తెలంగాణ అసెంబ్లీ.. కేటీఆర్‌ Vs కాంగ్రెస్‌.. | Telangana Assembly Budget Session On 17th March Live Updates, Top News Headlines And Highlights Inside | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అప్‌డేట్స్‌..

Mar 17 2026 9:26 AM | Updated on Mar 17 2026 1:35 PM

Telangana Assembly Budget Session On 17th March Live Updates

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు అప్‌డేట్స్‌..

కేటీఆర్‌ కామెంట్స్‌..

  • మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చొద్దు.
  • మూసీ సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు.
  • రూ.16వేల కోట్లతో మూసీ సుందరీకరణ చేయవచ్చు.
  • ఎరువులు అడిగితే రైతులపై దాడులు చేస్తున్నారు.
  • షాపులో ఇవ్వాల్సిన యూరియా యాప్‌లో ఇస్తామంటున్నారు.
  • బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్‌ అని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
  • ఈసారైనా బడ్జెట్‌లో బీసీలకు కేటాయింపులు చేయాలి.
  • దళిత బంధును బొందపెట్టారు.. ఇప్పటికైనా ఇవ్వాలి.
  • హిల్ట్‌ పాలసీలో పెద్దపెద్ద కుంభకోణాలు జరగబోతున్నా​యి.
  • 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కడతామన్నారు? ఏమైంది?.
  • రాజకీయం, అధికారం శాశ్వతం కాదు.. కానీ, తెలంగాణ శాశ్వతం.
  • తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం.
  • ప్రభుత్వ నిర్ణయాలు తెలంగాణకు విఘాతం కలిగించేలా ఉన్నాయి.
  • ఆర్టీసీని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
  • వ్యవసాయాన్ని బాగు చేసింది కాళేశ్వరమే.
  • మా మీద కోసం రైతుల మీద చూపెట్టకండి.
  • మేము ఏ ప్రాజెక్ట్‌ కట్టినా దేవుళ్ల పేర్లు పెట్టాం.
  • మీలా పార్టీ నాయకుల పేర్లు పెట్టలేదు.
  • సింగరేణిలో పెద్దపెద్ద కుంభకోణాలు బయటపడుతున్నాయి.
  • నైనీ టెండర్‌ రద్దు చేశారు. మిగతా టెండర్లు కూడా రద్దు చేయాలి.
  • మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.
  • వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టడాన్ని వ్యతిరేకిద్దాం.
  • బస్తీ దవాఖానాలు మూతపడుతున్నాయి.
  • బస్తీ దవాఖానాల్లో మందులు లేవు.
  • మా ఎమ్మెల్యేలపై దాడులు చేస్తున్నారు.

 

కేటీఆర్‌ కామెంట్స్‌..

  • మహిళలకు న్యాయం చేస్తున్నాం అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మిస్ ఇంగ్లాండ్ ఇండియా వదిలి వెళ్లారు.
  • మిస్ ఇంగ్లాండ్ పట్ల అసభ్య ప్రవర్తన చేసి తెలంగాణ పరువు అంతర్జాతీయంగా చేశారు.
  • మిస్ ఇంగ్లాండ్ ఘటనపై సిట్ వేయాలి. 

మంత్రి సీతక్క కామెంట్స్‌..

  • కేటీఆర్‌కు మహిళలు అంటే అంత కోపం ఎందుకు?
  • ఉచిత బస్సు ఇచ్చినా బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేశారు.
  • మేడారంలో మహిళలు 9 కోట్లు సంపాదించారు.
  • పదేళ్లు మహిళలకు ఎందుకు న్యాయం చేయలేదు.
  • పథకాలు ఎందుకు ఇవ్వలేదు.
  • మహిళల అభయహస్తం నిధులను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాడుకుంది.
  • మహిళలను ఎదుగనివ్వండి.

మంత్రి శ్రీధర్‌ బాబు కామెంట్స్‌..

  • మాది జాతీయ పార్టీ.
  • పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ ఢిల్లీకి ఎన్ని సార్లు వెళ్లింది.
  • రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము ఢిల్లీకి వెళ్తాం.
  • సోనియా గాంధీ నిర్ణయం మేరకే తెలంగాణ ఏర్పాటు జరిగింది.
  • తెలంగాణ ఏర్పాటులో అందరిని ప్రభుత్వం గుర్తు పెట్టుకుంటుంది.
  • సోనియా గాంధీ నిర్ణయం తీసుకోకపోతే బీఆర్‌ఎస్‌ ఎక్కడ ఉండేది.
  • ఒక లక్ష్యంతో తెలంగాణ అభివృద్ధి కోసం ముందుకు వెళ్తున్నాం.
  • 5లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి.
  • బీఆర్‌ఎస్‌ పాలనను ముందుకు తీసుకెళ్లడం తప్పా?
  • మహిళలు కోటీశ్వరులు కావడం తప్పా?
  • తెలంగాణ ప్రజల విశ్వాసాలపై వ్యంగ్యంగా మాట్లాడటం కరెక్ట్ కాదు.

 

కేటీఆర్‌ విమర్శలు..

  • గవర్నర్ ప్రసంగంలో గ్యారంటీ, డిక్లరేషన్ పదం రాకుండా చూసుకున్నారు
  • రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో డైవర్షన్లు, కమీషన్లు మాత్రమే ఉన్నాయి.
  • మొన్న ఇండియా టీ-20 గెలిచింది కానీ కాంగ్రెస్ పోటీలో ఉంటే 420 గెలుస్తారు.
  • కాంగ్రెస్ పాలన అంటే పని చారానా.. ప్రచారం బారానా..
  • గ్రాఫిక్స్ మాయాజాలంలో కాంగ్రెస్ కనికట్టు చేస్తోంది.
  • కాంగ్రెస్ సినిమా బయట అభయహస్తం.. లోపల చూస్తే భస్మాసుర హస్తం!
  • మీరు ఢిల్లీకి వెళ్తే మాకేం అభ్యంతరం లేదు.
  • ఢిల్లీ నుంచి నిధులు తెస్తారనుకున్నాం.
  • కానీ, నిధులు ఇచ్చి వస్తున్నారు.
  • మొన్న రూ. వెయ్యి కోట్లు ఇస్తాం అన్నారు.
  • కేబినెట్‌ ఆమోదించిన గవర్నర్‌ ప్రసంగంలోనూ విశ్వసనీయత లేదు. 


డిప్యూటీ సీఎం భట్టి కామెంట్స్‌..

  • బీఆర్‌ఎస్‌ పాలనలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ఎంత మందికి వచ్చాయి??
  • మేము 4.5లక్షల ఇందిరమ్మ ఇండ్లను పేదలకు కట్టిస్తున్నాం.
  • వీటి కోసం రూ.22500 కోట్లు ఖర్చు చేశాం.  
  • హామీల అమలుపై కేటీఆర్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ కరెక్ట్‌ కాదు.
  • కోటీ ఆరు లక్షల కుటుంబాలకు సన్నబియ్యం ఇస్తున్నాం.
  • రాష్ట్రంలో 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ అందిస్తున్నాం. 
     

తెలంగాణ శాసన సభలో గందరగోళం

  • కేటీఆర్‌ కామెంట్స్‌..
  • అధికారంలో ఎవరూ శాశ్వతంగా ఉండరు.
  • వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు కానందుకు ధన్యవాదాలు చెప్పాలా?
  • గ్యారెంటీ కార్డు పేరుతో మోసం చేస్తే ధన్యవాదాలు చెప్పాలా?

ఆరు గ్యారెంటీలపై మాట్లాడుతున్న కేటీఆర్ స్పీచ్‌ను అడ్డుకున్న మంత్రి కోమటిరెడ్డి

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్‌

  • కేటీఆర్ మా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి.
  • రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రుణమాఫీ చేసినందుకు కేటీఆర్ ధన్యవాదాలు చెప్పాలి.
  • మీలాగా దళిత ముఖ్యమంత్రి అని మాట తప్పలేదు.
  • కేటీఆర్ ఓపికతో వినాలి.
  • బీఆర్ఎస్ చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి బయటపడేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం
  • ఇందిరమ్మ ఇండ్లను ఇస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పాలి.
  • కేసీఆర్ చేసిన అప్పులు తీర్చుతున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి.

తలసాని కామెంట్స్‌..

  • సభలో సభ్యుల హక్కులను కాపాడాల్సింది స్పీకర్‌
  • ప్రతీసారి ప్రసంగానికి అడ్డుతగలడం సరికాదు. 
     

రైతుల వినతిపత్రాలతో అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు

  • రైతుల వినతిపత్రాలతో అసెంబ్లీకి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు
  • వినతిపత్రాలు లోపలికి తీసుకెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
  • అసెంబ్లీ లాబీలో బీజేపీ ఎమ్మెల్యేల వద్ద నుంచి దరఖాస్తులు తీసుకున్న పోలీసులు
  • తామే అసెంబ్లీలోనికి దరఖాస్తులు పంపిస్తామని తెలిపిన పోలీసులు
  • పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు

 

 తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. 

  • కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం 

20న అసెంబ్లీలో బడ్జెట్..

  • గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ
  • ఇవాళ, రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ
  • బీఆర్ఎస్ తరపున శాసనసభలో మాట్లాడనున్న కేటీఆర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి
  • బీఆర్ఎస్ తరపున మండలిలో మాట్లాడనున్న మధుసూదనాచారి, దాసోజు శ్రవణ్
  • ఈనెల 20న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం


రెండో రోజు ప్రశ్నోత్తరాలు రద్దు

  • అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు ప్రశ్నోత్తరాలు రద్దు
  • గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నేడు అసెంబ్లీలో చర్చ
  • తీర్మానాన్ని ప్రతిపాదించనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్
  • తీర్మానాన్ని బలపరచనున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
  • సభ ముందుకు ఇన్ఫర్మేషన్ కమిషన్ పెండింగ్ నివేదికలు
  • బీఏసీ నిర్ణయాలను సభ ముందు ఉంచనున్న సీఎం రేవంత్‌రెడ్డి
  • సభ టేబుల్‌పై తెలంగాణ ఇన్ఫర్మేషన్ కమిషన్ వార్షిక నివేదికలు


బీజేపీ వాయిదా తీర్మానం

  • శాసనసభలో బీజేపీ వాయిదా తీర్మానం
  • ఫసల్‌ బీమా యోజన రాష్ట్రంలో అమలు చేయాలని వాయిదా తీర్మానం


బీఆర్ఎస్, సీపీఐ వాయిదా తీర్మానం

  • ఉభయసభల్లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం
  • రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లింపు జాప్యంపై వాయిదా తీర్మానం
  • రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం
  • రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్‌పై అసెంబ్లీలో చర్చించాలని సీపీఐ వాయిదా తీర్మానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement