సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన తాజా చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’.
యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.
మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.


