breaking news
Ambati Rambabu
-
జైల్లో అంబటి పరిస్థితి..! జడ శ్రవణ్ రియాక్షన్..
-
Israel : ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి చేయటమే శాంతి భద్రతలా..?
-
Botsa: అంబటి తల్లి కూడా తల్లే మీ తల్లిని తిడితే ఊరుకుంటారా?
-
అంబటితో ములాఖత్..YSRCP నాయకులు సంచలన వ్యాఖ్యలు
-
కూటమి కుట్ర... అంబటికి మరోసారి 14 రోజుల రిమాండ్
-
సత్తెనపల్లి కేసులో అంబటి రాంబాబుకి రిమాండ్
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. జైలు నుంచి బయటకు రాకుండా కూటమి కుట్రలు చేస్తోంది. అంబటిపై ఉన్న పాత కేసు తిరగతోడిన కూటమి సర్కార్.. ప్రజా సమస్యలపై గళం విప్పకుండా అంబటిపై కుట్రలకు తెరలేపుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకు బాబు సర్కార్ కుట్రలు పన్నుతోంది.సత్తెనపల్లి కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు.. 14 రోజులు రిమాండ్ విధించింది. గుంటూరు నుంచి అంబటి రాంబాబును రాజమండ్రికి తరలిస్తున్నారు. సత్తెనపల్లి కేసులో బెయిల్ పిటిషన్, జైల్లో వసతులు కల్పించాలంటూ మరొక పిటిషన్‌ను అంబటి రాంబాబు తరఫున న్యాయవాదులు దాఖలు చేశారు.కాగా, అంబటి రాంబాబుకు ఒక కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తుంటే మరో కేసు ముందుకు తెస్తున్నారు. పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారు. మెడికల్ ఉద్యమం సందర్భంగా అధికారులను బెదిరించారంటూ అంబటిపై పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి.మేరీ సారధనమ్మ బుధవారం(ఫిబ్రవరి 11) బెయిల్ మంజూరు చేశారు. నేడు (గురువారం) ఆయన విడుదల అవుతారని అనుకుంటున్న తరుణంలో వెంటనే మరో కేసులో పీటీ వారెంట్ జారీ అయ్యింది. గతంలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన నాయకుడు పెట్టిన ఓ పెట్టీ కేసులో ఇపుడు పీటీ వారెంట్ జారీచేశారు.ఇలా వరుస కేసులతో బాబు సర్కార్.. ఇబ్బందులకు గురిచేస్తోంది. పొరపాటున మాట తూలినా క్షమాపణ కోరిన అంబటిని సెంట్రల్ జైలులో నిర్బంధించిన కూటమి ప్రభుత్వం అంబటి ఇంటిపై పెట్రోలు బాంబులు విసిరి, మారణాయుధాలతో భయానక దాడులు చేసిన వారికి మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి సాగనంపింది. ప్రశ్నిస్తున్నందునే అంబటిని ఇలా దుర్మార్గంగా హింసిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.అంబటి రాంబాబుపైకి దాడికి తెగబడటమే కాకుండా, ఇంటిపైన , కార్యాలయంపైన దాడి చేసి కార్యాలయానికి, కార్లకు నిప్పు పెడితే ఆ కేసులో ఒక్కరిని కూడా ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. పైగా దాడికి గురైన అంబటి రాంబాబుపైనే అక్రమ కేసు బనాయించి జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ వచ్చే సమయానికి కస్టడీ పిటీషన్‌తో పాటు మరో పాత కేసులో పీటీ వారెంట్ వేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సామాన్య ప్రజల ఆరోగ్య హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలలో భాగంగా గుంటూరులో జరిగిన ధర్నాలో పాల్గొన్న అంబటిపై అధికారులను బెదిరించారంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.ఆ కేసులో ఆయనకు ఈ నెల 22 వరకూ రిమాండ్ విధించారు. ఈ కేసులో బుధవారం వాదనల అనంతరం గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి. మేరీ సార ధనమ్మ బెయిల్ మంజూరు చేశారు. ఈ బెయిల్‌కు సంబం«ధించి షూరిటీలు అన్నీ సమర్పించిన తరుణంలో.. సత్తెనపల్లిలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబంరాలపై జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వేసిన కేసును బయటకు తీసారు. ఈ కేసులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో ఆయనను ఇవాళ (గురువారం) గుంటూరు కోర్టులో మళ్లీ హాజరుపర్చారు. ఈ కేసులో కోర్టు.. అంబటికి 14 రోజులు రిమాండ్ విధించింది. -
Chirla Jaggi: గుర్తుపెట్టుకోండి.. ఇంటికి వెళ్ళడానికి దారి ఖర్చులు ఉండవు..
-
జైల్లో పెట్టినా అదే ధైర్యం.. పోలీస్ జీపులోంచి తగ్గేదే లే..
-
అంబటిపై కుట్రల మీద కుట్రలు
-
2023లో కేసు.. ఇప్పుడు పీటీ వారెంట్
-
అంబటి కుటుంబానికి పెద్దిరెడ్డి పరామర్శ
-
సర్కార్ శాడిజం.. కాపు నేతపై కన్నింగ్ ప్లాన్
-
అంబటిపై కక్ష సాధింపు.. గుంటూరు కోర్టులో రాంబాబు
సాక్షి, తూర్పుగోదావరి: వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఏపీ పోలీసులు తాజాగా అంబటిపై మరో కేసుకు సంబంధించిన పిటీ వారెట్పై విచారణకు గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. కాగా, గతేదాడి నవంబర్ 12న పట్టాభిపురం వైఎస్సార్సీపీ ర్యాలీ కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. దీంతో, అంబటి జైలు నుంచి విడుదల కావాల్సి ఉండగా.. ఆయన బయటకు రాకుండా కూటమి ప్రభుత్వం మరో కేసులో అరెస్ట్‌కు రంగం సిద్దం చేసింది. 2023లో(ప్రైవేట్ కేసు నమోదు) సత్తెనపల్లి పరిధిలో నమోదైంది. అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన నాయకుడు పెట్టిన ఓ పెట్టీ కేసులో ఇపుడు పిటీ వారెంట్ జారీచేశారు. కేసుకు సంబంధించి పిటీ వారెంట్‌పై విచారణకు అంబటి రాంబాబును గుంటూరు తరలించారు. ఈ నేపథ్యంలో గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పిటీ వారెంట్‌పై అంబటిని సత్తెనపల్లి పోలీసులు హాజరు పరిచారు. బెయిల్.. వెంటనే పాత కేసులో పీటీ వారెంట్.. అంబటి రాంబాబుపైకి దాడికి తెగబడటమే కాకుండా, ఇంటిపైన , కార్యాలయంపైన దాడి చేసి కార్యాలయానికి, కార్లకు నిప్పు పెడితే ఆ కేసులో ఒక్కరిని కూడా ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. పైగా దాడికి గురైన అంబటి రాంబాబుపైనే అక్రమ కేసు బనాయించి జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ వచ్చే సమయానికి కస్టడీ పిటీషన్‌తో పాటు మరో పాత కేసులో పీటీ వారెంట్ వేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సామాన్య ప్రజల ఆరోగ్య హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలలో భాగంగా గుంటూరులో జరిగిన ధర్నాలో పాల్గొన్న అంబటిపై అధికారులను బెదిరించారంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.ఆ కేసులో ఆయనకు ఈ నెల 22 వరకూ రిమాండ్ విధించారు. ఈ కేసులో బుధవారం వాదనల అనంతరం గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి. మేరీ సార ధనమ్మ బెయిల్ మంజూరు చేశారు. ఈ బెయిల్‌కు సంబంధించి షూరిటీలు అన్నీ సమర్పించిన తరుణంలో.. సత్తెనపల్లిలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వేసిన కేసును బయటకు తీసారు. అంబటి రాంబాబుపై దాడి జరిగిన తర్వాత కొత్తగా 36 కేసులు నమోదు చేయగా ఆ కేసులన్నింటిలో 41 కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో అంబటిపై మరో కేసును తెరపైకి తీసుకువచ్చారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అన్యాయాలపై తన గళం వినిపిస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు పట్ల రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో జరుగుతున్న వేధింపులపై అన్ని వర్గాలలో నిరసన వ్యక్తం అవుతోంది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొంటున్నారు. సంబంధిత కేసులపై న్యాయపరమైన పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు వెల్లడించారు. -
సర్కారు శాడిజానికి 'పరాకాష్ట'
సాక్షి ప్రతినిధి, గుంటూరు, గుంటూరు లీగల్: మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వ కక్షసాధింపు కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తుంటే మరో కేసు ముందుకు తెస్తున్నారు. పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారు. మెడికల్ ఉద్యమం సందర్భంగా అధికారులను బెదిరించారంటూ అంబటిపై పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి.మేరీ సారధనమ్మ బుధవారం బెయిల్ మంజూరు చేశారు. గురువారం ఆయన విడుదల అవుతారని అనుకుంటున్న తరుణంలో వెంటనే మరో కేసులో పీటీ వారెంట్ జారీ అయ్యింది. గతంలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన నాయకుడు పెట్టిన ఓ పెట్టీ కేసులో ఇపుడు పీటీ వారెంట్ జారీచేశారు. ఇలా వరుస కేసులతో హింసించడం సర్కారు శాడిజానికి పరాకాష్ట అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పొరపాటున మాట తూలినా క్షమాపణ కోరిన అంబటిని సెంట్రల్ జైలులో నిర్బంధించిన కూటమి ప్రభుత్వం అంబటి ఇంటిపై పెట్రోలు బాంబులు విసిరి, మారణాయుధాలతో భయానక దాడులు చేసిన వారికి మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి సాగనంపింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఓ విష సంస్కృతికి శ్రీకారం చుట్టారని దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చని పరిశీలకులంటున్నారు. ఒక కాపు నేతపై ఇంతలా కక్ష సాధించడం విడ్డూరమని వారు పేర్కొంటున్నారు. ప్రశ్నిస్తున్నందునే అంబటిని ఇలా దుర్మార్గంగా హింసిస్తున్నారని అంటున్నారు. బెయిల్.. వెంటనే పాత కేసులో పీటీ వారెంట్.. అంబటి రాంబాబుపైకి దాడికి తెగబడటమే కాకుండా, ఇంటిపైన , కార్యాలయంపైన దాడి చేసి కార్యాలయానికి, కార్లకు నిప్పు పెడితే ఆ కేసులో ఒక్కరిని కూడా ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. పైగా దాడికి గురైన అంబటి రాంబాబుపైనే అక్రమ కేసు బనాయించి జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ వచ్చే సమయానికి కస్టడీ పిటీషన్‌తో పాటు మరో పాత కేసులో పీటీ వారెంట్ వేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సామాన్య ప్రజల ఆరోగ్య హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలలో భాగంగా గుంటూరులో జరిగిన ధర్నాలో పాల్గొన్న అంబటిపై అధికారులను బెదిరించారంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఆయనకు ఈ నెల 22 వరకూ రిమాండ్ విధించారు. ఈ కేసులో బుధవారం వాదనల అనంతరం గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి. మేరీ సార ధనమ్మ బెయిల్ మంజూరు చేశారు. ఈ బెయిల్‌కు సంబం«ధించి షూరిటీలు అన్నీ సమరి్పంచిన తరుణంలో.. సత్తెనపల్లిలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబంరాలపై జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వేసిన కేసును బయటకు తీసారు. ఈ కేసులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో ఆయనను గురువారం గుంటూరు కోర్టులో మళ్లీ హాజరుపరుచనున్నారు. అంబటి రాంబాబుపై దాడి జరిగిన తర్వాత కొత్తగా 36 కేసులు నమోదు చేయగా ఆ కేసులన్నింటిలో 41 కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో అంబటిపై మరో కేసును తెరపైకి తీసుకువచ్చారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అన్యాయాలపై తన గళం వినిపిస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు పట్ల రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో జరుగుతున్న వేధింపులపై అన్ని వర్గాలలో నిరసన వ్యక్తం అవుతోంది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొంటున్నారు. సంబంధిత కేసులపై న్యాయపరమైన పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు వెల్లడించారు. సుప్రీం తీర్పులకు విరుద్ధంగా.. అంబటి రాంబాబు మాట్లాడిన ఒక్క మాటకు 36 కేసులు పెట్టారు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు కూడా విరుద్ధమని, దీని వెనుక సర్కారు రాక్షసత్వం, ఒక వ్యక్తిపై కక్ష, పగ కనిపిస్తున్నాయని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ 2022లో ఇచ్చిన తీర్పు ప్రకారం ఓ కాగ్నిజబుల్ అఫెన్స్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే.. ఇక ఎక్కడా అలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు. ఈ ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్ను నమోదు చేయకుండా ఫిర్యాదుదారుల్ని సాక్షులుగా పేర్కొనవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. టీటీ ఆంథోనీ కేసులోనూ ఆర్టికల్ 141 ప్రకారం ఓ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అదే కేసులో మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పినా ఆ తీర్పును రాష్ట్రంలో అమలు చేయడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఆర్టికల్ 141, సుప్రీంకోర్టు తీర్పుల్ని లెక్కచేయడం లేదు. ఒకే కేసులో ఇన్ని ఎఫ్‌ఐఆర్‌లా..హైకోర్టు విస్మయం.. అంబటి రాంబాబుపై అనేక కేసులు నమోదు చేస్తుండడంపై హైకోర్టు కూడా విస్మయం వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా తనపై నమోదైన కేసులను కొట్టేయాలని కోరుతూ అంబటి లంచ్‌మోషన్ రూపంలో దాఖలుచేసిన వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ జరిపారు. ఒకే అంశంపై ఎన్ని ఎఫ్ఐఆర్లు దాఖలు చేస్తారని న్యాయమూర్తి ఈ సందర్భంగా ప్రశ్నించారు. మొదటి ఫిర్యాదును ప్రధాన కేసుగా తీసుకుని మిగిలిన అన్ని ఫిర్యాదులను సీఆర్పీసీ సెక్షన్ 162 కింద వాంగ్మూలాలుగా ఎందుకు పరిగణించకూడదని ప్రశ్నించారు. అంబటి కేసులో చట్ట ప్రకారం వ్యవహరించాలని హైకోర్టు గుంటూరు జిల్లా, మంగళగిరి గ్రామీణ పోలీసులను ఆదేశించారు. ఆయనకు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులకు స్పష్టం చేశారు. ఈ కేసులో తమ కుట్ర ఫలించకపోవడం వల్లనే ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతో అంబటిపై ఒక కేసు తర్వాత మరో కేసు పెడుతున్నారని విమర్శకులంటున్నారు. -
అంబటి ఇంటిపై దాడి దుర్మార్గం: పెద్దిరెడ్డి
సాక్షి, గుంటూరు: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో అరాచకం పతాక స్థాయికి చేరిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయని మండిపడ్డారు.సౌమ్యుడైన అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేయడంతో పాటు బీసీ నేత మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఈ తరహా దాడులు మునుపెన్నడూ చూడలేదని.. ఈ అరాచకాలకు మంత్రి లోకేషే మూల కారణమని తేల్చి చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం అయితే ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ఇంకా ఏమన్నారంటే..సౌమ్యుడైన అంబటి రాంబాబు మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఇంటిపై అత్యంత దారుణంగా దాడి చేశారు. ఆ తర్వాత బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై ఏకంగా పెట్రోలు బాంబులతో దాడి చేశారు. ఇలాంటి దాడులతో కూటమి ప్రభుత్వం ఎక్కడికి పోతుందో అర్ధం కావడం లేదు? ఇలాంటి దాడులతో మళ్లీ రాజకీయాలలో మనుగడ సాగించాలన్న ఆలోచన చేస్తుందా? లేదా అన్నది కూడా అర్ధం కావడం లేదు. వీరి తీరును రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనైనా, విడిపోయిన తర్వాత అయినా మాజీ మంత్రులు, శాసనసభ్యుల ఇళ్లపై దాడి చేసే సంస్కృతి ఎప్పుడూ చూడలేదు.1978 నుంచి రాజకీయాల్లో నేను కూడా ఏ పార్టీ ఇలాంటి దాడులకు పాల్పడ్డాన్ని చూడలేదు. కాపులకు అండగా ఉంటానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు? ఆ రోజు అధికారం కోసం అడ్డగోలుగా అబద్దాలు చెప్పిన పవన్ కళ్యాణ్.. 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని చెప్పాడు. ఇవాళ ఒక్క మహిళనైనా మరి వెనక్కి తిరిగి తీసుకొచ్చాడా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్నే మర్చిపోయాడు. చంద్రబాబు, లోకేష్‌లు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప.. పవన్ కళ్యాణ్ కాపులకు చేసిందేమీ లేదు.మరో వైపు, రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలన్నింటికీ మూల కారణం లోకేష్. చంద్రబాబు పవన్ కళ్యాణ్, లోకేష్‌లు చేస్తున్న తప్పులకు వత్తాసు పలకడం తప్ప.. తన వయస్సుకు తగినట్లు ప్రవర్తించడం లేదు. ఆలాంటి ఆలోచన కూడా చేయడం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , లోకేష్‌లకు ఒక్కటే చెబుతున్నాం. ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం అయితే మీకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు, మీ డిపాజిట్లు గల్లంతవడం ఖాయం. ఇవాళ శాసనసభలో అధికార పార్టీ నేతల మొహాలు చూస్తుంటేనే వారి పరిస్థితి అర్ధం అవుతుంది. వారి మొహాల్లో భయం కనిపిస్తోంది.అంబటి రాంబాబు కుటుంబానికి వైఎస్ జగన్‌తో పాటు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. రాంబాబు మీద దాడి చేసిన వారు తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదని, అధికార పార్టీ నేతలు చేసిన దుశ్చర్యను ప్రజలందరూ గమనిస్తున్నారని, తగిన టైంలో బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. అంబటి రాంబాబుకి బెయిల్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. -
మిమ్మల్ని పొలిమేరలు దాటే వరకు.. గల్లా మాధవి వంగలపూడి అనితకు జడ శ్రవణ్ స్ట్రాంగ్ వార్నింగ్
-
విడుదల కాకుండా ... అంబటిపై మరో కేసులో ఇరికించాలని చూస్తోన్న పోలీసులు
-
అంబటికి బెయిల్... కూతురు మౌనిక ఫస్ట్ రియాక్షన్
-
మాజీ మంత్రి అంబటిపై ఆగని కూటమి కుట్రలు
సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి కుట్రలు కొనసాగుతున్నాయి. అంబటి విడుదల కాకుండా విశ్వప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాత కేసులను తిరగతోడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా అంబటిని మరో కేసులో ఎలాగైనా ఇరికించాలని చూస్తున్నారు.గతేడాది నవంబర్‌లో పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. విచారణలో అంబటికి షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పుతో ఇదే కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం కుట్రకు దిగింది. అంబటి విడుదల కాకుండా పాత కేసులు తిరగతోడాలని ఆదేశాలు జారీ చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2023లో పెండింగ్‌లో ఉన్న పాత కేసును2023లో పెండింగ్‌లో ఉన్న పాత కేసును పోలీసులు తెరపైకి తెచ్చారు. సత్తెనపల్లిలో సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీలు నిర్వహించి బలవంతంగా డబ్బులు వసూలు చేశారని 2023లో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. జనసేన జిల్లా అధ్యక్షుడు ఫిర్యాదుతో అప్పట్లో సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టాభిపురం కేసులో అంబటికి బెయిల్ వస్తుందని భావించిన కూటమి ప్రభుత్వం మధ్యాహ్నం నుంచి పాత కేసులను తిరగ తోడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఆ ఆదేశాల మేరకు.. సత్తెనపల్లి కేసుకు సంబంధించి ఇవాళ గుంటూరు కోర్టులో పిటి వారెంట్ కోసం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పిటి వారెంటుకు కోర్టు అనుమతించింది. దీంతో రాజమండ్రి జైలు నుంచి పట్టాభిపురం కేసులో విడుదల కానున్న అంబటిని ఈ కేసులో కోర్టు ఎదుట హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది. -
అంబటి రాంబాబు బెయిల్‌పై లాయర్లు రియాక్షన్
-
అంబటి కుటుంబాన్ని పరామర్శించిన ఉషశ్రీ చరణ్
-
రాజమండ్రి జైల్ నుంచి రేపే అంబటి విడుదల
-
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్
సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. అంబటికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతేగడాది నవంబర్ 12న నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేస్తూ గుంటూరు కోర్టు తీర్పును వెలువరించింది. నవంబర్ 12న వైఎస్సార్సీపీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టింది. ఆ ర్యాలీ నిర్వహించే సమయంలో అంబటి తమ విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు. తాజా, కోర్టు తీర్పుతో ఈరోజే అంబటి రాంబాబు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంబటి రాంబాబు బెయిల్‌కు సంబంధించి పూచికత్తుల వ్యవహారం ఇప్పటికే పూర్తయ్యింది. అంబటి తరఫు న్యాయవాదులు పదివేల రూపాయలు చొప్పున రెండు పూచీకత్తులు కోర్టుకు సమర్పించారు. రిలీజింగ్ ఆర్డర్ తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు బయల్దేరారు. -
అంబటి కుటుంబానికి విజయవాడ YSRCP నేతలు పరామర్శ
-
జైల్లో అంబటిని కలిసిన తరువాత ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు
-
ఇటువంటివి నేనెప్పుడూ చూడలేదు... ఇది మీకు చాలా ప్రమాదం.. అరెస్ట్ పై ఉండవల్లి
-
కక్ష సాధింపే.. క్లియర్‌గా తెలిసిపోయింది: ఉండవల్లి
సాక్షి, తూర్పుగోదావరి: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మంగళవారం కలిశారు. రాజమండ్రి జైలులో అంబటితో ఉండవల్లి అరణ్‌కుమార్, మాజీ మంత్రి కన్నబాబు ములాఖత్ అయ్యారు.అనంతరం ఉండవల్లి.. మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో కొత్త పద్దతి నడుస్తుందన్నారు. ‘‘ధ్వంసం చేసిన వారికి స్టేషన్ బెయిల్.. విమర్శించిన వారికి జైలు. పెట్రోల్ బాంబులతో దాడులు చేసిన వారికి బెయిల్ దారుణం. జైల్లో వేయడం, 30 చోట్ల నుంచి కంప్లైట్ల పెట్టడం దారుణం. చంద్రబాబు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. కక్ష సాధింపు అనేది క్లియర్ గా తెలిసిపోయింది’’ అని ఉండవల్లి పేర్కొన్నారు.కాగా, అంబటి రాంబాబుకు ఒక కేసులో బెయిల్ రాగా, మరో కేసులో ఈ నెల 22వ తేదీ వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న అంబటి రాంబాబును పోలీసులు సోమవారం గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరు పరిచారు. ఒక కేసులో బెయిల్ లభించినా.. మరో కేసులో 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను తిరిగి రాత్రి 7.30 గంటలకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తీసుకువచ్చారు.అంబటిపై ఆగని కుట్రలునల్లపాడు పోలీసు స్టేషన్లో కేసుకు సంబంధించి అంబటి రాంబాబుకు బెయిల్ ఇచ్చిన స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌తోపాటు సౌకర్యాలు కోరుతూ రాంబాబు వేసిన ఎమినిటీస్ పిటిషన్లను తిరస్కరించారు. నల్లపాడు కేసులో బెయిల్ వస్తుందన్న ఉద్దేశంతో గతంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనపై పట్టాభిపురం పోలీసు స్టేషన్లో పెట్టిన కేసులో పీటీ వారెంట్‌పై సోమవారం రాజమండ్రి నుంచి గుంటూరు తీసుకువచ్చి ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది వక్కాల సూరిబాబు, మాజీ ఎంపీపీ మాతంగి శ్రీకాంత్, సహచర న్యాయవాదులు, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు వాదనలు వినిపించారు.బెయిలబుల్ సెక్షన్లతో ఉన్న కేసుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ రాజ్యాంగ బద్ధమైన హక్కు అని, అలాంటి సందర్భాల్లో అరెస్ట్, రిమాండ్ అవసరంపై కోర్టు సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే.. ఈ కేసులో ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కాగా.. అంబటికి ఎట్టిపరిస్థితుల్లో బెయిల్ రాకుండా, పాత కేసుల్లో పీటీ వారెంట్లు దాఖలు చేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. -
KSR Show: రాజకీయ నిరసనలపై కూడా పోలీసులు దృష్టి పెట్టాలట..!
-
ఒకే ఘటనపై ఎన్ని కేసులు పెడతారు
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వులు లేవని సీబీఐ–సిట్ చార్జిషిట్ దాఖలు చేసినా.. అధికార పార్టీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టే క్రమంలో చేసిన వ్యాఖ్యలకు గాను తనపై రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు పోలీస్ స్టేషన్లలో నమోదైన 33 కేసులను కొట్టేయాలని కోరుతూ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు సోమవారం అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ జరిపారు.ఒకే అంశంపై ఎన్ని ఎఫ్ఐఆర్లు దాఖలు చేస్తారని న్యాయమూర్తి ప్రశి్నంచారు. మొదటి ఫిర్యాదును ప్రధాన కేసుగా తీసుకుని మిగిలిన అన్ని ఫిర్యాదులను సీఆర్పీసీ సెక్షన్ 162 కింద వాంగ్మూలాలుగా ఎందుకు పరిగణించకూడదన్నారు. దీనిపై పోలీసులకు తగిన సూచనలు చేస్తామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ విషయంపై తదుపరి విచారణ నాటికి స్పష్టత తీసుకోవాలని పీపీకి న్యాయమూర్తి స్పష్టం చేశారు. అంబటిపై రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 33 కేసుల్లో చట్ట ప్రకారం నడుచుకోవాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు.బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసులు జారీ చేసి ఆయన వివరణ తీసుకోవాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 2కి వాయిదా వేశారు. అంబటి తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 35 కేసులు ఒకే అంశానికి సంబంధించినవని, దీనిపై బహుళ ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి వీల్లేదని తెలిసినా పోలీసులు కేసులు నమోదు చేస్తూనే ఉన్నారని కోర్టుకు తెలిపారు. చట్ట ప్రకారం నడుచుకోండి గత ఏడాది జూన్‌లో వెన్నుపోటు దినం పేరుతో బైక్ ర్యాలీ నిర్వహించినందుకు అంబటి రాంబాబుపై నమోదైన కేసుల్లో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నడుచుకోవాలని గుంటూరు, పట్టాభిపురం పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఆయనకు నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలంది. అంబటిపై నమోదైన కేసులు ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడేవేనని, ఫిర్యాదుదారులకు నోటీసులివ్వాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మార్చి 16కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
చంద్రబాబుకు బిగ్ షాక్ అంబటికి బెయిల్
-
పుల్ హ్యాపీ.. అంబటి బెయిల్ పై పొన్నవోలు రియాక్షన్
-
ఏపీ హైకోర్టులో అంబటి రాంబాబుకు ఊరట
-
అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు
-
అంబటిపై నాగబాబు వ్యాఖ్యలు.. కొండా రాజీవ్ అదిరిపోయే కౌంటర్
-
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్
సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు అంబటికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కస్టడీ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు అరెస్టు చేసిన కేసులో బెయిల్ ఇచ్చింది. ఇదే కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్నారు. పోలీసులు కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించింది. పట్టాభిపురం పోలీసులు అక్రమ కేసులుగతేడాది నవంబర్ నెలలో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ‘ప్రజా ఉద్యమం’ పేరుతో ర్యాలీ నిర్వహించింది. అయితే, గుంటూరులో ఈ ర్యాలీ నిర్వహించిన అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు.కేసుకు సంబంధించి గుంటూరు కోర్టులో పోలీసులు అంబటిని హాజరు పరిచారు. విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారంటూ జనవరి 31న అరెస్టు చేసిన కేసులో బెయిల్ వచ్చినప్పటికీ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ర్యాలీ కేసులో రిమాండ్‌లో కొనసాగనున్నారు. ఈ కేసులోనూ బెయిల్ వస్తే అంబటి విడుదలయ్యే అవకాశం ఉంది. 44 కేసులు కాగా కూటమి ప్రభుత్వం మాజీ మంత్రిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ఈ నేపథ్యంలో గడిచిన ఎనిమిది రోజుల్లో అంబటి రాంబాబుపై 36 కేసులు నమోదు చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మెుత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 44 కేసులు నమోదయ్యాయి. -
ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట
సాక్షి,విజయవాడ: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట లభించింది. పట్టాభిపురం, నగరం పాలెం పోలీసులు నమోదు చేసిన కేసులను క్వాష్ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంబటి దాఖలు పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా 35 (3) BNSS ప్రొసీజర్ ఫాలో కావాలని ఏపీ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. -
గుంటూరు కోర్టులో అంబటి రాంబాబు విజువల్స్
-
అంబటికి 22 వరకూ రిమాండ్ పొడగింపు
సాక్షి గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు ఈ నెల 22 వరకూ రిమాండ్ పొడిగించింది. గతేడాది నవంబర్ 12న పెట్టిన కేసులో ఆయనను కోర్టు ముందు హాజరు పరచగా రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా ర్యాలీ చేయగా దానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా దానిపై పీటీవారెంట్ జారీ చేసి కోర్టులో హాజరు పరిచారు.కాగా కూటమి ప్రభుత్వం మాజీ మంత్రిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ఈ నేపథ్యంలో గడిచిన ఎనిమిది రోజుల్లో అంబటిరాంబాబుపై 36 కేసులు నమోదు చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మెుత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 44 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అంబటిపై పీటీ వారెంట్లు జారీ చేసి రాష్ట్రమంతా తిప్పాలని సర్కార్ కుట్ర చేస్తోంది. ఇందులో భాగంగానే గతంలో నమోదైన కేసులో ఆయనకు పీటీ వారెంట్ జారీ చేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయనను జైలుకు తరలించనున్నారు. -
గుంటూరు కోర్టుకు అంబటి రాంబాబు
-
Advocate: PT వారెంట్ పెట్టి హింసిస్తున్నారు..? అంబటి ఆరోగ్యం ఎలా ఉందంటే..
-
అంబటి రాంబాబుపై కొనసాగుతున్న కక్ష సాధింపు చర్యలు
-
అంబటి రాంబాబుపై PT వారెంట్.. గుంటూరుకు తరలింపు
-
అంబటిపై కక్ష సాధింపు.. 52 కేసులు, పిటీ వారెంట్లు..
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. అంబటిపై నమోదు చేసిన మరో అక్రమ కేసులో భాగంగా పట్టాభిపురం పోలీసులు.. ఆయనను నేడు గుంటూరు కోర్టులో హాజరుపర్చనున్నారు. మరోవైపు.. అంబటి ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, గత ఏడాది నవంబర్ 12వ తేదీన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడానికి నిరసిస్తూ అంబటి రాంబాబు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ర్యాలీని అడ్డుకుని అంబటి రాంబాబుపై దౌర్జన్యానికి దిగారు. దీంతో, తమ విధులకు అంబటి ఆటంకం కలిగించారని రాంబాబుపై అక్రమంగా కేసు నమోదు చేశారు. రాంబాబుపై నమోదైన కేసులో పిటీ వారెంట్ ద్వారా పట్టాభిపురం పోలీసులు నేడు గుంటూరు కోర్టులో అంబటిని హాజరుపరచనున్నారు. ఈ క్రమంలో పట్టాభిపురం పోలీసులు రాజమండ్రి జైలు నుంచి అంబటిని తీసుకొని గుంటూరు బయలుదేరారు.ఇక, ఇప్పటికే రాజమండ్రి, అనపర్తి, చిత్తూరు, బాపట్లతో సహ రాష్ట్రంలో పలుచోట్ల అంబటిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 52 కేసులు నమోదయ్యాయి. మరో మూడు పిటీ వారంట్లను అధికారులు సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటికి ప్రత్యేక సదుపాయాలు సైతం ప్రభుత్వం కల్పించకపోవడం గమనార్హం. అంబటితో పాటు అదే బ్యారక్‌లో మరో ముగ్గురు ఖైదీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో అంబటి భద్రతపై అడ్వకేట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు, అంబటి రాంబాబు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆయనపై నమోదైన మరికొన్ని కేసుల్లో పిటీ వారెంట్లు వేయటానికి పోలీసులు రెడీ అవుతున్నారని సమాచారం. మరోవైపు.. అంబటి ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతలు కావాలనే అంబటిని మానసికంగా, భౌతికంగా వేధిస్తున్నారని మండిపడుతున్నారు. ప్లాన్ ప్రకారమే కక్షగట్టి తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లోనే పోలీసులు నడుస్తున్నారని ఆరోపించారు. -
అంబటి కుటుంబాన్ని పరామర్శించిన కాకాణి, పూజిత
-
ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ.. అరెస్ట్‌కు భయపడం: కాకాణి
సాక్షి, గుంటూరు: కూటమి ప్రభుత్వం.. నాటి బ్రిటిష్ పాలనను మించిపోయింది.. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. పోలీసులను అడ్డు పెట్టుకొని దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వ్యక్తిత్వం కోల్పోయాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారు. అంబటి ఇంటిపై కూడా దాడి చేశారు. ఆయన కుటుంబాలకు ధైర్యం చెప్పటానికి వచ్చాం. కుటుంబ సభ్యులంతా ధైర్యంగా ఉన్నారు. కూటమి పాలనలో రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్న అనేక అంశాలపై అంబటి ప్రశ్నించారు. దీంతో దాడి చేసి అరెస్ట్ చేశారు. పోలీసులను అడ్డు పెట్టుకొని దౌర్జన్యాలు చేశారు.సీఎం చంద్రబాబు లడ్డూ విషయంలో అబద్ధాలు ఆడారు. కూటమి పాలన అధ్వాన్నంగా ఉంది. సమాధానం చెప్పలేక చంద్రబాబు దాడులు చేయిస్తున్నారు. గర్జించే సింహం కన్నా గాయపడ్డ సింహం ప్రమాదం అన్న విషయం కూటమి నేతలు గుర్తుంచుకోవాలి. పైశాచిక ఆనందం పొందటం తప్ప ఎటువంటి ఫలితం ఉండదు. చంద్రబాబు వ్యక్తిత్వం కోల్పోయాడు. చంద్రబాబు తనని అరెస్టు చేసినందుకు మమ్మల్ని అరెస్టు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు తట్టుకోలేరు. రాంబాబు తుపాకి తూటాలకు కూడా భయపడరు’ అని అన్నారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు కాకాణి పూజిత మాట్లాడుతూ..‘మౌనిక.. తండ్రి బాధ్యతను తీసుకొంది. ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొంది. అంబటి కుటుంబ సభ్యులను ఈ పరిస్థితుల్లో కలుస్తామనుకోలేదు. రాజకీయాలు దిగజారిపోయాయి. వైఎస్ జగన్‌కు సైన్యంలా నిలబడే భావన కూటమి నేతలే కల్పిస్తున్నారు. ప్రాణాలర్పించైనా జగన్‌ను గెలిపించుకుంటాం. కూటమి పాలనను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మహిళలంటే గౌరవం లేదు. ప్రభుత్వం చేసే తాటాకు బెదిరింపులకు భయపడం’ అని హెచ్చరించారు. -
పొగరు తగ్గించుకో... మౌనిక వార్నింగ్
-
కాపులు తమ చెప్పు కింద ఉండాలన్న భావనతో టీడీపీ వ్యవహరిస్తోంది
పట్నం బజారు (గుంటూరు ఈస్ట్): టీడీపీ తొలినుంచీ కాపులు తమ చెప్పు కింద ఉండాలన్న భావనతోనే వ్యవహరిస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. 1988లో వంగవీటి రంగా హత్య మొదలుకుని.. ఇటీవల ముద్రగడ పద్మనాభంపై దాడి వరకు కాపులపై టీడీపీ దాష్టికాలు చేస్తూనే ఉందని చెప్పారు. తాజాగా కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి కూడా టీడీపీ కాపు వ్యతిరేక విధానాలకు నిదర్శనమన్నారు. శనివారం గుంటూరు నగరంలోని సిద్ధార్థ గార్డెన్స్‌లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వైఎస్సార్సీపీ నేతలు, ఉత్తరాంధ్ర కాపు నేతలు వచ్చారు. ఇటీవల టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. టీడీపీ నేతలే ఘటనలన్నిటికీ కారణం ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. అంబటి నివాసం, ఆయన కార్యాలయం, కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు దాడి చేయటం సిగ్గుచేటన్నారు. ఘర్షణకు ప్రేరేపించింది, తిట్టింది, కార్యాలయం తగలబెట్టింది, అంబటిపై హత్యాయత్నం చేసింది టీడీపీ నేతలేనని స్పష్టం చేశారు. చివరకు అంబటిపై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై కుట్రపన్ని రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేశారని, కొవ్వు లేదని నివేదికలు రావటంతో తమ ప్రభుత్వంపై తిరుగుబాటు వస్తుందని ఫ్లెక్సీలు వేయించారని ఆరోపించారు.ఆ ఫ్లెక్సీలు తొలగించాలని అంబటి పిలుపునిచ్చారని, దీంతో ఉద్దేశపూర్వకంగా ఆయనపై దాడికి తెగబడ్డారన్నారు. కుటుంబ సభ్యులను తిడుతుంటే అంబటి మాట తూలారని, దానికి పొరపాటు జరిగిందని కూడా చెప్పారని గుర్తు చేశారు. అంబటిపై 17 కేసులు పెట్టి అక్రమ అరెస్ట్‌కు తెరదీశారని, తాజాగా ఆయనపై మరో 16 కేసులు పెట్టినట్టు తెలుస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంగా భావిస్తున్నామని స్పష్టం చేశారు. అంబటి టైగర్ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారని.. కచ్చితంగా పులి బయటకు వస్తే ఏ ఒక్కరిని ఉపేక్షించదన్నారు. పరామర్శించేందుకు వచ్చే వారినీ అడ్డుకుంటున్నారు అంబటి రాంబాబు కుమార్తె మౌనిక మాట్లాడుతూ.. తన తండ్రిపై టీడీపీ గూండాలు చేసిన హత్యాయత్నాన్ని నిరసిస్తూ తమకు మద్దతివ్వటానికి వస్తుంటే అడ్డుకుంటున్నారన్నారు. పరామర్శకు వస్తున్న వారి ఆస్తులు అయిపోవాల్సిందేనని ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యాఖ్యానించటం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే మాధవి తిరిగి దాడి చేస్తానంటున్నారని, ఆమెను అధికార అహంకారం ఆవరించిందన్నారు. ‘మీరు మొదటిసారి గెలిచారు. వ్యవస్థలను మేనేజ్ చేయటం ఎవరి వల్లా కాదు. క్షమాపణ అడగడానికి కర్రలు, రాళ్లు, మారణాయుధాలతో ఇళ్లకు వస్తారా? ఎమ్మెల్యే గల్లా మాధవి సమాధానం చెప్పాలి.కేంద్ర మంత్రి పెమ్మసాని రాజకీయాలు ప్రక్షాళన చేస్తామన్నారు. చివరకు అయనే మరింత కలుషితం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్‌కళ్యాణ్‌ను ఇటువంటి ఘటనపై స్పందించాలని అడగటం తప్పా? కేవలం దాడి విషయంలో ప్రశ్నించి, భద్రత కల్పించాలని అడిగాను’ అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మేరుగ నాగార్జున, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీ కృష్ణ, తాడికొండ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, పార్టీ నేతలు చింతలపూడి వెంకట్రామయ్య, కంది రాజీవ్‌గాం«దీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వ ఆగడాలను ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆగడాలను ప్రశ్నింస్తే గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. అంబటిపై దాడిని చూసి రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. ప్రభుత్వ చేతకాని విధానాలను ప్రశ్నింస్తే ఉక్కుపాదం మోపుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్ దుర్మార్గంగా వ్యవహరించారని, అందుకు నిలువెత్తు నిదర్శనం అంబటిపై దాడేనని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా కాపులపై దాడి చేయటం పరిపాటిగా మారిందన్నారు. కాపులపై దాడి చేయడం టీడీపీ డీఎన్ఏలోనే ఉందని దుయ్యబట్టారు. ప్రణాళిక ప్రకారమే ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, ధూళిపాళ్ల నరేంద్ర కనుసన్నల్లోనే టీడీపీ గూండాలు దాడి చేశారన్నారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావు లోకేశ్ ఆదేశాలతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు నేతలంతా అంబటి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. -
పవన్ కల్యాణ్ ఇప్పుడే గుర్తొచ్చారా? అంబటి మౌనిక అదిరిపోయే రిప్లై
-
గల్లా మాధవి, పెమ్మసానికి YSRCP కాపు నేతల స్ట్రాంగ్ వార్నింగ్
-
చంపడానికి వచ్చినా భయపడలేదు అందుకే.. అంబటి కాపు టైగర్..
-
మనిషి చనిపోయినా కూడా వదలట్లే.. వీళ్ళు పోలీసులా.. రాక్షసులా..
-
ఫస్ట్ టైం ఎమ్మెల్యే నువ్వు అహంకారం తగ్గించుకో.. లేదంటే..
-
అధికార అహంకారమా.. గల్లా మాధవిపై అంబటి మౌనిక ఆగ్రహం
సాక్షి, గుంటూరు: టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లపై కర్రలు, రాడ్లతో దాడి చేయమని మాధవికి ఏ రాజ్యాంగం చెప్పింది అని ప్రశ్నించారు. గల్లా మాధవి అధికార అహంకారంతో మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి మరోసారి బెదిరింపులకు దిగుతున్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసి మా ఇంటిపై దాడి చేశారు. ఇళ్లపై కర్రలు, రాడ్లతో దాడి చేయమని మాధవికి ఏ రాజ్యాంగం చెప్పింది. మీరు మొదటి సారి గెలిచారు. క్షమాపణ అడగటానికి వచ్చాం అంటూనే దాడి చేశామంటున్నారు. క్షమాపణ అడగడానికి వచ్చినవాళ్లు కర్రలు, రాళ్లు, మారణాయుధాలతో వస్తారా? ఎమ్మెల్యే గల్లా మాధవి సమాధానం చెప్పాలి. మీరు మీ పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తారు. దాడి చేయమనే మీరు మీ పిల్లలకి మెసేజ్ ఇస్తున్నారా?.కేంద్ర మంత్రి పెమ్మసాని రాజకీయాలు ప్రక్షాళన చేస్తామన్నారు. ఆయనే మరింత కలుషితం చేశారు. రాళ్లు విసురుతూ, కత్తులు దూస్తున్నా.. గునపాలతో గోడలు పొడుస్తున్నా అంబటి ధైర్యంగా కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టిన మీరు ఓట్ల కోసం ఆయన దగ్గరకు రాలేదా?. వైఎస్ జగన్ మా ఇంటికి వచ్చినప్పుడు బంగారు, వెండి ఆభరణాలు పోయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కూటమి నాయకులకు చేతనైంది.. తప్పుడు ప్రచారం చేయడం మాత్రమే. అంబటి రాంబాబుపై తెలుగుదేశం గుండాలు చేసిన హత్యాయత్నానికి వ్యతిరేకంగా మద్దతివ్వటానికి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వచ్చారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను కాపాడాలని నేను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కోరాను అని వ్యాఖ్యలు చేశారు. -
చంద్రబాబుకు వణుకు పుట్టేలా 300 కార్లతో అంబటి ఇంటికి కాపు నేతలు
-
చలో గుంటూరు కార్యక్రమం.. అంబటి ఇంటికి కాపు నేతలు
విశాఖ: వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ కాపు నేతలు చలో గుంటూరు కార్యక్రమం చేపట్టారు,. ఉమ్మడి విశాఖ జిల్లా వైయస్సార్సీపి కాపు నేతల ఆధ్వర్యంలో నేడు చలో గుంటూరు కార్యక్రమం చేపట్టారు. విశాఖ నుంచి భారీ ర్యాలీగా కార్లతో బయలుదేరిన వైఎస్ఆర్సిపి కాపు నాయకులు..అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను కలిసి సంఘీభావం తెలపనున్నారు వైఎస్సార్సీపీ కాపు నేతలు. దీనిలో భాగంగా అక్రమ అరెస్టులతో కాపులను చంద్రబాబు వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాపు నేతలు. కాపు ద్రోహి చంద్రబాబు అంటూ మండిపడుతున్నారు. తిరుపతి లడ్డు, గీతం భూములు కబ్జా వంటి అంశాన్ని దృష్టి మళ్లించేందుకు కాపులపై దాడులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చలో గుంటూరు కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ‘ మాజీ మంత్రి అంబటి రాంబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా నేడు చలో గుంటూరు కార్యక్రమం చేపట్టామన్నారు. చలో గుంటూరు కార్యక్రమం ద్వారా కాపు నేతలు.. అంబటి రాంబాబు కుటుంబానికి సంఘీభావం తెలపనున్నట్లు వెల్లడించారు. ‘ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహారిస్తుంది. పార్టీలో ఎవరికి కష్టం వచ్చినా మా స్పందన ఇలాగే ఉంటుంది. అంబటి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్తాం’ అని స్పష్టం చేశారు. కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. ‘ ప్రశ్నించే కాపులను చంద్రబాబు టార్గెట్ చేస్తున్నారు.. అంబటిపై అక్రమ కేసులు పెట్టారు. మేమంతా అండగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. -
అంబటి కుటుంబానికి రోజా, భూమన పరామర్శ
-
పవిత్ర లడ్డూపై దుష్ప్రచారం ఆపి.. క్షమాపణ చెప్పాలి
సీబీఐ సిట్ చార్జ్‌షీట్ వేసిన తర్వాత అయినా చంద్రబాబు చేయాల్సిన పని ఏంటంటే.. శ్రీ వేంకటేశ్వరస్వామి ముందు లెంపలేసుకుని ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. కనీసం మానవత్వం ఉన్న మనిషైతే చంద్రబాబు అలాంటి పని ఎందుకు చేయడం లేదు?సీబీఐ సిట్ చార్జ్‌షీట్‌లో పొందుపరిచిన వాస్తవాలను చూపించి ఎవరైనా చంద్రబాబుని ప్రశ్నిస్తే.. ఆయన అసహనంతో మా నాయకుల మీద దాడులు చేయించే నీచ స్థాయికి దిగజారిపోయాడు. అందులో భాగంగానే వరుసపెట్టి మా నాయకులు విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకరరెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీద దాడి చేయడమే కాకుండా అంబటి రాంబాబు ఇంటి మీద కూడా దాడి చేశారు.అసలు చంద్రబాబుకు చిప్ సరిగ్గా ఉంటే ఇలాంటి పనులు చేయిస్తారా? తిరుమల లడ్డూ విషయంలో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినా.. ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్‌లు ఎలాంటి జంతు కొవ్వు లేదని ధ్రువీకరించినా.. చంద్రబాబు, పవన్‌కల్యాణ్,లోకేశ్ తమ తీరు అస్సలు మార్చుకోవడం లేదు.తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న కూటమి నేతల ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు వక్రబుద్ధి, అబద్ధాలపై వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ సిట్‌ను ఏర్పాటు చేసింది. ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను ఎవరూ తప్పుపట్టలేరు. సుప్రీంకోర్టు కన్నా చంద్రబాబు పదవి పెద్దది కాదు. ఇవాళ చంద్రబాబు తన స్వార్థం కోసం వన్‌మ్యాన్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వాటికి ఎలాంటి ప్రామాణికత ఉండదు. తనకు అనుకూలంగా రిపోర్టు రాకపోవడంతో మళ్లీ కొత్త కమిషన్ ఏర్పాటు చేసుకుని, తనకు అనుకూలమైన రిపోర్టు కోసం కుట్ర చేస్తున్నాడు. - వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘చంద్రబాబు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని సీబీఐ చార్జ్‌షీట్‌లో తేల్చి చెప్పింది. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ కలవలేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ చంద్రబాబు అన్యాయంగా ఇంకా దుష్ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు. చంద్రబాబు సీఎం కాక ముందు వరకు ఎవరైనా తిరుమల ప్రసాదం ఇస్తే కళ్లకు అద్దుకుని తినేవారు. కానీ ఇప్పుడు ఆ ప్రసాదం పవిత్రతను చంద్రబాబు దిగజార్చాడు. ఒక అబద్ధాన్ని సృష్టించి రాజకీయాల కోసం దేవుడిని కూడా వాడుకున్న దుర్మార్గుడు చంద్రబాబే. లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు లేదని ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్‌ల నివేదికలు స్పష్టం చేసినా చంద్రబాబు ఇంకా ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం దారుణం..’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. అబద్ధాన్ని సృష్టించి రెక్కలు కట్టి దుష్ప్రచారం చేశారని, కానీ చంద్రబాబువి అబద్ధాలని సీబీఐ చార్జ్‌షీట్ తేల్చేసిందని వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో టీడీపీ మూకల దాడిలో దెబ్బతిన్న జోగి రమేష్ ఇంటిని శుక్రవారం వైఎస్ జగన్ పరిశీలించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. కక్షగట్టి దాడులుచంద్రబాబు అబద్ధాలను ప్రశ్నిస్తున్నందుకు చిప్ పని చేయక పోవడం వల్లే కక్షగట్టి దాడులకు దిగుతున్నారు. చేసిన తప్పు ఒప్పుకుని, లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారు. ఇప్పుడు వన్‌మ్యాన్ కమిషన్ అంటూ అనుకూల నివేదిక కోసం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ఆ కమిషన్‌కు ఏ మాత్రం విలువ ఉండదు. టీడీపీ గూండాలు గుంటూరులో అంబటి రాంబాబు ఇంట్లో ఐదు కార్లు «ధ్వంసం చేయడంతోపాటు ఇల్లు, ఆఫీసులో విధ్వంసం సృష్టించి ఆఫీస్‌కు నిప్పుపెట్టారు. ఆ మర్నాడు ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు జోగి రమేష్ ఇంటిపై ఏకంగా యాసిడ్ బాటిళ్లతో, పెట్రోల్ బాంబులతో వి«ధ్వంసం సాగించారు. అక్కడ అంబటి రాంబాబు.. ఇక్కడ జోగి రమేష్ తండ్రిపై హత్యాయత్నం జరిగింది. పోలీసుల సమక్షంలోనే రెండు చోట్లా దాడులు జరిగాయి. టీడీపీ గూండాలకు వారు అండగా ఉంటున్నారు. నాగరిక సమాజం తల దించుకునేలా చంద్రబాబు రాష్ట్రంలో జంగిల్‌రాజ్ కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేస్తున్నారు. నాగరిక సమాజం తల దించుకునేలా చంద్రబాబు సర్కారు చర్యలు ఉన్నాయి. తప్పులు చేస్తున్న ఎవరినీ వదిలిపెట్టబోం. సుప్రీంకోర్టు తలుపు కూడా తడతాం. మరో మూడేళ్లలో వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ఇప్పుడు తప్పులు చేస్తున్న అందరినీ బోనులో నిలబెడతాం. వారికి శిక్ష తప్పదు. నాగరిక సమాజం తలదించుకునేలా.. రాష్ట్రంలో జంగిల్‌రాజ్ పరిపాలన సాగుతోంది. నాగరిక ప్రపంచం తలవంచుకునేలా చంద్రబాబునాయుడు చేశారు. గుంటూరులో అంబటి రాంబాబు ఇంట్లో 5 కార్లను ధ్వంసం చేసి ఇంట్లోకి చొరబడ్డారు. అద్దాలను పగలగొట్టారు. ఇంట్లో ఆడవాళ్లను దుర్భాషలాడారు. ఇంటి పక్కనే ఉన్న ఆఫీసులోకి చొరబడి విధ్వంసానికి దిగి ఆఫీసును తగలబెట్టారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలో జరగటాన్ని అంతా చూశాం. అక్కడ సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు దహనకాండ జరిగింది. ఆ మర్నాడే ఇక్కడ కూడా సాయంత్రం అదే పరంపర కొనసాగింది. జోగి రమేష్ ఇంటిపైనా దారుణంగా దాడి చేశారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలని సీబీఐ తేల్చింది చంద్రబాబునాయుడు నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నాడని, ప్రజలను తప్పుదోవ పట్టించాడని సాక్షాత్తూ సీబీఐయే తేటతెల్లం చేస్తూ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. చంద్రబాబు నాయుడు ఆరోపించినట్లుగా తిరుమలలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, గొడ్డు కొవ్వు కానీ, పందికొవ్వు కానీ, చేప నూనె కానీ కలపలేదని సీబీఐ స్పష్టం చేసింది. శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు దు్రష్పచారం చేశాడు. ప్రతిష్టాత్మక ల్యాబ్‌లూ అదే నిర్ధారించాయి తిరుమలలో వాడిన నెయ్యిపై చంద్రబాబు చెబుతున్నవి అబద్ధాలని దేశంలోనే ప్రతిష్టాత్మకమైన నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ), నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) ల్యాబ్‌లు నిర్ధారించాయి. ఆ మేరకు నివేదికలు ఇచ్చాయి. అవి రెండూ కేంద్ర ప్రభుత్వ సంస్థలు. వారు పరీక్షించిన నెయ్యి శాంపిల్స్ అన్నీ కూడా చంద్రబాబు సీఎంగా ఉండగా, ఆయన మనిషి టీటీడీ ఈవోగా ఉండగా సేకరించినవే. సీబీఐ ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీకి ఆ శాంపిల్స్ పంపారు. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని, గొడ్డు కొవ్వు లేదని, పందికొవ్వూ లేదని, ఎలాంటి చేపనూనె కూడా కలవలేదని ఆ ల్యాబ్‌లు ధ్రువీకరించాయి. ఆ రిపోర్టులను సీబీఐ కూడా సరి్టఫై చేసింది. సీబీఐ సిట్ ఆ మేరకు చార్జ్‌షీట్ దాఖలు చేసింది. భూమన, వైవీకి సీబీఐ క్లీన్చిట్.. ఆ చార్జ్‌షీట్‌లో సీబీఐ మరో విషయం కూడా చెప్పింది... గతంలో టీటీడీ చైర్మన్లుగా వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి ఉన్నప్పుడు వాళ్లు ఎలాంటి తప్పూ చేయలేదని, అన్యాయమైన పనులు చేయలేదని స్పష్టం చేసింది. అందుకే వారి పేర్లు చార్జ్‌షీట్‌లో పెట్టలేదు. వారిలో ఎవరినీ అరెస్టు చేయలేదు. అంటే సీబీఐ వారికి క్లీన్చిట్ కూడా ఇచ్చింది. ఇదొక్కటే కాదు.. ఆ చార్జ్‌షీట్‌లో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. (పేజీ నెం 62 ప్రస్తావించారు) చంద్రబాబు సీఎం అయిన తర్వాత 2024 జూలై 25న నెయ్యిలో నాణ్యత లేదని టీటీడీ 4 ట్యాంకర్లను రిజెక్ట్ చేసింది (ఆ రిపోర్టు చదివి వినిపించారు. చార్జ్‌షీట్‌లోని పేజీ నెం 64, 44 అంశాలను చదివి వినిపించారు). కానీ ఆ రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మళ్లీ ఇదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే దొడ్డిదారిన వేరేవాళ్ల పేరుతో తిరిగి వస్తే వాటిని టీటీడీ ఆమోదించింది. అవే ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ తయారీకి వాడారని స్వయంగా సీబీఐ వెల్లడించింది. అలా చంద్రబాబు ప్రభుత్వం మీద, వాళ్లు చేసిన తప్పుల మీద, వాళ్లు చేసిన అన్యాయంపై చార్జ్‌షీట్‌లో రాశారు. పాపం చేసింది ఎవరు బాబూ..? ఏకంగా సీబీఐనే చంద్రబాబు ప్రభుత్వం మీద ఈ మాదిరిగా చార్జిషీట్లో రాసిన తర్వాత అసలు పాపం చేసిన వాళ్లు ఎవరు? అని చంద్రబాబును, ఆయన కుమారుడిని, కూటమిలో ఉన్న పవన్‌కల్యాణ్‌ను ప్రశ్నిస్తున్నా. టీటీడీ నెయ్యిలో చేప నూనె, గొడ్డు కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందని ఎవరు చెప్పారు..? సీబీఐ చెప్పిందా..? ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్టులు చెప్పాయా..? చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్‌తో పాటు రోజూ వారి పల్లకి మోస్తున్న ఎల్లో మీడియా (ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5) ప్రచారం చేయడం మినహా ఎవరైనా చెప్పారా? ఒక అబద్ధానికి రెక్కలు కట్టి దు్రష్పచారం చేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం కన్నా హేయమైన చర్య ఇంకోటి ఉంటుందా? చంద్రబాబుకు ఇకనైనా బుద్ధి రావాలి.. అనిల్ సింఘాల్‌ను చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే టీటీడీ ఈవోగా నియమించారు. మా ప్రభుత్వం ఆయన్ను కొనసాగించింది. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన్నే తెచ్చారు. శ్యామలరావును టీటీడీ ప్రక్షాళన కోసం తెచ్చానని చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక చెప్పారు. ప్రక్షాళనకు ముందే ఆయన్ను ఎందుకు టీటీడీ ఈవోగా తొలగించారు? శ్యామలరావు ఈవోగా ఉన్నప్పుడు కొన్ని నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి. అవే ట్యాంకర్లు.. మళ్లీ టీటీడీకి మరో డెయిరీ పేరుతో తిరిగి వచ్చినట్లు సీబీఐ సిట్ ధ్రువీకరించింది. మరి పాపం చేసింది ఎవరు చంద్రబాబూ? చంద్రబాబుకు ఇకనైనా బుద్ధి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. పూజలు చేయడం తప్పా..? మానవత్వం లేని చంద్రబాబుని ప్రశ్నిస్తూ.. ఆయనకు దేవుడు జ్ఞానోదయం కలిగించాలని ప్రార్థిస్తూ మా నాయకులు ఆలయాల్లో పూజలు చేశారు. ఆయనతోపాటు లోకేశ్, పవన్‌కల్యాణ్‌తో సహా ఇతర నాయకులకు బుద్ధి, జ్ఞానం కలగాలని, వారి చిప్ రిపేర్ చేయాలని మా నాయకులంతా గుళ్లల్లో పూజలు చేశారు. ఒక అబద్ధానికి రెక్కలు కట్టి దు్రష్పచారం చేస్తూ శ్రీవారి ప్రతిష్టను మంట కలిపేస్తుంటే మావాళ్లు గుళ్లలో పూజలు చేయడం తప్పా? ఇది హత్యాయత్నం కాదా..? లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ఆరోపణలు పచ్చి అబద్ధమని అంత స్పష్టంగా, అన్ని విధాలుగా తేలిన తర్వాత కూడా ఈ పెద్ద మనిషి ఫ్లెక్సీలు కట్టి తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా దు్రష్పచారం చేయడం ధర్మమేనా? ఆ ఫ్లెక్సీల్లో అన్యాయమైన మాటలు రాసి దు్రష్పచారం చేయడం న్యాయమేనా? చంద్రబాబు, లోకేశ్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రశ్నిస్తూ మా నాయకుడు జోగి రమేష్.. మీ చిప్ రిపేర్ చేసుకోమని సలహా ఇచ్చాడు. దానికి ఇంత అన్యాయమైన పని చేయడం ధర్మమేనా? సలహా ఇవ్వడం మినహా జోగి రమేష్ ఏమీ చేయలేదు. దానికే చంద్రబాబుకి అసహనం ఏస్థాయిలో వచ్చింది అంటే.. ఏకంగా యాసిడ్ బాటిల్స్, పెట్రోల్ బాంబులతో జోగి రమేష్ ఇంటి మీద దాడులు చేయించాడు. ఆ యాసిడ్ పడిన ప్రాంతంలో బండలు తీవ్రంగా కాలిపోయాయి. గోడల నిండా యాసిడ్ మరకలు కనిపిస్తున్నాయి. యాసిడ్ పడి డోర్లు కాలిపోయాయి. ఆ పక్కనే ఉన్న స్విచ్ బోర్డుల మీద పడి షార్ట్ సర్క్యూట్ అయితే పెద్ద ఘోరం జరిగి ఉండేది. ఇంట్లో ఉన్న కర్టెన్లు, ఉడెన్ ఫర్నీచర్లు కాలిపోతే పరిస్థితి తీవ్రరూపం దాల్చేది. ఇంట్లో 80 ఏళ్ల వయసున్న జోగి రమేష్ నాన్న నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇది హత్యాయత్నం కాదా? బీసీ నాయకుడిగా జోగి రమేష్ ఎదుగుతుంటే, ప్రభుత్వ తప్పులపై ఆయన వాయిస్ బలంగా వినిపిస్తుంటే.. ఆ గొంతు నొక్కే కుట్రలో భాగంగానే చంద్రబాబు ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలతో దాడులు చేయిస్తున్నాడు. పోలీసులతో కలిసి టీడీపీ కుట్ర..జోగి రమేష్ ఇంటి మీద సాయంత్రం ఐదు గంటలకు దాడి జరిగితే.. ఆ దాడికి సంబంధించి పోలీసులు, తెలుగుదేశం పార్టీ వ్యక్తులు ఏ రకంగా కుట్రలు చేశారనే దానికి ఈ ఫొటోనే సాక్ష్యం (పోలీసులతో టీడీపీ నాయకులు మంతనాలు జరుపుతున్న ఫొటోను చూపారు). ఇదే సర్కిల్లో డీసీపీ రామకృష్ణ, ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్‌తో టీడీపీ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు దాడులకు సంబంధించి వ్యూహరచన చేశాడు. జోగి రమేష్‌ను హత్య చేసి, ఇంటి మీద దాడి చేసి వారి ఆస్తులను ధ్వంసం చేసే కుట్రలకు ఇక్కడే పోలీసులతో టీడీపీ నాయకుడు మంతనాలు జరిపాడని క్లియర్‌గా తెలిసిపోతోంది. హత్యా యత్నం ఎలా చేయాలి? ఆ దాడికి పోలీసులు ఎలా సహకరించాలో పథక రచన చేశారు. ఏకంగా పోలీసులే టీడీపీ నాయకులతో కలిసి మధ్యాహ్నం 2 గంటల సమయంలో మంతనాలు జరిపారు. ఆ తర్వాత టీడీపీ నాయకులు ఏకంగా పోలీసులనే వెంటబెట్టుకుని కలసికట్టుగా జోగి రమేష్ ఇంటిపై దాడికి దిగారు.ఈ పాపాలు ఎవరివి బాబూ?» నాలుగు నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేసి.. మళ్లీ అదే నెయ్యి ట్యాంకర్లు మరో పేరుతో వస్తే ఆమోదించింది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే కదా.» అవే ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ తయారీకి వాడారని స్వయంగా సీబీఐ చెప్పింది. » చంద్రబాబు ప్రభుత్వం తప్పులు, వాళ్లు చేసిన అన్యాయాన్ని చార్జ్‌షీట్‌లో సీబీఐ రాసింది » టీటీడీ ఈవోగా అనిల్ సింఘాల్‌ను తీసుకొచ్చింది ఎవరు? » ప్రక్షాళన కోసం తెచ్చామన్న శ్యామలరావును తప్పించింది ఎవరు?ఇవిగో పచ్చి నిజాలు... సాక్ష్యాలుటీడీపీ నాయకుడు ఫతావుల్లా ఏకంగా యాసిడ్ బాటిల్, పెట్రోల్ బాంబులతో దాడి చేశాడు. దాడికి ముందు వాటితో ఉన్న ఫొటోల్లో క్లియర్‌గా చూడవచ్చు. పోలీసుల సమక్షంలోనే జోగి ఇంటిపైకి పెట్రోల్ బాంబులు విసిరి నిప్పంటించాడు. ఫతావుల్లాతోపాటు ఆశా అనే టీడీపీ కార్యకర్త కూడా జోగి రమేష్ ఇంటి మీద పోలీసుల సమక్షంలోనే రాళ్ల దాడి చేసింది. ఆశా కుమార్తె పెళ్లికి చంద్రబాబు కూడా హాజరయ్యాడు. (చంద్రబాబు, లోకేశ్, హోంమంత్రితో వారు దిగిన ఫొటోలు, ఆశా కుమార్తె పెళ్లికి హాజరైన చంద్రబాబు ఫొటోలు చూపించారు. పోలీసులతోనే కలసి వచ్చి వారి సమక్షంలోనే టీడీపీ నాయకులు దాడికి దిగిన వీడియోలు కూడా చూపారు). టీడీపీ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు, డీసీపీ, సీఐ మంతనాలు జరుపుతున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసులతో కలిసి టీడీపీ శ్రేణులు వస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. (టీడీపీ నాయకుడు బాటిల్ ఎగరేస్తూ పోలీసులతో కలిసి జోగి రమేష్ ఇంటి వద్దకు వచ్చిన వీడియో క్లిప్పింగ్స్‌ను మీడియాకు చూపారు). మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా? లేక జంగిల్ రాజ్‌లో ఉన్నామో చెప్పేందుకు ఈ వీడియోలే సాక్ష్యం. కల్తీ లిక్కర్ కేసుకు సంబంధించి తంబళ్లపల్లె కోర్టుకు హాజరయ్యేందుకు జోగి రమేష్ వెళ్తుండగా ఇక్కడ ఇబ్రహీంపట్నంలోని తన ఇంటిపై దాడి జరిగినట్లు ఆయనకు సమాచారం వచ్చింది. ఈ విషయంపై విజయవాడ సీపీకి ఫిర్యాదు చేసేందుకు జోగి రమేష్ ఫోన్ చేసినా స్పందించలేదు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి సమయంలోనూ ఇలాగే జరిగింది. అన్ని ఆధారాలున్నాయ్.. ఎవరినీ వదిలిపెట్టం.. దాడులు, విధ్వంసాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఎన్హెచ్ఆర్సీ నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రతి గడప తొక్కుతాం. న్యాయ పోరాటం చేస్తాం. రాష్ట్రంలో సాగుతున్న జంగిల్‌రాజ్ పాలనను దేశానికి తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వానికి ఇప్పటికే రెండేళ్లు పూర్తయ్యాయి. ఇక మిగిలింది మూడేళ్లే. ఆ తరువాత వచ్చేది మా ప్రభుత్వమే. ఇవాళ మా పార్టీ నాయకుల ఇళ్లపై గూండాగిరీ చేసిన ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెడతాం. ప్రతి ఒక్కరికీ శిక్ష తప్పదు.బీసీలంటే చంద్రబాబుకు చులకన.. తంబళ్లపల్లిలో టీడీపీ తరఫున పోటీ చేసిన వ్యక్తి నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశాడు. కమీషన్ల పంపకాల్లో తేడా రావడంతో ఆ వ్యవహారం బయటపడింది. ఆ కేసులో జయచంద్రారెడ్డిని అరెస్టు చేయాల్సింది పోయి సంబంధం లేని జోగి రమేష్‌ను కేసులో చేర్చారు. చంద్రబాబు రాజ్యంలో జోగి రమేష్ లాంటి వ్యక్తి నకిలీ లిక్కర్ తయారు చేయగలడా? ఆ లిక్కర్‌ను బెల్ట్ షాపుల్లోకి సరఫరా చేయగలరా? జోగి రమేష్ పై చంద్రబాబు ప్రభుత్వం 12 కేసులు పెట్టింది. చేయని నేరానికి 83 రోజులు జైలులో పెట్టారు. ఆయన కుమారుడు రాజకీయంగా యాక్టివ్ అవుతున్నాడని చిన్న పిల్లాడిపై ఏడు కేసులు పెట్టారు. జోగి రమేష్ భార్యపై పోలీసులే దౌర్జన్యం చేసి తిరిగి ఆమెపైనే కేసులు పెట్టారు. బీసీలపై చంద్రబాబుకు ఉన్న చులకన భావానికి జోగి రమేష్‌పై నమోదైన కేసులే నిదర్శనం. -
ఏపీ హైకోర్టులో అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్లు
ఏపీ విజయవాడ: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. పట్టాభిపురం, నగరం పాలెం, మంగళగిరి, నల్లపాడు పోలీస్ స్టేషన్లలో తనపై అక్రమంగా కేసులు నమోదు చేశారని వాటిని క్వాష్ (కొట్టివేయాలని) చేయాలని కోరారు. ఇప్పటికే నల్లపాడు పీఎస్ కేసు క్వాష్ ఈ నెల 11కి వాయిదా పడింది. మంగళగిరిలో నమోదైన కేసులో 35 (3) BNSS ప్రొసీజర్ ఫాలో అవ్వాలని మంగళగిరి పోలీసులకు ఇవాళ ఏపీ హైకోర్టు ఆదేశాలు ఆదేశాలు జారీ చేసింది. అంబటిపై పిటి వారెంట్ కోసం మంగళగిరి కోర్టులో మంగళగిరి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మరో ఐదు కేసుల్లో క్వాష్ పిటిషన్లు వచ్చే సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
బాబూ.. లడ్డూపై ప్రశ్నిస్తే కోపమెందుకు?: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాపులంటే కక్ష అని ఘాటు విమర్శలు చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తుందని ఆరోపించారు. తిరుమలపై రాజకీయం చేస్తున్న చంద్రబాబు ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం కాపులను టార్గెట్ చేసింది. కాపులంటేనే చంద్రబాబు కక్ష సాధింపు. వంగవీటి రంగాను హత్య చేశారు. ముద్రగడను అనేక రకాలుగా వేధించారు. అంబటి మీద దాడి చేసి ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారు. ఎవరికి అన్యాయం జరిగినా వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. రేపు ఉదయం అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్నాం. దాడులు చేసిన వారిని వదిలేశారు. అంబటి రాంబాబుపై తప్పుడు కేసులు వ్యవహారంలో న్యాయ పరంగా పోరాటం చేస్తాము.మేము చేసేది సంఘీభావ యాత్ర మాత్రమే.. రాజకీయ యాత్ర కాదు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్ నివేదిక జంతు కొవ్వు కలవలేదని చెప్పిన తర్వాత కూడా మరొక కమిటీ ఎందుకు?. టీటీడీ లడ్డూలో జంతు కొవ్వు ఉందని చెప్పించడం కోసం చంద్రబాబు కమిటీ వేశారా?. వైఎస్సార్సీపీ మీద నెపం నెట్టడం కోసం మరొక కమిటీ వేస్తున్నారా. తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు లేదని వచ్చిన నివేదికపై మీడియా అడిగిన ప్రశ్నకు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తుంది. గతంలో తాను నాస్తికుడుని అని ప్రకటించుకున్న నాగేంద్రబాబు నేడు సనాతన ధర్మం కోసం ఎలా మాట్లాడుతున్నారు. నాగబాబు పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో ఉంది. కల్తీ లడ్డుపై పవన్ కళ్యాణ్ స్టాండ్ ఎప్పటికప్పుడు మారిపోతుంది’ అని ఎద్దేవా చేశారు.కరణం ధర్మ శ్రీ మాట్లాడుతూ..‘కాపులను కూటమి ప్రభుత్వం వేధిస్తుంది. తప్పుడు కేసులు పెడుతోంది. అంబటి రాంబాబు కుటుంబానికి కాపులు అందరూ అండగా ఉంటారు. రేపు అంబటి రాంబాబు కుటుంబాన్ని ఉమ్మడి విశాఖ జిల్లా కాపు నేతలు అందరూ పరామర్శిస్తారు. రాంబాబుపై అక్రమంగా అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టారు. అంబటిని చంపేందుకు టీడీపీ గుండాలు ప్రయత్నం చేశారు. కాపు అనే వారికి అన్యాయం జరిగితే వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు. -
అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ
సాక్షి,విజయవాడ: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అంబటి రాంబాబుపై కేసును క్వాష్ చేయాలని రిమాండ్ చట్ట విరుద్ధమని అంబటి న్యాయవాది కోర్టులో వాదించారు.పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదిపరి విచారణ ఈనెల 11కు వాయిదా వేసింది. అంబటి రాంబాబు అరెస్టుఅంతకుముందు అంబటి రాంబాబును పోలీసులు గుంటూరులోని తన నివాసం వద్ద అరెస్టు చేశారు. గత శనివారం రాత్రి గం. 10.30 ప్రాంతంలో అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు. ఆయనను నల్లపాడు పీఎస్‌కు తరలించారు. అంబటి రాంబాబు కేసును సమోటోగా తీసుకొని బీఎన్ఎస్ 126(2),132, 196(1), 352, 351(2),292 రెడ్‌విత్ 3(5),-BNS సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హైకోర్టులోఅంబటి సతీమణి హౌస్ మోషన్ పిటిషన్ అరెస్టుపై అంబటి సతీమణి విజయలక్ష్మి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనతోపాటు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్భందించారని ఆమె అందులో పేర్కొన్నారు. తనకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని, శాంతి భద్రతల సమస్య ఉందని పిటిషన్లో వివరించారు. తనకు 24 గంటలు భద్రత కల్పించాలని, అందుకు అనుగుణంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని విజయలక్ష్మి కోరిన విషయం తెలిసిందే. -
అంబటి చాలా వీక్ గా ఉన్నారు.. చెప్పుకోలేనంత బాధ అనుభవిస్తున్నారు
-
మీకు రోజులు దగ్గరపడ్డాయి.. అంబటి రాంబాబు చిన్న కూతురు మాస్ వార్నింగ్
-
టీడీపీది రాక్షసానందం.. జగనన్న మాకు ధైర్యం చెప్పారు
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతల దాడిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చిన్న కుమార్తె శ్రీజ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి వీడియో విడుదల చేసిన శ్రీజ.. జగనన్న తమ ఇంటికి వచ్చి అండగా నిలిచారని.. మా తల్లి, అక్కలతో మాట్లాడి ధైర్యం నింపారన్నారు. ‘‘టీడీపీ వాళ్లు మా ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. కానీ నిన్న వేలమంది అభిమానంతో మా ఇంటికి వచ్చారు. మా నాన్న చెప్పినట్టే మాకు అండగా వెంకటేశ్వరస్వామి ఉన్నారు’’ అని శ్రీజ పేర్కొన్నారు.‘‘దేవుడి అండ ఉన్నంతవరకు మాపై వేసే ప్రతీ రాయి పువ్వుగా మారుతుంది. ఆయనే మాకు ఓ రక్షణ కవచంలా ఉంటారు. మా ఇంటిపై అత్యంత దారుణంగా అటాక్ చేశారు. 9 గంటల పాటు తండోపతండాలుగా జనం దాడి చేశారు. ఉదయం గుడికి వెళ్లిన నాన్నపై టీడీపీ వాళ్లు దాడి చేశారు. కర్రలతో వచ్చి అంబటి రాంబాబుపై దాడి చేశారు. టీడీపీ మహిళలు బూతులతో ఆయనను తిట్టారు. ఆ సమయంలోనే మా నాన్న అలా మాట్లాడారు. దానికి ఆయన రియలైజ్ అయ్యి ఆ మాట అనకూడదన్నారు. లీగల్‌గా ఎదుర్కొంటానని కూడా చెప్పారు..కానీ మా ఇంట్లో ఆడవాళ్లని దారుణంగా తిడుతూ అటాక్ చేశారు. కాపు కులంకి బూతులు జోడించి తిట్టారు. ఒక డాక్టర్ అయిన కేంద్రమంత్రి దీనిని నడిపించడం దారుణం. ఆయన మేథస్సు ఆయన్ని సరైన మార్గంలో పెట్టలేదా అని అనిపిస్తోంది. అంబటి రాంబాబుని నాలుగు గోడల మధ్య భౌతికంగా వేధించడం దారుణం. ఆయనను వేధించి రాక్షసానందం పొందారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అని తెలుసుకొవాలి. దాడి చేసిన దానికంటే.. నాలుగు రెట్ల జనం అభిమానంతో వచ్చారు’’ అని శ్రీజ చెప్పారు. -
చంద్రబాబుకు ఆ మాత్రం తెలియదా?
మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కిందని ఓ సామెత. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి కూడా ఇలాగే ఉంది. ఏడాదిన్నర కాలంగా రాష్ట్రంలో టీడీసీ ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ, అరెస్టులు చేస్తూ... భౌతిక దాడులకు దిగుతూ రెడ్‌బుక్ అరాచకం సృష్టిస్తున్న పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు... వీటన్నింటికీ కారణం వైసీపీనేనని, వారి ట్రాప్‌లో పడవద్దని కేడర్‌కు చెబుతున్నారట. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని టెలికాన్ఫరెన్స్‌లో ఆయనగారు వక్కాణించిన మాటలను కొన్ని విశేషణాలు చేర్చి యథాతథంగా ప్రచురించుకుని తరించింది ఎల్లో మీడియా! ప్రజలు మాత్రం ఇదేం చోద్యమన్నట్టు నోళ్లెళ్లబెడుతున్నారు. అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడినే ఉదాహరణగా తీసుకుందాం. పక్కా రౌడీలు మాత్రమే అలాంటి విధ్వంసం సృష్టించగలరు. లకారాలతో ఈ దాష్టీకంలో పాల్గొన్న టీడీపీ మహిళ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆమె భర్త రామచంద్రరావులు మాత్రం ఇప్పటివరకూ అరెస్ట్ కూడా కాలేదు. తెలుగుదేశం కార్యకర్తలు తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నియమించిన సిట్ క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత కూడా రాష్ట్రమంతటా అనుచితమైన ఫ్లెక్సీలు కట్టడంతోనే ఈ సమస్యంతా మొదలైంది. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని సిట్ స్పష్టం చేయడంతో చంద్రబాబు బృందం,ఎల్లో మీడియా ఈనాడు, ఆంద్రజ్యోతుల సాయంతో ఈ ఫ్లెక్సీల డ్రామాకు తెరలేపారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారంటూ మాజీ సీఎం జగన్, టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలపై నెపం నెట్టేస్తూ తప్పుడు ఆరోపణలతో కట్టిన ఈ ఫ్లెక్సీలను పోలీసులు సకాలంలో తీసివేసి ఉంటే పరిస్థితి చేయిజారేదీ కాదు. పోలీసుల వైఫల్యాన్ని ప్రశ్నించి.. ఆ ఫ్లెక్సీలను తామే తొలగిస్తామనడం అంబటి పాపమైంది. ఫ్లెక్సీ కట్టిన రోడ్డు ద్వారా గుడికి వెళ్లి వస్తూంటే... టీడీపీ కార్యకర్తలో లేక వారు తెచ్చుకున్న కిరాయి మూకో కర్రలతో అంబటి కారుపై దాడి చేశారు. కర్రలు, రాడ్లతో వీరు దాడులు చేస్తూంటే.. పోలీసులు వారికి రక్షణగా ఉండటం రాష్ట్రంలో శాంతి భద్రతల దుస్థితికి అద్దం పడుతుంది. ఇది హింస అన్న విషయం చంద్రబాబుకు తెలియదా!. అంతేకాదు. గ్రంధాలయ సంస్థ ఛైర్ పర్సన్ అయిన టీడీపీ మహిళా నేత అకారణంగా అంబటిని బండబూతులు తిట్టడం ఏ రకమైన సభ్యతో వారికే తెలియాలి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు ఇలాంటి చౌకబారు రాజకీయాలను ఖండించాల్సింది పోయి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం ఆయన నిస్సహయత అనుకోవాలి. ఇంత జరిగిన తరువాత కదా అంబటి కూడా ఆవేశానికిలోనై ప్రతి దూషణకు దిగింది. అయితే ఆ వెంటనే ఆయన తన తప్పు తెలుసుకుని అలా మాట్లాడకుండా ఉండాల్సిందని వివరణ ఇచ్చారు. అంతేకాకుండా... తాను ‘ఆ’ మాటలు అన్నది చంద్రబాబును ఉద్దేశించి కాదని కూడా స్పష్టం చేశారు. తనను అదే మాటలతో తిట్టిన వారినే తాను దూషించానని చెప్పారు. అయినప్పటికీ టీడీపీ వారు వైసీపీ కార్యాలయం, అంబటి ఇంటిపై దాడులకు తెగబడ్డారు. విధ్వంసం సృష్టించారు. ఇళ్లపై దాడులు చేసి కార్లు, ఫర్నీచర్ పగులగొట్టిన టీడీపీ వాళ్లు అమాయకులు, శాంతికాముకులని చెప్పడం చంద్రబాబు మాటల్లోని ఉద్దేశమా? అంబటిపై జరిగింది హత్యా యత్నం! ఇరవై నాలుగు గంటల్లో సినిమా చూపిస్తామని స్వయంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్న కొన్ని గంటలకే అంబటి ఇంటిపై దాడి జరిగిన విషయం చంద్రబాబుకు తెలియదా? పైగా దీనికి నేతృత్వం వహించింది స్వయానా టీడీపీ మహిళా ఎమ్మెల్యే, ఆమె భర్త. సిగ్గుచేటు. అంబటి దొరికి ఉంటే.. చంపేసేవారమని టీడీపీ వారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటే ఎవరు ఎవరి ట్రాప్లోపడ్డట్టు? బాధితులు ఎవరు?.. అంబటి భార్య, కుమార్తెలు ఇంటిలో ఉంటే మహిళా ఎమ్మెల్యే ఆద్వర్యంలో దాడి చేస్తారా? వారిని భయభ్రాంతులను చేస్తారా? వారు లోపల బిక్కుబిక్కుమంటూ గడిపిన క్షణాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఊహించుకోవచ్చు. స్ల్రీల పట్ల కూడా కనికరం లేకుండా చంద్రబాబు మాట్లాడడమా! దానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంత పాడడమా! ఎంత అన్యాయం. రెచ్చగొట్టేది, హింసకు తెగబడేది, బూతులు తిట్టేది, విధ్వంసం చేసేది టీడీపీ వారే. ఆఖరికి విధ్వంసకారులకు పోలీసులు తోడుగా నిలబడటం, రక్షించాలని వేడుకున్నా ఓ పోలీసు ఉన్నతాధికారి పట్టించుకోకపోవడం రాష్ట్రంలో వ్యవస్థల పతనానికి దర్పణంగా నిలిచింది. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి ఏజెంట్లుగా మారి, చివరికి బాధితుడైన రాంబాబును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపడం ఎంత దారుణం? ఇలాంటి ఘటనలే కదా దేశవ్యాప్తంగా రాష్ట్రం పరువును పలుచన చేస్తున్నది? జాతీయ మానవ హక్కుల సంఘం స్వయంగా ఈ ఘటనపై స్పందించిందంటేనే పరిస్థితి తీవ్రత ఏమిటన్నది స్పష్టమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం గత టర్మ్‌లోనూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని పోలీసులతో ఎలా వేధించిందీ, ఆయన కుటుంబ మహిళలను ఎంత దారుణంగా దూషించిందీ కంటతడి పెట్టుకుని ముద్రగడే ఆవేదనతో చెప్పుకోవల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఇంకో కాపు నాయకుడు అంబటి రాంబాబు కుటుంబంపై టీడీపీ గూండాలు దాడి చేయడం సహజంగానే ఆ సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. అంబటి కుమార్తె మౌనిక ఒక ప్రశ్న వేశారు. తన తండ్రి ఆ క్షణంలో ఆవేశానికిలోనై ఒక మాట అన్నా... వెంటనే సారీ చెప్పారని, చంద్రబాబు గతంలో వైసీపీ నేత జగన్‌ను ఉద్దేశించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. టీడీపీ గూండాలు ఒక కాపు మహిళపై దాడికి తెగబడితే కనీసం ప్రశ్నించలేవా? అని జనసేనాధిపతి పవన్ కళ్యాణ్‌ను నిలదీశారు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పుకోవాలి. టీడీపీ సోషల్ మీడియా వారు తన కుటుంబాన్ని దూషిస్తూ పెట్టిన పోస్టులపై కేసులు నమోదు చేసేందుకు అంబటి సాక్షాత్తూ హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇక మరో మాజీమంత్రి జోగి రమేష్ మంత్రి లోకేశ్‌ను రాజకీయంగా విమర్శిస్తే ఆయన ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరి నిప్పు పెట్టారు. ఇలా దాడి చేసినవారి వెంట పోలీసులు ఉన్నా కనీసం ఆపే యత్నం చేయలేదు. మొక్కుబడిగా కేసులు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారా? చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు మాజీమంత్రి పరిటాల రవి హత్యకు గురైనప్పుడు టీడీపీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మరీ బస్సులు దగ్దం చేయించారన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో బంద్‌లలో హింస ఎలా చేయాలో చంద్రబాబు చెప్పేవారని తెలిపిన విషయాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి హింసలకు టీడీపీ తెగబడుతోందంటే అధికార అహంకారంతో కాక మరేమిటి? చంద్రబాబు, లోకేశ్‌ల ప్రోద్బలం కాదని ఎవరైనా అనుకుంటారా? ఇలా ఈ రెండేళ్లలో కనీసం ఇరవై మంది వైసీపీ నేతలపై దాడులు జరిగాయి. కార్యకర్తలపై ఎన్ని దాడులు చేసింది లెక్క చెప్పలేం. తిరిగి వీరిపైనే కేసులు పెట్టే ధోరణి ఇప్పడే చూస్తున్నాం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ... చంద్రబాబు సర్కారు అరాచక పాలనపై నిప్పులు చెరిగిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి...
-
బాబు జంగిల్ రాజ్ – భయానక పాలనతో 'ప్రజాస్వామ్యం ఖూనీ'!
కచ్చితంగా ప్రతిఘటన.. ఇలాంటివి మళ్లీ జరిగితే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు. దానికి కచ్చితంగా ప్రతిఘటన ఉంటుంది. అవసరమైతే రాష్ట్రవ్యాప్త బంద్‌కి కూడా పిలుపునిస్తాం. ఇప్పటికైనా ఆపకపోతే అడుగులు ఇంకా వేగంగా పడతాయి. ఇష్యూస్ పెద్దవి అవుతాయని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నా. ఈ ఘటనలపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తున్నాం. సుప్రీంకోర్టు తలుపులు కూడా తడతాం. అన్నిరకాల పోరాటాలు చేస్తాం.– వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితనకు కావాల్సిన వారిని నియమించుకుని..చంద్రబాబు తనకు కావాల్సిన కొంతమందిని మాత్రమే సీఐలు, ఎస్సైలు, డీఎస్పీలు, డీఐజీలుగా నియమించుకున్నారు. ఎస్పీలు గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారు. బిహార్‌లో ఏం జరుగుతోందో తెలియదు కానీ రాష్ట్రంలో వీరందరితో చంద్రబాబు జంగిల్ రాజ్ పాలన సాగిస్తున్నారు. దాదాపు 200 మంది సీఐలు, ఎస్సైలు, డీఎస్పీలను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. అలా రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన సాగుతోంది.అలా అనుకుంటే బాబు మూర్ఖుడే!వైఎస్సార్ సీపీపై ఈ రకంగా దాడులు చేస్తే కార్యకర్తలు భయపడతారని చంద్రబాబు అనుకుంటే ఆయన కన్నా మూర్ఖుడు ఇంకొకరు లేనట్టే. బంతిని ఎంత బలంగా నేలకేసి కొడితే అంతకన్నా నాలుగింతలు బలంగా పైకి లేస్తుందన్నట్లుగా.. మా కార్యకర్తలు చంద్రబాబు ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి వేస్తారు.- మీడియాతో వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు జంగిల్ రాజ్‌ను నడుపుతూ ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న చంద్రబాబు ఆరోపణల్లో నిజం లేదని దేశంలోనే ప్రఖ్యాత ల్యాబ్‌లు ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ నిర్థారిస్తూ రిపోర్టులు ఇచ్చినా.. అదే విషయాన్ని సీబీఐ తన చార్జిషీట్లో పొందుపరిచినా.. పాపభీతి లేకుండా, తప్పు ఒప్పుకోకుండా చంద్రబాబు ఎదురు దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. చేసిన తప్పులకు లెంపలు వేసుకోవాల్సింది పోయి దీనిపై ప్రశ్నిస్తుంటే భౌతిక దాడులు, విధ్వంసం, అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరులో టీడీపీ గూండాల చేతిలో ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిని, కార్యాలయాన్ని బుధవారం వైఎస్ జగన్ పరిశీలించారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అనంతరం వైఎస్ జగన్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..గుంటూరులోని చుట్టుగుంట సెంటర్లో మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలుకుతున్న అశేష జనసందోహంలో ఓ భాగం అబద్ధాలతో ఫ్లెక్సీలు..తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్‌లు, సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తమ తప్పులకు లెంపలు వేసుకుని శ్రీవేంకటేశ్వరస్వామివారిని, ప్రజలను క్షమాపణ కోరాల్సిందిపోయి.. అంతా కూడబలుక్కుని మళ్లీ అవే అబద్ధాలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. తప్పుడు సమాచారాలతో, కులమతాలను రెచ్చగొట్టే విధంగా, అబద్ధాలతో ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఇదే చంద్రబాబు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరుతో ఎన్నికలప్పుడు బాండ్లు ఇచ్చి అబద్ధాలతో మోసగించారని మేం కూడా ఫ్లెక్సీలు పెడితే ఒప్పుకుంటారా? ఇది హత్యాయత్నం కాదా..? కుట్రలో భాగం కాదా?ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే సాయంత్రం 5 గంటల నుంచి అర్థరాత్రి వరకు జరిగాయి. పోలీసుల సమక్షంలోనే ఐదు కార్లు ధ్వంసం చేశారు. ఇల్లు, ఆఫీసు మొత్తం తగలబెట్టారు. ఇంట్లో అద్దాలు, సామగ్రిని, ఆఫీసులో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఇంట్లో మహిళలు ఉన్నారని కూడా చూడకుండా లోపలికి వచ్చి ధ్వంసం చేశారు. ఇది హత్యాయత్నం కాదా..? పోలీసులు దగ్గరుండి మరీ ఈ కుట్రలో భాగం కాలేదా? పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ఈ మాదిరిగా జరిగేదా? ఇక్కడి నుంచి డీజీపీ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు కూతవేటు దూరంలోనే ఉన్నాయి. ఎంత మంది డీఎస్పీలు, సీఐలు లేరు..? మంగళగిరిలో పోలీసు బెటాలియన్ కూడా ఉంది. కనీసం ఫోన్ చేస్తే కూడా పోలీసులు స్పందించలేదు. మా పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ తదితరులు ఇంటెలిజెన్స్ డీజీ, ఎస్పీ, ఐజీ, ఇతర అధికారులు, చీఫ్ సెక్రటరీ ఆఫీసులకు ఫోన్లు చేస్తే స్పందించలేదు. మరి ఇది కుట్రలో భాగంగా కాదా? సాయంత్రం ఐదు గంటల నుంచి ఒంటి గంట దాకా విధ్వంసం చేశారు. ఇది ధర్మమేనా? న్యాయమేనా? ఇంతటితో ఆగకుండా ఆ రాత్రి రాంబాబు అన్నను అరెస్టు చేశారు. చంద్రబాబును తిట్టాడని కేసు పెట్టి అరెస్టు చేశారు. చంద్రబాబుని తిట్టినందుకు రాంబాబును అరెస్టు చేసినప్పుడు.. మరి రాంబాబు ఇంటికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నించి, ఐదు కార్లను ధ్వంసం చేసి, అద్దాలన్నీ పగలగొట్టి, ఆఫీసుకు నిప్పంటించడం అంతా ఎమ్మెల్యే, ఆమె భర్త సమక్షంలో జరిగితే వారివీుద ఏం యాక్షన్ తీసుకున్నారు? సింపుల్‌గా స్టేషన్ బెయిలిచ్చి పంపేశారు. అంబటి మీడియా సమక్షంలో వివరణ ఇచ్చారు. జరిగిన దానికి క్షమాపణ కూడా కోరారు. అయినా ఆయన ఇంటిపై దాడి చేశారు. అసలు మీరు మనుషులేనా? ఇది జంగిల్‌రాజ్ కాదా? రాంబాబును అక్రమంగా అరెస్టు చేయడమే కాదు.. అర్థరాత్రి దాటిన తరువాత ఆయన్ను నల్లపాడు స్టేషన్లో ముగ్గురు సీఐలు దారుణంగా హింసించి వేధించారు. ఓ మాజీ మంత్రి పట్ల ఆ విధంగా వ్యవహరించడం, టార్చర్ చేయడం ఏం న్యాయం? మరి ఇది జంగిల్‌రాజ్ కాకపోతే మరేమిటి? మాజీ మంత్రి అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్... విలువలున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులో అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా నల్లపాడు సీఐ వంశీ, పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు ఆయన్ను తీవ్రంగా దూషించి కొట్టారు. ఇదంతా చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అని అనుమానం కలుగుతోంది. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు...!మరుసటి రోజు జోగి రమేష్ ఇంటిపై దాడి! అక్కడా మళ్లీ పోలీసుల సమక్షంలోనే. అక్కడ ఏకంగా పెట్రోల్ బాంబులు. బాటిళ్లలో పెట్రోల్ పోసి వాటిని ఇంట్లోకి విసిరారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఐదు గంటల వరకు విధ్వసం సృష్టించారు. దాదాపు 300–400 మంది పోగయ్యారు. వారంతా అక్కడికి వచ్చేటప్పుడు పోలీసులు అక్కడే ఉన్నారు. పోలీసుల సమక్షంలో అదంతా జరుగుతున్నా చూస్తుండిపోయారు. పోలీసుల సమక్షంలోనే జోగి రమేష్ ఇంటికి నిప్పంటించారు.పోలీసుల సమక్షంలోనే..అంతకు ముందు రోజు విడదల రజిని గుడిలో పూజ చేసుకుని వస్తుంటే ఆమెను అడ్డగించి తిట్టారు. దుర్భాషలాడుతూ పోలీసుల సమక్షంలోనే ఆమెపై దాడికి యత్నించారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే.. తిరిగి ఆమె మీదే కేసు పెట్టారు. అది కూడా ఏమని? ఆమె గుడికి వెళ్లి వారందరిపై అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారని! మాట్లాడటానికి హద్దూ పొద్దూ ఉండాలి! ఇది జంగిల్ రాజ్ కాదా? బొల్లా బ్రహ్మనాయుడు అన్న చేసిన పాపం ఏమిటి..? చంద్రబాబు, ఆయన కుమారుడు, పవన్ కళ్యాణ్‌కు జ్ఞానోదయం కలగాలని కోరుతూ పూజ చేయటానికి ఆయన గుడికి బయలుదేరారు. దారిలో ఆయన మీద అటాక్ చేశారు. అది కూడా పోలీసుల సమక్షంలోనే జరిగింది. కాకాణి గోవర్ధన్‌రెడ్డి విషయంలో కూడా ఇదే జరిగింది. అసలు తప్పు చేసింది బాబేఅసలు తప్పు చేసింది చంద్రబాబు. తప్పుడు ఆరోపణలు చేసిందీ చంద్రబాబే. అవి తప్పుడు ఆరోపణలనీ దేవుడు మొట్టికాయలు వేసినా.. ఏకంగా సీబీఐ చార్జిషీట్‌లోనే చెప్పినా.. కేంద్ర ప్రభుత్వ ల్యాబ్‌లు నెయ్యిపై క్లీన్ చిట్ ఇస్తే... దేవుడు, ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిపోయి చంద్రబాబు చేస్తున్నదేమిటి? ప్రతి విషయంలోనూ దుర్మార్గమైన రాజకీయాలే! సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అని ఎన్నికలప్పుడు మాట ఇచ్చారు. ఇంటింటికీ బాండ్లు ఇచ్చి పథకాల ద్వారా ఆ ఇంటికి ఎంతెంత వస్తుందో చెబుతూ సంతకాలతో సహా హామీ ఇచ్చారు. మీ ఇంట్లో నిరుద్యోగులు ఉన్నారా? ఇదిగో మీకు రూ.36 వేలు. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? ఇదిగో మీకు రూ.15 వేలు. మీ ఇంట్లో రైతులు ఉన్నారా? ఇదిగో మీకు రూ.26 వేలు. మీ ఇంట్లో చిన్నమ్మలు, పెద్దమ్మలు 55 ఏళ్ల వయసులో ఉన్నారా? వాళ్లకు రూ.48 వేలు అంటూ ప్రజలను మోసం చేశారు. సూపర్ సిక్స్, సెవెన్ అమలు చేశామంటూ సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారు. చంద్రబాబు చేస్తున్నది తప్పని, మోసమని ఎవరైనా ప్రశ్నిస్తే.. కేసులు పెట్టి జైలుకు పంపుతున్నాడు. చివరకు పిల్లలని కూడా చూడకుండా సోషల్ మీడియా యాక్టివిస్టులపై గంజాయి కేసులు పెట్టి జైలుకు పంపి వారి కెరీర్ నాశనం చేస్తున్నాడు.బాబు చెప్పేవన్నీ అబద్ధాలే.. చేసేవన్నీ మోసాలే!చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే.. చేసేవన్నీ మోసాలే! టీడీపీ సైన్యానికి లాటరీలో ప్రైవేటు మద్యం షాపులన్నీ కట్టబెడతాడు. ఏకంగా ఎమ్మెల్యేలు దగ్గరుండి ప్రతి గ్రామంలో ఆక్షన్ పాడుతూ బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. లిక్కర్ షాపుల పక్కనే ఇల్లీగల్ పర్మిట్ రూములు నడుపుతూ పెగ్గులతో అమ్ముతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. అవి పక్కదోవలో చంద్రబాబుకింత... ఎమ్మెల్యేల కింత... వారి మాఫియా సైన్యానికింత.. అని లూటీ పద్ధతిలో పంచుకుంటున్నారు. ప్రతి గ్రామంలో ఒకటి, రెండు కాదు. పది వరకు బెల్టు షాపులున్నాయి. లిక్కర్ ఎమ్మార్పీ కన్నా ఎక్కువకు అమ్ముతున్నారు. అది సరిపోదన్నట్లు ఏకంగా ప్రతి ఐదు బాటిళ్లకు ఒకటి నకిలీ. వీళ్లే కుటీర పరిశ్రమను పెట్టి చీప్ లిక్కర్ తయారు చేసి అమ్ముతున్నారు. ఆ కల్తీ లిక్కర్ తాగి ఇంజనీరింగ్ విద్యార్థులు నలుగురు చనిపోయారు. నకిలీ లిక్కర్‌ను టీడీపీ నాయకులే తయారు చేస్తూ సాక్ష్యాధారాలతో దొరికిపోయారు. తంబళ్లపల్లెలో టీడీపీ తరఫున పోటీచేసిన జయచంద్రారెడ్డి కల్తీ లిక్కర్ తయారు చేస్తూ ఎక్సైజ్ పోలీసులకు దొరికాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక 20 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్నదంతా ఇదే. ఎక్సైజ్ అధికారులకు, జయచంద్రారెడ్డికి వాటాలు పంచుకోవడంలో తేడాలొచ్చి దొరికిపోతే మా నాయకుడు జోగి రమేష్‌ను ఈ కేసులో అక్రమంగా ఇరికించారు. ఒకపక్క రాక్షస పాలన సాగిస్తున్న టీడీపీ నాయకులతో కలిసి మా పార్టీకి చెందిన జోగి రమేష్ కల్తీ లిక్కర్ తయారు చేయడం సాధ్యమేనా? వీళ్లు నకిలీ లిక్కర్ తయారు చేసి చంద్రబాబు తీసుకొచ్చిన బెల్ట్ షాపుల్లో జోగి రమేష్ అమ్ముతున్నాడని అక్రమ కేసు పెట్టారు. నకిలీ, కల్తీ లిక్కర్ తయారు చేసేది వారే! బెల్ట్ షాపులు తీసుకొచ్చిందీ వారే! వాటిలో కల్తీ లిక్కర్ అమ్మకాలు చేసేదీ వారి మనుషులే! కానీ కేసు మాత్రం జోగి రమేష్ మీద పెట్టి జైలుకు పంపారు. విచారణ చేయిస్తాం... వడ్డీతో చెల్లిస్తాంఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి. కళ్లు మూసి తెరిచేలోపు మరో మూడేళ్లు గడిచిపోతాయి. అప్పుడు వచ్చేది మా ప్రభుత్వమేనని ఖచ్చితంగా చెబుతున్నా. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, ఆయనకు కొమ్ము కాస్తున్న ఇతర పార్టీ నాయకులకు, కొంతమంది పోలీసు అధికారులకు కూడా చెబుతున్నా.. ఎల్లకాలం ఇలాగే అన్యాయం చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఖచ్చితంగా వీరికి మొట్టికాయలు పడతాయి. రేపు మా ప్రభుత్వం వచ్చాక ఈ అరాచకాల్నంటి మీదా విచారణలు చేయిస్తాం. వడ్డీతో సహా చెల్లిస్తాం. అందర్నీ బోన్లలో నిలబెట్టి సాక్ష్యాధారాలతో వారి యూనిఫాంలు విప్పిస్తాం. ఈ దారుణాల్లో భాగస్వాములైన కూటమి నాయకులు ఎవరున్నా వారిని జైలుకు పంపించి బాధితులకు న్యాయం చేసి తీరుతామని ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తున్నా.మా కార్యకర్తలూ ఇలాగే స్పందిస్తే..రాష్ట్రంలో విషపు విత్తనాలు నాటుతున్నారు. ఈ సంస్కృతిని ఇప్పటికైనా ఆపండి. ఈ విషపు విత్తనాలు, కూటమి నాయకులు చేస్తున్న అన్యాయాల కారణంగా గ్రామ స్థాయి నుంచి ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్త, నాయకుడు దెబ్బతిని ఉన్నారు. ఈ విషపు విత్తనాలు పెరిగి పెద్దవై చెట్టుగా మారినప్పుడు, రేప్పొద్దున్న మా ప్రభుత్వం వచ్చినప్పుడు మా నాయకులు, కార్యకర్తలు ఇలాగే స్పందిస్తే మీకు ఏం జరుగుతుందో ఆలోచన చేసుకోవాలని చంద్రబాబుని గట్టిగా హెచ్చరిస్తున్నా.అంబటి నివాసంలో టీడీపీ మూకల దాడిలో ధ్వంసమైన కారును పరిశీలిస్తున్న వైఎస్ జగన్ చేతనైతే ఇవన్నీ చెయ్ బాబూ..!ఇప్పటికైనా దేవుడంటే భయం, భక్తితో వ్యవహరించి బుద్ధి జ్ఞానం తెచ్చుకుని మంచి పరిపాలనతో ప్రజలకు మేలు చేసి వారి వద్ద మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చంద్రబాబు చేయాలి. చేతనైతే సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ విషయంలో అబద్ధాలు చెప్పకుండా, మోసాలు చేయకుండా నెరవేర్చే కార్యక్రమం చేయాలి. కూటమి వచ్చాక నిర్వీర్యం అయిన స్కూళ్లను బాగుచేయాలి. 8 క్వార్టర్లకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలి. పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే ఆలోచన చేయాలి. చేతనైతే ఆపేసిన మెడికల్ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేసి పేద, మధ్యతరగతి వారికి నాణ్యమైన వైద్యం అందించే కార్యక్రమం చేసి చూపించాలి. చేతనైతే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. అన్నదాత సుఖీభవ కింద రూ.10 వేలిచ్చి వదిలేశారు. బకాయి పడ్డ రూ.30 వేలు కూడా తక్షణం చెల్లించాలి. వ్యవసాయాన్ని చక్కబెట్టే కార్యక్రమం చేయాలి. కానీ మీకు వీటన్నింటి మీద ధ్యాస లేదు. అన్నీ అబద్ధాలు, మోసాలు, ప్రశ్నించే గొంతులు నొక్కడమే. తనకు అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకే కమిషన్!చంద్రబాబు ఎంత దుర్మార్గుడు, రాక్షసుడో ప్రజలకు ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె కలిసిందని తాను చేసిన ఆరోపణలు పూర్తిగా తప్పు అని స్పష్టంగా తేలడం, ఆధారాలతో సహా రుజువు కావడంతో ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి గోబెల్స్ ప్రచారానికి తెర తీశారు. ఈ అంశంలో తానే ఓ కమిషన్ వేస్తామని చెబుతున్నారు. సీబీఐ చెప్పింది తప్పు..! ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్టులు తప్పు అని చెప్పిస్తూ, తనకు అనుకూలంగా నివేదిక ఇవ్వడానికి మరో కమిషన్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. తాను చెప్పినట్టే నివేదిక రావాలని ఒత్తిడి చేసి, దానిని రాష్ట్ర ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత దిగజారిపోయిన రాజకీయ నాయకుడు ప్రపంచ చరిత్రలో ఉండరు.వైఎస్సార్సీపీ నేతలు పేర్ని నాని, విడదల రజిని, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, నంబూరు శంకరరావు, అన్నాబత్తుని శివకుమార్, కోన రఘుపతి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దేవినేని అవినాష్, వనమా బాలవజ్రబాబు, అంబటి మురళీకృష్ణ, షేక్ నూరీ ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి, దేవభక్తుని చక్రవర్తి, తన్నీరు నాగేశ్వరరావు, పోతిన మహేష్, మోదుగుల వేణుగోపాలరెడ్డి, పలువురు రాష్ట్ర కార్యదర్శులు, అధికార ప్రతినిధులు జగన్ పర్యటనలో పాల్గొన్నారు.దేవుడంటే కనీసం భయం, భక్తి లేకుండా..రాష్ట్రంలో ఈరోజు జంగిల్ రాజ్ ఏ స్థాయిలో ఉందంటే.. ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది. ఒక భయానక వాతావరణంతో రాష్ట్రాన్ని పరిపాలించే కార్యక్రమం జరుగుతోంది. అంబటి రాంబాబు ఇంటిపైన దాడి.. జోగి రమేష్ ఇంటి మీద దాడి.. విడదల రజినిపై అటాక్.. బొల్లా బ్రహ్మనాయుడు మీద అటాక్.. ఇవన్నీ జంగిల్ రాజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు కొన్ని ఉదంతాలు. అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజినమ్మ, బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకర్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్ అన్న చేసిన తప్పేమిటి? చంద్రబాబు దాదాపు ఏడాదిన్నరగా ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ వచ్చారు. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు, పంది కొవ్వు ఉందని, చేప నూనె కలిసిందంటూ రకరకాలుగా చంద్రబాబు, ఆయన కుమారుడు, పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేశారు. దేవుడంటే కనీసం భయం, భక్తి లేకుండా స్వార్థ రాజకీయాల కోసం వాడుకున్నారు.ఆ ఆరోపణలన్నీ అవాస్తవమని తేల్చిన ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీనెయ్యిపై చంద్రబాబు ఆరోపణలన్నీ అవాస్తవం అని ఎన్డీఆర్ఐ (నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్), ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు) రిపోర్టు ఇచ్చాయి. ఈ రెండూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ల్యాబ్‌లు. వీళ్ల హయాంలో.. వీళ్లే ఇచ్చిన టెస్ట్ శాంపిళ్లు అవి. వాటిని విశ్లేషించి ఆ నెయ్యిలో జంతువుల కొవ్వుగానీ, గొడ్డు మాంసం కొవ్వులు గానీ, పందికొవ్వు గానీ, చేప నూనెగానీ.. ఇటువంటివి ఇంకొకటిగానీ ఇంకొకటి గానీ లేవని నిర్ధారణ చేసి సర్టిఫికెట్లు ఇచ్చాయి. అదే విషయాన్ని సీబీఐ తన చార్జిషీట్లో పొందుపరిచి ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ సర్టిఫికెట్లను జత చేసి క్లోజర్ కూడా ఇచ్చింది. సీబీఐ క్లీన్చిట్ ఇస్తోంది. ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్‌లు కూడా క్లీన్ చిట్లు ఇస్తున్నాయి.ఏ తప్పూ చేయలేదు కాబట్టే సీబీఐ క్లీన్చిట్..ఒకవేళ వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి తప్పు చేసి ఉంటే వారి పేర్లు ఎందుకు చేర్చలేదు? వారు ఒకవేళ తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే, తప్పు నిజమే అయితే ఎందుకు అరెస్టు చేయలేదు? వారు ఏ తప్పూ చేయలేదు కాబట్టే సీబీఐ క్లీన్చిట్ ఇచ్చింది. ఎటువంటి తప్పూ జరగలేదు కాబట్టే వారి పేర్లు చార్జిషీట్లో పెట్టలేదు. తప్పు చేయలేదు కాబట్టే అరెస్టు చేయలేదు. అసలు ఈ వ్యవహారంలోకి సీబీఐ ఎలా వచ్చిందో తెలుసా..?రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని, దీనిపై విచారణకు ఆదేశించాలని వైవీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లి పిటిషన్ వేశారు కాబట్టే దీనిపై స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించింది.ప్రశ్నిస్తుంటే దాడులు...దుర్బుద్ధితో ఫ్లెక్సీలు పెట్టి భావోద్వేగాలను రెచ్చగొడుతున్న చంద్రబాబును.. ఎందుకయ్యా అబద్ధాలు చెప్పావు? అన్యాయం చేశావు? ఎందుకయ్యా శ్రీవారి ప్రసాదం ప్రతిష్టను దెబ్బ తీశావు? అని ఎవరైనా గట్టిగా నిలదీస్తే ఆయన ఏం చేశారో తెలుసా..? అంబటి రాంబాబు అన్న మీద దాడి! ఆ రోజు (శనివారం) ఉదయం ఆయన గుడికి వెళ్లి చంద్రబాబుకు జ్ఞానోదయం కలగాలని పూజ చేసి బయటకు వస్తుంటే.. గుడి నుంచి ఇంటికి వచ్చే మార్గంలో ఏకంగా కట్టెలు పట్టుకుని, పోలీసులను పెట్టుకుని అడ్డుకున్నారు. (కర్రలు పట్టుకున్న టీడీపీ కార్యకర్తల ఫోటోలను చూపారు). కారులో ఉన్న రాంబాబును అడ్డగించి, కారును కర్రలతో బాదుతూ, పోలీసుల సమక్షంలోనే అనకూడని మాటలు అంటూ బూతులు తిట్టారు. ఒకేసారి అంతమంది దుండగులు చేతిలో కర్రలతో కారుపైకి దూసుకు రావడం.. బూతులు తిడుతూ మీదకు రావడంతో ఆయన కాస్త ఘాటుగా స్పందించాడు. ఆయన నోటి నుంచి ఒక తిట్టు పదం వచ్చింది. ఒక రియాక్షన్‌గా జరిగింది. అదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ మీద ఎటువంటి అటాక్ లేకపోయినా రొటీన్‌గా తిడుతున్నారు. అంబటి రాంబాబు అన్న ప్రాణం మీదకు వచ్చినప్పుడు రియాక్షన్‌గా ఆయన తిడితే మాత్రం ఇంకో రకంగా చిత్రీకరిస్తున్నారు. అయినప్పటికీ రాంబాబు ఇంటికి వచ్చిన తర్వాత ఒంటి గంట ప్రాంతంలో ప్రెస్‌మీట్ పెట్టి జరిగిన విషయమంతా వివరించారు. ఆయన పెద్ద మనిషి, సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి తాను తిట్టకుండా ఉండాల్సింది అని కూడా చింతిస్తూ చెప్పాడు. అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని చేతనైతే పొగడాలి. కానీ వాళ్లు దాన్ని కూడా వక్రీకరిస్తూ ఏకంగా రాంబాబు అన్నను హత్య చేయడానికి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు సాక్షాత్తూ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో మనుషులను వేసుకుని వచ్చి అంబటి ఇంటిపై దాడి చేశారు. ఐదు కార్లు ధ్వంసం చేశారు. ఇంట్లో కిటికీల అద్దాలు, సామగ్రి ధ్వంసం చేశారు. పక్కనున్న ఆఫీసులో అన్నీ పగలగొట్టారు. ఆ ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారు. వారి ప్రాణాలకు నష్టం జరిగే విధంగా.. వారిని తిడుతూ వ్యవహరించిన తీరు ఆక్షేపణీయం. -
జనం కేక.. జంగిల్‌రాజ్‌ను తరిమికొడదాం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రోడ్డుపై కిలోమీటర్ల కొద్దీ కనుచూపు మేర జనం.. జంగిల్ రాజ్‌కు వ్యతిరేకంగా ఏకమయ్యారు.. చంద్రబాబు సర్కారు దుర్మార్గాన్ని ధైర్యంగా దుయ్యబట్టారు.. సర్కారు ఆంక్షలను లెక్క చేయకుండా రోడ్డుపైకి వచ్చారు.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అడుగులో అడుగేస్తూ దిక్కులు పిక్కటిల్లేలా జై జగన్ అంటూ నినాదాలు చేశారు.. జంగిల్ రాజ్‌కు రోజులు దగ్గర పడ్డాయని గర్జించారు.. ఇందుకు బుధవారం గుంటూరు వేదికైంది.. గుంటూరు నగరం జన సంద్రమైంది.. నినాదాలతో దద్దరిల్లింది. తెలుగుదేశం పార్టీ గూండాల దాడికి గురైన అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జన సందోహం అపూర్వ స్వాగతం పలికింది. జగన్ పర్యటన ఖరారైందని తెలిసిన వెంటనే జిల్లాలో 30 యాక్ట్ అమలు చేస్తున్నట్లు ప్రకటించి, నాయకులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొనవద్దని పోలీసులు నోటీసులు ఇచ్చారు. తాడేపల్లి నుంచి అంబటి రాంబాబు ఇంటి వరకు మార్గ మధ్యంలో అనేక చోట్ల బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. జగన్ కాన్వాయ్‌ను మాత్రం అనుమతించి.. ఆయన వెనుక వస్తున్న వాహనాలను, జన సందోహాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఇన్ని అడ్డంకుల మధ్య కూడా వైఎస్ జగన్ పర్యటన విజయవంతమైంది. 35 కిలోమీటర్లు.. ఆరు గంటలు » తాడేపల్లి నుంచి గుంటూరు నగరంలోని అంబటి రాంబాబు నివాసం వద్దకు 35 కిలోమీటర్ల దూరం చేరుకోవడానికి వైఎస్ జగన్‌కు ఏకంగా ఆరు గంటల సమయం పట్టిందంటే జనం ఎంతగా పోటెత్తారో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ జగన్‌ను చూడటానికి స్వచ్ఛందంగా వెళ్తున్న వేలాది మంది ప్రజలు, వైఎస్సార్ సీపీ శ్రేణులకు అడుగడుగునా ఆంక్షలతో ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసింది. » జగన్ కాన్వాయ్ తాడేపల్లిలో బయలుదేరిన తర్వాత కాజా టోల్గేట్ వద్ద వాహనాలను ఆపారు. ఆయనతోపాటు కొద్ది వాహనాలు మాత్రమే పంపి మిగతా వాటిని నిలువరించారు. అనంతరం కాన్వాయ్ గుంటూరు ఆటోనగర్ వై జంక్షన్‌కు చేరుకోగానే అక్కడ బారికేడ్లు అడ్డుగా పెట్టి పూర్తి స్థాయిలో వాహనాలు ఆపేశారు. » ఏటుకూరు బైపాస్ వద్ద కూడా కార్యకర్తలు పత్తిపాడు నుంచి గుంటూరు నగరంలోకి రాకుండా బారికేడ్లు పెట్టి ఎక్కడికక్కడ నిలువరించారు. బైక్‌లపై వస్తుంటే బైక్‌ల తాళాలు లాక్కున్నారు. గుంటూరు జిల్లాను దిగ్బంధనం చేశారు. పల్నాడు జిల్లా నుంచి గుంటూరుకు వెళ్లే సరిహద్దు మండలాలైన నరసరావుపేట, యడ్లపాడు, సత్తెనపల్లి, అమరావతి మండలాల పరిధిలో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేశారు.» ఎక్కడికి వెళ్తున్నారు.. ఎందుకు వెళ్తున్నారు.. అంటూ ఆరా తీశారు. వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొనేందుకు వెళ్తున్న వారిని అడ్డుకొని వెనక్కి పంపారు. కొందరిని పోలీసు స్టేషన్లకు తరలించి సాయంత్రం ఐదు గంటల తర్వాత వదిలిపెట్టారు.జననేతకు జనం జేజేలు» గుంటూరు నగరానికి వచ్చిన జననేత వైఎస్ జగన్‌కు ప్రజలు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు జేజేలు పలికారు. విద్యార్థి విభాగం నేతలు, యువజన విభాగం నేతలు, అనుబంధ విభాగాల నేతలు, యువత భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ జన నేతకు ఎదురేగి స్వాగతం పలికారు. వైఎస్సార్సీపీ లీగల్ విభాగం నేతలు, న్యాయవాదులు ప్ల కార్డులు ప్రదర్శిస్తూ వైఎస్ జగన్ పర్యటనకు మద్దతు తెలిపారు.» కంకరగుంట ఓవర్ బ్రిడ్జి, పట్టాభిపురం స్వామి థియేటర్ వద్ద సైతం ప్రజలు భారీగా చేరుకుని పూల వర్షం కురిపించారు. చేబ్రోలు హనుమయ్య కంపెనీ, గుజ్జనగుండ్ల సెంటర్లో తీన్మార్ డప్పు వాయిద్యాలతో స్థానిక నేతలు స్వాగతం పలికారు. యువత భారీగా బైక్ ర్యాలీలతో సందడి చేశారు. జగన్ గుంటూరు చేరుకున్న తర్వాత ఏటుకూరు వద్ద సర్వీస్ రోడ్డు మీదుగా వీఐపి రోడ్లోకి రావడానికి ముందుగా పోలీసులు ఆ దారిన వచ్చిన వాహనాలను అడ్డుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం దాటిన తర్వాత కంకర్ గుంట ఓవర్ బ్రిడ్జి వద్ద సైతం వాహనాలను నిలువరించారు. అయినా జన సందోహం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. » గుంటూరు రోడ్లన్నింటిపై ప్రజలు, అభిమానుల కోలాహలం కనిపించింది. ఉదయం 10 గంటల నుంచే రోడ్లపైకి వచ్చి తమ అభిమాన నేత కోసం ఎదురు చూశారు. పెద్ద సంఖ్యలో వస్తున్న నాయకులు, కార్యకర్తలను అడ్డుకుని అంబటి ఇంటికి వెళ్లనీయకుండా ఆపివేసినప్పటికీ.. సాయంత్రం 5 గంటలయ్యే సరికి ఆ ప్రాంతం జనసంద్రంగా మారిపోయింది. » గుంటూరు నగరంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్ కాన్వాయ్‌కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో చుట్టుగుంట సెంటర్ నుంచి అంబటి రాంబాబు నివాసానికి వచ్చేందుకు ఏకంగా 3 గంటలకుపైగా సమయం పట్టింది. అంబటి రాంబాబు నివాసంతో పాటు చుట్టుపక్కల ఇళ్లపైన, గోడలపైకి ఎక్కి ప్రజలు తమ అభిమాన నేతను చూశారు. పర్యటన ఈ స్థాయిలో విజయవంతం కావడంతో అధికార పార్టీ నేతల్లో గుబులుపుట్టింది.అడుగడుగునా అడ్డంకులే..సాక్షి, నరసరావుపేట: జంగిల్ రాజ్ అరాచకాలను ఎండగట్టేందుకు గుంటూరు నగరానికి వస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా వెళ్తున్న వేలాది మంది ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులకు అడుగడుగునా ఆంక్షలతో ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసింది. పల్నాడు జిల్లా నుంచి గుంటూరుకు వెళ్లే సరిహద్దు మండలాలైన నరసరావుపేట, యడ్లపాడు, సత్తెనపల్లి, అమరావతి మండలాల పరిధిలో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేశారు. జగన్‌ను చూడటానికి వెళ్తున్న వారిని గుర్తించి వెనక్కు పంపారు. ఉదయం 7 గంటల నుంచే వాహనాల తనిఖీలు ప్రారంభించారు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ, యడ్లపాడు మండలం బోయపాలెం హైవే వద్ద, సత్తెనపల్లి మండలం నందిగం అడ్డరోడ్డు వద్ద పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. సత్తెనపల్లి, సత్తెనపల్లి రూరల్, ముప్పాళ్ల, రాజుపాలెం, దాచేపల్లి, అచ్చంపేట, బెల్లంకొండ తదితర మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు వెళ్తున్న వాహనాలను సత్తెనపల్లి నందిగం అడ్డరోడ్డు వద్ద సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఆపేశారు. వారిని సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించి సాయంత్రం 6 గంటల వరకు స్టేషన్లోనే నిర్బంధించారు. సత్తెనపల్లి కార్యకర్తలను సైతం ఇదే స్టేషన్లో సాయంత్రం వరకు ఉంచారు. వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొనేందుకు అనుమతి లేదంటూ పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకు గుంటూరులోని నివాసంలో పోలీసులు నోటీసులు అందజేశారు. చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి ఎంత కట్టడి చేసినా పల్నాడు జిల్లా మీదుగా గుంటూరు నగరానికి వేలాది మంది వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలి వెళ్లడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు అద్దం పడుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
అంబటి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ (ఫొటోలు)
-
పోలీసుల సమక్షంలోనే అంబటి హత్యకు కుట్ర
-
కాపు కులంలో అంబటి అన్న ఒక టైగర్ పోలీసులకు మాస్ వార్నింగ్
-
మేం కూడా మీలాగే ప్లెక్సీలు పెడితే ఒప్పుకొంటావా చంద్రబాబు?
-
గూండాలను వేసుకొచ్చి దాడి చేయిస్తావా? గల్లా మాధవిపై జగన్ ఫైర్
-
అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేంటి?
-
YS Jagan: ముగ్గురూ లెంపలేసుకుని క్షమాపణ చెప్పాలి..లేదంటే
-
LIVE: YS జగన్ సంచలన ప్రెస్ మీట్
-
నేనున్నా తల్లీ.. బాధపడకు.. అంబటి కుటుంబానికి జగన్ ఓదార్పు
-
అంబటి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించారు. టీడీపీ గూండాల దాడితో వణికిపోయిన కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పారు. బుధవారం వైఎస్ జగన్ గుంటూరు పర్యటన జన సందోహం నడుమ సాగింది. సాయంత్రం అంబటి నివాసానికి చేరుకున్న వైఎస్ జగన్.. తొలుత టీడీపీ రౌడీమూకల దాడిలో ధ్వంసమైన ఇంటిని, ఆఫీస్‌ను పరిశీలించారు. ఆ తర్వాత అంబటి కుటుంబ సభ్యులను కలిసి దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆ సమయంలో జగన్ వెంట పార్టీ ముఖ్య నేతలు పలువురు ఉన్నారు. -
అంబటి నివాసం వద్ద ఉద్రిక్తత
సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద బుధవారం సాయంత్రం ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ ప్రియతమ నేత వైఎస్ జగన్ వస్తున్నారనే సమాచారంతో అంబటి ఇంటికి భారీగా తరలి వచ్చినవారిపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ గూండాలు అంబటి రాంబాబు నివాసంపై దాడి చేసి.. ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని హతమార్చాలని ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉల్టా అంబటిపైనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించింది చంద్రబాబు ప్రభుత్వం. దాడితో భయాందోళనకు గురైన అంబటి కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించేందుకు వచ్చారు. జగన్ రాక నేపథ్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో అంబటి నివాసం వద్దకు తరలి వచ్చారు. అయితే.. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వాళ్లను అడ్డుకుని బారికేడ్లు పెట్టారు. ఈ క్రమంలో ఇరువర్గాలు వాగ్వాదానికి దిగడం పరిస్థితి హీటెక్కింది. అయితే.. జగన్ వచ్చాక మరోసారి అలాంటి పరిస్థితే కనిపించింది.అంతకు ముందు.. గుంటూరు నగరంలో అంతకు ముందు గుంటూరు నగరంలోకి వచ్చే సమయంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. గుంటూరు నగరంలోకి అడుగు పెట్టిన వైఎస్ జగన్‌కు స్వాగతం చెప్పేందుకు వైఎస్సార్సీసీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. అయితే, వైఎస్ జగన్ కాన్వాయి వాహనాలను మాత్రమే నగరంలోకి అనుమతిచ్చారు.ఫాలో ఆప్ వాహనాలను చెక్‌పోస్ట్ వద్ద అడ్డుకున్నారు. అంబటి రాంబాబు నివాసానికి వచ్చేందుకు పోలీసుల నుంచి అనుమతి తీసుకున్న తమను పోలీసులు అడ్డుకున్నారని పలువురు వైఎస్సార్సీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ శ్రేణుల్ని నెట్టే ప్రయత్నం చేయగా అక్కడ సైతం ఉద్రిక్తత నెలకొంది. ఇలా అంబటి కుటుంబాన్ని పరామర్శించేందుకు చేపట్టిన వైఎస్ జగన్ పర్యటనకు అడుగడుగున్నా అడ్డంకులు సృష్టించేందుకు కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.అయినప్పటకీ జగన్‌పై ఉన్న అమితమైన అభిమానం ఎప్పటికీ తగ్గదని అభిమానులు, శ్రేణులు నిరూపించారు. భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో గుంటూరులో వైఎస్ జగన్ పర్యటన జనసంద్రాన్ని తలపించింది. -
పట్టాభిపురం చేరుకున్న YS జగన్
-
గుంటూరుకు చేరుకున్న YS జగన్ కాన్వాయ్
-
ఏమి జనం సామీ..! గుంటూరులో జన సునామి
-
జగన్ అభిమానులను ఆపేదెవడు.... చేతులెత్తేసిన పోలీసులు..
-
జగన్ రాకతో దద్దరిల్లిన గుంటూరు
-
పోలీసులపై తిరగబడ్డ జనం.. జగన్‌ను చూడాలి..
-
జంగిల్ రాజ్‌కు వ్యతిరేకంగా.. భారీగా తరలి వచ్చిన జనం..
-
జగన్ రాకతో దద్దరిల్లిన గుంటూరు (చిత్రాలు)
-
సాక్ష్యాలు మాయం చేయడానికి పోలీసులు పొద్దున్నే ఇంటికి వచ్చి..
-
దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం : వైఎస్ జగన్
చంద్రబాబు ఆటవిక పాలనలో వైఎస్సార్సీపీ నేతలకు రక్షణ కరువైంది. వరుసగా అక్రమ కేసులు.. అరెస్టులు.. విచారణల పేరుతో ప్రతీకార రాజకీయాలు కొనసాగిస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో ఇప్పుడు ఏకంగా హత్యలకు కూడా కుట్ర పన్నుతోంది.. అందుకే వైఎస్సార్సీపీ శ్రేణులకు ధైర్యం చెప్పేందుకు వైఎస్ జగన్ రంగంలోకి దిగారు. -
Watch Live: అంబటి ఇంటికి YS జగన్
-
వైఎస్ జగన్ పర్యటన.. గుంటూరు పోలీసుల ఓవరాక్షన్!
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నేడు గుంటూరులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వైఎస్ జగన్ వస్తున్న కారణంగా నగరాన్ని పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. సిటీ నలువైపులా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను అడ్డుకుంటున్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో పోలీసులు కూటమి సర్కార్‌కు వత్తాసు పలుకుతున్నారు. నిన్న రాత్రి నుంచే వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఇంటికి అర్ధరాత్రి రెండుసార్లు పోలీసులు వెళ్లారు. గోడకు నోటీసు అంటించి పోలీసులు ఫోటోలు తీసుకున్నారు. అనంతరం, వెంటనే నోటీసులు తొలగించి పోలీసులు వెళ్లిపోయారు. దీంతో, నోటీసులు ఇచ్చినట్టు కవరింగ్ చేస్తున్నారు. వైఎస్ జగన్ పర్యటనకు ఆటంకాలు సృష్టించి.. సిటీకి నలువైపులా చెక్‌పోస్టులు పెట్టి.. వైఎస్సార్సీపీ నేతలు హాజరు కాకుండా అడ్డుకుంటున్నారు. మరోవైపు.. వైఎస్ జగన్ గుంటూరు పర్యటన నేపథ్యంలో సెక్షన్-30 అమలులో ఉంది కాబట్టి ర్యాలీలు, మీటింగ్‌లు నిర్వహించకూడదని పోలీసులు ప్రకటన చేశారు. అర్ధరాత్రి వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు వెళ్లి పోలీసులు హడావిడి చేశారు. పార్టీ నేతలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా, నంబూరు శంకర్రావు, బలసాని కిరణ్ కుమార్, వేమారెడ్డి అంబటి మురళి, విడుదల రజిని, పానుగంటి చైతన్య, మేరుగు నాగార్జున, అన్నాబత్తుని శివకుమార్, దొంతి రెడ్డి వేమారెడ్డికి నోటీసులు ఇవ్వడానికి పోలీసులు వారి ఇళ్లకు వెళ్లారు. గుంటూరులో వైఎఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు. వైఎస్ జగన్ పర్యటనలో పార్టీ కార్యకర్తలు పాల్గొనకుండా నోటీసులు ఇస్తున్నారు. -
కరకట్ట ప్యాలెస్ కిరాతకం.. దాడికి సహకరించిన ఓ పోలీసు అధికారి
-
నేడు అంబటి ఇంటికి YS జగన్..
-
నేడు అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం గుంటూరులో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ఆయన గుంటూరు వెళతారు.ఇటీవల టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
టీడీపీ చేతిలో ఖా‘కీలు బొమ్మలు’
సాక్షి టాస్క్ ఫోర్స్: వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేయడంతోపాటు ఆయనపై హత్యాయత్నం జరిగిన ఘటనలో ఇద్దరు పోలీస్ అధికారులు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ చేతిలో కీలుబొమ్మలై ఆ పార్టీ అధిష్టానం చెప్పినట్టు నడుచుకున్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు శనివారం గోరంట్ల గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో పూజలు చేసి తిరిగి వస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు గోరంట్ల చిల్లీస్ సెంటర్లో కర్రలు, మారణాయుధాలతో కాపుగాశారు. అంబటి రాంబాబు వాహనాన్ని అడ్డుకుని కారు మీద చేతులతో కొడుతూ అసభ్య పదజాలంతో దూషించారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ వందనాదేవి అయితే ‘‘నువ్వు మొగోడివి అయితే రారా’’అంటూ అంబటిని రెచ్చగొట్టారు. మారణాయుధాలతో తెలుగుదేశం నేతలు పెద్ద సంఖ్యలో గుమిగూడినా వారిని నియంత్రించడంలో నల్లపాడు సీఐ వంశీధర్ విఫలమయ్యారు.పైగా టీడీపీ నేతలకు కొమ్ముగాశారు. వైఎస్సార్సీపీ నేతల నుంచి ప్రతిస్పందన రాకుండా తెలుగుదేశం మూకలకు రక్షణగా నిలబడ్డారు. పైగా అంబటి వాహనంలో మారణాయుధాలు ఉన్నాయంటూ దుష్ప్రచారం చేశారు. వ్యూహాత్మకంగా దాడి.. అంబటిపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా అతిగా స్పందించారు. రాంబాబుకు 24 గంటల్లో తామేంటో సినిమా చూపిస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే శనివారం మధ్యాహ్నం 3.45 గంటలకు నల్లపాడు సీఐ వంశీధర్ సిద్ధార్ధనగర్‌లోని అంబటి ఇంటికి వెళ్లి నోటీసు ఇచ్చేందుకు వచ్చామని చెప్పారు. అయితే నోటీసు ఇవ్వకుండానే ఇప్పుడే వస్తామని చెప్పి వెళ్లిపోయారు. వెళ్లేటప్పుడు అంబటి ఇంటి వద్ద ఎంతమంది ఉన్నారో గమనించి వెళ్లి టీడీపీ నేతలకు ఉప్పందించారని సమాచారం.ఈ నేపథ్యంలో అంబటిని అరెస్ట్ చేస్తున్నారన్న సమాచారంతో మీడియా అక్కడికి చేరుకుంది. అదే సమయంలో వైఎస్సార్సీపీ శ్రేణులూ తరలివచ్చాయి. సాయంత్రం 4 గంటలకు తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్త లంకా మాధవి అంబటి ఇంటి వద్దకు వచ్చి అంబటిని ‘‘నా కొడకా రా..రా.. చెప్పుతో కొడతా’’అంటూ దుర్భాషలాడింది. దీనికి వైఎస్సార్సీపీ మహిళా నాయకులు ప్రతిస్పందించారు. టీడీపీ కార్యకర్తను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు లంకా మాధవిని అక్కడి నుంచి తప్పించారు. అప్పటికే వ్యూహాత్మకంగా పశ్చిమఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావు, అబ్బూరి మల్లి, ఇతర కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అంబటి ఇంటికి చేరుకుని ఒక్కసారిగా మారణాయుధాలు, కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అప్పటికే పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు నేతృత్వంలో వందమందికిపైగా పోలీసులు అక్కడ మోహరించినా.. వారిని అడ్డుకునే యత్నం చేయకుండా చోద్యం చూశారు. గోనుగుంట్ల కోటేశ్వరరావు అనే టీడీపీ దివ్యాంగుల విభాగం నేత మైక్ సెట్‌తో వచ్చి ‘‘బయటకు రారా నా కొడకా’’అంటూ అంబటిపై బూతుపురాణం లంకించుకున్నా.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీ గూండాలకు అండగా నిలబడ్డారు. ఈ ఇద్దరూ అధికారపార్టీ తొత్తులే! సీఐలు గంగా వెంకటేశ్వర్లు, వంశీధర్ ఇద్దరూ అధికారపార్టీ తొత్తులేనని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు గతంలో పలుమార్లు వైఎస్సార్సీపీ ర్యాలీలు, సభలను అడ్డుకున్నారు. కొన్ని సందర్భాల్లో అంబటి రాంబాబుతో వాగ్వాదానికీ దిగారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు సీఐలు అధికార పార్టీ నేతల ఆదేశాల ప్రకారం అంబటిని ఇబ్బంది పెట్టాలనే వ్యూహరచన చేశారని వైఎస్సార్సీపీ వర్గాలు మండిపడుతున్నాయి. వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై కోర్టును ఆశ్రయించడానికి సన్నద్ధమవుతున్నాయి. పక్క సబ్ డివిజన్ స్టేషన్లో ఆ సీఐకి ఏం పని?ఉదయం టీడీపీ నేతలు అంబటిపై దాడికి యత్నించిన ప్రదేశం గోరంట్ల చిల్లీస్ సెంటర్ నల్లపాడు స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో అన్యాయంగా అక్రమంగా అంబటిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను శనివారం రాత్రి 10.30 గంటలకు నల్లపాడు స్టేషన్‌కు తరలించి లాకప్‌లో పెట్టారు. నల్లపాడు గుంటూరు సౌత్ సబ్‌డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఆ స్టేషన్లో వైఎస్సార్సీపీ శ్రేణులు అంబటిని కలవకుండా ఉండేలా ఉన్నతాధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అర్ధరాత్రి లాకప్‌లో నిద్రపోతున్న అంబటిని నల్లపాడు పోలీస్ స్టేషన్ పైఅంతస్తుకు పోలీసులు తీసుకువెళ్లారు. అక్కడ నల్లపాడు సీఐ వంశీధర్తోపాటు పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లూ ఉన్నారని స్వయాన అంబటి రాంబాబు న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇచ్చారు. గంగా వెంకటేశ్వర్లు, వంశీధర్ ఇద్దరూ తనను గోడకు ఆనించి కూర్చోబెట్టి రెండు కాళ్లు చీల్చి ఇబ్బందికి గురి చేశారని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని పట్టాభిపురం స్టేషన్ సీఐ గంగా వెంకటేశ్వర్లుకు సౌత్ సబ్‌డివిజన్‌లోని నల్లపాడు స్టేషన్లో ఏం పని అనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
గల్లా మాధవి దంపతులకు క్లీన్ చిట్!
సాక్షి ప్రతినిధి, గుంటూరు/లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, కాపునేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయంపై చేసిన దాడిపై పోలీసులు మొక్కుబడిగా కేసు నమోదు చేశారు. అంబటిరాంబాబు ఫిర్యాదు మేరకు పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు.అయితే, దాడికి పాల్పడిన, పురిగొల్పిన టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావుతోపాటు ముఖ్యమైన టీడీపీ నాయకుల పేర్లను తప్పించారు. అంబటిఫిర్యాదులో దాడికి పాల్పడిన ముఖ్యమైన వారి పేర్లు స్పష్టంగా పేర్కొన్నారు. అయినా టీడీపీ కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్‌ప్రసాద్ అలియాస్ ఇసుక బుజ్జి, మరికొందరు... అంటూ మొక్కుబడిగా కేసు నమోదు చేసి వదిలేశారు. కేసు నమోదుకు తర్జనభర్జనలు... వైఎస్సార్సీపీ లీగల్ టీం ద్వారా అంబటి రాంబాబు సోమవారం మధ్యాహ్నం ఫిర్యాదు చేస్తే తర్జనభర్జనల అనంతరం రాత్రి 11.45 గంటలకు గుంటూరు పట్టాభిపురం పోలీసులు క్రైమ్ నంబర్ 43 /2026గా కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావు టీడీపీ గూండాలతో వచ్చి తన ఇల్లు, కార్యాలయంపై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేస్తే... పోలీసులు మాత్రం టీడీపీ నాయకుల వద్ద మరిన్ని మార్కులు కొట్టేసేందుకు కేసును నీరు గార్చే విధంగా సెక్షన్లు నమోదు చేశారు. ఎమ్మెల్యే మాధవి, భర్త రామచంద్రరావు పేర్లకు బదులు కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్‌ప్రసాద్ అలియాస్ బుజ్జి మరి కొంతమంది.. అంటూ కేసు నమోదు చేయడంపై వైఎస్సార్సీపీ నేతలు, పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే మాధవి, ఆమె భర్త రామచంద్రరావులను ఏ1, ఏ–2గా కేసు నమోదు చేసే వరకూ పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు.కాగా, అంబటి ఫిర్యాదుపై నమోదు చేసిన సెక్షన్లతో తక్కువ శిక్షలు పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే మాధవి టీడీపీ కార్యాలయంలో మంగళవారం ప్రెస్‌మీట్ పెట్టి అంబటి ఇంటిపై దాడితో తమకు సంబంధం లేదని, క్షమాపణ మాత్రమే కోరామని చెప్పడం గమనార్హం. అంబటి ఇంటి వద్ద పోలీసుల హైడ్రామా.. అంబటి రాంబాబు ఇంటి వద్ద మంగళవారం పోలీసులు హైడ్రామా నడిపారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న నేపథ్యంలో... మంగళవారం సాయంత్రం అంబటి ఇంటి వద్ద క్లూస్ టీమ్‌తో పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ప్రత్యక్షమయ్యారు. టీడీపీ మూకలు విధ్వంసం సృష్టించిన మూడు రోజుల తర్వాత వచ్చి అంబటి ఇంటి వద్ద పగిలిన కుండీలు, విరిగిపోయిన ఫర్నిచర్, ధ్వంసమైన కార్లను స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. దీనికి అంబటి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో తూతూ మంత్రంగా క్లూస్ టీమ్‌తో పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నేరస్థల పరిశీలనలో కార్లు, ఫర్నిచర్, అద్దంతో కూడిన కిటికీలు ధ్వంసమైనట్లు గుర్తించామని చెప్పారు. అంబటి కార్యాలయాన్ని తగలబెట్టిన ఆనవాళ్లు కనిపించలేదన్నారు. ఇదిలా ఉండగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మనుబోలు, దుత్తలూరులో టీడీపీ నేతల ఫిర్యాదుల మేరకు పోలీసులు మంగళవారం మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అక్రమ కేసులు నమోదు చేశారు. -
రేపు వైఎస్ జగన్ గుంటూరు పర్యటన
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(ఫిబ్రవరి 4, బుధవారం) గుంటూరులో పర్యటించనున్నారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన ఇల్లు, ఆఫీసుని వైఎస్ జగన్ పరిశీలించనున్నారు.టీడీపీ గూండాలు అంబటి నివాసంపై దాడి చేసి.. ఆయన్ని, కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అంబటి రాంబాబు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించి ఓదార్చనున్నారు. దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి.. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. -
దాడులను మళ్లీ రిపీట్ చేస్తాం.. గల్లా మాధవి అంబటికి వార్నింగ్..
-
ఆమె మాట్లాడింది తప్పు కాదా.. ఇప్పటికైనా ఆపకపోతే
-
జైల్లో అంబటిని కలిసిన ముద్రగడ
-
అంబటి అల్లుడు,కూతురుని పరామర్శించిన అనిల్ కుమార్ యాదవ్
-
ఏపీలో ఆటవిక పాలన నడుస్తోంది: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ అంబటి రాంబాబుతో ఆ పార్టీ నేతలు ముద్రగడ పద్మనాభం, తోట త్రిమూర్తులు, వేణుగోపాలకృష్ణ ములాఖత్ అయ్యారు. అనంతరం ముద్రగడ పద్మనాభం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రుల ఇల్లు తగలపెట్టే సంప్రదాయం రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు చాలా బాధగా ఉందని.. ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. ఇలాంటి విధానం రాజకీయాల్లో ఎప్పుడూ చూడలేదన్నారు.‘‘కల్తీ రిపోర్టు వచ్చింది. సారీ చెప్తున్నానని చంద్రబాబు చెప్పుంటే గౌరవం పెరిగి ఉండేది. తప్పించుకునేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటారు.. మీరు చేసే పనులు బాగోలేదు.. మీలో మార్పు రావాలి. దేశంలో మాజీ మంత్రుల ఇల్లు తగలబెట్టిన అరాచకం ఎక్కడా జరగలేదు’’ అని ముద్రగడ పేర్కొన్నారు.పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీమాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఆటవిక పాలన నడిపిస్తున్నారంటూ మండిపడ్డారు. ‘‘ఓటు ద్వారా అధికారం లభిస్తే చంద్రబాబు మళ్లీ ఆటవిక పాలనలోకి తీసుకెళ్లారు. ప్రజాస్వామ్యంలో బాధితులు ముద్దాయిలవుతున్నారు. తిరుమల లడ్డులో కల్తీ జరగలేదని సీబీఐ ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించింది. నెయ్యి కల్తీ జరిగిందని పోస్టర్లు వేయటం ఎంత దారుణం. అంబటి ఇంటిపై దాడి చేసిన 5 గంటల పాటు పోలీసులు నిస్తేజంగా ఉండిపోవటం దారుణం. దాడి సమయంలో ఇంట్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. బాధితులను చంద్రబాబు నిందితులుగా మారుస్తున్నారు. పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ అయింది..ప్రజాస్వామ్య రక్షణ కోసం ఎన్ని రోజులైనా జైల్లో ఉంటానని అంబటి చెప్పారు. జైల్లో మాజీ మంత్రికి ఇవ్వాల్సిన మినిమం ప్రివిలైజేస్ కూడా ఫాలో కావటం లేదు. కేంద్ర మంత్రి పెమ్మసాని దారుణమైన వ్యాఖ్యలు చేశారు. జాతీయ స్థాయిలో ఈ వ్యవహారాన్ని తెలియజేయటానికి వైఎస్సార్సీపీ ఎంపీలు పార్లమెంట్లో ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ప్రజా పక్షాన పోరాటం చేస్తున్న ప్రతిపక్షం గొంతు నొక్కటానికి ఎంత ప్రయత్నించినా వెనక్కి తగ్గేది లేదు’’ అని వేణుగోపాలకృష్ణ తేల్చి చెప్పారు. -
పార్లమెంట్ ముందు వైఎస్ఆర్సీపీ ఎంపీల ధర్నా
-
అంబటి, జోగి రమేష్ లను పరామర్శించనున్న వైఎస్ జగన్
-
బాబు ఆటవిక పాలన.. గుంటూరుకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రేపు(ఫిబ్రవరి 04, బుధవారం) గుంటూరులో పర్యటించనున్నారు. టీడీపీ గూండాల చేతిలో దాడితో భయబ్రాంతులకు గురైన సీనియర్‌నేత, మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చనున్నారు. టీడీపీ గూండాలు అంబటి నివాసంపై దాడి చేసి.. ఆయన్ని, కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నించిన సంగతి తెలిసిందే.గుంటూరులో ఇటీవల రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. తిరుపతి లడ్డూ ప్రచార నేపథ్యంలో టీడీపీ దుష్ప్రచారానికి దిగడం.. దానిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అంబటి రాంబాబుపై కర్రలతో దాడికి యత్నం.. ఆ క్రమంలో చోటుచేసుకున్న వాగ్వాదాలు.. చివరకు అంబటి ఇంటిపై టీడీపీ గూండాలు దాడికి ప్రయత్నించడం తెలిసిందే. ఆ సమయంలో అంబటితో వైఎస్ జగన్ మాట్లాడారు కూడా. అయితే.. ఆ తర్వాతే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాత్రిపూట పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయగా.. సీఎంను దుర్భాషలాడారన్న కేసులో మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. అయితే.. ఈ సంఘటనతో చంద్రబాబు ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అంబటి, ఆయన కుటుంబ సభ్యులపై జరిగిందని దాడి కాదని.. హత్యాయత్నమేనన్న అభిప్రాయం వ్యక్తమైంది. అదే సమయంలో మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైనా పెట్రోల్ బాంబ్ దాడి జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో బాధిత కుటుంబాలకు పరామర్శించి దైర్యం చెప్పాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారు. బుధవారం అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించనున్నారు. దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి.. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. అలాగే.. శుక్రవారం జోగి రమేష్ కుటుంబాన్ని కలిసి పరామర్శించనున్నారు. అంబటి, జోగితో పాటు టీడీపీ రౌడీ మూకల చేతుల్లో దాడులకు గురైన పార్టీ నేతలు విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడులతో వైఎస్ జగన్ ఇప్పటికే ఫోన్లో మాట్లాడి.. ధైర్యం చెప్పిన సంగతి తెలిసిందే. -
టీడీపీ గూండాలపై కేసులు పెట్టరా?
సాక్షి, రాజమహేంద్రవరం: ‘మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ఆఫీస్, ఇంటిపై టీడీపీ గూండాలు దాడులు చేశారు. కార్లు, ఇల్లు ధ్వంసం చేశారు. ఆఫీస్ తగులబెట్టేశారు. అయినా వారిపై ఇప్పటికీ ఎందుకు కేసులు నమోదు చేయలేదు’ అని అంబటి రాంబాబు అల్లుడు ఉపేష్ ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న అంబటి రాంబాబుతో ఉపేష్, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పార్టీ నాయకుడు అనిల్‌రెడ్డి సోమవారం ములాఖత్ అయ్యారు. అనంతరం సెంట్రల్ జైలు బయట ఉపేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అంబటిపై రెండు రోజులుగా హైడ్రామా నడుస్తోంది.వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లినప్పుడు టీడీపీ గూండాలు వచ్చి రెచ్చగొట్టి ఆయనతో మాట్లాడించారు. అంబటి రాంబాబుకు 24 గంటల్లో సినిమా చూపిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హెచ్చరించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త మా ఇంటిపైకి వచ్చి భయంకరంగా దాడులు చేశారు. దారుణమైన బూతులు తిట్టారు. మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మీరు కేసు పెడతారా?’ అని సీఎం చంద్రబాబును నిలదీశారు.పోలీసులు, సీఐలు వెంకటేశ్వర్లు, వంశీ అంబటిని టార్చర్ చేశారని, పెమ్మసాని చెప్పిన సినిమా చూపించడం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. తిరుమల ప్రసాదంలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసిందని చంద్రబాబు, లోకేశ్ స్టేట్మెంట్లు ఇచ్చారని, డైవర్షన్ కోసమే హైడ్రామా సృష్టించారని దుయ్యబట్టారు. ‘గల్లా మాధవికి ఇల్లు లేదా? ఎల్లప్పుడూ మీ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందా?’ అని హెచ్చరించారు. చంద్రబాబు కళ్లు తెరవాలి జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. ఏం చేసినా చెల్లుబాటవుతుందనే ధోరణితో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేతలపై దాడులు చేసి.. తిరిగి వారి పైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కక్షపూరిత రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరవాలని హితవు పలికారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా మాజీ సీఎం జగన్, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డిపై బురద జల్లే ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కొవ్వు కలవలేదని సీబీఐ దర్యాప్తులో తేలినా.. రాజకీయ ప్రయోజనాల కోసం ఫ్లెక్సీలు పెట్టడమేమిటని ప్రశ్నించారు. దీనిని తప్పుపట్టిన అంబటి రాంబాబు ఇంటిపై దాడులు చేయించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ‘మీరు ప్రారంభించిన సంప్రదాయాన్ని రేపు చక్రవడ్డీతో తిరిగి మీకు చెల్లిస్తాం’ అని జక్కంపూడి రాజా హెచ్చరించారు.సెంట్రల్ జైల్‌కు అంబటి గుంటూరు కోర్టు ఆదేశాల మేరకు మాజీ మంత్రి అంబటి రాంబాబును సోమవారం వేకువజామున 3.45 గంటల సమయంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటికి స్నేహా బ్లాక్‌లో ఓ గది కేటాయించారు. -
జంగిల్‌రాజ్‌పై జనాగ్రహం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో జంగిల్‌రాజ్ అరాచకాలను... అధికార మదంతో టీడీపీ గూండాలు, అల్లరి మూకలు సాగిస్తున్న విధ్వంస కాండను... తమ పార్టీ నేతలపై టీడీపీ గూండాలు, పచ్చ మూకలు చేస్తున్న దాడులను, చంద్రబాబు ప్రభుత్వ అక్రమ అరెస్టులను వైఎస్సార్సీపీ తీవ్రంగా పరిగణించింది. ఇందులో భాగంగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టీడీపీ గూండాల చేతిలో హత్యాయత్నానికి గురైన అంబటి రాంబాబు కుటుంబాన్ని బుధవారం పరామర్శించనున్నారు. అలాగే టీడీపీ పచ్చ మూకలు శుక్రవారం నిప్పు పెట్టిన జోగి రమేశ్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. మరోవైపు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు సమావేశమై టీడీపీ మూక దాడులపై మండిపడ్డారు. జంగిల్ రాజ్యాధిపతి చంద్రబాబు అరాచకాలు, ఆ పార్టీ నేతల గూండాగిరిని జాతీయ స్థాయిలో ఎండగడతామని స్పష్టం చేశారు. అంతేకాకుండా న్యాయస్థానాల్లో పిటిషన్లు వేయడంతోపాటు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఇంకోవైపు రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ టీడీపీ అరాచకాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కాపు నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు, బీసీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌లపై జరిగిన దాడులను ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, కాపు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జంగిల్ రాజ్‌కు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతోపాటు బీసీ, ప్రజా సంఘాలు, కాపు నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి చంద్రబాబు ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించాలని నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. వెంటనే చంద్రబాబు ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. ఉత్తరాంధ్రలో నిరసనల వెల్లువ.. టీడీపీ జంగిల్‌రాజ్‌కు వ్యతిరేకంగా, తిరుమల లడ్డూపై పచ్చ మూక చేస్తున్న దు్రష్పచారానికి వ్యతిరేకంగా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పార్టీ నేతలు, ప్రజా సంఘాలు, బీసీ నేతలు నిరసనకు దిగారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అండ్ కో సాగిస్తున్న అసత్య ప్రచారం... బాబు అబద్ధాలకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై మండిపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. అదేవిధంగా వైఎస్సార్సీపీ నేతలపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణకు సోమవారం వినతిపత్రమిచ్చారు. పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై ఆరోపణలన్నీ అవాస్తవమని సీబీఐ సిట్ నివేదిక ఇచ్చినా ఇంకా టీడీపీ నేతలు అసత్యాలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ దు్రష్పచారం సాగిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి ఆయన నెల్లూరు నగరంలోని వేదాయపాళెం ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావుకు సోమవారం ఫిర్యాదు చేశారు. కర్నూలు, నంద్యాలలో టీడీపీ నాయకులపై కేసు నమోదు చేయాలని పోలీసులకు వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్‌బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ పోలీసు స్టేషన్లో సీఐ వీరా నాయక్‌కు పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో వారం రోజులుగా ఆటవిక, రాక్షస పాలనను తలపించేలా కూటమి ప్రభుత్వ పాలన ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ విమర్శించారు. దాడులు అరికట్టాలని పామర్రు ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రకాశం జిల్లాలో మార్కాపురం మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, ఒంగోలులో ఇన్చార్జి చుండూరి రవిబాబు, కనిగిరిలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌లపై టీడీపీ గూండాలు చేసిన దాడులకు నిరసనగా సోమవారం అనంతపురం జిల్లా పరిషత్ ప్రాంగణంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన చేశారు. రాష్ట్రంలో ప్రశ్నిస్తే దాడులతో అరాచకం సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) అన్నారు. వివాదాస్పద ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ పాలకొల్లు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విజయవాడలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, తదితరులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అంతకుముందు నేతలు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. రెడ్‌బుక్ పాలనే... ప్రజా పాలన లేదుతిరుపతిలో జ్యోతిరావ్‌పూలే విగ్రహం వద్ద బీసీ సంఘ నాయకులు ఆందోళన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ కక్షతో రెడ్‌బుక్ పాలనే తప్ప, ప్రజా పాలన సాగించడం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ నాయకుడు తొండమల్ల పుల్లయ్య, జిల్లా అధ్యక్షులు చిన్నియాదవ్, వాసుయాదవ్ ఆరోపించారు. మాజీ మంత్రులు జోగి రమేశ్, అంబటి రాంబాబు ఇళ్లపై కూటమి గూండాలు చేసిన దాడులను ఖండిస్తూ సోమవారం తిరుపతి బాలాజీకాలనీలోని జ్యోతిరావ్‌పూలే విగ్రహం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా రాజకీయ కక్షలు మానడంలేదని, రెడ్‌బుక్ పాలన సాగిస్తూ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొవ్వు ఉందంటూ చేసిన ఆరోపణలు సీబీఐ నివేదికతో పటాపంచలయ్యాయన్నారు. అందువల్లే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. -
అంబటి, జోగి కుటుంబాలను పరామర్శించనున్న వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలను కలవనున్నారు. బుధవారం అంబటి రాంబాబు కుటుంబాన్ని, శుక్రవారం జోగి రమేష్ కుటుంబాన్ని కలిసి పరామర్శించనున్నారు. ఇటీవల అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ గూండాలు దాడి చేసి నిప్పు పెట్టిన ఘటన పెద్ద కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలతో చంద్రబాబు ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు వైఎస్ జగన్ ఈ పరామర్శలు చేయనున్నారు. -
Jogi Ramesh: నువ్వు పెద్ద పుడింగిలా ఫీల్ అవ్వకు నీ రెడ్ బుక్ మడిచి పెట్టుకో..
-
తగిన మూల్యం చెల్లిస్తారు..అంబటి, జోగి రమేష్ ఇళ్లపై దాడి తమ్మినేని సీతారాం సీరియస్ రియాక్షన్
-
Advocate Rajini: టీడీపీ గూండాలపై ఫిర్యాదు..
-
కులం పేరుతో దూషించారు మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు.. అంబటి అల్లుడు వార్నింగ్
-
Tirupati : అంబటి రాంబాబుపై కేసు నమోదు
-
కన్నీరు పెట్టిన అంబటి కూతుర్లు.. నేనూ మీ కాపు మహిళనే
-
సినిమా చుపిస్తావా..? సిగ్గుండాలి పెమ్మసాని అంబటి కూతురు స్ట్రాంగ్ కౌంటర్
-
Mounika : పీకే గారూ.. ఇదేనా మీరన్న మహిళల భద్రత..?
-
Botsa: అంబటి ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు మొదట బూతులు తిట్టింది వాళ్లే
-
Botsa: రాష్ట్రాన్ని రావణకాష్టం చేయాలనుకుంటున్నారా చంద్రబాబూ?
-
బండబూతులు తిడుతూ దాడి చేశారు: అంబటి కుమార్తె
సాక్షి, గుంటూరు: తమపై పక్కా ప్లాన్ ప్రకారమే మా ఇంటిపై కర్రలు, రాడ్లతో దాడి చేశారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక. తీవ్రమైన పదజాలంతో దాడులకు పాల్పడినట్టు చెప్పుకొచ్చారు. ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు అని మండిపడ్డారు. అక్కడే ఉండి కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక తాజాగా గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ..‘మహిళలపై దాడులను హోంమంత్రి అనిత సమర్థిస్తారా?. కాపు మహిళలైన మాపై కూడా దాడులు చేశారు. బండబూతులు తిడుతూ లకారాలతో మాపై దాడులకు పాల్పడ్డారు. తాను అన్నది చంద్రబాబును కాదని మా నాన్న క్లియర్‌గా చెప్పారు. గతంలో చంద్రబాబు కూడా వైఎస్ జగన్‌ను అనేక సార్లు అనరాని మాటలు అన్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవికి ఏ నైతిక విలువలు ఉన్నాయి?. తాగుబోతులను మాపై ఉసిగొల్పారు. మా నాన్నకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. ఆయన అలా మట్లాడినందుకు క్షమాపణ కూడా చెప్పారు. ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు. ఎనిమిది గంటల పాటు మా ఇంటిపై టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి మాపై దాడులు చేశారు. మహిళల క్షేమం గురించి మాట్లాడే పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?. మా ఫిర్యాదులను పోలీసులు తీసుకోవడం లేదు. టీడీపీ గూండాలను కంట్రోల్ చేస్తున్నట్టు పోలీసులు యాక్షన్ చేశారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు రోజులుగా మాపై దాడి జరుగుతుంది. లడ్డుపై వేసిన పోస్టర్లు చింపడానికి రాంబాబు వెళ్ళలేదు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజ కోసం వెళ్లారు. గుడి నుంచి ఇంటికి వస్తుంటే రాంబాబుపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అసభ్యకరమైనపై భాషతో కారుపై దాడి చేశారు. ఒక మహిళ మాట్లాడిన మాటలు చూడండి ఆయన్ను రెచ్చగొట్టారు. దీంతో రాంబాబు మాట్లాడిన మాటలు తప్పు అని ఆయనే మీడియా సమావేశం పెట్టి చెప్పారు. అంత దమ్ము ఎవరికి ఉంటుంది. ఇక్కడే ఉంటాను అని చెప్పిన తర్వాత ఆయనపై దాడి చేశారు. కేవలం ఆడవాళ్ళు మాత్రమే ఉన్న ఇంటిపై ఎలా దాడి చేస్తారు. హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలి. మేము వైఎస్సార్సీపీ అని అధికారంలో లేమని మాపై దాడి చేశారు. దేవుడి లడ్డూ గురించి మాట్లాడారని మా ఇంటిపై దాడి చేశారు.గల్లా మాధవికి కుటుంబం ఉంది. మీకు కుటుంబం ఉంది కదా?. కొంతమంది మిమ్మల్ని పావుగా వాడుకుంటున్నారు. మిమ్మల్ని బలి పశువును చేస్తున్నారు. మీ అత్మ సాక్షికే వదిలేస్తున్నాను. రాంబాబు దేని గురించి భయపడరు. మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలను ఉపయోగించి, మహిళలపై దాడి చేస్తున్నారు. రాంబాబు గారిని స్టేషన్లో చాలా ఇబ్బంది పెట్టారు. ఇంకా ఆటవికంగా ఉన్నామని నిరూపించారు. కేంద్రమంత్రి పెమ్మసాని ఒక డాక్టర్.. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. సినిమా చూపించడం అంటే మహిళలపై దాడి చేయడమా?. దీనికి పెమ్మసాని భార్య అను సమాధానం చెప్పాలి. మా భద్రత గురించి మా నాన్న ఆందోళన చెంది ఉంటారు. గల్లా మాధవి డైరెక్షన్‌తోనే మాపై దాడి చేశారు అని చెప్పుకొచ్చారు. -
చంద్రబాబు ఐదువేల కోట్ల స్కాంపై బొత్స విమర్శలు
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో దమనకాండపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్య నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో.. నారాలోకేష్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దాడుల్ని బొత్స ఖండించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ సోమవారం (2-2-2026) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత మూడ్రోజులుగా కూటమి సర్కార్ విధ్వాంసానికి పాల్పడింది. పోలీసులే దగ్గరుండి దాడులు చేయిస్తారా? దాడుల్ని ప్రోత్సహించి అప్రతిష్టను మూటగట్టుకోవద్దు చంద్రబాబు. చంద్రబాబు ఏది చెబితే పోలీసులు అది చేస్తారా? రాష్ట్రంలో హింసాకాండ జరుగుతుంటే జనసేన, బీజేపీ ఎందుకు స్పందించలేదు. కేంద్ర మంత్రే స్వయంగా తడాఖా చూపిస్తాం అని అంటున్నారు. కేంద్రమంత్రి హుందాగా వ్యవహరించాలి. తాటాకు చప్పుళ్లకు వైఎస్సార్సీపీ బెదరదు. రాష్ట్రంలో జరిగే దాడులను ప్రజలు గమనిస్తున్నారు.ఇంటిపై పెట్రోల్ బాంబులు వేసి చంపాలని అనుకుంటున్నారా?.ఈ ప్రభుత్వ పనితీరుపై ప్రజలే ఆలోచించాలి. పోలీసులు వారి ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాలి. తప్పులు చేస్తుంటే దేవుడు క్షమించరు. సంక్షేమాన్ని గాలికొదిలేసి దాడులకు తెగబడతారా?. సంపద సృష్టి పేరుతో వైజాగ్‌లో ఐదువేల కోట్ల విలువైన భూమిని కొల్లగొట్టారు. రాష్ట్ర సంపదను కాకుండా తన ఇంటి సంపదను పెంచుకుంటున్నారు’ అని ధ్వజమెత్తారు. -
అంబటి హత్యకు ప్లాన్.. కుట్ర బయటపెట్టిన స్వాతి చౌదరి
-
అంబటి దాడి.. ప్రత్యక్ష సాక్షి.. అసలు గొడవ ఎలా స్టార్ట్ అయిందంటే
-
Kakani: రాషాన్ని ఒక అగ్నిగుండంగా మార్చేశావయ్యా చంద్రబాబు
-
Vangaveeti: ఆరోజు రంగా... ఈరోజు అంబటి.. దమ్మున్న కాపు నాయకులే నీ టార్గెటా
-
ఒక మహిళ అంత ఘోరంగా మాట్లాడుతుంటే.. అనితకు ఆ మాటలు వినపడలేదా
-
కస్టడీలో అంబటిని తీవ్రంగా వేధించిన పోలీసులు
-
జోగి రమేష్‌పై ప్రభుత్వం మరో కక్ష సాధింపు
విజయవాడ:జోగి రమేష్‌పై ప్రభుత్వం మరో కక్ష సాధింపుజోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము బెయిల్ రద్దు చేయాలి అని పిటీషన్ఎక్సైజ్ కోర్టులో పిటీషన్ వేసిన సిట్జోగి రమేష్ ఇంటికి నిన్న నిప్పు పెట్టిన టీడీపీ నేతలు, గుండాలుఓ వైపు జోగి ఇంటిపై దాడి చేసి..మరో వైపు జోగి సోదరులు సాక్ష్యాలు ధ్వంసం చేస్తారంటూ పిటిషన్ వేయించిన టీడీపీ గుంటూరు: లకారాలతో మా గురించి మాట్లాడారు : అంబటి రాంబాబు కామార్తె అంబటి మౌనికరెండు రోజులుగా మాపై దాడి జరుగుతుందిలడ్డుపై వేసిన పోస్టర్లు చింపడానికి రాంబాబు వెళ్ళలేదువెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజ కోసం వెళ్లారుగుడి నుంచి ఇంటికి వస్తుంటే రాంబాబు పై కర్రలు, రాళ్లతో దాడి చేశారు.అసభ్యకరమైనపై భాషతో రాంబాబు కారుపై దాడి చేశారుఒక మహిళ మాట్లాడిన మాటలు చూడండి ఆయన్ను రెచ్చగొట్టారు.దీంతో రాంబాబు మాట్లాడిన మాటలు తప్పు అని ఆయనే మీడియా సమావేశం పెట్టి చెప్పారుఅంత దమ్ము ఎవరికి ఉంటుందిఇక్కడే ఉంటాను అని చెప్పిన తర్వాత ఆయనపై దాడి చేశారుఎమ్మెల్యే గల్లా మాధవిని అడుగుతున్నానుఏ నైతిక విలువలతో ఎమ్మెల్యే గల్లా మాధవి క్షమాపణ అడుగుతున్నారునేను రాంబాబు వ్యాఖ్యలను సమర్థించడం లేదుఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆయన సమాధానం చెప్పారుకేవలం ఆడవాళ్ళు మాత్రమే ఉన్న ఇంటిపై ఎలా దాడి చేస్తారుహోంమంత్రి అనిత సమాధానం చెప్పాలికాపు కులస్తులు వాళ్ళ వెంటే ఉన్నారని మాపై దాడి చేశారుపవన్ కళ్యాణ్ వైపే కాపు కులస్తులు ఉన్నారని ఆయన బలం చూసి మాపై దాడి చేశారులకారాలతో మా గురించి మాట్లాడారుకాపుల్లో పుట్టినందుకు మేము గర్విస్తున్నాంమనల్ని అడ్డం పెట్టుకుని మన కంటిలో మన వేలుతో పొడుస్తున్నాంవైఎస్ జగన్ పుట్టక గురించి గురించి చంద్రబాబునాయుడు కామెంట్స్ చేయడం తప్పు కాదామేము వైఎస్సార్సీపీ అని, అధికారంలో లేమని మాపై దాడి చేశారుదేవుడి లడ్డూ గురించి మాట్లాడారని మా ఇంటిపై దాడి చేశారుగల్లా మాధవికి కుటుంబం ఉందిమీకు కుటుంబం ఉంది కదాకొంతమంది మిమ్మల్ని పావుగా పావుగా వాడుకుంటున్నారుమిమ్మల్ని బలి పశువును చేస్తున్నారుమీ అత్మసాక్షికే వదిలేస్తున్నాను.పవన్ కళ్యాణ్ మహిళల రక్షణ గురించి చాలా సార్లు చెప్పారు.మరి ఇప్పుడే సమాధానం చెబుతారు చెప్పండిరాంబాబు దేని గురించి భయపడరుమహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలను ఉపయోగించి, మహిళలపై దాడి చేస్తున్నారురాంబాబుని స్టేషన్ లో చాలా ఇబ్బంది పెట్టారుఇంకా ఆటవికంగా ఉన్నామని నిరూపించారుపోలీసులు అల్లరి మూకలను కంట్రోల్ చేయలేదుదాడి చేసిన వారికి పోలీసులు రక్షణగా ఉన్నారురాంబాబు 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారుఆయన గొంతు నొక్కడానికే దాడి చేశారుకేంద్రమంత్రి పెమ్మసాని ఒక డాక్టర్ ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నానుసినిమా చూపించడం అంటే మహిళలపై దాడి చేయడమేదీనికి పెమ్మసాని భార్య అను సమాధానం చెప్పాలిఅంబటి రాంబాబు నిజానికి భయపడతారుఇటువంటి దాడులకు పాల్పడరుమా భద్రత గురించి మా నాన్న ఆందోళన చెంది ఉంటారుగల్లా మాధవి డైరెక్షన్ తోనే మాపై దాడి చేశారువిజయవాడ: జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర పార్టీ నేతలుజోగి రమేష్ ఇంటిని పెట్రోల్ బాంబులతో తగల బెట్టిన టీడీపీ గూండాలుటీడీపీ గూండాల దాడిని సజ్జలకు వివరించిన జోగి రమేష్విజయవాడ: టీడీపీ దాడులపై మాజీ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం ఇది ప్రజాస్వామ్యం,బలహీన వర్గాలపై జరిగిన దాడిమేం రాజకీయాల్లో ఉండకూడదాదాడులు పేరుతో నన్ను మట్టుబెట్టాలని చూశారు. నాకేమైనా జరిగితే లోకేషే కారణంనన్నుమళ్లీ అరెస్టు చేయాలని పోలీసులు చూస్తున్నారు. నా ఇంటిపై వందల మంది టీడీపీ గూండాలు దాడులు చేశారుమీ అరాచకాలు ప్రశ్నించడం తప్పా లోకేష్ ఆదేశాలతో ఎంపీ కేసినేని చిన్నీ నాపై దాడులు చేశారుకూటమి ప్రభుత్వాన్ని ప్రజలే శిక్షిస్తారుకూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందినాకు అండగా జగనన్న ఉన్నారు. వైఎస్సార్ సైన్యం ఉందితాడేపల్లి :సీబిఐ తేల్చిన నిజాల కన్నా చంద్రబాబు చెప్పే అబద్దాలే నమ్మాలా? : బొత్సరాష్ట్రంలో దారుణమైన పరిపాలన సాగుతోందిఅంబటి, జోగి ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేయటానికా చంద్రబాబుకు అధికారం ఇచ్చింది?ధర్మాన్ని కాపాడాల్సిన పోలీసులు రాజకీయ పార్టీల నేతల అడుగులకు మడుగులు ఎత్తుతారా?చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్న వారిపై న్యాయ పోరాటం చేస్తాంఅధినేత వైఎస్ జగన్‌తో మాట్లాడి కార్యాచరణ ప్రకటిస్తాంఏ ప్రభుత్వం ఐనా రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించాలికానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ప్రత్యర్థులపై ఎలా దాడులు చేయాలా అని చూస్తున్నారుజోగి రమేష్ ఇంటి మీద పెట్రోలు బాంబులు వేయటం దుర్మార్గంజోగి రమేష్ ఇంటిని తగల పెట్టారుఇంత జరుగుతుంటే డీజీపి ఏం చేస్తున్నారు?చంద్రబాబు దగ్గర డీజీపి ఊడిగం చేస్తున్నారా?డీజీపీ.. వ్యవస్థ మీద గౌరవాన్ని పోగొట్టవద్దుతనమీద దాడి చేయటానికి వచ్చిన వారినే అంబటి రాంబాబు దూషించారుతర్వాత దానిని కూడా వెనక్కు తీసుకున్నారుకానీ పోలీసులే దగ్గరుండి దాడులు చేయించటం భావ్యం కాదులడ్డూ ఇష్యూ మీద సీబిఐ నిజాలు తేల్చాక కూడా ఇంకా ఎందుకు విష ప్రచారం చేస్తున్నారు?సీబిఐ తేల్చిన నిజాల కన్నా చంద్రబాబు చెప్పే అబద్దాలే నమ్మాలా?దీనిపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదు?అంబటి రాంబాబు ఎప్పుడూ లైన్ దాటి మాట్లాడరుఆయనా మనిషే. తనని బూతులు తిడితే ఒకమాట అన్నారువెంటనే వెనక్కు తీసుకున్నారు కూడాఐతే ఐదారు గంటలపాటు ఇంటిపై దాడి చేయిస్తారా?చంద్రబాబుకు చేతనైతే మంచి పాలన చేసి పేరు తెచ్చుకోవాలిఅంతేగానీ దాడులకు పురిగొల్పవద్దుసంపద సృష్టి పేరుతో వైజాగ్ లో ఐదువేల కోట్ల విలువైన భూమిని కొల్లగొట్టారురాష్ట్ర సంపదను కాకుండా తన ఇంటి సంపదను పెంచుకుంటున్నారుఅంబటి, జోగి ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేయటానికా మీకు అధికారం ఇచ్చింది?పోలీసులు ధర్మాన్ని కాపాడాలిరాజకీయ నాయకుల అడుగులకు మడుగులు వద్దవద్దువెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగవద్దుభక్తుల మనోభావాలను దెబ్బతీయవద్దుమమ్మల్ని అవమాన పరిచేలా ఫ్లెక్సీలు పెడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్నదే ప్రభుత్వం వైఎస్సార్ కడప జిల్లా:వైఎస్సార్సీపీ నేతల అక్రమ అరెస్టులపై ఫిర్యాదువైఎస్సార్సీపీ నాయకుల అక్రమ అరెస్టులకు నిరసనగా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ రెడ్డి మన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్లో పిర్యాదువైఎస్సార్సీపీ నాయకులను పదజాలాలతో దూషించిన కూటమి నాయకురాలను వెంటనే అరెస్ట్ చేయాలిఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ రెడ్డిరాష్ట్రంలో రెడ్‌బుక్ పాలనలో రావణ కాష్టం జరుగుతున్నది. ఇండ్లను పెట్రొల్ బాంబులతో తగలబెడుతున్నారు-.ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ రెడ్డి జోగి రోహిత్ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణఏపీ హైకోర్టులో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రోహిత్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలుతమ ఇంటిపై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయడం లేదుదీనిని చట్ట విరుద్ధంగా ప్రకటించండి ఇంటి వద్ద తగిన భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్లో కోరిన రోహిత్రోహిత్ పిటిషన్ పై మధ్యాహ్నం విచారణ జరుపనున్న హైకోర్టునెల్లూరు:ఏపి రాష్ట్ర ఇమేజ్ను మంటగలిపారు:చంద్రశేఖర్ రెడ్డిలడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబు జుగుబ్సాకరమైన వ్యాఖ్యలు చేశారుచంద్రబాబు, పవన్ చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం నిజం లేదని ఎన్డిడిబీ రిపోర్ట్ ఇచ్చిందినేటికి ఆ అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టడానికి ఫ్లెక్స్ లు ఏర్పాటు చేయడం ఎంత వరకు సబబుమాజీ మంత్రుల ఇండ్లపై కుటుంబ సభ్యులు లోపల వుండగానే దాడులకు తెగబడ్డారునెల్లూరు:నెల్లూరు వేదాయపాళెం పోలీస్ స్టేషన్లో వైఎస్సార్సీపీ ఫిర్యాదుశ్రీవారి లడ్డూ వ్యవహారంలో అబద్దపు, అభ్యంతకర పోస్టర్లు ఏర్పాటు పై పిర్యాదుమాజీ మంత్రి కాకాణి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్, ఆనం విజయకుమార్ ఆధ్వర్యంలో పిర్యాదుకాకాణి కామెంట్స్రాష్ట్రంలో ఆటవిక పాలన రాజ్యం ఏలుతుందిసీఎం, డిసిఎం లు శ్రీవారి లడ్డూ పై నిరాధారమైన ఆరోపణలు చేశారుప్రపంచ వ్యాప్తంగా వున్న హిందువుల మనోభావాలు దెబ్బతీశారులడ్డూ వ్యవహారంలో గత ప్రభుత్వం పై నిందలు వేసే ప్రయత్నాలు చేశారు విజయవాడ:మాజీ మంత్రి జోగి రమేష్‌ను కలిసిన ఎమ్మెల్సీ తలశిల రఘురాంవిశాఖ:తిరుపతి లడ్డుపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ చేసిన తప్పుడు ప్రచారంపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు..ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సిపి నాయకులు కేకే రాజు, వరుదు కళ్యాణి, మోల్లి అప్పారావు డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్..తిరుపతిమాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గుండాలు దాడి నిరసిస్తూ బాలాజీ కాలనీ పూలే విగ్రహం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బిసి విభాగం ఆధ్వర్యంలో నిరసనరాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందన్న బిసి నాయకులుప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఏపీ రాష్ట్రం లో రాష్ట్రపతి పాలన విధించాలి-గీత యాదవ్. వైఎస్సార్సీపీ,మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అనంతపురం::చంద్రబాబు హింసా రాజకీయాలపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులకు నిరసనగా ఆందోళన చేపట్టారు. అనంతపురం జెడ్పీ కార్యాలయంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం అరాచకాలపై నల్ల కండువాలతో నిరసన తెలిపారు వైఎస్సార్సీపీ నేతలు. ‘ చంద్రబాబు పాలన.. ఆటవిక రాజ్యం’ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు బీసీ వ్యతిరేకి అంటూ నిరసన వ్యక్తం చేశారు.మొన్న(శనివారం), నిన్న(ఆదివారం) టీడీపీ గూండాలు రెచ్చిపోయి మరీ విధ్వంసం సృష్టించారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులకు దిగారు. అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేసేందుకు యత్నించారు. ఆ క్రమంలోనే అంబటి రాంబాబు ఇంటిపై రాళ్లు, కర్రలు, రాడ్లతో దాడులకు దిగారు. జోగి రమేష్ ఇంటికి నిప్పుపెట్టారు టీడీపీ గూండాలు. పెట్రోల్ బాంబుతో ఇంటిని ధ్వంసం చేసే యత్నం చేశారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రశ్నిస్తున్న వారికి సమాధానం చెప్పలేక ఆటవిక పాలనను ఎంచుకున్నారు. తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేయడంలో సీఎం చంద్రబాబుదే తప్పు అన్న విషయం సీబీఐ సిట్ సాక్షిగా బట్టబయలు కావడంతో ప్రజల దృష్టిలో చులకనై, వారి దృష్టి మళ్లించేందుకు వైఎస్సార్ సీపీ నేతలపై దాడులకు తన రౌడీలను పురమాయిస్తున్నారు. శనివారం గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై గూండాల దాడిని మరచిపోక ముందే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిపై విధ్వంసానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పెట్రోల్ బాంబులతో బ్లేడ్, గంజాయి బ్యాచ్, రౌడీషీటర్లు, టీడీపీ మూకలు రమేష్ ఇంటిపై విరుచుపడి విధ్వంసం సృష్టించారు. వందలాది మంది రౌడీలు విధ్వంసం సృష్టిస్తుంటే నిలువరించాల్సిన పోలీసులు చేష్టలుడిగి చూస్తుండటం విస్తుగొలుపుతోంది. వెళ్లిపోండి.. వెళ్లిపోండి.. అంటూ వారిని బతిమిలాడటం పోలీసు వ్యవస్థ దీన స్థితిని తెలియజేస్తోంది. రాష్ట్రంలో సాగుతున్నది ప్రజాస్వామ్యమా.. లేక ఆటవిక రాజ్యమా అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. పైగా ఈ విధ్వంసకాండను చంద్రబాబు తనయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, సదరు టీడీపీ శ్రేణులు చెప్పుకుంటుండటం దారుణమని, ఇది అత్యంత ప్రమాదకర పరిణామమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బలహీన వర్గాల గొంతు నులిమి రాక్షసానందం పొందుతూ ప్రశ్నించే తత్వాన్ని చంపేయడమే టీడీపీ పెద్దల లక్ష్యమనే భావన అత్యధికుల్లో వ్యక్తం అవుతోంది. దీనిపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏపీలో ఆటవిక రాజ్యం నడుస్తుందని వైఎస్సార్సీపీ మండిపడతోంది. -
రాజమండ్రి జైలు వద్ద టెన్షన్.. అంబటిని కలిసేందుకు YSRCP నేతలు సిద్ధం..
-
రెచ్చిపోతున్న టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ స్వాతి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్త స్వాతిరెడ్డి (స్వాతిచౌదరి) అత్యుత్సాహం ప్రదర్శించారు. అంబటి రాంబాబు అరెస్ట్ నేపథ్యంలో సోషల్ మీడియాలో అడ్డగోలు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అయితే ఆదివారం ఆమె చేసిన ఓ పోస్టు.. అంబటి హత్యకు కుట్రపన్నారనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త గల్లా రామచంద్రరావుకు అంబటి రాంబాబు దొరికి ఉంటే ఈపాటికి ఆయన అంత్యక్రియలు పూర్తయి ఉండేవంటూ ఆదివారం స్వాతి ‘ఎక్స్’లో పెట్టిన పోస్టు కలకలం రేపింది. గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మాజీమంత్రి అంబటి రాంబాబు ఇంటిపై శనివారం సా.4 గంటల నుంచి అర్ధరాత్రి 11 గంటలకు వరకు జరిగిన విధ్వంసకాండలో గల్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావు కీలకం అంటూ స్వాతి తన పోస్టులో పేర్కొంది. అంతటితో ఆగకుండా.. వైసీపీ వాళ్లు రామచంద్రరావును ఏదో చేస్తామని ఆయన ఫొటోను సేవ్ చేసుకుంటున్నారని.. ‘మీరు అనుకున్నట్లుగా ఆయన వ్యక్తి కాదురా.. కనపడని శక్తి. గుంటూరు రాజకీయాల్లో ఇప్పుడే అడుగుపెట్టాడు. ఆయన దగ్గరకు వెళ్లాలంటే చాలా సైన్యాన్ని దాటుకుని వెళ్లాలి’ అంటూ రెచ్చగొట్టే పోస్టులు చేస్తోందామె. -
చంద్రబాబూ.. కట్టుబట్టలతో కాపులను వెళ్లగొట్టండి
సాక్షి, కాకినాడ: చంద్రబాబు అనే వ్యక్తి ఎప్పుడూ కాపుల మీద రగిలిపోతూనే ఉంటారని.. అందుకే రిజర్వేషన్ల విషయం సహా ప్రతీ దాంట్లోనూ మోసం చేస్తూ వస్తున్నారని కాపు ఉద్యమ నేత, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం అంటున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి నేపథ్యం, రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు ముద్రగడ సోమవారం ఓ బహిరంగ లేఖ రాశారు. ‘‘రాష్ట్రంలో గాడితప్పిన రాక్షస పాలనలో దహనకాండను చూస్తున్నాను. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, జోగి రమేష్ లను ఘోరాతి ఘోరంగా అవమానించడం ఎంత వరకు న్యాయం?. తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదని సీబీఐ ఇచ్చిన నివేదికతో గతంలో మీరు చెప్పింది అబద్దమని తేలిపోయింది. దానిని కప్పిపుచ్చుకోవడానికి మీరు పడుతున్నపాట్లు అంతా ఇంతా కాదు. మీరు చెప్పిన అబద్దానికి మీ పార్టీనే ఎంతో నష్టపోయింది.. .. మీ పరిపాలనలో ఎంతసేపూ కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారు. గతంలో నా కుటుంబాన్ని, ఇప్పుడు అంబటి కుటుంబాన్ని అవమానాలకు గురి చేశారు. కాపుల మీద మీరు ఎప్పుడూ రగిలిపోతునే ఉన్నారు. గతంలో కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని హమీ ఇచ్చి మొండి చెయ్యి చూపించారు. డిప్యూటీ సీఎం(పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి..) మీద ప్రేమతో మళ్ళీ కాపులు మీకు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు కాపులంతా మీ మీద కోపంతో ఉన్నారు. దయచేసి కాపులను ఈ రాష్ట్రం నుండి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించే కార్యక్రమం చేయ్యండి’’ అంటూ చంద్రబాబు, లోకేష్‌ను ఉద్దేశించి ముద్రగడ పద్మనాభం లేఖలో పేర్కొన్నారు. -
అంబటి ఇంటికి భద్రత.. హైకోర్టు కీలక ఆదేశాలు
-
నన్ను చంపాలని చూశారు.. పోలీసులు తీవ్రంగా కొట్టారు
-
అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్
-
దాడి కాదు.. భారీ కుట్ర..!
-
వారందరి పేర్లూ డిజిటల్ బుక్‌లో నమోదు చేస్తాం
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే వైఎస్సార్సీపీ శ్రేణులపై కూటమి ప్రభుత్వం దాడులకు తెగబడుతోందని ఆ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అంబటి ఇంటిపై దాడి చేసి, విధ్వంసం సృష్టించిన వారితో పాటు వారికి సహకరించిన పోలీసులనూ వదిలి పెట్టబోమని, అందరి పేర్లు వైఎస్సార్సీపీ డిజిటల్ బుక్‌లోకి ఎక్కిస్తామని చెప్పారు. గుంటూరులోని సిద్ధార్థనగర్‌లో శనివారం టీడీపీ రౌడీమూకల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు నివాసం, కార్యాలయంలో ధ్వంసమైన ఫర్నిచర్, కాలిపోయిన కారు, చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులు, పుస్తకాలు, ఎల్రక్టానిక్ సామగ్రిని ఆదివారం ఆయన పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. అంబటి రాంబాబు సతీమణి విజయలక్షి్మ, కుమార్తెలు మౌనిక, మనోజ్ఞను పరామర్శించారు.అధైర్య పడవద్దని, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబుపై పథకం ప్రకారం దాడి జరిగిందని, అంబటిని అంతమొందించేందుకు వందలాదిగా వచి్చన టీడీపీ రౌడీ మూకలను పెద్ద సంఖ్యలో ఉన్న పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయలేదన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని తేలడంతో గోరంట్లలోని వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో పూజలు చేసి వస్తున్న అంబటి.. గోరంట్లలో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై అభ్యంతరం వ్యక్తం చేశారని చెప్పారు.ఫ్లెక్సీని తొలగించాలని కోరితే ఆయనపై అక్కడే దాడికి పాల్పడ్డారని, టీడీపీ మూకలు నడిరోడ్డుపై బహిరంగంగా కర్రలు, రాడ్లతో తిరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని దుయ్యబట్టారు. గంటల తరబడి కొనసాగిన రౌడీ మూకల దాడిపై శాసన మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ.. డీజీపీ, అదనపు డీజీపీలకు ఫిర్యాదు చేసేందుకు ఫోన్లు చేసినా స్పందించలేదన్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీని కలిసేందుకు వెళితే మాజీ హోం మంత్రి మేకతోటి సుచరితను ఎస్పీ ఇంటి గేటు బయటే నిలబెట్టారని చెప్పారు. గతంలో స్కిల్ స్కామ్ కేసులో దోషిగా తేలిన చంద్రబాబును చట్టపరంగా అరెస్టు చేయించామని, అంబటి రాంబాబుపై జరిగిన దాడిపై చట్ట పరంగా న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సజ్జల ఇంకా ఏమన్నారంటే.. జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం ⇒ సీబీఐ సిట్ దాఖలు చేసిన చార్జిషీట్లో తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఆరోపించినట్టుగా ఆవు, పంది కొవ్వు, చేపల నూనెలు కలవలేదని దేశంలోనే ప్రతిష్టాత్మక ల్యాబ్‌లు ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్టుల ఆధారంగా నిర్ధారణ అయ్యింది. దేవుడ్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్, ఇతర కూటమి నాయకులు చేసిన క్షుద్ర రాజకీయాలను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు. ⇒ దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఉద్దేశ పూర్వకంగా దాడికి టీడీపీ వ్యూహరచన చేసి, అమలు చేసింది. పోలీసుల సమక్షంలోనే జరిగినా వారు ఎక్కడా అడ్డుకోలేదు. మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకర్ రెడ్డిపై ఇదే విధంగా దాడి చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి భర్త సహా పలువురు నాయకులు స్వయంగా దాడిలో పాల్గొన్నారు. ⇒ అంబటి నిజంగా తప్పు చేసి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. నాడు వైఎస్ జగన్‌ను పలు సందర్భాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ సహా పలువురు టీడీపీ, జనసేన నాయకులు తీవ్రమైన భాషతో దూషించారు. వాటిపై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు? వారు ఇప్పటికీ అలాగే దూషణల పర్వం కొనసాగిస్తున్నారు. వాటిపై ఆధారాలతో సహా పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఏ ఒక్కరిపైనా చర్య లు తీసుకున్న దాఖలాలు లేవు. వారందరినీ శిక్షించి తీరుతాం ⇒ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్రంలో అశాంతిని సృష్టించడం చంద్రబాబుకు అలవాటే. గతంలో మేం అధికారంలో ఉన్నప్పుడు పట్టాభితో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి పదే, పదే తీవ్రంగా తిట్టించారు. ఫలితంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రతిఘటించారు. దానిని మనసులో పెట్టుకుని అంబటి రాంబాబును చంపాలన్న కుట్రతోనే టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారని కచి్చతంగా తెలుస్తోంది. ⇒ టీడీపీ గూండాల దాడిపై వైఎస్సార్సీపీ చట్టపరంగా న్యాయ పోరాటం చేస్తుంది. పార్లమెంటులో సైతం దీనిపై గళమెత్తుతాం. వీడియోలన్నీ తీసిపెట్టుకున్నాం. దాడి వెనుక ఉన్న వారు, దాడిలో పాల్గొన్న వారి పేర్లూ డిజిటల్ డైరీలో ఎక్కిస్తాం. నిందితులను చట్టపరంగా శిక్షించి తీరుతాం. ⇒ ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎంపీలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, నందిగం సురే‹Ù, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, రుహుల్లా తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి దగ్గరుండి దాడి చేయించారు : అంబటి మౌనిక గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి నాయకత్వంలో ఇంట్లో ఉన్న మహిళలపై కూడా దాడి జరిగిందని మాజీ మంత్రి, కాపు నాయకుడు, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు కుమార్తె అంబటి మౌనిక స్పష్టం చేశారు. టీడీపీ గూండాల దాడిలో దెబ్బతిన్న వస్తువులను ఆదివారం ఆమె పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డికి చూపించారు. శనివారం సాయంత్రం టీడీపీ మూకలు ఒక్కసారిగా ఇల్లు, కార్యాలయంపై దాడులకు తెగబడ్డారని చెప్పారు.టీడీపీ నాయకులు తన తండ్రిని ఉద్దేశ పూర్వకంగా రెచ్చగొట్టారన్నారు. గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి వెంట పెద్ద సంఖ్యలో వచి్చన మహిళలు బూతులు తిడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, కేకలు వేస్తూ భయభ్రాంతులకు గురి చేశారన్నారు. గళ్లా మాధవి ఉసికొలి్పన తర్వాతే ఇంటితో పాటు కార్యాలయంపై దాడి జరిగిందని తెలిపారు. అంబటి రాంబాబు క్యాంపు కార్యాలయంలో ఉన్నారని తెలిసీ, టీడీపీ రౌడీమూకలు విధ్వంసానికి దిగాయన్నారు. ఆ సమయంలో తాము పిల్లలతో బిక్కుబిక్కుమంటూ గడిపామని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల సహాయ, సహకారాలతోనేక ఈ దాడులు జరిగాయన్నారు. -
నన్ను అంతం చేయడమే వారి లక్ష్యం
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్)/గుంటూరు లీగల్: తనను అంతం చేయడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని వైఎస్సార్సీపీ నేత, కాపు నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీస్‌స్టేషన్‌లో తనను హింసించారని తెలిపారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, తమ విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. దీంతో శనివారం ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆదివారం రాత్రి 8.30 గంటలకు గుంటూరు మొబైల్ కోర్టులో హాజరు పరిచారు.రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబుపై 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అంబటి పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, దీనివల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనిపై అంబటి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. అంబటిపై నమోదైన కేసు ఎఫ్ఐఆర్ చెల్లదన్నారు. ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసుల్లో ప్రాథమిక విచారణ జరిపిన తర్వాతే ఉన్నతాధికారుల అనుమతితో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉందని, దీన్ని పోలీసులు పట్టించుకోలేదన్నారు. అంబటిపై పెట్టిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు శిక్ష పడేవే కాబట్టి 41ఏ నోటీసు కూడా ఇవ్వకుండా నేరుగా అరెస్టు చేయడం తగదన్నారు. రెండు కాళ్లు పంగ చీల్చి వేధించారుఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు తనను హింసించిన తీరును న్యాయమూర్తి ఎదుట వివరించారు. ‘గుంటూరు సిద్ధార్థనగర్‌లోని మా ఇంటి వద్ద నుంచి శనివారం రాత్రి 10.30 గంటలకు పోలీసులు నన్ను నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లాకప్‌లో పడుకుని ఉండగా, రాత్రి రెండు గంటలప్పుడు ఒక కానిస్టేబుల్ వచ్చి.. స్టేట్మెంట్ రికార్డు చేయాలంటూ మొదటి అంతస్తులోకి తీసుకువెళ్లాడు. అక్కడ నల్లపాడు సీఐ వంశీధర్, పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు వచ్చి పక్కన కూర్చున్నారు. తమకు పై నుంచి ఒత్తిడి ఉందని, తప్పుగా అనుకోవద్దని చెబుతూనే కానిస్టేబుళ్లకు సైగ చేశారు. కానిస్టేబుళ్లు నన్ను గోడకు అనించి కూర్చోబెట్టి, రెండు కాళ్లు ఎడం చేసి గట్టిగా లాగి పంగ చీల్చారు. నొప్పితో అరవడంతో కాసేపు ఆపి.. రెండోసారి కూడా అలాగే చేశారు. నొప్పితో తర్వాత లేచి నిల్చుని నడవలేక పోయాను. కొంచెం సేపు నెమ్మదిగా నడిపించి కిందికి పంపారు. చాలా నొప్పిగా ఉంది. నన్ను అంతం చేసేందుకే టీడీపీ నాయకులు ఈ వ్యవహారం అంతా చేస్తున్నారు’ అని న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో న్యాయమూర్తి అంబటి రాంబాబు స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. తమ విధులకు అడ్డు పడ్డారంటూ నల్లపాడు ఎస్ఐ చేత పెట్టించిన కేసులో రిమాండ్‌ను తిరస్కరించారు. దీంతో అంబటిని రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. కాగా, అంతకు ముందు రాత్రి 7.30 గంటలకు అంబటికి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. న్యాయవాదుల ఆగ్రహంకోర్టు ఆవరణలో కూడా బ్యారికేడ్లు పెట్టడం, పోలీసులు తమను పదే పదే బయటకు పంపే ప్రయత్నం చేయడంపై న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. పోలీసుల వల్ల తమకు కోర్టులో కూడా రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై హైకోర్టుకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. అంబటిని ఏ జైలుకు తరలిస్తున్నారనే విషయం కూడా అంబటి రాంబాబు తరఫు న్యాయవాదులకు చెప్పక పోవడం దారుణం అని మండిపడ్డారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి నల్లపాడు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. అంబటిని పోలీసులు ‘బాగా చూసుకున్నారు’ అని ఆమె తెలిపారు.రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపుతెల్లవారుజామున నాలుగు గంటలకునేత అంబటి రాంబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రత్యేక వాహనంలో ఎస్కార్ట్ తో సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. జైలు వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు.. జైలు బయట భద్రత పెంచారు. అంబటి రాంబాబుకు తీసుకొచ్చిన దుస్తులను సంచుల్లో పంపించేందుకు సైతం అనుమతించలేదు పోలీసులు. ఈరోజు అంబటితో వైఎస్సార్సీపీ నేతలు ములాకత్ కానున్నారు.తిరుగుబాటు తప్పదుప్రభుత్వ పెద్దలు పరిపాలనను పక్కనపెట్టి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అహంకార ధోరణితో కక్షగట్టి అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేశారు. తిరిగి ఆయనపైనే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దుర్మార్గంతో కూడిన రాక్షస చర్య. రెడ్‌బుక్ పేరుతో తండ్రీకొడుకులిద్దరూ కలిసి వైఎస్సార్సీపీ నాయకులు, పార్టీ శ్రేణులపై దాడులు చేయడం, తప్పుడు కేసులతో అరెస్ట్ చేయడం మినహా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకున్నారా? తప్పుడు కేసులకు, బెదిరింపులకు భయపడేది లేదు. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రిఆటవిక రాజ్యంలో ఉన్నామా?అంబటి రాంబాబుపై దాడికి పాల్పడటం దుర్మార్గం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఆటవిక రాజ్యంలో ఉన్నామా? సీబీఐ–సిట్ దర్యాప్తులో లడ్డూలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని తేల్చింది. దీనిని డైవర్ట్ చేసేందుకు టీడీపీ గూండాలు అంబటి రాంబాబు ఇంటిని, పార్టీ కార్యాలయాన్ని, ఆయన వాహనాన్ని ధ్వంసం చేసి ఇంటికి నిప్పు పెట్టారు. – రామసుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీడైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే..లడ్డూలో కల్తీ జరగలేదని సీబీఐ నిగ్గు తేల్చడంతో డైవర్షన్ పాలిటిక్స్‌ను తెరపైకి తెచ్చింది. ప్రభుత్వం తమదేనన్న మదంతో అంబటి రాంబాబు ఇంటిపై పైశాచికంగా దాడులు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని దేవాలయం మెట్లు కడిగిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఈ రోజు ఏ దేవాలయం మెట్లు కడుగుతారో చెప్పాలి. చంద్రబాబు, లోకేశ్ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. – తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్యేరాష్ట్రంలో రాబందుల పాలనరాష్ట్రంలో రాబందుల పాలన నడుస్తోంది. టీడీపీ కూటమి అధికారంలో ఉన్నంతకాలం పక్క రాష్ట్రాలకు పారిపోయేలా చేస్తున్నారు. చంద్రబాబు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన ఘటనతో ఏపీని ఆటవిక ప్రదేశ్‌గా మార్చేశారు. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ డాక్టర్స్ విభాగం అధ్యక్షుడుచంద్రబాబు నేతృత్వంలో వికృత పాలనవైఎస్సార్సీపీ నాయకులపై దాడి చేసే వికృత రాజకీయ క్రీడ రాష్ట్రంలో కొనసాగుతోంది. లోకేశ్ తోడల్లుడికి చెందిన గీతం వర్సిటీకి రూ.5 వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టడంతో రాష్ట్ర ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వీటికి సమాధానం చెప్పుకోలేక ప్రజల ఆలోచనలను మళ్లించేందుకు పథకం ప్రకారం అంబటి రాంబాబుపై దాడి చేశారు. – సాకే శైలజానాథ్, మాజీ మంత్రిబిహార్ తరహా ఆటవిక పాలనరాష్ట్రంలో బిహార్ తరహా పాలనకు టీడీపీ కూటమి ప్రభుత్వం తెరతీసింది. వైఎస్సార్సీపీకి చెందిన ముగ్గురు మాజీ మంత్రుల, మాజీ ఎమ్మెల్యేల ఇంటిపై అధికార పార్టీ శ్రేణులు దాడికి పాల్పడటం గర్హనీయం. అంబటి ఇంటిపైన, మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన పెట్రోల్, కిరోసిన్ బాంబులతో దాడికి దిగారు. కూటమి పాలనలో రౌడీ రాజ్యానికి ఇది నిదర్శనం. – వెలంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రిదాడులకు భయపడం రాజధాని ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. వైఎస్సార్సీపీ నాయకులపై కూటమి మూకలు దాడులు చేస్తున్నాయి. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటిపై దాడి చేయడం అమానుషం. డీజీపీ పచ్చచొక్కాను వీడి ఖాకీ చొక్కా ధరించాలి. పోలీసుల సమక్షంలోనే దాడులు జరగటం సిగ్గుచేటు. వైఎస్సార్సీపీ దాడులకు భయపడే ప్రసక్తే లేదు. ప్రభుత్వ విధానాలపై ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటాలు చేసూ్తనే ఉంటాం. – తలశిల రఘురాం, ఎమ్మెల్సీఅమిత్షా దృష్టికి తీసుకెళ్తాం..అంబటి రాంబాబుపై జరిగిన దాడి గురించి కేంద్ర హోంశాఖకు, ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశాం. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళతాం. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై పార్లమెంట్ వేదికగా తెలియజేస్తాం. బాధితుల్ని కాపాడాల్సిన పోలీసులు దాడిచేసేవారికి రక్షణ కల్పించడం దుర్మార్గం. – వైవీ సుబ్బారెడ్డి, ఎంపీవ్యూహం ప్రకారమే దాడి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలను బట్టి వ్యూహం ప్రకారమే అంబటిపై దాడి జరిగిందనిపిస్తోంది. ఈ కేసులో పోలీసుల్ని నిందితుల్ని చేయాలి. – పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎంపీపోలీసులు చోద్యం చూశారుఅంబటి రాంబాబు కారులో వస్తుండగా ఆయన్ని అడ్డగించి టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు చోద్యం చూశారు. సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే భర్త సమక్షంలో దాడి జరిగింది. – వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఎంపీఅంబటిని రెచ్చగొట్టారు లడ్డూ వ్యవహారంలో అంబటి రాంబాబుపై 24 గంటల ముందునుంచే వ్యూహం పన్ని ఆయన్ని రెచ్చగొట్టారు. టీటీడీ ఈవోపై ప్రభుత్వం అభాండాలు వేస్తోంది. వైఎస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి తప్పుచేయలేదని సీబీఐ చార్‌్జషీట్ ద్వారా నిజం బహిర్గతమైంది. – మేడ రఘునాథరెడ్డి, ఎంపీ హత్య చేయాలని చూశారుఅంబటి రాంబాబును హత్యచేసేందుకు టీడీపీ గూండాలు ప్రయత్నం చేశారు. వందలాదిమంది ఆయన ఇంటిపై దాడిచేసి నిప్పంటించడం అత్యంత దుర్మార్గం. దీని ఉద్దేశం ఏమిటంటే హత్యచేయాలనే కదా? అక్కడున్న పోలీసులు ఏం చేస్తున్నారు? వారు పోలీసులా? గూండాలా? దాడిచేసిన వారిపై కేసులు పెట్టకుండా అంబటి రాంబాబుపై కేసు పెట్టడం దారుణం. – గొల్ల బాబూరావు, ఎంపీ -
అదే నిప్పు మీ ప్రభుత్వాన్ని దహించేస్తుంది
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి శనివారం రాత్రి.. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి ఆదివారం టీడీపీ గూండాలు, అసాంఘిక శక్తులు నిప్పు పెట్టడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఇళ్లకు పెట్టిన నిప్పు జంగిల్‌రాజ్‌కు ప్రతీక అన్నారు. ఈ నిప్పు ద్వారా ప్రజాస్వామ్యంపై రగిల్చిన మంటలతో పుట్టిన వేడి.. మీ సర్కార్‌ను దహించి వేయక మానదని సీఎం చంద్రబాబును హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం వైఎస్ జగన్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘ప్రజాస్వామ్యంలో, మీరు చేసిన ఆరోపణలు తప్పు అని, ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబులు ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ నిర్ధారణ చేసిన తర్వాత, మీరు చేసిన ఆ తప్పులకు మిమ్మల్ని ప్రశి్నస్తే, జీరి్ణంచుకోలేక అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లకు మీరు నిప్పు పెట్టడం, ఆ దుశ్చర్యలతో భయాన్ని కలిగించానని మీరు అనుకోవడం, చంద్రబాబు గారూ అది మీ భ్రమే. ఆ నిప్పు మీ ప్రభుత్వానికి మీరు పెట్టుకున్నారని గుర్తుంచుకోవాలి. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లకు పెట్టిన నిప్పు అరాచకానికి, ఆటవిక పాలనకు, జంగిల్‌రాజ్‌కు ప్రతీక. ఈ నిప్పు మీ సర్కార్‌ను దహించి వేయక మానదని గుర్తుంచుకోండి. రానున్న కాలంలో మీకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసే ప్రజాగ్రహ జ్వాలలు, మీ ప్రభుత్వాన్ని పూర్తిగా దహనం చేసి, బూడిద చేయక మానదనీ గుర్తుంచుకోండి. ప్రజాస్వామ్యంలో హింసా జ్వాలను రేపే చేయీ కాలక తప్పదు. అరాచక, ఆటవిక పాలన అంతం కాక తప్పదు. మీరు సృష్టించిన జంగిల్ రాజ్ భూ స్థాపితం కాక తప్పదు. ఇది చరిత్ర చెప్పే సత్యం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
అంబటి రాంబాబుకు రిమాండ్
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనపై రెండుకేసులు నమోదు కాగా ఒక్క కేసులో రిమాండ్ విధించింది. మరోకేసులో 41ఏ నోటీసులిచ్చి విచారించాలని తెలిపింది. దీంతో పోలీసులు ఆయనను రిమాండ్ నిమిత్తం రాజమండ్రికి తరలించనున్నారు.కాగా మాజీ మంత్రి ఆయన తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అంబటిపై పెట్టిన కేసులన్నీ ఏడేళ్ల శిక్షకు సంబంధించినవేని సుధాకర్ రెడ్డి అన్నారు. 41ఏ కింద నోటీసులు ఇవ్వలేదన్నారు. అంతేకాకుండా అంబటి పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ చెల్లదని కేవలం ఉన్నతాధికారుల అనుమతితోనే ఏఫ్ఐఆర్ నమోదు చేయాలని సుధాకర్ రెడ్డి కోర్టు ముందు వాదించారు.అంబటి రాంబాబు గుంటూరు మేజిస్ట్రేట్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు తనను శారీరకంగా నన్ను ఇబ్బందిపెట్టారని, రెండు కాళ్లు వెడల్పు చేశారు. తన కాళ్లు నొప్పిపెడుతున్నాయన్నారు. నల్లపాడు సీఐతో పాటు మరో ఇద్దరు సీఐలు తనను వేధించారన్నారు. తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు తీసుకోలేదని జడ్జి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు ఆవేదనను కోర్టు జడ్జి రికార్డు చేశారు. -
‘చంద్రబాబూ గుర్తుంచుకోండి.. చరిత్ర చెప్పే సత్యం ఇది’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు సర్కార్ అరాచకాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘‘ప్రజాస్వామ్యంలో మీరు చేసిన తప్పుడు ఆరోపణలు తప్పు అని.. ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబ్‌లు ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ నిర్ధారణ చేశాయి. తర్వాత మీరు చేసిన ఆ తప్పులకు మిమ్మల్ని ప్రశ్నిస్తే.. జీర్ణించుకోలేక అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లకు మీరు నిప్పు పెట్టడం, ఆ దుశ్చర్యలతో భయాన్ని కలిగించానని మీరు అనుకోవడం.. చంద్రబాబూ అది మీ భ్రమే. ఆ నిప్పు మీ ప్రభుత్వానికి మీరు పెట్టుకున్నారని గుర్తుంచుకోవాలి చంద్రబాబూ’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ హెచ్చరించారు.‘‘అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లకు పెట్టిన నిప్పు అరాచకానికి, ఆటవిక పాలనకు ‘జంగిల్‌రాజ్’కు ప్రతీక. కానీ ఈ నిప్పు ద్వారా ప్రజాస్వామ్యంపై రగిల్చిన మంటలతో పుట్టిన వేడి.. చంద్రబాబూ మీ సర్కార్‌ను దహించివేయక మానదు. రానున్న కాలంలో మీకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసే ప్రజాగ్రహ జ్వాలలు.. మీ ప్రభుత్వాన్ని పూర్తిగా దహనం చేసి, బూడిద చేయకమానదు...చంద్రబాబూ గుర్తుంచుకోండి.. ప్రజాస్వామ్యంలో హింసా జ్వాలలను రేపే చేయి కాలక తప్పదు. అరాచక, ఆటవిక పాలన అంతం కాక తప్పదు! మీరు సృష్టించిన ‘జంగిల్ రాజ్’’ భూస్థాపితం కాక తప్పదు. చరిత్ర చెప్పే సత్యం ఇది.’’ అంటూ వైఎస్ జగన్ హెచ్చరించారు.ప్రజాస్వామ్యంలో, మీరు చేసిన తప్పుడు ఆరోపణలు తప్పు అని, ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబులు NDDB, NDRI నిర్ధారణ చేసిన తర్వాత, మీరుచేసిన ఆ తప్పులకు మిమ్మల్ని ప్రశ్నిస్తే, జీర్ణించుకోలేక అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లకు మీరు నిప్పు పెట్టడం, ఆ దుశ్చర్యలతో భయాన్ని… pic.twitter.com/pA288I5ZIL— YS Jagan Mohan Reddy (@ysjagan) February 1, 2026 -
అంబటి హత్యకు టీడీపీ కుట్ర బట్టబయలు
సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబు హత్యకు టీడీపీ చేసిన కుట్ర బట్టబయలైంది.అంబటి ఇంటిపై దాడిలో టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి దంపతులదే కీలక పాత్ర అని తేలింది. అంబటి రాంబాబు గల్లా మాధవికి దొరికి ఉంటే అంత్యక్రియలు జరిగిపోయేవని అని స్వాతిరెడ్డి అలియాస్ స్వాతిచౌదరి ట్వీట్ చేశారు. అంబటిని హత్య చేసేందుకు టీడీపీ కుట్రపన్నిందని స్వాతిచౌదరీ ట్వీట్ ద్వారా స్పష్టమైంది. హత్యచేసేందుకు ప్లాన్ వేసుకున్నారన్న విషయం స్వాతిచౌదరి ట్వీట్ ద్వారా వెలుగులోకి వచ్చింది. -
‘ మీ దుష్ప్రచారాలను తిప్పికొడితే దాడులు చేస్తారా?’
నెల్లూరు: సీఎం చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొడుతుంటే దాడులకు పాల్పడతారా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని గతంలో చంద్రబాబు మాట్లాడరని, సీబీఐ రిపోర్ట్ ప్రకారం అందులో ఎలాంటి కొవ్వు లేదని స్పష్టమైందన్నారు. దాంతో చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలేనని తేటతెల్లమైందన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అనుకున్న విధంగా రిపోర్ట్ రాలేదని ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ను బలి పశువును చేశారన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబపై హత్యాయత్నం చేస్తారా? అని నిలదీశారు. -
అంబటిని కోర్టులో హాజరు పరిచిన పోలీసులు
సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబును కోర్టులో హాజరు పరిచారు. అంతకుముందు నల్లపాడు పీఎస్ నుంచి జీజీహెచ్‌కు తరలించారు పోలీసులు. రాత్రి నుంచి నల్లపాడు పీఎస్‌లో అంబటి రాంబాబును ఉంచిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం, జడ్జి ముందు ప్రవేశ పెట్టారు. -
‘ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి’
విజయవాడ: వరుసగా వైఎస్సార్సీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొలేకే టీడీపీ ఈ దాడులకు పాల్పడుతుందని మండిపడ్డారు. నిన్న(శనివారం) అంబటి రాంబాబు ఇంటిపై దాడి, ఈరోజు(ఆదివారం) జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడులను పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని అంబటి ధ్వజమెత్తారు. ‘ఇంటెలిజెన్స్ చీఫ్ కిందస్థాయి సిబ్బందిని నిర్వీర్యం చేస్తున్నారు. టీడీపీ చేస్తున్న దాడులను అడ్డుకోవద్దని పైస్థాయి అధికారుల నంచి ఆదేశాలున్నాయని కింద స్థాయి సిబ్బంది చెబుతున్నారు. పోలీసులను అడ్డంపెట్టుకుని అరాచకం చేస్తున్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి.. లేకంటే వేలాది మంది ప్రాణాలకు ముప్పు. టీడీపీ దాడులను పోలీసులు అడ్డుకోవడం లేదు. ప్రశ్నించే వాళ్లను టార్గెట్ చేస్తున్నారు. ఏపీ రాష్ట్రానికి కేంద్ర బలగాలను పంపాలి’ అని పేర్కొన్నారు. -
హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టులో చంద్రబాబు సర్కార్‌కు షాక్ తగిలింది. వైఎస్సార్సీపీ నేత, కాపు నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి కేసులో హైకోర్టు సీరియస్ అయ్యింది. శాంతిభద్రతలు అదుపులోకి వచ్చేంతవరకూ అంబటి ఫ్యామిలీకి 24 గంటల భద్రత ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి నిన్న (శనివారం) హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.తనతోపాటు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆమె అందులో పేర్కొన్నారు. తనకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని, శాంతిభద్రతల సమస్య ఉందని పిటిషన్లో వివరించారు. తనకు 24 గంటలు భద్రత కల్పించాలని, అందుకు అనుగుణంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని విజయలక్ష్మి కోరారు. ఇవాళ (ఫిబ్రవరి 1, ఆదివారం) హౌస్ మోషన్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. అంబటి కుటుంబానికి భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.కాగా, టీడీపీ గూండాలు బహిరంగంగా ఆయుధాలు చేతబట్టి అంబటి రాంబాబుపై శనివారం హత్యాయత్నం చేయడం కలకలం రేపింది. కర్రలు, రాడ్లు, కోడిగుడ్లతో దాడి చేస్తూ అంబటి ఇంటి వద్ద టీడీపీ రౌడీలు రెచ్చిపోయారు. కార్యాలయంలోనూ విధ్వంసం సృష్టించారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. తుదకు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కుట్ర బెడిసి కొట్టడంతో దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఏకంగా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు పాలకులు బరి తెగించారు.ఈ క్రమంలో వందలాది మంది పోలీసుల సమక్షంలోనే మాజీ మంత్రి ఇంటిపై దాడికి దిగినా వారు చోద్యం చూస్తూ మిన్నకుండి పోవడం విస్తుగొలుపుతోంది. వందల మంది రౌడీలు ఒకేసారి అంబటి రాంబాబు ఇంటిపైకి దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఆయనపైనా దాడి చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి దాటినా విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఒక పథకం ప్రకారం అంబటి రాంబాబును భౌతికంగా నిర్మూలించాలన్న తెలుగుదేశం పార్టీ కుట్రలో భాగంగా గూండాలను పంపించి ఆయనపై ఉదయం నుంచి దాడి చేయడానికి టీడీపీ ప్రయత్నాలు చేసింది. -
హైకోర్టుకైనా వెళతాం.. అంబటిని బయటకు తీసుకొస్తాం..
-
ఇంటికి వచ్చి అలా అనడం తప్పు.. అంబటి కూతురు ఎమోషనల్
-
దాడి ఘటనను సజ్జలకు వివరసిస్తున్న అంబటి కుమార్తె
-
‘నాన్నతో పాటు మమ్మల్ని చంపాలని చూశారు’
సాక్షి,గుంటూరు: నాన్నతో పాటు తమని చంపాలని చూశారని మీడియా ఎదుట మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె అంబటి మౌనిక ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న టీడీపీ గూండాలు ధ్వంసం చేసిన అంబటి రాంబాబు ఇంటిని ఆదివారం వైఎస్సార్సీపీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా అంబటి మౌనిక మీడియాతో మాట్లాడారు. మా నాన్నపై హత్యాయత్నం జరిగింది. మా నాన్నను రాడ్లతో చంపేందుకు యత్నించారు. టీడీపీ మహిళా ఎమ్మెల్యే దగ్గరుండి దాడులు చేయించారు. ఇంట్లో మహిళలు,పిల్లలు ఉన్నారని తెలిసి.. మా ఇంట్లో చొరబడి దారుణంగా దాడులు చేశారు. మాపై కూడా హత్యాయత్నం జరిగింది.’అని వాపోయారు. -
చంద్రబాబు లక్షణం హింసను క్రియేట్ చేయడమే: సజ్జల
సాక్షి, గుంటూరు: ప్రజలు మీకు అధికారం కట్టబెట్టింది దేనికి?.. ప్రశ్నించే గొంతులను వేధించడానికా? అంటూ చంద్రబాబు సర్కార్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అసలేం జరుగుతోందంటూ ప్రశ్నించారు. ‘‘లడ్డూలో కొవ్వు కలిసిందని సీఎం హోదాలో బాబు చెప్పారు. బాధ్యతారాహిత్యంగా ఎలా మాట్లాడతారు?’’ అంటూ సజ్జల మండిపడ్డారు.‘‘కల్తీ నిజమంటూ ప్లెక్సీలు వేసి దుష్ప్రచారానికి దిగారు. తప్పుడు ఫ్లైక్సీలను మా పార్టీ నేతలను ప్రశ్నించారు. టీడీపీ నేతలను పోలీసులు ఎందుకు అడ్డుకోలేదు. చట్టం.. గూండాలను, అరాచకశక్తులను రక్షించింది. మా పార్టీ నేతలకు ప్రాణాపాయం జరిగితే ఎవరిది బాధ్యత?. పోలీస్ ఉన్నతాధికారులకు బొత్స ఫోన్ చేసినా స్పందన లేదు. దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టాలి. మా పోరాటం అహింసాయుతంగా ఉంటుంది. కోర్టులను ఆశ్రయిస్తాం, గవర్నర్‌ను కూడా కలుస్తాం’’ అని సజ్జల పేర్కొన్నారు.ఊరుపేరులేని ఫ్లైక్సీలను పోలీసులే తొలగించాలి. డీజీపీ, హోంమంత్రి సమాధానం చెప్పాలి. విడుదల రజిని, భూమన, బ్రహ్మనాయుడిపైనా దాడికి యత్నించారు. గతంలో టీడీపీ నేత పట్టాభి ఉద్దేశపూర్వకంగానే మాట్లాడారు. చంద్రబాబు లక్షణం హింసను క్రియేట్ చేయడమే. ఎమ్మెల్యే గల్లా మాధవి దగ్గరుండి దాడులు చేయించారు. టీడీపీ అరాచకాలను చట్టబద్ధంగా ఎదుర్కొంటాం. డిజిటల్ బుక్‌లో అరాచకవాదుల పేర్లు ఎక్కిస్తున్నాం. మేం అధికారంలోకి వచ్చాక అరాచక వాదులకు శిక్ష తప్పదు. మాజీ హోంమంత్రిని ఎస్పీ ఆఫీస్ గేట్ ఎదుట వెయిట్ చేయించారు. లోకేష్ నోటి వెంట వచ్చే ప్రతి మాట బూతే’’ అని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అంబటిని లేపేస్తాం.. ముందే చెప్పిన పెమ్మసాని
-
అంబటి ఇంటికి వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వైఎస్సార్సీపీ నేతల బృందం చేరుకుంది. నిన్న అంబటి ఇంట్లో టీడీపీ గూండాలు విధ్వంసం సృష్టించారు. అంబటి ఇంటిని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు పరిశీలించారు. అనంతరం అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్సార్సీపీ నేతల వెంట వచ్చిన కార్యకర్తలను బారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకున్నారు.అంబటి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ మంత్రి విడదల రజని, మాజీ ఎంపీ మోదుగుల, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ, నియెజకవర్గ ఇన్‌ఛార్జిలు నూరి ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి, బాలసాని కిరణ్, డైమండ్ బాబు, గజ్జల భార్గవ్‌రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్, వైఎస్సార్సీపీ నేతలు ఉన్నారు.


