న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు రంగంలోకి దిగారు. దీనిలో భాగంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఆయన భేటీ అయ్యారు. పార్లమెంట్ భవనంలోని లోక్‌సభ ప్రతిపక్ష నేత కార్యాలయంలో జరుగుతున్న ఈ కీలక సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కూడా హాజరయ్యారు. పార్లమెంట్ సజావుగా సాగేలా చూడటం, వివిధ అంశాలపై నెలకొన్న ప్రతిష్టంభనను దాటవేయడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
దీనికిముందు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా విమర్శించారు. రాహుల్ సభలో గందరగోళం సృష్టిస్తూ, ఇతరులను మాట్లాడనివ్వడం లేదని ఆయన మండిపడ్డారు. సభ సజావుగా సాగేందుకు సహకరిస్తే ప్రతిపక్ష పార్టీలకు మాట్లాడే అవకాశం కల్పిస్తామని తాను స్పీకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి హామీ ఇచ్చినట్లు మంత్రి రిజిజు వెల్లడించారు. మరోవైపు, స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్న అంశంపై కిరణ్ రిజిజు స్పందిస్తూ.. దానివల్ల ఎలాంటి ప్రభావం ఉండదని తేల్చిచెప్పారు. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం తెచ్చుకోవచ్చని, అయితే సభలో వారికి తగిన సంఖ్యాబలం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ప్రతిపక్షాల తీరు ఉందని, సభను అడ్డుకోవడం సరికాదని ఆయన హితవు పలికారు.
Delhi | Union Parliamentary Affairs Minister Kiren Rijiju is holding a meeting with Lok Sabha LoP Rahul Gandhi over continuing deadlock in Parliament. Congress MP Priyanka Gandhi Vadra is also present in the meeting being held in the office of the LoP in Parliament premises. https://t.co/RVDY5Oqkw2
— ANI (@ANI) August 5, 2026


