ప్రియుని చేతిలో వివాహిత హత్య | Chikkaballapur Incident | Sakshi
Sakshi News home page

ప్రియుని చేతిలో వివాహిత హత్య

Mar 2 2026 8:08 AM | Updated on Mar 2 2026 8:08 AM

Chikkaballapur Incident

కర్నాటక: ఇద్దరు పిల్లలు ఉన్న మహిళతో అక్రమ సంభందం పెట్టుకొన్న సందీప్‌ అనే దుండగుడు తేజస్విని (32) అనే మహిళను పొడిచి చంపాడు. ఇది చిక్కబళ్లాపురం నగరంలో జరిగింది. వివరాలు.. భర్తతో విడిపోయిన తేజస్విని ఓ హోటల్‌లో పని చేస్తూ అందులోనే ఓ గదిలో నివాసముంటోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 సందీప్‌ (26) అనే యువకుడు ఆమెకు పరిచయమై వేరే ఇల్లు తీసుకుని సహజీవనం ప్రారంభించారు.  తేజస్విని తన స్నేహితురాలు అరుణను ఇంటికి తీసుకొచ్చింది. ఇది నచ్చని సందీప్‌ తాగి గలాటా చేశాడు. అదే మత్తులో కత్తితో తేజస్వినిపై దాడి చేశాడు. స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స ఫలించక తేజస్విని చనిపోయింది. నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. తల్లి దూరమై ఆమె పిల్లలు అనాథలయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement