అధికార అహంకారమా.. గల్లా మాధవిపై అంబటి మౌనిక ఆగ్రహం​ | Ambati Mounika Serious Comments On TDP MLA Galla Madhavi | Sakshi
Sakshi News home page

అధికార అహంకారమా.. గల్లా మాధవిపై అంబటి మౌనిక ఆగ్రహం​

Feb 7 2026 3:09 PM | Updated on Feb 7 2026 3:39 PM

Ambati Mounika Serious Comments On TDP MLA Galla Madhavi

సాక్షి, గుంటూరు: టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లపై కర్రలు, రాడ్లతో దాడి చేయమని మాధవికి ఏ రాజ్యాంగం చెప్పింది అని ప్రశ్నించారు. గల్లా మాధవి అధికార అహంకారంతో మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు.

మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి మరోసారి బెదిరింపులకు దిగుతున్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసి మా ఇంటిపై దాడి చేశారు. ఇళ్లపై కర్రలు, రాడ్లతో దాడి చేయమని మాధవికి ఏ రాజ్యాంగం చెప్పింది. మీరు మొదటి సారి గెలిచారు. క్షమాపణ అడగటానికి వచ్చాం అంటూనే దాడి చేశామంటున్నారు. క్షమాపణ అడగడానికి వచ్చినవాళ్లు కర్రలు, రాళ్లు, మారణాయుధాలతో వస్తారా? ఎమ్మెల్యే గల్లా మాధవి సమాధానం చెప్పాలి. మీరు మీ పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తారు. దాడి చేయమనే మీరు మీ పిల్లలకి మెసేజ్ ఇస్తున్నారా?.

కేంద్ర మంత్రి పెమ్మసాని రాజకీయాలు ప్రక్షాళన చేస్తామన్నారు. ఆయనే మరింత కలుషితం చేశారు. రాళ్లు విసురుతూ, కత్తులు దూస్తున్నా.. గునపాలతో గోడలు పొడుస్తున్నా అంబటి ధైర్యంగా కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టిన మీరు ఓట్ల కోసం ఆయన దగ్గరకు రాలేదా?. వైఎస్‌ జగన్‌ మా ఇంటికి వచ్చినప్పుడు బంగారు, వెండి ఆభరణాలు పోయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కూటమి నాయకులకు చేతనైంది..  తప్పుడు ప్రచారం చేయడం మాత్రమే. అంబటి రాంబాబుపై తెలుగుదేశం గుండాలు చేసిన హత్యాయత్నానికి వ్యతిరేకంగా మద్దతివ్వటానికి వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు వచ్చారు. రాష్ట్రంలో లా అండ్‌​ ఆర్డర్‌ను కాపాడాలని నేను డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు కోరాను అని వ్యాఖ్యలు చేశారు. 

ఫస్ట్ టైం ఎమ్మెల్యే నువ్వు అహంకారం తగ్గించుకో.. లేదంటే..

Advertisement
 
Advertisement
Advertisement