
సోషల్ మీడియా భూతం అమరవీరుల జవాన్ల కుటుంబాలనూ వదలడం లేదు. దేశం కోసం ప్రాణాల్పించిన జవాన్లు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా పోస్ట్‌లు పెడుతున్నారు.
ఇటీవల అమరుడైన కెప్టెన్ అన్షుమాన్ సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం కీర్తచక్ర అవార్డ్‌ను ప్రకటించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్షుమాన్ సింగ్ సతీమణి స్మృతికి అవార్డ్‌ను అందించారు. ఆ వీడియోపై కొందరు దుర్మార్గులు ట్రోలింగ్‌కు దిగారు. ఆమె చాలా అందంగా ఉందంటూ అసభ్యకరంగా ఉందంటూ కామెంట్లు పెట్టారు.
ఈ అంశంపై నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఎన్‌సీడబ్ల్యూ) స్పందించింది. సోషల్ మీడియాలో అనుచిత కామెంట్లు చేస్తున్న వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.