హైదరాబాద్ : పంచతంత్రంలోని ఐదు ప్రసిద్ధ కథల సారాంశంతో హాస్యం, చమత్కారాలు మేళవించి.. సరికొత్తగా ప్రదర్శించిన నృత్యరూపకాలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి.
శుక్రవారం రవీంద్రభారతి వేదికగా..శంకరానంద కళాక్షేత్ర సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ ఆనంద్ శంకర్ జయంత్ శిష్య బృందం ‘పంచతంత్ర నృత్య కథలు’ అద్భుతంగా ప్రదర్శించారు. అడవికి రాజైన సింహాన్ని తెలివితో ఓడించిన కుందేలు, కొంగ–తాబేలు, దుష్ట మొసలి, తెలివైన కోతి, కిరాతకుడి నుంచి తప్పించుకునే పావురాలు వంటి కథలను కళాకారులు కళ్లకు కట్టారు.


