ఎన్నికల హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిందే..
జాబ్‌మేళాలతో సరిపెడితే ఊరుకోం
ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి
మాటతప్పి..మభ్యపెడితే తిరుగుబాటు తప్పదు
నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం
తిరుపతి సిటీ: చంద్రబాబు సర్కార్ ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేసి తీరాల్సిందే. యువగళం పాదయాత్రలో మంత్రి లోకేష్ నిరుద్యోగులకు అండగా ఉంటామని, రాష్ట్రంలో 2.50 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వీటితో పాటు మరో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి తీరుతామని నిరుద్యోగ యువతకు మాట ఇచ్చారు. అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తి కావస్తోంది. మెగా డీఎస్సీ పేరుతో తూతూ మంత్రంగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి, చేతులు దులుపుకున్నారు. జాబ్‌మేళాల పేరుతో సుమారు 2 లక్షల ఉద్యోగాలిచ్చామని అసెంబ్లీ సాక్షిగా మంత్రి లోకేష్ ప్రకటించడం హాస్యాస్పదం. కంపెనీల్లో అటెండర్, వాచ్‌మెన్, సేల్స్‌మెన్ వంటి పోస్టుల కోసం జాబ్‌మేళాలు నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చేశామంటూ ప్రగల్భాలు పలికారు. డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు, ఇంజినీరింగ్ తదితర ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ ఇంతవరకు నెరవేర్చలేదు.
జాబ్ క్యాలెండర్ లేదు..నిరుద్యోగభృతికి నామం పెట్టారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. ప్రభుత్వం నిరుద్యోగులను ఇలానే మోసం చేస్తే మరో ఉద్యమం తప్పదని, నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు.
ప్రగల్భాలే... పనితీరు శూన్యం
ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన ఒక హామీ నెరవేర్చలేదు. ప్రభుత్వం పనితీరు ప్రగల్భాలకే పరిమితమైంది పనితీరు శూన్యం. లక్షలలో ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. నిరుద్యోగభృతికి నామం పెట్టేశారు. అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా యువగళం పాదయాత్ర హామీలు ఒక్కటీ నెరవేర్చకపోవడం దారుణం.
–రామచంద్రారెడ్డి, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ, తిరుపతి
ఉపాధి చూపకపోతే నిరుద్యోగ భృతి
అందజేస్తాం.. రాష్ట్రంలోని ప్రభుత్వ
ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం.. ఒకటేమిటీ అప్పట్లో హామీల వరద ప్రవహించింది.. అధికారం చేజిక్కిచ్చుకుని రెండేళ్లవుతోంది.. ఒక్క హామీ అమలు కాలేదు.. అదేమంటే ఇప్పటికే 2 లక్షల ఉద్యోగలిచ్చామని
ఊకదంపుడు ఉపన్యాసాలు.. ఇలాగే
మోసం చేస్తే ఉద్యమం తప్పదు..
అని నిరుద్యోగ యువత హెచ్చరిస్తోంది.
20 లక్షల ఉద్యోగాలు భర్తీ నిల్
ప్రభుత్వ శాఖల్లోని 2.50 లక్షల జాబ్‌ల నోటిఫికేషనే లేదు
నిరుద్యోగ భృతి (నెలకు రూ.3వేలు) నామం పెట్టేశారు
ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల ఆ ప్రస్తావనేలేదు
ఇంటికో పారిశ్రామిక వేత్తను చేస్తాం మాటలకే పరిమతం
యువత కోసం ప్రత్యేక మ్యాన్‌ఫ్యాక్చరింగ్ యూనిట్స్ నిల్
ఇతర రాష్ట్రాలకు వెళుతున్న నిరుద్యోగుల వలసను అరికడతాం యథాతధంగా వలస
ఎంఎస్‌ఎంఈ, ఓబీఎంఎబఎస్, స్టార్టప్స్ నిల్
సెల్ఫ్ ఎంప్లాయీమెంట్ స్కీమ్స్ అమలు లేదు
కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తాం ఊసేలేదు
టీటీడీ వంటి ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఉద్యోగాల భర్తీ నిల్
యూనివర్సిటీలలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు నిల్
ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగ భద్రత ఉన్న ఉద్యోగం ఊడబెరికారు
ప్రతి మండలంలో స్కిల్ డెవలప్‌మెంట్ హబ్స్ నిల్
ఇంటింటా సర్వేతో యువతను గుర్తించి ఉపాధి నిల్
నిరుద్యోగ యువత ఉపాధికి షరతులులేని రుణాలు నిల్
ఎంఎన్‌సీ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలకు రిజర్వేషన్ల అమలు నిల్


