శ్రీవారి దర్శనానికి 18 గంటలు | 18 hours for Tirumala Srivari Darshan | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 18 గంటలు

Mar 7 2026 8:02 AM | Updated on Mar 7 2026 11:56 AM

18 hours for Tirumala Srivari Darshan

తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 66,855 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,690 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.82  కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement