సాక్షి, చిత్తూరు జిల్లా: వీ.కోటలో వెలుగు దారుణ ఘటన జరిగింది. ప్రియుడితో కలిసి ఏడేళ్ల కుమారుడిని తల్లి హింసించింది.. ప్రియుడితో కలిసి కసాయి తల్లి.. కుమారుడిపై బ్లేడుతో దాడి చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్నతల్లి తన ప్రియుడుతో కలిసి కొడుకును అతి కిరాతకంగా చిత్రహింసలకు గురిచేసింది.
వీ.కోట ఈశ్వర్ నగర్‌లో నివాసముంటున్న ఇంద్రజకు భర్త చనిపోగా.. ఎర్ర చేనుకు చెందిన రాజుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ సంబంధానికి ఏడేళ్ల కొడుకు విశాల్ అడ్డుగా ఉన్నాడని భావించిన తల్లి.. ప్రియుడుతో కలిసి శరీరం, ప్రైవేట్ పార్ట్‌లలో బ్లేడుతో విచక్షణారహితంగా కోసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాలుడిని కాపాడి ఆసుపత్రికి తరలించింది.


