breaking news
AP Politics
-
నాటి చంద్రబాబు పాత్రలో నేడు లోకేష్.. పీఆర్ పీక్స్!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా చక్రం తిప్పుతున్న ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ చేసిన ఒక వ్యాఖ్య ఆసక్తికరంగా ఉంది. ముఖ్యమంత్రి పదవి ఇప్పుడు తన ప్రాధాన్యం కాదని ఆయన చెప్పారు. ప్రజల హృదయాలను గెలుచుకోవాలనే పని చేస్తున్నానని ఆయన అన్నారని ఎల్లో మీడియా అత్యంత ప్రముఖంగా కథనాన్ని ఇచ్చింది. ఇండియా టుడే మీడియా కేరళంలో నిర్వహించిన ఒక సదస్సులో సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ చేసిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు.నిజంగా ఆయన అదే ప్రకారం పనిచేస్తే మంచిదే. కాని ప్రస్తుతం షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్న భావన రాజకీయ వర్గాలలోనే కాకుండా సాధారణ ప్రజలలో కూడా ఏర్పడింది. ముఖ్యమంత్రి పదవిలో లేరన్న మాట మినహాయించి, ప్రభుత్వంలో లోకేష్‌కు తెలియకుండా ఏమి జరగవన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఇది ఏమైనా మంచి పనుల కోసం అయితే ఫర్వాలేదు. పెద్దగా ఎవరూ అభ్యంతరం చెప్పరు. కాని రెడ్‌బుక్ పేరుతో ఏపీలో సాగుతున్న అరాచకాలన్నిటికి ఆయనే బాధ్యుడున్న విమర్శ వైఎస్సార్సీపీతో సహా వివిధ సంఘాలు చేస్తుంటాయి. ఇందులో చాలావరకు నిజం ఉందనిపించేలా ఆయన పార్టీ సమావేశాలలో వైఎస్సార్సీపీ వారిపై తప్పుడు కేసులు పెట్టించడం గురించి రెడ్‌బుక్ పేజీలు అంటూ ప్రసంగిస్తుంటారు.గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలు ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి అని రెచ్చగొట్టేవారు. అధికారంలోకి వచ్చాక టీడీపీవారిపై ఉన్న కేసులన్నీ ఎత్తివేయించే పనిలో ఉన్నారు. ఎక్కడైనా అలా ఎత్తివేయకపోతే డీజీపీని పంపిస్తానని ముఖ్యమంత్రి మాదిరే ప్రకటనలు చేశారు. నిజానికి ఇదంతా సీఎం లేదా, హోం మంత్రి పరిధిలో ఉండే విషయం. అయినా పెత్తనం అంతా లోకేష్‌దే అన్నమాట.ఇక పరిశ్రమల మంత్రి టీజీ భరత్ ఎక్కడ ఉంటారో తెలియదు. కాని మొత్తం ఆ పరిశ్రమకు సంబంధించిన అంశాలన్నిటిపైన నిర్ణయాలు ఈయనే ప్రకటిస్తుంటారు. విదేశాలకు టూర్లు వెళుతుంటారు. క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్లినా పారిశ్రామికవేత్తలతో తాను చర్చలు జరుపుతానని ఆయనే ఈ ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. 99 పైసలకే పరిశ్రమలకు భూములు ఇస్తా.. తన ఇష్టం అన్నట్లుగా కొంతకాలం క్రితం ఆయన మాట్లాడారు. ఆర్థిక శాఖకు సంబంధించి కూడా అదే పరిస్థితి. లోకేష్ పేషీకి తెలియకుండా బిల్లులు పాస్ అవడం అరుదని చెబుతున్నారు.గత టరమ్‌లో టీడీపీ ప్రభుత్వంలో చెట్టు-నీరు స్కీమ్‌లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. స్వయంగా ఆనాటి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వేల కోట్ల అవినీతి టీడీపీ ప్రభుత్వంలో జరిగిందని చెప్పేవారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేసింది. దాని ప్రకారం కొందరి బిల్లులు నిలిచిపోయాయి. ఈసారి టీడీపీ ప్రభుత్వం రావడంతో ఆ బిల్లులన్నీ క్లియర్ చేసుకుంటున్నారట. లోకేష్ ఏ బిల్లుల గురించి చెప్పారో కాని, ఒక పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. తాము ఇప్పటికే చాలావరకు బిల్లులు క్లియర్ చేశామని, మరో 200 కోట్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. ఈ సందర్భంలో ఆర్దిక మంత్రి ప్రస్తావనను తెచ్చినప్పటికి అది నామమాత్రమే అన్నది తెలుస్తూనే ఉంది.ప్రభుత్వ విషయాలలోనే కాదు.. పార్టీ వర్కింగ్ అధ్యక్షుడి హోదాలో కూడా ఆయనే కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేనకు 15 శాతం సీట్లే ఇస్తామని స్పష్టం చేసింది కూడా ఆయనే. ఒకవైపు పార్టీపరంగా సమావేశాలు నిర్వహిస్తూ, మరో వైపు ప్రభుత్వంలో చక్రం తిప్పుతూ, ఇంకో వైపు తన ఇమేజీని పెంచుకోవడం కోసం ఎల్లో మీడియాను, ఐటీడీపీ తదితర సోషల్ మీడియాను కూడా వాడుకుంటున్నారు.సాధారణంగా దేశస్థాయిలో జరిగే సదస్సులకు చంద్రబాబే వెళుతుండేవారు. కాని ఈ మధ్యకాలంలో ఢిల్లీ, లేదా ముంబై తదితర నగరాలలో జాతీయ మీడియా సంస్థలు నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమాలకు లోకేషే హాజరవుతున్నారు. ఆయా సభలలో లోకేష్, చంద్రబాబులు పరస్పరం పొగుడుకోవడం, తండ్రికి బహిరంగ కార్యక్రమాలలో పాదాభివందనం చేస్తున్న ఘట్టాలు అందరు గమనిస్తున్నవే. ఇదంతా పీఆర్లో భాగమేనని వేరే చెప్పనవసరం లేదు.ఇదీ చదవండి: యూసీసీపై అమిత్ షా ప్రకటన.. టీడీపీకి సంకటమేనా?కాగా, డీఎస్సీకి సంబంధించి అడిగిన ప్రశ్నలకు యధా ప్రకారం తండ్రి మాదిరి అసత్యాలు చెప్పడానికి ఆయన పెద్దగా ఫీల్ అవలేదు. ఎన్నికల కమిషన్‌పై వచ్చిన విమర్శలకు కూడా ఆయన ఇచ్చిన జవాబు తన తండ్రికే వర్తిస్తుందన్న సంగతి ఆయన గమనించనట్లే వ్యవహరించారు. గతంలో ఓటమి ఎదురైనప్పుడు ఈసీపై చంద్రబాబు ఎన్ని విమర్శలు చేసింది తెలిసిందే. ఈ సంగతి పక్కన పెడితే తనకు సీఎం పదవి ఇప్పుడు ప్రాధాన్యం కాదని ఆయన చెప్పడాన్ని ఎవరూ నమ్మడం లేదు. ఎందుకంటే సీఎం పదవిలో లేరన్నమాటే కాని, మొత్తం అధికారం అంతా ఆయన చేతిలోనే ఉందని చాలామంది నమ్ముతున్నారు. అందుకే ఆయన ఆఫీస్ వద్దే జనం ఎక్కువగా కనిపిస్తారట.2014 టరమ్‌లో లోకేష్ ఎన్నికలలో పోటీచేయలేదు. కాని పార్టీ అధికారంలోకి రావడంతో కొంతకాలానికి చంద్రబాబుపై కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చి లోకేష్‌ను ఎమ్మెల్సీ చేసి, ఆ తర్వాత మంత్రిగా చేయించారని అంటారు. అప్పట్లో షాడో ముఖ్యమంత్రి అన్న విమర్శ రాలేదు. ఆ తర్వాత విపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ సొంతంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టి జనంలో తిరగడానికి కృషి చేశారు. వాటిలో యువగళం ఒకటి.2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక మాత్రం చంద్రబాబు ప్రధానంగా పర్యటనలు, ఉపన్యాసాలకే పరిమితం అవుతుంటే, లోకేష్ కథ నడుపుతున్నారని టీడీపీ వర్గాలు చెప్పుకుంటాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ మీడియా చంద్రబాబుతో దాదాపు సమానంగా సానుకూల కథనాలు అనండి.. భజన స్టోరీలు అనండి.. నిత్యం ఇస్తుంటాయి. లోకేష్‌ను సీఎం చేయాలన్న వాదన కుటుంబంలోను, ఆయన మద్దతుదారులలో బలంగా ఉన్నప్పటికి, వివిధ కారణాల రీత్యా అది జరగడం లేదన్న అభిప్రాయం ఉంది.ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు కూడా పూర్తి స్థాయిలో ఇందుకు సానుకూలత వ్యక్తం చేయవలసి ఉందని అంటారు. అందుకే పవన్ కళ్యాణ్‌ను అన్న అని లోకేష్ సంభోధించడమే కాక, సభలలో వారిద్దరి మధ్య ఎంతో సన్నిహిత సంబంధం ఉందన్న పిక్చర్ ఇవ్వడానికి యత్నిస్తున్నారు. పవన్ ఈయనను ఓరే అన్నంత చనువు ఉన్నంతగా ఆ మధ్య చెప్పారు. కాని పవన్ అసలు ఎవరిని ఓరేయ్, అరేయ్ అనరని ఆయన మద్దతుదారులు చెబుతూ లోకేష్ వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అది వేరే కథ. బహుశా తను సీఎం పదవి తీసుకున్నా పవన్ సహకారం అవసరమన్న భావనతో ఆయనతో సలహా, సంప్రదింపులు జరుగుతున్నాయన్న అభిప్రాయం కల్పించడం లోకేష్ లక్ష్యం కావచ్చు. కాని, పవన్‌కు తెలియకుండానే ప్రభుత్వంలోని అనేక విషయాలు జరుగుతుంటాయి. డీఎస్సీకి అక్రమాల ఆరోపణలపై పవన్ ఇంతవరకు ప్రత్యక్షంగా లోకేష్‌కు మద్దతుగా ఖండన ఇవ్వకపోవడం కూడా గమనించదగిందే.ఇక్కడ మరో విషయం గుర్తు చేయాలి. 2024 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి పదవిని రెండేళ్లపాటు పవన్ కళ్యాణ్‌కు కూడా ఇవ్వాలని జనసేనలో కొందరు ప్రచారం చేశారు. కాని మొహమాటం లేకుండా అది కుదిరే పని కాదని లోకేష్ మీడియా ముందు ఆ రోజుల్లోనే కుండబద్దలు కొట్టారు. బహుశా ఆ అవకాశం పవన్‌కు వస్తే తన భవిష్యత్తుకు అడ్డంకి అవుతుందని అనుకొని ఉండవచ్చు. అంతేకాక పవన్‌కు డిప్యూటి సీఎం పదవిపై కూడా టీడీపీ పాలిట్ బ్యూరో నిర్ణయిస్తుందని చెప్పి షాక్ ఇచ్చారు. అయినా పవన్ దానిపై పెద్దగా ఫీల్ కాకుండా సర్దుకుపోయారు. ఇప్పుడు పవన్ ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో బయటపడడం లేదు. లోకేష్ తనకు సీఎం పదవి ప్రాధాన్యం కాదని అన్నారే తప్ప, ఈ టరమ్ అంతా చంద్రబాబే సీఎంగా ఉంటారని, వచ్చే ఎన్నికలలో సీఎం అభ్యర్ధి కూడా ఆయనే అని లోకేష్ స్పష్టంగా చెప్పకపోవడం గమనించదగ్గ అంశమే.2029 ఎన్నికలలో లోకేష్‌నే సీఎం అభ్యర్ధిగా ఫోకస్ చేస్తారా? లేదా? అన్నది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కొంతకాలం క్రితం లోకేష్ సీఎం కాబోతున్నారంటూ టీడీపీ వర్గాలు ప్రచారం చేశాయి. కాని అది జరగలేదు. ఉమ్మడి ఏపీ, విభజిత ఏపీలలో ఒక వైఎస్ జగన్ తప్ప మరే సీఎం కుమారుడు, లేదా కుమార్తె ముఖ్యమంత్రులు కాలేకపోయారు. ఇప్పుడు ఆ అవకాశం కోసం లోకేష్ ఎదురుచూస్తుండవచ్చు.1986 ప్రాంతంలో ఎన్టీఆర్ తన కుమారుడు బాలకృష్ణను వారసుడుగా ప్రకటించారు. ఆ వెంటనే చంద్రబాబు జోక్యం చేసుకుని వారసత్వ, కుటుంబ రాజకీయాల వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని చెప్పి ఆ ప్రకటనను ఉపసంహరింప చేశారు. 2009లో జూనియర్ ఎన్టీఆర్‌ను ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు. కాని ఆ తర్వాత అతనిలో ఉన్న పొటెన్షియాల్టిని గమనించి, లోకేష్ భవిష్యత్తుకు ఆటంకం అవుతాడని సందేహించి ఆయనను పక్కన పెట్టేశారని చెబుతారు. ఒకప్పుడు ఎన్టీఆర్ వద్ద కర్షక పరిషత్ చైర్మన్‌గా ఉంటూ టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు చక్రం తిప్పారు. ఇప్పుడు లోకేష్ ఆ పాత్ర పోషిస్తున్నారు.లోకేష్ తన కుమారుడు కనుక వారసత్వ, కుటుంబ రాజకీయాల సమస్య, విమర్శలు రావని చంద్రబాబు భావిస్తుండవచ్చు. అందుకే పార్టీలోను, ప్రజలలోను లోకేష్ పట్ల సానుకూలత పెంచేందుకు వివిధ ప్లాన్లు అమలు చేసున్నారనుకోవచ్చు. కాలచక్రం అలా ఉంటుందన్నమాట. కాకపోతే లోకేష్ పాజిటివ్ కోణం కన్నా, నెగిటివ్ ధోరణిలోనే ఎక్కువగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. లోకేష్ కోరిక ఈ టరమ్‌లో తీరుతుందా? లేదా? అన్నది చూడాల్సిందే. మనసులో ఎంత బలమైన కోర్కె ఉన్నా కొంత కాలం అణచుకోక తప్పదు కదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పక్షపాతం చూపితే ప్రశ్నిస్తాం.. కాకాణి హెచ్చరిక
సాక్షి, నెల్లూరు జిల్లా: మనుబోలులో 19 గ్రామపంచాయతీల వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. కాకాణి పూజిత సమావేశానికి హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై పార్టీ శ్రేణులకు కాకాణి దిశానిర్దేశం చేశారు. స్థానిక సమస్యల పరిష్కారంపై నేతలు, కార్యకర్తల నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు.ఈ సందర్భంగా కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ.. నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని కాకాణి మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్సార్సీపీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా అడ్డుకోవద్దని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకునే ప్రయత్నాలు చేయొద్దని అధికారులను కాకాణి కోరారు.పోలీస్, రెవెన్యూ, ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని డిమాండ్ చేసిన కాకాణి.. అధికారులు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తే చట్టపరంగా ప్రశ్నిస్తామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీకి చట్టబద్ధంగా రావాల్సిన హక్కులు, పారదర్శక సేవలు అందించాల్సిందేనని కాకాణి స్పష్టం చేశారు.ఇదీ చదవండి: టీడీపీ నేతల నుంచి నాకు ప్రాణహాని ఉంది: కేతిరెడ్డి -
జనసేన ఎమ్మెల్యేలపై చంద్రబాబు అసంతృప్తి!
పశ్చిమ గోదావరి జిల్లా కూటమిలో రెండేళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బాహాటంగానే రచ్చకెక్కుతున్నాయి. నియోజకవర్గాల్లో ఆధిపత్యం, ప్రోటోకాల్ వివాదాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు ఈ విభేదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.సాక్షి, భీమవరం: జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి ఒప్పందంలో భాగంగా టీడీపీ నాలుగు, జనసేన మూడు స్థానాల్లో గెలుపొందగా, నరసాపురం ఎంపీ స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది. అయితే జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ టీడీపీ నేతల హవానే నడుస్తోందని జనసేన శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్యేలకు పోటీగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేయడం, ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించడం ఘర్షణ వాతావరణానికి దారితీస్తోంది. మరోవైపు, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకొల్లు, ఆచంట, ఉండి, తణుకు నియోజకవర్గాల్లో తమకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని జనసేన, బీజేపీ కేడర్ నిరాశతో ఉంది. తాడేపల్లిగూడెంలో రాజీనామా సవాల్ తాడేపల్లిగూడెంలో జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జి మధ్య విభేదాలు ఇప్పటికే భగ్గుమన్నాయి. ఇటీవల ఒక కార్యక్రమంలో బాబ్జి మాట్లాడుతూ వార్డుల్లో ఎక్కడకు వెళ్లినా రోడ్లు లేవంటున్నారని, దోమల సమస్య చెబుతున్నారని చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బొలిశెట్టి స్పందించారు. ఎమ్మెల్యే పనిచేయడం లేదని ఎవరితోనైనా అనిపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ చేశారు. తాను వచ్చాక ఎన్ని కోట్లు రూపాయల వర్కులు జరిగింది? ఎన్ని రోడ్లు వేసింది? ఎన్ని డ్రెయిన్లు, ఎన్ని ఫిల్టర్ బెడ్లు కట్టింది? చరిత్ర చెబుతుందన్నారు. పదేపదే ప్రొటోకాల్‌కు విరుద్ధంగా ఇష్టానుసారం చేస్తామంటే చూస్తు ఊరుకోన్నారు. లోకల్ ఎలక్షన్స్‌లో జనసేన గెలిచే స్థానాలను ఎవరి కోసం త్యాగం చేసేది లేదని ఎమ్మెల్యే బొలిశెట్టి స్పష్టం చేశారు. నరసాపురంలో బాహాటంగానే విమర్శలు‘ఎమ్మెల్యే గారు.. మీరు, మీ నియోజకవర్గం ఆఫీసర్లు సరిగా పనిచేయడం లేదు. అన్నిట్లో మైనస్ ఉన్నారు’ అంటూ ఇటీవల ప్రజావేదిక సభలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నరసాపురం కూటమిలో నిప్పు రాజేశాయి. చంద్రబాబు కావాలనే తమ పార్టీ ఎమ్మెల్యేను జనంలో చులకన చేశారని జనసేన కేడర్ మండిపడింది. టీడీపీ, తన సామాజికవర్గం ఎమ్మెల్యేలపై ఎక్కడైనా ఈవిధంగా బహిరంగ రివ్వూ ఇచ్చారా? కనీసం మీ మీద గానీ, ప్రభుత్వంపై గాని రివ్యూ చేసుకున్నారా? మహిళలకు నెలకు రూ. 1500 ఇచ్చారా? నిరుద్యోగభృతి ఇచ్చారా? రెండేళ్లయినా కొత్త పింఛన్లు, హౌసింగ్ లోన్లు లేవు. ప్రజల్లో తల ఎత్తుకోలేకున్నాం. పథకాలేవని అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నామంటూ విమర్శలు గుప్పించారు. నిధులివ్వకుండా నిందలేమిటి చంద్రబాబు? అంటూ ఎమ్మెల్యే నాయకర్ పేరిట ఒక కరపత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది’ -
తాటతీస్తా.. టీడీపీ నేతకు కొలికపూడి వార్నింగ్
ఎన్టీఆర్ జిల్లా: తనపై అసత్య ఆరోపణలు చేస్తూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంపై ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తిరువూరులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై సామాజిక మాధ్యమాల్లో నిరాధారమైన ప్రచారాలు చేస్తున్న వారిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆరోపణలు నిరూపిస్తే తలదించుకుంటానని, లేదంటే ఆరోపించిన వ్యక్తులు క్షమాపణ చెప్పాలని కొలికపూడి హెచ్చరించారు. తనపై చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు చూపించాలని, తాను టీచర్‌ను తిట్టినట్టు, కొట్టినట్టు ఏవైనా సాక్ష్యాధారాలుంటే బయట పెట్టాలని కోటయ్యకు సవాల్ చేశారు. తిరువూరు నియోజకవర్గంలో రెండేళ్లుగా బాలకోటయ్య ఇష్టానుసారం మాట్లాడుతూ అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, ఇకపై ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఉపేక్షించే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బురద చల్లితే తుడుచుకోడానికి సిద్ధంగా లేమని, తప్పుడు ఆరోపణలు చేస్తే తాట తీస్తామని, చెప్పులు కుట్టడమే కాదు, చరిత్ర రాయడం, చరిత్రను మార్చడం కూడా తమకు తెలుసని కొలికపూడి హెచ్చరించారు. -
రూ.9 లక్షల డొల్ల కంపెనీకి రూ.1400 కోట్ల ప్రాజెక్టా?: పుత్తా శివశంకర్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు నేతృత్వంలోని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో తమ అనుయాయులకు, బినామీ కంపెనీలకు అడ్డగోలుగా వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఇవ్వడమే కాకుండా, పలు రాయితీల రూపంలో వందల కోట్లు దోచిపెడుతోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు.గతంలో విశాఖపట్నంలో ఉర్సా లాంటి డొల్ల కంపెనీకి రూపాయికే ఎకరం చొప్పున భూములు కట్టబెట్టిన తరహాలోనే, ఇప్పుడు రాయలసీమలోని చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలో ‘రావోక్స్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట మరో భారీ దోపిడీకి తెర లేపారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆక్షేపించారు. ప్రెస్మీట్లో పుత్తా శివశంకర్ ఇంకా ఏం మాట్లాడారంటే..:బినామీ సంస్థలకు ప్రజా ఆస్తులు:ఏర్పాటై ఏడాది కూడా పూర్తి కాని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎలాంటి అనుభవం లేని, కేవలం రూ.9 లక్షల పెయిడ్ అప్ క్యాపిటల్‌తో రిజిస్టర్ అయిన సంస్థకు ఏకంగా రూ.1388.14 కోట్ల ప్రాజెక్టు ఆపాదించారు. ‘రావోక్స్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థకు ఏపీఐఐసీకి చెందిన విలువైన 40.50 ఎకరాల భూమితో పాటు, రూ.592.22 కోట్ల మేర టైలర్ మేడ్ ఇన్సెంటివ్‌లను జీవో ఎంఎస్ 259 ద్వారా ధారాదత్తం చేశారు. అలా తమ వారి లబ్ధి కోసం నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే బినామీ సంస్థలకు ప్రజల ఆస్తులను యథేచ్ఛగా దోచిపెడుతున్నారు.రూ.9 లక్షల కంపెనీకి రూ.1400 కోట్ల పెట్టుబడి సామర్థ్యం ఎక్కడిది?:గత ఏడాది నవంబరు 20న ప్రారంభమైన రావోక్స్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పెయిడ్ అప్ క్యాపిటల్ కేవలం రూ. 9 లక్షలు మాత్రమేనని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ) రికార్డులే చెబుతున్నాయి. కనీసం రూ.2.5 లక్షల రుణం పొందే అర్హత కూడా లేని ఈ పసిగుడ్డు కంపెనీ ఏకంగా రూ.1388.14 కోట్ల పెట్టుబడి పెడుతుందంటే ఎవరైనా నమ్ముతారా? అసలు ఈ కంపెనీ వెనుక ఉండి నల్లధనాన్ని పెట్టుబడిగా పెడుతున్న బడా బాబులు ఎవరు? కేవలం పేపర్ మీద కంపెనీ పెట్టి, ప్రభుత్వ భూములు చేజిక్కించుకుని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి పారిపోయే కుట్ర కాదా ఇది?సర్జికల్ గ్లౌజులు చేసే వారికి ఆ అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది?:ఈ సంస్థ డైరెక్టర్లకు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కనీస అనుభవం ఉందా? వీరికున్న మరో కంపెనీ ఈజిస్ గ్లోవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం ఏఎంటీజెడ్‌లో సర్జికల్ హ్యాండ్ గ్లౌజులు తయారు చేస్తుంది. గ్లౌజులు తయారు చేసే వారికి, టమోటా, మామిడి ప్రాసెసింగ్ చేసే అనుభవం ఎలా ఆపాదించారు? పైగా వీళ్ల అనుబంధ సంస్థ ’దిసూత్ర ల్యాబ్స్’ను, ఈ ఏడాది ఏప్రిల్‌లో కేవలం రూ.10 వేల పెట్టుబడితో ప్రారంభించారు.జీవోకు ముందే రూ.1090 కోట్ల మెషినరీ ఆర్డర్లు ఎలా ఇచ్చారు?:ఈ కంపెనీకి భూకేటాయింపునకు సంబంధించిన ఆదేశాలు గత నెల జారీ అయ్యాయి. ఆ మేరకు జీఓ ఎంఎస్ నెం:259ని సెప్టెంబరు 25న జారీ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదన తొలుత సెప్టెంబరు 7న జరిగిన ఎస్ఐపీసీ (స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ) సమావేశంలోనూ, ఆ తర్వాత 11 రోజుల అనంతరం, సెప్టెంబరు 18న జరిగిన ఎస్ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు) సమావేశంలో వచ్చింది. కాగా, అప్పటికే దాదాపు రెండు నెలల ముందే జూలై 1 నాటికే ఆ సంస్థ రూ.1090 కోట్ల విలువైన ప్లాంట్ అండ్ మిషనరీ ఆర్డర్ ప్లేస్ చేసింది! నిజంగా ఆ కంపెనీకి అంత ఆర్థిక స్థోమత ఉందా? అదే నిజమైతే అంత తక్కువ మూలధన పెట్టుబడి మాత్రమే పెడతారా? లేక ఇదంతా ముందస్తు కుమ్మక్కు కాదా?రూ.592 కోట్ల ఇన్సెంటివ్ ఎవరి జేబుల్లోకి?:రూ.1388 కోట్ల ప్రాజెక్టు విలువలో ఏకంగా 46.61 శాతం, అంటే రూ.592.22 కోట్లను టైలర్ మేడ్ ఇన్సెంటివ్లుగా ప్రకటించడం విడ్డూరం కాదా? కేవలం రూ.9 లక్షల మూలధన పెట్టుబడి ఉన్న కంపెనీకి రూ.592 కోట్ల ఇన్సెంటివ్‌లు ఇవ్వడం దేశ చరిత్రలోనే ఎక్కడైనా ఉందా?. ఇలా 40.50 ఎకరాల భూమి ఉచితంగా ఇవ్వడమే కాకుండా, వివిధ రూపాల్లో మరో రూ.592 కోట్లు ప్రభుత్వం నుంచే దోచి పెడుతుంటే ఇది బినామీ దందా కాక మరేమిటని పుత్తా శివశంకర్ నిలదీశారు.ఇదీ చదవండి: చంద్రబాబూ.. మీ డ్రామాలు, బిల్డప్‌లు కట్టిపెట్టండి: వైఎస్ జగన్ -
యూసీసీపై అమిత్ షా ప్రకటన.. టీడీపీకి సంకటమేనా?
దేశంలోని ఎన్డీఏ రాష్ట్రాలలో ఉమ్మడి పౌర స్మృతి(యూనిఫాం సివిల్ కోడ్)ని అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించడం కొత్త వివాదం అవుతుందా? అన్న చర్చ జరుగుతోంది. ఎన్డీఏలో భాగస్వామి అయిన జేడీ(యు) ఈ ప్రతిపాదనకు ఓకే చేస్తున్నా, బిహారులో మాత్రం అమలు చేయరాదని డిమాండ్ చేస్తోంది. అలాగే మరికొన్ని ఎన్డీఏ పక్షాలు కూడా ఈ ప్రతిపాదనపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి. అమిత్ షా ప్రకటనతో ఇబ్బందిలో పడిన తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ విషయంలో కూడా యూటర్న్ తీసుకోవడానికే సిద్దపడుతున్నట్లు కనబడుతోంది.ఒకప్పుడు తలాఖ్ చట్టాన్నే వ్యతిరేకించిన టీడీపీ, ఇప్పుడు యూసీసీకి మద్దతు ఇవ్వాలని అభిప్రాయపడుతోంది. ముఖ్యమంత్రి, టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు దీనిపై నేరుగా వ్యాఖ్య చేయనప్పటికీ , ఆ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చాలా స్పష్టంగా అమిత్ షా ప్రకటన మేరకు నడుచుకుంటామని తెలిపారు. నిజానికి దేశం అంతటికి కలిపి పార్లమెంటులో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) బిల్లు పెట్టవలసి ఉంటుంది. కాని బీజేపీ అందుకు సిద్దపడడం లేదు. రాష్ట్రాలవారీగా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఈ విధానం అమలు చేయాలని భావిస్తున్నట్లు ఉంది.ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయడంలో తప్పేముంది? దేశంలో ఉన్న పౌరులందరికి సమానమైన నియమ, నిబంధనలు పెట్టడం మంచిదే కదా అన్న అభిప్రాయం కలగడం సహజమే. ప్రత్యేకించి వ్యక్తిగత విషయాలైన పెళ్లి, విడాకులు, ఆస్తుల వారసత్వం తదితర అంశాలలో యూసీసీ తీసుకువస్తామని భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో చెబుతోంది. 2014 నుంచి బీజేపీ పూర్తి మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చాక కూడా వివిధ కారణాలతో ఈ ప్రతిపాదనను అమలు చేయలేకపోయింది. అయితే గత ఏడాది ఉత్తరాఖండ్‌లోని బీజేపీ ప్రభుత్వం ఈ యూసీసీని అమలు చేయడం ఆరంభించింది. ఇందులో ఉన్న అంశాలలో ప్రజలకు మేలు చేసేవి అయితే స్వాగతించవలసిందే. ఉదాహరణకు ఆయా విషయాలలో అన్ని మతాలలోని మహిళలకు సమానత్వం కల్పించడం మంచిదే. కాని ఇది అన్ని మతాలలో ఒకే విధంగా ఉండాలి. కేవలం ఒక మతాన్ని ఉద్దేశించి ఈ చట్టం తెస్తున్నారన్న భావన కలగనివ్వరాదు.బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం సీఎఎ, త్రిబుల్ తలాఖ్ తదితర చట్టాలను తెచ్చినప్పుడు పెద్దగా ఇబ్బంది రాలేదు. ప్రత్యేకించి త్రిబుల్ తలాఖ్ విధానాన్ని రద్దు చేయడం ద్వారా ముస్లిం మహిళలకు మేలు జరుగుతుందని చాలామంది భావించారు. కాని ముస్లిం సమాజంలో కొంతమంది వ్యతిరేకించారు. బీజేపీ హిందూ మతాన్ని ఏకీకృతం చేయడం ద్వారా రాజకీయ లబ్ది పొందడానికి ప్రయత్నిస్తోందన్నది కాంగ్రెస్ తో సహా వివిధ పక్షాల విమర్శ. అయినప్పటికీ, బీజేపీ చిత్తశుద్దితో అందరిని సమానంగా చూసే చట్టాలు తెస్తే తప్పు లేదు. కాని అనేక మతపరమైన విషయాలలో బీజేపీ అనుసరిస్తున్న విధానం అంత సమర్ధనీయంగా లేదన్నది బుద్దిజీవుల భావన.గోవాలో అమలు చేస్తున్న యూసీసీపై పలువురు తమ అసమ్మతి తెలియచేస్తున్నారు. అందులో పురుషాధిక్యతను చాటే విధంగా నిబంధనలు రూపొందించారన్నది ఆరోపణ. అలాగే వివిధ మతాలలో కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. వాటిని గౌరవించకపోతే సమాజంలో అశాంతి ప్రబలే ప్రమాదం ఉంటుంది. అన్ని మతాలవారిని ఒప్పించి ఇలాంటివాటిని తేగలిగితే బాగుంటుంది. కాని అది అంత తేలిక కాదు. ఉత్తరాఖండ్ తర్వాత గుజరాత్ చేసిన యూసీసీ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో ఈ యూసీసీని అమలు చేస్తారా? అన్నది చర్చనీయాంశం అవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక దానిని అమలు చేయరు.పైగా మైనార్టీలు అధికంగా ఉన్న ఈ రాష్ట్రంలో వారి మనోభావాలు దెబ్బతింటాయని కాంగ్రెస్ భావిస్తుంది. వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా అదే పరిస్థితి కొనసాగవచ్చు. బీజేపీ కనుక పవర్లోకి వస్తే అప్పుడు యూసీసీ అమలు ప్రతిపాదన ముందుకు రావచ్చు. అయితే అంతకుముందు ఎన్నికల మానిఫెస్టోలో ఈ అంశం చేర్చుతారా? లేదా? అన్నది చెప్పలేం.ఇక ఏపీలో మాత్రం కూటమి ప్రభుత్వానికి ఈ అంశం ఇబ్బంది కలిగించేదే. బీజేపీతో స్నేహం తప్పనిసరి కనుక కేంద్రంలోని ఆ పార్టీ నాయకత్వం చెప్పినట్లు తెలుగుదేశం, జనసేన కూడా వినకతప్పదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఈ విషయంలో పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆయన గత ఐదేళ్లుగా బీజేపీ విధానాలకు వంతపాడుతున్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎటువచ్చి తెలుగుదేశం పార్టీకే కొంత సమస్య అవుతుంది. ఒకప్పుడు ఈ విషయంలో బీజేపీపై ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ తెచ్చిన త్రిబుల్ తలాఖ్ చట్టాన్నే ఈయన వ్యతిరేకించారు. 2019లో బీజేపీ మళ్లీ గెలిస్తే ముస్లింలకు రక్షణ ఉండదని విమర్శించేవారు. కాని ఆ తర్వాత పరిణామాలలో 2024లో అధికారంలోకి రావడానికి బిజెపి అవసరం తప్పనిసరి అని గుర్తించి మెల్లగా ప్లాన్ మార్చేసుకున్నారు. ఎలాగైతేనేం మళ్లీ అధికారంలోకి రాగలిగారు. తదుపరి ప్రధాని మోదీని విపరీతంగా పొగడడం ఆరంభించారు. బీజేపీకన్నా తాము మతవాదంలో తక్కువేం కాదన్న చందంగా వ్యవహరించడం ఆరంభించారు.ఇదీ చదవండి: బాబు ‘బీసీ’ బిల్డప్.. కోర్టు తీర్పుతో అట్టర్ ఫ్లాప్!గతంలో బీజేపీతో పొత్తు ఉన్నా, ముస్లింల హక్కులకు భంగం కలిగితే ఒప్పుకోబోమని అనేవారు. కాని ఇప్పుడు ఆ మాట కూడా అనలేని పరిస్థితి ఏర్పడినట్లు ఉంది. యూసీసీని అంగీకరించబోమని గతంలో చంద్రబాబు అన్నారు. కాని పల్లా శ్రీనివాసరావు ప్రస్తుతం అమిత్ షా ప్రకటనను సమర్ధించడంతో టీడీపీ యూటర్న్ తీసుకున్నట్లయింది. దేశ సమైక్యతకోసం యూసీసీని బలపరుస్తామని ఆయన అన్నారు. మరి గతంలో ఎందుకు వ్యతిరేకించారో చెప్పలేదు. దీనిని బట్టి తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాలలో ఎంత బలహీనంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. బిహార్ వంటి రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన జేడీయు, లోక్ జనశక్తి పార్టీలోని రెండు వర్గాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. కాని టీడీపీ ఏపీ అధ్యక్షుడు మాత్రం పూర్తిగా సరెండర్ అయిపోయిన విధంగా మద్దతు ప్రకటించారు. టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ప్రస్తుతానికి దీనిపై చర్చ జరగలేదని అన్నారు.వివిధ రాష్ట్రాలలో పలు రకాలు సంస్కృతులు ఉంటాయి. అలాగే ఆచారాలు ఉంటాయి. మతాలలోని అనాచారాలను సంస్కరించడం, మహిళలకు సమాన గౌరవం ఇవ్వడం వంటివి చేయడం స్వాగతించదగినవే. కాని బీజేపీ అధినేతలు ఆయా సందర్భాలలో మతాన్ని తమ రాజకీయం కోసం వాడుకుంటున్నారన్న విమర్శ ఎక్కువగా ఉంది. చివరికి ప్రధాని సైతం మత ఆధారిత ప్రసంగాలు చేస్తుంటారు. అందువల్లే వారి చిత్తశుద్దిపై సందేహాలు వస్తున్నాయి. కాకపోతే టీడీపీ వంటి పార్టీలు యూటర్న్ తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు ఏపీలో ఈ ప్రతిపాదన అమలు చేస్తారో చెప్పలేం కాని, అదే జరిగితే, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చిత్రమైన పరిస్థితిని ఎదుర్కుంటారు. ఏపీలో యూనిఫాం సివిల్ కోడ్ అమలు జరిగి, తెలంగాణలో అమలు కాకపోతే ఒక విభిన్నమైన వాతావరణం ఏర్పడుతుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబు ‘బీసీ’ బిల్డప్.. కోర్టు తీర్పుతో అట్టర్ ఫ్లాప్!
అది మోసమని తెలుసు.. ప్రజలను మభ్య పెట్టడమని తెలుసు.. అయినా ఎందుకు కావాలని ప్రభుత్వంలోని వారు ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తుంటారు? అదే రాజకీయం అన్నమాట. ఇలాంటి విషయాలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం డాక్టరేట్ సాధించిందని ఒప్పుకోవచ్చు.దేశంలో రిజర్వేషన్లకు సంబంధించి సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు అందరికి తెలుసు. దాని ప్రకారం ఏభై శాతం మించితే అవి చెల్లవు. అయినా ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం స్థానిక ఎన్నికలలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ చెల్లని జీఓ ఒకటి ఇచ్చేసింది. ఆ తర్వాత టీడీపీ క్యాడర్ చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం వంటివి చేసేశారు. ఎన్నికల మానిఫెస్టోలో చెప్పినట్లు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని గొప్పలు పోయారు. జయహో బీసీ అంటూ ఊదరగొట్టారు. కాస్త బుద్ది జీవులు కాని, బీసీ సంఘాలవారు కాని ఇదేమి మోసం అని విస్తుపోయారు.ఏభై ఏళ్ల రాజకీయ సీనియర్ని అని చెప్పుకునే చంద్రబాబు మరీ ఇంత ఓపెన్‌గా ప్రజలను తప్పుదారి పట్టించవచ్చా అని వారు బాధపడ్డారు. కాని చంద్రబాబు స్టైలే అది కదా అని అనుకున్నారు. ఈ జీఓలపై కొందరు హైకోర్టుకు వెళ్లారు. ఈ రిజర్వేషన్ల జీఓలు చెల్లవని హైకోర్టు కొట్టివేసింది. ఏభై శాతం మించిన రిజర్వేషన్లను ఎలా సమర్ధించుకుంటారని హైకోర్టు ప్రశ్నిస్తే సరైన సమాధానం ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. రాజివ్ రంజన్ కమిషన్ నివేదిక పరిశీలనలో ఉందని చెబుతున్నారని, అలాంటప్పుడు ఆ నివేదిక ఆధారంగా బీసీలకు 34 శాతం రిజర్వేష్లు ఎలా ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించడంతో ప్రభుత్వ డొల్లతనం బయటపడింది. పంచాయతీరాజ్ చట్టంలోనే వెసులుబాటు ఉందంటూ కొత్త వాదన తెచ్చి బీసీ వర్గాలను మాయచేయాలని కూడా అనుకున్నారు. ఎల్లో మీడియాలో బీసీలకు రిజర్వేషన్లు పెంచేసినట్లుగా హోరెత్తించారు. ఇవన్ని ఉట్టిదేనని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో స్పష్టమైంది. దాంతో చంద్రబాబు ప్రభుత్వం బీసీలను మాయ చేయడానికి డ్రామా ఆడిందన్న విషయం బట్టబయలైంది.నిజానికి చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే బీసీలకు కచ్చితంగా 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న నిజాయితీ ఉంటే, పార్లమెంటులో సంబంధిత చట్టం తీసుకురావడానికి కృషి చేసి ఉండాల్సింది. కేంద్రంలో టీడీపీ ఎంపీల బలంతోనే ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తున్న నేపథ్యంలో ఈ ప్రయత్నం ఎందుకు చేయలేదన్న ప్రశ్న వస్తుంది. ఇది బీసీలను వంచించడం కాదా అని ఆయా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. నిజానికి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి గత జగన్ ప్రభుత్వం కూడా జీఓ ద్వారా యత్నించింది. దానిపై బిర్రు ప్రతాపరెడ్డి అనే టీడీపీ నాయకుడు హైకోర్టుకు వెళ్లారు. దాంతో జీఓలను అప్పట్లో న్యాయ స్థానం కొట్టేసింది. ఆ మీదట ఏభై శాతం మించకుండా చట్టప్రకారం సుమారు 24 శాతం రిజర్వేషన్లు ఇస్తూ, పార్టీ పరంగా సుమారు ఏభై శాతం వరకు బీసీలకు టిక్కెట్లు ఇచ్చి జగన్ న్యాయం చేశారు.ఉదాహరణకు 69 శాతం మేయర్ పదవులను బీసీలకు ఇచ్చారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఆ రకంగా కొన్ని జనరల్ స్థానాలలో కూడా బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారు. 13 జిల్లా పరిషత్‌లకు గాను ఆరింటిని బీసీలకు వచ్చేలా చేశారు. 46 శాతం పదవులను బీసీవర్గాలకు కట్టబెట్టారన్నమాట. మండల పరిషత్, మున్సిపల్ చైర్ పర్సన్ల పదవులకు కూడా ఇలాగే ఏభై శాతం పైగా జగన్ బీసీలకు ఇచ్చారు. చంద్రబాబు ఆ ప్రకారం ఇస్తామని చెప్పలేకపోతున్నారు.ఇదీ చదవండి: రేవంత్ మాటలు.. బీజేపీకి వరంగా మారుతున్నాయా?గత కొన్ని నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి గెలుపుకోసం ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రచారం ఆరంభించారు. మున్సిపాల్టీలలో 11 వేల కోట్ల రూపాయల పనులు, పల్లెలలో 11 వేల కోట్ల రూపాయల పనులు చేపడుతున్నట్లు హంగామా చేసి సభలు పెట్టారు. పల్లెకు పట్టాభషేకం, పేదలకు పట్టాభిషేకం అంటూ డైలాగులు చెబుతూ హోరెత్తించారు. స్థానిక ఎన్నికలలో కూటమికి తిరుగులేదని చంద్రబాబు ప్రసంగాలు చేస్తున్నారు. బీసీలకు తాము న్యాయం చేయబోయామని కాని వైఎస్సార్సీపీ అడ్డుకుందని కూడా టీడీపీ ప్రచార వ్యూహం అమలు చేయవచ్చు. ఎందుకంటే అలవోకగా అబద్దాలు ఆడడంలో ఈ పార్టీ మంచి నైపుణ్యం సాధించిందన్న సంగతి తెలిసిందే.ఇప్పుడు అసలు సమస్య కూటమికి ఎదురు అవుతుంది. ఆరు వారాలలో ఎన్నికలు జరపాలని కోర్టు ఆదేశించింది. అది సాధ్యం కాదని చెప్పి వాయిదా కోరితే తప్ప ఎన్నికలు ఆగకపోవచ్చు. అయితే టీడీపీ, జనసేనల మధ్య పోటీచేసే స్థానాలపై పంచాయతీ నడుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాని నాదెండ్ల మనోహర్ కాని ఒకసారి ఆత్మాభిమానం అంటూ, మరోసారి గెలుపు ప్రాతిపదిక అంటూ టీడీపీ లైన్లో మాట్లాడారు. తద్వారా కార్యకర్తలలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. కనీసం 30 శాతం సీట్లు అయినా జనసేనకు ఆయా పదవులకు పోటీచేసే అవకాశం కల్పించాలన్నది క్యాడర్ డిమాండ్. కాని పవన్ కళ్యాణ్ ఎంతవరకు న్యాయం చేస్తారో అన్న సంశయం వారికి లేకపోలేదు. అయినా ఏదో ఆశ వారిలో ఉంది.టీడీపీ వర్కింగ్ అధ్యక్షుడు నారా లోకేష్ ఇప్పటికే 15 శాతం సీట్లు జనసేనకు ఇస్తామని ప్రకటించారు. దానిని నేరుగా ఖండించే ధైర్యం జనసేనకు లేకపోయింది. కాకపోతే కొంతమంది కార్యకర్తలు సోషల్ మీడియాలో వారి ఆవేదన, ఆందోళన వ్యక్తం చేసి సరిపెట్టుకున్నారు. 30 శాతం సీట్లు సాధించగలిగితే పవన్ కళ్యాణ్‌పై పార్టీలో నమ్మకం పెరుగుతుంది. లేదంటే పార్టీలో నిరాశ అలముకుంటుంది. అది వేరే సంగతి. ఒకవేళ 30 శాతం సీట్లు జనసేనకు, మరో ఐదు శాతం సీట్లు బీజేపీకి ఇవ్వాల్సి వస్తే టీడీపీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. బలం లేని జనసేన, బీజేపీలకు అన్ని సీట్లు ఇవ్వడం ఏమిటని టీడీపీ స్థానిక నేతలు తిరుగబడే అవకాశం ఉంటుంది. 30 శాతం కాకపోయినా, 15 శాతంతోనే జనసేనకు సరిపెట్టినా, సీట్ల కేటాయింపులో గడబిడలు కొంతమేర జరగవచ్చు.ఉదాహరణకు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల మేయర్ పదవులను జనసేన కోరుతోందట. కాని వాటిని టీడీపీ తమకు ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. ఈ పరిస్థితిలో సామాజికవర్గాల సమస్య కూడా టీడీపీ ఎదుర్కోవలసి ఉంటుంది. జగన్ మాదిరి బీసీ వర్గాలకు పార్టీపరంగా ఏభై శాతం సీట్లు ధైర్యంగా ఇవ్వడం కూడా అంత తేలికకాకపోవచ్చు. ఈ సమస్యతో పాటు బీసీలకు, బలహీనవర్గాలకు ఏభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఎన్నికల మానిఫెస్టోలో చేసిన వాగ్దానం కూడా కూటమికి తలనొప్పిగా మారుతుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకునే.. చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతలపైన, యాక్టివ్‌గా ఉండే కార్యకర్తలు, సోషల్ మీడియాపై అక్రమ కేసులు పెడుతూ భయపెట్టాలని చూస్తోంది. వైఎస్సార్సీపీ వారిని భయపెట్టి పోటీలో లేకుండా చేయడానికి కూడా యత్నించవచ్చు.అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ క్యాడర్‌కు, నేతలకు ధైర్యాన్ని ఇస్తూ అన్ని చోట్ల పోటీచేయాల్సిందేనని చెబుతున్నారు. మరో వైపు ప్రభుత్వపరంగా జనాన్ని పోగుచేస్తే తప్ప చంద్రబాబు మీటింగ్‌లు జరగడం కష్టంగా ఉంటే, జగన్ ఎక్కడకు వెళ్లినా వస్తున్న జన తరంగాలు కూటమిని కలవరపెడుతున్నాయి. వీటన్నిటిని గమనంలోకి తీసుకుంటే శాసనసభ ఎన్నికలలో మాదిరి ఏదైనా మాయ జరిగితే తప్ప స్థానిక ఎన్నికలు కూటమికి ఒక అగ్ని పరీక్షవంటివే అని చెప్పాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆ హామీలు ఏమయ్యాయి చంద్రబాబూ?: పేర్ని నాని
సాక్షి, మచిలీపట్నం: గ్రామంలో కష్టం వచ్చిన ప్రతీ ఇంటి దగ్గర వైఎస్సార్సీపీ కార్యకర్త ఉండాలని.. ప్రజల్లో మమేకమయ్యేవాడినే మీరు ఎన్నుకోండీ. డబ్బులతో మనుషులను కొనలేరు’’ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు పేర్ని నాని పేర్కొన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో రైతులకు సాగునీరివ్వాలనే ఆలోచన ఎమ్మెల్యేకు లేదు. నీళ్లు లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కాల్వల్లో సాగునీరు పారకపోయినా... సారా మాత్రం పారుతుంది’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘జనం గొంతు తడపడానికి తాగు నీరు లేదు కానీ బెల్ట్ షాపులకు మాత్రం కొదవ లేదు. నీరు లేదు వరి పండించడం మానేయండని చంద్రబాబు అంటున్నాడు. అక్టోబర్ 1 తేదీన కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు. మీటింగ్ పెట్టి పాత వాళ్లకే పెన్షన్లు ఇచ్చి చంద్రబాబు జారుకున్నాడు. మూడు సెంట్ల స్థలం ఇస్తా.. సైట్ ఓపెన్ అయ్యిందని హడావుడి చేస్తున్నాడు. చంద్రబాబు జీవితంలో పేదవారికి ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా?’’ అంటూ పేర్ని నాని నిలదీశారు.‘‘పేదలకు పట్టాలిచ్చిన ఘనత వైఎస్సార్, వైఎస్ జగన్‌లకే దక్కుతుంది. కమ్యూనిస్టులు ఉద్యమాలు చేస్తేనే గతంలో ఇళ్ల స్థలాలు వచ్చేవి. కానీ ఎలాంటి ఉద్యమాలు లేకుండా వైఎస్ జగన్ 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చారు. నిజాయితీగా బతికిన కమ్యూనిస్టు నాయకుడు పాటూరి రామయ్య వైఎస్ జగన్‌ను మెచ్చుకున్నారు. ఇంతకంటే ఏం కావాలి మనకు. రిజర్వేషన్లపై కోర్టు ఏం చెప్పిందో వైఎస్ జగన్ అదే చేశారు. కానీ చంద్రబాబు దుర్మార్గంగా జగన్‌పై నిందలు వేస్తున్నారు..ఇవాళ కోర్టులో అన్ని కేసులు కొట్టించుకున్నారు. మరి రిజర్వేషన్లపై కేసును ఎందుకు నీకు అనుకూలంగా తెచ్చుకోలేదు. డబ్బున్నోళ్లకు, పారిశ్రామిక వేత్తలకు లోకేష్ డోలో 650 అవుతా అంటున్నాడు. పేదలకు లోకేష్ పేరు గుర్తొస్తే పురుగుల మందు గుర్తుకొస్తుంది. హామీల గురించి విలేకరి అడిగితే మమ్మల్ని నమ్మడానికి జనానికి బుద్ధి లేదా అని లోకేష్ అంటున్నాడు’’ అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: డ్రామా చేస్తున్నారని మీకూ తెలుసు?: వైఎస్ జగన్ -
వెన్నుపోటు పార్టీ బీసీలకు మరోసారి ‘వెన్నుపోటు’: వరుదు కల్యాణి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు నిజంగా న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి వెన్నుపోటు పార్టీ సారథ్యంలోని ప్రభుత్వానికి ఉంటే.. వెంటనే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి, అవసరమైన చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కల్యాణి సవాల్ చేశారు. బీసీల రిజర్వేషన్ల సాధన కోసం కూటమి పార్టీల ఎంపీలు రాజీనామాలు చేస్తే, ఏకంగా కేంద్ర ప్రభుత్వమే కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. తద్వారా కేంద్రం దిగివచ్చి బడుగులకు అవసరమైన 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసే చర్యలు చేపడుతుందని సలహా ఇచ్చారు.కేంద్రంపై ఒత్తిడి తేకుండా బీసీలకు ఇచ్చిన 34 శాతం రిజర్వేషన్ హామీని ఎలా అమలు చేస్తారో ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, బీసీల రిజర్వేషన్ల అంశాన్ని కేవలం రాజకీయ ప్రచారానికి ఉపయోగించకుండా, రాజ్యాంగబద్ధంగా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హితవు పలికారు.రిజర్వేషన్లకు సంబంధించిన న్యాయపరమైన పరిమితులు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్న నేపథ్యంలో వాటిని అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు, రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయని, వాటిని అనుసరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. రాజకీయ అవసరాలకు కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి సమాజంలో అట్టడుగున ఉన్న బడుగులకు ద్రోహం చేయడం తగదని వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.50 శాతం పరిమితిని అధిగమించాల్సి వస్తే అవసరమైన రాజ్యాంగపరమైన చర్యలు చేపట్టాలన్న జ్జానం చంద్రబాబుకు లేదా అని నిలదీశారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుకు చట్టపరమైన ప్రక్రియ అవసరం అనే సంగతి తెలియదా అని ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్లు అమలు సాధ్యం కాదు అని తెలిసి కూడా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం జీఓలు జారీ చేయడం వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని ధ్వజమెత్తారు. ఈ ప్రెస్ మీట్ లో ఆమె ఇంకా ఏం మాట్లాడరంటే..ఆ కమిషన్ల నివేదికలపై చర్యలు ఏవీ..?గతంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిషన్ల నివేదికలపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలి. మంజునాథ కమిషన్, రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వంటి కమిషన్లను ఏర్పాటు చేసి నివేదికలు తీసుకున్న తర్వాత వాటిని బుట్టదాఖలు చేసింది. ఆ నివేదికల పరిస్థితి ఏమిటో ప్రజలకు వివరించాలి. కమిషన్ల నివేదికలను పక్కన పెట్టి కేవలం రాజకీయ ప్రకటనలతో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం వెనుకబడిన వర్గాలకు వెన్నపోటు పోడవడమే. 2014 నుంచి 2019 మధ్య కాలంలో చంద్రబాబు నాయడు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యంలో నష్టం జరిగింది.ఆ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి ఉంటే బీసీలకు లభించే రాజకీయ అవకాశాలు మరింతగా ఉండేవి. వేలాది స్థానిక సంస్థల పదవులను బీసీలు కోల్పోయారు. అంతేగాక భారీ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరు కాకుండా నిలిచిపోయాయి. బీసీలకు రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే విషయంలో చంద్రబాబు బాధ్యతగా లేకుండా, రాజకీయ అవసరాలే పరమావధిగా వ్యవహరించారనడానికే ఇదే నిదర్శనం.గ్రామగ్రామానికి వెళ్లి బాబు ద్రోహాన్ని వివరిస్తాంకేంద్రంలో కూటమి ప్రభుత్వానికి భాగస్వామ్యంగా ఉన్న పార్టీలు తమ రాజకీయ బలాన్ని ఉపయోగించి బీసీల రిజర్వేషన్ల అంశంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేయవద్దు. 34 శాతం రిజర్వేషన్ల అమలుపై కూటమి పార్టీలు వెనుకబడిన వర్గాలకు చేస్తున్న దగాను గ్రామగ్రామానకు వెళ్లి బీసీలకు వివరిస్తాం. కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలు, వాటి అమలు పరిస్థితిపై ద్రోహం చేస్తున్న తీరును ప్రజలకు వివరిస్తాం. వైఎస్సార్సీపీ బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాడుతుంది. గ్రామగ్రామాన పర్యటించి బీసీలకు వాస్తవ పరిస్థితులను వివరిస్తాం. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50 శాతం అవకాశాలు కల్పించాలి. బీసీలకు సంబంధించిన సంస్థలు, పదవుల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలి.వైఎస్ జగన్ హయాంలోనే బీసీలకు భరోసావైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో బీసీల సంక్షేమం, రాజకీయ సాధికారతకు అనేక చర్యలు చేపట్టింది.139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వాటికి చైర్మన్లు, డైరెక్టర్లుగా బీసీలకు అవకాశం కల్పించింది. బీసీలకు కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా ప్రాధాన్యత కల్పించాం. బీసీల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించేందుకు వైఎస్సార్సీపీ ఎంపీల ద్వారా ప్రైవేట్ బిల్లులు కూడా ప్రవేశపెట్టించాం. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని వైఎస్సార్సీపీ తరఫున డిమాండ్ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో బీసీలకు భారీ స్థాయిలో ఆర్థిక సహాయం అందించాం. డీబీటీ ద్వారా రూ.1,22,451 కోట్లు, నాన్-డీబీటీ ద్వారా రూ.50,657 కోట్లు, మొత్తంగా రూ.1,73,109 కోట్లు బీసీలకు అందించాం. బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక సాధికారత కల్పించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది.పారదర్శక ఎన్నికలే మా లక్ష్యంఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తికాకముందే ఎన్నికలు నిర్వహించడంతో అనేక అవకతవకలు చోటుచేసుకునే అవకాశం ఉందని న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి చూడాలని కోరాం. వలసలు, మరణాలు, ఇతర కారణాలతో తొలగించాల్సిన ఓట్లను సరిచేసిన తర్వాత తుది ఓటర్ల జాబితాను ప్రకటించాలి. తుది జాబితా వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే ఓటర్ల జాబితాపై మరింత స్పష్టత ఉంటుంది.సవరణ ప్రక్రియ పూర్తికాకముందు పాత జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తే తొలగించాల్సిన ఓట్లు కూడా అందులో ఉండే అవకాశం ఉంది. ఓటర్ల జాబితా సవరణ పూర్తయి తుది జాబితా వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే అనవసరమైన వివాదాలకు అవకాశం ఉండదు. ప్రజాస్వామ్య ప్రక్రియ మరింత పారదర్శకంగా జరుగుతుంది. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు, ఓటర్ల జాబితా విషయంలో కూడా ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి అని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కోరారు.ఇదీ చదవండి: ‘పాన్ ఇండియా జోకర్ నారా లోకేష్’ -
అందుకే ప్రజలు చంద్రబాబును నమ్మరు: ఉషశ్రీ చరణ్
సాక్షి, తాడేపల్లి: 34 శాతం బీసీ రిజర్వేషన్ చెల్లదని తెలిసీ చంద్రబాబు డ్రామా చేశారని.. కేవలం బీసీలను మోసం చేయటానికే ఈ నాటకమంటూ మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే చట్టమే తీసుకురావచ్చు.. కానీ అలా చేయకపోవటానికి కారణం బీసీలు ఎదగటం చంద్రబాబుకు ఇష్టం లేదు. వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు’’ అంటూ ఆమె దుయ్యబట్టారు.‘‘అందుకే ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు, జడ్పీలు, మేయర్లు, ఎంపీపీలు.. ఇలా అన్ని పదవుల్లోనూ వైఎస్ జగనే బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. బీసీల బతుకుల్లో వెలుగు నింపినది వైఎస్ జగన్ మాత్రమే. బీసీల కోసం ప్రత్యేకంగా ఒక శాఖను పెట్టాలని కేంద్రానికి ప్రతిపాదన చేసిందీ వైఎస్ జగనే. బీసీల్లోని కులవృత్తుల వారి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలన్నదీ వైఎస్ జగనే.. ఇలా అనేక రకాలుగా ఆయన బీసీలకు మేలు చేశారు’’ అని ఉషశ్రీ చరణ్ వివరించారు.కానీ చంద్రబాబు పాలనలో బీసీలపై దాడులు జరుగుతున్నాయి. జోగి రమేష్, విడదల రజిని, కారుమూరి నాగేశ్వరరావు, సీదిరి అప్పలరాజు.. ఇలా అనేకమంది బీసీ నేతలపై దాడులు చేశారు. అక్రమ కేసులు పెట్టి, అరెస్టులు చేశారు. బీసీలను మోసం చేసిన చంద్రబాబుకు తగిన బుద్ది చెప్పే రోజు త్వరలోనే వస్తుంది’’ అని ఉషశ్రీ చరణ్ తేల్చి చెప్పారు.ఇదీ చదవండి: రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. చంద్రబాబు వరుస డ్రామాలు! -
రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. చంద్రబాబు వరుస డ్రామాలు!
సాక్షి, అమరావతి: బీసీల రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు వరుస డ్రామాలకు దిగారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన జీవోలను ఏపీ హైకోర్టు గురువారం కొట్టేసింది. సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం తెచ్చిన ఆ జీవోలు చెల్లవంటూ హైకోర్టు తేల్చేసింది. తద్వారా ఊహించిన తీర్పే రావడంతో కూటమి సర్కార్‌పై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం కోటా కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2026 ఆగస్టులో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే.. ఈ రిజర్వేషన్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని మించుతున్నాయంటూ జీవో 105, జీవో 1065 చట్టబద్ధతను సవాలు చేస్తూ న్యాయవాది తాండవ యోగేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తీర్పు సందర్భంగా.. రిజర్వేషన్లు 59 శాతానికి మించి ఉండకూడదన్న ధర్మాసనం, రాజ్యాంగపరిధికి లోబడి రిజర్వేషన్లు కల్పించలేదని అభిప్రాయపడింది. మొత్తం రిజర్వేషన్లు పరిమితిని దాటకూడదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందని చెబుతూ పంచాయతీరాజ్, పురపాలక శాఖలు తెచ్చిన ఆ జీవోలను డిస్మిస్ చేసింది. సర్ ప్రక్రియ ముగిసేంత వరకు ఎన్నికలను వాయిదా వేయాలని వైఎస్సార్సీపీ విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఉన్నత న్యాయస్థానం.. ఆ కారణంతో ఎన్నికలు వాయిదా వేయమని కోరడం సరికాదని వ్యాఖ్యానించింది. అలాగే వార్డుల పునర్విభజనపైనా జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. తుది ఓటర్ల జాబితా ప్రచురణలో చట్ట నిబంధనలు పాటించాలని.. ఆరు వారాల్లో స్థానిక సంస్థల ఎన్నిక ప్రక్రియ ముగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ తీర్పు వెల్లడించింది.డ్రామా నడిపిన చంద్రబాబుబీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా చట్టం మాత్రం చేయలేదు. బదులుగా కేవలం జీవోలతో ముందుకెళ్లడంపై మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లను చట్టబద్ధం చేయాల్సిన చంద్రబాబు.. డెడికేషన్ కమిషన్ ఏర్పాటు పేరిట మరో నాటకానికి తెర తీశారు. అయితే ఆ కమిటీ నివేదిక పూర్తిగా అందకముందే జీవోలు జారీ చేయడమూ తీవ్ర చర్చనీయాంశమైంది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటే అంశంపై ఇప్పటికే న్యాయపరమైన వివాదాలు, గతంలో కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ.. అదే అంశంపై మరోసారి జీవోలు ఇవ్వడం ద్వారా బీసీలను చంద్రబాబు గందరగోళానికి గురిచేశారు. ఇటు.. కేంద్రంలోనూ భాగస్వామ్య అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధం చేసే దిశగా చర్యలు తీసుకోకపోవడాన్ని బీసీ సంఘాలు నిలదీస్తూ వస్తున్నాయి. ఈలోపు ఈ జీవోలను హైకోర్టు కొట్టివేయడంతో.. చంద్రబాబు డ్రామా పండిందంటూ బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. సుప్రీం పేరిట ఇంకోటి!హైకోర్టు తీర్పు.. తీవ్ర విమర్శల నేపథ్యంలో చంద్రబాబు మరో డ్రామాకు దిగినట్లు తెలుస్తోంది. తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని భావిస్తోందట. అయితే రిజర్వేషన్లు రాజ్యాంగ పరిధికి లోబడి ఉండాలని గతంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అలాంటిది ఈ జీవోల యవ్వారంలో బాబు సర్కార్ తీరును కోర్టు సమర్థిస్తుందా? అనేది అనుమానంగానే కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: అదెలా సమర్థించుకుంటారు?.. ఏపీ హైకోర్టు సూటి ప్రశ్న -
గతాన్ని మరిచిన బాబు.. ఈసీపై డబుల్ టాక్!?
రాజకీయ ప్రయోజనాలకోసం ఎన్నికల వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీయడం విచారకరం.. ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన వ్యాఖ్య.2019లో చంద్రబాబే చేసిన ఇంకో వ్యాఖ్యను గమనించండి. మోదీ దేశంలోని ప్రతిష్టాత్మక వ్యవస్థలను ధ్వంసం చేశారు. బీజేపీ పాలనలో వ్యవస్థల స్వతంత్రత, ప్రజాస్వామ్యం దాడికి గురవుతున్నాయి. సీబీఐ మొదలు ఆర్బీఐ వరకు... ఎన్నికల కమిషన్ వంటి సంస్థలను కూడా వదలిపెట్టడం లేదు.ఈ రెండు వ్యాఖ్యలను చదివితే ఏమనిపిస్తుంది? చంద్రబాబు వంటి అవకాశవాద రాజకీయ నేతల వల్ల ప్రజాస్వామ్యం దెబ్బతింటోందా? లేక బలపడుతోందా? అన్న భావన కలగదా! తాను అధికారంలో ఉంటే అంతా సజావుగా ఉన్నట్లు, అధికారంలో లేకపోతే వ్యవస్థలన్నీ పాడైనట్లు జనం అనుకోవాలన్నమాట. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్‌కుమార్ నియమితులైనప్పటి నుంచి వివాదాలు మరీ తీవ్రమైనట్లు అనిపిస్తుంది. గతంలో కూడా కొందరు సీఈసీలపై విమర్శలు వచ్చాయి. కానీ ఈసారి వచ్చినవి తీవ్రమైన అభియోగాలు.గతంలో టీఎన్ శేషన్ సీఈసీగా ఉన్నప్పుడు దేశం మొత్తాన్ని గడగడలాడించారంటే అతిశయోక్తి కాదు. కాస్త దుందుడుకు అన్న విమర్శ ఉన్నప్పటికీ, రాజకీయ నేతలు ఎన్నికల అక్రమాలకు పాల్పడాలంటే, అదికారులు రాజకీయ నేతలకు సహకరించాలంటే భయపడే పరిస్థితిని తెచ్చారు. చివరికి గోడలపై ఎన్నికల ప్రచారం చేయడానికి కూడా ఒకటికి, రెండుసార్లు ఆలోచించుకునేవారు. అప్పట్లో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో విబేధాలు రావడంతో, ఆనాటి ప్రధాని పీవీ నరసింహారావు ఎన్నికల కమిషన్‌ను త్రిసభ్య కమిషన్‌గా మార్చారు. ఆయన తనకు సన్నిహితుడైన జీవీజీ కృష్ణమూర్తిని నియమించారని అంటారు. శేషన్‌కు చెక్ పెట్టడానికి ఈ ఏర్పాటు జరిగిందన్న భావన అప్పట్లో ఉండేది. ఆనాటి నుంచి త్రిసభ్య కమిషనే కొనసాగుతోంది. కొన్నిసార్లు విమర్శలు వచ్చేవి.కేంద్రంలో శక్తిమంతమైన ప్రభుత్వం ఉన్నప్పుడు కొందరు ఎన్నికల కమిషనర్లు రాజీనామా చేసి వెళ్లిపోయిన ఘట్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రధానిగా, బీజేపీ అదికారంలోకి వచ్చాక కొన్ని ఇలాంటివి జరిగాయి. ఎన్నికల కమిషనర్‌గా ఉన్న ఒకరి కుటుంబ సభ్యులపై ఈడీని ప్రయోగించారన్న ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి ఎంపిక కమిటీలో సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ బదులుగా కేంద్ర మంత్రిని ఒకరిని నామినేట్ చేసే పద్దతిని మోదీ ప్రభుత్వం తీసుకువచ్చింది. లోక్‌సభలో విపక్ష నేతకు ఇందులో స్థానం ఉన్నా ఆ పాత్రను నామమాత్రం చేశారన్నమాట.గత 2024 ఎన్నికలకు ముందు జ్ఞానేశ్‌కుమార్‌ను ఎంపిక చేసుకున్న వైనం, అంతకుముందు కేంద్రంలో ఈయన కీలక పాత్ర పోషించిన తీరు, గతంలో కేరళలో పనిచేసినప్పుడు వచ్చిన విమర్శలు, ప్రధాని, హోం మంత్రులకు ఈయన సన్నిహితుడన్న ప్రచార నేపథ్యం వంటివాటిని పరిగణనలోకి తీసుకుంటే సహజంగానే ఆయా వర్గాలకు అనుమానాలు కలుగుతాయి. దానికి తోడు పశ్చిమబెంగాల్, బిహార్, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాలలో 2024 ఎన్నికలు జరిగిన తీరుతెన్నులపై ఎన్నో సంశయాలు వచ్చాయి. కొన్ని రాష్ట్రాలలో ఓటర్ల జాబితా సవరణ పేరుతో లక్షల ఓట్ల తొలగింపు, లేదా పెండింగులో పెట్టడం, పోలింగ్ జరిగేనాటికి కూడా ఓటర్ల నమోదు దరఖాస్తులను పరిష్కరించకపోవడం, ఎన్నికల సమయంలో వ్యవహరించిన తీరు, అర్ధరాత్రి దాటిన తర్వాత లక్షల ఓట్లు పోలైనట్లు చూపించడం, వీటిపై ఆధార సహితంగా ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడం వంటివి ఎన్నికల సంఘంలో పారదర్శత లేదన్న అభిప్రాయం కలిగించింది.కొన్ని ఉదాహరణలు చూడండి.. పశ్చిమబెంగాల్లో 27 లక్షల ఓట్లను పెండింగ్‌లో ఉంచారట. వాటి సంగతి తేల్చకుండా ఎన్నికలు పూర్తి చేయడంలో ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు వాటిని పరిశీలిస్తుంటే 97 శాతం ఓట్లు నిజమైనవేనని తేలుతోందట. ఏపిలో సాయంత్రం ఆరు తర్వాత ఏభై లక్షల ఓట్లు ఎలా పోలయ్యాయి? అందులోను అర్దరాత్రి 12 గంటల నుంచి రెండుగంటల వరకు 17 లక్షల ఓట్లు ఎలా పోల్ అయ్యాయన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఎన్నికల సంఘం మౌనముద్ర దాల్చింది. వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు ఫిర్యాదు చేసినా కిమ్మనలేదు. పరకాల ప్రభాకర్ వంటి వారు పరిశోధన చేసి సదస్సులు పెట్టి విమర్శలు గుప్పిస్తున్నా, జవాబు ఇవ్వడం లేదు. ఎన్నికల వ్యవస్థపై అభాండాలు వేస్తారా అని కూడా అడగలేకపోయింది.ఇదీ చదవండి: బాబుకు సోషల్ మీడియా భయం.. కరపత్రాల ప్రచారం తగ్గిందా?విశేషం ఏమిటంటే 2009లో కాని, 2019లో కాని ఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ పైన, ఈవీఎంల పైన తీవ్ర విమర్శలు చేసి, అవి మానిప్యులేషన్‌కు గురి అవుతున్నాయని ఆరోపించారు. నిజానికి అప్పట్లో ఈవీఎంలపై ఈ స్థాయిలో సందేహాలు రాలేదు. అయినా వాటి ద్వారా అక్రమాలు చేయవచ్చని ఆయన అనేవారు. అలాంటి వ్యక్తి.. ఇప్పుడేమో ఎన్నికల వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లేలా విమర్శలు చేయరాదని సుద్దులు చెబుతున్నారు. 2019లో ఆనాటి ప్రధాని మోదీపై ఎంత తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది ఆయన ట్వీట్లే తెలియచేస్తాయి. సీబీఐ, ఈడీ, ఎన్నికల కమిషన్ వంటి వ్యవస్థలను ధ్వంసం చేశారని కూడా ఆనాడు ఆరోపించారు. ఇప్పుడేమో ఇలా అమాయకంగా మాట్లాడుతున్నారు. అవే ఆయన తెలివితేటలు.చంద్రబాబు వ్యూహాత్మకంగా, ఎలాగొలా బతిమలాడి 2024 ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఏపీలో పరిస్థితులు మారిపోయాయి. ఎన్నికల కమిషన్ పూర్తిగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతల చేతుల్లోకి వెళ్లిపోయినట్లు వ్యవహరించిందన్న ఆరోపణలు వచ్చాయి. ఆనాటి బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తమకు ఏ ఏ అధికారి కావాలో చెబుతూ జాబితాను సమర్పిస్తే, చాలావరకు ఎన్నికల సంఘం అమలు చేసిందని చెబుతారు. సీసీ టీవీ ఫుటేజీ ఒకసారి లీక్ అయింది. దానిని టీడీపీ ప్రచారం చేసింది. అయినా అదెలా జరిగిందని ఈసీ అడగలేదు. ఎన్నికలయ్యాక కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్దిష్ట గడువుతో సంబందం లేకుండా వివిపాట్ స్లిప్‌లను దగ్దం చేసేయడం పలు సందేహాలకు అవకాశం ఇచ్చింది.కొందరు వైఎస్సార్సీపీ నేతలు కొన్ని బూత్‌లలో ఓట్లను తిరిగి లెక్క వేయాలని కోరుతూ దరఖాస్తు చేసినా అందుకు ఎన్నికల కమిషన్ అధికారులు సిద్దపడలేదు. దీనిపై న్యాయవ్యవస్థ వద్దకు వెళ్లినా ప్రయోజనం కలగకపోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసిన వ్యవస్థలు ఇలా వ్యవహరిస్తున్నాయేమిటా అని చాలామంది బాధపడ్డారు. కాని జరగవలసిన డామేజీ జరిగిపోయింది.ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఎన్నికల కమిషన్‌లో జరిగిన కొన్ని పరిణామాలు, ముఖ్యంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై ఇద్దరు కమిషనర్లు అభ్యంతరం చెప్పిన విధానం.. అన్నిటిని జర్నలిస్టు రితిక చోప్రా వెలుగులోకి తీసుకువచ్చిన కథనం సంచలనం అయింది. ఇందుకు ఆమె చేసిన కృషిని అంతా అభినందించాలి. ఎన్నికల కమిషన్‌లోని డొల్లతనం అంతా వెలుగులోకి వచ్చింది. అసలు ఇలా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు చట్టంలో ఎక్కడా అవకాశం లేదని, మాజీ ఎన్నికల ముఖ్య కమిషన్ ఖురేషి వెల్లడించారు. అయినా జ్ఞానేశ్‌కుమార్ ఎలా చేశారంటే ఏమి చెబుతాం. కేవలం బీజేపీ, దానికి మద్దతు ఇచ్చే పార్టీల కోసమే పనిచేస్తున్నారని, విపక్ష పార్టీల వాదనలను పెడచెవిన పెడుతున్నారన్న భావన కలిగితే వ్యవస్థకు ఎంత నష్టం. ఎవరు ఫిర్యాదు చేసినా అందులోని వాస్తవాలను విచారించి న్యాయం ఏమిటో తేల్చవలసిన ఎన్నికల వ్యవస్థే ఏకపక్షంగా మారితే ఎన్నికలు జరిగి ఏమి ఉపయోగం? ఇదంతా నియంతృత్వానికి దారితీయదా? అందువల్లే ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర కలవరం సృష్టిస్తోంది.జ్ఞానేశ్ రాజీనామాకు విపక్షంలోని కాంగ్రెస్, వామపక్షాలు, టీఎంసీ, సమాజవాది, తదితర పార్టీలతో పాటు యువతకు ప్రాతినిథ్యం వహిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల కమిషనర్ల నియామక విధానంపై పునఃసమీక్ష జరగాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ అభిప్రాయపడ్డారు. గతంలో తాము మద్దతు ఇచ్చినప్పటికీ, జరిగిన పరిణామాల రీత్యా దీనిలో మార్పు రావాలని ఆయన కోరారు. ఈ అంశంపై కొన్ని బీజేపీ మిత్రపక్షాలు కూడా జాగ్రత్తగా స్పందించాయి. వాటిలో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈసీ వివరణ ఇవ్వాలని తొలుత సూచించారు. దానికి టీడీపీ అధినాయకత్వం కంగారుపడినట్లు ఉంది. తదుపరి ఈసి ఇచ్చిన వివరణ అంత సంతృప్లిగా లేనప్పటికీ, చంద్రబాబు నాయుడు బీజేపీకి కోపం రాకుండా వెంటనే స్పందించారు.ఇంతకాలం ఏపిలో జరిగిన ఎన్నికల ప్రహసనంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా మాట్లాడని చంద్రబాబు దీనిపై మాట్లాడుతూ వ్యవస్థల విశ్వసనీయత గురించి ధర్మోపదేశం చేశారు. ఏపిలో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి అవకతవకలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పెద్దగా ప్రయోజనం జరగలేదని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు వంటివి లేకుండా ఓటర్ల జాబితాలను తయారు చేయాలన్న చిత్తశుద్ది ఉంటే, ఆధార్ కార్డుకు లింక్ పెట్టి ఓట్లను ఖరారు చేస్తే సరిపోతుందని ఎక్కువ మంది నిపుణుల అభిప్రాయం. అది చేయకుండా ఎన్నో విన్యాసాలను ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ చేస్తుంటే ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఎలా కుదురుతుంది?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘బాబు చేతిలో పోలీస్ శాఖ కీలు బొమ్మగా మారిపోయింది’
సాక్షి, కాకినాడ జిల్లా: ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? లేదా? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియంత సామ్రాజ్యంలా ఉందని ప్రజలు అనుకుంటున్నారు.. ప్రశ్నించేవారిని అణిచివేసేలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. అధికారులను అడ్డదారుల్లో వాడుకుంటుందన్నారు. ఉద్యోగుల పట్ల చంద్రబాబుకు చాలా చులకన. అన్ని వర్గాలాన్నే ప్రభుత్వ ఉద్యోగులు కూడా మోసపోయారు. ఇప్పుడు సచివాలయం ఉద్యోగులు మోసపోయారు. పరిపాలన వికేంద్రీకరణ లక్ష్యంతో వైఎస్ జగన్ సచివాలయాలు ఏర్పాటు చేయాలని విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. 15,004 సచివాలయాలు నిర్మించి.. 1,34,000 ఉద్యోగులను నియమించారు. సచివాలయం వ్యవస్థే వృధా అన్నట్లు మంత్రులు మాట్లాడుతున్నారు’’ అంటూ కన్నబాబు దుయ్యబట్టారు.‘‘అక్రమ కేసులు పెట్టి సచివాలయం ఉద్యోగులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆంద్రజ్యోతిలో సచివాలయాల మీద పచ్చి అబద్దాలను వండి వర్చారు. గ్రామాల్లోకి వెళ్లి సచివాలయాల ఉద్యోగులు ఎలా పని చేస్తున్నారో అడగండి. వైఎస్ జగన్ మీద ద్వేషం తప్పా.. మీకు మరేమీ లేదు. ఉద్యోగులను గౌరవంగా చూసుకుంటానని చంద్రబాబు ఎన్నికల మానిఫెస్టోలో చెప్పారు. తమ హక్కుల కోసం అడిగితే ఉద్యోగులపై కేసులు పెడతారా?...చంద్రబాబు చేతిలో పోలీస్ శాఖ కీలు బొమ్మగా మారిపోయింది. సచివాలయం ఉద్యోగులకు ఎలాంటి జీవోలు గత పాలనలో ఇచ్చామో ఆఫీస్‌కి వెళ్లి వెతుక్కోండి. సచివాలయం వ్యవస్థను రద్దు చేస్తారా? అని సూటిగా చంద్రబాబును అడుగుతున్నా?. సచివాలయ వ్యవస్థను కుదించే కార్యక్రమం చంద్రబాబు చేస్తున్నారు. కోవిడ్‌లో సచివాలయం ఒక యూనిట్‌గా ప్రజలకు సేవలందాయి. సచివాలయం ఉద్యోగులను వైఎస్ జగన్ ప్రభుత్వం చాలా గౌరవంగా చూసింది. మీ చేతగానితనాన్ని సచివాలయం ఉద్యోగులపై ఎందుకు రుద్దుతారు చంద్రబాబు?..ఉద్యోగుల మీద ప్రజల్లో నెమ్మదిగా పాయిజన్ ఎక్కిస్తున్నారు. వచ్చిన ప్రభుత్వ ఆదాయం ఉద్యోగులకు సరిపోతుందని చెబుతున్నారు. పి-4 పథకంలో దాతలు దొరకకపోతే.. ఉద్యోగులే దాతలుగా మారాలని ఒత్తిడి తెచ్చారు. ఇప్పడు సచివాలయం ఉద్యోగులపై కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిస్తున్నారు. మీ ఎల్లో మీడియా ఉందని పేట్రేగిపోతున్నారు. ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదూ?. పెయిడ్ ఇన్ఫ్లుయెన్సర్లను తీసుకువచ్చారు. మీ తండ్రి కొడుకులను వాళ్లు తమ భుజాన ఎత్తుకుని మోయాలిఇన్ఫ్లుయెన్స్ కోల్పోయిన వాళ్లే ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టుకుంటారు. అసలు సమస్యలను వదిలేసి వైఎస్ జగన్‌పై దూషణలతో ఎంతకాలం నెట్టుకొస్తారు. ఉద్యోగులు ఏం పాపం చేశారని వారిపై మీ రెడ్‌బుక్ ప్రయోగిస్తున్నారు. ఉద్యోగులు వాళ్ల హక్కుల కోసం ప్రశ్నిస్తే తప్పా..? ఎకరం రూ.99 లకు కార్పోరేట్ సంస్థలకు కట్టబెడితే ఒప్పా? అని ఎల్లో మీడియాను అడుగుతున్నా....భీమడోలు షుగర్ ఫ్యాక్టరీని పప్పు బెల్లంలా గతంలో చంద్రబాబు అమ్మేశారు. ఇప్పుడు మరికొన్ని సహకార చక్కెర కర్మాగారాలను అమ్మేసే ప్రయత్నం జరుగుతుంది. రైతులు దీనికి ఒప్పుకోవడం లేదు. త్వరలో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుంటే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు. సచివాలయం ఉద్యోగులపై కేసులు పెట్టడం దుర్మార్గం.. అమానుషం’’ అంటూ కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: కొల్లు రవీంద్రకు ఇదే నా ఛాలెంజ్: పేర్ని కిట్టు -
బాబుకు సోషల్ మీడియా భయం.. కరపత్రాల ప్రచారం తగ్గిందా?
ఏపీ ప్రభుత్వం ప్రచారం విషయంలో వెనుకడుగు వేయడం లేదు. కొత్తగా సోషల్ మీడియాలో ప్రచారం చేసేవారికి ప్రభుత్వం పరోక్ష వేతనం చెల్లించడానికి రెడీ అయింది. ఇది ఒకరకంగా పరీక్ష లేకుండానే క్రీడా కోటాలో కొందరికి టీచర్ల ఉద్యోగాలు ఇచ్చిన చందంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి సర్కార్, ఇప్పటికే తనకు అనుకూలంగా పనిచేస్తున్న దాదాపు ఎనభై శాతం ప్రధాన మీడియాకాని, వందల సంఖ్యలో ఉన్న యూట్యూబ్ చానళ్లు తమ ప్రచారానికి సరిపోవడం లేదని అనుకుంటోందా? లేక వాటిని జనం నమ్మడం లేదన్న అభిప్రాయానికి వచ్చిందా అన్నది తెలియదు కాని, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల పేరుతో అంటే ప్రభావశీలురతో కంటెంటె పెట్టిస్తారట. దానికి భారీగా చెల్లింపులు చేస్తారట.కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారందరికి నాలుగువేల రూపాయల చొప్పున మంజూరు చేయడానికి డబ్బులు లేవని మంత్రి అచ్చెన్నాయుడు ఆ మధ్య ఉపన్యాసం ఇచ్చారు. ఉద్యోగుల జీతాలకే ప్రభుత్వ ఆదాయంలో 94-98 శాతం ఖర్చు అవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తెలిపారు. సంపద సృష్టించే మార్గాలు కనబడడం లేదని, ఐడియాలు ఉంటే ఇవ్వండని ప్రజలనే ఆయన సలహా కోరారు. అవన్ని వాస్తవమా? కాదా? అన్నది మనం చెప్పలేం.కాని, చంద్రబాబు ప్రభుత్వం తాజాగా మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం సోషల్ మీడియాలో కూటమి సర్కార్ పక్షాన, చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌ల పక్షాన ప్రచారం చేయడానికి ఒక్కొక్కరికి 15 వేల రూపాయల నుంచి లక్షన్నర వరకు ఇస్తారట. ప్రభుత్వం ఇచ్చే కంటెంట్ పోస్టు చేస్తే ఒక రేటు, స్వయంగా తయారు చేసే కంటెంట్‌కు మరో రేటు ఉంటుందట. ప్రభుత్వం ఇచ్చే గ్రాఫిక్స్ పోస్టింగ్‌లకు కేటగిరిని బట్టి 500 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు ఇస్తారట. ఆడియో, వీడియో పోస్టింగ్లకైతే 750 నుంచి రెండువేల రూపాయల వరకు ఇస్తారట. సొంతంగా తయారు చేసే వీడియోలకు గాను క్రియేటర్స్‌కు 2500 నుంచి ఇరవైవేల వరకు చెల్లిస్తారట. దీనికి ఏవో కండిషన్లు అని చెప్పినా, చివరికి ఏమి జరుగుతుందో ఊహించుకోవచ్చు.ఎన్నివేల మందిని ఇందుకోసం వినియోగించుకుంటారో, ఎంత బడ్జెట్ కేటాయిస్తారో వెల్లడించలేదు. హిమచల్ ప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్‌లలో వివిధ పద్దతులలో ఇలాంటి స్కీములను అమలు చేస్తున్నారట. యూపీలో ఆయా సోషల్ మీడియా ఫ్లాట్ పారంలకు నేరుగా డబ్బులు ఇస్తారట. వీటిని కాపీ చేసి ఏపీ ప్రభుత్వం వీటిని అమలు చేస్తోందన్నమాట. ఇప్పటికే డిజిటల్ కార్పొరేషన్‌తో ప్రభుత్వ ప్రచారం చేస్తుంటుంది. అందులో కూడా కంటెంట్ తయారు చేస్తారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, తదతర మీడియా సంస్థలకు ప్రచార ప్రకటన రూపంలో, ఇతరత్రా భారీగానే లబ్ది చేకూర్చుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. వారు మరీ ఏకపక్షంగా టీడీపీ కరపత్రాలుగా ప్రచారం చేస్తుండడంతో ప్రజలలో విశ్వసనీయత తగ్గిపోతోంది.ఈ నేపథ్యంలో ఈ కొత్త ఐడియాను తీసుకువచ్చి ప్రజాధనాన్ని వెచ్చించబోతున్నారన్నమాట. నిజంగానే ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏవైనా పోస్టు చేస్తే ఫర్వాలేదు. ప్రభుత్వం ఇచ్చే గ్రాఫిక్స్, వీడియోలు అంటే కేవలం ప్రభుత్వ నేతల ప్రచారమే అత్యధికశాతం ఉంటుందన్నది బహిరంగ రహస్యమే. దానికి తోడు ఇప్పుడు ఈ ఇన్‌ఫ్లూయేన్సర్లు వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో వచ్చే విషయాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలన్నమాట. అలాగే ఇండిపెండెంట్‌గా పనిచేసే యూట్యూబర్లు వెలికితీసే వాస్తవాలను ఖండించాలన్నమాట. వైఎస్సార్సీపీ నేతలపై బురద చల్లే పనిలో నేర్పరితనం ప్రదర్శించాలన్నమాట. డైవర్షన్ రాజకీయాలలో భాగస్వాములవ్వాలన్నమాట.ఇదీ చదవండి: దానం ఎపిసోడ్.. డిఫెన్స్‌లో కాంగ్రెస్, రేవంత్? ఉదాహరణకు డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ ఆధారాలు చూపుతున్నప్పుడు అవేవి సరికావన్నట్లుగా ప్రచారం చేయాలి. ఇలాంటి డైవర్షన్ విషయాలలో చంద్రబాబును మించిన మొనగాడు మరొకరు ఉండకపోవచ్చు. డీఎస్సీ స్కామ్‌పై నిరసన చెప్పడానికి వెళ్లిన వైఎస్సార్సీపీవారిపై దాడి చేసింది టీడీపీవారు లేదా టీడీపీ యువగళం టీమ్ అన్నది బహిరంగ రహస్యమే. వారే ఈ విషయం చెప్పుకున్నారు. కాని వ్యూహాత్మకంగా గురువులపై వైఎస్సార్సీపీ దాడి అని చంద్రబాబే ప్రచారం ఆరంభించారు. అది నిజం కాదని ఆయనకు తెలుసు. పోలీసులకు తెలుసు. లేదా రెండు వైపులా ఏమైనా గొడవ జరిగితే ఇరుపక్షాలకు చెందినవారిమీద కేసులు పెట్టవచ్చు.అదేమి కాకుండా వైఎస్సార్సీపీపైన ఎంత వీలైతే అంత బురద చల్లడం, జగన్‌పై పిచ్చి, పిచ్చి ఆరోపణలు చేయడంతో అసలు స్కామ్‌ను దారి మళ్లించాలన్నది వారి వ్యూహమన్నమాట. దీనికోసం ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఎంత బాగా పనిచేసి అంతగా వ్యూస్ సంపాదిస్తే వారికి అంతగా డబ్బు వస్తుందన్నమాట. ఇదంతా టీడీపీ తరపున ఇప్పటికే పనిచేస్తున్నవారికి డబ్బులు ఇవ్వడానికే ఈ స్కీమ్ తెచ్చారని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. డీఎస్సీలో పరీక్షలు లేకుండా టీచర్ ఉద్యోగాలు కొంతమందికి ఇచ్చి అప్రతిష్ట తెచ్చుకున్న నేపథ్యంలో ఈ స్కీమ్ ప్రకారం తమకు కావల్సిన వారికి ప్రభుత్వం డబ్బు ఇష్టారీతిన వెచ్చించే అవకాశం ఉండవచ్చన్నది కొందరి అనుమానం.ఒకవైపు ఇలా జనం డబ్బుతో వారినే మభ్య పెట్టడానికో, నమ్మించడానికో సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ, మరో వైపు పోలీసుల ద్వారా తమకు వ్యతిరేకంగా స్కామ్‌లను బయటపెడుతున్న సోషల్ మీడయాను అణచివేయడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఆ క్రమంలో చివరికి అమెరికాకు చెందిన పోలీస్ వ్యవస్థ ఎఫ్‌బీఐ పేరుతో కూడా నకిలీ ఫిర్యాదులు చేయడానికి ఏపీ పోలీసు వ్యవస్థ సిగ్గుపడకపోవడం దారుణంగా ఉంటుంది.ఎవరైనా వేరే సంస్థ పేరుతో తప్పుడు ఫిర్యాదు చేస్తే కేసులు పెట్టే పోలీసులే స్వయంగా సోషల్ మీడియా ప్లాట్ ఫాంలకు నకిలీ ఫిర్యాదులు చేయడం ఏమిటి? తద్వారా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే వాస్తవ పోస్టులను తొలగించేలా చూడడం ఏమిటి? ఏపీలో పోలీసు వ్యవస్థ ఎంతసేపు వైఎస్సార్సీపీ సోషల్ మీడియాను అణచివేయడం, వారిపై తప్పుడు ఆరోపణలు చేయడం, వారి అక్కౌంట్లను మూసివేయించడం పనిలోనే బిజీగా ఉంటున్నట్లు కనిపిస్తుంది.ఎక్స్‌లో 150 ఖాతాలు తొలగింపచేశారట. సుమారు 800 పోస్టులు తొలగించారట. చివరికి జడ శ్రవణ్ వంటివారు మీడియా సమావేశాలలో చేసే విమర్శల వీడియోలు కొన్నిటిని సైతం ఇండియాలో కనబడకుండా చేస్తున్నారంటే ప్రభుత్వం సోషల్ మీడియాకు ఎంత భయపడుతోందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ కొత్త ఐడియాను ప్రవేశపెట్టి టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులకు ఉపాధి స్కీము కింద ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టబోతున్నారన్నమాట. అంత మాత్రాన ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత తగ్గుతుందా? అన్నది సందేహమే!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబు సర్కార్ మరో దుర్మార్గం!
ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. ప్రశ్నిస్తున్న వాళ్లపై ఉక్కుపాదం మోపుతోందన్న విమర్శలు నానాటికీ పెరిగిపోతున్నాయి. తమ సమస్యల పరిష్కారం కోసం గళమెత్తిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు తాజాగా కేసుల రూపంలో షాక్ తగిలింది. ప్రభుత్వంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు విజయవాడకు తరలివచ్చిన ఉద్యోగులపై పోలీసు కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ‘చలో విజయవాడ’కు పిలుపునిచ్చారు. ఆదివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగులు విజయవాడకు చేరుకుని నిరసనలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఉద్యోగులతో పోలీసుల దౌర్జన్యంగా వ్యవహరించడంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లపైనే ఇప్పుడు కేసులు నమోదు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అనుమతులు లేకుండా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారనే కారణంతో సత్యనారాయణపురం పోలీసులు 46 మంది ఉద్యోగులపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం.తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు శాంతియుతంగా నిరసన తెలిపిన ఉద్యోగులపై కేసులు నమోదు చేయడంపై ఉద్యోగ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా.. న్యాయబద్ధమైన తమ డిమాండ్లు తెలియజేసేందుకు ప్రయత్నిస్తే కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కొంతకాలంగా తమ విధులు, పని భారం, సేవా సంబంధిత అంశాలపై పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ‘చలో విజయవాడ’ కార్యక్రమం నిర్వహించారు. తాజాగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లపైనా కేసులు నమోదు కావడంతో ఉద్యోగుల్లో మరింత ఆందోళన నెలకొంది.చలో విజయవాడలో పాల్గొన్నందుకు కేసులు నమోదు చేయడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమ సమస్యలపై నిరసన తెలిపిన ఉద్యోగులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఉద్యోగ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.ఇదీ చదవండి: నాదీ హామీ.. న్యాయం చేసి తీరతాం: వైఎస్ జగన్ -
సీపీకి ఆధారాలిచ్చాం.. లోకేశ్‌పైనా రౌడీషీట్ తెరవాల్సిందే!: అంబటి
సాక్షి, విజయవాడ: డీఎస్సీ నిరసన సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై నమోదు చేసిన కేసుల్ని ఎత్తేయాలని ఆ పార్టీ నేతలు నగర పోలీస్ కమిషనర్‌ను కలిశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు బృందాలుగా శుక్రవారం విజయవాడ పోలీస్ కమిషనరేట్‌కు వెళ్లి.. సీపీ రాజశేఖర్‌బాబుకు తమ వద్ద ఉన్న ఆధారాలతో వినతిపత్రం అందించారు. డీఎస్సీ ఆందోళనలో జరిగిన ఘటనలకు సంబంధం లేని వారిపైనా కేసులు పెట్టారని ఈ సందర్భంగా వారు సీపీ దృష్టికి తీసుకెళ్లారు.ఫిర్యాదు అనంతరం మాజీ మంత్రి, గుంటూరు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. డీఎస్సీ నిరసన సమయంలో వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు మితిమీరిన చర్యలకు పాల్పడ్డారని అన్నారాయన. ‘అక్రమ కేసుల వ్యవహారంపై సీపీని కలిసేందుకు వచ్చాం. మా నేతలు లెక్కలేనంత మందిపై కేసులు బనాయించారు. ఎక్కడికి రావాలో చెబితే అక్కడికి వచ్చిన విచారణకు హాజరవుతామని, అంతేగానీ ఇళ్ల మీదకు రావొద్దని విజ్ఞప్తి చేస్తూ పోలీసులకు ఓ వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్నాం అని అంబటి వ్యాఖ్యానించారు.‘‘విజయవాడలో మల్లాది విష్ణు ధర్నా చేస్తే దాడి చేశారు. దాడి చేసిన వారిపై ఒక్క కేసైనా పెట్టారా? కోడిగుడ్లతో దాడి చేసిన టీడీపీ వారిపై ఒక్క కేసు కూడా పెట్టలేదు. డీఎస్సీ నిరసనల విషయంలోనూ అంతే’’ అని ఆయన అన్నారు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టి చివరకు అభాసుపాలవుతున్నారని విమర్శించారు.‘పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించాలి’కోర్టులు అక్షింతలు వేసినా పోలీసుల తీరు మారడం లేదని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించాలని, రాజకీయ ఒత్తిళ్లకు లోబడి కేసులు పెట్టడం సరికాదని అన్నారు. డీఎస్సీ నిరసనకు సంబంధించిన కేసుల్లో సెక్షన్ 307 పెట్టారని.. అలాగే ఎస్సీ నేతలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కేసులు పెట్టడం ఆశ్చర్యకరమని అన్నారాయన. గాదె సాయికృష్ణ కేసును కూడా అంబటి ప్రస్తావించారు. ఈ కేసులో పోలీసులు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ విఫలమైందని తేల్చేశారాయన. ‘లోకేశ్‌పై కూడా రౌడీషీట్ పెట్టాలి’మంత్రి నారా లోకేశ్‌పై కూడా అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించేవారిపై చర్యలు ఉండాలని, ప్రజాప్రతినిధులపై రౌడీషీట్లు తెరవడం ఏ ప్రాతిపదికన జరుగుతోందని ప్రశ్నించారు. మంత్రి లోకేశ్‌పై మాముళ్ల దందా నడిపిస్తున్నారని.. ఆయనపై కూడా రౌడీషీట్ పెట్టాలని అంబటి అన్నారు. పోలీసులు సివిల్ వార్ కోరుకుంటున్నారా?: ఎమ్మెల్సీ యేసురత్నంమేం ముందుగా చెప్పి నిరసనకు వస్తే అసలు వాళ్లకు(టీడీపీ నేతలకు) ఎలా అనుమతి ఇచ్చారు. ఇవాళ ఒక ప్రభుత్వం ఉంటుంది.. రేపు మరొకటి వస్తుంది. పోలీసులు పొలిటికల్ పార్టీల ఉచ్చులో పడొద్దు. పోలీసులు అంతర్యుద్ధం కోరుకుంటున్నారా? ఎలాంటి కేసులు పెట్టాలో వాళ్లకు తెలియదా ?. ఎవరి ప్రోద్బలంతోనే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు పెడితే మీరే సమాధానాలు చెప్పాలి. యూనిఫారం వేసుకుని ఇలాంటి తప్పులు చేయవద్దు. అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ యేసురత్నం హితవు పలికారు. చంద్రబాబు, లోకేష్ డీఎస్సీ విషయంలో చేసిన తప్పులు బయటపడ్డాయి. తప్ప చేశామని ఒప్పుకోవాలి.. ఆ శాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి. దౌర్జన్యంతో డీఎస్సీ అంశాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మీ అధ్వర్యంలో జరిగిన డీఎస్సీ లో ఏం చేశారో అందరికీ అర్థమైంది. మేం తప్పు చేయలేదంటే సీబీఐ విచారణ చేయించుకుని కడిగిన ముత్యంలా బయటకు రండి. సాయికృష్ణ ఉదంతంలో పోలీసులను సుప్రీం కోర్టు చివాట్లు పెట్టింది. అసలు గతంలో మీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఊచకోతల వల్లే అట్రాసిటీ చట్టం వచ్చింది. తిరిగి ఆ చట్టాలు మామీద ప్రయోగం చేస్తున్నారు. దమ్ముంటే లోకల్ బాడీ ఎన్నికల్లో మామీద పోతే చేసి గెలవాలి. వ్యవస్థల్ని ధ్వంసం చేయాలి అనుకుంటే అది మిమ్మల్ని నాశనం చేస్తుంది అని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. పోలీసులు పక్షపాత వైఖరితో ముందుకు వెళ్తుంది. మా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అర్ధరాత్రి ఇళ్లలోకి వెళ్లిన మా పార్టీ నేతలను తీసుకువెళ్తున్నారు. ఆరోజు నిరసన కార్యక్రమాన్ని పోలీసు డ్రోన్లు మొత్తం పర్యవేక్షించాయి. నాపైన కేసులు పెట్టిన వారిపై దాడి చేసి ఉంటే ఆ కేసులు బయటపెట్టాలి. మా నిరసన దగ్గరకు అసలు టీడీపీ వాళ్ళు ఎలా వచ్చారు. మాపైన దాడి చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. డీఎస్సీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు టీడీపీ వాళ్ళతో మాపై దాడి చేయించారు. మేం అడుగుతుంది ఒక్కటే డీఎస్సీపై సీబీఐ విచారణ జరగాలి.. లోకేష్ రాజీనామా చేయాలి. నిరుద్యోగుల పక్షాన వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుంది. మీరు ఫైనల్ గా కేసుల్లో ఉన్నవారి లిస్ట్ ఇవ్వండి.. అందరం స్టేషన్ దగ్గరకు వస్తాం. పోలీసులు మీ తీరు మార్చుకోకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అల్టిమేటం జారీ చేశారు. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై విచారణ కోరుతూ సెప్టెంబర్ 21న విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ ఆందోళన చేపట్టింది. ఆ సందర్భంగా టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీ శ్రేణులపై దుర్మార్గంగా దాడులు జరిపారు. అనంతరం వైఎస్సార్సీపీ నేతలపైనే ఆశ్యర్యకరరీతిలో భారీగా కేసులు నమోదు కావడం కొసమెరుపు.ఇదీ చదవండి: పాత బండ్లకు కొత్త స్టిక్కర్లు.. ఓరీ నీ బిల్డప్ తగలేయ్యా! -
బాబూ.. అమరావతిలో అసలు లెక్కేంటి?
ఎవరైనా వెయ్యి రూపాయలతో అయ్యే పనికి ఐదువేలో, పది వేలో ఖర్చు చేస్తారా? అలా చేస్తామని అంటే జనం ఏమని అనుకుంటారు? అయితే చేతకాని తనమన్నా కావాలి. లేదా ఏదైనా స్వార్ధ ప్రయోజనం ఉండి ఉంటుందని అనుకోరా? సరిగ్గా ఇదే రీతిలో ఏపీ రాజధాని అమరావతి గ్రామాలలో జరుగుతోందనిపిస్తోంది.కొత్త ఎయిర్ పోర్టు కోసం ఇరవై వేల ఎకరాలు, రైల్వే లైన్, గ్రిడ్ రోడ్డు విస్తరణ వంటి కోసం 6212 ఎకరాలు తీసుకుంటారట. ఎయిర్ పోర్టుకు ఐదువేల ఎకరాలు సరిపోతుంది. కాని నాలుగురెట్లు ఎక్కువగాను, రైల్వేలైన్, తదితర అవసరాలకు 1581 ఎకరాలు చాలు. కాని నాలుగు రెట్లు అదనంగా పూలింగ్ చేస్తారట. ఇప్పటికే విజయవాడ సమీపంలోని గన్నవరం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. గతంలో దాని విస్తరణకు రైతులనుంచి భూములు తీసుకున్నారు. ఆ రైతులందరికి పూర్తి స్థాయి న్యాయం జరగలేదని ఈ మధ్యనే ఎయిర్ పోర్టు వద్ద ధర్నా కూడా జరిగింది.అయితే కొంతమంది పలుకుబడి కలిగినవారు ఈ భూములకు బదులు అమరావతి ప్రాంతంలో విలువైన ప్లాట్లు పొందారని కూడా చెబుతారు. దీనిని పక్కనబెడితే కూటమి ప్రభుత్వానికి లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా, కొత్తగా మరో విమానాశ్రయం కట్టాలన్న ఆలోచన వచ్చింది. అది కూడా విజయవాడ, గుంటూరులకు సుదూరంగా ఉండే మారుమూల గ్రామాలలో కావడం విశేషం. ఇందుకోసం ఐదువేల ఎకరాలు అవసరమట. కాని 20వేల ఎకరాలు సేకరించవలసి ఉంటుందని పురపాలక శాఖ మంత్రి పీ.నారాయణ ప్రకటించారు. అదేమిటి? నాలుగు రెట్లు అధికంగా భూములు తీసుకోవడం ఏమిటన్న సందేహం ఎవరికైనా రావచ్చు. దానికి ఆయన ఇచ్చిన జవాబు ఏమిటంటే 20వేల ఎకరాలు తీసుకుంటే ప్రభుత్వానికి ఐదువేల ఎకరాలే మిగులుతుందట. మిగిలిన భూమిలో ప్లాట్లు అభివృద్ది చేసి రైతులకు ఇవ్వవలసి ఉంటుందట. అలాగే విద్యాసంస్థలు, ఆస్పత్రులు ఇతర అవసరాలకు కేటాయించాలట. ఇదే ప్రకారం రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, గ్రిడ్ రోడ్లకు కూడా తీసుకుంటారట.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో కేంద్రానికి రాసిన ఒక లేఖ ప్రకారం ప్లాట్ల అభివృద్దికి ఎకరాకు రెండు కోట్లు వ్యయం అవుతుంది. అది ఇప్పుడు మరికొంత పెరిగిందేమో తెలియదు. ఈ రకంగా చూస్తే ఎయిర్ పోర్టు భూమి పోను మిగిలిన 15వేల ఎకరాలనే పరిగణనలోకి తీసుకుంటే ఎకరాకు మినిమమ్ రెండు కోట్ల చొప్పున ముప్పైవేల కోట్ల వ్యయం అవుతుందన్నమాట. ఇంత భారీ వ్యయం చేసే బదులు అవసరమైన ఐదువేల ఎకరాలకు రెండు కోట్ల చొప్పున లెక్కగట్టి ఇస్తే పదివేల కోట్లు సరిపోతుంది కదా!లేదా మూడు కోట్లు ఇచ్చినా 15వేల కోట్లు అవుతుంది.రైల్వే లైన్ తదితర అవసరాలకోసం ఈ ప్రకారం లెక్కవేస్తే ప్లాట్ల అభివృద్దికే 18వేల కోట్లు అవుతుంది. కాని కొనుగోలు చేస్తే పది, పన్నెండువేల కోట్లు మించి కాకపోవచ్చు. దీనిని వదలి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ మాదిరి ఎందుకు భూములు సేకరిస్తున్నట్లు? రైతులకు ప్లాట్ల అభివృద్ది జరిగే వరకు కౌలు రూపేణా, రుణాల మాఫి రూపేణా, ఇతరత్రా కోట్ల రూపాయల మెత్తాలను వెచ్చించవలసి ఉంటుంది. దీనిని బట్టి ఏం అర్దం అవుతుంది. వెయ్యి రూపాయల ఖర్చు అయ్యేదానిని మూడు, నాలుగు రెట్లకు పెంచుతున్నారనిపించదా? ప్రభుత్వం ఏదో రకంగా దీనిని సమర్ధించుకోవచ్చు. కానీ అందులో హేతుబద్దత ఎంత అన్నదే చర్చ.ఇదీ చదవండి: నాడు ప్రశంసలు.. నేడు విమర్శలు.. బాబుకు కొత్త ఆందోళన!హైదరాబాద్ శంషాబాద్ వద్ద రైతుల నుంచి భూములను ప్రభుత్వం తీసుకుని పరిహారం చెల్లించిన అనుభవం ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం పూలింగ్ వైపే వెళుతోంది. రైతుల నుంచి భూములు తీసుకోవడంతో పచ్చని పంట పొలాలను నాశనం చేయడం ఒక ఎత్తు అయితే, వారి వద్దే భూములు ఉంటే ఎప్పుడైనా తమకు నచ్చిన రేటుకు అమ్ముకునే అవకాశం ఉండడం మరో ఎత్తుగా ఉంటుంది. వీటన్నిటిని కాదని ప్రభుత్వం భూములు తీసుకోవడం, నిర్మాణాల పేరిట వేల కోట్ల రూపాయలను అప్పు తెచ్చి మరీ వ్యయం చేయడంపై విమర్శలు వస్తున్నాయి.మాజీ మంత్రి, రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ ఐఎఎస్, లిబరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయకుమార్ తదితరులు ముందుగా ఇప్పటికే తీసుకున్న భూమిని అభివృద్ది చేయకుండా కొత్తగా భూములు తీసుకోవడం ఏమిటని, పలు అనుభవాల రీత్యా చంద్రబాబునునమ్మడం ఎలా అని ప్రశ్నించారు. రెండో దశ భూ సేకరణ అంటే అవినీతికోసమేనని మరో మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కొంతకాలం క్రితం ఆరోపించారు. ఎవరు ఎన్ని హితోక్తులు చెప్పినా, విమర్శలు చేసినా.. ప్రభుత్వం మాత్రం తగ్గడం లేదు. ఆయా భవనాల నిర్మాణానికి పెడుతున్న వ్యయం చూస్తే ఎవరికైనా దిమ్మదిరగాల్సిందే.శాశ్వత సచివాలయ టవర్ల అద్దాలకు 2455 కోట్లు వ్యయం చేయబోతున్నారు. ఇందులో తొలుత ఉన్న అంచనా వ్యయం కన్నా 500 కోట్లు అధికంగా ఉందని మీడియాలో వార్తలు వచ్చాయి. అమరావతిలో విద్యుత్ సరఫరాను ప్రైవేటుకు అప్పగించాలన్నది మరో ఆలోచనట. దీనిపై నివేదికలు తయారు చేయడానికి టెండర్లు పిలిచారు. ఇప్పటికే వేల కోట్ల వ్యయం చేసి అండర్ గ్రౌండ్ విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థను సీఆర్డిఏ తయారు చేస్తోంది. అంతా సిద్దం అయ్యాక ప్రైవేటువారికి దీనిని అప్పగిస్తారా? లేక ముందే ప్రైవేటుకు అప్పగిస్తారా? అన్న చర్చ జరుగుతోంది. ఇదంతా వినియోగదారులపై భారం కాదా అన్నది కొందరి సందేహం.అమరావతి చుట్టూరా అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేయాలన్నది మరో ప్రతిపాదన. కేంద్రం దీనిపై కొన్ని అభ్యంతరాలు చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. సుమారు 30వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా అయితే ఇందులో రాష్ట్రం కూడా నాలుగువేల కోట్లకు పైగా భరించాల్సి ఉంటుందట. అసెంబ్లీ కొత్త భవనాన్ని నిర్మించడంలో భాగంగా కేవలం భవన శిఖరం(డూమ్) నిర్మాణానికి 660 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేశారట. పార్లమెంటు కొత్త భవనం, తెలంగాణ సచివాలయంలకు పెట్టిన ఖర్చుతో పోల్చితే ఏపీ ఖర్చు గుండె బేజారెత్తిస్తుందని చెప్పాలి.కొండవీటి వాగు వరదనుంచి రక్షణ పొందడానికి కొన్నివందల కోట్లు వ్యయం చేస్తున్నారు. కృష్ణానది కుడి కరకట్ట విస్తరణకు 443 కోట్లు వెచ్చించబోతున్నారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సెంట్రలైజ్డ్ కూలింగ్ వ్యవస్థ కోసం 415 కోట్లు పెట్టబోతున్నారు. గవర్నర్ నివాస భవన సముదాయానికే 200 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా అట. అమరావతిలో పెడుతున్న ఖర్చులో ఇవి కొన్నే. ఇందులో దుబారా, అవినీతిపై ఎవరైనా ప్రశ్నించినా పట్టించుకునే దశలో చంద్రబాబు సర్కార్ లేదు. మొత్తం రాష్ట్ర ప్రజలందరినుంచి వసూలు చేసే పన్నులలో నుంచే అమరావతి అప్పులను తీర్చవలసి ఉంటుంది. ఒకపక్క ఎల్ నినో కారణంగా కరువు తాండవిస్తుంటే, మరో పక్క అమరావతిలో వేల కోట్ల రూపాయలను విచ్చలవిడిగా వెచ్చించడం న్యాయమా అని సామాన్యుడు ప్రశ్నించినా వినే నాధుడు లేడు.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పవన్‌ను దించేసి.. ఎమ్మెల్యేను ఎక్కించారు!
ప్రొద్దుటూరు(వైఎస్ఆర్ జిల్లా ): అధికారంలో ఎవరుంటే వారి కాళ్ల కింద తివాచీ పరచడం, సీట్లలో ఎవరు కూర్చుంటే వారి ఫొటోలకు దండలేయడం కొందరు అధికారులకు వెన్నతో పెట్టిన విద్య. ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ కూడా ఇప్పుడు ఇదే ‘రాజకీయ భక్తి’ మార్గంలో నడుస్తూ బ్యూరోక్రసీ చరిత్రలోనే నిలిచిపోయే సరికొత్త వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. కమిషనర్ ఛాంబర్లో రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటో ఉండేది. అయితే స్థానిక కూటమి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డిపై ఉన్న అమితమైన ‘ప్రేమ’ కొద్దీ, పవన్ ఫొటోను గుట్టుచప్పుడు కాకుండా పక్కనబెట్టి.. అదే స్థానంలో ఎమ్మెల్యే ఫొటోను తగిలించేశారు. ప్రభుత్వ ప్రొటోకాల్‌ను, నిబంధనలను బూజు పట్టిన కాగితాల్లా పక్కన పారేసి, స్థానిక బాస్‌ను ప్రసన్నం చేసుకునేందుకు కమిషనర్ పడిన తాపత్రయం అంతా ఇంతా కాదు. నెటిజన్ల షాక్.. కమిషనర్ యూ–టర్న్ డ్రామా అయితే, ఈ ‘ఫొటో మార్పిడి’ వ్యవహారాన్ని గమనించిన కొందరు నెటిజన్లు శుక్రవారం ఉదయం సోషల్ మీడియాలో కమిషనర్ అత్యుత్సాహంపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ మొదలుపెట్టారు. డిప్యూటీ సీఎం ఫొటో తీసేసి ఎమ్మెల్యే ఫొటో పెట్టడం ఏ చట్టంలో ఉందంటూ నెటిజన్లు ప్రశ్నించేసరికి కమిషనర్‌కు ఒక్కసారిగా చెమటలు పట్టాయి. వెంటనే తప్పు తెలుసుకున్న ఆయన.. పక్కన పారేసిన పవన్ కళ్యాణ్ ఫొటోను చకచకా తెచ్చి మళ్లీ పాత స్థానంలోనే తగిలించారు. అంతటితో ఆగకుండా, ఆ ఫొటోకు భక్తిశ్రద్ధలతో సెల్యూట్ చేస్తూ.. ‘సెల్యూట్ బాస్.. మనది విడదీయరాని బంధం, గుండెల్లో గూడు కట్టుకున్న అనుబంధం. అందుకో నా సెల్యూట్ బాస్.. మా పవన్ బాస్’ అంటూ తన అధికారిక సోషల్ మీడియా గ్రూపుల్లో కవిత్వాలు, పోస్టులు గుప్పించారు. రాజకీయాలు చేయాలనుకుంటే రాజీనామా చెయ్: ప్రజా సంఘాల ఆగ్రహం మున్సిపల్ కమిషనర్ హోదాలో ఉండి ఒక రాజకీయ నాయకుడిలా పవన్ కళ్యాణ్‌కు ఈ స్థాయి భజన చేస్తూ ఎలా పోస్టులు పెడతారంటూ దీనిపై ప్రజా సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి.ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ మాదిగ, జాతీయ మాలమహానాడు అధ్యక్షుడు గోసా మనోహర్, దళిత సంఘం నాయకుడు ఎమ్మన్యుయేల్ కమిషనర్ వ్యవహార శైలిపై నిప్పులు చెరిగారు. కూటమి నేతలపై అంతగా ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి, నేరుగా ఆ పార్టీల్లో చేరి జెండాలు మోసుకోవాలని ఘాటుగా విమర్శించారు. మరో తప్పు.. అంబేద్కర్‌తో పోలికా?! ప్రజా సంఘాల నుంచి విమర్శలు మరింత ముదరడంతో కమిషనర్ కంగారులో మరో తప్పిదానికి తెరలేపారు. ఈ వివాదాన్ని డైవర్ట్ చేయడానికి.. తాను గతంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నమస్కరిస్తున్న ఒక పాత ఫొటోను తీసుకొచ్చి మళ్లీ అదే గ్రూపులో పోస్ట్ చేశారు. ఈ చర్యతో ప్రజా సంఘాల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దేశానికి రాజ్యాంగం రాసిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్‌ను, ఒక రాజకీయ పార్టీ నాయకుడైన పవన్‌కళ్యాణ్‌ను ఒకే తాటిపై తెచ్చి పోలుస్తారా?ఎంతటి అజ్ఞానం అంటూ వారు తప్పుబ ట్టారు. కుర్చీ కాపాడుకోవడానికి ప్రొటోకాల్‌ను ఖూ నీ చేసి,దొరికిపోయాక కవర్ చేసుకోవడానికి అంబేద్కర్ ను వాడుకుంటున్న కమిషనర్ తీరుపై ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ సాగుతోంది. ఇదీ చదవండి: టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డికి భారీ షాక్ -
కాకుమాను మృతి తీరని లోటు.. వైఎస్సార్సీపీ నేతల నివాళులు
సాక్షి, ప్రకాశం: వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ హఠాన్మరణం.. ఏపీ రాజకీయ శ్రేణుల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గుర చేసింది. గుండెపోటుతో హైదరాబాద్ నివాసంలో ఆయన కన్నుమూశారు. ఆయన మృతికి సంతాపంగా పార్టీకి సంబంధించిన కొన్ని కార్యక్రమాలను వాయిదా వేశారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన పార్థివదేహానికి పార్టీ కీలక నేతలు నివాళులర్పించారు.ఒంగోలులోని క్లోపేటలో రాజశేఖర్ భౌతికకాయానికి రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి నివాళులర్పించారు. కాకుమాను మృతి వైఎస్సార్సీపీకి తీరని లోటని చెప్పారాయన. పార్టీ బలోపేతానికి రాజశేఖర్ ఎంతో కృషి చేశారని, కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారని గుర్తుచేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.రాజశేఖర్ పార్టీ వ్యవహారాల్లో అత్యంత క్రియాశీలకంగా పనిచేశారని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త(కోఆర్డినేటర్) సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. వ్యక్తిగతంగా తాను మంచి స్నేహితుడిని కోల్పోయానని, అలాగే పార్టీకి ఇది పూడ్చలేని లోటని అన్నారు. రాజశేఖర్ కుటుంబాన్ని త్వరలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శిస్తారని తెలిపారు. పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించినందుకే..ఇటీవల విజయవాడలో డీఎస్సీ అంశంపై పార్టీ చేపట్టిన నిరసన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై సజ్జల, వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. పోలీసులు కాకమాను రాజశేఖర్‌ను తోపులాట పేరిట ఛాతిపై బలంగా నొక్కారని.. కిందపడేసి మరీ ఆ పనే చేశారని అంటున్నారు. ఆ ఘటన తర్వాత ఒత్తిడికి గురై ఆయనకు గుండెపోటు వచ్చిందని పేర్కొన్నారు. -
గవర్నర్ ఆశ్చర్యపోయారు: అంబటి
సాక్షి,గుంటూరు: ‘‘డీఎస్సీ స్కామ్‌లో తప్పిదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇలా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ స్కాం రాష్ట్రంలో సంచలనంగా మారింది’’ అని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్.. డీఎస్సీలో జరిగిన స్కాం గురించి చెబుతుంటే గవర్నర్ ఆశ్చర్యపోయారన్నారు. చదువుకున్న వారికి ఉద్యోగాలు రావాలి.. వారి కోసం పోరాటం కొనసాగిస్తామని అంబటి అన్నారు.‘‘డీఎస్సీలో అన్యాయం జరిగిందని విజయవాడ శాప్ కార్యాలయం వద్ద నిరసన తెలిపాం. బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేసినట్లు మా నాయకులు, కార్యకర్తలపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తే చూస్తూ ఊరుకోం. 21వ తేదీన ఆందోళన చేస్తామని కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చాం. అక్కడకు వాళ్లు చెబుతున్న గురువులు ఎందుకు వచ్చారు?. లోకేష్ దళం మాపైన దాడి చేస్తే పోలీసులు మాపైన కేసులు పెట్టారు. కొంతమంది పోలీసులు లోకేష్ చెప్పినట్లు చేస్తున్నారు. వాళ్లు పోలీసులు రూపంలో ఉన్న రౌడీలు’’ అంటూ అంబటి దుయ్యబట్టారు.డీజీపీ, సీపీకి చెప్తున్నా.. మీకు ఎవరెవరు కావాలో పేర్ల లిస్టు ఇస్తే వాళ్లందరం ప్రత్యేక బస్సుల్లో విజయవాడ కమిషనర్ కార్యాలయానికి వస్తాం. మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయండి. రాత్రిపూట దొంగచాటుగా కోర్టులో హాజరు పరచడానికి సిగ్గుండాలి. ఎస్సీలుపైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి పోలీసులకు సిగ్గుండాలి. నన్ను ఇవాళ విచారణకు రమ్మని ఈడీ చెప్పలేదు’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆరోగ్యశ్రీలో వికసించిన 'అవినీతి' -
నాడు ప్రశంసలు.. నేడు విమర్శలు.. బాబుకు కొత్త ఆందోళన!
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి. గతంలో వైఎస్సార్సీపీ పాలనను వ్యతిరేకించే విధంగా వ్యవహరించిన కొందరు మేధావులు, మాజీ అధికారులలో మార్పు కనిపిస్తోంది. రాజకీయాలకు దూరంగా ఉన్న మరికొంతమంది సైతం ప్రభుత్వంపై స్పందిస్తున్న తీరు ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.గతంలో న్యాయాధికారిగా పనిచేసి జడ శ్రవణ్‌కుమార్ ఇటీవలికాలంలో కూటమి ప్రభుత్వ వైఖరిని తూర్పారాపడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన గత ప్రభుత్వ టైమ్‌లో అమరావతి తదితర అంశాలలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి పని చేశారు. వివిధ ఆందోళనలలో పాల్గొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే ఆయన విసిగిపోయారు. సొంత రాజకీయ పార్టీని స్థాపించుకుని పనిచేస్తున్న శ్రవణ్ ప్రజా సమస్యలపై గళం విప్పారు. ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలను కూడా వెలుగులోకి తెస్తున్నారు.చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో అరెస్టు అయినప్పుడు బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తికి, ఆయన రిటైర్ అయ్యాక లోకాయుక్త పదవిని ఇవ్వడాన్ని తీవ్రంగా ఆక్షేపించి శ్రవణ్ న్యాయపోరాటానికి సిద్దం అయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పని విధానంపై విరుచుకుపడుతున్నారు. మంత్రి నారా లోకేష్‌పై అవినీతి అభియోగాలు మోపుతూ మీడియా సమావేశాలు పెడుతున్నారు. డీఎస్సీ అక్రమాలు వెలుగులోకి వచ్చిన తొలినాళ్లలో శ్రవణ్ అంతగా స్పందించలేదు. అందులో అక్రమాలు ఉన్నాయా? లేదా? అన్న సందేహం ఆయనకు వచ్చినట్లు ఉంది.కాని గత కొద్ది రోజులుగా ఆయనకు వచ్చిన ఆధారాల మేరకు డీఎస్సీపై అవకతవకలపై విరుచుకుపడుతున్నారు. ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లతో ఉద్యోగాలు పొందినవారికి సంబంధించి అక్రమాలు జరిగాయని ఆయన చెబుతున్నారు. క్రీడా కోటాలో అనర్హులకు టీచర్ ఉద్యోగాలు వచ్చాయని వైఎస్సార్సీపీ గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. జై భీమ్ పార్టీని స్థాపించిన జడ శ్రవణ్ కూటమికి అధినేతలకు దూరం అవడమే కాకుండా, స్వతంత్రంగా ఆ ప్రభుత్వంపై విమర్శలు సందిస్తున్నారు.మరో రిటైర్డ్ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కూటమి ప్రభుత్వంపై ఈ స్థాయిలో విమర్శలు చేస్తారని రెండేళ్ల క్రితం ఎవరూ ఊహించి ఉండరు. కూటమి అధికారంలోకి రాగానే ఈయనకు కీలకమైన పదవి వస్తుందని చాలామంది అనుకున్నారు. కాని అనూహ్యంగా ప్రాధాన్యత లేని పోలీస్ హౌసింగ్ సంస్థ చైర్మన్ పదవిని చంద్రబాబు ఇచ్చారు. ఇది ఒక రకంగా అవమానించడమేనని ఆయన సన్నిహితులు చాలామంది బాధపడ్డారు. అయినా చంద్రబాబు కాని, షాడో ముఖ్యమంత్రిగా ఉన్న మంత్రి లోకేష్ గాని పట్టించుకున్నట్లు లేదు. ఆ తర్వాత క్రమేపి ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలపై ఏబీవి కూడా ధ్వజమెత్తడం ఆరంభించారు. ముఖ్యంగా 22-ఎ నిషేధిత భూముల జాబితా విషయంలో ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. సీతమ్మవారిని రావణాసురుడు అపహరించుకుపోయినట్లు భూములను ప్రభుత్వంలోని వారు ఎత్తుకపోయారని గళమెత్తారు. అమరావతి రెండో దశ భూ సమీకరణ అంతా అవినీతే అని ఆయన స్పష్టం చేశారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో చేసిన ఒక వ్యాఖ్య కూడా గమనించదగిందే. రాష్ట్రంలో సహకార డెయిరీ రంగం మూల పడుతోందని ఆయన అన్నారు. సహకార డెయిరీ రంగం 'మూడు " పువ్వులు, అనేకానేక కాయలు అంటూ వ్యంగ్యాస్త్రం విసిరారు.ఇదీ చదవండి: బాబూ.. ఏపీలో కొత్త సంస్కృతికి తెర లేపారా?అలాగే ఒక ప్రముఖ టీవీ యాజమాన్యంలో మార్పుల గురించి కూడా ఆయన కామెంట్ చేశారు. అది అసలు వార్తే కాదట.. కొనుక్కుని చదివే పాఠకులు వర్సెస్ ప్రకటనలు విసిరే పాలకులు.. ఎవరి ప్రయోజనాలు ముఖ్యం అని ఆయన ప్రశ్నించారు. ఏవి తల్లి నాడు విరిసిన విలువలు, అభ్యుదయాలు? అని ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ఈటీవిని టీడీపీకి చెందిన ముఖ్యనేతలలో ఒకరు తన అధీనంలోకి తీసుకున్నారని ప్రచారం అవుతున్న పరిస్థితిలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు.మరో సీనియర్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు కూడా చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు కోడలు, లోకేష్ సతీమణి అయిన నారా బ్రాహ్మణి ఎక్స్‌లో చేసిన ఒక పోస్టుపై ఆయన ఘాటుగా స్పందించారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టు అయి 53 రోజులు జైలులో ఉండి విడుదలై మూడేళ్లు అవుతున్న సందర్భంగా నిజం గెలిచింది అంటూ, 53 కొవ్వొత్తులు వెలిగించిన వీడియోని ఆమె పోస్టు చేశారు.ఈ పోస్టుపై నాగేశ్వరరావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రెండొ, ఇరవైరెండెకరాలతోనో 1970వ దశకంలో రాజకీయ జీవితం ఆరంభించి, ప్రస్తుతం దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా తెలుగుజాతికి అపఖ్యాతి తీసుకువచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబును నిస్వార్థ అవినీతిపరుడు అని కూడా ఎద్దేవ చేశారు. ఆత్మగౌరవం కోసం పోరాడిన తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ.రామారావుకు వెన్నుపోటు పొడిచారని కూడా ఆయన విమర్శించారు. ఏపీ విభజనకు లేఖ ఇవ్వడంతో తెలుగుజాతికి తీరని ద్రోహం చేశారని చంద్రబాబుపై నాగేశ్వరరావు మండిపడ్డారు.మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ విశాఖపట్నం ప్రాంతంలో ఇబ్బడి ముబ్బడిగా డేటా సెంటర్లు పెట్టడానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించారు. అమెరికా వంటి దేశాలు డేటా సెంటర్లను వదలించుకుంటుంటే, ఇండియా వంటి దేశాలు ఎదురు రాయితీలు ఇచ్చి తెచ్చుకోవడం ఏమిటని అన్నారు. అందులో విశాఖలో వీటిని అధికంగా ఏర్పాటు చేయడం వల్ల వచ్చే నీరు, విద్యుత్ సమస్యలను ఆయన ప్రస్తావించారు.ఇంకో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ఏపీ పోలీసులు ఎఫ్‌బీఐ పేరుతో మెటాకు ఫిర్యాదు చేసి సోషల్ మీడియా పోస్టులను తొలగించడంపై అసహనం వ్యక్తం చేశారు. దీనిని నేరపూరిత దుష్ప్రవర్తనగా ఆయన అభివర్ణించారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి విజయకుమార్ డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. వీరే కాదు. మరికొందరు మేధావులు కూడా ప్రభుత్వంలో జరుగుతున్న వివిధ అక్రమాలు, వివాదాస్పద అంశాలపై ప్రజలను చైతన్య పరుస్తున్న తీరు స్వాగతించదగిందే!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మీ ఆధిపత్య పోరు ఏంటి?
పిఠాపురం: ఎక్కడా లేనివిధంగా తాను పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే.. మీరు ఆధిపత్యపోరుకు దిగుతున్నారేమంటూ ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ జనసేన కేడర్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిని ఎలా సెట్ చేయాలో తనకు తెలుసంటూ హెచ్చరించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో మంగళవారం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. మూడునెలల్లో పిఠాపురంలో తన క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. జీవనగర్‌లో శ్మశానవాటిక కోసం పవన్‌ను కలిసేందుకు వెళ్లిన ఎంఆర్పీఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎంఆర్పీఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. నలుపు రంగు డ్రెస్గానీ, చీరగానీ ధరించి పవన్‌కళ్యాణ్ సభకు వచ్చినవారిని పోలీసులు అనుమతించలేదు. కొందరు మహిళలు ధరించిన నలుపు రంగు చున్నీలను తీసేయించి సభలోకి అనుమతించారు. చున్నీలను తొలగించమనడం తమను అవమానించడమేనని మహిళలు ఆవేదనతో చెప్పారు. ఇదీ చదవండి: కర్నూలు మహిళా కూలీకి దొరికిన వజ్రం! -
బాబూ.. ఏపీలో కొత్త సంస్కృతికి తెర లేపారా?
ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న పరిణామాలు ఎవరికైనా ఆవేదన కలిగిస్తాయి. ఈవీఎంలు మాయ కాకుండా నిజంగానే ప్రజల ఓట్లతోనే బీజేపీ, టీడీపీ,జనసేన కూటమి గెలిచి ఉంటే ఇంత అరాచకంగా, అధ్వాన్నంగా పాలన సాగిస్తుందా?అన్న సందేహం రోజురోజుకు బలపడుతోంది. విజయవాడలో స్పోర్ట్స్ అధారిటీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన ధర్నా చేయడానికి వెళ్లినప్పుడు వారిపై దాడి జరిగిన తీరు, తదుపరి అరెస్టులు, కేసులు వారిపైనే పెట్టిన వైనం గమనిస్తే , ఏపీలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు నిజాలు మాట్లాడుతూ ప్రజలకు ఒక మంచి సందేశం ఇవ్వాలి. కాని దురదృష్టవశాత్తు చంద్రబాబు అందుకు విరుద్దంగా నిత్యం అబద్దాలు చెబుతూ, ఏపీని అబద్దాల సమాజంగా మార్చుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. విషయం చిన్నదైనా, పెద్దదైనా ఏదో ఒక అసత్యం చెబితే సరిపోతుందన్న ధోరణితో ఆయన సాగుతున్నారన్న భావన ఏర్పడుతోంది. విజయవాడలో వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడి జరిగితే ఆయన గురువులపై వైఎస్సార్సీపీ గూండాలు దాడి చేశారని కుప్పంలో స్పీచ్ ఇచ్చారు. ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి అసలు టీడీపీ వారు కాని, టీచర్ల పేరుతో వచ్చిన గూండాలు కాని, లోకేష్ యువగళానికి చెందినవారుకాని చేసిన దుశ్చర్యల గురించి మాట మాత్రం రాయకుండా వైఎస్సార్సీపీ వారే దాడులు చేశారన్నట్లుగా తెగబడి రాశాయంటే ఏమిటి అర్దం?. డీఎస్సీ అక్రమాల కేసు ఆధారాలతో సహా బయటపడటంతో ఏం చేయాలో దిక్కుతోచక ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్న భావన కలగదా!. ఒక వేళ ఈ ఘటనలో వైఎస్సార్సీపీ వారి వైపు నుంచి కూడా ఏదైనా తప్పు ఉంటే అది రాయవచ్చు. అలాగే టీడీపీ వారు ఎందుకు అలా అరాచకంగా ప్రవర్తించారో తెలియచేయాలి. అదేమీ లేకుండా పూర్తి ఏకపక్షంగా కదనాలు ప్రచారంలోకి తెచ్చారంటే విద్యా శాఖ మంత్రి లోకేష్ ను ఈ స్కామ్ నుంచి బయట వేయడానికి ఎదురుదాడి ఒకటే మార్గమని ఎంచుకున్నట్లు అనిపించదా!అధికారం ఉంది కనుక ,పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారి నిష్పక్షపాతంగా పనిచేయడం మానివేసింది కనుక దాడులకు గురైనవారిపైనే కేసులు పెట్టవచ్చు. వారిని అరెస్టు చేయవచ్చు. అంతమాత్రాన ప్రభుత్వం ఎస్కేప్ అయిపోతుందని అనుకుంటే పొరపాటు.ఎందుకంటే సోమవారం నాటి ఈ ఏపీసోడ్ మొత్తం ప్రభుత్వ బలహీనతను బయటపెట్టింది. డీఎస్సీ అక్రమాలపై మరిన్ని అనుమానాలు పెంచింది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ దర్నాకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించడమే ఆశ్చర్యం. అంత ప్రమాదం ఏమి వచ్చిందని వారి నిరసనకు అనుమతి ఇవ్వలేదు? అయినావైఎస్సార్సీపీ నిరసనపై ముందుకు వెళ్లింది. అలా గతంలో విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు పలుమార్లు పోలీసులను తోసుకుంటూ ముందుకువెళ్లలేదా? అనివైఎస్సార్‌సీపీ వారు ప్రశ్నిస్తున్నారు. తాము శాంతియుతంగా ధర్నా చేస్తే తప్పేమిటన్నది వారి వాదన. డీఎస్సీ అభ్యర్దుల పేరుతో ప్రభుత్వం చేయించిన ర్యాలీలకు ఎలా పర్మిషన్ లభించింది?అంటే చట్టం అన్ని పక్షాలకు ఒకరకంగా ఉండడం లేదన్న విషయం అర్ధం అవుతూనే ఉంది కదా? టీడీపీ కార్యకర్తలు,గూండాలు, టీచర్ల ముసుగులో వచ్చిన రౌడీలు శాప్ కార్యాలయ ఆవరణలోకి ఎలా వెళ్లారు? అక్కడ వారికి షామియానాలు, కుర్చీలు వేసి ఎలా సదుపాయాలు కల్పించారు. వైఎస్సార్సీపీ నేతలు నిరసన నిమిత్తం అక్కడకు వెళితే వారు ఎలా ఎగబడ్డారు? కొందరైతే పోలీసుల నుంచి లాఠీలు లాక్కుని మరీ దాడి చేశారట. నోటికొచ్చిన బూతులతోవైఎస్సార్సీపీ నేతలను తిట్టారట. ఎంత వీలైతే అంత వైఎస్సార్సీపీ వారిని రెచ్చగొట్టారన్నమాట. అలా చేసినప్పుడు ఎవరైనా కొంతమంది ఆవేశపడుతుంటారు. అప్పుడు వారికి రౌడీ ముద్ర వేసి ప్రచారం చేస్తారన్నమాట. దాడులలో గాయపడ్డది వైఎస్సార్సీపీ నేతలు కదా!అయినా వారిపైనే కేసులు పెట్టారు. పైగా కొందరిపై హత్యాయత్నం కేసు వరకు పెడుతున్నారట. పోనీ దాడులు చేసిన టీడీపీవారిపై కూడా కేసు పెట్టారా అంటే అలాంటిదేమీ లేదట. టీడీపీ పక్షాన గూండాయిజం చేసిన కొందరు తాము యువగళం టీమ్ అని ఓపెన్ గానే చెప్పుకున్నారే. ఎల్లో మీడియా ఈ ఉదంతం మొత్తాన్ని వక్రీకరించి ప్రచారం చేసే క్రమంలో తొలుతటీడీపీవారిపైనే వైఎస్సార్సీపీ దాడి అని స్టోరీలు ప్రచారం చేసింది.కాని అంతలో వారికి కొత్త ఐడియా వచ్చినట్లు ఉంది. టీడీపీ వారిపైన దాడి అంటే,వైఎస్సార్సీపీ నిరసన సమయంలో వారు అక్కడ ఎందుకు ఉన్నారని జనం అనుకుంటారని భావించి మొత్తం కధను మార్చి గురువులపై దాడి అని కొత్త స్టోరీ అల్లారట. ముఖ్యమంత్రి సైతం ఇదే ప్రకారం ఉపన్యాసం ఇచ్చారు. అంటే ఇదంతా ప్లాన్ ప్రకారం చేశారని అర్ధం అవుతోంది కదా! గొడ్డలి పార్టీ అని చంద్రబాబువైఎస్సార్సీపీని ఉద్దేశించి అంటే, వెన్నుపోటు పార్టీ టీడీపీ అని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. ఇదంతా చంద్రబాబుకు గౌరవం అయిన సంగతేనా? అర్హులైన టీచర్ అభ్యర్ధులకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు ప్రసంగంలోని కొన్ని అంశాలు చూడండి.క్రీడా కోటాలో తప్పులు జరిగాయని, ఆ ఉపాధ్యాయులంతా బోగస్ అని అంటున్నారని చంద్రబాబు ఆరోపించారు.ఇదీ చదవండి: అందుకే ఈ అరాచకాలా..?వైఎస్సార్సీపీ ఎన్నడూ అందరూ బోగస్ అని అనలేదు. తప్పుడు క్రీడా సర్టిఫికెట్లు తెచ్చి పరీక్షలు లేకుండా ఉద్యోగాలు పొందిన పలువురి వివరాలు వెల్లడించి విమర్శలు చేస్తోంది. ఆ నిర్దిష్టమైన కేసులలో ఇంతవరకు చంద్రబాబు,లేదా మంత్రి లోకేష్ వివరణ ఇవ్వలేకపోయారు. వైఎస్సార్సీపీ హయాంలో పోటీలలో పాల్గొని వారి చేతుల మీదుగానే ధృవపత్రాలు పొందినవారిని ఫేక్ అంటున్నారని ఆయన చెప్పారు. ఇందులోను నిజం లేదు. ఫేక్ పత్రాలతో కొంతమంది పోస్టులు సాధించారా? లేదా? అన్నదాని పై ఆయన మాట్లాడడం లేదు. విజయవాడలో గురువులపై రౌడీలు దాడులు చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఇది కూడా నిజం కాదు. వైఎస్సార్సీపీ ధర్నా చేయాలని తలపెడితే అక్కడ టీడీపీ గూండాలు, టీచర్ల ముసుగులో రౌడీలు ఎందుకు ఉన్నారని ఎవరికైనా సందేహం వస్తుంది కదా! అసెంబ్లీకి వచ్చే ధైర్యంవైఎస్సార్సీపీకి లేదని చంద్రబాబు అన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లడం లేదు. కాని మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు హాజరవుతున్నారు కదా!అక్కడ ఎందుకు చర్చకు టీడీపీ వెనుకాడింది అంటే జవాబు ఇవ్వరు. లోకేష్ మండలికి హాజరైనా దాని గురించి ఎందుకు వాదన వినిపించలేకపోయారు.వైఎస్సార్సీపీ సహభ్యుల ప్రశ్నలకు బదులు ఇవ్వలేదంటే సమాధానం ఇవ్వరు. కొందరు టీచర్లను తీసుకువచ్చి ర్యాలీలు చేయించి ఒక రాజకీయ పార్టీని ఇష్టం వచ్చినట్లు దూషింపచేస్తారా?మాజీ ముఖ్యమంత్రిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా?ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది. చంద్రబాబు రాష్ట్రంలో ఒక విష సంస్కృతిని తీసుకువస్తున్నట్లు అనిపించదా!ఇవన్ని ఎందుకు! అసలు డీఎస్సీలో అక్రమాలు జరగలేదన్న నమ్మకం ఉంటే వైఎస్సార్సీపీ అదినేత జగన్ సవాల్ చేసినట్లు సిబిఐ విచారణకు ఆదేశించవచ్చు కదా! పైగా తన టైమ్ లో జరిగిన ఏపీపిఎస్సిపై కూడా సిబిఐ విచారణ వేసుకోండని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు కదా!దాని గురించి ప్రస్తావించకుండా ఏపీపిఎస్సిపై వైఎస్సార్సీపీ మాట్లాడడం లేదని చంద్రబాబు అనడం ఏమిటో అర్దం కాదు..టీచర్ల నియామకాలపై అనుమానాలు ఉంటే కోర్టుకు వెళ్లవచ్చని,కోర్టు ఆదేశిస్తే చర్య తీసుకుంటామని అన్నారు. ఉద్యోగాలు రాని అనేక మంది కోర్టుకు వెళితే అసలు కేసే విచారణకు రాకుండా చేస్తున్నారని వారు బహిరంగంగానే చెబుతున్నారే? కోర్టులో విచారణకు రెడీ అయిన ప్రభుత్వం వారు సిబిఐ దర్యాప్తునకు ఎందుకు వెనుకాడుతున్నారు?జగన్ మళ్లీ సోమవారం నాడు కూడా డీఎస్సీ స్కామ్ పై 14 ప్రశ్నలు వేశారు. చంద్రబాబు, లోకేష్ లు తమకు తామే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారని జగన్ ఎద్దేవ చేశారు. జగన్ ప్రశ్నలపై చంద్రబాబు ఎప్పటికైనా స్పందిస్తారా?అన్నది అనుమానమే. ఒక్క మాట చెప్పాలి. డెబ్బైఆరేళ్ల వయసులో ఎంతో సీనియర్ నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు తన హోదాకు తగ్గట్లు వ్యవహరించలేకపోతున్నారనిపిస్తుంది. ఇదంతా పుత్ర ప్రేమా?లేక సహజంగా వచ్చిన అలవాటా?అంటే ఏమి చెబుతాం!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘ఆ గూండాలకు పోలీసులే రక్షణ కల్పించటం దుర్మార్గం’
సాక్షి, తాడేపల్లి: శాప్ కార్యాలయం ఎదుట ధర్నాతో ప్రభుత్వ కూసాలు కదిలాయని.. జెన్ జీ కదిలి వచ్చి నిరసనల్లో పాల్గొందని.. దీన్ని జీర్ణించుకోలేక ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాసిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియా మాట్లాడుతూ.. చంద్రబాబు శిఖండి రాజకీయాలు చేయటం సిగ్గుచేటు. మా నిరసన కార్యక్రమంపై నాలుగు రోజుల క్రితమే పర్మిషన్ కోరాం.. కానీ మాకు పోటీగా కొందరు రౌడీ దళాన్ని ఎందుకు తెచ్చారు?’’ అంటూ నాగార్జున యాదవ్ ప్రశ్నించారు.‘‘నారా లోకేష్ రౌడీ దళం మాపై దాడులు చేశారు. పోలీసుల చేతిల్లోని లాఠీలు లాక్కుని మాపై దాడి చేశారు. పోలీసుల తుపాకులు కూడా వారికి దొరికి ఉంటే మా పరిస్థితేంటి?. డీఎస్సీలోని అక్రమాలపై ప్రశ్నిస్తే లోకేష్ ఉత్తర కుమారుడిలా మాట్లాడుతున్నారు. మా ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పటం లేదు?. నిరసనలు తెలిపితే మాపై దాడులా?. మీ బ్యారికేడ్లు మా భావజాలాన్ని ఆపలేక పోయాయి...మీ అరెస్టులు మా ధైర్యాన్ని నిలవరించలేవు. డీఎస్సీ అక్రమాలపై సీబిఐ విచారణ జరపాల్సిందే. అప్పటిదాకా మా ఉద్యమం ఆగదు. శాప్ ఆఫీసు దగ్గరకు గురువుల ముసుగులో గూండాలు వచ్చారు. ఆ గూండాలకు పోలీసులే రక్షణ కల్పించటం దుర్మార్గం’’ అంటూ నాగార్జున యాదవ్ దుయ్యబట్టారు.ఇదీ చదవండి: రౌడీ దళాన్ని దించినా డీఎస్సీపై పోరు ఆగదు -
రేపు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రేపు(బుధవారం) సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌ను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలవనున్నారు. శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నాయకులపై దాడి ఘటనపై వైఎస్ జగన్ ఫిర్యాదు చేయనున్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేయించాలని వైఎస్ జగన్ కోరనున్నారు.పార్టీ నాయకులతో ఇవాళ(మంగళవారం) వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. నిన్నటి వైఎస్సార్సీపీ శాంతియుత ర్యాలీలపై టీడీపీ గూండాల దాడిపై చర్చించారు. చంద్రబాబు, లోకేష్‌ల పథకానికి కొంతమంది పోలీసులు కొమ్ముకాశారని పార్టీ నాయకులు వైఎస్ జగన్‌కు వివరించారు. ఈ దాడి ఘటనను పార్టీ సీరియస్‌గా తీసుకుంటుందన్న వైఎస్ జగన్.. ఈ వ్యవహారాన్ని గవర్నర్‌కు కలిసి వివరించాలని నిర్ణయించారు.డీఎస్సీ స్కాంలో చంద్రబాబు, లోకేష్‌లు అడ్డంగా దొరికారని.. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. స్కామ్‌లను బయటపెడుతుంటే దాడులు చేస్తున్నారు. నిన్న(సోమవారం) వైఎస్సార్సీపీ చేసిన ర్యాలీ కార్యక్రమంతో డీఎస్సీ స్కాంపై మరోసారి చర్చ జరిగింది.. దీన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు, లోకేష్‌లు గూండాలను దింపారని వైఎస్ జగన్ అన్నారు.ఇదీ చదవండి: రౌడీ దళాన్ని దించినా డీఎస్సీపై పోరు ఆగదు -
రౌడీ దళాన్ని దించినా డీఎస్సీపై పోరు ఆగదు
సాక్షి, తాడేపల్లి: శాంతియుత ర్యాలీలపై టీడీపీ గూండాల దాడి వ్యవహారంపై వైఎస్సార్సీపీ అత్యవసర సమావేశం నిర్వహించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో.. నిన్న జరిగిన పరిణామాలను నేతలు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, దాడులపై గవర్నర్‌ను కలిసి వివరించాలని సమావేశంలో వైఎస్ జగన్ నిర్ణయించారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తుండటంతో సహించలేకపోతున్నారని.. అందుకే తమ పార్టీ ఆందోళనలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నందుకే దాడులు చేస్తున్నారని, నిన్నటి ర్యాలీతో ఈ అంశం మరోసారి చర్చలోకి వచ్చిందని అన్నారు.డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలు జరగడంతో వైఎస్సార్సీపీ ఆందోళనలు నిర్వహిస్తోంది. అవకతవకలపై సీబీఐ దర్యాప్తుతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామాను కూడా డిమాండ్ చేస్తోంది. అయితే సోమవారం విజయవాడలో శాప్ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమాల సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరిగాయి. ‘రౌడీ దళాన్ని దించారు’చంద్రబాబు, లోకేశ్ తమపై దాడులకు కొందరిని ప్రోత్సహిస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. ‘యువగళం టీం కాదు.. రౌడీ దళం’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శాంతియుతంగా జరుగుతున్న కార్యక్రమంలోకి రౌడీలను పంపి అలజడి సృష్టించారని, పోలీసుల వద్ద నుంచి లాఠీలు లాక్కుని రాళ్లతో దాడులు చేశారని మండిపడ్డారు. దాడుల్లో తమ పార్టీ నేతలు, కార్యకర్తలు గాయపడినా సంయమనం పాటించారని జగన్ చెప్పారు. తమవారిపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా.. వైఎస్సార్సీపీ నేతలపైనే కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. గతంలోనూ తమ పార్టీపై జరిగిన పలు దాడుల్లో ఇదే తరహా వ్యక్తులు ఉన్నారని, ఇందుకు ఆధారాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.పోలీసుల తీరుపైనా ఆగ్రహంశాంతియుత నిరసన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకుంటున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ కన్నా దారుణంగా మార్చారని చెప్పారు. అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసులు చట్టాన్ని పక్కన పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తమ పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అప్పటిదాకా పోరాటం ఆగదుడీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వైఎస్ జగన్ ఉద్ఘాటించారు. చంద్రబాబు, లోకేశ్‌ల బెదిరింపులకు భయపడి వెనక్కి తగ్గేది లేదన్నారు. ప్రజల తరఫున పోరాటాల్లో వైఎస్సార్సీపీ తగ్గేది లేదని, నిజాయితీగా పరీక్షలు రాసిన అభ్యర్థులకు అండగా ఉంటామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
అందుకే ఈ అరాచకాలా..?
అధికారం ఉంటే ఎలాగైనా చేయవచ్చని ఏపీలో కూటమి ప్రభుత్వం రుజువు చేస్తున్నట్లుగా ఉంది. తమ హయాంలో జరిగిన స్కామ్‌ల కేసులను పోలీసు వ్యవస్థ ద్వారానే ఎత్తివేయించుకోవడం, అదే పోలీసులను ప్రయోగించి విపక్ష వైఎస్సార్సీపీ నేతలపై కల్పిత కేసులు పెట్టడం ఒక ప్రత్యేకతగా కనిపిస్తుంది. బహుశా గతంలో ఏ ప్రభుత్వం ఇంత అరాచకంగా వ్యవహరించి ఉండకపోవచ్చన్నది ఎక్కువ మంది భావన.2014-19 టరమ్‌లో జరిగిన స్కిల్ స్కామ్‌తో సహా ఆయా కేసులను ఎత్తివేసేలా పావులు కదపడం, అదే సమయంలో వైఎస్సార్సీపీ హయాంలో జరిగిందంటూ ఒక కల్పిత మద్యం కేసును సృష్టించి, అవసరమైనప్పుడల్లా దానిని ప్రచారానికి వాడుకోవడం ఈ ప్రభుత్వం అలవాటుగా మార్చుకున్నట్లుంది. అంతేకాదు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలోని విద్యాశాఖలో జరిగిన టీచర్ల నియామక స్కామ్‌ను కప్పిపుచ్చడానికి ప్రభుత్వం నానా పాట్లు పడుతోంది. ఇదే కాదు.. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయికృష్ణ అనే యువకుడిని లాకప్ డెత్ చేసిన కేసు మూలలోకి వెళ్లకుండా కథ నడిపిస్తున్న తీరు కూడా ఆసక్తికరంగా కనిపిస్తుంది.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక జనాన్ని ఏమార్చే పనిలో ఉంటోంది. మరో వైపు ప్రభుత్వంలో జరుగుతున్న స్కామ్‌లు, పోలీసు శాఖ ద్వారా జరుగుతున్న అరాచకాలు కూటమి ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. వీటికి తోడు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని ఈడి కూడా తేల్చడంతో ప్రభుత్వ పెద్దలు అపచారం చేసినట్లయిందని ప్రజలు భావించే పరిస్థితి ఏర్పడింది. ఇవన్ని వెరసి ప్రభుత్వం ప్రజలలో పరపతి బాగా కోల్పోతోందన్న భావన వచ్చినప్పుడల్లా దానిని డైవర్ట్ చేయడానికి వైఎస్సార్సీపీపై ఏవేవో పిచ్చి ఆరోపణలు చేయడం, ఆ పార్టీ నేతలపై పిచ్చి కేసులు పెట్టడం చేస్తున్నారు.డీఎస్సీ అక్రమాలపై ఆధార సహితంగా మాజీ ముఖ్యమంత్రి జగన్, వైఎస్సార్సీపీ ఇతర నేతలు ఆరోపణలు చేస్తుండడంతో చంద్రబాబు, లోకేష్‌లు గుక్క తిప్పుకోలేకపోతున్నారు. ఎంత బుకాయించాలని చూస్తున్నా, స్కామ్ వివరాలు, కొత్త సమాచారం ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉంది. హర్యానాలో జరిగిన టీచర్ల ఎంపిక స్కామ్‌తో పోల్చుతూ కొందరు మేధావులు విశ్లేషణలు ఇస్తున్నారు. గతంలో హర్యానా ముఖ్యమంత్రి చౌతాలా, ఆయన కుమారుడు, కొందరు అధికారులు జైలుకు వెళ్లిన ఘటన తీరుతెన్నులను పోల్చుతూ ప్రముఖ మేధావి, ఫ్రొఫెసర్ రామచంద్రయ్య ఒక వీడియో చేశారు. ప్రస్తుతం ఏపీలో కూటమి అధికారంలో ఉండడంతో, కేసు విచారణ దశకు వెళ్లకుండా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిని వేధిస్తూ కాలం గడుపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో ప్రజలు డీఎస్సీ స్కామ్ గురించి మరీ ఎక్కువగా చర్చించుకోకుండా ఉండాలన్న లక్ష్యంతో అవసరమైనప్పుడల్లా మద్యం స్కామ్ అంటూ తెరపైకి తీసుకువచ్చి ఎల్లో మీడియాతో విస్తృత ప్రచారం చేయిస్తున్నారు. తాజాగా బెవరేజ్ కార్పొరేషన్లో ఓఎస్డీగా పనిచేసిన సత్యప్రసాద్ అనే ఉద్యోగి వాంగ్మూలం పేరుతో ఒక కథను సృష్టించారని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. సత్యప్రసాద్ కూడా ఈ కేసులో ఒక నిందితుడే. కాని ఆయన అరెస్టు కాకుండా చూసి, అతనిని నయానో, భయానో అప్రూవర్‌గా మార్చుకుంది. ఈ కేసును విచారిస్తున్న సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఈ రెండేళ్లలో రకరకాల విన్యాసాలు చేసిందన్న అభిప్రాయం కలుగుతోంది. అనేక మందిని ఈ కేసులోకి తీసుకురావడం, అరెస్టులు చేయడం, ఎప్పటికప్పుడు ఒక కొత్త స్టోరీని అల్లడం చేస్తోందన్న భావన ఉంది. మద్యం తయారీదార్ల నుంచి లంచాలు తీసుకున్నారన్నది సిట్ అబియోగం. ఇందుకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదు ఇచ్చారా అంటే అదేమి లేదు. ఎవరో రహస్య లేఖ రాస్తే వెంటనే పోలీసులను రంగంలోకి దించి విచారణ ఆరంభించారు. ఈ లంచం డబ్బును ఒకసారి రియల్ ఎస్టేట్‌లో పెట్టారని, మరోసారి సినిమాలు తీశారని, ఇంకోసారి విదేశాలకు తరలించారని, వేరొక సారి ఆ డబ్బును గత ఎన్నికలలో ఓటర్లకు పంచడానికి వెచ్చించారని ఆరోపణలు చేశారు. సత్య ప్రసాద్‌తో కోర్టులో కూటమి పెద్దలు కోరుకున్న విధంగా వాంగ్మూలం ఇప్పించారన్నది వైఎస్సార్సీపీ అభియోగం.ఇదీ చదవండి: ‘హూ ఈజ్ మోదీ’ నుంచి గ్రేట్ అని భజన దాకా.. బాబు వ్యూహం అదేనా?మాజీ మంత్రి పేర్ని నాని ఈ కేసుపై పార్టీ వాదనను సమర్ధంగా వినిపించారు. సత్యప్రసాద్ వాంగ్మూలంలో చెప్పిన అంశాలలోని వైరుధ్యాలపై పలు ప్రశ్నలు సంధించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటి వద్ద మద్యం డిస్టిలరీల నుంచి ముడుపుల వసూళ్లకు సమావేశం జరిగిందని సత్యప్రసాద్ చెప్పారట. ఆయన వద్ద దీనికి ఆధారం ఏమైనా ఉందా అంటే అదేమీ కనిపించదు. కొంతకాలం క్రితం హైదరాబాద్‌లో ఒక కాలేజీలో 11 కోట్ల డబ్బు దొరికిందని పోలీసులు హడావుడి చేశారు. అది ఈ కేసులో ఒక నిందితుడైన రాజ్ కసిరెడ్డిదని ఆరోపించారు. దానిని ఆయన తోసిపుచ్చి ఆ డబ్బును కోర్టులో పెట్టాలని, నెంబర్లు నోట్ చేయాలని కోరగా, కోర్టు ఆ మేరకు ఆదేశాలు ఇచ్చింది. దాంతో పోలీసు అధికారులు ఆ డబ్బును బ్యాంక్‌లో జమ చేసేశామని చెప్పడంతోనే ఈ కేసులో డొల్లతనం బహిర్గతం అయింది. తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పిన ఒక కానిస్టేబుల్‌కు ప్రమోషన్ ఇవ్వడం, అందుకు ఇష్టపడని మరో కానిస్టేబుల్‌ను తీవ్రంగా వేధించడం చేశారట. నెలకు ఏభై, అరవై కోట్లు వసూలు చేసేలా నిర్ణయించుకున్నారని, దానిని జగన్‌కు చేర్చేవారని లాజిక్ లేకుండా సత్యప్రసాద్ కోర్టుకు తెలిపారట. అది నిజమే అయితే అది ఎలా జరిగింది. సిసిటీవీ ఫుటేజ్ ఉందా? అంటే అదేమీ కనిపించదు.నిజంగానే మూడువేల కోట్ల డబ్బు ఎన్నికలలో పంచిఉంటే ఏ ఒక్క ఎన్నికల పర్యవేక్షణ అధికారి అయినా తన రిపోర్టులో తెలిపారా అని జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ ప్రశ్నించారు. ఇలాంటి పిచ్చి కేసులు పెట్టి ఏమి సాధిస్తారని ఆయన ప్రశ్నించారు. ఏ కేసు అయినా కేవలం అప్రూవర్ ఇచ్చే వాంగ్మూలం తోనే బలంగా ఉంటుందనుకుంటే పొరపాటని శ్రవణ్ అన్నారు. డబ్బు ఎక్కడనుంచి ఎక్కడకు వెళ్లింది? డబ్బును సీజ్ చేశారా? నిజంగానే మద్యం డిస్టిలరీల వారు లంచాలు ఇచ్చి ఉంటే వారందరిపైన కూడా కేసులు పెట్టాలి కదా అని ఆయన అడిగారు.ఇక సత్యప్రసాద్ ఇంతకుముందు రెండుసార్లు వాంగ్మూలం ఇచ్చినప్పుడు జగన్ పేరే ఎందుకు ప్రస్తావించలేదు? అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. గతంలో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డిని కూడా వేదించి అప్రూవర్‌గా మార్చుకునే యత్నం చేశారు. తొలుత అంగీకరించినా, ఆ తర్వాత ఆయన ఒప్పుకోకపోవడంతో కొత్త కేసులు పెట్టి వేదిస్తున్నారట. స్కిల్ స్కామ్‌లో డబ్బు ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్లింది? చివరికి టీడీపీ ఆఫీస్‌కు ఎలా చేరింది? బ్యాంకు స్టేట్ మెంట్లతో సహా సీఐడీ అప్పట్లో అభియోగాలు మోపింది. అంతేకాక సంబంధిత ఫైళ్లలో చంద్రబాబు సంతకాలు కూడా ఉన్నాయి. అలాంటి కేసులో ఏమీ జరగలేదని సీఐడీ కూటమి అధికారంలోకి వచ్చాక ఎలా నివేదిక ఇచ్చిందో తెలియదు. పైగా ఈ కేసు మూలం ఈడి దర్యాప్తుతో మొదలైంది. అయినా ఇప్పుడు ఈడి ఎక్కడా సీన్లో కనిపించదు.మాజీ మంత్రి అంబటి రాంబాబు డీఎస్సీ స్కామ్‌కు సంబంధించి లోకేష్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన కొద్ది రోజులకే ఆయనకు మద్యం కేసులో నోటీసులు రావడం అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. అమరావతికి సంబంధించిన స్కామ్‌లు కొన్నిటిలో కొందరు ఐఏఎస్ అధికారులు వాంగ్మూలాలు ఇచ్చినా, అవన్ని ఇప్పుడు ఎలా పూర్వపక్షం అవుతున్నాయో అర్థం కావడం లేదని ఈ కేసులను గమనిస్తున్న ఒక ప్రముఖుడు అన్నారు. న్యాయ వ్యవస్థ వీటిని ఎలా అనుమతిస్తుందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసును వీలైనంతమేర సాగదీస్తున్న సిట్ అధికారులు ఇంతవరకు ఎందుకు అతనిని హింసించారు అన్న మూలాలలోకి వెళ్ళినట్లు సమాచారం లేదు. ఏ ఉన్నతాధికారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు అతనిని మార్కాపురం నుంచి పట్టుకువచ్చారు? పై అధికారులను విచారించే పరిస్థితి ఉందా? లేదా? ఇలాంటి సందేహాలు ఎన్నో వస్తున్నాయి ఏ కేసునైనా నిష్పక్షపాతంగా చేస్తే అభ్యంతరం ఉండదు. అధికారంలో ఉన్నవారిపట్ల ఒకరకంగా, విపక్షంవారిపై మరో రకంగా వ్యవహరిస్తేనే సమస్య. ఇది వ్యవస్థలకు కూడా మంచిది కాదు. అన్నిటికి మించి సత్యప్రసాద్ మానసిక పరిస్థితిపై ఒక డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ కూడా ఆసక్తికరంగా ఉంది. అప్పుడు ఆయన వాంగ్మూలం చెల్లుతుందా? లేదా? అన్నది చూడాలి.మరో విషయం ఏమిటంటే మద్యం కేసులో ప్రభుత్వం తరపున వాదించే ఒక లాయర్ ఏకంగా జడ్జినే బెదిరించిన ఘటన గతంలో జరిగింది. అయినా ఆయనకు ఏమీ కాలేదు. ఇలా రకరకాల సందేహాలతో, సంశయాలతో కొనసాగుతున్న కల్పిత మద్యం కేసు ద్వారా వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బంది పెట్టి తమపై వచ్చిన ఆరోపణల నుంచి తప్పించుకోవచ్చని పాలకులు భావిస్తున్నారేమో తెలియదు. కాని అది అన్నివేళలా సాధ్యపడకపోవచ్చు.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
టీడీపీ గూండాలను వదిలి.. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. శాప్ ఆఫీస్ వద్ద డీఎస్సీ అక్రమాలపై నిరసన చేసినందుకు కేసులు నమోదు చేశారు. మంగళగిరి పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అక్రమ కేసు నమోదైంది. ఆయనతో పాటు మురళి, ఫాతిమా, డైమండ్ బాబుపై అక్రమ కేసులు నమోదు చేశారు.వైఎస్సార్సీపీ నేతలపై మాచవరం స్టేషన్లో పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు అర్ధరాత్రి వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రేసిడెంట్ రవిచంద్ర, వైసీపీ నేత సుందరపాల్ను అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ గూండాలు దాడి చేయగా.. టీడీపీ గూండాలను వదిలి వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెట్టారు. శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ శాంతియుత నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. కవ్వింపు చర్యలకు దిగిన టీడీపీ గూండాలు.. పోలీసుల చేతిలో ఉన్నా లాఠీలతో వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు చేశారు.మెగా డీఎస్సీ పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడ్డ చంద్రబాబు సర్కారు అవినీతిని ప్రశ్నిస్తూ.. బాధితులకు, నిరుద్యోగులకు న్యాయం జరగాలనే లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) కార్యాలయం వద్ద సోమవారం భారీ ధర్నా చేపట్టింది. శాంతియుతంగా జరుగుతున్న పోరుబాట కార్యక్రమాన్ని కూటమి సర్కారు కుట్రలతో అడ్డుకుని ఉద్దేశపూర్వకంగానే ఉద్రిక్తతలకు దారితీసేలా రెచ్చగొట్టి వైఎస్సార్సీపీ శ్రేణులు, నిరుద్యోగులపై ఉక్కుపాదం మోపింది.ప్రశాంతంగా జరుగుతున్న నిరసనలపై చంద్రబాబు సర్కారు గూండాలను మోహరించి రాక్షస క్రీడకు తెగబడింది. మెగా డీఎస్సీ 2025లో అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు బరి తెగించి అరాచక దాడులకు పురిగొల్పింది. కళ్లెదుట కనిపిస్తున్న మెగా డీఎస్సీ అక్రమాలకు సమాధానం చెప్పలేక, నిజాయతీని నిరూపించుకోవడం చేతగాక.. ప్రశ్నించిన వారిపై ప్రైవేటు సైన్యాన్ని ఉసిగొల్పింది. శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చిన వారిపై లాఠీచార్జీ జరిపి అక్రమ అరెస్టులకు పాల్పడింది.ఇదీ చదవండి: ఖాకీలు తోడుగా టీడీపీ గూండాల దాడి -
‘హూ ఈజ్ మోదీ’ నుంచి గ్రేట్ అని భజన దాకా.. బాబు వ్యూహం అదేనా?
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహం ఏమిటి? ఆయన ఏ లక్ష్యంతో బీజేపీ పట్ల, ప్రధాని మోదీ పట్ల అంత విధేయత చూపుతున్నారు? ఒకప్పుడు తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీగా తెలుగుదేశం గుర్తింపు పొందింది. అదంతా ఏమైందో కాని, ప్రస్తుతం ఆత్మాభిమానంతో సంబంధం లేకుండా టీడీపీ ముఖ్యనేతలు ప్రవర్తిస్తున్నారేమిటా అని పలువురు ముక్కున వేలు వేసుకుంటున్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా వారణాసికి వెళ్లి ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడాన్ని ఎవరూ కాదనరు. కాని వారణాసి వెళ్లి బీజేపీ కేంద్ర మంత్రులతో కలిసి పూజలు చేసి హారతి ఇచ్చిన వైనంపైనే అంతా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి పనే వైఎస్ జగన్ వంటి నేతలు ఎవరైనా చేసి ఉంటే, చంద్రబాబు బీజేపీ వ్యతిరేక కూటమిలో ఉండి ఉంటే, ఇక ఇల్లెక్కి గోలచేసినంత పని చేసేవారు. ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతిందని ఎల్లో మీడియాలో హోరెత్తించేవారు. కేసుల కోసమే ఇలా చేస్తున్నారని ఆరోపించేవారు.రాజకీయాలలో ప్రధాని మోదీ కన్నా చంద్రబాబు నాయుడు చాలా సీనియర్. ఈ విషయాన్ని ఆయనే గతంలో చెప్పుకునేవారు. ఆ సీనియారిటీని పక్కనబెట్టి మోదీ కోసం చంద్రబాబు పూజలు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. రాజకీయ అవసరాలా? లేక తన కుమారుడు లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయడానికి తగు సహకారం పొందడానికా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది చర్చగా ఉంది.చంద్రబాబు 1978లోనే ఎమ్మెల్యేగా గెలిచారు. అదే టరమ్‌లో మంత్రి అయ్యారు. ఆయన మామ ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించి ముఖ్యమంత్రి కావడంతో కాంగ్రెస్ నుంచి జంప్ చేసి పెత్తనం సాగించారు. కర్షకపరిషత్ ఛైర్మన్‌గా, టీడీపీ ప్రధాన కార్యదర్శిగా చక్రం తిప్పారు. 1984లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కూలదోసినప్పుడు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ మెడలు వంచి అధికారం సాధించామని ఆయన ఉపన్యాసాలు ఇస్తారు. అలాంటి నేత బీజేపీ విషయంలో పలుమార్లు పిల్లిమొగ్గలు వేశారు.1996లో వామపక్షాలతో కలిసి పోటీచేసి బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అని విమర్శించేవారు. 1998 నాటికి ఎన్డీఏలోకి వచ్చి, 1999 ఎన్నికలలో కలిసి పోటీచేశారు. 2001 ప్రాంతంలో గుజరాత్ మత కలహాల నేపథ్యంలో మోదీని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. 2004 ఎన్నికలలో ఓటమి తర్వాత జీవితంలో బీజేపీతో పొత్తు పెట్టుకోబోనని ప్రతిజ్ఞ చేశారు. కాని 2014 నాటికి ప్రధాని అభ్యర్ది అయిన మోదీని కలవడానికి లాబీయింగ్ చేసుకుని సఫలం అయ్యారు. ఆ తర్వాత 2018లో మళ్లీ బీజేపీకి దూరం అయి కాంగ్రెస్‌తో కలిశారు. 2019లో ఓటమి తర్వాత మళ్లీ బీజేపీవైపు వెళ్లడానికి రకరకాల ప్రయత్నాలు చేసి 2024లో పొత్తు పెట్టుకోగలిగారు. రాజకీయాలలో పొత్తులు మార్చుకోవడం జరుగుతూనే ఉంటుంది. కాని విమర్శలు, ఆరోపణల విషయంలో పెద్ద నేతలు సంయమనంగా ఉంటారు. కాని చంద్రబాబు మాత్రం ఆ విషయంలో హద్దులు పాటించలేదు. ప్రధానిని ఏవైతే అనగూడదో ఆ మాటలన్నీ అన్నారు. దేశానికి ద్రోహం చేస్తున్న వ్యక్తిగా, ముస్లింలను బతకనివ్వని మనిషిగా, భార్యను ఏలుకోవడం లేదని అంటూ హూ ఈజ్ మోదీ అనేంతవరకు వెళ్లారు. 2019 ఎన్నికల సమయంలో మోదీ కూడా చంద్రబాబును అవినీతిపరుడని ధ్వజమెత్తారు. అయినా ఇరు పార్టీలు, ఇద్దరు నేతలు మళ్లీ కలవడం ద్వారా ఇవా రాజకీయాలు.. ఔరా అనిపించారు.తెలుగుదేశం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి బీజేపీతో పొత్తుకోసం డిల్లీలో మూడు రోజులు పడిగాపులు కాచారని అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. టీడీపీతో పొత్తుకు బీజేపీ ఇష్టపడలేదని, తాను ఈ విషయంలో తిట్లు కూడా తిన్నానని పవన్ కళ్యాణ్ ఒక స్పీచ్‌లో వెల్లడించారు. కూటమి ఎన్నికల ప్రచారానికి మోదీ వచ్చినా చంద్రబాబుతో అంతంతమాత్రంగానే మాట్లాడారని అంటారు. ఆయా సందర్భాలలో మొక్కుబడిగానే వీరిమధ్య సంబంధాలు సాగాయి. ఈ లోక్ సభ ఎన్నికలలో 16 సీట్లు రావడం టీడీపీకి కలిసి వచ్చింది. బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో టీడీపీ, జేడీయూ సీట్లు కీలకం అయ్యాయి. ఆ తర్వాత మోదీ, చంద్రబాబుల మధ్య సంబంధాలు మెరుగుపడడం ఆరంభం అయిందని చెప్పాలి.ఇదీ చదవండి: రేవంత్ వర్సెస్ కేసీఆర్.. భూముల లెక్కల్లో అసలు ట్విస్ట్ ఇదేనా?అయినా చంద్రబాబును బీజేపీ పెద్దలు నమ్మడం అంతంత మాత్రమేనని చెబుతారు. చంద్రబాబు పలుమార్లు డోకా చేశారని, కాంగ్రెస్‌తో కూడా కలిసి దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో వ్యతిరేక ప్రచారం చేశారన్న అసంతృప్తి బీజేపీలో ఉంటుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తనపై బీజేపీలో నమ్మకం పెరగడానికి గాను 2024 నుంచి తెగ పాట్లు పడుతున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో ఉంది. మోదీని అవసరం ఉన్నా, లేకపోయినా పొగడడం, అది కూడా బీజేపీవారికే ఎబ్బెట్టుగా ఉండేంతగా చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది.ఉదాహరణకు ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనలు తీసుకుంటే భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో మోదీని ఆకాశానికి ఎత్తేశారు. మోదీ, మోదీ అంటూ సభికులతో నినాదాలు ఇప్పించారు. మోదీ ప్రపంచానికే నాయకుడని మెచ్చుకుంటున్నారు. మోదీ కోసం ప్రత్యేకంగా యోగా దినోత్సవం నాడు కోట్లు వెచ్చించి ఒక రోజు కార్యక్రమం నిర్వహించారన్న విమర్శలు కూడా వైఎస్సార్సీపీ, మరికొన్ని పక్షాలు చేశాయి. కేంద్రం బాగా సహకరిస్తోందని ఒకటికి రెండుసార్లు ప్రకటనలు చేస్తున్నారు.జగన్ టైమ్‌లో రెవెన్యూ లోటు, పోలవరం ప్రాజెక్టు తదితర స్కీములకు భారీగానే నిధులు వచ్చాయి. ఆనాటితో పోల్చితే ఈ రెండేళ్లో అమరావతి అప్పు మినహా చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం నుంచి సాధించింది అంతంత మాత్రమే. అయినా ఆ విషయాన్ని చెప్పలేకపోతున్నారు. వారణాసిలో సైతం మోదీని కొనియాడుతూ సరైన సమయంలో సరైన నాయకుడు అని అభివర్ణించారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకు వచ్చారని చెప్పారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, లోకేష్‌లు కూడా మోదీని పొగిడే పనిలో ఉంటున్నారు.గతంలో గుజరాత్‌కే అన్ని చేస్తున్నారని, ఏపీ అంటే మోదీకి అసూయ అని, అమరావతికి వచ్చి చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చారని చంద్రబాబు ఆరోపించేవారు. కాని జత కలిసిన తర్వాత మాట మార్చారు. అది వేరే సంగతి. ఇటీవలికాలంలో ఎందుకు ఇంతగా తగ్గి వ్యవహరిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. తన కుమారుడు లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్న ఒత్తిడి ఆయనపై అధికంగా ఉందని అంటారు. జనసేన, బీజేపీల నుంచి దానిపై ఒక క్లారిటీ రావడం లేదు. పవన్ కళ్యాణ్ ఇంతవరకు తన అభిప్రాయం వెల్లడించలేదు. మోదీ ఒప్పుకుంటే ఆ విషయం ఒక కొలిక్కి రావచ్చు.అంతేకాదు... అది జరిగితే తను జాతీయ స్థాయిలో ఏదైనా పదవికి వెళ్లడానికి చంద్రబాబు టార్గెట్ పెట్టుకుని ఉండవచ్చు. అది సాధించాలంటే బీజేపీ ఓకే చేయవలసి ఉంటుంది. కేంద్ర స్థాయిలోకాని, ఇతరత్రా ఏమైనా కేసులు ఉంటే వాటిని పరిష్కరించుకునే పనిలో కూడా ఉండి ఉండవచ్చన్నది కొంతమంది అభిప్రాయం. ఏది ఏమైనా మోదీ జన్మదినోత్సవ పూజలకు వెళ్లడం ద్వారా చంద్రబాబు తన సీనియారిటీని తానే తగ్గించుకున్నట్లు అయిందా అన్న భావన టీడీపీతో సహా ఆయా వర్గాలలో ఏర్పడింది. ఆత్మగౌరవం వంటివాటితో సంబంధం లేకుండా, ఇలాంటి రాజకీయ వ్యూహాలలో ఆయన దిట్టే అన్న అభిప్రాయం కూడా ఉంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఇంత బతుకూ బతికి ఇంటెనక చావడం అంటే ఇదే మరి!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఇంత బతుకూ బతికి ఇంటెనక చావడం అంటే ఇదే మరి... నిన్న మొన్నటి వరకూ మంత్రులు.. ఎమ్మెల్యేలు ఎంపీలను తన గుమ్మం ముందు వెయిట్ చేయించిన చిన్న శ్రీను ఇప్పుడు కారు నిండా బొకేలు శాలువాలు పట్టుకుని టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేల గుమ్మానికి బయలు దేరుతున్నారు. వారి ఇళ్లకు వెళ్లి తనను తాను పరిచయం చేసుకుని కొత్త చుట్టరికానికి చేతులు చాస్తున్నారు. అటువైపు నుంచి ఇష్టం లేకున్నా అయిష్టంగానే ఆహ్వానించక తప్పని పరిస్థితిలో వారు మొహం మీద నవ్వును పులుముకుని రండి.. రండి.. అంటూ ఆ ఎపిసోడ్‌ను ముగిస్తున్నారు. గత 20 ఏళ్లుగా చిన్న శ్రీను అనుభవించిన పొలిటికల్ సెలబ్రిటీ స్టేటస్‌ను కళ్లారా చూసిన వాళ్లంతా ఔరా... పూలమ్మిన చోట కట్టెలు అమ్మడం అంటే ఇదే కదా! అని లోలోన ముక్కున వేలేసుకుంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా.. వైఎస్సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా.. ఆఖరుకు టీడీపీ ప్రభుత్వం ఉన్నా కానీ జిల్లాలో చిన్న శ్రీను మాటకు తిరుగుండేది కాదు. పలు సందర్భాల్లో టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు సైతం ఆయనపై కటువైన కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఆయన్ను రాజ్యాంగేతర శక్తి అని.. అవినీతిపరుడు అని పోరాటాలు.. ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఎకాఎకిన ఎలా ఆహ్వానించి కౌగిలించుకుంటాం అనే ప్రశ్నలు వేస్తున్నారు. కడుపులో కత్తులు.. కళ్లలో నవ్వులు 20 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ చిన్న శ్రీనుపై కత్తులు నూరుతూనే ఉంది. జిల్లాపై ఆయన పెత్తనాన్ని పెద్దరికాన్ని పలు సందర్భాల్లో విమర్శిస్తూ ఆయనపై పోరాటం చేస్తూనే వచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్లు మంత్రులుగా ఉన్నవారు కేంద్ర మంత్రులుగా ఉన్నవారు, గవర్నర్‌గా ఉన్న వారు సైతం ఆయనను టార్గెట్ చేస్తూనే ఉండేవారు. ఇప్పుడు ఒక్కసారిగా చిన్న శ్రీనును తమలో కలుపుకోవాలి అంటే కష్టంగా ఉందని ఓ టీడీపీ నాయకుడు వ్యాఖ్యానించడం ఆయన పట్ల వారిలో ఉన్న అయిష్టతను స్పష్టం చేస్తుంది. 20 ఏళ్లుగా ఉన్న వైరం ఒక్కసారిగా ఎలా పోతుంది అంటూ తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు. పార్టీకి నాయకత్వ లోటు ఏం లేదే ? చిన్న శ్రీనును తమలో చేర్చుకొని ఆయనకు పెద్దరి కం ఇవ్వాల్సిన అవసరం ఏమి వచ్చిందని టీడీపీ ఎమ్మెల్యేలు లోలోన గుర్రుమంటున్నారు. తమకు ఏ ఇబ్బంది లేదని, తమవైపు ఎవరూ లేకున్నా జిల్లా మొత్తాన్ని గెలిచామని గుర్తు చేస్తూ ఇప్పుడు ఆయన్ను తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటే ఎలా సహిస్తాం అని అంటున్నారు. నలభయ్యేళ్లుగా ఉన్న పార్టీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని గుర్తు చేస్తూ ఇప్పటికిప్పుడు చిన్న శ్రీను వచ్చి తమను ఏం ఉద్ధరిస్తారని.. ఆయన రాకతో తమకు ఉన్నఫళంగా ఏం లాభం కలుగుతుందని అంటున్నారు. భోజన భేటీలో అప్పడాలు కరకర.. నాయకులు కొరకొర ప్రతి నెలా ఓ ఎమ్మెల్యే ఇంట్లో భోజనం పెట్టే పేరిట ఎమ్మెల్యేలంతా కలసి కూర్చుని మాట్లాడుకోవడం టీడీపీలో ఈ మధ్య వచ్చిన కొత్త సాంప్రదాయం. ఇందులో భాగంగా తాజాగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇంట్లో రణస్థలంలో టీడీపీ ఎమ్మెల్యేలు.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సైతం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. అయితే ఆయన పెద్దరికాన్ని, తమతమ నియోజకవర్గాల్లో ఆయన జోక్యాన్ని ఏమాత్రం సహించరాదని వారంతా కూడబలుక్కుని తీర్మానించినట్లు తెలిసింది. ఆయనకు ఏ చిన్న అవకాశం ఇచ్చినా తమ ఉనికికి ముప్పు కలుగుతుందని, అందుకే ఆయన్ను దూరం పెట్టాలని వారంతా మౌఖికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆయన చేరిక తమకు సుతరామూ ఇష్టం లేదని.. కానీ అధిష్టానం నిర్ణయాన్ని కాదనలేక సైలెంట్‌గా ఉన్నామని చెబుతూ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఆయన జోక్యం చేసుకుంటే లేనిపోని చిక్కులు.. గ్రూపు తగదాలకు ఆస్కారం కలుగుతుందని, దానికి అవకాశం ఇవ్వొద్దని వారు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇదీ చదవండి: డీజేలకు అనుమతి ఇచ్చేయండి అనిత గారు! -
వైఎస్సార్సీపీకి మాత్రమే ఎందుకు?.. బీజేపీ, జనసేనకు వర్తించదా??
సాక్షి, విజయవాడ: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన ఆందోళనతో నగరంలో టెన్షన్ నెలకొంది. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాలతో శాప్ కార్యాలయం ముందు ఇవాళ నిరసనలకు ఆ పార్టీ ప్రయత్నిస్తుండగా.. అనుమతి లేదని పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడ అడ్డగింతలు, అరెస్టులు, అక్రమ నిర్బంధాల పరంపర కొనసాగుతోంది.డీఎస్సీ ఎంపిక ప్రక్రియలో, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్సీపీ మొదటి నుంచి చెబుతోంది. కూటమి ప్రభుత్వం చేసిన ఈ భారీ స్కామ్‌లో.. శాప్ కూడా భాగమైందని అంటోంది. అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా ఒక కార్యచరణతో పోరాటం చేస్తున్న ఆ పార్టీ.. ఇవాళ అభ్యర్థులతో శాప్ కార్యాలయం వద్ద ఇవాళ నిరసనకు సిద్ధమైంది. అయితే నగరంలో ఇప్పటికే బీఎన్ఎస్ఎస్ 163, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నాయని, వినాయక నిమజ్జనాలు, ఊరేగింపులు, ట్రాఫిక్ సమస్యలు, పోలీసు సిబ్బంది కొరత కారణంగా ర్యాలీలు, ధర్నాలకు అనుమతి ఇవ్వలేదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు నిరసనకు అనుమతి లేదని పోలీసులు ముందే ప్రకటించడంతో నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శాప్‌కు మూడు వైపులా భారీ పోలీస్ బందోబస్తు కనిపిస్తోంది. కీలక కూడళ్ల వద్ద పోలీసులను మోహరించడంతోపాటు విజయవాడకు వచ్చే మార్గాలపై నిఘా పెట్టారు. గుంటూరు వైపు నుంచి తాడేపల్లి మీదుగా విజయవాడ వచ్చే మార్గంలోనూ పికెట్లు ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా ర్యాలీ, ధర్నా నిర్వహిస్తే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పేర్ని నాని, దేవినేని అవినాష్ సహా పలువురు నేతలకు నోటీసులు కూడా జారీ చేశారు.ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులు పోలీసుల తీరుపై ప్రశ్నలు సంధించారు. డీఎస్సీ రిక్రూట్మెంట్పై వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికైనా.. కూటమిలో ఒక్కరైనా సమాధానం చెప్పారా? అని నిలదీశారు. అలాగే ఇటీవల జరిగిన కూటమి పార్టీల కార్యక్రమాలను గుర్తు చేశారు. ‘‘మొన్నీమధ్యే బీజేపీ ర్యాలీ జరిగింది కదా. మరి దానికి ఎలా? ఎందుకు? అనుమతిచ్చారు. శాప్ కార్యాలయం ముందు టెంట్లు వేసుకుని కూర్చునే కార్యక్రమాలకు ఈ మధ్యకాలంలో అనుమతులు ఇవ్వలేదా?. పోలీస్ యాక్ట్ వైఎస్సార్సీపీకి మాత్రమేనా? జనసేన, బీజేపీ నేతలకు వర్తించదా? ఇదెక్కడి న్యాయం?? అని నిలదీశారు. ఈ క్రమంలో.. శాప్ కార్యాలయం వైపు వెళ్లే ప్రయత్నం చేసిన మల్లాది విష్ణును పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ ఆందోళన ఒకవైపు.. పోలీసుల అనుమతి నిరాకరణ, ఆ పార్టీ నేతల ప్రశ్నలు మరోవైపు విజయవాడలో రాజకీయ వేడిని పెంచాయి. పోలీసులు హెచ్చరించినా.. తమ ఉద్యమం ఆగదని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.ఇదీ చదవండి: బాబు ట్రాప్‌లో పవన్.. జనసేనలో కొత్త టెన్షన్ -
నెల్లూరు మేయర్ సీటు.. టీడీపీలో కుర్చీ కుంపటి!
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల వేడి మొదలవకముందే అధికార టీడీపీలో మేయర్ పీఠం చిచ్చు రేపుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే అభ్యర్థిత్వంపై నేతలు తమ వర్గాల బలాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేయర్ పీఠం తమ గుప్పెట్లో పెట్టుకోవాలని ఎవరికి వారు అభ్యర్థిత్వాలపై ప్రతిపాదనలను తెరపైకి తీసుకొస్తున్నారు. ఆ పీఠంపై తమ మాటే నెగ్గించుకోవాలన్న పట్టుదల కీలక నేతల మధ్య ఆధిపత్య పోరుకు తెర తీస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వర్గం నుంచి డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌యాదవ్ పేరు ప్రచారంలో ఉండగా, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన వర్గం నుంచి ప్రత్యామ్నాయ పేర్లను తెరపైకి తీసుకురావడం ఆసక్తి రేపుతోంది. దీంతో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందన్న దానికంటే.. పార్టీలో ఎవరి రాజకీయ ఆధిపత్యం నిలుస్తుందన్నదే ఇప్పుడు నెల్లూరులో హాట్‌టాపిక్‌గా మారింది.సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీలో మేయర్ పీఠం కుంపటి రగులుతోంది. త్వరలో జరగబోయే నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో మేయర్ అభ్యర్థిత్వంపై ఆ పార్టీ కీలక నేతల మధ్య అంతర్గతంగా మంటలు రాజకున్నాయి. ఇటీవల టీడీపీ ముఖ్య నేత లోకేశ్ పర్యటన నేతల మధ్య విభేదాలకు మరింత ఆజ్యం పోశాయి. మేయర్ పీఠంపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి చెక్ పెట్టేందుకు మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి కలిసి ప్రయోగించిన అస్త్రం గురి తప్పలేదు. అధిష్టానం వద్ద కోటంరెడ్డి పరపతి ఇంతేనని ఆఖరి క్షణంలో నెల్లూరు రూరల్‌లో లోకేశ్ పర్యటనను రద్దు చేయించడంతో ఘోర పరాభవం తప్పలేదు. ఈ పరిణామాలతో రగిలిపోతున్న కోటంరెడ్డి మేయర్ అభ్యర్థిత్వంపై తన మాటే చెల్లుబాటయ్యేలా తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. మైనార్టీ మెలిక.. వ్యూహం కార్పొరేషన్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కాకముందే మేయర్ అభ్యర్థిత్వంపై మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ఆధిపత్యానికి చెక్ పెడుతూ ఎమ్మెల్యే కోటంరెడ్డి మెలిక ఆ పార్టీని అంతర్మథనంలో పడేస్తోంది. రోస్టర్ ప్రకారం నెల్లూరు కార్పొరేషన్ జనరల్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో జనరల్ కేటగిరీకి చెందిన వారికే అవకాశం ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీల ఆలోచన. కానీ టీడీపీలో మాత్రం మేయర్ అభ్యర్థిత్వంపై నెల రోజులుగా నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ వ్యూహకర్తగా ఉన్న నెల్లూరురూరల్ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి మేయర్ పీఠం తన గుప్పెట్లో పెట్టుకునేందుకు, రానున్న రోజుల్లో మైనారిటీల్లో తన పట్టును నిలబెట్టుకునేందుకే ముందుగానే నెల్లూరు మేయర్ సీటు మైనారిటీలైన ముస్లింలకు ఇవ్వాలని మెలిక పెట్టారు. ఒక వేళ పార్టీ ఓకే అంటే ఆ క్రెడిట్ తనదిగా చెప్పుకోవచ్చు.. లేదంటే నేను మైనార్టీలకు ఇవ్వాలని చెప్పినా మంత్రి నారాయణ ఒప్పుకోలేదని ఆ నెపం ఆయనపై నెట్టేయొచ్చు అనే రాజకీయ వ్యూహంతో కోటంరెడ్డి తుట్టెను కదిలించారు. నెల్లూరు రూరల్‌పరిధిలో మైనార్టీ ఓట్లను ఆకట్టుకునేందుకు ఈ అస్త్రం ఉపయోగించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కోటంరెడ్డిని ఆయనకు అత్యంత సన్నిహితుడైన కోడూరు కమలాకర్‌రెడ్డి కలిసి తన అభ్యర్థిత్వాన్ని ఆమోదించాలని ప్రతిపాదనలు పెట్టినట్లు తెలిసింది. రూప్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న కోటంరెడ్డి డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ అభ్యర్థిత్వాన్ని ఎంపీ వేమిరెడ్డి, మంత్రి నారాయణ ఖరారు చేయిస్తున్నారని తెలియగానే ఎమ్మెల్యే కోటంరెడ్డికి మింగుడు పడలేదు. రూప్‌కుమార్‌కు మేయర్ అభ్యర్థిత్వం అయితే తన పవర్ సెంటర్‌కు చిల్లు పడుతుందని, ఎలాగైనా రూప్ అభ్యర్థిత్వాన్ని అడ్డుకునేందుకు తన రాజకీయ అస్త్రాలు వాడుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. జనరల్ సీటులో బీసీకి ఎలా ఇస్తారంటూ మెలిక పెట్టి తాజాగా తన సోదరుడు గిరిధర్ రెడ్డి పేరు తెరపైకి తెచ్చారు. చాపకింద నీరులా ప్రయత్నాలు తీవ్ర తరం చేస్తున్నారు. ఒక వేళ తన సోదరుడు కాకుంటే తన అనుచరుడు కోడూరు కమలాకర్‌రెడ్డిని పేరును తెరపైకి తెచ్చినట్లు సమాచారం. రూప్ అభ్యర్థిత్వానికి నారాయణ.. వేమిరెడ్డి పావులు నెల్లూరు కార్పొరేషన్లో విజయావకాశాలు పక్కన పెట్టి.. టీడీపీ అభ్యర్థిత్వంలో తన మాటే నెగ్గాలని మంత్రి నారాయణ తన ఆధిపత్య అ్రస్తాన్ని ప్రయోగిస్తున్నారు. జిల్లా టీడీపీలో కీలకంగా మారిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు సైతం నారాయణ నిర్ణయానికే జైకొడుతున్నారు. బీసీ వర్గానికి చెందిన రూప్‌కుమార్ జనరల్ సీటులోనైనా తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించమని వేడుకోవడంతో ఈ క్రమంలో మంత్రి, ఎంపీలకు ఇష్టుడుగా ఉన్న డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌యాదవ్ పేరు తెరపైకి తెచ్చారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి రూప్ పేరు ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల లోకేశ్ వద్ద కూడా రూప్ పేరునే ఖరారు చేయమని ఎంపీ వేమిరెడ్డి దంపతులు, నారాయణ చెప్పినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. -
భీమిలిలో 2029లో పార్టీ జెండా ఎగరేస్తా..
సాక్షి, విశాఖపట్నం: భీమిలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శాసనమండలిలో విపక్ష నేత, సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ బొత్స అనూషను భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఇప్పటివరకు సమన్వయకర్తగా వ్యవహరించిన మజ్జి శ్రీనివాసరావు పార్టీని వీడిన నేపథ్యంలో భీమిలి బాధ్యతలను అనూషకు అప్పగించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. నియోజకవర్గంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చే బాధ్యతలను ఆమె భుజానకెత్తుకోవడంతో క్షేత్రస్థాయి కేడర్‌లో నూతనోత్సాహం వెల్లువెత్తుతోంది. క్రియాశీల రాజకీయాల్లోకి.. బొత్స కుటుంబం నుంచి మరో తరం రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఈ నియామకంతో చర్చనీయాంశంగా మారింది. ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకైన పాత్రకు సిద్ధమవుతున్న అనూషకు భీమిలి బాధ్యతలు కీలకమైనవిగా మారాయి. 2024 ఎన్నికల అనంతరం తండ్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహించిన చీపురుపల్లి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో ఆమె మమేకమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడం, స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకోవడం ద్వారా అక్కడ పార్టీ కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నట్లు పేర్కొంటున్నాయి. ఇప్పుడు భీమిలి బాధ్యతలు చేపట్టడంతో ఆ అనుభవాన్ని కొత్త నియోజకవర్గంలో వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా స్థానిక నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచడం, పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం ఆమె ముందున్న తక్షణ బాధ్యతలుగా మారాయి. వైద్య సేవ నుంచి ప్రజా క్షేత్రంలోకి.. డాక్టర్ అనూష కేవలం రాజకీయ వారసురాలు మాత్రమే కాదు.. ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుతున్న నిబద్ధత గల యువ నేత. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టక ముందే ధీరా ఫౌండేషన్, సత్య ఎడ్యుకేషన్ సొసైటీల డైరెక్టర్‌గా అందించిన వైద్య, సామాజిక సేవలు ప్రజల్లో ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఉన్నత విద్య, వైద్య నేపథ్యం, ప్రజల సమస్యలపై స్పష్టమైన పట్టు, ఆకట్టుకునే వాక్చాతుర్యం ఉన్న యువ నాయకురాలు భీమిలి బాధ్యతలు స్వీకరించడం పట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.భీమిలిలో 2029లో పార్టీ జెండా ఎగరేస్తా.. బాధ్యతలు స్వీకరించిన వెంటనే స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నట్లు అనూష ప్రకటించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు. తనపై పార్టీ అధినేత వైఎస్ జగన్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని పేర్కొన్నారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో భీమిలిలో వైఎస్సార్సీపీ జెండా ఎగరేయడమే తన లక్ష్యమని అనూష ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇప్పటి నుంచే నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని భావిస్తున్నారు. ఈ సందర్భంగా తనకు బాధ్యతలు అప్పగించిన వైఎస్ జగన్‌కు అనూష కృతజ్ఞతలు తెలిపారు. -
వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీపై పోలీసుల ఆంక్షలు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీపై పోలీసుల ఆంక్షలు విధించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ 21న వైఎస్సార్సీపీ ర్యాలీ నిర్వహించతలపెట్టింది. నిరసన ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు.ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్‌కు మాచవరం పోలీసులు నోటీసులు ఇచ్చారు. విజయవాడలో ఎలాంటి ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. ర్యాలీలు చేపడితే చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.ఇదీ చదవండి: విశాఖలో నీటి కొరత ఉందని ఒప్పుకున్న చంద్రబాబు -
కొండపైకి నడిచి వెళ్లి క్షమాపణ చెప్పాల్సిందే: వెల్లంపల్లి
సాక్షి, తాడేపల్లి: సనాతన ధర్మ పరిరక్షకులమని గొప్పలు చెప్పుకునే కూటమి పార్టీల నేతలు, కనీసం హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఆదిదేవుడు వినాయకుడి విగ్రహాల నిమజ్జనానికి నీళ్లు కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో ఉన్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పలుచోట్ల నిమజ్జనానికి నీళ్లు లేక విగ్రహాలను ఎండిన కాలువలు, వాగుల్లో అలానే వదిలిపెడుతున్న హృదయ విదారక దృశ్యాలు చూస్తే ప్రతి హిందువు హృదయం కలుక్కుమంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేతల హిందుత్వం ఇప్పుడు ఎక్కడికి పోయిందని, కనీసం నిమజ్జనానికి నీళ్లు కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదా? అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. మరోవైపు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి అత్యంత పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిసిందంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అత్యంత నిస్సిగ్గుగా మాట్లాడిన పచ్చి అబద్ధాలన్నీ సుప్రీంకోర్టు ఆదేశాలతో నడుస్తున్న సిట్ నివేదిక ద్వారా తేలిపోయాయని స్పష్టం చేశారు.ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వారికి వత్తాసు పలికిన ఎల్లో మీడియా తమ ముఖాలను ఎక్కడ పెట్టుకుంటారని నిలదీశారు. చేసిన మహా పాపానికి వెంకటేశ్వరస్వామి వారికి, భక్తులకు కచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలని, లేనిపక్షంలో ఆ ఏడుకొండలవాడి శాస్తి తప్పదని వెల్లంపల్లి తీవ్రంగా హెచ్చరించారు.వినాయక చవితిపైనా కూటమి నిర్లక్ష్యంవినాయక చవితి అనేది పసిపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి హిందువు అత్యంత పవిత్రంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకునే అతిపెద్ద పండుగ. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ భక్తులు మండపాలు వేసి పూజలు చేసుకుంటే, కనీస ఏర్పాట్లు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం హిందువుల మనోభావాలను దారుణంగా దెబ్బతీసింది. వెన్నుపోటు పాలనలో ఆదిదేవుడైన గణనాథుడికి కూడా తీరని అపచారం జరుగుతోంది.ఎండిన కాలువల్లో గణనాథులు..అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రం వద్ద హెచ్ఎల్సీ కాలువలో నీరు లేక, ఎల్లనూరు ప్రాంతంలో చిత్రావతి పరిసరాల్లో నీటి కొరత వల్ల పూజలు అందుకున్న విగ్రహాలను మట్టిలో, ఎండిన కాలువల్లో వదిలేయాల్సిన దారుణ పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వానికి, అధికారులకు ముందే తెలుసు. అటువంటప్పుడు నిమజ్జనం కోసం ప్రత్యామ్నాయంగా చిన్న చిన్న కుంటలు, కాలువలు ఎందుకు తవ్వించలేదు?. నిమజ్జనానికి నీళ్లు వదలాలనే కనీస జ్ఞానం చంద్రబాబు నాయుడి ప్రభుత్వానికి లేదా?.ఇళ్లల్లో పూజలు.. వీడియోలకే పరిమితమైన నేతలుచంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ ఇళ్లల్లో పూజలు చేసుకుని, నాలుగు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వదిలేస్తే గొప్ప హిందూ భక్తులు అయిపోతారా? ఊర్లలో సామాన్య ప్రజలు వినాయక చవితిని ఎలా జరుపుకుంటున్నారు, నిమజ్జనాలు ఎలా జరుగుతున్నాయనే సోయి ఈ పాలకులకు ఏమాత్రం లేదు. ఉచిత కరెంటు ఇస్తున్నామంటూ పందిళ్లపై వందల కొద్దీ ఆంక్షలు పెట్టి భక్తులను తీవ్రంగా వేధించారు.వైజాగ్‌లో పోలీసుల వేధింపులు..విశాఖపట్నంలో భక్తులు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి మండపాలు వేసుకుంటే, పోలీసులు వెళ్లి బెదిరించి మండపాలు తీసేయమంటున్నారు. ఒకపక్క సకల శాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్లో నీతులు చెబుతుంటే, గ్రౌండ్లో మాత్రం అన్నదానాలు, పూజలు చేసుకోకుండా ట్రాఫిక్ పేరుతో అడ్డంకులు సృష్టిస్తున్నారు. కూటమిలో ఉన్న బీజేపీ నేతలను సూటిగా అడుగుతున్నాను.. జై శ్రీరామ్, జై గణేష్ అనే మీరు, మీ ప్రభుత్వంలో గణనాథుడికి జరుగుతున్న ఈ ఘోర అవమానంపై ఎందుకు నోరు మెదపడం లేదు?.సిట్ నివేదికతో బట్టబయలైన లడ్డూ అసత్యాలుకలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అత్యంత దిగజారి విష ప్రచారం చేశారు. లడ్డూలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె, బాత్రూములు కడిగే కెమికల్స్ కలిపారంటూ సీఎం స్థానంలో ఉండి చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడారు. అయోధ్య రామాలయానికి పంపిన లక్ష లడ్డూలపై కూడా విషం చిమ్మి దేశవ్యాప్తంగా భక్తులను క్షోభకు గురిచేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ పర్యవేక్షణలో పనిచేస్తున్న సిట్ ఇచ్చిన నివేదికలో ఎక్కడా జంతువుల కొవ్వు గానీ, కల్తీ గానీ జరిగినట్లు తేలలేదు.పవన్ కళ్యాణ్ దీక్షల డ్రామాలు.. ఎల్లో మీడియా విషంసనాతన ధర్మం అంటూ 11 రోజులు దీక్షలు చేసి, దుస్తులు మార్చి, గుడి మెట్లు కడిగి మీడియా ముందు ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? రాజకీయ స్వార్థం కోసం, వైఎస్సార్సీపీని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక దేవుడి ప్రసాదాన్ని అడ్డం పెట్టుకుని ఇంత నీచానికి ఒడిగడతారా? తిరుపతి లడ్డూపై పచ్చి అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించిన ఏబీఎన్, టీవీ5 లాంటి ఎల్లో మీడియా ఇప్పుడు ఎక్కడ దాక్కుంటుంది?కొండపైకి నడిచి వెళ్లి క్షమాపణ చెప్పాల్సిందే..ల్యాబ్‌కు పంపిన ఆ నెయ్యి ట్యాంకర్లు, శాంపిల్స్ అన్నీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరఫరా అయినవన్న విషయం స్పష్టమైందని వెల్లంపల్లి తెలిపారు. ఈ నేపథ్యంలో చేసిన ఘోర అపచారానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కూటమి నేతలు, ఎల్లో మీడియా చెంపలు వేసుకోవడంతో పాటు.. తిరుమల కొండపైకి నడుచుకుంటూ వెళ్లి, స్వామివారి పాదాల చెంత సాష్టాంగపడి భక్తులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదని.. దేవుడే తగిన శాస్తి చేస్తాడని హెచ్చరించారు.ఇదీ చదవండి: వైఎస్ జగన్ వార్నింగ్‌తో దిగొచ్చిన చంద్రబాబు -
వైఎస్ జగన్ వార్నింగ్‌తో దిగొచ్చిన చంద్రబాబు
సాక్షి, విజయవాడ/గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జారీ చేసిన అల్టిమేటం నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో కదలిక కనిపించింది. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, కరువు మండలాలను ప్రకటించాలని జగన్ డిమాండ్ చేసిన మరుసటి రోజే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై అధికారులతో సమీక్షించిన సీఎం.. అక్టోబర్ 1న కరువు మండలాలను ప్రకటించనున్నట్లు శనివారం స్వయంగా వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు, రైతుల సమస్యలు, సాగునీటి కొరత, వ్యవసాయ సంక్షోభంపై వైఎస్ జగన్ ఈ నెల 17న పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో జరిగిన ఈ సమీక్షలో రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. కరువు మండలాలను ప్రకటించకపోతే ఉద్యమిస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.వైఎస్ జగన్ ఫైర్రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, సాగునీటి కొరత, వ్యవసాయ సంక్షోభంపై జగన్ సమీక్షించారు. కరువు కాలంలో రైతులను ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోపించారు. ఎల్‌నినో కంటే ‘ఎల్లో నినో’తోనే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందంటూ చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జూన్ నుంచి వర్షపాతం లోటు కొనసాగుతున్నప్పటికీ కరువు మండలాలను ప్రకటించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్లో సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే సాగు గణనీయంగా తగ్గిందని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు.చంద్రబాబు ప్రకటనఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై అధికారులు సమర్పించిన నివేదికలను పరిశీలించారు. సెప్టెంబర్ 24 నాటికి జిల్లా స్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, సెప్టెంబర్ 29 నాటికి రాష్ట్రస్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 1న కరువు మండలాలను ప్రకటించాలని సూచించారు.రాష్ట్రంలో 513 మండలాల్లో కరువు ఛాయలు ఉన్నట్లు అధికారుల నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. పంటల పరిస్థితి, వర్షపాతం లోటు, సాగునీటి లభ్యత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని కరువు మండలాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు.హైరిస్క్ కేటగిరీలో 1,357 ఆర్ఎస్కేలురాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ పరిస్థితులపై ప్రభుత్వం రిస్క్ ఆధారిత అంచనాలు చేపట్టింది. 1,357 రైతు సేవా కేంద్రాల పరిధిలో పంటలను హైరిస్క్ కేటగిరీలో గుర్తించినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఖరీఫ్‌లో వర్షపాతం లోటు నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు పంటల పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.తాగునీటి సమస్యపైనా సమీక్షఇదిలా ఉండగా.. సాగుతో పాటు తాగు నీటి విషయంలోనూ జగన్ వార్నింగ్ పని చేసింది. విశాఖపట్నంలో తాగునీటి సమస్యపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని కరువు పరిస్థితులతో పాటు తాగునీరు, సాగునీటి లభ్యతపై కూడా అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు.ఇదీ చదవండి: బొత్స కూతురికి కీలక బాధ్యతలు అప్పగించిన వైఎస్ జగన్ -
బ్రహ్మోత్సవాల వేళ మరోసారి నిజం రుజువైంది: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ కాలేదన్న తాజా పరిణామాలపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్.కే. రోజా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. శ్రీవారి ప్రసాదాలు పరమ పవిత్రమైనవని పేర్కొంటూ.. రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలకు ముగింపు పలకాలని ఆమె అన్నారు.అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల వేళ నిజం మరోసారి నిర్ధారణ అయిందని రోజా పేర్కొన్నారు. పవిత్రమైన శ్రీవారి ప్రసాదాలకు కళంకం అంటగట్టే ప్రయత్నం చేసిన వారు ఇప్పటికైనా రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలకు ముగింపు పలకాలని అన్నారు. అలాగే వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హయాంలో కల్తీ జరిగిందంటూ చేస్తున్న తప్పుడు ప్రచారం కూడా ఇకనైనా ఆపాలని ఆమె అంటున్నారు.శ్రీవారి ప్రసాదాలు పరమ పవిత్రం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల వేల నిజం నిర్ధారణ. పవిత్రమైన శ్రీవారి ప్రసాదాలకు కళంకితం అంటగట్టే ప్రయత్నం చేసిన కళంకితులు ఇప్పటికైనా రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలకు ముగింపు పలకాలి. పచ్చి పాలు లాంటి మనసు… pic.twitter.com/TLc3MprUnB— Roja Selvamani (@RojaSelvamaniRK) September 19, 2026‘‘పచ్చి పాలు లాంటి మనసు జగనన్నది. పచ్చి పాలలో కల్తీకి ఆస్కారం ఉండదు. జగనన్న పాలనలో కూడా కల్తీకి ఆస్కారం ఉండదు. అంతా పవిత్రమేనని బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల వేళ మరోసారి నిరూపితమైంది’’ అని ఆర్.కే. రోజా తన పోస్టులో పేర్కొన్నారు.ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యి ట్యాంకర్లను టీటీడీ తిరస్కరించింది. ఆ నెయ్యిని లడ్డూ తయారీలో ఉపయోగించినట్లు ఆధారం లేదు. అయినా లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఎలా ప్రకటించారు. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బ తీయడం కాదా? అని చంద్రబాబును ఉద్దేశించి మరో ట్వీట్లో రోజా ప్రశ్నించారు. ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యి ట్యాంకర్లను టీటీడీ తిరస్కరించింది. ఆ నెయ్యిని లడ్డూ తయారీలో ఉపయోగించినట్లు ఆధారం లేదు. అయినా లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఎలా ప్రకటించారు @ncbn గారూ? ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడం కాదా?#NoAnimalFatInTTDLaddu… pic.twitter.com/i4Z1JjtQOd— Roja Selvamani (@RojaSelvamaniRK) September 19, 2026 -
వైఎస్సార్సీపీలోకి ప్రముఖ వ్యాపారవేత్త
ఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి కొడాలి నాని సమక్షంలో ప్రముఖ వ్యాపారవేత్త బొప్పన రామచంద్రరావు శుక్రవారం వైఎస్సార్సీపీలో చేరారు. ఆయనతో పాటు ఎన్టీఆర్ జిల్లా గుడ్లవల్లేరు మండలం పెంజండ్ర గ్రామానికి చెందిన పలువురు యువకులు పార్టీలో చేరారు. పుట్టినరోజు నాడు పార్టీలో చేరిన రామచంద్రరావుకు కొడాలి నాని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ గుడ్లవల్లేరు మండల అధ్యక్షుడు శాయన రవి, పట్టణాధ్యక్షుడు గొర్ల శ్రీను తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదీ చదవండి: భీమిలి సమన్వయకర్తగా బొత్స అనూష -
భీమిలి సమన్వయకర్తగా బొత్స అనూష
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూషను నియమించారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీలో నియామకాలుసాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కమిటీలో వివిధ హోదాల్లో నియామకాలు చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గానికి చెందిన పైలా సన్యాసిరాజును స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఎస్ఈసీ) మెంబర్‌గా నియమించారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి చెందిన వెంపడ శ్రీనివాసరెడ్డిని స్టేట్ సెక్రటరీ(పార్లమెంట్)గా నియమించారు. ఇదీ చదవండి: వైఎస్సార్సీపీలోకి ప్రముఖ వ్యాపారవేత్త -
‘చంద్రబాబు ఆ ఆలోచన నుంచి బయటకు రావాలి’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర రైతులకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారని.. కృష్ణా, గోదావరి నీటి నిర్వహణను లోపభూయిష్టంగా మార్చారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత సాకే శైలజానాథ్ మండిపడ్డారు. ఆ ఫలితంగా రాష్ట్ర మంతటా రైతులకు అన్యాయం జరిగిందని.. వ్యవసాయం దండుగ అనే ఆలోచనలో నుండి చంద్రబాబు బయట పడాలన్నారు. ఇంకా అదే ఆలోచనలో ఉన్నందునే రైతుల కష్టాలను పట్టించుకోవటం లేదని దుయ్యబట్టారు.‘‘శ్రీశైలం ప్రాజెక్టు కింద సాగయ్యే పంట భూములన్నీ బీడులుగా మారాయి. రాయలసీమలో చంద్రబాబు పర్యటిస్తే రైతుల కష్టాలు, కన్నీళ్ళు కనపడతాయి. ఇది ఎల్‌నినో కాదు.. ముమ్మాటికీ ఎల్లోనినోనే. తీవ్ర కరువు ఏర్పడినా ఎల్లో మీడియా చంద్రబాబుకు భజన చేస్తోంది. శ్రీశైలానికి భారీగా వరద అనీ, జలకళతో రాయలసీమ రిజర్వాయర్లు అంటూ వార్తలు రాశారు. అంత జలకళ ఉంటే.. మరి గ్రేటర్ రాయలసీమకు నీళ్లు ఎందుకు ఇవ్వటం లేదు?..కనీసం ఆరుతడి పంటలకు కూడా ఎందుకు నీరివ్వటం లేదు?. శ్రీశైలంలో పూర్తిస్థాయి నీటిమట్టం నీరు ఉన్నా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎందుకు నీరు ఇవ్వటం లేదు?. రాయలసీమ ప్రజలు ఏం ద్రోహం చేశారని ఇంత కక్ష చంద్రబాబూ?. శ్రీశైలంలో 840 అడుగులకు చేరితే ఇక పోతిరెడ్డిపాడు ద్వారా నీరు ఇవ్వలేరు. అనాలోచిత నీటి నిర్వహణ కారణంగానే నీటి ఎద్దడి. నెల్లూరు బ్యారేజి కింద వేలాది ఎకరాల వరి పైరు ఎండిపోతోంది. శ్రీశైలం కింద సాగు చేసే రైతులు పూర్తిగా నష్టపోయారు..వెలిగొండ, పోలవరం వద్ద చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేశారు. అయినా పంట పొలాలకు సాగు నీరు ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్టును సైతం చివరికి రిజర్వాయర్ నుండి బ్యారేజిగా మార్చేశారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారు. రాయలసీమ ప్రాంత ప్రజాప్రతినిధులు స్పందించాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నీటి విడుదల చేయించాలి. ఎండిపోతున్న చీనా చెట్లు, అరటి తోటలు, వరిపైరు, శనగ తోటలు కనపడటం లేదా?. రోడ్డున పడుతున్న రైతుల కష్టాలు కనపడటం లేదా?. కర్ణాటక, తెలంగాణాలో సాగు నీరు ఇస్తుండగా లేనిది ఏపీలో ఎందుకు ఇవ్వరు?. చంద్రబాబు రాయలసీమలోని పొలాలు చూస్తే రైతుల కష్టాలు కనపడతాయి?. వ్యవసాయం దండగ అనే ఆలోచనలో నుండి చంద్రబాబు బయటకు రావాలి’’ అని శైలజానాథ్ హితవు పలికారు.ఇదీ చదవండి: ఏపీ సరిహద్దులు దాటిన రెడ్ బుక్ అరాచకం -
బాబూ.. వాటర్‌మ్యాన్ బిరుదుకు ఇంతే క్వాలిఫికేషనా?!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటర్ మాన్ ఎప్పుడు అయ్యారు? వాటర్ మాన్ అంటే రాష్ట్రానికి పుష్కలంగా నీటిని అందించిన వ్యక్తి అన్నమాట. నిజంగా ప్రాజెక్టులు నిర్మించి, ఏపీలో కరువు పరిస్థితిని పారదోలి ఉంటే ఆయన అందుకు అర్హుడు అయి ఉండేవారు. కాని వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్న అభిప్రాయం ఉంది.అయినా ప్రాజెక్టులు ఎవరు నిర్మించినా, నీటిని కొంతమేర విడుదల చేసే అవకాశం వచ్చినంతవరకు క్రెడిట్ తీసుకుంటే ఆక్షేపణ లేదు. కాని మొత్తం ప్రాజెక్టులన్నీ ఆయనే పూర్తి చేశారేమో అన్న విధంగా ప్రచారం చేసుకోండం, దానికి తోడు వాటర్ మాన్ పదాన్ని ఎకనమిక్ టైమ్స్ పత్రిక వాడింది కనుక ఆయనకు సన్మానాలు, అభినందనలు, స్టాండింగ్ ఒవేషన్లు ఇప్పించడం మరీ కృతకంగా ఉన్నట్లు అనిపిస్తుది. పార్టీపరంగా ఏదో చేసుకుంటే చేసుకున్నారులే అనుకోవచ్చు. కాని ఏకంగా అధికారిక సమావేశంలో ఐఏఎస్ అధికారులంతా పాల్గొన్న కలెక్టర్ల సదస్సులో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వాటర్ మాన్ అంశాన్ని ప్రస్తావించి చప్పట్లు కొట్టించారు. దానికి చంద్రబాబు మురిసిపోయారు.ఇది ఒక రకంగా అతి ప్రచారంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఐఏఎస్‌లలో చాలామంది సీనియర్లు గత పాతికేళ్లుగా ఉమ్మడి ఏపీలోకాని, విభజిత ఏపీలో కాని పనిచేసి ఉంటారు. వారందరికి వాస్తవ పరిస్థితి తెలియకుండా ఉండదు కదా! వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన విషయం, ఆ సమయంలో చంద్రబాబు వాటిపై విమర్శలు చేయడం, పోలవరం ప్రాజెక్టుపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, అంతేకాక పోలవరం కాల్వలను వైఎస్ తవ్విస్తుంటే తీవ్రంగా అభ్యంతరం తెలిపి, ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని చేసిన వ్యాఖ్యలన్నీ వీడియోల రూపంలో నిక్షిప్తం అయి ఉన్నాయి.అలాగే వెలిగొండ ప్రాజెక్టు టెక్నికల్‌గా సాధ్యం కాదని కొంతకాలం, నిధులు లేవని మరికొంతకాలం చంద్రబాబు కాలయాపన చేసిన అంశంపై వార్తలు ఇప్పటికీ వస్తూనే ఉంటాయి. అయినా అదృష్టం కొద్ది నీటిని విడుదల చేసే అవకాశం పొందారు. కాని వెలిగొండ ప్రాజెక్టు నీరు నల్లమలసాగర్‌లోకి రావడానికి అవసరమైన టన్నెల్స్ తవ్వకం, ఫీడర్ కాల్వ ఏర్పాటు, డామ్ నిర్మాణం మొదలైనవన్నిటిని చేపట్టింది వైఎస్ రాజశేఖరరెడ్డి కాదా!ఆయన కుమారుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టన్నెల్స్‌ను పూర్తి చేసి ఆరంభించిన సంగతి తెలియదా! నిర్వాసితులకు పెండింగులో ఉన్న పునారావాస చర్యలను అరకొరగా చేపట్టి, హడావుడిగా నీళ్లను వదలితే వాటర్ మాన్ అయిపోతారా? అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా, గ్రావిటీ ద్వారా కాకుండా లిప్ట్ ద్వారా నీటిని కాల్వలోకకి తోడితే వాటర్ మాన్ అయిపోయినట్లేనా? ఎకనమిక్ టైమ్స్ పత్రిక ఈ కార్యక్రమాలకు సంబంధించి ఒక కథనాన్ని ఇస్తూ అందులో వాటర్ మాన్‌గా పేర్కొంది.సాధారణంగా వార్త ఇవ్వడం తప్పుకాదు. కాని అతిశయోక్తులతో, లేని బిరుదులు ఆపాదించి స్టోరీలు ఇస్తే ఆ పత్రిక విమర్శలకు గురి అవుతుంది. చంద్రబాబుకు ఎంతవరకు క్రెడిట్ ఇవ్వాలో అంతవరకు కాకుండా, మొత్తం ఏపీకి ఈయనే వాటర్ మాన్ అన్నచందంగా వార్త ఇస్తే జనం నమ్ముతారా? కాకపోతే టీడీపీ ప్రచారానికి వాడుకోవచ్చు. ఒకపక్క ఏపీలో ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. విశాఖ నగరంలో సైతం తాగు నీటి కష్టాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. ఏభై శాతం పైగా వర్షపాతం లోటు ఉందని స్వయంగా చంద్రబాబే చెబుతున్నారు. వరి వేసుకోవద్దని సలహాలు ఇచ్చారు. రైతులు నానా అవస్థలు పడుతున్న టైమ్ లో చంద్రబాబును వాటర్ మాన్ అని పొగిడితే కాస్త ఎబ్బెట్లు అనిపించదా!ఇదీ చదవండి: కలెక్టర్ల సదస్సా.. ఏకపాత్రాభినయమా? చంద్రబాబు తీరుపై చర్చ!సుదీర్గకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుకు నిజానికి భారీ ప్రాజెక్టులపైనే నమ్మకం లేదు. ఆ మాట ఆయన దాచుకోకుండానే గతంలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు వడ్డీ వీరభద్రరావు, ఎర్రా నారాయణస్వామి వంటివారు పోలవరం ప్రాజెక్టుపై ఉద్యమం చేస్తుంటే వారిని చంద్రబాబు అసలు పట్టించుకోలేదు. ఆయన చెరువుల పూడిక తీయడం, పట్టణాలలో ఇంకుడు గుంతలు వంటివాటిపైనే ఎక్కువగా కేంద్రీకరించేవారు. అయితే ఎన్నికల సమయంలో మాత్రం ఈ భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన ఫలకాలు వేసి వదలివేసేవారు.నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి తదితరుల సమయంలో శ్రీశైలం, నాగార్జున సాగర్, పోచంపాడు వంటి ప్రాజెక్టులు రాకపోతే ఉమ్మడి ఏపీలో పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. అంతకు ముందు ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉండి విజయవాడవద్ద బారేజీ నిర్మించారు. ఆంగ్లేయుడైన కాటన్ దొర తొలుత కృష్ణా, గోదావరి నదులపై డామ్లు నిర్మించారు.ఆ తర్వాత కాలంలో భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయి. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తెలుగు గంగ ప్రాజెక్టును చేపట్టారు. అలాగే హంద్రీ-నీవా, గాలేరు-నగరి మొదలైన ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. తదుపరి వైఎస్ రాజశేఖరరెడ్డి 48 ప్రాజెక్టులకు జీవం పోశారు. ఆయన చొరవ లేకపోతే పోలవరం, పులిచింతల, వెలిగొండ, పోతిరెడ్డిపాడు విస్తరణ మొదలైన ప్రాజెక్టులు ఉండేవి కావేమో! వైఎస్ ఆర్ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ను విస్తరిస్తున్నప్పుడు కృష్ణా డెల్టాకు అన్యాయం జరుగుతోందంటూ టీడీపీ ఎమ్మెల్యేలు విజయవాడలో ధర్నా చేయడానికి చంద్రబాబు అంగీకారం ఉందా? లేదా? అలాగే జగన్ పాలనలో రాయలసీమ లిఫ్ట్ స్కీమ్‌ను చేపడితే, దానిని వ్యతిరేకించడమే కాకుండా, తెలంగాణ సీఎం కోరారని దానిని నిలుపుదల చేయించింది ఈయన కాదా! అయినా వాటర్ మాన్ అని పిలిపించుకుంటే ఏమి చెబుదాం.అవన్ని ఎందుకు! చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంకు జగన్ టైమ్‌లో కదా నీరు వచ్చింది. అప్పటికే సుమారు 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఈ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోలేదు? కేవలం నీటిని విడుదల చేస్తేనే వాటర్ మాన్ అయిపోతే ప్రాజెక్టులు ఒక రూపానికి తీసుకువచ్చిన ఇతర ముఖ్యమంత్రులు ఏమి అవుతారు? అసలు వాటర్ మాన్‌గా ప్రసిద్ది చెందిన రాజేంద్రసింగ్ గురించి ఏమి చెప్పుకోవాలి. ఏడారిలో పచ్చదనం సృష్టించిన ఆయన ఘనత తెలియదా! మంత్రి కేశవ్‌కు ఈ విషయాలేవి తెలియక కాదు. కాని చంద్రబాబు మెప్పు పొందడానికి, టీడీపీ ప్రచారానికి ఇది ఉపయోగపడవచ్చు. అంతే తప్ప ఆయన చెప్పింది పూర్తి వాస్తవం కాదు.ఈ పాతికేళ్లలో ఏడెనిమిది సార్లు కరువు పరిస్థితులు ఏర్పడితే అందులో ఐదారుసార్లు చంద్రబాబు పాలనలోనే అని గణాంకాలు ఇస్తూ ఎల్లో మీడియాలోనే ఒక కథనం వచ్చింది. 2014 టరమ్‌లో రెయిన్ గన్స్ ద్వారా కరువు నివారిస్తామంటూ సుమారు 400 కోట్లు వ్యయం చేశారు. ఆ తర్వాత ఆ రెయిన్ గన్స్ ఏమయ్యాయో తెలియదు. ఇజ్రాయిల్ టెక్నాలజీ అంటూ 2004 కి ముందు చంద్రబాబు కొంత హడావుడి చేసి చాలా ఖర్చు చేశారు. కుప్పంలో ప్రయోగాత్మకంగా పెట్టారు. కాని అది సఫలం అయి ఉంటే దానిని ఎందుకు చంద్రబాబు ప్రభుత్వం కొనసాగించడం లేదు? పోలవరం ప్రాజెక్టును జాప్యం చేసి, పట్టిసీమ వద్ద లిఫ్ట్ పెట్టామని చెబితే సరిపోతుందా? ఆ లిఫ్ట్ ద్వారా వచ్చే నీళ్లు వైఎస్ నిర్మించిన కాల్వలలోనే ప్రవహిస్తున్నది.ఎకనమిక్ టైమ్స్ పత్రిక ప్రతినిధికి అన్ని విషయాలు తెలిసి ఉండకపోవచ్చు. ఆ పత్రికలో వాటర్ మాన్ అని రాసేస్తే అయిపోతుందా!అన్ని విషయాలు విశ్లేషించాలి కదా! ఈ మధ్య అమరావతిపై న్యూయార్క్ టైమ్స్ కథనం అంటూ ఒక దానిని ప్రచారం చేశారు. అందులో వాస్తవాలకన్నా అతిశయోక్తులే ఎక్కువగా కనిపించాయి. దాంతో అంతర్జాతీయ పత్రికలైనా, జాతీయ పత్రికలైనా మేనేజ్ మెంట్‌కు అతీతం కావు అన్న భావన ఏర్పడింది.తనకు డాక్టరేట్ ఇవ్వడానికి ఆయా యూనివర్శిటీలు ఆసక్తి చూపినా తాను ఒప్పుకోలేదని చంద్రబాబు అన్నారట. గతంలో ఒకసారి చికాగోకు చెందిన ఒక యూనివర్శిటీ ఆయనకు డాక్టరేట్ ప్రకటించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాని ఆ తర్వాత ఆ యూనివర్శీటీ స్థితిగతులపై అనేక విమర్శలు వచ్చాయి. వీటిని పక్కనబెడితే ఏపీలో కరువును శాశ్వతంగా నివారించే దిశగా ఇప్పటికైనా చంద్రబాబు చిత్తశుద్దితో చర్యలు చేపట్టి మంచి పేరు తెచ్చుకోవాలి. అప్పుడు ఎవరూ అడగకుండానే ఐఏఎస్ లైనా, మరెవరైనా చప్పట్లు కొడతారన్న సంగతి గ్రహించాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కలెక్టర్ల సదస్సా.. ఏకపాత్రాభినయమా? చంద్రబాబు తీరుపై చర్చ!
ఏపీలో మూడు నెలలకో, నాలుగు నెలలకో ఒకసారి జిల్లా కలెక్టర్లు, ఇతర సీనియర్ ఐఏఎస్ అధికారుల సమావేశాలు పెట్టి ఏం సాధిస్తున్నట్లు?. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గంటల తరబడి ఇచ్చే స్పీచ్‌లను గమనిస్తే, ఒకసారి అంతా బాగుందని చెబుతారు. మరో సారి కలెక్టర్లు, ఐఏఎస్‌లు సరిగా పనిచేయడం లేదని అంటారు. ఈ చెవితో విని ఆ చెవితో వదలివేస్తుంటారని కూడా ఆయనే చెబుతారు. 12 గంటలపాటు కూర్చోలేరా? అని ప్రశ్నించి అధికారులందరిని ఆశ్చర్యపరుస్తారు. ఏవేవో ర్యాంకులు అంటారు. ఫైళ్ల క్లియరెన్స్ అంటారు. ఒక మంత్రి మొదటి స్థానంలో ఉన్నారంటారు. తదుపరి ఆ మంత్రి ఏమి తెలియకుండా మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రే మందలిస్తారు. సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మండంగా అమలు చేస్తున్నామని, లక్షన్నర కోట్లు వ్యయం చేశామని చెబుతారు. అదెలాగో స్కీములవారీగా వివరణ ఇవ్వరు. అందులో నిజం అంత ఎన్నది ప్రజలు లెక్కవేసుకోవాల్సిందే. గత ఎన్నికలకు ముందు ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటి గురించి చర్చించరు!అప్పట్లో చంద్రబాబు ప్రకటించిన వివిధ స్కీములకు ఏడాదికి లక్షన్నర కోట్ల వ్యయం అవుతుందని ఆనాటి సీఎం జగన్ చెబితే, తమకు సంపద సృష్టించడం తెలుసునని అన్నారు. ఈ రెండేళ్లలో ఇన్నిసార్లు కలెక్టర్ల సదస్సులు జరిగాయి కదా! ఎంత మేర సంపాదన సృష్టించింది లెక్కలు చెప్పి ఉండవచ్చు కదా! లేదా తాను చేసిన 3.90 లక్షల కోట్ల అప్పే సంపద అని అనుకోమంటారా!. మరోవైపు పెన్షన్దారులలో అనర్హుల పేరుతో ఏరివేయాలని అంటారు. చివరికి పెన్షన్ దారులను తాగుబోతులుగా అభివర్ణిస్తారు. మద్యం షాపులను ఇష్టారాజ్యంగా సిండికేట్లకు ఇచ్చి బెల్ట్ షాపులను విచ్చలవిడిగా పెడతారు. ఎంఆర్పీ మించి ధరకు అన్ని చోట్ల అమ్ముతున్నా,చర్యలు ఉండవుకాని, కలెక్టర్ల సదస్సులో మాత్రం హుంకరిస్తుంటారు.ఎన్నికలకు ముందు సాయంత్రం పూట ఒక పెగ్గు వేసుకుంటే తప్పేముందని,నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామని ఆయనే హామీ ఇచ్చిన సంగతి మర్చిపోయి ఉండవచ్చు. డిఎస్సిని బాగా చేశామని అంటారు. అక్రమాలు బయటపడడంతో డిఎస్సి నిర్వహణ అంతా అధికారులే చూసుకున్నారని చెప్పేస్తారు.చంద్రబాబు చెప్పే అనేక అంశాలలో ఒకదానితో మరొకటి పొంతన ఉండదన్న భావన ఉంది.గత కలెక్టర్ల సమావేశాలలో వచ్చిన సమస్యలే మళ్లీ,మళ్లీ వస్తుంటాయి. అంతా ఏకపాత్రాభినయంగా సాగిపోతున్నట్లు అనిపిస్తుందని కొందరు అదికారులు వ్యాఖ్యానిస్తుంటారు. కొందరు అధికారులను ఆయన కావాలని అవమానించేలా మాట్లాడారన్న అభిప్రాయం కలుగుతోందన్న ప్రచారం ఐఏఎస్ వర్గాలలో జరుగుతోంది.వీరిని స్కూల్ పిల్లల మాదిరిగా ట్రీట్ చేయడం, తమాషాలు చేస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు తీవ్ర విమర్శలకు గురి అవుతోంది.ఎవరి పని తీరైనా నచ్చకపోతే వారిపై చర్య తీసుకోవచ్చు.లైవ్ లో టీవీ ప్రసారాలు జరుగుతున్నప్పుడు సీఎం స్థాయి వ్యక్తి ఇలా బహిరంగంగా మాట్లాడితే అదికారులలో నైతిక స్థైర్యం దెబ్బతినదా అన్నది ప్రశ్న. అధికారులు కొందరు సమావేశాలకు రాకపోవడంతో ఆయనకు కోపం వచ్చింది. అందుకు కారణాలు ఏమిటో తెలుసుకోవాలి కదా! మంత్రులు, ఐఏఎస్ లు అంతా రావల్సిందేనట.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాబినెట్ సమావేశాలకు రాకపోయినా, ఈ సదస్సులకు హాజరుకాకపోయినా ఇలాగే ప్రశ్నిస్తున్నారా అని ఐఏఎస్ లు గుసగుసలాడుకున్నారట. ఐఏఎస్ లు ఈ చెవితో విని ,ఆ చెవితో వదలివేస్తున్నారని చంద్రబాబే చెప్పిన తర్వాత ఈ సదస్సులకు ఉన్న విలువ ఏమిటో అర్ధం అవుతూనే ఉంది.12 గంటలు కూర్చోవాల్సిందేనని సీఎం ఆదేశిస్తే, బయటకు వెళ్లిన తర్వాత అదికారులు ఏలా ఫీల్ అవుతారో ఊహించుకోపోవచ్చు. ఇదంతా లాఫింగ్ స్టాక్ అవుతుందని గమనించాలి.సుదీర్ఘంగా మాట్లాడడం అలవాటు చేసుకుని గంటల తరబడి ప్రసంగాలు చేస్తే ఎంత ఐఏఎస్ లైనా ఎలా భరించగలుగుతారు? నిజానికి సాంకేతిక పరిజ్ఞానం బాగా పెంపొందిన ఈ రోజుల్లో రెండు రోజుల పాటు ఇలా కలెక్టర్ల సదస్సులు పెట్టడం అవసరమా?కాదా?అన్న చర్చ ఉంది.అసలు సమావేశాలు వద్దని ఎవరూ అనరు.కాని అవి అర్ధవంతంగా లేకపోతే రెండు రోజుల ఖర్చు వృధా అవడం తప్ప ఏమీ ఉండదు కదా అన్నది కొందరి అభిప్రాయం. రాజకీయ పాలన చేయాలని ఐఏఎస్ లకు,ఐపిఎస్ లకు చెప్పిన తర్వాత ఇంక వారు చేసే సాధారణ పాలన ఏమి ఉంటుంది?తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు చెప్పిన పనులు చేయడమే కదా రాజకీయ పాలన అంటే!ప్రత్యర్ధి రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు ఎలాంటి పనులు జరగకూడదని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పిన తర్వాత కలెక్టర్లు నెత్తి,నోరు కొట్టుకోవడం తప్ప ఏమి ఉంటుంది?గంటల తరబడి ఉప్యాసాలు ఇచ్చేసి ,ఎవరైనా అధికారులు సమస్యలు చెప్పబోతే వారిని డబాయిస్తే అవి ఎలా పరిష్కారం అవుతాయి.గత సమావేశంలో కూడా అటవీ శాఖ,పర్యావరణ సమస్యలు వచ్చాయి. దానికి చంద్రబాబు ఇచ్చిన చిట్కా ఏమిటో తెలుసా!కాసేపు అటవీ,పర్యావరణ అధికారులు కళ్లు మూసుకోవాలట.అప్పుడు పనులు చేసుకోవాలట. సంబంధిత చట్టాలు చేసింది ఎవరు?వాటిని అమలు చేయవద్దని చెబుతున్నదెవరు? పెన్షన్ల ను,ఇళ్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇష్టానుసారం ఇచ్చేసిందట.సాచ్యురేషన్ మోడ్ లో గత ప్రభుత్వం వివిధ స్కీములను అమలు చేసింది. అంతకంటే ఎక్కువ ఇస్తామని హామీలు గుప్పించి,కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత దానిని చంద్రబాబు తప్పుపడుతున్నారు.అది సరికాదని అనుకుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే తీసివేసి ఉండాలి కదా!రెండేళ్లుగా ఇవ్వకుండా ఆపి స్థానిక ఎన్నికలకు ముందు పెన్షన్లు ఇవ్వడంలోకాని, అనర్హతతో రద్దు చేసే ఆలోచనకాని ఎందుకు చేస్తున్నట్లు?ఇప్పటికే టీడీపీ కార్యకర్తలు తమకు కావల్సినవారికే పెన్షన్ దరఖాస్తులు అప్ లోడ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే వైఎస్సార్సీపీ మద్దతుదారుల పెన్షన్లు రద్దు చేయడానికి ప్రయత్నం జరుగుతోందా అన్న చర్చ జరుగుతోంది. పెద్ద కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలట. అదేమిటో అర్ధం కాదు.ఒక వయసు వచ్చాక ఎవరి బతుకు వారు బతుకుతారు. వారిలో అర్హులైనవారికి పెన్షన్లు,ఇళ్లు వంటివాటిని ప్రభుత్వాలు మంజూరు చేస్తాయి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాల పేరుతో వీటిని తగ్గించాలని చూస్తున్నారా అని వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోంది.దీనికి ఎల్లో మీడియా పెట్టిన హెడింగ్ ఏమిటంటే ఉమ్మడి కుటుంబాలు చీలిపోవాలా?దీనిని చంద్రబాబు ఆచరించి చూపారా అని కొందరు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు.కుటుంబం ఒక యూనిట్ అయితే పెన్షన్లు, ఇళ్లు తదితర అన్నీ స్కీములలో లబ్దిదారులు బాగా తగ్గిపోతారన్నమాట.ప్రస్తుతానికి లబ్దిదారులను యధాతధంగా కొనసాగిస్తామని అంటున్నా,దానికి గ్యారంటీ ఏమి ఉంటుంది. కొంతమందికి ఒక విధానం, మరికొందరికి ఇంకో విధానం ఉంటుందా? ఎన్నికల సమయంలో ఆడబిడ్డ నిధి కింద కుటుంబంలోని ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామని ఎలా చెప్పారు?అప్పుడు ఉమ్మడి కుటుంబం గురించి ఆలోచించలేదా?యధా ప్రకారం వైఎస్సార్సీపీపైన పరోక్ష విమర్శలు చేయడం, ప్రభుత్వంలో జరుగుతున్న స్కామ్ లను వెలుగులోకి తీసుకువస్తున్న సాక్షి ,లేదా మరికొన్ని మీడియా సంస్థలకు వ్యతిరేకంగా అధికారులను పురికొల్పడం కోసం కలెక్టర్ల సమావేశాలు పెట్టాలా? ఇప్పటికే పోలీసు, అధికార యంత్రాంగం ద్వారా అన్ని కుట్రలు చేస్తున్నారు కదా! పైళ్ల క్లియరెన్స్ అంటూ లెక్కలు చెప్పడం ఆయనకు ఎప్పటి నుంచో అలవాటే. దాదాపు ప్రతి రోజు ఆయా జిల్లాలకు వెళ్లి సభలు పెట్టి అధికారులకు ర్యాంకులు ఇస్తున్న చంద్రబాబు, ఇప్పుడు మళ్లీ ర్యాంకులు అంటూ కధ నడపడం దేనికి?. విశేషం ఏమిటంటే చంద్రబాబేమో అన్ని పనులు చేసేయాలని హుకుం జారీ చేస్తుంటారు.ఇదీ చదవండి: వైఎస్ జగన్ అడిగింది లోకేష్‌కు అర్థం కాలేదా?ఆర్ధిక మంత్రి కేశవ్ ఏమో బడ్జెట్ తో సంబంధం లేకుండా మితిమీరి ప్రతిపాదనలు వస్తుంటే ఒత్తిడి అవుతోందని అంటున్నారు.నిధులు ఇచ్చినా,ఇవ్వకపోయినా పనులు జరగాలంటే అది ఎలా అవుతుంది. చివరికి అసలు విషయం ఏమిటంటే తమది రాజకీయ పాలన కనుక కూటమి నేతలకు అధికారుల వద్దకు వస్తే గౌరవించాలని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ప్రజలు ఎవరు వచ్చినా, ఏ రాజకీయ పార్టీవారు వచ్చినా మర్యాద ఇవ్వండి అని చెప్పవలసిన చంద్రబాబు ఇలాంటి ప్రసంగాలు చేయడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దం అనిపించదా!అయినా ఆయన తప్పులేదనుకోవాలి.రాజకీయ పాలన చేస్తామని ఆయన చెబుతుంటే జనం నిలదీయనంతకాలం ఇలాంటి నేతలు ఇలాగే పాలన చేస్తారు.-కొమ్మినేని శ్రీనివాసరావు,సీనియర్ జర్నలిస్ట్,రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్సార్సీపీ కీలక సమావేశం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో–ఆర్డినేటర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు.జూమ్ ద్వారా జరిగిన ఈ మీటింగ్‌లో.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కరువు పరిస్థితులు, పలు ప్రాంతాల్లో నెలకొన్న నీటి ఎద్దడిపై నేతల నుంచి వివరాలను వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రజలకు ఎదురవుతున్న ఇతర సమస్యలు, ఆయా జిల్లాల్లోని తాజా పరిస్థితులపైనా పార్టీ నేతలతో ఆయన చర్చించారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను గుర్తించి.. వాటిపై పార్టీ తరఫున చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా సమావేశంలో దిశానిర్దేశం చేశారు.ఇదీ చదవండి: కొండ పైనా క్రెడిట్ చోరీనా? -
‘మోసాలు, కుట్రలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు’
సాక్షి, తాడేపల్లి: మోసాలు, కుట్రలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా పెన్షన్లు ఇస్తానంటూ మోసానికి దిగారని.. దశల వారీగా పెన్షన్లు ఇస్తానంటూ మభ్యపెట్టటం మొదలు పెట్టారంటూ ఆయన దుయ్యబట్టారు.‘‘66 లక్షల మందికి వైఎస్ జగన్ హయాంలో పెన్షన్లు ఇచ్చారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్తగా పెన్షన్లు ఇచ్చారు. చంద్రబాబు 59 లక్షల మందికి మాత్రమే ఇస్తున్నారు. రెండేళ్లలోనే చంద్రబాబు 6.5 లక్షల పెన్షన్లు కట్ చేశారు. యాభై సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్లు ఇస్తామని గతంలో హామీ ఇచ్చారు. ఈ రెండేళ్లుగా పడిన బకాయితో కలిపి పెన్షన్లు ఇవ్వాలి’’ అని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.‘‘వైఎస్ జగన్ హయాంలో ప్రారంభించిన ఇళ్లనే చంద్రబాబు ఆపేశారు. ఇప్పుడు కొత్తగా ఐదు లక్షల మందికి ఇళ్లు మంజూరు చేస్తామంటున్నారు. అసైన్డ్ భూముల విషయంలోనూ చంద్రబాబు అదే మోసానికి దిగారు. 20 ఏళ్లుగా అసైనీలుగా ఉన్న వారికే జగన్ పూర్తి హక్కులు కల్పించారు...చంద్రబాబు వచ్చాక ఆ జీవోని అమలు చేయకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు అవే భూములను తాను ఫ్రీహోల్డ్ చేయబోతున్నట్లు చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. చుక్కల భూములు, 22ఏ భూముల సమస్యలకు కూడా వైఎస్ జగన్ హయాంలో పరిష్కారం చూపారు. భూ సమస్యల పరిష్కారానికి వైఎస్ జగన్ చేసిన కృషి మరెవ్వరూ చేయలేదు’’ అని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఏపీలో మరో రిక్రూట్మెంట్లో గోల్మాల్! -
రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి షాక్?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ రాజకీయాల్లో కొందరు ఎప్పుడూ కరివేపాకులాంటి వాళ్లేనని మరోసారి రుజువైంది. మంత్రి లోకేశ్ పర్యటనతో తన ప్రతిష్టను పెంచుకోవాలని చూసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ఆ పార్టీలో వీసమెత్తు పలుకుబడి లేదని విస్పష్టమైంది. పార్టీలో జిల్లా నుంచి మంత్రి నారాయణ, వేమిరెడ్డి దంపతుల మాటకే ప్రాధాన్యత ఉందనే సంకేతాలు ఇచ్చినట్లు అయింది. ఇకపై నియోజకవర్గంలో పార్టీ క్యాడర్‌కు సైతం తన ముఖం చూపించుకోలేని ఘోర పరాభవాన్ని చవిచూశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దగ్గర మార్కులు కొట్టేయాలనే తృష్ణతో లోకేశ్ బుధవారం నెల్లూరు, కోవూరు పర్యటనకు రానున్న నేపథ్యంలో తిరుపతి నుంచి వస్తున్న ఆయన్ను తన నియోజకవర్గ పరిధి నుంచి మాగుంట లేఅవుట్ రోడ్డులోని కార్యాలయం మీదుగా పర్యటనకు తొలుత రూట్ మ్యాప్ సిద్ధం చేశా రు. సుమారు 10 వేల మందితో ఘన స్వాగతం పలికి, తన పలుకుబడిని పెంచుకోవాలని నాలుగు రోజులుగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులతో సమీక్షలు, సమావేశాలు పెట్టారు. ఈ పరిణామాలతో మంత్రివర్గ విస్తరణ జరిగితే తనకు అవకాశం దక్కించుకోవాలని కోటంరెడ్డి కంటున్న కలలు భగ్నమే అని రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఆఖరి క్షణంలో ఝలక్ అయితే లోకేశ్ పర్యటనలో నెల్లూరు రూరల్ ఊసేలేకుండా ఆఖరి క్షణంలో రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. నేరుగా మంత్రి నారాయణ ప్రాతినిథ్యం వహించే సిటీ నియోజకవర్గంలోని పలు కార్యక్రమాల్లో.. ఆ తర్వాత కోవూరులో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేలా పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేయడంతో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిని ఉద్దేశ పూర్వకంగానే పక్కకు తప్పించినట్లు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్ చర్చ జరుగుతోంది. ఇది కోటంరెడ్డికి జరిగిన ఘోర పరాభవంగా భావిస్తున్నారు. ఇటీవల కాలంలో నెల్లూరు మేయర్ స్థానం విషయమై ఇటు మంత్రి నారాయణ, అటు వేమిరెడ్డి దంపతులతో విభేదించిన శ్రీధర్‌రెడ్డిని రాజకీయంగా ఒంటరిని చేసి అణచివేసేందుకే అనే ప్రచారం కూడా లేకపోలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో శ్రీధర్‌రెడ్డి లోకేశ్ పర్యటనలో పాల్గొంటారా? ముఖం చాటేస్తారా? అనే విషయంపై చర్చ నడుస్తోంది. బోసిపోయిన ఎమ్మెల్యే కార్యాలయం లోకేశ్ పర్యటన పర్యటన నేపథ్యంలో హడావుడి చేసిన కోటంరెడ్డి క్యాడర్ ఆఖరి క్షణంలో మార్పు చేయడంపై భగ్గుమంటుంది. నెల్లూరు రూరల్ పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు రచ్చరచ్చ చేయడంతో వారిని నాయకులు సముదాయించే ప్రయత్నం చేశా రు. జరిగిన అవమానం, క్యాడర్ ఒత్తిడిని తట్టుకోలేక శ్రీధర్‌రెడ్డి తన కార్యాలయం నుంచి నిష్క్రమించారు. హడావుడిగా కనిపించిన ఎమ్మెల్యే కార్యాలయ ప్రాంతంలో క్యాడర్ సైతం ముఖం చాటేయడంతో బోసిపోయింది. కోటంరెడ్డి ఇక ఒంటరేనా? రాజకీయంగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఒంటరి కావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్సార్సీపీ అండతో ఎదిగిన కోటంరెడ్డి తన బలంగా భ్రమించారు. అడ్డగోలుగా చెలరేగిపోతున్న ఆయన్ను కట్టడి చేసిన నేపథ్యంలో తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్సీపీని దూషిస్తూ పచ్చ కండువా కప్పుకొ న్నారు. అప్పటి నుంచి మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిపై స్థాయిని మరిచి తరచూ ప్రేలాపణలతో చెలరేగిపోయారు. తాజాగా దగా డీఎస్సీపైనా లోకేశ్‌ను వెనకేసుకు వస్తూ ఇష్టారీతిన మాట్లాడారు. అప్పటి వరకు కోటంరెడ్డిని అభిమానించిన ఆ పార్టీ శ్రేణులు సైతం ఈ పరిణామాలతో ఛీదరించుకునే పరిస్థితికి దిగజారిపోయాడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులను, శ్రేణులను సైతం బెదిరించి ఇదే తన బలమంటూ.. పేట్రేగిపోతున్నారు. తాజా పరిణామాలతో కోటంరెడ్డికి అధికార పార్టీలో కనీస స్థాయి పలుకుబడి లేదని స్పష్టం కావడంతో క్యాడర్ సైతం మౌనం.. గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఇదీ చదవండి: టీడీపీ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు.. హెచ్-1బీ వీసాల పేరుతో.. -
మాజీ మంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం
సాక్షి, ఏలూరు: ఏపీ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మాజీ మంత్రి ఆళ్ల నాని(57) గుండెపోటుతో మంగళవారం విశాఖ నివాసంలో కన్నుమూశారు. ఏలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన ఆయన.. వైఎస్సార్సీపీ హయాంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. ఏలూరు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నేత ఆళ్ల నాని(ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్). కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం వైఎస్సార్సీపీలో చేరి 2019లో మళ్లీ ఏలూరు నుంచి విజయం సాధించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంతో పాటు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టారు. కోవిడ్ సమయంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఆయన పాత్ర కూడా చర్చనీయాంశమైంది. ఏలూరు రాజకీయాల్లో ఆళ్ల నాని రాజకీయ ప్రస్థానం ఓ ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. ఆయన మృతి పట్ల పలువురు వైఎస్సార్సీపీ నేతలు, పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. -
‘చంద్రబాబు వాటర్ మెన్ కాదు.. క్వార్టర్ మెన్’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు వాటర్ మెన్ కాదు.. క్వార్టర్ మెన్.. మంచి నీరు ఇవ్వలేదు.. మందు మాత్రం ఇస్తున్నారంటూ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఇవాళ (ఆదివారం) విశాఖ నగర వైఎస్సార్సీపీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. రీజనల్ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, కేకే రాజు, వరుదు కళ్యాణి, మాజీ మేయర్ హరి వెంకట కుమారి పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించారు.ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. మూడు రోజులకు ఒకసారి మంచి నీరు ఇస్తున్నారు.. వేలాది బోర్లు ఎండిపోతున్నాయి. మంచి నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం ఉంటే ఎంత.. పోతే ఎంత? ఇప్పుడే ఇలా ఉంటే ఎండాకాలంలో మంచి నీటి పరిస్థితి ఏమిటి? మంచి నీటి సమస్యను పరిష్కరించడంలో చంద్రబాబు విఫలమయ్యారు’’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు నైజం యూజ్ అండ్ త్రో పాలసీ: కన్నబాబుకురసాల కన్నబాబు మాట్లాడుతూ.. వెన్నుపోటు పార్టీ మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ‘‘చంద్రబాబుది వెన్నుపోటు పార్టీ అయితే వైఎస్సార్సీపీది వెన్ను చూపని పార్టీ. యాదవ సామాజిక వర్గానికి సాధారణ మహిళను జీవీఎంసీ మేయర్‌గా వైఎస్ జగన్ చేశారు.. యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను చంద్రబాబు మేయర్ పీఠం నుంచి దించేశారు. చంద్రబాబు నైజం యూజ్ అండ్ త్రో పాలసీ...రుషి కొండపై భవనం కడితే తప్పుడు ప్రచారం చేశారు. కూటమి పాలనలో విశాఖ నగరంలో కొండలను పిండి చేస్తున్నారు. రూపాయికి చాక్లెట్ కూడా రాదు. కానీ ఎకరా భూమి 99 పైసలకు ఇచ్చేస్తున్నారు. మూడు రోజులకు ఒకసారి వాటర్ ఇచ్చేవాడు వాటర్ మ్యాన్ నా? చంద్రబాబు చేసిన మోసాన్ని గడప గడపకు తీసుకువెళ్లాలి. పెన్షన్లు తీసుకొనే వారిని చంద్రబాబు తాగు బోతులుగా చిత్రీకరిస్తున్నారు. పేకాట ఆడే వారికి డీఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చారు’’అని కన్నబాబు దుయ్యబట్టారు. అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు: వరుదు కల్యాణివైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘‘అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం కోసం రూ.2 లక్షల 40 వేల కోట్లు ఖర్చు చేయాలి. మూడేళ్లలో కేవలం 32 వేల కోట్ల ఖర్చు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఒక సైనికుడులా పని చేయాలి. కూటమికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు’’ అని ఆమె పేర్కొన్నారు.విశాఖ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షులు కేకే రాజు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. స్థానిక సమస్యలు మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలి. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమం పథకాలను ప్రజలకు వివరించాలి. చెప్పిన హామీలు కంటే ఎక్కువగా వైఎస్ జగన్ అమలు చేశారు. విశాఖకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. యాదవులకు విశాఖ మేయర్ పదవి వైఎస్ జగన్ ఇచ్చారు. జీవీఎంసీలో కీలకమైన పదవులు బడుగు బలహీన వర్గాలు వారికి ఇచ్చారు’’ అని ఆయన వివరించారు.ఇదీ చదవండి: ఏడు దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా చంద్రబాబూ? -
మరోసారి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి వ్యాఖ్యలు వైరల్
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: మరోసారి తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. జనసేన కార్యకర్తలను కూలీలుగా చూడొద్దని చంద్రబాబును బొలిశెట్టి కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం బలంగా ఉన్నచోట్ల మనమే పోటీ చేద్దామని జనసేన శ్రేణులకు బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.కాగా, స్థానిక ఎన్నికలపై అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ సమావేశంలో బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన చోట జనసేన సైనికులను తొక్కేస్తున్నారు.. జనసేన గెలిచిన చోట మాత్రం టీడీపీ వాళ్లను మనం గౌరవిస్తున్నాం’ అంటూ బొలిశెట్టి వ్యాఖ్యానించారు.టీడీపీ నాయకులు మనల్ని తొక్కేస్తున్న విషయం మన పార్టీ నాయకులకు కూడా తెలుసని, వారి తీరుపై తాను సీఎం చంద్రబాబుతో కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో మాట్లాడతానని అన్నారు. ‘మీరు ఆవేదన చెందాల్సిన అవసరం లేదు. మీరే పవన్ కళ్యాణ్‌కు బలం, మాకు బలగం. ఈ రెండున్నరేళ్లు మీ బాధను చూశాం. ఇక నుంచి మీరు బాధపడకుండా చూసుకోవాలి్సన బాధ్యతను జనసేన తీసుకుంటుంది’ అని చెప్పారు. బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. జనసేన అనుబంధ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.ఇదీ చదవండి: ఆయన మనకెందుకు? -
అందుకే కలెక్టర్లను చంద్రబాబు బెదిరిస్తున్నారు: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ఫ్రస్టేషన్ పీక్ లెవల్‌కు చేరిందని.. అందుకే కలెక్టర్లను కూడా బెదిరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహిళా ఐఏఎస్ సునీతను చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారని.. స్కిల్ కేసులో సునీత నిజాలు మాట్లాడారన్న కోపంతో చంద్రబాబు ఉన్నారన్నారు.‘‘చంద్రబాబు ఒత్తిడి చేయటం వలనే తాను సంతకాలు చేసినట్టు సునీత చెప్పారు. అందుకే తాను స్కిల్ కేసులో ఇరుక్కున్నానని చంద్రబాబు అనుమానిస్తున్నారు. అందుకే ప్రతిసారీ సునీతను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఒక దళిత ఐఏఎస్ అధికారిణిపై చంద్రబాబు నోరు పారేసుకోవటం సరికాదు. ఆమె తన బాధను మిగతా అధికారులతో చెప్పుకుంది. స్పోర్ట్స్ కోటాలో నారా లోకేష్ తన మనుషులకు అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చారు. ఈ ఆధారాలన్నీ బయట పడినా.. చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో ఎందుకు మాట్లాడలేదు?’’ అంటూ టీజేఆర్ నిలదీశారు.‘‘డీఎస్సీ అక్రమాలను అధికారుల మీదకు నెట్టేశారు. అందుకే చంద్రబాబు మాటలు నమ్మి సంతకాలు చేయవద్దని పదేపదే చెప్పాం. మా పార్టీ అధికారంలోకి వచ్చాక లోకేష్ జైలుకు వెళ్లటం ఖాయం. నీట్ పేపర్ లీక్‌తో కేంద్రమంత్రి రాజీనామా చేశారు. మరి నారా లోకేష్ ఎందుకు రాజీనామా చేయలేదు?. చంద్రబాబు, లోకేష్ అవినీతిలో అధికారులు బాధ్యులు కావద్దు. ఐఏఎస్ అధికారిని సునీత లాగా స్ట్రాంగ్‌గా నిలబడాలి...ఎల్‌నినో ఎఫెక్ట్‌తో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలు పడవని ముందే ప్రపంచమంతా తెలుసు. కానీ ఇప్పటివరకు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు కలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేయటం సబబు కాదు. చంద్రబాబు చెప్పిన పెట్టుబడులు, ఉద్యోగాల లెక్కలన్నీ పచ్చి అబద్దాలు. రాష్ట్ర ప్రజలను దగా చేశారు. పెన్షనర్లను తాగుబోతులనటం దుర్మార్గం. వృద్దులు, వికలాంగులను తాగుబోతులు అంటూ అవహేళన చేయటం తగదు. ఆ మాటలను చంద్రబాబు వెంటనే వెనక్కు తీసుకోవాలి’’ టీజేఆర్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ఈ ఆటలేంటి చంద్రబాబూ?: వైఎస్ జగన్ ఫైర్ -
ఈ ఆటలేంటి చంద్రబాబూ?: వైఎస్ జగన్ ఫైర్
సాక్షి, తాడేపల్లి: ఏపీ మెగా డీఎస్సీ స్కామ్‌పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మరోసారి స్పందించారు. వెరిఫికేషన్ పేరుతో అసలేం సాధించారంటూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏడు దశలు పెట్టినా.. ఒక్కో కేసులో ఒక్కో అంశం బయటపడుతోందన్నారు. ఉపాధ్యాయ అభ్యర్థుల భవిష్యత్తుతో చంద్రబాబు సర్కార్ ఆటలాడుతోందంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.“వెరిఫికేషన్? నో, నో.. ఏడు దశల వెరిఫికేషన్!” అంటూ జగన్ ట్వీట్ చేశారు. ముందుగా విజేతల జాబితాను పరిశీలిస్తే.. అందులో సంబంధిత అభ్యర్థుల పేర్లు కనిపించడం లేదని పేర్కొన్నారు. ఆ తర్వాత ఖోఖో అధికారులను సంప్రదిస్తే.. సర్టిఫికెట్ నకిలీదని తేలిందని ఆరోపించారు. అంతేకాకుండా నాగార్జున యూనివర్సిటీని సంప్రదిస్తే.. అసలు ఆ క్రీడా కార్యక్రమమే జరగలేదని తేలిందని జగన్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డీఎస్సీ ప్రక్రియను న్యాయమైన, పారదర్శకమైన నియామక ప్రక్రియగా ఎలా పిలుస్తారని ప్రశ్నించారు.𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻? 𝗡𝗼, 𝗡𝗼 : 𝟳 𝗦𝘁𝗮𝗴𝗲𝘀 𝗼𝗳 𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻!Teacher aspirants’ careers have become a joke for you, @ncbn Garu ?𝗖𝗮𝘀𝗲 𝟭: Check the winners’ list: 𝗢𝗼𝗽𝘀! 𝗧𝗵𝗲 𝗻𝗮𝗺𝗲𝘀 𝗮𝗿𝗲𝗻’𝘁 𝘁𝗵𝗲𝗿𝗲.𝗖𝗮𝘀𝗲 𝟮: Check with Kho-Kho… pic.twitter.com/NShMVPrVmh— YS Jagan Mohan Reddy (@ysjagan) September 12, 2026కేసు–1: మెరిట్ లిస్టులో పేర్లు పరిశీలిస్తే.. అసలు పేర్లే కనిపించ లేదు. కేసు–2: ఖో-ఖో అధికారులను సంప్రదిస్తే ఆ సర్టిఫికెట్ నకిలీదని చెబుతున్నారు. కేసు–3: నాగార్జున యూనివర్సిటీలో ఆరా తీస్తే అసలు ఆ స్పోర్ట్స్ ఈవెంటే జరగలేదని తేలింది. మరి 7 దశల్లో వెరిఫికేషన్ చేశామన్న ప్రభుత్వం.. ఆ తనిఖీలు ఎక్కడ చేశారు?, ఏం తనిఖీ చేశారు? అని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో డీఎస్సీ ప్రక్రియను నిష్పక్షపాతంగా.. పారదర్శకంగా నిర్వహించామని ఎలా చెప్పగలరు? అని అన్నారు. ఈ లోపాలే డీఎస్సీ అక్రమాలకు అవకాశం కల్పించలేదా? దీనికి నైతిక బాధ్యతను మీరు తీసుకోరా?” అంటూ చంద్రబాబును ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రశ్నించారు. #MegaDSCScam హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన ఈ ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: ఆ జీవోల మాయ ఏంటో అసలు! -
ఆయన మనకెందుకు?
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎన్నాళ్లనుంచో ఉన్న మాకే పదవుల్లేవు.. ఎప్పుడు వస్తాయో తెలియడం లేదు.. అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది... ఇంకా మా భవిష్యత్తే మాకు అర్థం కావడం లేదు.. ఇక్కడ ఉన్నవాళ్లకి ఏదీ అర్థం కాకపోతుంటే మళ్లా ఆయన, ఆయన కుమార్తె వచ్చి ఏం చేస్తారు..? మళ్లీ ఆయనను తెచ్చి మా మీద రుద్దడం ఎందుకు.. మా నియోజకవర్గాల్లో... గ్రామాల్లో.. మండలాల్లో మా పనులు మేము చేసుకోలేమా? ఆయనొచ్చి ఏం ఉద్ధరిస్తారు.. ఎందుకొచ్చిన లంపటం మాకు.. ఇదీ ఉమ్మడి విజయనగరం జిల్లాలోని టీడీపీ కార్యకర్త్తల నుంచి వినిపిస్తున్న వ్యాఖ్యలు. గత పదిహేనేళ్లుగా టీడీపీ కార్యకర్త దగ్గర్నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆఖరుకు కేంద్రమంత్రిగా పనిచేసి, ప్రస్తుతం గవర్నర్‌గా ఉన్న అశోక్ గజపతిరాజు సైతం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేసినవారే. అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఏ రకంగా తమ పార్టీలో ఇముడ్చుకోవాలన్నది టీడీపీ క్యాడర్‌కు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈయనను తెచ్చి ఎందుకు నెత్తిన ఎక్కించుకోవాలన్న ప్రశ్నలు టీడీపీ కాంపౌండ్ నుంచి వినిపిస్తున్నాయి. అదెలా కుదురుతుంది: బేబీ నాయిన మరోవైపు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయిన కూడా జెడ్పీచైర్మన్ చేరికను వ్యతిరేకించినట్లు తెలిసింది. వాస్తవానికి తాము గతంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఉండేవాళ్లమని, అప్పట్లో బొత్స సత్యనారాయణ, ఆయనతో బాటు మజ్జి శ్రీనివాసరావు తదితరులు కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి చేరడాన్ని సహించలేకనే తాము టీడీపీలో చేరామని, అలాంటపుడు మళ్లీ ఇప్పుడు ఆయనను టీడీపీలో ఎలా చేర్చుకుంటారని బేబీ నాయిన అధిష్టానాన్ని ప్రశ్నించినట్లు తెలిసింది. ఆయన టీడీపీలో చేరితే బొబ్బిలి రాజకీయాల్లో వేలుపెట్టి గ్రూపులు కట్టి తమకు ఇబ్బంది పెట్టడం.. పార్టీలో గ్రూపులు కట్టడం వంటి అనారోగ్యకరమైన పరిస్థితులు ఏర్పడతాయని బేబీనాయిన వాదించినట్లు తెలిసింది. కానీ, టీడీపీ అధిష్టానం ఆయనను ఊరడించి మజ్జి శ్రీనివాసరావును చేర్చుకున్నట్లు సమాచారం. మరోవైపు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, తదితరులు కూడా చిన్న శ్రీను రాకను అయిష్టంగానే స్వాగతించినట్టు బోగట్టా. ఇదీ చదవండి: ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి టీడీపీ షాక్..! -
ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి టీడీపీ షాక్..!
సాక్షి ప్రతినిధి, కడప: క్షేత్రస్థాయిలో విలువ దక్కకపోయినా అధిష్టానం వద్ద పరపతి తగ్గలేదు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని కాదని, మాజీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి సిఫార్సుల వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. ప్రతి చిన్న విషయానికి అటు ఎమ్మెల్యే వరద ఇటు ప్రవీణ్‌కుమార్ పోటీ పడుతున్నారు. పైచేయి సాధించేందుకు ఎత్తులు..పైఎత్తులు వేస్తున్నారు. ప్రొద్దుటూరులో ప్రవీణ్ పాత్ర అతిస్వల్పం అని చూపించేందుకు ఎమ్మెల్యే తనయుడు కొండారెడ్డి రెండు అడుగులు ముందుకు వేస్తున్నారు. తాజాగా అధిష్టానం వద్ద ప్రవీణ్కుమార్రెడ్డిదే అప్పర్ హ్యాండ్ అయ్యింది. ప్రొద్దుటూరు సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా (ఏజీపీ) వినోద్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు ముందు ప్రొద్దుటూరు ఇన్చిర్జిగా ఉక్కు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి చురుగ్గా ఉండేవారు. సమీకరణల్లో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నంద్యాల వరదరాజులరెడ్డి తెరపైకి వచ్చారు. అప్పటి వరకు కలిసికట్టుగా ఉన్నట్లు అనిపించినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే వరద అన్నింటా తనదే పైచేయి ఉండాలనే దిశగా అడుగులు వేశారు. ఈక్రమంలో పరస్పర దాడులు వరకు వెళ్లారు. ఎప్పటికప్పుడు ఎవరికి వారు చోటుచేసుకున్న పరిస్థితులను అధిష్టానానికి వివరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ప్రభుత్వ నియామకాలపై కూడా ఎప్పటికప్పుడు ఆయా వర్గీయులు అభ్యర్థులను సిఫార్సు చేస్తూ వచ్చారు. ఏజీపీగా వినోద్‌కుమార్ నియామకం... ప్రొద్దుటూరు సివిల్ జడ్జి కోర్టు ఏజీపీగా అడ్వకేట్‌గా ఈ.వినోద్‌కుమార్‌ను నియమిస్తూ జీఓ ఆర్టీ నెం.259 ద్వారా సెప్టెంబర్ 11న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏజీపీ నియామకం కోసం ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అడ్వకేట్ నిర్మలను నియమించాలని సూచించారు. ఈవిషయాన్ని ఇన్చార్జి మంత్రి సవిత, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు టీడీపీ మాజీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అడ్వకేట్ వినోద్‌కుమార్‌ను ఏజీపీగా నిమించాలని మంత్రి నారా లోకేష్‌కు విన్నవించినట్లు సమాచారం. ప్రవీణ్ అభ్యర్థన మేరకు సిఫార్సులు పంపాల్సిందిగా సీఎంఓ నుంచి ఆదేశాలు జారీ కావడం, ఆమేరకు నియామకపు ఉత్తర్వులు వెలుబడినట్లు విశ్వసనీయ సమాచారం. కొండారెడ్డి చర్యలతోనే పలుచబడ్డ పరపతి.... ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అయినప్పటీకీ అనధికార పెత్తనమంతా తనయుడు నంద్యాల కొండారెడ్డి కొనసాగిస్తున్నారు. ప్రత్యేక కోటరీ ఏర్పాటు చేసుకొని కోటరీ సిఫార్సులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. మట్కా, గుట్కా, జూదం లాంటివి విచ్చలవిడిగా ఉన్నాయని స్వయంగా ఎమ్మెల్యే వరద బాహాటంగా వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అలాంటి వ్యక్తులనే కొండారెడ్డి ప్రోత్సహిస్తూ వారి సిఫార్సులకు అనుగుణంగా నడుచుకుంటున్నారని విశ్లేషకులు సైతం వివరిస్తున్నారు. ఇసుక అక్రమదందా, సెటిల్మెంట్లు ఈమారు ప్రొద్దుటూరులో సైర్వవిహారం చేస్తున్నాయి. ఈనేపథ్యంలో అధిష్టానం వద్ద ఎమ్మెల్యే వరద పరపతి పలుచబడినట్లు సమాచారం. ఆమేరకే ఎమ్మెల్యే సిఫార్సులను కాదనీ, ఉక్కు ప్రవీణ్ సిఫార్సులకు అనుగుణంగా ఏజీపీ నియామకం చోటుచేసుకున్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: ఇచ్చింది రెండు.. మెలికెలు మెండు.. -
చంద్రబాబు వెన్నుపోటు నాయకుడు: కొడాలి నాని
సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబు వెన్నుపోటు నాయకుడు అంటూ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కొడాలి నాని దుయ్యబట్టారు. 16 ఏళ్ల బాబు పాలనలో ఒక్కసారే స్థానిక ఎన్నికలు పెట్టాడు. ఎన్నికలకు వైఎస్ జగన్ భయపడుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. భయమంటే ఏంటో తెలియని నాయకుడు జగన్. చంద్రబాబు, లోకేష్‌ల అవినీతికి అంతులేకుండా పోయింది. డీఎస్సీ పేరుతో ఉద్యోగాలను అమ్మేశారు. కొంతమంది దొంగల కోసం స్పోర్ట్స్ జీవోలను మార్చారు’’ అని కొడాలి నాని మండిపడ్డారు.‘‘వైఎస్ జగన్‌ను చర్చకు రమ్మనడానికి లోకేష్‌కు ఉన్నస్థాయి ఏంటి?. పేర్ని నాని చర్చకు వస్తానంటేనే లోకేష్ పారిపోయాడు. తండ్రి పేరు నిలబెట్టేందుకు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి వైఎస్ జగన్. ప్రజలకు ఇచ్చిన మాటకోసం మడమతిప్పని నేత వైఎస్ జగన్. నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తి వైఎస్ జగన్. అధికారమే పరమావధిగా బతికే వ్యక్తి చంద్రబాబు. సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికల్లో పెద్ద లిస్ట్ పట్టుకొచ్చాడు. చంద్రబాబు లాగా అబద్ధపు హామీలతో ఎన్నికలకు వెళ్లనని ధైర్యంగా చెప్పిన వ్యక్తి వైఎస్ జగన్. చంద్రబాబు ఒక్క వాగ్ధానమైనా నెరవేర్చాడా?. మోసంతో చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు’’ అని కొడాలి నాని ధ్వజమెత్తారు.‘‘వెన్నుపోటు సామ్రాట్‌ను, వెన్నుపోటు పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలి. పేర్ని నాని, ఆయన భార్య పై కేసులు పెట్టి వేధించారు. ఎన్ని కేసులు పెట్టినా పేర్ని నాని వెనక్కి తగ్గలేదు. వైఎస్ వెంట నిలిచి ఆయన గొంతును నిరంతరం వినిపిస్తున్నారు. వల్లభనేని వంశీని ఉద్ధేశపూర్వకంగా కేసులతో ఇబ్బంది పెట్టారు. వంశీకి హైదరాబాద్‌లో కోట్ల విలువైన ఆస్తులున్నాయ్. పేదల పట్టాలను అమ్ముకున్నాడని వంశీ పై దొంగ కేసులు పెట్టారు. భోగాపురం ఎయిర్ పోర్టు రాకతో ప్రజల కళ్లల్లో ఆనందం చూశానని సొల్లు కబుర్లు చెబుతున్నాడు. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ ఎలా ఉంటుందో కూడా చంద్రబాబుకు తెలియదు. నీళ్ల కోసం కొండను ఎలా తవ్వుతారని విమర్శించింది చంద్రబాబే. చంద్రబాబు చేలో మేస్తే.. లోకేష్ గట్టుమీద మేస్తాడా?’’ అంటూ కొడాలి నాని నిలదీశారు. -
‘నమ్మినవాళ్లే మోసం చేశారు..’ ఏడ్చేసిన బొత్స
సాక్షి, విజయనగరం: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవలి పరిణామాలతో కలత చెందిన ఆయన.. కష్టకాలంలో నిలబడే కార్యకర్తలే పార్టీకి నిజమైన వెన్నుదన్ను అంటూ కంటతడి పెట్టారు. అయితే తండ్రి బొత్స సత్యనారాయణ కంటితడి పెట్టడంపై ఆయన కుమార్తె బొత్స అనూష చలించిపోయారు. తండ్రిని ఓదార్చారు. గురువారం గరివిడిలో చీపురుపల్లిలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఆ సమయంలో బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాస్(చిన్న శ్రీను) ఇటీవలె పార్టీ మారడం.. పార్టీతో కలిసి నడిచిన రోజుల్ని, అనుబంధాన్ని కొందరు కార్యకర్తలు ప్రస్తావించారు. ఆ ప్రసంగాల సమయంలో.. నమ్మినవాళ్లు మోసం చేశారంటూ బొత్స ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ఆపై తనను తాను సముదాయించుకుని.. ‘‘వ్యక్తులు రావొచ్చు.. పోవచ్చు.. పార్టీ మాత్రం శాశ్వతం. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. పార్టీ పటిష్టత కోసం నిరంతరం పని చేయాలి. వైఎస్ జగన్ ఆశయాల కోసం కలిసి పని చేద్దాం. కష్టకాలంలో నిలబడే కార్యకర్తలే పార్టీకి నిజమైన వెన్నుదన్ను’’ అని అన్నారాయన.ఇదీ చదవండి: నేనూ ఓ కాక్రోచ్‌గా మారొచ్చు: వైఎస్ జగన్ -
జనసేన, బీజేపీ సిగ్గుపడాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ జరగాలి.. విద్యాశాఖ మంత్రి నారాలోకేశ్ రాజీనామా చేయాలి అనే డిమాండ్లను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వినిపించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన.. స్కామ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటపెట్టారు.డీఎస్సీ అక్రమాలు స్పష్టంగా కనిస్తున్నాయి. అర్హత లేని వారికి ఎవరు చెబితే పోస్టులు ఇచ్చారు?. టెట్ అర్హత లేకుండా పోస్టులు ఇచ్చామని ఒప్పుకున్నారు. స్పోర్ట్ సర్టిఫికెట్లు నిఖార్సయినవి కావని చెప్పలేకపోయారు. జూడో పోటీల్లో దొంగ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు ఒప్పుకున్నారు. లంచాలు తీసుకుని స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఏడుసార్లు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది కూడా బోగస్సే. అసలు ఏ పరీక్ష లేకుండా ఉద్యోగాలివ్వడమే పెద్ద స్కాం....ఏపీపీఎస్సీలోనూ పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని చూశారు. దొడ్డిదారిన జీవో నెంబర్ 4 తేవాలని చూశారు. మా హయాంలో క్లియరెన్స్ పొందిన 814 పోస్టుల్లో.. పరీక్ష లేకుండా 40 పోస్టులు ఇవ్వాలని చూశారు. డీఎస్సీ స్కాం బయటకు రావడంతో ఆగిపోయారుచంద్రబాబు, లోకేశ్‌లు వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారు. ఆయన దగ్గర పని చేసే అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేయగలరా?. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నాం. నిరుద్యోగ యువత కోసం కోర్టులోనూ పోరాడుతున్నాం అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కాయలున్న చెట్టుకే రాళ్లదెబ్బలు తగులుతాయి అంటూ డీఎస్సీ వ్యవహారంపై నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యపైనా వైఎస్ జగన్ స్పందించారు. లోకేశ్, ఆయన తండ్రి చంద్రబాబు చెప్పే సమాధానాలు కూడా అబద్ధాల రూపంలోనే ఉంటున్నాయని ఎద్దేవా చేశారు. డీఎస్సీ స్కామ్‌పై ఇంతరాద్ధాంతం జరుగుతుంటే.. బీజేపీ, జనసేన మౌనంగా ఉండడంపై వైఎస్ జగన్ స్పందించారు. జగన్ అడిగే అంశం సరైందే అయినప్పుడు నోరు మెదపాల్సిన అవసరం అన్ని పార్టీలకు ఉంటుందని అన్నారు. బీజేపీ, జనసేన స్పందించకపోవడంపై వాళ్లనే అడగాలని మీడియాకు సూచించారు. ఇలాంటి చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్నందుకు.. ఇలాంటి వ్యవస్థను బలపరుస్తూ తప్పుచేసుకున్నందుకు వాళ్లు సిగ్గుపడాలని వైఎస్ జగన్ అన్నారు. -
దొంగ సర్టిఫికెట్లు.. ఫ్యామిలీ ప్యాకేజీలా ఉద్యోగాలు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ స్కామ్‌లో వాస్తవాలు బయటపడుతున్నా.. దాన్ని కప్పిపుచ్చేందుకు కూటమి ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. స్పోర్ట్స్ కోటాలో అర్హతలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని, ఏడుసార్లు వెరిఫికేషన్ చేసిన తర్వాతే నియామకాలు చేపట్టామని అధికారుల ద్వారా చెప్పిస్తూ ఇప్పుడు కవర్అప్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.గురువారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టెట్ పాస్ కాకుండానే కొందరికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏ పరీక్ష రాయకుండానే విశాఖపట్నంకు చెందిన యోగేశ్వరరావుకు స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ ఉద్యోగం ఇచ్చారని ఆరోపించారు. ఆయనతో పాటు ఆయన సోదరికి కూడా ఉద్యోగం ఇచ్చారని, కుటుంబం మొత్తానికీ ‘ఫ్యామిలీ ప్యాకేజీ’లా పోస్టులు కట్టబెట్టారని విమర్శించారు. ఈ వ్యవహారంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కీలకంగా వ్యవహరించిందన్నారు.యోగేశ్వరరావు, మోహినీదేవి పేర్లు తాము నిర్వహించిన ఈవెంట్లో లేవని తెలంగాణ ఖోఖో అసోసియేషన్ స్పష్టం చేసిందని జగన్ తెలిపారు. అయినప్పటికీ వారు పోటీల్లో పాల్గొన్నట్లు చూపించి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ప్రగడ కల్యాణి విషయంలోనూ ఇదే తరహా వ్యవహారం జరిగిందన్నారు. ఆమె కబడ్డీ పోటీలో పాల్గొన్నట్లు పేర్కొన్నప్పటికీ.. 2003లో నాగార్జున యూనివర్సిటీలో సౌత్‌జోన్ కబడ్డీ పోటీలు జరిగాయని, కాబట్టి ఆమె సమర్పించింది నకిలీ సర్టిఫికెట్‌గా తేలిందని ఆయన చెప్పారు.ఈడిగ ప్రభాకర్ వ్యవహారాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. ఆయన టెట్‌కు క్వాలిఫై కాలేదని, కనీస విద్యార్హత కూడా లేదని డీఈవో స్వయంగా వెల్లడించారని తెలిపారు. అయినా ఉద్యోగం ఎలా వచ్చిందని ప్రశ్నించారు.మరోవైపు ‘ఏడుసార్లు వెరిఫికేషన్ అయ్యాకే ఉద్యోగాలు ఇచ్చాం’ అని అధికారులు డీఎస్సీ స్కాం గురించి ప్రెస్‌మీట్ పెట్టి చెప్పారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. డీఎస్సీ స్కామ్‌పై ప్రశ్నలు తలెత్తిన తర్వాత.. కొందరు అభ్యర్థులు చాలాసార్లు టెట్ రాసి ఉండొచ్చని, అందువల్ల ఉద్యోగం వచ్చి ఉండొచ్చంటూ కవర్అప్ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అసలు ఆ వెరిఫికేషన్ కూడా బోగస్ అని ఆయన అభివర్ణించారు. ఇలా తప్పుడు సర్టిఫికెట్లు, అర్హతలు, స్పోర్ట్స్ కోటా నియామకాలపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.ఇదీ చదవండి: ఆధారాలు చూపిస్తే అక్రమ కేసులా? -
కాక్రోచ్లు పుట్టుకొచ్చేది ఇందుకే..: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు కుంభకోణాల చరిత్రలో.. డీఎస్సీ స్కామ్ అనేది ఓ ఆణిముత్యమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రెస్మీట్లో డీఎస్సీ అంశాలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు.డీఎస్సీ స్కామ్‌ను దగ్గరుండి నిర్వీర్యం చేస్తున్నారు. కొడుకు నారా లోకేశ్‌ను కాపాడుకోవాలనే ఆరాటంలో చంద్రబాబు ఉన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారు. వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారు. ఇలాంటి స్కామ్‌ల వల్లే కాక్రోచ్లు(కాక్రోచ్ జనతా పార్టీ.. జెన్‌జీ ఉద్యమంను ఉద్దేశించి) పుట్టుకొస్తున్నాయి అని వైఎస్ జగన్ అన్నారు.వ్యవస్థలు చెడగొట్టినప్పుడే కాక్రోచ్లు వస్తాయి. ఇలాంటి స్కామ్‌లతో కాక్రోచ్లు రాక తప్పదు. ఆఖరికి నాలాంటి వాడు కూడా కాక్రోచ్ అవుతాడు అని వైఎస్ జగన్ కామెంట్ చేశారు.డీఎస్సీ కుంభకోణంలో పై నుంచి కింది స్థాయి వరకు కుమ్మక్కయ్యారు. తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలిచ్చేశారు అని ఖమ్మం(తెలంగాణ)లో జరగని ఈవెంట్లతో ఉద్యోగాలిచ్చిన కేసును ఆధారాలతో సహా చూపించారు. ఆ జూడో అసోషియేషన్ అధ్యక్షుడు ఎవరో కాదు.. చంద్రబాబు దగ్గరి బంధువు.. నారా లోకేశ్ తోడల్లుడు.. టీడీపీ ఎంపీ భరత్ అని చెప్పారు. సాఫ్ట్ బాల్ విషయంలోనూ ఇదే జరిగిందని.. దాని అధ్యక్షుడు ఎమ్మెల్యే కూన రవి అని గుర్తు చేశారు. వీటి ఆధారంగా దొంగ సర్టిఫికెట్లు గుర్తించినట్లు ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. కుంభకోణం జరిగిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని వైఎస్ జగన్ అన్నారు.ఇదీ చదవండి: డీఎస్సీ స్కాంతో బాబుకి హైబీపీ -
డీఎస్సీ స్కామ్‌తో చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోంది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి.. సుదీర్ఘంగా ఈ కుంభకోణంపై కొత్త విషయాలతో మాట్లాడారాయన.డీఎస్సీ కుంభకోణంలో తవ్వే కొద్దీ అక్రమాలు కనిపిస్తున్నాయి. స్కామ్ జరిగిందని ఎవరైనా ఆధారాలు చూపిస్తే చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోంది. వాళ్లను జైల్లో పెడుతున్నారు. జర్నలిస్టులు కొందరు వాస్తవాలు బయటపెడితే.. వాళ్లపైనా తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. డీఎస్సీ అక్రమాలపై కూటమి ప్రభుత్వానికి ఎన్నో ప్రశ్నలు సంధించాం. నా ప్రశ్నలకు చంద్రబాబు, నారా లోకేశ్ దగ్గరి నుంచి సమాధానమే లేదు అని వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రశ్నాపత్రం తయారీ.. పర్యవేక్షణ ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారు?. ఇక్కడే డీఎస్సీ స్కామ్‌కు ద్వారాలు తెరిచారు. మా ప్రశ్నలకు సమాధానం చెప్పుకుండా బుల్డోజ్ చేస్తున్నారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్ అనే వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు. మెరిట్ లిస్ట్‌లో ఫస్ట్‌ర్యాంకర్ పేరు ఎందుకు లేదు?. సెకండ్ లిస్ట్‌లో అతని పేరు ఎందుకు మాయమైంది?. అతని డీఎస్సీ లాగిన్ ఎందుకు బ్లాక్ చేశారు. ఎందుకు అతన్ని వెరిఫికేషన్‌కు ఎందుకు పిలవలేదు?. కోర్టుకు ఆ ఫస్ట్ ర్యాంకర్ ఎందుకు వెళ్లాడు?. స్కామ్‌ను దాచిపెట్టే ప్రయత్నంలోనే ఇదంతా చేశారు అని వైఎస్ జగన్ అన్నారు. స్పోర్ట్ కోటాలో పరీక్షే లేకుండా 372 మందికి ఉద్యోగాలు కట్టబెట్టారు. అందుకోసం ప్రత్యేక జీవోలు రిలీజ్ చేశారు. రిక్రూట్మెంట్ అయ్యాక ఆ జీవోలు మార్చేశారు. డీఎస్సీ ఉద్యోగాల కోసం జరిగిన బేరసారాల ఆడియో, వీడియోలు బయటకు వచ్చాయి. తూతూమంత్రంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది స్కామ్‌ను దాచిపెట్టే ప్రయత్నం కాదా? అని వైఎస్ జగన్ నిలదీశారు. -
నేడు వైఎస్ జగన్ ప్రెస్‌మీట్
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమకాలీన అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. -
అరెస్ట్‌ను సెలబ్రేట్ చేసుకోవడం సిగ్గుచేటు: వీరశేఖర్ రెడ్డి
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తే పార్టీ నాయకులు చూస్తూ ఊరుకోరని, వారి భాషలోనే అంతకన్నా బలంగా సమాధానం ఇస్తామని.. తమ హుందాతనాన్ని చేతకానితనంగా భావించవద్దని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సహనం నశించేలా తమను రెచ్చగొడితే చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌కు సంబంధించిన అంశాలపై కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.2014 నుంచి 2019 మధ్య కాలంలో ఫైబర్ నెట్, ఇసుక, మద్యం, అమరావతి భూములు, స్కిల్ డెవలప్మెంట్ వంటి అనేక స్కామ్‌లకు పాల్పడి, కోట్లు కొల్లగొట్టి, జైలుకు వెళ్లి మెడికల్ బెయిల్‌పై బయటికి వచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్టస్ పేరుతో ఆ కేసులను కొట్టేయించుకున్న విధానంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మా సహనాన్ని తక్కువ అంచనా వేయొద్దు:వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననం చేస్తే చూస్తూ ఊరుకోం. మా హుందాతనం చేతకానితనం అనుకోవద్దు. మీరు రాళ్లు వేస్తే మేము బండలు వేయగలం. మీరు పూలు పెడితే మేము పుష్పగుచ్ఛాలు ఇవ్వగలం. మీరు బూతులు తిడితే మేము కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మేము హుందాగా మాట్లాడుతున్నామంటే చేతకాక కాదు. మాపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా రాజకీయంగా విమర్శిస్తే రాజకీయంగానే సమాధానం ఇస్తాం. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలి అనే దానిపై మాట్లాడాలి.కానీ చంద్రబాబు మాట్లాడటం మొదలుపెడితే బూతులు, అబద్ధ ప్రచారం, విషప్రచారం తప్ప మరేమీ కనిపించడం లేదు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఈ స్థాయికి దిగజారడం దురదృష్టకరం. మాజీ ముఖ్యమంత్రి, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిపై వ్యక్తిగతంగా, నీచంగా మాట్లాడటం సరైంది కాదు. ముఖ్యమంత్రి అనే స్థాయిని చంద్రబాబు మర్చిపోకూడదు.2014 నుంచి 2019 మధ్య ఫైబర్‌నెట్, ఇసుక, మద్యం, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్, అమరావతి అసైన్డ్ భూములు, స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన అనేక ఆరోపణలు వచ్చాయి. స్కిల్ కేసులో వందల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీల ఆరోపణలతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి అరెస్టు చేస్తే కోర్టు జైలుకు పంపింది. అలాంటిది కేసులు, అరెస్టులు, రిమాండ్లకు సంబంధించిన విషయాలను కూడా సెలబ్రేట్ చేసుకోవడం ఏ విధమైన రాజకీయ సంస్కతి? తప్పు చేయకుండా ఒక సిద్ధాంతం కోసం పోరాడి జైలుకు వెళ్లినవాళ్లు గొప్పగా చెప్పుకుంటారు.కానీ తన అరెస్టును చంద్రబాబు సెలబ్రేట్ చేసుకోవడం సిగ్గుచేటు. స్కిల్ కేసులో అరెస్టు కాబటి జైల్లో ఉండొచ్చిన చంద్రబాబు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాడు? ఆయన మెడికల్ గ్రౌండ్స్‌పై బెయిల్ వచ్చాడే కానీ కేసుల్లో నిజాయితీ పరుడిగా నిర్ధారణ కాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉన్న కేసులను మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ పేరుతో తొలగించేసుకుంటున్నాడు.ముఖ్యమంత్రి పదవి చేపట్టింది తనపై ఉన్న కేసులను తొలగించుకోవడానికా? లేక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికా? ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. కేసుల విషయంలో కోర్టులు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో ప్రభుత్వం, పోలీసులు తీసుకునే నిర్ణయాలపై కూడా ప్రజలకు వివరణ ఇవ్వాలి.లోకేశ్ బాగోతం బయట పెట్టమంటారా?వైఎస్ జగన్ చదువుల కోసం అమెరికా వెళ్లి హోమ్‌సిక్‌తో తిరిగి రావడం ఏమైనా పెద్ద తప్పా? చదువు కోసం అమెరికా వెళ్లి తల్లిదండ్రులను విడిచి ఉండలేక తిరిగి రావడాన్ని కూడా రాజకీయ విమర్శగా ఉపయోగించుకోవడం అన్యాయం. అప్పట్లో వైఎస్సార్.. చంద్రబాబు వ్యాఖ్యలకు ఇచ్చిన సమాధానం ప్రజలకు తెలుసు. వైఎస్ జగన్ వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతున్న చంద్రబాబు.. ముందుగా తన కుటుంబానికి సంబంధించిన ఆరోపణలపై సమాధానం చెప్పాలి. నారా లోకేష్‌కు సంబంధించి గతంలో వచ్చిన ఆరోపణలపై ప్రజలకు వివరణ ఇవ్వాలి. ఇతరుల వ్యక్తిగత జీవితాలను ప్రశ్నించే ముందు తన కుటుంబంపై వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. జనాలు అన్నీ మర్చిపోయారు, తాను ఏది చెప్పినా నమ్ముతారు అనుకోవద్దు.దస్తగిరి టీడీపీ ఆఫీస్‌కు ఎందుకు వెళ్లారు?వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడైన దస్తగిరికి టీడీపీ కార్యాలయంలో ఏం పని? ఆయనకు న్యాయ సహాయం ఎవరు అందించారు? ఈ అంశాలపై రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలి. వీటికి సమాధానం చెప్పిన తర్వాత వైఎస్ జగన్ గురించి మాట్లాడాలి. మేము హుందాగా మాట్లాడుతున్నాం. అంతే తప్ప, అది తమ బలహీనత కాదన్న విషయం చంద్రబాబు గుర్తుంచుకోవాలని వీరశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
ఆ లేఖను బయట పెట్టగలరా?: వంగవీటి నరేంద్ర
సాక్షి, తాడేపల్లి: స్కిల్ స్కామ్ నుంచి డీఎస్సీ వరకు అవినీతి, అక్రమాలపై ప్రజలకు సమాధానం చెప్పకుండా సంబరాలు చేసుకోవడం చంద్రబాబు, లోకేశ్‌కు పరిపాటిగా మారిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ధ్వజమెత్తారు. చంద్రబాబుపై స్కిల్ కేసు పెట్టింది వైఎస్ జగన్ కాదు.. ఈడీ పెట్టింది. కానీ తనపై వైఎస్ జగన్ కేసులు పెట్టించాడంటూ అన్యాయంగా మాట్లాడుతున్నారు. అనారోగ్య సమస్యలు చూపించి బెయిల్ తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు’’ అంటూ నరేంద్ర మండిపడ్డారు.‘‘అధికారులను భయపెట్టి తనపై ఉన్న కేసులను వెనక్కి తీసుకునేలా చేసుకుంటున్నారు. తనపై కేసులకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకోవటం సిగ్గుచేటు. చంద్రబాబు నేరం చేసినట్లు ఛార్జ్ షీట్ లో స్పష్టంగా ఉంది. ప్రభుత్వం మారిన తరువాత వరుసగా కేసులు క్లోజ్ అవుతున్నాయి. స్కిల్ కేసులో నలుగురిని ఈడీ అరెస్టు చేసింది. స్కిల్ కేసులో క్లీన్ చిట్ ఇచ్చిందంటున్నారు. ఆ లెటర్ బయట పెట్టగలరా?.సిద్ధార్థ లూథ్రాకి ఏ అధికారంతో ఏపీ పోలీసు అధికారులతో సమావేశాలు పెడుతున్నారు. చంద్రబాబు అడ్డదారిలో అధికారంలోకి రాకుండా ఉంటే జీవిత కాలం జైల్లో ఉండే కేసులు ఉన్నాయి. చంద్రబాబు మళ్లీ జైలుకి వెళ్ళడం ఖాయం’’ అని వంగవీటి నరేంద్ర వ్యాఖ్యానించారు. -
ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్ జగన్ (ఫొటోలు)
-
జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు, ఎలా జరిగినా పార్టీ శ్రేణులు గట్టిగా నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు. అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగం, అక్రమ కేసులు, అరెస్టులు వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. బుధవారం పర్చూరు నియోజకవర్గ పార్టీ కేడర్‌తో జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడారు. స్థానిక ఎన్నికలు జరుగుతాయో లేదో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం వెనుక ఎన్నికలను వాయిదా వేయాలన్న ఉద్దేశం ఉందని వ్యాఖ్యానించారు. ఆ రిజర్వేషన్లను కోర్టు కొట్టివేస్తుందని ప్రభుత్వానికి ముందే తెలుసని, దానిని సాకుగా చూపి ఎన్నికలను వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ‘‘రేపు జరిగేది కురుక్షేత్ర సంగ్రామం. స్థానిక ఎన్నికల్లో జరిగే అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగంపై కసి వచ్చే సాధారణ ఎన్నికల్లో కనిపించాలి’’ అని అన్నారు. ఓట్లపై కూడా అనుమానాలు..ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపైనా జగన్ ప్రశ్నలు సంధించారు. ఇప్పటికే 44 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిజంగా సజావుగా జరుగుతాయా? అని ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్సీపీ ప్రజలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. “ఎన్నికలు సాఫీగా జరిగితే వైఎస్సార్సీపీదే విజయం. సాఫీగా జరగనివ్వకపోయినా గట్టిగా పోరాడదాం. స్థానిక ఎన్నికల్లో మీరు గట్టిగా నిలబడాలి” అని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.రోజుకో డ్రామా.. డైవర్షన్ పాలిటిక్స్చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఎన్నికలు సాఫీగా సాగే అవకాశం లేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, జైలుకు పంపడం జరుగుతోందని ఆరోపించారు. ‘‘రోజుకో డ్రామా.. రోజుకో నటన.. డైవర్షన్ పాలిటిక్స్’’ అంటూ కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.స్థానిక ఎన్నికలు కేవలం రాజకీయ పార్టీలకు సంబంధించినవి కావని, అవి ప్రధానంగా కార్యకర్తల ఎన్నికలని జగన్ అన్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు కార్యకర్తలే అండగా ఉంటారని, అలాంటి కార్యకర్తలకు పార్టీ కూడా అండగా నిలవాలని సూచించారు. దౌర్జన్యంతో ఎప్పటికీ పాలకులు రాజ్యం చేయలేరని వ్యాఖ్యానించారు.నంద్యాల ఉప ఎన్నికను గుర్తుచేస్తూ..పర్చూర్ కేడర్ వద్ద తన గత రాజకీయ అనుభవాలను కూడా వైఎస్ జగన్ ప్రస్తావించారు. 2017లో తాను పాదయాత్ర ప్రారంభించడానికి ముందు నంద్యాల ఉప ఎన్నిక జరిగిందని గుర్తుచేశారు. తీవ్ర అధికార దుర్వినియోగం కారణంగా వైఎస్సార్సీపీ 35 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిందని అన్నారు. 2014–19 మధ్య తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు తీసుకున్నారని జగన్ ఆరోపించారు. ఆ తర్వాత తాను పాదయాత్ర చేపట్టానని, ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని తెలిపారు. 2019 ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. నాడు తమ పార్టీ నుంచి తీసుకెళ్లిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీల సంఖ్యకే చంద్రబాబు పార్టీ పరిమితమైందని వ్యాఖ్యానించారు.మంచి చేసి ఓటు అడగాలి..పాలకులు ప్రజలకు మంచి చేసి, ఆ పనులను చూపించి ఓట్లు అడగాలని జగన్ అన్నారు. అలా చేసినప్పుడే దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆదరణ లభిస్తాయని పేర్కొన్నారు. ఎల్లవేళలా అబద్ధాలు, దౌర్జన్యాలను ప్రజలు హర్షించబోరని అన్నారు. ‘‘జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం. ఆ సంగ్రామంలో మీరంతా ప్రజలకు తోడుగా నిలబడాలి.. పోరాడాలి’’ అని వైఎస్సార్సీపీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: అర్హతే లేనివారికి టీచర్ పోస్టులా? -
‘డీఎస్సీ అక్రమాల వెనుక నారా లోకేష్ హస్తం’
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలు జరిగినట్టు అధికారులు అంగీకరించారు.. విజిలెన్స్ విచారణ జరుగుతోందని చెప్పారు.. అంటే అక్రమాలు జరిగినట్టు తేలిపోయింది. నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలి’’ అని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విజిలెన్స్‌తో కాకుండా సీబిఐతో విచారణ జరిపించాలన్నారు.‘‘ఈ అక్రమాల వెనుక నారా లోకేష్ హస్తం ఉంది. 382 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు ఎవరికిచ్చారో పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలేవీ?. ఇప్పటికీ అక్రమాలను కప్పి పుచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు?. పచ్చి అబద్దాలతో మంత్రి లోకేష్ అసెంబ్లీని సైతం అవమాన పరిచారు. వైఎస్ జగన్‌కు సవాల్ చేసిన లోకేష్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?. డీఎస్సీ అక్రమాల వెనుక వ్యవస్తీకృత నేరం ఉంది. ఒక పక్కా ప్లాన్ ప్రకారమే అక్రమాలు చేశారు...జూడో అసోసియేషన్ ఛైర్మన్ భరత్ సాక్షాత్తూ నారా లోకేష్ తోడల్లుడే. ఆ అసోసియేషన్ నుండి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఇవన్నీ బయట పడాలంటే సీబిఐతో విచారణ జరపాల్సిందే. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. వైఎస్ జగన్‌కి సవాల్ చేసే స్థాయి లోకేష్‌కి లేదు. లోకేష్ ఎమ్మేల్యే కాకముందే నేను ఎంపీ అయ్యాను. లోకేష్‌తో చర్చకు నేను సిద్ధం. కరకట్ట ఇల్లయినా, హైదరాబాదు ఇంటికైనా చర్చకు వస్తా. డేటు, టైం లోకేష్ ప్రకటించాలి’’ అని మార్గాని భరత్ సవాల్ విసిరారు. -
ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు ‘డైవర్షన్’ రాజకీయం!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా సెంటిమెంట్ రాజకీయాలను పండించడానికి ప్రాజెక్టుల ద్వారా నీటి విడుదల కార్యక్రమాలను అమలు చేశారా అన్న అభిప్రాయం కలుగుతుంది. తొలుత వెలుగొండ ప్రాజెక్టు నుంచి , ఆ తర్వాత పోలవరం ఎడమ కాల్వ ద్వారా నీటి విడుదల నిర్వహించారు. ఈ కార్యక్రమాలు చేయడానికి ఎవరికి అభ్యంతరం లేదు. కాని ఆ సందర్భంగా ఆయన అనుసరించిన పద్దతులు, చేసిన ప్రసంగాలు చూస్తే , డైవర్షన్ రాజకీయాలలో భాగమేనా అన్న సందేహం కలుగుతుంది. స్థానిక ఎన్నికలు కూడా దృష్టిలో ఉండవచ్చు. కాగా వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు క్రెడిట్ చోరీ ఎలా చేశారో అంకెలతో సహా జగన్ వివరించారు. ఆ తర్వాత పోలవరం ఎడమ కాల్వకు గ్రావిటీ ద్వారా కాకుండా, అప్పటికే అమలులో ఉన్న పుష్కర లిఫ్ట్ ద్వారా నీటిని తోడి ఈ కాల్వలో పోసి అదేదో ప్రాజెక్టు పూర్తి అయినట్లు కలరింగ్ ఇచ్చుకుంటున్నారని జగన్ విమర్శించారు. దీనిని గమనిస్తే చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టడానికి తంటాలు పడుతున్నట్లు అవుతుంది. ఇటీవలి కాలంలో చంద్రబాబు ప్రభుత్వం అనేక సమస్యలను ఎదుర్కుంటోంది. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అరకొరగా నెరవేర్చి ,సూపర్ సిక్స్ అంటూ సూపర్ హిట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దానిని ప్రజలు విశ్వసించడం లేదు. అంతా ఆశ్చర్యంగా ఇదేమిటి ఇలా చెబుతున్నారేమిటా అని చర్చించుకుంటున్నారు. మరో వైపు రెడ్ బుక్ పేరుతో పోలీసుల ద్వారా అరాచకాలు సాగుతున్న వైనం ప్రభుత్వ ప్రతిష్టను బాగా దెబ్బతీస్తోంది. ఉద్యోగులు తమను ప్రభుత్వం మోసం చేసిందన్న ఆగ్రహంతో ఉన్నారు.విశాఖలో డేటా సెంటర్ల పేరుతో జరిగే కాలుష్య విధ్వంసంపై మేదావులు గళమెత్తుతున్నారు. అమరావతిలో మాత్రం వేల కోట్ల అప్పులు తెచ్చి అదిక అంచనాలతో నిర్మాణాలు జరుగుతున్న తీరుపై ప్రజలలో అసంతృప్తి ఏర్పడింది. జగన్ మావిగన్ (విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం) కారిడార్ అభివృద్దిని ప్రతిపాదించడంతో ఇరుకున పడ్డ చంద్రబాబు దానిని ఆవిగన్గా (అమరావతి, విజయవాడ, గుంటూరు) మార్చుకున్నారు. అయినా ఖర్చు మాత్రం కేవలం 29 గ్రామాల పరిదిలోనే చేస్తున్నారన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడింది. డిఎస్సి అక్రమాలతో సహా ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలు చికాకుగా మారాయి. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోతోందన్న భావన ఏర్పడింది. ఈ నేపధ్యంలో వాటిని కొంతమేర పక్కదారి పట్టించి ప్రజలలో ప్రాజెక్టులకు సంబందించి ఏదో జరుగుతోందన్న అభిప్రాయం కలిగించడమే లక్ష్యంగా ఈ నీటి విడుదల కార్యక్రమాలు పెట్టుకున్నారని కొంతమంది విశ్లేషిస్తున్నారు. ఇందులో ఎక్కువ భాగం వాస్తవం ఉన్నట్లు అనిపిస్తుంది. లేకుంటే వెలిగొండలో నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం చేయకుండా, హడావుడిగా నీటిని విడుదల చేశారు. ఆ ప్రాజెక్టు మొత్తం తన ఘనతేనని ఆయన చెప్పుకున్నారు. దానిపై జగన్ వేసిన ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వలేకపోయారు.ఇక ఆ వెంటనే పోలవరం ఎడమ కాల్వకు నీరు అంటూ మరో ప్రోగ్రాం నిర్వహించారు. నిజంగానే పోలవరం ప్రాజెక్టు అందరూ ఆశించినట్లు పూర్తి చేసి,నీటి విడుదల జరిగి ఉంటే అంతా సంతోషిస్తారు. కాని గతంలో చంద్రబాబు హయాంలో పెట్టిన పుష్కర స్కీమ్ మోటార్లను వాడి కాల్వలో నీటిని పారించారట. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు లక్ష్యాన్ని నీరుకార్చినట్లు అవుతుందన్న భయం ప్రజలలో ఏర్పడుతోంది. మార్కాపురం వద్దకాని, అనకాపల్లి జిల్లా పాయకరావు పేట వద్ద కాని, ఆయన పంచెకట్టుతో రావడం, సాశ్టాంగ నమస్కారం చేయడం, సభికులతో గోదావరి నీళ్లు వచ్చాయి అంటూ గట్టిగా చెప్పించడం, రకరకాల సెంటిమెంట్లను చొప్పించడం వంటివి చేశారు. నిజంగా ఎడమ కాల్వను ఆయనే నిర్మాణం చేపట్టి ఉంటే చెప్పుకోవచ్చు. కాని ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాల్వలు తవ్వించడంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయం వల్లనే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఒక దశకు చేరిందన్నది వాస్తవం. కాకపోతే చంద్రబాబుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఎత్తడం ఇష్టం ఉండదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయి ఉంటే ఎడమ కాల్వకు మోటార్ల ద్వారా నీరుఎత్తిపోయవలసిన అవసరం ఎందుకు వస్తుందన్న ప్రశ్న వస్తుంది. అప్పట్లో పోలవరం ప్రాజెక్టు అంటే అంతగా ఆసక్తి లేని చంద్రబాబు, గత టరమ్ లో పట్టిసీమ లిఫ్ట్ ను పెట్టి హడావుడి చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తవ్వించిన కుడి కాల్వ ద్వారా నీటిని విజయవాడ వద్ద కృష్ణానదికి తీసుకువెళ్లారు. అప్పట్లోనే పట్టిసీమ కాకుండా పోలవరానికి ఆ డబ్బు ఖర్చు చేసి సత్వరమే ప్రాజెక్టును సిద్దం చేయాలని అనేక మంది సూచించినా చంద్రబాబు పట్టించుకోలేదు.ఇప్పుడు తాను ఏర్పాటు చేసిన లిఫ్ట్ ల ద్వారానే నీటిని తరలిస్తున్నానని చెప్పుకోవచ్చేమో కాని, దానివల్ల జరిగే నష్టం గురించి తెలుసుకోవాలి. ఈ సీజన్ లో పట్టిసీమ ద్వారా నీటిని తరలించి కృష్ణా డెల్టాకు సాగుకు అందిస్తున్నామని గొప్పగా ప్రకటించారు. పూజలు కూడా చేశారు.కాని ఆ తర్వాత గోదావరిలో నీరు తగ్గడంతో పట్టిసీమ నుంచి నీరు రావడం తగ్గిపోయింది. దాంతో కృష్ణా డెల్టాలో సైతం పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. అలాగే ప్రస్తుతం పుష్కర మోటార్లను వాడి నీటిని విడుదల చేశారు. కాని ఈ నీరు పూర్తిగా రైతులకు అందడానికి ఇంకా సమయం పడుతుంది. మోటార్లపైనే ఎప్పటికీ ఆధారపడడం అంత మంచిది కాదని అనుభవం చెబుతోంది. అలాగే ఉత్తరాంద్ర సుజల స్రవంతికి నీరు ఇవ్వడం కూడా అంత తేలికకాకపోవచ్చు. కాకపోతే జనాన్ని ప్రస్తుతానికి మభ్య పెట్టడానికి ఉపయోగపడవచ్చు. ఈ నేపధ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక ట్వీట్ చేస్తూ పోలవరంపై డ్రామాలు ఆపాలని చంద్రబాబుకు సలహా ఇచ్చారు. పురుషోత్తపట్నం పంపులతో నీటిని ఎత్తిపోస్తే ప్రాజెక్టు నుంచి ఇచ్చినట్లు ఎలా అవుతుందని జగన్ ప్రశ్నించారు. ఈ పంపులు కొత్తవి కావని, ఇప్పటికే ఉన్నవే కదా అని అంటూ, అయినా ఈ డ్రామా ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. నీళ్లు పురుషోత్తమపట్నానివి అయితే, కాల్వ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించినదని ఆయన వ్యాఖ్యానించారు. ఇందులో చంద్రబాబు కొత్తగా చేసిందేమిటని అన్నారు. పోలవరం ఎత్తు 45.72 మీటర్లా? లేక 41.15 మీటర్లకే పరిమితమా? అని జగన్ సూఠిగా అడిగారు.ఈ అంశంపై చంద్రబాబు స్పందించగలిగితే బాగుంటుంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పై ప్రేమ అంతా ప్రసంగాలకే పరిమితమా అని జగన్ ఎద్దేవ చేశారు. ఒక వేళ 41.15 మీటర్ల వద్దే పోలవరం ప్రాజెక్టు నిలిచిపోతే ఈ కాల్వల ద్వారా ఆశించిన ప్రయోజనం నెరవేరడం కష్టం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.మరో వైపు పోలవరం నిర్వాసితుల కాలనీలలో అధ్వాన్న పరిస్థితులు ఉన్నాయని వార్తలు వచ్చాయి. కాగా ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎడమ కాల్వ నీటి విడుదలపై కామెంట్ చేస్తూ 26 నెలల్లో ఎడమ కాల్వ పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందని అన్నారు. పవన్ కళ్యాణ్ కు నీటిపారుదల ప్రాజెక్టులపై అవగాహన ఉంటే ఇలా వ్యాఖ్యానిస్తారా అని నిపుణులు అంటున్నారు. రెండేళ్లలో టైమ్ లో భూ సేకరణ, ఆ తర్వాత కాల్వ తవ్వకం, తదితర నిర్మాణాలు సాద్యమవుతాయా అని వారు అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే అమరావతి వ్యయం జనానికి కన్పించకుండా, ఉత్తరాంధ్ర, రాయలసీమలను నిర్లక్ష్యం చేయడం లేదని ప్రచారం చేసుకోవడానికి ఈ నీటి విడుదల కార్యక్రమాలు నిర్వహించారా అన్నది చర్చగా ఉంది. అదే లక్ష్యం అయితే ప్రజలను మరోసారి మభ్యపెట్టడమే అవుతుందా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.చదవండి: పోలవరం కల సాకారమా?.. లేక ముగింపు ప్రయత్నమా? -
జట్టు కడతారా.. గట్టునుంటారా!
అన్నమయ్య జిల్లా టీడీపీ నేతలు ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగానే ముందుకు సాగుతున్నారా? పలు నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లు మార్చినా వర్గ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయా..? జిల్లా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు అధిష్టానానికి తలనొప్పులుగా మారాయా? అంటే..అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.అన్నమయ్య జిల్లా టీడీపీ రాజకీయాల్లో వర్గ విభేదాలు సమసిపోలేదు. నిన్నటిదాకా జిల్లా టీడీపీలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనుకూల, వ్యతిరేక వర్గాలు కొనసాగి.. బలాబలాలు సమానంగానే ఉన్నాయి. ఇటీవల తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను మార్చడంతో ఇప్పుడు అందరి దృష్టి కొత్త నేతలపై పడింది. వీరు మంత్రి మండిపల్లి శిబిరంలో చేరుతారా లేక నల్లారి కిశోర్ పక్షాన వెళ్తారా అన్నది జిల్లా టీడీపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జిల్లా రాజకీయాల్లో కీలకమైన మంత్రి ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారన్నది ఉత్కంఠగా కనిపిస్తోంది. మొన్నటిదాకా రెండు వర్గాలుజిల్లా టీడీపీ రాజకీయాల్లో జిల్లా అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్ నియామకం కాక ముందు వరకు జిల్లా మంత్రి చుట్టూ రాజకీయాలు నడిచాయి. అప్పటివరకు పుంగనూరు ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె ఇన్చార్జి జయచంద్రారెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, మాజీ ఎమ్మెల్యే, ముఖ్య నాయకులు మండిపల్లి వర్గంగా ముద్రపడ్డారు. ఈ పరిస్థితుల్లో కొంతకాలం న్యూట్రల్ గా ఉన్న మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా మంత్రిపై అసంతృప్తితో పీలేరు ఎమ్మెల్యే కిశోర్ కుమార్ రెడ్డితో జతకట్టారు. తర్వాత కొంతకాలానికి ప్రసాద్ జిల్లా అధ్యక్షుడు కావడంతో ఈ ముగ్గురు ఒక వర్గంగా కార్యకలాపాలు కొనసాగిస్తూ వస్తున్నారు. జిల్లాలో వీరంతా మంత్రితో కలిసి పాల్గొన్న సందర్భమే లేదు.చల్లా, దాసరిపల్లి తొలగింపుతంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో ఇరుక్కోవడంతో ఆయనను పార్టీ నుంచి అధినేత చంద్రబాబు సస్పెండ్ చేశారు. పుంగనూరు నియోజవర్గంలో చల్లాపై వచ్చిన ఆరోపణలతో ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించారు. మంత్రి మండిపల్లికి రెండు నియోజకవర్గాల నుంచి అండగా ఉన్న ఇద్దరు నేతల బలం తగ్గిపోయింది.ఆ ఇద్దరు ఎవరి వైపు..కొత్తగా వచ్చిన ఇన్చార్జీలు ఏ వర్గం వైపు ఉంటారన్నది పార్టీ నేతల్లో అమితాసక్తి నెలకొంది. పుంగనూరు, తంబళ్లపల్లె గత ఇన్చార్జిలు ఉండగా రెండు వర్గాల బలం సమంగా ఉండేది. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, మధుసూదన్ నాయుడు ఇన్చార్జిలు కావడంతో వీరు ఎవరి వైపు వెళ్తారన్నది చర్చనీయాంశమైంది.శంకర్ విషయానికి వస్తే..గత ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన ఆవేదనతో ఉన్న శంకర్ యాదవ్ తిరిగి ఇంచార్జ్ అయ్యారు. జయచంద్రారెడ్డి నకిలీ మద్యం తయారు కేసులో నిందితుడు కాకపోయి ఉంటే శంకర్‌కు తిరిగి అవకాశం వచ్చేది కాదు. కాగా గత పరిస్థితులను పరిశీలిస్తే శంకర్ కిశోర్ వైపు వెళ్తారన్నది అనుమానమే. ఎందుకంటే శంకర్ కాంగ్రెస్ పారీ్టలో చేరి రాజకీయాల్లోకి వచ్చాక అప్పటి కిరణ్ సర్కార్ నుంచి సహాయ నిరాకరణ ఎదుర్కొన్నారు. తాజాగా టీడీపీ ఇన్చార్జిగా శంకర్‌కి బాధ్యత అప్పగించే విషయంలో కిశోర్ పలు సందర్భాల్లో చంద్రబాబు ఎదుట అసంతృప్తి వ్యక్తం చేశారని పారీ్టలో ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో శంకర్ కిశోర్‌తో జత కడతారా అన్నది అనుమానమే. అలాగే మంత్రి మండిపల్లి విషయంలోనూ శంకర్ సానుకూలంగా ఉండే అవకాశాలు లేవు. దాసరిపల్లి జయచంద్రారెడ్డిపై నియోజకవర్గ టిడిపిలో తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ మంత్రి అండగా నిలిచారని శంకర్ వర్గం రెండేళ్లుగా మొరపెట్టుకుంటూనే ఉంది.మధు ఎటు వైపు.. పుంగనూరు ఇంచార్జ్ మధుసూదన్ నాయుడు ఇన్చార్జిగా నియమితులయ్యాక కిశోర్, చల్లాను కలవగా, మంత్రి మండిపల్లిని, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కలవలేదని తెలుస్తోంది. దాసరిపల్లి, చల్లా ఇద్దరూ మంత్రి వర్గీయులుగా కొనసాగిన కారణంతో శంకర్, మధులు మంత్రితో జత కట్టేందుకు మొగ్గచూపకపోతే..జిల్లాలోని ఐదు నియోజకవర్గ నేతల్లో నలుగురు ఓ వర్గమై, జిల్లాలో రాజకీయాల్లో మంత్రి ఒంటరిగా మిగలడం ఖాయంగా కనిపిస్తోంది. ఎవరు ఏ జట్టులో చేరుతారో.. గట్టునుండి చూస్తుండిపోతారో వేచిచూడాలి.చదవండి: ఏళ్లుగా కష్టపడ్డాం.. పదవి మాత్రం లంకకు! -
‘అక్రమాలపై ప్రశ్నిస్తే చంద్రబాబుకు ఎందుకంత భయం?’
సాక్షి, తాడేపల్లి: అక్రమాలను ప్రశ్నిస్తుంటే చంద్రబాబు సర్కార్‌కు భయం పట్టుకుందని.. అందుకే ప్రశ్నించే గొంతులను నులుముతున్నారంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో అనధికార సెన్సార్ షిప్ దుర్మార్గం అన్నారు. సోషల్ మీడియా ఖాతాలను లేపేస్తున్నారు. గతంలో వైఎస్సార్సీపీ ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను తొలగించారు. సాక్షి టీవీ, బిగ్ టీవీ ఖాతాలను కూడా లేపేశారు. ప్రశ్నించే గొంతులను చూసి చంద్రబాబుకు ఎందుకంత భయం?’’ అంటూ శివశంకర్ ప్రశ్నించారు.డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే నేరమా?. అందులో అబద్దాలు ఉంటే ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కానీ సోషల్ మీడియా, టీవీ ఛానళ్ల ఎక్కౌంట్లపై దాడి ఎందుకు?. తప్పులను కప్పి పుచ్చుకోవటానికే సోషల్ మీడియా ఖాతాలపై దాడి చేస్తున్నారు. ఇదే కొనసాగితే సోషల్ మీడియా వార్ తప్పదు. డీఎస్సీలో అక్రమాలకు మంత్రి లోకేష్ బాధ్యత వహించాలి. పదవికి రాజీనామా చేసి సీబీఐతో విచారణ జరపాలి. సోషల్ మీడియా అకౌంట్లపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. న్యాయ పోరాటం చేసి మళ్ళీ ఆ అక్కౌంట్లను సాధిస్తాం’’ అని శివశంకర్ అన్నారు. -
‘పాలు, పెరుగు అమ్మినట్టు టీచర్ ఉద్యోగాలు అమ్మేశారు’
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: డీఎస్సీలో అక్రమాలు గురించి గతం నుంచి చెబుతూనే వచ్చామని.. మూడున్నర లక్షల మంది అభ్యర్థులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నైతిక బాధ్యత వహించాలన్న ఆలోచన మాత్రం ప్రభుత్వానికి రావటం లేదన్నారు. డీఎస్సీలో అక్రమాలపై ప్రభుత్వం ప్రజలకు సంజాయిషి చెప్పాలని డిమాండ్ చేశారు.‘‘దేశ చరిత్రలో కానీ విని ఎరుగని రీతిలో గత ప్రభుత్వ హయాంలో ఒకటిన్నర లక్షల ఉద్యోగాల రిక్రూట్మెంట్ నిర్వహించాం. హెరిటజ్లో పాలు, పెరుగు అమ్మినట్టు రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాలు అమ్మేశారు. లోకేష్ విద్యాశాఖ మంత్రిగా రావటం విద్యార్థులకు శాపం. టెట్‌కి, డీఎస్సీకి ఒకరినే కన్వీనర్‌గా పెట్టడం దగ్గర నుంచి.. సంతలో బర్రెలు అమ్మినట్టు టీడీపీ నేతలు ఉద్యోగాలు అమ్మేసేంతవరకు ప్రతి విషయాన్ని ప్రజలకు వివరించాం. మీకు చిత్తశుద్ధి ఉంటే సీబిఐ విచారణ జరిపించండి’’ అని జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు.కుల విద్వేషాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా లాభం పొందే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ వ్యవహారంపై ఎందుకు సీబిఐ విచారణ జరపటం లేదు. సీబీఐ విచారణ జరిపితే వాస్తవాలు బయటికి వస్తాయి. యువగళం పాదయాత్రలో పాల్గొన్న వారిలో ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చారో బయట పడుతుంది. ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని ఉద్దేశంతోనే ధైర్యం చేయడం లేదు. కనీసం గ్రౌండ్లో అడుగుపెట్టని వారికి సైతం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చేశారు.. డబ్బు కోసం అక్రమ సంపాదన కోసం ఎటువంటి నీచమైన పని చేయడానికైనా ప్రభుత్వం దిగజారి పోతుంది. ఆడియో టేపులు బయటకు వచ్చినా ప్రభుత్వంలో స్పందన ఉండటం లేదు.డీఎస్సీ వ్యవహారంలో ఎందుకు ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయలేకపోయారు. సోషల్ మీడియా హ్యాండిల్స్ నిలుపు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ సర్వీసెస్ పరీక్షలపై మీరు చేసిన ఆరోపణలపై, ప్రస్తుత డీఎస్సీపై సిబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వండి. మీరు చేసిన తప్పుడు నియామకాలు బయటపడతాయి. సాక్ష్యాలు ఉన్నా ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించడం దారుణం. లోకేష్ మంత్రిగా కొనసాగేందుకు అర్హత లేదు. తక్షణమే లోకేష్ రాజీనామా చేయాలి. ఈ వ్యవహారంలో కోర్టులు కూడా జోక్యం కల్పించుకోవాలి’’ అని జక్కంపూడి రాజా పేర్కొన్నారు. -
ఇది దేవుడు చెప్పిన సత్యం: బొత్స
సాక్షి, అనకాపల్లి: చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా కరువేనని.. ఇది దేవుడు చెప్పిన సత్యం అని వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అనకాపల్లి జిల్లాలో ఎక్కడ చూసినా మైనింగ్ జరుగుతుంది. ఏపీ గంజాయి మత్తులో తూగుతోంది. వాస్తవాలను చెబుతున్నప్పుడు సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేసే అధికారం ఎవరిచ్చారు?’’ అంటూ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.‘‘వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు పదివేలకు పైగా డీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చాము. సుమారు లక్షల 50 వేల సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేశాం. ఎక్కడైనా మాపై ఒక చిన్న ఆరోపణ వచ్చిందా? ఎక్కడైనా డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆధారాలు లభించాయా?. వైఎస్ జగన్ పాలనలో ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరిగింది. కూటమి పాలనలో స్పోర్ట్స్ కోటాలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఒక జీవో తీసుకువచ్చారు. ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఆ జీవోను రద్దు చేశారు’’ అంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.డీఎస్సీలో ఉద్యోగాల కోసం బేరాలు పెట్టారు. శాసనమండలిలో చర్చకు రమ్మంటే తోక ముడిచి పారిపోయారు. విశాఖ నగరాన్ని సర్వనాశనం చేశారు. గీతం యూనివర్సిటీకి వేల కోట్లు చేసే భూములు అప్పగించారు. ఎవడబ్బ సొమ్ము అని 3 వేల కోట్లు ధారాదత్తం చేస్తారు?. గ్రావిటీ ద్వారా పోలవరం ఎడమ కాలువకు నీరు ఇవ్వాలి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా శ్రీకాకుళం చివరికి నీరు ఇవ్వాలి. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా నీరు ఇచ్చి గోదావరి జలాలు ఇచ్చామని ప్రచారం చేస్తారా?. పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది వైఎస్సార్.. అందుకు నేను సాక్ష్యం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలి గెలిచి తీరాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబులా పారిపోయే మనస్తత్వం వైఎస్ జగన్‌ది కాదు’’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
ఇక రాజకీయాలకు గుడ్ బై.. అయ్యన్నపాత్రుడు
అనకాపల్లి: భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయను.. వయసు రీత్యా రాజకీయాల నుంచి తప్పుకుని విశ్రాంతి తీసుకుంటానని స్పీకర్ సీహెచ్.అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఏరియా ఆస్పత్రిలో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజకీయాల నుంచి తప్పుకుంటాను. తర్వాత ఏది చేద్దామన్నా అవకాశం ఉండదు. పదవీకాలం మూడేళ్లు మాత్రమే ఉన్నందున ఈలోపే ఏదో ఒక మంచి పని చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాను’’ అని చెప్పారు. అయ్యన్నపాత్రుడు పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.చదవండి: సాక్షి సోషల్ మీడియాపై చంద్రబాబు సర్కార్ అక్కసు -
నోరుపారేసుకుంటే మంత్రి పదవి ఇస్తారని ఆశ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘కాళింగ సామాజిక వర్గం తరఫున ఎవరికీ కేబినెట్లో చోటు దక్కలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడ్డారు. కింజరాపు ఫ్యామిలీలోనే ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చేశారు. చంద్రబాబుపై ఆ సామాజిక వర్గమంతా గుర్రుగా ఉంది. కూన రవికుమార్‌ను చంద్రబాబు పట్టించుకోలేదు.’ ఇదీ కూన రవికుమార్‌పై ఆ పార్టీలోని కాళింగ సామాజిక వర్గంలో ఉన్న సానుభూతి. ఆ సానుభూతిని దాటి చంద్రబాబు దృష్టిలో మరింత పడేందుకు కూన రవికుమార్ ఆపసోపాలు పడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి వీరావేశం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా జెడ్పీ సమావేశాల్లో సైతం జెడ్పీటీసీలు గొంతెత్తాల్సిన చోట కూన రవికుమార్ పెద్ద ఎత్తున గొంతెత్తి అంతెత్తున లేస్తున్నారు. ప్రతిపక్షంలో దారుణాలెన్నో.. కూన రవి నోటి దురుసు గురించి జిల్లాలో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు సంబంధించి ఆడియో, వీడియోలు సంచలనం రేపాయి. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన సమయంలో కోవిడ్ నిబంధనల మేరకు కొందరే రావాలని పోలీసు అధికారులు అన్నందుకు ‘జాగ్రత్త.. శంకరిగిరి మాన్యాల్లో ఉంటారు జాగ్రత్త.. ఎవడక్కడ.. మీ స్థాయి ఎంత.. మీరు ఎంత’ అని నరసన్నపేట సీఐ, ఎస్‌లను ఉద్దేశించి నోరు పారేసుకున్నారు. పొందూరులో టీడీపీ కార్యాలయంగా నడుస్తున్న తన భవనాన్ని ఖాళీ చేయాలని కోరినందుకు ఆ ఇంటి యజమానికి ఫోన్లోనే ‘నేను ఖాళీ చేయను, నువ్వు మర్యాదగా బీహేవ్ చేస్తే ఫర్వాలేదు, నువ్వేగాని అక్కడేమైనా చేస్తే చాలా సీరియస్‌గా ఉంటుంది’ అని బెదిరించారు. పింఛన్ల విషయంలో తన మాట వినలేదని మండల కార్యాలయంలోనే సరుబుజ్జిలి ఎంపీడీఓ, ఈఓపీఆర్డీకి ‘ఆఫీసులోనే తలుపులు వేసి మరీ బాదేస్తాను. నన్ను ఎవరూ ఆపలేరు. చెట్టుకు కట్టి కాల్చేస్తాను’ అంటూ బెదిరించారు. పనుల విషయంలో తాను చెప్పినట్టు వినకపోతే ‘కుర్చీలో కూర్చున్నా లాక్కుని వచ్చి తంతాను నా కొడకల్లారా’ అని పంచాయతీ కార్యదర్శులను భయపెట్టారు. ఒక బిల్లు విషయంలో సరుబుజ్జిలి ఇన్చార్జి ఈఓపీఆర్డీపై ‘నీకెంత ఒల్లు బలిసిందిరా.. నిన్ను గొయ్యి తీసి పాతకపోతే నా పేరు కూన రవికుమారే కాదు. నీ బతుకెంతరా’ అంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. మట్టిని అక్రమంగా తరలించిన వాహనాలు విడిచిపెట్టలేదని పొందూరు తహసీల్దార్‌పై ‘పట్టుకున్న వాహనాలు విడిచి పెట్టకపోతే లంచం డిమాండ్ చేశావని నీ మీద కంప్లైంట్ చేస్తాను.’ అంటూ విరుచుకుపడ్డారు. ‘నా ఇంటి లోపలకు నువ్వు పోలీసులను పంపిస్తే నీ కాళ్లు ఇరగకొట్టకపోతే చూద్దువుగాని..’ అంటూ శ్రీకాకుళం టూటౌన్ పోలీసులపై జులుం చూపించారు. అధికారంలోకి వచ్చినా.. అధికారం దక్కాక కూడా కూన తీరు మారలేదు. ప్రెస్మీట్లు, మిగతా సమావేశాలు పక్కన పెడితే జిల్లా పరిషత్ సమావేశాల్లో ఆయన వ్యవహరించే తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. జెడ్పీ సమావేశాల్లో సభ్యులుగా జెడ్పీటీసీలకు చాన్స్ ఇవ్వాలి. కానీ కూన రవికుమార్ ఎవరినీ మాట్లాడనివ్వకుండా ఆయనే మాట్లాడుతున్నారనే అపవాదు మూటగట్టుకున్నారు. పెద్ద పెద్ద అరుపులు, కేకలతో జెడ్పీ దద్దరిల్లిపోతోంది. గొడవకు వచ్చారా అన్నట్టుగా మాట్లాడుతుండడంతో కూన రవికుమార్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు కరుణిస్తారో లేదో గానీ ఈ అరుపులతో విమర్శలకు కేంద్ర బిందువు అవుతున్నారు. చదవండి: సాక్షి సోషల్ మీడియాపై చంద్రబాబు సర్కార్ అక్కసు -
‘ఒక్కొక్కటిగా బయటపడుతున్న లోకేష్ బండారం’
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ హయాంలో చేపట్టింది మెగా డీఎస్సీ కాదని, యువగళం డీఎస్సీ అంటూ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేసిన పాపాలను ఎల్లకాలం దాచిపెట్టలేరని, రోజుకో నిజం బయటపడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో వెలుగులోకి వస్తున్న డీఎస్సీ అక్రమాలపై శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్సీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న తమ అనుచరులకు, కార్యకర్తలకే స్పోర్ట్స్ కోటా పేరిట అక్రమంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు కట్టబెట్టారు. కనీసం టెట్ అర్హత సాధించని వారికి, తక్కువ మార్కులు వచ్చిన వారికి కూడా ఉద్యోగాలు ఎలా కట్టబెట్టారో మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నిబంధనను కఠినంగా వర్తింపజేస్తూ, తమ యువగళం టీచర్లకు మాత్రం ఎలాంటి అర్హతలూ లేకపోయినా మినహాయింపు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.కర్నూలు జిల్లాలో ప్రారంభమైన ఈ అక్రమాల డొంక ఇప్పుడు రాష్ట్రంలోని మిగతా జిల్లాలకూ విస్తరిస్తోంది. కౌతాళం మండలంలోనే ఏకంగా 24 మంది, ఒకే చోట ఐదుగురు స్పోర్ట్స్ కోటా టీచర్లు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఆదరణ లేని జూడో ఆట పేరుతో నకిలీ సర్టిఫికేట్లు సృష్టించి దాదాపు 30 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే చిత్తూరు జిల్లాలో కేవలం 79 మార్కులు వచ్చిన వారికి, తూర్పు గోదావరి జిల్లాలో అసలు అర్హతే లేని వారికి నియామకాలు చేపట్టారు. ఇటువంటి ఉపాధ్యాయులు రేపటి తరం పిల్లలకు ఏం పాఠాలు చెబుతారని ఆవేదన వ్యక్తం చేశారు.స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) పూర్తిగా అవినీతి అడ్డాగా మారింది. క్రీడా సర్టిఫికేట్లను కనీసం వెరిఫికేషన్ చేయకుండా నియామకాలు ఎలా పూర్తి చేస్తారని పేర్ని నాని మండిపడ్డారు.చంద్రబాబు, లోకేష్‌లకు ధైర్యముంటే స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైన టీచర్ల జాబితాను, వారి సర్టిఫికేట్లను వెంటనే బహిర్గతం చేయాలని సవాల్ విసిరారు. మెగా డీఎస్సీలో జరిగిన ఈ భారీ కుంభకోణంపై ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని, ఈ అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం మరో డీఎస్సీ అంటూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయసాయి మాట ఎందుకు మార్చారు?
మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి ఏదో తెలియని ఆందోళనతో, ఒత్తిడితో కొట్టుమిట్టాడుతున్నట్లు అనిపిస్తుంది. ఏమి చెప్పాలో అర్థంకాకుండా మాట్లాడుతున్నారన్న భావన కలుగుతుంది. వైఎస్సార్సీపీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన విజయసాయి సడన్‌గా ఎంపీ పదవి వదలుకోవడం, పార్టీని సైతం వీడడం సంచలనం అయింది. ఇందులో ఏమి మతలబు ఉందా అన్న చర్చ జరిగింది. కాని ఆయన మాత్రం తాను వ్యవసాయం చేసుకుంటానని, రాజకీయాలకు దూరంగా ఉంటానని అప్పట్లో ప్రకటించారు. చాలామంది ఆయన మాటకు కట్టుబడి ఉంటారేమోలే అని సరిపెట్టుకున్నారు.కాని కొంతకాలం గడిచే కొద్ది ఆయనలో మార్పు రావడం ఆరంభం అయింది. తొలుత అక్కడక్కడ కామెంట్లు చేయడం, తదుపరి వైఎస్సార్సీపీపై విమర్శలు చేయడం, ప్రత్యేకించి వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆరోపణలు గుప్పించడం అందరిని విస్మయపరిచింది. రాజకీయ పార్టీలలో నేతల మధ్య తెలియని స్పర్ధ ఉంటుంది. అయినా పార్టీలో ప్రధాన నాయకుడిని చూసి సర్దుకుపోతుంటారు. పైగా విజయసాయికి మాజీ ముఖ్యమంత్రి జగన్ వద్ద లభించిన ప్రాధాన్యత చాలా ఎక్కువే. పార్టీలో పలువురికి దీనిపై కాస్త అసంతృప్తి ఉన్నా ఎవరూ పైకి మాట్లాడలేదు.ప్రత్యేకించి విశాఖపట్నం ఇన్‌చార్జీగా ఉన్న సమయంలో ఈయనపై ఎల్లోమీడియా విపరీతమైన వ్యతిరేక వార్తలు ఇచ్చేది. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడుకూడా ఈయన టార్గెట్‌గానే ఉండేవారు. ఈయన బందువులు విశాఖలో స్థలం కొనుగోలు చేసినా ఎల్లోమీడియాలో ఆరోపణలు వచ్చేవి. చివరికి ఆయనపై ఎంత నీచమైన అభియోగాలు మోపింది అందరికి తెలుసు. టీడీపీ మీడియాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ విజయసాయి మీడియా సమావేశాలు పెట్టేవారు. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు విజయసాయి చేసిన వ్యాఖ్యలను ఎల్లో మీడియా మొదటి పేజీతో పాటు, లోపలి పేజీలో పెద్ద ఎత్తున పరచిందంటే అందులో ఉన్న మతలబు అర్థం చేసుకోవచ్చు.ఆ రకంగా చూస్తే విజయసాయి తనకు ఇంత ప్రచారం ఆ మీడియాలో వస్తోందని సంతోషిస్తున్నారేమో తెలియదు కాని, అది పులిమీద స్వారీలాంటిదే అని తెలుసుకోగలగాలి. నిజంగానే ఆయన చెబుతున్నట్లు కొత్తగా పార్టీ పెట్టిన తర్వాత కూడా తన విధానాలపై ప్రచారం చేసుకుంటే ఫర్వాలేదు. అధికారంలో ఉన్న టీడీపీ, జనసన, బీజేపీ కూటమి విధానాలను వ్యతిరేకిస్తారో, మద్దతు ఇస్తారో చూడాల్సి ఉంది. ఒకవేళ మద్దతు ఇస్తే ఆయన అసలు లక్షణం బయటపడుతుంది.ప్రభుత్వ విధానాలలోని మంచి, చెడులపై వ్యాఖ్యానిస్తే తప్పు కాదు. కూటమి ప్రభుత్వంపై కాకుండా వైఎస్సార్‌సీపీపైనే దృష్టి కేంద్రీకరిస్తే, టీడీపీకి పరోక్ష మద్దతు ఇవ్వడానికే ఈ రెండేళ్లుగా రాజకీయం నడిపారని జనం అనుకుంటారు. అంటే టీడీపీ ట్రాప్‌లో విజయసాయి పూర్తిగా చిక్కుకున్నట్లు అవుతుంది. వైఎస్సార్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత విజయసాయిపైన కాని, ఆయన సమీప బంధువులపై కాని కూటమి ప్రభుత్వం పలు కేసు పెట్టి ఇబ్బందులు పెట్టడానికి యత్నించింది. దానికి తోడు విశాఖలో ఈయన అనుచరులు భూ దందాలకు పాల్పడ్డారని పదే, పదే ప్రచారం చేశారు. అప్పటికే మద్యం కుంభకోణాన్ని సృష్టించి అందులో పలువురిని అరెస్టు చేశారు. విజయసాయి పేరు కూడా కేసులో చేర్చారు.ఈ కేసుల బెడద, ఎల్లోమీడియా దాడి భరించలేకే ఈయనలో బాగా మార్పు వచ్చిందా అన్నది కొందరి అనుమానం. ఆ కేసులో ఉన్న ఇతర నిందితులు కొందరితో ఆయన వివాదపడుతున్నట్లు స్టేట్మెంట్లు ఇచ్చారు. మొత్తం మీద ఏ రకంగా మేనేజ్ చేసుకున్నారో కాని చంద్రబాబు ప్రభుత్వం ఐదో నిందితుడుగా ఉన్న ఆయన జోలికి వెళ్లలేదు. ఆ క్రమంలోనే ఎంపీ పదవికి రాజీనామా చేయడం, దానిని టీడీపీ చేజిక్కించుకోవడం వంటివి జరిగాయి.ఇవి కూడా చదవండి: పోలవరం కల సాకారమా?.. లేక ముగింపు ప్రయత్నమా?ఈ నేపథ్యంలో విజయసాయి తాజాగా చేసిన ప్రకటనలు సహజంగానే అందరికి సందేహాలు కలిగిస్తాయి. ముఖ్యంగా మత మార్పిడులను జగన్ ప్రోత్సహించారంటూ దారుణమైన ఆరోపణ చేయడం ఆయనకే చెల్లింది. అదే నిజమైతే ఈయననే మార్చి ఉండాలి కదా అన్న విమర్శకు బదులు లేదు. జగన్ అధికారంలో ఉండగా, అందుకు సంబంధించిన ఆధారాలు ఉంటే ఈపాటికి కూటమి ప్రభుత్వం ఎంత యాగీ చేసేదో కదా! పైగా హిందూ ధర్మపరిరక్షణకు అవసరమైన అనేక చర్యలు జగన్ తీసుకున్నారు. విజయసాయి చేసిన ఈ విమర్శపై సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరాలు రావడంతో ఈసారి బహరంగ లేఖ పేరుతో సజ్జలపై విరుచుకుపడే యత్నం చేశారు. ఆయన పార్టీలో నెంబర్ వన్‌గా ఉన్నారంటూ జగన్‌ను తగ్గించే యత్నం చేశారు. నిజంగా ఆ పరిస్థితి ఉంటుందో లేదో ఆయనకు తెలియదా? అధికారంలో ఉన్నప్పుడే ఆయనకు ఆ ఫీలింగ్ ఉంటే అప్పుడే బయటకు వచ్చి ఉండవచ్చు లేదా ఓపెన్ అయి ఉండవచ్చు. అలాకాకుండా ఎన్నికలలో ఓటమి ఎదురయ్యాక మాట్లాడడమే అభ్యంతరం అనిపిస్తుంది. సజ్జలపై కేసులు రాలేదని ఆయన చెబుతున్నారంటే దాని అర్థం టీడీపీతో కుమ్మక్కైనట్లు కాదు.నిజానికి సజ్జలపైన, ఆయన కుమారుడు భార్గవపైన పలు కేసులను ప్రభుత్వం పెట్టింది. వాటిలో పలు పిచ్చి కేసులు ఉన్నాయి. లుక్ అవుట్ నోటీసుల వరకు వెళ్లింది. అయితే వాటన్నిటిపైన న్యాయపోరాటం చేసి స్టేలు తెచ్చుకున్నారు. అంతే తప్ప విజయసాయి మాదిరి భయపడి పోలేదని అనుకోవాలి. ఒకప్పుడు విజయసాయికి ఉన్న ధైర్యం ప్రస్తుతం లేకుండా పోయిందని అనుకోవాలి. వైఎస్సార్సీపీ కార్యకర్తల మాదిరి పోరాడే శక్తిని ఆయన కోల్పోయారని భావించాలి. సజ్జల వల్ల తాను పార్టీని వీడడం లేదని గతంలో చెప్పిన విజయసాయి మాట మార్చి, ఏకంగా తనపై భౌతిక దాడి జరిగిందని, 74 సార్లు అవమానాలు జరిగాయని ఆరోపించేవరకు వెళ్ళడం ఆశ్చర్యం కలిగిస్తుంది.అది నిజమే అయితే, ఆనాడే ఆత్మగౌరవం దెబ్బతిందని చెప్పి ఉండాల్సింది కదా! అప్పుడే పదవులను వదలుకుని ఉండాలి కదా!అధికారం కోల్పోయాక చేసే ఆరోపణలకు విలువ ఏమి ఉంటుంది. ఆయన ప్రతిష్ట దెబ్బతినడం తప్ప. తనను ఎన్నో విధాలుగా వేధించిన ఎల్లో మీడియాకు అస్త్రంగా మిగలడం తప్ప. ఆయన వ్యాఖ్యలు చిన్నపిల్లల చేష్టల మాదిరిగా కనిపిస్తున్నాయి.గతంలో చంద్రబాబుపై, టీడీపీపై విజయసాయి కొన్ని అభ్యంతర పోస్టులు పెట్టడం ద్వారా పార్టీని ఇరుకున పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయినా సీనియర్ నేత కనుక ఎవరూ మాట్లాడలేదు. తనతో పాటు విజయసాయిపై కూడా అక్రమ కేసులు పెట్టారన్న సానుభూతి ఉండబట్టే కదా జగన్ ఈయనను రెండుసార్లు ఎంపీని చేశారు. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధిని చేశారు. పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. కాని వివిధ పరిణామాల నేపథ్యంలో పార్టీలో మార్పులు జరుగుతుంటాయి. ఆ సంగతి ఆయనకు తెలియదా! అయితే ఇప్పటికీ జగన్‌కు నమ్మక ద్రోహం చేయనని అనడం మంచిమాటే. కాకపోతే టీడీపీ ట్రాప్‌లో పడి, వారు రాసిచ్చే స్క్రిప్టు చదివే దశకు విజయసాయి వెళితే అది మరింత బురద ఊబిలో కూరుకుపోతున్నట్లే అవుతుందేమో! ఆ సంగతి ఆయన గ్రహిస్తే మంచిదే!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
లోకేశ్ అంకెల గారడీపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, అమరావతి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వాస్తవ పరిస్థితులను.. గణాంకాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తాజా అక్షరాస్యత రేటుపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. 2026 సంవత్సరానికి సంబంధించిన గణాంకాలే ఇంకా వెలువడలేదని, అలాంటప్పుడు పెరిగిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు.గణాంకాలు ఏం చెబుతున్నాయంటే.. 2023-24 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) నివేదిక ప్రకారం.. ఏపీలో ఏడేళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారి అక్షరాస్యత రేటు 72.6 శాతంగా ఉంది. 2018-19లో ఇది 69.1 శాతంగా ఉన్నట్లు వైఎస్ జగన్ తన ఎక్స్ ఖాతా ద్వారా వాస్తవాలను బయటపెట్టారు.2025లోనూ తగ్గిందే..2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు నిర్వహించిన సర్వే ఆధారంగా కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన పీఎల్ఎఫ్ఎస్ వార్షిక నివేదికలో ఏపీ అక్షరాస్యత రేటు 71.4 శాతంగా నమోదైందని జగన్ వెల్లడించారు. ఈ నివేదికను 2026 జూలై 2న విడుదల చేశారని తెలిపారు. దీంతో 2024లో 72.6 శాతం ఉన్న అక్షరాస్యత.. 2025లో 71.4 శాతానికి తగ్గిందని, మరి 2026లో 82.1 శాతానికి ఎలా చేరిందో ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేశారు.𝗜𝘁’𝘀 𝘀𝗵𝗼𝗰𝗸𝗶𝗻𝗴 𝘁𝗼 𝘀𝗲𝗲 𝘁𝗵𝗲 𝗲𝘅𝘁𝗲𝗻𝘁 𝗼𝗳 𝗺𝗶𝘀𝗶𝗻𝗳𝗼𝗿𝗺𝗮𝘁𝗶𝗼𝗻 𝗽𝗿𝗼𝗽𝗮𝗴𝗮𝗻𝗱𝗮 𝗯𝘆 𝘁𝗵𝗲 𝗽𝗿𝗲𝘀𝗲𝗻𝘁 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵 𝗚𝗼𝘃𝗲𝗿𝗻𝗺𝗲𝗻𝘁.The Minister of education claims that the literacy rate increased from 72.6% in 2024 to… pic.twitter.com/6yzdtMCVjV— YS Jagan Mohan Reddy (@ysjagan) September 4, 2026‘ఇది తప్పుడు ప్రచారం’..2026 సంవత్సరం ఇంకా పూర్తికాకముందే ఆ ఏడాది అక్షరాస్యత గణాంకాలను కూటమి ప్రభుత్వం ఎలా ప్రకటించిందని జగన్ ప్రశ్నించారు. స్పష్టమైన అధికారిక గణాంకాలు అందుబాటులో ఉన్నప్పటికీ తప్పుడు లెక్కలు చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని విమర్శించారు.ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న చేరికలు..ఇదే సమయంలో రాష్ట్రంలో విద్యా రంగానికి సంబంధించి మరో ఆందోళనకరమైన అంశాన్ని జగన్ ప్రస్తావించారు. కేంద్ర విద్యాశాఖకు చెందిన యూడైస్ (UDISE) గణాంకాల ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు తగ్గుతుండగా, ప్రైవేటు పాఠశాలల్లో చేరికలు పెరుగుతున్నాయని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.‘విద్యాశాఖపై దృష్టి పెట్టండి’..విద్యారంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాల్సిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.. తప్పుడు గణాంకాలతో ప్రచారం చేసుకోవడంపై కాకుండా శాఖ పనితీరుపై శ్రద్ధ పెట్టాలని జగన్ సూచించారు. ‘రెడ్‌బుక్ పాలన’పై దృష్టి పెట్టడం కంటే విద్యాశాఖను సమర్థంగా నిర్వహించడంపై ఎక్కువ సమయం కేటాయించడం మంచిదని ఎద్దేవా చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో తీసుకొచ్చిన విధాన మార్పులపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయని పేర్కొన్న జగన్.. ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్యపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. అక్షరాస్యతపై ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, కేంద్ర ప్రభుత్వ గణాంకాలకు మధ్య ఉన్న వ్యత్యాసంపై స్పష్టత ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: అసలు మోదీ, పవన్ ఎవరబ్బా? -
హూ ఈజ్ మోదీ.. పవన్?
సాక్షి, విశాఖపట్నం: ‘హూ ఈజ్ మోదీ? ఆయన నాకంటే సీనియరా? నాకంటే ఎక్కువసార్లు ముఖ్యమంత్రి అయ్యారా? ‘ప్రశ్నిస్తానని చెప్పి పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్‌కు.. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రం, ప్రధాని మోదీ ఎందుకు కనిపించడం లేదు? ఉదయం ఒక మాట, సాయంత్రం ఒక మాట మాట్లాడతాడు. ఆయనకంటూ ఒక విధానం, ఒక స్టాండ్ లేదు.’ ఇవి కూటమిగా ఏర్పడకముందు చంద్రబాబు మొదటి నాలుక పలికిన పలుకులు. కట్ చేస్తే.. కూటమిగా ఏర్పడిన తర్వాత.. ‘నరేంద్ర మోదీ 21వ శతాబ్దపు నవభారత దార్శనికుడు. సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడు దొరికారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం నాకెంతో గర్వకారణం.’ ‘పవన్ కల్యాణ్ నిఖార్సైన నాయకుడు, నిజాయితీపరుడు. ఆయనకు పదవుల మీద, ప్యాకేజీల మీద వ్యామోహం లేదు’. ఇదీ.. చంద్రబాబు రెండో నాలుక సూక్తులు. అందితే జుట్టు.. అందకపోతే వెన్నుపోటు.. అని చంద్రబాబు మరోసారి నిరూపించారు. ఎన్నికల్లో గెలుపు కోసం అబద్ధాలతో ఎవరితోనైనా జట్టులు కట్టే బాబు.. ఎన్నికలు అయ్యాక మాత్రం.. ఏరు దాటాక.. అన్న చందంగా వ్యవహరించడం పరిపాటిగా మారిందని మరోసారి బుద్ధిని బయటపెట్టారు. ఎన్నికలకు ముందు మోదీ దేవుడు.. పవన్ తమ్ముడంటూ అంటకాగిన చంద్రబాబు.. ఇప్పుడు వారిని పక్కన పెట్టేయడం హాట్ టాపిక్‌గా మారింది. మోదీ, పవన్ బొమ్మలు మాయం! రాష్ట్రంలో ఇంటింటికీ పంచుతున్న ‘కూటమి ప్రభుత్వం.. సంక్షేమ విజయాలు’ కరపత్రాల్లో ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోలను నిర్దాక్షిణ్యంగా మాయం చేశారు. సినిమా హిట్టయ్యే దాకా హీరోలు కావాలి.. కలెక్షన్లు వచ్చాక పోస్టర్‌పై తన బొమ్మ మాత్రమే ఉండాలి అన్నట్లుగా బాబు చేస్తున్న ఈ సింగిల్ క్రెడిట్ సోలో పెర్ఫార్మెన్స్.. నిన్నటి దాకా ‘మా మోదీ, మా పవన్’ అన్న నోటితోనే, నేడు కరపత్రాల సాక్షిగా ‘హూ ఈజ్ మోదీ.. హూ ఈజ్ పవన్’ పార్ట్–2 డ్రామాకు తెరతీసినట్లుగా కనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కింగ్ మేకర్లు కరివేపాకయ్యారా? కూటమి అంటే ఎన్నికల ముందు ఓట్లు వేయించుకోవడానికి మాత్రమేననీ.. తీరా విజయాల క్రెడిట్ తీసుకునే సమయానికి అంతా తన సోలో పెర్ఫార్మెన్సే అని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. ఉత్తరాంధ్ర వీధుల్లో తిరుగుతున్న ఆ కరపత్రం పేరుకే ‘కూటమి’ విజయాలు. కానీ అందులో ప్రధాని మోదీ కానీ.. పవన్ ఫొటో కానీ కనిపించడం లేదు. కేవలం తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేశ్ ఫొటోలు మాత్రమే ముద్రించుకోవడం గమనార్హం. సొమ్ము ఢిల్లీది.. సోకు బాబోరిది! రాష్ట్రంలో ఏ చిన్న సంక్షేమ పథకం అమలు చేయాలన్నా.. కేంద్రం ఇచ్చే నిధులు, రుణాలు విదిలిస్తే తప్ప పూట గడవని పరిస్థితి. ఢిల్లీ నుంచి వస్తున్న వేల కోట్ల రూపాయలతోనే రాష్ట్రంలో హడావిడి డ్రామా నడుస్తోంది. కానీ ప్రచారానికి వచ్చేసరికి మాత్రం టీడీపీ ఫోజులు కొడుతూ డప్పు కొట్టుకుంటోంది. మోదీ పంపిన నిధులతో జరిగిన పనులన్నింటినీ తన క్రెడిట్లో వేసుకుంటూ, కరపత్రాల్లో మోదీ ఫొటోకు మాత్రం తెలివిగా కత్తెర వేసేశారు. ఈ ‘పచ్చ’ పైత్యాన్ని చూసి అటు కమలనాథులు, ఇటు జనసైనికులు అగ్గిమీద గుగ్గిలవుతున్నారు. ఇదంతా చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు 2018 నాటి ఫ్లాష్‌బ్యాక్ గుర్తుకొస్తోందని మండిపడుతున్నారు. అధికార మదంతో అప్పుడే అహంకారం తలకెక్కితే, ఈ కరపత్రాల మంటలు రేపు టీడీపీ పునాదులకే ఎసరు పెడతాయంటూ బీజేపీ రాష్ట్ర ధారి్మక సెల్ ప్రతినిధి విజయ శంకర్ ఫణీంద్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చదవండి: నరసన్నపేటలో పోటీ చేస్తా.. నీ సంగతి చూస్తా.. -
బాబు సాష్టాంగం నమస్కారం.. చెప్పని అసలు లెక్క ఇదే!
దశాబ్దాల తరబడి ఎదురు చూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కొంత మేర అయినా సాకారం అవడం సంతోషమే. మార్కాపురం, ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలకు నీరందించాలని ఈ ప్రాజెక్టును రూపొందించారు. ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించే పరిస్థితి ఇంకా రావల్సి ఉంది. ప్రస్తుతానికి తామేదో చేసేశామని చెప్పుకోవడం కోసం కూటమి ప్రభుత్వం తంటాలు పడింది. దీనికి ఎల్లో మీడియా విపరీతమైన హైప్ ఇచ్చింది.గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరంభించిన వెలిగొండ ప్రాజెక్టు సొరంగాల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నీరు వదలే అవకాశం రావడం అదృష్టమే. చంద్రబాబు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తన పేరు గుర్తుంచుకునేలా చేసిన కార్యక్రమం పెద్దగా ఏదీ లేదని చాలామంది అంటారు. అయితే గత ప్రభుత్వాలు చేసిన వివిధ పనులను తనవిగా ప్రొజెక్టు చేసుకోవడంలో ఆయనను మించిన వారు మరొకరు ఉండకపోవచ్చు. దానిని క్రెడిట్ చోరీ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు పెట్టారు. ఉన్నవి, లేనివి ఏవేవో అంకెలు చెబుతూ చంద్రబాబు ఉపన్యాసాలు చేస్తుంటారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి కూడా అదే జరుగుతోంది.తానే శంకుస్థాపన చేశానని, తానే ప్రారంభిస్తున్నానని ఆయన చెబుతారు. అంతవరకు నిజమే. కాని అసలు పనిచేసింది ఎవరు అన్నది మాత్రం చెప్పరు. అందువల్లే కృష్ణా నది నుంచి నీటిని తరలించే బృహత్తర పథకంలో వెలిగొండ ప్రాజెక్టు వివిధ దశలకు సంబందించి తన పాత్రను వివరించలేకపోయారు. నిజానికి చంద్రబాబుకు వచ్చిన రాజకీయ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉంటే ఉమ్మడి ఏపీలో ఎన్నో నీటిపారుదల ప్రాజెక్టులు ఎప్పుడో పూర్తి అయి ఉండేవి.1996 ఎన్నికలకు ముందు జనాన్ని మాయ చేయడం కోసం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వాటిలో అత్యధికం అంతకుముందు ఎన్టీఆర్ ప్రభుత్వంలో వచ్చిన ప్రతిపాదనలే. చంద్రబాబు శిలాఫలకాలైతే వేశారు కాని, వాటిని ముందుకు తీసుకువెళ్లలేదు. భారీ ప్రాజెక్టులపై ఆయనకు గతంలో పెద్దగా నమ్మకం లేకపోవడమే కారణం. అవి సకాలంలో పూర్తి కావని, రాజకీయంగా లబ్ది చేకూరదన్నది ఆయన ఉద్దేశం.చంద్రబాబు 1998 ప్రాంతంలో ఏపీ ఎంపీలతో ఒక సమావేశం నిర్వహించారు. అందులో వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ జరిగింది. వైఎస్ అప్పటికే ఇరిగేషన్ ప్రాజెక్టుల సాధనకు పలు ఆందోళనలు చేశారు. ఆ నేపథ్యంలో చంద్రబాబుకు ఒక హెచ్చరిక చేస్తూ, నీటిపారుదల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తే చరిత్ర హీనుడవుతావు.. అని వ్యాఖ్యానించడం సంచలనం అయింది. అయినా చంద్రబాబు పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. బీజేపీతో కలిసి పోటీచేయడం ద్వారా 1999 ఎన్నికలలో గెలవలిగారు. వాజ్ పేయిపై జనంలో ఉన్న సానుభూతి కలిసి వచ్చింది.ఆ తర్వాత కూడా ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండేవి. దాంతో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అప్పట్లో ఉమ్మడి ఏపీలో ప్రతి ప్రాజెక్టు స్థలాల వద్దకు వెళ్లి శంకుస్థాపన ఫలకం పక్కన మొక్కలు నాటి నిరసన తెలిపారు. వాటిలో వెలిగొండ కూడా ఒకటి. 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తొలి క్యాబినెట్ లోనే నీటిపారుదల ప్రాజెక్టుల రిపోర్టును అప్పటి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి సీవీఎస్ కె శర్మ ప్రవేశపెట్టారు. వాటి వివరాలు చూసిన ఆనాటి మంత్రి జేసీ దివాకరరెడ్డి ఇన్ని ప్రాజెక్టులకు అవకాశం ఉంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు చేపట్టలేకపోయారని ప్రశ్నించారు. దానికి శర్మ సమాధానం ఇస్తూ, ఆయన ప్రాధాన్యతలు వేరు, ప్రాజెక్టులను మీరు చేస్తామంటున్నారు.. అందుకే నివేదిక సమర్పించాను అని బదులు ఇచ్చారట.తదుపరి వైఎస్సార్ మీడియాతో మాట్లాడుతూ పోలవరం, పులిచింతలతో సహా వివిధ ప్రాజెక్టులు చేపట్టి, పూర్తి చేస్తామని ప్రకటించారు. తదనుగుణంగానే ఆయన భారీ ఎత్తున ప్రారంభించారు. అప్పట్లో పోలవరం ప్రాజెక్టును ఓ రకంగా చంద్రబాబు వ్యతిరేకించారు. ఆ ప్రాజెక్టులో కొన్ని సమస్యలు ఉన్నాయని అప్పట్లో ఒక టీవీ చానల్‌తో అన్న వీడియో ప్రస్తుతం సర్కులేషన్‌లోకి వచ్చింది. అలాగే వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం సాంకేతికంగా సాధ్యం కాదన్న అభిప్రాయంతో దానిని చంద్రబాబు ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. కాని వైఎస్ రాజశేఖరరెడ్డి విదేశాల నుంచి కొండలు తొలిచే యంత్రాలను తెప్పించి సొరంగాల నిర్మాణం ఆరంబించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కనిపిస్తాయి. దీనిని చంద్రబాబు కాదనగలరా అన్నది ఒక ప్రశ్న. వైఎస్ మరణంతో ఈ ప్రాజెక్టులలో జాప్యం జరిగిన మాట వాస్తవం. తదుపరి రాష్ట్ర విభజన, ఏపీకి 2014లో చంద్రబాబు సీఎం కావడం జరిగింది. ఆ అవకాశాన్ని కూడా ఆయన వాడుకోలేకపోయారు. వెలిగొండపై పెట్టవలసినంత శ్రద్ద పెట్టలేకపోయారనిపిస్తుంది. కాకపోతే వ్యయ అంచనాలు పెంచేయడం ద్వారా కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చారన్న విమర్శ వచ్చింది.ఇవి కూడా చదవండి: పోలవరం కల సాకారమా?.. లేక ముగింపు ప్రయత్నమా?వైఎస్ రాజశేఖర్‌రెడ్డి టైమ్‌లో సుమారు 20 కిలోమీటర్ల సొరంగం తీయడమే కాకుండా, రిజర్వాయిర్‌ను చాలావరకు ముందుకు తీసుకువెళ్లారు. చంద్రబాబు టైమ్‌లో కేవలం సుమారు ఆరు కిలోమీటర్లకే టన్నెల్ తవ్వారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్ జగన్ పది కిలోమీటర్ల టన్నెళ్లను పూర్తి చేసి, అవసరమైన ముఖ్యమైన కాల్వలను తవ్వించారు. తదుపరి వాటిని జాతికి అంకితం చేశారు. అయితే మానవత్వ కారణాలతో రిజర్వాయిర్ నిర్మాణం వల్ల నిర్వాసితులు అయ్యేవారికి పూర్తి స్థాయిలో పరిహారం, సహాయం అందించి వారు సెటిల్ అవడం కోసం నీళ్లను వదలే కార్యక్రమాన్ని వాయిదా వేశారు. జగన్ తిరిగి గెలిచి ఉంటే బహుశా 2024 జూన్, జూలైలలో ఆ పని కూడా అయిపోయేదేమో! కాని ఎన్నికలలో ఓటమి ఎదురవడంతో ఆగిపోయింది.కూటమి ప్రభుత్వం వచ్చాక రెండేళ్లపాటు ముందుకు సాగలేదు. ఒక మిషన్ టన్నెల్లో విరిగిపోయిందని, ఆ కాంట్రాక్టర్ స్టే తెచ్చుకున్నారని చంద్రబాబు చెబుతున్నారు. కాని అది సాకేనేమో అనిపిస్తుంది. నిర్వాసితులకు 2024లోనే ఎందుకు పరిహారం ఇవ్వలేకపోయారు? గ్రామాలను ఖళీ చేయించలేదు? ఒక టన్నెల్ ద్వారా అయినా నీటిని ఇచ్చి ఉండవచ్చు కదా! అలా చేస్తే వైఎస్ రాజశేఖర్‌రెడ్డికు, జగన్‌కు జనం క్రెడిట్ ఇస్తారన్న ఉద్దేశంతోనే ఆ పని చేయలేదన్నది వైఎస్సార్సీపీ విమర్శ. ఇప్పటికీ నిర్వాసితులు సెటిల్ కాకముందే నీటిని వదలడంతో ఎన్ని వందల కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయన్నది తెలిసిన విషయమే.బాధితులు మంత్రిని, కలెక్టర్ తదితర అధికారులను నిలదీసిన, ఆగ్రహం వ్యక్తం చేసిన ఘట్టాలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ సందర్భంలో ప్రాజెక్టు నిర్మాణంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌ల కృషిని కూడా అభినందించి ఉంటే, చంద్రబాబుకు వయసుకు తగ్గట్లుగా హుందాగా ఉండేది. అలా చేయకపోగా వైఎస్సార్సీపీపైన ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ విమర్శలు చేయడం బాగోలేదు. 1996-2004 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేసింది కేవలం పది లక్షలేనని, అది కూడా శంకుస్థాపన సభ ఏర్పాట్ల కోసమేనని జగన్ వ్యాఖ్యానించారు. ఈ ఒక్కదానికి చంద్రబాబు సమాధానం చెప్పగలిగితే, ఆయన ప్రభుత్వం ఏ మేరకు పనిచేసింది అర్థం అవుతుంది. శ్రీశైలంలో కనీస నీటి మట్టంగా 834 అడుగులుగా నిర్ణయిస్తూ చంద్రబాబు జీఓ ఇచ్చారు. ఇదే కొనసాగి ఉంటే అసలు వెలిగొండకు నీరు వచ్చే అవకాశమే ఉండదట. వైఎస్ ప్రభుత్వం దానిని 854 అడుగులకు పునరుద్దరించడంతో వెలిగొండతో పలు రాయలసీమ ప్రాజెక్ట్‌లకు నీరు అందించగలిగే పరిస్థితి వచ్చిందన్నది నిజమా? కాదా? టన్నెల్ తవ్వడానికి భారీ యంత్రాన్ని తెప్పించింది వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాదని అనగలరా!ఇప్పుడు చంద్రబాబు చేయవలసింది వెలిగొండ రెండో దశ కూడా పూర్తి చేసి నిర్దిష్ట లక్ష్యం ప్రకారం సమారు ఐదులక్షల ఎకరాలకు నీరవ్వడం. అది చేసి, ఆ క్రెడిట్ తనదేనని చెప్పుకుంటే అభ్యంతరం లేదు. ఇది ఎంతవరకు జరుగుతుందన్నది చెప్పలేం. వెలిగొండ సభలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ప్రత్యేకించి రప్పించి జగన్‌ను దూషింపచేయడం మరీ దారుణంగా ఉంది. ఇదే మాగుంట గతంలో జగన్ టన్నెళ్ల ప్రారంభోత్సవం చేసినప్పుడు ఎంపీగానే ఉన్న సంగతి మర్చిపోయారా! లేక చంద్రబాబు మెప్పుకోసం తన మాగుంట కుటుంబ పరువును రోడ్డున పడేశారా అని పలువురు వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించారు.మరో అంకం చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేయడం. వైఎస్ చేపట్టిన భారీ ప్రాజెక్టులను ఊహజనితం అని ఆ రోజుల్లో చంద్రబాబు విమర్శించేవారు. కాని సాష్టాంగ నమస్కారం చేయడం ద్వారా వెలిగొండ ప్రాజెక్టు ఊహాజనితం కాదని, వాస్తవమని చంద్రబాబుకు అర్థం అయి ఉండాలి. చంద్రబాబు వెలిగొండ చరిత్రలో చివరిలో అయినా ఒక భాగం అయ్యారు. అంతవరకు ఓకే. కాని చరిత్రను సృష్టించింది మాత్రం వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌లే అన్నది పచ్చి నిజం. వెలిగొండ నీటిలో కనిపించేది వైఎస్ రాజశేఖరరెడ్డి నీడే అన్నది అర్థం అవుతూనే ఉంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘చంద్రబాబు మరో ఈవెంట్ మేనేజ్మెంట్’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు మరో ఈవెంట్ మేనేజ్మెంట్కు తెరలేపారని.. రెండున్నరేళ్ల నుంచి ఇదే తరహాలో కాలం గడుపుతూ వచ్చారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ‘‘పురుషోత్తపట్నం ద్వారా పోలవరం ఎడమ కాల్వలోకి నీళ్లు వదిలారు. పోలవరం నీళ్లు వస్తున్నాయని చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారు’’ అని అమర్నాథ్ దుయ్యబట్టారు.‘‘పోలవరం కాలువ ప్యాకేజీలను అంచనాలు పెంచి తనకు నచ్చిన వాళ్లకు ఇచ్చుకున్నారు. పోలవరం ఏటీఎం అని స్వయంగా ప్రధాని మోదీ చెప్పారు. పోలవరం ఎత్తు 41 మీటర్లు కాంటూరు వద్ద నీటిని నిల్వ చేస్తే ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలియదా?. 45 మీటర్ల నుంచి ఎత్తును 41 మీటర్లకు తగ్గించేందుకు ఎందుకు ఒప్పుకున్నారు? ఇంకా ఎన్ని రోజులు ప్రజలను మోసం చేస్తారు. చంద్రబాబు పాలనలో ఉత్తరాంధ్రకు తెచ్చిన ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పండి’’ అంటూ అమర్నాథ్ ప్రశ్నించారు.వైఎస్ జగన్ ఫోబియాతో చంద్రబాబు భయపడుతున్నారు. జగన్నామస్మరణతో చంద్రబాబు బతుకుతున్నారు. చంద్రబాబు చేసిన ఈవెంట్ మేనేజ్మెంట్ల ఖర్చుతో మరొక పోలవరం ప్రాజెక్టు కట్టవచ్చు. పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఇస్తున్నారా? పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు ఇస్తున్నారా? ప్రజలకు చెప్పాలి. వైఎస్సార్ మరణించిన రోజు నీళ్లు విడుదల చేయడం దేవుడు రాసిన స్క్రిప్ట్. చేతకాని వాడు మంగళవారం అన్నారనే సామెత చందంగా ఉంది చంద్రబాబు తీరు. చంద్రబాబు పాలనలో పనులు చేయలేక ఆ నెపాన్ని ఉద్యోగుల మీద నెడుతున్నారు. గ్రావిటీ ద్వారా పోలవరం కాలువకు నీళ్లు ఇవ్వాలి.. ఎత్తిపోతల పథకం ద్వారా కాదు.’’ అని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. -
కూటమిలో కుతకుతలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి రాజకీయాల్లో అధికార కూటమిలో మరోమారు వేడి రాజుకుంది. వైఎస్సార్సీపీ బహిష్కృత నేత మన్నెమాల సుకుమార్‌రెడ్డి కూటమిలోకి ఎంట్రీ అంశం ఇప్పుడు టీడీపీ, జనసేన వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఒక వైపు మన్నెమాల టీడీపీలో చేరే ప్రయత్నాలపై ఆ పార్టీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయన్న చర్చ.. ఇంకో వైపు మన్నెమాలను జనసేన ఇన్చార్జిగా తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే కావ్య ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం.. వెరసి కూటమి రాజకీయాలు కుతకుతలాడుతున్నాయి. కూటమిలో అంతర్గత రాజకీయాల వెనుక జనసేనను బలహీన పరిచి టీడీపీ ఆధిపత్యాన్ని మరింత పెంచుకునే వ్యూహమనే ప్రచారం ఇప్పుడు కావలి రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. మన్నెమాల ఎంట్రీకి మోకాలడ్డు? వైఎస్సార్సీపీలో కీలకంగా పని చేసిన మన్నెమాల సుకుమార్‌రెడ్డిని ఆ పార్టీ సస్పెండ్ చేయడంతో కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన అనంతరం ఆయన రాజకీయ భవిష్యత్‌పై కావలిలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అధికార కూటమిలోకి చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం మొదలైనప్పటి నుంచి టీడీపీలోనే అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మన్నెమాలను టీడీపీలోకి తీసుకురావడంపై ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఆయన వర్గం సానుకూలంగా లేదు. ఈ క్రమంలో మన్నెమాల ఎంట్రీకి బీద రవిచంద్ర మోకాలడ్డినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కావలి రాజకీయాల్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మధ్య నిప్పు.. ఉప్పులా ఉండగా మన్నెమాల వ్యవహారం ఆ అంతర్గత విభేదాలకు మరింత ఆజ్యం పోస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన ఇన్చార్జిగా మన్నెమాల? మన్నెమాల సుకుమార్‌రెడ్డిని జనసేన కావలి ఇన్చార్జిగా తీసుకురావాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ మేరకు ఎమ్మెల్యే కావ్య సైతం మన్నెమాలతో మంతనాలు సాగిస్తున్నారన్న ప్రచారం ఇప్పుడు మరింత ఆసక్తిని రేపుతోంది. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే కావ్య.. రాజకీయంగా తటస్థంగా ఉన్న మన్నెమాలను నేరుగా టీడీపీలోకి తీసుకురావడంపై ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంతో అదే సమయంలో జనసేనలోకి పంపిస్తే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయన్న అంచనాలు తెరపైకి వస్తున్నాయి. ఇదే ఇప్పుడు కూటమి రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. పవన్ బర్త్‌డే వేదికగా కొత్త రాజకీయం జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా కావలిలో భారీ ఎత్తున సామాజిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎమ్మెల్యే కావ్య, మన్నెమాల కలిసి కార్యాచరణ రూపొందిస్తున్నారన్న ప్రచారం కూడా ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యం తెచ్చింది. సాధారణంగా జనసేన కార్యక్రమాలను ఆ పార్టీ స్థానిక నాయకత్వం ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉండగా.. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ బహిష్కృత నేతతో కలిసి జనసేన కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందించడం వెనుక రాజకీయ ఉద్దేశం ఏమిటన్న చర్చ మొదలైంది. మన్నెమాలను జనసేనలోకి తీసుకొచ్చే ప్రక్రియకు ఇదే తొలి అడుగా? అనే అనుమానాలు జనసేన శ్రేణుల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. జనసేన విచ్ఛిన్నానికేనా..! కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పారీ్టలో ఉన్న కొందరు నేతలను పక్కకు తప్పించి, కొత్త వ్యక్తులను ముందుకు తీసుకురావాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం ఆ పారీ్టలోనే కలకలం రేపుతున్నాయి. మన్నెమాల ఎంట్రీ కూడా ఈ వ్యూహంలో భాగమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పారీ్టలోని సీనియర్ నాయకులను బలహీనపరచడం.. వారి రాజకీయ ప్రాధాన్యాన్ని తగ్గించడం.. ఆ తరువాత కొత్త నాయకత్వాన్ని తెరపైకి తీసుకురావడం ద్వారా జనసేనపై పరోక్షంగా పట్టు సాధించాలన్న వ్యూహంగా తెలుస్తోంది. ఇప్పటికే జనసేనలోని కొందరు నేతలను బయటకు గెంటేసేలా రాజకీయంగా స్కెచ్‌లు సిద్ధమవుతున్నాయన్న ప్రచారాలు కూడా వినిపిస్తున్నాయి. అధికారానికి ముందు వెంచర్లపై రచ్చరచ్చమన్నెమాల సుకుమార్‌రెడ్డికి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యవహారాలు గతంలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. కూటమి అధికారంలోకి రాక ముందు ఆయనకు సంబంధించిన రియల్ వెంచర్లపై టీడీపీ వర్గాల నుంచే పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తిన సందర్భాలను రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నరేళ్లు అవుతున్నప్పటికీ మన్నెమాలకు సంబంధించిన రియల్ వెంచర్లపై అప్పట్లో రాజకీయంగా తీవ్ర ఆరోపణలు చేసినప్పటికీ ఇప్పటి వరకు జానెడు భూమిని స్వా«దీనం చేసుకోలేదని ప్రత్యర్థి వర్గాలు విమర్శిస్తున్నాయి. కూటమిలో చీలికలు.. పేలికలు అధికార కూటమి ఏర్పడినప్పుడు మూడు పార్టీల సమన్వయంతో పని చేస్తామని ప్రకటించిన నేతలు, ఇప్పుడు ఎవరికి వారే రాజకీయ లెక్కలు వేసుకుంటున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య అంతర్గత విభేదాలు, మన్నెమాల ఎంట్రీపై భిన్నాభిప్రాయాలు, జనసేనలో కొత్త నాయకత్వాన్ని తెరపైకి తీసుకురావాలన్న ప్రయత్నాలు.. ఇవన్నీ కలిపి చూస్తే కావలి కూటమిలో సమన్వయం కంటే ఆధిపత్య పోరే ఎక్కువైందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కావలిలో కూటమి మూడు పార్టీల ఐక్యతగా కనిపిస్తున్నా.. లోపల మాత్రం ఎవరి రాజకీయ పట్టు పెంచుకోవాలన్న లెక్కలతో కుతకుతలాడుతోందన్న చర్చ సాగుతోంది. -
పోలవరం కల సాకారమా?.. లేక ముగింపు ప్రయత్నమా?
పోలవరం బహుళార్ధక సాధక ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు అనుగుణంగానే సిద్దం అవుతోందా?వచ్చే ఏడాది జూన్ నాటికి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమార్లు ప్రకటిస్తున్నారు. ఇది సంతోషించదగ్గ విషయమే. కాని ఆ ప్రాజెక్టును తొలుత ప్రతిపాదించిన విధంగా కాకుండా నిర్ధిష్ట లక్ష్యంలో నాలుగో వంతుకే పరిమితం చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటా అన్నది పెద్ద చర్చగా ఉంది. 7.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి గాను రూపొందించిన ఈ ప్రాజెక్టు తాజాగా కేంద్రం ప్రకటించిన ప్రకారం కేవలం 1.98 లక్షల ఎకరాలకే నీరు అందించగలుగుతుందని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? దీనికి ఎవరు బాద్యత వహించాలి?. ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తున నిర్మించాలని తొలుత భావించగా, ఇప్పుడు దానిని 41.15 మీటర్లకే పరిమితం చేయబోతున్నారన్నది వస్తున్న సమాచారం. దీనికి తొలిదశ అని పేరు పెట్టి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారా అన్న సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం పార్లమెంటుకు ఇస్తున్న సమాచారం పరిశీలిస్తే,ఈ ఎత్తు వరకే కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు నిధులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎల్లో మీడియా మాత్రం దీనిని కవరప్ చేస్తూ ఇది తొలిదశ అయినా, తర్వాత కూడా పనులు సాగించుకోవచ్చని చెబుతోంది. కాని అందుకు అయ్యే ఖర్చును ఎవరు భరించాలి? ఈ మొత్తం ఎపిసోడ్‌ను పరిశీలిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014-2019 టర్మ్‌లో తీసుకున్న ఒక నిర్ణయమే ఈ పరిస్థితికి కారణమన్న విశ్లేషణలు వస్తున్నాయి. విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్మించి ప్రజలకు అందించాలి. కాని చంద్రబాబు అప్పట్లో కూడా ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి, ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్రమే నిర్మిస్తుందని చెప్పి కేంద్రాన్ని ఒప్పించారు.ప్రత్యేక హోదా డిమాండ్‌ను చంద్రబాబు వదలుకుని పోలవరం కాంట్రాక్టును తీసుకున్నట్లయిందని అప్పట్లో ప్రతిపక్షం విమర్శించేది. ఆ తర్వాత వైఎస్సార్సీపీ అధినేత, ఆనాటి ముఖ్యమంత్రి జగన్ టైమ్‌లో ఈ ప్రాజెక్టుకు 45.72 మీటర్ల ఎత్తును కేంద్రంతో ఖరారు చేయించి, తదనుగుణంగా నిధులు మంజూరుకు ఒప్పించారని చెబుతారు. ఇందుకు తగినట్లుగా స్పిల్వేని ఆ స్థాయిలో నిర్మాణం చేయించారు. జగన్ ప్రభుత్వం రెండు దశలలో నిర్మాణం జరుగుతుందని చెబితే విపక్షంగా ఉన్న తెలుగుదేశం తీవ్ర విమర్శలు గుప్పించింది. రెండేళ్ల క్రితం కూటమి అదికారంలోకి వచ్చాక తొలిదశతోనే ప్రాజెక్టును ముగించే పరిస్థితి ఏర్పడడం ఆందోళన కలిగించే అంశమే. 45.72 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు పూర్తి అయితే 194 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. 41.15 మీటర్ల స్థాయిలో అయితే 119 టీఎంసీల నీటిని నిల్వ చేయగలుగుతారు. ఇదే జరిగితే తొలుత అంచనా వేసినట్లు ఏడు లక్షల ఎకరాలకు పైగా నీటిని అందించడం సాధ్యం కాదు. అలాగే కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను మళ్లించడానికి, గోదావరి డెల్టా ఆయకట్టు స్థిరీకరణ, ఉత్తరాంద్ర సుజల స్రవంతి పూర్తి స్థాయిలో నీళ్లు అందించడం సాధ్యం కాకపోవచ్చన్నది నిపుణుల అభిప్రాయంగా ఉంది. అలాగే విద్యుత్ ప్రాజెక్టును కూడా వరద వచ్చినప్పుడే నడపగలుగుతారు. ఒరిజినల్‌గా పోలవరం నిర్మాణానికి సుమారు 55 వేల కోట్లు అవసరం అని అంచనా వేశారు. కాని ఇప్పుడు దానిని సుమారు 30వేల కోట్లకే పరిమితం చేస్తున్నారట. ఆ లెక్కన మరో 12 వేల కోట్లు ఇస్తే సరిపోతుందన్నది కేంద్రం అభిప్రాయంగా ఉంది. దీనివల్ల ఏపీకి బాగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. తుది దశ నిర్మాణాన్ని రాష్ట్రం నిజంగా కొనసాగిస్తే అదనంగా అయ్యే వ్యయం సుమారు 25 వేల కోట్లు ఉంటుంది. కేంద్రం దీనిని ఇస్తామంటే మంచిదే. కాని రాష్ట్రమే భరించవలసిరావచ్చన్న సందేహాలు వస్తున్నాయి. ఈ మొత్తాన్ని నిర్వాసితుల కోసం ఖర్చు చేయవలసి ఉంది. రెండో దశలో మునిగిపోయే ప్రాంతాన్ని తగ్గించడంవల్ల ఈ వ్యయం తగ్గించుకోవాలని చూస్తున్నట్లుగా ఉంది.అదే జరిగితే ప్రాజెక్టు పర్పస్ నిర్వీర్యం అవుతుందన్న ఆందోళన ఉంది. కేంద్రం రెండో దశకు కూడా నిధులు ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడా అధికారికంగా చెబుతున్నట్లు కనిపించడం లేదు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ఎత్తు పెంచడాన్ని వ్యతిరేకిస్తోంది. దీనివల్ల తమ భూభాగం మునుగుతుందన్నది ఆ రాష్ట్ర వాదన. నిజానికి ప్రాజెక్టును వైఎస్సార్ ప్రతిపాదించి, వివిధ అనుమతులు సాదించినప్పుడే వాటన్నిటిని లెక్కించి చాలావరకు పరిహారం ఇప్పించారు. తదుపరి ఆయన అనూహ్య మరణంతో మొత్తం పరిస్థితులు మారిపోయాయి. ఉమ్మడి ఏపీ విభజన జరిగింది. ఈ విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును కేంద్రమే చేపడుతుందని తెలిపినా, చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో కేంద్రం నుంచి తీసుకోవడం ఒక చారిత్రక తప్పిదంగా చెబుతారు. 2019 ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ విమర్శలు చేస్తూ పోలవరాన్ని చంద్రబాబు అవినీతి ఏటీఎంగా మార్చుకున్నారని ఆరోపించారు. అంతేకాక కాఫర్ డామ్ పూర్తిగా నిర్మించకుండా రెండు గాఫ్ల్ పెట్టి డయాఫ్రం వాల్ నిర్మాణానికి పూనుకోవడం, భారీ వరదల కారణంగా ఆ వాల్ దెబ్బతినడం వంటి ఘటనలు జరిగాయి. చంద్రబాబు తాను చేసిన తప్పులను జగన్ ప్రభుత్వంపై నెట్టివేయడం చేస్తూ వచ్చారు. అయితే ఇటీవల కాఫర్ డామ్ ఎడమవైపు పది అడుగుల వెడల్పు, ఏడు నుంచి ఎనిమిది అడుగుల లోతున జారిందని ఎల్లో మీడియానే రిపోర్టు చేసింది. దీనిని కొంత కవర్ అప్ చేసే యత్నం చేస్తూ కధనాన్ని ఇచ్చింది. అదే జగన్ టైమ్ లో ఇలాంటి ఘటన జరిగి ఉంటే, టీడీపీ, ఎల్లో మీడియా రచ్చ రచ్చగా ప్రచారం చేసేవి. కాగా డయాఫ్రం వాల్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని సెంటర్ ఫర్ లిబర్టి ప్రతినిధులు ఎబి వెంకటేశ్వరరావు, నల్లమోతు చక్రవర్తి చెబుతున్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి తొలిదశ పూర్తి చేసి మమ అనిపించుకుంటారా? లేక పోలవరం ప్రాజెక్టు రెండో దశ కొనసాగించగలుగుతారా అన్న సందేహాన్ని నివృత్తి చేయవలసి ఉంది. చంద్రబాబుకు భారీ ప్రాజెక్టులపై అంత నమ్మకం లేదు. ఇదే విషయాన్ని గతంలో ఆయన చెబుతుండేవారు. టీడీపీ నేతలుగా ఉన్న వడ్డి వీరభద్రరావు, ఎర్రా నారాయణస్వామి వంటివారు ఈ ప్రాజెక్టు కోసం నిత్యం పోరాడేవారు. అయినా వారిని చంద్రబాబు పట్టించుకునేవారు కాదు. భారీ ప్రాజెక్టుల వల్ల రాజకీయ లబ్ది వెంటనే ఉండదన్నది ఆయన భావనగా ఉండేది. కాని వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం మాత్రమే కాకుండా సుమారు 48 ప్రాజెక్టులను ఆ రోజుల్లో జలయజ్ఞం పేరుతో సంకల్పించారు. దానిపై టీడీపీ విమర్శలు చేస్తుండేది. విభజన తర్వాత మాత్రం అప్పటికే నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు తన కల అని చంద్రబాబు చెప్పడం ఆరంభించారు.నిజంగా ఆయన కలే అయితే చిత్తశుద్దితో 45.72 మీటర్ల ఎత్తుతో పూర్తి చేయగలగాలి. చంద్రబాబు ఆ పని చేసి చూపిస్తారా!. లేక దీనితోనే మాయ చేస్తారా? అన్నది చూడాలి. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
దమ్ముంటే రారా చూసుకుందాం!
‘‘నేను నీపేరు వాడుకున్నానా...నీ బతుక్కి అనంతపురంలో పార్టీ కార్యాలయం పెట్టే పరిస్థితి లేకపోతే నా ఇళ్లు ఇచ్చా. నీ కోసం కేసులు మోసుకున్నా..జైలుకు వెళ్లా...ఇంత చేస్తే...నన్ను వాడు...వీడు అంటావా...దమ్ముంటే రారా చూసుకుందాం’’ అంటూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌పై అతని నమ్మినబంటు, వరుసకు మామ అయిన గంగారాం రెచ్చిపోయారు. మంగళవారం రాత్రి టీడీపీ నియోజకవర్గ స్థాయి కార్యాలయంలో గంగారాం తన అనుచరులతో హల్చల్ చేసినట్లు తెలిసింది. ఏకంగా ఎమ్మెల్యే దగ్గుపాటిని ఉద్దేశించి బండబూతులు తిట్టినట్లు సమాచారం. ‘‘ఆ్రఫ్టాల్ ఎంపీపీవి.. ఎమ్మెల్యే స్థాయికి రావడానికి నేనే కారణం’’ అంటూ గంగారాం బాహాటంగానే విమర్శించినట్లు టీడీపీ వర్గాల్లో భారీగా చర్చ నడుస్తోంది. అసలు వివాదం ఏమిటంటే ఇటీవల బెంగళూరులో ఓ సామాజికవర్గం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న నగరానికి చెందిన టీడీపీ నేత ఒకరు...‘‘ గంగారాంను వాడుకుని జైలు పాలు చేశావు కదయ్యా’’ అని అన్నారు. దీంతో సహనం కోల్పోయిన దగ్గుపాటి ప్రసాద్ అందరిముందే గంగారామ్‌ను బండబూతులు తిట్టినట్లు చర్చ జరుగుతోంది. ‘‘గంగారాం ఎంత అతని బతుకెంత... నా పేరు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడతాడా‘‘ అంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి రెచ్చిపోయినట్లు సమాచారం. ఈ విషయం అక్కడున్న వారి ద్వారా తెలుసుకున్న గంగారామ్ తీవ్ర అవమాన భారానికి లోనయ్యారు. మంగళవారం రాత్రి ఎమ్మెల్యే పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఉన్నట్లు తెలిసి అనుచరులతో కలిసి అక్కడికే వెళ్లాడు. అయితే ఎమ్మె ల్యే పార్టీ కార్యాలయంలోనే ఉన్నప్పటికీ గంగారామ్ వస్తున్నట్లు తెలిసి తాను లేనట్లు అనుచరులతో చెప్పించారు. దీంతో కోపోద్రిక్తుడైన గంగారామ్ ఎమ్మెల్యే దగ్గుపాటి.. చేసిన మేలు మరచిపోయాడంటూ చిందులు తొక్కారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అప్పటికప్పుడు తన అనుచరులను పిలిపించి గంగారామ్‌పై ఫిర్యాదు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అక్రమ వసూళ్లు...జైలు ఎమ్మెల్యే దగ్గుపాటికి నమ్మిన బంటుగా ఉన్న గంగారామ్.. నగరంలో విచ్చలవిడిగా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. నగరంలో ఒక వైన్ షాప్‌లో వాటాలు ఇవ్వలేదని నిప్పు పెట్టిన ఘటనలో గంగారాం అరెస్ట్ అయ్యారు. ఎగ్జిబిషన్ నిర్వాహకుడిపైనా డబ్బులు ఇవ్వాలని బెదిరించిన ఘటనలోనూ గంగారాం ప్రధానంగా ఉన్నారు. గంగారాంను కరివేపాకులా తీసి పారేసిన ఎమ్మెల్యే వైఖరిపై భగ్గుమంటున్నారు. ఏది ఏమైనా ఎమ్మెల్యే.. గంగారాం వైఖరి టీడీపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా అనంతపురం నగరంలో టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఇటీవల ఏకంగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి దగ్గుపాటి వైఖరిపై ప్రెస్‌మీట్ పెట్టి ఏకిపారేశాడు. దగ్గుపాటి రూ.200 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డాడు అంటూ ఆధారాలతో సహా అధిష్టానానికి ఇచ్చామంటూ పేర్కొనడంతో నగరంలో టీడీపీ కేడర్ ఆత్మరక్షణలో పడింది. -అనంతపురం చదవండి: ‘ఒరేయ్ మీ నాన్న నాకు మంచి ఫ్రెండ్ రా.. రా కూల్‌డ్రింక్ తాగుదాం!’ -
లోకేష్ వ్యాఖ్యలు.. జనసేన ఆత్మగౌరవానికే పరీక్ష?
స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు చికాకుగా మారేలా ఉంది. జనసేన క్యాడర్ లో చాలామంది ఈ స్థానిక పదవులపై ఆశలుపెంచుకోవడమే దీనికి కారణం. పవన్ కళ్యాణ్ డిప్యూటి సీఎం పదవిలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ సంగతి ఎలా ఉన్నా,తన వరకు పవర్‌ను బాగానే ఎంజాయ్ చేస్తున్నారన్నది పలువురి భావనగా ఉంది. ఆయన తరచుగా మంత్రివర్గ సమావేశాలకు వెళ్లకపోయినా అడిగేవారు లేరు. కీలకమైన అంశాలలో పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించకపోయినా లోలోపల మదనపడేవారే తప్ప ఆయనను అడిగే ధైర్యం చేసేవారు లేరు. పవన్ కు భుజం శస్త్ర చికిత్స ,అనారోగ్య సమస్య కారణంగా కొంత ఇబ్బంది పడుతున్నారు. అయినా కొన్ని కార్యక్రమాలకు వెళ్లడం, మరికొన్నిటికి వెళ్లకపోవడం జరుగుతోంది.ఇటీవల కేరళకు వెళ్లారు. దీనిపై అంతా సానుభూతితోనే ఉన్నారు. కాని రాజకీయంగా జరుగుతున్న పరిణామాలు పార్టీలో అంత సంతృప్తికరంగా లేవన్నది నిష్టుర సత్యంగా కొందరి వ్యాఖ్యల బట్టి అర్దం అవుతుంది. ఇవన్ని ఎలా ఉన్నా కూటమి ప్రభుత్వం ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం 15 ఏళ్లు ఉండాలని స్వయంగా పవన్ కళ్యాణే పలుమార్లు ప్రకటించడంతో జనసేన క్యాడర్ లో నిస్తేజం ఏర్పడింది. తాము పవన్ కళ్యాణ్‌ను సీఎంగా చూడాలని అనుకుంటే, ఆయనేమో దాని గురించి ఆలోచించడం మానేశారన్నది వారి బాధ. తన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించినా అది దక్కలేదు. కాని చివరికి అటవీశాఖలో గ్రీన్ కమిటీ ఛైర్మన్‌గా నియమించి క్యాబినెట్ హోదా ఇచ్చారు. అంతవరకైనా అన్నదమ్ములకు న్యాయం జరిగినట్లయిందని కొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తుంటారు. ఒకప్పుడు కుటుంబ సభ్యులకు పదవులు ఇవ్వడాన్ని తీవ్రంగా విమర్శించిన సంగతి వేరే కోణం. పార్టీలో ఆయా ముఖ్యమైన పదవులలో సామాజిక న్యాయం జరగడం లేదన్న విమర్శ ఉంది. పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు కారు రాష్ డ్రైవింగ్ కారణంగా ఒక యువతి మరణిస్తే తగురీతిలో పార్టీ స్పందించి ఉండాల్సిందని,అలా చేయకపోవడం వల్ల జాతీయ మీడియాలో కూడా విమర్శలకు గురి కావల్సి వచ్చిందన్న భావన ఉంది. చంద్రబాబు, మంత్రి లోకేష్ లు అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ ను పొగడడం మినహా జనసేన పార్టీవారికి పెద్దగా ఒరుగుతున్నదేమీ లేదన్నది కొంతమంది జనసేన నేతల అభిప్రాయం. ఈ పరిణామాలను అంతా గమనిస్తున్నారు. కాకపోతే అధికారంలో ఉన్న నేపద్యంలో ఎవరికివారు పైకి మాట్లాడడానికి కాస్త వెనుకాడుతుంటారు. ఈ పరిస్థితిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే తమకు ఏ మేరకు అవకాశాలు వస్తాయన్నది జనసేన కార్యకర్తలలో ఉన్న ప్రశ్న. లోకేష్ ఎప్పుడైతే జనసేనకు 15 శాతం సీట్లే కేటాయిస్తామని చెప్పడంతో జనసేన కార్యకర్తలు ఉలిక్కిపడ్డారు. లోపల ఉడుకుతున్నారు. పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ శాసనసభ ఎన్నికలు వేరు, స్థానిక ఎన్నికలు వేరని, అందువల్ల 15 శాతం కేటాయింపు సమ్మతం కాదన్నట్లు మాట్లాడారు.కాని ఆ తర్వాత కాస్త తగ్గారేమో అన్న అభిప్రాయం పార్టీలో ఏర్పడింది. దాంతో పవన్ కళ్యాణ్ కూడా దీని గురించి మాట్లాడక తప్పలేదు. నిజానికి ఆయనకు ఈ అంశంపై ఎంత శ్రద్ద ఉందో పార్టీ క్యాడర్ కు తెలియడం లేదు. నిర్దిష్టంగా స్థానిక ఎన్నికలలో పార్టీ కార్యకర్తలు,లోకల్ నేతలకు మంచి ప్రాధాన్యం వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వలేదు. ఒక కమిటీని నియమించారు. వారేమి చేస్తారో తెలియదు. లోకేష్ ప్రకటనకు పవన్ గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోయారన్నది జనసేనలో ఉన్న ఒక అభిప్రాయంగా భావిస్తున్నారు. ఆయా ప్రాంతాలు,సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని సీట్ల కేటాయింపు కోరాలన్న ఆలోచనను ఆయన చేస్తున్నారట. ఈ ఎన్నికలలో జనసేన ప్రభావశీలంగా ,మెరుగైన స్థాయిలో నిలబడుతుందని ఆయన చెప్పారు. అయితే కచ్చితంగా ఎంత శాతం సీట్లు దక్కుతాయన్నది తేల్చలేదు. లోకేష్ అంత స్పష్టంగా ఒక లెక్క చెప్పినప్పుడు అది కుదరదని చెప్పకపోతే పార్టీవారికి అది లోకువ కాదా అన్నది కొందరు నేతల భావన. కాగా పార్టీ బాధ్యత అంతా నాదెండ్ల మనోహర్ కే అప్పగించినట్లుగా కనిపిస్తుందని, ఆయనే ఆయా సమావేశాలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. స్థానిక ఎన్నికల కోసం 30 రోజుల ప్రణాళిక తయారు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.చంద్రబాబు వ్యూహాత్మకంగా జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించేది చెప్పకుండా ,మూడుపార్టీలు కలిసి పనిచేయాలని ప్రకటనలు చేస్తున్నారు. టీడీపీ ఏ మేరకు సీట్లు ఇస్తుందో తెలియక,ఆయా చోట్ల జనసేన ఆశలు పెంచుకుంటోంది. మచిలీపట్నంలో ఇంతవరకు టీడీపీతో ఒక అవగాహన రానప్పటికీ జనసేనలోని రెండువర్గాలు దీనిపై ఘర్షణ పడ్డాయి.మరోవైపు గుంటూరు మేయర్ సీటును జనసేనకే కేటాయించాలని కోరుతూ ఆ పార్టీ గుంటూరు జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు అడపా మాణిక్యాలరావు ఒక కరపత్రాన్ని విడుదల చేశారు.గుంటూరులో ప్రస్తుతం ఉన్న ముఖ్యమైన పదవులన్నీ టీడీపీవారికే వచ్చాయని, అందువల్ల మేయర్ పదవికి పోటీచేసే అవకాశాన్ని జనసేనకు ఇవ్వాలని ఆయన కోరారు. పలు ఇతర జిల్లాలలో కూడా జనసేన నేతలు ఇలాంటి డిమాండ్లే పెడుతున్నారు. ఇదిలా ఉండగా కొంతమంది నేతలు ఏ ఏ జిల్లాలలో ఎంత శాతం సీట్ల కేటాయింపు కోరాలో పార్టీకి సూచిస్తున్నారు.దాని ప్రకారం ఉభయ గోదావరి జిల్లాలలో టీడీపీతో సమానంగాను, ఉత్తరాంధ్ర నుంచి కృష్ణా జిల్లావరకు 40 శాతం సీట్లు,తొమ్మిది జడ్పి చైర్ పర్సన్, ఐదు మేయర్ పదవులకు పోటీ చేయాలని వీరు కోరుతున్నారు. ఒవరాల్ గా చూసినప్పడు సగటున మూడో వంతు సీట్లకు పట్టుబట్టాలన్నది జనసేన నేతల డిమాండ్ గా ఉందని అంటున్నారు. తాను నియమించిన కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత తాము కోరదగిన సీట్ల వివరాలను టీడీపీ నాయకత్వానికి అందచేయవచ్చని భావిస్తున్నారు.ఆ తర్వాత సంప్రదింపులలో ఎన్నిటికి ఒప్పందం కుదురుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. శాసనసభ ఎన్నికలలో కనీసం 50 సీట్లకుపట్టుబట్టి ఉంటే,ఈ రోజు జనసేనకు ఈ పరిస్థితి వచ్చేది కాదని అనుకుంటున్నారు. అయినా ఆనాడు పవన్ మాటను కాదనలేక సర్దుకుపోయామని కొందరి వ్యాఖ్యగా ఉంది. ఇప్పుడు స్థానిక ఎన్నికలలో లోకేష్ మాటే చెల్లితే జనసేన పరిస్థితి మరింత దిగజారుతుందన్న భయం పార్టీవర్గాలలో ఉంది.ఇప్పటికే అనేక చోట్ల టీడీపీ నేతల నుంచి అవమానాలను భరించవలసి వస్తోందన్నది పలువురు నేతల బాధగా ఉంది.ఈ విషయాన్ని కొంతమంది ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారని వార్తలు వచ్చాయి. దీనిపై పార్టీ కార్యకర్తలలో ఉన్న అసహనాన్ని కూడా తెలియచేశారు. పవన్ ఈ విషయాలు తెలుసునని అన్నారట. అయినా ఆయన నుంచి వారికి కచ్చితమైన హామీ లభించినట్లు చెప్పలేకపోతున్నారు. ఒకరకంగా ఈ స్థానిక ఎన్నికలు జనసేన ఆత్మగౌరవానికి ఒక పరీక్ష అని ఆ పార్టీవారే వ్యాఖ్యానిస్తున్నారు. ఒక రాజకీయపార్టీగా జనసేన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోగలుగుతుందా?. ఆత్మ గౌరవాన్ని పరిరక్షించుకుంటుందా? లేక టీడీపీ వెనుక నిలబడే పార్టీగానే మిగిలిపోతుందా అన్నది స్థానిక ఎన్నికలలో కొంతవరకు తేలవచ్చేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.చదవండి: వైఎస్ జగన్ ప్రశ్నలకు టీడీపీ ఉక్కిరిబిక్కిరి..! -
బాబూ... చెత్త ఎవరిది? సోషల్ మీడియాలో రివర్స్ కౌంటర్!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు భలే ప్రకటనలు చేస్తుంటారు. వాటిని ఎల్లో మీడియా పరమ పవిత్రం అన్నట్లుగా ప్రముఖంగా ప్రచురించి ప్రచారం చేస్తుంటుంది. చంద్రబాబు ఈ మధ్య ఒక ప్రకటన చేశారు. అది ఏమిటంటే రాజకీయాలలో చెత్తను తొలగిద్దాం.. అని అన్నారు. మామూలుగా అయితే ఇది ఆహ్వానించదగిందే. కాని ఆయన లక్ష్యం వేరు. ప్రతిపక్షాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నానని ఆయన అనుకోవచ్చేమోకాని, వాటిని విన్నవెంటనే, పత్రికలలో చదివిన వెంటనే గుర్తుకు వచ్చేది అధికార పార్టీలో ఉండేవారు చేసే అక్రమాల గురించే కదా! ఆ విషయాన్ని ఆయన పట్టించుకోకుండా స్పీచ్‌లు ఇస్తుండడం విశేషం.మనం రాజకీయాలలో ఉన్నవారిని అలాంటి పదాలతో సంభోధించడం సరైన పద్దతి కాదు. ఎవరు తప్పు చేసినా తప్పే. అసలు రాజకీయాలలో చెత్త అంటే ఏమిటో ఆయన ఒక నిర్వచనం ఇస్తే బాగుంటుంది కదా! ఎవరిపైన కేసులు ఉంటే వారు ఆ కోవలోకి వస్తారని అన్న భావనా? లేక ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడితే దానిని ఆ విధంగా పరిగణించాలన్న అర్థమా? ఎన్నికలలో డబ్బు ఖర్చు చేసేవారిపై వ్యాఖ్యలా?ఒక విశేషం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఈ స్పీచ్ ఇవ్వడానికి రెండు రోజుల ముందు జాతీయ స్థాయిలో ప్రజస్వామ్య సంస్కరణల వేదిక ఒక నివేదిక విడుదల చేసింది. అందులో ఏమి ఉంది? ఏపీలో 79 శాతం మంది ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నాయనే కదా! అంటే అత్యధిక సంఖ్యలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేల మీదే కదా! నేర చరిత్ర కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో చంద్రబాబుది నాలుగో స్థానం అని అందులో ప్రకటించారు. ఈయనపై 19 క్రిమినల్ కేసులు ఉంటే, కొన్ని తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని రిపోర్టు చెబుతుంది. ఆయన శిష్యుడుగా గుర్తింపు పొందిన తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిపై ఏకంగా 89 కేసులు ఉన్నాయట. ఆయన అగ్రస్థానంలో ఉన్నారు.వీటిలో పెక్కు రాజకీయపరమైన కేసులు ఉండవచ్చని వీరు వాదించవచ్చు. కాని ఎదుటి పక్షాలపై అలాంటి కేసుల ఆధారంగానే చంద్రబాబు ఆరోపణలు చేస్తుంటారే! అక్కడే వచ్చింది సమస్య. తాను ఎవరిపైన ఆరోపణ చేస్తే అందులో నిజం ఉందని అనుకోవాలన్నది ఆయన భావన. అదే తనపై ఎవరైనా ఆరోపణ చేస్తే ఎవరూ నమ్మకూడదన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. రాజకీయాలలో ఉన్నప్పుడు ఎంతసేపు ఎదుటివారిపై బురద వేయడమే పనిగా పెట్టుకున్నప్పుడు ఆ బురద తమపై కూడా పడే అవకాశం ఉంటుందని వారు గుర్తించాలి కదా! తనకు మీడియా బలం ఉంది కనుక తను చెప్పిందే జనంలోకి వెళుతుందని చంద్రబాబు భ్రమపడి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయనకే నష్టం.ఇవి కూడా చదవండి: వైఎస్ జగన్ ప్రశ్నలకు టీడీపీ ఉక్కిరిబిక్కిరి..!చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే సోషల్ మీడియాలో ఆయనను ఎద్దేవ చేస్తూ అనేక విషయాలను ఫాక్ట్స్ అండ్ ఫిగర్స్‌తో పోస్టులు వస్తున్నాయి. గొడ్డలి పార్టీ అని వైఎస్సార్సీపీని అంటూ తన పార్టీని వెన్నుపోటు పార్టీ అని చంద్రబాబు పిలిపించుకుంటున్నారు. మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు చేస్తున్న వ్యక్తిగత విమర్శలు చాలా అనుచితంగా ఉంటున్నాయి. చంద్రబాబు తన హోదాను, సీనియారిటీని కూడా మర్చిపోయి ఏది పడితే అది ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం దురదృష్టకరం. ప్రజలు నిజాయితీగా ఉంటే నాయకులు తప్పులు చేయరట. ఎన్నికలలో డబ్బు ప్రభావం లేకుండా చేయవలసిన బాధ్యత ప్రజలదట. అది జరిగితేనే రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందట. అంటే ఇప్పట్లో రాష్ట్రం స్వర్ణాంధ్ర కాదని పరోక్షంగా చెప్పినట్లు అనుకోవాలా? ఎంతసేపు ప్రజలను నిందిస్తున్నారే తప్ప, తాము డబ్బు పంచకుండా ఎన్నికలలో పోటీచేస్తామని మాటవరసకు చెప్పలేకపోతున్నారన్న విమర్శ వస్తోంది.సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు అయితే నేరుగా రాజకీయాలలో డబ్బు ప్రభావం తెచ్చిందే చంద్రబాబు అని స్పష్టంగా చెబుతున్నారు. వైఎస్సార్సీపీ పార్టీ అధినేత పీఏ వందల కోట్లు సంపాదించారని ఆయన ఏ ఆధారంతో చెప్పారో తెలియదు. కాని చిత్రం ఏమిటంటే స్వయంగా చంద్రబాబు పీఏ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీబీటీడీనే రెండువేల కోట్ల అక్రమాలను గుర్తించినట్లు ప్రకటించింది. దాని గురించి ఎన్నడైనా చంద్రబాబు వివరణ ఇచ్చారా? స్కిల్ స్కామ్‌లో ఆయన పీఏ అరెస్టు కాకుండా అమెరికాకు పంపించిందెవ్వరో తెలియదా! స్కిల్ స్కామ్‌లో అప్పటి సీఐడీ చేసిన అభియోగాలపై ఎన్నడైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పాయింట్ వైజ్ వివరణ ఇచ్చి, తానేమి తప్పు చేయలేదని చెప్పి ఉండాలి కదా!ఈ స్కామ్‌లో ఏ అధికారులు అరెస్టు అయింది అందరికి తెలుసే. డీఎస్సీ, ఏపీపీఏస్సీ అంశాలను చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌లు ప్రస్తావిస్తూ తమ వాదన సమర్థించుకునే యత్నం చేస్తున్నా, జగన్ విసిరిన సవాల్, అంటే సీబీఐ విచారణకు సిద్దపడకపోవడం వారి బలహీనతగా కనిపించదా! నకిలీ మద్యంతో గత ప్రభుత్వంలో 30వేల మంది చనిపోయారని ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం.విశేషం ఏమిటంటే కూటమి అధికారంలోకి వచ్చాక తంబళ్లపల్లె నియోజకవర్గంలో ములకల చెరువు గ్రామం వద్ద టీడీపీ నేతలే నకిలీ మద్యం తయారీ కేంద్రాన్నే పెట్టిన విషయం బహిర్గతం అయింది. అలాంటివి ఏవైనా జగన్ టైమ్‌లో కనిపించాయా? అయినా ఈ ఆరోపణలు ఏమిటో! చంద్రబాబు స్పీచ్ ఇస్తున్న టైమ్‌లోనే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేపై టీడీపీకే చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి తీవ్ర ఆరోపణ చేశారే. ఈ రెండేళ్లలో 200 కోట్లు భూ దోపిడీ, ఇతరత్రా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మరి వాటిపై విచారిస్తానని ఎందుకు చెప్పలేకపోయారు.అంతేకాదు. అదే ఎమ్మెల్యే తనకు ప్రతినెల మామూళ్లు ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్‌ను బెదిరించినట్లు కూడా వార్తలు వచ్చాయే!విజయవాడ టీడీపీ ఎంపీ వర్గంపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చేసిన ఆరోపణల మాటేమిటి? గంజాయి, మట్టి, ఇసుక మాఫియాగా మారి ఏ విధంగా అక్రమాలు చేస్తున్నదానిపై ఎన్ని ఆరోపణలు చేసింది ఆయనకు తెలియదా? వాటిపై చర్య తీసుకోకపోగా పార్టీ కమిటీ కొలికపూడిని పిలిచి మందలించిందని వార్తలు వచ్చాయే. ఇటీవలే ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ పోలీస్ స్టేషన్ అడ్డగానే దందాలు చేస్తున్నట్లు జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారే. వారిద్దరు బహిరంగంగా మాట్లాడవద్దని సలహా ఇస్తే సరిపోతుందా!ఇక మహిళలను వేదించిన కొందరు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలను కనీసం పిలిచి కోప్పడ్డారా? ఒక మంత్రే తనను వేధించారని ఒక ఎన్ఆర్ఐ మహిళ ఫిర్యాదు చేస్తే ఏమి చర్య తీసుకున్నారో ప్రజలకు తెలియచేసి ఉండాల్సింది కదా! ఇలా చెప్పుకుంటూ పోతే భారతం అంత అయ్యే పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వ అద్వాన్న పరిస్థితి కళ్లకు కట్టినట్లు కనబడుతుంది.ఇక మంత్రి లోకేష్ డీఎస్సీపై ఐదో సారి చర్చకు రమ్మన్నా రావడం లేదని సభలలో ఉపన్యాసాలు ఇచ్చి, జనం వాటినే నమ్మాలని తండ్రి మాదిరే అనుకుంటే ఎలా? జగన్ విసిరిన సీబీఐ సవాల్‌ను దమ్ముగా ఎదుర్కుని స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరగలేదని రుజువు చేసుకోవచ్చు కదా! చంద్రబాబు, లోకేష్‌లు తమను తాము పొగుడుకుంటే పొగుడుకోవచ్చు. కాని ఎదుటివారిపై నిందలు మోపే ముందు, అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు అవి తమకు కూడా తగులుతాయేమో చూసుకుని మాట్లాడితే వారికే మంచిది కదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కూటమి సర్కార్‌కు జోగి రమేష్ సవాల్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: కూటమి సర్కార్ వచ్చిన దగ్గర్నుంచి తానను టార్గెట్ చేస్తూనే ఉన్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. గుంటూరులో కోట్ల విలువైన ఇరిగేషన్ భూమి విషయంలో నాపై వార్తలు రాశారు. నిస్సిగ్గుగా నాపై ఆంధ్రజ్యోతి వార్త రాసింది. ప్రభుత్వం రాగానే నా కుమారుడిపై కేసు నమోదు చేశారు. నకిలీ మద్యం కేసులో నన్ను, నా తమ్ముడిని 83 రోజులు జైల్లో పెట్టారు. నా ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడులు చేయించారు’’ అని జోగి రమేష్ ధ్వజమెత్తారు.‘‘నా కుమారుడు, నాపై పెట్టిన కేసుల్లో మా పాత్రను నిరూపించలేకపోయారు. నా కుమారుడి వ్యక్తిగత వ్యవహారాన్ని కూడా రోడ్డుకి ఈడ్చారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ప్రభుత్వాన్ని కోరుతున్నా.. గుంటూరులో ఇరిగేషన్ భూముల వ్యవహారంలో ఉన్న ప్రైవేట్ వ్యక్తి ఎవరో వాస్తవాలు వెల్లడించండి. నన్ను, నా కుటుంబాన్ని అన్ని రకాలుగా టార్గెట్ చేశారు. గుంటూరు ఇరిగేషన్ భూముల విషయంలో నాపై వచ్చిన ఆరోపణలపై విచారణకు నేను సిద్ధం. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని చంద్రబాబును కోరుతున్నా. విజిలెన్స్ విచారణ జరిపించాలని కోరుతున్నా..అక్రమ కేసులు, తప్పుడు ఆరోపణలతో నాపై బురద చల్లాలని చూస్తున్నారు. నా గొంతు నొక్కాలని చూడటం మీకు సాధ్యం కాదు. అప్పులను తీర్చుకోవడానికి నాకు ఉన్న భూములను అమ్ముకుంటున్నా.. నాకు గుంటూరు ఇరిగేషన్ భూములతో ఎలాంటి సంబంధం లేదు. నాపై మీకు కక్ష తీరకపోతే ఇంకా ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. నా భార్య బైబిల్ చదివితే తప్పేంటి? నాతో పాటు నా భార్య కూడా ఆలయాలకు వస్తుంది. మొన్ననే నేను, నా భార్య కాశీ విశ్వేశ్వరుడి వద్దకు వెళ్లొచ్చాం. మూడేళ్ల క్రితం నా ఇంట్లో జరిగిన ఛండీయాగంలో నా భార్య, నేను పాల్గొన్నాం. తప్పుడు ప్రచారాలు చేయొద్దని చంద్రబాబును కోరుతున్నా’’ అని జోగి రమేష్ పేర్కొన్నారు. -
‘అందుకే విజయసాయిరెడ్డి ఆరోపణలు’
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ నాయకత్వాన్ని, వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేసి దాడి చేస్తున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలతో తమ పార్టీలో అపోహలు రావొచ్చని.. అందుకే ఈ వివరణ అన్న సజ్జల.. కోటరీలో వైఎస్ జగన్ బందీ అయితే తక్కువ సమయంలోనే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేదా? అంటూ ప్రశ్నించారు. ఇవాళ (ఆదివారం) మీడియాతో మాట్లాడిన సజ్జల.. వైఎస్ జగన్‌పై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.‘‘పార్టీకి సుదీర్ఘకాలం నాయకత్వం వహించే సత్తా ఉన్న నేత వైఎస్ జగన్ ఒక్కరే. పేదల జీవితాల్లో వైఎస్ జగన్ మార్పు తీసుకొచ్చారు. పార్టీని వీడిన వారిపై మేము ఎప్పుడూ పెద్దగా విమర్శలు చేయలేదు. విజయసాయిరెడ్డి సొంత కారణాలతో పార్టీ నుంచి బయటకు వెళ్లారు. వైఎస్ జగన్‌పై దాడి చేసేందుకు కొత్త పాత్రలు తెరపైకి వస్తుంటూనే ఉంటారు. అలానే ఇప్పుడు విజయసాయిరెడ్డి అనే పాత్ర తెరపైకి వచ్చింది. వైఎస్ జగన్‌పై సాయిరెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజల దృష్టి తన మీద పడాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వైఎస్ జగన్ అన్ని మతాలపట్ల సమాన గౌరవం చూపిస్తారు’’ అని సజ్జల పేర్కొన్నారు.వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తే పబ్లిసిటీ వస్తుందని విజయసాయిరెడ్డి అనుకుంటున్నారు. వైఎస్ జగన్ చుట్టూ కోటరీ ఉందని అసత్య ప్రచారం చేస్తున్నారు. ప్రజల్ని తప్పుదారి పట్టించేలా విష ప్రచారం చేస్తున్నారు. పార్టీలో వైఎస్ జగన్ ఒక్కరే నాయకుడు.. మేమంతా కార్యకర్తలం. వైఎస్ జగన్‌పై ఎవరైనా విమర్శలు చేస్తే ఎల్లో మీడియా పండగ చేసుకుంటుంది. వైఎస్ జగన్.. విజయసాయిరెడ్డికి ఎంతో గౌరవం ఇచ్చారు. విజయసాయిరెడ్డిని ఆయన ఉన్నత స్థానంలో కూర్చొబెట్టారు’’ అని సజ్జల వివరించారు.‘‘గతంలో వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని విజయసాయిరెడ్డి అన్నారు. రాజీనామా సమయంలో ఎవరితోనూ సమస్యలు లేవని చెప్పారు. ఎంపీగా, జాతీయ కార్యదర్శిగా ఇలా ఎన్నో పదవులు పార్టీ ఇచ్చింది. వైఎస్సార్సీపీలో విజయసాయిరెడ్డికి వచ్చినన్ని పదవులు ఎవరికి రాలేదు’’ అని సజ్జల పేర్కొన్నారు.ఇదీ చదవండి: అంబటి రాంబాబుకు వైఎస్ జగన్ పరామర్శ ‘‘వైఎస్సార్సీపీకి కర్త, కర్మ, క్రియ ఒక్క వైఎస్ జగనే. పార్టీలో నంబర్ వన్, నంబర్ టూ అనే ప్రశ్నే లేదు. వైఎస్ జగన్ నంబర్ టూ, సజ్జల నంబర్ వన్ అన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్య అత్యంత అన్యాయం. వైఎస్ జగన్ లేని వైఎస్సార్సీపీకి అర్థమే లేదు. విజయసాయిరెడ్డిని పార్టీలో వెనక్కి లాగారన్న ఆరోపణకు ఆయనకు వచ్చిన పదవులే సమాధానం. రాజ్యసభ సభ్యత్వం, జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ఉత్తరాంధ్ర సమన్వయకర్త, అనుబంధ విభాగాల ఇన్చార్జ్ వంటి అత్యంత కీలక బాధ్యతలు ఆయనకే దక్కాయి. 2020 నుంచే తనను తగ్గించారని విజయసాయిరెడ్డి ఇప్పుడు చెబుతున్నారు. అలా అయితే 2022లో రెండోసారి రాజ్యసభకు ఎందుకు పంపారు?..పార్టీ నుంచి వెళ్లినప్పుడు ‘వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నాను. ఎవరిపైనా కోపం లేదు, సజ్జల వల్ల రాజీనామా చేయలేదు’ అని చెప్పిన విజయసాయిరెడ్డి ఇప్పుడు అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ మతమార్పిడులను ప్రోత్సహించారన్న విజయసాయిరెడ్డి ఆరోపణ దారుణం. వైఎస్ కుటుంబం అన్ని మతాలను ఎలా గౌరవించిందో దశాబ్దాలుగా దగ్గరగా ఉన్న విజయసాయిరెడ్డికి బాగా తెలుసు. సాయిరెడ్డిపై వైఎస్ జగన్‌కు ప్రత్యేకమైన అభిమానం, విశ్వాసం ఉండేది. తప్పుడు కేసుల్లో తనతో పాటు ఇబ్బందులు పడ్డారన్న భావనతో అత్యున్నత స్థాయి అవకాశాలు, బాధ్యతలు ఇచ్చారు...రాజకీయ పార్టీ పెట్టుకోవాలంటే విజయసాయిరెడ్డి స్వేచ్ఛగా పెట్టుకోవచ్చు. కానీ కొత్త రాజకీయ ప్రయాణానికి ప్రచారం కోసం వైఎస్ జగన్‌ను, వైఎస్సార్సీపీని టార్గెట్ చేయడం సరికాదు. ఇదే ధోరణి కొనసాగితే సమాధానం కూడా అంతే ఘాటుగా ఉంటుంది. 2024 ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినా వైఎస్సార్సీపీ సంస్థాగతంగా మళ్లీ పుంజుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలకైనా, 2029 సాధారణ ఎన్నికలకైనా, అంతకంటే ముందే ఎన్నికలు వచ్చినా పార్టీ సిద్ధం. వైఎస్సార్సీపీ ఎన్నికలకు భయపడటం లేదు. డెడ్, అబ్సెంట్, ఘోస్ట్ ఓట్లను తొలగించి ఓటర్ల జాబితా శుద్ధి చేసిన తర్వాత ఎన్నికలు జరపాలన్నదే పార్టీ డిమాండ్...వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి వైఎస్ జగన్ నాయకత్వం, వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేయడమే రాజకీయ ప్రత్యర్థుల ప్రధాన అజెండాగా మారింది. ప్రజల సమస్యలపై చర్చ జరగకుండా వైఎస్ జగన్ చుట్టూ వివాదాలు సృష్టించి అసలు అజెండాను పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర అనుకూల మీడియాతో పాటు సోషల్ మీడియాలోని ఫేక్ ఫ్యాక్టరీల ద్వారా జగన్‌పై నిరంతర విషప్రచారం జరుగుతోంది. ప్రజా సమస్యలు చర్చకు వస్తే చంద్రబాబు ప్రభుత్వానికి మైనస్ మార్కులే వస్తాయి. అందుకే వ్యక్తిగత వివాదాలను ముందుకు తెస్తున్నారు...వైఎస్ జగన్‌ను ఎవరో ఒక ‘కోటరీ’ నడిపిస్తోందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఎలాంటి పొత్తులు లేకుండా పార్టీని నిర్మించి, రికార్డు మెజారిటీతో అధికారంలోకి తీసుకువచ్చిన నాయకుడిని ఎవరో వెనక నుంచి నడిపిస్తున్నారనడం హాస్యాస్పదం. 2019లో భారీ విజయం, అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన చారిత్రక ఫలితాలు వైఎస్ జగన్ నాయకత్వ సామర్థ్యానికి నిదర్శనం. సంక్షేమం, అభివృద్ధి, పేదల జీవితాల్లో సమూల మార్పు అనే అజెండాతోనే వైఎస్సార్సీపీ పుట్టింది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సమస్యలు, సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి అనే అజెండాలో వైఎస్సార్సీపీకి మార్పు లేదు...వైఎస్ జగన్ ఇచ్చిన మాట, మేనిఫెస్టో, ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో రాజీ పడని నాయకత్వం. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు తొలుత కావాలనే స్పందించలేదు. ఆయన సృష్టించాలనుకున్న అజెండాలో పార్టీ పడకూడదన్నదే ఉద్దేశం. వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తే కొన్ని మీడియా సంస్థల్లో భారీ ప్రచారం వస్తుందనే పరిస్థితి ఏర్పడింది. వరుస ఆరోపణలతో పార్టీ కార్యకర్తల్లో కూడా అపోహలు వచ్చే పరిస్థితి రావడంతో స్పందించాల్సి వచ్చింది. విజయసాయిరెడ్డికి పార్టీలో అన్యాయం జరిగిందన్న వాదనకు వాస్తవాలు సరిపోవు. వైఎస్ జగన్ తర్వాత అత్యంత కీలక పదవులు, బాధ్యతలు పొందినవారిలో విజయసాయిరెడ్డి ముందువరుసలో ఉన్నారు. 2016లో రాజ్యసభ సభ్యత్వం, 2017లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యత...వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకత్వం వంటి అత్యంత కీలకమైన బాధ్యత కూడా విజయసాయిరెడ్డికే. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా క్యాబినెట్ స్థాయి హోదా కూడా విజయసాయిరెడ్డికే. 2020–22 మధ్య ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ సమన్వయకర్తగా బాధ్యత. పార్టీ అనుబంధ విభాగాల ఇన్చార్జ్గా కూడా కీలక బాధ్యత. 2022లో రెండోసారి రాజ్యసభ సభ్యత్వం. ఇన్ని అవకాశాలు పొందిన తర్వాత ‘నన్ను ఎదగనివ్వలేదు, వెనక్కి లాగారు’ అనడం వాస్తవాలకు విరుద్ధం. విజయసాయిరెడ్డికి ఇచ్చిన ప్రాధాన్యంపై పార్టీలో ఇతరులు ఎప్పుడూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. తప్పుడు కేసుల్లో వైఎస్ జగన్‌తో పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న సానుభూతి కూడా విజయసాయిరెడ్డిపై జగన్‌కు ఉండేది...వైఎస్ జగన్ ఇచ్చిన ప్రత్యేక ప్రాధాన్యాన్ని తన వ్యక్తిగత ప్రతిభ వల్లే వచ్చిందని విజయసాయిరెడ్డి భావించి ఉండవచ్చు. పార్టీ నుంచి వెళ్లినప్పుడు చెప్పిన కారణాలకు, ఇప్పుడు చెబుతున్న కారణాలకు పొంతన లేదు. ‘సజ్జల వల్ల నేను పార్టీని వీడాను’ అన్న మాట విజయసాయిరెడ్డి రాజీనామా సమయంలో ఎక్కడా చెప్పలేదు. తన ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరని గతంలో విజయసాయిరెడ్డే ప్రకటించారు. వైఎస్సార్సీపీలో ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్. మిగిలిన వారందరూ కార్యకర్తలే. వైఎస్ జగన్‌ను నంబర్ టూగా చూపించి మరొకరిని నంబర్ వన్‌గా ప్రచారం చేయడం రాజకీయ దురుద్దేశం. పార్టీ ఆవిర్భావం నుంచి విధానాలు, రాజకీయ నిర్ణయాలు, ఎన్నికల వ్యూహం అన్నింటిలో జగన్‌కే పూర్తి స్పష్టత...ఒక వ్యక్తి ఆలోచన, నిబద్ధత, ప్రజా అజెండా చుట్టూ రూపుదిద్దుకున్న పార్టీ వైఎస్సార్సీపీ. వైఎస్ జగన్ నాయకత్వం లేకుండా వైయస్సార్సీపీ అనే రాజకీయ వ్యవస్థకు అర్థమే లేదు. వైఎస్ జగన్ మతమార్పిడులను ప్రోత్సహించారన్న ఆరోపణ అత్యంత దారుణం. వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ అన్ని మతాల పట్ల గౌరవంతో వ్యవహరించిన విషయం విజయసాయిరెడ్డికి ప్రత్యక్షంగా తెలుసు. వైఎస్ హయాంలోనే తిరుమలలో అన్యమతస్తుల ఉద్యోగాల అంశంపై చర్యలు తీసుకున్నారు. నలభై ఏళ్లుగా వైఎస్ కుటుంబంతో పరిచయం ఉందని చెప్పుకునే వ్యక్తే ఇప్పుడు మతమార్పిడుల ఆరోపణ చేయడం అన్యాయం. నిజంగా వైఎస్ కుటుంబానికి మతమార్పిడుల అజెండా ఉంటే దశాబ్దాలుగా అత్యంత దగ్గరగా ఉన్న విజయసాయిరెడ్డికే మతమార్పిడి జరిగి ఉండేదిగా ..కొత్త రాజకీయ పార్టీ పెట్టుకోవడం విజయసాయిరెడ్డి ఇష్టం; ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఆ హక్కు ఉంది. కొత్త పార్టీకి మీడియా స్పేస్ కోసం జగన్‌ను తిట్టడం రాజకీయ విధానం కాకూడదు. వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తే ఫుల్పేజీలు, బ్యానర్ హెడ్డింగులు వస్తాయనే ఉద్దేశంతో రాజకీయాలు చేయడం సరికాదు. టీడీపీ అనుకూల మీడియాకు పనిముట్టుగా మారి వైఎస్సార్సీపీపై నిరంతరం దాడి చేస్తే ఇక మౌనంగా ఉండే పరిస్థితి ఉండదు. ఇప్పటివరకు ‘మన సాయిరెడ్డి’ అనే భావనతో సంయమనం పాటించాం.. ఇదే ధోరణి కొనసాగితే రాజకీయంగా వేరే విధంగా ట్రీట్ చేయాల్సి వస్తుంది...విజయసాయిరెడ్డి ఆరోపణల వల్ల వైఎస్ జగన్ రాజకీయ స్థాయి గానీ, వైఎస్సార్సీపీ బలం గానీ తగ్గవు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్సీపీ బలహీనపడలేదు; సంస్థాగతంగా తిరిగి పుంజుకుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తి సన్నద్ధత. 2029 ఎన్నికలకు పూర్తి సన్నద్ధత. అంతకంటే ముందే సాధారణ ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం. ఎన్నికలకు భయపడి కోర్టుకు వెళ్లారన్న ప్రచారం అవాస్తవం. ఓటర్ల జాబితాలో డెడ్, అబ్సెంట్, లేని ఓటర్లను గుర్తించి తొలగించే ప్రక్రియ పూర్తిచేయాలన్నదే డిమాండ్. లేని ఓట్లతో ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్యం కాదు. ఓటర్ల జాబితా శుద్ధి చేసి ఎన్నికలకు వెళ్లాలన్నది న్యాయమైన డిమాండ్...సజ్జల పాత్రపై వచ్చిన ఆరోపణలకు డైరెక్ట్ సమాధానం. పదవులు, హోదాలు వ్యక్తిగత కిరీటాలు కాదు; పార్టీ అప్పగించిన బాధ్యతలు మాత్రమే. వైఎస్ జగన్ విజన్‌కు అనుగుణంగా పనిచేసే అవకాశం రావడమే ముఖ్యమైనది. జర్నలిజం నుంచి రాజకీయాల్లోకి రావడం ముందుగా వేసుకున్న ప్రణాళిక కాదు. వైఎస్ మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ పరిణామాల్లో వైఎస్ జగన్‌తో కలిసి సాగిన ప్రయాణం నాది. 2014 వరకు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్‌గా పనిచేసి, అనంతరం పూర్తిస్థాయిలో రాజకీయ బాధ్యతల్లోకి ప్రవేశించా..క్షేత్రస్థాయిలో ప్రజలతో నేరుగా పనిచేసే నాయకులు, కార్యకర్తలకే మరింత గౌరవం, ప్రాధాన్యం ఇవ్వాలన్నది వైఖరి. ఢిల్లీలో పార్టీ వ్యవహారాలు చూసేవారికి అవసరమైన ప్రాధాన్యం, రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పనిచేసేవారికి వారి పాత్రకు తగిన ప్రాధాన్యం.. ఇదంతా టీమ్‌వర్క్. టీడీపీతో సంబంధాలు ఉన్నందుకే సజ్జలపై కేసులు లేవన్న విజయసాయిరెడ్డి ఆరోపణకు అర్థం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం జగన్‌పై కేసులు పెట్టిన సమయంలో విజయసాయిరెడ్డి రాజకీయాల్లోనే లేరు. ఆ సమయంలో నేను సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్‌గా ఉన్నాను..ఒక పార్టీలో ఉన్న వ్యక్తి మరో పార్టీతో ఒప్పందం చేసుకుని తనపై కేసులు రాకుండా చేసుకోగలడన్న వాదన అసంబద్ధం. విజయసాయిరెడ్డి చేస్తున్న తాజా ఆరోపణలు ఆయన రాజకీయంగా ఎటువైపు వెళ్తున్నారో వెల్లడిస్తున్నాయి. భౌతిక దాడి జరిగిందని నిజంగా భావిస్తే విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. 74 సార్లు అవమానించారని, దాడి జరిగిందని ఆరోపణలు చేస్తే వాటికి సంబంధించిన వివరాలను అధికారికంగా బయటపెట్టాలి. ప్రస్తుత ‘రెడ్‌బుక్’ పాలనలో పాత ఫిర్యాదులపైనా కేసులు పెడుతున్న పరిస్థితి ఉంది. విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం వెంటనే స్పందించే అవకాశం ఉంది’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
రైతులను ముంచడమే చంద్రబాబు ఉద్దేశమా?: కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని ఉపయోగించుకోవడంలో కూటమి పూర్తి స్థాయిలో విఫలం అయిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. శ్రీశైలంలో నుంచి సోమశిల, కండలేడు జలాశయాలకు ఎందుకు విడుదల చేయడం లేదు? అంటూ ప్రశ్నించారు.పోతిరెడ్డిపాడు హెడ్ రెగులేటర్ను ఉపయోగించి వెంటనే ఎందుకు నీరు వినియోగించడం లేదు. నెల్లూరు, రాయలసీమ రైతులను నిట్టనిలువుగా ముంచడమే చంద్రబాబు ఉద్దేశమా?. నెల్లూరులో జలాశయాలు అడుగంటి పోయే పరిస్థితి ఏర్పడింది. 71 శాతం వరకు పుష్కలమైన నీరు శ్రీశైలంలో వున్న నీటిని వినియోగించుకోకపోవడంలో మీ దురుద్దేశం ఏంటి? అంటూ కాకాణి నిలదీశారు.‘‘మరో వైపు తెలంగాణ శ్రీశైలం నీటి ఎడాపెడా దోచుకుంటున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏపీ రైతుల జీవితాలను తాకట్టు పెడుతున్నాడా..?. నీటి యాజమాన్య పద్దతులను ఏనాడు పాటించిన పాపాన పోలేదు. మొదటి పంటకే నీరు కరువైంది. నెల్లూరు జిల్లా రైతాంగం ఆందోళన చేపట్టే పరిస్థితులు తలెత్తాయి’ అని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: అలిగి వెళ్లిపోయిన దానం నాగేందర్ -
టీడీపీలో ‘లేఖ’లుకలు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార తెలుగుదేశం పార్టీ లో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. కొంతమంది పచ్చనేతలపై ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ప్రధానంగా ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, మంత్రాలయం టీడీపీ నేత తిక్కారెడ్డి మరికొందరు నేతలపై కృష్ణమ్మ లేఖాస్త్రం సంధించినట్లు ప్రచారం జరుగుతుండటం తెలిసిందే. వైరి వర్గానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా ఆమె అధిష్టానానికి లేఖ పంపినట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరగుతోంది. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే, ఆదోని టీడీపీ ఇన్చార్జ్జ్ మీనాక్షి నాయుడును టీడీపీ నుంచి బయటకు సాగనంపి ఆదోని ఇన్చార్జ్ బాధ్యతలు సొంతం చేసుకునేందుకే కృష్ణమ్మ ఫిర్యాదులకు తెరతీసినట్లు ‘పచ్చ’పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమె పాచిక పారి అధిష్టానం మాజీ ఎమ్మెల్యే మీనాక్షికి చెక్ పెట్టేందుకు సిద్ధమైనట్లు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలోనే ఆమె కోరిక నెరవేరి ఆదోని ఇన్చార్జ్ బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. ఇందుకు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసార«థి సైతం కూటమి తరఫున మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది. తిక్కారెడ్డిని వదిలించుకున్నట్లేనా? మంత్రాలయం టీడీపీ నేత తిక్కారెడ్డికి సైతం పచ్చపార్టీ ప్రాధాన్యత తగ్గించిన దూరంపెట్టినట్లు తెలుస్తోంది. ఈ నెల 25న జిల్లా ఇన్చార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు, విద్యుత్ శాఖామంత్రి గొట్టిపాటి రవికుమార్‌లు మంత్రాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సమావేశం టీడీపీ ఇన్చార్జ్ రాఘవేంద్రారెడ్డి స్వగృహంలో నిర్వహించడంతో ఆ సమావేశానికి తిక్కారెడ్డి వర్గీయు లు గైర్హాజరయ్యారు. అయినా అధిష్టా నం తిక్కారెడ్డిని బుజ్జగించే ప్రయత్నమేమీ చేయకపోవడం గమనార్హం. గత జూన్ నెలలో మంత్రాలయం వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తిక్కారెడ్డి సేవలు బయట ఉపయోగించుకుంటామంటూ వ్యాఖ్యానించారు. మంత్రాలయం రాజకీయాల నుంచి తిక్కారెడ్డిని తప్పించినట్లు చంద్రబాబు స్వయంగా సంకేతాలిచ్చారు. దీంతో తిక్కారెడ్డివర్గం భగ్గుమంటోంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామంటూ తిక్కారెడ్డి వర్గం మండిపడుతున్నట్లు సమాచారం. సత్తా చాటుతాం ఇప్పటికీ టీడీపీలో బలంగా ఉన్న మీనాక్షి నాయుడు పచ్చపార్టీతో అమీతుమీకి సిద్ధపడనున్నట్లు ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. మీనాక్షి నాయుడుని కాదని గుడిసె కృష్ణమ్మకు ఆదోని ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తే తమ సత్తా చాటుతామని మీనాక్షి నాయుడి వర్గం బహిరంగంగానే విరుచుకుపడుతున్నట్లు చర్చ జరుగుతోంది. మొత్తంగా జిల్లా టీడీపీలో వర్గవిబేధాలు తారస్థాయికి చేరడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఓటమికి కృష్ణమ్మ రిటర్న్ గిఫ్ట్ కృష్ణమ్మకు మీనాక్షి నాయుడుతో ఆది నుంచి విబేధాలు ఉన్నాయి. ఆదోని నుంచి ఐదుసార్లు పోటీ చేసిన మీనాక్షి నాయుడు 1991, 1999, 2009లలో ఎమ్మెల్యేగా ఎన్నికకాగా.. 2014, 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 2004 ఎన్నికల్లో మీనాక్షి నాయుడుని కాదని టీడీపీ అధిష్టానం గుడిసె కృష్ణమ్మను బరిలో నిలిపింది. టికెట్ ఇవ్వకపోవడంతో మీనాక్షి నాయుడు వర్గం రచ్చచేసింది. గొడవలు సృష్టించింది. అయినా బెదరక అధిష్టానం చివరకు కృష్ణమ్మనే అభ్యర్థిగా నిలిపింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వై.సాయిప్రసాదరెడ్డి చేతిలో ఆమె ఓటమి చవిచూశారు. మీనాక్షి నాయుడువర్గం కృష్ణమ్మ ఓటమికోసం పనిచేసినట్లు ప్రచారం జరిగింది. అప్పటి నుంచి ఆమె మీనాక్షితో పాటు ఆయన వర్గంపై ఆగ్రహంతో ఉంది. అవకాశం కోసం ఎదురు చూసిన కృష్ణమ్మ అధిష్టానంతో సయోధ్య నెరిపి ఇప్పడు మీనాక్షి నాయుడుకి చెక్ పెడుతున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చజరుగుతోంది.సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు జిల్లా అధ్యక్ష పదవి? గుడిసె కృష్ణమ్మ స్థానంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా సోమిశెట్టి వెంకటేశ్వర్లును నియమించనున్నట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సోమిశెట్టికి దాదాపుగా జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలంతా మద్దతుగా నిలిచినట్లు సమాచారం. కృష్ణమ్మ టీడీపీ జిల్లా అధ్యక్ష పదవికంటే ఆదోని ఇన్చార్జ్ పదవిపైనే ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్లు చర్చ జరుగుతోంది. మంత్రి లోకేష్ సూచనలతో వ్యూహం ప్రకారమే మీనాక్షి నాయుడుకు కృష్ణమ్మ చెక్ పెట్టినట్లు తెలుస్తోంది.చదవండి: ఒంటెత్తు పోకడలతో ఒంటరై! -
వైఎస్ జగన్ ప్రశ్నలకు టీడీపీ ఉక్కిరిబిక్కిరి..!
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న బాటింగ్‌ను టీడీపీ తట్టుకోలేకపోతోందన్న దిగులు ఎల్లో మీడియాకు బాగానే పట్టుకున్నట్లు ఉంది. అందుకే జగన్ మీడియా సమావేశంపై నేరుగా దాడి చేయడానికి ఈ తెలుగుదేశం మీడియా పడరాని అగచాట్లు పడుతోంది.జగన్ బుధవారం నాడు కరువు సమస్య, బీసీల రిజర్వేషన్లపై ప్రభుత్వ డ్రామా, గంజాయి ప్రదేశ్‌గా మారిన ఏపీ, వెలిగొండ క్రెడిట్ చోరీ మొదలైన అంశాలపై డిటైల్డ్‌గా తన మీడియా సమావేశంలో మాట్లాడారు. వీటన్నిటికి ఆయన ఆధారాలు, సాక్ష్యాలు చూపుతూ తన వాదన వినిపించారు. వాటికి నేరుగా సమాధానం ఇవ్వలేక, టీడీపీ నేతలు, మంత్రులు కప్పదాటు వైఖరి ప్రదర్శించారు. కాని ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి మాత్రం రాజును మించిన రాజభక్తితో, టీడీపీని కాపు కాసే బాధ్యత తమదే అన్నట్లుగా జగన్‌పై నేరుగా దాడి చేసింది. జగన్ చెప్పినవి అబద్దాలని రాసేసుకుంది. ఆ రకంగా జగన్‌పై బురద వేసి ఆ మీడియా సంతృప్తి చెందింది.జగన్ చెప్పిన విషయాలను పరిశీలిద్దాం.. ముందుగా కరువు ప్రస్తావనను జగన్ చేశారు. రాష్ట్రంలో కరువు ఉందన్నది వాస్తవమే కదా!స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ఆ విషయాన్ని చెబుతున్నారు కదా! అయినా పట్టిసీమ నుంచి నీరు వచ్చేసిందని చెప్పి ప్రకాశం బారేజీ వద్ద పూజలు చేసి నీళ్లు వదలి కృష్ణా డెల్టా కింద మంత్రులు నీరు ఇస్తున్నట్లు చెప్పింది అవాస్తవమా? ఆ సందర్భంలో వీరంతా ఏ రకంగా గప్పాలు పోయారో తెలియదా! ఆ విషయాలనే కదా జగన్ గుర్తు చేసింది.వాటికి ఆధారంగా ఎల్లో మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లను కూడా చూపించారు కదా! కాకపోతే ఎల్లో మీడియా, టీడీపీ నేతలు కరువు అన్న పదాన్ని వాడకుండా ఎల్‌నినో అని చెప్పుకుని జనాన్ని మభ్య పెట్టాలని చూస్తున్నారు. మంత్రుల మాటలు నమ్మి పంటలు వేసుకున్న రైతులు నష్టపోతున్నారని జగన్ తెలిపారు. ఇందులో తప్పేముంది? అబద్దం ఏమి ఉంది. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ మొదలైన ప్రాంతాలలో నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్న వార్తలు ఎల్లో మీడియాలో కూడా వచ్చాయి కదా!రైతులను, కరువు బారిన ప్రజలను ప్రభుత్వం ఆదుకోవడం లేదని జగన్ విమర్శించారు. ప్రభుత్వం ఇంతవరకు కరువును ఎదుర్కోవడానికి తీసుకుంటున్న నిర్దిష్ట చర్యలేమిటి? ఇంకా ప్లానింగ్‌లోనే ఉన్నామని కదా ప్రభుత్వ పెద్దలు చెబుతున్నది. పలు చోట్ల ముఖ్యంగా రాయలసీమ నుంచి వలసలు ఎలా సాగుతున్నాయో పత్రికలలో వార్తలు వచ్చాయి కదా!ఆగస్టు 11నాటికి శైశైలంలో 879 అడుగుల నీటి మట్టం వచ్చినా పోతిరెడ్డిపాడు నుంచి నీరు ఎందుకు ఇవ్వలేదన్నది జగన్ ప్రశ్న. రైతులకు ఇవ్వకుండా విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వాడేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు వంటి పాలకులు ఉంటారనే, తాము రాయలసీమ లిఫ్ట్ఇరిగేషన్ స్కీమ్‌ను ఆరంభించామని జగన్ తెలిపారు. ఇది వాస్తవమే కదా! ఈ స్కీమ్‌ను జగన్ వేగంగా ముందుకు తీసుకువెళుతున్న సమయంలో ప్రభుత్వం మారడం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారని చంద్రబాబు ఈ స్కీమ్‌ను నిలిపివేయడం కరెక్టే కదా! రేవంత్ ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పినా చంద్రబాబు ఖండించలేకపోయారే. మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులు జగన్ చేసిన విమర్శలకు జవాబు ఇస్తూ ప్రతి విమర్శలు చేశారే కాని, ప్రభుత్వం ఇంతవరకు ఏ చర్యలు తీసుకున్నది వివరించినట్లు కనిపించలేదు.జగన్ టైమ్‌లో రైతులకు ఉచిత భీమా అమలు చేస్తే ఈ ప్రభుత్వం దానిని ఎందుకు కొనసాగించలేకపోయింది? రామానాయుడు మాత్రం కరువు నేపథ్యంలో తాగునీటికే ప్రాధాన్యం ఇస్తున్నామని, ఆ తర్వాత ఆరుతడి పంటలకు నీరు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చామని అన్నారు. కరువు సమస్య కారణంగా గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక పరిస్థితులు గడ్డుగా మారాయి. వాటిని ఎలా నివారిస్తారన్న జగన్ ప్రశ్నకు బదులు ఇచ్చినట్లు లేదు.జగన్ టైమ్‌లో వివిధ స్కీమ్‌ల ద్వారా గ్రామీణ ప్రాంతాలవారికి ఆర్థిక సాయం అందించడంతో చేతిలో డబ్బులు ఆడాయి. వ్యాపారాలు కూడా సాగాయని ఆర్థిక నిపుణులు కూడా అంగీకరించారు. జగన్ టైమ్‌లో రెండేళ్లపాటు కరోనా సంక్షోభం వస్తే ఈ ఎల్లో మీడియా ఎంత నీచమైన రాతలు రాసిందో మర్చిపోయి ఉండవచ్చు. ప్రపంచం అంతటా ఏర్పడినట్లే ఏపీలో కూడా అప్పట్లో ఆదాయం పూర్తిగా పడిపోయింది. కేంద్రం సూచనల ప్రకారం రుణం తీసుకోవలసి వచ్చింది. మిగిలిన రాష్ట్రాలకన్నా మెరుగ్గా కరోనాను జగన్ ప్రభుత్వం ఎదుర్కుంది. అయినా జగన్ ఏపీని శ్రీలంక చేసేస్తున్నారని ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాసిందా? లేదా? ఉద్యోగులకు జీతాలు ఆలస్యం అయితే కోర్టులలో కేసులు వేయించి వడ్డీతో సహా జీతాలు చెల్లించాలని ఆదేశాలు తెచ్చింది ఎవరో తెలియదా!తాను అధికారంలో ఉంటే కరోనా వచ్చేదా తమ్ముళ్లు అని చంద్రబాబు అంటే అదేమిటని ప్రశ్నించకపోగా, ఎల్లో మీడియా ఔను, ఔను అని భజంత్రి వాయించాయే. ఇప్పుడు కరువు సమస్య వల్ల ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడుతుంటే వారిని మభ్య పెట్టడానికి ఎల్లో మీడియా ఎల్‌నినో, యుద్దం అంటూ సాకులు ప్రచారం చేస్తోంది. వెలిగొండ ప్రాజెక్టు క్రెడిట్ గురించి కూడా ఎల్లో మీడియా తనదైన శైలిలో టీడీపీ ఖాతాలో వేయడానికి తహతహలాడుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవ లేకపోతే ఈనాటికి కూడా ఈ ప్రాజెక్టు వాస్తవరూపం దాల్చేది కాదన్నది పచ్చి నిజం.చదవండి: బాబూ.. అమరావతి కథనం వెనుక అసలు కథేంటి?జగన్ రెండేళ్ల క్రితం సొరంగాలకు ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా చేసిన ప్రసంగంలో ,నిర్వాసితులకు పరిహారం చెల్లించి రిజర్వాయిర్‌లోకి నీరు తరలిస్తామని ప్రకటించారు. ఈలోగా ప్రభుత్వం మారింది. రెండేళ్ల క్రితం ఈ పని పూర్తి చేయకుండా ఆలస్యం చేసింది కూటమి ప్రభుత్వం కాదా! వైఎస్సార్సీపీ, జగన్ కలిసి సుమారు 31 కిలోమీటర్ల మేర సొరంగాలు తవ్విస్తే, చంద్రబాబు హయాంలో 6.68 కిలోమీటర్ల మేర మాత్రమే పూర్తి చేశారన్నది నిజమా? కాదా? ఈ క్రెడిట్లో ఎవరి వాటా ఎంతో చెబితే తప్పుకాదు. మొత్తం క్రెడిట్‌ను చోరీ చేయాలని చూస్తేనే ఇబ్బంది. ఇక ఏపీ గంజాయి ప్రదేశ్‌గా మారిందని జగన్ ఆరోపణ.ఈ మధ్యనే ఏకంగా పోలీసుల వాహనంలోనే గంజాయి తరలించిన వార్తను ఎల్లో మీడియా మర్చిపోయిందా? నిత్యం ఎక్కడో చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. వంద రోజుల్లో గంజాయి నిరోదించి చూపుతామని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లు ఎన్నికల ముందు చేసిన ప్రగల్బాలను జగన్ ప్రస్తావించారు. ఆ ప్రకారం వారు చేయలేకపోయిన విషయాన్ని జగన్ ఎండగట్టారు. ఇక బీసీల రిజర్వేషన్ల అంశాన్ని కూడా ఎల్లో మీడియా నిస్సిగ్గుగా భుజాన వేసుకుని అసత్యాలు ప్రచారం చేస్తోంది.ఇదీ చదవండి: బాబూ.. డీస్సీ, ఏపీపీఎస్సీపై సమాధానమేది?గతంలో జగన్ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై జీఓ ఇస్తే తప్పుపట్టారా?లేదా?దానిపై టీడీపీ నేతే కోర్టుకు వెళ్లారా?లేదా?ఆ తర్వాత అది ఆగిపోతే జగన్ పార్టీపరంగా ఆయా పదవులను ఏభై శాతం పైగా బీసీలకు ఇచ్చారే! ఆ విషయాన్ని ఆయన లెక్కలతో సహా చూపించారు. మరి చంద్రబాబు మళ్లీ ఇప్పుడు జీఓ ఇచ్చి రిజర్వేషన్లు కల్పిస్తామని చెబితే దానికి కోర్టు ఆమోదం తెలుపుతుందా?పార్లమెంటులో సంబంధిత చట్ట సవరణ చేయిస్తామని ఎందుకు టీడీపీ ప్రకటించలేదు?ఇక వైఎస్సార్సీపీ బీసీ నేతలపై కేసులు అక్రమమా? కాదా? అన్నది అందరికి తెలిసిందే. చంద్రబాబు నాయుడుతో సహా పలువురు టీడీపీ నేతలపై అప్పట్లో అవినీతి కేసులు వస్తే ఇదే ఎల్లో మీడియా గుండెలు బాదుకుని గోల, గోల చేసిందే. టీడీపీ ముఖ్యనేత పీఏ ఇంటిపై ఆదాయపన్ను శాఖ దాడి చేసి రెండువేల కోట్ల అక్రమాలను కనుగొన్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం బహిరంగ రహస్యమే కదా! ఆ కేసు ఏమైందో చెప్పి, ఆ తర్వాత వైఎస్సార్సీపీపై ఎన్ని ఆరోపణలు చేసినా ఆలోచించవచ్చు. ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు అన్నట్లు టీడీపీతో పాటు ఎల్లో మీడియా ప్రవర్తిస్తున్న విషయాన్ని జనం గమనించరా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఒంటెత్తు పోకడలతో ఒంటరై!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: శింగనమల నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య వర్గ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఆ పార్టీ నియోజకవర్గ స్థాయి నేతలకు, ఎమ్మెల్యే బండారు శ్రావణికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. నియోజకవర్గ కేడర్‌కు, ఎమ్మెల్యేకు ఏ మాత్రమూ పొసగడం లేదు. శ్రావణి తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని కేడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. దీంతో తన నియోజకవర్గంపై ఎమ్మెల్యే బండారు శ్రావణి పూర్తిగా పట్టును కోల్పోయారు. అన్నిటికీ కమీషన్లే! నియోజకవర్గంలో ఎవరికి ఏ పని కావాలన్నా, పోస్టింగ్‌లు ఇవ్వాలన్నా ప్రజాప్రతినిధికి కమీషన్లు ఇచ్చుకోవాల్సిందే. సొంత పార్టీ కార్యకర్తల పనులు చేయాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందేనని కరాఖండీగా చెప్పడంతో ఎమ్మెల్యే వ్యవహారశైలిపై కేడర్ భగ్గుమనే పరిస్థితి నెలకొంది. రేషన్ డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, యానిమేటర్లు ఇలా చిన్న చిన్న వాటిని కూడా ద్వితీయ శ్రేణి నాయకులు చేయించుకోలేకపోవడంతో ఎమ్మెల్యేకు వారంతా వ్యతిరేక వర్గంగా ఏర్పడ్డారు. టూ మెన్ కమిటీ నియామకం శ్రావణి మొదటి సారి 2019లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆమెకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో ఓ వర్గం ఏర్పాటైంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆమెకు సహకరించేది లేదంటూ ఆ వర్గం చెబుతూ వచ్చింది. అయినా కొందరి ఆశీస్సులతో బండారు శ్రావణి 2024లో టికెట్ తెచ్చుకోగలిగారు. అయితే, ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆమె ఒంటెత్తు పోకడలను టీడీపీ సీనియర్ నేతలు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ పూర్తిగా అభాసుపాలయ్యే పరిస్థితి దాపురించింది. ఆ పార్టీ అధిష్టానం నష్టనివారణ చర్యల్లో భాగంగా నియోజకవర్గంలో కేశవరెడ్డి, ఆలం నరసానాయుడులతో టూమెన్ కమిటీని నియమించింది. సీఎం పర్యటన వాయిదా! ఈ నెల మూడో వారంలో సీఎం చంద్రబాబు శింగనమల నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది. సీఎం పర్యటనపై నియోజకవర్గ నేతలు సమావేశమై చర్చించారు. వేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలి.. సీఎం దృష్టికి తీసుకెళ్లాల్సిన సమస్యలపై చర్చించారు. అయితే వేదిక ఏర్పాటు అంశంపై ఎమ్మెల్యేకు, నియోజకవర్గ నేతలకు మధ్య సఖ్యత కుదరలేదు.మొదట నార్పలలో వేదిక ఏర్పాటు చేయాలని నిర్ణయించినా, తర్వాత బుక్కరాయసముద్రంలో ఏర్పాటు చేశారు. దీనిపైనా ఏకాభిప్రాయం వ్యక్తం కాకపోవడంతో చివరికి సీఎం పర్యటనే వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతోంది. చేతులెత్తేసిన ఎమ్మెల్యే శ్రావణి టీడీపీ కేడర్ పూర్తిగా ఎమ్మెల్యేకు సహకరించే పరిస్థితి కరువైంది. ఆమె సూచించిన ఏ ఒక్కరికీ పార్టీ పరంగా పదవులు దక్కలేదు. పోస్టింగుల విషయంలోనూ ఆమె మాటను ఉన్నతాధికారులు లెక్క చేయడం లేదు. ఎమ్మెల్యే వసూళ్లపై అధిష్టానికి భారీగా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో నియోజకవర్గంపై బండారు శ్రావణి పూర్తిగా పట్టును కోల్పోయారు. ఆమె మాటను ఏ ఒక్క లీడరూ లెక్క చేయకపోవడంతో విధిలేని పరిస్థితుల్లోనే పక్క నియోజకవర్గ నేతను అరువు తెచ్చుకున్నారని సొంత పార్టీ కేడరే వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు. రండి సారూ..ఇటీవల పుట్లూరు, యల్లనూరు మండలాల ద్వితీయ శ్రేణి నేతలంతా ఎమ్మెల్యేను లెక్క చేయడంలేదు. దీంతో పరిస్థితిని చక్కదిద్దాలని తాడిపత్రి మున్సిపల్ మాజీ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఎమ్మెల్యే శ్రావణి కోరినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో జేసీ పక్క నియోజకవర్గంలో గురువారం కలియతిరిగారు. జేసీ అండ ఉందని, ఇకపై ఎవరైనా తమ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రాజకీయం చేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని శ్రావణి వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. రాజకీయ నేతలెవరూ తమ నియోజకవర్గంలోకి పక్క నియోజకవర్గం వారిని అడుగు పెట్టనివ్వరు. ఇక్కడ మాత్రం ఎమ్మెల్యేనే స్వయంగా పక్క నియోజకవర్గ నేతను బతిమాలుకోవడం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. చదవండి: కమిషనర్ ఔట్.. పీఆర్సీ లేదు.. ఉద్యోగులకు వెన్నుపోటు! -
‘100 రోజుల్లో గంజాయి నిర్మూలిస్తానన్న హోంమంత్రి ఎక్కడ?’
సాక్షి, తాడేపల్లి : ఏపీ గంజాయి స్టేట్‌గా మారిపోయిందని.. పోలీసులతోనే గంజాయిని రవాణా చేసే దుస్థితికి తెచ్చారంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగ మల్లీశ్వరి మండిపడ్డారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వంద రోజుల్లో గంజాయి నిర్మూలిస్తామన్న హోంమంత్రి ఎక్కడ ఉన్నారంటూ నిలదీశారు. లిక్విడ్ రూపంలో కూడా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. ఇప్పటికే 70 లక్షల లీటర్ల లిక్విడ్ పట్టుబడింది. గంజాయి డాన్ సోహెల్‌ని పోలీసుల నుంచి తప్పించిందెవరు?’’ అంటూ నాగ మల్లీశ్వరి ప్రశ్నించారు.‘‘హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే విచ్చలవిడిగా గంజాయి దొరుకుతోంది. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనూ గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. హోంమంత్రితో పోలీసులతో కూడా తప్పు చేయిస్తున్నారు. అత్యంత అసమర్థ మంత్రిగా హోంమంత్రి చరిత్రలో నిలిచిపోయారు. వైఎస్ జగన్ హయాంలో గంజాయి సాగుపై యుద్ధం చేశారు. ఆపరేషన్ పరివర్తన్ పేరుతో పెద్ద ఎత్తున చైతన్యం తెచ్చారు. ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు నడిపించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మళ్ళీ గంజాయి విచ్చలవిడిగా సాగవుతోంది’’ అంటూ మలీశ్వరి ధ్వజమెత్తారు.‘‘గంజాయిని నిర్మూలించామంటున్న హోంమంత్రి మాతో చర్చకు రాగలరా?. హోంమంత్రికి నిత్యం వైఎస్ జగన్‌పై విషం చిమ్మటం తప్ప మరో పనిలేదు. సోహెల్ పోలీస్ స్టేషన్ నుండి పారిపోతే ఇప్పటి వరకు పట్టుకోలేదు. ఇదీ హోంమంత్రి పనితీరు. హోంమంత్రి అనిత దగ్గరకు ఫైల్ వెళ్తే ఐదు రోజులపాటు చూడరు. ఇది ప్రభుత్వమే చేయించుకున్న సర్వేలో తేలిన అంశం. ఇలాంటి వారి పాలనలో రాష్ట్రం ఇంకేం బాగుపడుతుంది?’’ అంటూ నాగ మల్లీశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: పంచదార్ల కొండపై వైఎస్సార్సీపీ పోరాటానికి దిగొచ్చిన ప్రభుత్వం -
దొంగ ఎవరో తెలిసి కూడా.. పూజారుల్ని బలిచేస్తున్నారా?
సాక్షి, గుంటూరు: పొన్నూరు ఆలయంలో అమ్మవారి మంగళసూత్రం మాయం ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు దొంగల్ని పట్టుకోకుండా.. పూజారులను సస్పెండ్ చేశారంటూ మండిపడుతున్నారు. పైగా కొత్త మంగళసూత్రం సమర్పించే విషయంలోనూ స్పష్టత లేకుండా పోయింది. ఈ క్రమంలో.. గురువారం అమ్మవారికి తానే కొత్త మంగళసూత్రం సమర్పించారు పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంఛార్జి అంబటి మురళి. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది రాజకీయాలు మాట్లాడాల్సిన సమయం కాదు. కానీ, తప్పడం లేదు. 14వ తేదీన అమ్మవారి మంగళసూత్రం పోయింది. మంగళసూత్రం లేకుండానే వరలక్ష్మి వ్రతం చేయించారు. ఇది అశుభం. మంగళసూత్రాన్ని ఎలా సమకూరుస్తారో ప్రభుత్వం ప్రకటించలేదు. దేవదాయ శాఖ, రెవెన్యూ యంత్రాంగం ఇప్పటివరకూ స్పందించలేదు. ప్రభుత్వం స్పందించడం లేదు. అమ్మవారి మెడలో పూలదండలు తీసే సమయంలో మంగళసూత్రం పోయిందని కబుర్లు చెబుతున్నారు. మంగళసూత్రాన్ని చేయించి గుట్టుచప్పుడు కాకుండా అమ్మవారికి వేయాలని ఆలయ అధికారి బసవ శంకర్ చూశాడు. అలాంటప్పుడు ఈవో, సీనియర్ అసిస్టెంట్ లపై చర్యలు ఎందుకు తీసుకోలేదు. అమాయకులైన పూజారులనే ఎందుకు సస్పెండ్ చేశారు?.. దొంగ ఎవరో తెలుసు... కావాలనే బయట పెట్టలేదు. ఇవాళ మంగళసూత్రాలు ఇచ్చాం. నాను తాడు సెప్టెంబర్ 3వ తేదిన అందిస్తాం అని అంబటి మురళి పేర్కొన్నారు. పరువు నష్టం నోటీసులపై స్పందనఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర రాజ్యాంగేతర శక్తిగా మారాడు. నాపై పరువు నష్టం దావా వేశాడు. రూ. 5 కోట్లకు నోటీసులు పంపించారు. ఆయన రాజకీయ జీవితాన్ని సెకనుకు ఐదు పైసలుగా లెక్క కట్టాడు. ఆ ఐదు పైసలు నేనే ఇస్తాను. పాపాల భైరవుణ్ణి శిక్షించవా తల్లి అని అమ్మవారిని అంబటి మురళి వేడుకున్నారు. పూజారుల ఉసురు తగులుతుంది: ఆరే శ్యామలమంగళసూత్ర సమర్పణ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరే శ్యామల అన్నారు. ‘‘అర్చకులను దొంగతనంలో భాగస్వాములను చేస్తున్నారు. దొంగతనం జరిగిన విషయం కూడా ఎమ్మెల్యేకు తెలియదా?. పూజారుల ఉసురు తగులుతుంది. దొంగను పట్టుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వపైనే ఉంది’’ అని అన్నారామె. -
బాబూ.. అమరావతి కథనం వెనుక అసలు కథేంటి?
ఏపీలో ప్రస్తుత సచివాలయంలో సుమారు మూడువేల మంది పనిచేస్తుంటారు. పోనీ ఏ రకంగా చూసినా ఐదువేల మంది మించి ఉండరు. కాని అమరావతి రాజధానిలో సచివాలయం కోసం చేపట్టిన భారీ టవర్లలో 16వేలమంది పని చేయవచ్చట. అంత పెద్ద టవర్లు ఏం చేస్తారు? ఈ సందేహం ఏ సామాన్యుడికైనా వస్తుంది? కాని అంతర్జాతీయ మీడియాగా పేరొందిన న్యూయార్క్ టైమ్స్‌కు రాకపోవడమే విచిత్రం అనిపిస్తుంది.ఈ మీడియా అమరావతిపై ప్రత్యేక వ్యాసం ప్రచురించింది. దానిని తెలుగుదేశం పత్రికలు ప్రముఖంగా ప్రచారంలోకి తెచ్చాయి. ఆంధ్రజ్యోతి అయితే అమరావతి.. అనితర సాధ్యం అన్న శీర్షికన ఈ వ్యాస కథనాన్ని అందించింది. ఒక అంతర్జాతీయ మీడియా అమరావతికి సంబంధించి మంచి, చెడు లేదా లాభ, నష్టాలు రెండూ ఇస్తే ఎవరూ తప్పు పట్టనక్కర్లేదు. కానీ, ఆ వ్యాసం చదివితే ఇంత పెద్ద మీడియా సంస్థలు కూడా ఏకపక్షంగా కథనాలు ఇస్తాయా? అమెరికాలో కూడా పత్రికా ప్రమాణాలు దిగజారి ఉంటాయా అన్న సందేహం కలుగుతుంది.మోస్ట్ లివబుల్ సిటీ అమరావతి అని ఈ వ్యాసానికి శీర్షిక పెట్టారు. వినడానికి ఎంత బాగుంది. అమరావతిలో నివసిస్తే ఓ పాతికేళ్లు అధికంగా బతకవచ్చని చంద్రబాబు తన ఉపన్యాసాలలో చెబుతున్నారు. అది నిజమే అయితే అంతా సంతోషిస్తారు. కానీ, ఈ వ్యాసం వచ్చిన కొద్ది రోజులకే, చంద్రబాబు స్పీచ్ ఇచ్చిన కొన్నాళ్లకే జరిగిన శాసనసభ సమావేశాలలో ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే టీడీపీ ఎమ్మెల్యే శ్రావణకుమార్ ఏమి చెప్పారో తెలుసా! అమరావతిలో గ్రామాల ప్రజలు నానా పాట్లు పడుతున్నారని, సరైన రోడ్లు లేవని, ఇతర వసతులు లేవని, రకరకాల సమస్యలతో సతమతమవుతున్నారని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం ఉండడం లేదని ఆయన వాపోయారని వార్తలు వచ్చాయి. మంత్రులు నిధులు కేటాయించినా పనులు జరగడం లేదని ఆయన వాపోయారు.న్యూయార్క్ టైమ్స్ మీడియా ప్రతినిధులు నిజంగా ఈ ప్రాంతాన్ని సందర్శించే రాశారా? లేక ప్రభుత్వానికి సంబంధించి ఎవరైనా రాసిచ్చిన దానిని ముద్రించారా అన్నదానిపై కొందరికి డౌట్లు ఉన్నాయి. కారణం ఏమిటంటే ఏ వ్యాసం రాసినా పాజిటివ్, నెగిటివ్ రెండూ ఉంటాయి. కానీ, ఇందులో పూర్తిగా ఏకపక్షంగా పాజిటివ్ వ్యాఖ్యలే కనిపిస్తాయి. ఇది పెయిడ్ ఆర్టికిల్ వంటిదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. దానిని కూడా పట్టించుకోనవసరం లేదు. అయితే ఈ వ్యాసకర్తలు అనుసరించాల్సిన ప్రమాణిక సూత్రాలు పాటించినట్లు కనిపించకపోవడమే అసలు సమస్య.న్యూయార్క్ టైమ్స్ విలేకరులు అమరావతి సందర్శించడం చంద్రబాబుకు లేదా మంత్రి నారాయణకు తెలియకుండా జరుగుతుందా? పైగా అంతర్జాతీయ మీడియా వారు వస్తుంటే చంద్రబాబు కలవకపోవడమన్నది నిజంగా జరిగితే ఆశ్చర్యమే. ఎందుకంటే మామూలు స్థానిక మీడియాకే విశేష ప్రాధాన్యత ఇచ్చే ముఖ్యమంత్రి అంతర్జాతీయ మీడియా వస్తుంటే ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉంటారా! అమరావతిని ఫలానా పెద్ద మీడియా వారు చూసి వెళ్లారన్న వార్తనే హడావుడి చేసి ఉండేవారు కదా! వారు మంత్రి లోకేష్‌తో మాత్రమే ఎందుకు మాట్లాడారో తెలియదు. సంబంధిత మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను సంప్రదించలేదా? నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయన్నంత వరకు ఆక్షేపణ లేదు. కానీ, వారు అమరావతి గురించి మరీ అతిగా పొగిడారా అన్న అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.ఏపీకి రాజధాని నిర్మాణాన్ని ఎవరూ కాదనడం లేదు. అవసరమైన భవనాలు కట్టుకోవచ్చు. కాని ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు?వారికి ఎంత విస్తీర్ణంలో భవనాలు కావాలి? ఎంత నిర్మిస్తున్నారు? అలా ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉంటుంది కదా! అలా కాకుండా అవసరాన్ని మించి నాలుగైదు రెట్ల అదనంగా నిర్మాణం చేపట్టిన తీరును ప్రశ్నించాలి కదా! అమెరికాలోని కాపిటల్ హిల్స్, ఇతర ప్రభుత్వ భవనాలు ఉన్న విస్తీర్ణం గురించి గూగుల్‌లో అడిగితే వచ్చిన సమాధానం ఇది.. Capitol Hill is a historic residential neighborhood and the legislative center of the United States government in Washington, D.C., covering just under 2 square miles (5 square kilometers).ఇవి కూడా చదవండి: రేవంత్ టూర్‌కు ‘నో’ పర్మిషన్.. కేంద్రం మరో కోణం ఇదేనా?కాపిటల్ హిల్ అనేది వాషింగ్టన్, డీ.సీ.లోని ఒక ప్రాంతం, ఇది ఈశాన్య మరియు ఆగ్నేయ చతుర్భుజాలలో విస్తరించి ఉంది. బహుశా అన్ని ప్రభుత్వ ఆఫీస్‌లు ఇందులో ఉన్నాయో లేదో తెలియదు. కాని అంత పెద్ద రాజధానిలో కేవలం 5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే ఈ భవనాలు ఉంటే, భారత్‌లో ఒక చిన్న రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రభుత్వ భవనాల నిర్మాణం జరుగుతోంది.మరో ఉదాహరణ చూద్దాం. అమెరికాలో అతి పెద్దదైన రాష్ట్రాలలో ఒకటైన కాలిఫోర్నియా రాజధాని సాక్రమెంటో అనే చోట ఉంది. అక్కడ కేవలం 39 ఎకరాలలో పది బ్లాక్‌లలో ఆఫీస్‌లు ఉన్నాయట. అసెంబ్లీ, ఇతర ప్రభుత్వ ఆఫీస్‌లు అన్నీ కలిపి 4,72,600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయని గూగుల్ చెబుతోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అన్ని ఆఫీస్‌లు కలిపి 300 ఎకరాలలోనే ఉన్నాయన్నది ఒక అంచనా. అమరావతిలో ఏభై లక్షలు, అరవై లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు ఎందుకు నిర్మిస్తున్నారు? ఈ విషయాలేవీ న్యూయార్క్ టైమ్స్ ప్రతినిధులకు తెలియవా? అంటే ఏమి చెబుతాం. అమరావతిలో కేవలం సచివాలయానికే, పరిపాలన కార్యాలయాలకు ఐదు టవర్లు, అతి పెద్ద టవర్‌పై అంతస్తులో సీఎం ఆఫీస్, ఆ పైన హెలిపాడ్ ఉంటాయట.అప్పుల కుప్పగా ఉన్న ఏపీకి ఇంత ఆర్భాటం, అట్టహాసం అవసరమా? దానివల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నలు వేశారో, లేదో తెలియదు. క్వాంటమ్ వ్యాలీ గురించి, ఇతరత్రా చంద్రబాబు చేస్తున్న కృషి గురించి వివరించారు. యధా ప్రకారం లోకేష్ విభజన సమయంలో కట్టుబట్టలతో ఏపీకి తరలివచ్చేశామని కూడా వారికి చెప్పేశారట. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను వదలి ఎందుకు అలా చేయవలసి వచ్చిందన్న ప్రశ్న సహజంగా జర్నలిస్టులకు వస్తుంది. మరి వీరికి ఎందుకు రాలేదో అర్థం కాదు.ఈ అమరావతి భవనాల నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది? ఏభై వేల కోట్ల అప్పు ఎందుకు సమీకరించారు. ఇంకా మరో 1.75 లక్షల ఎకరాల భూమి సేకరణ అవసరం ఏమిటి? ఆ భూములలో మౌలిక వసతుల కల్పనకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి? ఈ అప్పులు ప్రజలపై భారం కాదా? భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు ఎప్పటికి ఇస్తారు? వారికి అవసరమైన మౌలిక వసతులకు అయ్యే వ్యయం ఎంత? పూలింగ్‌కు భూములు ఇవ్వని రైతులను వేధించారన్నది నిజమా? కాదా? రైతుల గోడును విన్నారా? లేదా? మూడు పంటలు పండే భూములను ఇలా చేయడం పర్యావరణ విధ్వంసం అవుతుందా? కాదా? వరదపీడిత ప్రాంతంలో రాజధాని ఎలా కడుతున్నారు? ఆ వరదను ఎత్తిపోయడానికి లిఫ్ట్‌లు కట్టడమేమిటి? ఇలాంటి అనేక సందేహాలను వారు ముఖ్యమంత్రి లేదా కీలక మంత్రితో మాట్లాడి నివృత్తి చేసుకుని అన్ని విశేషాలతో వ్యాసం రాసి ఉంటే దానికి విలువ వచ్చేది కదా!అలాకాకపోతే తెలుగుదేశం మీడియాకు, ఈ అంతర్జాతీయ మీడియాకు తేడా ఏముంటుందని కొందరు ఢిల్లీ జర్నలిస్టులు తమ కామెంట్లలో ప్రశ్నించారట. అది న్యాయార్క్ టైమ్స్ మీడియాకు శోభనిస్తుందా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాతఇవి కూడా చదవండి: మార్గదర్శి కేసు: తప్పు.. తప్పు కాకుండా పోతుందా? -
మా పాలన.. మేం కట్టం చలానా!
సాక్షి, కడప: కడప శాసన సభ్యురాలు ఆర్. మాధవిరెడ్డి జన్మదినం సందర్భంగా కడప నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కడ చూసినా శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. అయితే ఆమె అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఏ ఒక్కరూ కార్పొరేషన్‌కు ఒక్క రూపాయి చెల్లించకుండా, అను మతి తీసుకోకుండా ఆ ఫ్లెక్సీలను ఊరంతా ఏర్పాటు చేశారు. నిబంధనలు పాటించి నగరపాలక సంస్థ అనుమతి పొంది, చలానాలను చెల్లించి ఉంటే కార్పొరేషన్‌కు ఆదాయం సమకూరేది.. కానీ అందరూ అధికార దర్పంతో ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారే తప్ప నగరపాలక సంస్థకు చిల్లిగవ్వ కూడా చెల్లించలేదు. ఇతర పార్టీల వారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఆగమేఘాలపై అక్కడ వాలి పోయి వాటిని తొలగించే టౌన్‌ప్లానింగ్ అధికారు లు, సిబ్బంది.. ఈ ఫ్లెక్సీలపై ఉదాసీనంగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నేతలకు కార్పొరేషన్‌లోని ఇద్దరు ఉన్నతాధికారుల అండ పుష్కలంగా ఉండటం వల్లే ఇలా అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి.చలానా ముద్రించి వైఎస్సార్సీపీనేత వేసిన ప్లెక్సీ రూల్స్.. గీల్స్ జాన్తానైసాధారణంగా ఎవరైనా నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే కార్పొరేషన్‌కు ఒక అర్జీ పెట్టుకోవాలి. ఏ సైజు ఫ్లెక్సీలు ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారో అందులో తెలపాలి. అక్కడ రోడ్డుకు అడ్డంగా ఉన్నా, వాహనదారులకు ఇబ్బంది కలుగుతుందని భావించినా అధికా రులు అనుమతి ఇవ్వరు.. అలా ఏం లేకుంటే అనుమతి ఇస్తూ.. ఎంత చలానా అవుతుందో చెప్పి చెల్లించమంటారు. అలా చెల్లించిన తర్వాతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ చలానాకు సంబంధించిన రశీదును ఫ్లెక్సీపై ముద్రించాలి. కానీ అధికార పార్టీ నేతలు ఈ నిబంధనలేవీ పాటించడం లేదు. వారు ఎక్కడ ఏర్పాటు చేయాలనుకుంటే అక్కడ ఇష్టారీతిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చాలా చోట్ల ఇవి రోడ్లకు అడ్డంగా ఉన్నాయి. చలానా చెల్లించిన ‘ఒకే ఒక్కడు’: ఆగష్టు 27న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి జన్మదినం కూడా ఉంది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే నిబంధనల పేరు చెప్పి అనుమతి ఇవ్వకపోవడం వల్ల వారంతా సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా వైఎస్సార్సీపీ యువజన నాయకుడు రహీమ్ మాత్రమే ఐదు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు చలానా చెల్లించి అనుమతి తీసుకున్నారు. చదవండి: ఏం పర్వాలేదు.. ఇసుక తవ్వుకోండి..! -
ఏం పర్వాలేదు.. ఇసుక తవ్వుకోండి..!
నెల్లూరు జిల్లా: నదుల్లో ఇసుక తవ్వకాలపై నిషేధం అమల్లో ఉన్నా, తవ్వుకోండంటూ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల సంరక్షణలో భాగంగా నదుల్లో ఇసుక తవ్వకాలను నిర్ణీత కాలం పాటు నిలిపేస్తారు. అయితే ఈ నిషేధం కొనసాగుతున్న తరుణంలో ఎమ్మెల్యే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బుచ్చిరెడ్డిపాళెంలో ఓ టీడీపీ నేత శుభకార్యానికి హాజరైన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. భవన నిర్మాణ రంగ కార్మికులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇసుక లభ్యతపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సీఎం సూచనల మేరకు రీచ్‌ల నుంచి పగటిపూట ఇసుకను తరలించుకోవచ్చని, యంత్రాలను ఉపయోగించకుండా మనుషుల ద్వారా ట్రాక్టర్లలో పంపొచ్చని నేతలకు సూచించారు. ఇలాంటి వ్యాఖ్యలు అక్రమార్కులకు మరింత ఊతమిచ్చే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. చదవండి: వెలిగొండలో చంద్రబాబు క్రెడిట్ చోరీ -
పోలీసులే ఇలా ఉంటే ప్రజలు ఇంక ఎవరిని నమ్మాలి?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కూటమి పాలనలో ఓ వైపు తప్పుడు కేసులు, వేధింపులు కొనసాగుతుంటే.. మరోవైపు రకరకాల మాఫియాలు నడుస్తున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో యథేచ్ఛగా నడుస్తున్న దందాల గురించి మాట్లాడారు.రాష్ట్రంలో అంతా మాఫియానే కనిపిస్తోంది. అమరావతి పేరుతో బిల్డింగ్‌ల స్కామ్ నడుస్తోంది. విలువైన భూములను కొల్లగొడుతున్నారు. వీటికి తోడు విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి, బెల్ట్ షాపులు అందునా కల్తీ మద్యం రాష్ట్రంలో ప్రతీ చోటా కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఘటన మరీ దారుణమని వైఎస్ జగన్ అన్నారు. శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో చెప్తోంది.ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే అక్రమాలకు పాల్పడుతున్నారు. వాటిల్లో వాటాదారులుగా మారిపోతున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో.. మత్తులో పోలీసులే యాక్సిడెంట్ చేసి ప్రజలకు పట్టుబడ్డారు. కారులో గంజాయి, లిక్కర్, ఖాకీ యూనిఫాం దొరికాయి. డ్రైవర్‌తో సహా మరో ఇద్దరూ పోలీసులు మత్తులోనే ఉన్నారు. సీఐ వచ్చి వీడియోలు తీసే జనాల్ని తీయొద్దని బెదిరించారు. అలాంటప్పుడు ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలని, ప్రజలు ఎవరిని నమ్మాలి? అని వైఎస్ జగన్ నిలదీశారు.పైగా అద్దంకి ఘటనను కవర్అప్ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. పోలీసు అధికారులు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రకటనలు చేశారు. వాళ్ల మాటలకు ఎఫ్ఐఆర్కు పొంతనే లేదు(ఈ సందర్భంగా దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ, ప్రకాశం ఎస్పీ హర్షవర్ధనరాజుల వేర్వేరు స్టేట్మెంట్ల వీడియోలను ప్రదర్శించారు). ఇలాంటి పోలీసులను జైలుకు పంపకుండా.. తప్పుడు సాక్ష్యాలతో కాపాడాలని చూస్తున్నారు. కూటమి పాలనలో అద్దంకి ఘటనే కాదు.. కృష్ణలంక సాయికృష్ణ, విజయవాడ క్రాంతికుమార్ కేసులు ఈ వ్యవస్థలు ఎంతగా దిగజారిపోయాయో చెబుతున్నాయని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ హయాంలో గంజాయిని కట్టడి చేశాం. గంజాయి కేసుల్లో 13,210 మంది అరెస్ట్ చేశాం. 11 వేల ఎకరాల్లో గంజాయి పంటల్ని ధ్వంసం చేశాం.ఆపరేషన్ పరివర్తన్ పేరుతో గిరిజనులను గంజాయి సాగుకి దూరం చేశాం. ప్రత్యేకంగా ఎస్ఐబీని ఏర్పాటు చేశాం అని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఇప్పుడు.. చంద్రబాబు పాలనలో సర్వం దోపిడీ మయం.. గంజాయి మయం. కూటమి పాలనలో అందరూ కలిసి దందాలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలకు ఇంత, చినబాబు.. పెదబాబుకి ఇంత అని వాటేలేసుకుంటున్నారు. చంద్రబాబు హయాంలో ఒకే ఒక పంటకు గిట్టుబాటు ధర లభిస్తోంది.. అది గంజాయే అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు.ఇదీ చదవండి: కోర్టులకు వెళ్లేది చంద్రబాబే.. వద్దని చెప్పేది బాబే! -
నార్లు ఎండుతున్నా.. చంద్రబాబు ధ్యాసంతా వాటి మీదే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నార్లు ఎండిపోతున్నా రైతులను ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ముందుకు రావడం లేదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నా దాన్ని గుర్తించేందుకు కూడా ఆయన ఇష్టపడటం లేదని అన్నారు. జూన్, జులైలోనే 52 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయని వైఎస్ జగన్ వెల్లడించారు.బుధవారం మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు పంటల బీమా ప్రీమియం చెల్లించలేదని గుర్తు చేశారు. కూటమి పాలనతో ఇప్పటిదాకా రైతులకు సుమారు రూ.3 వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. 2025 అక్టోబర్‌లో మోంథా తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్నా.. ఇప్పటివరకు రైతులకు ఒక్క పైసా కూడా అందలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేయడంతో పాటు రైతులకు సున్నావడ్డీ పథకాన్ని కూడా నిలిపివేశారని అన్నారు.తమ ప్రభుత్వ హయాంలో రైతుల కోసం రూ.7,800 కోట్లు ఖర్చు చేసి అండగా నిలిచామని జగన్ గుర్తు చేశారు. అయితే బాబు పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా చేశారని, పంటలు దెబ్బతిన్న రైతులకు ఇప్పటివరకు ఎలాంటి సాయం అందించలేదని తెలిపారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, ఉచిత విత్తనాలు ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. రైతుల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం డైవర్షన్, రెడ్‌బుక్ రాజకీయాలపై దృష్టి సారిస్తోందని జగన్ విమర్శించారు. మంత్రులు ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని, తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడంపైనే చంద్రబాబు దృష్టి ఉందని పేర్కొన్నారు. కరువు పరిస్థితుల్లో ప్రజలు, రైతులను ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళిక ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎంగా తాను ఏం చేస్తున్నానో చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని వైఎస్ జగన్ సూచించారు.ఇదీ చదవండి: చంద్రబాబు అలా చేస్తే మనదే విజయం: వైఎస్ జగన్ -
తీవ్రకరువులో కుంభకర్ణుడి మాదిరిగా చంద్రబాబు తీరు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ సవాల్ విసిరితే ఇప్పటిదాకా చంద్రబాబు ప్రభుత్వం నుంచి సమాధానమే రాలేదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులపై బుధవారం ఆయన తాడేపల్లిలో మీడియా ద్వారా మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉంది. మొత్తం 28 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. రాయలసీమతో పాటు కోస్తాలోనూ తీవ్ర కరువు నెలకొంది. అంత తీవ్ర పరిస్థితులు ఉన్నా చంద్రబాబు స్పందించడం లేదు. పైగా కుంభకర్ణుడిలా నిద్ర నటిస్తున్నారు. జూన్ నుంచి ఇప్పటిదాకా 52 శాతం వర్షపాతం నమోదైంది. మొత్తం 688 మండలాల్లో 625 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. అయినా రైతులను ఆదుకునే చర్యలేవీ చేపట్టలేదు....ఎల్‌నినో ఎఫెక్ట్ ఉంది అని తెలుసు. జూన్‌లో తక్కువ వర్షాలు పడ్డాయని తెలుసు. జులైలోనూ అదే పరిస్థితి. అయినా పంటలకు నీళ్లు ఇస్తామని ఫోజులు ఇచ్చారు. వీళ్లు నీళ్లు ఇస్తారనే నమ్మకంతో రైతులు పెట్టుబడులు పెట్టారు. ఫలితంగా.. ఎకరాకు 15 వేలు నష్టపోయారు. కరువు డేంజర్ బెల్స్ మోగుతున్న చంద్రబాబు కనీసం స్పందించడం లేదు అని వైఎస్ జగన్ అన్నారు.ఒకవైపు వర్షాలు లేక సంక్షోభం వస్తే మరోవైపు నీటిని విడుదల విషయంలో చంద్రబాబు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ విషయంలో ఆయన మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. శ్రీశైలం జలాశయంలో నీటితో తెలంగాణ, ఇటు కరువులో రైతుల గురించి ఆలోచించకుండా ఎడాపెడా విద్యుత్ ఉత్పత్తి మీద చంద్రబాబు దృష్టి సారించారని జగన్ ధ్వజమెత్తారు. అవకాశమున్నా పొత్తిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీరు ఇవ్వడానికి బాబుకు చేతులు రాలేదని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండబోతోంది. సెప్టెంబర్ 15 తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ చెబుతుంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటి?. రాయలసీమకు నీరు ఎలా ఇస్తారు? అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇదీ చదవండి: అదే గనుక జరిగితే వైఎస్సార్సీపీదే విజయం -
స్థానిక ఎన్నికలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా గనుక జరిగితే కూటమికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారని ఆయన అన్నారు. మంగళవారం వైఎస్సార్సీపీ ముఖ్యనేతలతో భేటీ అయిన వైఎస్ జగన్.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘ఇవి కేవలం గెలుపోటములకు సంబంధించిన ఎన్నికలు కావు. మన కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం ఓటేస్తారు. అందుకే చంద్రబాబు ఎన్నికలను నిష్పక్షపాతంగా జరగనివ్వరు. స్థానిక ఎన్నికలను నేతలు ఆషామాషీగా తీసుకోవద్దు. బలమైన అభ్యర్థులను నిలబెడదాం. గతంలో.. ఎంపీటీసీ, మున్సిపాలిటీ, జడ్పీ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు, ప్రలోభాలు చూశాం. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా నాయకుడు తనతోనే ఉన్నాడనే భరోసా ప్రతి కార్యకర్తకు కలగాలి. ఇప్పుడు కార్యకర్తకు అండగా నిలబడితేనే, రేపు సాధారణ ఎన్నికల్లో అతడు రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తాడు’’ అని వైఎస్ జగన్ అన్నారు.ప్రత్యక్ష ఎన్నికలు–బలమైన అభ్యర్థులుస్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటన ఒకరకంగా మనకు అనుకూలమే. అందుకే బలమైన అభ్యర్థులను నిలబెట్టాలి. ప్రధాన పదవికి బలమైన అభ్యర్థి ఉంటే మిగిలిన ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, వార్డు అభ్యర్థులకు పర్యవేక్షణతోపాటు బలం లభిస్తుంది. అవసరమైన చోట కార్యకర్తలకు అండగా నిలిచేందుకు కుటుంబ సభ్యులను పోటీకి దింపడానికీ వెనకాడవద్దు. ప్రజల గొంతు వినిపించేలా, పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించేలా ప్రతి స్థానంలో పోటీ జరగాలిఏకగ్రీవాలకు అంగీకరిస్తే కఠిన నిర్ణయంఏ నియోజకవర్గంలోనూ పోటీ లేకుండా ఏకగ్రీవాలకు ఆస్కారం ఉండకూడదు. స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే, తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడున్న కో-ఆర్డినేటర్ పార్టీ అభ్యర్థులు కాలేరు. ప్రతి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అభ్యర్థులను నిలబెట్టారో ఎన్నికల అనంతరం నివేదికలు తెప్పించుకుంటా. అభ్యర్థులను నిలబెట్టడమే కాకుండా వారికి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంత బలంగా మద్దతిచ్చారన్నదానిపైనా నివేదికలు తీసుకుంటా. కార్యకర్తల ఎన్నికల్లో మనం గట్టిగా నిలబడితేనే, మన ఎన్నికల్లో కార్యకర్తలు మన కోసం గట్టిగా నిలబడతారు.గ్రామస్థాయి ప్రచార కార్యక్రమం“వెన్నుపోటు పార్టీ–వెన్నుపోటు పాలన”పై గ్రామ కమిటీలు, అనుబంధ విభాగాలు ప్రతి గ్రామంలో ప్రచారం చేయాలి. ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్సీపీ పాలనకు, కూటమి పాలనకు మధ్య తేడాను వివరించాలి. ఇంటింటి ప్రచారానికి అవసరమైన పూర్తి సమాచారాన్ని, ప్రచార సామగ్రిని పార్టీ అందిస్తుంది. కార్యక్రమాలన్నీ నిర్దిష్ట తేదీలు, షెడ్యూల్, వ్యవస్థీకృత కార్యాచరణ ప్రకారం జరగాలి.14–15 లక్షల గుర్తింపు కార్డులుపార్టీ కేడర్ కోసం దాదాపు 14–15 లక్షల గుర్తింపు కార్డులు సిద్ధమయ్యాయి. గ్రామస్థాయి కమిటీలు, అనుబంధ విభాగాల కార్యకర్తల వరకు గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తాం. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయుల్లో సమావేశాలు నిర్వహించి గుర్తింపు కార్డులు అందించాలి. సమావేశాల్లో గుర్తింపు కార్డులతోపాటు ఇంటింటి ప్రచార సామగ్రినీ కేడర్‌కు పంపిణీ చేయాలి. గుర్తింపు కార్డుల్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది; కార్యకర్తలు తమ ఫోన్లలోనే సమాచారాన్ని పొందవచ్చు. సెప్టెంబరు 5,6,7 తేదీల్లో ఒకరోజు ఏదో ఒకరోజు జిల్లాల స్థాయి సమావేశాలు నిర్వహిద్దాం. సెప్టెంబరు 8,9,10,11 తేదీల్లో ఏదో ఒకరోజు అసెంబ్లీ నియోజవకర్గాల స్థాయి సమావేశాలు నిర్వహిద్దాం. ఇక మండల, వార్డు, డివిజన్ స్థాయిల్లో సెప్టెంబరు 12 నుంచి 22 వరకూ సమావేశాలు నిర్వహిద్దాం. లీగల్, మీడియా సెల్స్ యాక్టివ్‌గా ఉండాలిప్రతి నియోజకవర్గంలో లీగల్ సెల్, మీడియా సెల్‌లను వెంటనే బలోపేతం చేయాలి. పోటీ జరగకుండా అడ్డుకునేందుకు అధికార పార్టీ కేడర్‌పై దౌర్జన్యాలకు దిగే అవకాశం ఉంది; కార్యకర్తలను రక్షించుకోవాలి. నియోజకవర్గ స్థాయిలో సమర్థులైన న్యాయవాదులను ఒక వేదికపైకి తీసుకొచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉంచాలి. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర లీగల్ సెల్స్ పరస్పరం అనుసంధానమై పనిచేయాలి. అవసరమైన కేసులను హైకోర్టు వరకు తీసుకెళ్లేందుకు సమన్వయ వ్యవస్థ ఉండాలి. పోలీసుల వేధింపులకు గురయ్యే కార్యకర్తలను న్యాయపరంగా రక్షించాల్సిన బాధ్యత పార్టీ తీసుకోవాలి. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి లీగల్, మీడియా వ్యవస్థలన్నీ ఒకే యూనిట్‌గా పనిచేయాలి.సోషల్ మీడియాకు అత్యంత ప్రాధాన్యంప్రతి నియోజకవర్గంలో సోషల్ మీడియాకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. పార్టీలో సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నవారిని గుర్తించి, మిగిలిన వారినీ యాక్టివేట్ చేయాలి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి వేదికలపైకి మొత్తం పార్టీ కేడర్‌ను తీసుకురావాలి. సోషల్ మీడియా ఖాతాలు ఎలా ప్రారంభించాలి, ఎలా యాక్టివేట్ చేయాలి, ఎలా నిర్వహించాలనే అంశాలపై శిక్షణ ఇవ్వాలి. జగన్ 2.0 సూపర్ యాప్, వైయస్సార్సీపీ టాక్స్, పార్టీ సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజల్లోకి సందేశం తీసుకెళ్లాలి. పార్టీకి సంబంధించిన యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా వ్యవస్థలను సమర్థంగా ఉపయోగించుకోవాలి. పార్టీ కేడర్‌కు వాస్తవ సమాచారం, అవసరమైన న్యూస్ కంటెంట్ నిరంతరం అందాలి. నియోజకవర్గాల్లోని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వ్యక్తిగతంగా కలిసి పార్టీకి మద్దతుగా నిలవాలని కోరాలి. ఎందుకంటే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి ప్రతికూల మీడియా వ్యవస్థలతో మనం యుద్ధం చేస్తున్నాం.నాయకులకు హెచ్చరికనియోజకవర్గాల్లో మీడియా, సోషల్ మీడియా, లీగల్ సెల్స్‌పై యాక్టివ్‌గా లేని నాయకులు ఇప్పటికైనా గేర్ మార్చాలి. నాయకులు కార్యకలాపాలను తమ నియంత్రణలోకి తీసుకోకపోతే కార్యకర్తలు నష్టపోతారు. ఇంటింటి ప్రచారం ద్వారా ప్రతి కుటుంబానికి వైయస్సార్సీపీ–కూటమి పాలన మధ్య తేడాను వివరించాలి.ఈగోలకు తావులేదుస్థానిక ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి అభ్యర్థి వ్యక్తిగత బలం అత్యంత కీలకం. అభ్యర్థుల ఎంపికలో భావోద్వేగాలు, వ్యక్తిగత ఈగోలను పక్కనపెట్టి అందరినీ కలుపుకొని వెళ్లాలి. తొమ్మిది ఓట్లతో గెలిచిన సందర్భాలు, తొమ్మిది ఓట్లతో ఓడిన సందర్భాలూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఓటూ కీలకమే. “జో జీతా వహీ సికందర్”.. గెలుపే ముఖ్యం, గెలుపు కోసం ఈగోలను పక్కన పెట్టాలి. ప్రతి గ్రామంలో పార్టీని బలంగా కన్సాలిడేట్ చేసి, సమర్థుడైన కార్యకర్త చుట్టూ ఏకాభిప్రాయం సృష్టించాలి. రాబోయే 60–70 రోజులు నాయకులు తమ నియోజకవర్గాలను దాటి వెళ్లకుండా పూర్తిగా స్థానిక ఎన్నికలపైనే దృష్టిపెట్టాలి. సరైన శ్రద్ధ, పూర్తి స్థాయి కార్యాచరణ ఉంటే స్థానిక ఎన్నికల్లో గెలుపు జెండా ఎగరేస్తాంవాళ్ల పేర్లు డిజిటల్ బుక్‌లోకి..పోలీసు అధికారులు పదవిని దుర్వినియోగం చేయకుండా న్యాయంగా, ధర్మంగా వ్యవహరించాలి. కానీ అలా జరగడం లేదు. కార్యకర్తలను వేధించే, అన్యాయం చేసే అధికారుల వివరాలను నమోదు చేయాలి. చట్టవిరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై భవిష్యత్తులో చట్టప్రకారం చర్యలు తప్పవు. ప్రతి పోలీసు అధికారి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా తటస్థంగా వ్యవహరించాలని కోరుతున్నాం. పోలీసు వ్యవస్థలో నిష్పాక్షికత తీసుకురావడానికి పార్టీ నాయకులు గట్టి ప్రయత్నం చేయాలి అని వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.ఇదీ చదవండి: ఆలయాల విధ్వంసం.. పవన్ కంటికి కనిపించడం లేదా? -
గోడు చెప్పుకుందామంటే.. చెంపదెబ్బ భయం!
హిందూపురంలోని సర్వే నంబరు 66/1ఏ/1లో 18.40 ఎకరాలుండగా.. భూపాలం శ్రీకాంత్, పురిడి దేవరాజు అనే వ్యక్తులకు 1937 నుంచి వంశపారంపర్యంగా వస్తోంది. అందులోని 5.90 ఎకరాలకు (రూ.50 కోట్ల విలువ) బాలకృష్ణ పీఏల్లోని ఒకరు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కాజేసేయత్నం చేశాడు. దీంతో ఈనెల 14వ తేదీన బాధితులు ఆందోళనకు దిగారు. లేపాక్షిలో పార్కింగ్ కోసం టెండర్లు పిలవగా రూ.60 లక్షలపైచిలుకు టెండరు దాఖలైంది. అయితే బాలకృష్ణ పీఏల్లో ఒకరి సూచన మేరకు ఆ టెండరును రద్దు చేసిన అధికారులు...ఆ తర్వాత కేవలం రూ.25 లక్షలకు కుదించి మిగిలిన మొత్తాన్ని స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి. లేపాక్షి ఆలయ కమిటీ చైర్మన్ పదవి కోసం కూడా భారీగా ముడుపులు స్వీకరించినట్లు సమాచారం. హిందూపురం శివారున అనధికారికంగా బెల్టు షాపు నిర్వహిస్తున్నారు. బాలకృష్ణ పీఏలతో ఒకరి అండతోనే బెల్టు షాపు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అందుకే అధికారులు అటు వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి. అన్ని శాఖల అధికారులు ఈ అనుచరుడి కనుసన్నల్లోనే విధులు నిర్వర్తిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. నియోజకవర్గంలో బియ్యం దందా, ఇసుక దోపిడీ, మట్టి మాఫియా, డంపింగ్ యార్డు, పేకాట, ప్రైవేటు వ్యాపారుల నుంచి నెల మామూళ్లు.. తదితర వ్యవహారాలన్నీ బాలయ్య పీఏల్లో ఇంకొకరు చూస్తుంటారు. దీంతో పాటు ప్రతిపక్ష పార్టీలపై ఎవరితో కేసులు పెట్టించాలి, ఎవరిపై దాడి చేయాలనే స్కెచ్ కూడా అతనే వేస్తారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు ...ఇలా బాలకృష్ణ నలుగురు పీఏలు నియోజకవర్గాన్ని నలువైపులా ఆక్రమించి అక్రమాలు, ఆక్రమణలు చేస్తున్నారు. వీరి పోరు పడలేని స్థానికులు తమ గోడు చెప్పుకుందామంటే ఎమ్మెల్యే బాలకృష్ణ హైదాబాద్‌లో ఉంటారు. నియోజకవర్గానికి వచ్చినప్పుడైనా చెప్పుకుందామంటే ఆయన చెంపదెబ్బతో సమాధానం ఇస్తారు. అందుకే హిందూపురం వాసులు ఆయన్ను ఎందుకు గెలిపించుకున్నామా...అని ఇప్పుడు బాధపడుతున్నారు.సాక్షి, పుట్టపర్తి: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమా షూటింగ్లలో బిజీగా ఉంటూ.. నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వచ్చి వెళ్తుంటారు. దీంతో పాలన అంతా ఆయన వ్యక్తిగత సహాయకులు (పీఏ) సాగిస్తూ భారీ దందాకు తెరలేపారు. ప్రైవేటు వ్యాపారుల దగ్గర వసూళ్లు నుంచి రూ.కోట్లు విలువ చేసే భూ కబ్జాల వరకు తలా ఓ విభాగం పంచుకుని భారీ దోపిడీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అసాంఘిక కార్యక్రమాల్లో ఒకరు.. అధికారులను నియంత్రించడంలో మరొకరు, టెండర్లు, నియామకాలు పర్యవేక్షణలో మరొకరు.. దాడులు, అక్రమ కేసులు, గొడవలను ఇంకొకరు చూస్తున్నారు. షాడో ఎమ్మెల్యేలుగా.. నలుగురు అనుచరులు షాడో ఎమ్మెల్యేలుగా.. ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తుంటారు. అన్నింటా వారై వ్యవహరిస్తూ అధికారులను సైతం ఇరకాటంలోకి పెడుతుంటారు. అధికారులను శాసిస్తూ ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ నియంత్రణలోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల వైఎస్సార్ సీపీ కార్యాలయంపై దాడికి కుట్ర చేసి అమలు చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడికి దిగి.. ప్రశ్నించిన వారిపైనే అక్రమ కేసులు పెట్టించారు. భారీగా భూఆక్రమణలు.. హిందూపురంలో దండు రోడ్డు సమీపంలో ఆర్యవైశ్యులకు చెందిన రూ. 50 కోట్ల విలువైన 5.90 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు యత్నించారు. చిలమత్తూరు మండలం టేకులోడు ప్రాంతంలో ఎకరా రూ. 25 లక్షల విలువైన రైతుల భూములను బలవంతంగా రూ. 12.66 లక్షలకు తగ్గించి బినామీ కంపెనీలకు కట్టబెట్టారు. మున్సిపాలిటీ స్థలాలు, సర్వే నంబర్ 259–1లోని భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. వ్యాపారుల వద్ద దందాలు.. తూముకుంట పారిశ్రామికవాడలోని ప్రతి పరిశ్రమ నుంచి నెలవారీగా రూ.లక్షలు వసూలు చేస్తారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. అంతేకాకుండా గుజరీ (స్క్రాప్) వ్యాపారుల వద్ద ప్రతి నెలా రూ. 50 వేలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. డబ్బులివ్వని పక్షంలో బెదిరింపులకు దిగి వ్యాపారాలను అడ్డుకున్న ఘటనలూ ఉన్నాయి. కాంట్రాక్టులు, టెండర్లలో గోల్మాల్.. రూ.92 కోట్ల మున్సిపల్ అభివృద్ధి పనుల టెండర్లను తమ అనుకూల కాంట్రాక్టర్ల కోసం రద్దు చేయించి.. 5 శాతం ఎక్సెస్ బిడ్డింగ్‌తో రూ.కోట్ల ప్రజాధనాన్ని పక్కదారి పట్టించారు. పనులు చేయకుండానే అధికారుల సాయంతో బిల్లులు పెట్టి ప్రతి మండలం నుంచి రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు నిధులు మింగేసినట్లు తెలిసింది. నియోజకవర్గంలో ప్రతి కాంట్రాక్టు.. టెండర్ల నుంచి కమీషన్ డిమాండ్ చేస్తున్నారు. జనన – మరణ పత్రాల జారీలోనూ.. టౌన్ ప్లానింగ్ అనుమతులు, భవన నిర్మాణ మంజూరు, జనన–మరణ ధ్రువీకరణ పత్రాల జారీలోనూ లంచాలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా పీఎం సూర్య ఘర్ పథకం కింద తమకు అనుకూలమైన వెండర్ వద్ద మాత్రమే సోలార్ సామగ్రి కొనుగోలు చేయాలని మున్సిపల్ అధికారులతో హుకుం జారీ చేయించి కమీషన్లు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఏవైనా ఆరోపణలు రాగానే కనిపించకుండా పోతున్న పీఏలు రెండు, మూడు వారాల తర్వాత యథావిధిగా దందాకు పాల్పడుతున్నారు.మీరెన్ని కేసులు పెట్టినా.. నా గొంతు ఆగదు: అంబటి -
పవన్‌కు ఇవేవీ కనిపించడం లేదా?: భూమన
సాక్షి, తిరుపతి: పురాతన ఆలయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా.. సనాతనిగా తనను తాను చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఇవేవీ కనిపించడం లేదా? అని నిలదీశారు. మంగళవారం ఈ వ్యవహారం భూమన కరుణాకర్ స్పందించారు. కడప–చెన్నై రహదారి వెంట ఉన్న అనేక ఆలయాలను కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రేణిగుంట–రైల్వే కోడూరు మార్గంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆంజనేయస్వామి ఆలయాన్ని కూల్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతించడంపై తీవ్రంగా మండిపడ్డారు.అంజనేయపురం గ్రామానికి ఆ ఆలయం వల్లే ఆ పేరు వచ్చిందని భూమన పేర్కొన్నారు. తొలి వాగ్గేయకారుడు అన్నమయ్య తిరుమలకు అడవి మార్గంలో వెళ్తూ ఇక్కడి స్వయంభూ ఆంజనేయస్వామిని పూజించిన చరిత్ర ఉందన్నారు. బ్రిటిష్ కాలంలో 1871లోనే అంజనేయపురంలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.‘తెల్లోడు కాపాడితే.. నల్లోడు కూల్చేస్తున్నాడు’బ్రిటిష్ పాలకులు ఆలయాలను సంరక్షిస్తే.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పాలకులు వాటిని కూల్చేందుకు సిద్ధమవుతున్నారని భూమన వ్యాఖ్యానించారు. తిరుపతి–చెన్నై మార్గంలోని నగరి సమీపంలోని కీలపట్టు సర్కిల్లో ఆంజనేయస్వామి ఆలయాన్ని ఇప్పటికే కూల్చివేశారని చెప్పారు. 1993లో చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభమైన ఆలయాన్ని ఇప్పుడు ధ్వంసం చేశారని ఆరోపించారు.‘పవన్‌కు కనిపించడం లేదా?’సనాతన ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆలయాల ధ్వంసం కనిపించడం లేదా? అని భూమన ప్రశ్నించారు. ‘‘అన్న ఆలయాన్ని ప్రారంభిస్తే.. తమ్ముడు అధికారంలో ఉండగా అదే ఆలయాన్ని కూల్చివేశారు. ఇదేనా సనాతన ధర్మ పరిరక్షణ?’’ అంటూ నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వం ఆలయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందన్న భూమన.. ఆలయాల పరిరక్షణ కోసం ప్రజలతో కలిసి వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: రఘురామరాజుపై కేసు ఏదీ? -
బాబూ.. డీఎస్సీ, ఏపీపీఎస్సీపై సమాధానమేది?
ఆంధ్రప్రదేశ్‌లో విశ్వసనీయతతో కూడిన రాజకీయానికి, బుకాయింపు రాజకీయానికి మధ్య ఉన్న తేడాను గమనించండి. డీఎస్సీ అక్రమాలపై సాక్ష్యాధారాలు చూపుతూ మీడియా సమావేశంలో వివరించడమే కాకుండా, వైఎస్సార్సీపీ హయాంలో ఏపీపీఎస్సీలో అవకతవకలు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు చేసిన ఆరోపణలు అన్నింటికి జవాబు ఇచ్చిన తీరు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయతను పెంచిందని చెప్పాలి.ప్రతిపక్షం లేని అసెంబ్లీలో చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు డీఎస్సీపై సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చి, విపక్షం ఉన్న శాసనమండలిలో అసలు చర్చకే వెనుకాడడం, దీనిని కప్పిపుచ్చుకోవడానికి ఏపీపీఎస్సీపై ఆరోపణలు చేసిన వైనంతో వారు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తుంది. ఈ వ్యవహారంలో లోకేష్ పరిణితితో వ్యవహరించలేకపోతే, చంద్రబాబు మాత్రం డబాయింపు విధానాన్ని అనుసరించారన్న అభిప్రాయం కలుగుతుంది. అన్నింటికి మించి డీఎస్సీ, ఏపీపీఎస్సీలు రెండిటి పైన సీబీఐ విచారణకు అప్పగించాలని జగన్ సవాల్ విసరడంతో చంద్రబాబు, లోకేష్‌లకు గుక్క తిప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి.మామూలుగా అయితే జగన్ మీడియా సమావేశం పూర్తి కాగానే టీడీపీ అధినేతలు దానికి కౌంటర్‌గా వారే మాట్లాడడం కాని, లేదా పార్టీ ఇతర నేతలతో కాని జవాబు ఇప్పించేవారు. కాని అలా చేసినట్లు కనిపించలేదు. అసెంబ్లీలో వీరు ప్రసంగాలు చేస్తున్నప్పుడు కూటమి ఎమ్మెల్యేలు దాదాపు మౌన ప్రేక్షకుల మాదిరిగానే ఉన్నారనిపించింది. దాదాపుగా ఒక్క ప్రశ్న కూడా వేయకపోవడం, ముఖ్యమంత్రి, మంత్రి చెబుతున్న దానిలో హేతుబద్దత లేదన్న భావన కలుగుతున్నా వాటిని ఎత్తిచూపలేకపోవడం వారి బలహీనతగా తీసుకోవాలి. టీచర్ల నియమాకాలకు సంబంధించి జరిగే డీఎస్సీ ప్రక్రియలో, ప్రత్యేకించి క్రీడా రిజర్వేషన్ విభాగంలో అక్రమాలు జరిగాయని వైఎస్సార్సీపీ నిర్దిష్ట ఆధారాలతో ఆరోపిస్తోంది. శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ సభ్యులు పోరాటం చేశారు. వెంటనే ఆ అక్రమాలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. కాని అధికార టీడీపీ చర్చకు ముందుకు రాలేదు. పోనీ అసెంబ్లీలో కూడా ఈ అంశం చర్చకు పెట్టకుండా ఉంటే అదో పద్దతి అనిపించేది. చంద్రబాబు, లోకేష్‌లు డీఎస్సీ అక్రమాలు జరగలేదని చెప్పడానికి చేసిన వాదనలో చాలా లోపాలు కనిపించాయి. జగన్ చేసిన ఆరోపణలు ఒక్కోదానికి క్లారిటీగా సమాధానం ఇవ్వలేకపోయారు. వాటిలో కొన్నిటిని పరిశీలించండి.జగన్ తన వాదనలో ప్రధానంగా క్రీడా కోటాలో 372 పోస్టులు పరీక్షలు లేకుండా ఇచ్చిన విదానాన్ని ప్రశ్నించారు. ఇందుకోసం రెండు జీఓలు ఇచ్చి, వారికి ఉద్యోగాలు ఇచ్చేశాక మళ్లీ ఆ జీఓలను రద్దు చేస్తూ వేరొక జీఓ ఇవ్వడం గురించి జగన్ ప్రస్తావించారు. తమకు కావల్సినవారికి ఉద్యోగాలు ఇచ్చి, తదుపరి గేట్లు మూసివేశారా అన్నది ఆయన వేసిన ప్రశ్న. దీనికి చంద్రబాబు లేదా లోకేష్ ఎక్కడా జవాబు ఇచ్చినట్లు కనిపించలేదు. ప్రఖ్యాత క్రీడాకారిణి పీవీ సింధూతో ఈ టీచర్లను లోకేష్ పోల్చడాన్ని యావన్మంది తప్పుపట్టారు. ఈ విషయం కూటమి ఎమ్మెల్యేలకు కూడా అర్థం అయి ఉండాలి. కాని అధికార పక్షంలో ఉన్నందున వారు అడగలేకపోయి ఉంటారు. లోకేష్ తీరు ఇమ్మెచ్యూర్గా ఉందని పలువురు విశ్లేషకులు, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మేధావులు వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ ఇచ్చిన లేఖల ఆధారంగా ఉద్యోగాలు ఎలా ఇస్తారో అర్థం కాదు. కేవలం స్థానికంగా ఆటలలో పాల్గొంటే చాలన్న పద్దతి బహుశా దేశంలో మరే రాష్ట్రంలో ఉండి ఉండదు. చిత్రంగా జాతీయస్థాయి క్రీడలలో మెడల్స్ సంపాదించిన కొందరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. వారు బహిరంగంగానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నవీన్ అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు వచ్చినట్లు ప్రకటించడం, ఆ తర్వాత అతనిని మెరిట్ లిస్ట్ నుంచి తొలగించడం, పరీక్ష పత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ బాధ్యతలు ఒకరికే అప్పగించడం వంటివాటిని లోకేష్ సమర్ధించుకున్న తీరు కూడా అంత బాగోలేదు.టీచర్ల పోస్టులకు బేరాసారాలు సాగిన ఆడియో తదితర విషయాలను కూడా జగన్ ఆధారసహితంగా చూపించారు. చంద్రబాబు, లోకేష్‌లు ఇచ్చిన సమాధానాలలో పరస్పర విరుద్దంగా ఉన్న అంశాలను కూడా ప్రస్తావించారు. జగన్ లేదా వైఎస్సార్సీపీ డిమాండ్ చేసినంతనే లోకేష్ తన పదవికి రాజీనామా చేస్తారని ఎవరూ అనుకోలేదు. కాని తన వైపు తప్పులేదని చెప్పుకోవడానికి ఆయన పడిన పాట్లు, ఆయనను రక్షించడానికి తండ్రిగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన యత్నాలు అందరికి అర్థం అయిపోయాయన్నది పలువురి భావన.చంద్రబాబు తనదైన శైలిలో ఎదురుదాడి చేయడానికి యత్నించారు. పనికట్టుకుని ఏపీపీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ, తన జీవితంలోనే ఎన్నడూ ఇలాంటి కుంభకోణం చూడలేదంటూ పెద్ద హడావుడి చేయాలని ఆయన తలపెట్టారు. కాని అది పండలేదు. అసెంబ్లీలో అయినా, బయట అయినా ఆయన ఎంత గట్టిగా మాట్లాడితే, అంత అసత్యం అయి ఉంటుందని, గతంలో వైఎస్సార్సీపీలో ఉండి, ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఒక ఎమ్మెల్యే అంటుండేవారు. పనికట్టుకుని జగన్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న అధికారి గురించి చంద్రబాబు ప్రస్తావించడంపై రకరకాల చర్చలు ఉన్నాయి. ఆనాటి ప్రభుత్వంలో చంద్రబాబుపైన పలు కీలకమైన కేసులు రావడానికి ఆ అధికారి కారణమన్న కోపం ఉండి ఉండవచ్చని, దానిని ఈ సందర్భంగా బయటపెట్టారని కొందరు అంటున్నారు.అయితే జగన్ తన వివరణలో చంద్రబాబు చేసిన ఆరోపణలు అన్నిటిని పటాపంచలు చేసే విధంగా మాట్లాడారు. గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని, ఆ తర్వాత మెయిన్స్ పరీక్షలు తమ ప్రభుత్వంలో జరిగాయని ఆయన చెప్పారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే మొత్తం ప్రక్రియ జరిగిందని ఆయన తెలిపారు. అసలు సంబంధం లేని డిజిటల్ వాల్యుయేషన్, హాయ్ లాండ్ ఇష్యూలను తెరపైకి తెచ్చి, వాస్తవాలు మరుగున పరచడానికి ముఖ్యమంత్రి యత్నించారని ఆయన ఆరోపించారు. వాటిని కూడా ప్రస్తావించి జగన్ హైకోర్టు తప్పుపట్టలేదన్న సంగతిని గుర్తు చేశారు.గ్రూప్-1 పరీక్షలలో అవకతవకలు జరగలేదని చంద్రబాబు ప్రభుత్వం నియమించిన సిట్ హైకోర్టుకు నివేదిక ఇచ్చిందని, పేపర్ టాంపర్ కాలేదని సీఎఫ్ఎస్ఎల్ నివేదిక పేర్కొందని జగన్ వెల్లడించడంతో కూటమి ప్రభుత్వ వాదనంతా వీగిపోయినట్లయింది. ఇంటర్వ్యూ బోర్డుల ఏర్పాటు, వాల్యుయేషన్ మూడు ప్రదేశాలలో జరపడం, అన్నిచోట్ల సిసిటీవీ కెమెరాల అమరిక జంబ్లింగ్ మొదలైన పద్దతులను కట్టుదిట్టంగా అమలు చేశామని జగన్ తెలిపారు. చంద్రబాబు, లోకేష్‌లు అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వారిలో తమ ప్రభుత్వం తప్పు చేయలేదన్న కాన్పిడెన్స్‌ను చూపించలేకపోయారన్న అభిప్రాయం పలువురిలో ఏర్పడింది.అదే టైమ్‌లో జగన్ తన ప్రజెంటేషన్‌లో ఒక స్పష్టత, వీడియో, ఆడియో ఆధారాలు, ప్రభుత్వ జీఓలు, కోర్టు తీర్పులలోని వివిధ భాగాలు మొదలైనవాటిని చూపించడం ద్వారా తన క్రెడిబిలిటీని మరోసారి రుజువు చేసుకున్నట్లయింది. ఈ వివాదాల నుంచి బయటపడాలంటే, అవినీతి జరగలేదని, తాము అసత్యాలు చెప్పడం లేదని ప్రజలను నమ్మించాలంటే చంద్రబాబు ముందు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏమిటంటే జగన్ విసిరిన సవాల్‌కు ధైర్యంగా స్పందించి డీఎస్సీ, ఏపీపీఎస్సీ రెండిటిపైన సీబీఐ విచారణకు ఆదేశించడమే. మరి వారు అలా చేయగలుగుతారా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
సంచలన వీడియో బయటపెట్టిన జోగి రమేష్
సాక్షి, విజయవాడ: గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తన కుటుంబంపై జరుగుతున్న ప్రచారంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. తన కుమారుడు రాజీవ్, కోడలు మేఘనకు సంబంధించిన వివాదంలో తన కుటుంబాన్ని రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఓ సంచలన వీడియోను విడుదల చేసిన ఆయన.. మేఘనను కన్నకూతురిలా చూసుకున్నామని, పిల్లల మధ్య వచ్చిన విభేదాలను పెద్దవి చేసి రాజకీయ రంగు పులమడం సరికాదని అన్నారు.నెల రోజులుగా తాను, తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నామని జోగి రమేష్ పేర్కొన్నారు. తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం, చదివించడం, వారికి వివాహం చేయడం తమ బాధ్యత అని చెప్పారు. అదే బాధ్యతలో భాగంగా తన కుమారుడు రాజీవ్‌కు మేఘనతో ఘనంగా వివాహం జరిపించామని తెలిపారు.వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చాయని, పిల్లలు కలిసి ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారని అన్నారు. విడిపోవాలని ఎవరూ కోరుకోరని పేర్కొన్నారు. అయితే వారి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా పరిస్థితి కోర్టు వరకు వెళ్లిందని చెప్పారు. జూన్ 8న తన కుమారుడు రాజీవ్ విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశాడని, జూలై 24న మేఘన తమ కుటుంబంపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని జోగి రమేష్ తెలిపారు. విడాకుల ప్రక్రియ కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై ఎక్కువగా మాట్లాడలేనని చెప్పారు.మతమార్పిడి ఆరోపణలపై స్పందనమేఘన ఇచ్చిన ఫిర్యాదులో మతమార్పిడికి సంబంధించిన అంశాలను ప్రస్తావించడంపై జోగి రమేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన భార్య బైబిల్ చదివితే తప్పా? ఏసుక్రీస్తు బోధనలు వినడం తప్పా? అని ప్రశ్నించారు. తమ కుటుంబం అన్ని మతాలను గౌరవిస్తుందని చెప్పారు. తిరుపతి వెళ్తామని, దుర్గగుడికి వెళ్తామని, యాగాల్లో కూడా పాల్గొంటామని తెలిపారు. కేవలం మత విశ్వాసాల ఆధారంగా తన కుటుంబంపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.ఎల్లో మీడియాపై ఆగ్రహంటీడీపీ అనుకూల ఎల్లో మీడియా సంస్థలు తన కుటుంబ సమస్యను పదేపదే ప్రసారం చేసి వ్యాపారం చేసుకున్నాయని జోగి రమేష్ అన్నారు. ఒక కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను ఇలా బహిరంగంగా చర్చించడం సమంజసం కాదన్నారు. “మీకు పిల్లలు లేరా? మీకు కుటుంబాలు లేవా?” అంటూ ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కుటుంబ వ్యవహారాలను రోడ్డుపైకి తీసుకురావద్దని కోరారు.మహా టీవీ వంశీని ఉద్దేశించి కూడా జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబ వివాదంపై నెల రోజులుగా వార్తలు ప్రసారం చేస్తూ తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. తన కుమారుడు రాజీవ్ సామర్థ్యం గురించి ప్రశ్నించే ముందు.. ఈ వ్యవహారం వెనుక ఉన్న వారిని ప్రశ్నించాలని అన్నారు. కుటుంబ విషయాలను రాజకీయ, మీడియా అంశంగా మార్చడం సరికాదని వ్యాఖ్యానించారు.చంద్రబాబు, లోకేష్.. ఏ ఇంట్లో లేవు?తనపై రాజకీయ కక్షతోనే కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారని జోగి రమేష్ చెబుతున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. బీసీ నేతలను కావాలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. కారుమూరి, సునీల్ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నికల తర్వాత తన కుమారుడిని అరెస్ట్ చేయించారని, నకిలీ మద్యం కేసులో తనను.. తన సోదరుడిని 83 రోజుల పాటు జైలులో పెట్టారని గుర్తు చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాను వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. “రాజకీయంగా నాపైకి రండి.. వ్యక్తిగత విషయాల్లోకి రావద్దు” అని చంద్రబాబు, నారా లోకేష్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.ఆధారాలు ఉన్నాయంటూ వ్యాఖ్యలుతన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, సరైన సమయంలో వాటిని బయటపెడతానని జోగి రమేష్ తెలిపారు. కుటుంబ వివాదాలను రాజకీయాలకు ఉపయోగించుకోవడం మానుకోవాలని హితవు పలికారు. తన కుమారుడు, మేఘన మధ్య సమస్యలు ఉన్నప్పటికీ.. మేఘనను తాను కన్నకూతురిలానే చూసుకున్నామని మరోసారి స్పష్టం చేశారు. “ఏ కుటుంబంలో సమస్యలు లేవో చంద్రబాబు చెప్పాలి” అని ప్రశ్నించిన ఆయన.. ప్రముఖుల కుటుంబాల్లోనూ ఇలాంటి సమస్యలు ఉంటాయని వ్యాఖ్యానించారు.వసంత కృష్ణప్రసాద్ వల్లే ఇదంతా..మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కార్యాలయానికి తన కోడలు మేఘన వెళ్లిన సంచలన వీడియోను విడుదల చేసిన జోగి రమేష్.. ఈ వ్యవహారంలో రాజకీయ జోక్యం ఉందని ఆరోపించారు. తాను ఏ రోజూ వసంత కృష్ణప్రసాద్ వ్యక్తిగత జీవితంపై మాట్లాడలేదని, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కొంటానని చెప్పారు. వ్యక్తిగత అంశాలను రాజకీయాల్లోకి తీసుకురావడం సరికాదన్నారు.“ఇప్పటికైనా ఇలాంటి రాజకీయాలు మానుకోవాలి. ప్రజా సమస్యలపై నా పోరాటం కొనసాగుతుంది” అని జోగి రమేష్ పేర్కొన్నారు. తన గొంతు నొక్కేందుకు ప్రయత్నించినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: గంజాయి ఊడలు..'కుప్పంలో గుప్పు'! -
‘సీబీఐ పేరు వింటే చంద్రబాబు, లోకేష్‌కు బీపీ ఎందుకు?’
సాక్షి, తాడేపల్లి: సీబీఐ పేరు వింటే చంద్రబాబు, లోకేష్‌లకు బీపీ పెరుగుతోందని.. డీఎస్సీలో అక్రమాలపై విచారణ అంటే తట్టుకోలేక పోతున్నారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. స్పోర్ట్స్ కోటా పేరుతో పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చారని మండిపడ్డారు.‘‘కొత్తకొత్త జీవోలతో గేట్లు ఎత్తి తమ వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. మెరిట్ లిస్టుల పేరుతో మరో మోసం చేశారు. డీఎస్సీ అక్రమాలు కప్పి పుచ్చుకోవటానికే గ్రూప్-1ను తెర మీదకు తెచ్చారు. సిట్‌తో విచారణ జరిపినా గ్రూప్-1లో తప్పులు కనపడలేదు. అందుకే రెండో సిట్ వేసి తప్పులు ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. దమ్ముంటే సీబీఐతో విచారణ జరపాలి. డీఎస్సీ, గ్రూప్-1 రెండిటి పైనా సీబిఐ విచారణ చేయించాలి’’ అని అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు.శాసనమండలిలో దీనిపై చర్చిద్దామంటే చంద్రబాబు, లోకేష్ పారిపోయారు. సీబీఐతో విచారణ అంటే ఎందుకంత భయం?. తప్పు చేసినట్టు ఇప్పటికైనా ఒప్పుకోండి. డీఎస్సీ అక్రమాలపై జనసేన, బీజేపీ ఎందుకు మౌనంగా ఉన్నాయి?. స్పోర్ట్స్ లో పాల్గొనడమే అర్హతగా ఉద్యోగాలు ఇస్తారా?. ఇలాంటి వారు పిల్లలకు ఏం పాఠాలు చెప్తారు?ఇదీ చదవండి: ‘సర్’లో ఈ నాలుగైదు రోజులే కీలకం..ఇప్పటికే రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. ఏపీని గంజాయి విక్రయ రాష్ట్రంగా మార్చారు. లింగమనేని రమేష్ కొడుకు ర్యాష్ డ్రైవింగ్‌తో ఒకరిని చంపేస్తే కేసులు ఉండవా?. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుంటూ దొరికినా చర్యల్లేవు. ఆదినారాయణ రెడ్డి కొడుకు గంజాయి తాగుతూ దొరికినా కేసుల్లేవు. కూటమి నేతలు, వారి పిల్లలకు ప్రత్యేక చట్టాలున్నాయా?’’ అంటూ అరుణ్‌కుమార్ ప్రశ్నించారు. -
ఈసారైనా.. ఎన్నికలు జరిగేనా?
తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి ): కోర్టు కేసులున్న మున్సిపాలిటీల్లో ఈ సారైనా ఎన్నికలు జరుగుతాయా.. ప్రతిపాదిత విలీన గ్రామాలతో కలిపి ఎన్నికలు నిర్వహిస్తారా.. కోర్టు కేసులు ఎత్తేసి, ప్రత్యేక ఆదేశాలతో పాత వార్డులతోనే ఎన్నికలకు వెళతారా.. జిల్లాలో కోర్టు అభ్యంతరాలున్న పాలకొల్లు, తణుకు, భీమవరం, తాడేపల్లిగూడెంలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయా.. ఇది ప్రస్తుతం అంతటా జరుగుతున్న చర్చ.. వీటిలో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఎన్నిక జరిగే అవకాశాలున్నా, వాటిని ఆపడానికి కూటమి నాయకుల తరఫున ఎవరైనా ప్రయత్నిస్తున్నారా.. అంటే అవుననే సమాచారం తెలుస్తోంది. గతంలో 35 వార్డులుగా ఉన్న తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో 5 సమీప గ్రామాలను (కొండ్రుపోలు, ఎల్.అగ్రహారం, కుంచనపల్లి, ప్రత్తిపాడు, పడాల) విలీనం చేస్తూ వార్డుల సంఖ్యను 40కి పెంచేందుకు ప్రతిపాదించారు. అయితే దీనిని వ్యతిరేకిస్తూ దాఖలైన కేసుల వల్ల గత ఏడేళ్లుగా ఇక్కడ ఎన్నికలు జరగక ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. అలాగే ప్రతిపాదిత ఐదు గ్రామాలకు కూడా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించలేదు. ఇదిలా ఉండగా ప్రభుత్వం విడుదల చేసిన జీఓలో కోర్టు కేసులున్న 23 మున్సిపాలిటీలు మినహా మిగిలిన వంద మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు పేర్కొంది. గవర్నర్ ఆర్డినెన్స్ మాటేంటి? మున్సిపాలిటీల్లో సమీప గ్రామాల విలీన ప్రతిపాదనలకు సంబంధించి 2021 జనవరి 12న అప్పటి గవర్నర్ ఆర్డినెన్స్ ఇచ్చారు. దీని ప్రకారం ప్రతిపాదిత పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేసుకోవచ్చని చెబుతున్నారు. వీటిని సవాల్ చేస్తూ కేసులు వేసిన వారు కోర్టును ఆశ్రయించినా గతంలో వాటిని కొట్టేసినట్టు సమాచారం. 1న వాదనలు : తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో ఐదు గ్రామాల విలీనానికి సంబంధించి వచ్చేనెల 1న హైకోర్టులో వాదనలు జరుగనున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గతంలో ఈ కేసులను కోర్టులో దాఖలు చేసిన న్యాయవాది ప్రభుత్వ నియామక పోస్టులోకి వెళ్లడంతో ఆయన నుంచి కేసులను కేసులు వేసిన వారు వెనక్కి తీసుకున్నారని తెలుస్తోంది. వాస్తవానికి అప్పట్లో కేసులు వేసిన వారు టీడీపీ సానుభూతిపరులుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆ పార్టీ ఇక్కడ ఎన్నికలు జరగాలని ఆకాంక్షిస్తోంది. కూటమి వ్యూహం.. ‘చిదంబర’ రహస్యం తాడేపల్లిగూడెం మున్సిపల్ ఎన్నికల విషయంలో కూటమి వ్యూహం చిదంబర రహస్యంగా ఉంది. ఈ ఎన్నికను రెండేళ్ల కూటమి పాలనకు రిఫరెండంగా భావిస్తున్నట్టు ఆయా నాయకుల ఆలోచనలు కనిపిస్తున్నాయి. సూపర్ సిక్స్ హామీలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో పరాభవం తప్పదనే భయం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కూటమిలో కీలక నాయకుడు ఒకరు జిల్లాలోని తీరప్రాంతానికి చెందిన పేరొందిన హైకోర్టు లాయర్ ద్వారా తాడేపల్లిగూడెం ఎన్నిక నిలుపుదలకు కేసు వేయించినట్టు సమాచారం. -
‘రాయలసీమ అభివృద్ధి నిరోధకుడు చంద్రబాబు’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయమే జరుగుతుందని.. ఆయన పక్కా రాయలసీమ అభివృద్ధి నిరోధకుడని వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి సాకే శైలజనాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గ్రేటర్ రాయలసీమ టాస్క్ ఫోర్స్ కమిటీ, పార్టీ రైతు, యువజన, విద్యార్థి, సోషల్ మీడియా విభాగాల నేతలతో కీలక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.శ్రీశైలం జలాశయం నిండుకుండలా ఉన్నప్పటికీ రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు విడుదల చేయకుండా కూటమి ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతోందని మండిపడ్డారు. పాలకుల మొద్దునిద్రను విడదీసేందుకు, రాయలసీమ రైతుల హక్కులను కాపాడేందుకు ఈ నెల 24న వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సీమ ప్రాంత రైతులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రజా పోరాటానికి దిగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే..సీమపై చంద్రబాబుది మొదటి నుంచీ కక్షపూరిత వైఖరే..చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడల్లా రాయలసీమ ప్రాంతం కరువుతో అల్లాడాల్సిందే. ఆయన పరిపాలన సీమకు అన్యాయం చేయడానికే అన్నట్లుగా సాగుతోంది. రాష్ట్రంలో వర్షాలు లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి శ్రీశైలం రిజర్వాయర్‌లో దాదాపు 185 టీఎంసీల నీరు చేరింది. డ్యామ్ 90 శాతం నిండి పూర్తి స్థాయికి చేరువలో ఉంది. కానీ దానిపై ఆధారపడిన రాయలసీమ రిజర్వాయర్లన్నీ సగానికి పైగా ఎండిపోయి ఉన్నాయి. రైతులకు మేలు చేయాల్సింది పోయి, పంటలు వేసుకోవద్దని బాబు ఉచిత సలహాలు ఇస్తున్నారు.రైతులను వ్యవసాయానికి, భూములకు దూరం చేయడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. పోతిరెడ్డిపాడు ద్వారా పూర్తిస్థాయి నీటిని ఎందుకు విడుదల చేయడం లేదు?. శ్రీశైలం నిండితే దిగువన ఉన్న వెలుగోడు, బ్రహ్మం సాగర్, సోమశిల, కండలేరు, గోరకల్లు, ఔకు, గండికోట, పైడిపాలెం, వామికొండ, చిత్రావతి ప్రాజెక్టులు ఎందుకు నిండటం లేదు? 11 టీఎంసీల సామర్థ్యం ఉన్న గోరకల్లులో కేవలం 4 నుంచి 5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వకుండా ఆపుతున్నది ఎవరు? సీమ ప్రాజెక్టులను ఎండగడతామని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమైనా మాట ఇచ్చారా? పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 40,400 క్యూసెక్కులు అయితే.. కేవలం 8 వేల క్యూసెక్కులు మాత్రమే వదులుతున్నారు. 850 అడుగులు దాటిన తర్వాత కనీసం 30 నుంచి 40 వేల క్యూసెక్కుల నీటిని వదిలే అవకాశం ఉన్నా ఎందుకు తాత్సారం చేస్తున్నారు?.రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను అడ్డుకున్న ద్రోహి చంద్రబాబుగతంలో వైఎస్ జగన్ రాయలసీమ ప్రాంతానికి ఒక రక్షణ కవచంలా 'రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్' ప్రాజెక్టును తలపెట్టారు. 90 శాతం పనులు పూర్తయిన ఆ ప్రాజెక్టును చంద్రబాబు.. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డితో కుమ్మక్కై నిలిపివేశారు. ఆ ప్రాజెక్టు పూర్తయి ఉంటే 800 అడుగుల నుంచే రోజుకు 80 వేల క్యూసెక్కుల వరద నీటిని ఒడిసిపట్టి సీమ ప్రాజెక్టులన్నింటినీ క్షణాల్లో నింపేవాళ్లం. అలాంటి మహోన్నత ప్రాజెక్టును గతంలో 'బురద నీళ్లు' అంటూ చంద్రబాబు హేళన చేశారు. అలాగే హంద్రీ-నీవా ప్రవాహ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచుతూ వైయస్.జగన్ ఇచ్చిన టెండర్లను రద్దు చేసి, దాన్ని 3,800 క్యూసెక్కులకు కుదించి రాయలసీమ రైతుల నోట్లో మట్టి కొట్టారు.ఆల్మట్టి, అప్పర్ భద్రలపై ఎందుకు మౌనం?కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ రోజుకోసారి జపం చేసే చంద్రబాబు.. కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదు? అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణం వల్ల తుంగభద్రకు 25 టీఎంసీల నీరు ఆగిపోయి ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటుంటే ఎందుకు కేంద్రాన్ని నిలదీయడం లేదు? పులిచింతల పరివాహక ప్రాంత రైతుల గొంతు కోస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? చంద్రబాబుకు నీళ్ల మీద, రైతుల మీద ప్రేమ లేదు. కేవలం రాజకీయ స్వలాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు.24న 'పోతిరెడ్డిపాడు' వద్ద మహా పోరాటం..ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజల్లో ఎండగట్టడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని శైలజనాథ్ స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఈ నెల 24వ తేదీ సోమవారం నాడు గ్రేటర్ రాయలసీమ జిల్లాల పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులు, రైతు విభాగాలతో కలిసి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను సందర్శిస్తున్నామన్నారు. పోతిరెడ్డిపాడును పూర్తి సామర్థ్యంతో, హంద్రీ-నీవాను పూర్తి సామర్థ్యంతో నడిపించి రాయలసీమ ప్రాజెక్టులను నింపాలని.. 6,300 క్యూసెక్కుల హంద్రీ-నీవా సామర్థ్యాన్ని తగ్గించి 3,800 క్యూసెక్కులకు పరిమితం చేయడం ఎందుకని నిలదీశారు.దీనిపై రైతులు, మేధావులు, ప్రజా సంఘాలతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని.. తక్షణమే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, మాల్యాల, ముచ్చుమర్రి ద్వారా పూర్తి సామర్థ్యంతో 40 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి రాయలసీమ రిజర్వాయర్లన్నింటినీ నింపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయలసీమ వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని శైలజానాధ్ హెచ్చరించారు. -
పీపీపీ ముసుగులో ఏపీ ఫర్ సేల్..!?
కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రగతి నివేదిక విడుదల చేసిన సందర్భంలో చెప్పిన విషయాలు రానున్న ప్రమాదానికి సంకేతమా అన్న అభిప్రాయం అప్పుడే కలిగింది. సరిగ్గా వారం తిరగకముందే అసలు విషయం బయటకు వచ్చేసింది. ఏపీ ప్రభుత్వం 16 శాఖలకు సంబందించి వివిధ కార్యక్రమాలను పీపీపీ పద్దతిలో ప్రైవేటువారికి అప్పగించబోతున్నట్లు మార్గదర్శకాలు విడుదల అయ్యాయి.టీడీపీ, జనసేనలు కలిసి మానిఫెస్టో విడుదల చేసినప్పుడు కాని, ఆ తర్వాత బీజేపీతో కలిసి ఎన్నికల ప్రచారాలు నిర్వహించినప్పుడు కాని తాము పీపీపీ విధానంలో వివిధ రంగాలను ప్రైవేటుకు అప్పగిస్తామని, యూజర్ చార్జీలు వసూలు చేస్తామని ఎక్కడా చెప్పలేదు. పైగా గత ప్రభుత్వం పట్టణాలలో పారిశుధ్ద్యం నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం ఏభై నుంచి వంద రూపాయల చార్జీలు వసూలు చేస్తే అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు నానా యాగీ చేశారు. చెత్తపన్నువేసే చెత్త ప్రభుత్వం అని ప్రచారం చేశారు. అధికారంలోకి రాగానే చెత్తపన్ను తొలగించామని అన్నారు. అయినా పిఠాపురం తదితర చోట్ల యధాప్రకారం వసూలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.నిజానికి దీనివల్ల ప్రజలపై పెద్దగా భారం పడింది లేదు. అయినా అంత రచ్చ చేసిన చంద్రబాబు ఇప్పుడేమో విద్య, వైద్యం, రవాణా మొదలైన 16రంగాలలో యూజర్ చార్జీలు వసూలుకు రంగం సిద్దం చేస్తున్నారు. దీనిని ఏ తరహా ప్రభుత్వం అని జనం అనుకోవాలి?ప్రజలకు సంపద సమకూర్చి పెడతానని పదే, పదే ఊదరగొట్టిన చంద్రబాబు.. ఇప్పుడు సంపద సృష్టేమో కాని, ఉన్న ప్రజల సంపదను ప్రైవేటువారికి కట్టబెట్టడానికి తయారవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.విపక్షంలో ఉన్నప్పుడు రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లను పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు, లోకేష్‌లు అధికారంలోకి వచ్చాక వాటిని ఎత్తివేస్తామని చెప్పారు. లోకేష్ అయితే ఒక అడుగు ముందుకేసి మీటర్లను పగలకొట్టండని పిలుపు ఇచ్చారు. పవర్లోకి వచ్చాక వాటిని తొలగించలేదు సరికదా.. ఇళ్లకు కూడా కొత్త మీటర్లు పెడుతూ జనానికి చిర్రెత్తిస్తున్నారు. చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేసిన రోజున ఒక మాట చెప్పారు. రాష్ట్రంలో వచ్చిన 23 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలలో 11.37 లక్షల కోట్ల పెట్టుబడుల పనులు ఆరంభం అయ్యాయని, వీటిలో అధిక భాగం పీపీపీ మోడల్ అని అన్నారు. అయితే ప్రభుత్వ మార్గదర్శకాలలో 1.23 లక్షల కోట్ల ప్రాజెక్టులు పీపీపీ విధానంలో ఉన్నాయని తెలపడం విశేషం. దేనిని నమ్మాలో తెలియదు.అదలా ఉంచితే పీపీపీ వ్యవస్థలో భవిష్యత్తులో యూజర్ చార్జీల రూపేణా లక్షల కోట్ల మేర ప్రజలపై భారం వేయబోతున్నట్లు చెప్పకనే చెప్పారనుకోవాలా! ఈ ప్రైవేటు కంపెనీలకు వయబిలీటి గ్యాప్ ఫండ్ ఇస్తారట. వడ్డీ లేని రుణం ఇస్తారట. వయబిలిటి ఫండ్ కోసం ప్రభుత్వం 1500 కోట్లు కేటాయించింది. ప్రైవేటు కంపెనీల మూలధనంలో ప్రభుత్వం 20 నుంచి నలభై శాతం గ్రాంట్‌గా కూడా ఇస్తుందట. జగన్ ప్రభుత్వం పోర్టులు, మెడికల్ కాలేజీలు ప్రభుత్వపరంగా నిర్మిస్తే, వాటిని ప్రైవేటువారికి అణాకు, బేడాకు ఆ సంపదను అప్పగించే కుట్ర జరుగుతోందన్నది వైఎస్సార్సీపీ నేతల విమర్శగా ఉంది.వేల కోట్ల పెట్టుబడి పెట్టిన తర్వాత, దానిపై ఏ ప్రభుత్వమైనా ఆదాయం పొందాలని చూస్తుంది. కాని చిత్రంగా కూటమి ప్రభుత్వం దానిని వదలుకుని, ప్రైవేటువారికి అప్పగించి యూజర్ చార్జీల రూపేణా ప్రజలపై అదనపు భారం వేయడానికి రెడీ అయిందన్నమాట.భోగాపురం విమానాశ్రయం ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో నిర్మించడాన్ని, మెడికల్ కాలేజీలు ప్రైవేటువారికి అప్పగించడాన్ని ఒక రీతిలో చంద్రబాబు చూడడాన్ని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తప్పుపట్టారు. విమానాలు ఎక్కేవారు, ఆరోగ్యం కోసం వచ్చే పేదవారు ఒకటేనా అని ఆయన ప్రశ్నించి, చంద్రబాబు ఆలోచన ధోరణి ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పడానికి ఇది ఉదాహరణ అని అన్నారు. పీపీపీ ముసుగులో వనరుల దోపిడీ జరగబోతోందని సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పీపీపీ కాదు.. ఏపీ ఫర్ సేల్, అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అన్న కొత్త విధానానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ఇదంతా పెద్ద స్కామ్ అని ఆయన ఆరోపించారు.కాగా ఈనాడు మీడియా మాత్రం ప్రైవేటుకు ప్రోత్సాహం ప్రజలకు ప్రయోజనం అన్న శీర్షిక పెట్టి తెలుగుదేశంపై తన భక్తిని ప్రదర్శించింది. అంతే తప్ప విద్య, వైద్యం, తాగునీరు వంటి సామాజిక సేవలకు యూజర్ చార్జీలేమిటి అని ప్రశ్నించలేదు.2004 కి ముందు కూడా చంద్రబాబు ఇదే విధానం అమలు చేయాలనుకునేవారు. ప్రభుత్వ ఆస్పత్రులలో యూజర్ చార్జీలను కూడా కొన్నిచోట్ల పెట్టారు. నష్టాలలో ఉన్నాయని పలు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటువారికి కారుచౌకగా కట్టబెట్టారు. వాటిలో పెక్కు సంస్థలు అక్కడ పరిశ్రమలు నడపడం లేదు. ఆ పరిశ్రమల భూమిని ప్రైవేటు యాజమాన్యాలు రియల్ ఎస్టేట్‌కు వాడుకుని భారీగా లబ్ది పొందాయని అంటారు. చంద్రబాబు అప్పట్లో ఏది ఉచితం కాదని ప్రజలు గుర్తుంచుకోవాలని అనేవారు. ఆ రోజుల్లో జన్మభూమి పేరుతో ఏభైశాతం ఖర్చు పెట్టే వారి ప్రాంతంలోనే రోడ్లను వేసేవారు.2004లో ఎన్నికైన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఆ పద్దతులకు గుడ్ బై చెప్పి, ప్రజల సాధారణ అవసరాలకు ప్రభుత్వమే పూర్తి వ్యయం భరించే విధానం అమలు చేశారు. చంద్రబాబు విద్య అన్నది ప్రభుత్వ బాధ్యత కాదని ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఆయన మైండ్ సెట్ ఎప్పుడూ ఆ రకంగానే ఉంటుందని వైఎస్సార్సీపీ వారు వ్యాఖ్యానిస్తుంటారు. ప్రస్తుతం తీసుకువచ్చిన పీపీపీ విధానం కూటమి ప్రభుత్వానికి మరణశాసనం అయినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాన్ని కొందరు మేధావులు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ తీరు ప్రజలకు ఆందోళన కలిగించేదిగా ఉందన్నది వాస్తవం.ప్రైవేటువారు అభివృద్ది చేసుకునే రాజధాని అమరావతిలో ప్రభుత్వం లక్షల కోట్లు వెచ్చించడానికి సిద్దం అవుతూ, ప్రభుత్వపరంగా పేద, మధ్య తరగతి ప్రజలకు సేవలందించే కార్యక్రమాలను ప్రైవేటువారికి అప్పగించి యూజర్ చార్జీల భారం మోపడానికి తయారవుతున్న వైనం చూస్తే ఇదంతా రివర్స్ ప్రభుత్వం అన్న భావన కలగదా! సామాజిక రంగాలలో సేవలన్నిటిని ప్రైవేటుకు అప్పగించాక ప్రభుత్వ బాధ్యత ఏమి ఉంటుంది? పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టడం తప్ప అని కొందరు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. అది నిజమేకదా అనిపించదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఇది కూటమి సర్కారువారి డైవర్షన్ డ్రామా!
సాక్షి, గుంటూరు: కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయన కుటుంబానికి సంబంధించిన ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించడం ఏపీలో రాజకీయ వేడిని పెంచింది. ఇన్నాళ్లుగా సీబీఐ విచారణలో కనిపించని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ఇప్పుడు పీఎంఎల్ఏ పేరిట హఠాత్తుగా రంగంలోకి రావడంపై వైఎస్సార్సీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ సోదాలు కూటమి ప్రభుత్వం వారి కొత్త డైవర్షన్ డ్రామా అంటూ మండిపడుతోంది.వివేకా హత్య కేసుకు సంబంధించి హైదరాబాద్‌లో రెండు, కడప జిల్లాలో నాలుగు ప్రాంతాల్లో.. మొత్తం పది చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డికి సంబంధించిన ప్రాంతాలతో పాటు ఇతర వ్యక్తుల నివాసాలు, కార్యాలయాల్లోనూ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఉన్నట్లుండి ఈ కేసులో హవాలా మనీ కోణం తెరపైకి రావడం పలు అనుమాలకు తావిస్తోంది.ఇంతకాలం ఈడీ ఎక్కడ?2019 మార్చి 15న పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. తొలుత రాష్ట్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టగా.. అనంతరం కేసు సీబీఐకి వెళ్లింది. సీబీఐ 2020 నుంచి దర్యాప్తు కొనసాగిస్తూ చార్జ్షీట్లు, అనుబంధ చార్జ్షీట్లు దాఖలు చేసింది. తాజాగా మూడో అనుబంధ చార్జ్‌షీట్ దాఖలు చేసిన అనంతరం.. ఇకపై మరింత దర్యాప్తు అవసరం లేదని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. వివేకా కుమార్తె సునీతారెడ్డి మాత్రం కేసులో మరింత లోతైన దర్యాప్తు అవసరమని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సీబీఐ ఇప్పటికే దర్యాప్తు పూర్తిచేసినట్లు ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. ఆ దశలో తదుపరి దర్యాప్తుపై జోక్యం చేసుకోలేదు.ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అదే హత్య కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ సోదాలు నిర్వహించడం రాజకీయంగా ప్రశ్నలకు తావిస్తోంది. సీబీఐ దర్యాప్తు దాదాపు ముగిసిందని చెబుతున్న సమయంలో.. కొత్తగా ఈడీ ఎందుకు రంగంలోకి వచ్చింది? ఇంతకాలం ఈడీ పేరు ఎక్కడా లేకుండా ఇప్పుడు హఠాత్తుగా సోదాలు ఎందుకు? అంటూ వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తోంది.డీఎస్సీ వివాదం.. అవినీతి ఆరోపణల వేడిఇదే సమయంలో.. ఏపీలో కూటమి ప్రభుత్వం డీఎస్సీ వ్యవహారం సహా పలు అంశాలపై విమర్శలు ఎదుర్కొంటోంది. డీఎస్సీలో అవకతవకలు జరగడం.. అసెంబ్లీ సమావేశాల్లో వాటిని పరోక్షంగా ఒప్పుకోవడం.. మండలిలో చర్చకు వైఎస్సార్సీపీ పట్టుబట్టడం.. భయపడి కూటమి ప్రభుత్వం పారిపోవడం తెలిసిందే. అటు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కూడా ఈ కుంభకోణాన్ని బయటపెట్టి.. చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్‌ను ఏకీపారేశారు. 2018 గ్రూప్-1 విషయంలో తాము సీబీఐ విచారణకు సిద్ధమని, డీఎస్సీపై సీబీఐ విచారణకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వివేకా కేసును మళ్లీ తెరపైకి తీసుకొచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.‘డైవర్షన్ డ్రామా’నేఈడీ సోదాల వెనుక కేంద్ర దర్యాప్తు అవసరం కంటే రాజకీయ ప్రయోజనమే ఎక్కువగా కనిపిస్తోందనే చర్చ నడుస్తోంది. వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు దీని వెనుక ఉన్నారనే అనుమానాలు బలపడుతున్నాయి.‘‘కూటమి ప్రభుత్వ తప్పులను, అవినీతి ఆరోపణలను, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకు ఏదో ఒక డైవర్షన్ డ్రామాకు దిగుతుంది. గత రెండేళ్లలో ఏపీలో జరుగుతోంది ఇదే. ఇప్పుడు కూడా ఇంతే’’ అని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. మొత్తానికి వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసినట్లు చెబుతున్న వేళ.. అదే కేసులో ఈడీ ఎంట్రీ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో మరో హైడ్రామాకు తెరలేపినట్లైంది. -
బాబు, లోకేశ్‌కు వైఎస్ జగన్ ఓపెన్ చాలెంజ్
సాక్షి, తాడేపల్లి: ఏపీపీఎస్సీ గ్రూప్-1లో ఎలాంటి అవకతవకలు జరగలేదని చంద్రబాబు వేసిన సిట్ చెప్పిందని.. అయినా దుష్ప్రచారం ఆపడం లేదని కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఆయన సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు ఓపెన్ చాలెంజ్ విసిరారు. గురువారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీపీఎస్సీ గ్రూప్-1 చంద్రబాబు హయాంలో రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఎన్నికల ముందు హడావిడిగా ఆయన దానిని రిలీజ్ చేశారు. మేం అధికారం చేపట్టక ముందే ప్రిలిమ్స్ జరిగాయి. ప్రిలిమ్స్‌లో పాసైన వాళ్లకే మేం మెయిన్స్, ఇంటర్వ్యూలు నిర్వహించాం. ఎలాంటి అవకతవకలు జరగలేదని.. చంద్రబాబు వేసిన సిట్ చెప్పింది. వాల్యూయేషన్‌లో ఎలాంటి తప్పులు జరగలేదని తేల్చి చెప్పింది. అయినా కూడా పదే పదే తప్పుడు ప్రచారాలు చేశారు. అసలు ఏపీపీఎస్సీలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన ఘనత మాది. మరి బాబు హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ ఫలితాలను బయటపెట్టగలరా? అని సవాల్ విసిరారు. బాబు హయాంలో ఏపీపీఎస్సీలో జరిగిన ఫలితాలను బయటపెట్టగలరా?.. రిటన్ టెస్ట్‌లో ఎన్ని మార్కులు, ఇంటర్వ్యూలో ఎన్ని మార్కులు చెప్పగలరా? అని ప్రశ్నించారు. గ్రామ సచివాలయాల్లో లక్షా 30 వేల ఉద్యోగాలిచ్చాం. మా హయాంలో 78 నోటిఫికేషన్లతో 6,296 ఉద్యోగాలిచ్చాం. ఒక్క ఆరోపణ అయినా వచ్చిందా? అని ప్రశ్నించారు. మా హయాంలో నిర్వహించిన 2018 గ్రూప్-1పై సీబీఐ దర్యాప్తునకు నేను రెడీ.. మీ హయాంలో జరిగిన 2025 డీఎస్సీపై సీబీఐ దర్యాప్తునకు మీరు సిద్ధమా? అని చంద్రబాబుకి వైఎస్ జగన్ ఓపెన్ చాలెంజ్ విసిరారు.తప్పు చేయలేదు కాబట్టే తల ఎత్తుకుని అడుగుతున్నాం. ఫస్ట్ ర్యాంకర్ నవీన్‌కు ఎందుకు ఉద్యోగం రాలేదు?. విద్యాశాఖ మంత్రి ఆదేశాలు లేకుండా జీవోలు ఇవ్వగలరా?. బేరసారాల ఆడియో, వీడియో టేపులపై చర్యలేవీ?. సీబీఐ విచారణ జరిపించాలని ప్రధాని మోదీకి లేఖ రాశాం. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశాం. సీబీఐ విచారణ చేయించాలని కోర్టును కూడా ఆశ్రయించాం. సవాల్‌కు సిద్ధమైతే.. విచారణకు సిద్ధమైతే దర్యాప్తు సంస్థకు లేఖ రాయండి అని వైఎస్ జగన్ అన్నారు. -
కొడుకును కాపాడుకునేందుకే చంద్రబాబు ఆక్రోశం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: స్పోర్ట్స్‌కోటాలో ఉద్యోగాలు అమ్ముకునే ప్రయత్నాలు జరిగాయన్నది వాస్తవమేనని అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వమే ఒప్పుకుందని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చెప్పారు. అందుకు సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పులు బయటకు వచ్చాయని.. కేసు కూడా నమోదైందని ఆయన గుర్తు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీవోలిచ్చే స్థాయికి డీఎస్సీ స్కాం వెళ్లింది. మంత్రి ఆమోదం లేకుండా జీవోలు ఇస్తారా?. డీఎస్సీ స్కాంపై ఆడియో, వీడియో టేపులు బయటకు వచ్చాయి. టేపులు బయటకు వచ్చినట్లు బాబు, లోకేశ్‌లు ఒప్పుకున్నారు. ఎంతో సీరియస్ యాక్షన్ తీసుకున్నట్లు బిల్డప్ ఇచ్చారు. కానీ, జరిగింది ఏంటో తెలుసా?.. ఎఫ్ఐఆర్ కాపీలో నిందితుడిని సస్పెక్టెడ్ అని రాశారు. అరెస్ట్ శిక్ష సంగతి పక్కన పెడితే.. ఆ వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. అసలు వెంటనే ఎఫ్ఐఆర్ రాయకుండా ఉన్నతాధికారులతో ఎందుకు మాట్లాడారు?. ఆడియో, వీడియో టేపుల్లో ఆ వ్యక్తి ఫోన్ నెంబర్ బయటకు వచ్చింది. ఆ నెంబర్ ఎవరిదనేది కనుక్కోవడం పోలీసులకు ఎంత సేపు పని?. దారుణంగా అబద్దాలు ఆడుతున్నారు.. నిందితులను కాపాడుతున్నారు అని వైఎస్ జగన్ అన్నారు.డీఎస్సీలో జాబ్ ఇస్తారని ఓ మహిళా అభ్యర్థి దగ్గర డబ్బు తీసుకున్నారు. ఆపై మోసం చేశారు. ఏపీ టూరిజంలో మరో ఉద్యోగం ఇస్తారని మభ్య పెట్టారు. ఆమె తనను మోసం చేశారని కంప్లయింట్ చేశారు. ఎవరికి రూ.14 లక్షలు ఇచ్చారో అనేది కూడా ఉంది. డీఎస్సీ అని పేర్కొనకుండా.. ఏపీ టూరిజంలో మోసం చేశారని పోలీసులు ఎఫ్ఐఆర్లో రాశారు. గతేడాది నవంబర్లోనే ఇది జరిగితే.. ఇప్పటిదాకా ఎలాంటి కేసు లేదు. కేసులో పురోగతి లేదని ఎస్పీకి ఆమె ఫిర్యాదు చేసినా.. పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవే కాదు.. డీఎస్సీ విషయంలో ఏ ఫిర్యాదు వచ్చినా పక్కన పెట్టారు.నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కానీ, ఇక్కడ నారా లోకేశ్‌తో చంద్రబాబు రాజీనామా చేయట్లేదు. పైగా మరింత దిగజారిపోయారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1లో అవకతవకలు జరిగాయని దుష్ప్రచారానికి దిగారు. కానీ, ఆ వ్యవహారం అయన ప్రభుత్వం చివర్లోనే ప్రిలిమ్స్ జరిగింది.ఆక్రోశంతో దుష్ప్రచారం2019కి ముందే బాబు హయాంలో ఆ నోటిఫికేషన్ వచ్చింది. మా ప్రభుత్వం అధికారం చేపట్టకముందే(2019 మే 26న).. ప్రిలిమ్స్ జరిగాయి. మేం ప్రిలిమ్స్‌లో పాసైన వాళ్లకు మెయిన్స్ మాత్రమే నిర్వహించాం. ఆ తర్వాత కోవిడ్ కారణంగా డిజిటల్ వాల్యూయేషన్ జరిపించాం. అయితే కొంత మంది హైకోర్టులో పిటిషన్ వేశారు. డిజిటల్ వాల్యూయేషన్‌ను పరిగణనలోకి తీసుకోకుండా మాన్యువల్ వాల్యూయేషన్ చేయాలని కోర్టు చెప్పింది. అలా చేశాకే.. నియామకాలు జరిపాం. అలాంటప్పుడు అక్రమాలకు తావెక్కడిది?. అయితే చంద్రబాబు ప్రభుత్వం.. డిజిటల్ వాల్యూయేషన్‌లో అవకతవకలు జరిగాయని అంటోంది. హైకోర్టు ఆదేశాల మేరకు వాటిని పక్కన పెట్టాక ఆ ప్రస్తావన మళ్లీ ఎందుకు వస్తోంది?. అంటే.. ఇది 165 మంది జీవితాలను అతలాకుతలం చేసే ప్రయత్నమా?. ఇదే గ్రూప్-1 వ్యవహారంపై నాలుగేళ్ల తర్వాత చంద్రబాబు విషం కక్కుతున్నారు. 2025లో సిట్ వేశారు. ఆ సిట్ అధికారులు ఏ తప్పు జరగలేదని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇరికించే కుట్రలో భాగంగా మరో సిట్ వేశారు. సిట్‌లో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వంలో పని చేసేవారే కదా?. నిజాలను ఎవరూ దాచిపెట్టలేరు.. బయటకు రావాల్సిందే. మా హయాంలో ఇప్పటి డీఎస్సీ మాదిరి ఏ స్కాంలు జరగలేదు. మేమేం పరీక్షలే నిర్వహించకుండా.. ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎవరికీ అనుకూలంగా జీవోలు తేలేదు. ఉద్యోగాలు అమ్ముకుంటున్నట్లు.. బేరసారాలు జరిగినట్లుగా.. ఆడియో, వీడియోలు ఇలాంటి ఆధారాలేవీ బయటకు రాలేదు. మా హయాంలో ఎలాంటి అక్రమాలు జరగలేదు. కొడుకును కాపాడుకునేందుకే చంద్రబాబుకి ఈ ఆక్రోశం’’ అని వైఎస్ జగన్ అన్నారు.డీఎస్సీలో లీకేజీల నుంచి బేరసారాల వరకు పరిశీలించాలి. మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరగాల్సిందే. విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాల్సిందే అని వైఎస్ జగన్ ఉద్ఘాటించారు. -
పీవీ సింధులా ఎంత మందికి మెడల్స్ వచ్చాయి?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ నియామకాల్లో పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకునేందుకే స్పోర్ట్స్ కోటాను ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన డీఎస్సీ అవకతవకలపై పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.డీఎస్సీ పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారని జగన్ నిలదీశారు. పరీక్ష పెట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అసలు ఎలా అనగలిగిందని ప్రశ్నించారు. ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చే సమయంలో కనీసం అభ్యర్థుల విద్యా సామర్థ్యాన్ని కూడా పరీక్షించాల్సిన అవసరం లేదా? అని అన్నారు. ‘‘చదువు చెప్పే వారికి పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇస్తారా? చంద్రబాబు, లోకేశ్ మైండ్‌లో చిప్‌లు ఉన్నాయా? లేదా?’’ అని మండిపడ్డారు. స్పోర్ట్ కోటాలో ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా జీవోలు కూడా జారీ చేశారని.. రిక్రూట్మెంట్లు అయ్యాక వాటిని వెనక్కి కూడా తీసుకున్నారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. పీవీ సింధుకు ఇచ్చినట్లుగానే ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారు.. కానీ పీవీ సింధులా ఎంతమంది అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని పతకాలు సాధించారు? అని ప్రశ్నించారు. అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని దేశానికి ఎన్నో పతకాలు సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు ప్రత్యేక కేటగిరీ కింద ఉద్యోగం ఇవ్వడాన్ని ఎవరూ తప్పుపట్టరని ఆయన అన్నారు. కానీ అదే పేరుతో సాధారణ నియామక ప్రక్రియను పక్కనపెట్టి వందల మందికి ఉద్యోగాలు ఇవ్వడాన్ని ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు.పీవీ సింధు స్థాయిలో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నవారు ఎంతమంది? దేశానికి, రాష్ట్రానికి పతకాలు సాధించినవారు ఎంతమంది? అనేది చెప్పాలని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ నిలదీశారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన 372 మంది అర్హతలు, వారు సాధించిన పతకాలు, ప్రభుత్వం జారీ చేసిన జీవోల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.చంద్రబాబు, నారా లోకేశ్‌ల అబద్ధాలు ఏస్థాయిలో ఉన్నాయంటే.. ఆర్చరీలో గోల్డ్ మెడల్ అందుకున్న దుర్గయ్యకి కూడా ఉద్యోగం రాలేదు. కాల్‌లెటర్ పంపిన తర్వాత కూడా.. ఉద్యోగం ఇవ్వలేదు అంటే అర్థం చేసుకోవాలి అని వైఎస్ జగన్ అన్నారు. అందుకే తాము సీబీఐ దర్యాప్తు కోరుతున్నామని వైఎస్ జగన్ చెప్పారు. -
బాబూ...! 'ఓటుకు నోటు' కేసు మరిచిపోయావా?
ఎన్నికలలో డబ్బులు తీసుకోవడం మానేయలేమా? ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వచ్చిన ఒక పెద్ద సందేహం!కొందరు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం అయిన సందర్భంలో ఆయన ఈ ప్రశ్న వేశారు. నిజానికి చంద్రబాబు ప్రశ్న వేసుకోవలసింది తనకే కదా అని ఎవరికైనా డౌటు రావచ్చు. అసలు చంద్రబాబు చెప్పవలసిన మాటేమిటి? ఇకపై వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో సహా ఏ ఎన్నికలోను తాము పార్టీపరంగా ఓటర్లకు డబ్బు పంచబోమని, అలాగే ఏ పార్టీని పంచబోనివ్వబోమని కదా! నిజంగా ఈ మాట అని ఉంటే ఆయనకు మంచి పేరు వచ్చేది.ఇంతకాలం జరిగిన విషయాల సంగతెలా ఉన్నా ఇకపై ఎన్నికలలో డబ్బు ప్రభావం తగ్గించడానికి చంద్రబాబు ఇప్పటికైనా పూనుకోవడం మంచి పరిణామం కదా అని అంతా అనుకునేవారు. వాస్తవంగా అలా జరుగుతుందా? లేదా? అన్నది పక్కనబెడితే, కనీసం మాటవరసకైనా అన్నారులే అని భావించవచ్చు. ఇప్పుడు ఆ మాట చెప్పకపోవడంతో ఆయన చిత్తశుద్దిని శంకించే పరిస్థితి ఏర్పడుతుంది కదా! పైగా మహిళలే డబ్బు తీసుకుంటున్నట్లు మాట్లాడడంపై మాజీ మంత్రి రోజా వంటి వారు అభ్యంతరం చెప్పారు. ఇది మహిళలను అవమానించడమేనని ఆమె అభిప్రాయపడ్డారు.సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు అయితే ఘాటు వ్యాఖ్య చేస్తూ రాజకీయాన్ని వ్యాపారమయం చేసిందే చంద్రబాబు అని ధ్వజమెత్తారు. చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ జరపాలని ఈసీకి లేఖ కూడా రాశారు. నాయకులు రెండువేలు ఇస్తే, రెండు లక్షలు సంపాదించుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రెండు లక్షలేమి ఖర్మ.. రెండు కోట్లు అయినా కావచ్చు. అదేమి రహస్యం కాదు. మాకు నీతి ఉంది.. డబ్బులు తీసుకోబోమని చెప్పండి అని ఆయన అన్నారు. నేతలు డబ్బు ఇస్తుంటే తమకు నీతి ఉందని చెప్పండని, డబ్బు తీసుకోకుండా ఓటేయండి అని ఆయన అన్నారు. ఇది మంచిమాటే.ఎన్నికలలో డబ్బు ఇచ్చేవారిది తప్పుకాదా! తీసుకునేవారిదే అవుతుందా? ఒకప్పుడు ఈ డబ్బు ప్రభావం పెద్దగా ఉండేది కాదు. టీడీపీ ఆవిర్భావం తర్వాత, అది చంద్రబాబు నాయకత్వంలోకి వచ్చాకే ఇది బాగా అధికం అయిందని వివిధ రాజకీయ పక్షాల నేతలు విమర్శిస్తుంటారు. అందులో కొంత వాస్తవం లేకపోలేదు. ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ డబ్బు ఖర్చు పెడుతోందా? లేదా? ఓట్ల కొనుగోలుకు డబ్బు వ్యయం చేయడం లేదని చంద్రబాబు గుండెలమీద చెయ్యి వేసుకుని చెప్పగలరా? అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చేముందు ఆయా అభ్యర్దులను వారి పరిస్థితిని బట్టి 25 కోట్ల నుంచి ఏభై కోట్ల వరకు ఖర్చు చేయగలరా? లేదా? అని అడుగుతున్నారా? లేదా? కొందరి నుంచి కోట్ల రూపాయలు టిక్కెట్ కోసం వసూలు చేస్తున్నారా? లేదా? ఇతర పార్టీలు చేయడం లేదా?అని అడగవచ్చు.ఒకరిని బట్టి మరొకరు చేసే పరిస్థితి ఎలా వచ్చింది? చంద్రబాబు ఈ సుభాషితాలు చెప్పగానే అనేక పాత విషయాలు గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో వీడియో సహిత వ్యాఖ్యలు వచ్చాయి. ముఖ్యంగా ఓటుకు నోటు కేసును పలువురు ప్రస్తావించారు. 2015లో కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికిగాను ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి టీడీపీ ప్రయత్నించిందన్న ఆరోపణ వచ్చింది. ఆనాటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏభై లక్షల రూపాయలు తీసుకువెళ్లి ఏసీబీకి పట్టుబడిన వైనం, ఆ తర్వాత ఆ నామినేటెడ్ ఎమ్మెల్యేతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడి భరోసా ఇవ్వడం వంటి సన్నివేశాలు మరోసారి తెరపైకి వచ్చాయి.ఆ క్రమంలో అప్పటి సీఎం అయిన కేసీఆర్‌తో రాజీలో భాగంగానే అప్పటికప్పుడు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను వదలుకుని చంద్రబాబు విజయవాడ వెళ్లిపోయిన ఘట్టాన్ని గుర్తు చేస్తున్నారు. 1995లో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి కోట్లు వెచ్చించారని చంద్రబాబుపై స్వయంగా ఆయన మామ ఎన్టీ.రామారావు ఆరోపించారు. ఆ రోజుల్లో అత్తిలి నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగితే ఓటుకు 500 రూపాయలు చొప్పున టీడీపీ పక్షాన పంచామని కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి ఒక టీవీ షోలో ఓపెన్‌గానే కొన్నేళ్ల క్రితం చెప్పారు. అప్పటి నుంచి ఓటు రేటు పెరుగుతూ రెండువేలకు చేరుకుందని అంటారు.ఇక 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేసింది అందరికి తెలుసు. ఒక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తనకు ఏడు కోట్లు టీడీపీ నాయకత్వం ఇచ్చిందని ఆ రోజుల్లో బహిరంగంగానే వెల్లడించారు. మరో ఎమ్మెల్యే తనకు బెంగుళూరులో డబ్బు అందచేశారని అంటే, ఇంకొకరు తన అప్పు మొత్తం తీరిపోయిందని, అందుకే వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించానని ఆంతరంగికంగా చెప్పేవారు. నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నది చంద్రబాబు అభిప్రాయం.కొద్ది రోజుల క్రితం కూడా ఆయన ఒక ఉపన్యాసంలో ఈ ప్రస్తావన చేశారు. ఇతర విషయాల సంగతేమో కాని, ఎన్నికల విషయంలో ఆయన డబ్బు వ్యయంలో రాజీపడరని కొందరు సీనియర్ టీడీపీ నేతలు చెబుతుంటారు. అవసరమైతే అప్పు చేయడానికి వెనుకాడరు. అలా అప్పులు ఇచ్చినవారిలో కొందరు ఎన్ఆర్ఐలు ఉన్నారని ప్రచారం జరిగేది.తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయ్ కొత్తగా రాజకీయాలలోకి వచ్చి ఓటర్లకు డబ్బు ఇవ్వకుండా విజయం సాధించారని చెబుతారు. ఆయన మాదిరి ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు అదేబాటలో నడుస్తానని చెప్పి ఉండాల్సింది కదా! ఉచిత బస్ స్కీమ్ వల్ల మహిళల ఆత్మగౌరవం పెరిగిందట. అది ఎలా ఉందో కాని, బస్‌లలో జరుగుతున్న గొడవలపై పలుచోట్ల ప్రజలు చికాకు పడుతున్నారు. ఒకప్పుడు ఏదీ ఉచితం కాదని చెప్పిన చంద్రబాబు తాను ఉచిత బస్ వంటి స్కీమ్ అమలు చేస్తే మాత్రం గొప్ప సంగతి అని చెప్పుకుంటారు. అది ఆయన ప్రత్యేకత.ఈ సందర్భంలో ఒక మహిళ తాను ఫ్రీబస్ ఉందని హైదరాబాద్ నుంచి విశాఖకు వచ్చి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నానని, విజయనగరం నుంచి రోజూ ఉచిత ప్రయాణం వల్ల 3500 రూపాయలు సేవ్ అవుతున్నాయని అన్నారు. తీరా చూస్తే ఆమె ఏదో చీరల వ్యాపారం చేస్తున్నారని, రీల్స్ చేస్తుంటారని సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో ఈ ఉదంతం నవ్వులపాలైనట్లయింది. పైగా హైదరాబాద్‌లో కూడా ఫ్రీబస్ స్కీమ్‌ను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది కదా అని కొందరు పేర్కొంటున్నారు.మహిళలకు ఇచ్చిన ఇతర హామీల గురించి ప్రస్తావించకుండా చంద్రబాబు జాగ్రత్తపడుతుంటారు. ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల ఇస్తానన్న ఆడబిడ్డ నిధి గురించి మాత్రం మాట్లాడలేదు. ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ డబ్బు ఇస్తామని, వేలంపాట మాదిరి ఎన్నికల ప్రచారంలో చెప్పేవారు. దాని గురించి ఏమనుకుంటున్నారని చంద్రబాబు మహిళలను అడగలేదు. ఒక్కో కుటుంబానికి నాలుగు పథకాలు వస్తున్నాయని ఆయనే అంటారు. చేపలు ఇవ్వడం కాదు. చేపలు పట్టడం నేర్పాలి.. అని ఆయనే చెబుతారు. దేనిని నమ్మాలి!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్
సాక్షి, అమరావతి: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆయన సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు, డీఎస్సీపై మాట్లాడారు.వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్..డీఎస్సీ అక్రమాలపై ఆధారాలు ప్రజల ముందు ఉంచాం.డీఎస్సీ అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రశ్నిస్తే గింజుకున్నారు. తప్పు ఒప్పుకోవడం లేదు.తప్పులను ప్రతిపక్షం ఎత్తుచూపుతున్నదని చంద్రబాబుకు భయంఅసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్ బ్యాటింగ్ చేస్తున్నారు.ప్రతిపక్షానికి సమయం ఇవ్వాల్సి వస్తుందని హోదా ఇవ్వడం లేదు. ప్రశ్నపత్రం తయారీ ఎస్సీఈఆర్టీ బాద్యతరెండూ ఒకే వ్యక్తి చేతిలోపెడితే పారదర్శకత ఉంటుందా?ఇక్కడే స్కామ్‌కు బీజం పడింది.ఒకే వ్యక్తి చేతిలో రెండు బాధ్యతలు ఎందుకు పెట్టారు?స్వయంగా లోకేష్ సభలో అంగీకరించారు.ఏపీ డీఎస్సీ నియామాక చరిత్రలో ఎప్పుడు ఒకే వ్యక్తికి రెండు బాధ్యతలు అప్పగించలేదుపేపర్ తయారీ విభాగంలో వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది.పరీక్ష నిర్వహణ డీఎస్సీ కన్వీనర్‌ది.ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో ఫస్ట్ ర్యాంకర్ నవీన్ పేరు ఉందిఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్‌కు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు?వెరిఫికేషన్‌లో నవీన్ పేరు లేదని ఉద్యోగం ఇవ్వలేదటఇదే వాస్తవం అయితే నవీన్ కోర్టుకు ఎందుకు వెళ్లాడు?సెకెండ్ వెరిఫికేషన్ లిస్టులో కూడా నవీన్ పేరు తొలగించారు.సర్టిఫికెట్ వెరిఫికేష్కు నవీన్ ఎలా వస్తాడు?డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై చర్చకావాలంటూ నాలుగు రోజులపాటు శాసనమండలిని మా ఎంఎల్సీలు స్తంభింపచేశారు.కాని, అక్కడ డిస్కషన్ చేయడానికి ముందుకు రావడంలేదు. ఎందుకు కౌన్సిల్లో చర్చకు ఒప్పుకోలేదంటే, కారణం డీఎస్సీలో తప్పులు జరిగాయి కాబట్టి, సీబీఐ విచారణ చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి, జరిగిన దానికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామాచేసి తప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి. డీఎస్సీ పరీక్షల ప్రశ్నల తయారీ–పరీక్ష నిర్వహణ రెండూ ఒకే అధికారి చేతిలో పెట్టినట్టు లోకేష్ స్వయంగా అంగీకరించారు. మేం లేవనెత్తిన కీలక అంశంకూడా ఇదే. అంగీకరించడమే కాకుండా, తప్పేముంది అని దబాయించాడు.ప్రశ్నలు తయారుచేసే వ్యవస్థకు, పరీక్ష నిర్వహించే వ్యవస్థకు మధ్య ఉండాల్సిన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎందుకు తొలగించారో దర్యాప్తు జరగాలి, అంతేకాదు, ఒకే వ్యక్తి చేతిలో రెండు కీలక బాధ్యతలు ఎందుకు పెట్టారో తేలాలి? అందుకే సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం.మరి ఇన్ని తప్పులు కనిపిస్తున్నప్పుడు సీబీఐ దర్యాప్తు జరగాలా? వద్దా?వాళ్ల మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకున్నారు.చదువు చెప్పేవారికి పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇచ్చేస్తారా?డీఎస్సీ నియామకం తర్వాత ఇచ్చిన జీవోను ఎందుకు వెనక్కి తీసుకున్నారుపీవీ సింధు పేరు చెప్పి చంద్రబాబు, లోకేష్ అబద్ధాలుచరిత్రలో లేనివిధంగా పరీక్ష రాయని వారికి ఉద్యోగాలు ఇచ్చేశారు.మెడల్స్ కాదు కేవలం పాల్గొన్నందుకే ఉద్యోగాలు ఇచ్చేశారు.గతంలో డీఎస్సీ క్వాలిఫై అయితేనే ఉద్యోగం వచ్చేది.జీవోలు ఇచ్చే స్థాయికి స్కాం వెళ్లింది.372 మందికి ఉద్యోగాలిచ్చిన జీవోలను రద్దు చేశారు.మంత్రి ఆమోదం లేకుండా జీవోలు ఇస్తారా?డీఎస్ స్కాంపై ఆడియో, వీడియో టేపులు బయటపడ్డాయి.డీఎస్సీ పరీక్ష రాయకుండానే, చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, అసలు పరీక్ష రాయకుండానే, స్పోర్ట్స్‌కోటాలో పోస్టులు ఇచ్చామని, దీనికోసం జీవోలు జారీచేశామనికూడా ఒప్పుకున్నారు.దీన్ని సమర్థించుకోడానికి చెప్పిన కబుర్లు మామ్మూలుగా లేవు.స్పోర్ట్స్ పర్సన్స్‌కు టెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదంట, పీవీ సింధులాంటి వారికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి, పిల్లలకు చదువుచెప్పే ఈ టీచర్ ఉద్యోగాలూ కూడా అలాగే ఇచ్చారంట?ఇలా అడ్డగోలుగా సమర్థించుకోవడం ఆ అబ్బా, కొడుకులు ఇద్దరికే తప్ప, ఎవరికైనా సాధ్యం అవుతుందా?పీవీ సింధుకు, డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో నింపిన 372 ఉద్యోగాలకు మధ్య పోలిక తీసుకువచ్చినందుకు చంద్రబాబును, లోకేష్‌ను ఏమనుకోవాలి? వీళ్ల మైండ్‌లో చిప్‌లు ఉన్నాయా? లేవా? ఉంటే అవి పనిచేస్తున్నాయా? లేవా?పీవీ సింధుకు 2016 రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ వచ్చాయి. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఛాంపియన్ షిప్, కామన్వెల్త్, ఏసియన్ గేమ్స్, ఇలా చాలా ఇంటర్నేషనల్ టోర్నీల్లో ఎన్నో విజయాలు సాధించింది. స్పోర్ట్స్ కోటాలో నియమించిన దాదాపు 372 మందిలో పీవీ సింధులా ఎంతమందికి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ అచీవ్మెంట్స్ ఉన్నాయి? బుద్ధి ఉన్నోడు ఎవరైనా ఇలాంటి పోలికలు తెస్తారా?తన స్కాంలను కప్పిపుచ్చుకోవడానికి సింధులాంటి ప్లేయర్‌ను అడ్డుపెట్టుకుంటున్నాడు.సింధులాంటి వాళ్లకు ఇవ్వడానికే టీచర్ రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్కోటాకు ఈ కొత్త జీవోలు ఇచ్చామని, చెప్తున్న ఈ చంద్రబాబు, లోకేష్ - ఇద్దరూ కూడా మళ్లీ ఇచ్చిన ఆ జీవోలను ఎందుకు ఎత్తివేశారో మాత్రం అసెంబ్లీలో సమాధానం చెప్పలేకపోయారు.ఒకవైపు సింధు పేరుచెప్పి, మరోవైపు వీళ్ల అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయి - అంటే, చివరకు ఆర్చరీలో నేషనల్ ఛాంపియన్ షిప్ సాధించిన, ఎస్టీ కేండిడేట్ దుర్గయ్యకు కూడా, కాల్ లెటర్ పంపిన తర్వాత కూడా, పోస్టు ఇవ్వకుండా అన్యాయం చేశారు. డీఎస్సీ విషయంలో ఏ ఫిర్యాదు వచ్చినా పక్కన పెట్టారు.విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందే: వైఎస్ జగన్‘నీట్’ లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాధర్మేంద్ర ప్రధాన్‌కు ఒక నీతి.. బాబు కుమారునికి మరొక నీతా?కొడుకును కాపాడుకునేందుకు బాబు మరింత దిగజారుడుబాబు, లోకేష్ డైరెక్షన్లోనే పోలీసుల వ్యవహరంమేం నిర్వహించిన ఎపీపీఎస్సీలో లీకేజీ జరగలేదు.స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టుల అమ్మకాలు, బేరసారాలు చేసినట్టుగా, ఆడియో, వీడియో కాల్స్ బయటకు వచ్చినట్టుగా అసెంబ్లీలోనే ఒప్పుకున్నారు.మరి వీడియోలో బేరసారాలు చేస్తున్న వ్యక్తి ఫోన్ నంబర్ అంత స్పష్టంగా ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ కాపీలో, పేరు చూపకుండా, కేవలం సస్పెక్ట్ అని ఎందుకు రాయాల్సి వచ్చింది? ఎందుకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు సీనియర్ అధికారులతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అసలు ఆకేసును ఎందుకు నిర్వీర్యం చేశారు. మరి చంద్రబాబు, లోకేష్‌లు ఇద్దరూ వీటికి ఎందుకు సమాధానం చెప్పలేదు? ఒంగోలులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఒక డీఎస్సీ అభ్యర్థికి స్పోర్ట్స్‌కోటాలో పోస్టు ఇప్పిస్తామని రూ.14లక్షలు తీసుకున్నారు.రిఫరెన్స్‌గా మరో వ్యక్తికి కూడా ఇలాగే చేస్తున్నామని చెప్పారు. రిఫరెన్స్‌గా చూపిన వ్యక్తికి పోస్టు వచ్చింది, కాని, ఈ అమ్మాయికి పోస్టు రాలేదు. గట్టిగా అడిగితే ఏపీ టూరిజంలో మరో ఉద్యోగం ఇస్తామంటూ మభ్యపెట్టారు. తనకు అన్యాయం జరిగిందని, ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాని పోలీసులు ఎఫ్ఐఆర్లో డీఎస్సీ పోస్టుకోసం బేరసారాలు చేశారని రాయకుండా, టూరిజం పోస్టుకోసం అన్నట్టుగా రాశారు.గత ఏడాది నవంబర్ 11న, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే, ఇప్పటివరకూ ఎలాంటి చర్యల్లేవు. తన కంప్లైంట్‌పై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని ఎస్పీకి ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు.అంటే డీఎస్సీ విషయంలో ఏ కంప్లైంట్ వచ్చినా, ఎక్కడవి అక్కడే ఎలాంటి విచారణ లేకుండా వదలిలేయాలని, తండ్రికొడుకులు ఇద్దరూ ఆదేశాలు ఇచ్చినట్టుగా, దాన్ని పోలీసులు పాటిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది.లీకేజీ దగ్గరనుంచి స్పోర్ట్స్‌కోటా వరకూ, ఆపై బేరసారాల వరకూ ఇవన్నీ కూడా సమగ్రంగా పరిశీలించాల్సిన అంశాలు.అందుకే డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరగాలి. జరిగిన వాటికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి. మేం ఎవరికీ అనుకూలంగా జీవోలు తీసుకురాలేదుకొడుకును కాపాడుకునేందుకే చంద్రబాబు ఆక్రోశంనిజాలను ఎవరూ దాచలేరు.. బయట పెట్టాల్సిందేఅప్పట్లో కోవిడ్ వల్ల డిజిటల్ వాల్యుయేషన్‌కు వెళ్లాం.మార్కుల ఆధారంగా 165 మందికి ఉద్యోగాలు ఇచ్చాం.కొంతమంది కోర్టుకు వెళ్లడంతో డిజిట్ వాల్యుయేషన్‌ను పరిగణలోకి తీసుకోలేదు.మాన్యువల్ వాల్యుయేషన్ చేయాలని కోర్టు ఆదేశించింది.నాలుగేళ్ల తర్వాత చంద్రబాబు విషం కక్కుతున్నారు. కొడుకును కాపాడుకునేందుకు చంద్రబాబు కొత్త గేమ్ మొదలుపెట్టాడు. మరింత దిగజారిపోయి 2018- ఏపీపీఎస్సీ గ్రూప్-1 భర్తీపై తప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టాడు.163 మంది ఉన్నత ఉద్యోగుల జీవితాలను అతలాకుతలం చేయాలని చంద్రబాబు టార్గెట్ చేశాడు.అప్పటి ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇప్పటి, డీఎస్సీ మాదిరిగా పేపర్ లీకేజీ అప్పుడు జరగలేదు.ఇప్పటి డీఎస్సీ మాదిరిగా ప్రశ్నపత్రాల విభాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ లేదా ఇతర ఉద్యోగులు ఎవ్వరికీ ర్యాంకులు రాలేదు. ఎవ్వరికీ అనుకూలంగా ప్రత్యేక జీవోలు ఇవ్వలేదు, పరీక్షలే లేకుండా ఎవ్వరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు.ఉద్యోగాలు అమ్ముకున్నట్టుగా, డబ్బులు ఇచ్చినట్టుగా, బేరసారాలు చేస్తున్నట్టుగా ఆడియో, వీడియో ఆధారాల్లాంటివి బయటకు రాలేదు.బయటకు వస్తున్నదల్లా చంద్రబాబు ఆక్రోశం. కొడుకును కాపాడుకోవాలన్న ఆయన ఆరాటం మాత్రమే.చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాదిలోనే 2025, ఏప్రిల్‌లో ఒక సిట్ వేశాడు. ఫైనల్ ఫలితాల వెల్లడిలో ఏ తప్పూ జరగలేదని హైకోర్టులో గవర్నమెంటు అడ్వకేట్లు సైతం అఫడవిట్ ఫైల్ చేశారు. ఇది ఓవైపు జరుగుతుండగానే 2026 ఫిబ్రవరి 14న మరొక సిట్ వేశారు. సిట్‌లో ఉండేది ఎవరు? చంద్రబాబుగారి కింద పనిచేసే వారే.బురదజల్లడంకోసం దర్యాప్తు బృందాలను ఇష్టానుసారంగా వాడుకోవడం చంద్రబాబుకు కొత్తకాదు.గ్రూప్-1 వాల్యూషన్‌కు సంబంధించి హాయ్‌ల్యాండ్‌లో ఏదో జరిగిపోయిందని, అదే పనిగా, ఒకే అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు. హాయ్లాండ్లో ఎలాంటి ఎవాల్యూషన్ జరగలేదని అఫీషియల్ డాక్యుమెంట్స్ చాలా స్పష్టంగా చెప్తున్నాయి.చంద్రబాబు ప్రభుత్వమే 2025 నవంబర్ 15న, హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కూడా ఇదే విషయాన్ని రాశారు.మరి ఏదో జరిగిపోయిందన్న ప్రచారం ఎందుకు చేస్తున్నారు?గ్రూప్ -1పై ఎల్లో మీడియా దుష్ప్రచారం మొదలుపెట్టింది.బాబు హయాంలోని ఏపీపీఎస్సీ ఫలితాలు బయటపెట్టగలారా?ఇంటర్వ్యూలలో ఎన్ని మార్కులు వచ్చాయో, రిటన్ టెస్ట్‌లో ఎన్ని మార్కులు వచ్చాయో చెప్పగలరా?.. చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్..ఏపీపీఎస్సీలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం: వైఎస్ జగన్ఒక్క ఆరోపణ లేకుండా 1.30 లక్షల మందికి ఉద్యోగాలిచ్చాం.2018 గ్రూప్ -1, 2025 డిఎస్సీ విచారణకు రెడీ.. సీబీఐ విచారణకు మీరు సిద్ధమా?తప్పు చేయలేదు కాబట్టి తలెత్తుకుని అడుగుతున్నాం.. చంద్రబాబు, లోకేష్‌కు వైఎస్ జగన్ సవాల్ మేం ఇచ్చిన దాంట్లో 7 నోటిఫికేషన్లను చంద్రబాబు పెండింగ్‌లో పెట్టాడు. మరో రెండింటిని రద్దు చేశాడు. ఇదీ నిరుద్యోగుల మీదున్న ప్రేమ.చంద్రబాబూ…మేం సవాల్ విసురుతున్నాం. మేం అడుగుతున్నట్టుగా DSC-2025పైనే కాదు, 2018 గ్రూప్-1 నోటిఫికేషన్మీదా, సీబీఐ ఎంక్వైరీ వేయండి. మేం రెడీ. చంద్రబాబు రెడీనా?తప్పు చేయలేదు కాబట్టి, మేం రెడీగా ఉన్నాం. చంద్రబాబు రెడీ అయితే వెంటనే సీబీఐ దర్యాప్తుకు లెటర్ రాయాలి. -
నేడు వైఎస్ జగన్ ప్రెస్‌మీట్
సాక్షి, అమరావతి: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడుతారు. -
పాదయాత్రపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నేతలతో ఇవాళ(బుధవారం) వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. నియోజకవర్గ ఇంఛార్జి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాదయాత్రపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘మరో ఏడాదిలో నా పాదయాత్ర మొదలవుతుంది. ఆ తర్వాత ఏడాది ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా మనదే విజయం. నిత్యం ప్రజలతో మమేకమై పని చేయండి’’ అంటూ వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచారని ఆయన దుయ్యబట్టారు.ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. విద్యార్థులు, రైతులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, ఉద్యోగులు, వ్యాపారులు.. ఇలా ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. అందుకే వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం మీద రెండేళ్లలోనే తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అదే సమయంలో మన వైయస్సార్సీపీపై రోజురోజుకీ ప్రజాదరణ పెరుగుతోంది. అందుకే నాటి గత మన ఐదేళ్ల పరిపాలనను, ఇప్పుడు వెన్నుపోటు పార్టీ కూటమి పాలనతో పోల్చి చూస్తున్నారు. దీనిపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది’’ అని వైఎస్ జగన్ వివరించారు. -
ఇంత అహంకారమా?.. మండలి పరిణామాలపై బొత్స ఆగ్రహం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో అధికార కూటమి సభ్యులు, మంత్రుల తీరుపై వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా సంప్రదాయాలను అధికార పక్షం తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ సభ్యులు డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై చర్చకు పట్టుబడుతుండగా.. సమాధానం చెప్పలేక మంత్రులు అసహనంతో వ్యవహరిస్తున్నారన్నారు. చివరకు సభను ఎలా నిర్వహించాలో చైర్మన్‌కే సూచనలు చేసే స్థాయికి మంత్రుల తీరు వెళ్లిందని ధ్వజమెత్తారు.బుధవారం శాసన మండలిలో.. డీఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, దీనిపై సమగ్రంగా చర్చించాల్సిందేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. దీనిపై వాయిదా తీర్మానం ఇచ్చినా చైర్మన్ అనుమతించకపోవడంతో సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. డీఎస్సీ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిబంధనలు ఒక్కరికే కాకుండా అందరికీ సమానంగా వర్తించాలని బొత్స పేర్కొన్నారు.ప్రశ్నలకు సమాధానం చెప్పలేక..వైఎస్సార్సీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కూటమి మంత్రులు గట్టిగా మాట్లాడటం, అసహనం వ్యక్తం చేయడం సరికాదని బొత్స అన్నారు. సభలో మంత్రుల తీరు చూస్తుంటే ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి లేకపోవడం స్పష్టమవుతోందని విమర్శించారు. సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. ప్రతిపక్ష సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తోందని మండిపడ్డారు.చైర్మన్‌నే ఆదేశిస్తారా?సభను నిర్వహించే విషయంలో మంత్రులు చైర్మన్ కొయ్యే మోషేనురాజుపై అసహనం వ్యక్తం చేయడాన్ని బొత్స తప్పుబట్టారు. “మండలిని ఎలా నిర్వహించాలో మీకు తెలియదా?” అంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు మంత్రి పార్థసారథి వైఎస్సార్సీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారని పేర్కొన్నారు. మంత్రుల వ్యాఖ్యలపై చైర్మన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారని బొత్స తెలిపారు. సభను ఎలా నడపాలో తనకు చెప్పాల్సిన అవసరం లేదంటూ చైర్మన్ మంత్రులకు స్పష్టం చేయడం.. అధికార పక్షం వ్యవహారశైలికి అద్దం పడుతోందన్నారు.చైర్మన్ సీటును గౌరవించాలిచైర్మన్ స్థానాన్ని మంత్రులు గౌరవించాల్సి ఉంటుందని బొత్స హితవు పలికారు. నాదెండ్ల మనోహర్ వ్యవహారశైలిని తాను చాలాసార్లు గమనించానని.. ఆయన చైర్మన్ పట్ల వ్యవహరించిన తీరు సరికాదన్నారు. ప్రొసీజర్ బుక్ తీసుకొచ్చి తానేమీ తప్పుగా మాట్లాడలేదని నాదెండ్ల సమర్థించుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదని అన్నారు. పొరపాటు జరిగితే చెప్పాలి కానీ.. చైర్మన్‌కే హితబోధ చేసేలా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు.కూటమి ఎమ్మెల్సీల తీరుపైనా..మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయంలో అధికార కూటమి సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోవడాన్ని కూడా బొత్స తప్పుబట్టారు. సభలో అధికార పార్టీ సభ్యులు లేకపోవడం సరికాదని, ఇది శాసనసభా సంప్రదాయాలను అగౌరవపరచడమేనని అన్నారు. డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన తూమాటి మాధవరావుకు బొత్స అభినందనలు తెలిపారు.“మండలిలో వెన్నుపోటు పార్టీ నేతల తీరు బాధాకరం. ఆ పార్టీ వైఖరి మరోసారి బయటపడింది. అధికార పార్టీ సభ్యులు సభను గౌరవించలేదు.. అగౌరవపరిచారు. సభా సంప్రదాయాలను తుంగలో తొక్కారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నికల సమయంలో అధికార పక్షం లేకపోవడం దురదృష్టకరం. రాష్ట్ర చరిత్రలో ఎన్నాడూ ఇలా జరగలేదు” అని బొత్స విమర్శించారు. ‘‘అధికార పక్షానికి అహంకరం పనికి కాదు. డిప్యూటీ చైర్మన్‌కు గౌరవం ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు. నీతులు చెప్పడమేనా? పాటించడం తెలియదా?. కూటమి సభ్యులు చరిత్ర హీనులుగా నిలిచిపోతారు’’ మరో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు.ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుందిప్రభుత్వం ఎంత దూరం పారిపోయినా ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుందని బొత్స స్పష్టం చేశారు. డీఎస్సీ అంశంతో పాటు అన్ని ప్రజా సమస్యలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అధికార పక్షం ఇప్పటికైనా అహంకార వైఖరిని విడనాడి ప్రతిపక్షం లేవనెత్తే అంశాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
జీతాలకే 98 శాతమా? చంద్రబాబు లెక్కలపై ఉద్యోగుల ఫైర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు ఎంత వ్యయం అవుతోంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా 94 నుంచి 98 శాతం వ్యయం అవుతోందని, సంక్షేమ స్కీములకు అప్పులు తెస్తున్నామని ఆర్ధిక పరిస్థితి శ్వేతపత్రం విడుదల సందర్భంగా చెప్పారు. దీనిపై ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన పడుతున్నారు. వారి సంఘాలు మండిపడుతున్నాయి. చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని ఉద్యోగ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. వీరిలో కొందరు టీడీపీ అనుకూల నేతలు కూడా ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఏపీ ఎన్జీవోల గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడుగా ఉన్న అలపర్తి విద్యాసాగర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే వ్యక్తి కాదని అంటారు. కాని ఆయన సైతం చంద్రబాబు అసత్యపు లెక్కలు చెప్పారని అంటున్నారు.చంద్రబాబు చెప్పేదానిలో నిజం ఉంటే, ఈ నేతలు ఇంత ధైర్యంగా ఖండించగలుగుతారా అన్నది చర్చ. చంద్రబాబు లెక్కల్లో ఎక్కువ సందర్భాలలో నిర్దిష్టత అన్నది ఉండదు. అందువల్ల ఆయన చెప్పేదానిలో సత్యం ఎంత ఉంది? అసత్యం ఎంత ఉంది అన్నది తేల్చడం అంత తేలికకాదు. మొత్తం ప్రభుత్వ లెక్కలన్నీ పరిశీలించి ఒక అవగాహనకు రావల్సి ఉంటుంది. అందువల్లే ఉద్యోగ సంఘాల నేతలు అన్నిటిని సరిపోల్చుకుని మాట్లాడినట్లు అనిపిస్తుంంది. విద్యాసాగర్ చెబుతున్నదాని ప్రకారం 30 నుంచి 35 శాతమే ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ఉ ద్యోగుల పెన్షన్లకు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం తప్పుడు లెక్కలతో వంచిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మరింత వివరంగా ఈ అంశంపై మాట్లాడారు. 2025లో ప్రభుత్వం వ్యయం చేసిన 2.26 లక్షల కోట్లలో 37.4 శాతం మాత్రమే ఉద్యోగులకు అయిన ఖర్చు అని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి వచ్చే పన్నుల రాబడిలో 59 శాతం, ఇతర రాబడి కూడా కలిపితే 49 శాతం మాత్రమే ఉద్యోగులకు పెడుతన్న ఖర్చు అని ఆయన వివరించారు. ఈ రెండేళ్లలో 41 వేల మంది రిటైరైతే, వచ్చే ఐదేళ్లలో లక్షన్నర మందికి పైగా రిటైర్ కాబోతున్నారని, అదే సమయంలో కొత్త రిక్రూట్ మెంట్ జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సంపద సృష్టించి హామీలు నెరవేర్చుతామని చంద్రబాబు అన్నారని, ఉద్యోగులకు పలు వరాలు ప్రకటించారని, జాబ్ కాలెండర్ ఇస్తామన్నారని, కాని ఇప్పుడేమో డబ్బంతా ఉద్యోగులకే అయిపోతోందని ప్రచారం చేస్తున్నారని వలిశెట్టి దామోదర్ అనే మరో ఉద్యోగ సంఘ నేత పేర్కొన్నారు.గతంలో ఉద్యోగుల నేతగా ఉండి, ప్రభుత్వ ఆగ్రహానికి గురైన మరో ప్రముఖుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని, ఉద్యోగులకు 30 వేల కోట్ల బకాయిలు చెల్లించామని ఆయన అనడం అసత్యమని అన్నారు. ఉద్యోగుల జీతాల ఖర్చు 35 నుంచి నలభై శాతమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికి 50 వేల కోట్ల మేర ప్రభుత్వం ఉద్యోగులకు బాకీ పడిందని ఆయన చెబుతున్నారు. ప్రభుత్వం చర్చలు జరిపి ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పినా, ఆచరణలో జరగడం లేదని ఈ నేతలంతా అంటున్నారు. మరోవైపు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బాధలు ఇంకో విధంగా ఉన్నాయి. వారు సభలు పెట్టుకుని ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.తమపై పనిభారం పెంచడమేకాకుండా,తమ 22 డిమాండ్లను పక్కనబెట్టిందని వారు ధర్నా చేశారు. కరపత్రాలు పంచడానికి తమను ఇంటింటికి వెళ్లమంటున్నారని,సర్వేల పేరుతో విసిగిస్తున్నారని, ఆ క్రమంలోతాము ప్రజల నుంచి ఈసడింపులు ఎదుర్కుంటున్నామని చెబుతున్నారు. ఇవన్ని చూస్తుంటే ప్రభుత్వంలో ఉద్యోగులలో దాదాపు ఎవరూ సంతోషంగా లేరనిపిస్తుంది. ఒకవైపు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి,కీలక మంత్రి ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లలో తిరుగుతూ కోట్లు వ్యయం చేస్తున్నారని,మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులపై మాత్రం ప్రజలలో చెడు అభిప్రాయం కలిగించడానికి యత్నిస్తున్నారని వారు ధ్వజమెత్తుతున్నారు.వీరు చెప్పే విషయాలలో చాలావరకు వాస్తవాలు ఉండవచ్చు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని చెప్పడం ద్వారా కొత్తగా పిఆర్సి వేయలేమని, ఇంటెరిమ్ రిలీఫ్ ఇవ్వలేమని చంద్రబాబు సంకేతం పంపినట్లయిందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. అమరావతి పేరుతో వేల కోట్ల అప్పు తెచ్చి ఇష్టారాజ్యంగా వ్యయం చేస్తున్న వైనాన్ని ఉద్యోగులు కూడా గమనిస్తున్నారు. ఏకంగా నాలుగు భవనాల అద్దాలకు 2500 కోట్లు, రీడిజైనింగ్ కన్సల్టెన్సీకి అదనంగా 206 కోట్లు, హైకోర్టు వెలుపల సుందరీకరణకు 540 కోట్లు.. ఇలా మితిమీరి ఖర్చు చేసే ప్రభుత్వం ఉద్యోగుల వద్దకు వచ్చేసరికి ఆదాయం అంతా జీతాలకే సరిపోతోందని చెప్పడం ప్రజలను తప్పుదారి పట్టించడానికేనన్నది వారి భావన. ఉద్యోగ సంఘాల నేతలపై కూడా రెడ్ బుక్ ప్రయోగం చేయకపోలేదు. అయినా వెంకట్రామిరెడ్డి వంటివారు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. టీడీపీ, జనసేన కలిసి ఇచ్చిన ఎన్నికల మానిఫెస్టోలో ఉద్యోగులకు ఏమి హామీలు ఇచ్చారో గమనించండి. ఉద్యోగుల గౌరవాన్ని పునఃప్రతిష్టిస్తామని ఒక సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే యత్నం చేశారు. కాని ఇప్పుడేమో అవమానించే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న భావన ఉద్యోగులలో కలుగుతోంది. జగన్ ప్రభుత్వం జిపిఎస్ తీసుకువచ్చి ఒక పరిష్కారాన్ని కనుగొనే యత్నం చేస్తే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు దానిపై దుష్ప్రచారం చేశారు.తాము అధికారంలోకి వస్తే పాత పెన్షన్ స్కీమ్, జిపిఎస్ విధానాలను పునఃసమీక్షించి పరిష్కారం చేస్తామని అన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఆ ఊసే తేవడం లేదు. మెరుగైన పీఆర్సీ,ఐఆర్. వెంటనే ప్రకటిస్తామని మానిఫెస్టోలో చెప్పినా అతీగతీ లేకుండా పోయింది. ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైరైనవారికి మొదటి తేదీనే జీతాలు పెన్షన్ ఇస్తామని,వారికి రావల్సిన బకాయిలు చెల్లిస్తామని వాగ్దానం చేశారు. కాని చంద్రబాబు ఈ విషయంలో చెబుతున్న లెక్కలు తప్పని ఉద్యోగ నేతలు విమర్శిస్తున్నారు. వలంటీర్ల గౌరవ వేతనాన్ని ఐదువేల నుంచి పదివేలు చేస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దేవుళ్ల సాక్షిగా ప్రకటించారు కాని, అసలు మొత్తం వ్యవస్థనే లేకుండా చేయడం మోసం కాదా అన్నది వారి ప్రశ్నగా ఉంది. ఈ నేపధ్యంలో ఉద్యోగ సంఘాలు ఉద్యమానికి సన్నద్దమవుతున్నాయి.అయితే ఏదో రకంగా వారిని భయపెట్టో, మభ్యపెట్టో వారి ఉద్యమానికి ప్రభుత్వపరంగా అడ్డుకట్ట వేసే యత్నం జరుగుతుంది. విశేషం ఏమిటంటే ఎల్లో మీడియా ద్వారా మాత్రం ఉద్యోగులకు ఏదో చాలా జరిగిపోతోందన్న భ్రమ కల్పించడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నించకపోలేదు. గత జగన్ ప్రభుత్వ టైమ్‌లో ఉద్యోగులను ఎన్నిరకాలుగా రెచ్చగొట్టాలో అన్ని విదాలుగా టీడీపీ,జనసేనలతో పాటు ఈనాడు,ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా రెచ్చగొట్టాయి. ఇప్పుడు అదేమీడియా ఉద్యోగులను మభ్యపెట్టే పనిలో పడింది. ప్రభుత్వ ఉద్యోగులు గత జగన్ టైమ్ లో తమ టైమ్ ప్రకారం డ్యూటీ చేసుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలకు జనాన్ని పోగు చేసే పనే ఎక్కువగా ఉంటోందని చెబుతున్నారు. ఇప్పటికైనా పాలేవో,నీళ్లేవో ఉద్యోగులు గమనించారా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మూడో రోజూ పారిపోయిన కూటమి
సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాల నేపథ్యంలో అసెంబ్లీ మూడోరోజు సమావేశాల మూడో రోజూ కూడా దద్దరిల్లింది. ఈ అంశంపై చర్చకు పట్టుబడుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే చైర్మన్ తిరస్కరణతో ఎమ్మెల్సీలు చర్చకు పట్టుబడుతూ ఆందోళనకు దిగారుఅప్డేట్స్మీడియా పాయింట్ వద్ద మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణమూడో రోజు కూడా కూటమి పారిపోయే వైఖరి అవలంభించింది..బయట మేకపోతు గంబీర్యం ప్రదర్శిస్తుంది.డీఎస్సీపై సీబీఐ ఎంక్వయిరీ వెయ్యాలని, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తున్నాం.. ప్రభుత్వ స్పందించడం లేదురాష్ట్ర చరిత్రలో కొత్త సంప్రదాయంకి తెర తీస్తోందిడిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయంలో పాలక పార్టీ బయటకి వెళ్ళిపోయిందిసభా సంప్రదాయం పాలక పక్షం అమలు చేయాలి5 కోట్ల మందికి బాధ్యత వహించాలని వెన్నుపోటు పార్టీకి లేదు..ఒంటెద్దు పోకడతో ప్రవర్తిస్తుందిరూల్ బుక్స్, చట్టాలు, సంప్రదాయాలు ఎక్కడ వున్నాయి?మేము చెప్పింది మీరు చేయండి అని మాత్రమే కూటమి అంటుంది.. ఇష్టా రాజ్యాంగ వ్యవహరిస్తుంది..సభా సంప్రదాయాలు తెలియని వ్యక్తుల దగ్గర మాకు అవసరం ఎందుకు ఇచ్చావ్ దేవుడా? అని సభ్యులు బాధ పడుతున్నారు..పెద్ద పెద్ద మాటలు చెప్పడం కాదు.. ఆచరించాలి.రాబోయే తరాలకు ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకొంటున్నారు.. వీళ్లా? మనకు నాయకులు..బీసీలకు జగన్ 50శాతం అమలు చేశారు..బీసీ లకు రిజర్వేషన్ పై కోర్ట్ కి వెళ్ళింది వెన్నుపోటూ పార్టీ నేతలు..డీఎస్సీ మీద జీవో ఎందుకు మార్చమని చెప్పాడు.. అమ్ముకోవడానికి కదా?14 నుండి 19 వరకు ఎంతమంది బీసీ లకు చంద్రబాబు పదవులు ఇచ్చారో రేపు మాట్లాడతా..మంత్రి నాదెండ్ల మనోహర్ ఏకంగా చైర్మన్‌నే డిక్టేట్ చేస్తారుసభలో చర్చించిదే మండలి లో చర్చించమని అడుగుతున్నాం..ప్రజలు తెలిసో తెలియకో అధికారం ఇచ్చారు.. మాకు నచ్చినట్లు చేస్తాంటే కుదరదు..సభను పొడిగించామని కోరుతున్నాం..గ్రూప్ 1 పరీక్ష పై చర్చమని, ఎంక్వయిరీ వేయమని అడుగుతున్నామని గ్రూప్ 1 పేరు ఎత్తడం మానేశారు..ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయల్ కామెంట్లు..తూమాటి మాధవరావు మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ఏకగ్రీవమయ్యారుఆయన్ని చైర్లో కూర్చోబెట్టాల్సిన సమయంలో అధికారపక్షం అగౌరవంగా వ్యవహరించిందినాదెండ్ల మనోహర్, మరో మంత్రి సభ రూల్స్ ను నేర్పాలని చూశారు.. అలాంటి వారు సభా మర్యాదలను పాటించలేదుమండలి చరిత్రలో ఈరోజు చీకటి రోజునాలుగు సార్లు సీఎం అని చెప్పుకునే చంద్రబాబు డిప్యూటీ ఛైర్మన్ ను చైర్ లో కూర్చోబెట్టడానికిన మనసు రాలేదుడీఎస్సీలో విచారణకు రమ్మంటే లోకేష్ రావడం లేదుస్పోర్ట్స్ కోటాలో పరీక్ష రాశాకే ఉద్యోగమిచ్చామని అధికారులు చెప్పారుస్పోర్ట్స్ కోటా వారికి ఏ పరీక్షా పెట్టలేదని లోకేష్ చెబుతున్నారువ్యవసాయ శాఖ మంత్రి లేకుండా వ్యవసాయం పై చర్చిస్తారువిద్యాశాఖ మంత్రికి బదులు ఫైనాన్స్ మంత్రి సమాధానం చెబుతాడుఓడలరేవులో ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు15 రోజులైనా మత్స్యకారుల ఆచూకీ తెలియలేదుప్రభుత్వం ఏం చేస్తోందిమత్స్యకారులు గల్లంతైన ఘటనకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలిఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ..డీఎస్సీ పై మూడవ రోజు కూడా వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారుఈ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటోందినిజానిజాలను చర్చించేందుకు మండలిలో అవకాశం లేకుండా చేయడం దురదృష్టకరండిప్యూటీ ఛైర్మన్ కుర్చీని అధికారపక్షం అగౌరవపరిచిందిమండలి పట్ల అధికారపక్షానికి ఎంత గౌరవముందో తేలిపోయిందిబీసీ బిల్లు పెట్టి అసెంబ్లీలో చర్చించారుబలహీన వర్గాలకు మంచి చేయాలని ఈ ప్రభుత్వం ఆలోచన చేయడం లేదుస్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందిజగన్ మోహన్ రెడ్డి జనరల్ పోస్టుల్లోనూ బిసిలకు అవకాశం కల్పించారుజీవో లేకపోయినా 36% బిసిలకు అవకాశం కల్పించిన మహానాయకుడు జగన్బీసీలే వెన్నుముక అని నమ్మిన నాయకుడు జగన్50 ఏళ్లకే బీసీలకు పెన్షన్లు ఇస్తామని చంద్రబాబు చెప్పారుఅధికారంలోకి వచ్చి రెండేళ్లైన బీసీలకు పెన్షన్ ఇవ్వలేదుజగన్ బీసీ కులాలకు కార్పొరేషన్లు కల్పిస్తే.. చంద్రబాబు హేళన చేశారుఇప్పుడు తమ మనుషులతో అవే కార్పొరేషన్లను భర్తీ చేసుకున్నారుమేయర్, జడ్పీ ఛైర్మన్లకు డైరెక్ట్ ఎన్నికలు నిర్వహిస్తామనడం దుర్మార్గంతమ మనుషులకు మేలు చేయడం కోసమే ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారుఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ..మంత్రి లోకేష్ అసెంబ్లీలో చెప్పిన మాటలు మండలికి వచ్చి ఎందుకు చెప్పరు?డీఎస్సీ అక్రమాల పై చర్చకు రాకుండా పారిపోతున్నారుఈరోజు సభలో చోటుచేసుకున్న ఘటన దురదృష్టకరంమండలి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధికారపక్షం వ్యవహరించిందిరూల్స్ బుక్ తీసుకొచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ కు సభా మర్యాదలు తెలియదా?స్పీకర్ గా చేసిన వ్యక్తికి సభ రూల్స్ గుర్తులేదా?మండలి మీడియా పాయింట్ వద్ద రమేశ్ యాదవ్ కామెంట్లు.. బీసీలకు ‘వెన్నుపోటు పార్టీ’ వెన్నుపోటు పొడుస్తుంది..34 శాతం బీసీ రిజర్వేషన్ మీద సభలో హైడ్రామా నడిపారుగత ప్రభుత్వం 34శాతం బీసీ లకు రిజర్వేషన్ అమలు చేస్తున్నట్లు జీవో విడుదల చేసిందివెన్నుపాటు పార్టీ ప్రతాప్ రెడ్డి అనే నాయకుడితో కోర్టులో రిట్ పిటిషన్ వేశారు..పార్టీ పరంగా బీసీ లకు 50శాతం సీట్లు ఇచ్చిన నేత జగన్..18 స్థానాలు ఎమ్మెల్సీ ఖాళీలు అయితే 11 బీసీ లకు ఇచ్చిన నేత జగన్..మున్సిపాలిటి, జిల్లా పరిషత్, కార్పొరేషన్ లో అత్యధిక ప్రాధాన్యత కల్పించారు..జగన్ ఇద్దరు బీసీలను డిప్యూటీ సీఎంగా చేశారు..కూటమి ప్రభుత్వం బీసీలకు డిప్యూటీ సీఎం ఇవ్వలేదు..కల్లబొల్లి కబుర్లు చెబుతూ చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకు గా చూస్తున్నాడుబీసీలకు చంద్రబాబు వెన్నుపోటూ పొడుస్తూనే వున్నాడు..136 కులాలను తీసుకొచ్చి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారుకోర్టుకు పొతే నిలవదని చంద్రబాబుకి తెలిసి అసెంబ్లీలో బిల్లు పెట్టాడు..బీసీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం లో పెద్ద పీఠ వేశారు..చంద్రబాబుకి చిత్త శుద్ధి ఉంటే మంత్రి మండలిలో డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి..బీసీ రిజర్వేషన్ బిల్లుపై చర్చ కి ప్రభుత్వం సిద్ధమా?మీడియా పాయింట్ వద్ద కౌరు శ్రీనివాస్ కామెంట్లు.. 2019 నుండి 2024 వరకు బీసీలకు అన్యాయం చేసారని చంద్రబాబు మాట్లాడుతున్నారురాష్ట్రంలో 139 బీసీ కులాలు ఉన్నాయని గుర్తించిన నేత జగన్ఆ కులాలకు పదవి ఇచ్చిన నేత జగన్‌కూటమి బీసీలను ముందుకు తీసుకొని వెళ్లిన దాకలాలు లేవుబీసీలను ఏ విధంగా గుర్తించాలని అని ఆలోచించిన నేత జగన్రాజశేఖర్ రెడ్డి, జగన్ హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందిఅన్ని పధకాలు బీసీలతో పాటు ఎస్సీఎస్టీలకు అందేలా చేసిన వ్యక్తి జగన్బీసీలు రాజకీయ పరంగా అభివృద్ధి చెందాలి అంటే.. మళ్లీ జగన్ సీఎం కావాలివైఎస్ జగన్‌కు ధన్యవాదాలు: తూమాటిమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా తూమాటి మాధవరావుబాధ్యతలు స్వీకరించిన వెంటనే మాట్లాడిన తూమాటినాకు డిప్యూటీ ఛైర్మన్ గా అవకాశం కల్పించిన జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలుమండలి ఛైర్మన్, విపక్షనేత, సభ్యులకు ధన్యవాదాలుప్రజాస్వామ్యంలో శాసన వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యం ఉందిశాసనమండలి విలువలను కాపాడుతాబొత్స కామెంట్లు.. శాసన మండలిలో కూటమి ఎమ్మెల్సీల దుస్సంప్రదాయండిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయంలో బయటకు వెళ్లిపోయిన కూటమి సభ్యులుడిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన తూమాటి మాధవరావుకు బొత్స అభినందనలుమండలిలో వెన్నుపాటు పార్టీ నేతల తీరు బాధాకరం: బొత్సకూటమి వ్యవహరిస్తున్న తీరు బాగోలేదు: బొత్సఅధికార పార్టీ సభ్యులు సభను గౌరవించలేదు.. అగౌరవ పరిచారు: బొత్సడిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయంలో అధికార పక్షం లేకపోవడం సరికాదు: బొత్ససభా సాంప్రదాయాలను తుంగలో తొక్కారు: బొత్సనాదెండ్ల ప్రవర్తనను చాలాసార్లు గమనించా: బొత్సపొరపాటు జరిగితే చెప్పాలిగానీ.. చైర్మనే హిత బోధ చేయడం ఏంటి?: బొత్సడీఎస్సీపై చర్చించాలన్నదే మా డిమాండ్: బొత్సనిబందనలు ఒక్కరికే కాదు.. అందరికీ వర్తిస్తాయి: బొత్సఅధికార సభ్యులు అహంకారంతో వ్యవహరిస్తున్నారు: బొత్స మంత్రులపై బొత్స ఆగ్రహంమండలి డిప్యూటీ చైర్మన్‌గా తూమాటి మాధవరావుఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా తూమాటి మాధవరావువైఎస్సార్సీపీ తరఫున ఏకైక నామినేషన్తూమాటి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన చైర్మన్ కొయ్యే మోషేనురాజుఅభినందనలు తెలిపిన వైఎస్సార్సీపీ సభ్యులుఆ వెంటనే డిప్యూటీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన తూమాటివాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన శాసన మండలిసభలో మంత్రుల తీరుపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహంవైఎస్సార్స్సీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రుల అసహనంచైర్మన్నే ఆదేశించేలా వ్యాఖ్యలుచైర్మన్పట్ల మంత్రి నాదెండ్ల వ్యవహరించిన తీరుపై బొత్స మండిపాటుప్రొసీజర్ బుక్ తెచ్చి.. తానేం తప్పుగా మాట్లాడలేదంటూ మంత్రి నాదెండ్ల బుకాయింపుసభ్యులు పోడియం వద్దకు వస్తే చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించిన నాదెండ్లచైర్మన్ సీటును మంత్రులు గౌరవించాల్సి ఉంటుందని నాదెండ్లకు బొత్స హితవుప్రారంభం.. ఆ వెంటనే వాయిదాడీఎస్సీ అంశంపై చర్చ జరపాలని వైఎస్సార్సీపీ, కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. శాసనసభలో సమాధానం ఇచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.. మండలికి వచ్చి అదే సమాధానం చెప్పాలని కోరుతోంది. అవకతవకలు జరిగిన మాట వాస్తవమని.. తప్పు ఒప్పుకుని నైతిక బాధ్యత వహిస్తూ లోకేశ్ రాజీనామా చేయాలని అంటోంది. అదే సమయంలో.. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. అయితే ప్రభుత్వం తరఫున నుంచి వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నలకు ఎలాంటి సమాధానం రావడం లేదు. కేవలం దాటవేత ధోరణి మాత్రమే కనిపించింది. దీంతో వైఎస్సార్సీపీ సభ్యుల చైర్మన్ పోడియంను చుట్టుముట్టడంతో.. ఆయన మండలిని కాసేపు వాయిదా వేశారు.మంత్రులకు చైర్మన్ చురకలువైఎస్సార్సీపీ సభ్యుల డీఎస్సీ డిమాండ్‌తో కూటమి మంత్రులకు ఏం చేయాలో పాలుపోలేదు. సమాధానం ఇవ్వలేక.. గట్టి గట్టిగా అరుస్తూ ఏవేవో స్టేట్మెంట్లు ఇచ్చారు. చివరకు మండలిని సరిగ్గా నడపాలంటూ చైర్మన్ కొయ్యే మోషేనురాజు మీద అసహనం ప్రదర్శించారు. మండలిని ఎలా నిర్వహించాలో మీకు తెలియదా? అంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. మంత్రి పార్థసారథి ఓ అడుగు ముందుకేసి వైఎస్సార్సీపీ సభ్యుల్ని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే మంత్రుల కమాండింగ్పై చైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభను ఎలా నడపాలో తనకు చెప్పాల్సిన అవసరం లేదంటూ మంత్రులందరికీ చురకలంటించారు.నల్ల కండువాతో..అంతకు ముందు.. మండలి సమావేశానికి ముందు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మెడలో నల్ల కండువాలు వేసుకుని ర్యాలీగా వచ్చారు. ‘మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ’ అంటూ నినాదాలు చేస్తూ మండలికి చేరుకున్నారు. అయితే ఎమ్మెల్సీల నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల తీరుపై ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు.మండలి సమావేశం ప్రారంభమైన తర్వాత డీఎస్సీలో జరిగిన అక్రమాలపై చర్చించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు చంద్రశేఖర్‌రెడ్డి, కల్పలతారెడ్డి, రామచంద్రారెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే మండలి చైర్మన్ ఆ తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో డీఎస్సీ అంశంపై చర్చకు అనుమతించాలని వైఎస్సార్సీపీ సభ్యులు పట్టుబడుతున్నారు.పొంతన లేని సమాధానాలు: లేళ్ల అప్పిరెడ్డిఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. డీఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్నారు. డీఎస్సీ కన్వీనర్, ఎస్సీఆర్టీ డైరెక్టర్‌గా ఒకే వ్యక్తిని నియమించడంపై ప్రశ్నలు లేవనెత్తారు. మంత్రి నారా లోకేశ్ చెబుతున్న మాటలకు విద్యాశాఖ అధికారులు చెబుతున్న విషయాలకు పొంతన లేదని విమర్శించారు.ఎన్ఓసీ తీసుకోలేదని లోకేశ్ చెబుతుంటే.. ఎన్ఓసీ తీసుకున్నానంటూ నవీన్ కోర్టును ఆశ్రయించారని అప్పిరెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగాలను లక్షల రూపాయలకు విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయని, డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అలాగే.. పీవీ సింధు తరహాలోనే మిగతా వాళ్లకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలిచ్చామని చెబుతున్నారని, నియామకాల ప్రక్రియకు ఈ స్టేట్మెంట్కు సంబంధం ఏమైనా ఉందా? అని నిలదీశారు. ‘లోకేశ్ మండలికి వచ్చి సమాధానం చెప్పాలి’డీఎస్సీ అక్రమాలపై తాము ఆందోళన చేస్తున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం కనిపించడం లేదని అప్పిరెడ్డి విమర్శించారు. లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సవాళ్లు విసరడం తప్ప తమ ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదన్నారు. ఎవరూ ప్రశ్నించరనే ఉద్దేశంతోనే అసెంబ్లీలో మాట్లాడుతున్నారని, మండలిలో మాత్రం చర్చకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.డీఎస్సీ కన్వీనర్, ఎస్సీఆర్టీ డైరెక్టర్‌గా ఇద్దరు ఉండాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోందని.. అలాంటప్పుడు విద్యాశాఖ, శాప్ అధికారులను ఎందుకు బదిలీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారులందరినీ బదిలీ చేసినప్పుడు సంబంధిత మంత్రి లోకేశ్‌ను కూడా పదవి నుంచి తొలగించాలి కదా అని వ్యాఖ్యానించారు.డీఎస్సీకి సంబంధించిన అన్ని అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎంత దూరం తప్పించుకున్నా విద్యార్థులు, నిరుద్యోగుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ప్రజలు, యువతే ప్రభుత్వాన్ని మార్చేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. -
ఏపీ శాసన మండలి వాయిదా
డీఎస్సీ అక్రమాల అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళనతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వరుసగా రెండో రోజు హోరెత్తాయి. ఎమ్మెల్సీల నిరసనలతో శాసన మండలి దద్దరిల్లుతోంది.AP అసెంబ్లీ సమావేశాల అప్డేట్స్ముగిసిన బీఏసీ సమావేశం.. మండలి వాయిదాశాసన మండలి సమావేశాలు రేపటికి వాయిదాడీఎస్సీపై చర్చకు కూటమి ప్రభుత్వం తర్జన భర్జనచర్చకు సిద్ధమంటూనే.. డేట్, టైం ఫిక్స్ చేయని వైనంఎల్నినో చర్చ తర్వాత డీఎస్సీ చర్చపై చర్చిస్తామంటున్న కూటమిముందే చర్చించాలని పట్టుబడుతున్న వైఎస్సార్సీపీడిప్యూటీ చైర్మన్ పోస్ట్‌కి నామినేషన్ వేసిన తుమాటి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్లుఎన్నికల బరిలో వైఎస్సార్సీపీనామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్సీ తుమాటి మాధవరావుఅసెంబ్లీ కార్యదర్శి వద్ద నామినేషన్ దాఖలుపాల్గొన్న మండలి ప్రతిపక్ష నేత బొత్స, వైసీపీ ఎమ్మెల్సీ లు కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆగ్రహంమీడియా పాయింట్ వద్ద తోట త్రిమూర్తులు కామెంట్స్.. డీఎస్సీపై చర్చ జరగాలని పట్టుబడుతుంటే లోకేష్ వెనక్కి వెళ్ళిపోయాడు..సభలో చర్చించి నోట్ ఇచ్చిన చప్పట్లు కొట్టుకొన్నారు..లోకేష్ చంద్రబాబు ని, చంద్రబాబు లోకేష్ ని సభలో పొగుడుకొన్నాడు.డీఎస్సీపై అక్రమాలపై ప్రశ్నించేది ఎవరు?మండలి లో మేము ప్రశ్నిస్తామని కూటమి నేతలు రావడం లేదు..డీఎస్సీ అక్రమాలపై జగన్ ఆధారాలతో బయట పెట్టారు..అవినీతి జరకపోతే చర్చించండి..6నెలలకు అసెంబ్లీ జరపాలి కాబట్టి మామ అనిపిస్తున్నారు..రైతులు కష్టాలపై మేము ప్రశ్నిస్తున్నాం..ప్రజలకు చెప్పేది ఎమ్ లేక ప్రతిపక్షం లేని సభలో చప్పట్లు కొట్టుకొంటున్నారు..టీడీపీ నేతలు గ్రామాల్లో తిరిగిటే 10 మంది కూడా ఉండడం లేదు..ఆడబిడ్డ నిది ఎక్కడని మహిళలు, రైతు భరోసా కోసం రైతులు గ్రామాల్లో అడుగుతున్నారు..ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మొహం చాటస్తున్నారు..అమరావతి లో దాచుకు తింటున్నారు కాబట్టి అమరావతి గురించి మాట్లాడుతున్నారు..మొండితోక అరున్ కామెంట్లు..DSC పై చర్చకి వాయిదా తీర్మానం ఇచ్చాం..గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వొచ్చారు.. Dsc పై చర్చిస్తరని ఆశించం.లోకేష్ కాదు.. లీకేష్ తన మంత్రులతో పారిపోయాడు.స్పోర్ట్స్ కోటాలో రాత పరీక్ష లేదని అబద్ధం చెప్పావ్..పీవీ సింధూకి పరీక్ష నిర్వహించకుండా ఇచ్చామమని లోకేష్ చెప్పాడు.సరేగానీ చర్చిద్దాం అంటే లీకేష్ ముందుకు రావడం లేదుసత్యం రామలింగ రాజు మేనేజ్మెట్ కోటాలో చదివాడో అలాగే స్పోర్ట్స్ కోటాలో కూడా అలాగే జాబ్ లు ఇచ్చాడు..హోమ్ శాఖ ఏవిధంగా కేంద్ర గణాంకాలులో దిగజారిందో అలాగే విద్యా శాఖ కుడా దిగజారుతుంది..మూడేళ్లు లీకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉంటే విద్యాశాఖ ర్యాంక్ కూడా పడిపోతుంది..డీఎస్సీతో పాటు మా హయాంలో జరిగిన ఏపీపీఎస్సీపైనా సీబీఐ విచారణ జరిపిద్దాంఅవకతవకలు జరిగినట్లు కనిపిస్తోంది కాబట్టి లీకేష్ రాజీనామా చేయాలి..లీకేష్ మేనేజ్మెంట్ కోట కింద ఇచ్చిన 400స్పోర్ట్స్ కోట సీట్లు రద్దు చేయాలి..4 రోజులు సభ పెడితే ప్రజా సమస్యలు ఎక్కడ చర్చకి వస్తాయి..లీకేష్ స్కామ్ పై జనసేన, బీజేపీ మాట్లాడాలి..వాళ్ల స్టాండ్ ఏంటో బీజేపీ, జనసేనలు చెప్పాలి..ప్రశ్నించానికి పార్టీ పెట్టానని చెప్పిన పవన్ ఈ లీకేజ్ పై లీకేష్ ని ప్రశ్నించాలి..బీఏసీ సమావేశంలో డీఎస్సీపై చర్చించాలని పట్టుబడుతున్నాం..వాస్తవాలు మాట్లాడితే జీర్ణించుకోలేక పోతున్నారు: మంచ నాగమల్లేశ్వరికూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి మంచ నాగమల్లేశ్వరి ఫైర్అసెంబ్లీ వేదిక శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అడిగిన ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయింది.బొత్స సత్యనారాయణ పై మంత్రి అచ్చెన్నాయుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు..మంత్రిగా విఫలమైన అచ్చెన్నాయుడు కంటే దద్దమ్మ మరొకరు లేరు.బొత్స సత్యనారాయణ కు మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలి.లేదంటే అచ్చెన్నాయుడు ఇంటిని ముట్టడిస్తాము..అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి..బొత్సా సత్యనారాయణ కు లోకేష్ కు నక్కకు నాగలోకానికి ఉన్నత తేడా ఉంది.బొత్స సత్యనారాయణ విద్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో మన రాష్ట్ర విద్యార్ధులు ఐక్యరాజ్య సమితిలో అడుగుపెట్టారు..దద్దమ్మ ప్రభుత్వం అధికారంలో ఉందని రాష్ట్ర ప్రజలు అభిప్రాయపడుతున్నారు.540 మంది రైతులు కూటమి పాలనలో చనిపోయారు.వాస్తవాలు మాట్లాడితే జీర్ణించుకోలేక పోతున్నారు.నారా లోకేశ్‌కు వైఎస్ అవినాష్‌రెడ్డి సవాల్నారా లోకేశ్‌కు సవాల్ విసిరిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిలోకేష్ తో చర్చకు మేము సిద్ధమని అభ్యర్థులే సవాల్ విసురుతున్నారుముందు వాళ్ళకి సమాధానం చెప్పు లోకేష్..గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య విసిరిన సవాళ్లకు సమాధానం చెప్పుదుర్గయ్య నీతో చర్చకు సిద్ధం అంటున్నాడు..నువ్వు సిద్ధమా..?పరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటా ఎంపిక చేసి..ఆ తర్వాత ఆ జీవో రద్దు చేశారునిన్న అసెంబ్లీలో లోకేష్ ఇచ్చిన వివరణ ఆయన్ని నవ్వుల పాలు చేసిందిఅంతర్జాతీయ క్రీడాకారిణి పీవీ సింధుతో పోల్చడం చాలా దారుణంమీ కోన రవి, భరత్ ఇచిన సర్టిఫికెట్ తో ఉద్యోగం పొందిన వారు..పీవీ సింధు ఒకటేనా...?నీతో చర్చకు జగన్ అవసరం లేదు...మా పేర్ని నాని వస్తున్నారునీకు దమ్ముంటే పేర్ని నానితో చర్చకు సిద్ధమా..?చరిత్రలో ఎన్నడూ లేని అక్రమాలు చేసి..ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారుకోర్టులో ఉన్న అభ్యర్ధుల కేసులే నీకు ప్రశ్నలు..వాటికి సమాధానం చెప్పు లోకేష్టెట్ సమస్యపై మాతో పాటు ఉపాధ్యాయులు కేంద్రమంత్రిని కలిస్తే వేధింపులా...?టీచర్లపై అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలి...లేదంటే వారికి అండగా మేము ఉద్యమిస్తాండీఎస్సీపై విచారణ జరిపించాల్సిందే: వైఎస్సార్సీపీశాసన మండలిలో దద్దరిల్లిన డీఎస్సీ నినాదాలుమెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల నినాదాలుమండలిని కాసేపు వాయిదా వేసిన చైర్మన్మరో రెండు రోజులు పొడిగించండి: బొత్స విజ్ఞప్తినాలుగు రోజులపాటు కొనసాగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలుఇవాళ రెండో రోజు కొనసాగుతున్న సమావేశాలుమండలి చైర్మన్‌కు విపక్ష నేత బొత్స విజ్ఞప్తిఎల్నినోపై చర్చ అవసరం లేదా?ఎరువులు దొరక్క, గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని చెబుతోందే మేంఅసెంబ్లీ సమావేశాలు మరో రెండు రోజులు పొడిగించండిపయ్యావుల పక్కనే లోకేశ్అసెంబ్లీకి వచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పయ్యావుల పక్కనే గప్‌చుప్‌గా కూర్చున్న లోకేశ్ లోకేశ్ మౌనంగా కూర్చోవడంపై మండలిలో బొత్స అభ్యంతరంమండలిలో సమాధానం చెప్పాలంటూ నిలదీతకౌన్సిల్ నుంచి ఎందుకు పారిపోతున్నారు?: బొత్సమేం డీఎస్సీ అంటే.. ఏపీపీఎస్సీలో ఏదో జరిగిందని అంటున్నారు. మా హయాంలో నిర్వహించిన గ్రూప్-1పై సీబీఐతో విచారణ చేయించుకోండిడీఎస్సీపై ప్రభుత్వం సమాధానం చెప్పే పరిస్థితి కనిపించడం లేదుప్రభుత్వం మండలిలో ఎందుకు మాట్లాడడం లేదు?శాసన సభలో చెప్పిన విషయాలేవో.. ఇక్కడ మండలిలో చెప్పాలి.. మేం అదే అడుగుతున్నాంఒకవేళ అవినీతి జరిగితే.. అక్రమాలపై సీబీఐ విచారణ వేయాలిమంత్రి లోకేశ్ రాజీనామా చేయాలిశాసన మండలిలో గందరగోళండీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని పట్టుచర్చ జరగాలంటూ వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానంతిరస్కరించిన మండలి చైర్మన్సభలో ఆందోళనకు దిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలువైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల నినాదాలతో మండలిలో గందరగోళం -
ఎమ్మెల్సీల ర్యాలీ.. ఏపీ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో మంగళవారం ఉదయం స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. డీఎస్సీ అక్రమాలపై చర్చకు పట్టుబడుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ర్యాలీగా అసెంబ్లీకి వచ్చారు. ఆ సమయంలో పోలీసులు వాళ్లను అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. సీబీఐ అక్రమాలపై విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేశ్రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఫ్లెక్సీలతో గేటు వద్ద నుంచి ర్యాలీగా బయల్దేరారు. ఆ సమయంలో పోలీసులు వాళ్లను అడ్డుకుని బారికేడ్లు అడ్డుపెట్టారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీలు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అసెంబ్లీలో చర్చిస్తామన్న వాళ్లు.. కౌన్సిల్ నుంచి ఎందుకు పారిపోతున్నారు? అని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. డీఎస్సీ అంశంపై మండలిలో చర్చ జరపాల్సిందేనని ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు భాగంగా ‘డీఎస్సీ అక్రమాలపై చర్చ’కు వైఎస్సార్సీపీ శాసన మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చింది. -
డీఎస్సీ అక్రమాలు.. లోకేష్ ప్రకటనతో ఇరుకున పడ్డ ప్రభుత్వం!
సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాల విషయంలో కూటమి ప్రభుత్వం అడ్డంగా బుక్కైంది. ఎలాంటి అవకతవకలు జరగలేదని నిన్నటిదాకా బుకాయిస్తూ వస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.. ఇప్పుడు, ఇవాళ అసెంబ్లీ వేదికగా అన్ని తప్పులనూ అంగీకరించారు!. అంతేకాదు.. స్పోర్ట్స్ కోటా జీవోను మళ్లీ రద్దు చేసిన ప్రభుత్వం.. రిటెన్ టెస్ట్ పెడుతూ జీవో నెంబర్ 56ను రిలీజ్ చేయడం గమనార్హం. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇచ్చిన లోకేష్.. గతంలో క్రీడాకారిణి పీవీ సింధుకు రాత పరీక్ష లేకుండా ఉద్యోగం ఇచ్చిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అదే విధానంలో స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు కూడా రాత పరీక్ష లేకుండా నియామకాలు చేపట్టినట్లు వివరించారు. అయితే పీవీ సింధు వంటి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణి, సాధారణ క్రీడా సర్టిఫికెట్ల ఆధారంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఒకటేనా? అనేనా ప్రశ్న మొదలైంది.జీవోల్లో మార్పులు.. స్పోర్ట్స్ కోటా నియామకాలపై వివాదం నేపథ్యంలో ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో 47ను రద్దు చేసి.. కొత్తగా జీవో 56ను తీసుకొచ్చింది. తాజా నిబంధనల్లో రాత పరీక్షను తప్పనిసరి చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మార్పు కూడా డీఎస్సీ ప్రక్రియలో గందరగోళానికి దారితీసినట్లైంది. తద్వారా అవకతవకలను కప్పిపుచ్చుకునే ప్రయత్నమేనని స్పష్టమవుతోంది.నవీన్ వ్యవహారంపైనా ప్రశ్నలుఎస్ఈఆర్టీ ఉద్యోగి నవీన్‌కు టాప్ ర్యాంక్ రావడం, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై కూడా అసెంబ్లీలో చర్చ జరిగింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కాలేదని, అందుకే ఉద్యోగం ఇవ్వలేదని గతంలో ప్రభుత్వం కోర్టుకు వివరించింది. అయితే ఇవాళ శాసన సభలో లోకేష్ మాట్లాడుతూ.. కోర్టులో ప్రభుత్వం ఇచ్చిన వివరణకు విరుద్ధంగా ప్రకటన చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి కావడంతో ఎన్ఓసీ తీసుకోలేదని లోకేశ్ పేర్కొన్నారు. ఎన్వోసీ అంశంపై తాము రిజక్ట్ చేయలేదని సెక్రటరీ కోన శశిధర్ గతంలో చెప్పారు. అలా.. ఈ రెండు ప్రకటనల నడుమ మధ్య బోలెడు వ్యత్యాసం ఉంది. ఒకరికే అవకాశం ఇచ్చారా?ఇక ఎస్ఈఆర్టీ, డీఎస్సీ కన్వీనర్ ఒకే వ్యక్తికి ఇచ్చిన అంశాన్ని కూడా లోకేష్ ప్రస్తావించారు. దీనిపై ప్రభుత్వం తరఫున లోకేశ్ వివరణ ఇస్తూ.. అలా ఇవ్వకూడదని చట్టంలో ఎక్కడా లేదని సమర్థించుకున్నారు. దీంతో నియామక ప్రక్రియలో పారదర్శకతపై అనుమానాలు ఉన్నాయి.అవును.. అక్రమాలు జరిగాయ్స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై వచ్చిన ఆడియో లీక్ అంశాన్ని కూడా లోకేష్ సభలో ప్రస్తావించారు. దీనిపై శాప్ ఫిర్యాదు చేసిందని, సంబంధిత వ్యక్తిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.అయితే ఈ పరిణామాలన్నీ డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో లోపాలను బయటపెడుతున్నాయి. మెరిట్ అభ్యర్తుల్ని పట్టించుకోకుండా తమకు నచ్చినవాళ్లకే స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారని వైఎస్సార్సీపీ తొలి నుంచి చెబుతోంది. డీఎస్సీ అక్రమాలపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ శాసన మండలిలో ఇవాళ గట్టిగా గళం వినిపిస్తోంది. ఈ తరుణంలో.. వైఎస్సార్సీపీ గైర్హాజరు అయిన శాసనసభలో లోకేశ్ ప్రకటన చేయడం, అవకతవకలు జరగలేదంటూనే తప్పులు అంగీకరించడంతో సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లైంది. -
మనిషి పెరిగితే సరిపోదు.. అచ్చెన్నకు బొత్స స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాలపై చర్చ జరగాల్సిందేనని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. ఈ అంశంపై మండలి ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన క్రమంలో.. తనను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి అచ్చెన్నాయుడికి బొత్స గట్టి కౌంటర్ ఇచ్చారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై బొత్స తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మనిషి ఎద్దులా పెరిగితే సరిపోదు.. బాష కూడా బాగుండాలి. సభలో ఎలా మాట్లాడాలో అచ్చెన్నాయుడు నేర్చుకోవాలి. తోటి సభ్యులకు గౌరవం ఇచ్చి మాట్లాడాలి. డీఎస్సీ పై చర్చ జరగాలన్నదే మా డిమాండ్. లోకేశ్ రాజీనామా చేసి.. సీబీఐతో దర్యాప్తు జరిపించాల్సిందే అని అన్నారు. ‘‘ఎద్దులా పెరిగితే తెలితేటలు రావు. మాటలు మంచిగా రావాలి. ఎరువులు లేకుండా రైతులు ఎలా చనిపోతున్నారో ఈ దద్దమ్మ వచ్చి చూస్తే తెలుస్తుంది. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను ఛైర్మన్ పరిశీలించాలి. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో చిర్రెత్తుకుపోయిన అచ్చెన్నాయుడు.. కుర్చీలోంచి లేని బొత్స వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దద్దమ్మ అనడం అన్‌పార్లమెంటరీనా? అంటూ అచ్చెన్న గట్టి గట్టిగా అరిచారు. క్షమాపణలు చెప్పమంటే చెబుతానని.. దానికే అంతలా రియాక్ట్ కావాలా? అంటూ బొత్సను ఉద్దేశించి మాట్లాడారు. ఈ క్రమంలో సభ్యుల నినాదాలతో గందరగోళం నెలకొనగా.. చైర్మన్ మళ్లీ మండలిని వాయిదా వేశారు.అంతకు ముందు.. డీఎస్సీ అక్రమాల పై సమాధానం చెప్పలేక మంత్రులు ఎదురుదాడికి దిగారు. పదేపదే వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను కించపరిచేలా మాట్లాడారు. -
చింతమనేని ఇలాకాలో కమ్మవారికి ప్రాణరక్షణ లేకుండా పోయింది
ఏలూరు జిల్లా: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్వల్ల దెందులూరు నియోజకవర్గంలో కమ్మవారికి ప్రాణరక్షణ లేకుండా పోయిందని ప్రముఖ న్యాయవాది ఈడుపుగంటి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఏలూరులోని తన నివాసంలో శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం పార్టీని బుల్డోజర్ పార్టీగా మారుస్తున్నారని విమర్శించారు. చింతమనేని దాడులు, దౌర్జన్యాలు అధికమవుతున్నాయని, గ్రామాల్లో ఆయన వర్గానికి చెందిన కొందరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.తన భూమిలో కొంతమంది అక్రమంగా రాళ్లు వేయగా వాటిని తొలగించినందుకు తనపై ఎస్సీ, ఎస్టీ తదితర కేసులు నమోదు చేశారన్నారు. పెదపాడు తహసీల్దార్, పెదపాడు సీఐ వారి పరిధి దాటి.. టీడీపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఇలాగే కొనసాగితే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించారు. పెదవేగి మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబ సభ్యులు చిన్నòÙడ్డు నిరి్మంచుకుని వ్యాపారం చేసుకుంటుండగా ఎమ్మెల్యే చింతమనేని ఆ షెడ్డును బుల్డోజర్తో కూలి్చవేశారని తెలిపారు. జగన్నాథపురానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు పాలడుగు భానుప్రకాష్ ఇంటికి వెళ్లి చింతమనేని అనుచరులు దాడి చేశారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. 23 ఏళ్లుగా టీడీపీలో ఉన్నాం కాగా.. పాలడుగు భానుప్రకాష్, శ్రావణి దంపతులు మీడియాతో మాట్లాడుతూ.. తాము 23 ఏళ్లుగా టీడీపీలో పనిచేస్తున్నామని తెలిపారు. రూ.కోటితో భూమిని కొనుగోలు చేసి మొత్తం సొమ్ము చెల్లించినప్పటికీ రిజి్రస్టేషన్ జరగకుండా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అడ్డుకున్నారని ఆరోపించారు. తనపై దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకపోగా, తిరిగి తనపైనే కేసు నమోదు చేశారని భానుప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. -
పవన్ ‘గ్రీన్’ సిగ్నల్.. అన్నకు క్యాబినెట్ హోదా!
సాక్షి, విజయవాడ: ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జనసేన ఎమ్మెల్సీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు కీలక పదవి దక్కింది. రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ పరిధిలోని గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నాగబాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవికి ఆయనకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.నాగబాబు నియామకంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికై ఏడాదిన్నర కూడా పూర్తి కాలేదు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యవేక్షిస్తున్న పర్యావరణ, అటవీ శాఖ పరిధిలోనే ఆయన సోదరుడికి కీలక బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘‘అన్నకు తన సొంత శాఖలోనే కీలక పదవి’’ అంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం కనిపిస్తోంది.గ్రీన్ మిషన్‌కు కమిటీ చైర్మన్పర్యావరణ పరిరక్షణ, హరిత కార్యక్రమాల అమలు, రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెంపు వంటి అంశాలపై ఈ కమిటీ పనిచేయనుంది. ఈ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆయనకు క్యాబినెట్ హోదా ఉండటంతో ప్రభుత్వ పరంగా ప్రత్యేక ప్రాధాన్యత లభించనుంది.బొత్స కామెంట్నాగబాబుకి కేబినెట్ హోదా పదవి దక్కడంపై మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. చంద్రబాబు ఎలాగూ మంత్రి పదవి ఇవ్వరు. అందుకే పవన్ కల్యాణ్ ఇలా ఇప్పించుకున్నారు అంటూ వ్యాఖ్యానించారు.రాజకీయంగా ఆసక్తి..జనసేనలో మొదటి నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న నాగబాబు.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబును బతిమాలి.. అలిగి.. తన అన్నకు ఎమ్మెల్సీగా అవకాశం ఇప్పించుకున్నారు పవన్ కల్యాణ్. ఇప్పుడు మరో కీలక పదవి కట్టబెట్టారు. ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న నేతల కుటుంబ సభ్యులకు పదవులు దక్కడం ఎప్పుడూ రాజకీయ చర్చకు దారితీస్తుంటుంది. తాజాగా నాగబాబు నియామకం కూడా అలాంటి చర్చకే తెరలేపింది. -
డీఎస్సీ అక్రమాలపై దద్దరిల్లిన ఏపీ శాసన మండలి
సాక్షి, అమరావతి: ఏపీ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు.. వాయిదాల పర్వంతో మొదలైంది. కూటమి ప్రభుత్వంలో మెగా డీఎస్సీ పేరిట జరిగిన అక్రమాలపై శాసనమండలి దద్దరిల్లింది. ఈ అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చిన ప్రతిపక్ష వైఎస్సార్సీపీ.. చైర్మన్ తిరస్కారంతో చర్చకు పట్టుబట్టింది. ‘‘ప్రభుత్వం అంటే అందరికీ న్యాయం చేయాలి. కానీ, మూడు లక్షల మందిని డీఎస్సీ రిక్రూట్మెంట్ పేరిట మోసం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాల్సిందే. స్పోర్ట్స్ కోటా పేరుతో వాళ్లకు నచ్చినవాళ్లకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఈ అక్రమాలపై సభలో చర్చ జరగాల్సిందే. ఏపీపీఎస్సీపై కూడా చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం’’ అని విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ తరుణంలో ప్రభుత్వం వర్గాల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని నినాదాలు చేశారు. పరీక్షలు రాయకుండా ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో మండలిని చైర్మన్ కాసేపు వాయిదా వేశారు. మంత్రుల అసహనండీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రుల అసహనం వ్యక్తం చేశారు. విపక్ష నేతకు మైక్ ఎలా ఇస్తారంటూ మంత్రి నాదెండ్ల మనోహర్, మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజును ప్రశ్నించారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు విపక్ష నేత బొత్సపై నోరు పారేసుకున్నారు. బొత్సను ఉద్దేశించి దద్దమ్మ అంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా.. గొడ్డలి పార్టీ అంటూ వైఎస్సార్సీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అడ్డంకులు.. ఆంక్షలు.. అయినా జగన్ వెంట జనం!
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన ఏపీ ప్రజలకు మరింత స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు కనిపిస్తుంది. రాష్ట్రంలో ఉన్న దారుణమైన పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించడంలో జగన్ కృతకృత్యమయ్యారు. అంతేకాదు.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని నిర్భంధాలు పెట్టినా జగన్ పట్ల తమ అభిమానం చెక్కు చెదరదని వైఎస్సార్సీపీ క్యాడర్‌తో పాటు సామాన్య జనసందోహం కూడా తేల్చి చెబుతోంది.ఏపీ కూటమి ప్రభుత్వం పోలీసులనే నమ్ముకుని వందల సంఖ్యలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై కేసులు పెడుతున్నా వారు పట్టించుకోవడం మానేశారన్న అభిప్రాయం కలుగుతుంది. జగన్‌ను కర్నూలు జైలులో అవమానించిన తీరు కూడా ఆయన అభిమానులలో ఆగ్రహాన్ని మరింత పెంచుతోంది. ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని అక్రమ కేసులో అరెస్టు చేసి కర్నూలు జైలులో ఉంచారు. అది ఎలా అక్రమ కేసు అన్నది సాక్ష్యాధారాలతో సహా జగన్ చెప్పగలిగారు.వైఎస్సార్సీపీ కార్యకర్తపై కొందరు టీడీపీ వారు దాడి చేసిన సందర్భంలో అతనిని రక్షించడానికి విరూపాక్షి ఆ గ్రామానికి వెళ్లారు. అక్కడ టీడీపీ కార్యకర్త ఒకరు తన భార్య నైటీని తానే చించడమే కాకుండా, ఎమ్మెల్యే విరూపాక్షిపై తప్పుడు ఆరోపణ చేసి కేసు పెట్టారు. ఆ తర్వాత కారుపై కూడా టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ వివాదంలో పోలీసులు విరూపాక్షి ఇంటికి అర్ధరాత్రి వెళ్లి తలుపులు పగలకొట్టి లోపలకు వెళ్లడమే కాకుండా, ఆ సన్నివేశాలు తెలియకుండా ఉండడానికి సిసిటీవీ ఫుటేజ్‌ని, డిస్క్ లను అపహరించుకుని పోయారట. ఈ వివరాలన్నిటిని జగన్ తన టాబ్ ద్వారా మీడియాకు వివరించారు.జగన్ ఏది మాట్లాడినా ఆధారాలతోనే మాట్లాడతారని ప్రజలు భావిస్తారు. దానికి తగినట్లుగానే తను చెప్పిన విషయాలకు ఆధారంగా సంబంధిత వీడియోలను ప్రదర్శించారు. పోలీసు అధికారులు కాని, ప్రభుత్వంలో ఉన్నవారు కాని వాటిపై ఇంతవరకు జవాబు ఇవ్వలేకపోతున్నారు. బాధితులు వైఎస్సార్సీపీ అనుకూలురు అన్న భావన కలిగితే చాలు.. పోలీసులు వారిపైనే ఏదో రకంగా కేసు పెడుతున్నారనడానికి విరూపాక్షి అక్రమ అరెస్టు ఉదాహరణ అవుతుంది. పోలీసులు ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ భార్య నైటి చించుతున్న వ్యక్తిని అడ్డుకోకపోవడం, వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి చేసినవారిమీద కేసు పెట్టకపోవడం వంటివి ఏపీ పోలీసు వ్యవస్థకు మచ్చగానే మిగులుతుంది.కొందరు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కూటమి ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ద్వారా జగన్‌కు జనంలో విస్తారంగా పర్యటించే అవకాశాన్ని కూటమి నేతలే ఇస్తున్నారు. తద్వారా ఆయనకు జనంలో ఉన్న అభిమానాన్ని ఎప్పటికప్పుడు తెలిసేలా చేస్తున్నారు. జగన్ శ్రీకాకుళం వెళ్లినా, తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి వెళ్లినా, ఇప్పుడు కర్నూలు వెళ్లినా ఒకే రకమైన స్పందన కనిపిస్తుండడం విశేషం. అంతకుముందు గుంటూరు, కృష్ణా, నెల్లూరులలో పర్యటించినప్పుడు కూడా ఇదే సీన్ కనిపించింది. ఓర్వకల్లు విమానాశ్రయంలో హెలికాఫ్టర్ దిగినప్పటినుంచి కర్నూలు జైలు వద్దకు వెళ్లేవరకు 38 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి జగన్‌కు ఐదుగంటలకు పైగా పట్టింది. ఈ పరిస్థితి టీడీపీతో పాటు ఎల్లో మీడియాకు కూడా కడుపుమంటగా మారుతోంది. వారికి కంటగింపు అవుతోంది. ఇది పరామర్శయాత్రనా? లేక విజయ యాత్రనా అని ఎల్లో మీడియా వ్యాఖ్యానిస్తోంది. ఆ రకంగా జగన్‌కు జనంలో ఉన్న పట్టును టీడీపీ మీడియానే తెలియచేసినట్లవుతోంది.జగన్‌కు జనం రాలేదని రాయాలన్నది వారి కోరిక కావచ్చు. కాని పరిస్థితి అలా ఉండడం లేదు. కర్నూలుకు జనం రాకుండా పోలీసులు ఎక్కడకక్కడ చెక్ పోస్టులు పెట్టారు. దీనిపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి పోలీసుల తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఆ దశలో వైఎస్సార్సీపీ అభిమానులు పోలీసు చెక్ పోస్టులను తోసుకుంటూ ముందుకు వెళ్లిపోవడం కనిపించింది. తమపై పోలీసులు కేసులు పెడతారని తెలిసినా వారు అంత ధైర్యంగా ముందుకు కదులుతున్నారంటే జగన్ పై వారికి ఏర్పడిన అభిమానం అటువంటిదన్నమాట.అసలు ప్రజాస్వామ్యంలో తమ నాయకుడిని కలుసుకోవడానికి వెళుతున్న కార్యకర్తలను నిలువరించే పని పోలీసులు ఎందుకు పెట్టుకుంటారో అర్థం కాదు. ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనుకుంటే కట్టడి చేయవచ్చు. లేదా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంటే, దానికి తగ్గట్లు ఏర్పాటు చేయవచ్చు. అలాకాకుండా పాలక పార్టీల నేతల మెప్పు కోసం కొందరు పోలీసు అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు ఒక మాజీ ముఖ్యమంత్రి స్వయంగా జైలులో ఉన్న తన ఎమ్మెల్యేని కలవడానికి వెళితే పోలీసులు అవమానించిన తీరు కూడా తీవ్ర అభ్యంతరకరంగా ఉందని చెప్పాలి. సాదారణంగా రూల్ ప్రకారం ఎవరినైనా కూర్చోబెట్టి ఫోటో తీసిన తర్వాత ఖైదులో ఉన్న వ్యక్తిని కలవడానికి అనుమతిస్తారు. కాని జగన్‌ను మాత్రం నిలబెట్టి ఒక గేటు వద్ద ఫోటో తీయడం ద్వారా ఆయనే ఏదో కటకటాల వెనుక ఉన్నట్లు చూపించాలన్నది అధికారుల తాపత్రయం కావచ్చు. కాని ఈ విషయాన్ని జగన్ బయట చెప్పేయడంతో పోలీసు శాఖ ప్రతిష్ట మరింత దిగజారినట్లయింది.వైఎస్సార్‌సీపీవారితో పాటు సామాన్య ప్రజలలో కూడా ఇదేమిటి ప్రభుత్వం ఇంత సంకుచితంగా మారింది అన్న అభిప్రాయం ఏర్పడింది. గతంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడును కుప్పం, అనపర్తిలలో శాంతిభద్రతల సమస్య ఉందని నిలువరించే యత్నం చేశారు. దానిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి వారి మాట కాదని టూర్ చేశారు. అనపర్తి వద్ద అయితే ఏకంగా నడుచుకుంటూ వెళతానని తన కార్యకర్తలతో కలిసి వెళ్లారు. ఆయన చేస్తే అదంతా చట్టబద్దం, వ్యతిరేక పార్టీవారు చేస్తే మాత్రం తప్పు అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతుంటారు.కర్నూలు టూర్లో సుగాలి ప్రీతి తల్లి కూడా కలవడం విశేషం. పవన్ కళ్యాణ్ తనకు ఇచ్చిన హామీలను విస్మరించి, కనీసం అప్పాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నది ఆమె బాధ. అలాగే డీఎస్సీ అక్రమాల బాధితులు కూడా జగన్‌ను కలిశారు. ఇలా వివిధ వర్గాలవారిని కలుసుకుంటూ, రోడ్లపై ఉన్నవారికి అభివాదం చేసుకుంటూ జగన్ ముందుకు వెళ్లారు. జగన్‌కు ఇంత ఆదరణ ఎందుకు వస్తున్నదన్నదానిపై ఆత్మవిమర్శ చేసుకోవల్సిన చంద్రబాబు నాయుడు ఆ పని చేయకుండా జగన్‌ను, వైఎస్సార్సీపీని తీవ్రస్థాయిలో విమర్శించడానికి, కొన్నిసార్లు దూషించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది ఆయనలోని అసహనాన్ని తెలియచేస్తుంది.ప్రభుత్వం ఇకనైనా తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలి. వైఎస్సార్సీపీని అణచివేయాలని చూస్తే, అది మరింత ప్రభావం చూపుతుందని, జగన్‌ను కలవకుండా ప్రజలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే, అది తమకే నష్టమని చంద్రబాబు, లోకేష్‌లు తెలుసుకుంటే మంచిది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నారావారిపల్లి దళిత ఎంపీటీసీ సభ్యుడికి అవమానం
చంద్రగిరి: సీఎం చంద్రబాబు స్వగ్రామానికి చెందిన దళిత ఎంపీటీసీ సభ్యుడిని అధికారులు తీవ్రంగా అవమానించారు. ఆయనకు సమాచారం ఇవ్వకుండానే స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లి (కందులవారిపల్లి)కి చెందిన రాజయ్య గత ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. శనివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. అయితే ఎంపీటీసీ సభ్యుడు రాజయ్యకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తనకు జరిగిన అవమానంపై రాజయ్య శనివారం చంద్రగిరిలోని ఎంపీడీవో కార్యాలయ ప్రవేశ మార్గంలో బైఠాయించి నిరసన చేపట్టారు. ‘దళిత ఎంపీటీసీ సభ్యులంటే మీకు గౌరవం లేదా’ అని ఎంపీడీవో చంద్రికను నిలదీశారు. సీఎం చంద్రబాబు సొంత పంచాయతీకి తాను ఎంపీటీసీ సభ్యుడిగా ప్రాతినిథ్యం వహించడం నేరమా? అని వాపోయారు. -
సీకే కుటుంబం ఇష్టమైతే నీ ఇంట్లో పెట్టుకో..
చిత్తూరు అర్బన్: చిత్తూరులో కూటమి నేతల మధ్య వైరం మరోమారు బట్టబయలయ్యింది. ఇటీవల నగరంలో జరుగుతున్న ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాలతో పాటు ఎమ్మెల్యే వెంట సీకే కుటుంబ సభ్యులు వెళుతుండడాన్ని అధికార పార్టీలోని కొందరు సీనియర్లు అంగీకరించడంలేదు. వాళ్లు ఎందు కు వస్తున్నారని, అసలు వాళ్లను ఎందుకు చేరదీస్తున్నారంటూ సొంత పార్టీ నేతలపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కుటుంబ సభ్యులు టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వ్యవహారంపై రెండు రోజుల క్రితం చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో జరిగిన ఓ సమావేశంలో ఇద్దరు టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరగడం చర్చనీయాంశంగా మారింది. గురువారం ఉదయం 10 గంటలకు సమావేశం అని చెప్పి ఎమ్మెల్యే జగన్మోహన్ నాయుడితో పాటు సీకే లావణ్య సైతం 11.30 గంటలకు సభాస్థలికి రావడంతో సీనియర్ కురువృద్ధుడు తీవ్ర అసహనానికి గురయ్యారు. అప్పటికే వేదికపై మొదటి వరుసలో జూనియర్లు కూర్చోవడం టీడీపీ చిత్తూరు నియోజకవర్గ పరిశీలకురాలు పూరిమెట్ల కుమారికి సైతం సీటు లేకపోవడంతో.. మరింత అసహనానికి లోనయ్యారు. దీంతో పరోక్షంగా సీకే కుటుంబాన్ని ప్రస్తావిస్తూ.. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో టీడీపీ సీనియర్లతో సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే (ఫైల్)ఎందుకు వాళ్లు..? టీడీపీలోని ఓ కురువృద్ధుడు ఈ సమావేశంలో ఎమ్మెల్యేని లక్ష్యంగా చేసుకుని, ఆయన అనుచరుడిపై విరుచుకుపడినట్లు సమాచారం. ‘‘ఏం యా.. సీకే కుటుంబాన్ని ఎందుకు మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు.? ఎక్కడకు పోయినా వాళ్లను వెంటబెట్టుకుని పోతా ఉండారు. ఇన్నాళ్లు రానివాళ్లు ఇప్పడు ఎందుకు మీ వెంట వస్తా ఉండారు..? ఇది పద్ధతికాదు. వాళ్లకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. గంజాయి అమ్మే ఇద్దరు ఆడోళ్లను కూడా దూరం పెట్టమని చెప్పాను. వాళ్ల వల్ల పార్టీకి చాలా చెడ్డపేరు వస్తా ఉండాది. అయినా కూడా మీరు వినడంలేదు. పేపర్లలో ఎండకడతా ఉండారు. పోలీస్ స్టేషన్లలో పిలి వార్నింగులు ఇస్తా ఉండారు. ఇదంతా మంచిది కాదు..’’ అన్నట్లు తెలిసింది. ఇటీవల ఎమ్మెల్యే చెంతచేరి, అన్నీ తానై నడిపిస్తున్న ఆ వ్యక్తి ఆ కురువృద్ధుడికి ధీటుగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘‘ఏందినా నువ్వు చెప్పేది. ఎలక్షన్లలో ఎమ్మెల్యేకి వాళ్లు పనిచేయలేదా..? కూడానే ఉంటూ ఎవరు ఎంత ద్రోహం చేసినారో మాకు అన్నీ తెలుసు. కానీ సీకే మాత్రం నిజాయితీగా పనిచేసినాడు. పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు ప్రియారిటీ ఇస్తే తప్పేముండాది..? మీకు మీకు మధ్య ఏదైనా పర్సనల్ గొడవలుంటే మీరు చూసుకోండి. పార్టీపైన రుద్దొద్దు..’’ అంటూ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. ఇదంతా కూడా పలువురు సీనియర్ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే సమక్షంలోనే జరిగినట్లు సమాచారం. సొంత పార్టీ నేతలపైనే మీడియాకు లీకులు ఇచ్చి వార్తలు రాయించడం నీ నైజం కాదా..? అంటూ మరో నేత, ఎమ్మెల్యేకు దగ్గరి వ్యక్తిపై మండిపడ్డట్లు సమాచారం. తలనొప్పి తప్పదా..? ఓ వైపు మునిసిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభు త్వం చెబుతున్న తరుణంలో త్తూరులోని అధికార పార్టీ నేతల మధ్య చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు పార్టీకి నష్టం చేకూర్చడంతో పాటు స్థానిక ఎమ్మెల్యేకు తలనొప్పి తప్పదన్నట్లుగా ఉంది. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసినవాళ్లు, కుటుంబ స భ్యుల ప్రాణాలే పోగొట్టుకున్న వాళ్లు, కరుడుగట్టిన టీడీపీ కోసం శ్రమింన వాళ్లను కాకుండా.. ఇప్పుడు వచ్చిన వాళ్లకు మేయర్ పీఠంపై హామీ ఇస్తే ఏమాత్రం సహించేదిలేదని సీనియర్లు తేల్చి చెబుతున్నారు. దీంతో చిత్తూరు టీడీపీలో సం‘కుల’ సమరం తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈశ్వరరావు ద్వంద వైఖరి.. మరోవైపు రావూరి ఈశ్వరరావు ఇటీవల సీకే బాబును పొగుడుతూ వీడియోలు విడుదల చేయడంపై అటు టీడీపీలోని ఓ వర్గం, ఇటు వైఎస్సార్సీపీ నేతలు పెదవి విరుస్తున్నారు. ఈశ్వరరావుకు సీకేపై అంత ప్రేమ ఉంటే, 2004 ఎన్నికల్లో తవణంపల్లె, చిత్తూరు ప్రాంతాల్లో ఊరూరా పర్యటించి స్థానికులకు బియ్యం, డప్పులు పంచిపెట్టి మరీ.. సీకేను ఓడించడానికి ఎందుకు కంకణం కట్టుకున్నారని ప్రశ్నిస్తున్నారు. సీకే గెలిస్తే చిత్తూరు రౌడీ రాజ్యం అవుతుందని ఈశ్వరరావు నాడు చెప్పలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఈశ్వరరావు కుటిల రాజకీయానికి, ద్వంద వైఖరికి ఆయన విడుదల చేసిన వీడియోలే నిదర్శమని వైఎస్సార్సీపీ నేతలు గట్టిగానే బదులిస్తున్నారు. -
కూటమిలో కుంపటి.. మరో కొత్త తలనొప్పి!
ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎంత అద్వాన్నంగా పనిచేస్తున్నది ఆ పార్టీల నేతలే బహిర్గతం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎంత అరాచకం సాగుతున్నది కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. టీడీపీకి ఒకప్పుడు గట్టి మద్దతుదారులుగా ఉన్న కొంతమంది మేధావులు ప్రభుత్వ తీరుపై పెదవి విరవడమే కాకుండా, ప్రభుత్వం ఐసీయులో ఉందని కామెంట్ చేస్తున్నారు.ఒంగోలులో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డిల మధ్య ఆరోపణల పర్వం, విజయవాడలో టీడీపీకే చెందిన డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులుతో బలవంతపు రాజీనామా చేయించడం తాజా ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.కొద్ది రోజుల క్రితం కృష్ణా జిల్లా సహాకార పాల ఉత్పత్తుల సంఘం విజయ డెయిరీ చైర్మన్‌గా చలసాని ఆంజనేయులు మరోసారి ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా జరిగిన ఈ ఎన్నిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కీలక మంత్రి లోకేష్‌లకు నచ్చలేదేమో తెలియదు. క్యాబినెట్ సమావేశం జరుగుతుండగానే ఇద్దరు మంత్రులు హుటాహుటీన డెయిరీ ఆఫీస్‌కు వెళ్లి ఆంజనేయులు రాజీనామా చేయాలని కోరారు. చంద్రబాబు పంపకపోతే వారు ఎందుకు వస్తారన్నది టీడీపీ వర్గాలలో ఉన్న టాక్.ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్ధసారధి, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వెంటనే రంగంలో దిగి డెయిరీ కార్యాలయానికి వెళ్లి ఆంజనేయులును బెదిరించారట. రాజీనామాకు ఆయన సుముఖంగా లేరు. అయినా మంత్రుల హూంకరింపులతో ఆంజనేయులు ఒత్తిడికి లోనై అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆంజనేయులు కూడా టీడీపీకి చెందినవారే అయినా ఎందుకు ఇంతగా కక్ష కట్టారన్న చర్చ జరుగుతోంది. ఒక టీడీపీ ఎమ్మెల్యే ఈయనపై అసంతృప్తిగా ఉన్నారట. ఆయన అలిగారట. దాంతో ఆయనను బుజ్జగించడానికి గాను ఆంజనేయులుతో రాజీనామా చేయించాలని అధిష్టానం భావించిందట.అయితే చంద్రబాబు కుటుంబానికి చెందిన పాల కంపెనీకి లాభం చేకూర్చడానికే చలసానితో రాజీనామా చేయించారని వైఎస్సార్సీపీ ఆరోపించింది. అది వేరే విషయం. చలసానిని వెంటనే డిశ్చార్జ్ చేయాలని ఆస్పత్రి యాజమాన్యానికి మంత్రులు చెప్పారట. అంతేకాక ఈ క్రమంలో ఆంజనేయులుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ మద్దతుదారులుగా పేరొందిన కొందరు యూట్యూబ్ చానళ్లలో ఆవేదన వ్యక్తం చేశారు. పైగా వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరి మంత్రి అయిన పార్ధసారధి స్వయంగా ఆస్పత్రికి వెళ్లి బెడ్‌పై ఉన్న ఆంజనేయులుతో రాజీనామా పత్రాన్ని తీసుకుని ఫోటో దిగడంపై వారు మండిపడ్డారు. పార్ధసారధి తన లాయల్టీని రుజువు చేసుకోవడానికి ఇంతగా తాపత్రయ పడ్డారని వీరు అంటున్నారు.తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పార్టీకి వ్యతిరేకంగా అన్ని ఆరోపణలు చేసినా, మరికొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నా, వారిపై ఎందుకు చర్య తీసుకోవడం లేదని టీడీపీ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక ఘట్టం గుర్తుకు వస్తుంది. 1995లో పార్టీని చంద్రబాబు కైవసం చేసుకున్న సందర్భంలో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అనారోగ్యానికి గురయ్యారు. అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ ఆస్పత్రికి వెళ్లి ఎన్టీఆర్ నుంచి రాజీనామా పత్రం తీసుకున్నారని చెబుతారు. సరిగ్గా అదే రీతిలో టీడీపీ నాయకత్వం ఇప్పుడు వ్యవహరించిందన్నమాట. కాగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి ప్రభుత్వంలో సాగుతున్న అవినీతిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇప్పటికి పలుమార్లు ఎంపీ కేశినేని చిన్ని వర్గానికి చెందిన కొందరు సాగిస్తున్న గంజాయి, ఇసుక మాఫియాలపై ఓపెన్‌గానే మాట్లాడారు.తాజాగా జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. మద్యం, ఇసుక, గ్రావెల్ మాఫియాలలో దామచర్లకు వాటాలు ఉన్నాయని, రేషన్ బియ్యం మాఫియా నుంచి నెలకు 25 లక్షలు వసూలు చేస్తున్నారని, పోలీస్ స్టేషన్ అడ్డాగానే దందాలు సాగిస్తున్నారని కూడా బాలినేని అన్నారు. దీనికి ప్రతిగా దామచర్ల కూడా బాలినేనిపై పలు ఆరోపణలు చేశారు. బాలినేని పార్టీ మారకపోతే, బాలినేని ఆయన కుమారుడు ఈపాటికి జైలులో ఉండేవారని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ విషయాలు చూస్తే ఏమి అర్దం అవుతుంది. ప్రభుత్వంలోను, అలాగే అధికార కూటమి ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలకు అడ్డూ, ఆపు లేకుండా పోయిందనే కదా! కాని వీరిద్దరు సమన్వయం పాటించాలని టీడీపీ, జనసేన ముఖ్యనేతలు ఒంగోలులోని తమ పార్టీ నేతలకు సందేశం పంపించారట. అంతే తప్ప ఇరువురు చేసుకున్న ఆరోపణలపై విచారణ చేయించి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రెడీగా లేదన్నమాట.అవినీతిని కాపాడటమంటే ఇది కదా అన్నది ప్రజల భావన. దీనిని కప్పిపుచ్చుకోవడానికి మూడు పార్టీల సంయుక్త ప్రకటన ఒకటి విడుదల చేశారు. మనలో మనం విమర్శలు చేసుకోవదని సలహా ఇచ్చాయి. అంతే తప్ప అక్రమాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించలేదు. పనిలో పనిగా సోషల్ మీడియాలో కూటమి మిత్రపక్షాలలో విభేదాలు సృష్టించడానికి వైఎస్సార్సీపీ కుట్రలు చేస్తోందని పిచ్చి ఆరోపణ చేశారు.ఈ మధ్య ఒక సినిమాకు సంబంధించి టీడీపీ, జనసేనల అభిమానులు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నారట. కొందరైతే దూషణలకు దిగారట. వాటిని వైఎస్సార్సీపీ అంటకట్టి తప్పించుకోవాలని చూస్తే ఎవరు నమ్ముతారు! కాగా రాష్ట్రంలో జరుగుతున్న అద్వాన్న పాలనను, అవినీతిని ప్రశ్నించని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీపై కొత్త ఆరోపణ చేశారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా గోవింద నామాన్ని పేరడిగా వాడుతున్నారన్నది ఆయన అభ్యంతరమట. నిజంగానే ఆయన చిత్తశుద్దితో అభిప్రాయపడితే తగు సూచన చేయడం తప్పుకాదు. కాని సినిమాలలో ఎన్ని రకాల పేరడిలు హిందూ మత విశ్వాసాలపై జరిగాయో ఆయనకు తెలియదా! గోవిందా పేరుతో సినిమానే వచ్చింది. గతంలో ఎన్టీఆర్ ఒక సినిమాలో గోవింద అంటూ ఒక బాబాపై పాటకట్టారే. ఇలా ఎన్నో సన్నివేశాలు సినిమాలలో ఉన్నాయి. వాటి గురించి ఏమంటారో తెలియదు.మంత్రి లోకేష్ కూడా గతంలో వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా గోవిందా.. అంటూ నినాదాలు చేసిన వీడియోలు కూడా చక్కర్లు తిరుగుతున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక పాటను కూడా చూపుతున్నారు. అందుకే ఏదైనా విమర్శ చేయాలనుకుంటే ముందూ, వెనక ఆలోచించాలని అంటారు. అధికారంలోకి వచ్చిన కొత్తల్లో తిరుమల స్వామివారి ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిందని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఆరోపణ చేశారు. వైఎస్సార్సీపీపై బురద వేసే క్రమంలో ఈ ఆరోపణలు చేయడం ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్న విమర్శలు వచ్చాయి. తదుపరి సీబీఐ దర్యాప్తులో అలాంటి జంతు కొవ్వు కల్తీ ఏది జరగలేదని తేలింది. మరి దానిపై వీరు స్పందించలేదు. ఇప్పుడు మాత్రం మళ్లీ సనాతన ధర్మం పేరుతో ప్రజలను ఏమార్చడానికి వచ్చినట్లుగా ఉంది.ఒంగోలులో తన పార్టీ నేత చేసిన ఆరోపణలపై ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు. పైగా రెండు పార్టీలు కాంప్రమైజ్ ఫార్ములా వర్కవుట్ చేయడం ఏమిటి? ఈ నేపథ్యంలోనే ఏబీ వెంకటేశ్వరరావు చేసిన ఒక కామెంట్ ఆసక్తికరంగా ఉంది. చలసాని ఆంజనేయులు నుంచి ఆస్పత్రిలోనే రాజీనామా పత్రాన్ని మంత్రి పార్ధసారధి తీసుకుంటున్న పోటో టాగ్ చేస్తూ ఐసీయూలో పార్టీ, ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ వారిని నిత్యం దూషించే చంద్రబాబు నాయుడు.. ఏబీతో పాటు మరికొందరు టీడీపీ వీర మద్దతుదారులు చేస్తున్న విమర్శలకు జవాబు ఇచ్చే ధైర్యం చేయగలరా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
అమరావతి ఎప్పటికీ పూర్తి కాదు: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: అమరావతి పేరిట అడ్డగోలు నిర్మాణాలు.. వాటిపై వ్యయాలు, చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రకటనలపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతి పేరుతో భారీగా ఖర్చు చూపిస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారని.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా, అప్పులు సైతం చేస్తున్నారని చేస్తున్నారన్నారు. శుక్రవారం గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.ఏడేళ్లలో అమరావతికి చంద్రబాబు చేసిందేమీ లేదని అంబటి రాంబాబు అన్నారు. ఇప్పుడు అద్భుత నగరం నిర్మిస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్నారని.. ఇది మార్కెటింగ్ తప్ప మరొకటి కాదన్నారు. అమరావతి అనేది ఎప్పటికీ పూర్తి కాదన్నారు. మరోవైపు ఖర్చులను భారీగా పెంచుతున్నారని మండిపడ్డారు. ‘‘అమరావతి అంటే అద్భుత నగరం కాదు.. అవినీతి, దోపిడీకి కేంద్రం’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.రోడ్ల నిర్మాణంపై ప్రశ్నలుఅమరావతిలో రోడ్ల నిర్మాణ వ్యయాలపై అంబటి రాంబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. కిలోమీటర్ రోడ్డుకు రూ.180 కోట్ల వరకు ఖర్చు చూపిస్తున్నారన్నారు. దేశంలోనే కాదు.. ప్రపంచంలోని ఏ దేశంలోనూ రోడ్ల కోసం ఇంత భారీగా ఖర్చు చేయరని అన్నారు. 21.77 కిలోమీటర్ల రోడ్డుకు రూ.1,519 కోట్లు చంద్రబాబు ఖర్చు చేస్తున్నారని.. రూ.100 కోట్లలో పూర్తయ్యే పనులను అంచనాలు పెంచి రూ.356 కోట్లకు తీసుకెళ్లారని విమర్శించారు. చదరపు మీటర్ రోడ్డుకు రూ.10 లక్షలు ఖర్చు చేయడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.రైతుల పరిస్థితిపై ప్రశ్నలురాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతుల పరిస్థితిపైనా అంబటి ప్రశ్నలు లేవనెత్తారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చారా? లే అవుట్లు అందించారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పొలాలు ఇచ్చినందుకు రైతులు బాధపడే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు.‘‘అద్దాల భవనాల పేరుతో వేల కోట్లు’’అమరావతిలో అద్దాల భవనాలు, భారీ నిర్మాణాల పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అంబటి అన్నారు. తాత్కాలిక స్టీల్ బ్రిడ్జి కోసం రూ.80 కోట్లు ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నించారు. అమరావతిలో చదరపు అడుగు ధర రూ.20 వేల నుంచి రూ.22 వేల వరకు పెరిగిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్నించారు.‘‘బాబు, లోకేశ్‌లకు చెప్పే ధైర్యం ఉందా?’’అమరావతిలో జరుగుతున్న వ్యయాలపై ప్రజలు, మేధావులు ఆలోచించాలని అంబటి రాంబాబు కోరారు. అప్పులు తీసుకువచ్చి వాటిలోనూ కమీషన్లు దండుకుంటున్నారంటూ చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్‌పై మండిపడ్డారు. వైఎస్సార్సీపీ లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని సవాల్ చేశారు. అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. -
బాబు రాయబారం ఫెయిల్.. ఝలక్ ఇచ్చిన పవన్!
సాక్షి, అమరావతి: అమరావతి కార్యక్రమాలను కూటమి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వేళ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గైర్హాజరు కావడం ఇప్పుడు రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపింది. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొన్న కీలక కార్యక్రమానికి పవన్ కావాలనే దూరంగా ఉన్నారంటూ అధికార, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.గురువారం అమరావతిలో స్టీల్ బ్రిడ్జి, ఎమ్మెల్యేల క్వార్టర్లు, సీడ్ యాక్సిస్ రోడ్డు వంటి కీలక ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే అదే సమయంలో పవన్ కల్యాణ్ విశాఖపట్నం పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశమైంది. ఏనుగుల కార్యక్రమం ఉందంటూ ఉదయమే ఆయన విశాఖకు వెళ్లినట్లు తెలుస్తోంది. అదీ షెడ్యూల్లో హడావిడిగా చేర్చుకుని మరీ.. ప్రభుత్వ వర్గాలకు సరైన సమాధానం ఇవ్వకుండానే!.నారాయణ రాయబారం విఫలం!పవన్ కల్యాణ్ కార్యక్రమానికి హాజరయ్యేలా చేయడానికి అమరావతి పనుల్ని చూసుకుంటున్న మంత్రి నారాయణను చంద్రబాబు రంగంలోకి దింపారు. ఈ క్రమంలోనే నిన్న పవన్‌తో నారాయణ భేటీ అయినట్లు సమాచారం. ఎలాగైనా అమరావతి కార్యక్రమానికి రావాలని ఆయన కోరినప్పటికీ.. చివరకు పవన్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదన్న చర్చ సాగుతోంది. విశాఖ పర్యటనకు వెళ్లడంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదనే సంకేతాలు వెలువడుతున్నాయి.చంద్రబాబుపై తగ్గిన పవన్ స్పందనలుగత కొంతకాలంగా చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వ వ్యవహారాలపై పవన్ కల్యాణ్ స్పందనలు తగ్గడం కూడా రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో చంద్రబాబును ఆకాశానికి ఎత్తిన పవన్.. ఈ మధ్యకాలంలో అలాంటి స్టేట్మెంట్లకు దూరంగా ఉంటున్నారు. అంతేకాదు పాలనాపరమైన అంశాలు, పార్టీ వ్యవహారాల్లోనూ తన దారి తనదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. బాబును పొగడాల్సి వస్తుందనే అమరావతి వంటి కీలక కార్యక్రమానికి ఆయన దూరంగా ఉన్నారా? అని చర్చించుకుంటున్నారు.ఎమ్మెల్యేల క్వార్టర్ల అంశమే కారణమా?పవన్ కల్యాణ్ అమరావతి కార్యక్రమానికి దూరంగా ఉండటానికి ఎమ్మెల్యేల క్వార్టర్ల నిర్మాణంపై ఉన్న అభ్యంతరాలే కారణమన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. నిర్మాణ వ్యయాల పెంపు, అంచనాల మార్పులపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఖర్చుల విషయంలో మరింత పారదర్శకత అవసరమని పవన్ వర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఎమ్మెల్యేల క్వార్టర్ల నిర్మాణానికి సంబంధించిన అంశంపై పవన్ గతంలోనూ అధికార యంత్రాంగానికి కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన అమరావతి కార్యక్రమానికి దూరంగా ఉన్నారా? అనే దానిపై జనసేన స్పందించాల్సి ఉంది.వరుస గైర్హాజరులతో పెరుగుతున్న చర్చఇటీవల జరిగిన కొన్ని కీలక సమావేశాలకు కూడా పవన్ కల్యాణ్ గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. ఇప్పటికే పలు కేబినెట్ సమావేశాలకు(మూడు సార్లు) ఆయన దూరంగా ఉన్నారు. అయితే ఈమధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరైన భోగాపురం ఎయిర్‌పోర్టు కార్యక్రమానికి మాత్రం పవన్ హాజరయ్యారు. ఆ వేదికపై కూడా చంద్రబాబు కంటే ప్రధాని మోదీనే ప్రసన్నం చేసుకునేందుకు పవన్ ఎక్కువ తాపత్రయపడ్డారన్న రాజకీయ వ్యాఖ్యలు వినిపించాయి.నాదెండ్ల ప్రకటనతో మరింత ఆసక్తిమరోవైపు పవన్ గైర్హాజరుపై టీడీపీ–జనసేన కూటమి నేతలు ఆచితూచి స్పందిస్తున్నారు. బహిరంగంగా ఎలాంటి విభేదాలను ప్రస్తావించకపోయినా.. ఈ పరిణామాలపై మౌనం పాటిస్తున్నారు. ఇదే సమయంలో అమరావతి కార్యక్రమానికి పవన్ దూరంగా ఉండగా.. జనసేన సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్‌తో అమరావతిపై ఒక మొక్కుబడి ప్రకటన ఇప్పించడం కూడా చర్చకు దారితీసింది.అసలు పవన్ దూరం వెనుక కారణం ఏమిటి? నిజంగానే కూటమిలోని కొన్ని అంశాలపై ఆయన అసంతృప్తిగా ఉన్నారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. -
మహేంద్ర దేవ్.. బాబు రాగానే మాట మారిందా?
దేశానికి మేధావులు ఎంతో కీలకం. వారు దేశాన్ని నడిపే రాజకీయ నేతలకు సరైన మార్గ నిర్దేశనం చేస్తే సమాజానికి మేలు చేసినవారు అవుతారు. కాని అదే మేధావులు కూడా, తమ స్వార్థ ప్రయోజనాలకోసమో, లేక ఏదో పార్టీకి మేలు చేయడం కోసమో రాజకీయ కోణంలో మాట్లాడితే అది దేశానికి తీరని నష్టం చేసినవారు అవుతారు. దురదృష్టవశాత్తు కొందరు మేధావుల ముసుగులో ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకరకంగాను, మరో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరో రకంగా మాట్లాడుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఆ జాబితాలో ఆర్థికవేత్తగా ఉన్న సూర్యదేవర మహేంద్రదేవ్ కూడా చేరడం బాధాకరంగా ఉంది.ప్రముఖ చిత్రకారుడు సూర్యదేవర సంజీవదేవ్ అంటే తెలుగు ప్రజలకు ఎంతో గౌరవం. అలాంటి గొప్పవ్యక్తి కుమారుడు అయిన మహేంద్రదేవ్ గతంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలకు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ఎంత తేడా ఉందో చూడండి. ఇది ఆయనకు అప్రతిష్ట అవుతుందా? కాదా? అన్నదానిని పక్కనబెడితే, ప్రముఖ ఆర్థికవేత్తలు చెప్పే విషయాలను కూడా నమ్మకూడదన్న అభిప్రాయం ప్రజలలో కలగదా? అది మేధావి వర్గానికి సిగ్గు చేటు అవుతుందా? కాదా?మహేంద్రదేవ్ 2024 ఎన్నికలముందు ఏప్రిల్ నెలలో ఎల్లో మీడియాగా గుర్తింపు పొందిన ఈనాడు మీడియాకు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఆంధ్రాకు అప్పులే శాపం అని వ్యాఖ్యానించారు. ఆయన ఏ ఆధారంతో అన్నారో తెలియదు కాని ఏపీ అప్పులు 14 లక్షల కోట్లు దాటిపోయాయని విమర్శించారు. అందులో ఏ ప్రభుత్వ వాటా ఎంత అన్నది చెప్పినట్లు లేరనుకోండి. ఇది సరిగ్గా ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలిగా ఆ రోజుల్లో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి వంటివారు చెప్పిన అసత్య మాటల మాదిరిగా ఉన్నట్లు అనిపిస్తుంది గదా!నిరుద్యోగం తాండవిస్తోందని, సంపద సృష్టించకుండా సంక్షేమ కార్యక్రమాలు అంటే ఎలా అని మహేంద్రదేవ్ ప్రశ్నించారు. ప్రత్యక్ష నగదు బదిలీ స్వల్పకాలికంగా బాగానే ఉంటుందని, దీర్ఘకాలంలో అన్ని రంగాలపైన దుష్ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు. అప్పటి జగన్ ప్రభుత్వం చేపట్టిన స్కూళ్లు, ఆస్పత్రులను నాడు-నేడు స్కీమ్ కింద బాగు చేయడం పట్ల కూడా అంత సంతృప్తి చెందలేదు. జీడీపీలో అది ఐదు శాతంకన్నా తక్కువేనని ఆయన ఆనాడు వ్యాఖ్యానించారు. కారణం ఏదైతేనేం.. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. లోకేష్ కీలక మంత్రిగా మారి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వారితో పాటు మహేంద్రదేవ్‌కు కూడా ప్రధాని కార్యాలయంలో ఆర్థిక సలహామండలి చైర్మన్ పదవి వచ్చింది. ఇక అంతా ఆల్ హాపీస్ అన్నమాట.తాజాగా ఆయన ఎల్లో మీడియాలోని మరో పత్రిక ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఎమన్నారో తెలుసా! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు పెరిగిపోతున్నాయని ఆందోళన చెందడంలో అర్థం లేదట. అప్పులను కేవలం సంఖ్య రూపంలో కాకుండా జీడీపీతో పోల్చి చూడాలట. అంతేకాదు.. చంద్రబాబుకు కూడా సర్టిఫికెట్ ఇచ్చేశారు. అమరావతి నిర్మాణంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని, చంద్రబాబు మిగిలిన ప్రాంతాలను విస్మరించడం లేదని తెలిపారు. ఇవన్ని చదివితే ఏమి అర్థం అవుతుంది. బహుశా చంద్రబాబు సిఫారస్తోనే కేంద్రంలో ఈయనకు పదవి వచ్చిందేమో అన్న అనుమానం జనానికి కలగదా!ఆయన నిజాయితీగా చెప్పదలిస్తే ఏమి వివరించాలి.. గత ఎన్నికలకు ముందు ఏపీ అప్పు 14 లక్షలు ఉందని ఎందుకు చెప్పవలసివచ్చిందో వివరించాలి కదా! ఆ పని చేయలేదు. ప్రస్తుతం లోక్ సభ ఇచ్చిన వివరాల ప్రకారం ఏపీ అప్పు 6.45 లక్షలే అని ఎందుకు ఉంది? అంటే మహేంద్రదేవ్ కావాలనే జగన్ ప్రభుత్వంపై బురద వేసినట్లు అవ్వలేదా? జగన్ తన టరమ్‌లో రెండేళ్ల కరోనా సంక్షోభాన్ని ఎదుర్కున్నా ఐదేళ్ల పీరియడ్‌లో వైఎస్సార్సీపీ టైమ్‌లో జరిగిన అప్పు 3.63 లక్షల కోట్లేనని వెల్లడవుతోంది కదా! కాని కూటమి వచ్చిన రెండేళ్లలోనే చంద్రబాబు సర్కార్ 3.60 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేసిందో ప్రభుత్వంలోని వారు చెప్పలేకపోతున్నారు. కనీసం మహేంద్రదేవ్ అయినా చెప్పి ఉంటే బాగుండేది కదా!అమరావతి నిర్మాణంతో ప్రయోజనాలు ఉన్నాయట. ఎవరూ రాజధానికి అవసరమైన నిర్మాణాలు చేయవద్దని చెప్పడం లేదు. అభివృద్ది అన్నది సహజ సిద్దంగా ఉండాలి కాని, లక్షల కోట్ల వ్యయం చేసి, రియల్ ఎస్టేట్ వెంచర్ మాదిరి చేయవద్దని కదా చాలామంది సలహా ఇస్తున్నది! ఒకే ప్రాంతంలో ఇప్పటికే 50 వేల కోట్లను, అది కూడా అప్పు చేసి ఖర్చు చేస్తుంటే మిగిలిన ప్రాంతాలవారికి అది అసంతృప్తి కలిగించదా? జగన్ మావిగన్ ప్రతిపాదన చేస్తే దాని గురించి మాట్లాడకుండా మూడు రాజధానులు అంటూ ఇప్పుడు అవసరం లేని ప్రస్తావన మహేంద్రదేవ్ తేవడం వల్ల ఏమి ప్రయోజనం కలుగుతుంది.జగన్ సంక్షేమ స్కీముల వల్ల ఉపయోగం లేదని అప్పట్లో చెప్పారు. మరి అంతకన్నా ఎక్కువ అమలు చేస్తామని, సంపద సృష్టిస్తామని చంద్రబాబు టీమ్ ప్రచారం చేసిందే! ఈ రెండేళ్లలో సంపద సృష్టించలేదే. ఖజానా ఖాళీ అయిందని, సంపద ఎలా సృష్టించాలో చెవిలో చెప్పండని చంద్రబాబు అడిగారే! కనీసం మహేంద్రదేవ్ అయినా ఆయన చెవిలో సలహా ఇచ్చి ఉండాల్సింది కదా! ఇక ఈనాడు మీడియా జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాసిన కొన్ని అబద్దపు కథనాలు, పెట్టిన హెండింగ్లు చూస్తే జర్నలిజాన్ని ఇంత నీచంగా మార్చారా అన్న బాధ కలుగుతుంది. కొన్ని ఉదాహరణలు చూడండి..జగన్ బొమ్మవేసి రుణ కంఠుడు అంటూ హెడింగ్ పెట్టి, పది లక్షల కోట్ల అప్పు దాటించిన ఘనుడు అని రాసింది. పురందేశ్వరి రాష్ట్ర అప్పులు 12.50 లక్షల కోట్లు అని ఆరోపించారు. మరోసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు 11 లక్షల కోట్లు అప్పు అంటూ లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేస్తూ అప్పులతో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అప్పుల గురించి నోరు తెరిస్తే ఒట్టు. శ్రీలంక కంటే నాలుగు రెట్ల అప్పుల ఏపీ అని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ప్రస్తుతం ఆయనే ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆ శ్రీలంక ఏమైందో, ఇప్పుడు తామెందుకు భారీ అప్పులు చేస్తున్నారో కేశవ్ చెప్పడం లేదు.శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరం అని పవన్ కళ్యాణ్ మరో ట్వీట్ చేశారు. మేలుకోకుంటే మనకూ శ్రీలంక గతే అని ఈనాడు గుండెలు బాదుకున్నారు. శ్రీలంకలా ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో అని చంద్రబాబు విమర్శించారు. ఇవన్ని జగన్ ప్రభుత్వంపై ప్రచారం చేసిన అబద్దాలు. వారు అప్పట్లో చేసిన ఆరోపణలన్నిటిని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో నిజం చేస్తోందేమో అని ప్రజలు భయపడే పరిస్థితి నెలకొందని బుద్దిజీవులు వ్యాఖ్యానిస్తున్నారు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మాజీ మంత్రితో మర్యాదగా వ్యవహరించారని..
గుడివాడ రూరల్: వైఎస్సార్సీపీకి చెందిన ఓ మాజీ మంత్రికి నోటీసు ఇచ్చిన సందర్భంగా ఆ ఎస్సై మర్యాదగా వ్యవహరించడమే చంద్రబాబు ప్రభుత్వానికి నచ్చలేదు. దానిపై పచ్చ మీడియాలో పిచ్చి కథనాలు రావడం, ఆ ఎస్సైని ప్రభుత్వం వీఆర్‌కు పంపడం చకచకా జరిగిపోయాయి. సాధారణంగా విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం చేసిన వారిని, ప్రజల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన వారిని, తీవ్ర ఆరోపణలు ఉన్న వారిని వీఆర్‌కు పంపుతుంటారు. కానీ, ఏ తప్పూ చేయని ఓ ఎస్సైని వీఆర్‌కు పంపడం అందరినీ విస్మయానికి గురి చేసింది. చంద్రబాబు సర్కారు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇది మరో కోణం. ఈ నెల 10న వైఎస్సార్సీపీ డీఎస్సీ ర్యాలీలు చేపట్టింది. ఈ ర్యాలీని అడ్డుకొనేందుకు ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పలువురు వైఎస్సార్సీపీ నేతలకు ముందస్తుగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. కృష్ణా జిల్లా గుడివాడలో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని)కి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను గుడివాడ వన్‌టౌన్ ఎస్ఐ వై.వి.వి. సత్యనారాయణ ఇతర అధికారులతో కలిసి వెళ్లి కొడాలి నానికి అందజేశారు. ఈ సందర్భంగా నానితో మర్యాదగా మాట్లాడారు. ఇది నచ్చని చంద్రబాబు సర్కారు ఆ ఎస్సైపై కన్నెర్ర చేసింది. ఎస్సై సత్యనారాయణను వీఆర్‌కు పంపుతూ జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే రోజు ఎస్ఐతో పాటు పలువురు సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది కూడా అక్కడ ఉన్నారు. కానీ వారిపై కాకుండా కేవలం నోటీసు ఇచ్చిన ఎస్ఐ సత్యనారాయణపైనే చర్యలు తీసుకోవడం గమనార్హం. -
“ప్రజా సమస్యలపై పోరాడతాం”.. వైఎస్ జగన్ వ్యూహంతో వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: ప్రజా సమస్యలపై చట్టసభలో గళం విప్పాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చట్టసభ్యులకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో శాసనసభా పక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. ప్రజా సమస్యలపై పోరాటానికి సభ్యులు సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం మీటింగ్ సారాంశాన్ని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాకు తెలియజేశారు..డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా పేరుతో మెరిట్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని బొత్స సత్యనారాయణ అన్నారు. డీఎస్సీ అక్రమాలపై ఆధారాలున్నా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు ఈ అంశంపై పోరాటం కొనసాగుతుందని, ప్రభుత్వాన్ని చట్టసభలో నిలదీస్తామని తెలిపారు. నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తామని పేర్కొన్నారు.అభివృద్ధిపై వైఎస్సార్సీపీ విమర్శలురాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ కనిపిస్తోందని బొత్స ప్రశ్నించారు. అభివృద్ధి అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలకే పరిమితమైందని విమర్శలు చేసింది. ప్రజల సమస్యలు, ఉద్యోగుల ఇబ్బందులపై కూడా సమావేశాల్లో ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాయని, వారి సమస్యలపై కూడా పార్టీ తరఫున మాట్లాడతామని తెలిపారు.ప్రతిపక్ష హోదాపై పోరాటంఅసెంబ్లీలో ఉన్నవి రెండే పక్షాలు.. మూడోది లేదు కదా. అలాంటిది 40 శాతం ఓట్లు సాధించిన వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదు? అని చంద్రబాబు ప్రభుత్వాన్ని బొత్స ప్రశ్నించారు. ప్రజా తీర్పును గౌరవించకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. వైఎస్సార్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, అలాగని చట్టంలో ఉంటే డిస్క్వాలిఫై చేయాలని బొత్స కోరారు.‘‘రాజ్యాంగబద్ధంగానే పోరాడుతున్నాం. ఎక్కడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం లేదు. అయినా ప్రభుత్వాన్ని ఫేక్ పోలీసులతో నడిపిస్తున్నారు. చంద్రబాబు రాష్ట్రానికి సీఎం కావడం మన ఖర్మ. అందరి తరఫున అడుగుతాం. అన్ని ఆధారాలు చూపిస్తాం. అన్ని విషయాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం’’ అని బొత్స తెలిపారు. మండలి వరకే.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై నిరసనగా వైఎస్సార్సీపీ శాసనసభ సమావేశాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదే నిర్ణయించింది. అయితే శాసన మండలి సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలపై పోరాడాలని నిర్ణయించింది. ఇక మండలిలో పార్టీ తరఫున డిప్యూటీ చైర్మన్‌గా తూమాటి మాధవరావును ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. -
రేపు కర్నూలుకు వైఎస్ జగన్.. విరూపాక్షికి పరామర్శ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (ఆగస్టు 13, 2026) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. అక్రమ కేసులో అరెస్టై జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని కలిసి పరామర్శించనున్నారు.పర్యటనలో భాగంగా గురువారం తాడేపల్లిలోని తన నివాసం నుంచి వైఎస్ జగన్ బయలుదేరుతారు. కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి పంచలింగాల వద్ద ఉన్న కర్నూలు జిల్లా జైలుకు వెళ్లనున్నారు. జైలులో ములాఖత్ ద్వారా ఎమ్మెల్యే విరూపాక్షిని కలిసి మాట్లాడనున్నారు. విరూపాక్షికి ధైర్యం చెప్పడంతో పాటు, ప్రస్తుత పరిస్థితులపై వివరాలు తెలుసుకోనున్నారు. స్థానిక నేతలతోనూ మాట్లాడనున్నారు. ములాఖత్ అనంతరం.. వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అనంతరం వైఎస్ జగన్ కర్నూలు నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ పర్యటనకు సంబంధించి పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.విరూపాక్షి అక్రమ అరెస్టు వ్యవహారంపై వైఎస్సార్సీపీ ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఆయనను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.అయితే వైఎస్ జగన్ పర్యటనలకు పోలీసుల ఆంక్షల పేరిట అడ్డుతగులుతున్న కూటమి ప్రభుత్వం.. రేపు అదే పంథాను కొనసాగించే అవకాశం లేకపోలేదు. -
ఏపీ విద్యాశాఖలో టెండర్ల గోల్మాల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు సరుకుల సరఫరా టెండర్ల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విద్యార్థినులకు అవసరమైన నిత్యావసర వస్తువుల సరఫరా కోసం చేపట్టిన టెండర్ల ప్రక్రియపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. భారీగా గోల్మాల్ జరుగుతుందనే చర్చ జోరందుకుంది.సెంట్రలైజ్డ్ టెండర్ విధానం పేరుతో భారీ స్థాయిలో కాంట్రాక్టుల కేటాయింపులు జరిగాయి. టీడీపీ నేతలు చెప్పిన వాళ్లకే టెండర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే స్థానికంగా జరిగే కొనుగోళ్లకు బదులుగా మొత్తం ప్రక్రియను కేంద్రీకరించడం వల్ల పారదర్శకతపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఇక.. కేజీబీవీ పాఠశాలలకు సరుకుల సరఫరా కోసం దాదాపు రూ.178 కోట్ల విలువైన టెండర్లను కేవలం నలుగురు కాంట్రాక్టర్లకు అప్పగించినట్లు సమాచారం. ఈ ఎంపిక విధానం, సరఫరా ధరలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ధరల నిర్ణయంపై అభ్యంతరాలుసరుకుల ధరల విషయంలోనూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మార్కెట్ ధరలతో పోలిస్తే కొన్ని వస్తువులకు రేట్లు పెంచేసి.. ఎక్కువ ధరలు నిర్ణయించారనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కోడిగుడ్డు ధర విషయంలో మధ్యాహ్న భోజన పథకంలో ఉన్న ధరలతో పోల్చుతూ పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. చిల్లర సామాన్ల విషయంలోనూ చినబాబు టీం దోపిడీకి దిగిందనే విమర్శలూ వెల్లువెత్తున్నాయి.విద్యార్థుల కోసం ఉద్దేశించిన నిధులు సక్రమంగా వినియోగించాల్సిన అవసరం ఉందని, ప్రతి రూపాయి ఖర్చుపై పారదర్శకత ఉండాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.కేంద్రీయ బండార్‌కు టెండర్‌పై చర్చఈ టెండర్లలో కేంద్రీయ బండార్‌కు అవకాశం కల్పించడంపై కూడా విమర్శలు వినవస్తున్నాయి. గతంలో విజిలెన్స్ సంబంధిత అంశాలు ప్రస్తావనకు వచ్చిన సంస్థకు మళ్లీ అవకాశం ఇవ్వడంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే టెండర్ల ప్రక్రియ నిబంధనల ప్రకారమే జరిగిందా? అర్హతల పరిశీలన ఎలా జరిగింది? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.16 నుంచి కొత్త సరఫరా వ్యవస్థకొత్తగా ఎంపికైన కాంట్రాక్టర్ల ద్వారా ఈ నెల 16 నుంచి కేజీబీవీ పాఠశాలలకు సరుకుల సరఫరా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టెండర్ల ఎంపిక, ధరల నిర్ణయం, సరుకుల నాణ్యతపై మరింత చర్చ సాగుతోంది. కేజీబీవీ విద్యార్థినుల అవసరాలకు సంబంధించిన ఈ సరఫరా వ్యవస్థలో ఎలాంటి లోపాలకు తావులేకుండా ప్రభుత్వం పర్యవేక్షణ పెంచాలని పలువురు కోరుతున్నారు.చిల్లర సరుకుల కొనుగోలు నుంచి కోట్ల రూపాయల టెండర్ల వరకు.. విద్యాశాఖలో ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రగడకు కారణమవుతోంది. అసలు టెండర్ల ప్రక్రియలో ఏం జరిగింది? అనేదానిపై ప్రభుత్వం ఇవ్వబోయే వివరణపై అందరి దృష్టి నెలకొంది. -
ప్రియాంక కేసు.. నిందితుల కాల్ డేటా ఏదీ?: మార్గాని భరత్
సాక్షి, రాజమహేంద్రవరం: మెడికో ప్రియాంక హత్య కేసులో నిందితులను కాపాడే అదృశ్య శక్తులు ఉన్నాయా? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్. ఈ కేసులో నిజాలేమైనా దాచారా? అంటూ చంద్రబాబు సర్కార్‌పై ఆయన మండిపడ్డారు. సమాధానం చెప్పాలంటూ కూటమికి పది ప్రశ్నలు సంధించారు. డాక్టర్ ప్రియాంకను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇంతటి తీవ్రమైన ఘటనను మొదట్లో ఎందుకు తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరిగిందని ఆయన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘మూడు రోజులు నిందితులు ఎక్కడున్నారు?’ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అనుమానాలు ఉన్నాయని మాజీ ఎంపీ ఆరోపించారు. మూడో తేదీన ఘటన జరిగితే.. ఆరో తేదీన నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారని, ఆ మధ్య మూడు రోజులు నిందితులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. వారిని ఎవరైనా దాచారా? దాచితే ఎవరి అండ ఉందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.‘చిన్న యాక్సిడెంట్‌గా ఎలా చెబుతారు?’డాక్టర్ ప్రియాంక మృతిని మొదట చిన్న ప్రమాదంగా పేర్కొనడంపై భరత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు తొలుత ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేశారని, హత్య అంశం వెలుగులోకి వచ్చిన తర్వాతే సెక్షన్లు ఎందుకు మార్చారని ప్రశ్నించారు. తాము ఆందోళన చేపట్టే వరకు కేసు తీవ్రతను ఎందుకు గుర్తించలేదని నిలదీశారు.‘నిందితుల ఫోన్ డేటా ఎందుకు సేకరించలేదు?’హత్య జరిగిన రోజు రాత్రి నిందితులు ఎవరెవరితో మాట్లాడారో, ఎవరిని సంప్రదించారో తెలుసుకోవడానికి ఫోన్ డేటాను ఎందుకు పరిశీలించలేదని భరత్ ప్రశ్నించారు. ఘటన వెనుక ఉన్న శక్తులను బయటకు తీసుకురావాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.‘మద్యం మత్తులో జరిగిన ఘటనగా ఎలా చెబుతారు?’స్థానిక ఎమ్మెల్యే ఘటనను మద్యం మత్తులో జరిగిన హిట్ అండ్ రన్ కేసుగా పేర్కొనడంపై కూడా భరత్ స్పందించారు. ఒక మనిషి ప్రాణం పోయిన ఘటనను కేవలం ప్రమాదంగా ఎలా చూస్తారని భరత్ ప్రశ్నించారు. సోషల్ మీడియా పేజీలు ఎందుకు మూగబోయాయి?రెండు రాష్ట్రాల్లో చర్చకు వచ్చిన ఈ ఘటనపై రాజమహేంద్రవరం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, పేజీలు ఎందుకు స్పందించలేదని భరత్ ప్రశ్నించారు. వారిపై ఎవరి ఒత్తిడి ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు.‘అధికార పార్టీ ఆదేశాలతోనే కప్పిపుచ్చే ప్రయత్నం’ఈ ఘటనలో అధికార పార్టీ ఒత్తిళ్లు ఉన్నాయంటూ మార్గాని భరత్ ఆరోపించారు. నిందితులు ఘటన అనంతరం వెళ్లిన మార్గాల్లో సీసీ కెమెరాలను ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. పోలీసులు వారికి సంబంధించిన వివరాలు ముందుగానే తెలుసుకున్నా.. ఆలస్యంగా అరెస్ట్ చేసినట్లు చూపించారని ఆరోపించారు.సీఐపై చర్యలు ఎందుకు లేవు?ఇంతటి వివాదం నెలకొన్నప్పటికీ ప్రకాష్‌నగర్ సీఐపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని భరత్ ప్రశ్నించారు. కేసులో పూర్తి నిజాలు బయటకు రావాలంటే సమగ్ర దర్యాప్తు అవసరమని అన్నారు. -
‘ఆనం అంటే అవినీతి.. అవినీతి అంటే ఆనం’
సాక్షి, నెల్లూరు జిల్లా: ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ప్రశ్నించడమే పాపం అన్నట్లు ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలొ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మేకపాటి కుటుంబానికి ఒక సుస్థిర స్థానం ఉంది. తమ సానుభూతిపరులను ఉద్దేశించి నీచంగా మాట్లాడటం సరికాదంటూ విక్రమ్‌రెడ్డి హితవు పలికారు.ఆనం గెలిచాక మర్రిపాడులో ఇసుక కొండను మాయం చేశారు. ఆత్మకూరులో ఇసుక దందాకు పాల్పడుతున్నారు. మంత్రి ఆనం ధనదాహానికి ఏడుగురు బలయ్యారు. మంత్రి ఆనం చికెన్ వేస్ట్ మాఫియా తయారు చేశారు. అవినీతి, అక్రమాలు, ఇసుక రవాణా, చికెన్ వేస్ట్ దందాలు చేసిన చరిత్ర మాది కాదు. వైఎస్ జగన్‌ని తిట్టి మంత్రి అయిన చరిత్ర హీనుడివి నువ్వు. భూ సేకరణ చేయకుండా నూతన ప్రాజెక్ట్ అంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నాడు. పోలీస్ స్టేషన్లో సైతం మాముళ్ళు వసూళ్లు చేసిన నీచపు చరిత్ర నీది’’ అంటూ విక్రమ్‌రెడ్డి దుయ్యబట్టారు.‘‘మంత్రి ఆనం ఇసుక దందా ద్వారా రూ.3 కోట్లు సంపాదిస్తున్నారు. ఐదేళ్లకోసారి పార్టీ మార్చే ఊసరవెల్లి నైజం మీదే. ఆనం అంటే అవినీతి.. అవినీతి అంటే ఆనం. నాపై ఆరోపణలునిరూపిస్తే రాజీనామా చేస్తా. నా సవాల్ స్వీకరించే దమ్ముందా?’’ అంటూ విక్రమ్‌రెడ్డి సవాల్ విసిరారు. -
చంద్రబాబు కాకి లెక్కలు.. ఆ భయంతోనేనా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గణాంకాలు చెప్పడంలో ఘనాపాటి అని ఒప్పుకోవాలి. కొందరు వాటిని కాకి లెక్కలు అనవచ్చు. మరికొందరు భలే లెక్కలు అనవచ్చు. కాని వాటిని విశ్లేషించుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఏపీ ప్రజలు వాటిని ఎంతవరకు నమ్ముతారో తెలియదు. ఆయన మాత్రం ఏకధాటిగా మూడు గంటలపాటు ప్రజెంటేషన్ ఇచ్చి ఏదో జరిగిపోతోందన్న భ్రమ కల్పించడానికి యత్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం పేరుతో ఇచ్చిన ప్రజెంటేషన్ రెండు రకాలుగా కనిపిస్తుంది. ఒకటి ఏపీ ఆర్థికంగా ఇబ్బందులలో ఉందన్న భయం. మరోపక్క లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయన్న భ్రాంతి.. ఈ రెండు విషయాలు ఆయనే చెప్పగలరు. ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ప్రజలకు బాండ్ పత్రాలు ఇచ్చారు. అందులో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిస్తే ఒక్కో కుటుంబానికి ఎంత మొత్తం లబ్ధి చేకూరుతుందో తెలిపారు. వీరిద్దరూ త్రికరణ శుద్దిగా ప్రమాణం చేసి బాండ్లు ఇస్తున్నామని అన్నారు. బాగానే ఉంది. త్రికరణ శుద్ది ఉంటే ఏమి చేసి ఉండాలి. నిజంగానే ఆయా కుటుంబాలకు ఈ రెండేళ్లలో ఎంతెంత ఇచ్చింది మళ్లీ లెక్కలు ఇవ్వాలి కదా! ఆ పని చేయకుండా ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నామని, అప్పులు చేసి సంక్షేమ స్కీములు అమలు చేస్తున్నామని చంద్రబాబు చెబుతున్నారు.గతంలో అప్పులు చేసేవారికి సంక్షేమ స్కీములు అమలు చేసే అర్హత ఉందా అని ఆయనే ప్రశ్నించేవారు. డబుల్ ఇంజన్ సర్కార్, ట్రిపుల్ ఇంజన్ గ్రోత్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎల్లో మీడియా ప్రముఖంగా కథనాన్ని ఇచ్చింది. సీమాంధ్ర, కోస్తా, ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్దే లక్ష్యమని ఆయన చెప్పారు. బాగానే ఉంది. ఆ తర్వాత ఇచ్చిన లెక్కలు చూస్తే మతి పోవల్సిందే. ఈ మూడు ప్రాంతాలలో కలిపి ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టుల ద్వారా సుమారు 46 లక్షల ఉద్యోగాలు వస్తాయట. అందులో 2032 లోపు 30 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందట. బహుశా 1956 నుంచి ఉమ్మడి ఏపీలో కూడా ఇన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయో, లేదో తెలియదు. కాని విభజిత ఏపీలో మాత్రం అన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబితే నమ్మగలమా? 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు అని ప్రచారం చేశారు. శ్వేతపత్రంలో వాటిని డబుల్ చేసేశారన్నమాట.ఒకవైపు ప్రపంచం అంతటా సంక్షోభం, ఎల్‌నినోలో ప్రభావం వంటివాటితో ఉపాధి సమస్యలు వస్తుంటే ఏపీలో మాత్రం ఈ రకంగా లక్షల ఉద్యోగాలు వస్తాయంటున్నారు. నిజంగా అలా చేయగలిగితే గొప్పపేరే వస్తుంది. దానిని అంతా స్వాగతిస్తారు. కాని కేవలం ప్రజలను మభ్య పెట్టేరీతిలో ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ప్రచారం చేస్తే మాత్రం ఏపీకి తీరని అన్యాయం చేసినట్లవుతుందని గ్రహించాలి. చంద్రబాబు చెబుతున్నదాని ప్రకారం అమరావతి ఆర్థిక రీజియన్‌ను టెక్నాలజీ, పరిశ్రమలు మౌలిక వసతులు, ఇంధనం విభిన్న ఆర్థిక వ్యవస్థలకు కేంద్రంగా తీర్చిదిద్దుతారట. ఇక్కడ మొత్తం 6-8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రాథమిక అంచనా అట. వీటి ద్వారా 2032 నాటికి పది లక్షల ఉద్యోగాలు వస్తాయని సీఎం చెబుతున్నారు. విశాఖ ఎకనమిక్ రీజియన్‌లో 49 ప్రాజెక్టులతో పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయట. ఈ పెట్టుబడుల ద్వారా 24 లక్షల మందికి ఉపాధి లబ్ధిస్తుందని ఆయన అంటున్నారు. 2032 నాటికి పది లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందట. ఇక తిరుపతి ఆర్థిక రీజియన్‌లో 11-12 లక్షల కోట్ల పెట్టటుబడులు ఆకర్షించడం ద్వారా 2032 నాటికి పది లక్షల ఉద్యోగాలు కల్పించడం లక్ష్యం అని ఆయన తెలిపారు. ఏపీ ఆదాయంలో 40 శాతం రాయలసీమ నుంచే వచ్చేలా తయారు చేస్తారట. లక్ష కోట్లతో ఉద్యానవన హబ్‌ను ఏర్పాటు చేస్తామని కూడా ఆయన వెల్లడించారు. ఒక పక్క మామిడి రైతులు తమకు గిట్టుబాటు ధరలు రావడం లేదని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో చీని తోటలు ఎండిపోతున్నాయని, టాంకర్లు తెచ్చి నీరు పెట్టుకోవల్సి వస్తోందని ఈ మధ్య ఎల్లో మీడియానే వార్తలు ఇచ్చింది. మరో వైపు చంద్రబాబు మాత్రం లక్ష కోట్ల ఉద్యానవన హబ్ అని ఊదరగొడుతున్నారు. ఇందులో కేంద్రం నలభైవేల కోట్లు ఇవ్వాలట. ఇవన్ని ఎప్పటికి జరిగేనో ఎవరు చెప్పగలరు? మరో విషయం ఏమిటంటే అమరావతి క్వాంటమ్ వ్యాలీ ద్వారా 2030 నాటికి రెండున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబుతున్నారు.విశేషం ఏమిటంటే విశాఖ, తిరుపతి రీజియన్లకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ఎంత పెట్టుబడి పెడతారన్నది క్లారిటీ లేదు కాని, అమరావతిలో నిర్మాణాలు, మౌలిక వసతులకోసం ఇంతవరకు 40887 కోట్ల మొత్తాన్ని సమీకరించామని ఆయన తెలిపారు. ఇటీవల ఏపీలో ఒక అసంతృప్తి ఏర్పడింది. ప్రభుత్వం వేల కోట్ల అప్పు చేసి మొత్తం అంతా అమరావతిలోనే ఖర్చు చేస్తోందని మిగిలిన ప్రాంతాల ప్రజలు విమర్శిస్తున్నారు.ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా విశాఖ, తిరుపతి రీజియన్లలో పెట్టుబడులు రాబోతున్నాయని, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని నమ్మబలకాలని ఆశిస్తున్నట్లుగా ఉంది. ఇవన్ని చదువుతుంటే ఒకప్పుడు చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా 2002 ప్రాంతంలో విజన్ 2020 అంటూ పెద్ద ఎత్తున హడావుడి చేశారు. అందులో కూడా ఏవేవో లెక్కలు రాస్తే అంతా చూసి నవ్వుకున్నారు. తదుపరి టీడీపీ 2004 ఎన్నికలలో ఓటమిపాలైంది. తిరిగి 2014లో విభజిత ఏపీలో టీడీపీ మళ్లీ పవర్లోకి వచ్చింది. ఆ టరమ్‌లో ఒక్కసారి కూడా విజన్ 2020 ఊసు ఎత్తినట్లు కనిపించలేదు. అప్పట్లో స్వర్ణాంధ్ర, 2029నాటికి దేశంలోనే నెంబర్ ఒన్ అంటూ కొత్త నినాదాలతో కాలం గడిచిపోయింది. 2019 ఎన్నికలలో టీడీపీ ఓడిపోయింది. తిరిగి ఈ టరమ్‌లో 2047 విజన్‌తో పాటు డబుల్ ఇంజన్ సర్కార్, ట్రిపుల్ ఇంజిన్ గ్రోత్ అని కొత్త పదాలు అందుకున్నారు. అంటే ఒక్కో టరమ్‌లో ఒక్కో నినాదంతో కథ నడిపేయడం, ప్రజలు వాటిని వినీ.. విని విసుగుచెంది ఓడించడం జరుగుతోందని అనుకోవాలా? మరి వచ్చే ఎన్నికలలో ఏమవుతుందో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చంద్రబాబు సర్కార్ పిరికిపంద చర్య
సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాలను నిలదీస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు కూటమి ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడిని పెంచాయి. అయితే ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ర్యాలీలను అడ్డుకోవడం, నేతలను అదుపులోకి తీసుకోవడం.. పలు చోట్ల లాఠీఛార్జీలు చేయడంపై వైఎస్సార్సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిరసనలను అడ్డుకోవడం చంద్రబాబు ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.డీఎస్సీ నియమకాల్లో జరిగిన అవినీతికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయడం, ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ అభ్యర్థులు, డీఎస్సీ సంఘాలతో వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పలుచోట్ల పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు.పులివెందులలో లాఠీఛార్జ్.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నియోజకవర్గంలో పోలీసులు దౌర్జన్యకాండకు పాల్పడ్డారు. పులివెందులలో ఆర్డీవోకు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ శ్రేణులపై లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో పలువురికి గాయాలు కాగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వినిపించాయి. అంతకు ముందు.. ఎంపీ అవినాశ్‌రెడ్డికి ర్యాలీ నిర్వహించడానికి వీల్లేదంటూ పోలీసులు నోటీసులు అందించారు.చీపురుపల్లిలో బొత్సకు అడ్డంకులుచీపురుపల్లిలో నిర్వహించాల్సిన నిరసన కార్యక్రమానికి వెళ్తున్న సీనియర్ నేత, మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణను పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ పోలీసులు అడ్డుకోవడం సరికాదని బొత్స మండిపడ్డారు. రోడ్డుపైనే ఆయన ఆందోళన చేపట్టారు. కొడాలి నాని హౌస్ అరెస్ట్‌మాజీ మంత్రి కొడాలి నానిని గుడివాడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. డీఎస్సీ అంశంపై నిరసనల్లో పాల్గొనకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ పరిణామంపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు మండిపడుతున్నారు.అటు రాజమండ్రిలోనూ మాజీ ఎంపీ భరత్ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతుండగా.. పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఆయన మండిపడ్డారు. విశాఖలో అరెస్టులువిశాఖపట్నంలోని మారియట్ సెంటర్ వద్ద నిరసనకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కేకే రాజు సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.విజయవాడలో దేవినేని ర్యాలీకి అడ్డంకులువిజయవాడలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనుమతి లేదంటూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ శ్రేణులు బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.అవనిగడ్డలోనూ అడ్డగింతఅవనిగడ్డలోనూ వైఎస్సార్సీపీ నేతల నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమస్యలపై గొంతెత్తే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించింది.తిరుపతిలో భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలో.. గన్నవరంలో వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో ర్యాలీలు జరుగుతున్నాయి. నెల్లూరు, కర్నూల్, అనంతపురం, అవనిగడ్డ.. ఇలా పలు చోట్ల వైఎస్సార్సీపీ ర్యాలీలు నిర్వహించకుండా పోలీసులు అడ్డుపడుతున్నారు. నిరసన తెలియజేస్తున్న వాళ్లపైకి లాఠీ ప్రయోగిస్తున్నారు.‘శాంతియుత నిరసనలకు ఎందుకు అభ్యంతరం?’డీఎస్సీ అంశంపై శాంతియుతంగా ర్యాలీలు నిర్వహిస్తే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, దాన్ని అడ్డుకోవడం సరికాదని అన్నారు. -
అనంత పోలీసుల దౌర్జన్యం.. రోడ్డుపైనే పెద్దిరెడ్డి బైఠాయింపు
సాక్షి, అనంతపురం: ఏపీలో దగా డీఎస్సీపై ప్రజాపోరు కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ ఆధర్వ్యంలో పోరాటం ఉధృతమైంది. అయితే శాంతియుతంగా నిర్వహిస్తున్న ర్యాలీలను మాత్రమే కాదు.. ఈ దౌర్జన్యకాండను నిలదీస్తున్న వైఎస్సార్సీపీ నేతలను సైతం పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం తాడిపత్రి నియోజకవర్గం ముచ్చుకోట వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రిలో ఇవాళ యువత ర్యాలీకి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఏర్పాట్లు చేశారు. అయితే పోలీసులు మాత్రం అధికార టీడీపీ కార్యక్రమం ఉందంటూ ఆ ర్యాలీని అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాడిపత్రికి బయల్దేరారు. మార్గమధ్యంలో ముచ్చుకోట వద్ద పోలీసులు ఆయన్ని అడ్డుకోవడంతో.. ఆయన రోడ్డుపైనే బైఠాయించి ఆయన నిరసన తెలియజేశారు. పోలీసులను నిలదీసిన పెద్దిరెడ్డిశాంతియుతంగా నిర్వహించే కార్యక్రమాలను ఎలా అడ్డుకుంటారని పోలీసులను పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసులతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు.. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది.డీఎస్సీ అంశంపై ప్రభుత్వంపై విమర్శలుసాక్షితో మాట్లాడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. వైఎస్సార్సీపీ ర్యాలీలను అడ్డుకోవడం దుర్మార్గమని ఆరోపించారు. “మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదు? మంత్రి లోకేశ్ కనుసన్నల్లోనే డీఎస్సీలో అక్రమాలు జరిగాయి. నైతిక బాధ్యతగా ఆయన రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేశారు.హైవేపై బైఠాయింపుపోలీసుల తీరుకు నిరసనగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు అనంతపురం-తాడిపత్రి హైవేపై బైఠాయించారు. పోలీసుల వ్యవహారశైలిపై నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు వెంకటరెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి కూడా పోలీసుల తీరును తప్పుబట్టారు. శాంతియుత కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు. -
డీఎస్సీపై ప్రశ్నిస్తే దాడులా?.. ‘క్రిమినల్స్ అడ్డా’ ఎవరిది బాబు?
విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వరరావు తన అనుచరులతో కలిసి గత గురువారం నాడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్ష శిబిరంపై దాడి చేశారు. టెంట్ పీకేశారు. అక్కడ కొందరు టీడీపీ గూండాలు వికృత చేష్టలకు పాల్పడ్డారు. సరిగ్గా అదే టైమ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశంలో ఉన్నారు. బోండా ఉమ అరాచక ప్రవర్తనపై ఆయనకు సమాచారం అందే ఉండాలి. అయినా అలాంటివి చేయవద్దని చెప్పకపోగా, వైఎస్సార్‌సీపీవారిని ఉద్దేశించి గొడ్డలి పార్టీ, క్రిమినల్స్ తయారీ అడ్డా అంటూ చంద్రబాబు విమర్శించారట.కొన్నాళ్ల క్రితం బోండా ఉమ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పక్కన కూర్చుంటే చంద్రబాబుకు కోపం వచ్చింది. వెంటనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి పార్టీ కమిటీ వేసి మందలించే ఏర్పాటు చేశారు. తదుపరి తన కుమారులతో కలిసి బోండా ఉమ చంద్రబాబును కలిశారు. అక్కడ ఏమి మాట్లాడుకున్నారో తెలియదు కాని, మరుసటి రోజే ఉమా విజయవాడలో గూండాయిజానికి బరి తెగించారు. వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై ఆయన అనుచరులు దాడి చేశారు. విజిటేరియన్ అయిన విష్ణుపై కోడిగుడ్లు విసిరారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు, మంత్రి లోకేష్ రాజీనామా కోరుతూ వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. వారు తమ డిమాండ్‌తో ప్రశాంతంగా దీక్షలు చేస్తున్నారు. దీనిని భరించడం టీడీపీ నాయకత్వానికి కష్టంగా మారింది.నీట్ ప్రశ్నాపత్రాల లీక్‌పై ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన ఫలితంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయవలసి వచ్చింది. జార్ఖండ్‌లో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆందోళనలు సాగుతున్నాయి. వాటికి ప్రభుత్వంలో భాగస్వామి అయిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా మద్దతు ఇస్తున్నారు. ఏపీలో కూడా డీఎస్సీ టీచర్ల ఎంపికలో అక్రమాలు జరిగాయని మాజీ సీఎం జగన్ ఆధార సహితంగా ఆరోపణలు చేశారు. ఆయన అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వ పక్షాన సరైన జవాబు ఇవ్వలేకపోతున్నారు. పలువురు డీఎస్సీ అభ్యర్ధులు తమకు అన్యాయం జరిగిందని సాక్ష్యాలు చూపుతున్నారు. అయినా ప్రభుత్వం డబాయించి తప్పించుకోవాలని చూస్తోంది.ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ వివిధ రూపాలలో ఆందోళనలు సాగిస్తోంది. డీఎస్సీ అక్రమాలపై జరుగుతున్న ప్రచారం ప్రజలలోకి వెళుతుండడంతో చంద్రబాబు, లోకేష్‌లు అసహనానికి గురవుతున్నారు. అందువల్లే ప్రభుత్వం అనుకుంటే రెండు నిమిషాలలో అణచివేయగలదని బెదిరించడం, ఆందోళన చేస్తున్న రైతులను, నిరుద్యోగ యువతను గంజాయి బాచ్ అని అనడం వంటివి చేశారనిపిస్తుంది. ఇవన్ని ముఖ్యమంత్రి స్థాయికి తగనివని ఆయనకు తెలిసినా ఏదో నిస్సహాయ స్థితిలో పడ్డారనిపిస్తుంది. ఎదురుదాడిలో భాగంగా కర్నూలులో కొందరితో ప్రదర్శన చేయించారు. వారు ఏ తరహా వారో తెలియదు. ఎల్లో మీడియా ప్రముఖంగా ఆ కథనాన్ని ఇచ్చింది. అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ర్యాలీ చేస్తే వారు పవిత్రులు, వ్యతిరేకంగా చేస్తే గంజాయి బాచ్లని ప్రచారం చేస్తారన్నమాట. తనవైపు వాదన సరిగా లేనప్పుడే ప్రభుత్వాలు ఇలాంటి చర్యలకు పాల్పడతాయన్న అబిప్రాయం ఉంది. దేవరపల్లిలో జగన్ టూర్లో ఒక చిన్న హోటల్లో జరిగిన ఉదంతాన్ని కూడా పెద్దదిగా ఫోకస్ చేయాలని యత్నించి చంద్రబాబు అండ్ కో భంగపడ్డారు. ఆ హోటల్ యజమానురాలు లక్ష్మి వచ్చి జగన్‌ను కలిశారు. వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయాలని ఒత్తిడి చేసినా ఆమె ఒప్పుకోకపోవడం గొప్ప విషయమే. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు, లోకేష్‌లను సంతృప్తిపరచడానికి బోండా ఉమా కాని, మరికొన్ని చోట్ల ఇతర టీడీపీ నేతలు కాని దాడులు చేస్తున్నట్లు వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. దానికి తగినట్లే ఉమా మాట్లాడుతూ లోకేష్‌ను విమర్శిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అనుమతి లేకుండా దీక్ష శిబిరాలు నిర్వహిస్తారా అని అంటున్నారు.నిజానికి విష్ణు పోలీసులకు చెప్పే దీక్ష శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. చిత్రంగా శిబిరానికి రక్షణ కల్పించవలసిన పోలీసులు దాడికి పాల్పడ్డ ఉమాను కాకుండా, శాంతియుతంగా కూర్చుని ఉన్న విష్ణును వాహనం ఎక్కించి తరలించారు. అదే టీడీపీ ఎక్కడైనా సభ పెడితే ఆ సమీపంలోకి అయినా విపక్షాలను రానిస్తారా? ఇప్పుడు చెప్పండి.. క్రిమినల్స్ తయారీ అడ్డాగా టీడీపీ ఉందా? వైఎస్సార్సీపీ ఉందా? ఈ దాడుల ద్వారా డీఎస్సీ అక్రమాల వ్యవహరం మరింతగా ప్రజలలోకి వెళుతుంది. ప్రభుత్వ తీరుపై మరిన్ని అనుమానాలు బలపడతాయి. మరికొన్ని ఉదాహరణలు గమనించండి.ఒక మంత్రి తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఒక ఎన్ఆర్ఐ మహిళ స్వయంగా లోకేష్‌కు ఫిర్యాదు చేశారట. అయినా ఆ మంత్రిపై చర్య తీసుకోలేదే? అంటే ఎవరు క్రిమినల్స్ అడ్డాలో ఉన్నట్లు అవుతుంది! ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై తప్పుడు ఆరోపణలు చేసి అరెస్టు చేశారే. ఒక టీడీపీ నేత తన భార్య నైటీని తానే చించి ఎమ్మెల్యేపై ఆరోపించిన విషయం వీడియో సహితంగా బయటపడి ఉండకపోతే, ఎమ్మెల్యేపై ఆరోపణలను నమ్మే పరిస్థితి వచ్చేది కదా? ఇలాంటివాటిని చేసేవారిని కదా క్రిమినల్స్ అనాల్సింది. అలాంటివారిని ఎంకరేజ్ చేసే పార్టీని కదా క్రిమినల్స్ తయారు చేసే అడ్డా అనాల్సింది అని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. దానిని కాదనగలరా?ఈ మధ్యనే గుంటూరులో ఒక మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేసింది కూడా టీడీపీ నేతే కదా! అంతేకాదు. కొందరు కూటమి ఎమ్మెల్యేలు కొంతమంది మహిళలపై ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడింది ఫిర్యాదులు వచ్చాయే. ఏకంగా ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ నుంచే వీడియో కాల్ చేసిన ఘట్టం మరిచిపోయారా? ఆ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన యువతిని నడిరోడ్డులో పోలీసు లాఠీతో కొట్టింది జనసేన నేత కదా! ఆ ఎమ్మెల్యేపై కాని, దౌర్జన్యం చేసిన జనసేన నేతపై కాని ఏమైనా చర్య తీసుకున్నారా? పలు చోట్ల బాధితులపైనే కేసులు పెడుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది.గతంలో వైఎస్సార్సీపీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు, లోకేష్‌లు ఇలాగే క్రిమినల్స్ అంటూ ఆరోపణలు చేసేవారు. ఎన్నికల సమయానికి వారిలో పలువురిని టీడీపీలో చేర్చుకున్నారు. అంటే టీడీపీ క్రిమినల్స్ అడ్డాగా మారిందని ఒప్పుకుంటున్నటా?కాదా? డీఎస్సీలో అక్రమాలు జరిగాయన్నది వైఎస్సార్సీపీ ఆరోపణ. దానికి సమాధానం ఉంటే చెప్పాలి. లేదా ధైర్యం ఉంటే సీబీఐ విచారణకు ఒప్పుకోవచ్చు.గతంలో చంద్రబాబు డిమాండ్ చేసిన వెంటనే తన కుమారుడు జగన్‌పై సీబీఐ విచారణకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఒప్పుకున్న ఘటనను పలువురు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు తన కుమారుడిపై డీఎస్సీ ఆరోపణలు వస్తే ఆ ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. గత రెండేళ్లుగా వైఎస్సార్సీపీ నేతలపైన, కార్యకర్తలపైన జరిగిన హత్యలు, హత్యాయత్నం ఘటనలు, టీడీపీ నేతల దౌర్జన్యాలు ఇవన్ని చూస్తుంటే 1983లో తెలుగుదేశం ఆవిర్భావ సమయంలో ఎన్టీ రామారావు చెప్పిన ఆదర్శాలు ఏమిటి? ఇప్పుడు జరుగుతున్నదేమిటి?ఒక వైపు క్రిమినల్స్‌ను ప్రోత్సహిస్తూ మరో వైపు వైఎస్సార్సీపీపై అదే విమర్శ చేయడం చంద్రబాబుకే చెల్లిందని వైఎస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరు తప్పు చేసినా తప్పే అని, నిష్ఫక్షపాతంగా పనిచేయండని పోలీసులకు చెప్పవలసిన సీనియర్ నేత చంద్రబాబు ఈ వయసులో కూడా ఇలాంటి ప్రమాణరహిత రాజకీయాలు చేయడం వల్ల ఆయనకు అప్రతిష్ట అవుతుందా? కాదా? అన్నది ఆలోచించుకోవాలి. రెడ్‌బుక్ అరాచకాలకు స్వస్థి పలికి, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించకపోతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే నష్టం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఎమ్మెల్యే సారూ.. ఒక్కసారి కిందకు దిగి చూడండి..
అనంతపురం: ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు స్థానిక సమస్యలపై ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. శనివారం పాతగుంతకల్లులోని ఆరో వార్డు వాల్మీకి సర్కిల్ ఏరియా నుంచి దోనిముక్కల రోడ్డులో ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం నిర్వహించారు.ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. కార్యక్రమం ముగించుకుని మరోచోట తాగునీటి సరఫరా మెరుగుదల పథకం భూమిపూజకు కారులో బయల్దేరారు. మార్గమధ్యంలో ఆరోవార్డు ప్రజలు ఎమ్మెల్యే కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. దోనిముక్కలకు వెళ్లే ప్రధాన రహదారిలో డ్రెయినేజీ లేక రోడ్డుకు ఇరు వైపులా మురుగు పారుతోందని, వర్షం పడిన సమయంలో రొచ్చురొచ్చుగా మారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మురుగుపై దోమలు వాలడం వల్ల తాము అనారోగ్యాల పాలవుతున్నామని ప్రజలు తెలిపారు. ‘ఎమ్మెల్యే సారూ... ఒక్కసారి కిందకు దిగి రోడ్డుపై ఉన్న మురుగును చూడండి.. మా బాధలు తెలుసుకోండి’ అంటూ వేడుకున్నా ఎమ్మెల్యే పలకలేదు. ప్రజాప్రతినిధే పట్టనట్టు ఉంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు డ్రెయినేజీ ఏర్పాటు చేస్తామని ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి కారు దిగి వచ్చి హామీ ఇవ్వడంతో వార్డు ప్రజలు శాంతించారు. -
పాలన ఎలా ఉందో వాళ్లనే అడుగు: బాబుపై బుగ్గన ఫైర్
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలు వాస్తవాలను ప్రతిబింబించేవి కావని.. అవి కేవలం రాజకీయ జిమ్మిక్కులేనని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అంటున్నారు. చంద్రబాబు మాటలకు, చేతలకు ఎలాంటి సంబంధం ఉండదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో బుగ్గన, కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించేలా చంద్రబాబు హామీలు ఇస్తారని, కానీ ఆచరణలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయన్నారు. ప్రొగ్రెస్ కార్డు అనే కాన్సెప్ట్ తెచ్చిన చంద్రబాబు.. అది తనకు తానే ఇచ్చుకుంటున్నాడని, కానీ అది ఇవ్వాల్సింది ప్రజలని బుగ్గన గుర్తు చేశారు. చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించే మీడియా కూడా అదే తరహాలో ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ‘హైదరాబాద్‌ను కడితే.. కుతుబ్ షా ఏం చేసినట్లు?’చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధి గురించి చెప్పుకునే తీరుపై బుగ్గన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైదరాబాద్‌ను తానే నిర్మించానన్నట్లుగా చెప్పుకోవడం సరికాదన్నారు. “చంద్రబాబు హైదరాబాద్‌ను కడితే.. కుతుబ్ షా ఏం చేసినట్లు? చంద్రబాబు బిర్యానీ కనిపెడితే.. ఇరానీయులు ఏం చేసినట్లు?. అందరినీ అమెరికాకు తానే పంపానని అంటారు.. ఇతర రాష్ట్రాల వాళ్లను కూడా ఆయనే పంపారా?” అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రకటనలు, రాజకీయ వ్యాఖ్యలు చూస్తే ఇతర దేశాల్లో అయితే ఆయనను పబ్లిక్ లైఫ్ నుంచి వెల్లగొట్టేవారని బుగ్గన అన్నారు.వాళ్లను అడిగితే సరిపోదా?.. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని బుగ్గన సూచించారు. చంద్రబాబు పాలన ఎలా ఉందో మహిళలను అడిగితే చెబుతారని, నిరుద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులను అడిగినా వాస్తవ పరిస్థితి తెలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో రైతులు సమస్యలతో రోడ్డెక్కుతున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని విమర్శించారు. ఆయన సభలకు వచ్చిన ప్రజలు మధ్యలోనే వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానించారు.ఆరోగ్యశ్రీపై విమర్శలురాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం సరిగా అమలు కావడం లేదని బుగ్గన ఆరోపించారు. ప్రజా సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని అన్నారు. రైతులు, విద్యార్థులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.జగన్ జనాదరణపై వ్యాఖ్యలుచంద్రబాబు మీటింగ్ పెడితే జనం మధ్యలో వెళ్లిపోతున్నారన్న బుగ్గన.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయటకు వస్తే లక్షలాది మంది ప్రజలు తరలివస్తున్నారని అంటున్నారు. అది చూసి చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బంది పడుతోందని అన్నారు. ప్రజల్లో తమ పార్టీకి ఇంకా ఆదరణ ఉందని పేర్కొన్నారు. -
బొండా ఉమామహేశ్వరరావు బాటలో బుద్దా వెంకన్న..!
టీడీపీలో అంతర్గత అసంతృప్తి, అధిష్టానం మెప్పు కోసం జరుగుతున్న పోటీ ఇప్పుడు బహిరంగ దూకుడుకు దారి తీస్తోందా? విజయవాడ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలు ఈ ప్రశ్నలను తెరపైకి తెస్తున్నాయి. ఇటీవల ముద్రగడ సంతాప సభలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.. ఆ తర్వాత పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే యత్నాల్లో భాగంగా వైఎస్సార్ సీపీ దీక్షా శిబిరంపై దాడికి దిగారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బొండా చర్యకు మరుసటి రోజే పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ బుద్దా వెంకన్న కూడా అదే తరహాలో వ్యవహరించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. అధిష్టానం మెప్పు కోసం టీడీపీ నాయకుల మధ్య మొదలైన ఈ పోటీ నగర రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది.సాక్షి ప్రతినిధి, విజయవాడ: అధిష్టానం మెప్పు పొందేందుకు విజయవాడ నగరంలోని టీడీపీ నాయకులు పోటీ పడుతున్నారు. తొలిరోజు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.. వైఎస్సార్ సీపీ దీక్షా శిబిరంపై దాడి చేస్తే దాన్ని చూసి రెండోరోజు నగరంలోని టీడీపీ ‘పశ్చిమ’ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా అదే బాట పట్టారు. టీడీపీ నేతలు చేస్తున్న ఈ రచ్చను నగర ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు.. తర్వాత ప్లేటు మార్చి.. తాను టీడీపీకి కట్టుబడి ఉన్నానని అధిష్టానం మెప్పు పొందేందుకే ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వైఎస్సార్ సీపీ దీక్షా శిబిరంపై దాడికి దిగారు. ఇటీవల వరకూ అసంతృప్తితో ఉండటం, అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఉమా ఒక్కసారిగా ప్లేటు మార్చారు. గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం సంతాపసభలో పాల్గొన్న బొండా ఉమా 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ముద్రగడ చేసిన ఉద్యమాలే కారణమంటూ వ్యాఖ్యానించడం, వైఎస్సార్ సీపీతోపాటు అన్ని పార్టీల్లోని కాపు నేతలతో మాట్లాడటం అధిష్టానానికి కోపం తెప్పించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఆయనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడితో కమిటీ వేయడం, అ కమిటీ ముందు ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఆ కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నివేదిక ఇచ్చిన తర్వాత బుధవారం సంజాయిషీ ఇచ్చుకుని వచ్చారు. దాడికి వ్యూహరచన తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అబద్ధం అని చెప్పేందుకే వైఎస్సార్ సీపీపై దాడికి వ్యూహరచన చేశారు. గురువారం ఉదయం సింగ్‌నగర్‌కు చేరుకుని అక్కడ జన సమీకరణ చేసుకున్న తర్వాత నేరుగా ముత్యాలంపాడు ప్రభుత్వ ముద్రణాలయం వద్ద డీఎస్సీలో అక్రమాలపై జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరం వద్దకు చేరుకుని దాడికి తెగబడ్డారు. షామియానాను తొలగించడంతో పాటు వైఎస్సార్ సీపీ నేతలపై తన అనుచరులను దాడులకు పురికొల్పారు. వెంకన్న దాడికి యత్నం రెండోరోజు శుక్రవారం పశ్చిమలో కేదారేశ్వరపేటలోని బాప్టిస్ట్‌పాలెంలో జరుగుతున్న దీక్షా శిబిరంపై దాడికి వెంకన్న ప్రయత్నించారు. ఆయనను పోలీసులు హౌస్ అరెస్టు చేయగా, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున చేరుకుని దాడికి తెగబడ్డారు. గురువారం ఘటనతో పరువు పోగొట్టుకున్న పోలీసులు అప్రమత్తమై వారిని అక్కడి నుంచి పంపించివేశారు. అధిష్టానం మెప్పుకు ఒకరిని చూసి మరొకరు వాతలు పెట్టుకుంటుండటంతో ఈ ట్రెండ్ ఎక్కడికి పోతోందనన్న భయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.బ్రాహ్మణ నేతపై దాడి బ్రాహ్మణ సామాజికవర్గానికి చెంది రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న మల్లాది విష్ణుపై కోడిగుడ్లతో బొండా వర్గం దాడి చేయడాన్ని ఆ సామాజికవర్గ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. చంద్రబాబు, లోకేష్ నుంచి మార్కులు కొట్టేయడం కోసమే ఈ దాడులకు దిగినట్లు సమాచారం. ఇటీవల గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై, కార్యాలయంపై దాడులకు దిగిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవికి పొలిట్‌బ్యూరోలో స్థానం కల్పించిన సంగతి తెలిసిందే.లోకేష్ దృష్టిలో పడటానికే హడావుడి ఈ నేపథ్యంలోనే తాను కూడా లోకేష్ దృష్టిలో పడేందుకు ఈ హడావుడి చేసినట్లు తెలుస్తోంది. రాజధాని రైతులను పరామర్శించడానికి వెళ్తున్న వైఎస్సార్ సీపీ కమిటీ సభ్యులపై మహిళలతో కోడిగుడ్లతో దాడి చేసిన సంఘటన స్ఫూర్తితోనే మహిళలకు కోడిగుడ్లు ఇచ్చి వారిని గొడవకు తీసుకువచ్చినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. విజయవాడ నడి»ొడ్డున రెండుగంటలపాటు టీడీపీ నేతలు హడావుడి చేసినా పోలీసులు చోద్యం చూడటం పోలీసుల పనితీరుకు అద్దం పడుతోంది. -
అర్ధరాత్రి వరకూ పోలీసుల అదుపులో ఇద్దరు వైఎస్సార్సీపీ నేతలు
శ్రీకాకుళం: ఆమదాలవలసలో అర్ధరాత్రి పోలీసుల చర్యలు కలకలం రేపాయి. వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌పై నమోదైన కేసులో భాగంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎఫ్ఐఆర్లో పేర్లు లేని వారిని కూడా విచారణ పేరుతో స్టేషన్‌కు పిలిపిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.చింతాడ రవికుమార్ తమ్ముడు చింతాడ కృష్ణ, బొడ్డేపల్లి రమేష్ కుమార్‌లను సాయంత్రం 5 గంటలకు విచారణకు పిలిచిన పోలీసులు, ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. రాత్రి 12 గంటలు కావస్తున్నా ఇద్దరినీ పోలీసులు విడిచిపెట్టలేదని, పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో పోలీస్ స్టేషన్లోకి స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాలు చేరుకున్నాయి.కృష్ణ, రమేష్ కుమార్‌లను వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు సమాచారం. వారిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే విషయంపై పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి సమయంలో వైఎస్సార్సీపీ నాయకులు పోలీస్ స్టేషన్ల వద్దకు చేరుకుంటున్నారు. -
వైఎస్సార్సీపీ దీక్షా శిబిరాలపై దాడులు.. వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ దీక్షా శిబిరాల మీద దాడుల పట్ల ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ఘటనపై తీవ్రంగా మండిపడ్డారు. దాడుల వీడియోను ఎక్స్‌లో పోస్టు చేసిన వైఎస్ జగన్.. చంద్రబాబూ మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంత దిగజారుతుంది? అంటూ నిలదీశారు. నిరుద్యోగ యువతకు, వారికి మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే… దానికి మీరు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా? అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘డీఎస్సీ-2025 ప్రశ్నాపత్రం లీక్, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని కోరుతూ విజయవాడలో శాంతియుతంగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షపై మీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసి, దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేశారు. పోలీసుల కళ్లముందే, వారి సమక్షంలోనే టెంట్లు లాగిపడేశారు. మా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. మహిళలపై దాడులకు తెగబడ్డారు...రాష్ట్రవ్యాప్తంగా దీక్షా శిబిరాలపై నిర్బంధకాండను కొనసాగించారు. చిలకలూరిపేట, కనిగిరి, యాడికి, తాడిపత్రి నుంచి పలమనేరు, రేపల్లె, గుంటూరు, పొన్నూరు, వేమూరు, మాచర్ల, గురజాల, కందుకూరు, బాపట్ల వరకు నిరసన శిబిరాలపై దాడులు చేశారు. నాయకులను నిర్బంధించారు. శాంతియుతంగా దీక్షలు చేస్తూ మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కూడా నిరుద్యోగ యువతకు లేకుండా చేశారు. నారా లోకేష్‌ను బాధ్యత నుంచి తప్పించడానికి మీ ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులను, పోలీసు యంత్రాంగాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు?’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.‘‘డీఎస్సీ –2025 ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందని మీరు చెబుతున్నప్పుడు, సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి చదివిన యువతకు న్యాయం జరగాలి. నియామకాల్లో జరిగిన అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. ప్రస్తుతం రూ.9,000 కోట్లకు చేరిన పెండింగ్ విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్మెంట్), వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలి. మీ ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతిని, గత రెండేళ్ల బకాయిలతో సహా వెంటనే చెల్లించాలి...చంద్రబాబూ.. మీరు దీక్షా శిబిరాలను ధ్వంసం చేయవచ్చు. మీ పోలీసులను, పార్టీ శ్రేణులను ప్రయోగించవచ్చు. నిరసనకారులను అరెస్టు చేయవచ్చు. కానీ డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై ఆధారాలను చెరిపేయలేరు. నిరుద్యోగ యువతలో రగులుతున్న ఆగ్రహాన్ని అణచివేయలేరు. ఆంధ్రప్రదేశ్ జెన్ జీ గొంతును మూయలేరు. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.@ncbn గారూ, మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంత దిగజారుతుంది? నిరుద్యోగ యువతకు, వారికి మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే… దానికి మీరు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా?#DSC2025 ప్రశ్నాపత్రం లీక్, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐతో విచారణ… pic.twitter.com/SbndqNaPsD— YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2026 -
ఏపీలో కొనసాగుతున్న టీడీపీ రాక్షస క్రీడ
సాక్షి, అమరావతి: డీఎస్సీ అవకతవకలపై వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కూటమి ప్రభుత్వానికి వణుకు పుట్టిస్తున్నాయి. నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేశ్ రాజీనామా చేయాలని, అలాగే సీబీఐతో దర్యాప్తు చేయించాలనే డిమాండ్లకు ఇటు డీఎస్సీ అభ్యర్థులు, సంఘాలు కూడా మద్దతు ప్రకటిస్తున్నాయి. దీంతో కూటమి పెద్దలు ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో దుష్ట రాజకీయానికి తెర తీశారు. ఏపీవ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో.. ఇవాళ రెండో రోజు కూడా పలు చోట్ల దీక్షను భగ్నం చేసే కుట్రలు కొనసాగుతున్నాయి. ఓవైపు పోలీసుల రూపంలో ఆటంకాలు కలిగిస్తున్న కూటమి ప్రభుత్వం.. మరోవైపు టీడీపీ గూండాలతో దౌర్జన్యకాండకు దిగుతోంది. ఈ రాక్షస క్రీడపై వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. డీఎస్సీ వ్యవహారంపై దెందులూరు నియోజకవర్గం మాదేపల్లిలో వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్ష చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారని ఆ పార్టీ నేతలు తెలిపారు. మాదేపల్లిలో ఏర్పాటు చేసిన దీక్షా టెంట్‌ను టీడీపీ గూండాలు తొలగించారని తెలుస్తోంది. ఆపై వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించగా.. అబ్బయ్య చౌదరి నేలపై బైఠాయించి నిరసన కొనసాగించారు.తునిలో ఎండలోనే దీక్షలుకాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న రిలే దీక్షల టెంట్లను పోలీసులు తొలగించారు. రాత్రి కార్పొరేషన్ బ్యాంక్ సమీపంలో ఏర్పాటు చేసిన టెంట్‌ను, అనంతరం ఉదయం జియో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మరో టెంట్‌ను తొలగించినట్లు తెలిపింది. టీడీపీ నేతల సూచనతోనే పోలీసులు ఈ పని చేశారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. అయితే టెంట్లు తొలగించినా వెనక్కి తగ్గేది లేదని వైఎస్సార్సీపీ శ్రేణులు స్పష్టం చేశాయి. ఎండలోనే బైఠాయించి తమ నిరసన కొనసాగిస్తున్నారు.విజయవాడ వెస్ట్‌లో ఉద్రిక్తత!విజయవాడ వెస్ట్‌లో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న రిలే దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నేత బుద్ధా వెంకన్న దీక్షా ప్రదేశానికి చేరుకుని వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా నినాదాలు చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవ సృష్టించే ప్రయత్నం చేశారు. నిన్న మల్లాది విష్ణు ఆధ్వర్యంలో జరిగిన దీక్ష వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నది తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా అక్కడికి రావడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మహిళలపై దాడులు జరగ్గా.. బోండా అనుచరుడు ఒకడు జుగుప్పాసకంగా వ్యవహరించాడు. మహిళా జర్నలిస్టుల మీద దాడి జరుగుతున్నా కూడా.. పోలీసులు చూస్తూ ఉండిపోయారు.కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. టీడీపీ శ్రేణులు ఎంత బరితెగించినా వైఎస్సార్సీపీ శ్రేణులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవినీతి, అవకతకవలకు నారా లోకేశ్ కచ్చితంగా రాజీనామా చేయాలని, జాతీయ దర్యాప్తు సంస్థతో ఈ వ్యవహారంపై విచారణ జరిపించాల్సిందేనని పట్టుబడుతోంది. -
విజయ డైరీ చైర్మన్‌పై టీడీపీ నేతల ఒత్తిళ్లు
ఆంధ్రప్రదేశ్, విజయవాడ: విజయ డెయిరీ చైర్మన్‌గా బుధవారం సాయంత్రం జరిగిన డైరెక్టర్ల సమావేశంలో చలసాని ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, ఆయన ఎన్నిక అనంతరం రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నట్లు సమాచారం.చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని ఇద్దరు మంత్రులు, టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రులు విజయ డెయిరీ కార్యాలయానికి వెళ్లి చలసాని ఆంజనేయులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఒత్తిళ్ల కారణంగా చలసాని ఆంజనేయులు అస్వస్థతకు గురై, విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు సమాచారం.అయితే, టీడీపీ నేతలు, మంత్రుల నుంచి ఈ ఆరోపణలపై ఎలాంటి స్పందన లేదు. అలాగే, చలసాని ఆంజనేయులు అస్వస్థతకు గురికావడానికి గల అసలు కారణాలు రాజీనామా చేయాలనే ఒత్తిడేనా అనేదానిపై వైద్యుల నుంచి అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. ప్రస్తుతం ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
‘ఎన్ఆర్ఐ మహిళను వేధించిన ఆ మంత్రిపై చర్యలేవీ?’
సాక్షి, తాడేపల్లి: అమెరికాలోని డల్లాస్‌లో రాష్ట్ర మంత్రి ఒకరు తనను వేధించారంటూ ‘ప్యూర్’ (పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్) సంస్థ వ్యవస్థాపకురాలు, ఎన్ఆర్ఐ డాక్టర్ శైలా తాళ్లూరి మంత్రి నారా లోకేష్‌కు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేసినా, ఇప్పటి వరకు వెన్నుపోటు పార్టీ కానీ, ఈ ప్రభుత్వం కానీ స్పందించలేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగ మల్లీశ్వరి ఆక్షేపించారు.ఎన్ఆర్ఐ అయిన తెలుగు మహిళను వేధించిన ఆ మంత్రిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు, ఆయనపై కేసు నమోదు చేసి విచారణ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మహిళల భద్రతను పూర్తిగా గాలికొదిలేసిందని, వారు అధికారంలోకి వచ్చిన 26 నెలలుగా మహిళలపై వేధింపులు, దాడులు, అవమానాలు పెరిగిపోయాయని చెప్పారు. మహిళలను రక్షించాల్సిన ప్రజాప్రతినిధులే నిత్యం వేధింపులకు పాల్పడుతున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాగ మల్లీశ్వరి గుర్తు చేశారు. ఆమె ఇంకా ఏం మాట్లాడారంటే..అమెరికాలోని డల్లాస్‌లో వెన్నుపోటు పార్టీకి చెందిన ఓ మంత్రి తనను వేధించారంటూ ఎన్ఆర్ఐ తెలుగు మహిళ సోషల్ మీడియాలో తీవ్రమైన ఆరోపణలు చేసినా, ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే మహిళల రక్షణకు ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు అద్దం పడుతోంది. ఆ మహిళను ఒంటరిగా కాఫీకి రావాలని పిలవడం, ఫొటోలు పంపి ఇబ్బంది పెట్టడం వంటి ఆరోపణలను సైతం వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం చాలా తేలిగ్గా తీసుకోవడం అత్యంత హేయం.ఇంత జరిగినా వెన్నుపోటు పార్టీ తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తోంది. బాధిత మహిళ సోషల్ మీడియా వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, హోం మంత్రి అనిత తదితరులని ట్యాగ్ చేస్తూ న్యాయం కోసం అభ్యర్థించినా వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం స్పందించక పోవడం హేయం.రాష్ట్రంలో మహిళలపై అన్యాయం జరిగిన ప్రతిసారీ తిరిగి బాధితుల పైనే కేసులు పెట్టే పరిస్థితిని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. మహిళా కమిషన్, హోం శాఖ, మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థలు ప్రజల కోసం కాకుండా అధికార వెన్నుపోటు పార్టీ నాయకుల కోసం మాత్రమే పని చేస్తున్నాయనే భావన కలుగుతోంది.వెన్నుపోటు పార్టీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయి. ఇప్పుడు అవి సరిహద్దులు కూడా దాటాయి. చివరకు అమెరికాలో సైతం ఏకంగా రాష్ట్ర మంత్రి, ఒక ఎన్ఆర్ఐ మహిళను వేధించడం వెన్నుపోటు పార్టీ, ఈ ప్రభుత్వ ఉన్మాదానికి పరాకాష్ట. వెన్నుపోటు పార్టీ ప్రభుత్వానికి ఏ మాత్రమైనా నైతికత ఉంటే, తక్షణమే ఆ మంత్రిని బర్తరఫ్ చేసి, కేసు పెట్టి విచారణ చేయాలని నాగ మల్లీశ్వరి డిమాండ్ చేశారు. -
అరాచక ప్రదేశ్‌లో బాబు సర్కార్.. నూకలు చెల్లాయ్
సాక్షి, కృష్ణా/తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ అక్రమాల ఆరోపణలపై కొనసాగుతున్న రాజకీయ వేడి మరింత పెరిగింది. గురువారం విజయవాడలో వైఎస్సార్సీపీ దీక్షా శిబిరంపై జరిగిన దాడి ఘటనను ప్రస్తావిస్తూ మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాబు ప్రభుత్వానికి నూకలు చెల్లాయని, తప్పుడు పనులు, రౌడీయిజానికి ప్రజలు త్వరలోనే సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.కృష్ణాడెల్టాకు సాగునీరు ఇవ్వాలని కోరుతూ అవనిగడ్డలో పులిగడ్డ ఆక్విడెక్ట్ వేదికగా మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ నిరాహారదీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి పేర్నినాని అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘బోండా ఉమా అధికార మదంతో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శిబిరంపై దాడి చేశారు. దీక్షా శిబిరంలో కోడిగుడ్లు విసరడం, షామియానాలు ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. అధికార పార్టీ నేతలు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారు అని మండిపడ్డారు.“బోండా ఉమా లాంటి వంద మంది రౌడీలను పోగేసుకుని చంద్రబాబు, లోకేష్ శునకానందం పొందొచ్చు. కానీ ఆ ఆనందం ఎన్నో రోజులు ఉండదు. మీ పాపాలన్నీ శిశుపాలుడి పాపాల మాదిరిగా లెక్కిస్తున్నారు” అంటూ పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఇంటికొచ్చి కొడతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆయన.. “మీ చేతనైంది చేసుకోండి.. ఎంతమందిని కొడతారో చూస్తాం” అంటూ సవాల్ విసిరారు. దాడులతో తమకు జరిగే నష్టం ఏమీ లేదని, ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు. ఈ క్రమంలో బోండా ఉమాను ఉద్దేశించి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “మీ కార్యకర్తలే మీ ఇళ్లకు వచ్చి ప్రశ్నించకుండా చూసుకోండి” అంటూ హెచ్చరించారు. అధికార దర్పంతో చేసే చర్యలకు ప్రజలు తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్‌ను అరాచక ప్రదేశ్‌గా మార్చారు: లేళ్ల అప్పిరెడ్డిఇటు విజయవాడ ఘటనపై తాడేపల్లిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను అరాచక ప్రదేశ్‌గా మార్చారని, అక్రమాలు, అన్యాయాలకు కేంద్రంగా మారిందని ఆరోపించారు. డీఎస్సీ అక్రమాలపై శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై దాడులు చేయడం దారుణమని అన్నారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఎమ్మెల్యే బోండా ఉమా దాడులకు దిగారని ఆరోపించారు. దీక్షా శిబిరంలో మహిళలు, విద్యార్థులపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు.ఆందోళనకారులపై మూత్రం పోశారనే ఆరోపణలను ప్రస్తావిస్తూ.. ఇది అత్యంత నీచమైన చర్య అని విమర్శించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయానికి సమీపంలోనే ఘటన జరగడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని అన్నారు. దాడి చేసిన వారిని వదిలి.. మల్లాది విష్ణును అరెస్ట్ చేశారని, పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుందని, అందుకే తమ కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో బెదిరింపులు, దాడులకు భయపడబోమని స్పష్టం చేశారు.డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలికితే న్యాయపోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. -
సరిహద్దులు దాటిన క్రేజ్
కాకినాడ: రాష్ట్రాలకు సరిహద్దులున్నా.. ప్రజాదరణ ముందు అవన్నీ తల వంచాల్సిందేనని ఖమ్మం యువకులు నిరూపించారు. వైఎస్ జగన్ దేవరపల్లి పర్యటనలో ఖమ్మం నుంచి ప్రత్యేకంగా వచ్చిన యువకులు దాసరి మధు, రాజేష్ అరుణ్, రఘు సందడి చేశారు. వైఎస్ జగన్, కేటీఆర్, తమిళనాడు సీఎం దళపతి విజయ్ ఫొటోలతో.. ‘జన నాయకులు’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ, దేవరపల్లిలో జరిగిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల ప్రజల దశాబ్దాల కలను నిజం చేస్తూ.. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఖమ్మం – దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి జగన్ ఘనతే కారణమని చెప్పారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడే భూసేకరణ చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ఈ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకువెళ్లారని, అందువల్లనే ఈ రోడ్డు నిర్మాణం పూర్తయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో తమ అభిమాన నేతకు కృతజ్ఞతలు చెప్పేందుకే ఇక్కడకు వచ్చామంటూ ఆ యువకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.


