కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. అనారోగ్యంతో ఉన్న ఓ మహిళను చికిత్స కోసం తీసుకెళ్లే క్రమంలో కుటుంబ సభ్యులు పడిన కష్టం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వర్షాల కారణంగా రాకపోకలు కష్టంగా మారడంతో అక్కడి పరిస్థితులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

కెరమెరి మండలం అనార్పల్లి వాగు వద్ద చలించిపోయే దృశ్యాలు కనపడ్డాయి. జ్వరంతో బాధపడుతున్న భూరిబాయిని భుజాలపై మోసుకుంటూ వాగు దాటాడు ఆమె కొడుకు. బోరిలాల్గూడకు చెందిన భూరిబాయి కొంతకాలంగా జ్వరంతో బాధపడుతోంది. ఆమె కోలుకోవాలంటే ఆ వాగు దాటక తప్పని పరిస్థితి. దీంతో భూరిబాయి కొడుకు ఆ పని చేశాడు.


