సాక్షి, నెల్లూరు జిల్లా: రెడ్డి సామాజిక వర్గంపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చిందులు తొక్కారు. ‘‘నన్నే నిలదీస్తారా..? ఎదురు సమాధానం ఇస్తారా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరులో నియోజకవర్గం పొంగురులో 3 ఓట్లు తక్కువ వచ్చాయి. నాకు ఓటు వేయమంటే రెడ్ల పార్టీకి వేస్తారా?. పొంగురు గ్రామంలోని రెడ్డి వర్గానికి బెనిఫిట్స్ రాకుండా కట్ చేయిస్తా. రెడ్లకు పెన్షన్‌లు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం రాకుండా చేస్తా’’ అంటూ బెదిరింపులు దిగారు.


