ఆర్టీసీ బస్సు–లారీ ఢీ.. 15 మందికి తీవ్ర గాయాలు | Road Accident In National Highway 65 | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు–లారీ ఢీ.. 15 మందికి తీవ్ర గాయాలు

Feb 28 2026 11:09 AM | Updated on Feb 28 2026 11:16 AM

Road Accident In National Highway 65

సంగారెడ్డి జిల్లా: సదాశివపేట జాతీయ రహదారి 65పై బైపాస్ రోడ్డులోని మూలమలుపు వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జహీరాబాద్ నుంచి సదాశివపేట బస్టాండ్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, సదాశివపేట నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్‌లలో సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement