మురుగులో మెరుపులు.. ఆకలిలో ఆశలు | From Waste To Livelihood, Poor Families Seek Tiny Gold Particles In Nellore Wastewater Canals, More Details Inside | Sakshi
Sakshi News home page

మురుగులో మెరుపులు.. ఆకలిలో ఆశలు

Feb 7 2026 1:31 PM | Updated on Feb 7 2026 1:35 PM

men and women who sift through sludge for a sprinkle of gold

నెల్లూరు: ముక్కు పుటరాలు అదిరే మురుగులో స్వర్ణ రేణువుల కోసం.. నిత్యం ఆకలి ఆశలు జల్లెడ పడుతుంటాయి. ఈ విభిన్న జీవన వాస్తవాలకు అద్దం పట్టే దృశ్యం నెల్లూరులోని కాపువీధిలో నిత్యం కనిపిస్తోంది. ఇక్కడ బంగారు ఆభరణాలు తయారు చేసే దుకాణాలు వరుసగా ఉంటాయి. మెరిసే ఉంగరాలు, కంఠహారాలు సిద్ధమైన తర్వాత మిగిలిపోయే సూక్ష్మ బంగారు రేణువులు వేస్ట్‌గా కాలువల్లోకి వెళ్లిపోతాయి. 

అవే నగరానికి చెందిన కొన్ని కుటుంబాలకు జీవనాధారం. ఆ పేదలు పొట్ట నింపుకోవడానికి రోజూ ఆకలి పోరాటం చేస్తుంటారు. మురుగు కాలువ వెంబడి నడిచే వారు ముక్కు మూసుకునే వెళ్లేవారెందరో... అయితే అదే కాలువల్లో పేరుకుపోయిన మట్టిని చేతులతో తీసి, జల్లెడ పట్టి, అందులో బంగారపు కణాలు చిక్కుతాయేమోనని వెతుకుతుంటారు. ఈ దృశ్యాలు వారి ఆకలి పోరాటాని, జీవిత వాస్తవానికి దర్పణంగా నిలుస్తాయి.           

        

                                              

 

Advertisement
 
Advertisement
Advertisement