breaking news
v kota
-
Extra Marital Affair: స్నేహితుడి ప్రియురాలితో సానిహిత్యం.. ఏడాది తర్వాత!
సాక్షి, చిత్తూరు : వివాహేతర సంబంధం కారణంగా స్నేహితుడినే హత్య చేసి చెరువులో పాతి పెట్టాడు. ఈ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఏడాది తరువాత ఛేదించి, నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా వి.కోట సీఐ ప్రసాద్‌బాబు కథనం మేరకు పట్టణ పరిధిలోని ముదిమడుగుకు చెందిన షరీఫ్ కుమారుడు ఇస్మాయిల్(23) ఎలక్ట్రీషియన్. ఇతనికి వి.కోట పట్టణంలోని నారాయణనగర్‌కు చెందిన నరేష్ స్నేహితుడు. ఇలా వీరి స్నేహం మొదలైన ఏడాదిన్నర తరువాత ఇస్మాయిల్ బెంగుళూరుకెళ్లి, బంధువుల ఇంటిలో ఉంటూ అక్కడే పనిచేసుకుంటున్నాడు. ఈ క్రమంలో నరేష్ అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో నరేష్ ఇంటి వాళ్లు గొడవ చేయగా ఆ మహిళతోనే ఉండిపోయాడు. ఈ సమయంలో అప్పుడప్పుడు స్నేహితుడి వద్దకు వచ్చిపోతున్న ఇస్మాయిల్, నరేష్ ప్రియురాలితో సన్నిహితంగా మెలిగేవాడు. నరేష్ లేని సమయంలో ఆమె ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. దీన్ని గమనించిన నరేష్ ఇస్మాయిల్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో తన వద్ద అప్పుగా తీసుకున్న డబ్బు చెల్లించాలని 05–01–2021న ఇస్మాయిల్, నరేష్‌ను అడిగాడు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు వి.కోటకు వచ్చిన ఇస్మాయిల్, నరేష్‌కు ఫోన్ చేశాడు. రాత్రి 8 గంటల సమయంలో వీరిద్దరూ కలిసి మద్యం బాటిల్ తీసుకుని వి.కోట చెరువులోకి వెళ్లారు. అక్కడ మహిళ విషయంలో వీరి మధ్య వాదులాట జరిగింది. ఇదే అదనుగా నరేష్ మందు తాగుతున్నట్లు నటించి ఇస్మాయిల్ మందు తాగే సమయంలో మందు బాటిల్‌తో తలపై బలంగా కొట్టి చంపేశాడు. ఇస్మాయిల్ చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత అక్కడే ఇసుక కోసం తవ్విన గుంతల్లో ఇస్మాయిల్ మృతదేహాన్ని చేతులతో మట్టిని కప్పి వెళ్లిపోయాడు. చదవండి: చెట్టుకింద గొయ్యిలో ఏదో పూడ్చిపెట్టినట్లు కనపడడంతో.. పశువుల కాపర్లు.. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఇస్మాయిల్ స్నేహితులను విచారించడంతో, నరేష్ సోమవారం తన నేరాన్ని పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. ఇస్మాయిల్‌ను పాతిపెట్టిన ప్రదేశానికి మండల రెవెన్యూ సిబ్బంది, పోలీసులు చేరుకు న్నారు. అయితే చెరువులో నీరు ఎక్కువగా ఉండడంతో మృతదేహాన్ని వెలికి తీయడం సాధ్యం కాలేదని సీఐ , తహసీల్దార్ పుల్లారావు తెలిపారు. ఇస్మాయిల్ మొబైల్‌ఫోన్ ఆధారంగా హత్య కేసు మిస్టరీని ఛేదించిన అభినందనలు అందుకున్నారు. -
టీడీపీ నాయకుడి లాడ్జిలో వ్యభిచారం
చిత్తూరు, వి.కోట : మండలంలో వ్యభిచార ముఠా గుట్టును వి.కోట పోలీసులు రట్టు చేశారు. సీఐ యతీంద్ర తెలిపిన వివరాల మేరకు పట్టణానికి చెందిన (టీడీపీ నాయకుడికి సంబంధించిన ) లాడ్జి మేనజర్‌గా పనిచేస్తున్న నగేష్, వి.కోటకు చెందిన నరేంద్రబాబు పలమనేరు చెందిన పర్వీన్‌తో రహస్యంగా ఒప్పదం కుదుర్చుకుని వి.కోటలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహించేవారు. ఆదివారం రాత్రి వి.కోటకు చెందిన సతీష్ అనే విటుడిని లాడ్జికి రప్పించి ఓ యువతితో వ్యభిచారం చేయించడానికి ప్రయత్నించారు. రాత్రి పలువురితో కలసి బురఖాతో వెళుతున్న యువతిని చూసిన పరిసరాల ముస్లిం యువకులు వారిని అడ్డగించగా వ్యభిచార విషయం బయటపడింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు లార్డికి చేరుకోగా, యువతి, యువకులతో సహా ముఠా సభ్యులు పరారయ్యారు. సోమవారం ఉదయం లాడ్జి మేనేజర్ నాగేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. లాడ్జిలో వ్యభిచారం చేస్తున్న వైనాన్ని అతడు వెల్లడించాడు. లాడ్జి మేనేజర్ నాగేష్ , గంగవరానికి చెందిన పర్వీన్, వి.కోట నాగేంద్రబాబు, విటుడు సతీష్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. వ్యభిచార నిర్వహణకు సంబంధించి కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
ఉపాధ్యాయుడి ఆత్మహత్య
వి.కోట: మండలంలోని గోనుమాకులపల్లెలో గురువారం ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. గోనుమాకులపల్లెకు చెందిన నవీన్(27) కృష్ణాపురం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. ఆలస్యంగా గమనించిన కుటుంబసభ్యులు కిందికి దించి వి.కోట సీహెచ్‌సీకి తరలించారు. అతను అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు కారణాలపై విచారణ చేస్తామని ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. -
వి.కోట కావడిపట్నంలో వింత ఆచారం