తిరుపతి ఐఐటీలో శుక్రవారం రాత్రి తిరుత్సవ్–2026 పేరిట నిర్వహించిన టెక్నో కల్చరల్ ఫెస్ట్ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఐఐటీ డీన్ శశిధర్ గుమ్మా ఆధ్వర్యంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథులుగా సినీ నటీనటులు మృణాల్ ఠాకూర్, అడివి శేష్ విచ్చేశారు.


