ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో స్థలాలు రిజర్వ్
మరికొన్నింటిలో స్థలాల గుర్తింపు కోసం అన్వేషణ
ఎల్‌ఐజీ తొలివిడత ప్రక్రియ పూర్తికాగానే ఎంఐజీ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: మహా హైదరాబాద్ పరిధిలో పేదల సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ టవర్స్ పేరుతో ఎల్‌ఐజీ గృహాల ప్రక్రియను శరవేగంగా కొలిక్కి తెచ్చిన హౌసింగ్ బోర్డు ఇప్పుడు మిడిల్ ఇన్ కమ్ గ్రూప్ (ఎంఐజీ) టవర్ల నిర్మాణంపై దృష్టి సారించింది. మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కల నెరవేర్చేందుకు ఎంఐజీ గృహాలను నిర్మించి, సులభతర వాయిదాలలో అందజేయడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఇప్పటికే ఇందిరమ్మ ఎంఐజీ టవర్ల నిర్మాణానికి కొన్ని ప్రాంతాల్లో అనువైన స్థలాలను ప్రాథమికంగా గుర్తించి రిజర్వ్ చేసింది. మరికొన్నింటి ప్రాంతాల్లో స్థలాలకోసం అన్వేíÙస్తోంది. మొత్తంమీద రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండి, వివాద రహితంగా ఉన్న ప్రభుత్వ భూములకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. భవిష్యత్తు సవాళ్లను అధిగమించేందుకు ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందే విద్యుత్ సరఫరా, తాగునీటి లైన్లు,డ్రైనేజీ వ్యవస్థలను ఏర్పాటు చేసేలా ముందస్తు చర్యలు ఉపక్రమించాలని యోచిస్తోంది.
ఎల్‌ఐజీ ముగియగానే ఎంఐజీ..
క్యూర్ పరిధిలో మొదటి విడత ఎల్‌ఐజీ ఇళ్ల ప్రక్రియ పూర్తి కాగానే ప్రభుత్వం నుంచి ఎంఐజీ ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ లభించనుంది. ఇప్పటికే 16 నియోజకవర్గాల్లో ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి కాగా, మరో నాలుగు నియోజకవర్గాల్లో ప్రాథమికంగా ఇళ్ల కేటాయింపుపై క్షేత్ర స్థాయి పరిశీలన కొనసాగుతోంది. త్వరలో మిగిలిన ఉప్పల్, జూబ్లీహిల్స్,చారి్మనార్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో కూడా నోటీఫికేషన్ జారీ చేసేందుకు హౌసింగ్ బోర్డు సిద్ధమైంది.
ఈ ప్రక్రియ పూర్తిగా కొలిక్కి రాగానే ఎంఐజీ తొలివిడత నోటిఫికేషన్ విడుదల చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఎల్‌ఐజీ మాదిరిగానే లబి్ధదారుల ఎంపికలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పారదర్శకమైన ఆన్‌లైన్ పోర్టల్ ద్వారానే దరఖాస్తులను స్వీకరించనుంది. మధ్యతరగతి వర్గాల నిర్దిష్ట వార్షిక ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుని అర్హులను ఎంపిక చేయనుంది. దరఖాస్తు రుసుము, కేటాయింపు విధానం, వాయిదాల చెల్లింపుల షెడ్యూల్‌ను నోటిఫికేష¯Œన్ లోనే స్పష్టంగా పొందుపరచనున్నారు.
30 వేల ఎంఐజీ ఇళ్లు
నగరానికి నాలుగు వైపులా నూతన ఎంఐజీ టవరర్లో సుమారు 30 వేల ఇళ్ల నిర్మాణాలకు ప్రణాళిక పొందించింది.ఒక్కో టవర్‌లో ఆధునిక హంగులతో ఫ్లాట్లను నిర్మించేలా డిజైన్ చేస్తోంది. మధ్యతరగతి కుటుంబాలపై ఒక్కసారిగా ఆర్థిక భారం పడకుండా సింగిల్ విండో విధానం ద్వారా లబ్ధిదారులకు సులభంగా రుణ వసతి కల్పించేందుకు వివిధ బ్యాంకులతో ప్రభుత్వం ముందస్తు చర్చలు జరుపుతోంది. తక్కువ వడ్డీ రేటుకే బ్యాంకుల నుంచి గృహ రుణాలు అందించేలా ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. నిర్మాణం పురోగమించే కొద్దీ దశలవారీగా వాయిదాలలో సొమ్ము చెల్లించే వెసులుబాటును లబి్ధదారులకు కల్పించనుంది.
క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎంఐజీ ఇళ్లు ఇలా...
––––––––––––––––––––––––––––––––––
జిల్లా ఎంఐజీ ప్లాట్లు
–––––––––––––––––––––––––––––––
హైదరాబాద్ 10,000
రంగారెడ్డి 10,000
మేడ్చల్–మల్కాజిగిరి 5,000
సంగారెడ్డి (క్యూర్ పరిధి) 5,000


