కేజ్రీవాల్‌ అనుచరుడు బిభవ్‌ అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

స్వాతి మలివాల్‌ ఎపిసోడ్‌: కేజ్రీవాల్‌ అనుచరుడు బిభవ్‌ అరెస్ట్‌

Published Sat, May 18 2024 1:58 PM

Swati Maliwal Case: Bibhav Kumar Arrested Details

న్యూఢిల్లీ: ఆప్‌ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌ అనుచరుడు బిభవ్‌ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. సోమవారం కేజ్రీవాల్‌ నివాసానికి వెళ్లిన తనపై విభవ్‌ దాడికి పాల్పడ్డాడని స్వాతి మలివాల్‌ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఢిల్లీ సీఎం నివాసం నుంచే అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నేరుగా సివిల్‌ లైన్‌ పోలీస్‌ స్టేషన్‌కు ఇంటరాగేషన్‌ కోసం తరలించారు. అంతకు ముందు సీఎం కేజ్రీవాల్‌ నివాసంలో సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ నిర్వహించారు పోలీసులు. 

అయితే.. ఈ కేసులో పూర్తిగా సహకరిస్తామని అధికారులకు తాము మెయిల్‌ పంపించామని, అయినా కూడా పోలీసుల నుంచి బదులేం లేదని విభవ్‌ లాయర్‌ మీడియాకు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement