విజయవాడ:
జోగి రమేష్‌పై ప్రభుత్వం మరో కక్ష సాధింపు
జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము బెయిల్ రద్దు చేయాలి అని పిటీషన్
ఎక్సైజ్ కోర్టులో పిటీషన్ వేసిన సిట్
జోగి రమేష్ ఇంటికి నిన్న నిప్పు పెట్టిన టీడీపీ నేతలు, గుండాలు
ఓ వైపు జోగి ఇంటిపై దాడి చేసి..మరో వైపు జోగి సోదరులు సాక్ష్యాలు ధ్వంసం చేస్తారంటూ పిటిషన్ వేయించిన టీడీపీ
గుంటూరు:
లకారాలతో మా గురించి మాట్లాడారు : అంబటి రాంబాబు కామార్తె అంబటి మౌనిక
రెండు రోజులుగా మాపై దాడి జరుగుతుంది
లడ్డుపై వేసిన పోస్టర్లు చింపడానికి రాంబాబు వెళ్ళలేదు
వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజ కోసం వెళ్లారు
గుడి నుంచి ఇంటికి వస్తుంటే రాంబాబు పై కర్రలు, రాళ్లతో దాడి చేశారు.
అసభ్యకరమైనపై భాషతో రాంబాబు కారుపై దాడి చేశారు
ఒక మహిళ మాట్లాడిన మాటలు చూడండి ఆయన్ను రెచ్చగొట్టారు.
దీంతో రాంబాబు మాట్లాడిన మాటలు తప్పు అని ఆయనే మీడియా సమావేశం పెట్టి చెప్పారు
అంత దమ్ము ఎవరికి ఉంటుంది
ఇక్కడే ఉంటాను అని చెప్పిన తర్వాత ఆయనపై దాడి చేశారు
ఎమ్మెల్యే గల్లా మాధవిని అడుగుతున్నాను
ఏ నైతిక విలువలతో ఎమ్మెల్యే గల్లా మాధవి క్షమాపణ అడుగుతున్నారు
నేను రాంబాబు వ్యాఖ్యలను సమర్థించడం లేదు
ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆయన సమాధానం చెప్పారు
కేవలం ఆడవాళ్ళు మాత్రమే ఉన్న ఇంటిపై ఎలా దాడి చేస్తారు
హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలి
కాపు కులస్తులు వాళ్ళ వెంటే ఉన్నారని మాపై దాడి చేశారు
పవన్ కళ్యాణ్ వైపే కాపు కులస్తులు ఉన్నారని ఆయన బలం చూసి మాపై దాడి చేశారు
లకారాలతో మా గురించి మాట్లాడారు
కాపుల్లో పుట్టినందుకు మేము గర్విస్తున్నాం
మనల్ని అడ్డం పెట్టుకుని మన కంటిలో మన వేలుతో పొడుస్తున్నాం
వైఎస్ జగన్ పుట్టక గురించి గురించి చంద్రబాబునాయుడు కామెంట్స్ చేయడం తప్పు కాదా
మేము వైఎస్సార్‌సీపీ అని, అధికారంలో లేమని మాపై దాడి చేశారు
దేవుడి లడ్డూ గురించి మాట్లాడారని మా ఇంటిపై దాడి చేశారు
గల్లా మాధవికి కుటుంబం ఉంది
మీకు కుటుంబం ఉంది కదా
కొంతమంది మిమ్మల్ని పావుగా పావుగా వాడుకుంటున్నారు
మిమ్మల్ని బలి పశువును చేస్తున్నారు
మీ అత్మసాక్షికే వదిలేస్తున్నాను.
పవన్ కళ్యాణ్ మహిళల రక్షణ గురించి చాలా సార్లు చెప్పారు.
మరి ఇప్పుడే సమాధానం చెబుతారు చెప్పండి
రాంబాబు దేని గురించి భయపడరు
మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలను ఉపయోగించి, మహిళలపై దాడి చేస్తున్నారు
రాంబాబుని స్టేషన్ లో చాలా ఇబ్బంది పెట్టారు
ఇంకా ఆటవికంగా ఉన్నామని నిరూపించారు
పోలీసులు అల్లరి మూకలను కంట్రోల్ చేయలేదు
దాడి చేసిన వారికి పోలీసులు రక్షణగా ఉన్నారు
రాంబాబు 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు
ఆయన గొంతు నొక్కడానికే దాడి చేశారు
కేంద్రమంత్రి పెమ్మసాని ఒక డాక్టర్ ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను
సినిమా చూపించడం అంటే మహిళలపై దాడి చేయడమే
దీనికి పెమ్మసాని భార్య అను సమాధానం చెప్పాలి
అంబటి రాంబాబు నిజానికి భయపడతారు
ఇటువంటి దాడులకు పాల్పడరు
మా భద్రత గురించి మా నాన్న ఆందోళన చెంది ఉంటారు
గల్లా మాధవి డైరెక్షన్ తోనే మాపై దాడి చేశారు
విజయవాడ:
జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర పార్టీ నేతలు
జోగి రమేష్ ఇంటిని పెట్రోల్ బాంబులతో తగల బెట్టిన టీడీపీ గూండాలు
టీడీపీ గూండాల దాడిని సజ్జలకు వివరించిన జోగి రమేష్
విజయవాడ:
టీడీపీ దాడులపై మాజీ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం
ఇది ప్రజాస్వామ్యం,బలహీన వర్గాలపై జరిగిన దాడి
మేం రాజకీయాల్లో ఉండకూడదా
దాడులు పేరుతో నన్ను మట్టుబెట్టాలని చూశారు.
నాకేమైనా జరిగితే లోకేషే కారణం
నన్నుమళ్లీ అరెస్టు చేయాలని పోలీసులు చూస్తున్నారు.
నా ఇంటిపై వందల మంది టీడీపీ గూండాలు దాడులు చేశారు
మీ అరాచకాలు ప్రశ్నించడం తప్పా
లోకేష్ ఆదేశాలతో ఎంపీ కేసినేని చిన్నీ నాపై దాడులు చేశారు
కూటమి ప్రభుత్వాన్ని ప్రజలే శిక్షిస్తారు
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది
నాకు అండగా జగనన్న ఉన్నారు. వైఎస్సార్ సైన్యం ఉంది
తాడేపల్లి :
సీబిఐ తేల్చిన నిజాల కన్నా చంద్రబాబు చెప్పే అబద్దాలే నమ్మాలా? : బొత్స
రాష్ట్రంలో దారుణమైన పరిపాలన సాగుతోంది
అంబటి, జోగి ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేయటానికా చంద్రబాబుకు అధికారం ఇచ్చింది?
ధర్మాన్ని కాపాడాల్సిన పోలీసులు రాజకీయ పార్టీల నేతల అడుగులకు మడుగులు ఎత్తుతారా?
చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్న వారిపై న్యాయ పోరాటం చేస్తాం
అధినేత వైఎస్ జగన్‌తో మాట్లాడి కార్యాచరణ ప్రకటిస్తాం
ఏ ప్రభుత్వం ఐనా రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించాలి
కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ప్రత్యర్థులపై ఎలా దాడులు చేయాలా అని చూస్తున్నారు
జోగి రమేష్ ఇంటి మీద పెట్రోలు బాంబులు వేయటం దుర్మార్గం
జోగి రమేష్ ఇంటిని తగల పెట్టారు
ఇంత జరుగుతుంటే డీజీపి ఏం చేస్తున్నారు?
చంద్రబాబు దగ్గర డీజీపి ఊడిగం చేస్తున్నారా?
డీజీపీ.. వ్యవస్థ మీద గౌరవాన్ని పోగొట్టవద్దు
తనమీద దాడి చేయటానికి వచ్చిన వారినే అంబటి రాంబాబు దూషించారు
తర్వాత దానిని కూడా వెనక్కు తీసుకున్నారు
కానీ పోలీసులే దగ్గరుండి దాడులు చేయించటం భావ్యం కాదు
లడ్డూ ఇష్యూ మీద సీబిఐ నిజాలు తేల్చాక కూడా ఇంకా ఎందుకు విష ప్రచారం చేస్తున్నారు?
సీబిఐ తేల్చిన నిజాల కన్నా చంద్రబాబు చెప్పే అబద్దాలే నమ్మాలా?
దీనిపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదు?
అంబటి రాంబాబు ఎప్పుడూ లైన్ దాటి మాట్లాడరు
ఆయనా మనిషే. తనని బూతులు తిడితే ఒకమాట అన్నారు
వెంటనే వెనక్కు తీసుకున్నారు కూడా
ఐతే ఐదారు గంటలపాటు ఇంటిపై దాడి చేయిస్తారా?
చంద్రబాబుకు చేతనైతే మంచి పాలన చేసి పేరు తెచ్చుకోవాలి
అంతేగానీ దాడులకు పురిగొల్పవద్దు
సంపద సృష్టి పేరుతో వైజాగ్ లో ఐదువేల కోట్ల విలువైన భూమిని కొల్లగొట్టారు
రాష్ట్ర సంపదను కాకుండా తన ఇంటి సంపదను పెంచుకుంటున్నారు
అంబటి, జోగి ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేయటానికా మీకు అధికారం ఇచ్చింది?
పోలీసులు ధర్మాన్ని కాపాడాలి
రాజకీయ నాయకుల అడుగులకు మడుగులు వద్దవద్దు
వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగవద్దు
భక్తుల మనోభావాలను దెబ్బతీయవద్దు
మమ్మల్ని అవమాన పరిచేలా ఫ్లెక్సీలు పెడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?
శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్నదే ప్రభుత్వం
వైఎస్సార్ కడప జిల్లా:
వైఎస్సార్‌సీపీ నేతల అక్రమ అరెస్టులపై ఫిర్యాదు
- వైఎస్సార్‌సీపీ నాయకుల అక్రమ అరెస్టులకు నిరసనగా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ రెడ్డి మన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు
- వైఎస్సార్‌సీపీ నాయకులను పదజాలాలతో దూషించిన కూటమి నాయకురాలను వెంటనే అరెస్ట్ చేయాలి
ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ రెడ్డి - రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలనలో రావణ కాష్టం జరుగుతున్నది. ఇండ్లను పెట్రొల్ బాంబులతో తగలబెడుతున్నారు
-.ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ రెడ్డి
జోగి రోహిత్ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ
- ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రోహిత్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు
- తమ ఇంటిపై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయడం లేదు
- దీనిని చట్ట విరుద్ధంగా ప్రకటించండి
- ఇంటి వద్ద తగిన భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్‌లో కోరిన రోహిత్
- రోహిత్ పిటిషన్ పై మధ్యాహ్నం విచారణ జరుపనున్న హైకోర్టు
నెల్లూరు:
ఏపి రాష్ట్ర ఇమేజ్‌ను మంటగలిపారు:చంద్రశేఖర్ రెడ్డి
- లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబు జుగుబ్సాకరమైన వ్యాఖ్యలు చేశారు
- చంద్రబాబు, పవన్ చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం నిజం లేదని ఎన్డిడిబీ రిపోర్ట్ ఇచ్చింది
- నేటికి ఆ అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టడానికి ఫ్లెక్స్ లు ఏర్పాటు చేయడం ఎంత వరకు సబబు
- మాజీ మంత్రుల ఇండ్లపై కుటుంబ సభ్యులు లోపల వుండగానే దాడులకు తెగబడ్డారు
నెల్లూరు:
- నెల్లూరు వేదాయపాళెం పోలీస్ స్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
- శ్రీవారి లడ్డూ వ్యవహారంలో అబద్దపు, అభ్యంతకర పోస్టర్లు ఏర్పాటు పై పిర్యాదు
- మాజీ మంత్రి కాకాణి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్, ఆనం విజయకుమార్ ఆధ్వర్యంలో పిర్యాదు
కాకాణి కామెంట్స్
- రాష్ట్రంలో ఆటవిక పాలన రాజ్యం ఏలుతుంది
- సీఎం, డిసిఎం లు శ్రీవారి లడ్డూ పై నిరాధారమైన ఆరోపణలు చేశారు
- ప్రపంచ వ్యాప్తంగా వున్న హిందువుల మనోభావాలు దెబ్బతీశారు
- లడ్డూ వ్యవహారంలో గత ప్రభుత్వం పై నిందలు వేసే ప్రయత్నాలు చేశారు
- విజయవాడ:
మాజీ మంత్రి జోగి రమేష్‌ను కలిసిన ఎమ్మెల్సీ తలశిల రఘురాం - విశాఖ:
తిరుపతి లడ్డుపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ చేసిన తప్పుడు ప్రచారంపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు.. - ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సిపి నాయకులు కేకే రాజు, వరుదు కళ్యాణి, మోల్లి అప్పారావు డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్..
తిరుపతి
- మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గుండాలు దాడి నిరసిస్తూ బాలాజీ కాలనీ పూలే విగ్రహం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బిసి విభాగం ఆధ్వర్యంలో నిరసన
- రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందన్న బిసి నాయకులు
- ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఏపీ రాష్ట్రం లో రాష్ట్రపతి పాలన విధించాలి
-గీత యాదవ్. వైఎస్సార్‌సీపీ,మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
అనంతపురం::
చంద్రబాబు హింసా రాజకీయాలపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులకు నిరసనగా ఆందోళన చేపట్టారు. అనంతపురం జెడ్పీ కార్యాలయంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం అరాచకాలపై నల్ల కండువాలతో నిరసన తెలిపారు వైఎస్సార్‌సీపీ నేతలు. ‘ చంద్రబాబు పాలన.. ఆటవిక రాజ్యం’ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు బీసీ వ్యతిరేకి అంటూ నిరసన వ్యక్తం చేశారు.
మొన్న(శనివారం), నిన్న(ఆదివారం) టీడీపీ గూండాలు రెచ్చిపోయి మరీ విధ్వంసం సృష్టించారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులకు దిగారు. అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేసేందుకు యత్నించారు. ఆ క్రమంలోనే అంబటి రాంబాబు ఇంటిపై రాళ్లు, కర్రలు, రాడ్లతో దాడులకు దిగారు. జోగి రమేష్ ఇంటికి నిప్పుపెట్టారు టీడీపీ గూండాలు. పెట్రోల్ బాంబుతో ఇంటిని ధ్వంసం చేసే యత్నం చేశారు.
రాష్ట్రంలో జంగిల్ రాజ్ విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రశ్నిస్తున్న వారికి సమాధానం చెప్పలేక ఆటవిక పాలనను ఎంచుకున్నారు. తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేయడంలో సీఎం చంద్రబాబుదే తప్పు అన్న విషయం సీబీఐ సిట్ సాక్షిగా బట్టబయలు కావడంతో ప్రజల దృష్టిలో చులకనై, వారి దృష్టి మళ్లించేందుకు వైఎస్సార్ సీపీ నేతలపై దాడులకు తన రౌడీలను పురమాయిస్తున్నారు. శనివారం గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై గూండాల దాడిని మరచిపోక ముందే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిపై విధ్వంసానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పెట్రోల్ బాంబులతో బ్లేడ్, గంజాయి బ్యాచ్, రౌడీషీటర్లు, టీడీపీ మూకలు రమేష్ ఇంటిపై విరుచుపడి విధ్వంసం సృష్టించారు.
వందలాది మంది రౌడీలు విధ్వంసం సృష్టిస్తుంటే నిలువరించాల్సిన పోలీసులు చేష్టలుడిగి చూస్తుండటం విస్తుగొలుపుతోంది. వెళ్లిపోండి.. వెళ్లిపోండి.. అంటూ వారిని బతిమిలాడటం పోలీసు వ్యవస్థ దీన స్థితిని తెలియజేస్తోంది. రాష్ట్రంలో సాగుతున్నది ప్రజాస్వామ్యమా.. లేక ఆటవిక రాజ్యమా అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. పైగా ఈ విధ్వంసకాండను చంద్రబాబు తనయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, సదరు టీడీపీ శ్రేణులు చెప్పుకుంటుండటం దారుణమని, ఇది అత్యంత ప్రమాదకర పరిణామమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బలహీన వర్గాల గొంతు నులిమి రాక్షసానందం పొందుతూ ప్రశ్నించే తత్వాన్ని చంపేయడమే టీడీపీ పెద్దల లక్ష్యమనే భావన అత్యధికుల్లో వ్యక్తం అవుతోంది. దీనిపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏపీలో ఆటవిక రాజ్యం నడుస్తుందని వైఎస్సార్‌సీపీ మండిపడతోంది.


