పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని ఉండి రోడ్డులో ఎస్‌ఆర్ షాపింగ్‌మాల్ 16వ బ్రాంచ్‌ను శుక్రవారం సినీ నటి కృతిశెట్టి (Krithi Shetty) ప్రారంభించారు.
అభిమానులతో సెల్ఫీలు దిగి సందడి చేశారు.
భీమవరం పరిసర ప్రాంతాలంటే తనకెంతో ఇష్టమని, ఇక్కడి ప్రేక్షకుల అభిమానం మరువలేనన్నారు.
శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, కేంద్ర ఉక్కు, భారీపరిశ్రమశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు తదితరులు షాపింగ్‌మాల్‌ను సందర్శించి వస్త్రాలను పరిశీలించారు.


