ప్రస్తుత రోజుల్లో ప్రతి కుటుంబంలోని మహిళల మెనోపాజ్ గురించి బహిరంగంగా చర్చించడం, దానిని సాధారణ విషయంగా చూడటం అత్యంత అవసరమని నిపుణులు చెబుతున్నారు. స్త్రీలలో రుతుస్రావం (పీరియడ్స్) శాశ్వతంగా ఆగిపోయే దశను మెనోపాజ్ అంటారు. భవిష్యత్ తరాల మహిళల కోసం తల్లుల మెనోపాజ్ అనుభవాలను కూతుళ్లు తప్పనిసరిగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తన చిన్నతనంలో తన తల్లి మెనోపాజ్ దశను ఎదుర్కొన్నప్పుడు దాని గురించి ఎలాంటి అవగాహన లేదని, ఆమె ఎదుర్కొన్న భావోద్వేగాలను కేవలం ‘ఒత్తిడి’గా భావించామని ఓ మహిళ గుర్తుచేసుకున్నారు. ఈ అంశంపై సరైన చర్చ లేకపోవడం వల్ల తల్లులు పడే ఇబ్బందులు కూతుళ్లకు అర్థంకావని ఆమె పేర్కొన్నారు.
భారతీయ కుటుంబాలలో మెనోపాజ్ ఇప్పటికీ ఒక రహస్య విషయంగానే ఉంది. దీనివల్ల తల్లుల శారీరక, మానసిక ఇబ్బందులు కూతుళ్లకు తెలియవు. కొన్ని లక్షణాలను బట్టి తల్లులు కేవలం కోప్పడుతున్నారని భావిస్తారు. కానీ వాస్తవానికి వారు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పోరాడుతుంటారు. ఈ దశపై అవగాహన పెంచుకోవడం ద్వారా కూతుళ్లు తమ తల్లుల కష్టాలను అర్థం చేసుకుని తగిన సహకారం అందించగలుగుతారు.
భవిష్యత్తులో కూతుళ్లు కూడా ఇదే దశను ఎదుర్కొవాల్సి ఉంటుంది. తల్లి అనుభవాల ద్వారా ముందస్తు సంకేతాలను గుర్తించి, వైద్య సహాయం ఎప్పుడు అవసరమో తెలుసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ మౌన సంస్కృతిని బద్దలు కొట్టాలి. తల్లితో ఈ అంశంపై మాట్లాడటం ద్వారా భవిష్యత్తులో తన కూతుత్తోనూ చర్చించే అవకాశం లభిస్తుంది. ఈ విజ్ఞానాన్ని తరతరాలకు అవసరమైనదిగా భావించి, కుటుంబాలలో మెనోపాజ్‌పై చైతన్యం తేవాలని, తద్వారా మహిళల సమస్యలను అర్థం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ‘కే బ్యూటీ’ గ్లాస్ స్కిన్ రహస్యం.. వంట గదిలో..


