ఒకే వేదికపై 2 వేల మంది డ్రమ్మర్లు సందడి చేశారు. ఈ సందడి కాస్తా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. లయ, సంగీతం, ఐక్యతకు ప్రతీకగా మారింది.
గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియం ఈ వేడుకకు వేదిక అయింది. శనివారం రాత్రి ‘రిథమ్’–వరల్డ్ లార్జెస్ట్ జెంబే డ్రమ్ సర్కిల్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఐదు నిమిషాల పాటు 2వేల మంది ఒకేసారి డ్రమ్‌లను వాయించడం ఆకట్టుకుంది.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ ప్రతినిధి రిచర్డ్ స్టెన్నింగ్ స్వయంగా ఈవెంట్‌ను పరిశీలించారు.
ప్రపంచ దృష్టిని ఆకర్షించే పలు కార్యక్రమాలకు హైదరాబాద్ వేదికగా నిలుస్తోందని తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయే‹Ùరంజన్ పేర్కొన్నారు.
సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, ది జెంబే డ్రమ్ సర్కిల్ వ్యవస్థాపకుడు, సీఈఓ సాయికుమార్ యేలేశ్వరపు మాట్లాడుతూ.. 5 నిమిషాలు నాన్‌స్టాప్‌గా 2 వేల మంది ఒకేసారి డ్రమ్స్ వాయించడం గొప్ప విషయమన్నారు.


