హైదరాబాద్ : మాదాపూర్ శిల్పకళా వేదికలో ఆదివారం ‘కే హార్మనీ ఫెస్టా– కొరియా కల్చర్ డే– 2026’ ఉత్సాహంగా జరిగింది.
కే పాప్ సంగీతం, తైక్వాండో ప్రదర్శనలు, కొరియన్ వంటకాలు, సంప్రదాయ కళారూపాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
ఎన్టీఎక్స్ బాయ్ గ్రూప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.వారి మార్షల్ఆర్స్ట్ అద్భుతం అనిపించాయి.
శిల్పకళా వేదిక ప్రాంగణం కిక్కిరిసిపోవడంతో బయట ప్రత్యేక తెరలు ఏర్పాటు చేసి సందర్శకులకు కార్యక్రమాన్ని వీక్షించే అవకాశం కల్పించారు.


