 97 కేసుల్లో నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. ఈ క్రమంలో.. పోలీసులు సమర్పించిన వాటిల్లో నకిలీ ఆధారాలు, కల్పిత సాక్ష్యాలు ఉన్నట్లు కోర్టులు గుర్తించారు. ప్రత్యేకించి.. 17 కేసుల్లో ఫేక్ ఎవిడెన్స్‌ను కోర్టులు హైలైట్ చేశాయి. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి.తాజాగా ఢిల్లీ ఎర్రకోట వద్ద కారు పేలిన ఘటనలో 12 మంది మరణించారు. ఇది ఉగ్రదాడి అని, ఆత్మాహుతి దాడికి పాల్పడింది జమ్ముకశ్మీర్ పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ ఉన్ నబీ విచారణలో తేలింది. అంతేకాదు.. ఉమర్‌కు పాక్ ఆధారిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌తో సంబంధాలున్నట్లు తేలింది. అయితే ఈ పేలుళ్లకు కొన్నిగంటల ముందు భారీ ఉగ్రకుట్రను ఫరీదాబాద్+జమ్ము కశ్మీర్ పోలీసులు చేధించారు. భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలోనూ పలువురు వైద్యులను అరెస్ట్ చేశారు. మరోవైపు.. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులోనూ పలువురు వైద్యులు అరెస్ట్ అయ్యారు. దీంతో విద్యావంతులు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనే వైట్‌కాలర్ టెర్రరిజంపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఏం జరిగిందో అర్థం కాలేదు, కానీ..: ప్రత్యక్ష సాక్షులు
సాక్షి, న్యూఢిల్లీ: భారీ పేలుడుతో ఎర్రకోట వద్ద భయానక వాతావరణం నెలకొంది. సోమవారం సాయంత్రం సంభవించిన పేలుడు ధాటికి 9 మంది మృతి చెందగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంతో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్.. దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. పేలుడు శబ్దం ఎంత బిగ్గరగా ఉందంటే సమీపంలోని దుకాణాల కిటికీలు, తలుపులు, కిటికీలు పగిలిపోయాయి. పలు దుకాణాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. పేలుడు ధాటికి మృతదేహాలు తునాతునకలు కావడం పేలుడు తీవ్రతకు అద్దం పడుతోంది. గాయపడిన వాళ్లకు ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. #WATCH | Delhi: Car parts seen strewn around due to the force of the blastMultiple casualties have been brought to the LNJP hospital due to the blast near Gate No 1 of Red Fort Metro Station. Several people have been injured in the incident, sources tell ANI pic.twitter.com/UA8KDHqDTN— ANI (@ANI) November 10, 2025పార్కింగ్ చేసిన కారులో భారీ పేలుడు సంభవించిందని.. ఆ తీవ్రతకు చుట్టుపక్కల వాహనాలు ధ్వంసం అయ్యాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ‘‘ఏం జరిగిందో అర్థం కాలేదు. గాయపడ్డ వాళ్లను వంద అడుగుల దూరం లాక్కొచ్చాం’’ అని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెబుతున్నారు.#WATCH | Delhi: Senior police officials at the spot following a blast near Gate No. 1 of Red Fort Metro StationMultiple casualties have been brought to the LNJP hospital due to the blast near Gate No. 1 of Red Fort Metro Station. Several people have been injured in the… pic.twitter.com/FPpfsQfl70— ANI (@ANI) November 10, 2025‘‘నా జీవితంలో ఇంత పెద్ద శబ్దం నేను ఎప్పుడూ వినలేదు. పేలుడు ధాటికి నేను మూడుసార్లు కింద పడ్డాను. మేమంతా చనిపోబోతున్నట్లు అనిపించింది’’ అని ఓ దుకాణదారుడు చెప్పారు. VIDEO | Blast near Delhi's Red Fort: Zeeshan, auto driver who got injured due to the blast, says: "The car in front of me was about two feet away. I don’t know whether there was a bomb in it or something else, but it exploded. It was a Swift Dzire car."(Full video available on… pic.twitter.com/YoA4KJVqt4— Press Trust of India (@PTI_News) November 10, 2025 -
భారత్–రష్యా సంబంధాలను దెబ్బతీసే ఆదేశాలివ్వలేం
న్యూఢిల్లీ: భారత్–రష్యాల మధ్య సంబంధాలను దెబ్బతీసే ఎలాంటి ఆదేశాలను తాము ఇవ్వాలనుకోవడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భారత్‌కు చెందిన భర్త నుంచి విడిపోయి తమ చిన్నారి సహా దొంగచాటుగా సొంత దేశం రష్యా వెళ్లిపోయిన మహిళ జాడ కోసం అధికారులు అన్వేషణ కొనసాగిస్తున్న వేళ ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిల ధర్మాసనం పేర్కొంది. ఈ అంశాన్ని విదేశాంగ శాఖ అక్టోబర్ 17వ తేదీన మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ద్వారా అక్కడి అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. రష్యా మహిళ తప్పించుకుపోవడంపై నేపాల్‌కు చెందిన వారిని కూడా ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి చెప్పారు. నేపాల్, యూఏఈల మీదుగా ఆ మహిళ సొంత దేశం వెళ్లేందుకు ఢిల్లీలోని రష్యా ఎంబసీ అధికారులు సాయపడినట్లు ధర్మాసనం గుర్తించింది. ఈ విషయంలో రష్యా అధికారులకు ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపినా సరైన ఫలితం రాలేదని సమాచారం. ఈ నేపథ్యంలో భారత్, రష్యా మధ్య సంబంధాలను దెబ్బతీసే ఏ ఉత్తర్వునూ మేం ఇవ్వదలుచుకోలేదు. కానీ, ఇది ఒక బిడ్డకు సంబంధించిన విషయం. తల్లితో ఉన్న ఆ చిన్నారి క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నాడని మాత్రమే మేం ఆశించగలం. ఇది మానవ అక్రమ రవాణా కేసు కాకూడదని ఆశిస్తున్నాం’అని ధర్మాసనం తెలిపింది. ఈ విషయంలో విదేశాంగ శాఖ, ఢిల్లీ పోలీసులతో చర్చలు జరిపి తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని అదనపు సొలిసిటర్ జనరల్‌కు ధర్మాసనం రెండు వారాల గడువిచ్చింది. దేశంలో 2019 నుంచి ఉంటున్న ఆ మహిళ ఎక్స్–1వీసా గడువు ఎప్పుడో తీరిపోయింది. చిన్నారి కస్టడీ కేసు కోర్టులో ఉండటంతో ఎప్పటికప్పుడు వీసా కాలపరిమితిని పొడిగిస్తూ వచ్చారు. అయితే, ఆమె అధికారుల కళ్లుగప్పి రష్యా వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఆ చిన్నారిని వారంలో మూడు రోజులపాటు తల్లి వద్ద, మిగతా రోజుల్లో తండ్రి కస్టడీలో ఉండేలా మే 22న కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే, కుమారుడిని తల్లి తన కస్టడీకి అప్పగించలేదని, వారిద్దరి జాడ తెలియడం లేదని తండ్రి కోర్టును ఆశ్రయించగా వెంటనే వారి ఆచూకీ కనుగొనాలని కోర్టు జూలై 17వ తేదీన ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. అయితే, ఆమె దేశం విడిచి వెళ్లినట్లు జూలై 21వ తేదీన సమాచారమివ్వగా, ఇది తీవ్రమైన ధిక్కరణ అంటూ పోలీసుల తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టడం తెల్సిందే. -
దేశరాజధానిలో భారీ ఉగ్రకుట్ర భగ్నం!
సాక్షి, ఢిల్లీ: భారీ ఉగ్రకుట్రను దేశ రాజధాని పోలీసులు భగ్నం చేశారు. ఇద్దరు ఐసిస్(ISIS) ఉగ్రవాదులను శుక్రవారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లో ఒకరు, సౌత్ ఢిల్లీలో మరొకరికి అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారణ జరుపుతున్నారు. ఈ ఇద్దరూ దేశ రాజధానిలో ఆత్మాహుతి దాడులకు కుట్రలు పన్నారని వెల్లడించారు. ఢిల్లీ-భోపాల్ పోలీసులు సంయుక్తంగా ఈ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో బోఫాల్‌కు చెందిన అద్నాన్‌తో పాటు దక్షిణ ఢిల్లీకి చెందిన మరొక వ్యక్తిని ఐఈడీ బాంబులను తయారు చేస్తుండగా పట్టుకున్నారు. వీళ్లిద్దరి నుంచి పేలుడు పదార్థాలకు చెందిన పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఢిల్లీలో జనసంచారం అత్యధికంగా ఉన్న ప్రాంతంలోనే వీళ్లు పేలుడుకు ప్రణాళిక రచించినట్లు తెలిందన్నారు. -
50 రోజులు.. 15 హోటళ్లు.. ఢిల్లీ బాబా కేసులో షాకింగ్ విషయాలు
ఢిల్లీ: బాబా చైతన్యానంద సరస్వతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన 17 మంది విద్యార్థినులను వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబా చైతన్యానంద.. పోలీసులను తప్పించుకునేందుకు 50 రోజులు పరారీలో ఉండగా.. ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆగ్రాలోని ఓ హోటల్లో బస చేసిన అతడిని ఆదివారం(సెప్టెంబర్ 28) తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. 50 రోజుల పాటు సీసీటీవీలకు చిక్కకుండా పరారీలో ఉన్న ఢిల్లీ బాబా గురించి షాకింగ్ విషయాలు పోలీసులు వెల్లడించారు.పోలీసుల కళ్లలో పడకుండా ట్యాక్సీల్లో ప్రయాణిస్తూ, చౌక హోటళ్లలో బస చేస్తూ బృందావన్, ఆగ్రా, మధుర తదితర ప్రాంతాల్లో తిరిగారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆయన 50 రోజుల్లో 15 హోటళ్లను మార్చాడు. సీసీటీవీ కెమెరాలు లేని చౌక హోటళ్లలోనే అతను బస చేసేవాడని పోలీసులు తెలిపారు. బాబాకు సహకరించిన ఆయన సహాయకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.కాగా, బాబా చైతన్యానంద సరస్వతి నుంచి పోలీసులు ఒక ఐపాడ్, మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక ఫోన్లో ఢిల్లీలోని విద్యాసంస్థ క్యాంపస్, హాస్టల్లోని సీసీటీవీ ఫుటేజీని యాక్సెస్ చేసే సౌకర్యం ఉండటం పోలీసులు గుర్తించారు. ఈ ఫోన్ ద్వారానే విద్యార్థినుల కదలికలను చైతన్యానంద గమనించేవాడని తెలిపారు.చైతన్యానంద వద్ద ఐక్యరాజ్యసమితి రాయబారిని, బ్రిక్స్ కమిషన్ సభ్యుడని చెప్పుకుంటూ ముద్రించిన రకరకాల నకిలీ విజిటింగ్ కార్డులు ఇతడి వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఆగ్రా హోటల్లో ఈ నెల 27వ తేదీన సాయంత్రం 4 గంటలకు పార్థసారథి అనే పేరుతో చైతన్యానంద గది తీసుకున్నాడన్నారు. వేర్వేరు పేర్లతో ఇతడు తీసుకున్న రూ.8 కోట్ల బ్యాంకు అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లను పోలీసులు స్తంభింపజేశారు.ఢిల్లీలోని మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్కు గతంలో చైర్మన్‌గా ఉన్న చైతన్యానంద మహిళా విద్యార్థినులను రాత్రి వేళ గత క్వార్టర్‌కు పిలిపించుకునే వాడు. రాత్రిళ్లు వారికి అసభ్యకర సందేశాలను పంపించేవాడు. తన ఫోన్లో వారి కదలికలను గమనించేవాడు. కేసు నమోదైనట్లు తెలిసిన తర్వాత బ్యాంకు నుంచి రూ.50 లక్షలను విత్‌డ్రా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.సుమారు 16 మంది పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇతడి బారిన 16 నుంచి 20 మంది విద్యార్థినులు పడ్డారన్నారు. వీరందరి స్టేట్మెంట్లు పోలీసులు రికార్డు చేశారని తెలిపారు. పోలీసుల విచారణకు సహకరించడం లేదని, ఐపాడ్, ఐక్లౌడ్ పాస్‌వర్డులను వెల్లడించడం లేదని ఆరోపించారు. అయితే, పోలీసులు తనను వేధించేందుకే కస్టడీ కోరుతున్నారని, నిజంగా తనతో ప్రమాదముంటే జ్యుడీషియల్ కస్టడీకి పంపించాలని చైతన్యానంద తరపు లాయర్ వాదించారు. వాదనలు విన్న డ్యూటీ మేజిస్ట్రేట్ రవి ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
ఎర్రకోటలో నిఘా వైఫల్యం.. బంగ్లాదేశీయులు అరెస్ట్.. అధికారులు సస్పెండ్
ఢిల్లీ: భారత స్వాతంత్ర్య వేడుకలకు ఎర్రకోట సిద్ధమవుతున్న వేళ సంచలన ఘటన చోటుచేసుకుంది. ఎర్రకోటలో తీవ్ర భద్రతా వైఫల్యం బయటపడింది. డమ్మ బాంబును భద్రతా అధికారులు గుర్తించకపోవడం ఒక కారణం అయితే.. ఎర్రకోటలోకి ఐదుగురు బంగ్లా దేశీయులు అక్రమంగా చొరబడే ప్రయత్నం చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని అధికారులు తెలిపారు.వివరాల ప్రకారం.. స్వాతంత్ర్య దినోత్సవ కార్యaక్రమం నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు.. ఎర్రకోటలో స్పెషల్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు భద్రతాధికారులు సాధారణ వ్యక్తుల్లా డమ్మీ బాంబుతో ఎర్రకోటలోకి ప్రవేశించారు. అయితే, అక్కడ విధుల్లో ఉన్న అధికారులు ఆ డమ్మీ బాంబును గుర్తించడంలో విఫలమయ్యారు. దీంతో వారిని సస్పెండ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపారు. మొత్తం ఏడుగురు సస్పెండ్ కాగా.. వారిలో హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ ఉన్నారు. 7 police personnel, including constables and head constables, deployed for the security of the Red Fort, have been suspended due to negligence in security. The Delhi Police conducts daily drills as part of preparations for the program scheduled for 15th August. A team of the…— ANI (@ANI) August 4, 2025ఇదిలా ఉండగా.. తాజాగా బంగ్లాదేశ్‌కు చెందిన ఐదుగురు యువకులు.. ఎర్రకోటలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దీంతో, వారిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్ట తెలిపారు. 20-25 ఏళ్ల వయసున్న వీరంతా అక్రమ వలసదారులుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు వారిని విచారిస్తున్నామని వెల్లడించారు. వరుస ఘటనల నేపథ్యంలో ఎర్రకోట వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్టు అధికారులు చెప్పుకొచ్చారు. Delhi Police arrested 5 Bangladeshi nationals who tried to forcibly enter the Red Fort premises. All of them are illegal immigrants. @Sreya_Chattrjee with more details.#news #ITVideo @anchorAnjaliP #RedFort #Delhi pic.twitter.com/JD56T6Mc5W— IndiaToday (@IndiaToday) August 5, 2025 -
చిన్నారితోపాటు దేశం విడిచి వెళ్లిన రష్యా మహిళ..
న్యూఢిల్లీ: భర్త నుంచి విడిపోయిన రష్యా మహిళ, చిన్నారితోపాటు దేశం విడిచి వెళ్లిపోవడంపై సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులకు తలంటింది. పోలీసులు తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరించి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని మండిపడింది. మైనర్‌ను రష్యా నుంచి తిరిగి తీసుకువచ్చేందుకు అక్కడి భారత ఎంబసీతో సంప్రదింపులు జరపాలని ఆదేశించింది. చిన్నారి కస్టడీ విషయంలో రష్యా మహిళ కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగి్చల ధర్మాసనం మే 22వ తేదీన ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. అయినప్పటికీ, ఆమె దేశం విడిచి నేపాల్ మీదుగా రష్యా వెళ్లిపోయినట్లుగా తెలవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ పోలీసుల పూర్తి నిర్లక్ష్యం, వైఫల్యమని పేర్కొంది. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులతోపాటు విదేశాంగ శాఖ కూడా దీన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారని వ్యాఖ్యానించింది. కానీ, చిన్న వివాదం ఏమాత్రం కాదని పేర్కొంది. ‘ఆ బిడ్డను ఈ కోర్టు కస్టడీ నుంచి తల్లి తీసుకుంది. ఇది పిల్లలు తల్లిదండ్రుల మధ్య కస్టోడియల్ వివాదం కేసు కాదు. ఆ బాలుడి సంరక్షణ బాధ్యతను తండ్రికి, తల్లికీ కూడా అప్పగించలేదు. దేశం తరఫున అతడి సంరక్షకుడిగా ఉంటూ సమస్యను పరిష్కరించేందుకు ప్రయతి్నస్తున్నాం. ఆ పిల్లవాడు ప్రస్తుతం కోర్టు కస్టడీలో ఉన్నాడు’అని ధర్మాసనం వెల్లడించింది. ఈ పరిణామానికి కారణమైన స్థానిక స్టేషన్ హౌస్ అధికారి(ఎస్‌హెచ్‌వో), డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ)లనే కాదు, అవసరమైతే పోలీస్ కమిషనర్‌కు సైతం సమన్లు జారీ చేస్తామని తీవ్ర స్వరంతో హెచ్చరించింది. ‘తల్లి కదలికలపై కన్నేసి ఉంచేందుకు మహిళా పోలీసు అధికారులను నియమించాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే, స్థానికుల సాయంతో, పారదర్శకతతో వ్యవహరిస్తూ ఆ మహిళ ఇంట్లోకి ప్రవేశించడానికి సైతం అనుమతిచ్చాం. అయినప్పటికీ ఆమె బిడ్డతోపాటు ఇంటిని ఎలా వదిలి వెళ్లగలిగింది?’అని ఢిల్లీ పోలీసుల తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిని ధర్మాసనం ప్రశ్నించింది. నేపాల్, యూఏఈ, రష్యా వైమానిక సంస్థలను సంప్రదించగా వారు వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశమంటూ ఎలాంటి సమాచారమూ తమకు ఇవ్వలేదని ఐశ్వర్య భాటి తెలిపారు. ‘నేర పూరిత చర్యలకు వ్యక్తిగత గోప్యతనేది వర్తించదు. ఢిల్లీ నుంచి బిహార్ ద్వారా అతి కష్టమైన రోడ్డు మార్గం ద్వారా నేపాల్‌కు చేరుకుంది. అక్కడ నాలుగు రోజు లు మకాం వేసింది. అయినా ఢిల్లీ పోలీసులు పట్టించుకోలేదు. కోర్టు వద్ద అసలైన పత్రాలుండటంతో ఆమె ఫోర్జరీ పత్రాలతో నేపాల్ వెళ్లినా ఢిల్లీ పోలీసులు అడ్డుకోలేదు’అంటూ ధర్మాసనం మండిపడింది. ఈ విషయంలో ఇంటర్‌పోల్ సాయం తీసుకోవాలని, అవస రమైన ఆదేశాలను తాము జారీ చేస్తామని ఐశ్వర్య భాటికి తెలిపింది. చిన్నారిని వెనక్కి తీసుకువచ్చే విషయంలో తీసుకున్న చర్యల పురోగతిపై పది రోజుల్లో నివేదికను అందించాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. రష్యా మహిళ చిన్నారి సహా దేశం విడిచి నేపాల్, షార్జాల మీదుగా వెళ్లిపోయి ఉంటుందని జూ లై 21న జరిగిన విచారణ సందర్భంగా కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. నేపథ్యమిదీ..భారత్‌కు చెందిన వ్యక్తి రష్యా మహిళను పెళ్లి చేసుకున్నారు. ఆమె 2019 నుంచి ఎక్స్–1 వీసాపై ఢిల్లీలోనే ఉంటోంది. కుమారుడు పుట్టాక వారి మధ్య విభేదాలొచ్చాయి. కోర్టు సూచన మేరకు బాలుడి సంరక్షణ బాధ్యతను వారంలో చెరి సగం పంచుకున్నారు. కొన్నాళ్లు సరిగానే ఈ వ్యవహారం నడిచినా అకస్మాత్తు గా ఆ మహిళ, చిన్నారి సహా కనిపించకుండా పోవడంతో ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. -
ఢిల్లీ ఉల్లంఘనల రాజధాని కూడానా?!
దేశమంతా ఎలా ఉన్నా, కనీసం రాజధాని ఆదర్శప్రాయంగా, ఉదాహరణప్రాయంగా ఉండాలంటారు. రాజధానిలోనే సుప్రీంకోర్టు, పార్లమెంటు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కీలకమైన అధికార యంత్రాంగం వంటి అత్యున్నత అధికార పీఠాలు, విదేశీ రాయబార కార్యాలయాలు, విదేశీ ప్రచార సాధనాల ప్రతినిధులు ఉంటారు. దేశమంతటికీ అది కూడలి. అందరి దృష్టీ రాజధాని మీదనే ఉంటుంది. (కొన్నేళ్ల కిందనైతే జంతర్ మంతర్ (Jantar Mantar) రోడ్డు మీద అరగంట తిరిగితే దేశపు సమస్యలన్నీ తెలిసేవి. ఇప్పుడది మారిందనుకోండి. సమస్యలు పోయాయని కాదు, జంతర్ మంతర్‌ను మార్చేశారు!) మొత్తం మీద రాజధానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందువల్ల ఢిల్లీని పూర్తి స్థాయి రాష్ట్రంగా మార్చకుండా, కేంద్ర పాలిత ప్రాంతంగానే ఉంచి, పోలీసు యంత్రాంగాన్ని స్థానికంగా ఎన్నికైన ప్రభుత్వం చేతిలో కాక, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంచారు. ఢిల్లీ ప్రభుత్వం ఏ పార్టీదైనప్పటికీ, పోలీసు యంత్రాంగం నేరుగా కేంద్ర ప్రభుత్వ హోం శాఖ నిర్వహణలో ఉంటుంది.అటువంటి మహా ఘనత వహించిన ఢిల్లీ పోలీసుల ఇటీవలి పనులు వారు స్థానిక ప్రభుత్వం కన్న పై స్థాయిలో మాత్రమే కాదు, భారత రాజ్యాంగం కన్న, భారత ప్రజాస్వామిక ఉద్యమాలలో వెల్లువెత్తి, చట్టాలుగా మారిన విలువల కన్న, అసలు మానవత కన్న, నాగరికత కన్న పైన ఎక్కడో అతీతంగా, వాటన్నిటినీ లెక్క చేయనక్కర లేని స్థితిలో ఉన్నారని చూపుతున్నాయి. దేశంలో పాలనా విధానాల పట్ల, తమ జీవితాలను అతలాకుతలం చేస్తున్న ఆర్థిక, రాజకీయ పరిణామాల పట్ల విద్యార్థి లోకంలో అసంతృప్తి నానాటికీ పెరుగుతున్నది. ఉద్వేగభరితమైన వయసు వల్ల ఆ అసంతృప్తి వ్యక్తీకరణలు తీవ్రంగా ఉండటం కూడా సహజమే. ఢిల్లీలో జేఎన్‌యూ, జామియా మిలియా, అంబేడ్కర్ విశ్వవిద్యాలయాలు అటువంటి అసంతృప్తికి, ఆందోళనలకు కేంద్రాలుగా మారుతున్నాయి. అక్కడి విద్యార్థి లోకాన్ని బెదిరించి, ప్రశ్నను, ఆలోచనను చిదిమేయాలని ఢిల్లీ పోలీసులు (Delhi Police) ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేకంగా అక్కడ విద్యార్థులలో పని చేస్తున్న భగత్ సింగ్ ఛాత్ర ఏకతా మంచ్, దిశ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నజరియా పత్రిక, ఫోరం అగెనెస్ట్ కార్పొరేటైజేషన్ అండ్ మిలిటరైజేషన్ (ఫాకమ్) వంటి సంస్థల సభ్యులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు.భగత్ సింగ్ ఛాత్ర ఏకతా మంచ్‌కు చెందిన గురుకీరత్ అనే విద్యార్థిని, గౌరవ్, గౌరంగ్ అనే విద్యార్థులు జూలై 9న కనబడకుండా పోయారు. జూలై 11న ఫాకమ్కు చెందిన పరిశోధక విద్యార్థి ఎహెతమామ్ ఉల్ హక్, విద్యార్థిని బాదల్‌లను వారి ఇంటి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు తీసుకుపోయారు. జూలై 12న పొరుగున హరియాణా యమునా నగర్లో సామాజిక కార్యకర్త, మనస్తత్వ శాస్త్రవేత్త సామ్రాట్ సింగ్‌ను ఢిల్లీ పోలీసులు స్థానిక హరియాణా (Haryana) పోలీసులకు సమాచారం కూడా ఇవ్వకుండా పట్టుకుపోయారు. జూలై 19న విద్యార్థి రుద్రను న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి పట్టుకుపోయారు. ఇలా నాలుగు దఫాలుగా జరిగిన ఏడుగురు విద్యార్థి, యువజనుల అపహరణలను చట్టబద్ధమైన అరెస్టు అనడానికి వీలులేదు. వారిని పట్టుకుంటున్నప్పుడు పోలీసులు ఎటువంటి వారంట్, నోటీసు చూపలేదు. రాజ్యాంగ అధికరణం 22, చట్టాలు, అనేక కోర్టుల ఆదేశాలు చెపుతున్నట్టుగా ఇరవై నాలుగు గంటల లోపు ఏదైనా కేసు పెట్టి న్యాయస్థానం ముందు హాజరు పరచలేదు. చట్టం నిర్దేశిస్తున్నట్టుగా వారి కుటుంబ సభ్యులకు తెలపలేదు, వారు కోరుకున్న న్యాయవాదిని పిలిపించి వారి ముందే నిర్బంధితులను ప్రశ్నించలేదు. వారందరినీ రోజుల తరబడి ఢిల్లీలో న్యూ ఫ్రెండ్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో భయంకరమైన చిత్రహింసలకు గురిచేశారు. ఏడు రోజుల అక్రమ నిర్బంధం తర్వాత జూలై 16న గురుకీరత్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి పోలీసు స్టేషన్‌కు వచ్చి కూతురిని తీసుకుపోవాలని ఆదేశించారు. తల్లిదండ్రులు చూసేటప్పటికి ఆమె శారీరకంగా, మానసికంగా శిథిలమైన స్థితిలో ఉంది. అదే స్థితిలో జూలై 17న బాదల్, గౌరవ్, గౌరాంగ్‌లను, జూలై 18న ఎహెతమామ్, సామ్రాట్‌లను, జూలై 21న రుద్రను వదిలిపెట్టారు.ఈ దౌర్జన్యం, అక్రమ నిర్బంధం, చిత్రహింసలు ఇరవైలలో ఉన్న నవయువత మీద కాగా, ఏడు పదులు నిండిన హర్ష్ మందర్, అరవై ఆరేళ్ల జీన్ డ్రీజ్, నందితా నారాయణ్ వంటి సుప్రసిద్ధుల విషయంలో కూడా రాజ్యాంగ అధికరణం 19ని, భావప్రకటనా స్వేచ్ఛను గౌరవించబోమని పోలీసులు చూపారు. వారితోపాటు వంద మంది జూలై 19న నగరం నడిబొడ్డున నెహ్రూ ప్లేస్‌లో జరుపుతున్న శాంతియుత ప్రదర్శన మీద మూకదాడి జరుగుతుంటే దౌర్జన్యకారులను అడ్డుకోవలసిన పోలీసులు చోద్యం చూస్తూ నిలబడ్డారు. హర్ష్ మందర్ ఐఏఎస్ వదులుకుని ప్రజా ఉద్యమాలతో పని చేస్తున్నారు. జీన్ డ్రీజ్ ప్రపంచ ప్రసిద్ధ సామాజిక శాస్త్రవేత్త. చదవండి: విచారణా లేదు.. విడుదలా లేదు!నందితా నారాయణ్ ఢిల్లీ విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రొఫెసర్. వారితోపాటు పౌర సమాజ ప్రముఖులు, విద్యార్థి యువజనులు గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న మారణహోమానికి నిరసనగా జరుపుతున్న ప్రదర్శన అది. వారి ప్రదర్శన మొదలయిందో లేదో, ఒక పెద్ద మూక చుట్టూ ఉన్న భవనాల మొదటి అంతస్తుల నుంచి ప్రదర్శనకారుల మీద కోడిగుడ్లు, టమాటాలు, పేడ, రాళ్లు విసిరింది. పోలీసులు ఘర్షణను నివారించడానికి ప్రయత్నించలేదు. రాజ్యాంగ హక్కులను, ప్రజాస్వామిక సంప్రదాయాలను, నాగరిక విలువలను, మానవత్వాన్ని తుంగలో తొక్కడంలో కూడా తమది రాజధాని అని ఢిల్లీ పోలీసులు చూపదలిచారా?- ఎన్ వేణుగోపాల్ ‘వీక్షణం’ సంపాదకుడు -
ఢిల్లీ సీఎం రేఖా గుప్తాను చంపేస్తానంటూ బెదిరింపులు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను హత్య చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన శ్లోక్ త్రిపాఠి అలియాస్ శ్లోక్ తివారీ(30) అనే వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతడు మద్యం మత్తులో బెదిరింపులకు దిగినట్లు గుర్తించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టి, ఘజియాబాద్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శ్లోక్ త్రిపాఠి ఎల్ఎల్బీ చదివాడు. యూపీలోని ఘజియాబాద్ కోర్టులో డాక్యుమెంట్ రైటర్‌గా పని చేస్తున్నాడు. 2020లో పెళ్లి చేసుకున్నాడు. గత ఏడాది భార్య అతడిని వదిలేసి, ఢిల్లీకి వెళ్లిపోయింది. భర్త తాగుడు వ్యసనం భరించలేక దూరంగా ఉంటోంది. మళ్లీ ఎలాగైనా భార్యతో కలిసి జీవించాలని శ్లోక్ త్రిపాఠి నిర్ణయించుకున్నాడు. ఆమె వినకపోవడంతో పోలీసుల సాయం తీసుకోవాలని భావించాడు. గురువారం, శుక్రవారం రాత్రిపూట చిత్తుగా మద్యం సేవించి, 112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నెంబర్‌కు పదేపదే ఫోన్ చేశాడు. తన భార్యను తనతో కలపాలని పోలీసులను కోరాడు. వారు పట్టించుకోకపోవడంతో ఢిల్లీ ముఖ్యమంత్రిని రేఖా గుప్తాను చంపేస్తానంటూ హెచ్చరించాడు. దాంతో ఘజియాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ పోలీసులకు సమాచారం చేరవేశారు. ఇరు రాష్ట్రాల పోలీసులు అతడి కోసం ఉమ్మడిగా గాలింపు చర్యలు ప్రారంభించారు. ఘజియాబాద్‌లో అరెస్టు చేశారు. మరోవైపు సీఎం రేఖా గుప్తా భద్రతను మరింత పెంచారు. -
కోహ్లి ఆర్సీబీ గెలుపుతో ఢిల్లీ పోలీసులు యువతకు సందేశం..!
ఏ విజయమైన స్ఫూర్తిని, చక్కటి సందేశాన్ని అందిస్తుంది. అంతేగాదు ఎందరో పరాజితుల్లో కొండంత ఆశలను నింపి..సాధనకు ఉపక్రమించేలా చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే..గెలుపును అందుకోవడంపై గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. ఇప్పుడిదంతా ఎందుకంటే..ఐపీఎల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులనే ఆశ్చర్యపరిచేలా ఆర్సీబీ ఘన విజయం అందుకుంది. ఎన్నాళ్లుగానో ఐపీఎల్లో విజయం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి అందని ద్రాక్షలా ఉండిపోయిందో తెలిసిందే. ఎట్టకేలకు 18వ సీజన్లో ఆ కలను సాకారం చేసుకుంది ఆర్సీబీ. ఇక్కడ ఆర్సీబీ విజయం ఓ చక్కటి సందేశం తోపాటు స్ఫూర్తిని కూడా నింపింది. రావడం లేదు, అందుకోలేకపోతున్నా అన్న నిరాశ నిస్ప్రుహలకు ఒక్క గెలుపుతో చెక్‌పెట్టొచ్చని ఆర్సీబీ విజయంతో తేటతెల్లమైంది. ఓపికతో నిరీక్షించేవాడు ఎన్నటికైన విజయం అందుకుంటాడు. విసుగే చెందాక ప్రయత్నిస్తేనే విజయమనే నిధిని అందుకోగలమనే సామెతకు నిర్వచనంగా మారింది ఆర్సీబీ. ఏకంగా 18 ఏళ్ల నిరీక్షణ తెరపడేలా ఘన విజయం అందుకుని అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. మనం కూడా ఓటములతో సతమతమవుతున్నప్పుడూ..చుట్టూ ఉన్నవాళ్లు అస్సలు గెలుస్తావా అన్నట్లు చూసే చూపులు తట్టుకోవడం అంత ఈజీ కాదు. వాటన్నింటిని ఓర్చుకుంటూ ఓపికతో లక్ష్యంపైనే ఫోకస్ పెట్టేవాడిని ఎన్నటికైనా విజయలక్ష్మీ వరిస్తుందనడానికి ఉదాహరణగా ఆర్సీబీ ఆటగాళ్లు నిలిచారు. ముఖ్యంగా విరాట్ కోహ్లి ఈ ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్సీబీకే ఆడుతున్నాడు. ఎట్టకేలకు 18వ సీజన్లో తన కలను సాకారం చేసుకున్నాడు. విచిత్రంగా విరాట్ జెర్సీ నంబర్ కూడా 18 కావడం మరింత విశేషం. చెప్పాలంటే విరాట్ కోహ్లి ఓపికకు దక్కే ఫలితం ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియజేశారు. ఇప్పుడు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఢిల్లీ పోలీసులు ఓ విన్నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చూడండి విరాట్ కోహ్లీగెలుపు కోసం 18 ఏళ్లు వేచి ఉన్నాడు. అలాగే డ్రైవింగ్ చేసేందుకు 18 ఏళ్లు నిండే వరకు ఓపిక పట్టండి. అలా కాకుండా టీనేజర్లుగా ఉన్నప్పుడే త్వరపడి కన్నవాళ్లకు శోకం మిగల్చడం లేదా అవతల ప్రయాణికుల ప్రాణాలను పొట్టబెట్టుకుని నేరస్థులుగా మిగిలిపోవడం జరుగుతుంది అని తమ అధికారిక ఇన్స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేశారు. అంతేగాదు అందులో టీనేజర్లు చట్టబద్ధంగా డ్రైవింగ్ వయస్సు వచ్చే వరకు వేచి ఉండండి లేదంటే అసహనం తెచ్చిపెట్టే అనర్థాలకు బలైపోతారని క్యాప్షెన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. నిజంగా ఒక గెలుపు ఎన్నో రకాలుగా స్ఫూర్తిని నింపుతుందంటే ఇదే కదూ..!. View this post on Instagram A post shared by DelhiPolice (@delhi.police_official) (చదవండి: ఆ విషయాలు గురించి అస్సలు మాట్లాడను! హాట్‌టాపిక్‌గా హర్ష్‌గోయెంకా ప్రసంగం) -
24 ఏళ్ల కిందటి కేసు.. మేధా పాట్కర్ అరెస్టు
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌ను శుక్రవారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా(VK Saxena) సుమారు 24 ఏళ్ల కిందట దాఖలు చేసిన కేసులో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. అంతకుముందు, ఈ కేసుకు సంబంధించిన ప్రొబేషన్ బాండ్ అమలు ప్రక్రియను రెండు వారాల పాటు నిలిపివేయాలన్న పాట్కర్ విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో క్రవారం నిజాముద్దీన్‌లోని ఆమె నివాసానికి చేరుకున్న పోలీసుల బృందం ఆమెను అదుపులోకి తీసుకుంది. మేధా పాట్కర్ అరెస్ట్‌ను సౌత్ఈస్ట్ డీసీపీ రవి కుమార్ సింగ్ ధృవీకరించారు. మధ్యాహ్నం ఆమెను సాకేత్ కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఈ కేసుకు సంబంధించి రెండు రోజుల కిందటే ఢిల్లీ సాకేత్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. ఈ కేసులో న్యాయ స్థానం నుంచి మేధా పాట్కర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని, కోర్టు ఆదేశాలను ఆమె ఉల్లంఘించారని, ప్రొబేషన్ బాండ్ సమర్పించలేదని, రూ. లక్ష జరిమానా చెల్లించలేదంటూ వారెంట్‌లో పేర్కొంది. నర్మదా బచావో ఆందోళన్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు ప్రచురించారనే ఆరోపణలపై వినయ్ కుమార్ సక్సేనా(VK Saxena)పై ఆమె అప్పట్లో కేసు వేశారు. అప్పుడు ఆయన అహ్మదాబాద్ కేంద్రంగా ఉన్న ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్’ అనే ఎన్జీవోకు చీఫ్‌గా ఉన్నారు. ఆ సమయంలో గుజరాత్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు సక్సేనా మద్దతు ఇచ్చారు. అయితే ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతోపాటు పరువునష్టం కలిగించేలా పత్రికా ప్రకటన జారీ చేశారని ఆరోపిస్తూ పాట్కర్‌పై వీకే సక్సేనా సైతం రెండు కేసులు దాఖలు చేశారు.సక్సేనా పిరికిపంద అని, హవాలా లావాదేవీల్లో ఆయన హస్తం ఉందని ఆరోపించారామె. నవంబర్ 5, 2000 సంవత్సరంలో మేధా పాట్కర్ వీకే సక్సేనాపై వ్యాఖ్యలు చేయగా.. పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో ఆమె వేసిన పిటిషన్‌ను కోర్టు తోచ్చింది. అంతేకాదు.. కిందటి ఏడాది జులై1వ తేదీన ఆమె ఐదు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు కూడా ఇచ్చింది. అయితే అదే నెల ఆఖరులో ఆ శిక్షను రద్దు చేస్తూ పలు షరతుల మీద న్యాయమూర్తి మేధా పాట్కర్‌కు బెయిల్ మంజూరు చేశారు. అయితే ఆ షరతులను ఉల్లంఘించడంతోనే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. -
పూజా ఖేద్కర్ కేసు జాప్యం దేనికి?
న్యూఢిల్లీ: మాజీ ఐఏఎస్ శిక్షణా అధికారిణి పూజా ఖేద్కర్‌కు సుప్రీం కోర్టు(Supreme Court)లో మరోసారి ఊరట లభించింది. ఆమెను అరెస్ట్ చేయొద్దంటూ గతంలో జారీ చేసిన ఆదేశాలను మంగళవారం మరోసారి కోర్టు పొడిగించింది. ఈ క్రమంలో.. దర్యాప్తు ఆలస్యంపైనా సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.తనంతట తానుగా విచారణకు సహకరిస్తానని ఆమె చెప్పారు. అయినా కూడా ఇంత ఆలస్యం దేనికి? అంటూ ఢిల్లీ పోలీసులపై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వెల్లగక్కింది. ఈ కేసులో త్వరగతిన దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.2022 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) పరీక్షలో ఫోర్జరీ డాక్యుమెంట్లను సమర్పించారని పూజా ఖేద్కర్‌పై అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ కేసుకు సంబంధించి.. విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని పేర్కొంటూ ముందస్తు బెయిల్ కోరుతూ ఆమె తొలుత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే కోర్టు దానిని తిరస్కరించడంతో.. ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయతే ముందస్తు బెయిల్‌పై విచారణ జరుగుతుండగానే.. ఈ ఏడాది జనవరిలో ఆమెను అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఆ ఆదేశాలను పొడిగించింది. పూజా ఖేద్కర్(Puja Khedkar) వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు ఢిల్లీ పోలీసుల తరఫు వాదనలు వినిపించిన అదనపు సాలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు. కానీ, పరీక్ష రాసే సమయం నాటికి ఆమెకు కంటి చూపు సరిగా లేదని, ఆమె ఫోర్జరీకి పాల్పడిందన్న అభియోగంలోనూ నిజం లేదని పూజా తరఫు న్యాయవాది వాదించారు. అయితే ఆ వాదనను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు ఆమె లాయర్‌కు తేల్చి చెప్పింది.ఈ పిటిషన్‌పై ఇప్పటివరకు ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. ఫోర్జరీ వ్యవహారంపై విచారణకు ఆమెను కస్టడీలోకి తీసుకునే విచారించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఈ క్రమంలో విచారణ త్వరగతిన పూర్తయ్యేలా చూడాలని ఢిల్లీ పోలీసులను ఆదేశిస్తూ పూజా పిటిషన్ విచారణను ఏప్రిల్ 15కి వాయిదా వేసింది. -
Bhagwant Mann: పంజాబ్ సీఎం ఇంట్లో పోలీసుల సోదాలు!
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి.. ఢిల్లీలోని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ సింగ్ (Bhagwant Mann Singh) నివాసం వద్ద పోలీసు బలగాలు మోహరించారని చెప్పారు. ఈ ఘటన ఒక్కసారిగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సీఎం అతిశి వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు.తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి ట్విట్టర్ వేదికగా.. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ సింగ్ నివాసం వద్ద పోలీసు బలగాలు మోహరించారు. ముఖ్యమంత్రి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించేందుకు వచ్చారు. కానీ, బీజేపీ చేసిన తప్పులను, కాషాయ పార్టీ నేతలను మాత్రం పోలీసులు పట్టించుకోవడం లేదు. బీజేపీ నేతలు పట్టపగలే డబ్బులు పంచినా ఎందుకు పట్టించుకోవడం లేదు. ఎన్నికల కోసం వస్తువులను ప్రజలకు పంచేందుకు వెళుతున్నారు అయినప్పుటికీ పోలీసుల నుంచి స్పందన కరువైంది. కానీ, ప్రజలు ఎన్నుకున్న నాయకుడి ఇంటి పైకి సోదాలు చేసేందుకు మాత్రం వచ్చారు’ అంటూ మండిపడ్డారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి.మరోవైపు.. సీఎం అతిశి ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. తాము సీఎం నివాసంలో ఎలాంటి సోదాలు చేపట్టలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్బంగా సీ-విజిల్ పోర్టల్‌లో వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు కోసం రిటర్నింగ్ ఆఫీసర్ నేతృత్వంలోని పోలీసు బృందం పంజాబ్ సీఎం నివాసానికి రావాల్సి వచ్చిందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. అయితే.. అక్కడున్న భద్రతా సిబ్బంది పోలీసుల బృందాన్ని దర్యాప్తు చేసేందుకు అనుమతించలేదని తెలిపారు.ఇదిలా ఉండగా.. అతిశి ఆరోపణలపై బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఆప్ నేతలు ఇలా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ నేతలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇక, ఢిల్లీ ఎన్నికల వేళ యమునా నది నీళ్ల విషయం కూడా సంచలన మారిన సంగతి తెలిసిందే. दिल्ली पुलिस @BhagwantMann जी के दिल्ली के घर पर रेड करने पहुँच गई है। भाजपा वाले दिन दहाड़े पैसे, जूते, चद्दर बांट रहे हैं- वो नहीं दिखता। बल्कि एक चुने हुए मुख्यमंत्री के निवास पर रेड करने पहुँच जाते हैं।वाह री भाजपा! दिल्ली वाले 5 तारीख़ को जवाब देंगे!— Atishi (@AtishiAAP) January 30, 2025 -
గ్యాంగ్స్టర్ల స్థావరాలపై ఢిల్లీ పోలీసుల దాడులు
న్యూఢిల్లీ: గ్యాంగ్స్టర్ల అరాచకాలను అరికట్టేందుకు ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, కౌశల్ చౌదరి గ్యాంగ్, హిమాన్షు భావు గ్యాంగ్, కాలా జాతేడి, హషీమ్ బాబా, చేను గ్యాంగ్, గోగి గ్యాంగ్, నీరజ్ బవానియా, టిల్లూ తాజ్‌పురియా గ్యాంగ్‌లతో సంబంధమున్న వాంటెడ్ నేరస్థుల రహస్య స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు.ఢిల్లీలోని ఔటర్ ఢిల్లీ, ద్వారకా ఏరియా, ఈశాన్య ఢిల్లీ, నరేలా, కంఝవాలా, సంగమ్ విహార్ తదితర ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసు బృందాలు దాడులు నిర్వహించాయి. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్ బృందం, ప్రత్యేక పోలీసు సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. గ్యాంగ్స్టర్లతో సంబంధం ఉన్న పలువురు షూటర్లు, హెంచ్మెన్లను అదుపులోకి తీసుకున్నారు.ఢిల్లీలోని గ్యాంగ్స్టర్లు ఇటీవలి కాలంలో తమ అనుచరుల ద్వారా కాల్పులు, హత్యా ఘటనలకు పాల్పడుతున్నారు. 2024 అక్టోబరులో ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన ఏడుగురు షూటర్లను అరెస్టు చేసింది. వీరిని పంజాబ్, ఆ చుట్టుపక్కల రాష్ట్రాలలో అరెస్టు చేశారు. వారి నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.బాబా సిద్ధిఖీ కేసులో అరెస్టయిన షూటర్లను స్పెషల్ సెల్ విచారిస్తోంది. జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ) రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది. 2022లో నమోదైన రెండు ఎన్ఐఏ కేసుల్లో అతనిపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఇది కూడా చదవండి: ‘నేటి పిల్లలే రేపటి సూపర్ మోడల్స్’.. 200 మంది పేరెంట్స్‌కు రూ. 5 కోట్ల టోకరా -
‘నేటి పిల్లలే రేపటి సూపర్ మోడల్స్’.. 200 మంది పేరెంట్స్‌కు రూ. 5 కోట్ల టోకరా
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ద్వారకకు చెందిన 34 ఏళ్ల మహిళ తన తీరిక సమయంలో ఫేస్‌బుక్‌ను స్క్రోలింగ్ చేసింది. ఒక ప్రకటన ఆమె దృష్టిని ఆకర్షించింది. ఆ యాడ్‌లో లాట్స్ స్టార్ కిడ్స్ సంస్థ పిల్లలకు మోడలింగ్ అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొంది.దీనితో పాటు మోడలింగ్‌లో శిక్షణ కూడా ఇస్తామని తెలిపింది. తన కుమార్తెకు ఇది మంచి అవకాశం అవుతుందని ఆమె భావించింది. వెంటనే సదరు మహిళ ఆ యాడ్‌పై క్లిక్ చేసింది. అది ఆమెను ‘టెలిగ్రామ్’కు తీసుకువెళ్లింది. ఈ సంస్థను ఇదేవిధంగా చాలా మంది తల్లిదండ్రులు సంప్రదించారు. తమపిల్లలను మోడల్స్‌గా మార్చాలనే తాపత్రయంలో ఆ సంస్థ అడిగినంత ఫీజు చెల్లించారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆ సంస్థ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన చిన్నారులకు మోడలింగ్ అసైన్మెంట్లు ఇవ్వనున్నట్లు హామీనిచ్చింది. ఎంతకాలం గడిచినా లాట్స్ స్టార్ కిడ్స్ సంస్థ చిన్నారులకు మోడలింగ్ అవకాశాలు కల్పించలేదు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్లు చేపట్టి ఈ సంస్థ గుట్టును రట్టు చేశారు. ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. ఈ సంస్థ ముఠా సభ్యులు 197 మంది తల్లిదండ్రుల నుంచి రూ.4.7 కోట్లకు పైగా మొత్తాన్ని వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. పిల్లలను మోడల్స్‌గా తీర్చిదిద్దాలనుకునే తల్లిదండ్రులను టార్గెట్‌గా చేసుకుని, వీరు భారీ ఎత్తున మోసానికి పాల్పడ్డారు.ఈ స్కామర్లు మోడలింగ్ చేస్తున్న పిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, ఇతర తల్లిదండ్రులను ఆకర్షిస్తారు. తరువాత వారిని టెలిగ్రామ్ గ్రూప్‌లో చేర్చి, పిల్లలకు మోడలింగ్‌లో అవకాశాలు ఇప్పిస్తామంటూ తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తారు. ఇందుకు ఆన్లైన్ వేదికను ఉపయోగించుకుంటారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. తల్లిదండ్రులు ఇలాంటి ఉచ్చులో చిక్కుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: రైలులో పాము కాటు.. ప్రయాణికుల తొక్కిసలాట -
Supreme Court: కాలుష్యాన్ని ఏ మతమూ ప్రోత్సహించదు
న్యూఢిల్లీ: కాలుష్యాన్ని సృష్టించే ఏ రకమైన కార్యకలాపాలనూ ఏ మతమూ ప్రోత్సహించబోదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఏడాదంతా బాణసంచాను ఢిల్లీ పరిధిలో నిషేధించాలా వద్దా అనే అంశంపై 15 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఢిల్లీలో బాణసంచా తయారీ, విక్రయాలపై నిషేధం అమల్లో ఉన్నాసరే దీపావళి వేళ ఢిల్లీ వ్యాప్తంగా విపరీతంగా బాణసంచా కాల్చడంతో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. సంబంధిత కేసును సోమవారం సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ల ధర్మాసనం విచారించింది. ‘‘కాలుష్యరహిత వాతావరణంలో జీవించడం అనేది ప్రతి ఒక్క పౌరుడి ప్రాథమిక హక్కు. దీనిని రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ రక్షణ కల్పిస్తోంది. కాలుష్యకారక ఏ పనినీ ఏ మతమూ ప్రోత్సహించదు. సరదాగా బాణసంచా కాల్చినాసరే తోటి పౌరుల ఆరోగ్యకర జీవన హక్కుకు భంగం వాటిల్లినట్లే’’ అని వ్యాఖ్యానించింది. సంవత్సరం పొడవునా ఢిల్లీలో బాణసంచాపై నిషేధం అంశంపై ప్రభుత్వానికి కోర్టు సూచన చేసింది. ‘‘ సంబంధిత అన్ని వర్గాలతో సంప్రతింపులు జరపండి. ఆ తర్వాత నవంబర్ 25వ తేదీలోపు మీ నిర్ణయాన్ని తెలియజేయండి’’ అని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మీ రాష్ట్రాల్లోనూ బాణసంచా తయారీ, నిల్వ, అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధించడంపై స్పందన తెలియజేయాలని ఢిల్లీ పొరుగు రాష్ట్రాలనూ కోర్టు కోరింది. ఢిల్లీ పోలీసులకు చీవాట్లునిషేధం ఉన్నాసరే ఊపిరాడనంతగా బాణసంచా కాల్చుతుంటే చూస్తూ ఊరుకున్నారని ఢిల్లీ పోలీసులపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘ నిషేధించాలంటూ గతంలో మేం ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ పోలీసులు బేఖాతరు చేశారని స్పష్టమైంది. గతంలో బాణసంచా తయారీ, నిల్వ, అమ్మకం అనుమతులు తీసుకున్న సంస్థలకు మా ఉత్తర్వుల కాపీలు అందినట్లు కనపించట్లేదు. మొదట ఢిల్లీ పోలీసులు చేయాల్సిన పని లైసెన్స్ దారులు టపాకాయలు విక్రయించకుండా అడ్డుకో వాలి. అమ్మకాలను ఆపేశారని, నిషేధం అమల్లోకి వచ్చిందని, ఆన్లైన్ వేదికలపై విక్రయాలు, డెలివరీ సౌకర్యాలను స్తంభింపజేసేలా సంబంధిత వర్గాల కు ఢిల్లీ పోలీసు కమిషనర్ తక్షణం సమా చారం ఇవ్వాలి. ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయండి. క్షేత్రస్థాయిలో నిషేధాన్ని అమలు చేయా ల్సిన బాధ్యత స్థానిక పోలీస్స్టేషన్లదే. అక్టోబర్ 14వ తేదీదాకా మా ఉత్తర్వులు ఎవరికీ అందకుండా ఢిల్లీ ప్రభుత్వం చేసిన ఆలస్యం చూస్తుంటే మాకే ఆశ్చర్యంవేస్తోంది’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.సాకులు చెప్పిన పోలీసులుదీనిపై ఢిల్లీ పోలీసులు తప్పును ఆప్ సర్కార్‌పై నెట్టే ప్రయత్నంచేశారు. ఢిల్లీపోలీసుల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీ వాదించారు. ‘‘ మాకు ఉత్తర్వులు రాలేదు. దసరా అయి పోయిన రెండ్రోజుల తర్వాత ఆప్ సర్కార్ ఆదేశా లు జారీచేసింది. ఆదేశాలు వచ్చాకే మేం నిషేధం అమలుకు ప్రయత్నించాం’’ అని భాటీ అన్నారు. దీపావళి, ఆ తర్వాతి రోజు ఢిల్లీలో వా యునాణ్యత దారుణంగా పడిపోవడంతో సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఆదేశాలు అమలుకా కపోవడంపై కోర్టు ధిక్కరణగా భావించింది. -
అదుపుతప్పి ఇద్దరిని ఢీకొన్న బస్సు.. కానిస్టేబుల్, మరో వ్యక్తి మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి రింగ్ రోడ్‌లోని మొనాస్టరీ మార్కెట్ సమీపంలో ఒక డీటీసీ బస్సు అదుపుతప్పింది. ఈ ఘటనలో సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌తో పాటు మరో వ్యక్తి మృతి చెందాడు. డీటీసీ బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బస్సు డ్రైవర్‌ను ఘాజీపూర్ నివాసి వినోద్ కుమార్ (57)గా గుర్తించారు. సదరు డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో రింగ్ రోడ్డులోని మఠం మీదుగా వేగంగా వచ్చిన ఈ డీటీసీ బస్సు ఒక ఇనుప స్తంభాన్ని ఢీకొని, అక్కడే ఉన్న ఒక వ్యక్తిని కూడా ఢీకొంది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. #WATCH दिल्ली: रिंग रोड पर मोनेस्ट्री मार्केट के पास एक अनियंत्रित डीटीसी बस ने एक व्यक्ति और पीएस सिविल लाइंस के एक पुलिस कांस्टेबल को टक्कर मार दी और डिवाइडर से टकरा गई। दुर्भाग्य से, दोनों की मृत्यु हो गई है। दोनों को मृत घोषित कर दिया गया। डीटीसी बस का ड्राइवर विनोद कुमार… pic.twitter.com/R6MdWM9Gny— ANI_HindiNews (@AHindinews) November 4, 2024ఈ ప్రమాదం తరువాత కూడా బస్సు డ్రైవర్ వినోద్ బస్సును 100 మీటర్లు ముందుకు పోనిచ్చి, బారికేడ్ వద్దనున్న కానిస్టేబుల్ విక్టర్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు విక్టర్(27) నాగాలాండ్ నివాసి. ప్రమాదం జరిగిన సమయంలో విక్టర్ నైట్ పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ విక్టర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. #WATCH दिल्ली: एफएसएल टीम मोनेस्ट्री मार्केट, रिंग रोड के बाहर मौजूद है, जहां एक अनियंत्रित डीटीसी बस की चपेट में आने से एक व्यक्ति और पीएस सिविल लाइंस के एक पुलिस कांस्टेबल की मौत हो गई।डीटीसी बस का ड्राइवर विनोद कुमार (57) निवासी गाजीपुर पुलिस हिरासत में है। बस खराब स्थिति… pic.twitter.com/tJNWZBuaMl— ANI_HindiNews (@AHindinews) November 4, 2024ఇది కూడా చదవండి: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో సూపర్ యాప్ -
‘నా ఫోన్ దొరికింది’.. భారత్‌లోని ఫ్రెంచ్ రాయబారి
ఢిల్లీ : భారత్‌లో ఫ్రెంచ్ రాయబారి థియరీ మాథౌ మొబైల్ ఫోన్ దొంగతనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. థియరీ మాథౌ ఫోన్ దొంగతనం చేసిన నలుగురు యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.దీపావళి పండుగ నేపథ్యంలో ఫ్రెంచ్ రాయబారి థియరీ మాథౌ అక్టోబర్ 20 తన కుటుంబ సభ్యులతో కలిసి ఓల్డ్ ఢిల్లీలోని చాందినీ చౌక్ లో షాపింగ్ చేశారు. ఆ సమయంలో 20 నుంచి 25ఏళ్ల మధ్యన ఉన్న దొంగలు తమ చేతి వాటం ప్రదర్శించారు.షాపింగ్ చేస్తున్న థియరీ మాథౌ జేబులో ఉన్న ఫోన్‌ను కాజేశారు. ఫోన్ మాయ మవ్వడంతో మాథౌ ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయబార కార్యాలయం అధికారులు సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాటి నుంచి కేసు దర్యాప్తు చేస్తున్నారు.దర్యాప్తులో భాగంగా మాథౌ షాపింగ్ చేస్తున్న ప్రదేశంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఫోన్ నెంబర్ ఆధారంగా మాథౌ ఫోన్ ట్రేస్ చేశారు. నిన్న, ఇవాళ రెండ్రోజుల వ్యవధిలో ఫోన్ దొంగతనం చేసిన యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం థియరీ మాథౌకు ఫోన్‌ను అందించారు. దీంతో మాథౌకు సంతోషం వ్యక్తం చేశారు. -
ఢిల్లీ బర్గర్ కింగ్ హత్య కేసు: ‘లేడీ డాన్’ అరెస్ట్
ఢిల్లీ: ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ ప్రాంతంలో ఉన్న బర్గర్ కింగ్ అవుట్‌లెట్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన ఈ ఏడాది జూన్‌లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు గ్యాంగ్‌స్టర్ హిమాన్షు భావు గర్ల్ ఫ్రెండ్ అన్ను ధంకర్(19)ను ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఆమెను అరెస్ట్ చేసే సమయంలో నేపాల్ పారిపోవడానికి ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హిమాన్షు భావు ఆదేశాల మేరకు ఆమె దుబాయ్ మీదుగా అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. హిమాన్షు భావు గ్యాంగ్‌లోని సభ్యులు అన్ను ధంకర్ ‘‘లేడీ డాన్’’గా పిలుస్తారని పేర్కొన్నారు.హిమాన్షు భావు ఆదేశాల మేరకు ఆమె అమెరికా పరారు కాలనఇక.. జూన్ 18న పశ్చిమ ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్‌లోని బర్గర్ కింగ్ అవుట్‌లెట్‌లో అమన్ జూన్ (26) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ హత్య తామే చేశామని గ్యాంగ్‌స్ట్‌ర్ హిమాన్షు భావు ప్రకటించించారు. శక్తి దాదా హత్యకు ప్రతీకారంగా అమన్ జాన్‌ను హత్య చేసినట్లు తెలిపాడు. అతని స్నేహితులు.. ఆశిష్, వికాస్, బిజేందర్ అనే ముగ్గురు వ్యక్తులు ఈ హత్యలో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. అందులో ఇద్దరు షూటర్లు ఉన్నట్లు గుర్తించారు. అమన్ హత్య అనంతరం కత్రా రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలో ధంకర్ చివరిసారిగా కనిపించినట్లు పోలీసులు తెలిపారు.నిందితురాలు అన్ను నకిలీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను ఉపయోగించి అమన్‌తో స్నేహం చేసింది. జూన్ 18న అతడిని బర్గర్ కింగ్ అవుట్లెట్కు పిలింపించింది. ఆమె కోసం అమన్ వేచిచూస్తుండగా.. ఆశిష్ , వికాస్ లోపలికి వెళ్లి అమన్‌పై 39 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. బిజేందర్ అనే మరో వ్యక్తి బైక్‌పై వచ్చి బయట వేచి ఉన్నాడు. కాల్పుల అనంతరం ముగ్గురు పరారయ్యారు. -
ఢిల్లీ పేలుడు: ఖలిస్తానీ హస్తంపై టెలిగ్రామ్‌కు లేఖ
ఢిల్లీ ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. అయితే.. ఈ ఘటనకు నాటు బాంబే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ), సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)ల బృందాలు విచారణ చేపట్టాయి.ఖలిస్థాన్ అనుకూల వేర్పాటువాదులను భారత ఏజెంట్లు లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపిస్తూ.. ప్రతీకారంగా ఈ పేలుడు జరిగిందని టెలిగ్రామ్‌లో ఓ పోస్ట్ వెలుగులోకి వచ్చింది. ‘జస్టిస్ లీగ్ ఇండియా’ పేరుతో ఓ టెలిగ్రామ్ ఛానెల్ ఈ పోస్ట్‌ను పెట్టినట్లు పోలీసులు గురించారు. దీంతో ఈ దాడికి ఖలిస్థాన్ వేర్పాటువాదులు పాల్పడి ఉంటారని దర్యాప్తు సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ ఘటనకు ఖలిస్తాన్ వేర్పాటవాదులకు ఉన్న లింక్‌ను పరిశీలిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. తాజాగా ‘జస్టిస్ లీగ్ ఇండియా’ పేరుతో ఉన్న టెలిగ్రామ్ ఛానెల్‌కు సంబంధించిన వివరాలను ఇవ్వాలని దర్యాప్తు బృందం లేఖలో కోరింది. అయితే.. టెలిగ్రామ్ నుంచి దర్యాప్తు సంస్థలకు ఇంకా ఎంటువంటి స్పందన రాలేదని అధికారులు తెలిపారు.ఇక.. ఈ పేలుడు తీవ్రతకు స్కూలు ప్రహరీ, ఆ సమీపంలోని దుకాణాల అద్దాలు, ఒక కారు దెబ్బతిన్నాయి. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. మరోవైపు.. పండగ సీజన్లో ఇప్పటికే రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్నాయి. ఘటన నేపథ్యంలో మరింత అప్రమత్తత ప్రకటించారు. -
డ్యాన్స్ చేస్తుండగా ఆగిన కానిస్టేబుల్ గుండె
గుండె ఆగిపోయి.. హఠాత్తుగా చనిపోతున్న ఘటనలు తరచూ చూస్తున్నదే. అయితే అలాంటి మరణాల వెనుక.. వైద్యపరంగా ఆరోగ్య సమస్యలూ ఉండొచ్చనే అభిప్రాయమూ నిపుణుల నుంచి వ్యక్తం అవుతోంది. తాజాగా ఢిల్లీలో ఓ యువ పోలీస్ కానిస్టేబుల్ డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. ఢిల్లీ రూప్‌నగర్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రవికుమార్.. స్టేషన్ హౌస్ అధికారి (ఎస్‌హెచ్‌వో) బదిలీ కావడంతో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా రవికుమార్ పలు పాటలకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు. ఈ క్రమంలో ఆయనకు ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. దీంతో.. అతడి సహచరులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. రవికుమార్ చనిపోయినట్లు ప్రకటించారు. దీంతో అప్పటివరకు తమతో సరదాగా ఉన్న కానిస్టేబుల్ మృతిచెందడంతో ఆయన మిత్రులు షాక్‌కు గురయ్యారు. హెడ్ కానిస్టేబుల్ డ్యాన్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌కు చెందిన రవికుమార్ 2010లో ఢిల్లీ పోలీస్ విభాగంలో చేరాడు. అతడి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. 45 రోజుల క్రితమే రవికుమార్ యాంజియోగ్రఫీ పరీక్ష చేయించుకున్నట్లు తెలుస్తోంది. Delhi Police Head Constable Dies of Heart Attack During Farewell PartyDelhi Police Head Constable Ravi Kumar, posted at Roop Nagar police station in North District, died of a heart attack on Wednesday evening. Kumar was attending a farewell party at the police station when he… pic.twitter.com/rfXSKGdcpa— Atulkrishan (@iAtulKrishan1) August 29, 2024 -
మహిళా రెజ్లర్లకు భద్రత కల్పించండి: కోర్టు
న్యూఢిల్లీ: ముప్పున్న మహిళా రెజ్లర్లకు భద్రతను ఉపసంహరించడం తగదని పేర్కొన్న కోర్టు తక్షణమే భద్రత కల్పించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ముగ్గురు రెజ్లర్లు గతంలో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఇదివరకే ఢిల్లీ పోలీసులు చార్జిషీట్ నమోదు చేశారు.కేసు విచారణలో ఉంది. కాగా... కేంద్రంలో అధికారపక్షం నేత అయిన బ్రిజ్‌భూషణ్ నుంచి హాని ఉంటుందని గతంలో ఆ ముగ్గురు రెజ్లర్లకు ఢిల్లీ పోలీసులు భద్రత కల్పించారు. కానీ ఇప్పుడు ఉన్నపళంగా పోలీసు భద్రతను ఉపసంహరించడం ఏంటని అడిషనల్ చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ప్రియాంక రాజ్‌పుత్ ఢిల్లీ పోలీసులను తలంటారు.వెంటనే భద్రతను పునరుద్ధరించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. రెజ్లర్ల భద్రతపై స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ‘ఎక్స్’ వేదికగా అభ్యంతరం వ్యక్తం చేసింది. బ్రిజ్‌భూషణ్‌పై పోరాడుతున్న రెజ్లర్లకు భద్రతను తొలగించారని వినేశ్ పోస్ట్ చేసింది. -
పాపులారిటీ కోసం పాకులాట.. ‘స్పైడర్ మ్యాన్’ అరెస్ట్
సోషల్ మీడియాలో తొందరగా పాపులరిటీ సంపాదించేందుకు కొందరు పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తుంటారు. చేయకూడని పనులు చేసి చిక్కుల్లో పడుతున్నారు. రకరకాల రీల్స్ చేస్తూజనాల చేత తిట్లు తింటున్నారు. ప్రమాదకర స్టంట్లతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే ఇలాంటివి మానుకోవాలని అధికారులు చెబుతున్నా, కఠిన చర్యలు తీసుకుంటున్నా కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు.తాజాగా ఓ వ్యక్తి తన ప్రమాదకర స్టంట్తో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి కటకటాల పాలయ్యాడు. పట్టుమని 20 ఏళ్లు కూడా నిండని ఆదిత్య అనే వ్యక్తి మరో యువకుడితో కలిసి ఢిల్లీ రోడ్డుపై డేంజరస్ స్టంట్లు చేశాడు. ద్వారక ప్రాంతంలో గౌరవ్ సింగ్ (19) డ్రైవింగ్ చేస్తుండగా.. స్పైడర్ మ్యాన్ వేషం ధరించిన ఆదిత్య కారు బానెట్‌పై నిలబడి ప్రమాదకర స్టంట్లు వేశాడు.దీనిని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో సోషల్ మీడియాలో అనేక మంది ఫిర్యాదు చేశారు. చివరికి సమాచారం అందుకున్న ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు.. యువకులపై చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఇద్దరినీ కస్టడీలోకి తీసుకున్నారు. Delhi | On receiving a complaint on social media about a car seen on Dwarka roads with a person dressed as Spiderman on its bonnet, the Delhi Traffic Police took action. The person in the Spiderman costume was identified as Aditya (20) residing in Najafgarh. The driver of the… pic.twitter.com/UtMqwYqcuK— ANI (@ANI) July 24, 2024ప్రమాదకర డ్రైవింగ్, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోవడం, సీటు బెల్టు ధరించకపోవడం వంటి చర్యలకు పాల్పడినందుకు జైలు శిక్షతో పాటు రూ. 26 వేల జరిమానా విధించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. అయితే ఆదిత్య గతంలోనూ స్పైడర్ మ్యాన్ దుస్తుల్లో ప్రమాదకర స్టంట్లకు పాల్పడి కటకటాల పాలైనట్లు తెలుస్తోంది. -
కెప్టెన్ అన్షుమన్ సతీమణిపై వివాదాస్పద పోస్టు.. నెటిజన్‌పై కేసు
న్యూఢిల్లీ: కీర్తి చక్ర అవార్డు గ్రహీత దివంగత కెప్టెన్ అన్షుమన్‌సింగ్ సతీమణి స్మృతిసింగ్‌పై వివాదాస్పద పోస్టు పెట్టినందుకుగాను ఢిల్లీ పోలీసులు ఓ నెటిజన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) ఫిర్యాదు మేరకు నిందితునిపై ఇటీవలే అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్ 2024)సెక్షన్ 79, ఐటీ చట్టం సెక్షన్ 67 కింద కేసులు పెట్టారు. స్మృతిసింగ్‌పై సోషల్‌మీడియాలో వివాదాస్పద పోస్టు పెట్టిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని ఎన్సీడబ్ల్యూ ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు ఒక లేఖ కూడా రాసింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.గతేడాది సైన్యంలో విధి నిర్వహణలో ఉండగా సియాచిన్‌లో జరిగిన ఒక అగ్నిప్రమాదంలో అన్షుమన్ ప్రాణాలు కోల్పోయారు. చనిపోయే ముందు తన సహచరులను కాపాడినందుకుగాను అన్షుమన్‌కు కేంద్ర ప్రభుత్వం కీర్తి చక్ర పతకం ప్రకటించింది. ఈ పతకాన్ని ఈ మధ్యే జులై 5న రాష్ట్రపతి చేతుల మీదుగా అన్షుమన్ సతీమణి, మాతృమూర్తులు అందుకున్నారు. కాగా అన్షుమన్‌కు వివాహం జరిగిన తర్వాత కేవలం 5 నెలలకే ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది. -
అమరవీరుల జవాన్ల కుటుంబాలనూ వదలని సోషల్ మీడియా భూతం
సోషల్ మీడియా భూతం అమరవీరుల జవాన్ల కుటుంబాలనూ వదలడం లేదు. దేశం కోసం ప్రాణాల్పించిన జవాన్లు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా పోస్ట్‌లు పెడుతున్నారు.ఇటీవల అమరుడైన కెప్టెన్ అన్షుమాన్ సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం కీర్తచక్ర అవార్డ్‌ను ప్రకటించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్షుమాన్ సింగ్ సతీమణి స్మృతికి అవార్డ్‌ను అందించారు. ఆ వీడియోపై కొందరు దుర్మార్గులు ట్రోలింగ్‌కు దిగారు. ఆమె చాలా అందంగా ఉందంటూ అసభ్యకరంగా ఉందంటూ కామెంట్లు పెట్టారు.ఈ అంశంపై నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఎన్సీడబ్ల్యూ) స్పందించింది. సోషల్ మీడియాలో అనుచిత కామెంట్లు చేస్తున్న వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. -
భారత్ విక్టరీ.. వాహనదారుల కోసం పోలీసుల సరికొత్త ఐడియా..
ఢిల్లీ: టీ20 వరల్డ్‌కప్‌లో విజేత నిలిచిన భారత జట్టును ప్రతీ ఒక్కరూ అభినందిస్తున్నారు. టీమిండియా విజయం పట్ల అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే భారత జట్టుకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇదే సమయంలో టీమిండియా విజయంపై ఢిల్లీ పోలీసులు సరికొత్తగా ట్వీట్ చేశారు. టీమ్ విజయానికి ట్రాఫిక్ సిగ్నల్స్‌కు లింక్ పెడుతూ ప్రతీ ఒక్కరిని ఆలోచించే విధంగా పోస్ట్‌ను ట్విట్టర్లో పోస్టు చేశారు. We all waited 16 years 9 months 5 days (52,70,40,000 seconds) for India to win another #T20WorldCupLet's be a little patient at traffic signals too. Good moments are worth the wait. What say? Hearty congratulations, #TeamIndia💙 #INDvsSA#INDvSA— Delhi Police (@DelhiPolice) June 29, 2024కాగా, ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ వేదికగా.. ‘మనమంతా భారత జట్టు మరో టీ20 వరల్డ్ కప్ గెలుపు కోసం 16 ఏండ్ల 9 నెలల 5 రోజులు (52 కోట్ల 70 లక్షల 40 వేల సెకన్లు) వేచిచూశాం. అదేవిధంగా ట్రాఫిక్ సిగల్స్ వద్ద కూడా ఓపికతో ఉందాం. మంచి క్షణాలు వేచి ఉండాల్సినవి. మరి మీరేమంటారు? టీమ్ఇండియాకు హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The Dream Come True Number Plate!#UnStoppables#IndVsSA#WorldChampions pic.twitter.com/xMHfQjsnCc— Mumbai Traffic Police (@MTPHereToHelp) June 29, 2024 -
స్వాతి మలివాల్ కేసు: బిభవ్‌పై 201 సెక్షన్ నమోదు
ఢిలీ: తనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌కుమార్ దాడి చేశారని గత నెలలో ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. ఈ కేసులో బిభవ్ కుమార్‌పై కేసు నమోదు కాగా.. పోలీసులు మే 18 అరెస్ట్ చేశారు. అయితే తాజాగా బిభవ్‌కుమార్ నమోదైన కేసులో 201 సెక్షన్‌ను చేర్చారు. 201 సెక్షన్ అంటే.. ఆధారాలు మాయం చేసి.. తప్పుడు సమాచారం ఇవ్వటం. బిభవ్ కుమార్ ఈ కేసుకు సంబంధించి ఆధారాలు మాయం చేసి.. తప్పుడు సమాచారం అందించిస్తున్నట్లు మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.బిభవ్ కుమార్‌ను దర్యాప్తు చేసిన పోలీసులు.. ఆయన తన ఫోన్‌ను ఫార్మాట్ చేసినట్లు గుర్తించారు. ఆయన ముంబైలో ఫోన్ ఫార్మాట్ చేసినట్లు అనుమానం రావటంతో ఇప్పటికే పోలీసులు రెండుసార్లు ముంబైకి తీసుకువెళ్లి దర్యాప్తు చేశారు. ముంబైలో ఏ ప్రాంతంలో ఫార్మాట్ చేశారు?. ఫోన్లోని డేటాను ఎవరికి షేర్ చేశారు? అన్న విషయాలు మాత్రం బిభవ్ వెల్లడించలేదని పోలీసులు తెలిపారు. ఇక.. కస్టడీలో ఉన్న ఆయన దర్యాప్తు సమయంలో అస్సలు సహకరించలేదని ఓ పోలీసు అధికారి తెలిపారు.సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి నుంచి మూడు సీసీటీవీ కెమెరాల డీవీఆర్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. బిభవ్ సీసీటీవీ కెమెరాలను ట్యాంపర్ చేశారని పోలీసుల అనుమానం వ్యకం చేశారు. దీంతో డీవీఆర్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. వీటికి సంబంధించిన రిపోర్టులు ఇంకా వెల్లడికాలేదని తెలిపారు. మే 18 అరెస్ట్ అయిన బిభవ్ కుమార్ ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు.మే 13న ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లితే.. అక్కడ కేజ్రీవాల్ సహాయకుడు తనపై దారుణంగా దాడి చేశారని బయటపెట్టారు. అయితే వాటిని ఆప్.. బీజేపీ కుట్రలో భాగంగానే స్వాతి మలివాల్ బిభవ్‌పై దాడి ఆరోపణలను చేస్తోందని విమర్శలు చేసింది. -
‘దాడి సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు’
ఢిల్లీ: తనపై దాడి జరిగిన సమయంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ అన్నారు. ఆమె జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. దాడికి సంబంధిచి పలు విషయాలు పంచుకున్నారు.‘‘ మే 13న సీఎం ఆరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ నాపై దాడి చేస్తున్నప్పుడు నేను అరుస్తునే ఉన్నారు. కానీ, నన్న రక్షించడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాడి జరిగిన సమయంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం ఇంట్లోనే ఉన్నారు. ఈ దాడి విషయలో నేను ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేను. నేను 9 గంటలకు సీఎం నివాసానికి వెళ్లితే డ్రాయింగ్ రూంలో నన్ను వేచి ఉండాలని ఇంటి సిబ్బంది తెలిపింది. కేజ్రీవాల్ ఇంట్లోనే కూర్చొని ఉన్నారు. సీఎం నన్ను కలవడానికి వస్తారని సిబ్బంది చెప్పింది. ఒక్కసారిగా బిభవ్ నేను ఉన్న గదిలోకి దూసుకువచ్చారు. ఏం అయింది? కేజ్రీవాల్ వస్తున్నారు. ఏం అయింది? అని ఆయన్ను అడిగాను. అంతలోనే ఆయన నాపై దాడి చేయటం మొదలు పెట్టాడు. ఏడెనిమిది సార్లు నా చెంప మీద కొట్టారు. నేను ఆయన్ను వెనక్కి నెట్టేయాలని ప్రయత్నం చేశాను. తన కాలుతో నన్ను లాగి మధ్యలో ఉన్న టెబుల్‌కు నా తలను బాదారు’’ అని స్వాతి మలివాల్ తెలిపారు.‘‘బిభవ్ కుమార్ వేరే వాళ్ల సూచన మేరకే నాపై దాడి చేశారు. దాడి కేసులో నేను ఢిల్లీ పోలీసులకు సంపూర్ణంగా సహకరిస్తా. ఈ విషయంలో నేను ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వను. నాపై దాడి జరుగుతున్న సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు. నేను బాధతో ఎంత అరిచినా నన్ను ఎవరూ పట్టించుకోలేదు. నాపై జరిగిన దాడిలో విషయంలో నేను గళం ఎత్తుతాను.దాని వల్ల నా కెరీర్‌కు ఇబ్బందైనా వదిలిపెట్టను. సత్యానికి, నిజమైన ఫిర్యాదులకు మద్దతుగా ఉండాలని చెప్పే నేను నా విషయంలో అంతే ధైర్యంగా ఉండి పోరాడుతాను’’ అని స్వాతి మలివాల్ అన్నారు. ఈ కేసులో అరెస్టైన బిభవ్ కుమార్ ఫోన్ ఫార్మాట్, సీఎం నివాసం వద్ద ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ దాడికి సంబంధించి స్వాతి మలివాల్ వెనక బీజేపీ కుట్ర ఉందని ఆప్ తీవ్ర విమర్శలు చేస్తోంది. -
స్వాతి మలివాల్ కేసు: సీఎం నివాసంలో సీసీటీవీ ఫుటేజీ స్వాధీనం
ఢిల్లీ: ఆప్ రాజ్యసభ స్వాతి మలివాల్‌పై దాడి జరిగిన కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోని సీసీటీవీ కెమెరాలకు సంబంధించి డిజిటల్ వీడియో రికార్డ్ (డీవీఆర్)లను పోలీసులు స్వాధీనం చేసకున్నారు. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం వెల్లడించింది. కాగా.. లోక్‌సభ ఎన్నికల ముందు పార్టీ ప్రతిష్టను దెబ్బతీయాలని పోలిసులు ప్రయత్నం చేస్తున్నారని ఆప్ ఆరోపించింది. దర్యాప్తుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు కట్టకథలు అల్లుతోందని ఆప్ ఆరోపణుల చేసింది. ఇక.. ఢిల్లీ పోలీసులు నుంచి ఎటువంటి సత్వరమైన స్పందన లేదని పేర్కొంది. ‘‘పోలీసులు శనివారమే కేజ్రీవాల్ నివాసంలోని సీసీటీవీ కెమెరాల డీవీఆర్‌లను స్వాధీనం చేసుకున్నారు. మళ్ల ఆదివారం కూడా సీఎం నివాసంలోని మిగతా చోట్ల ఉన్న సీసీటీవీ కెమెరాల డీవీఆర్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ తొలగించారని పోలీసులు చెబుతున్నారు. కానీ, అప్పటికే పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కావాలనే వాటిపై కట్టుకథలు అల్లుతున్నారు’’ అని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు. అదే విధంగా సీఎం నివాసంలోని సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణను పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్ ఆధీనంలో ఉంటుందని సౌరభ్ భరద్వాజ్ తెలిపారు.ఈ కేసుకు సంబంధించిన ఆయలు పలు ప్రశ్నలు సంధించారు. ‘‘మే 13న స్వాతి మలివాల్ నుంచి పోలీసులకు కాల్ వచ్చింది. అయితే కొద్దిసేటికే ఈ విషయం మీడియాకు వ్యాపించింది. సెక్షన్ 354(బీ)కి కేసు నమోదైంది. ఓ మహిళకు సంబంధించిన సున్నితమైన విషయం. కానీ, కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది. బిభవ్‌కుమార్ నిందితుడు అయితే ఆప్ వద్ద ఎఫ్ఐఆర్ కాపీ లేదు’ అని సౌరభ్ భరద్వాజ్ అన్నారు. -
స్వాతి మలివాల్ కేసులో సాక్ష్యాలు మాయం?!
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై జరిగిన దాడి కేసులో ఢిల్లీ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నిందితుడు బిభవ్ కుమార్ రిమాండ్ నోట్‌ను విడుదల చేశారు. ఈ కేసులో సాక్షాలు మాయమైట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. దాడి జరిగిన రోజు (మే13)న సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో సీసీటీవీ ఫుటేజీని నిందితుడు బిభవ్‌కుమార్ ట్యాంపర్ చేశారని వెల్లడించారు. ‘‘విచారణకు సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ సహకరించడం లేదు. బిభవ్ కుమార్ తన ఫోన్ పాస్ వర్డ్ చెప్పడం లేదు. ఆయన ఫోన్‌ను ముంబైలో ఫార్మాట్ చేశారు. కేజ్రీవాల్ నివాసంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజీ బ్లాంక్‌గా ఉంది. దాడి జరిగిన వీడియోను తొలగించారు. సీసీటీవీ పుటేజీకి సంబంధించిన డిజిటల్ వీడియో రికార్డర్‌ను ఇచ్చేందుకు కేజ్రీవాల్ నిరాకరిస్తున్నారు’’ అని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.‘‘ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఉన్న సీసీటీవీ కెమెరాలు బ్లాంక్‌గా ఉన్నాయి. మే 23( సోమవారం) రోజు సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేసేందుకు వీలుగా డిజిటిల్ వీడియో రికార్డర్‌ను మాకు అందజేయలేదు.ముఖ్యమంత్రి నివాసంలో ఉన్న సీసీటీవీ కెమెరాల నిర్వహణ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది. ఆ విభాగానికి చెందని ఓ జూనియర్ ఇంజనీర్ ఇచ్చిన పెన్ డ్రైవ్‌ను పరిశీలించాము. కానీ అందులో ఒక వీడియో బ్లాంక్‌గా వస్తోంది. జూనియర్ ఇంజనీర్ వద్ద డీవీఆర్ యాక్సెస్ లేదు’ అని దర్యాపు చేసిన ఢిల్లీపోలీసులు రిమాండ్ నోట్లో వెల్లడించారు. ఇక.. స్వాతి మలివాల్‌పై దాడి కేసులో సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్‌కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి.. ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. -
కేజ్రీవాల్ అనుచరుడు బిభవ్ అరెస్ట్
న్యూఢిల్లీ: ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో అరవింద్ కేజ్రీవాల్ అనుచరుడు బిభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. సోమవారం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లిన తనపై విభవ్ దాడికి పాల్పడ్డాడని స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.ఢిల్లీ సీఎం నివాసం నుంచే అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నేరుగా సివిల్ లైన్ పోలీస్ స్టేషన్‌కు ఇంటరాగేషన్ కోసం తరలించారు. అంతకు ముందు సీఎం కేజ్రీవాల్ నివాసంలో సీన్ రీ కన్స్ట్రక్షన్ నిర్వహించారు పోలీసులు. అయితే.. ఈ కేసులో పూర్తిగా సహకరిస్తామని అధికారులకు తాము మెయిల్ పంపించామని, అయినా కూడా పోలీసుల నుంచి బదులేం లేదని విభవ్ లాయర్ మీడియాకు వెల్లడించారు. -
మలివాల్ వాంగ్మూలం నమోదు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో కలిసేందుకు వెళ్లిన సందర్భంగా ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారని ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ ఆరోపించిన ఉదంతంలో పోలీసులు ముందడుగు వేశారు. ఈ విషయంలో ఇంతవరకు స్వాతి పోలీసులకు ఫిర్యాదుచేయలేదు. అయినాసరే పోలీసులే గురువారం స్వయంగా ఆమె ఇంటికి వెళ్లిమరీ ఆమె వాంగ్మూలాన్ని రికార్డుచేశారు. సోమవారం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లినప్పుడు జరిగిన ఘటన వివరాలను ఇద్దరు సభ్యుల ఢిల్లీ పోలీసు బృందానికి స్వాతి వివరించింది. నాలుగున్నర గంటలపాటు అదనపు పోలీసు కమిషనర్ పీఎస్ కుషా్వహా బృందం స్వాతి ఇంట్లో వివరాలు సేకరించింది. వాంగ్మూలం నమోదు పూర్తయిన నేపథ్యంలో బిభవ్‌పై పోలీసులు గురువారం ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. సోమవారం దాడి ఘటన జరిగిన వెంటనే స్వాతి సివిల్ లైన్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనపై జరిగిన దాడి విషయాన్ని చెప్పి వచ్చారుగానీ ఫిర్యాదుచేయలేదు. దీంతో ఇన్నిరోజులైనా పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. దీంతో ఈ విషయాన్ని సూమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ శుక్రవారం తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని బిభవ్ కుమార్‌కు సమన్లు జారీచేసింది. కేజ్రీవాల్ మౌనమేల?: బీజేపీ సొంత ఇంట్లో జరిగిన ఘటనపై సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారని బీజేపీ ప్రశ్నించింది. లక్నోలో పత్రికా సమావేశం సందర్భంగా కేజ్రీవాల్‌ను మీడియా ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పలేదు. దీంతో బీజేపీ విమర్శించింది. ‘‘ ఆయన మౌనం కూడా ఎంతో చెప్తోంది. జైలు నుంచి విడుదలయ్యాక సీఎంగా కంటే గూండాలా వ్యవహరిస్తున్నారు’’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. బీజేపీ రాజకీయాలు ఆపాలి: స్వాతి దాడి ఉదంతాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని బీజేపీకి స్వాతి మలివాల్ హితవు పలికారు. ‘‘ ఆరోజు నా విషయంలో జరిగింది నిజంగా బాధాకరం. అందుకే పోలీసులకు వాంగ్మూలం ఇచ్చా. సరైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా. ఇందులో బీజేపీకి ఏం సంబంధం. వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనను రాజకీయంచేయొద్దని బీజేపీ నేతలకు ప్రత్యేకంగా విన్నవిస్తున్నా’’ అని స్వాతి ‘ఎక్స్’లో హిందీలో పోస్ట్‌చేశారు. -
NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్‌కు సుప్రీం కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: న్యూస్‌క్లిక్ పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్ట్ చెల్లదని, ఆయన్ని తక్షణమే విడుదల చేయాలని సుప్రీం కోర్టు బుధవారం ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఈ న్యూస్ పోర్టల్‌కు విదేశీ నిధులు అందుతున్నాయంటూ.. ఉగ్రవాద నిరోధక చట్టం కింద కిందటి ఏడాది అక్టోబర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. అరెస్టుకు సరైన కారణాలు చెబుతూ రిమాండ్ కాపీని సమర్పించడంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారు. దీంతో.. రిమాండ్ కాపీ తమకు అందకపోవడంతో ఈ అరెస్ట్ చెల్లదని, వెంటనే ఆయన్ని రిలీజ్ చేయాలని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా పంకజ్ బన్సాల్ కేసును కోర్టు ప్రస్తావించింది. అరెస్టుకు గల కారణాలేంటో నిందితులకు కూడా రాతపూర్వకంగా పోలీసులు తెలియజేయాల్సి ఉంటుందని పంకజ్ బన్సాల్ కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఈ కేసులోనూ అదే వర్తిస్తుంది అని బెంచ్ స్పష్టం చేసింది. చైనా అనుకూల ప్రచారానికి నిధులు అందుకున్నారనే ఆరోపణలు రావడంతో ఉపా చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అక్టోబర్ 3వ తేదీన న్యూస్‌క్లిక్‌పోర్టల్‌లో పని చేసే జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు చేశారు. డిజిటల్ పరికరాలు, పలు డాక్యుమెంట్లను సీజ్ చేశారు. అదే రోజు ప్రబీర్ పుర్కాయస్థతో పాటు ఆ సంస్థ హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని అరెస్టు చేసినట్టు ఢిల్లీ పోలీస్ అధికార ప్రతినిధి సుమన్ నల్వా వెల్లడించారు. ‘న్యూస్‌క్లిక్’ సంస్థకు చైనా నుంచి నిధులు అందుతున్నాయంటూ గత ఏడాది ఆగస్టులో ‘న్యూయార్క్ టైమ్స్’లో కథనం ప్రచురితమైంది. చైనా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే అమెరికా మిలియనీర్ నెవిల్ రాయ్‌సింగం నుంచి గ్లోబల్ నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్న న్యూస్‌క్లిక్ నిధులు పొందినట్టు ఆ కథనంలో పేర్కొంది. దీంతో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA)లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు దిల్లీ పోలీసులు.ఈ క్రమంలోనే న్యూస్‌క్లిక్ ఆఫీస్‌తో పాటు ఆ సంస్థలో పనిచేసే జర్నలిస్టుల ఇళ్లు సహా మొత్తం 30 చోట్ల సోదాలు జరిపి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసుల తీరుపై ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఇంకోవైపు.. ‘న్యూస్‌క్లిక్’పై దాడులను విపక్ష కూటమి ‘ఇండియా’ నేతలు తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు మాట్లాడేవారి గళాన్ని అణచివేసేందుకే కేంద్రం సోదాలు చేపట్టిందని విమర్శించారు. బిహార్‌లో కులగణనలో బయటపడిన విషయాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేంద్రం న్యూస్‌క్లిక్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందని విపక్షాలు ఆ సమయంలో మండిపడ్డాయి. -
తిహార్ జైలుకు బాంబు బెదిరింపు..
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో దేశంలో బాంబు బెదిరింపులు కలవరపెడుతున్నాయి. పాఠశాలలు, బస్టాండ్లు, ఎయిర్‌పోర్టులు, హాస్పిటల్స్ ప్రముఖుల నివాసాలు.. ఇలా ప్రతిచోటా బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. తాజాగా ఢిల్లీలోని తీహార్ జైలుకు బాంబు బెదిరింపు మెయిల్ అందింది.దీంతో జైలు అధికారులు ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేశారు. జైలులోని ప్రముఖ రాజకీయ నాయకులతోపాటు కొందరు ఉన్నతస్థాయి ఖైదీలు ఉన్న సెల్లో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, బాంబు డిటెక్షన్ టీమ్, పోలీసులు సోదాలు జరుపుతున్నాయి. ఇప్పటి వరకు అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులను అధికారులు గుర్తించలేదు. కాగా ఇటీవల ఢిల్లీలోని పాఠశాలలు, ఆసుపత్రులు, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్(ఐజీఐఏ) విమానాశ్రయానికి కూడా ఇలాంటి హెచ్చరికలు అందిన విషయం తెలిసిందే -
షా డీప్‌ఫేక్ ప్రసంగం వీడియో సృష్టికర్త అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగ వీడియోను డీప్‌ఫేక్‌గా సృష్టించిన వ్యక్తిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. అమిత్ షా వీడియోను ఏఐసీసీ సోషల్ మీడియా విభాగం జాతీయ సమన్వయకర్త అరుణ్‌రెడ్డి డీప్‌ఫేక్ చేశారని పోలీసులు నిర్ధారించారు. దీని వెనక కాంగ్రెస్ ప్రముఖుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు.సృష్టించి.. సర్క్యులేట్ చేసి..మెదక్‌లో ఏప్రిల్ 23న నిర్వహించిన సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ మళ్లీ అధికారంలోకి వస్తే మతప్రాతిపదికన అమలవుతున్న ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. కానీ ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అరుణ్‌రెడ్డి ఎడిట్ చేసి తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తామని షా అన్నట్లుగా యాడ్ చేశారని ఢిల్లీ పోలీసులు చెప్పారు. అనంతరం ఆ వీడియోను ఏఐసీసీ, ఎన్ఎస్యూఐ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని వాట్సాప్ గ్రూపుల్లో అరుణ్‌రెడ్డి పోస్ట్ చేశారని పేర్కొన్నారు.కేంద్ర హోంశాఖ ఫిర్యాదుతో..షా డీప్‌ఫేక్ వీడియోను వీక్షించిన నెటిజన్లు బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే దీనిపై ఏఐసీసీ అధ్యక్షు డు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సహా మరికొందరు పార్టీ నేత లు స్పందించారు. బీజేపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని వారు బహిరంగ సభల్లో చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర హోంశాఖ ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ద్వారా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై గత నెల 28న ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నేడు మరో అరెస్టుకు అవకాశం..వీడియో సృష్టికర్త అరుణ్‌రెడ్డి కాగా దాన్ని వైరల్ చేసింది మాత్రం తెలంగాణకు చెందిన వ్యక్తేనంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’ ఇప్పటికే ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు నివేదించింది. దీంతో ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆదివారంలోగా తమకు సమర్పించాలని ‘ఎక్స్’తోపాటు ‘ఫేస్బుక్’ను పోలీసులు కోరారు. ఆదివారంలోగా ఆ డీప్‌ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో తొలిసారి పోస్ట్ చేసిన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేయనున్నారు. -
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
వడపావ్ అమ్ముతున్న యువతిని అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను పోలీసులు ఖండించారు. వడాపావ్ గర్ల్‌గా ఫేమస్ అయిన చంద్రిక దీక్షిత్‌ను అరెస్టు చేయలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అంతేగాక ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని స్పష్టం చేశారు.చంద్రిక దీక్షిత్ అనే యువతి కొంతకాలంగా ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలో వడపామ్ ఫుడ్ స్టాల్ నడిపిస్తోంది. రాను రాను ఆమె ‘వడపామ్ గర్ల్’గా పేరొందింది. ఆమెకు ఇన్‌స్టాలో 30 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల ఈ యువతి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. స్టాల్ దగ్గర యువతి విందు ఏర్పాటు చేయగా.. స్థానికులతో వివాదం జరిగినట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. స్టాల్‌ను తొలగించాలని ఆదేశించిన మున్సిపల్ అధికారులతో ఆమె గొడవకు దిగింది. ఆ వీడియో వైరల్ అయ్యింది.అయితే, చంద్రిక ఫుడ్ స్టాల్‌ను స్థానిక మున్సిపాలిటీ అనుమతి లేకుండా నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం వల్ల ఆమె స్టాల్ వద్దకు జనాలు భారీగా వస్తున్నారని. దీని వల్ల స్థానికంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్న చుట్టుపక్కల వారు తమకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీంతో పోలీస్ సిబ్బంది వెళ్లి ప్రశ్నించగా ఆమె దురుసుగా ప్రవర్తించిందని, ఈ నేపథ్యంలో ఆ ఫుడ్ స్టాల్ ను సీజ్ చేసి, ఆమెను పోలీస్ స్టేషన్ తరలించినట్లు పేర్కొన్నారు. అయితే, ఆమెను అరెస్ట్ చేయలేదని, తనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలిపారు. -
అమిత్ షా ఫేక్ వీడియో: పోలీసు నోటీసులకు సీఎం రేవంత్ రిప్లై..
ఢిల్లీ: రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే ఆరోపణలతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. తాజాగా ఆ నోటీసులపై సీఎం రేవంత్‌రెడ్డి తరఫున న్యాయవాది సౌమ్య గుప్త వివరణ ఇచ్చారు.‘‘కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో షేర్ చేయడానికి నాకు సంబంధం లేదు. ఐఎన్సి తెలంగాణ ట్విటర్ ఖాతాకి నేను ఓనర్ కాదు. ఆ ఖాతాను నేను నిర్వహించడం లేదు. నేను కేవలం రెండు ట్విటర్ ఖాతాలను (సీఎంఓ తెలంగాణా, నా వ్యక్తిగత ఖాతా) మాత్రమే వినియోగిస్తున్నాను’’ అని న్యాయవాది సౌమ్య గుప్త ద్వారా ఢిల్లీ పోలీసులకు రేవంత్‌రెడ్డి సమాధానం పంపారు. రేవంత్ రెడ్డి సమాధానాన్ని ఢిల్లీ పోలీసులకు ఆయన తరపు న్యాయవాది సౌమ్య గుప్త అందజేసినట్లు తెలిపారు.మరోవైపు.. ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్ గీతా ఫోన్ సీజ్ చేశారు. తెలంగాణలోని సికింద్రాబాద్ శాంతినగర్‌కు చెందిన గీతకి ఢిల్లీ పోలీసులు సీఆర్పీసీ 41ఏ నోటీసు ఇచ్చారు. ఈ నెల 5వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపారు.తెలంగాణలో ఇటీవల ఓ సభలో పాల్గొని అమిత్ షా ప్రసంగిస్తూ.. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగవిరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కులను వారికే కల్పిస్తామని చెప్పారు. అమిత్ షా మాటలను కొంతమంది వక్రీకరించారు. రిజర్వేషన్లు అన్నింటినీ పూర్తిగా రద్దు చేస్తామని అమిత్ షా అన్నట్లుగా వీడియోను ఎడిట్ చేశారని బీజేపీ ఆరోపణలు చేసింది.మరోవైపు.. ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ ఓ ప్రచార సభలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఆరోపించారు. అమిత్ షా వీడియోను వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారని బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసు కేసు నమోదు చేసుకోని సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మరికొందరికి వివరణ ఇవ్వాలని నోటీసులు పంపారు. -
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
-
అమిత్ షా ఫేక్ వీడియో.. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
-
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో కేసులో మే 1న విచారణకు రావాలని ఆదేశించింది. తన వెంట గ్యాడ్జెట్స్ తీసుకురావాలని తెలిపింది.కాగా రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఫేక్ వీడియోను కాంగ్రెస్ వైరల్ చేసింది. దీనిపై బీజేపీ, హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు చేయగా.. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేక్ వీడియో ఎవరు తయారు చేశారన్న దానిపైన స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్(IFSO) దర్యాప్తు చేస్తోంది.అయితే తెలంగాణ పీసీసీ అధికారిక ట్విటర్ హ్యాండీలో అమిత్ షా వీడియో పోస్టు చేశారు. దీంతో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌కు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఎంతోపాటు తెలంగాణ డీజీపీ, సీఎస్‌కు కూడా ఢిల్లీ నోటీసులు జారీ అయ్యాయి.కాగా దేవంతో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేయడం గురించి అమిత్ షా కామెంట్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా మాట్లాడినట్టుగా ఉంది. అయితే, అసలు వీడియోలో తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడినట్టు బీజేపీ స్పష్టం చేసింది. అలాగే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయడంపై అమిత్ షా ఏమీ మాట్లాడలేదని బీజేపీ తెలిపింది -
కోర్టులో కేజ్రీవాల్.. సీఎంతో ఏసీపీ అనుచిత ప్రవర్తన?
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోర్టులో కేజ్రీవాల్‌ను హాజరుపరుస్తున్న వేళ కేజ్రీవాల్‌తో ఓ పోలీసు అధికారి అనుచితంగా ప్రవర్తించడం కలకలం రేపింది. దీంతో, కేజ్రీవాల్ సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం.. లిక్కర్ స్కాం కేసులో భాగంగా కేజ్రీవాల్‌ను శుక్రవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్బంగా పటిష్ట పోలీసు భద్రత మధ్య కేజ్రీవాల్‌ను కోర్టుకు తీసుకువచ్చారు. కాగా, తనను ఈడీ ఆఫీసు నుంచి కోర్టుకు తీసుకువచ్చే క్రమంలో ఢిల్లీ ఏసీపీ ఏకే సింగ్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని కేజ్రీవాల్ ఆరోపించారు. అవసరం లేకున్నా ఏక్ సింగ్ అత్యుత్సహం ప్రదర్శించి తనను ఇబ్బందులకు గురిచేసినట్టు కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఏకే సింగ్‌ను తన సెక్యూరిటీ నుంచి తొలగించాలని రౌస్ అవెన్యూ కోర్టుకు దరఖాస్తు అందజేశారు. ఇదిలా ఉండగా.. గతంలో కూడా ఏకే సింగ్ ఇలాగే ప్రవర్తించడం విశేషం. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో కూడా ఏకే సింగ్ ఇలాగే ప్రవర్తించారు. లిక్కర్ స్కాం కేసులో సిసోడియాను కోర్టులో హాజరుపరుస్తున్న క్రమంలో ఏకే సింగ్.. సిసోడియా మెడ పట్టుకుని తీసుకెళ్లారు. దీంతో, ఈ ఘటన అప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. లిక్కర్ స్కాం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కోర్టు ఈడీ కస్టడీ విధించింది. ఈ కేసులో భాగంగా కేజ్రీవాల్‌ను ఈడీ.. ఆరు రోజుల పాటు కస్టడీలో ప్రశ్నించనుంది. ఇక, లిక్కర్ స్కాం కేసు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో, వీరిద్దరిని కలిపి ఈడీ విచారించే అవకాశం ఉంది. -
250 మంది పోలీసుల బందోబస్తు మధ్య గ్యాంగ్స్టర్ల పెళ్లి..
న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ సందీప్ అలియాస్ కాలా జాతేడి, మహిళా క్రిమినల్ అనురాధ చౌదరి అలియాస్ 'మేడమ్ మింజ్'ల వివాహం మంగళవారం ఢిల్లీఓ జరిగింది. ద్వారకా సెక్టార్-3లోని సంతోష్ గార్డెన్, బాంక్వెట్ హాల్ వీరి పెళ్లి వేదికగా మారింది.. సందీప్ తరఫు న్యాయవాది రూ.51వేలు చెల్లించి ఈ హాల్‌ను బుక్ చేశాడు. ఈ వివాహానికి సందీప్ కుటుంబం 150 మంది అతిథులను ఆహ్వానించాడు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఓ గ్యాంగ్‌స్టర్, బెయిల్‌పై ఉన్న ఓ మహిళా క్రిమినల్‌కు వివాహం నేపథ్యంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించారు. గ్యాంగ్‌స్టర్‌కు ఉన్న నేర చరిత్ర, కేసులను దృష్టిలో పెట్టుకొని గ్యాంగ్‌వార్ జరిగే అవకాశం, లేదా కస్టడీ నుంచి నిందితుడు తప్పించుకునేందుకు తావివ్వకుండా ఢిల్లీ పోలీసులు పకడ్బందీ ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, స్పెషల్ స్టాఫ్, క్రైమ్ బ్రాంచ్‌ల బృందాలు రంగంలోకి దిగాయి. డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లు, సాయుధ బలగాల మోహరించారు. 250 మందికి పైగా పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. వేదిక ప్రవేశం వద్ద రెండు డోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశామని, వివాహానికి హాజరైన ప్రతి ఒక్కరూ దాని గుండా వెళ్లాల్సి ఉంటుందని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా హరియాణాలోని సోనిపట్‌కు చెందిన సందీప్ ఒకప్పుడు అతని తలపై రూ. 7 లక్షల రివార్డుతో వాంటెడ్ క్రిమినల్. తీహార్ జైల్లోఉ న్న సందీప్.. పెళ్లి కోసం ఢిల్లీ కోర్టు ఆరు గంటల పెరోల్ ఇచ్చింది. ఇక ‘రివాల్వర్ రాణి' గా పేరొందిన అనురాధ చౌదరి అనేక కేసుల్లో నిందితురాలిగా ఉంది. ప్రస్తుతం ఆమె బెయిల్‌పై ఉన్నారు. నాలుగేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు.. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు సందీప్ అత్యంత సన్నిహితుడు. ఇతడిపై దోపిడీ, హత్య, హత్యాయత్నం వంటి కేసులున్నాయి. -
సరిహద్దులో రణరంగం
న్యూఢిల్లీ/చండీగఢ్: పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించడంతోపాటు ఇతర డిమాండ్ల సాధనకు దాదాపు 200 రైతు సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాతలు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పంజాబ్, హరియాణా రాష్ట్రాల నుంచి ట్రాక్టర్లపై ర్యాలీగా బయలుదేరిన వేలాది మంది రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పంజాబ్, హరియాణా శంభు సరిహద్దులో పోలీసులపై నిరసనకారుల రాళ్ల దాడులు, బారికేడ్ల విధ్వంసం, రైతన్నలపై బాష్పవాయువు ప్రయోగం వంటి ఘటనలు చోటుచేసుకున్నారు. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువుతోపాటు జల ఫిరంగులు ప్రయోగించారు. దాదాపు 100 మంది రైతులు గాయపడ్డారని రైతు సంఘాల నాయకులు చెప్పారు. శంభు బోర్డర్ వద్ద రోజంతా ఉద్రిక్తత కొనసాగింది. మరోవైపు ఢిల్లీ శివార్లలోని సింఘు, చిల్లా, తిక్రీ, ఘాజీపూర్ బోర్డర్ పాయింట్ల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పార్లమెంట్ ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టాలన్న రైతు సంఘాల ప్రణాళిక అమలు కాలేదు. ‘చలో ఢిల్లీ’ని మంగళవారం రాత్రికి నిలిపివేస్తున్నామని, బుధవారం ఉదయం కొనసాగిస్తామని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. ఎలాగైనా ఢిల్లీకి చేరుకొని, తమ గళం వినిపించడం ఖాయమన్నారు. శంభు సరిహద్దులో యుద్ధ వాతావరణం శంభు సరిహద్దు వద్ద ట్రాక్టర్ల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. రైతులను ముందుకు వెళ్లనివ్వలేదు. చలో ఢిల్లీకి అనుమతి లేదని, వెనక్కి వెళ్లిపోవాలని సూచించారు. ఆగ్రహానికి గురైన రైతులు పోలీసులపై రాళ్లు రువ్వారు. వంతెనపై బారికేడ్లను నదిలోకి తోసేశారు. సిమెంట్ బారికేడ్లను ట్రాక్టర్లతో తొలగించేందుకు ప్రయతి్నంచారు. పరిస్థితి చెయ్యి దాటుతుండటంతో పోలీసులు జల ఫిరంగులు, డ్రోన్లతో బాష్పవాయు గోళాలు ప్రయోగించి రైతులను చెదరగొట్టారు. నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. చర్చలు అసంపూర్ణం రైతు సంఘాలతో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా సోమవారం రాత్రి జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ర్యాలీని విరమించాలని మంత్రులు కోరగా నేతలు అంగీకరించలేదు. డిమాండ్లు నెరవేరే దాకా ఉద్యమం కొనసాగిస్తామని తే ల్చిచెప్పారు. చాలా అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చామని మంత్రులు చెప్పారు. మిగతా డిమాండ్ల పరిష్కారానికి కమిటీ వేస్తామని ప్రతిపాదించగా నేతలు ఒప్పుకోలేదు. 2020–21 ఉద్యమంలో పాల్గొన్న రైతులపై కేసుల ఉపసంహరణకు, మరణించిన వారి కటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు అప్పట్లోనే కేంద్రం ముందుకొచ్చింది. అవిప్పటికీ నెరవేరలేదని నేతలు ఆక్షేపించారు. పంటలు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాల్సిందేనని వారు మరోసారి తేల్చిచెప్పారు. తక్షణం చర్చలు ప్రారంభించాలి రైతులతో ప్రభుత్వం వెంటనే చర్చలు ప్రారంభించాలని, డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధ్యక్షుడు నరేశ్ తికాయత్ చెప్పారు. ఉద్యమంపై కఠినంగా వ్యవహరిస్తే ప్రమాదకరంగా మారవచ్చన్నారు. ఈ నెల 16న బంద్ పిలుపు ఇవ్వాలన్న ప్రతిపాదన ఉందన్నారు. తామెప్పుడూ రైతుల పక్షానే ఉంటామని స్పష్టం చేశారు. ‘‘డిమాండ్లు నెరవేరాలంటే రైతన్నలు ప్రతిసారీ ఉద్యమబాట పట్టాల్సిందేనా? ఢిల్లీకి వెళ్లాల్సిందేనా? ప్రభుత్వానికి బాధ్యత లేదా?’’ అని ప్రశ్నించారు. -
Dilli Chalo 2.0: ఢిల్లీ సరిహద్దులో యుద్ధవాతావరణం
అష్ట దిగ్బంధనంలో దేశ రాజధాని ఢిల్లీ సింగు బోర్డర్ వద్దకు భారీగా చేరుకున్న రైతులు రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగంతో చెల్లాచెదురైన నిరనసన కారులు శంభు బోర్డర్ వద్ద హైటెన్షన్ పోలీసులపై రాళ్లు రువ్విన రైతులు #WATCH | Protesting farmers vandalise flyover safety barriers at the Haryana-Punjab Shambhu border. pic.twitter.com/vPJZrFE0T0 — ANI (@ANI) February 13, 2024 పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తత బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసిన పోలీసులు ఎక్కడిక్కడ రహదారులను మూసివేసిన పోలీసులు పంజాబ్, హర్యానా నుంచి ఢిల్లీ వైపు వస్తున్న రైతులు రైతుల ట్రాక్టర్లు ఢిల్లీలోకి రాకుండా సరిహిద్దుల్లో పటిష్ట భద్రత కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని రైతుల డిమాండ్ #WATCH | Protesting farmers throw police barricade down from the flyover at Shambhu on the Punjab-Haryana border as they march towards Delhi to press for their demands. pic.twitter.com/oI0ouWwlCj — ANI (@ANI) February 13, 2024 ఢిల్లీ వ్యాప్తంగా నెలరోజులపాటు 144 సెక్షన్ డ్రోన్లతో పర్యవేక్షిస్తున్న భద్రతా బలగాలు అంబాల హైవేపైకి భారీగా రైతులు ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జాం రైతుల చలో ఢిల్లీ రహదారులను మూసివేసిన పోలీసులు పలుచోట్ల అతినెమ్మదిగా కదులుతున్న వాహనాలు ఢిల్లీ సరిహద్దుల్లో టెన్షన్.. టెన్షన్.. పంజాబ్,హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తత సరిహద్దుల వద్ద రైతులను అడ్డుకున్న పోలీసులు రైతుల టియర్ గ్యాస్ ప్రయోగం ఢిల్లీ ముట్టడికి రైతుల యత్నం 2020 ఉద్యమం తరహాలో పోరుగు సిద్ధమైన రైతులు పంజాబ్, హర్యానా నుంచి ఢిల్లీ వైపు వస్తున్న రైతులు తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమం ఆగదన్న రైతులు ఆరు నెలలకు సరిపడా ఆహార పదార్థాలతో బయల్దేరిన రైతులు ధీర్ఘకాలిక ఉద్యమాన్ని కొనసాగించాలని రైతులు నిర్ణయం మంత్రులతో చర్చలు విఫలం కావడంతో మొదలైన రైతుల మార్చ్ శాంతియూతంగా ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టం సాక్షి, ఢిల్లీ: రైతుల ఢిల్లీ ఛలో యాత్రతో నగర సరిహద్దులో యుద్ధవాతావరణం నెలకొంది. ముట్టడికి బయల్దేరిన రైతు సంఘాలను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈ క్రమంలో సంభూ సరిహద్దులో అడ్డగించే క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. డ్రోన్ ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగించిన దృశ్యాలు చక్కర్లు కొడుతున్నాయి. టియర్ గ్యాస్ ప్రయోగంతో చెల్లాచెదురైన నిరసనకారులు.. అంబాల హైవే పైకి చేరారు. #WATCH | Police use tear gas drones at the Haryana-Punjab Shambhu border to disperse protesting farmers. pic.twitter.com/LcyGpDuFbv — ANI (@ANI) February 13, 2024 మరోవైపు.. పంజాబ్, హర్యానాల నుంచి నిరసనకారులు ఢిల్లీ వైపు వచ్చే యత్నం చేస్తేఉన్నారు. ఇంకోపక్క రైతన్నల ఢిల్లీ ఛలో ప్రభావంతో.. నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రహదారుల దగ్గర పోలీసుల మోహరింపు.. తనిఖీలతో.. వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. అతినిదానంగా వాహనాలు కదులుతుండడంతో.. కిలో మీటర్ దూరం దాటేందుకు గంటల సమయం పడుతోందని వాహదనదారులు సోషల్ మీడియాలో వాపోతున్నారు. రైతుల మెగా మార్చ్‌ను భగ్నం చేసేందుకు.. ఢిల్లీకి దారి తీసే ప్రధాన సరిహద్దుల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సిమెంట్ దిమ్మెలు, కంచెలతో అడ్డుకునే యత్నం చేస్తున్నారు. సింగూ, టిక్రిలతో పాటు ఢిల్లీ(ఘజియాబాద్), యూపీ నొయిడాల సరిహద్దు ప్రాంతాలైన ఘాజిపూర్, చిల్లా వద్ద పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అయితే పోలీసులు మాత్రం దారుల్ని పూర్తిగా మూసేయలేదని.. ఫెన్సింగ్‌లో పాక్షికంగా మూసేసి తనిఖీల అనంతరం అనుమతిస్తున్నామని చెబుతున్నారు. #Traffic snarls on the highway from #Gurugram towards #DelhiPolice place concrete slabs on the road as a part of measures to stop farmers from marching to Delhi#DelhiNCR #FarmersProtest pic.twitter.com/oqCel5wEUf — cliQ India (@cliQIndiaMedia) February 13, 2024 అలాగే అత్యవసరాల వస్తువులను సైతం అనుమతిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు మాత్రం ఘోరంగా ఉన్నాయి. ఎన్‌హెచ్ 48పై కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఆందోళనకు తరలివస్తున్న రైతుల్ని పంజాబ్ పోలీసులు అనుమతిస్తుండడం గమనార్హం. #WATCH | Punjab Police allows protesting farmers to cross Rajpura bypass to head towards Haryana's Ambala onward to Delhi for their protest to press for their demands pic.twitter.com/yCMvdNnD8t — ANI (@ANI) February 13, 2024 ఇదిలా ఉంటే.. పలు డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ ఛలోను ప్రారంభించారు. మంగళవారం ఉదయం పంజాబ్, హర్యానా ఇలా సమీప ప్రాంతాల నుంచి యాత్రను ప్రారంభించారు. అయితే ముందుగానే అప్రమత్తమైన పోలీసులు.. సరిహద్దుల్లో కంచెలతో భారీగా మోహరించారు. దీంతో ఏం జరగనుందా? అనే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. #WATCH | Delhi Police personnel and barricades deployed at ITO intersection, section 144 CrPC imposed, in view of farmers' protest march to Delhi demanding a law guaranteeing MSP for crops pic.twitter.com/ZSUhHhFFA7 — ANI (@ANI) February 13, 2024 కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమవడంతో.. ముందుగానే నిర్ణయించినట్లు ‘ఢిల్లీ చలో’ పేరుతో భారీస్థాయిలో ఆందోళన చేపట్టేందుకు రైతులు కదిలారు. పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో రైతన్నలు ఇప్పటికే దేశ రాజధాని దిశగా కదిలారు. మరోవైపుభగ్నం చేసేందుకు పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. #WATCH | Farmers begin their 'Delhi Chalo' march from Fatehgarh Sahib in Punjab. pic.twitter.com/WE7mXiPu9J — ANI (@ANI) February 13, 2024 #WATCH | Farmers begin their 'Delhi Chalo' march from Shambhu Border. pic.twitter.com/tKEF6iEHkZ — ANI (@ANI) February 13, 2024 సోమవారం నాడు.. యాత్రను విరమించుకోవాలని సూచించిన కేంద్రం.. రైతుసంఘాల నాయకులతో చండీగఢ్ వేదికగా సోమవారం దాదాపు అర్ధరాత్రి వరకూ చర్చలు కొనసాగించింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండాల నేతృత్వంలోని ప్రభుత్వ బృందం.. రైతుల ప్రతినిధులుగా వచ్చిన ఎస్కేఎం (రాజకీయేతర) నేత జగ్జీత్సింగ్ డల్లేవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్‌సింగ్ పంధేర్ తదితరులతో సమాలోచనలు జరిపింది. డిమాండ్లు ఏంటంటే.. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు భరోసా కల్పించేలా చట్టం చేయడం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, పంటరుణాల మాఫీ, రైతులు-రైతుకూలీలకు పింఛన్లు ఇవ్వడం, మూడు వ్యవసాయ చట్టాలకు (తర్వాత రద్దయ్యాయి) వ్యతిరేకంగా 2020-21లో ఉద్యమించినప్పుడు రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణ వంటి డిమాండ్లపై ఈ భేటీలో విస్తృతంగా చర్చ నడిచింది. వీటిలో.. 2020-21 నాటి కేసుల ఉపసంహరణకు కేంద్ర బృందం అంగీకరించింది. నాటి ఆందోళనల సమయంలో మరణించిన అన్నదాతల కుటుంబాల్లో ఇంకా ఎవరికైనా పరిహారం దక్కకుండా ఉండిఉంటే.. వారికీ పరిహారం అందించేందుకు సమ్మతించింది. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాల్సిందేనని రైతు నాయకులు ప్రధానంగా డిమాండ్ చేశారు. దానిపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఢిల్లీ మార్చ్ యథాతథంగా కొనసాగనున్నట్లు కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం సర్వన్‌సింగ్ పంధేర్ ప్రకటించారు. మరోవైపు రైతు నాయకులతో కేంద్రం ఈ నెల 8న కూడా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఆంక్షల వలయంలో హస్తిన రైతులను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా నివారించేందుకు నగరంలో సోమవారం నుంచి నెల పాటు సెక్షన్-144 విధిస్తూ దిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోడా ఉత్తర్వులు జారీ చేశారు. రైతుల నిరసనను సంఘ విద్రోహశక్తులు తమకు అనుకూలంగా మలుచుకునే ముప్పుందని అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాభద్రతను దృష్టిలో పెట్టుకొని ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. పెళ్లిళ్లు, అంతిమయాత్రలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. #WATCH | Delhi: Security heightened at Delhi borders in view of the march declared by farmers towards the National Capital today. (Visuals from Jharoda border) pic.twitter.com/xcFCYaeoMz — ANI (@ANI) February 13, 2024 -
కేజ్రీవాల్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు
ఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యేలకు ఎర వేసేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ చేసిన ఆరోపణలకు గాను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు శనివారం పోలీసులు నోటీసులిచ్చారు. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను మూడు రోజుల్లో అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా ఐదు గంటలు హైడ్రామా జరిగింది. కేజ్రీవాల్ నివాసంలో అధికారులు తాము నోటీసులు తీసుకుంటామని చెప్పగా పోలీసులు నిరాకరించారు. సీఎంకే ఇస్తామన్నారు. చివరికి కేజ్రీవాల్ బయటకు రాగా నోటీసులిచ్చారు. మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తామిచ్చిన ఐదు నోటీసులకు కేజ్రీవాల్ స్పందించలేదంటూ ఈడీ అధికారులు శనివారం అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దివ్యా మల్హోత్రాకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఈ నెల 7వ తేదీన విచారణ చేపడతామని మేజిస్ట్రేట్ చెప్పారు. -
అప్పు చెల్లించలేదని.. ఏసీపీ కుమారుడి హత్యచేసిన స్నేహితులు
న్యూఢిల్లీ: పోలీస్ ఉన్నతాధికారి కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. ఆర్ధిక వివాదాల నేపథ్యంలో స్నేహితులే అతన్ని కుట్ర పన్ని అంతమొందించారు. పెళ్లికి తీసుకెళ్లి... తిరిగిరాని లోకాలకు పంపించారు. ఢిల్లీ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ యశ్పాల్ సింగ్‌కు 24 ఏళ్ల కుమారుడు లక్ష్య చౌహాన్ ఉన్నాడు.ఇతడు తీస్ హజారీ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. సోమవారం తన స్నేహిలు వికాస్ భరద్వాజ్, అభిషేక్‌లతో కలిసి హర్యానాలోని సోనేపట్‌లో జరిగిన వివాహ వేడుకకు ముగ్గురు హారయ్యారు.. ఆ తర్వాత లక్ష్య చౌహాన్ తిరిగి ఇంటికి రాలేదు. కంగారు పడిన తండ్రి ఎసీపీ అధికారి యశ్పాల్ సింగ్ తన కుమారుడు మిస్సింగ్‌పై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లక్ష్యతో కలిసి కారులో వెళ్లిన స్నేహితుడు అభిషేక్నును అదుపులోకి తీసుకొచిన విచారించగా అసలు విషయం చెప్పాడు. వికాస్ భరద్వాజ్, లక్షయ్, తాను ముగ్గురం కలిసి కారులో సోనెపట్‌కు వెళ్లామని, వివాహం అనంతరం అదేరోజు రాత్రి ఇంటికి బయలుదేరామని చెప్పాడు. చదవండి: ఆర్టీసీ బస్సును ఢీకొన్న కూలీలతో వెళ్తున్న ఆటో.. ముగ్గురు దుర్మరణం మార్గంమధ్యలో పానిపట్ దగ్గర మునక్ కాలువ వద్ద మూత్రవిసర్జన కోసం కారు ఆగినట్లు తెలిపాడు. ఈ సందర్భంగా భరద్వాజ్, తాను కలిసి చౌహాన్‌ను కాలువలోకి తోసినట్లు పోలీసులకు చెప్పాడు. అనంతరం అదే కారులో వికాస్ తనని ఢిల్లీ సమీపంలోని నెరెలా వద్ద విడిచిపెట్టాడని తెలిపాడు. దీంతో కాలువలో గాలించి చౌహాన్ మృతదేహాన్ని వెలికితీశారు. పరారీలో ఉన్న భరద్వాజ్ కోసం పోలీసులు వెతుకున్నారు. నిందితుడు వికాస్ భరద్వాస్ కూడా తీస్ హజారీ కోర్టులోనే క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. వికాస్ గతంలో లక్షయ్కు కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు. తిరిగి ఇవ్వమంటే లక్షయ్ ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. దీంతో కక్ష పెంచుకున్న వికాస్ అతడిని హత్య చేసేందుకు పథకం పన్నాడు. మరో స్నేహితుడు అభిషేక్‌ను ఇందుకు ఉపయోగించుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై ఐపీసీ 302, 201 కింద సెక్షన్లు నమోదు చేశారు. -
Republic Day 2024: కర్తవ్య పథ్‌లో దళ నాయికలు
ఢిల్లీ పోలీస్ మొదటిసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో సంపూర్ణ మహిళా దళాన్ని కవాతు చేయించనుంది. ఇదొక రికార్డు. ఈ దళానికి ఐపిఎస్ శ్వేత కె సుగాధన్ నాయకత్వం వహించనుంది. అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్ దళానికి అసిస్టెంట్ కమాండెంట్ చునౌతి శర్మ నాయకత్వం వహించనుంది. ఇదీ రికార్డే. భారత త్రివిధ దళాలలో, రక్షణ దళాలలో మహిళల భాగస్వామ్యం ప్రతి ఏటా ప్రాధాన్యం సంతరించుకుంటోంది. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో మహిళా శక్తి తన స్థయిర్యాన్ని ప్రదర్శించనుంది. దేశ రక్షణలో, సాయుధ ప్రావీణ్యంలో తాను ఎవరికీ తీసిపోనని చాటి చెప్పనుంది. గత రెండు మూడు సంవత్సరాలుగా రిపబ్లిక్ డే పరేడ్‌లో మహిళలకు దొరుకుతున్న ప్రాధాన్యం ఈ సంవత్సరం కూడా కొనసాగుతోంది. అంతే కాదు గత కొన్నాళ్లుగా త్రివిధ దళాలలో ప్రమోషన్లు, ర్యాంకులు, నియామకాల్లో స్త్రీలకు సంబంధించిన పట్టింపులు సడలింపునకు నోచుకుంటున్నాయి. ప్రాణాంతక విధుల్లో కూడా స్త్రీలు ఆసక్తి ప్రదర్శిస్తే వారిని నియుక్తులను చేయడం కనిపిస్తోంది. ఆ తెగువే ఇప్పుడు రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శితం కానుంది. ఢిల్లీ మహిళా దళం ఈ సంవత్సరం గణతంత్ర వేడుకలలో ఢిల్లీ పోలీసులు సంపూర్ణ మహిళా దళాన్ని కవాతు చేయించాలని, దానికి మరో మహిళా ఆఫీసర్ నాయకత్వం వహించాలని నిర్ణయించడం చరిత్రాత్మకం. ఎప్పుడో 1975లో ఢిల్లీ పోలీసు దళానికి నాటి ఐ.పి.ఎస్. ఆఫీసర్ కిరణ్ బేడీ నాయకత్వం వహించి చరిత్ర సృష్టించింది. మళ్లీ గత సంవత్సరంగాని ఐ.పి.ఎస్. ఆఫీసర్ శ్వేత కె సుగాధన్కు నాయకత్వం వహించే అవకాశం రాలేదు. అయితే ఆ దళంలో ఉన్నది మగవారు. ఈసారి మాత్రం పూర్తి మహిళా దళం పాల్గొననుండటం విశేషం. దీనికి తిరిగి శ్వేత కె సుగాధన్ నాయత్వం వహించనుండటం మరో విశేషం. నార్త్ ఢిల్లీకి అడిషినల్ డీసీపీగా పని చేస్తున్న శ్వేత కె సుగాధన్ది కేరళ. 2015లో బి.టెక్ పూర్తి చేసిన శ్వేత మొదటిసారి కాలేజీ టూర్లో ఢిల్లీని దర్శించింది. 2019లో యు.పి.ఎస్.సి. పరీక్షలు రాయడానికి రెండోసారి ఢిల్లీ వచ్చింది. అదే సంవత్సరం ఐ.పి.ఎస్.కు ఎంపికైన శ్వేత ఇప్పుడు అదే ఢిల్లీలో గణతంత్ర దినోత్సవంలో దళ నాయకత్వం వహించే అవకాశాన్ని పొందింది. శ్వేత దళంలో మొత్తం 194 మంది మహిళా హెడ్ కానిస్టేబుళ్లు ఉంటారు. వీరిలో 80 శాతం మంది ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారు. ఢిల్లీ పోలీసు విభాగంలో ఈశాన్య రాష్ట్రాల మహిళల నియామకానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అందుకే శ్వేత నాయకత్వం వహించే దళంలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మహిళా పోలీసులే ఉంటారు. మరో విశేషం ఏమంటే ఈసారి ఢిల్లీ పోలీస్ బ్యాండ్‌కు రుయాంగియో కిన్సే అనే మహిళా ఆఫీసర్ నాయకత్వం వహించనుంది. 135 మంది పురుష కానిస్టేబుళ్లు ఢిల్లీ పోలీసు గీతాన్ని కవాతులో వినిపిస్తూ ఉంటే వారికి కిన్సే నాయకత్వం వహించనుంది. కోస్ట్ గార్డ్‌కు చునౌతి శర్మ గణతంత్ర వేడుకలలో ఇండియన్ కోస్ట్ గార్డ్ దళానికి అసిస్టెంట్ కమాండెంట్ చునౌతి శర్మ నాయకత్వం వహించనుంది. తీర ప్రాంతాల గస్తీకి, అసాంఘిక కార్యకలాపాల నిరోధానికి నియుక్తమైన ఇండియన్ కోస్ట్ గార్డ్ తన ప్రాతినిధ్య దళంతో పరేడ్‌లో పాల్గొననుంది. దీనికి నాయకత్వం వహించే అవకాశం రావడం పట్ల చునౌతి శర్మ ఆనందం వ్యక్తం చేసింది. ‘గతంలో నేను ఎన్సీసీ కేడెట్‌గా పరేడ్‌లో పాల్గొన్నాను. ఎన్సీసీలో మహిళా కాడెట్ల దళం, పురుష కాడెట్ల దళం విడిగా ఉంటాయి. కాని ఇక్కడ నేను కోస్ట్ గార్డ్ పురుష జవాన్ల దళానికి నాయకత్వం వహించనున్నాను. ఈ కారణానికే కాదు మరోకందుకు కూడా ఈ వేడుకల నాకు ప్రత్యేకమైనవి. ఎందుకంటే నా భర్త శిక్కు దళానికి పరేడ్‌లో నాయకత్వం వహించనున్నాడు. దేశ సేవలో ఇదో విశిష్ట అవకాశం’ అందామె. వీరే కాదు... త్రివిధ దళాల మరిన్ని విభాగాలలోనూ స్త్రీల ప్రాధాన్యం ఈ రిపబ్లిక్ డే వేడుకల్లో పథం తొక్కనుంది. -
ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం?
ఢిల్లీ: దేశ రాజధానిలో భారీ ఉగ్ర కుట్రను స్పెషల్ పోలీసులు భగ్నం చేశారు. ఈ క్రమంలో మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది జావెద్ అహ్మద్ మట్టూ అరెస్ట్ అయ్యాడు. స్పెషల్ సెల్ పోలీసులు గురువారం ఢిల్లీలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. జావెద్ జమ్ము కశ్మీర్లో ఉంటూ హిజ్బుల్ ముజాహిద్దీన్ తరఫున ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడ్డాడు.జావేద్ నుంచి ఒకపిస్టల్, మ్యాగ్జిన్లు .. దొంగలించిన ఓ కారును రికవరీ చేసుకున్నారు ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్రకు పాల్పడేందుకే జావేద్ వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. జావేద్ ప్రస్తుతం ఏ-ఫ్లస్ ఫ్లస్ లిస్ట్‌లో ఉన్న ఉగ్రవాది. పలు ఉగ్రదాడుల్లో అతని ప్రమేయం ఉంది. జావెద్ మట్టూ.. జమ్ము కశ్మీర్లో పలు ఉగ్రదాడులకు పాల్పడ్డాడు. అందుకే భద్రతా బలగాల మోస్ట్ వాంటెడ్ టాప్ టెన్ లిస్ట్‌లో ఉన్నాడు. అతనిపై రూ.10 లక్షల రివార్డు సైతం ఉంది. సోఫోర్ వాసి అయిన మట్టూ పలుమార్లు పాక్‌కు వెళ్లి వచ్చాడు. కిందటి ఏడాది గణతంత్ర దినోత్సవం నాడు.. అతని సోదరుడు సోఫోర్లో మువ్వన్నెల జెండా ఎగరేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది కూడా. -
పార్లమెంట్ ఘటన.. మాజీ డీఎస్పీ కొడుకు అరెస్ట్?
బెంగళూరు/ఢిల్లీ: పార్లమెంట్‌లోకి చొరబాటు.. లోక్‌సభ దాడి ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన ఓ మాజీ పోలీసు అధికారి కొడుకును ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి భాగల్‌కోట్‌లో నివాసంలో అతన్ని ప్రశ్నించిన పోలీసులు.. ఆపై అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు. అతని ల్యాప్‌ట్యాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్నవ్యక్తి పేరు సాయికృష్ణ జగలి. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడని పోలీసులు ప్రకటించారు. పార్లమెంట్లో అలజడి సృష్టించిన మనోరంజన్.. సాయికృష్ణ ఇద్దరూ ఇంజినీరింగ్‌లో బ్యాచ్‌మేట్స్.. రూమ్మేట్స్ కూడా. సాయికృష్ణ తండ్రి డీఎస్పీగా రిటైర్ అయిన అధికారిగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. సాయికృష్ణ అరెస్ట్‌పై ఆమె సోదరి స్పందన స్పందించారు. తన సోదరుడు ఎలాంటి తప్పు చేయలేదని ఆమె అంటున్నారు. ‘‘ఢిల్లీ పోలీసులు మా ఇంటికి వచ్చిన మాట వాస్తవమే. వాళ్లు సాయిని ప్రశ్నించారు. ఎంక్వయిరీకి పూర్తిగా మేం సహకరించాం. సాయికృష్ణ ఎలాంటి తప్పు చేయలేదు. మనోరంజన్, సాయి రూమ్మేట్స్ అనే మాట వాస్తవం. ప్రస్తుతం నా సోదరుడు వర్క్‌ఫ్రమ్ హోంలో ఉన్నాడు’’ అని తెలిపారామె. మరోవైపు ఈ కేసుకు సంబంధించి యూపీకి చెందిన ఓ వ్యక్తిని కూడా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. #WATCH | Police have detained a man from Karnataka's Bagalkote, who was accused D. Manoranjan's roommate during their engineering college days, in connection with the Parliament security breach case pic.twitter.com/ZSZj02C9vK — ANI (@ANI) December 21, 2023 పార్లమెంట్ ఘటనలో బుధవారం వరకు.. ఆరుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మణిపూర్ ఘటన, దేశంలో నిరుద్యోగం, రైతు సమస్యలు.. వీటన్నింటిపై కేంద్రానికి నిరసన తెలిపేందుకు తాము ఈ పని చేశామని నిందితులు అంటున్నారు. అయితే.. అన్నీ కోణాల్లోనూ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఢిల్లీ పోఈసులు అంటున్నారు. లోక్‌సభలో వెల్‌లోకి దూసుకెళ్లే యత్నం చేయడంతో పాటు కలర్ స్మోక్ షెల్స్ తెరిచి అలజడి రేపినందుకుగానూ మనోరంజన్‌తో పాటు సాగర్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. అదే సమయంలో పార్లమెంట్ బయట నినాదాలు చేస్తూ నిరసన చేసిన అమోల్ షిండే, నీలం ఆజాద్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలపై కేసులు నమోదు అయ్యాక దర్యాప్తులో లలిత్ ఝా అనే వ్యక్తిని(ప్రధాన నిందితుడిగా భావిస్తున్నారు), అతనికి సహకరించిన రాజస్థాన్‌వాసి మహేష్ కునావత్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. -
Parliament security breach: వారి ‘ఫేస్బుక్’ వివరాలివ్వండి
న్యూఢిల్లీ: లోక్‌సభలో పొగబెట్టిన ఉదంతంలో అరెస్టయిన నిందితుల ‘ఫేస్బుక్’ ఖాతాల వివరాలు ఇవ్వాలని ‘మెటా’ సంస్థను ఢిల్లీ పోలీసులు కోరారు. నిందితులు సభ్యులుగా ఉన్న, ప్రస్తుతం మనుగడలో లేని ‘భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్’ ఫేస్బుక్ పేజీ వివరాలను అందించాలని ‘మెటా’కు ఢిల్లీ పోలీస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం లేఖ రాసిందని సంబంధితవర్గాలు వెల్లడించాయి. ఈ ఫేస్బుక్ పేజీని నిందితులే క్రియేట్ చేసి ఘటన తర్వాత డిలీట్ చేశారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లకు ‘మెటా’ మాతృసంస్థ. ఈ నేపథ్యంలో నిందితుల మధ్య జరిగిన వాట్సాప్ ఛాటింగ్లనూ తమకు ఇవ్వాలని పోలీసులు ‘మెటా’ను కోరారు. -
పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం ఘటన కేసులో సూత్రధారి అరెస్ట్
-
చిరుత కలకలం: బయటికి రావద్దంటూ పోలీసుల హెచ్చరికలు
న్యూఢిల్లీలోని సైనిక్ ఫాంహౌజ్‌లో చిరుతపులిసంచారం కలకలంరేపింది.శనివారం తెల్లవారుఝామునరాత్రి వాహనదారులకు కంటపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒక వీడియోలో, చిరుతపులి గోడపై నుండి దూకి అడవిలోకి పారిపోయిన దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, రాత్రి బయటకు రావద్దంటూ ప్రకటన జారీ చేశారు. ఫాంహౌజ్‌కు కొద్ది దూరంలో చిరుత సంచారంతో భయాందోళనకు గురైన స్థానికులు ఆటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారి సుబోధ్ కుమార్ సమాచారం ప్రకారం చిరుత గోడ దూకి అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో రెండు కేజ్‌లను ఏర్పాటు చేయడం తోపాటు, ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. 80-90 కిలోల బరువున్న పూర్తిగా పెరిగిన చిరుతపులి అని తెలిపారు. అటవీ, ఢిల్లీ పోలీసులకు చెందిన 40 మంది సిబ్బందిని ఈ ప్రాంతంలో మోహరించినట్లు అధికారి తెలిపారు. అలాగే ఫాంహౌజ్ వైపు ఎవరూ వెళ్లకుండా స్థానికులను అప్రమత్తం చేశామని ట్రాప్ బోనులను ఏర్పాటు చేసి, వాటి సమీపంలో గుమిగూడ వద్దని ప్రజలకు సూచించినట్లు తెలిపారు. ట్రాప్ బోనులకు సమీపంలో గుమిగూడవద్దని ప్రజలకు సూచించినట్లు పోలీసు అధికారి తెలిపారు.. ఇందులో భాగంగానే అందరూ ఇళ్లనుంచి బయటికి రావద్దని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడం గమనార్హం. #WATCH | Announcements are being made in Delhi's Sainik Farm area urging people to stay indoors after a leopard was spotted in the area, earlier today. https://t.co/P4nFo6i3rx pic.twitter.com/HzKnabl7qB — ANI (@ANI) December 2, 2023 -
రష్మిక డీప్ ఫేక్ వీడియో: కీలక పరిణామం, ఇది వాడి పనేనా?
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో ఘటనలో కీలక పరిణామంచోట చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు బిహార్‌కు చెందిన 19 ఏళ్ల యువకుడిని ప్రశ్నించారు. విచారణలో భాగంగా ఆ యువకుడిని ప్రశ్నించినట్టు అధికారులు బుధవారం వెల్లడించారు. నిందిత యువకుడి సోషల్ మీడియా ఖాతానుండే అప్లోడ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తరువాత ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడికి పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే, ఈ కేసులో ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు. మరోవైపు విచారణ సందర్భంగా వేరే ఇన్‌స్టా ఖాతానుంచి ఆ వీడియోను తాను డౌన్లోడ్ చేసుకున్నట్లు యువకుడు చెప్పినప్పటికీ, విచారణ కొనసాగుతుందని సంబంధిత సీనియర్ అధికారులు తెలిపారు. (వర్క్ ఫ్రం హోం, ఆదాయంపై సంచలన సర్వే:ఆ దిగ్గజాలు ఇపుడేమంటాయో?) మొబైల్ ఫోన్‌తో సహా బిహార్‌కు చెందిన యువకుడిని ఐఎఫ్ఎస్ఓ యూనిట్ ముందు హాజరుకావాలని పోలీసులు అదేశించారు. అలాగే FIR నమోదు చేసిన వెంటనే, IFSO యూనిట్ కూడా నిందితుడిని గుర్తించడానికి URL ఇతర వివరాల కోసం సోషల్ మీడియా దిగ్గజం, ఫేస్బుక్ మాతృసంస్థ మెటాకు లేఖ రాసింది. ఇది ఇలా ఉంటే ఈ ఘటనలో నవంబర్ 10న, ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (IFSO)లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 465 (ఫోర్జరీకి శిక్ష) , 469 (పరువుకు భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఫోర్జరీ) , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్లు 66C , 66E కింద ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ యూనిట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. (దీపావళి తరువాత పసిడి పరుగు: డాలర్ ఢమాల్) కాగా నటి రష్మిక డీప్ ఫేక్ వీడియో ఆన్లైన్లో మహిళల సెక్యూరిటీపై ఆందోళన రేపింది. బిగ్‌బీ అమితాబ్ సహా పలువురు నటీ నటులు, ఇతర సెలబ్రిటీలు ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చివరికి కేంద్ర ఐటీ శాఖ కూడా స్పందించి మరోసారి సోషల్ మీడియా సంస్థలు ఐటీ నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని గుర్తు చేసింది. (చాలా బాధ కలిగింది, ప్రతీదీ నిజం కాదు..ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు!) -
హీరో మోటో ఎండీ, తదితరులపై ఫోర్జరీ కేసు:షేరు ఢమాల్
Delhi Police file FIR against Hero MotoCorp chairman Pawan Munjal ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్‌కు మరోసారి భారీ షాక్ గిలింది. మోసం, ఫోర్జరీ , నేరపూరిత కుట్ర ఆరోపణలతో ఢిల్లీ కోర్టు ఆదేశాలపై హీరో మోటో ఎండీ, సహా పలువురి సీనియర్ అధికారులపై కేసు నమోదైంది. నకిలీ బిల్లులు తయారు చేసి, ఆదాయపు పన్ను శాఖలో డిపాజిట్ చేసి, సేవా పన్నులో లబ్ధి పొందారని పోలీసులు ఆరోపించారు. దీంతో స్టాక్ 3 శాతం భారీ పతనాన్ని నమోదు చేసింది. ఈ కేసు ఎఫ్ఐఆర్ 2010కి ముందు నాటి పాత విషయానికి సంబంధించినదని, ఇతర దర్యాప్తులు , పన్ను విచారణలకు ఎలాంటి సంబంధం లేదని కంపెనీ తెలిపింది. బిలియనీర్ , కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజాల్, సీఈవో పవన్ కాంత్, ముగ్గురిపై ఫోర్టరీ అరోపణలపై కేసు నమోదైంది. కాగా పవన్ ముంజాల్సహా మరికొందరికీలక అధికారులపై మనీలాండరింగ్ ఆరోపణలు దాఖలైనాయి. ఇందులో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) 2023 ఆగస్టు లో ముంజాల్, ఇతరులపై సోదాలు నిర్వహించింది. ప్రకటించని విదేశీ కరెన్సీని కలిగి ఉన్నారనే ఆరోపణలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) ఫిర్యాదు చేసింది. దీంతో ముంజాల్ నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. వ్యక్తిగత అవసరాల కోసం కోసం రూ.40 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ (నిషేధిత వస్తువు)ని అక్రమంగా ఎగుమతి చేసినట్టు ఈడీ ఆరోపించింది. దీనికి సంబంధించిన తనిఖీల్లో సెర్చ్ 25 కోట్ల రూపాయల విలువైన విదేశీ కరెన్సీ, నగదు, బంగారం ,వజ్రాభరణాలు (విదేశీ కరెన్సీ, బంగారంతో సహా) స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. (ఇజ్రాయెల్-గాజా సంక్షోభం: ‘షెకెల్’ కోసం సెంట్రల్ బ్యాంకు కీలక నిర్ణయం) ఆగస్ట్ 20, 2018న ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ముంజాల్‌తో పాటు ఎగ్జిక్యూటివ్ లండన్‌కు బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో భద్రతా తనిఖీల సమయంలో అతని హ్యాండ్ బ్యాగేజీలో రూ.81 లక్షల కంటే ఎక్కువ విలువైన విదేశీ కరెన్సీని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ స్వాధీనం చేసుకుంది. 800 కోట్లకు పైగా అక్రమ వ్యాపార వ్యయాలు, భూమి కొనుగోలుకు ఉపయోగించిన రూ. 60 కోట్ల విలువైన "ఖాతాలో చూపని" అక్రమ ఆస్తులను సోదాల్లో కనుగొన్నట్లు ఐటి అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ గత ఏడాది మార్చిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. (స్పోర్ట్స్ ఈవెంట్లో మెరిసిన రణబీర్, అలియా...మరో విశేషమేమంటే..!) -
‘న్యూస్‌క్లిక్’లో పోలీసుల సోదాలు
న్యూఢిల్లీ: చైనా అనుకూల సమాచారాన్ని భారత్‌లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు భారీ స్థాయిలో నగదును స్వీకరించిందన్న ఆరోపణలపై ఆన్లైన్ న్యూస్‌పోర్టల్ ‘న్యూస్‌క్లిక్’పై ఢిల్లీ పోలీసులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. సంస్థకు సంబంధించిన ఆఫీసులతోపాటు అందులో పనిచేసే జర్నలిస్టులు, సిబ్బందికి సంబంధించిన ఇళ్లలోనూ పోలీసులు విస్తృతస్థాయిలో తనిఖీలు చేపట్టారు. న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకులు, ఎడిటర్–ఇన్–చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థా, హెచ్ఆర్ చీఫ్ అమిత్ చక్రవర్తిని మొదట ప్రశ్నించిన పోలీసులు ఆ తర్వాత ఇద్దరినీ అరెస్ట్‌చేశారు. 100 ప్రాంతాల్లో ఏకంగా 500 మంది ఢిల్లీ పోలీసులు ఒకేసమయంలో దాడిచేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ముంబైలలో ఈ సోదాలు జరిగాయి. సోదాలు చేయాల్సిన వ్యక్తులను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించారు. ఏ కేటగిరీలో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి చెందిన ఢిల్లీలోని నివాసంలోనూ సోదాలు జరిగాయి. ఆయనకు సహాయకునిగా ఉండే శ్రీనారాయణ్ కుమారుడు సుమిత్ ఇదే న్యూస్‌క్లిక్‌లో పనిచేస్తుండటంతో ఏచూరీ ఇంట్లోనూ పోలీసు తనిఖీలు కొనసాగాయి. దీంతో ఏచూరి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీలోని సంస్థ ముఖ్య కార్యాలయంలోని వారిని ప్రశ్నించాక ఆ ఆఫీస్‌కు పోలీసులు సీలువేశారు. విదేశీ ప్రయాణాలు, పౌరసత్వ(సవరణ) చట్టంపై షాహీన్‌బాగ్ వద్ద చెలరేగిన ఆందోళనలు, రైతుల ఉద్యమాలు తదితరాలపై జర్నలిస్టులను 25 అంశాలపై ప్రశ్నించామని పోలీసులు వెల్లడించారు. న్యూస్‌క్లిక్‌కు నిధులు ఎలా వస్తున్నాయనే కోణంలో గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యూస్‌క్లిక్ కార్యాలయాల్లో సోదాలు చేయడం తెల్సిందే. ఈ విషయంలో ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు అందించిన సమాచారంతోనే మంగళవారం ఢిల్లీ పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం, నేరమయ కుట్ర సెక్షన్ల కింద కొత్తగా కేసు నమోదుచేసి దాడులు చేశారు. ఈ సందర్భంగా పలువురి నుంచి ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, హార్డ్ డిస్‌్కలు, ఫ్లాష్ డ్రైవ్‌లను స్వాదీనం చేసుకున్నారు. ఆగస్ట్ 17న అత్యంత కఠిన ఉగ్రవ్యతిరేక చట్టం, చట్టవ్యతిరేక కార్యకలాపాల(నిరోధక )చట్టంకింద నమోదైన కేసు ఆధారంగానే కొత్తను నమోదుచేసి దర్యాప్తు వేగవంతం చేశారు. చైనాతో సంబంధం ఉన్న కొన్ని సంస్థల నుంచి గత మూడేళ్లకాలంలో రూ.38.05 కోట్ల నగదు న్యూస్‌క్లిక్ పోర్టల్‌కు ముట్టిందని ఈడీ ఆరోపిస్తోంది. ఈ నగదులో కొంత మొత్తం పాత్రికేయులు గౌతమ్ నవ్లఖా, తీస్తా సీతల్వాడ్లకు చేరినట్లు ఆరోపిస్తోంది. విపక్షాల తీవ్ర విమర్శలు మీడియా స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపుతున్నారంటూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, సమాజ్‌వాదీ సహా పలు విపక్ష పార్టీలు ప్రభుత్వ తీరును తూర్పారబట్టాయి. ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాసహా పలు మీడియా సంఘాలు పోలీసు దాడులను ఖండించాయి. మోదీ సర్కార్‌ను విమర్శించే పాత్రికేయులపై ప్రభుత్వం కత్తిగట్టిందని ఆక్షేపించాయి. -
చైనా నుంచి నిధులు.. ఢిల్లీలో న్యూస్‌క్లిక్ జర్నలిస్టుల నివాసాల్లో సోదాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పలువురు జర్నలిస్టుల నివాసాల్లో ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. ప్రముఖ మీడియా పోర్టల్ ‘న్యూస్‌క్లిక్’కు సంబంధించిన జర్నలిస్టులు, ఉద్యోగుల ఇళ్లలో మంగళవారం ఉదయం నుంచి ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం తనిఖీలు చేపట్టింది. ఏకకాలంలో ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌లోని 100 చోట్ల ఆకస్మిక దాడులు నిర్వహిస్తోంది. న్యూస్‌క్లిక్ సంస్థకు చైనా నుంచి అక్రమంగా నిధులు అందాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుపుతోంది. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సీజ్.. ఈ దాడుల్లో జర్నలిస్టులు, ఉగ్యోగులకు సంబంధించిన ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు సహా ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అందించిన సమాచారం ఆధారంగా ఢిల్లీ పోలీసులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు చీఫ్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థతో సహా తమంది జర్నలిస్టులను లోధీ రోడ్‌లోని స్పెషల్ సెల్ కార్యాలయానికి తీసుకువచ్చి విచారిస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని అధికారులు తెలిపారు. భారీగా విదేశీ నిధులు ఇక న్యూస్ క్లిక్ సంస్థ మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే రూ. 38.05 కోట్ల విదేశీ నిధులను మోసగించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ద్వారా రూ. 9.59 కోట్లు, సేవల ఎగుమతి ద్వారా రూ. 28.46 కోట్లు విదేశీ రెమిటెన్స్ వచ్చినట్లు గుర్తించినట్లు తేలింది. అలా వచ్చిన నిధులను గౌతమ్ నవ్లాఖా, హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్ సహా పలువురు వివాదాస్పద జర్నలిస్టులకు పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సొమ్మును దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించిందని ఈడీ ఆరోపించింది. సీతారాం ఏచూరి నివాసంలోనూ సోదాలు.. న్యూస్‌క్లిక్‌కు సంబంధించి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అధికారిక నివాసంలో కూడా ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించారు. సీపీఎం ఉద్యోగి శ్రీనారాయణ్ ఇంటిపై తనిఖీలు చేపట్టింది. కాగా నారాయణ్ కొడుకు న్యూస్ క్లిక్‌లో పనిచేస్తున్నాడు. అయితే సీపీఎం అధికార నివాసాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేరిట కేటాయించారు. తన నివాసంలో జరిగిన దాడులపై ఏచూరి స్పందించారు. చదవండి: 'సనాతన ధర్మం మాత్రమే మతం.. మిగిలినవన్నీ..' మీడియా నోరు నొక్కేందుకే..? పోలీసులు తన నివాసానికి వచ్చారని, అక్కడ తనతోపాటు నివసిస్తున్న సహచరుడి కుమారుడు న్యూస్‌క్లిక్‌లో పనిచేస్తున్నాడని తెలిపారు. అతడిని విచారించేందుకు పోలీసులు వచ్చినట్లు చెప్పారు. అతని ల్యాప్‌టాప్, ఫోన్‌ను తీసుకున్నారని అయితే పోలీసులు ఏ కేసులో ఈ దర్యాప్తు చేస్తున్నారో తనకు తెలియదని పేర్కొన్నారు. ఒకవేళ ఇది మీడియా నోరును నొక్కేందుకు జరుగుతున్న ప్రయత్నమైతే.. దీని వెనకున్న కారణాన్ని దేశమంతా తెలుసుకోవాలని అన్నారు. తప్పు చేస్తే దర్యాప్తు చేస్తారు: కేంద్రమంత్రి ఢిల్లీ పోలీసుల సోదాలపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ.. దీనిని సమర్థించాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే దర్యాప్తు సంస్థలు నిర్ణీత మార్గదర్శకాల ప్రకారం విచారించే స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. మరోవైపు న్యూస్‌క్లిక్‌తో సంబంధం ఉన్న జర్నలిస్టులు, ఉద్యోగుల ఇళ్లపై దాడులు చేపట్టడంపై ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చదవండి: ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం.. 24 గంటల్లో 24 మంది మృతి చైనా నుంచి నిధులు న్యూస్‌క్లిక్‌కు చైనా నుంచి నిధులు అందుతున్నట్టుగా ఇటీవల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో కూడా ఈ మీడియా సంస్థకు చెందిన కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరిపింది. ఈ క్రమంలో న్యూస్ క్లిక్ సంస్థకు చెందిన కొంతమంది ఉద్యోగులు చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు అనుమానిస్తూ.. చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం(UAPA) కింద సదరు సంస్థపై ఆగస్టు 17న కేసు నమోదైంది. దీని ఆధారంగానే పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. కాగా , చైనా అనుకూల ప్రచారాన్ని వ్యాప్తి చేయడానికి అమెరికన్ బిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్ నుంచి నిధులను పొందిన గ్లోబల్ నెట్‌వర్క్‌లో ఈ సంస్థ కూడా భాగమని న్యూయార్క్ టైమ్స్ గతంలో పేర్కొంది. ఈ ఆరోపణలు న్యూస్‌క్లిక్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పరిశోధనలు, చర్యలకు మరింత ఊతమిచ్చాయి. -
ఢిల్లీలో మోస్ట్ వాంటెడ్ ఐసిస్ ఉగ్రవాది అరెస్ట్
న్యూడిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అనుమానిత ఐఎస్ఐఎస్ ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐసిస్ టెర్రరిస్ట్ మహమ్మద్ షానవాజ్ అలియాస్ సైఫీ ఉజామాతోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం సోమవారం అరెస్టు చేసింది. కాగా సైఫీ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లిస్ట్‌లో ఉన్నారు. అతని వివరాలు వెల్లడించిన వారికి మూడు లక్షల రివార్డు కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అనుమానిత ఉగ్రవాదులు దేశ రాజధానిలో ఉగ్రదాడికి ప్లాన్ చేసినట్లు పక్కా సమాచారం రావడంతో ఇతడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన షానవాజ్ పూణె ఐసిస్ మాడ్యుల్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. ఇతడు ఢిల్లీకి చెందిన వాడు కాగా పూణె పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. ఢిల్లీలో తలదాచుకున్నట్లు తెలియడంతో చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఐఈడీ తయారీకి ఉపయోగించే ద్రవ రసాయనంతో సహా పలు పేలుడు సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐసిస్ అనుమానితులుగా అరెస్టు చేసిన ఇద్దరు వ్యక్తులతో కలిసి షానవాజ్‌ను ప్రస్తతం పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో ఐసిస్ ఉగ్రవాదుల గురించి మరిన్ని విషయాలు తెలియనున్నాయి. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు, ఎన్ఐఏ అధికారులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. కాగా దేశంలోని అనేక టెర్రర్ మాడ్యూల్స్‌ను అణిచివేసేందుకు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఎన్ఐఏ అధికారులతో కలిసి పనిచేస్తోంది. షానవాజ్‌తో పాటు మరో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులైన రిజ్వాన్ అబ్దుల్ హాజీ అలీ, అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలియాస్ డయాపర్వాలా, తల్హా లియాకత్ ఖాన్ గురించి సమాచారం ఇస్తే ఒక్కొక్కరికి రూ.3 లక్షల నగదు బహుమతిని ఇటీవలె ఎన్ఐఏ ప్రకటించింది. మహారాష్ట్రలోని పూణెలో ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్కు చెందిన మాడ్యూల్తో ఈ నలుగురికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. చదవండి: భారత్‌లో అఫ్గాన్ ఎంబసీ మూసివేత -
'ప్రతి అవకాశంలో మహిళా రెజ్లర్లను వేధించాడు'
ఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అవకాశం దొరికినప్పుడల్లా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించారని కోర్టుకు తెలిపారు ఢిల్లీ పోలీసులు. ఆయనపై అభియోగాలు మోపడానికి తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. తజకిస్థాన్‌లో ఈవెంట్ సందర్భంగా ఓ రెజ్లర్‌ను గదిలోకి పిలిచి హగ్ చేసుకునేందుకు ప్రయత్నించారని కోర్టుకు పోలీసులు తెలిపారు. బాధితురాలు నిరసన తెలిపితే.. తాను తండ్రిలాగే దగ్గరికి తీసుకున్నట్లు బ్రిజ్ భూషణ్ చెప్పారని న్యాయమూర్తికి పోలీసులు చెప్పారు. అనుమతి లేకుండా తన శరీర భాగాలను దురుద్దేశంతో తాకాడని మరో మహిళా రెజ్లర్ పేర్కొన్న విషయాన్ని కూడా ధర్మాసనానికి వెల్లడించారు. ఇవన్నీ బ్రిజ్ భూషణ్ దురుద్దేశంతోనే చేశాడని పోలీసులు తెలిపారు. మహిళా రెజ్లర్ల ఆరోపణలను పరిశీలించడానికి బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ నేతృత్వంలో కమిటీ కూడా బ్రిజ్ భూషణ్‌ను నిర్దేషిగా పేర్కొనలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణల దర్యాప్తుకు కేంద్రం ఓ కమిటీని నియమించింది. అందుకు సంబంధించిన రిపోర్టును బయటకు వెల్లడించలేదు. కానీ ఓ కాపీని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులకు అందించారు. మహిళ రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో గరిష్ఠంగా మూడేళ్లు ఉంటుంది. బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరుగురు మహిళా రెజ్లర్లు జూన్ 15న కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును ఢిల్లీ కోర్టు విచారణ చేపడుతోంది. తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది. ఇదీ చదవండి: రమేశ్ బిధూరీపై సస్పెన్షన్ వేటు వేయాలి -
450 మంది పోలీసులకు ప్రధాని విందు
ఢిల్లీ: భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సమావేశం G20 Summit.. సక్సెస్‌లో కీలకంగా వ్యవహరించిన ఢిల్లీ పోలీసులకు ప్రధాని నరేంద్ర మోదీ విందు ఇవ్వనున్నారు. ఈ వారంలోనే.. అదీ జీ20 సమ్మిట్ జరిగిన భారత్ మండపంలోనే ఈ విందు కార్యక్రమం ఉండనుందని సమాచారం. ఈ మేరకు కానిస్టేబుల్స్ నుంచి ఇన్స్పెక్టర్ల దాకా.. సదస్సు సమయంలో విధి నిర్వహణ అద్భుతంగా నిర్వహించిన సిబ్బంది జాబితాను ఢిల్లీ కమిషనర్ సంజయ్ అరోరా సిద్ధం చేస్తున్నారు. వాళ్లతో కలిసి అరోరా, ప్రధాని మోదీ ఇచ్చే డిన్నర్లో పాల్గొంటారు. దాదాపు 40 దేశాల అధినేతలు పాల్గొన్న ఈ కీలక సదస్సును అత్యంత పటిష్టమైన భద్రత నడుమ విజయవంతంగా నిర్వహించింది భారత్. హైలెవల్ సెక్యూరిటీ నడుమ ఉండే ప్రముఖుల సంరక్షణ అనే అత్యంత కష్టతరమైన బాధ్యతను.. మరీ ముఖ్యంగా ఢిల్లీ పోలీసులు సమర్థవంతంగా నిర్వహించడంపై అభినందనలు కురుస్తున్నాయి. ప్రధాని మోదీ ఇలా క్షేత్రస్థాయి సిబ్బంది కష్టాన్ని గుర్తించడం కొత్తేం కాదు. గతంలో కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంలో.. నిర్మాణ కూలీలను ఆయన సత్కరించారు. -
జీ-20 సమ్మిట్: చెహ్లం ఊరేగింపునకు మతం రంగు..
ఢిల్లీ: జీ-20 వేడుకలకు ముందు జరిగిన చెహ్లం ఊరేగింపునకు మతం రంగు పూస్తున్న సోషల్ మీడియా పోస్టులపై ఢిల్లీ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఆ పుకార్లు అవాస్తవాలని స్పష్టం చేశారు. జీ-20 వేడుకలు శనివారం ప్రారంభం కానుండగా.. బుధవారం ఢిల్లీలో చెహ్లం ఊరేగింపు జరిగింది. దీనిపై ప్రపంచస్థాయి వేడుకలకు ముందు ఏదైనా మతపరమైన ఆందోళనలకు ప్లాన్ చేశారా..? అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. వీటిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెహ్లం ఊరేగింపులో కొన్ని మతపరమైన నినాదాలు వినిపించినట్లు, అభ్యంతకరమైన భాషను వాడినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో జీ-20 వేడుకలకు ముందు ఏదైనా మతపరమైన ఆందోళనలకు ప్లాన్ చేస్తున్నారా..? అంటూ ప్రచారం కల్పిస్తూ పోస్టులు వెలువడ్డాయి. FALSE NEWS: Some social media handles are wrongly projecting videos of Chehlum procession,as communal protest before G-20 Summit.The Chehlum procession is traditional one and carried out with due permissions from the law enforcing agencies. Please do not Spread rumors.#DPUpdates — Delhi Police (@DelhiPolice) September 7, 2023 దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఢిల్లీ పోలీసులు..' అవన్నీ అవాస్తవాలు. చెహ్లం ఊరేగింపు, జీ-20 ముందు మతపరమైన ఊరేగింపు అంటూ కొందరు సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారు. చెహ్లం వేడుక సాంప్రదాయంగా, అనుమతుల మేరకు జరుపుకుంటున్నారు. తప్పుడు ప్రచారం చేయవద్దు.' అని పేర్కొన్నారు. చెహ్లం పండగను ఢిల్లీలో షియా ముస్లింలు బుధవారం నిర్వహించారు. మొహర్రం పండుగ పూర్తి అయిన 40వ నాడు ఈ ఊరేగింపును చేపడతారు. ముహమ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ బలిదానానికి జ్ఞాపకార్థంగా ఈ వేడుక జరుగుతుంది. ఈ పండగ సందర్భంగా ఢిల్లీ పోలీసులు అప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జీ20 సదస్సు శని, ఆదివారాల్లో ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో జరగనుంది. ఈరోజు రాత్రి 9 గంటలకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయి. వాహనాలను ఆదివారం అర్ధరాత్రి వరకు ఢిల్లీలోకి అనుమతించరు. శనివారం ఉదయం 5 గంటల నుంచి ట్యాక్సీలు, ఆటోలకు ఇవే ఆంక్షలు వర్తిస్తాయి. ఇదీ చదవండి: జీ20: ఎందుకు.. ఏమిటి! -
కేంద్ర పోలీస్ విభాగాల్లో 1.14 లక్షల ఖాళీలు
న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఢిల్లీ పోలీసు వంటి కేంద్ర పోలీస్ విభాగాల్లో 1,14,245 ఉద్యోగాలు ఇంకా భర్తీ చేయాల్సి ఉందని కేంద్రప్రభుత్వం బుధవారం వెల్లడించింది. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా బుధవారం ఈ వివరాలు తెలిపారు. ఈ ఏడాది 31,879 పోస్టులకు ప్రకటనలు జారీచేయగా ఇప్పటిదాకా 1,126 పోస్టులే భర్తీ అయ్యాయి. కేంద్ర హోం శాఖ, దాని విభాగాలైన బీఎస్ఎఫ్, సశస్త్ర సీమా బల్, సీఆర్పీఎఫ్, ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్, అస్సాం రైఫిల్స్, సీఐఎస్ఎఫ్, కేంద్ర పోలీసు సంస్థలు, ఢిల్లీ పోలీస్ ఇలా అన్ని విభాగాల్లో మొత్తంగా 1,14,245 ఖాళీలు ఉన్నట్లు మంత్రి తెలిపారు. వీటిలో షెడ్యూల్ కులాల పోస్టులు 16,356 ఉన్నాయి. షెడ్యూల్ తెగలకు 8,759, ఇతర వెనుకబడిన వర్గాలకు 21,974, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 7,394 పోస్టులు, మిగతా 59వేలకుపైగా జనరల్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి. -
ఘోర ప్రమాదం.. కారును ఢీకొట్టిన ట్రక్కు.. సీఐ దుర్మరణం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కారును ట్రక్కు ఢీకొట్టిన దుర్ఘఘనలో ఓ పోలీస్ ఇనస్పెక్టర్ మృత్యువాతపడ్డాడు. మదిపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం వెలుగుచూసింది. వివరాలు.. ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన సీఐ జగ్బీర్ సింగ్ ప్రయాణిస్తున్న కారు సాంకేతిక సమస్యతో రోహ్తక్ రోడ్డుపై ఆగిపోయింది. దీంతో కారు దిగి ఆయన పక్కన నిల్చున్నాడు. అదే సమయంలో వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ ట్రక్కు కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జగ్బీర్ సింగ్ అక్కడికక్కడే మరణించాడు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి నిలిపి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక కావాలనే హత్య కుట్రతో జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కాశ్మీర్లో సెలవుపై వచ్చిన భారత జవాను అదృశ్యం Delhi | A Delhi Police inspector died after his car was hit by a truck from behind on Rohtak Road, near Madipur metro station. The car had stopped due to some mechanical problem and the deceased was standing outside when his car was hit by the truck. The deceased has been… pic.twitter.com/qDE5aLHP4x — ANI (@ANI) July 30, 2023 -
'చుప్'.. మైక్ విరగ్గొట్టి రిపోర్టర్‌తో దురుసు ప్రవర్తన
మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(WFI) మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ తన చర్యతో మరోసారి వార్తల్లోకెక్కారు. ప్రశ్న అడిగిన పాపానికి ఒక మహిళా జర్నలిస్టుతో దురుసుగా ప్రవర్తించడమే గాక మైక్‌ను విరగ్గొట్టడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్రిజ్‌భూషణ్ చర్యపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విషయంలోకి వెళితే.. ప్రముఖ న్యూస్ చానెల్‌కు చెందిన రిపోర్టర్.. ''రెజ్లర్లకు లైంగిక వేధింపులపై ఢిల్లీ పోలీసులు మీపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు.. నేరం రుజువైతే ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నారా'' అంటూ ప్రశ్నించింది. రిపోర్టర్ ప్రశ్నపై ఆగ్రహం వ్యక్తం చేసిన బ్రిజ్‌భూషణ్.. ''నేనెందుకు రాజీనామా చేస్తాను.. నా రాజీనామా గురించి ఎందుకడుగుతున్నారు''' అంటూ అసహనం వ్యక్తం చేశారు. ''అనంతరం మీపై చార్జ్‌షీట్ లు ఫైల్ అయ్యాయి.. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది'' అని అడగ్గా.. బ్రిజ్‌భూషణ్ రిపోర్టర్‌వైపు ఉరిమి చూస్తూ ''చుప్(Shut Up)'' అంటూ కారు ఎక్కడానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో రిపోర్టర్ తన ప్రశ్నకు జవాబు చెప్పాలంటూ మైక్‌ను కారు డోరులో పెట్టింది. దీంతో కోపంతో మైక్‌పై నుంచే డోర్‌ను గట్టిగా వేశాడు. దీంతో రిపోర్టర్ చేతికి గాయమవ్వగా.. మైక్ విరిగిపోయింది. అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఇదంతా వీడియో తీసి ట్విటర్లో షేర్ చేయగా ట్రెండింగ్‌గా మారింది. #LIVE कैमरे पर एक महिला पत्रकार से पहलवानों के साथ उत्पीड़न का आरोपी भाजपाई सांसद धमका रहा है, उनका माइक तोड़ रहा है, क्या महिला बाल विकास मंत्री @smritiirani बता सकती है ये किसके शब्द है? किसके संस्कार है? pic.twitter.com/689KVkrBRg — Srinivas BV (@srinivasiyc) July 11, 2023 बृजभूषण का ऑन कैमरा जब एक महिला पत्रकार के साथ ऐसा व्यवहार है तो ऑफ कैमरा आप ख़ुद समझ लें. #BrijBhushanSharanSingh pic.twitter.com/UdvtUhTZSH — Vividha (@VividhaOfficial) July 11, 2023 ఇక మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ కేసులో ఢిల్లీ పోలీసులు ఢిల్లీ పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. బ్రిజ్ భూషణ్ పై ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో సుమారు 108 మంది సాక్షులను విచారించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకూ నమోదైన కేసుల్లో ఆయన శిక్షార్హుడేనని ఢిల్లీ పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జ్‌షీట్ (chargesheet)లో తెలిపారు. నేరం రుజువైతే ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. కాగా ఢిల్లీ కోర్టు గత శుక్రవారం బ్రిజ్ భూషణ్ కు సమన్లు జారీ చేసింది. కేసును కొనసాగించేందుకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొంది. జులై 18న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే మహిళా రెజ్లర్లు తనపై చేసిన లైంగిక వేధింపు ఆరోపణలను బ్రిజ్ భూషణ్ పలుమార్లు ఖండించారు. చదవండి: Ashes 2023: 'అరె శాండ్‌పేపర్ మరిచిపోయా'.. ఆసీస్ ప్రధానికి రిషి సునాక్ కౌంటర్ Asia Cup 2023: 'జై షా పాకిస్తాన్ వెళ్లడమేంటి?.. దాయాదుల మ్యాచ్ అక్కడే' -
బ్రిజ్‌భూషణ్‌పై చార్జ్‌షీట్ దాఖలు
మైనర్‌ను లైంగికంగా వేధించినట్లు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్(Brij Bhushan)పై రెజ్లర్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆరోపణలపై విచారణ చేపట్టిన ఢిల్లీ పోలీసులు తమ రిపోర్టును రిలీజ్ చేశారు. మైనర్‌ను బ్రిజ్ భూషణ్ వేధించినట్లు ఆధారాలు లేవని పోలీసులు తమ చార్జ్‌షీట్‌లో తెలిపారు. బ్రిజ్‌పై మైనర్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని ఢిల్లీ పోలీసులు తమ రిపోర్టులో కోరారు. కాగా లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ పోలీసులు దాదాపు 1000 పేజీల చార్జ్‌షీట్ రిపోర్టును తయారు చేశారు. కేవలం మైనర్ కేసు విషయంలో సుమారు 500 పేజీల నివేదికను పొందుపరిచారు. దాంట్లో ఆ కేసును రద్దు చేయాలని పోలీసులు సూచించారు.విచారణలో తమకు ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఇవాళ పోలీసులు అధికారులు రిపోర్టును సమర్పించి 1500 పేజీలతో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కాగా పోలీసులు సమర్పించిన చార్జ్‌షీట్‌పై తదుపరి విచారణను జూన్ 22కు వాయిదా వేసింది. ఏప్రిల్‌లో పోక్సో చట్టం కింద బ్రిజ్ భూషణ్‌పై ఓ మైనర్ అథ్లెట్ కేసు దాఖలు చేసింది. బ్రిజ్‌పై ఇచ్చిన స్టేట్మెంట్ను ఆ మైనర్ వెనక్కి తీసుకున్నట్లు పోలీసుల రిపోర్టు ద్వారా తెలుస్తోంది. తనను ఎంపిక చేయకపోవడం పట్ల ఆగ్రహంతో డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌పై కేసును ఫైల్ చేసినట్లు ఆ మైనర్ అథ్లెట్ వెల్లడించింది. చాలా కఠినంగా టోర్నీల కోసం వర్క్ చేశానని, కానీ తనను సెలెక్ట్ చేయలేదని, దాని వల్ల డిప్రెషన్లోకి వెళ్లిపోయానని, ఆ కోపంతో బ్రిజ్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టినట్లు ఆ మైనర్ రెజ్లర్ పేర్కొన్నది. మైనర్ కేసు విషయంలో సీఆర్పీసీ సెక్షన్ 173 కింద రిపోర్టును రూపొందించినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. బాధిత మైనర్ తో పాటు ఆమె తండ్రి నుంచి కూడా వాంగ్మూలం తీసుకున్నట్లు తెలిపారు. జూలై 4వ తేదీన మైనర్ కేసుపై కోర్టు విచారణ జరగనున్నది. చదవండి: 'టైటిల్ గెలిచిన మత్తులో ఎక్కాల్సిన ఫ్లైట్ మిస్సయ్యాం' జూలై 3 నుంచి వింబుల్డన్.. ప్రైజ్‌మనీ భారీగా పెంపు -
రాతపూర్వక హామీ.. ఓ మెట్టుదిగిన రెజ్లర్లు
సాక్షి, ఢిల్లీ: రెజ్లర్ల నిరసనలో.. కేంద్రంతో రెజ్లర్ల చర్చల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను ఎలాగైనా ఆ సీటు నుంచి దించే ఉద్దేశంతో నిరసనలు కొనసాగిస్తున్న రెజ్లర్లు.. కేంద్రం నుంచి లభించిన హామీతో ఓ మెట్టు దిగారు. జూన్ 15వ తేదీ దాకా ఆందోళనలను చేపట్టబోమని, అప్పటివరకు తమ నిరసన ప్రదర్శనలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కేంద్రం నుంచి రాతపూర్వక హామీ లభించినందువల్లే తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు బజరంగ్ పూనియా మీడియాకు వెల్లడించారు. బుధవారం కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో ఐదు గంటల పాటు రెజ్లర్లు భేటీ అయ్యారు. బ్రిజ్‌పై వచ్చిన ఆరోపణలపై జూన్ 15వ తేదీలోపు విచారణ పూర్తి చేయిస్తామని ఈ సందర్భంగా ఆయన రెజ్లర్లకు స్పష్టమైన రాతపూర్వక హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బజరంగ్ పూనియా బయటకు వచ్చాక మీడియాకు తెలిపాడు. మంత్రి చెప్పిన తేదీ వరకు నిరసనలను ఆపేస్తామని, అప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించకపోతే మాత్రం నిరసనలను ఉదృతం చేస్తామని పూనియా మీడియా ద్వారా తెలిపాడు. అలాగే కేంద్రంతో రెజ్లర్లు ఓ ఒప్పందానికి వచ్చారని, మైనర్ బాధితురాలు కూడా తన ఫిర్యాదును వెనక్కి తీసుకుందంటూ వస్తున్న కథనాలను పూనియా తోసిపుచ్చాడు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామే తప్ప.. వెనక్కి తగ్గబోమని ప్రకటించాడు. మరోవైపు రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికలను స్వతంత్రగా నిర్వహించాలని, బ్రిజ్ కుటుంబ సభ్యులెవరూ అందులో పాల్గొనకుండా చూడాలని కేంద్రాన్ని రెజ్లర్లు కోరినట్లు తెలుస్తోంది. వీటితో పాటు తమపై పెట్టిన కేసులను సైతం వెనక్కి తీసుకోవాలని మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను వాళ్లు కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మహిళా రెజ్లర్ల భద్రతను ప్రధానాంశంగా పరిగణిస్తామని, అలాగే.. వాళ్లపై ఎఫ్ఐఆర్లను వెనక్కి తీసుకుంటామని మంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం చర్చల సారాంశాన్ని మీడియాకు తెలిపారు. అయితే.. బ్రిజ్ అరెస్ట్‌పై మాత్రం ఇరువర్గాలు స్పందించకపోవడం గమనార్హం. ఇక ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఒక మైనర్‌తో పాటు ఆరుగురు రెజ్లర్ల ఫిర్యాదులు కూడా అక్కడే నమోదుకాగా.. ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజా పరిణామాలతో జూన్ 15వ తేదీలోపు ఆ దర్యాప్తు పూర్తి చేసి.. నివేదిక సమర్పించాలని కేంద్రం, ఢిల్లీ పోలీసులపై ఒత్తిడి తెచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. -
రెజ్లర్ల ఆందోళన.. బ్రిజ్‌భూషణ్ ఇంటికి పోలీసులు
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నివాసానికి పోలీసులు వెళ్లడం ఆసక్తి కలిగించింది. ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో ఉన్న ఆయన నివాసంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఆ ఇంట్లో ఉన్న సుమారు 12 మంది నుంచి వాంగ్మూలాన్ని సేకరించారు. ఆ స్టేట్మెంట్లను రికార్డు చేశారు. వాంగ్మూలం ఇచ్చిన వారి పేర్లను, అడ్రస్, ఐడీ కార్డులను తీసుకున్నారు. సాక్ష్యం కోసమే ఆ డేటాను సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌కు అనుకూలంగా ఉన్న అనేక మంది మద్దతుదారులను కూడా ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. బ్రిజ్‌పై లైంగిక వేధింపుల కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇప్పటి వరకు 137 మంది నుంచి స్టేట్మెంట్లను రికార్డు చేసింది. అయితే బ్రిజ్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనని విచారించారా లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్, భజరంగ్ పూనియాలు రైల్వే ఉద్యోగాల్లో చేరడంతో ఆందోళన ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలను రెజ్లర్లు ఖండించారు. తాము ఆందోళన విరమించే ప్రసక్తే లేదని.. విధులు నిర్వహిస్తూనే తాము నిరసన వ్యక్తం చేస్తామని పేర్కొన్నారు. ''హింస లేకుండా ఉద్యమాన్ని ఎలా కొనసాగించాలని ఆలోచిస్తున్నాం. మా సత్యాగ్రహాన్ని, ఉద్యమాన్ని బలహీనపరిచే కుట్ర ఇది. కేంద్ర హోంమంత్రితో సమావేశంలో తుది పరిష్కారం దొరకలేదు. మాకు హాని తలపెట్టాలనే ఉద్దేశంతోనే ఇలా తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారు.'' అంటూ తెలిపారు. -
అరెస్టు చేశాం.. పోలీసు మార్జాలాలు ఉండవు
న్యూఢిల్లీ: ట్విటర్ అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్‌కు ఢిల్లీ పోలీసులు ఇచ్చిన సమాధానం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. పర్ఫెక్ట్ రిప్లై ఇచ్చారంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. అసలేం జరిగిందంటే.. పోలీసు జాగిలాలు (కుక్కలు) ఉంటాయని మనకు తెలుసు, మరి పోలీసు మార్జాలాలు (పిల్లులు) కూడా ఉంటాయా? అని తన కుమారుడు లిటిల్ ఎక్స్ అడిగాడంటూ మస్క్ గురువారం ట్వీట్ చేశారు. Hi @elonmusk, please tell Lil X that there are no police cats because they might get booked for feline-y and 'purr'petration. https://t.co/W8CMMvYi9I — Delhi Police (@DelhiPolice) June 2, 2023 ఇదీ చదవండి: మస్క్‌కు మరో ఝలక్: కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్‌బై ఈ ట్వీట్‌పై ఢిల్లీ పోలీసు శాఖ శుక్రవారం స్పందించింది. ‘‘హాయ్ ఎలాన్ మస్‌్క! పోలీసు పిల్లులు ఉండవు. ఎందుకంటే నేరాలు ఘోరాలు చేసినందుకు వాటిని ఎప్పుడో అరెస్టు చేసేశాం. ఈ సంగతి మీ లిటిల్ ఎక్స్‌కు చెప్పండి’’అని ట్వీట్ చేసింది. భలేగా స్పందించారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. Delhi Police gives ‘purr-fect’ reply to Elon Musk’s tweet on ‘police cats’ pic.twitter.com/csIQ9p4hgy — Talli Jatt (@tallijatt) June 2, 2023 -
బ్రిజ్ భూషణ్‌పై సంచలన నిందారోపణలు
బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై సంచలన నిందారోపణలు వెలుగులోకి వచ్చాయి. మహిళా అథ్లెట్లను అసభ్యంగా తాకుతూ.. లైంగికంగా వేధించినట్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. ఒకవైపు ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుండగా.. ఆ ఎఫ్ఐఆర్ కాపీల్లో సారాంశం ఇప్పుడు బయటకు వచ్చింది. మొత్తం ఏడుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదు మేరకు ఢిల్లీ కన్నౌట్ ప్లేస్ పోలీస్ స్టేషన్లో కిందటి నెలలో ఫిర్యాదులు నమోదు అయ్యాయి. అందులో ఆరుగురి ఫిర్యాదుతో ఒక ఎఫ్ఐఆర్, మైనర్ తండ్రి ఫిర్యాదు మేరకు మరో ఎఫ్ఐఆర్ను పోలీసులు ఫైల్ చేశారు. ఏప్రిల్ 21వ తేదీన ఫిర్యాదులు అందగా.. వారం తర్వాత వాటిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. दरिया अब तेरी ख़ैर नहीं, बूँदो ने बग़ावत कर ली है नादां ना समझ रे बुज़दिल, लहरों ने बग़ावत कर ली है, हम परवाने हैं मौत समाँ, मरने का किसको ख़ौफ़ यहाँ रे तलवार तुझे झुकना होगा, गर्दन ने बग़ावत कर ली है॥ pic.twitter.com/a5AYDkjCBu — Vinesh Phogat (@Phogat_Vinesh) May 29, 2023 ఇక ఎఫ్ఐఆర్లో.. బ్రిజ్‌పై రెజ్లర్ల ఫిర్యాదు మేరకు సంచలన నిందారోపణలను పోలీసులు చేర్చారు. శ్వాస పరీక్ష పేరిట అభ్యంతరకరంగా తాకడంతో పాటు, వాళ్లను ఇష్టానుసారం పట్టుకోవడం, వ్యక్తిగత ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టడం, లైంగిక కోరికలు తీర్చమని ఒత్తిడి చేయడం, టోర్నమెంట్లలో గాయాలు అయినప్పుడు ఆ ఖర్చులు ఫెడరేషన్ భరిస్తుందని ఆశజూపి వాళ్లను లోబర్చుకునే ప్రయత్నం చేయడం, కోచ్‌గానీ.. డైటీషియన్గానీ ఆమోదించని ఆహారం అందించడం, అన్నింటికీ మించి మైనర్ వెంటపడడంతో పాటు ఆమెను లైంగికంగా తాకుతూ వేధించడం లాంటి నిందారోపణలను ఎఫ్ఐఆర్లో చేర్చారు. कभी सोचा नहीं था कुश्ती की रिंग में लड़ते लड़ते एक दिन इंसाफ़ के लिए ऐसे सड़कों पर भी लड़ना पड़ेगा…. देश की बेटियाँ बहुत मज़बूत हैं, जब विदेश में मेडल जीत सकती हैं तो अपने देश में इंसाफ़ की लड़ाई भी जीतके ही मानेंगी। #WrestlerProtest pic.twitter.com/eTHzERBUwb — Sakshee Malikkh (@SakshiMalik) May 28, 2023 ‘‘ఆరోజు(ఫలానా తేదీ..) నేను శిక్షణలో భాగంగా మ్యాట్ మీద పడుకుని ఉన్నాను. నిందితుడు(బ్రిజ్) నా దగ్గరకు వచ్చాడు. అతని ప్రవర్తన నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ టైంలో నా కోచ్ అక్కడ లేరు. నా అనుమతి లేకుండా నా టీషర్ట్‌ను లాగేశాడు. నా ఛాతీపై చెయ్యి వేశాడు. ఆ చెయ్యిని అలాగే కడుపు మీదకు పోనిచ్చి.. నా శ్వాసను పరీక్షిస్తున్న వంకతో నన్ను వేధించాడు’’ అని అవార్డు సాధించిన ఓ రెజ్లర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మిగతా ఆరుగురి ఫిర్యాదులన్నీ దాదాపు పైతరహాలో ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే.. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఈ ఆరోపణలన్నింటినీ మొదటి నుంచి ఖండిస్తూ వస్తున్నాడు. ఆరోపణల్లో ఒక్కటి రుజువైనా.. తనను తాను ఉరి తీసుకుంటానని బుధవారం స్టేట్మెంట్ ఇచ్చాడాయన. అలాగే.. రెజ్లర్ల దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే వాటిని కోర్టుకు సమర్పించాలని, నేరం రుజువైతే శిక్షను తాను అభవిస్తానని అంటున్నాడు. 🙏 pic.twitter.com/4LzKaVTYo4 — Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) May 30, 2023 ఇదీ చదవండి: బీజేపీలో ఉన్నానంటే ఉన్నా.. అంతే! -
రెజ్లర్లకు షాక్!
-
Wrestlers Protest: ఆరోపణలు రుజువైతే ఉరి వేసుకుంటా
న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు సంబంధించి భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై నమోదైన కేసు వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు స్పష్టతనిచ్చారు. దీనిపై విచారణ ఇంకా కొనసాగుతోందని వారు వెల్లడించారు. ‘మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణల విషయంలో బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదు’ అని పోలీసులు చెప్పినట్లుగా బుధవారం ఉదయం వార్తలు వచ్చాయి. దాంతో కాస్త గందరగోళం నెలకొంది. దాంతో పోలీసులు ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. ‘ఆ వార్తలు పూర్తిగా తప్పు. చాలా సున్నితమైన ఈ కేసు విషయంలో అంతే జాగ్రత్తగా విచారణ జరుపుతున్నాం. తాజా పరిస్థితిపై కోర్టుకు సమాచారం ఇస్తూనే ఉన్నాం. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతూనే ఉంది కాబట్టి నివేదిక కోర్టుకు సమర్పించక ముందు బహిరంగంగా వెల్లడి చేయడం సరైంది కాదు’ అని పోలీసులు స్పష్టం చేశారు. తాజా పరిణామాల్లో దేశంలోని వేర్వేరు రాజకీయ పార్టీలు రెజ్లర్లకు మద్దతు ప్రకటించాయి. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెజ్లర్లకు న్యాయం చేయాలంటూ స్వయంగా ప్లకార్డ్ పట్టి ర్యాలీలో పాల్గొనగా... బ్రిజ్‌భూషణ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బేటీ బచావా, బేటీ పడావో మాత్రమే కాదు...ఇకపై బీజేపీ నాయకుల నుంచి ఆడబిడ్డలను కాపాడుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ ‘బేటీ బీజేపీ కే నేతావోంసే బచావో’ అంటూ కొత్త నినాదాన్ని ఇచ్చింది. మరోవైపు మంగళవారం హరిద్వార్‌లో గంగలో పతకాలు వేయాలని సంకల్పించిన ఆ తర్వాత మనసు మార్చుకున్న రెజ్లర్లు స్వస్థలం హరియాణా చేరుకోగా, సాక్షి మలిక్ మాత్రం ఢిల్లీలోనే ఉండిపోయింది. తీవ్ర బాధలో ఉండటంతో పాటు మౌనంగా ఉండాలని ఒట్టేసుకోవడం వల్లే మంగళవారం వారు ఎవరితో మాట్లాడలేదని సన్నిహితులు వెల్లడించారు. తీవ్ర చర్యలకు పాల్పడవద్దు: ఠాకూర్ క్రీడల గొప్పతనాన్ని తగ్గించే ఎలాంటి తీవ్ర చర్యలకు పాల్పడవద్దని కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ రెజ్లర్లకు సూచించారు. విచారణ పూర్తయ్యే వరకు కాస్త ఓపిక పట్టమని ఆయన కోరారు. మరోవైపు ఆదివారం భారత రెజ్లర్ల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. రెజ్లర్లను పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు కలిచివేసే విధంగా ఉన్నాయని ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఆరోపణలు రుజువైతే ఉరి వేసుకుంటా’ కేసుకు సంబంధించి తనపై ఆరోపణలు రుజువైతే ఉరి వేసుకుంటానని బ్రిజ్‌భూషణ్ సింగ్ మరోసారి చెప్పారు. ‘వారు నాపై ఆరోణలు చేసి నాలుగు నెలలైంది. ఒక్కదానినీ రుజువు చేయలేకపోయారు. నాకు ఉరిశిక్ష విధించాలని వారు కోరారు. గంగలో పతకాలు వేయడం ద్వారా నన్ను శిక్షించలేరు. సాక్ష్యాలుంటే కోర్టుకు ఇచ్చి నాకు ఉరిశిక్ష వేయించండి. నా బిడ్డల్లాంటివారైన రెజ్లర్లపై నాకు ఇప్పటికీ కోపం లేదు’ అని ఆయన అన్నారు. మరోవైపు బ్రిజ్‌భూషణ్‌పై కేసు నమోదు చేసిన మైనర్ రెజ్లర్ వివరాలు బహిర్గతం చేసిన ఆమె బంధువు ఒకరిపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ స్వాతి మలివాల్ పోలీసులకు సూచించింది. -
రెజ్లర్లను అడ్డుకున్న పోలీసులు
రెజ్లర్లను అడ్డుకున్న పోలీసులు -
‘కాలుస్తావా.. ఎక్కడికి రావాలో చెప్పు’.. రిటైర్డ్ ఐపీఎస్‌కు బజరంగ్ పూనియా ఛాలెంజ్
న్యూఢిల్లీ: డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వ్యతిరేకంగా భారత రెజ్లర్లు గత నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ రాజకీయ ప్రముఖుడిపై కేంద్రం సరిగా స్పందించకపోవడంతో రెజర్లు ఆదివారం ప్రధాని మోదీ ప్రారంభించిన కొత్త పార్లమెంటు భవనం వైపు ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు వారి అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్ వద్ద రెజర్ల విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై రిటైర్డ్ ఐపీఎస్ ఒకరు ట్విట్టర్ లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకు ఒలింపిక్ మెడలిస్ట్ బజరంగ్ పూనియా..ధీటుగా బదులిచ్చారు. కాల్పుల అంశంపై పునియా అన్నట్లు వస్తున్న వార్తలపై స్పందిస్తూ రిటైర్డ్ ఐపీఎస్, కేరళ పోలీస్ మాజీ చీఫ్ ఎన్ సీ ఆస్తానా ఈ రకంగా ట్వీట్ చేశారు. ‘పరిస్థితులు బట్టి మీపై కాల్పులు జరుపుతారు తప్ప మీరు చెబితే కాదు. ఒక బస్తా చెత్తను పడేసినట్లే.. మిమ్మల్ని లాగి పడవేస్తాం. సెక్షన్ 129 ప్రకారం పోలీసులకు కాల్చులు జరిపే అధికారం ఉంది. సమయం వస్తే ఆ కోరిక నెరవేరుతుంది. అందుకే మీరు ముందుకు చదువుకుని ఉండాలి. పోస్ట్‌మార్టం టేబుల్‌పై మళ్లీ కలుద్దాం’’ అంటూ రెజర్లను ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ట్వీట్ పై పునియా స్పందిస్తూ.. ‘‘ఈ ఐపీఎస్ అధికారి మమ్మల్ని కాల్చడం గురించి మాట్లాడుతున్నారు. సోదరా, మేము మీ ముందు ఉన్నాం, ఎక్కడికి రావాలో చెప్పండి. మీ బుల్లెట్లకు మా చాతీని చూపుతామని మీకు ప్రమాణం చేస్తున్నా. ఇప్పటి వరకు రెజర్లు బుల్లెట్లు మినహా మిగతావన్నింటినీ ఎదుర్కొన్నారు. ఇక మిగిలింది అదొక్కటే, అది కూడా తీసుకురండి’’ అంటూ హిందీలో ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియా భగ్గుమంది. అయితే.. రెజ్లర్లు అల్లర్లు, చట్టవిరుద్ధమైన సమావేశాల ద్వారా తమ విధులను చేయకుండా అడ్డుకున్నారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో సహా నిరసనలో పాల్గొన్న రెజ్లర్లందరినీ ఈ కేసులో ప్రస్తావించారు. ये IPS ऑफिसर हमें गोली मारने की बात कर रहा है। भाई सामने खड़े हैं, बता कहाँ आना है गोली खाने… क़सम है पीठ नहीं दिखाएँगे, सीने पे खाएँगे तेरी गोली। यो ही रह गया है अब हमारे साथ करना तो यो भी सही। https://t.co/jgZofGj5QC — Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) May 29, 2023 చదవండి: Delhi Shahbad Dairy Case:: గాళ్‌ఫ్రెండ్‌తో గొడవ.. అందరూ చూస్తుండగానే..! -
ఇక నో మోర్ పర్మిషన్.. జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసనపై పోలీసుల నిర్ణయం
ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన సందర్భంగా నిన్న(ఆదివారం) పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంటూ నిరసనకారుల్ని బలవంతంగా అదుపులోకి తీసుకుని 12 మందిపై కేసులు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ పోలీసులు రెజ్లర్లకు షాక్ ఇచ్చారు. ఇక నుంచి జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసనకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఒకవేళ అనుమతుల కోసం గనుక వాళ్లు దరఖాస్తు చేసుకుంటే.. జంతర్ మంతర్ కాకుండా వేరే ఎక్కడైనా అనుమతులు ఇస్తామంటూ న్యూఢిల్లీ డీసీపీ కార్యాలయం ట్విటర్ ద్వారా స్పష్టం చేసింది. ‘‘వాళ్లు(రెజ్లర్లు) పోలీసుల అభ్యర్థనను పట్టించుకోకుండా పార్లమెంట్ మార్చ్‌ను చేపట్టి.. చట్టాన్ని ఉల్లంఘించారని తెలిపారు. అందుకే జంతర్ మంతర్ వద్ద వాళ్లు చేపట్టిన నిరసన దీక్ష ముగిసింది!. రెజ్లర్లు గనుక భవిష్యత్తులో మళ్లీ నిరసనకు దరఖాస్తు చేస్తే.. జంతర్ మంతర్ కాకుండా అనువైన ప్రదేశంలో వారి నిరసనకు అనుమతిస్తాం అని డీసీపీ ట్విటర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది.. कुश्ती पहलवानों का धरना और प्रदर्शन निर्बाध तरीक़े से जंतर मंतर की सूचित जगह पर चल रहा था। कल, प्रदर्शकारियों ने तमाम आग्रह और अनुरोध के बावजूद कानून का उन्मादी रूप से उल्लंघन करा। अतः चल रहे धरने को समाप्त कर दिया गया है। — DCP New Delhi (@DCPNewDelhi) May 29, 2023 ఇదిలా ఉంటే.. ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియా భగ్గుమంది. అయితే.. రెజ్లర్లు అల్లర్లు, చట్టవిరుద్ధమైన సమావేశాల ద్వారా తమ విధులను చేయకుండా అడ్డుకున్నారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో సహా నిరసనలో పాల్గొన్న రెజ్లర్లందరినీ ఈ కేసులో ప్రస్తావించారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఈ నిరసనలు కొనసాగాయి. మొత్తం 38 రోజుల పాటు జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన కొనసాగింది. భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేదించారని, అతన్ని అరెస్ట్ చేయాలని, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు జోక్యంతో ఇప్పటికే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెండు ఎఫ్ఐఆర్లను ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు. కానీ, రెజ్లర్లు మాత్రం బ్రిజ్‌ను అరెస్ట్ చేసే దాకా నిరసనలు ఆపమని చెబుతున్నారు. VIDEO | Security heightened at Jantar Mantar in Delhi ahead of the 'Mahila Samman Mahapanchayat' called by protesting wrestlers today. pic.twitter.com/rP0EXvLuwg — Press Trust of India (@PTI_News) May 28, 2023 Video Source: PTI News అవి మార్ఫింగ్ ఫొటోలు ‘‘అవి నిజమైన ఫొటోలు కావు. కొందరు కావాలనే మార్ఫింగ్ చేశారు. అలాంటి వారికి సిగ్గు లేదు. వారిని దేవుడు ఎలా సృష్టించాడో అర్థం కావడం లేదు. మాకు చెడ్డ పేరు తెచ్చేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు’’.. అరెస్టు తర్వాత వ్యానులో వినేష్, సంగీత ఫొగాట్‌లు నవ్వుతున్నట్లు ఉన్న ఓ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై రెజ్లర్ సాక్షి మాలిక్ పై విధంగా స్పందించారు. ఇదీ చదవండి: రాజదండం ఎవరి కోసం? -
తొలిరోజే 'సెంగోల్' ఒరిగిపోయింది!: స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
పార్లమెంట్ ప్రారంభోత్సవం తొలిరోజే ప్రతిష్టించిన చారిత్రాత్మక సెంగోల్ ఒరిగిపోయిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చారిత్రాత్మక సెంగోల్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని మాటల దాడి చేశారు. సరిగ్గా ప్రారంభోత్సవం రోజే ధర్మానికి ప్రతీక, మన చారిత్రక సంప్రదాయం అపహాస్యం పాలైందంటూ విమర్శలు కురిపించారు స్టాలిన్. భారత రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు భారత రెజ్లర్లు పార్లమెంట్ కొత్త భవనం వెలుపల నిరసన చేసేందుకు యత్నించడంతో ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు సీఎం బీజేపీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ గత కొన్ని నెలలుగా నిరసనలు చేస్తున్నా ఇంతవరకు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పైగా శాంతియుతంగా పార్లమెంట్ వెలుపల నిరసన చేసేందుకు వచ్చిన రెజ్లర్లను ఈడ్చుకెళ్తూ..వారిని అదుపులోకి తీసుకెళ్లడం అనేది తీవ్రంగా ఖండించదగినదన్నారు. న్యాయం చేయలేక ధర్మానికి ప్రతీక అయిన సెంగోల్ తొలిరోజే వంగినట్లు కనిపించింది అని మండిపడ్డారు. రాష్ట్రపతిని పక్కకు తప్పించి, ప్రతిపక్షాల బహిష్కరణల మధ్య కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం రోజున ఇలాంటి దారుణం జరగడం న్యాయమేనా? అని డీఎంకే నేత స్టాలిన్ ట్విట్టర్ వేదికగా కేంద్రాన్ని నిలదీశారు. (చదవండి: శుభోదయం.. నవోదయం) -
సిసోడియాకు అవమానం.. మెడ పట్టుకుని లాక్కెళ్లిన పోలీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా పట్ల నగర పోలీసులు వ్యవహరించిన తీరుపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సహా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. దేశ రాజధానిలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చిన సమయంలో.. సిసోడియాను పోలీసులు మెడ పట్టుకొని బలవంతంగా లాక్కెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు సీఎం కేజ్రీవాల్ ఓ వీడియో విడుదల చేశారు. సిసోడియాను మెడ పట్టుకొని లాక్కెళ్లిన పోలీసులు? ఇందులో ఢిల్లీ కోర్టుకు భారీ భద్రత నడుమ పోలీసులు సిసోడియాను తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో మీడియా వారి వద్దకు చేరుకొని ప్రశ్నలు అడుగుతుంటే పోలీస్ అధికారి ఏకే సింగ్ రిపోర్టర్లను దూరంగా నెట్టడానికి ప్రయత్నించారు. కోర్టు ఆవరణలో సిసోడియా విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధానికి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని, మోదీ చాలా అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఓ పోలీస్ అధికారి సిసోడియాను మాట్లాడనివ్వకుండా మెడ పట్టుకొని తీసుకెళ్లిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కేజ్రీవాల్ ఆగ్రహం ఈ వీడియోపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. మనీష్ సిసోడియాతో ఇలా అనుచితంగా ప్రవర్తించే హక్కు పోలీసులకు ఉందా? అని ప్రశ్నించారు. ఇలా చేయమని పైనుంచి (కేంద్రం లోని మోదీ సర్కార్) పోలీసులకు ఆదేశాలొచ్చాయా? అని మండిపడ్డారు. మనీష్‌తో పోలీసుల దురుసు ప్రవర్తన షాక్‌కు గురిచేసిందని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి పేర్కొన్నారు. సిసోడియా పట్ల అనుచితంగా ప్రవర్తించిన అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. क्या पुलिस को इस तरह मनीष जी के साथ दुर्व्यवहार करने का अधिकार है? क्या पुलिस को ऐसा करने के लिए ऊपर से कहा गया है? https://t.co/izPacU6SHI — Arvind Kejriwal (@ArvindKejriwal) May 23, 2023 ఖండించిన పోలీసులు అయితే ఆప్ ఆరోపణలను ఢిల్లీ పోలీస్‌లు కొట్టి పారేశారు. ఇదంతా దుష్ప్రచారంగా పేర్కొన్నారు. వీడియోలో కనిపిస్తున్న పోలీసుల చర్య భద్రత దృష్ట్యా సహజమేనని.. నిందితులు ఎవరైనా మీడియాకు స్టేట్మెంట్లు ఇవ్వడం చట్టవిరుద్ధమని పోలీసులు ట్వీట్ చేశారు. సిసోడియా కస్టడీ పొడిగింపు కాగా, ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి సిసోడియాను పోలీసులు మంగళవారం కోర్టులో హాజరు పరిచారు. రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు జూన్ 1వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. -
రెజ్లర్ల దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో రెజ్లర్లు ఆందోళన చేస్తున్న దీక్షా స్థలి ఒక్కసారిగా ఉద్రిక్తతకు కేంద్ర బిందువైంది. రెజ్లర్లు, వారికి మద్దతుగా వచ్చిన ఆప్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగడం, చివరకు తోపులాట, ఘర్షణకు దారితీసింది. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. దీక్షా శిబిరం వద్ద వర్షాలతో రెజ్లర్లు వినియోగిస్తున్న పరుపులు తడిసి ముద్దయ్యాయి. వారికి సాయపడేందుకు కొన్ని చెక్క మంచాలను ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతి తన కార్యకర్తలతో తెప్పించారు. వాటిని రెజ్లర్లకు ఇచ్చేందుకు అనుమతించేది లేదని, జంతర్‌మంతర్‌ను శాశ్వత దీక్షాశిబిరంగా మార్చేందుకు అనుమతులు లేవని అక్కడే మొహరించిన పోలీసులు తెగేసి చెప్పారు. అయినా సరే కొన్ని మంచాలను రెజ్లర్లకు కార్యకర్తలు ఇవ్వడం, వాటిని రెజ్లర్లు శిబిరంలోకి తీసుకెళ్తుండటంతో పోలీసులు, ఆప్ కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది. తమకు సాయపడేందుకు వచ్చిన ఆప్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో రెజ్లర్లు వారితో వాదనకు దిగారు. దీంతో రెజ్లర్లు, కార్యకర్తలను నిలువరించేందుకు పెద్ద ఎత్తున పోలీసులు బలప్రయోగం చేశారు. ఇరువర్గాల వాదనలు చివరకు తోపులాటలు, ఘర్షణకు దారితీశాయి. ఈ ఘటనలో రాహుల్ యాదవ్, దుష్యంత్ ఫొగాట్‌సహా పలువురు రెజ్లర్లకు గాయాలయ్యాయి. వినేశ్ ఫొగాట్ కంటతడి నన్ను తిట్టారు. నేలకు పడేశారు. పురుష పోలీసులు తమతో అనుచితంగా ప్రవర్తించారు. ఒక్క మహిళా పోలీసు అయినా ఉన్నారా ఇక్కడ?. మమ్మల్ని చంపేద్దామనుకుంటున్నారా? చంపేయండి. ఇలాంటి రోజు కోసమేనా మేం దేశం కోసం పతకాలు సాధించింది? అంటూ ప్రముఖ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ కన్నీరు పెట్టుకున్నారు. తాము సాధించిన పతకాలు, కేంద్రం ఇచ్చిన అవార్డులు, పద్మశ్రీ అన్నీ వెనక్కి ఇస్తామని రెజ్లర్లు హెచ్చరించారు. విపక్షాల తీవ్ర ఆగ్రహం రెజ్లర్లపై పోలీసుల దాడి దారుణమని విపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ‘ఆటగాళ్లపై పోలీసుల దాడి సిగ్గు చేటు. సమాఖ్య చీఫ్ శరణ్‌ను ఆ పదవి నుంచి మోదీ తొలగించాలి’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘కోర్టు పర్యవేక్షణలో ఘటనపై దర్యాప్తు జరగాలి. కనీసం ఘటనాస్థలికి వెళ్లి మోదీ రెజ్లర్లకు సంఘీభావం ప్రకటించాలి’ అని కాంగ్రెస్ డిమాండ్చేసింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదితర నేతలూ పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. -
Vinesh Phogat: ఇలాంటివి చూసేందుకే పతకాలు సాధించామా?
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా భారత్ రెజ్లర్లు ఏప్రిల్ 23 నుంచి జంతర్‌మంతర్ వద్ద నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెజ్లర్ల నిరసను ఆపించి, తరలించేందుకు భారీ సంఖ్యలో ఢిల్లీ పోలీసులు జంతర్‌మంతర్ వద్దకు చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో వర్షం కారణంగా వారి పరుపులు తడిచిపోవడంతో బయటనుంచి మరికొన్నింటిని తీసుకొచ్చేందుకు యత్నించగా అందుకు పోలీసులు అంగీకరించలేదు. మేము నేరస్తులం కాదు.. ఈక్రమంలోనే బృందంలోని కొంతమంది సభ్యులను ఢిల్లీ పోలీసులు దూషించారు. దీంతో పోలీసులు, రెజ్లర్ల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ మేరకు రెజ్లర్ వినేష్ ఫోగట్ ఇలాంటి రోజులు చూడటానికేనా! తాము పతకాలు సాధించింది? అంటూ కన్నీటి పర్యంతమైంది. ఈ సందర్భంగా వినేష్ ఉద్వేగంగా మాట్లాడుతూ.. మాపై ఇలా పోలీసులు దురుసుగా ప్రవర్తించడానికి తామేమి నేరస్తులం కాదంటూ మండిపడ్డారు. ఘటనా స్థలంలో మహిళా పోలీసులు లేకపోవడంపై నిలదీశారు. ఓ పోలీసు అధికారి తాగిన మద్యం మత్తులో దుర్భాషలాడి, తమపై దాడి చేశారని ఆరోపణలు చేశారు. Watch | "Did We Win Medals To See Such Days?" Wrestler Vinesh Phogat Breaks Down pic.twitter.com/NXOrAZwfPA — NDTV (@ndtv) May 3, 2023 ఆప్ నేత అరెస్టు! ఈ క్రమంలో రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో నాలుగు పతకాలు గెలుచుకున్న బజరంగ్ పునియా ఉద్వేగభరితంగా తన పతకాలన్నింటిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాని అని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ ఘటనలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సోమనాథ్ భారతితో సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా భారతి మంచాలు తీసుకొచ్చేందుకు యత్నించారని, దూకుడుగా ప్రవర్తించారని అందుకే ఆయనతోపాటు మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం జంతర్ మంతర్ ప్రాంతాన్ని సీల్ చేశారు. రెజ్లర్లను పరామర్శించేందుకు వస్తున్న ప్రతిపక్షాల హాజరును నమోదు చేసి మరీ నిరసన ప్రాంతానికి అనుమతించకుండా, రెజ్లర్లను కలవకుండా అడ్డుకున్నారు. కాగా, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఏడుగురు మహిళ రెజ్లర్లు లైంగిక వేధింపులకు గురి చేశారంటూ ఆరోపణలు చేశారు. అతడిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ తదనంతరం సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడంతో ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్‌పై రెండు కేసులు నమోదు చేశారు. (చదవండి: కోపంలో నోరు జారిన పోలీసు..సెకనులో టెర్రరిస్టుగా మారుస్తా! అని బెదిరింపులు) #WATCH | Delhi: A scuffle breaks out between protesting wrestlers and Delhi Police at Jantar Mantar pic.twitter.com/gzPJiPYuUU — ANI (@ANI) May 3, 2023 -
సత్యపాల్ మాలిక్‌ను అరెస్ట్ చేయలేదు: ఢిల్లీ పోలీసులు
ఢిల్లీ: జమ్ము కశ్మీర్‌తో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేసిన సత్యపాల్ మాలిక్.. శనివారం ఢిల్లీలోని ఆర్కే పురం పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. తన ఇంట్లో జరగాల్సిన రైతు సంఘాల నేత భేటీని పోలీసులు అడ్డుకోవడంపై పీఎస్‌లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారాయాన. ఈ క్రమంలో.. ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారంటూ ప్రచారం జరగ్గా ఢిల్లీ పోలీసులు దానిని ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను మేం అదుపులోకి తీసుకోలేదు. ఆయనంతట ఆయనగా పీఎస్‌కు వచ్చారు. తోడు మద్ధతుదారులు కూడా ఉన్నారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కూడా మేం ఆయన్ని కోరాం సీనియర్ అధికారి ఒకరు ప్రకటన విడుదల చేశారు. అసలు విషయం ఏంటంటే.. ఆర్కేపురంలో ఉన్న తన ఇంట్లో సత్యపాల్ మాలిక్ శనివారం రైతు సంఘాల నేలతో భేటీ కావాల్సి ఉంది. హర్యానా నుంచి రైతు సంఘాల నేతలు తమ పోరాటానికి మాలిక్ మద్దతు కోరే యత్నం చేశారు. ఈ క్రమంలో ఇంటి ఆవరణ సరిపోక.. భోజనాలను బయట ఉన్న పార్క్‌లో ఏర్పాటు చేశారు. అయితే అది పబ్లిక్ స్పేస్ అని, అక్కడ అనుమతి లేదని పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు. దీంతో.. స్థానిక పీఎస్‌కు తన మద్దతుదారులతో చేరుకున్న సత్యపాల్ మాలిక్, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాసేపు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈలోపు పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారంటూ ప్రచారం నడిచింది. దీంతో ఢిల్లీ పోలీసులు ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఈయన గవర్నర్‌గా ఉన్న టైంలో జమ్ము కశ్మీర్లో జరిగిన ఓ భారీ అవినీతి స్కాంకు సంబంధించి సీబీఐ సాక్షిగా ప్రశ్నించేందుకు సమన్లు జారీ చేసింది. ఈ అంశం రాజకీయంగానూ హాట్ టాపిక్ అయ్యింది. విచారణలో స్పష్టత కోసమే తనను పిలిచారని, ఏప్రిల్27, 28, 29 తేదీల్లో సీబీఐకి అందుబాటులో ఉంటానని బదులు ఇచ్చినట్లు ఆయన మీడియాకు తెలిపారు. थाना आर.के. पुरम के सामने पूर्व राजयपाल चौ सत्यपाल मलिक के समर्थन में पहुंचे समर्थक ।@SatyapalMalik_1#SatyapalMalik #CBISummonedSatyapalMalik#सत्यपाल_मलिक #PulwamaAttack #देश_सत्यपाल_मलिक_के_साथ_है pic.twitter.com/qR1XLbFAXg — DU JAT STUDENTS UNION (@du_jat) April 22, 2023 సంచలనాల సత్యపాల్ మాలిక్ -
మానవ మృగాలు.. అంజలిని కాపాడే వీలున్నా..
క్రైమ్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ కంజావాలా మృతి కేసులో ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితుల(నలుగురు ప్రధాన నిందితులు) పేర్లను చేరుస్తూ.. 20 ఏళ్ల అంజలి మృతికి కారణమయ్యారంటూ ఢిల్లీ పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచారు. అంతేకాదు ఆమెను కాపాడే వీలున్నా అందుకు కనీస ప్రయత్నం చేయలేదని, పైగా ఆమెను చంపే ఉద్దేశంతోనే కారుతో ఈడ్చుకెళ్లారని పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఘటన సమయంలో బాధితురాలు అంజలిని కాపాడే అవకాశాలు రెండుసార్లు కలిగినా కనికరం లేకుండా నిందితులు ముందుకు సాగారని పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. మొదట.. స్కూటీపై వెళ్తున్న ఆమెను కారుతో ఢీ కొట్టారని, అప్పుడే ఆగి ఆమెను రక్షించే వీలున్నా ఆ ప్రయత్నం చేయలేదని తెలిపారు. రెండు.. ఢీ కొట్టిన తర్వాత ఆమె కారు కింద ఇరుక్కుందని వాళ్లకు తెలుసు. దిగి ఆమెను కాపాడే అవకాశం అప్పటికీ ఉంది. అయినా నిందితులు ఉద్దేశపూర్వకంగానే ఆమెను సుల్తాన్‌పురి నుంచి కంజావాలా మధ్య 12 కిలోమీటర్లపాటు ఈడ్చుకెళ్లారని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొని ఇంటికి వెళ్తున్న అంజలి, ఆమె స్నేహితురాలిని తొలుత కారుతో ఢీ కొట్టారు నిందితులు. అంజలి కాలు కారు కిందే ఇరుక్కుపోగా.. స్నేహితురాలు కాస్త దూరంలో కింద పడిపోయి భయంతో అక్కడి నుంచి పారిపోయింది. ఆపై అంజలిని కారుతో ఈడ్చుకుంటూ వెళ్లిపోయారు నిందితులు. ఈ క్రమంలో ఆమె ప్రాణం పోతుందని తెలిసినా కూడా నిందితులు ముందుకు సాగడం ఘోరం. ఈ కేసులో నలుగురు నిందితులు అమిత్ ఖన్నా, కృష్ణన్, మనోజ్ మిట్టల్, మిథున్‌లపై హత్య నేరాభియోగాలను ఛార్జ్‌షీట్‌లో నమోదు చేశారు పోలీసులు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం వాళ్లపై అభియోగాలు నమోదు అయ్యాయి. స్కూటీని ఢీ కొట్టి 500-600 మీటర్ల దూరం వెళ్లాక.. డ్రైవర్ పక్క సీట్లో ఉన్న నిందితుడు, వెనకాల ఉన్న నిందితుడు ఇద్దరూ.. ఆమె ఇంకా కారు కింద ఉందా? లేదా? అనేది చూశారు. ఉందని నిర్ధారించుకున్న తర్వాత కూడా కారును ముందుకు పోనివ్వాలని డ్రైవర్ సీట్లో ఉన్న నిందితుడికి సూచించారు. అలా ముందుకు వెళ్లే క్రమంలో.. ఆమె దుస్తులు చినిగిపోయి, వీపు చిట్లిపోయి వెన్నుపూస బయటకు వచ్చేసింది. పుర్రె భాగం సైతం పగలిపోయింది. ఈడ్చుకెళ్లే దారిలోనే ఆమె ప్రాణం పోయిందని శవ పరీక్షలో వెల్లడైంది. తాము చేస్తున్న పని ఆమెను గాయపర్చడమే కాదు.. ప్రాణాలకు ముప్పు కలిగించేదని తెలిసి కూడా మృగాల్లా నిందితులు వ్యవహరించారని, ఈ కేసులో మద్యం మత్తు అనేది కేవలం తప్పించుకునే సాకుగానే కనిపిస్తోంది తప్ప నిందితులు ఘటన సమయంలో స్పృహలోనే ఉన్నారని, వాళ్లకు ఆ నేర తీవ్రత గురించి కూడా తెలుసని పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఈ ఛార్జ్‌షీట్ ఆధారంగా ఢీల్లీ రోహిణి కోర్టు ఏప్రిల్ 18వ తేదీన వాదనలు విననుంది. -
Rahul Gandhi: రాహుల్ గాంధీ ఇంటికి పోలీసులు.. వారి వివరాల కోసమే..
న్యూఢిల్లీ: దేశంలో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ జనవరి 30న శ్రీనగర్‌లో భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీసులు మరోసారి స్పందించారు. సదరు బాధిత మహిళల నుంచి ఫిర్యాదు స్వీకరించడంతోపాటు రక్షణ కలి్పంచడానికి వీలుగా వారి వివరాలు తెలుసుకొనేందుకు ఆదివారం ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లారు. ప్రత్యేక కమిషనర్ సాగర్‌ప్రీత్ హుడా నేతృత్వంలో పోలీసుల బృందం ఉదయం పదింటికి తుగ్లక్ రోడ్డులోని రాహుల్ ఇంటికి వెళ్లినా ఆయన్ను కలవలేకపోయింది. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి వెళ్లిపోయింది. ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ ఇంటికి రావడం ఇటీవల ఇది మూడోసారి. ‘లైంగిక వేధింపులకు గురవుతున్నామంటూ మిమ్మల్ని వేడుకున్న మహిళల వివరాలు తెలపండి’ అంటూ రాహుల్‌కు ప్రశ్నావళితో నోటీసు పంపించారు. తీవ్రమైన ఆరోపణలు చేశారు రాహుల్ ఇంటికి పోలీసుల వచ్చారన్న సంగతి తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు పవన్ ఖేరా, అభిషేక్ సింఘ్వీ, జైరాం రమేశ్ తదితరులు ఇక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీలో జోడో యాత్ర జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై స్థానికంగా దర్యాప్తు జరిపామని, మహిళలపై లైంగిక వేధింపులు జరిగినట్లు, సమస్యను వారు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు నిర్ధారణ కాలేదని ప్రత్యేక కమిషనర్ సాగర్‌ప్రీత్ హుడా చెప్పారు. ‘‘రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. త్వరలో తానే స్వయంగా ఆయనను కలిసి, వివరాలు తెలుసుకుంటా’’ అని చెప్పారు. అదానీపై ప్రశ్నిస్తున్నందుకే: రాహుల్ తన ఆరోపణపై రాహుల్ ఆదివారం సాయంత్రం 4 పేజీల్లో ప్రాథమిక ప్రతిస్పందనను పోలీసులకు పంపించారు. గౌతమ్ అదానీ అంశంలో పార్లమెంట్ లోపల, బయట కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశి్నస్తున్నందుకే పోలీసులు తన ఇంటికి వస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, ఇతర పార్టీలు ప్రకటనలపై కూడా ఇలాంటి శల్యపరీక్ష చేశారా అని ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించారు. ఆరోపణలపై పూర్తిస్థాయిలో సమాధానం ఇవ్వడానికి 8 నుంచి 10 రోజుల సమయం కోరారు. కుట్రపూరితంగానే ఢిల్లీ పోలీసులు రాహుల్ ఇంటికి వెళ్లడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. దీని వెనుక రాహుల్‌ను వేధించి, బెదిరించే కుట్ర ఉందని పార్టీ నేతలు అశోక్ గహ్లోత్, జైరాం రమేశ్, అభిషేక్ సింఘ్వీ మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు చేసే ప్రకటనలపై కేసులు నమోదు చేసే దుష్ట సంస్కృతికి మోదీ సర్కారు తెరతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీయేతర పారీ్టల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు చేసే ప్రకటనలపై ఇకపై ఇలాంటి కేసులు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకుల విమర్శలపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా స్పందించారు. పోలీసులు వారి విధులను వారు నిర్వర్తించారని, ఇందులో తప్పుపట్టడానికి ఏమీ లేదని తేల్చిచెప్పారు. చట్టప్రకారమే వారు నడుచుకున్నారని తెలిపారు. अडानी के साथ PM मोदी के रिश्ते पर श्री राहुल गांधी के सवालों से बौखलाई सरकार पुलिस के पीछे छिप रही है। भारत जोड़ो यात्रा के 45 दिन बाद राहुल गांधी जी को दिल्ली पुलिस ने नोटिस दिया है, जिसमें उन महिलाओं की जानकारी मांगी गई है जो उनसे मिलीं और खुद के उत्पीड़न के बारे में बात की। pic.twitter.com/fgioVK413V — Congress (@INCIndia) March 16, 2023 చదవండి: శిండే వర్గంతో కలిసే పోటీ! అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ.. -
Shraddha Walkar Case: ఆ అనుభవంతోనే..
క్రైమ్: అఫ్తాబ్ పూనావాలా.. యావత్ దేశాన్ని విస్మయానికి గురి చేసిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఏకైక, ప్రధాన నిందితుడు. మనస్పర్థలతో సహ భాగస్వామి శ్రద్ధను చంపేసి, శరీరాన్ని 35 ముక్కలు చేసి, ఫ్రిడ్జ్‌లో భద్రపర్చి ఆపై ఆ భాగాలను వివిధ చోట్ల పడేశాడతను. అయితే.. ఈ కేసులో ఇప్పుడు పోలీసులు మరో ఆసక్తికరమైన విషయాన్ని ఢిల్లీ కోర్టుకు వెల్లడించారు. ఆఫ్తాబ్ పూనావాలా శిక్షణ పొందిన చెఫ్ అని, మాంసాన్ని సైతం ఎలా భద్రపర్చాలో అతనికి తెలుసని పోలీసులు కోర్టుకు తాజాగా నివేదించారు. తాజ్ హోటల్లో అఫ్తాబ్ చెఫ్ ట్రైనింగ్ తీసుకున్నాడు. అలాగే మాంసాన్ని ఎలా భద్రపర్చడమో కూడా అతనికి తెలుసు. నేరంలో అది తనకి సాయపడిందని అఫ్తాబ్ ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే.. డ్రై ఐస్, అగరబత్తీలతో పాటు శ్రద్ధను హత్య చేసిన తర్వాత నేలను శుభ్రం చేసేందుకు.. కొన్ని రసాయనాలను ఆర్డర్ చేశాడు అని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. శ్రద్ధను హత్య చేసిన వారంలోపే మరో యువతితో డేటింగ్ ప్రారంభించాడని, ఆ కొత్త గర్ల్‌ఫ్రెండ్‌కు శ్రద్ధ రింగ్‌నే బహుకరించాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసుల తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమిత్ ప్రసాద్ వాదనలు వినిపిస్తున్నారు. తాజా విచారణ సందర్భంగా.. ఆయన కేసు దర్యాప్తులో పోలీసులు తాజాగా సాధించిన పురోగతిని కోర్టుకు తెలిపారు. -
Delhi: తాగిన మైకంలో మూత్రం పోసి క్షమాపణలు.. అరెస్ట్
న్యూఢిల్లీ: మరో పీ గేట్ ఘటన వెలుగు చూసింది. న్యూయార్క్-న్యూఢిల్లీ అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. తప్పతాగిన స్థితిలో ఓ భారతీయ విద్యార్థి మూత్రవిసర్జన చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రయాణికుడు ఎలాంటి ఫిర్యాదు చేయకున్నా.. విమానయాన సంస్థ రంగంలోకి దిగి ఆ విద్యార్థిని అరెస్ట్ చేయించింది. శుక్రవారం రాత్రి అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఏఏ292 న్యూయార్క్ నుంచి బయలుదేరింది. శనివారం రాత్రి ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది. అయితే.. ఈ మధ్యలో ఓ ప్రయాణికుడు తప్పతాగిన మైకంలో మూత్ర విసర్జన చేశాడు. అది కాస్త పక్కనే ఉన్న ప్యాసింజర్‌కు తాకింది. దీంతో విమాన సిబ్బందికి విషయం తెలియజేశాడు సదరు ప్రయాణికుడు. అయితే.. మూత్ర విసర్జన చేసింది విద్యార్థి కావడం, ఫిర్యాదు చేస్తే అతని కెరీర్ దెబ్బ తింటుందనే ఉద్దేశం, పైగా క్షమాపణలు చెప్పడంతో.. ఈ ఘటనపై బాధితుడు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కానీ, విమానయాన సంస్థ మాత్రం ఈ ఘటనను తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. సిబ్బంది వెంటనే విషయాన్ని పైలట్‌కు తెలియజేశారు. పైలట్, ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. దీంతో.. ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. విమానం ల్యాండ్ కాగానే సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకుని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. పౌర విమానయాన నిబంధనల ప్రకారం.. ప్రయాణికుడు విమానంలో అనుచితంగా ప్రవర్తించినట్లు రుజువైతే.. క్రిమినల్ చట్టాల ప్రకారం శిక్షలతో పాటు కొంతకాలం అతనిపై విమానయాన వేటు విధించే అవకాశం ఉంటుంది. గత నవంబర్‌లో ఇదే తరహాలో ఎయిర్ ఇండియా విమానంలో జరిగిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. శంకర్ మిశ్రా అనే వ్యక్తి తాగిన మైకంలో ఓ వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసి జైలుకు వెళ్లి.. బెయిల్‌పై విడుదల అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి ఎయిర్ఇండియా స్పందన సరైన రీతిలో లేదన్న అభియోగాలతో.. విమానయాన సంస్థకు 30 లక్షల రూ. జరిమానా కూడా విధించింది డీసీసీఏ. -
శ్రద్ధా వాకర్ హత్య కేసు.. 3,000 పేజీల చార్జిషీట్
న్యూఢిల్లీ: దేశవ్యాప్త సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో 3 వేల పేజీల భారీ ముసాయిదా చార్జిషీట్‌ను ఢిల్లీ పోలీసు అధికారులు, న్యాయ నిపుణులు తయారు చేశారు. ఇందులో 100 సాక్ష్యాలతో కూడిన ఫోరెన్సిక్, ఎలక్ట్రానిక్ ఆధారాలున్నాయి. దీని నుంచి తుది చార్జిషీట్‌ను రూపొందించే పనిలో నిమగ్నమై ఉన్నారు. దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీలో ఉండే అఫ్తాబ్ పూనావాలా తన భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను గత మేలో గొంతు పిసికి చంపి, మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి, ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో పడేసేందుకు ముందుగా వాటిని ఫ్రిజ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. ఛతర్పూర్ అటవీ ప్రాంతంలో లభించిన ఎముకలు శ్రద్ధవేనని డీఎన్ఏ నివేదికల్లో తేలింది. ఇవే కీలక ఆధారాలు కానున్నాయి. -
Swati Maliwal: ఢిల్లీ పోలీసులకు ఎన్సీడబ్ల్యూ అల్టిమేటం
ఢిల్లీ: దేశ రాజధాని పోలీసులకు జాతీయ మహిళా కమిషన్ తాజాగా అల్టిమేటం జారీ చేసింది. ఢిల్లీ మహిళా కమిషన్ స్వాతి మలివాల్‌ను వేధించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తీసుకున్న చర్యల పూర్తి నివేదికను రెండు రోజుల్లోగా తమ ముందు ఉంచాలని ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖా శర్మ.. ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. స్వాతి మలివాల్‌తో తప్పతాగిన ఓ వ్యక్తి బుధవారం అర్ధరాత్రి పూట అనుచితంగా ప్రవర్తించాడని, కారుతో పాటు కొద్దిదూరం లాక్కెళ్లాడని మీడియాలో వచ్చిన కథనాలను పరిగణనలోకి తీసుకుంది జాతీయ మహిళా కమిషన్. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తూ.. ఢిల్లీ కమిషనర్‌కు రేఖా శర్మ లేఖ రాశారు. అంతకు ముందు ఇదే విషయంపై ఆమె ట్వీట్ కూడా చేశారు. కారుతో ఈడ్చుకెళ్లిన తాగుబోతు! ఇదిలా ఉంటే.. ఢిల్లీలో మహిళ భద్రతను పర్యవేక్షించే క్రమంలో ఎయిమ్స్ గేట్ వద్ద అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో తన టీంతో నిఘా పెట్టారు డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్. అయితే తప్పతాగి కారులో వచ్చిన వ్యక్తి ఆమెతో అనుచితంగా ప్రవర్తించడంతో పాటు ప్రతిఘటించే సమయంలో ఆమెను కారుతో పాటు లాక్కెళ్లే యత్నం చేశాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన స్వాతి మలివాల్.. భగవంతుడి దయతో బయటపడ్డానని, లేకుంటే తాను మరో అంజలి సింగ్‌ను అయ్యేదానిని అంటూ వ్యాఖ్యానించారు కూడా. ఇదిలా ఉంటే ఈ ఘటనకు సంబంధించి.. నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు కారును పోలీసులు సీజ్ చేశారు కూడా. -
జనవరి 31న రిటైర్మెంట్.. కారు ఢీకొని డ్యూటీలోని ఎస్సై మృతి!
న్యూఢిల్లీ: కారు ఢీకొట్టిన ఘటనలో విధుల్లో ఉన్న ఓ పోలీస్ అధికారి మృత్యువాతపడ్డారు. పదవీ విరమణకు కొన్ని రోజుల ముందు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నిపింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి ఢిల్లీ నగరం నడిబొడ్డున చోటుచేసుకుంది. 59 ఏళ్ల లతూర్ సింగ్ సెంట్రల్ జిల్లాలోని చందిని మహాల్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నాడు. శుక్రవారం రాత్రి రింగ్ రోడ్డులో రాజ్‌ఘాట్,శాంతివన్ సిగ్నల్స్ వద్ద వేగంగా వచ్చిన కారు లతూర్ సింగ్‌ను ఢీకొట్టింది. దీంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమయంలో సింగ్ డ్యూటీలో ఉన్నట్లు సెంట్రల్ డిప్యూటీ కమిషనర్ శ్వేతా చౌహన్ వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాగంజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రమాదానికి కారణమైన హర్యానా రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగిన హ్యుందాయ్ కారును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారుడ్రైవర్‌ను కూడా అరెస్ట్ చేశామని డీసీపీ తెలిపారు. నిందితుడిని శోకేంద్ర(34)గా గుర్తించారు. హర్యానాలోని సోనిపట్ జిల్లాకు చెందిన ఇతడు అసఫ్ అలీ రోడ్డులోని బ్యాంక్‌లో పనిచేస్తున్నట్లు తెలిపారు. కాగా మృతుడు లతూర్ సింగ్ జనవరి 31న రిటైర్మెంట్ తీసుకోనున్నారని శ్వేతా చౌహన్ తెలిపారు. అతడికి భార్య ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నాడని పేర్కొన్నారు. సింగ్ కుటుంబం దయాల్పూర్లో నివసిస్తుందని, వారికి ప్రమాదంపై సమాచారం ఇచ్చిన్నట్లు చెప్పారు. చదవండి: నితీష్ రాముడిగా, మోదీ రావణుడిలా.. కలకలం రేపుతున్న పోస్టర్లు -
Nupur Sharma: నూపుర్ శర్మకు గన్ లైసెన్స్ జారీ
ఢిల్లీ: మొహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కిన నూపుర్ శర్మకు గన్ లైసెన్స్ జారీ చేశారు ఢిల్లీ పోలీసులు. కిందటి ఏడాది ఓ టీవీ డిబేట్లో ఆమె ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగానే కాదు.. యావత్ ప్రపంచంలోనూ మంట పుట్టించాయి. ఆపై ఆమెను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కూడా. అయితే.. తనకు ప్రాణ హాని ఉందని, తరచూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఆమె ఎప్పటి నుంచో పోలీసులను ఆశ్రయిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలంటూ కోరారామె. ఈ నేపథ్యంలోనే ఆమెకు గన్ లైసెన్స్ జారీ చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. దీంతో ఆ లైసెన్స్ ఆధారంగా ఆమె ఆత్మ రక్షణ కోసం తుపాకీని వెంట పెట్టుకునే అవకాశం లభిస్తుంది. మరోవైపు.. సుప్రీం కోర్టు సైతం ఆమె భద్రత కారణాల దృష్ట్యా.. దేశంలో ఆమెపై దాఖలైన(దాఖలు అవుతున్న కూడా) ఎఫ్ఐఆర్లను ఢిల్లీకి బదలాయించాలని ఆదేశించి ఆమెకు ఊరట ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతకు కొన్నినెలల ముందు.. నూపుర్ శర్మ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బాధ్యతారాహిత్యంగా చేసిన వ్యాఖ్యలకు గానూ ఆమె తక్షణ క్షమాపణలు చెప్పాల్సిందని అభిప్రాయపడింది. బాధ్యత గల న్యాయవాది వృత్తిలో అనుభవం ఉండి.. సోయి లేకుండా ఆమె చేసిన వ్యాఖ్యలు దేశంలో విద్వేషాలకు దారి తీసిందని, పరిణామాలకు ఆమె ఒక్కతే బాధ్యత వహించాలంటూ కూడా అభిప్రాయపడింది. ఇక నూపుర్‌కు మద్దతు వ్యాఖ్యలు చేసినందుకే.. రెండు హత్యలు జరగడం దేశాన్ని కుదిపేసింది కూడా. రాజస్థాన్ ఉదయ్‌పూర్ ఓ టైలర్‌ను, ఆపై మహారాష్ట్ర అమరావతిలో ఓ ఫార్మసిస్ట్‌ను దారుణంగా హతమార్చారు. మరోవైపు ఆమెను హతమారుస్తామంటూ కొందరు వీడియోల ఆధారంగా బెదిరింపులకు పాల్పడ్డంతో ఆమె కొన్నాళ్లూ అజ్ఞాతంలోనూ గడిపారు. -
వీడియో కాల్‌తో ట్రాప్..ఏకంగా ఢిల్లీ హైకోర్టు పేరుతో రూ.2.69 కోట్లు..
గుజరాత్ వ్యాపారవేత్తని ఒక మహిళ మాయమాటలతో ఉచ్చులోకి దింపి ఏకంగా రూ.2.69 కోట్లు కొల్లగొట్టింది. బలవంతంగా వీడియోకాల్స్ మాట్లాడించి ఆ తర్వాత బ్లాక్‌మెయిల్‌కి పాల్పడి, కేసుల పేరుతో భయబ్రాంతులకు గురిచేసి పలు దఫాలుగా డబ్బులు కొల్లగట్టారు. చివరికి బాధితుడు తాను మోసపోయినట్లు గుర్తించి, సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకెళ్తే..పునరుత్పాదక ఇంధన సంస్థను నడుపుతున్న ఒక పారిశ్రమాకవేత్తకి గతేడాది ఆగస్టు8న రియా శర్మ అనే మహిళ నుంచి కాల్ వచ్చింది. ఆ తర్వాత ఆమె తన మాయమాటలతో ఆ వ్యక్తిని బట్టలు లేకండ వీడియో కాల్ మాట్లాడేలా చేసింది. ఆ తర్వాత అనుహ్యంగా ఫోన్ కాల్ కట్ అయ్యింది. కాసేపటికి ఆ వ్యాపారవేత్తని మీ నగ్న వీడియో సర్యూలేట్ కాకుండా ఉండాలంటే రూ. 50 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మరికొన్ని రోజుల తర్వాత ఢిల్లీ పోలీసు ఇన్స్పెక్టర్ గుడ్డుశర్మ అనే పేరుతో ఓ వ్యక్తి కాల్ చేసి ఏకంగా ఆ వీడియో క్లిప్ తన వద్ద ఉందని పేర్కొంటూ ఏకంగా రూ. 3 లక్షలు దోచేశాడు. సరిగ్గా ఆగస్టు14న మరో కాల్లో.. మీరు వీడియోకాల్ మాట్లాడిన మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని, ఆమె తల్లి మీపై కేసు పెట్టిందుకు సీబీఐని అశ్రయించందంటూ బాంబుపేల్చారు. ఈసారి ఏకంగా రూ. 80 లక్షలు డిమాండ్ చేశారు. సదరు బాధితుడు కేసు అనేసరికి బెంబేలెత్తి...ఎంత డబ్బైనా చెల్లించి ఈ కేసు నుంచి బయటపడాని అనుకున్నాడు. ఆ దుండగలు ఫేక్ ఢిల్లీ హైకోర్టు పేరుతో డిసెంబర్ 15 వరకు బాధితుడు నుంచి డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు. చివరి కేసు క్లోజ్ అయ్యిందంటూ ఒక ఉత్తర్వు చేతిలో పెట్టారు. అప్పుడు ఆ ఉత్తర్వు చూడగానే అనుమానం తలెత్తి సైబర్ క్రైంని ఆశ్రయించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు బాధితుడు జనవరి 10న సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి, దాదాపు 11 మందిపై కేసు పెట్టాడ. అంతేగాదు తన నుంచి సుమారు రూ. 2.69 కోట్లు దోపిడీ చేసినట్లు ఫిర్యాదు చేశాడని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: అయ్యో తల్లీ.. ఎంత పని చేశావ్? ) -
మా వాళ్లనే అరెస్ట్ చేస్తారా? ఢిల్లీ పోలీసులపై 100 మంది ఆఫ్రికన్ల దాడి!
న్యూఢిల్లీ: వీసా గడువు ముగిసినా దేశ రాజధానిలో ఉంటున్న ముగ్గురు నైజీరియన్లు అదుపులోకి తీసుకుంది యాంటీ డ్రగ్స్ ఫోర్స్. దీంతో దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమవారిని అరెస్ట్ చేస్తున్నారని తెలిసి సుమారు 100 మంది ఆఫ్రికన్లు పోలీసులను చుట్టు ముట్టారు. నైజీరియన్లను వారి నుంచి విడిపించేందుకు పోలీసులకు చుక్కులు చూపించారు. దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని స్వదేశం పంపించేందుకు నెబ్‌సరాయ్‌లోని రాజుపార్క్‌కు శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు నార్కొటిక్స్ సెల్ బృందం వెళ్లింది. వీసా గడువు ముగిసిన ముగ్గురు నైజీరియన్లను తమ అదుపులోకి తీసుకున్నారు. అప్పుడే పోలీసులను 100 మంది ఆఫ్రికన్లు చుట్టుముట్టారు. వారిని వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ గందరగోళ పరిస్థితుల్లోనే ముగ్గురిలో ఇద్దరు పోలీసుల చెర నుంచి తప్పించుకున్నారు. 22 ఏళ్ల పిలిప్ అనే వ్యక్తి దొరికిపోయాడు. పోలీసులపై మూకదాడి సమాచారం అందుకున్న నెబ్సరాయ్ పోలీస్ స్టేషన్ బృందం, నార్కొటిక్స్ స్క్వాడ్ సాయంత్రం 6.30 గంటలకు రాజ్‌పార్క్‌కు చేరుకుంది. ఓ మహిళతో పాటు మొత్తం నలుగురు నైజీరియన్లను అదుపులోకి తీసుకుంది. మళ్లీ సుమారు 150-200 మంది ఆఫ్రికన్ దేశాల ప్రజలు పోలీసులను చుట్టుముట్టారు. పోలీసుల చెరలో ఉన్న వారు తప్పించుకునేందుకు సాయం చేశారు. వారిని చెదరగొట్టిన పోలీసులు నిందితులను నెబ్సరాయ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి వారిని స్వదేశాలకు పంపించనున్నారు. Delhi Cops Arrest 3 On Drug Charge, Foreigners' Mob Brings Them Back https://t.co/Ggnt34m0rC pic.twitter.com/tFJLQBcF1L — NDTV (@ndtv) January 8, 2023 ఇదీ చదవండి: రాజౌరీ: హిందువులే లక్ష్యంగా దాడులు.. కేంద్రం కీలక నిర్ణయం.. గ్రామ రక్షణ కమిటీల పునరుద్ధరణ -
శంకర్ మిశ్రాను పట్టించిన సోషల్ మీడియా.. బెంగళూరులో అరెస్ట్
ఎయిరిండియా విమానంలో వృద్ద మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన కేసులో శంకర్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు విచారణ చేపట్టేందుకు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అధికారులు మిశ్రాకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు అతని కోసం దేశ వ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే లుక్ అవుట్ నోటీసులతో పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న మిశ్రా బెంగళూరులో ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ప్రత్యేక బృందాల సాయంతో బెంగళూరుకు చెందిన ఓ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దేశ రాజధానికి తరలించారు. మిశ్రాను పట్టించిన సోషల్ మీడియా లుక్ అవుట్ నోటీసులతో బెంగళూరులో తలదాచుకున్న శంకర్ మిశ్రా పోలీసులకు దొరక్కుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. క్రెడిట్ కార్డులను వినియోగించుకున్నాడు. అయితే తన స్నేహితులతో కమ్యూనికేట్ అయ్యేందుకు సోషల్ మీడియాను వినియోగించడంతో అతని ఆచూకీ లభ్యమైంది. సోషల్ మీడియా అకౌంట్స్ ఐపీవో అడ్రస్‌లను ట్రేస్ చేసిన పోలీసులు మిశ్రాను అరెస్ట్ చేశారు. (క్లిక్ చేయండి.. అమెజాన్: భారత్‌లో ఊడిన ఉద్యోగాల సంఖ్య ఇది) -
ఢిల్లీలో అనుహ్యంగా రోడ్ల మీదకు వచ్చిన జనం..ఒక్కసారిగా రహదారులు బ్లాక్
న్యూ ఇయర్ సందర్భంగా ఇండియా గేట్ వద్ద భారీగా జనం పోటెత్తారు. అదీగాక గత రెండేళ్లుగా కరోనా ఆంక్షల నేపథ్యంలో జనం చుట్టుపక్కల ఉన్న షాపింగ్ మాల్స్‌కి, దుకాణాలకు, ఫేమస్ ప్రదేశాలకు వెల్లువలా బయటకు వచ్చారు. దీంతో రహదారులన్నీ ఒక్కసారిగా బ్లాక్ అయ్యాయి. ఇదే సమయంలో జైనుల పుణ్య క్షేత్రమైన సమ్మేద్ షిఖార్జీని పర్యాటక ప్రదేశంగా ప్రకటించాలనే జార్ఖండ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జైన్ మతానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ చేయాలనుకున్నారు. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన పోలీసులు ఆందోళకనకారులను కొంత దూరంలోనే నిలిపేశారు. సరిగ్గా ఈ ప్రదేశంలోనే ఢిల్లీ వాసులు తమ కుటుంబ సభ్యులతో సెల్ఫీలతో సందడిగా ఉన్నారు. ఆ ప్రదేశం అంతా పికినిక్ స్పాట్‌గా మారింది. దీంతో ఢిల్లీలోని ఐటీఓ, మండిహౌస్, ఆశ్రమం, మధుర రోడ్, గ్రీన్‌పార్క్, డీఎన్డీ వంటి తదితర ప్రాంతాలలో చాలా దారుణమైన ట్రాఫిక్ ఏర్పడి వాహనాలన్ని ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. Delhi | Members of the Jain community protest at India Gate against the decision of the Jharkhand govt to declare 'sacred' Shri Sammed Shikharji a tourist place pic.twitter.com/6WCKHq3UII — ANI (@ANI) January 1, 2023 (చదవండి: న్యూ ఇయర్ గిఫ్ట్ అంటూ..పాముతో కాటు వేయించుకుని మరీ చనిపోయాడు) -
యూనిఫామ్ ఉందని మరిచారా సార్! మహిళతో ఎస్సై డ్యాన్స్ వీడియో వైరల్
న్యూఢిల్లీ: డ్యూటీలో ఉన్న సమయంలో రీల్స్, డ్యాన్సులు చేస్తూ వైరల్‌గా మారిన ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సస్పెండ్ అయిన సంఘటనలు చాలానే జరిగాయి. అయినప్పటికీ కొందరిలో ఎలాంటి మార్పు రావటం లేదు. తాము డ్యూటీలో ఉన్నామని, యూనిఫామ్‌లో ఉన్నామనే విషయాన్ని మరిచిపోతున్నారు. ఇలాగే ఓ పోలీసు అధికారి మైమరిచిపోయి మహిళతో చిందులేశారు. ఆ వీడియో కాస్త వైరల్‌గా మారడంతో చిక్కుల్లో పడ్డారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఆ పోలీసు అధికారిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టేందుకు ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు సమాచారం. నైరుతి ఢిల్లీలోని నారాయణ పోలీస్ స్టేషన్ ఇంఛార్జిగా శ్రీనివాస్ విధులు నిర్వర్తిస్తున్నారు. బంధువుల ఇంట్లో నిశ్చితార్థం వేడుకలకు పోలీసు యూనిఫామ్‌లోనే హాజరయ్యారు. ఈ క్రమంలో తమ బంధువైన ఓ మహిళతో ‘బలామ్ థనేందర్- నా ప్రేమికుడు పోలీసు’ అనే పాటకు కాలు కదిపారు. మహిళతో పాటు మైమరిచిపోయి డ్యాన్స్ చేశారు. మరోవైపు.. కొందరు పోలీసు సిబ్బంది ఆయనపై నోట్ల వర్షం కురిపించారు. అక్కడున్న వారంతా ఈ దృశ్యాలను తమ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. అయితే.. పోలీసు అధికారి సెలవులో ఉన్నారని సమాచారం. వీడియో వైరల్‌గా మారిన క్రమంలో పోలీసు అధికారిపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. పోలీసు యూనిఫామ్‌లో డ్యాన్సులు చేయటమేంటని ప్రశ్నిస్తున్నారు. స్టేషన్ ఇంఛార్జి తీరుపై ఉన్నతాధికారులు సైతం అసహనంతో ఉన్నారనే సమాచారం. ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. Video Of Delhi Cop's Dance In Uniform Goes Viral, He May Face Action https://t.co/WonuFuamws pic.twitter.com/vji8qdvtkT — NDTV (@ndtv) December 20, 2022 ఇదీ చదవండి: ‘శునకం’ వ్యాఖ్యలపై దద్దరిల్లిన రాజ్యసభ.. క్షమాపణలకు ఖర్గే ససేమిరా -
మరో వ్యక్తితో శ్రద్ధా డేటింగ్.. అందుకే చంపి ముక్కలుగా చేశా: అఫ్తాబ్
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య ఘటన వెలుగులోకి వచ్చిన నెల రోజులు సమీపిస్తున్నా నిత్యం సంచలన విషయాలు తెరమీదకు వస్తున్నాయి. యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసిన ఈ ఘోర ఈ దారుణ ఘటనలో నిందితుడి ఆఫ్తాబ్ను పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న అఫ్తాబ్ రోజుకో కొత్త విషయాలను చెప్పి షాక్‌లా మీద షాక్‌లు ఇస్తున్నాడు. తాజాగా మరో షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తిని శ్రద్ధా కలిసినందుకే తనను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. బంబుల్ డేటింగ్ యాప్ ద్వారా శ్రద్ధాకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడిందని, మే 17న అతన్ని గురుగ్రామ్‌లో కలవడానికి వెళ్లిందని తెలిపాడు. ఆరోజంతా అతనితోనే గడిపి మరుసటి రోజు(మే 18న) మధ్యాహ్నం మెహహ్రోలీలో ఉంటున్న తన ఫ్లాట్‌కు తిరిగి వచ్చిందని పేర్కొన్నాడు. ఈ విషయంపై ఆరోజు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని.. గొడవ పెద్దదవడంతోనే ఆమెను చంపినట్లు పేర్కొన్నాడు. అఫ్తాబ్ చెబుతుంది నిజమా? కాదా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాల కోసం బంబుల్ యాప్‌కు పోలీసులు లేఖ రాశారు. అలాగే శ్రద్దా వాకర్ ఫోన్ కాల్స్, లొకేషన్ టవర్ డేటాను పరిశీలిస్తున్నారు. చదవండి: ‘ఇండియాలోని అత్తమామలు ఐఫోన్లు గిఫ్ట్ ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నారు’ అంతకుముందే విచారణలో శ్రద్ధాతో బ్రేకప్ చేసుకున్నట్లు, ఆమెతో సహజీవనం చేయడంలేదని అఫ్తాబ్ పోలీసులకు తెలిపాడు. అప్పటి నుంచి వారు కేవలం ఫ్లాట్మెట్స్లా కలిసి ఉంటున్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం ఆఫ్తాబ్ తీహార్ జైలులో ఉన్నాడు. మరో రెండు రోజుల్లో అతని జ్యూడిషియల్ కస్టడీ ముగియనుంది. ఇప్పటి వరకు అఫ్తాబ్ కుటుంబ సభ్యులెవరూ అతన్ని కలవడానికి జైలుకు రాలేదని అధికారులు తెలిపారు. ఇన్ని రోజులు సెల్లో ఒంటరిగానే ఉండేవాడని, లేదంటే పుస్తకాలు చదవడం, కొన్నిసార్లు తోటి ఖైదీలతో చెస్ ఆట ఆడేవారని పేర్కొన్నారు. మరోవైపు డీఎన్ఐ అనాలసిస్, పాలిగ్రాఫ్, నార్కో టెస్ట్ రిపోర్ట్స్ కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే అవన్నీ ఢిల్లీ పోలీసులకు అందిచనున్నట్లు ఫోరెన్సిక్ అధికారి ఒకరు తెలిపారు. చదవండి: పిల్లలే దూరమైతే నా బతుకెందుకు..! -
శశి థరూర్‌కు తప్పని చిక్కులు.. ఆ కేసులో కోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్‌ను ఆయన భార్య సునంద పుష్కర్ మృతి కేసు వెంటాడుతూనే ఉంది. ఈ కేసులో శశిథరూర్‌కు క్లీన్చిట్ ఇవ్వటంపై హైకోర్టును ఆశ్రయించారు ఢిల్లీ పోలీసులు. థరూర్‌పై ఉన్న అభియోగాలను కొట్టవేస్తూ గతేడాది పాటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు.. శశి థరూర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఊరట లభించిన దాదాపు 15 నెలల తర్వాత ఢిల్లీ పోలీసులు రివిజన్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ ఢీకే శర్మ.. పిటిషన్ కాపీని శశి థరూర్ న్యాయవాదికి అందించాలని ఢిల్లీ పోలీసుల తరపు న్యాయవాదికి సూచించారు. పిటిషన్ కాపీ తమకు అందలేదని, అది ఉద్దేశ పూర్వకంగానే మరో మెయిల్‌కు పంపి ఉంటారని థరూర్ న్యాయవాది ధర్మాసనానికి తెలపడంతో ఈ మేరకు ఆదేశించారు. మరోవైపు.. రివిజన్ పిటిషన్ ఆలస్యానికి క్షమించాలని ఢిల్లీ పోలీసులు న్యాయస్థానానికి అప్పీల్ చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసుల పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని శశి థరూర్‌కు నోటీసులు జారీ చేసింది కోర్టు. ఈ కేసుకు సంబంధించిన పత్రాలను వ్యాజ్యదారులకు మినహా వేరే వ్యక్తులకు పంపించొద్దని సూచించింది ధర్మాసనం. కేసు విచారణను 2023, ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేశారు. ఇదీ కేసు.. 2014, జనవరి 17న ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్లో సునందా పుష్కర్ అనుమానాస్పదంగా మృతి చెందటం కలకలం సృష్టించింది. తొలుత హత్య కోణంలో దర్యాప్తు జరిపినా.. చివరకు ఆత్మహత్యగా పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అయితే, సునంద ఆత్మహత్య చేసుకునేలా శశి థరూర్ ప్రేరేపించారని ఆయనపై అభియోగాలు మోపారు. దీంతో ఆయన ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన పాటియాలా హౌస్ కోర్టు.. 2021, ఆగస్టులో ఆ అభియోగాలను కొట్టివేస్తూ థరూర్‌కు క్లీన్చిట్ ఇచ్చింది. ఇదీ చదవండి: రామభక్తుల నేలపై రావణుడు అనడం.. ఖర్గే కామెంట్లపై ప్రధాని ఘాటు కౌంటర్ -
నాకు స్వర్గం గ్యారెంటీ.. అక్కడ అప్సరసలతో ఆనందిస్తా..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా పాలిగ్రాఫ్ టెస్టులో నివ్వెరపరిచే అంశాలు బయటపెట్టాడు. నమ్మి సహజీవనం చేసిన శ్రద్ధా వాకర్‌ను అత్యంత పాశవికంగా కడతేర్చినందుకు తనకు ఇసుమంతైనా పశ్చాత్తాపం లేదని కుండబద్దలు కొట్టాడు! ‘‘నన్ను ఉరితీసినా బాధ లేదు. ఎందుకంటే నేను స్వర్గానికే వెళ్తా. అక్కడ నన్నంతా ఓ హీరోలా చూస్తారు. అప్సరసలతో ఆనందిస్తా’’ అని చెప్పుకొచ్చాడు. ‘‘శ్రద్ధను చంపేటప్పుడు గానీ, శవాన్ని ముక్కలుగా నరుకుతున్నప్పుడు గానీ ఏమాత్రం బాధగా అనిపించలేదు. అసలు ముంబైలో ఉండగానే శ్రద్ధను చంపి ముక్కలు చేయాలని భావించా’’ అని వెల్లడించాడు. అంతేకాదు, ‘‘శ్రద్ధతో సహజీవనం చేస్తూనే మరోవైపు 20 మందికి పైగా అమ్మాయిలతో సంబంధం పెట్టుకున్నా! బంబుల్ యాప్ సాయంతో వారిని ట్రాప్ చేసేవాడిని. శ్రద్ధను చంపాక ఓ సైకాలజిస్ట్‌ను ఫ్లాట్‌కు ఆహ్వానించి ఆమెతో గడిపా. శ్రద్ధ తాలూకు రింగును ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చా’’ అని వివరించాడు. ఇవన్నీ విని షాకయ్యామని పోలీసులు చెప్పుకొచ్చారు. విచారణ అనంతరం అతను ఏ చీకూచింతా లేకుండా ఇట్టే నిద్రలోకి జారిపోయేవాడని వివరించారు. పరీక్ష అనంతరం అతని ఫ్లాట్ నుంచి ఐదు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. -
శ్రద్ధ కేసు: అఫ్తాబ్ అలాంటి వాడని ఊహించలేదు!
ఆమె మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్లకు చికిత్స అందించే వైద్యురాలు. అలాంటి ఆమెకే షాకిచ్చి.. మానసిక చికిత్స తీసుకునేలా చేశాడు మెహ్రౌలీ ఘోర హత్యోదంతంలో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా. శ్రద్ధా వాకర్‌ను ముక్కలు చేసిన అనంతరం.. ఆ విడిభాగాలను ఇంట్లో ఫ్రిడ్జ్‌లో ఉంచి మరీ ఈ కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో డేటింగ్ చేశాడు. ఈ క్రమంలో.. ఆ మానవ మృగం గురించి సదరు యువతిని ఆరా తీసిన పోలీసులు.. స్టేట్మెంట్ నమోదు చేశారు. శ్రద్ధా వాకర్ హత్య అనంతరం.. ఆఫ్తాబ్ డేటింగ్ యాప్ ద్వారా మరో యువతిని పరిచయం చేకున్నాడు. ఆమె పలుమార్లు ఇంటికి రప్పించాడు. ఆమె ఓ సైకియాట్రిస్ట్. అయితే ఆ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కనీసం శ్రద్ధా వాకర్‌తో అతని గత పరిచయ విషయం కూడా తనకు తెలియదని ఆమె వాపోయింది. ఆఫ్తాబ్ ఫ్లాట్‌కు వెళ్లిన సమయంలో అతడి ఫ్రిజ్‌లో మానవ శరీర భాగాలు ఉన్న విషయం తనకు తెలియదని సదరు యువతి వెల్లడించింది. అయితే.. హత్య జరిగిన తర్వాత రెండుసార్లు తాను అఫ్తాబ్ ఫ్లాట్‌కు వెళ్లినట్లు మాత్రం ఒప్పుకుంది. ‘‘డేటింగ్ యాప్ ద్వారా నాకు అఫ్తాబ్‌తో పరిచయం ఏర్పడింది. అతను చాలా నార్మల్‌గా కనిపించేవాడు. కాకపోతే సిగరెట్లు ఎక్కువగా కాల్చేవాడు. బాడీస్ప్రేలు, ఫర్ఫ్యూమ్ల కలెక్షన్ ఎక్కువగా ఉండేది అతని దగ్గర. వాటిల్లోంచి కొన్ని నాకు గిఫ్ట్‌గా ఇచ్చేవాడు. అలాగే మా డేటింగ్ కొన్ని నెలలపాటు సాగింది. అక్టోబర్ 12వ తేదీన ఆఫ్తాబ్ నాకు ఓ ఫ్యాన్సీ ఉంగరాన్ని గిఫ్ట్‌గా ఇచ్చాడు. అది అతని మాజీ ప్రేయసిది, ఆమెను అతనే చంపేశాడనే విషయం మీరు(సిట్ పోలీసులు) చెప్పేదాకా తెలియదు. ఆమె చనిపోయినట్లుగా చెప్తున్న నెల వ్యవధిలో అతన్ని రెండుసార్లు కలిశా అని ఆమె ఒప్పుకుంది. అఫ్తాబ్ తనతో చాలా నార్మల్‌గా ఉండేవాడని, ముంబయిలోని తన ఇంటి గురించి తరచూ తనతో చెప్తుండేవాడని ఆమె పేర్కొంది. అతని ప్రవర్తన చూసి మంచివాడు అనుకున్నానే తప్ప.. అంత ఘోరం చేస్తాడని ఊహించని లేదని ఆమె తెలిపింది. అఫ్తాబ్ గురించి తెలిశాక షాక్ తిన్న ఆమె కొన్నాళ్లు మానసిక చికిత్స తీసుకుంది. డిశ్చార్జి అయ్యి ఇంటికి వచ్చిన ఆమె నుంచి పోలీసులు ఇవాళ వాంగ్మూలం సేకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఒకేసారి డేటింగ్ యాప్‌ల ద్వారా పాతిక మంది దాకా యువతులను అఫ్తాబ్ సంప్రదించినట్లు తేలిందని పోలీసులు తాజాగా వెల్లడించారు. ఇదీ చదవండి: నేరం ఒప్పుకోలు.. పశ్చాత్తాపంలేని అఫ్తాబ్ -
ఆప్ ఎన్నికల అభ్యర్ధి తుపాకీతో డ్యాన్సులు.. వీడియో వైరల్
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థి సింగ్ స్వరూప్ తుపాకీతో డ్యాన్సులు చేస్తూ హల్చల్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ మేరకు పోలీసులు ఈ కేసును సుమోటోగా తీసుకుని ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఆ వీడియోలో సింగ్స్వరూప్ పసుపు రంగు టీషర్ట్ ధరించి కొంతమంది వ్యక్తులతో కలిసి డ్యాన్యులు చేస్తున్నట్లు కనిపించాడు. ఆ తర్వాత ఉన్నటుండి సడెన్‌గా తుపాకీని తీసి తన సహచరులతో రౌడీ మాదిరిగా చిందులు వేశాడు. వాస్తవానికి డిసెంబర్ 4న 250 వార్డులకు మున్సిపల్ ఎన్నికలు జరుగునున్నాయి. ఈ తరుణంలో ఆప్ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థి ఇలా తుపాకీతో హల్చల్ చేయడంతో పార్టీ శ్రేణులంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. Joginder singh (yellow T- Shirt me) Ward 19N Swaroop Nagar se AAP ne MCD Election ka ticket diya hai.. @IamAjaySehrawat pic.twitter.com/oRcdogavP4 — Dev विराट (@Dev08364316) November 24, 2022 (చదవండి: వర్క్ ఫ్రం హోమ్ తెచ్చిన తంటా!..ఆఖరికి పెళ్లి పీటలపై కూడా) -
శ్రద్ధా కేసు: అఫ్తాబ్‌కి ఆ సమయంలో రక్షణగా ఉన్న పోలీసులకు రివార్డు
న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్ హత్య కేసులోని నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాని తీసుకువెళ్తున్న వాహనంపై కొందరూ దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో అతడికి రక్షణగా ఉన్న ఐదుగురు పోలీసులు గాల్లో కాల్పులు జరిపి పరిస్థితిని చాలా చాకచక్యంగా అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ కుమార్ ఆ సమయంలో సరైన విధంగా స్పందించిన ఢిల్లీ ఆర్మీ పోలీస్ బృందానికి చెందిన మూడవ బెటాలియన్ పోలీస్ కమాండ్‌కి రివార్డులు బహుకరించారు. ఈ మేరకు సబ్ఇన్స్పెక్టర్లు ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రివార్డు అందజేశారు. ఇద్దరు కానిస్టేబుళ్లకు రూ 5000/-లు మరోక కానిస్టేబుల్ రూ. 5000లు బహుకరించారు. ఇదిలా ఉండగా, ఢిల్లీ పోలీసులు అప్తాబ్‌ను పాలీగ్రఫీ టెస్ట్ నిమిత్తం సోమవారం ఎఫ్ఎస్ఎల్ ల్యాబొరేటరీకి తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. ఇక అఫ్తాబ్‌కి నిర్వహించాల్సిన టెస్ట్‌లు పూర్తి అయిన తదనతరం రక్షణగా ఉన్న ఢిల్లీ ఆర్మీ పోలీసు బృందం వ్యాన్ని పూర్తిగా తనిఖీ చేసి తీహార్ జైలుకి తరలించేందుకు సిద్ధం అయ్యారు. సరిగ్గా వ్యాన్ రోహిణి ప్రాంతంలోని కార్యాలయం నుంచి గేటు దాటుతుండగా... అకస్మాత్తుగా ఒక గుంపు జైలు వ్యాన్‌పై దాడి చేసింది. దీంతో ఢిల్లీ ఆర్మ్డ్ పోలీస్(డీఏపీ) బృందం అద్భుతమైన తెగువను ప్రదర్శించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా రక్షించింది. ఇది చాలా ప్రశంసించదగ్గ విషయం అని ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ పేర్కొంటూ వారికి రివార్డులు అందజేసింది. కాగా అప్తాబ్ పోలీస్ వాహనంపై దాడికి పాల్పడ్డ నిందితులు కుల్దీప్ ఠాకూర్, నిగమ్ గుర్జార్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత వారిని అక్కడి నుంచి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. మిగిలిన నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు తమ బృందం ప్రయత్నిస్తోందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. (చదవండి: ‘మా సోదరిని వాడు 35 ముక్కలు చేశాడు సార్.. మేం 70 ముక్కలు చేస్తాం’) -
ఆరు రోజులుగా ఎయిమ్స్ సర్వర్ హ్యాక్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రఖ్యాత ఆస్పత్రి ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడకల్ సైన్సెస్ (ఎయిమ్స్) సర్వర్ హ్యాకైంది. ఆరు రోజులుగా పని చేయడం లేదు. సర్వర్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్న హ్యాకర్లు రూ.200 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని ది ఇండియా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషిచేస్తోంది. ఢిల్లీ పోలీస్ ఇంటెలిజెన్స్ ఫ్యూజన్, స్ట్రాటెజిక్ ఆపరేషన్స్ విభాగం కేసు నమోదుచేసి దర్యాప్తు కొనసాగిస్తోంది. బుధవారం ఉదయం స్తంభించిన సర్వర్‌లో దాదాపు నాలుగు కోట్ల మంది రోగుల ఆరోగ్య, బిల్లుల చెల్లింపుల సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. డేటా అంతా అమ్మకానికి వస్తే అప్రతిష్ట తప్పదని పోలీసు, ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. మాజీ ప్రధానమంత్రులు, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, న్యాయమూర్తుల ఆరోగ్య సమాచారం సైతం సర్వర్‌లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అందుకే హ్యాకర్లు రూ.200 కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. -
‘వాడు 35 ముక్కలు చేశాడు.. మేం 70 ముక్కలు చేస్తాం’
సాక్షి, ఢిల్లీ: నగరంలో సోమవారం సాయంత్రం హైడ్రామా నెలకొంది. శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాను తీసుకెళ్తున్న పోలీస్ వాహనంపై కొందరు దాడికి యత్నించారు. ఊహించని ఈ పరిణామంతో కంగుతిన్న పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. రోహిణి ప్రాంతంలోని ఎఫ్ఎస్ఐ ల్యాబ్‌లో సోమవారం సాయంత్రం అఫ్తాబ్‌కు పాలిగ్రఫీ టెస్ట్ నిర్వహించినట్లు సమాచారం. అదయ్యాక బయటకు వాహనంలో తీసుకొస్తున్న తరుణంలో.. హిందూసేన కార్యకర్తలుగా చెప్పుకుంటున్న కొందరు అడ్డగించారు. తల్వార్లతో దూసుకొచ్చిన ఆ యువకులు.. పోలీస్ వాహనంపై దాడికి యత్నించారు. ‘‘వాడు మా సోదరిని చంపి 35 ముక్కలుగా చేశాడు. మేం వాడిని చంపి 70 ముక్కలు చేస్తాం. పోలీసులు వాడికి సెక్యూరిటీ కల్పించడం ఏంటి? వాడిని మాకు అప్పగించండి.. చంపేస్తాం అంటూ నినాదాలు చేశారు వాళ్లు. మా ఆడబిడ్డలు, అక్కాచెల్లెళ్లకు భద్రత కొరవడినప్పుడు.. మేం బతికి ఉండి ఏం సాధించినట్లు అంటూ కొందరు అక్కడే ఉన్న మీడియాతో వ్యాఖ్యానించారు. ఒక్కసారిగా వచ్చిన మూకను చూసి పోలీసులు షాక్ తిన్నారు. ఎంతకూ వెనక్కి తగ్గకపోవడంతో గాల్లోకి కాల్పులు జరిపారు. పలువురిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని నియంత్రించారు. #WATCH | Police van carrying Shradhha murder accused Aftab Poonawalla attacked by at least 2 men carrying swords who claim to be from Hindu Sena, outside FSL office in Delhi pic.twitter.com/Bpx4WCvqXs — ANI (@ANI) November 28, 2022 ఇదీ చదవండి: శ్రద్ధా వాకర్ కంటే భయంకరమైన హత్య ఇది! -
ఆ పోలీసాయన తెగువకి హ్యాట్సాఫ్.. నెట్టింట వైరల్
వైరల్: విధి నిర్వహణలో ప్రాణాలు పణంగా పెట్టిన అధికారుల గాథలు మనం బోలెడు చూసి ఉంటాం. అదే విధంగా.. సమయస్ఫూర్తితో వ్యవహరించే వాళ్లు కూడా అప్పుడప్పుడు తారసపడుతుంటారు. అలా.. ఢిల్లీలో ఓ పోలీసాయన డ్యూటీలో చూపించిన తెగువకి అభినందనలు కురుస్తున్నాయి. ఢిల్లీలో సత్యేంద్ర అనే కానిస్టేబుల్ తన విధి నిర్వహణను సక్రమంగా నిర్వహించారు. అదీ తెగువ ప్రదర్శించి. షాహాబాద్ డెయిరీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు చోరీకి గురైందన్న సమాచారం అందుకున్నారాయన. వెంటనే.. చెయిన్‌తో పారిపోతున్న ఓ దొంగను వెంటాడి.. భైక్ మీద నుంచి దూకి మరీ అతన్ని పట్టుకున్నాడు. చెయిన్ రికవరీతో పాటు పారిపోతున్న ఆ దొంగను పట్టేసుకున్న సత్యేంద్ర ఉన్నతాధికారుల అభినందనలు సైతం అందుకున్నారు. ఆపై తేలింది ఏంటంటే.. కానిస్టేబుల్ సత్యేంద్ర పట్టుకుంది మామూలు చెయిన్ స్నాచర్‌ను కాదంట. అతనికి నేర చరిత్ర చాలానే ఉందని, అతని ద్వారా పదకొండు పెండింగ్ కేసులను విజయవంతంగా పరిష్కరించగలిగామని ఢిల్లీ పోలీసులు ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు. ప్రాణాలకు తెగించి మరీ స్నాచర్‌ను పట్టుకున్న కానిస్టేబుల్ సత్యేంద్రపై అభినందనలు కురుస్తున్నాయి. ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేసిన ఆ వీడియోనే ఇప్పుడు ట్విటర్ ద్వారా ట్రెండ్ అవుతోంది. अपनी जान की परवाह किए बगैर शाहबाद डेरी थाने के कांस्टेबल सत्येंद्र ने एक स्नैचर को गिरफ्तार किया। इस स्नैचर की गिरफ्तारी से 11 मामले सुलझाए गए। विधिक कार्यवाही जारी है।@dcp_outernorth#HeroesOfDelhiPolice pic.twitter.com/PceBbYpdYQ — Delhi Police (@DelhiPolice) November 24, 2022 -
ఆస్ట్రేలియాలో ఢిల్లీ పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్..
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో మోస్ట్ వాంటెడ్ నిందితుడిని ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియా బీచ్‌లో జరిగిన ఓ యువతి హత్య కేసులో నిందితుడుగా ఉన్న రాజ్వేందర్ సింగ్‌ను(38) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2018 ఆక్టోబర్ 21న క్వీన్స్లాండ్ బీచ్‌లో నడుచుకుంటూ వెళ్తుండగా 24 ఏళ్ల తోయా కార్డింగ్లీ యువతి హత్యకు గురైంది. బీచ్ మర్డర్ కేసుగా ఈ ఘటన ఆ దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్విందర్ సింగ్ హత్య చేసిన రెండు రోజులకే దేశం విచిడి పారిపోయాడు. ఉన్నపళంగా ఉద్యోగం, భార్య, ముగ్గురు పిల్లలను వదిలి భారత్‌కు చెక్కేశాడు. పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లోని బటర్ కలాన్‌కు చెందిన రాజ్ విందర్ ఆస్ట్రేలియాలోని ఇన్నిస్ ఫైల్ టౌన్లో నివసించేవాడు. అక్కడే నర్సింగ్ అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. ఆస్ట్రేలియా నుంచి పారిపోయి వచ్చిన తర్వాత అతడు పంజాబ్‌లో తలదాచుకున్నాడు. అప్పటి నుంచి ఆస్ట్రేలియన్ పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. 2021 మార్చి నెలలో రాజ్విందర్ సింగ్‌ను అప్పగించాలని ఆస్ట్రేలియా భారత్‌ను కోరింది. అదే ఏడాది నవంబర్‌లో భారత్ అందుకు అంగీకరించింది. కొన్ని వారాల క్రితం రాజ్ విందర్పై క్వీన్స్లాండ్ పోలీసులు భారీ రివార్డు ప్రకటించారు. నిందితుడిని ఆచూకీ తెలిపిన వారికి 1 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు( భారత్ కరెన్సీలో దాదాపు 5 కోట్లు) నజరానా ప్రకటించారు. దీంతో ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. కాగా క్వీన్స్లాండ్ పోలీసులు ప్రకటించిన అత్యంత భారీ రివార్డు ఇదే. ఆస్ట్రేలియా అధికారులు, భారత్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఇందు కోసం పంజాబీ, హిందీ మాట్లాడే అయిదుగురు పోలీస్‌లను ఆస్ట్రేలియన్ ప్రభుత్వం నియమించింది. ఫలితంగా నిందితుడు పోలీసులకు చిక్కాడు. చదవండి: Video: చిన్నారిపై అత్యాచారం.. నిందితుడికి ఐదు గుంజీల శిక్ష -
స్నాచర్ ఆటకట్టించిన ఢిల్లీ పోలీస్
-
శ్రద్ధా వాకర్ హత్య కేసు: సీబీఐ విచారణ దేనికి?
ఢిల్లీ: సంచలన శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఇవాళ కూడా కీలక పరిణామాలే చోటు చేసుకున్నాయి. నిందితుడు అఫ్తాబ్ కస్టడీని పొడగించింది ఢిల్లీ సాకేత్ కోర్టు. అయితే.. సీబీఐకి అప్పగించాలన్న విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మంగళవారం హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ అభ్యర్థనను విచారణకు స్వీకరించడానికి మాకు ఒక్క మంచి కారణం కనిపించలేదు అని ఈ సందర్భంగా జస్టిస్ సతీష్ చంద్ర, జస్టిస్ సుబ్రమణియమ్ ప్రసాద్‌తో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. ఢిల్లీ పోలీసుల దర్యాప్తుపై బాధితురాలి తల్లిదండ్రులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. అలాంటిది మీకు ఎందుకు అంత ఆసక్తి?. అంటూ కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అంతేకాదు.. ‘మేమేం విచారణ పర్యవేక్షణ సంస్థ కాదు’ అంటూ ఘాటు కామెంట్ చేసింది. శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని ఢిల్లీ హైకోర్టు ఈ సందర్భంగా తెలిపింది. అసలు సీబీఐ దర్యాప్తు కోరాల్సిన అవసరం ఏముందని పిటిషనర్‌ని నిలదీసింది. పోలీసులు 80 శాతం దాకా దర్యాప్తు పూర్తి చేశారని, ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో 200 మంది సిబ్బంది ఇందులో భాగం అయ్యారని ఈ సందర్భంగా హైకోర్టు పిటిషనర్ తరపు న్యాయవాదికి తెలిపింది. ఇదిలా ఉంటే ఈ కేసులో ఢిల్లీ పోలీసుల తీరును తప్పుబడుతూ.. సీబీఐకి కేసును అప్పగించాలని పిటిషనర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. శ్రద్ధా వాకర్ కేసులో దర్యాప్తు సమర్థవంతంగా జరగడం లేదని, పైగా ఆధారాల సేకరణలోనూ ఢిల్లీ పోలీసులు విఫలం అవుతున్నారని, ఇవీగాక.. దర్యాప్తులో ప్రతీ విషయం మీడియాకు చేరుతోందని పిటిషనర్ తరపు న్యాయవాది అడ్వొకేట్ జోగిందర్ తులీ(రిటైర్డ్ ఐపీఎస్ కూడా)వాదించారు. అయితే.. కోర్టు మాత్రం సీబీఐ విచారణకు ఆదేశించేది లేదంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. -
శ్రద్ధా హత్య కేసు: నిజాలు నిగ్గు తేల్చేందుకు..
శ్రద్ధా వాకర్ హత్య కేసులో.. నిందితుడికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో నిందితుడి అతిక్రూర స్వభావం బయటపడడంతో ఆధారాలను పక్కాగా కోర్టుకు సమర్పించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో.. నిందితుడిపై పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతించాలని కోర్టు అనుమతి కోరారు. శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాపై పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు సోమవారం సాకేత్ కోర్టులో ఢిల్లీ పోలీసులు పిటిషన వేశారు. ఈ కేసులో తొలుత పోలీసులను పక్కదారి పట్టించే విధంగా వ్యవహరించాడు నిందితుడు అఫ్తాబ్. అయితే చివరికి నేరం ఒప్పుకున్నప్పటికీ.. అతని సమాధానాలు పొంతన లేకుండా ఉంటున్నాయని పోలీసులు అంటున్నారు. ఇంతకు ముందు అఫ్తాబ్‌పై నార్కో అనాలసిస్ టెస్ట్ నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసులకు సాకేత్ కోర్టు అనుమతి ఇచ్చింది. ఇక ఇప్పుడు.. అఫ్తాబ్‌పై పాలీగ్రాఫ్ పరీక్షల నిర్వహణకు అనుమతించాలని సాకేత్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదిలా ఉంటే మెజిస్ట్రేట్ విజయశ్రీ రాథోడ్.. అఫ్తాబ్‌పై నార్కో అనాలసిస్ పరీక్ష నిర్వహణకు అనుమతించారు. దీంతో.. పాలిగ్రాఫ్ అనుమతించే విషయంపై తేల్చాల్సిందిగా మెజిస్ట్రేట్ రాథోడ్ అభిప్రాయసేకరణకు పోలీసుల పిటిషన్‌ను పంపించారు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అవిరల్ శుక్లా. మంగళవారం ఈ పిటిషన్ విచారణకు రానుంది. మరోవైపు ఐదురోజుల కస్టడీ గడువు ముగియడంతో ఢిల్లీ పోలీసులు.. అఫ్తాబ్‌ను కోర్టులో సమర్పించాల్సి ఉంటుంది. గతంలో ఢిల్లీ పోలీసులు కోర్టుకు ‘అఫ్తాబ్ తప్పుడు సమాచారం అందించాడని, దర్యాప్తును తప్పుదోవ పట్టించే యత్నం చేశాడ’ని కోర్టుకు నివేదిక సమర్పించారు. ఇక నిందితుడు అఫ్తాబ్‌పై థర్డ్ డిగ్రీ ఉపయోగించొద్దని దర్యాప్తు అధికారులను ఆదేశించిన న్యాయస్థానం.. నార్కో అనాలసిస్‌ను ఐదు రోజుల్లో పూర్తి చేయాలని గత గురువారం ఆదేశించింది. అయితే సోమవారం నిర్వహించాల్సిన ఈ పరీక్ష వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇక అతని తరపు న్యాయవాది ఎవరూ వాదించేందుకు ముందుకు రాకపోవడంతో.. న్యాయవాది హర్షిత్ సాగర్‌ను లీగల్ ఎయిడ్ కౌన్సెల్‌గా నియమించిన సంగతి తెలిసిందే. పాలీగ్రాఫ్ టెస్ట్ ఎలా ఉంటుందంటే.. పాలీగ్రాఫ్ టెస్ట్.. నేర పరిశోధనలో ప్రయోగాత్మకమైన పద్ధతి. లైడిటెక్టర్ పరీక్ష అని కూడా వ్యవహరిస్తుంటారు. నిజాలను రాబట్టడం అనడం కంటే.. అబద్ధాలను గుర్తించడం అనే ట్యాగ్‌తో ఈ పరీక్షగా ఎక్కువగా పాపులర్ అయ్యింది. 1921లో కాలిఫోర్నియా యూనివర్సిటీ మెడికో జాన్ అగస్టస్ లార్సన్ ఈ విధానాన్ని కనిపెట్టారు. ఎలక్ట్రానిక్ యంత్రాల సాయంతో ఈ పరీక్ష నిర్వహిస్తారు. వైర్లు, ట్యూబుల్లాంటి వాటితో శరీరానికి సెన్సార్ల వంటి నిర్దిష్ట పరికరాలను జోడించి.. బీపీ, పల్స్, వివిధ భావోద్వేగాలు, శరీర కదలికలను జాగ్రత్తగా పర్యవేక్షించడం ద్వారా ఈ టెస్ట్ నిర్వహిస్తుంటారు. శరీరం ఎలా స్పందిస్తుందో నిశితంగా గమనించి ఆ వ్యక్తి చెప్పేది నిజమో అబద్ధమో అనే నిర్ధారణకు అధ్యయనం చేపట్టడం ద్వారా వస్తారు. క్రిమినల్ కేసుల దర్యాప్తుల్లో కీలకంగా వ్యహరిస్తుంటుంది ఈ పరీక్ష. కానీ, ఇదే ఫైనల్ రిజల్ట్ అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే.. నేరస్థులు ప్రాక్టీస్ ద్వారా ఈ పరీక్ష నుంచి తప్పించుకున్న దాఖలాలు బోలెడు ఉన్నాయి. అందుకే ఈ పరీక్ష ఖచ్చితత్వంపై తరచు విమర్శలు వినిపిస్తుంటాయి. నార్కో టెస్ట్.. ఈ పరీక్షకి ముందు కొన్ని మందులు లేదంటే ఇంజెక్షన్లు ఇస్తారు. తద్వారా నిందితుడు/అనుమానితుడు అపస్మార స్థితిలోకి జారుకుంటాడు. మనస్సుపై నియంత్రణ కోల్పోతాడు. అప్పుడు అతని ద్వారా నిజాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తారు. అయితే.. కొన్ని సందర్భాల్లో, సదరు వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకోవచ్చు. డోస్ ఎక్కువగా ఇస్తే కోమాలోకి వెళ్లిపోవడం లేదంటే చనిపోవచ్చూ కూడా. కాబట్టి, నార్కో టెస్ట్‌కు కోర్టు లేదంటే దర్యాప్తు సంస్థల అనుమతి తప్పనిసరి. అంతేకాదు.. అతను నార్కో టెస్ట్‌కు అర్హుడేనా? అనేది కూడా బాడీ టెస్ట్ ద్వారా ధృవీకరించుకుంటారు. ఫోరెన్సిక్ నిపుణులు, దర్యాప్తు అధికారులు, వైద్యులు, మనస్తత్వవేత్తల సమక్షంలో ఈ పరీక్ష జరుగుతుంది. పరీక్ష జరిగే టైంలో వీళ్లలో ఎవరు అభ్యంతరం వ్యక్తం చేసినా.. ఆ టెస్ట్ ఆపేయాల్సిందే!.. ఇక కొందరు ఈ పరీక్షలో కూడా దర్యాప్తు బృందాన్ని కూడా తప్పించుకుంటున్నారు. అందుకే ఈ పరీక్షపైనా తరచూ విమర్శలు వినిపిస్తుంటాయి. కానీ, మన దేశంలో నార్కో టెస్ట్, పాలీగ్రాఫ్ టెస్ట్‌ల ద్వారా కేసుల దర్యాప్తులో పురోగతి సాధించిన సందర్భాలు, కేసుల చిక్కుముడులు విప్పిన దాఖలాలే ఎక్కువగా నమోదు అయ్యాయి.


