సేవా తీర్థ్ ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ | PM Modi Inaugurates Seva Teerth And New PMO Complex | Sakshi
Sakshi News home page

సేవా తీర్థ్ ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

Feb 13 2026 3:24 PM | Updated on Feb 13 2026 3:29 PM

PM Modi Inaugurates Seva Teerth And New PMO Complex

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సేవా తీర్థ్‌ ప్రారంభించారు. గణపతి పూజతో పీఎంవో కార్యాలయం ప్రారంభమైంది. మహిళా, యువత, రైతులకు సంబంధించిన ఫైళ్లపై ప్రధాని మోదీ సంతకాలు చేశారు. యాక్సిడెంట్ల బాధితులకు లక్షన్నర వరకు నగదు రహిత చికిత్స పథకానికి ఆమోదం తెలిపారు. లక్పతి దీదీ పథకం లబ్ధిదారుల సంఖ్య ఆరు కోట్లకు పెంచారు. అగ్రికల్చర్ మౌలిక సదుపాయాల నిధి 2 లక్షల కోట్లకు పెంపు ఫైళ్లపై మోదీ సంతకాలు చేశారు.

సౌత్ బ్లాక్ నుంచి నూతన చిరునామాకు పీఎంవో మారింది. పీఎంఓతోపాటు జాతీయ భద్రతా మండలి సచివాలయం, కేబినెట్‌ సెక్రెటేరియట్‌ కూడా సేవా తీర్థ్‌లోనే కొలువుదీరాయి. సేవా తీర్థ్‌తో పాటు కర్తవ్య భవన్ 1,2ను మోదీ ప్రారంభించనున్నారు. బ్రిటిష్ కాలం నాటి సౌత్ బ్లాక్‌లో ప్రధాని కార్యాలయంలో కొనసాగుతుంది. కార్యాలయం పాతబడడం, మారుతున్న కాలానికి అనుగుణంగా లేకపోవడంతో నూతన కార్యాలయం ఏర్పాటు చేశారు.

కర్తవ్య భవన్‌లో ఆర్థిక, రక్షణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్పొరేట్ వ్యవహారాలు ,విద్య, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, న్యాయ శాఖ, ఐఅండ్‌బి శాఖ,  వ్యవసాయం, రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ,  గిరిజన మంత్రిత్వ శాఖ సహా పలు కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఉద్యోగులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేలా అధునాతన సౌకర్యాలతో నూతన కార్యాలయాలు ఏర్పాటు చేశారు. భవన సముదాయంలో స్మార్ట్ యాక్సెస్ కంట్రోల్, నిఘా నెట్వర్క్, అత్యవసర ప్రతిస్పందన మౌలిక సదుపాయాలు, సమగ్ర భద్రత సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement