దుబాయ్‌లో భారీ పేలుళ్లు: జెబెల్ అలీని ‍కమ్మేసిన దట్టమైన పొగ! | Jebel Ali Industrial Area Shaken by Loud Blasts, Smoke Videos Flood Social Media | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో భారీ పేలుళ్లు: జెబెల్ అలీని ‍కమ్మేసిన దట్టమైన పొగ!

Aug 5 2026 10:43 AM | Updated on Aug 5 2026 11:08 AM

Jebel Ali Industrial Area Shaken by Loud Blasts, Smoke Videos Flood Social Media

జెబెల్ అలీ: దుబాయ్‌లోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన జెబెల్ అలీలో బుధవారం ఉదయం భారీ పేలుళ్లు సంభవించినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఆ ప్రాంతం నుండి దట్టమైన పొగ ఎగిసిపడుతున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి.

స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:40 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. జెబెల్ అలీ పారిశ్రామిక ప్రాంతంలో ఒక భవనంలో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. దుబాయ్ నగర కేంద్రానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం నుంచి, సమీపంలోని అల్ ఫుర్జాన్ నివాస ప్రాంతం నుంచి కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు సమాచారం. సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న వీడియోల్లో నివాస ప్రాంతాలు, తాటి చెట్ల మధ్య నల్లటి పొగ కమ్ముకోవడం కనిపిస్తోంది.
 

ఈ పొగ పారిశ్రామిక ప్రమాదం వల్ల వచ్చిందా లేక మరేదైనా కారణమా అనే దానిపై యూఏఈ అధికారులు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్లు, క్షిపణులతో జెబెల్ అలీని లక్ష్యంగా చేసుకున్నట్లు కొందరు సోషల్ మీడియా ఖాతాల్లో ఆరోపించినప్పటికీ, దీనికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. గతంలో కూడా ఇటువంటి వదంతులు వచ్చినప్పుడు దుబాయ్ మీడియా కార్యాలయం వెంటనే స్పందించి ఖండించింది. ప్రస్తుతం తాజా ఘటనపై అధికారుల నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.

ఇది కూడా చదవండి: ‘జపాన్‌ అంతు చూస్తాం’.. కిమ్ సోదరి హెచ్చరిక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement