కేసులకు భయపడే ప్రసక్తే లేదు: అంబటి | YSRCP Leader Ambati Rambabu Lashes Out At Chandrababu Sarkar | Sakshi
Sakshi News home page

కేసులకు భయపడే ప్రసక్తే లేదు: అంబటి

Nov 10 2026 3:59 PM | Updated on Nov 10 2026 4:34 PM

YSRCP Leader Ambati Rambabu Lashes Out At Chandrababu Sarkar

కాకినాడ జిల్లా:  కూటమి ప్రభుత్వం తనపై పెట్టే అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ రాజకీయ కక్ష సాధింపులకు వేదికగా మారిందని విమర్శించారు. దివంగత నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో గౌరవ వందనం వద్దని కుటుంబ సభ్యులు చెప్పారని, అయితే దొంగ చాటుగా పోలీసులు గౌరవం చేస్తుంటే దాన్ని తాము అడ్డుకున్నామన్నారు.  ఈ అంశానికి సంబంధించి తనపై కేసు పెట్టి కిర్లంపూడి పోలీస్‌ స్టేషన్‌కు రావాలని నోటీసులు ఇచ్చారన్నారు. 

తాను విచారణకు హాజరైన క్రమంలో అంతర్జాతీయ తీవ్రవాదిని అడిగినట్లు చాలా ప్రశ్నలు అడిగారని అంబటి మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ అనేది రాజకీయ కక్ష సాధింపుల వేదికగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ముద్రగడ సొంత స్థలంలో చేసే కార్యక్రమానికి పోలీసులు దౌర్జన్యంగా వచ్చి గౌరవం వందనం చేసే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులకు కోరిక మేరకు ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నాము. అడ్డుకున్నందుకు మాపై కేసు పెట్టారు... ఈ కేసుపై న్యాయపోరాటం చేస్తాం. రాష్ట్రంలో పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నేతలపై కక్ష సాధించడమే చంద్రబాబు లోకేష్ లక్ష్యంగా పెట్టుకున్నారు. నాపై కూటమి ప్రభుత్వం చాలా కేసులు పెట్టింది.. వాటికి భయపడే ప్రసక్తే లేదు.’ అని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ఏజెంట్‌ వైఎస్‌.. ఓటర్‌ ఓఎస్‌ !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement