వికారాబాద్‌లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య | Vikarabad Women Constable Divya Ends Her Own Life, Investigation Underway, Check More Details Inside | Sakshi
Sakshi News home page

వికారాబాద్‌లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

Feb 28 2026 12:35 PM | Updated on Feb 28 2026 1:29 PM

Vikarabad Women Constable Divya Incident

వికారాబాద్ జిల్లా: వికారాబాద్‌లో విషాదం నెలకొంది. పట్టణంలోని గంగారాం సాయి బాబా కాలనీలో మహిళా కానిస్టేబుల్ బలిజ దివ్య ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం.. దివ్య గత ఐదేళ్లుగా ధారూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. శనివారం  తెల్లవారుజామున తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

దివ్య మృతదేహం వద్ద పోలీసులు ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ” ప్రియమైన అమ్మ, నా కుటుంబసభ్యులు నేను ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు నన్ను క్షమించండి. నా చావుకు ఎవరు కారణం కాదు. మెంటల్ స్ట్రెస్ తట్టుకోలేక ఈ రాంగ్ స్టెప్ తీసుకుంటున్నా. అమ్మా.. నీకు నేను భారం కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నా. నాన్న ఉంటే బాగుండే అమ్మ. నాన్న లేనందుకే నీకు ఇన్ని కష్టాలు. నన్ను క్షమించు అమ్మా” అని అందులో రాసి ఉంది. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దివ్య ఆత్మహత్యకు గల అసలు కారణాలపై విచారణ కొనసాగుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement