‘అసలు ఏపీలో పరిపాలన ఉందా... లేదా?’ | YSRCP Leader Tammineni Sitaram Takes On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

‘అసలు ఏపీలో పరిపాలన ఉందా... లేదా?’

Feb 2 2026 12:54 PM | Updated on Feb 2 2026 12:59 PM

YSRCP Leader Tammineni Sitaram Takes On Chandrababu Govt

శ్రీకాకుళం: ఏపీలో ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తుంటే ఆందోళనకరంగా ఉందన్నారు మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారం. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిణామాలు ఇప్పుడే చూస్తున్నానన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా.. లేదా? అని ప్రశ్నించారు. 

‘అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడి దురదృష్టకరం. అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగితే నిందితులపై   జిల్లా ఎస్పీ సైతం కనీస చర్యలు తీసుకోలేదు. ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కోరుతున్నా. రాష్ట్రంలో అరాచకాల్ని రెచ్చగొడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. తిరుమల లడ్డులో కల్తీ లేదు అని సీబీఐ రిపోర్ట్ ఇచ్చింది.. మళ్ళీ దానిపై రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు?, సిబిఐ రిపోర్ట్ మీరు స్వీకరించి ఇప్పటితో ఈ చేష్టలు వదిలేస్తాం అని  చంద్రబాబు అంటే హుందాగా ఉండేది. కోట్లాది మంది ఆరాధ్య దైవం వెంకటేశ్వరస్వామి ప్రసాదంలో కల్తీ జరిగింది అంటే ఎంత దారుణం. ఇది భక్తుల మనోభావాలు దెబ్బతీయడం కాదా?, 

గీతం యూనివర్సిటీ  అక్రమ భూములు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఎంపీ భరత్‌ మళ్ళీ భూ అక్రమణలకు పాల్పడడం ఎంత దారుణం. ప్రజాస్వామ్య వ్యవస్థను పట్టపగలు నిట్ట నిలువునా ఖూనీ చేశారు. చంద్రబాబు నాయుడిది అటవిక పాలన. అమరావతి కోసం లెక్క లేనంత అప్పు చేస్తున్నారు. మీరు చేసిన తప్పులకు తగిన మూల్యం చెల్లిస్తారు. చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్  భజన చెయ్యడానికే టైం సరిపోతుంది. కనీసం తప్పును తప్పు అని చెప్పాలి కదా?। అని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement