‘కూటమి నేతలకు రాజపూజ్యం.. ప్రజలకు అవమానం’ | Varudu Kalyani Fires On Chandrababu Government | Sakshi
Sakshi News home page

‘కూటమి నేతలకు రాజపూజ్యం.. ప్రజలకు అవమానం’

Mar 19 2026 2:56 PM | Updated on Mar 19 2026 3:28 PM

Varudu Kalyani Fires On Chandrababu Government

సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వం అబద్ధాల నక్షత్రంలో వెన్నుపోటు రాశిలో ఏర్పడిందని.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. కూటమి నేతల ఆదాయం పెరిగింది.. పేద ప్రజల ఆదాయం పెరగలేదు. కూటమి మంత్రులకు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు రాజ్యపూజ్యం.. ప్రజలకు అవమానం. నిరుద్యోగులు, రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులను కూటమి మోసం చేసింది’’ అని వరుదు కల్యాణి మండిపడ్డారు.

‘‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో విద్యార్థులకు కాలేజీలు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. రైతులకు పెట్టుబడిసాయం లేదు.. గిట్టుబాటు ధర లేదు. మహిళలకు ఎన్నోహామీలు ఇచ్చి ఒక్కటి అమలు చేయలేదు. మహిళల రక్షణ పూర్తిగా గాలికి వదిలేశారు. ఉద్యోగుల పరిస్థితి కక్కలేక.. మింగలేక అన్నట్టు ఉంది. కూటమి పాలన అత్యంత దారుణంగా ఉంది. ఎన్నికల కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు మోసానికి మరోసారి గురికావద్దని రాష్ట్ర ప్రజలను కోరుతున్నాం’’ అని వరుదు కల్యాణి పేర్కొన్నారు.

ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు: కల్పలతారెడ్డి
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏవర్గం ప్రజలు పండగ చేసుకోలేదని.. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని ప్రభుత్వం అమలు చేయలేదని మండిపడ్డారు. ‘‘ప్రభుత్వ ఉద్యోగులు బకాయిలు విడుదల చేస్తారని ఎదురు చూస్తున్నారు. ఉగాది కాదు దగాదిగా భావిస్తున్నారు. ఈ ఉగాదికి అయినా మేలు జరుగుతుందని ఉద్యోగులు ఆశించారు. పీఆర్సీ, ఐఆర్, డీఏకి సంబంధించిన జీవోలు విడుదల చేస్తారని ఆశించారు. వెయ్యి రూపాయిలు కూడా ప్రభుత్వం వేతనం పెంచలేదు

..అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి చేస్తామని చెప్పారు. మంచి ఐఆర్ అన్నారు, పెండింగ్ బకాయిలు అని ఉద్యోగులను మోసం చేసింది. ఉద్యోగస్తులపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రతి పండగకి ఉద్యోగస్తులు ఎదురుచూస్తున్నారు. పండగ వచ్చి పొతుంది తప్ప ఒక్క మేలు మాత్రం జరగడం లేదు. గతంలో వైఎస్‌ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే 27 శాతం ఐఆర్ ఇచ్చారు. కరోనా సమయంలో 23శాతం పిట్మెంట్ ఇచ్చారు. ఉద్యోగస్తులు రోడ్డెక్కుతున్న కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పీఆర్సీ కమిషన్‌ని నియమించాలని కోరుతున్నా కానీ ప్రభుత్వం స్పందించడం లేదు. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు. పిఆర్సీ కమిషన్‌ని త్వరగా నియమించాలి. పిఆర్సీ ఆలస్యం అయితే ఐఆర్ ప్రకటించాలి. 29 శాతం పిఆర్సీని అమలు చేయాలి. ఉద్యోగస్తులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలి’’ అని కల్పలతారెడ్డి డిమాండ్‌ చేశారు.

అబద్దంలా నక్షత్రం.. వెన్నుపోటు రాశి.. చంద్రబాబుకు వరుదు కళ్యాణి కౌంటర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement