తెలంగాణ‌ కాంగ్రెస్‌కు 16 మంది ప్యానెలిస్టులు | Telangana Congress Appoint 16 Media Panelists Names Here | Sakshi
Sakshi News home page

TPCC: అధికార పార్టీకి 16 మంది ప్యానెలిస్టులు

Nov 10 2026 7:07 PM | Updated on Nov 10 2026 7:16 PM

Telangana Congress Appoint 16 Media Panelists Names Here

కొత్తగా మీడియా కోఆర్డినేటర్లు, అధికార ప్రతినిధుల నియామకం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ‌లో అధికార కాంగ్రెస్‌ పార్టీ పక్షాన విలేకరుల సమావేశాలు నిర్వహించడంతో పాటు టీవీ చానళ్లలో జరిగే చర్చల్లో పాల్గొనేందుకు 16 మంది ప్యానెలిస్టులు నియమితులయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌ అనుమతి మేరకు వీరిని ప్యానెలిస్టులుగా నియమిస్తూ మీడియా, పబ్లిసిటీ సెల్‌ చైర్మన్, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, అద్దంకి దయాకర్, వేముల వీరేశం, బీర్ల అయిలయ్య, రాంచంద్రునాయక్, బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, టీఆర్‌ఆర్, యెన్నెం, రాజ్‌ఠాకూర్, మేడిపల్లి సత్యం, కె.రాజేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, తేజావత్‌ బెల్లయ్య నాయక్, సామా రామ్మోహన్‌రెడ్డి, ఎస్‌.చరణ్‌కౌశిక్‌ యాదవ్‌లు ప్యానెలిస్టుల జాబితాలో ఉన్నారు.

మీడియా చీఫ్‌ కోఆర్డినేటర్‌గా కె.శ్రీకాంత్‌యాదవ్, కన్వీనర్‌గా అవేలీ దామోదర్, కోఆర్డినేటర్లుగా తుమ్మలపద్మ, మొగిలి సత్యారెడ్డిలను నియమించారు. వీరితోపాటు మరో 49 మందిని పార్టీ అధికార ప్రతినిధులుగా నియమించగా, ఇప్పటికే అధికార ప్రతినిధులుగా పనిచేస్తున్న వారికి సీనియర్‌ అధికార ప్రతినిధులుగా పదోన్నతి కల్పిస్తున్నట్టు ఎంపీ చామల జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇదీ చ‌ద‌వండి: సింగరేణి ప్రాంతంలో డేటా సెంటర్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement