పీఎస్‌లో సత్యపాల్‌ మాలిక్‌.. అరెస్ట్‌ ప్రచారం.. ఖండించిన ఢిల్లీ పోలీసులు

Satya Pal Malik sits on dharna following argument with Delhi cops - Sakshi

ఢిల్లీ: జమ్ము కశ్మీర్‌తో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేసిన సత్యపాల్‌ మాలిక్‌.. శనివారం ఢిల్లీలోని ఆర్కే పురం పోలీస్‌ స్టేషన్‌ వద్ద ధర్నాకు దిగారు. తన ఇంట్లో జరగాల్సిన రైతు సంఘాల నేత భేటీని పోలీసులు అడ్డుకోవడంపై పీఎస్‌లో బైఠాయించి  నిరసన వ్యక్తం చేశారాయాన. ఈ క్రమంలో.. ఆయన్ని పోలీసులు అరెస్ట్‌ చేశారంటూ ప్రచారం జరగ్గా ఢిల్లీ పోలీసులు దానిని ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. 

మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ను మేం అదుపులోకి తీసుకోలేదు. ఆయనంతట ఆయనగా పీఎస్‌కు వచ్చారు. తోడు మద్ధతుదారులు కూడా ఉన్నారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కూడా మేం ఆయన్ని కోరాం సీనియర్‌ అధికారి ఒకరు ప్రకటన విడుదల చేశారు. 

అసలు విషయం ఏంటంటే.. ఆర్కేపురంలో ఉన్న తన ఇంట్లో సత్యపాల్‌ మాలిక్‌ శనివారం రైతు సంఘాల నేలతో భేటీ కావాల్సి ఉంది. హర్యానా నుంచి రైతు సంఘాల నేతలు తమ పోరాటానికి మాలిక్‌ మద్దతు కోరే యత్నం చేశారు.  ఈ క్రమంలో ఇంటి ఆవరణ సరిపోక.. భోజనాలను బయట ఉన్న పార్క్‌లో ఏర్పాటు చేశారు. అయితే అది పబ్లిక్‌ స్పేస్‌ అని, అక్కడ అనుమతి లేదని పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు.  

దీంతో.. స్థానిక పీఎస్‌కు తన మద్దతుదారులతో చేరుకున్న సత్యపాల్‌ మాలిక్‌, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాసేపు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈలోపు పోలీసులు ఆయన్ని అరెస్ట్‌ చేశారంటూ ప్రచారం నడిచింది. దీంతో ఢిల్లీ పోలీసులు ట్విటర్‌ వేదికగా క్లారిటీ ఇచ్చారు. 

ఇదిలా ఉంటే.. ఈయన గవర్నర్‌గా ఉన్న టైంలో  జమ్ము కశ్మీర్‌లో జరిగిన ఓ భారీ  అవినీతి స్కాంకు సంబంధించి సీబీఐ సాక్షిగా ప్రశ్నించేందుకు సమన్లు జారీ చేసింది. ఈ అంశం రాజకీయంగానూ హాట్‌ టాపిక్‌ అయ్యింది. విచారణలో స్పష్టత కోసమే తనను పిలిచారని,  ఏప్రిల్‌27, 28, 29 తేదీల్లో సీబీఐకి అందుబాటులో ఉంటానని బదులు ఇచ్చినట్లు ఆయన మీడియాకు తెలిపారు.

సంచలనాల సత్యపాల్‌ మాలిక్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top