breaking news
Tirupati District Latest News
-
సిద్ధార్థలో వైభవంగా సీతారాముల కల్యాణం
నారాయణవనం: స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న నవాహ్నిక‘మహా సంకల్పసిద్ధి మహాయాగం’లో భాగంగా సోమవారం సీతారాముల కల్యాణం కన్నుల పండువగా సాగింది. ఉదయం సుందరకాండ సంపూర్ణ పారాయణం, సంపూర్ణ పారాయణ యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక క్రతువులో రాష్ట్ర వైద్య విద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషితరాజు దంపతులు, మాజీ శాసన సభ్యులు జీవీ శ్రీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ మట్లాడుతూ భారత ప్రధాని నరేంద్రమోదీ శ్రేయస్సును కోరుతూ, లోక కళ్యాణార్థం ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్న అశోక్ రాజును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సాయంత్రం వేళ సీతారామ పట్టాభిషేకం, శ్రీరాముల వరి పల్లకీ ఉత్సవం నిర్వహించగా, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి మంత్రోచ్ఛారణల మధ్య శ్రీరామ మూల మంత్ర యజ్ఞం సాగింది. -
సూర్య తేజం.. చంద్ర వికాసం
తిరుపతి రూరల్: తుమ్మలగుంటలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన సేవలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై అనంత తేజోమయుడిగా స్వామివారు భక్తులకు దర్శనమివ్వగా.. రాత్రి చంద్రప్రభ వాహనంపై చల్లనయ్యగా కటాక్షించారు. ఉదయం సూర్యప్రభ వాహన సేవ సందర్భంగా సరిగ్గా 6.45 గంటలకు సూర్యకిరణాలు స్వామివారి పాదాలు తాకిన సమయంలో అర్చకులు ప్రత్యేక హారతులు సమర్పించారు. ఈ అపురూప దృశ్యాన్ని తిలకించి భక్తులు పరవశించిపోయాయి. చంద్రప్రభపై.. చల్లనయ్యగా.. సోమవారం రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి విహరిస్తూ భక్తులను కటాక్షించారు. సూర్యప్రభ వాహన సేవకు చంద్రగిరి మండలంలోని చంద్రగిరి, రెడ్డివారిపల్లి, నరసింగాపురం, రాయలపురం, తిరుపతి రూరల్ మండలం నుంచి గాంధీపురం గ్రామాలకు చెందిన భక్తులు సారె తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. సారె తెచ్చిన భక్తులకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సాదర స్వాగతం పలికారు. చంద్రప్రభ వాహన సేవకు రామచంద్రాపురం మండలం నెన్నూరు, నడవలూరు, సొరకాయలపాలెం, దేసూరికండ్రిగ, సి.రామాపురం, పి.వి.పురం గ్రామాలకు చెందిన భక్తులు సారె సమర్పించారు. చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి వాహన సేవల్లో పాలు పంచుకున్నారు. నేడు రథోత్సవం బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం 6 గంటలకు రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. స్వామివారు రథంపై ఆశీనులై పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే రాత్రి 7 గంటలకు అశ్వ వాహన సేవ నిర్వహించనున్నారు. -
మోహన్‌బాబు యూనివర్సిటీతో ‘ఫిజిక్స్ వాలా’ ఒప్పందం
చంద్రగిరి: మోహన్ బాబు యూనివర్సిటీ ప్రాంగణం సోమవారం ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా నిలిచింది. దేశంలోనే ప్రముఖ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ ‘ఫిజిక్స్ వాలా’, మోహన్‌బాబు యూనివర్సిటీల మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రో ఛాన్స్లర్ మంచు విష్ణు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఛాన్స్లర్, పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్‌బాబు, ఫిజిక్స్ వాలా వ్యవస్థాపకుడు అలఖ్ పాండే, డైరెక్టర్ వినయ్ మహేశ్వరి, వైస్ ఛాన్స్లర్ పి.వి.రమణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఛాన్స్లర్ మోహన్‌బాబు మాట్లాడుతూ.. నేటి తరం విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందనే విషయాన్ని గుర్తుచేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మోహన్‌బాబు యూనివర్సిటీలో ప్రతి ఏటా సరికొత్త సాంకేతికతను, డిజైన్లను అందుబాటులోకి తెస్తూ దేశంలోనే మొదటి సారిగా వినూత్న విద్యా విధానాలను అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఫిజిక్స్ వాలా వ్యవస్థాపకుడు అలఖ్ పాండే మాట్లాడుతూ.. యూట్యూబ్‌లో 6.5 కోట్లకు పైగా, యాప్‌లో 60 లక్షల మందికి పైగా విద్యార్థులకు 54 రకాల పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తూ ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించామని తెలిపారు. అనంతరం ఎంఓయూలను చేసుకున్నారు. -
చిన్నారులకు అరుదైన చికిత్స
తిరుపతి తుడా: స్విమ్స్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారులకు అరుదైన క్లిష్టమైన శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారని డైరెక్టర్ డాక్టర్ జగదీష్ తెలిపారు. అన్నమయ్య జిల్లా, రాయచోటికి చెందిన రెండేళ్ల బాలిక కడుపులో అసాధారణంగా మాస్ గుర్తించడంతో తల్లిదండ్రులు చిన్నారిని స్విమ్స్‌కు తీసువచ్చారని తెలిపారు. వైద్య పరీక్షలు, స్కానింగ్ అవసరమైన ఇతర నిర్ధారణ పరీక్షల అనంతరం చిన్నారి కుడి కిడ్నీలో విల్మ్స్ ట్యూమర్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించి మెడికల్ ఆంకాలజీ విభాగానికి చెందిన డాక్టర్ భార్గవి ఆధ్వర్యంలోని వైద్య బృందం చిన్నారికి నాలుగు సైకిళ్ల కీమోథెరపీ చికిత్సను పూర్తి చేశారని తెలిపారు. అలాగే తిరుపతి జిల్లా, పుత్తూరు మండలానికి చెందిన రెండేళ్ల బాలుడు విల్మ్స్ ట్యూమర్‌తో స్విమ్స్‌లో చేరారని, మూడు నెలల క్రితం ఈ చిన్నారికి మెడికల్ ఆంకాలజీ విభాగం డాక్టర్ భార్గవి బృందం కీమోథెరపీ అందించగా, అనంతరం సర్జికల్ ఆంకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మణిలాల్ నేతృత్వంలోని విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించినట్టు తెలిపారు. -
చిన్న సూక్ష్మజీవులు.. గొప్ప ప్రభావం
తిరుపతి రూరల్: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సూక్ష్మజీవుల దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. అప్లైడ్ మైక్రోబయాలజీ విభాగం– సూక్ష్మవీక్షణ విద్యార్థి విభాగం, మైక్రోబయాలజిస్ట్స్ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో ‘చిన్న సూక్ష్మజీవులు–గొప్ప ప్రభావం’ ఇతివృత్తంతో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘సూక్ష్మజీవ ప్రపంచం – చిన్న సూక్ష్మజీవులు, గొప్ప ప్రభావం’ అనే అంశంపై రంగోలి పోటీ నిర్వహించారు. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, రంగురంగుల చిత్రాల ద్వారా సూక్ష్మజీవుల ప్రాధాన్యతను చాటిచెప్పారు. అప్లైడ్ మైక్రోబయాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ పి.సువర్ణలతాదేవి, ప్రొఫెసర్లు ఉమామహేశ్వరి, జయమాధురి, ఎంఎస్‌బీఐ విద్యార్థి విభాగం ప్రతినిధులు సాయిభార్గవి, గీత, సుస్రోనియా పాల్గొన్నారు. గొర్రెపాటికి జైలు శ్రీకాళహస్తి: మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన గొర్రెపా టి సురేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ నరసింహమూర్తి తెలిపా రు. సోమవారం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇద్దరు మహిళల ఫిర్యాదు మేరకు అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. -
సమస్యలు అనేకం.. పరిష్కారం నామమాత్రం
పింఛన్ ఇప్పించండి సారూ మాది వెంకటగిరి. నా భర్త మృతి చెందారు. రెండేళ్లుగా వితంతు పింఛన్ కోసం ఎదురుచూస్తున్నాను. అయితే ఇటీవల పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సచివాలయానికి వెళితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సమయంలో నేను మా అమ్మ రేషన్ కార్డులో ఉన్నట్లు నమోదు చేశారు. మా అమ్మకు పింఛన్ వస్తున్న నేపథ్యంలో నేను దరఖాస్తు చేసుకోవడానికి వీలులేకుండా పోయింది. మాకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు. నాకు పింఛన్ ఇప్పించాలని వేడుకుంటున్నా. –తమ బిడ్డలతో పార్వతి, వెంకటగిరి తిరుపతి అర్బన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు అర్జీదారులు క్యూ కట్టారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 437 అర్జీలను కలెక్టర్ వెంకటేశ్వర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ గోవిందరావు, డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్‌నాయక్, భరత్ నాయక్, రామాంజనమ్మ అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అర్జీదారులు తమ సమస్యలను అధికారులకు ఏకరువు పెట్టారు. వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కలుజు కాలువ ఆక్రమణ రేణిగుంట మండలం, వెంకటాపురం కలుజు కాలువను సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం సర్వే నం.227లో 74 సెంట్లు ఆక్రమించిందని స్థానికులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఆనేక కుటుంబాలు కలుజు కాలువ ఆక్రమణలో ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటాపురంతోపాటు కరకంబాడి, తిమ్మాయిగుంట, అంకమ్మనాయుడుమిట్ట, ఆర్ అగ్రహారం తదితర చెరువులకు సురక్షితంగా నీరు చేరాలంటే ఈ కలుజు కాలువ ఎంతో ఆదారమన్నారు. అధికార పార్టీకి చెందిన కొందరి అండదండలతోనే ఆక్రమణ జరిగిందని ఆరోపించారు. డీలర్లకు నేరుగా ఎరువులు ఇవ్వండి కంపెనీల నుంచి నేరుగా చిట్టమూరు మండలంలోని రసాయనిక ఎరువుల దుకాణాలకు ఎరువులతోపాటు పురుగు మందులు అందించాలని డీలర్లు అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు బాబురెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పీజీఆర్ఎస్ సందర్భంగా అగ్రికల్చర్ జేడీ ప్రసాద్‌రావుకు వినతిపత్రాన్ని అందించారు. నెల్లూరు నుంచి సరఫరా చేస్తే బస్తాకు రవాణా చార్జీ అదనంగా రూ.45, రేణిగుంట నుంచి సరఫరా చేస్తే బస్తాపై రవాణా చార్జీ రూ.60 పడుతుందని చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీకి విక్రయిస్తే తమకు బస్తాపై రూ.50 నుంచి రూ.60 నష్టం వస్తోందని వాపోయారు. ఎమ్మార్పీకే ఎరువులు విక్రయించాలంటే నేరుగా చిట్టిమూరు మండలంలోని డీలర్ల దుకాణాల వద్ద ఎరువులు దించాలని డిమాండ్ చేశారు. డీలర్స్ అసోసియేషన్ యూనియన్ నాయకులు భాస్కర్, సాయిరాం కృష్ణ, సుబ్బారావు, మహేష్‌నాయుడు, వేణురెడ్డి, సుబ్రహ్మణ్యం, ఎస్.కే.జలీల్, ఎస్.కే.కరిముల్లా, రాజేష్ నాయుడు, రవీంద్రబాబు పాల్గొన్నారు.కోట్ల విలువ చేస్తే భూములు కబ్జా రైల్వేకోడూరు మండలంలోని వీవీ కండ్రిక గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్లు 130, 142లో ఉన్న కోట్ల విలువచేసే సుమారు 350 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమిస్తున్నారని దళిత నిరుపేద మహిళలు తిరుపతి కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. తమకు సెంటు భూమి లేదని, ఉపాధి హామీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించి హద్దులు ఏర్పాటు చేసుకోవడంతో పాటు జేసీబీలతో భూమిని చదును చేసి మామిడి మొక్కలు నాటుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా అడ్డుకోవాలని రాధిక, శివమ్మ, ఉమామహేశ్వరి, నదియా, కుమారి, దేవమ్మ, పార్వతి, ఇందిరమ్మ, వెంకటమ్మ, రాజమ్మ తదితరులు డిమాండ్ చేశారు. -
చెరువులు చెర‘బట్టీ’
అధికార అండతో కూటమి నేతలు చెలరేగిపోతున్నారు. పెళ్లకూరు మండలంలోని కొండలు, గుట్టలు, చెరువులను చెరబడుతున్నారు. కాలువలు, అటవీ భూముల్లో వాలిపోతున్నారు. భారీ యంత్రాలతో అక్రమంగా మట్టిని తవ్వి ఇటుక బట్టీలు, వెంచర్లు, పరిశ్రమలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రావులపాడు, రాజుపాళెం, చెంబేడు, పునబాక చెరువుల్లో ఇప్పటికే తవ్వకాలు సాగుతుండగా.. అటవీ భూములు, అసైన్మెంట్ భూములే లక్ష్యంగా చేసుకుని ఇబ్బడిముబ్బడిగా లోడేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. పెళ్లకూరు: మండలంలో అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు బరితెగించేశారు. అధికారం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని తహతహలాడుతున్నారు. తమకెదురే లేదన్న రీతిలో మట్టి తవ్వకాలకు పూనుకుంటున్నారు. నాయుడుపేట, మేనకూరు ప్రాంతాల పరిధిలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న లేఅవుట్లకు శిరసనంబేడు, రాజుపాళెం, రోసనూరు గ్రామాల్లోని చెరువులు, తెలుగుగంగ కాలువ గట్లు, ప్రభుత్వ భూముల్లోని గ్రావెల్‌ను తవ్వేసి తరలించేస్తున్నారు. చెరువుల్లో గ్రావెల్, మట్టి తవ్వకాలు చేపట్టరాదని కోర్టు ఆదేశాలున్నా ఇక్కడి అధికార పార్టీ నేతలు పట్టించుకోవడం లేదు. పట్టించుకోని అధికారులు స్వర్ణముఖి నది నుంచి ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నా.. రావులపాడు, రాజుపాళెం, శిరసనంబేడు గ్రామాల నుంచి మట్టి, గ్రావెల్ ఎత్తుకెళ్తున్నా ఇక్కడి అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మైనింగ్, రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులు తూతూమంత్రంగా దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇక్కడి వ్యాపారుల నుంచి వివిధ శాఖల అధికారులు భారీగా ముడుపులు తీసుకుంటున్న తెలుస్తోంది. రావులపాడు కేంద్రంగా మట్టి తవ్వకాలు మండలంలోని రావులపాడు గ్రామంలో అసైన్మెంట్ పొలాల నుంచి చెరువు కట్టలను తవ్వేసి లారీలతో మట్టి తరలిస్తున్నారు. శిరసనంబేడు గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత గ్రామ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములు, చెరువులను లక్ష్యంగా చేసుకుని లారీలు, టిప్పర్లతో మట్టి తరలిస్తున్నారు. ఆ మట్టిని బట్టీలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మట్టి రవాణా కోసం చెరువులో తాత్కాలికంగా రోడ్డు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి తాళ్వాయి పాడు, పెన్నేపల్లి ప్రాంతాల్లోని ఇటుక బట్టీలతో పాటు దొరవారిసత్రం, నాయుడుపేటలో ఉన్న ఇటుక బట్టీలకు లారీలతో మట్టి తరలిస్తున్నారు. స్థానిక రైతుల ముసుగులో కొందరు టీడీపీ నాయకులు రెవెన్యూ అధికారుల నుంచి తాత్కాలిక అనుమతులు పొంది అక్రమాలకు పాల్పడుతున్నారు. దీని వెనుక అధికార పార్టీకి చెందిన ఓ అగ్రనేత ఉన్నట్టు సమాచారం. మట్టి అక్రమ రవాణాతో రోడ్లు కూడా దెబ్బతిన్నాయని స్థానికులు వాపోతున్నారు. చర్యలు తీసుకుంటాం రావులపాడు గ్రామంలో వ్యవసాయ భూములు లెవలింగ్ పనుల కోసం నాలుగు రోజులు మట్టి తరలింపులకు అనుమతులు పొందారు. కానీ ఇటుక బట్టీలకు మట్టి తరలిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. అలాగే రోసనూరు, శిరసనంబేడు, రాజుపాళెం చెరువులు, పలు ప్రాంతాల్లోని అటవీ భూములు, అసైన్మెంట్ భూములు, తెలుగుగంగ పొర్లు కట్టలు, చెరువుల్లో మట్టి, గ్రావెల్ త్రవ్వకాలు, స్వర్ణముఖినది నుంచి అక్రమ ఇసుక రవాణాపై ఫిర్యాదులు వస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు చేపడుతాం. – హరికృష్ణ, తహసీల్దార్, పెళ్లకూరు -
ఆట్రిసోల్ టెక్నాలజీస్‌తో శ్రీరామ కళాశాల ఒప్పందం
తిరుపతి సిటీ: పరిశ్రమ, విద్యాసంస్థల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, విద్యార్థులకు మెరుగైన అవకాశాలను కల్పించే లక్ష్యంతో స్థానిక కరకంబాడి రోడ్డులోని శ్రీ రామ ఇంజినీరింగ్ కాలేజ్, ఆట్రిసోల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు సంబంధిత ప్రతినిధులు కళాశాల యాజమాన్యంతో సోమవారం ఒప్పందపు పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మన్నెం రామిరెడ్డి మాట్లడుతూ ఈ అవగాహన ఒప్పందం ద్వారా విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాభివృద్ధి, ఇంటరాక్షన్, శిక్షణ, ప్లేస్మెంట్ సహకారం, పరిశ్రమకు అనుగుణమైన అభ్యసన అవకాశాలు అందుతాయన్నారు. విద్యార్థులు తరగతి గదిలో పొందే విద్యను పరిశ్రమ అవసరాలతో అనుసంధానం చేయడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ యమన్నెం రామసుబ్బారెడ్డి, డైరెక్టర్ మన్నెం అరవిందుకుమార్రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ జయచంద్ర, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వాసు పాల్గొన్నారు -
నేటి నుంచి పవిత్రోత్సవాలు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం నుంచి 26వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పవిత్రోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ యాగశాల నుంచి పట్టువస్త్రాలు, పట్టు పవిత్రాలు, పాదుకలు, సుగంధ ద్రవ్యాలు తదితర పూజా సామగ్రిని ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి వినాయకస్వామి, చెంగల్రాయస్వామి, శ్రీకాళహస్తీశ్వరస్వామి, జ్ఞానప్రసూనాంబ గర్భాలయాల్లో ఉంచి విశేష పూజలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటలు వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు గర్భాలాయల్లో విశేషాధిపూజా కార్యక్రమాలు నిర్వహించనున్న ఆ సమయాల్లో అంతరాలయ దర్శనం ఉండదన్నారు. ప్రతిరోజూ ఉదయం 10గంటలకు నిర్వహించే ఉచ్ఛికాల అభిషేకం పవిత్రోత్సవాల సందర్భంగా ఉదయం 9.30గంటలకు నిర్వహిస్తారన్నారు. సాయంత్రం దీపారాధణ సేవ టిక్కెట్లు కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. -
వివాహితపై లైంగిక దాడికి యత్నం
దొరవారిసత్రం: బహిర్భూమికి వెళ్లిన వివాహితపై లైంగికదాడికి యత్నించిన ఘటన సోమవారం తెల్లవారు జామున బురదమడుగు గ్రామంలో చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసుల కథనం..బురదమడుగు గ్రామానికి చెందిన వివాహిత రోజూలాగే గ్రామ సమీపంలో బహిర్భూమికి వెళ్లింది. అక్కడే కాపుకాసిన అదే గ్రామానికి చెందిన మొడెం చెంగయ్య ఆమైపె లైంగికదాడికి యత్నించాడు. కేకలు వేయడంతో ఆమె భర్త ఘటనా స్థలానికి చేరుకోవడంతో చెంగయ్య పరారయ్యాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పేలిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ సూళ్లూరుపేట: సూళ్లూరుపేట పట్టణంలోని బజారువీధిలో సోమవారం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలడంతో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. అధికలోడు పడి పేలిపోయినట్టు సమాచారం. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఐదుగురిపై కేసు సైదాపురం: ఆస్తి తగదా విషయంలో మండలంలోని మర్లపూడి గ్రామానికి చెందిన మాదిరెడ్డి సుశీలమ్మపై దాడి చేసిన ఐదుగురిపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ బాధితురాలు సుశీలమ్మకు.. ఆమె చెల్లెలు రత్నమ్మ మధ్య ఆస్తి విషయంలో వివాదం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సుశీలమ్మపై ఒక్కసారిగా మాదిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అతని కుమారుడు వెంకటేష్, చీర్ల అయ్యప్పరెడ్డి, చీర్ల పెంచలరెడ్డి, చీర్ల రాజేశ్వరి తదితరులు కలిసి రాళ్లు, చాకులతో దాడి చేయడంతో సుశీలమ్మ తీవ్రంగా గాయపడిందన్నారు. గాయపడిన సుశీలమ్మను కుటుంబ సభ్యులు గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారని, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్లారని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. రుయాలో హోమ్ కేర్ నర్సింగ్ కోర్సు తిరుపతి తుడా: రుయా ఆసుపత్రిలో హోమ్ కేర్ నర్సింగ్ ఎయిడ్ సర్టిఫికెట్ కోర్సు ప్రారంభించినట్లు ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీ.రవిప్రభు తెలిపారు. రుయా ఆస్పత్రి, రోటరీ క్లబ్ ఆఫ్ తిరుపతి, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో మూడు నెలల కాలవ్యవధితో హోమ్ కేర్ నర్సింగ్ ఎయిడ్ సర్టిఫికెట్ కోర్సును వైద్యాధికారులతో కలిసి ఆయన సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాలియేటివ్ కేర్ రోగులకు సేవలందించేందుకు శిక్షణ పొందిన సంరక్షకుల అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. రుయా సూపరింటెండెంట్ డాక్టర్ బీ.మనోహర్ మాట్లాడుతూ ఆస్పత్రితో పాటు ఇంటి వద్ద పాలియేటివ్ కేర్ అవసరమైన రోగులకు మెరుగైన సేవలందించగల నైపుణ్యం కలిగిన నర్సింగ్ సహాయకులను తీర్చిదిద్దడం ఈ కోర్సు ప్రధాన ఉద్దేశమన్నారు. -
శ్రీహరి రాజసం
ప్రభల తేజసం..ఘటాటోపం నీడన చంద్ర ప్రభ వాహన సేవ(ఇన్సెట్) ప్రత్యేక అలంకరణలో మలయప్పతిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవా లు అంగరంగ వైభవంగా సాగుతున్నా యి. ఏడో రోజు సోమవారం ఉదయం సూర్య ప్రభపై తేజోమయంగా, రాత్రి చంద్ర ప్రభపై చల్లని వెన్నెల కాంతుల్లో శ్రీమలయప్పస్వామి దేదీప్యమానంగా ఊరేగుతూ కనువిందు చేశారు. సూర్యప్రభ వాహనంపై స్వర్ణకాంతులు వెదజల్లుతూ భక్తకోటిని కటాక్షించిన స్వామివారు.. రాత్రి చంద్ర ప్రభపై శ్వేతవర్ణ పుష్పాలంకరణలో సాక్షాత్తు చల్లని చంద్రుడిని తలపించారు. వాహన సేవకు ముందే వర్షం రావడంతో ఘటాటోపం నీడలో చంద్రప్రభ వాహన సేవ సాగింది. స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం మహారథోత్సవం, రాత్రి అశ్వవాహన సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. బుధవారం చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. వాహన సేవల ముందు వివిధ కళాబృందాల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. వాహన సేవల్లో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్యచౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ పాల్గొన్నారు. -
ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
భాకరాపేట: భాకరాపేట సబ్స్టేషన్న్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి పీలేరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు గాయపడ్డారు. ప్రమాదంలో చెట్టేవారిపాళెం గ్రామపంచాయతీ తొగుటపల్లికి చెందిన శంకరయ్య (60), సుబ్రహ్మణ్యం (65), విమలమ్మ (50), స్రవంతి (35), చైతన్య (6) గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే చిన్నగొట్టిగల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
హృదయమనే కోవెలలో..
తిరుపతి తుడా: టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ ఆధ్వర్యంలోని తిరుపతి శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయ చికిత్సా కేంద్రంలో 27వ గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. గుండె మార్పిడి కోసం ఎదురుచూస్తున్న 14 ఏళ్ల బాలికకు గుంటూరులో లభించిన దాత గుండెను సకాలంలో తిరుపతికి తరలించి విజయవంతంగా మార్పిడి చేశారు. గుంటూరులోని కిమ్స్ ఆస్పత్రిలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించిన 38 ఏళ్ల వ్యక్తి కుటుంబం అవయవదానానికి ముందుకు వచ్చింది. వారి మానవతా నిర్ణయం మరో చిన్నారికి ప్రాణం పోసింది. ఎయిర్ అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో టీటీడీ రవాణా విభాగం వాహనంలో ఈనెల 20న మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు నుంచి గుండెను రోడ్డు మార్గంలో తిరుపతికి తరలించారు. ఎస్పీసీహెచ్సీకి చెందిన ఫిజీషియన్ అసిస్టెంట్ విజయ్, శ్యామ్‌బాబు గుండెతో పాటు ప్రయాణించి, వైద్య బృందంతో నిరంతర సమన్వయం చేశారు. సోమవారం సాయంత్రం 7 గంటలకు గుండె తిరుపతికి చేరుకోగా, వైద్య బృందం వెంటనే మార్పిడి ప్రక్రియను ప్రారంభించింది. సుమారు ఎనిమిది గంటలపాటు జరిగిన సంక్లిష్ట శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తిచేశారు. పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి సమన్వయంతో, చీఫ్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ దీపేష్ త్రివేది నేతృత్వంలో కార్డియాక్ అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ మధుయాదవ్‌తో పాటు కార్డియాక్ సర్జన్లు, కార్డియాలజిస్టులు, వైద్య బృందం విజయంతంగా బాలికకు గుండె మార్పిడి చేసి ప్రాణం పోశారు. -
సొంత కార్యక్రమంలా జాతర సమీక్ష సమావేశం
సాక్షి టాస్క్‌ఫోర్స్ : వెంకటగిరి పోలేరమ జాతర ఏర్పాట్లపై సోమవారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో చేపట్టిన సమీక్ష సమావేశం అధికారుల సొంత కార్యక్రమంలా జరిగింది. కింద స్థాయి అధికారులు, విలేకరులు సమావేశం నుంచి వెళ్లిపోవాలని ఆర్డీవో హుకుం జారీచేశారు. దీంతో అక్కడున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు విస్తుపోయారు. అమ్మవారి జాతర రాష్ట్ర పండుగ అయినప్పిటి నుంచి ప్రత్యేక బాధ్యతలు వహిస్తూ జాతరకు సంబధించిన అన్నీ అంశాలు విలేకరులతో పంచుకునేవారు. అయితే ఈ ఏడాది దానికి భిన్నంగా మున్సిపల్ కార్యాలయంలోని ఓ చిన్న గదిలో సమావేశం నిర్వహించారు. దానికి తోడు దేవదాయశాఖ పర్యవేక్షణలో జరిగే ఈ జాతరలో ఆ శాఖ అధికారి, కమిటీ అధ్యక్షులు సమావేశానికి అన్ని శాఖల అధికారులు, పాత్రికేయులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆ డివిజన్ అధికారి ఆదేశంతో పలుశాఖల అధికారులు వెళ్లిపోగా పాత్రికేయులు గంటల తరబడి వెలుపలే నిరీక్షించారు. -
ఈకేవైసీ పూర్తి చేయండి
తిరుపతి అర్బన్: జిల్లా వాప్యంగా రైతులు సాగుచేసిన పంటలకు సంబంధించి వంద శాతం ఈకేవైసీ ప్రక్రియను వ్యవసాయశాఖ నేతృత్వంలో పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ గోవిందరావు స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని జేసీ చాంబర్లో సోమవారం వరి ధాన్యం కొనుగోలుతోపాటు ఈకేవైసీ పూర్తి చేయడానికి అధికారులతో సమీక్షించారు. జేసీ మాట్లాడుతూ ఈకేవైసీ ఉంటేనే వరి ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తుందనే విషయాన్ని రైతులకు ముందుగానే స్పష్టంగా తెలియజేయాలన్నారు. అలాగే 2026–27 రబీకి సంబంధించి వరి ధాన్యం కొనుగోలు చేయడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్వో శేషాచలం రాజు, డీఎం దేవుళ్ల నాయక్, అగ్రికల్చర్ జేసీ ప్రసాద్‌రావు పాల్గొన్నారు. ఫిజియోథెరపిస్ట్ మెరిట్ లిస్ట్ విడుదల తిరుపతి తుడా: కాంబియైండ్ నోటిఫికేషన్ – 2025లో భాగంగా ఫిజియోథెరపిస్ట్ పోస్టుకు సంబంధించి మెరిట్ లిస్ట్‌ను విడుదల చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ పర్మిషన్ మేరకు మెరిట్ లిస్టును స్విమ్స్ అధికారిక వెబ్సైట్లో ఉంచారు. ఫైనల్ లిస్ట్‌కు సంబంధించి అభ్యర్థులకు ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా మంగళవారం సాయంత్రం 5గంటల్లోపు ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. వర్షాలపై విద్యుత్‌శాఖ అప్రమత్తం తిరుపతి రూరల్: భారీ వర్షాలు, బలమైన గాలుల నేపథ్యంలో ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేలా ముందస్తు చర్యలు చేపట్టాలని సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో అధికారులుతో సోమవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. స్తంభాలు కూలిపోవడం, విద్యుత్ తీగలు తెగిపడటం వంటి ఘటనలు కనిపిస్తే వెంటనే సమీప విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే 1912, 1800 425 155333 టోల్‌ఫ్రీ నంబర్లకు లేదా 91333 31912 వాట్సాప్ నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. అంతకుముందు గురజాడ అప్పారావు చిత్రపటానికి నివాళి అర్పించారు. డయల్ యువర్ సీఎండీకి 103 వినతులు ‘డయల్ యువర్ సీఎండీ’, ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాలకు 103 మంది వినియోగదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వివిధ సమస్యలపై వినతులు అందినట్లు సీఎండీ శివశంకర్ తెలిపారు. పరిశ్రమల్లో పటిష్ట భద్రత తిరుపతి అర్బన్: పరిశ్రమల్లో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ వెల్లడించారు. సోమవారం ఆయన కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమీక్షా సమావేశాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగల్ డెస్క్ విధానంలో 190 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. అందులో 151కి అనుమతులు ఇచ్చామని తెలిపారు. దీంతో పలువురుకి ఉద్యోగ ఉపాధి లభిస్తుందని వివరించారు. మున్సిపల్ కమిషనర్ జయకృష్ణ, జిల్లా పరిశ్రమల జీఎం చంద్రశేఖర్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ విజయభరత్‌రెడ్డి, అగ్రిమాపక అధికారి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 6 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 72,019 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,431 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.50 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 6 గంటల సమయం పడుతోంది. -
గరుడ గోవిందం
ఆరు గంటలపాటు వైభవంగా గరుడోత్సవం తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడవాహన సేవ శనివారం రాత్రి అశేష భక్తజనుల మధ్య వైభవంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. పల్లకీపై మోహినీ అవతారంలో ఊరేగుతున్న స్వామివారిని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వాహన సేవ సాగేంతసేపూ మాడ వీధులు గోవింద నామస్మరణలు, వేద విద్యార్థుల మంత్ర పఠనంతో మార్మోగాయి. హారతులు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ వాహన సేవ వైభవంగా కొనసాగింది. పల్లకీసేవకు తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం, చిగురువాడ, మల్లంగుంట, దుర్గసముద్రం, కేసీపేట, రామానుజపల్లి, సి.గొల్లపల్లి, పైడిపల్లి, పాతకాల్వ పంచాయతీల నుంచి భక్తులు సారె తీసుకువచ్చి సమర్పించారు. గోవింద నామస్మరణతో పులికించిన తుమ్మలగుంట శనివారం రాత్రి తుమ్మలగుంటలో శ్రీవారికి అత్యంత ప్రీతికరమైన గరుడ వాహనంపై కల్యాణ వేంకటేశ్వర స్వామి విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి గరుడవాహన సేవను తిలకించేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో తుమ్మలగుంట వీధులన్నీ జనసంద్రంగా మారాయి. గరుడునిపై గోవిందుడు విహరిస్తుండగా భక్తులు గోవింద నామస్మరణతో పరవశించారు. సుమారు ఆరు గంటల పాటు సాగిన గరుడోత్సవం ముగిసే సమయానికి సుమారు 70 వేల మందికిపైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు సమాచారం. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను కఠినంగా అమలు చేశారు. గరుడవాహన సేవలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భక్తులందరికీ సంతృప్తికరమైన దర్శనం కల్పించేలా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
ఆంక్షలతో శ్రీవారి భక్తుల సతమతం
● గరుడోత్సవ దర్శనానికి తప్పని తిప్పలు ● తిరుమల ఔటర్ రింగ్ రోడ్డులో వాహనాల కట్టడి ● ప్రయాణికులను సైతం అక్కడే దించేసిన ఆర్టీసీ సాక్షి టాస్క్‌ఫోర్స్: గరుడ సేవ తిలకించడానికి తిరుమల చేరుకున్న సాధారణ భక్తుల పాట్లు అన్నీ ఇన్నీ కావు. తిరుమలలో అడుగడుగునా పోలీసుల ఆంక్షలు.. సరైన సమాచారం అందించే హెల్ప్ డెస్క్‌లు లేకపోవడం వంటి పరిణామాలతో శనివారం రాత్రి భక్తులు సతమతం అయ్యారు. ఆపై ప్రైవేట్ టాక్సీలకు అనుమతించగా పోగా టీటీడీ ఉచిత బస్సుల సేవలు అందుబాటులో లేకపోవడంతో వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు నడవడానికి ఇబ్బందులు పడ్డారు. గురుడ సేవ రోజున శనివారం రాత్రి సొంత వాహనాల్లో తిరుమలకు వచ్చిన వారు, ఆర్టీసీ బస్సుల్లో విచ్చేసిన ప్రయాణికులను తిరుమల ఔటర్ రింగ్ రోడ్డులో వదిలేశారు. దీంతో వారు ఆయా మార్గాల్లో లగేజీని చేతపట్టి నడవడానికి కష్టాపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎలాగో రామబంగీచా బస్టాండ్ ప్రాంతానికి చేరుకున్న భక్తులు గరుడసేవ చూసేందుకు మాడ వీధుల్లోకి చేరుకునే క్రమంలో నిర్ధిష్టమైన సూచిక బోర్డులు లేక, సమాచారం అందించే సహాయ కేంద్రాలు కనిపించకపోవడంతో కొందరు తీవ్ర అసహనానికి గురయ్యారు. మరోవైపు సర్వదర్శనానికి వెళ్లే భక్తుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ప్రధానంగా రాంబగీచా బస్టాండు, బాలాజీ బస్టాండులో దిగిన ప్రయాణికులకు టీటీడీ ఉచిత బస్సుల సేవలు, ప్రైవేట్ క్యాబ్‌లు అందుబాటు లేవు. దీంతో సర్వదర్శనం వైకుంఠం కాంప్లెక్స్ వద్దకు చేరుకోవడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. తిరుమలలోని ప్రధాన మార్గాల్లో భక్తులు నడవలేక కాళ్ల నొప్పులతో కాసేపు కూర్చుందామనే లోపు అక్కడే బందోబస్తులో ఉంటున్న పోలీసులు లేవయ్యా.. లేవమ్మా అంటూ పక్కకు వెళ్లండంటూ ఆంక్షలు విధించారు. మరికొందరు భక్తులు గదులు పొందడానికి మార్గాలు తెలియక ఆపసోపాలు పడ్డారు. టీటీడీ ఉద్యోగులు, పోలీసులు, మీడియా గ్యాలరీల్లో వెళ్లే ప్రవేశ ద్వారం వద్ద కూడా గందరగోళ వాతావరణం నెలకొంది. తాము టీటీడీలో పనిచేస్తున్నా ఎందుకు ప్రవేశ ద్వారం వద్ద ఆంక్షలు పెట్టారంటూ కొందరు తమ గుర్తింపు కార్డులతో ప్రశ్నించినప్పటికీ.. పక్కన ఉండాలనే సమాధానం అసంతృప్తికి గురిచేసింది. -
గ్రామీణ వారసత్వ సంపదను పరిరక్షిద్దాం
– గ్రామీణ వారసత్వం మోనోగ్రాఫ్ను ఆవిష్కరించిన కలెక్టర్ తిరుపతి అర్బన్: గ్రామీణ వారసత్వ సంపదను సమన్వయంతో సమష్టిగా పరిరక్షిద్దామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో రూపొందించిన ‘తిరుపతి జిల్లా గ్రామీణ వారసత్వం’ మోనో గ్రాఫ్‌ను కలెక్టరేట్లో శనివారం కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని చారిత్రక కట్టడాలు , సాంస్కృతిక సంప్రదాయాలతోపాటు పురావస్తు సంపదను గుర్తించి, వాటికి సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా సేకరించి, డాక్యుమెంట్ చేయడం అభినందనీయమన్నారు. గ్రామీణ వారసత్వ సంపదను పరిరక్షించడంతో పాటు, దాని ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసేందుకు ఇలాంటి ప్రచురణలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మోనోగ్రాఫ్ రూపకల్పనలో కృషి చేసిన జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారులు, సిబ్బందిని జిల్లా కలెక్టర్ అభినందించారు. -
చంద్రాపచారం
సాక్షి టాస్క్‌ఫోర్స్: చంద్రబాబు, కూటమి నేతలు చేసిన దిగజారుడు డైవర్షన్ డ్రామా బెడిసికొట్టింది. గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి ప్రసాదం లడ్డూలో వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందంటూ సాక్ష్యాత్తు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు కూటమి నేతలు రాజకీయ స్వార్థం కోసం శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని వాడుకోవడంపై భక్తకోటి ఆగ్రహించింది. ఈ ఘటనపై సుదీర్ఘ విచారణ జరిపిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లడ్డూకి వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు ఆనవాళ్లే లేవని స్పష్టం చేసింది. శ్రీవారి ప్రసాదంపై కూటమి నేతలు దుష్ప్రచారం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, లడ్డూ తయారు చేసే పోటు కార్మికులను సైతం అవమానించారని ప్రజా సంఘాలు, మేధావులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా హిందూ భక్తుల ఆరాద్యదైవం శ్రీవారికి రాజకీయాలు ఆపదించి భక్తుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నాలు విరమించుకోవాలని వారు కోరుతున్నారు. మౌనం వీడి వాస్తవాలు భక్తులకు తెలపాలి గత ప్రభుత్వ పాలనలో శ్రీవారి లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిసిందంటూ అవాస్తవాలను కూటమి నేతలు దుష్ప్రచారం చేయడంతో కోడై కూసిన కొన్ని పచ్చ మీడియా యాజమాన్యాలు ప్రస్తుతం మౌనం పాటిస్తున్నాయి. జంతుకొవ్వు ఆనవాళ్లు లేవని ఈడీ సైతం స్పష్టం చేయడంతో వాస్తవాలను ప్రచారం చేసేందుకు ఎందుకు వెనుకాడుతున్నాయో అర్థం కాలేదని భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సీఎం, డిప్యూటీ సీఎం వంటి అత్యున్నత పదవుల్లో కొనసాగుతున్న వ్యక్తులు మౌనం వీడి దెబ్బతిన్న భక్తుల మనోభావాలపై స్పందించి క్షమాపణలు చెప్పాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. శ్రీవారి ప్రసాదంపై కూటమి విషం భక్తులతో పాటు పోటు కార్మికులకు అవమానం శ్రీవారి లడ్డూకు వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిపారని శ్రీవారి భక్తులను భయభ్రాంతులకు గురిచేశారు. తిరుమలలో లడ్డూ తయారు చేసే పోటు కార్మికులను సైతం అవమానించారు. సాక్ష్యాత్తు సీఎం, డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తులు వాస్తవాలు గ్రహించకుండా మాట్లాడడం దారుణం. ఈడీ విచారణతో జంతు కొవ్వు కలవలేదని వాస్తవాలు బయటపడ్డాయి. దుష్ప్ర చారం చేసిన వ్యక్తులు శ్రీవారి భక్తులకు, పోటు కార్మికులకు ఏం సమాధానం చెబుతారు? వాస్తవాలు తెలుసుకోకుండా రాజ కీయ స్వార్థం కోసం ఇష్టానుసారంగా మాట్లాడి భక్తుల మనోభావాలతో ఆడుకోవడం నిలిపివేసి ప్రజాశ్రేయస్సుపై దృష్టి పెట్టాలి. – జే విశ్వనాథ్, సీపీఐ నగర కార్యదర్శి, తిరుపతి -
సున్నిత అంశాలపై ఆరోపణలు మానుకోవాలి
గత ప్రభుత్వంలో పాలకులు శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతుకొవ్వు కలిపారని నానా హంగామా చేయడంతో భక్తులు భయభ్రాంతులకు లోనయ్యారు. అలాంటి సున్నితమైన విషయంపై వాస్తవాలు తెలుసుకోకుండా పాలకులు జంతుకొవ్వు కలిసిందని వ్యాఖ్యానించడం బాధాకరం. ఈ విషయంపై ఈడీ విచారణతో వాస్తవాలు బయటపడ్డాయి. నెయ్యిలో జంతుకొవ్వు కలపలేదని అన్ని నిరాధార ఆరోపణలేనని స్పష్టమైంది. ఇప్పటికై నా రాజకీయ పార్టీ నేతలు కలియుగ దైవంతో రాజకీయాలు చేయడం మానుకోవాలి. – రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ టీచర్, తిరుపతి ధర్మం గెలిచింది వేలాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా శ్రీవారి లడ్డూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. అలాంటి లడ్డూలో గత ప్రభుత్వ హయాంలో జంతుకొవ్వు కలిపా రని నిందలు వేశారు. కూటమి ప్రభుత్వం చేసిన ప్రచారం అసత్యమని నెయ్యి లో జంతు కొవ్వు కలవలేదని ఈడీ విచారణలో తేలింది. దీంతో ధర్మం గెలిచిందని నమ్ముతున్నాం. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ప్రభుత్వం, టీటీడీ అధికారులు నిర్ణయించాల్సిన అవసరం ఉంది. – రాపూరి ప్రసాద్‌బాబు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యుడు, తిరుపతి -
కమలమ్మకు భూమన నివాళి
తిరుపతి మంగళం : దివంగత వైఎస్ రాజారెడ్డి సోదరి కమలమ్మ మృతి చెందారు. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి శనివారం పులివెందులలో కమలమ్మ పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాతృమూర్తి అయిన వైఎస్ విజయమ్మతో భూమన కరుణాకరరెడ్డి మాట్లాడారు. కమలమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కామెర్ల మందుకు వెళ్లిన యువకుడి అదృశ్యం తొట్టంబేడు (శ్రీకాళహస్తి రూరల్): తొట్టంబేడు మండలం కొత్త కన్నలి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, మునెమ్మ దంపతుల కుమారుడు పి.మునిశేఖర్ (30) కనబడడం లేదని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈనెల 17వ తేదీ సాయంత్రం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. మునిశేఖర్ కొంతకాలంగా కామెర్ల వ్యాధితో బాధపడుతున్నాడు.ఈనెల 12వ తేదీ ఉదయం కామెర్లకు మందులు తీసుకురావడానికి తమిళనాడు రాష్ట్రంలోని వాలాజీ గ్రామానికి వెళ్తున్నట్టు కుటుంబ సభ్యులకు తెలిపి ఇంటి నుంచి బయలుదేరాడు. అయితే అతను తిరిగి ఇంటికి రాలేదని, కుటుంబ సభ్యులందరూ వాలాజీ, తిరుత్తణి పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా అతని జాడ తెలియలేదు. గతంలో కూడా అతను రెండుసార్లు కామెర్ల మందుల కోసం వాలాజీ గ్రామానికి వెళ్లి వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి గల్లంతయిన మునిశేఖర్ ఆచూకీ కోసం వివిధ కోణాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు. సీటు కోసం మహిళల ఘర్షణరైల్వేకోడూరు అర్బన్: తిరుపతి నుంచి రైల్వే కోడూరుకు మహిళలు ఉచిత బస్సులో ప్రయాణం చేస్తుండగా కొందరు కోడూరుకు చెందిన మహిళలు సీట్లకోసం తగువులాడుకుంటూ శుక్రవారం రాత్రి ఘర్షణకు దిగారు. చివరకు జుట్లు పట్టుకుని కొట్టుకొనే వరకు వెళ్లారు. కొందరు మహిళలు ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. వారి బంధువులకు ఫోన్లు చేసి పిలవడంతో మాధవరం పోడువద్ద బస్సును ఆపేశారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని బస్సును పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకువచ్చి విచారించారు. కొందరు మహిళలు 3 తులాల బంగారు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ప్రజా ఉద్యమంగా స్వచ్ఛతా హి సేవా తిరుపతి అర్బన్: పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన తిరుపతి జిల్లా సాధన దిశగా స్వచ్ఛతా హి సేవా– 2026ను ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన కలెక్టరేట్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా మండల, మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అన్ని శాఖలు, స్థానిక సంస్థలు సమన్వయంతో సమర్థవంతంగా నిరహించాలని ఆదేశించారు. నిర్దేశించిన కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో స్పష్టమైన, శాశ్వతమైన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చ్ఛతా హి సేవా కార్యక్రమాల అమలును అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, నిర్వహించిన కార్యక్రమాలను సమగ్రంగా డాక్యుమెంట్ చేసి, నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం నివేదికలు సమర్పించాలని వివరించారు. -
వాస్తవాలు తెలుసుకున్న భక్తులు
గత ప్రభుత్వ హయాంలో ఏదో జరిగిపోయిందని హంగామా చేసిన కూటమి నేతలకు కనువిప్పు కలిగింది. నెయ్యిలో జంతు కొవ్వు ఆనవాళ్లు లేవని ఈడీ నిర్ధారించింది. వాస్తవాలను టీటీడీతో పాటు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం భక్తులకు తెలియజేయాలి. వారు చేసిన ఆరోపణలు అవాస్తవమని ప్రకటించాలి. అప్పుడే పాలకుల నిజాయితీపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది. పాలకులు వాస్తవాలను ప్రజలకు చేరవేశారని, నిజాయితీపరులని ప్రజలు నమ్ముతారు. – శివసుబ్రమణ్యం, సాఫ్ట్వేర్ ఇంజినీర్, తమిళనాడు భక్తుడు. శ్రీవారితో రాజకీయం తగదు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి శక్తితో ప్రపంచం నడుస్తోంది. ఆయనను రాజకీయాలకు అతీతంగా కొలవాలి. గతంలో లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ప్రచారం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు బాధపడ్డారు. ఈడీ విచారణలో జంతుకొవ్వు లేదని తేలడం శుభపరిణామం. అసత్య ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీయడం బాధ కలిగించే విషయం. – పద్మావతమ్మ, భక్తురాలు, తిరుపతి -
ఆగి ఉన్న లారీని ఢీకొని యువకుడి మృతి
చంద్రగిరి: ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన విషాద ఘటన చంద్రగిరి సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. చంద్రగిరి మండలం ఐతేపల్లి గ్రామానికి చెందిన బొబ్బిలి రవితేజ (18) తిరుపతి నుంచి తన స్వగ్రామమైన ఐతేపల్లికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మార్గం మధ్యలోని చంద్రగిరి సమీపంలో ఫ్లైఓవర్ వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీని రవితేజ నడుపుతున్న ద్విచక్ర వాహనం ఢీకొంది. అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతరం చైన్నెలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడ చికిత్స పొందుతున్న రవితేజ శనివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. యువకుడి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రవితేజ ప్రమాద సమయంలో హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉండేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. -
నకిలీ బంగారం కుదువబెట్టి మోసం
నాయుడుపేట టౌన్: పట్టణంలోని సత్యసాయి కుదువ దుకాణంలో గంగసాయి అనే వ్యక్తి నకిలీ నకిలీ బంగా రం పెట్టి రూ.2లక్షలకు పైగా నగదు తీసుకుని మోసం చేసినట్లు దుకాణ యజమాని సముద్రాల మురళీకృష్ణ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిట్టమూరు మండలం యాకసిరి పాటిమిట్టకు చెందిన గంగసాయి అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం బంగారు గాజులు తీసుకువచ్చి కుదువపెట్టాలని చెప్పి సుమారు రూ.2లక్షల కు పైగా నగదు తీసుకున్నట్లు తెలిపారు. మరలా మరో బంగారు చైను తీసుకురావడంతో అనుమానం వచ్చి ఆ చైను పరిశీలించగా నకిలీ బంగారంగా తేలిందన్నారు. అంతేకాకుండా ఇటీవల పెట్టిన బంగారు గాజులు కూడా నకిలీవిగా తేలడంతో అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయినట్లు మురళీకృష్ణ పోలీసుల కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
జాతీయ స్థాయిలో నిత్య హాసిని సత్తా
శ్రీకాళహస్తి: అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పుదుచ్చేరిలో నిర్వహించిన సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ నేషనల్ చాంపియన్‌షిప్–2026లో శ్రీకాళహస్తికి చెందిన పత్తి నిత్య హాసిని అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. శ్రీకాళహస్తిలోని ఫిట్నెస్ సెంటర్ నిర్వాహకులు జ్యోతిరావు, రూపాదేవి దంపతుల కుమార్తె నిత్య హాసిని ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ జాతీయ స్థాయి పోటీల్లో షాట్‌పుట్, డిస్కస్ త్రో రెండు విభాగాల్లో పాల్గొన్నారు. షాట్‌పుట్‌లో 12.12 మీటర్లు విసిరి ద్వితీయ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించారు. డిస్కస్ త్రోలో 33.85 మీటర్ల దూరం విసిరి నాలుగో స్థానాన్ని కై వసం చేసుకున్నారు. షాట్‌పుట్‌లో రాష్ట్ర స్థాయి పోటీల్లో నిత్య 11.21 మీటర్లు సాధించగా.. జాతీయ స్థాయిలో తన ప్రదర్శనను 12.12 మీటర్లకు మెరుగుపరుచుకున్నారు. అంటే ఏకంగా 91 సెంటీమీటర్ల మెరుగుదల సాధించడం విశేషం. అదేవిధంగా డిస్కస్ త్రోలో రాష్ట్ర స్థాయిలో 31.40 మీటర్లు సాధించిన నిత్య.. జాతీయ స్థాయిలో 33.85 మీటర్లు విసిరి తన ప్రదర్శనను మరింత మెరుగుపరుచుకున్నారు. శ్రీకాళహస్తి పట్టణవాసులు సైతం నిత్య విజయాన్ని ప్రశంసిస్తూ భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
రాజమన్నార్ కటాక్షం.. గజేంద్ర మోక్షం!
సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకరణలో మలయప్పతిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజు శుక్రవారం రాత్రి స్వామివారు సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకరణలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఉదయం కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకరణలో అభయమిచ్చారు. వాహన సేవల ముందు కళాబృందాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శనివారం రాత్రి స్వామివారు తనకిష్టమైన గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. – తిరుమల -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
రేణిగుంట: మండలంలోని పుత్తూరు–రేణిగుంట రహదారి కాటన్ మిల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంజయ్ అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. గురువారం రాత్రి రేణిగుంట పంచాయతీలోని నేతాజీ కాలనీకి చెందిన సంజయ్ (17) ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కాటన్ మిల్లు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి అడ్డురావడంతో అతడిని తప్పించబోయి అదుపుతప్పి కింద పడ్డాడు. తలకి తీవ్ర గాయమైంది. స్థానికులు సమీపంలోని ప్రయివేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సంజయ్ మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గాజులమండ్యం పోలీసులు తెలిపారు. ఆర్డీఎస్ఎస్ పనులు వేగవంతం చేయండి తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో ఆర్డీఎస్ఎస్ (పునర్వ్యవస్థీకరణ విద్యుత్ పంపిణీ పథకం) కింద చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి ఆదేశించారు. శుక్రవారం కార్పొరేట్ కార్యాలయం నుంచి అధికారులు, కాంట్రాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనుల పురోగతిని సమీక్షించారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ, మౌలిక వసతుల బలోపేతం, విద్యుత్ నష్టాల నియంత్రణ, వినియోగదారులకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా లక్ష్యంగా చేపట్టిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో డైరెక్టర్ పి.అయూబ్ ఖాన్న్తో పాటు సీఎజీఎంలు, జీఎంలు, తొమ్మిది జిల్లాల ఎస్ఈలు, ఈఈలు, ఆర్డీఎస్ఎస్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. వైభవంగా మహాలక్ష్మియాగం నారాయణవనం: మండలంలోని సిద్ధార్థ కళాశాలలో తొమ్మిది రోజుల పాటు నిర్వహించనున్న నవాహ్ని హోమ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం మహాలక్ష్మి యాగాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే సాయంత్రం లక్ష కుంకుమార్చన, ఆధ్యాత్మిక ప్రవచనాలు వైభవంగా జరిగాయి. ఉదయం 8.30 గంటలకు కళాశాల చైర్మన్ అశోక్‌రాజు దంపతుల ఆధ్వర్యంలో ఆగమ వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ మహాలక్ష్మి యాగం, లక్ష కుంకుమార్చన పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 4 నుంచి రెండు గంటల పాటు ‘యజ్ఞఫలం – లోకక్షేమం’ అంశంపై డాక్టర్ శేషచార్యులు ప్రవచించారు. అనంతరం మహాలక్ష్మి అమ్మవారి పల్లకీ సేవను నిర్వహించారు. అశోక్‌రాజు మాట్లాడుతూ మహాలక్ష్మి యాగంతో ప్రజలందరికీ ధార్మిక, ఆర్థిక, సాంస్కృతిక, జ్ఞాన, విజ్ఞాన, సిరిసంపదలు చేకూరుతాయన్నారు. వరకట్నం కేసులో ఇద్దరికి మూడేళ్ల జైలు డక్కిలి: వరకట్నం కేసులో భర్త, అత్తకు మూడేళ్ల జైలుశిక్ష, ఒక్కొక్కరికీ రూ.15వేలు జరిమానా విధిస్తూ వెంకటగిరి జూనియర్ సివిల్‌జడ్జి న్యాయమూర్తి విష్ణువర్మ శుక్రవారం తీర్పునిచ్చారు. వివరాలు.. డక్కిలి మండలంలోని మిట్టపాళెం గ్రామానికి చెందిన రంగినేని మంజులను 13 ఏళ్ల క్రితం నెల్లూరు బీవీ నగర్‌కు చెందిన రంగినేని ప్రదీప్‌రెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు. కొన్ని సంవత్సారాల నుంచి మంజులను భర్త, అత్త మనసికంగా, శారీరకంగా వేధించేవారు. దీనిపై 2018లో డక్కిలి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. అప్పటి ఎస్ఐ మరిదినాయుడు గృహ హింస, వరకట్నం వేధింపుల కింద కేసు నమోదు చేశారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన పిదప తల్లి, కుమారుడికి జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. బాధితురాలి తరఫున ఏపీపీ వీ.రోహిత్ వాదనలు వినిపించారు. -
రాజమన్నార్ రాజసం.. సర్వభూపాల తేజసం
తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజైన శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకరణలో కల్యాణ వెంకన్న భక్తులను కటాక్షించారు. రాత్రి ఉభయదేవేరులతో కలిసి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి సర్వభూపాల వాహనంపై సర్వభూపాలునిగా పురవీధుల్లో విహరిస్తూ కనువిందు చేశారు. కల్పవృక్ష వాహన సేవకు తిరుపతి రూరల్ మండలం అవిలాల, గాంధీపురం, సాయినగర్, లింగేశ్వరనగర్, వెంకటపతినగర్, పేరూరు పంచాయతీలకు చెందిన భక్తులు సారెను సమర్పించారు. అలాగే రాత్రి జరిగిన సర్వభూపాల వాహనంకు చిన్నగొట్టిగల్లు మడలానికి చెందిన చిన్నగొట్టిగల్లు, జంగావాండ్లపల్లి, రంగన్నగారిగడ్డ, కోటబైలు, భాకరాపేట, దేవర కొండ, దీన్దార్లపల్లి, చిట్టేచర్ల, చట్టేవారిపాలెం, తిప్పిరెడ్డిగారిపల్లి, దిగవూరు, ఎగవూరు, నెల్లుట్ల వారిపల్లి గ్రామాలకు చెందిన భక్తులు సారె తీసుకువచ్చారు. అలాగే ఇస్కాన్ అధ్యక్షులు రేవతిరమణదాస్, వారి శిష్య బృందం ఆలయం వద్దకు చేరుకుని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ వ్యవస్థాపకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి సాదరస్వాగతం పలికారు. – తిరుపతి రూరల్ -
నేడు తుమ్మలగుంటలో గరుడోత్సవం
తిరుపతి రూరల్: తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి గరుడోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. వైఖానస ఆగమోక్తంగా విశేష అలంకరణలతో గరుడోత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. శనివారం రాత్రి 7 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు స్వామివారు గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. తిరుమలలో గరుడసేవను దర్శించలేని శ్రీవారి భక్తులు తుమ్మలగుంటకు విచ్చేసి గరుడ వాహన సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఏర్పాట్లుపై చెవిరెడ్డి ఆలయ అధికారులు, గ్రామ పెద్దలతో సమీక్షించారు. సమావేశంలో తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డితో పాటు ఉత్సవ నిర్వాహకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. రెండో విడత డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, టీటీడీ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు ఓఏఎమ్‌డీసీ శుక్రవారం నుంచి ఈనెల 21 వతేదీ సోమవారం వరకు విద్యార్థులు రిజి స్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈనెల 20 నుంచి 24వ తేదీవరకు ఆన్లైన్ ధ్రువపత్రాల వెరిఫికేషన్, 21 వతేది నుంచి 23 వరకు వెబ్ ఆప్షన్లు, 24న ఆప్షన్ల మార్పునకు అవకాశం కల్పించి, 27వ తేదీన రెండో విడతలో సీట్లు పొందిన విద్యార్థుల మెరిట్ జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలలో 28వ తేదీ నుంచి 30వ తేదీ లోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 21న డీఫార్మసీ స్పాట్ అడ్మిషన్లు తిరుపతి సిటీ: ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల కాల వ్యవధితో కూడిన డీఫార్మసీ కోర్సులో మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం సోమవారం స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఉత్తీర్ణులైన ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియకు హాజరుకానున్న అభ్యర్థులు ఒరిజనల్ ధ్రువపత్రాలతో ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉదయం 10గంటలకు హాజరుకావాల్సి ఉంటుందని తెలిపారు. -
టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలపై.. బాబు పచ్చి అబద్ధాలు
తిరుపతి మంగళం : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు శ్రీవారి సన్నిధిలో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది తానేనని పచ్చి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా, తాను టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడే టీటీడీ ఉద్యోగులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సంకల్పించినట్టు గుర్తుచేశారు. ఆయన అకాల మరణం చెందడం, కోర్టు వ్యాజ్యాలతో ఆ కార్యాచరణను పూర్తి చేయలేకపోయామన్నారు. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, తాను శాసనసభ్యుడిగా, టీటీడీ అధ్యక్షుడిగా ఉండి టీటీడీ ఉద్యోగుల ఇళ్ల పట్టాల కల నెరవేర్చాలా చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. 12 ఎకరాలు యుద్ధప్రాతిపదికన సమీకరించి 2023లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదగా టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు అందించామన్నారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో టీటీడీ ఉద్యోగులకు ఆ తర్వాత చేయాల్సిన పనులన్నీ నిలిచిపోయాయన్నారు. 17 సంవత్సరాలు పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏనాడైనా టీటీడీ ఉద్యోగుల బాగు కోరుకున్నారా? అని ప్రశ్నించారు. 1989లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న మర్రి చెన్నారెడ్డి తిరుపతి బైరాగిపట్టెడలో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని, ఆ తర్వాత టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల సంకల్పం వైఎస్ రాజశేఖరరెడ్డిదైతే ఆ కార్యాచరణను పూర్తిచేసిన ఘనత జగనన్నదని పేర్కొన్నారు. టీటీడీలో శాశ్వత ఉద్యోగులు ఉండకూడదా?. శాశ్వతంగా చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోవచ్చు కానీ, టీటీడీలో శాశ్వత ఉద్యోగులు ఉండకూడదా? అని భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. శ్రీవారి సేవకులతో సేవ చేయించుకుంటే సరిపోదా అని చంద్రబాబు మాట్లాడిన మాటలు బాధాకరమన్నారు. చంద్రబాబు జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటారు కానీ టీటీడీ ఉద్యోగులు మాత్రం సేవకులుగా పనిచేయాలా..? అని భూమన ప్రశ్నించారు. జగనన్న అధికారంలోకి రాగానే టీటీడీలో ఖాళీగా ఉన్న 7వేల పోస్టులను భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అందులో స్థానికులకు 75శాతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో ఓట్లు కోసం టీటీడీ ఉద్యోగులకు చంద్రబాబు పట్టాలు ఇచ్చినట్లుగా పచ్చి అపద్ధాలు చెబుతున్నారని భూమన మండిపడ్డారు. -
సేవా ‘కీర్తన’!
సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి శుక్రవారం చివరి తేదీ కావడంతో తిరుపతి అర్బన్‌కు చెందిన ఎడ్యుకేషన్ డేటా ఎంట్రీ సెక్రటరీ కీర్తనబాబు ఆస్పత్రిలో డయాలసిస్ చేసుకుంటూనే విధులు నిర్వహించారు. తిరుపతిలోని మధురానగర్ సచివాలయం పరిధిలో పనిచేస్తున్న ఆయన వారానికి రెండుసార్లు ఆస్పత్రికి వెళ్లి డయాలసిస్ చేసుకుంటున్న తరుణంలో శుక్రవారం డయాలసిస్‌కు వెళ్లాల్సి వచ్చింది. దీంతో తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మొబైల్ ద్వారా పింఛన్ల దరఖాస్తుల సమాచారాన్ని సేకరిస్తూ.. కంప్యూటర్లో నమోదు చేశారు. – తిరుపతి అర్బన్ -
స్వచ్ఛతా ప్రతిజ్ఞ
ఏర్పేడు: స్వచ్ఛతా హి సేవా 2026 ప్రచారంలో భాగంగా శుక్రవారం ఏర్పేడు మండలం, జంగాలపల్లి సమీపంలోని తిరుపతి ఐసర్‌లో విద్యార్థులచేత స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యం, బాధ్యతాయుతమైన పౌర భాగస్వామ్యం పట్ల తమ నిబద్ధతను ధృవీకరిస్తూ తిరుపతి ఐసర్ రిజిస్ట్రార్ (ఇన్చార్జ్) లెఫ్టినెంట్ కమాండర్ కుమార్ హిమాంశు శేఖర్ (రిటైర్డ్), జాయింట్ రిజిస్ట్రార్ రమేష్ విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగింది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. గురువారం అర్ధరాత్రి వరకు 68,265 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 26,959 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ద్వారా రూ.4.16 కోట్ల కానుకలు లభించాయి. టైమ్‌స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లో దర్శనం చేసుకోగలుగుతున్నారు. -
అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి అర్బన్: జిల్లా వ్యాప్తంగా 12 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 32 అంగన్వాడీ వర్కర్లు, 166 అంగన్వాడీ హెల్పర్ల పోస్టులు భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ వసంతబాయి తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 21 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు మీ పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టులో అందజేయాలని సూచించారు. పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలని చెప్పారు. 01.07.2026 నాటికి 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు అర్హులని తెలిపారు. స్థానిక వివాహితులు అర్హులని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 10వ తరగతి ఉత్తీర్ణత లేకుంటే 8వ తరగతి వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. నాయుడుపేట, సూళ్లురుపేట, సత్యవేడు, కోట, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, పిచ్చాటూరు, చంద్రగిరి, పుత్తూరు, రైలేకోడూరు, చిట్వేలి మండలాల పరిధిలో ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. గరుడ సేవకు కట్టుదిట్టమైన భద్రత తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడసేవకు తిరుమల సిద్ధమైంది. గరుడ వాహనంపై కొలువుదీరే శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. దాదాపు రెండు లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉండే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తోంది. గరుడ వాహన సేవను రాత్రి 6.30 గంటలకు ప్రారంభించనున్నట్టు అదనపు ఈఓ వెంకయ్య చౌదరి తెలిపారు. 1,200 మంది పోలీసులతో అదనపు భద్రత బ్రహ్మోత్సవాల భద్రతను జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ పర్యవేక్షిస్తున్నారు. టీటీడీ నిఘా, భద్రతా సిబ్బంది సుమారు 1,130 మందితోపాటు 3,600 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. గరుడసేవకు ప్రత్యేకంగా మరో 1,200 మంది పోలీసులతో అదనపు భద్రత కల్పించారు. 2,770 సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించనున్నారు. శుక్రవారం సాయంత్రం 6 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఘాట్‌రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను రద్దు చేశారు. విశేష విహారం కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మో త్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉత్సవాల్లో భాగంగా స్వామివారు ఉదయం బంగారు చిన్న శేష వాహనంపై ఊరేగారు. రాత్రి ఉభయకర్తల ఆధ్వర్యంలో బంగారు పెద్ద శేష వాహనంపై వినాయకస్వామిని కొలువుదీర్చి గ్రామోత్సవం జరిపించారు. -
రేణిగుంట రైల్వేస్టేషన్లో వ్యక్తి హల్చల్
రేణిగుంట: రేణిగుంట రైల్వే స్టేషన్లో పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి విద్యుత్ వైర్లు పట్టుకునేందుకు ప్రయత్నించి హల్చల్ సృష్టించాడు. అతికష్టం మీద రైల్వే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని తిరుపతి రుయా హాస్పిటల్‌లోని మానసిక వైద్యశాలకు తరలించారు. స్థానికుల కథనం.. పశ్చిమబెంగాల్‌కు చెందిన ప్రకాష్‌రాయ్ (35) కేరళలో వంట మాస్టర్. సొంత ఊరికి వెళ్లేందుకు కేరళ నుంచి కేరళ ఎక్స్‌ప్రెస్‌లో వస్తుండగా శుక్రవారం ఉదయం రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలో జనరల్ బోగీలో అతడికి మిగిలిన ప్రయాణికులకు గొడవ జరిగినట్లు సమాచారం. రైల్వే స్టేషన్లో అతడిపై పోలీసులకు సమాచారం ఇస్తారేమోనని ముందుగానే రైలు దిగి స్టేషన్‌లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైకి ఎక్కి అక్కడి నుంచి విద్యుత్ లైన్లు పట్టుకుంటానని బెదిరించాడు. అధికారులు స్పందించి విద్యుత్ సరఫరాను నిలుపుదల చేశారు. బ్రిడ్జ్ పైనుంచి వేలాడుతూ రైలు పైకి దూకి పరుగులు తీయగా స్థానికుల సహాయంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి వెళ్లే రైళ్లన్నీ దాదాపు గంటకు పైగా ఆలస్యంగా నడిచాయి. ఎంతటి పోలీసులకు అతడి వివరాలు తెలపకపోవడంతో అతడి వద్ద ఉన్న సిమ్ కార్డ్ ఆధారంగా అతడు వివరాలను పోలీసులు సేకరించారు. మతిస్థిమితం సరిగ్గా లేని కారణంగా అతడిని తిరుపతి రుయా హాస్పిటల్‌లోని మానసిక వైద్య విభాగంలో చేర్పించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. -
కలెక్టర్ విస్తృత పర్యటన
రామచంద్రాపురం: మండలంలో శుక్రవారం కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ విస్తృతంగా పర్యటించారు. ఉపాధి హామీ పనులతో పాటు, భూముల రీ–సర్వే ప్రక్రియను ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మండలంలోని కమ్మపల్లి గ్రామ పంచాయతీలో జరుగుతున్న నీటి కుంటలు, వ్యవసాయ కుంట నిర్మాణ పనులను డ్వామా పీడీ మద్దిలేటి, సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలకు ఏడాదిగా లభించిన పని దినాలు, రోజువారీ సగటు వేతనం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కమ్మపల్లి పంచాయతీలో రీ–సర్వే తరువాత తలెత్తిన భూ అభ్యంతరాలు, సర్వే నంబర్లలోని వ్యత్యాసాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, అడంగల్ తదితర రికార్డులను రెవెన్యూ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ మధుసూదన్, ఎంపీడీవో పులి రాంసింగ్, మండల స్వర్ణ గ్రామ అధికారి తేజోవతి, ఏపీవోలు, వీఆర్వోలు, సర్వేయర్లు పాల్గొన్నారు. -
కలుజును అమ్మేశారు!
సాక్షి, టాస్క్‌ఫోర్స్: రేణిగుంట మండలం, వెంకటాపురం చెరువు కలుజు భూమిని అంతా కుమ్ముకై ్క ఓ ప్రైవేటు కళాశాలకు అమ్మేసినట్లు విశ్వసనీయ సమాచారం. చెరువు నీరు వెళ్లకుండా కళాశాల యాజమాన్యం కలుజుపై ప్రహరీ నిర్మాణానికి పూనుకుంది. కలుజు కాలువ అని తెలిసినా.. రెవెన్యూ అధికారులు నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నారు. తిరుపతి– కరకంబాడి మార్గంలోని వెంకటాపురం సర్వే నం.227లో 74 సెంట్ల కలుజు కాలువను టీడీపీ నేతలు ఓ ప్రైవేటు కళాశాలకు గుట్టుచప్పుడు కాకుండా విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కలుజు దురాక్రమణ విషయం పత్రికలు, మీడియాలో ప్రసారం కావడంతో కళాశాల యాజమాన్యం లబోదిబోమంటున్నట్లు తెలిసింది. టీడీపీ, కొందరు రెవెన్యూ అధికారులను నమ్మి కొనుగోలు చేస్తే ఇలా అయ్యిందేంటని అంటున్నారు. కలుజు కాలువను అక్రమంగా అమ్మడమే కాకుండా.. మరింత నగదు రాబట్టుకునేందుకు కొన్ని యూటూబ్ చానల్స్ వారిని కళాశాల యాజమాన్యం వద్దకు పంపి బ్లాక్మైయిల్ చేసినట్లు వెంకటాపురంలో ప్రచారం జరుగుతోంది. రూ.3 కోట్ల విలువచేసే కలుజు కాలువ విషయం వెలుగులోకి రావడంతో రెవెన్యూ అధికారులు తూతూమంత్రంగా పర్యటించి.. వాస్తవాలు తెలుసుకునేందుకు కమిటీని వేసినట్లు తెలిసింది. కలుజు కాలువ అని స్పష్టంగా రికార్డుల్లో ఉన్నా.. రెవెన్యూ అధికారులు కమిటీ వేసి నాన్చివేత ధోరణి అవలంభించడంపై స్థానికులు మండిపడుతున్నారు. కలుజు కాలువ ఇరిగేషన్కి సంబంధించింది అయినా.. సంబంధిత అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
లక్ష్యం చేరే వరకు శ్రమించండి
తిరుపతి సిటీ: స్థానిక కరకంబాడి రోడ్డులోని ఎస్వీసీఈ కళాశాల యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్ సెల్, ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు డ్రీమ్స్ టు డీడ్స్ ప్రేరణాత్మక సదస్సు నిర్వహించారు. శుక్రవారం కళాశాలలో నిర్వహించిన ఈ సదస్సుకు హైదరాబాద్‌కు చెందిన రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి భోదమయానందజీ మహారాజ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల నుద్దేశించి ప్రసంగించారు. కృషి, పట్టుదల, క్రమశిక్షణతో విద్యార్థులు తమ కలలను సాకరం చేసుకునేందుకు శ్రమించాలని సూచించారు. స్వామి వివేకానంద బోధించిన లేవండి మేల్కొనండి లక్ష్యం చేరే వరకు శ్రమించండి అనే దివ్య మంత్రాన్ని విద్యార్థులు తమ జీవితంలో ప్రతి నిత్యం గుర్తించుకోవాలని సూచించారు. ఈ సదస్సులో ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం ఆఫీసర్ డాక్టర్ చంద్రయ్య, యూహెచ్వీ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ సుజన్‌కుమార్, అధ్యాపకులు, ప్రథమ సంవత్సంరంలో ప్రవేశాలు పొందిన బీటెక్ విద్యార్థులు పాల్గొన్నారు. -
మత్తు పదార్థాలు తరలిస్తున్న ముగ్గురి అరెస్టు
తిరుత్తణి: ఆంధ్రా నుంచి కాంచీపురానికి ప్రయివేటు బస్సులో నిషేధిత మత్తు పదార్థాలు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను తిరుత్తణి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తిరుత్తణి సమీపంలోని చైన్నె – తిరుపతి జాతీయ రహదారిలోని పొన్పాడి చెక్ పోస్టు వద్ద గురువారం రాత్రి పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రాలోని నగరి నుంచి తిరుత్తణి మార్గంలో కాంచీపురం వెళుతున్న ప్రయివేటు బస్సులో నిషేధిత గుట్కా, పొగాకు ప్యాకెట్లు ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు కారణమైన ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఇన్స్పెక్టర్ శివకుమార్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చైన్నెకి చెందిన శరవనన్(47), అరక్కోణంకు చెందిన కమల్‌రాజ్(42), తిరువణ్ణామలైకు చెందిన రామమూర్తి(35) ఆంధ్రాలోని తిరుపతిలో మత్తు పదార్థాలు కొనుగోలు చేసి కాంచీపురం తరలిస్తున్నట్లు తేలింది. వారిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. -
రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్‌కు రెండు ప్రాజెక్టులు
తిరుపతి ఎడ్యుకేషన్ : జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ పోటీల్లో రెండు ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. రీజనల్ సైన్స్ సెంటర్, జిల్లా విద్యాశాఖ సంయుక్తంగా శుక్రవారం తిరుపతిలోని రీజనల్ సైన్స్ సెంటర్లో జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ పోటీలను నిర్వహించాయి. ఈ ఏడాది భారతదేశ ఇంధన శక్తి వనరుల సముదాయం 2027–అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై నిర్వహించిన పోటీలకు జిల్లా నుంచి 45 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. వీరు రూపొందించిన ప్రాజెక్టుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్, వ్యాసరచన ద్వారా వివరించారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన శ్రీకాళహస్తి బాలికోన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని ఎం.సిరి, గైడ్ టీచర్ పద్మజ మొదటి స్థానం సాధించగా, సూళూరుపేట జెడ్పీ హైస్కూల్ పదో తరగతి విద్యార్థిని బి.లక్ష్మీప్రసన్న దుర్గ, గైడ్ టీచర్ మంజుల ద్వితీయ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్‌కు ఎంపికయ్యారు. ఈ నెల చివరి వారం విజయవాడలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. మొదటి రెండు స్థానాలు సాధించిన విద్యార్థినీలను డీఈఓ కేవీఎన్.కుమార్, ఎస్ఎస్ ఏపీసీ ఎం.భరత్‌కుమార్‌రెడ్డి, సైన్స్ సెంటర్ డైరెక్టర్ శ్రీనివాస నెహ్రూలు అభినందించి సర్టిఫికెట్లు, బహుమతులను అందించారు. -
రేణిగుంట స్టేషన్లో కలకలం.. హైటెన్షన్ వైర్ పట్టుకున్న వ్యక్తి!
సాక్షి, తిరుపతి: జిల్లాలోని రేణిగుంట రైల్వే స్టేషన్లో కలకలం రేగింది. మతిస్థిమితం లేని ఓ వ్యక్తి రైల్వే స్టేషన్ పరిసరాల్లోని హైటెన్షన్ విద్యుత్ లైన్ పట్టుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.అయితే, ఈ ఘటనతో రేణిగుంట స్టేషన్లో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అలాగే, విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పలు రైళ్ల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. ఆ వ్యక్తి అసోం రాష్ట్రానికి చెందినవాడిగా రైల్వే పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని ఘటనకు గల కారణాలపై విచారిస్తున్నారు.ఇదీ చదవండి: నీకు నా మీద లవ్ తగ్గిపోయింది కదా... -
ఇదేంది డ్రైవరన్నో?
నాగలాపురం: డ్యూటీలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ తన వ్యక్తిగత సమస్యపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ఏకంగా ప్రయాణికులను స్టేషన్ వద్దకు తీసుకొచ్చిన ఘటన నాగలాపురంలో చోటు చేసుకుంది. పిచ్చాటూరు మండలం, రామగిరి గ్రామానికి చెందిన వికేష్నాయుడు తిరుమల డిపోకు చెందిన చైన్నె–తిరుమల ఎక్స్‌ప్రెస్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం డ్యూటీలో ఉన్న సమయంలో తన వ్యక్తిగత సమస్యకు సంబంధించి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు బస్సులో ప్రయాణికులని తిరుమల నుంచి ఎక్కించుకొని నాగలాపురం పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు ఇచ్చి వెళ్లాడు. బస్సులో ఉన్న ప్రయాణికులు కొంతసేపు పోలీసు స్టేషన్ వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. డ్యూటీ సమయంలో వ్యక్తిగత సమస్య పరిష్కారం కోసం పోలీసు స్టేషన్‌కు రావడం వల్ల కొందరు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. -
ముత్యపు పందిరిలో మురిపాల రేడు
సింహ వాహనంపై యోగనరసింహుని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న కల్యాణ వేంకటేశ్వరుడు తుమ్మలగుంటలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు మంగళవారం రాత్రి దేవేరులతో కలిసి శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు ముత్యపు పందిరి వాహనంపై బాలకృష్ణుడి అవతారంలో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం స్వామివారు యోగ నరసింహుని అవతారంలో సింహ వాహనంపై కొలువుదీరి భక్తులను కటాక్షించారు. తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి సైతం యువకులతో కలిసి వాహనాన్ని మోశారు. సింహ వాహన సేవకు తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు, ముండ్లపూడి, బ్రాహ్మణపట్టు, పాడిపే ట ప్రాంతాల నుంచి భక్తులు సారెను తీసుకొచ్చి స్వామి వారికి సమర్పించారు. రాత్రి ముత్యపు పందిరి వాహన సేవకు ఎర్రావారిపాళెం మండలంలోని ఎర్రావారిపాళెం, చెరుకువారిపల్లి, యల్లమంద, ఉదయమాణిక్యం, ఉస్తికాయలపెంట, కోటకాడపల్లి, యల్లమంద, బోడేవాండ్లపల్లి, వీఆర్ అగ్రహారం, నెరబైలు, చింతగుంట, కూరపర్తివారిపల్లి, చెరకువారిపల్లికి చెందిన భక్తులు వస్త్రాలు తీసుకువచ్చి సమర్పించారు. వాహనసేవల్లో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మి దంపతులు, ఈవో సుబ్రమణ్యంరెడ్డి పాల్గొన్నారు. – తిరుపతి రూరల్ -
డయల్ యువర్ సీఎండీకి 2,249 ఫిర్యాదులు
తిరుపతి రూరల్: ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమానికి వివేష స్పందన లభిస్తోందని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. 9 జిల్లాల పరిధిలో ఇప్పటివరకు 2,249 ఫిర్యాదులు అందగా, 1,898 సమస్యలు పరిష్కరించినట్లు వెల్లడించారు. గురువారం ఏపీఎస్పీడీసీఎల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎండీ.. ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమంలో నమోదైన ఫిర్యాదులు, పరిష్కార స్థితి, పెండింగ్ అంశాలపై సమీక్షించారు. 2025 నవంబర్ 3 నుంచి 2026 సెప్టెంబర్ 14 వరకు 2,249 ఫిర్యాదులు నమోదైనట్లు తెలిపారు. 9 జిల్లాల్లో ‘డయల్ యువర్ సీఎండీ’, ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాల ద్వారా నమోదవుతున్న ఫిర్యాదులపై నోడల్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సీఎండీ ఆదేశించారు. సంస్థ డైరెక్టర్ కె.గురవయ్య, చీఫ్ జనరల్ మేనేజర్లు, జనరల్ మేనేజర్లు, 9 జిల్లాల సూపరింటెండింగ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. -
రాష్ట్ర గవర్నర్‌కు సాదర స్వాగతం
రేణిగుంట: తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు, తదితరులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ రోడ్డు మార్గాన తిరుపతికి బయల్దేరి వెళ్లారు. రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, సెట్విన్ సీఈఓ యస్వంత్, విమానాశ్రయ అధికారులు, తహసీల్దార్ శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు. ఓపెన్ వర్సిటీ స్టడీసెంటర్ కో–ర్డినేటర్గా కిరణ్‌కుమార్ తిరుపతి సిటీ: ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రం కో–ఆర్డినేటర్‌గా డాక్టర్ ఎం.కిరణ్‌కుమార్‌రాజు నియమితులయ్యారు. గతంలో ఉన్న డాక్టర్ జీ. కిషన్ ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్‌గా నియామకం కావడంతో ఆయన స్థానంలో డాక్టర్ కిరణ్‌కుమార్ రాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రాన్ని అందరి సహకారాలతో మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కిషన్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వై మల్లికార్జునరావు, డాక్టర్ ఎం.ప్రసాద్‌రావు, అధ్యాపకులు, సిబ్బంది ఆయనను ఘనంగా సత్కిరంచారు. పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్ నాయుడుపేట టౌన్ : పోక్సో కేసులో నిందితుడుగా ఉన్న మండల పరిధిలోని మేనకూరు గ్రామానికి చెందిన కందాటి నజీర్‌ను అరెస్టు చేసి గురువారం కోర్టులో హాజరు పరిచినట్టు నాయుడుపేట అర్బన్ సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. పోక్సో కేసు దర్యాప్తు చేస్తున్న నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు సారథ్యంలో నజీర్‌ను పట్టణ పరిధిలోని శివాలయం సమీపంలో అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఏడేళ్ల చిన్నారులపై లైంగిక దాడి జరిపిన ఘటనపై నజీర్పై పోక్సో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందె. గురువారం కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించినట్టు సీఐ పేర్కొన్నారు. బీవీపాళెంలో పర్యటన తడ: మండలంలోని బీవీపాళెం, సూళ్లూరుపేట మండలం అటకానితిప్ప, దొరవారిసత్రం మండలం నేలపట్టు గ్రామాల్లోని టూరిజం కేంద్రాలను రాష్ట్ర టూరిజం శాఖ కార్యదర్శి, ఐఏఎస్ అధికారి ఎస్ఎస్ రావత్ గురువారం పర్యటించారు. ఈ ప్రాంతాల్లో నెలకొల్పిన టూరిజం రిసార్టులు, టూరిస్టుల కోసం ఏర్పాటు చేసిన వసతులు కొనసాగుతున్న తీరును ఆయన పరిశీలించారు. ఆయన వెంట టూరిజం శాఖ ఎండీ తదితరులు ఉన్నారు. పిచ్చి కుక్క బీభత్సం – 13 మందిని కరిచిన శునకం నాగలాపురం: నాగలాపురం పట్టణంలోని ఈస్ట్ దళితవాడలో గురువారం ఉదయం ఓ పిచ్చి కుక్క బీభత్సం సృష్టంచింది. వీధుల్లో తిరుగుతూ ఏకంగా 13 మందిని కరిచింది. కుక్క కాటుకు గురైన బాధితులు నాగలాపురం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందారు. ఒకే ప్రాంతంలో వరుసగా పలువురిని కుక్క కరవడంతో స్థానికులు ఆందోళనలో పడ్డారు. అప్పు ఇవ్వలేదని..! – వివాహిత ఆత్మహత్యాయత్నం వరదయ్యపాలెం: ఇచ్చిన అప్పు వసూలు కాక మనస్తాపానికి గురైన ఓ వివాహిత పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వరదయ్యపాలెం మండలంలో గురువారం వెలుగు చూసింది. మండలంలోని సీఎల్ఎన్పల్లెకు చెందిన మౌనిక, ప్రవీణ్ దంపతులు ప్రస్తుతం వరదయ్యపాళెం ప్రకాశం వీధిలో నివాసం ఉంటున్నారు. కొంతకాలం క్రితం పట్టణంలోని బీసీ కాలనీ, బలిజపాలెం విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలోని రియల్ ఎస్టేట్ భూమి వ్యవహారంలో స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి, రాజకీయ నాయకుడికి రూ.40 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు బాధితురాలు తెలిపింది. అయితే ఆ భూమి వివాదంలో చిక్కుకోవడంతో అప్పు తిరిగి చెల్లించడం లేదని ఆరోపిస్తున్నారు. పలుమార్లు ఇంటి చుట్టూ తిరిగినా రాజకీయ, అధికార బలంతో బెదిరిస్తున్నారని బాధితురాలు వాపోయింది. గతంలో పోలీస్ స్టేషన్లో పంచాయితీ జరిగి గడువు ఇచ్చినా అమలు కాలేదని పేర్కొంది. దీంతో మనస్తాపానికి గురై గురువారం ఇంట్లోనే పురుగుమందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
సింహ వాహనంపై యోగనరసింహుడి రూపంలో మలయప్ప
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజు గురువారం రాత్రి మలయప్ప స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై శ్రీమన్నారాయణుడి అలంకరణలో తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఉదయం సింహ వాహనాన్ని అధిష్టించి యోగనరసింహుడి రూపంలో కనువిందు చేశారు. వాహన సేవల ముందు కళాబృందాల ప్రదర్శన ఆకట్టుకుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనాన్ని అధిరోహించి మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు. – తిరుమల -
బిల్ కలెక్టర్లకు బిగ్ రిలీఫ్
● తొలగింపులు ఉండవు.. అందరినీ కొనసాగిస్తాం తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న 134 మంది బిల్ కలెక్టర్లకు భారీ ఊరట లభించింది. ఉద్యోగం నుంచి ఎవ్వరినీ తొలగించబోమని, అందరినీ కొనసాగిస్తామని ఆ సంస్థ సీఎండీ శివశంకర్ హామీ ఇచ్చారు. బిల్ కలెక్టర్లను కొనసాగించడంతో పాటు ప్రత్యామ్నాయ విధులపై నవంబర్1వ తేదీన జరిగే చర్చలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గతంలో జారీ చేసిన తొలగింపు ఉత్తర్వులను ఉపసంహరించుకుంటామని స్పష్టం చేశారు. దీంతో తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట 31 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలను బిల్ కలెక్టర్లు విరమించారు. చర్చల అనంతరం సంస్థ డైరెక్టర్ గురవయ్య, సీజీఎంలు మురళి, రామచంద్రయ్య, ప్రసాద్ తదితర అధికారులు దీక్షా శిబిరానికి చేరుకుని యాజమాన్యం నిర్ణయాన్ని వివరించారు. అనంతరం డైరెక్టర్ గురవయ్య నిమ్మరసం ఇచ్చి బిల్ కలెక్టర్ల దీక్షలను విరమింపజేశారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి, ఏపీ బిల్ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణతోపాటు తొమ్మిది జిల్లాలకు చెందిన బిల్ కలెక్టర్లు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
నిమజ్జనం వేళ కత్తితో దాడి
– యువకుడికి గాయాలు సైదాపురం : గణేష్ నిమజ్జనం వేళ ఇద్దరి మధ్య వివాదం జరగడంతో ఓ యువకుడు మరో యువకుడిని కత్తితో దాడి చేసి గాయపరిచిన ఘటన మండల కేంద్రమైన సైదాపురంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ దుర్గాప్రసాద్ కథనం.. మండల కేంద్రమైన సైదాపురం బస్టాండు సమీపంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద బుధవారం రాత్రి గణేష్ విగ్రహంతో ఊరేగింపుగా నిమజ్జనానికి బయలు దేరారు. ఆ సమయంలో యువకులు డ్యాన్స్‌లు వేస్తుండగా పలవారి వెంకి కాలును డేగా మహేష్ తొక్కాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. వెంకీ ఆగ్రహానికి గురై మహేష్‌పై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మహేష్ ప్రస్తుతం నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష అమీర్‌పేట (హైదరాబాద్): చేపల వ్యాపారి హత్య కేసులో నింధితుడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష, జరిమానా విధించింది. ఎస్ఆర్నగర్ ఇన్‌స్పెపెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏజీ కాలనీ సమీపంలోని వికాస్పురి కాలనీకి చెందిన చేపల వ్యాపారి పాంపరి రమేష్ (50) 2020 యూసుఫ్‌గూడ జవహర్‌నగర్‌లో హత్యకు గురయ్యాడు. ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం బోరబండ వెళ్తున్నానని రమేష్ ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. అదే రోజు రాత్రి 8.30 గంటల సమయంలో ఆయన స్నేహితుడైన సాయి ఫోన్ చేయగా, తాను స్నేహితుడి ఇంట్లోనే ఉన్నానని రమేష్ తెలిపాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో అనుమానం వచ్చిన కుమారుడు పాంపరి ప్రదీప్ 2వ తేదీన ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు 4వ తేదీన జవహర్‌నగర్‌లోని ఓ ఇంట్లో రమేష్ మృతదేహన్ని గుర్తించారు. కాళ్లను తాళ్లతో కట్టి, రెండు చేతులను నరికిన స్థితిలో మృతదేహం లభించింది. డబ్బుల కోసం హత్య తిరుపతి ఎస్.వి.నగర్‌కు చెందిన నిందితుడైన మూడే రాజునాయక్‌కు రమేష్‌తో గతంలో పరిచయం ఉంది. డబ్బుల కోసం రమేష్‌ను కిడ్నాప్ చేసి డిమాండ్ చేయాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా యూసుఫ్‌గూడలో ఇంటిని అద్దెకు తీసుకుని, రమేష్‌ను మద్యం తాగేందుకు అక్కడికి పిలిచాడు. మద్యంలో నిద్రమాత్రలు కలపడంతో రమేష్ స్పృహ కోల్పోయాడు. అనంతరం సుత్తితో తలపై కొట్టి హత్య చేశాడు. రమేష్ వద్ద ఉన్న బంగారు గొలుసు, ఉంగరం, ఏటీఎం కార్డు, సెల్ఫోన్లు తీసుకున్నాడు. మృతదేహాన్ని గదిలో ఉంచి తాళం వేసి వెళ్లిపోయాడు. రమేష్ కోడలి సెల్‌కు వాట్సాప్ సందేశాలు పంపి, కిడ్నాప్ చేశానని, విడిచిపెట్టాలంటే రూ.90 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు విచారణలో తేలింది. శాసీ్త్రయ ఆధారాలతో నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. నాంపల్లి నాలుగో అదనపు సెషన్స్ కోర్టులో నింధితుడిపై చార్జిషీట్ దాఖలు చేయగా జీవిత ఖైదుతో పాటు రూ.16 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి జె.విక్రమ్ తీర్పు వెలువరించారు. -
ఎస్వీయూలో జాబ్‌మేళా రేపు
తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో శనివారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టీ.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. పేరొందిన ఎమ్ఎన్సీ కంపెనీ ప్రతినిధులు జాబ్‌మేళాలో పాల్గొని సుమారు 500 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనట్లు తెలిపాశారు. ఎస్ఎస్స్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లొమో, ఏదేని డిగ్రీ, డీ, బీ, ఎమ్ ఫార్మసీ, బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీవారి దర్శనానికి 4 గంటలు తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 4 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 71,196 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 22,581 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.246 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 04 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. బాధ్యతల స్వీకరణ తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుపతి రైల్వేస్టేషన్ నూతన డైరెక్టర్‌గా రంజిత్‌కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఇక్కడ పనిచేసిన కుప్పాల సత్యనారాయణ ఉద్యోగోన్నతిపై గుంతకల్ రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎంగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విజయవాడ రైల్వేలో అసిస్టెంట్ ఆపరేషన్ మేనేజర్‌గా పనిచేస్తున్న రంజిత్‌కుమార్‌ను ఆ శాఖ ఉన్నతాధికారులు నియమించారు. ఆ మేరకు ఆయన బాధ్యతలు చేపట్టారు. కాణిపాక వినాయకునికి ముక్కంటి సారె శ్రీకాళహస్తి: వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని కాణిపాక వరసిద్ధి వినాయకస్వామివారికి ముక్కంటి ఆలయ సారెను గురువారం పాలక మండలి చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, ఈవో బీకే.వెంకటేశులు అందజేశారు. వారికి ఆలయం వద్ద ఈవో, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేదమంత్రో చ్ఛారణల నడుమ వారు ఆలయానికి పట్టు వస్త్రాలను అందజేశారు. వేదపండితులు వారిని ఆశీర్వదించి స్వామివారి జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలు అందజేశారు. పాలకమండలి సభ్యులు గుర్రప్పశెట్టి, విజయమ్మ, హైమావతి, పగడాల మురళి, అధికారులు శ్రీనివాసరాజు, మోహన్ పాల్గొన్నారు. జనవరి 22 నుంచి జేఈఈ మెయిన్స్ తిరుపతి సిటీ: ఐఐటీ, ఎన్ఐటీ సంస్థల్లో ఇంజినీరింగ్ విద్యనభ్యసించాలనే కలను విద్యార్థులు నెరవేర్చుకునేందుకు సమయం ఆసన్నమైంది. ఈ మేరకు జేఈఈ మెయిన్స్–2027 పరీక్షల తేదీలను ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి, ఏప్రిల్ మాసాలలో రెండు సెషన్స్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. తొలి సెషన్ పరీక్షలు జనవరి 22 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనన్నట్లు ప్రకటించారు. అలాగే రెండవ సెషన్ పరీక్షలను ఏప్రిల్ మొదటి వారంలో నిర్వహించేందుకు సిద్ధమవతున్నట్లు వెల్లడించారు. తొలి సెషన్ పరీక్షల కోసం అక్టోబర్ మొదటి వారంలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. పింఛన్ల దరఖాస్తుకు నేటితో ఆఖరు తిరుపతి అర్బన్: కొత్త పింఛన్ల దరఖాస్తుకు శుక్రవారంతో గడువు పూర్తికానుంది. ఇప్పటివరకు 49,205 మంది దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. జిల్లాలో సుమారు 60 వేల మంది వరకు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఇంకా 11 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. -
శ్రీసిటీ సందర్శన
శ్రీసిటీ (వరదయ్యపాళెం): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర అమెరికా పెట్టుబడుల ప్రధాన అనుసంధానకర్త సతీష్ మండువ గురువారం శ్రీసిటీని సందర్శించారు. రాష్ట్రానికి ఉత్తర అమెరికా పెట్టుబడులను ఆకర్షించేందుకు నియమితులైన ఆయన యూఎస్–ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా, ఇంటెలిసాఫ్ట్ టెక్నాలజీస్ సీఈఓగా కొనసాగుతున్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్‌తో అనుబంధంతో పాటు ఉత్తర అమెరికా వ్యాపార వర్గాల్లో విస్తృత పరిచయాలు, అనుభవం ఉన్నాయి. శ్రీ సిటీకి చేరుకున్న సతీష్ మండువకు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవకాశాలను ఉత్తర అమెరికా పెట్టుబడిదారులకు పరిచయం చేయడంలో ఆయన చేస్తున్న కృషి అభినందించారు. మోడల్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌గా శ్రీసిటీని అభివృద్ధి చేయడంలో డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి దూరదృష్టి, పట్టుదలను అభినందించారు. పర్యటనలో భాగంగా స్థానిక డైకిన్ పరిశ్రమను సందర్శించి, అక్కడ సంస్థ ప్రతినిధులతో చర్చించారు. -
కొత్త ఉద్యోగాలు
‘శ్రీవారి దగ్గర సేవ చేయాలి.. ఉద్యోగం కాదు. కొత్తగా ఉద్యోగాలిస్తే.. వచ్చే ఆదాయం వారి జీతాలకే వెళ్తుంది. ఇప్పటికే 50 శాతం వరకు ఉద్యోగుల జీతాలకు ఖర్చు చేస్తున్నాం.’ అంటూ సీఎం చంద్రబాబు చేసిన వాఖ్యలపై నిరుద్యోగులు రగిలిపోతున్నారు. ఎన్నికల ముందు సవాలక్ష హామీలిచ్చి.. నిరుద్యోగ భృతి అంటూ మభ్యపెట్టి ఓట్లు దండుకుని అధికార పీఠం ఎక్కాక శాశ్వత ఉద్యోగులు వద్దన్న రీతిలో వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఉద్యోగులు, కార్మికులు, శ్రీవారి సేవకుల మధ్య విబేధాలు సృష్టించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని హితవు పలుకుతున్నారు. శాశ్వత ఉద్యోగాలకు చెక్ కొద్దిపాటి ఉద్యోగులను భర్తీ చేసి.. శ్రీవారి సేవకుల సేవల్ని ఉచితంగా వినియోగించుకునే విధానం అమలు చేయాలని సీఎం చెప్పడం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. ఇప్పటికే టీటీడీలో శ్రీవారి సేవకులతో అన్నదానం, క్యూలైన్ మేనేజ్మెంట్ వినియోగిస్తున్నారు. అన్నదానంలో కూరగాయలు తరగడం నుంచి, వడ్డించే వరకు శ్రీవారి సేవకులే విధులు నిర్వహిస్తున్నారు. మరో వైపు శ్రీవారి భక్తులకు గుండుకొట్టే కళ్యాణ కట్ట క్షురకుల్లో కూడా కేవలం పీస్ రేట్ కింద శ్రీవారి సేవకుల్ని వినియోగించుకుంటుఊ.. శాశ్వత ఉద్యోగాల భర్తీకి చెక్ పెట్టారు. రానున్న రోజుల్లో ఇదే విధానం అన్ని విభాగాల్లో అమలు చేసే దిశగా అడుగులు వేస్తే తమ పరిస్థితి ఏంటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. సాక్షి, టాస్క్‌ఫోర్స్: టీటీడీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. టీటీడీలో ఇకపై శాశ్వత ఉద్యోగాలు భర్తీ లేకుండా శ్రీవారి సేవకులతో భర్తీ చేసే విధానం అమలు చేస్తామని సీఎం వ్యాఖ్యానించడంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఆ వ్యాఖ్యలు ఉద్యోగులు, కార్మికులు, శ్రీవారి సేవకుల మధ్య భేదాభిప్రాయాలు సృష్టించే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నాయి. బాబొస్తే జాబు పోయినట్టేనా? బాబొస్తే జాబు వస్తుంది అంటూ 2014–19 ఎన్నికల్లో ఊదరగోట్టారు. బాబు వచ్చారు.. నిరుద్యోగ యువతకు జాబు రాలేదు. అలాగే 2024 ఎన్నికల్లో సంపద సృష్ట్టిస్తా, ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా.. అంటూ జబ్బలు చరిచారు. అంతవరకు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానంటూ కాకమ్మ కబుర్లు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టించడం పక్కనబెట్టి, దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయా..? అంటే అదీ లేదు. తాజాగా టీటీడీలో శాశ్వత ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులపై భారం పడుతోంది. దుమారం రేపిన సీఎం వ్యాఖ్యలు ‘తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వచ్చిన సీఎం చంద్రబాబునాయుడు బుధవారం టీటీడీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘శ్రీవారి దగ్గర సేవ చేయాలి. ఉద్యోగం కాదు. శ్రీవారి సేవకోసం వైద్య, విద్య సేవకులు ముందుకొస్తున్నారు. సత్యసాయి ట్రస్ట్‌లో భక్తులకు ఎలాగైతే సేవ చేస్తున్నారో అదేవిధానం తిరుమలలో మరింత పెంచేలా శ్రీవారి సేవకులకు శిక్షణ ఇచ్చి వారిని వినియోగించుకోవాలని. టీటీడీలో ఇప్పటికే దాదాపు 12 లక్షల మంది శ్రీవారి సేవకులుగా నమోదు చేసుకున్నారు. వీరిని ఆలయ సేవా కార్యక్రమాలకు అనుసంధానం చేస్తాం. వైద్యులను కూ డా శ్రీవారి సేవకులుగా అనుసంధానం చేసి టీటీడీ ఆస్పత్రుల్లో సేవలందించేలా చర్యలు చేపడుతాం’. అంటూ సీఎం స్థాయి వ్యక్తి వ్యాఖ్యలు చేయడం నిరుద్యోగులను తీవ్ర నిరాశలో పడేసింది.టీటీడీలో కొత్త ఉద్యోగాలకు గండి ఆ వ్యాఖ్యలు ఉప సంహరించుకోవాలి టీటీడీ ఉద్యోగులపై సీఎం చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. శ్రీవారి సేవకుల పేరుతో శాశ్వత ఉద్యోగాలను తగ్గించే ఆలోచన సరికాదు. తిరుమలలో శాశ్వత ఉద్యోగుల సంఖ్యను పరిమితం చేసి, పనులను శ్రీవారి సేవకులతో చేయించుకోవాలనే విధంగా సీఎం చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. భక్తులకు నిరంతరం సేవలందించే టీటీడీ ఉద్యోగులను తక్కువ చేసి మాట్లాడడం వారి మనోభావాలను గాయపరుస్తోంది. శ్రీవారి సేవకులు స్వచ్ఛందంగా అందిస్తున్న సేవలను గౌరవిస్తాం. అయితే, వారి సేవను శాశ్వత ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా చూపడం సరికాదు. పారిశుద్ధ్యం సహా తిరుమలలో రోజూ నిర్వహించాల్సిన పనులకు తగిన సంఖ్యలో ఉద్యోగులు, కార్మికులు అవసరం. ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, శ్రీవారి సేవకుల మధ్య పోటీ పెట్టే విధానాన్ని ప్రభుత్వం విడనాడాలి. 2025–26 బడ్జెట్లో జీతాలు, ఇతర సిబ్బంది చెల్లింపులకు కేటాయించిన మొత్తం సుమారు 34 శాతం. ఈ కేటాయింపులో జీతాలతో పాటు ఇతర సిబ్బంది చెల్లింపులూ ఉన్నాయి. దాన్నంతటినీ సాధారణ ఉద్యోగుల జీతంగా చూపడం సరైంది కాదు. వెంటనే ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. – కందారపు మురళి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు, తిరుపతి -
స్విమ్స్‌లో అరుదైన శస్త్ర చికిత్స
తిరుపతి తుడా: స్విమ్స్‌లో టీటీడీ ప్రాణదాన పథకం కింద పేద రోగికి ఉచితంగా లక్షల విలువ చేసే అరుదైన శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తిచేశారు. ప్రకాశం జిల్లా, కోమరోలు మండలం, మాధవపల్లి చెందిన రోగి ఎం.తిరుమలేశ్వర్‌రెడ్డి (25) గతనెలలో స్విమ్స్‌లో న్యూరో సర్జరీ విభాగంలో అడ్మిషన్ పొందారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి, సర్జరీ అవసరమని నిర్ణయించి ప్రాణదాన పథకం కింద విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ స్విమ్స్‌లో వైద్యసేవ అంటే కేవలం వ్యాధికి చికిత్స చేయడం మాత్రమే కాదని, ఆపదలో ఉన్న రోగికి, అతని కుటుంబానికి భరోసాగా నిలవడం కూడా తమ బాధ్యతన్నారు. -
గరుడ సేవకు పటిష్ట భద్రత
తిరుపతి అర్బన్: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవ (ఈనెల 19వ తేది శనివారం) సందర్భంగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టనున్నట్టు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ జిల్లా అధికార యంత్రాంగంతోపాటు ప్రధానంగా టీటీడీ, విజిలెన్స్ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ భద్రతా చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రైవేటు వాహనాల పైన ఆంక్షలు విధిస్తున్నామని, భక్తులకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సులు, టీటీడీ వాహనాల ద్వారా తిరుమలకు చేరుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదు ఈనెల 18వ తేదీ రాత్రి 9 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనాలకు బాలాజీ లింక్ బస్తాండ్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, ఎస్వీ మెడికల్ కాలేజీ గ్రౌండ్, ఇస్కాన్ గ్రౌండ్, వద్ద పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఆర్టీసీ బస్సుల మళ్లింపు -
సైన్స్ సెమినార్లో విద్యార్థుల ప్రతిభ
కేవీబీపురం: జాతీయ సైన్స్ సెమినార్–2026లో కేవీబీపురం మండల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్, తిరుపతి జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్ ఆదేశాల మేరకు కేవీబీపురం మండల విద్యాశాఖ అధికారి రవికుమార్ ఆధ్వర్యంలో కేవీబీపురం ఉన్నత పాఠశాల వేదికగా గురువారం మండల స్థాయి సైన్స్ సెమినార్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో కేవీబీపురం ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి ప్రజ్వల్రాజు ప్రథమ బహుమతి సాధించగా, అదే పాఠశాలకు చెందిన విద్యార్థిని ఎన్.యాన్సీమేరీ ద్వితీయ బహుమతి సాధించింది. ఇద్దరు విద్యార్థులు తమ ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. హెచ్ఎం కూనాటి సురేష్, సైన్స్ ఉపాధ్యాయులు సత్య, సుబ్రహ్మణ్యం, ప్రకాష్, విజయ, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులు జిల్లా స్థాయి జాతీయ సైన్‌న్స్ సెమినార్–2026లో పోటీల్లో పాల్గొననున్నట్టు ఎంఈఓ తెలిపారు. -
దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి ఎడ్యుకేషన్ : నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ కేవీఎన్.కుమార్ తెలిపారు. నవంబర్ 15న నిర్వహించే ఈ పరీక్షకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 8వ తరగతి చదువుతూ వార్షిక కుటుంబ ఆదాయం రూ.3.5 లక్షల లోపున్న విద్యార్థులు అర్హులని తెలిపారు. ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఇన్’ వెబ్సైట్ ద్వారా అక్టోబర్ 12వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, అలాగే దరఖాస్తు రుసుమును ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 అక్టోబర్ 13వ తేదీలోపు ఎస్బీఐ కలెక్ట్ లింకు ద్వారా చెల్లించాలని పేర్కొన్నారు. నామినల్ రోల్‌ను సంబంధిత ప్రధానోపాధ్యాయులు ధృవీకరించి, ఆ ధృవపత్రాలను డీఈఓ కార్యాలయంలో అక్టోబర్ 14వ తేదీలోపు అందజేయాలని ఆయన సూచించారు. రెండు బస్సులు ఢీ – తప్పిన పెను ప్రమాదం తడ: జాతీయ రహదారిపై రెండు బస్సులు ఢీకొన్న ఘటన మండలంలోని కొండూరు గ్రామం వద్ద గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. టైర్ పంక్చర్ కావడంతో పరిశ్రమలకు కార్మికులను తరలించే బస్సు ఓ లారీ పక్కన రోడ్డుపై నిలిచిపోయింది. అదే సమయంలో తమిళనాడుకు ప్రయాణికులతో వెళుతున్న ట్రావెల్స్ బస్సు దాన్ని అంచనా వేయలేక కార్మికుల బస్సును ఢీకొట్టింది. ట్రావెల్స్ బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. -
ఘనంగా ఆయుష్య హోమాలు, కోటి దీపోత్సవం
నారాయణవనం : స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో తొమ్మిది రోజుల పాటు తలపెట్టిన నవాహ్నిక హోమ కార్యక్రమంలో భాగంగా గురువారం హోమాలు, ధార్మికోపన్యాసం, సాయంత్రం దీపోత్సవం, వేణుగోపాలస్వామి ఊరేగింపు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. చైర్మన్ అశోకరాజు ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోదీ పేరున ఉదయం ఆయుష్య హోమం, మృత్యుంజయ హోమం లక్ష తులసి అర్చనలను నిర్వహించారు. సాయంత్రం ప్రవచనకర్త కుప్పా విశ్వనాథ శాస్త్రిచే ‘ధర్మము – పునరవలోకనం‘ ప్రవసచనం కొనసాగింది. సాయంత్రం హోమ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరై శ్రీకృష్ణ వేణుగోపాలస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించి, గోపూజ నిర్వహించారు. దీపో త్సవం అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి (వేణుగోపాల అలంకారంలో) పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్, అశోకరాజు మాట్లాడుతూ 25 ఏళ్ల సూదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా పనిచేస్తున్న నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం విశ్వగురు స్థానానికి చేరుకుంటుందన్నారు. ఆధ్యాత్మిక వేడుకల్లో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, భక్తులు పాల్గొని స్వామివారి దివ్యాశీస్సులు అందుకున్నారు. -
రూ.కోట్ల కాలువ కబ్జా!
రేణిగుంట : తిరుపతి– కరకంబాడి రహదారిలోని రేణిగుంట మండలం వెంకటాపురం చెరువు కలుజు నుంచి నీరు వెళ్లే కాలువను ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం కబ్జా చేసేస్తోంది. 227 సర్వే నంబర్లోని 74 సెంట్లను టీడీపీ స్థానిక నేతల అండతో ఆక్రమించుకుని ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టింది. కబ్జాకు సహకరిస్తున్నందుకు సదరు పచ్చనేతలు భారీగా ముడుపులు తీసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు రూ.3కోట్ల విలువైన భూమి కబ్జాకు గురైనప్పటికీ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానిక రైతులు మండిపడుతున్నారు. పేదలు రెండు సెంట్ల పోరంబోకు భూమిలో ఇల్లు కట్టుకుంటేనే కూల్చి వేసే అధికారులు ఇప్పుడు రూ.కోట్ల స్థలం చెరబడుతున్నప్పటికీ ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటికి దారేది..? వెంకటాపురం చెరువు నుంచి ఈ కాలువ ద్వారా మరో రెండు చెరువులకు నీరు వెళుతుంది, ఇప్పుడు కాలువను కబళించేసి ప్రహరీ గోడ నిర్మిస్తే నీరు దిగువకు ఎలా వెళుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. కింది చెరువుల ఆయకట్టు రైతులు పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. ఆక్రమణ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఉన్నతాధికారులైనా స్పందించాలని కోరుతున్నారు. గతంలో సైతం ఆక్రమణ సదరు ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం గతంలో సైతం వెంకటాపురం చెరువుకు సంబంధించి సర్వే నంబర్ 225/1లో ఒక ఎకరా ఆక్రమించుకొని ప్రహరీ గోడ నిర్మించుకున్నారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. అదే విధంగా మళ్లీ కబ్జాకు తెగబడుతున్నారని ఆరోపిస్తున్నారు. అధికారలు వెంటనే పూర్తిస్థాయిలో సర్వే చేయించి చెరువు భూమిని కాపాడాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే దీనిపై తహసీల్దార్ శ్రావణ్‌కుమార్ వివరణ తీసుకునేందుకు యత్నించగా, ఆయన స్పందించలేదు. వెంకటాపురం చెరువు కలుజు -
జిల్లా హౌసింగ్ హెడ్ పోస్టుతో ఆటలు
● 6 నెలలకు ఒకసారి మారుతున్న అధికారులు ● ముందుకు సాగని గృహ నిర్మాణాలు నిరుపేదల సొంతింటి కలలను చంద్రబాబు ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ఇప్పటికే గత వైఎస్సార్సీపీ హయాంలో మంజూరైన ఇళ్ల నిర్మాణంపై శీతకన్ను వేసింది. ఈ క్రమంలోనే హౌసింగ్‌శాఖ జిల్లా హెడ్ పోస్టును సైతం ఇష్టారాజ్యం చేసేస్తోంది. పక్కా గృహాల పురోగతిని పర్యవేక్షించాల్సిన కీలక అధికారిని సక్రమంగా పనిచేయకుండా మోకాలడ్డుతోంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్త వారిని నియమిస్తూ ఆటలాడుకుంటోంది. టీడీపీ నేతల సిఫార్సు ఉంటే చాలు ఎవరికై నా సదరు పోస్టును కట్టబెట్టేస్తోంది. సామర్థ్యం.. పనితీరుతో సంబంధం లేకుండా రికమండేషన్లకు ప్రాధాన్యమిస్తోంది. చివరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారైనా సరే పలుకుబడి ఉంటే చాలు వెంటనే జిల్లా అధికారి స్థానంలో కూర్చోబెట్టేస్తోంది.హౌసింగ్ జిల్లా సమాచారం గత వైఎస్సార్సీపీ హయాంలో మంజూరు చేసిన ఇళ్లు 69,215 పూర్తి చేసినవి 25,450 ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేసినవి 10,132 భూమి పూజ చేసినవి 4,385 పునాదుల్లోనే ఉన్నవి 3,500 బేసిమెంట్ దశలోవి 13,313 గోడల దశలోని ఇళ్లు 7,902 శ్లాబ్ దశలో ఉన్నవి 4,533తిరుపతి అర్బన్:చంద్రబాబు ప్రభుత్వంలో జిల్లా స్థాయి అధికారి పోస్టును.. కాస్త సిఫార్సు ఉంటే చాలు సులభంగా తెచ్చుకోవచ్చునంటూ హౌసింగ్ డిపార్ట్ మెంట్లో జోరుగా చర్చసాగుతోంది. అందుకు జిల్లా హౌసింగ్ హెడ్ (డీహెచ్‌హెచ్) పోస్టును ఉదాహరణ గా చూపుతున్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హౌ సింగ్ కార్యాలయంలోని ఉద్యోగులు పదే పదే డీహెచ్‌హెచ్ పోస్టును మార్పు చేయడంపై మండిపడుతున్నారు. అవినీతి అరోపణలతో సంబంధం లేదు.. ఆప్షన్–3 ఇంటి నిర్మాణాల్లో దోపిడీకి పాల్పడినా ఏ మా త్రం పట్టించుకోకుండా రికమండేషన్‌తో సులవుగా జిల్లా అధికారి పోస్టును సంపాదించుకుంటున్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. జిల్లా హౌసింగ్ హెడ్‌ను తరచూ మారుస్తుండడంతో పక్కా గృహాల నిర్మాణాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారయ్యాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీహెచ్హెచ్కు సైతం తమ పోస్టును కాపాడుకునేందుకే సమయం గడచిపోతోందని ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారి పర్యవేక్షణ లేకపోవడంతో పలువురు ఉద్యోగులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. డీహెచ్‌హెచ్ మహా ఉంటే మూడు నెలలు ఉంటారు.. ఆయనను పట్టించుకునేది ఏముంటదిలే అని తూతూమంత్రంగా విధులు నిర్వర్తిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పూర్తి బాధ్యతలతో కీలకమైన హౌసింగ్ జిల్లా అధికారి పోస్టును భర్తీ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే పేదల ఇళ్ల అసంపూర్తిగానే మిగిలిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. బేసిమెంట్ దశలో ఆగిన ఇంటి నిర్మాణాలు తాజాగా శ్రీనివాసరావు నియామకం డీహెచ్‌హెచ్‌గా ఏ.శ్రీనివాసరావును బుధవారం నియమించారు. ఆయన ఏడాది క్రితం ఉద్యోగ విమరణ పొందారు. అయితే మూడు నెలల క్రితం హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల విరమణ వయసును 62 ఏళ్లకు పెంచారు. దీంతో పదలు సంఖ్యలో ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరారు. ఈ క్రమంలో శ్రీనివాసరావు సైతం తిరుపతి ఈఈగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం తిరుపతి ఈఈతోపాటు జిల్లా హౌసింగ్ హెడ్‌గా ఇన్చార్జి బాద్యతలు అప్పగించారు. అయితే మూడు నెలల నుంచి ఇప్పటి వరకు ఇన్చార్జి డీహెచ్‌హెచ్‌గా విధులు నిర్వర్తించిన గోపాల్‌నాయక్‌ను తిరిగి గూడూరు ఈఈగా పంపించారు. గోపాల్‌నాయక్‌కు ముందు రైల్వేకోడూరు హౌసింగ్ ఈఈ శ్రీరాములురెడ్డి డీహెచ్‌హెచ్‌గా పనిచేశారు. -
నిమజ్జనోత్సాహం
తిరుపతి నగరంలో వినాయక నిమజ్జనోత్సవం వైభవంగా సాగుతోంది. బుధవారం ఈ మేరకు గణపతి విగ్రహాలను ఊరేగింపుగా తరలించారు. బాణసంచా పేలుస్తూ.. డప్పు వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ.. రంగులు చల్లుకుంటూ యువత ఉత్సాహంగా గణేశుని నిమజ్జనానికి బయలుదేరింది. ఈ క్రమంలోనే గణేశుని ప్రతిమలను గంగమ్మ ఒడికి చేర్చేందుకు నగరపాలక సంస్థ అధికారులు వినాయకసాగర్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వినాయక నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో మంగళం రోడ్డు వద్ద ఓ వేదిక ఏర్పాటు చేసి విశేష విగ్రహాలకు మంగళ హారతి సమర్పించి వీడ్కోలు పలికారు. చవితి వేడుకుల సందర్భంగా తిరుపతిలో సుమారు 2,500 విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు 80శాతం వరకు ప్రతిమలను నిమజ్జనం చేశారు. భారీ క్రేన్ల సాయంతో సురక్షితంగా ప్రక్రియను పూర్తి చేశారు. – తిరుపతి మంగళం/ తిరుపతి తుడా -
శ్రీవారి దర్శనానికి 4 గంటలు
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 61,361 మంది స్వామివారిని దర్శించుకోగా 18,722 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.70 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 04 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది. ముక్కంటి సేవలో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీకాళహస్తి : జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారిని బుధవారం దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కన్నబాబు సేవించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద ఆయనకు ఆలయ పాలకమండలి చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, ఈఓ బీకే వెంకటేశులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. మృత్యుంజయస్వామి సన్నిధిలో వేదపండితులు ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ పరిపాలన భవనంలో చైర్మన్, ఈఓతో కలిసి అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆలయ నిర్వహణ, భక్తులకు అందుతున్న సౌకర్యాలు, అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. భక్తులకు మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. జాతర నిర్వహణకు అనుమతి వెంకటగిరి(సైదాపురం) : గ్రామశక్తి పోలేరమ్మతల్లి జాతరను వైభవంగా నిర్వహించాలని వెంకటగిరి రాజా కుటుంబీకులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వీబీ సాయికృష్ణ యాచేంద్ర సూచించారు. బుధవారం ఈ మేరకు వెంకటగిరి రాజా ప్యాలెస్‌లోని మండపంలో వెంకటగిరి గ్రూప్ దేవస్థానం ఈఓ శ్రీనివాసులరెడ్డి, సీఐ రోశయ్యకు సాయికృష్ణయా చేంద్ర తాంబులం అందించి జాతర నిర్వహణ కు అనుమతి ఇచ్చారు. సాయికృష్ణ యాచేంద్ర మాట్లాడుతూ సాంప్రదాయలను గౌరవిస్తూ ప్రజా ప్రతినిధుల సమక్షంలో దేవదాయ, పోలీ సు, ఇతర శాఖల అధికారులు సమన్వయం చేసు కుని జాతరను విజయవంతం చేయాలని కోరా రు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. -
సంప్రదాయబద్ధంగా వెంకటగిరి జాతర చాటింపు
వెంకటగిరిరూరల్ : వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మతల్లి జాతర మొదటి చాటింపు బుధవారం అర్ధరాత్రి సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ముందుగా కాపాళెంలోని గాలిగంపుల పోలేరమ్మ, కామాక్షమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం జాతరకు చాటింపు వేశారు. కాంపాళెంలోని ప్రధాన మార్గం మీదుగా వరదరాజస్వామి ఆలయం, బజారువీధి మీదుగా పోలేరమ్మతల్లి ఆలయం, ఆర్చి, కాశీపేట కూడలి మీదుగా చాటింపును కొనసాగించారు. శ్రీనివాసులరెడ్డి, సీఐ రోశయ్య పర్యవేక్షించారు. 19న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు తిరుపతి అర్బన్: ఇంటర్ 2025–26లో 75శాతం మార్కులతో ఉత్తీర్ణులైన నాన్ మ్యాథ్స్ గ్రూప్ విద్యార్థులకు హెస్‌సీఎల్ కంపెనీ అసోసియేట్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆర్ఈఓ గోపాల్‌రెడ్డి, డీఎస్డీఓ లోకనాథం తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుపతిలోని కరకంబాడి మార్గంలో ఉన్న శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు. ఆసక్తిగల విద్యార్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వివరాలకు 8019913422 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
ఉపాధి అవకాశాల విధ్వంసం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: కేంద్రంలోని మోడీ పాలనలో ఉపాధి అవకాశాలు విధ్వంసమయ్యాయని ప్రగతిశీ ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్ తెలిపారు. బుధవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, కూటమి ప్రభుత్వం అరకొరగా భర్తీ చేస్తోందని విమర్శించారు. అందుకే శాశ్వతమైన, గౌరవప్రదమైన ఉపాధి ప్రతి విద్యార్థి హక్కు నినాదంతో డిసెంబర్ 11 నుంచి 13వ తేదీ వరకు తిరుపతిలో 24వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా మేధావులు, పీడీఎస్‌యూ ప్రతినిధులు మహాసభలకు హాజరు కానున్నట్లు చెప్పారు. మంత్రి నారా లోకేష్ జీవో నంబర్ 77ను రద్దు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు. అలాగే పెండింగ్‌లోని రూ.64 వేల కోట్ల ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్క యూనివర్సిటీకి రూ. 200 కోట్లు నిధులు కేటాయించాలని కోరారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
రాపూరు : పట్టణంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. వివరాలు.. స్థానిక పడమటి అగర్తకట్టకు చెందిన భూపతి శ్రీదేవి (53) ఇంటి నుంచి బజారుకు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా మోటార్ సైకిల్ ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని ఆదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిరుమలరావు తెలిపారు. ఫాస్ట్‌ఫుడ్ తయారీపై ఉచిత శిక్షణ చంద్రగిరి : యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చంద్రగిరిలో ఈనెల 21వ తేదీ నుంచి 12 రోజుల పాటు పురుషులు, మహిళలకు ఫాస్ట్ ఫుడ్ తయారీపై ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సంస్థ డైరెక్టర్ పి. సురేష్ బాబు బుధవారం తెలిపారు. తెల్ల రేషన్ కార్డు గల గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు కలిగిన నిరుద్యోగ పురుషులు, మహిళలు అర్హులన్నారు. కనీసం 8వ తరగతి చదువుకుని ఉండాలని చెప్పారు. ట్రైనీస్‌కి ఉచిత భోజనం, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందించనున్నట్లు తెలిపారు. ఆసక్తిగలవా రు ఆధార్ కార్డు, రేషన్ కార్డు జెరాక్స్ కాపీలు, 4 పాసుపోర్టు సైజు ఫొటోలతో సంస్థకి వచ్చి పేరు నమోదు చేయించుకోవాలని కోరారు. ముందుగా పేరు నమోదు చేసుకున్న ప్రాధాన్యతనిస్తామన్నారు. ఇతర వివరాలకు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, 11–48 ద్వారకానగర్ (రాయల్ విక్టరీ స్కూల్ దగ్గర) కొత్తపేట, చంద్రగిరి. 79896 80587, 91775 43543, 63017 17672 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. భక్తుడికి నగల బ్యాగు అప్పగింత తిరుపతి అన్నమయ్యసర్కిల్ : అలిపిరి చెక్ పాయింట్ వద్ద బంగారు నగలు, నగదుతో కూడిన బ్యాగును మరచివెళ్లన భక్తుడికి తిరిగి బ్యాగును అప్పగించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా పీర్లగూడానికి చెందిన జనార్ధన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి బుధవారం ఉదయం అలిపిరి చెక్‌పాయింట్ వద్ద తమ బ్యాగును మరిచి తిరుమలకు చేరుకున్నారు.భద్రతా సిబ్బంది సదరు బ్యాగును సెక్టార్ కార్యాలయానికి చేర్చారు. అందులో నగదు రూ. 32 వేలు, సుమారు 30 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. బ్యాగును మరిచిపోయిన వారు తిరిగి అలిపిరి చెక్‌పాయింట్ వద్దకు చేరుకున్నారు. వారి వివరాలను నిర్ధారించుకుని ఏవీఎస్ఓ రమేష్‌కుమార్ ఆ బ్యాగ్‌ను తిరిగి అప్పగించారు. రైల్వేట్రాక్‌పై గుర్తుతెలియని మృతదేహం తిరుపతి అర్బన్ : తిరుపతి– తిరుచానూరు రైల్వే స్టేషన్ మధ్య చింతల చేను వద్ద గుర్తుతెలియని వ్యక్తి (సుమారు 35 ఏళ్లు) మృతదేహం ఉందని రైల్వే ఇన్స్పెక్టర్ వరప్రసాద్ బుధవారం తెలిపారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని వెల్లడించారు. మృతుడి వివరాలు తెలియలేదని, ఈ మేరకు కేసు నమోదు చేసి ఎస్వీ మెడికల్ కళాశాల మార్చురీకి మృతదేహం తరలించినట్లు వివరించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9247575618 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. విద్యుదాఘాతానికి యువకుడి బలి సైదాపురం : మండలంలోని తురిమెర్లలో మంగళవారం అర్ధరాత్రి విద్యుదాఘాతానికి ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. సైదాపురానికి చెందిన కాకాణి నాగరాజు, ప్రమీల దంపతులకు ముగ్గురు కుమార్తెలు. నాగరాజు కొంతకాలంగా తురిమెర్లలోని అత్తగారింట్లోనే కాపురం ఉంటున్నాడు. కూలి పనులకు వెళ్లి జీవనం సాగించేవాడు. మంగళవారం రాత్రి ఆరు బయట ఫ్యాన్ పెట్టుకుని కుటుంబ సమేతంగా పడుకున్నాడు. అర్ధరాత్రి దాహం వేసి నీరు తాగేందుకు ఇంట్లోకి వెళ్లి వస్తుండగా తలుపులు తగిలి ప్లగ్‌బాక్స్ వైర్ తెగిపోయింది. దానికి మరమ్మతు చేస్తుండగా కరెంట్ షాక్‌కు గురయ్యాడు. కుటుంబీకులు వెంటనే ఆస్పత్రికి తరలించేందుక యత్నించగా అప్పటికే మరణించాడు. సమాచారం అందుకునన స్టేషన్ ఇన్చార్జి శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ పెద్ద మృత్యువాత పడడంతో భార్యాబిడ్డలు కన్నీరుమున్నీరవుతున్నారు. -
బ్రహ్మాండోత్సవం
రూ.కోట్ల కాలువ కబ్జా! తిరుపతి– కరకంబాడి మార్గంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం యథేచ్ఛగా కబ్జాకు పాల్పడుతోంది.తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉభయ దేవేరీ సమేతంగా శ్రీమలయప్పస్వామివారు విశేష వాహనాల్లో కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. బుధవారం ఉదయం చిన్నశేష వాహనంపై ఊరేగుతూ అశేష జనులను కటాక్షించారు. రాత్రి వీణాపాణి అలంకారంలో హంస వాహనంపై విహరించారు. భువి వైకుంఠంలో ఏడుకొండలస్వామి దివ్యతేజోవిరాజిత మూర్తిని వీక్షించి భక్తకోటి పులకించింది. మహిమాన్విత మాడవీధుల్లో దేదీప్యంగా ప్రకాశిస్తున్న తిరుమలేశుని దర్శించి పరవశించింది. ఎన్ని జన్మల ఫలమో కదా.. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని సేవించు భాగ్యము దక్కిందంటూ మురిసిపోయింది. – తిరుమల భక్తుల సౌకర్యాలకే ప్రాధాన్యం తిరుమలలో భక్తుల సౌకర్యాలకే ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గురువారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026 -
వైభవోత్సవం
తుమ్మలగుంట శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండో రోజు బుధవారం ఉదయం చిన్నశేష వాహనంపై వెంకన్న విహరించారు. రాత్రి హంస వాహనంపై సరస్వతీ స్వరూపంగా దర్శనమిచ్చారు. ఈ క్రమంలోనే ఉదయం 11 గంటలకు దేవదేవేరులనను కల్యాణ మండపానికి వేంచేపు చేశారు. వేడుకగా స్నపన తిరుమంజనం జరిపించారు. సాయంత్రం కనులపండువగా ఊంజల్ సేవ నిర్వహించారు. ఈ క్రమంలోనే చిన్నశేష వాహన సేవకు తిరుపతి రూరల్ మండలానికి చెందిన భక్తులు సారె తీసుకువచ్చారు. హంస వాహన సేవకు పాకాల మండలానికి చెందిన వారు సారె సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కుటుంబీకులు పర్యవేక్షించారు. – తిరుపతి రూరల్ లారీని ఢీకొన్న తమిళనాడు ఆర్టీసీ బస్సుఆదేశాల అమలు తప్పనిసరి నాయుడుపేట టౌన్ : ఎన్నికల కమిషన్ ఆదేశాలను మున్సిపల్‌శాఖ అధికారులు తప్పనిసరిగా అమలు చేయాలని మున్సిపల్ అడ్మినిస్టేషన్ కమిషనర్ సంపత్‌కుమార్ స్పష్టం చేశారు. బుధవారం నాయుడుపేట మున్సిపల్ కార్యాలయంలో నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి కమిషనర్లు షేక్ ఫజులుల్లా, చిన్నయ్య, కిరణ్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందిగా నిర్వహించాలని సూచించారు. పురపాలక సంఘాల్లో తాగునీటి సరఫరాతో పాటు పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కోరారు. అనంతరం పట్టణంలోని పాతబస్టాండ్ వద్ద అన్నా క్యాంటీన్‌కు మధ్యాహ్న భోజనం పంపిణీని పరిశీలించారు. మున్సిపల్ మేనేజర్ ఊరుకుందమ్మ పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలోకి పాముపుల్లంపేట :ప్రభుత్వ పాఠశాల ఆవరణలోకి పాము రావడంతో విద్యార్ధులు భయాందోళనకు గురయ్యారు. బుధవారం ఉదయం సాతువారిపల్లె ప్రాథమిక పాఠశాల గేటు తీయగానే రక్తపింజరి పాము కనిపించడంతో విద్యార్ధులు కేకలు వేస్తూ పరుగులు తీశారు. గ్రామస్తులు వెంటనే అక్కడకు చేరుకుని పాముని కొట్టి చంపేశారు. పాఠశాల సమీపంలో ముళ్లపొదలు అధికంగా ఉండడం, పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడంతో విషజీవుల సంచారం అధికమైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల ప్రాంగణంలోనే అంగన్వాడీ కేంద్రం కూడా ఉండడంతో చిన్నారుల భద్రతపై దృష్టి సారించాలని కోరుతున్నారు. శిథిలావస్థలోని పాఠశాల భవనానికి మరమ్మతులు చేయించడంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా మార్చేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నాయుడుపేట టౌన్ : మండలంలోని నరసారెడ్డి కండ్రిగ వద్ద జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని కంటైనర్ లారీని తమిళనాడు ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. తమిళనాడుకు చెందిన 103 బస్సు నెల్లూరు నుంచి 50 మంది ప్రయాణికులతో చైన్నెకు బయలుదేరింది. మార్గం మధ్యలో ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ సెల్‌ఫోన్ చూస్తూ అజాగ్రత్తగా నడపడం వల్లే యాక్సిడెంట్ జరిగిందని ప్రయాణికులు వెల్లడించారు. బస్సు వేగంగా వెళుతున్న సమయంలో కాల్ రావడంతో డ్రైవర్ ఫోన్ చూస్తూ రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఢీకొట్టాడని చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగంలో కూర్చుని ఉన్న కండక్టర్ షణ్ముగంతోపాటు ఇందుకూరు పేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు తిరుమలశెట్టి మల్లికార్జున, పొదలకూరు ప్రాంతానికి చెందిన శ్రీనివాసులు, సూళ్లూరుపేటకు చెందిన ఎస్కే షేక్ సద్దార్, తడ మండలం చెరివి గ్రామానికి చెందిన శ్రీరాఘవేంద్ర, నాయుడుపేటకు చెందిన ఎన్.నరేంద్రకుమార్‌లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక మహాలక్ష్మీనగర్ కాలనీకి చెందిన యువత, హైవే మొబైల్, 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.తీవ్రంగా గాయపడిన కండక్టర్ షణ్ముగాన్ని మెరుగైన చికిత్స నిమిత్తం చైన్నెకు తీసుకెళ్లార. ప్రయాణికులు మరో బస్సులో చైన్నెకు తరలివెళ్లారు. సీఐ వెంకటేశ్వరరావు, ఏఎస్ఐ రామ్మూర్తి, పోలీస్ సిబ్బంది ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కండక్టర్ వద్ద ఉన్న రూ.15వేల నగదు 108 ఈఎంటీ బల్లి కిరణ్‌కుమార్, పైలెట్ సుబ్బారావుకు దొరికింది. వారు ఆ నగదును ప్రభుత్వ వైద్యశాలలో బస్ డ్రైవర్ జ్ఞానప్రకాష్కు అందజేశారు. రోడ్డు ప్రమాదంలో ఎస్బీఐ మేనేజర్ దుర్మరణం వెంకటగిరి రూరల్:వెంకటగిరి– తిరుపతి జాతీయ రహదారిపై బుధవారం శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లె వద్ద గుర్తుతెలియని వాహ నం ఢీకొని ఎస్బీఐ వెంకటగిరి శాఖ మేనేజర్ మృతి చెందారు. వివరాలు.. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన దీపక్ (35) వెంకటగిరి స్టేట్ బ్యాంకులో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దీపక్ వాకింగ్ వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగింది. స్ధానికులు 108లో వైద్యశాలకు తరలించగా దీపక్ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. లారీ ఢీకొని అర్చకుడి మృతి శ్రీకాళహస్తి: ఏర్పేడు నుంచి వెంకటగిరికి వెళ్లే ప్రధాన రహదారిలో మంగళవారం అర్ధరాత్రి లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంలో వస్తున్న అర్చకుడు కళ్యాణ్ కుమార్ శర్మ (29) అక్కడకక్కడే మృతి చెందాడు. వివరాలు.. పల్లం గ్రామానికి చెందిన పులివెందుల కళ్యాణ్ కుమార్ శర్మ వెంకటగిరి వెళ్లి తిరిగి వస్తుండగా పల్లంపేట పెట్రోల్ బంకు వద్ద ప్రమాదం జరిగింది. ఏర్పేడు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఐక్య పోరాటంతోనే వివక్ష అంతం
తిరుపతి సిటీ : ఐక్య పోరాటంతోనే కుల వివక్ష అంతమవుతుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తెలిపారు. బొజ్జాతారకం పదో వర్ధతిని పురస్కరించుకుని బుధవారం ఎస్వీయూ సెనెట్ హాల్లో దళిత సాహిత్యం, ప్రజా ఉద్యమాలు అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ముందుగా బొజ్జాతారకం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాఘవులు మాట్లాడుతూ బొజ్జా తారకంతో కలిసి ఉద్యమాలు చేసిన సందర్భాలను గుర్తు చేశారు. దళితుల కోసం ఆయన సృష్టించిన సాహిత్యాన్ని మేళవించి ముందుకెళ్లితేనే దళితుల సమస్యను అరికట్టవచ్చని తెలిపారు. దళిత అభ్యుదయ సాహిత్య రచనలను వినూత్నంగా తీసుకురావల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ప్రస్తుతం దళిత సంఘాల్లో విభజన ద్వారా రాజకీయ స్వార్థం పెచ్చు మీరుతోందని, దళితులందరూ ఐకమత్యంగా ప్రజా ఉద్యమాలను సాగించాలని పిలుపునిచ్చారు. సదస్సులో దక్షిణ భారత రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు అంజయ్య, ఉమ్మడి చిత్తూరు జిల్లా జెడ్పీ మాజీ సీఈఓ వెంకట నారాయణ, ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షుడు పిట్టా వరప్రసాద్, రచయిత గోవిందయ్య పాల్గొన్నారు. పింఛన్ల దరఖాస్తుకు గడువు పెంపు – 18 వరకు అవకాశం తిరుపతి అర్బన్:కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు మరో రెండు రోజులు అవకాశం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం వారు మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీలోపు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
అవినీతి తప్ప అభివృద్ధి ఎక్కడ?
సూళ్లూరుపేట: రెండున్నరేళ్లు కూటమి ప్రభుత్వ హయాంలో అవినీతి తప్ప అభివృద్ధి కనిపించడం లేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ కిలివేటి సంజీవయ్య ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన స్థానిక నాయకులతో కలిసి శిథిలావస్థకు చేరుకున్న కాళంగి వంతెనను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ కుటుంబ సభ్యులు నియోజకవర్గాన్ని అవినీతి పథంలో నడిపిస్తున్నారని విమర్శించారు. సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీచెంగాళమ్మ పరమేశ్వరి ఆలయ సమీపంలో కాళంగి నదిపై నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరుకున్నా ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వంతెన గురించి నాటి ముఖ్యమంత్రి మా జగనన్నకు చెప్పి 2023 నవంబర్ 6 జీఓ ఆర్టీ నం.325 ద్వారా రూ.35 కోట్లు మంజూరు చేస్తే.. దానికి టెక్నికల్ మంజూరు చేయించుకునే లోపు ఎన్నికల కోడ్ రావడం, ఎన్నికల్లో ఓడిపోవడంతో మేము పనులు చేయలేకపోయామన్నారు. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయకుండా సీఎంతో మాట్లాడాను అని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. ఎంతసేపు ఎమ్మెల్యే కుటుంబం ప్రకృతి వనరుల్ని పర్సెంటేజీలకు అమ్మేయడమే పనిగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. రెండున్నరేళ్ల పాలనలో ఏం చేశారో చెప్పండి? అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరింపులా? ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరించడం ఏమిటని కిలివేటి అన్నారు. మా నాయకుడు సత్యనారాయణరెడ్డిపై తప్పుడు కేసులు నమోదు చేసి రెండోసారి జైలుకు పంపడం వెనుక కుట్రకోణం దాగి ఉందన్నారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు అల్లూరు అనిల్‌కుమార్‌రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు వేళ్లపాళెం కృపాకర్‌రెడ్డి, నాయకులు స్వామిరెడ్డి, జెట్టి వేణుయాదవ్, మీజూరు రామకృష్ణారెడ్డి, అలవల సురేష్, వాకాటి బాబురెడ్డి, బద్దెపూడి మోహన్‌రెడ్డి, మల్లిరెడ్డి, చిలకా యుగంధర్, అయితా శ్రీధర్, కాకి శ్రీరామ్మూర్తి, మాదరపాక సురేష్ పాల్గొన్నారు. -
తిరుపతి @ 66 డివిజన్లు
తిరుపతి తుడా: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 66 డివిజన్లకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం రాజముద్ర వేసింది. కార్పొరేషన్ 50 డివిజన్ల నుంచి 66కు పెంచుతూ ఫైనల్ నోటిఫికేషన్‌తో కూడిన గెజిట్‌ను మంగళవారం విడుదల చేసింది. ఇటీవల అభ్యంతరా లు, సూచనలు ఉంటే చేయాలని ఏడు రోజుల పాటు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మొత్తం 33 ఫిర్యాదులు, అభ్యంతరాలు కార్పొరేషన్‌కు అందాయి. వాటిని పరిశీలించిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చిన్న మార్పులు, చేర్పులు చేసి ప్రభుత్వానికి నివేదించారు. ఈ క్రమంలో ప్రభుత్వం 66 డివిజన్లకు ఆమోదం తెలిపింది. -
డయల్ యువర్ సీఎండీకి 75 వినతులు
తిరుపతి రూరల్: డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమానికి 75 వినతులు వచ్చినట్టు సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. ప్రతి సోమవారం ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో నిర్వహించే డయల్ యువర్ సీఎండీ, డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని వినాయక చవితి సందర్భంగా సోమవారం సెలవుదినం కావడంతో మంగళవారం నిర్వహించారు. సంస్థ పరిధిలోని 9 జిల్లాల నుంచి 75 మంది వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను సీఎండీకి విన్నవించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు పి.అయూబ్‌ఖాన్, కె.గురవయ్య, చీఫ్ జనరల్ మేనేజర్లు జె.రమణాదేవి, ఎన్.శోభా వాలెంటీనా, ఆర్.పద్మ, ఎం.మురళీకుమార్, సిహెచ్ రామచంద్రరావు, కే.సంపత్ కుమార్, ఎస్.రమణ, ఎం.శ్రీకాంత్, ఏ.శ్రీనివాసబాబు, జనరల్ మేనేజర్లు జగదీష్, భాస్కర్‌రెడ్డి, హేమలత, సురేష్ తదితరులు పాల్గొన్నారు. బీజీపీ నేత బైక్ దగ్ధం చంద్రగిరి: మండల బీజేపీ నేత ద్విచక్ర వాహనానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పటించిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. చంద్రగిరి శ్రీనివాసశెట్టి సందు వీధికి చెందిన కాకిమాను మునిరాజ బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున తన ఇంటి సమీపంలో ఉంచిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై పెట్రోల్ పోసి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటనలో బైక్ పూర్తిగా కాలిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించారు. వినాయక చవితి పండుగకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్యానర్లు పెట్టామనే కక్షతో తన బైక్‌కే నిప్పటించారని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. బైక్‌ను ఢీకొన్న శ్రీసిటీ బస్సు – వ్యక్తికి తీవ్ర గాయాలు చిట్టమూరు: నాయుడుపేట–మల్లాం రహదారిలో చిట్టమూరు మండలం, బయ్యవారికండ్రిగ గ్రామం వద్ద సోమవారం శ్రీసిటీకి వెళ్తున్న బస్సు మోటార్ బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పెళ్లకూరు మండలం, చెంబేడుకు చెందిన రామచంద్రయ్య మోటార్ బైక్‌పై నాయుడుపేట నుంచి మల్లాం వైపు వస్తుండగా, తడ మండలం నుంచి శ్రీసిటీలోని ఓ కంపెనీకి ఉద్యోగులను తీసుకెళ్తున్న బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో మోటార్ బైక్‌పై వెళ్తున్న రామచంద్రయ్యకు గాయాలు కావడంతో వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, బస్సును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తిరుపతిలో ట్రెకింగ్–ఐ తిరుపతి సిటీ: తిరుపతి ఎన్సీసీ నగర్లో ఆల్ ఇండియా ఎన్సీసీ ఏపీ ట్రెక్–ఐ పేరుతో ఇండియన్ సీనియర్, జూనియర్ డివిజన్ ఎన్సీసీ క్యాడెట్లకు ట్రెకింగ్ యాత్ర చేపట్టారు. ఈనెల 12 ప్రారంభమైన యాత్ర ఈనెల 19 వరకు జరగనుంది. తిరుపతి ఎన్సీసీ గ్రూప్ హెడ్‌క్వార్టర్స్ 5వ ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ నిర్వహిస్తున్న ట్రెకింగ్ యాత్రలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, కేరళ, లక్ష్యదీప్, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర డైరెక్టరేట్లకు చెందిన 510 మంది ఎన్సీసీ క్యాడెట్లు, 15 మంది ఎన్సీసీ అధికారులు పాల్గొంటున్నారు. ట్రెకింగ్ షెడ్యూల్లో భాగంగా క్యాడెట్లు తిరుమల, జూపార్క్, సైన్స్ సెంటర్ వంటి కేంద్రాల్లో శిక్షణ, సాహస కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఎన్సీసీ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ గ్రూప్ కమాండర్, ట్రెక్ మేనేజర్ కల్నల్ ఎకే.శర్మ పాల్గొన్నారు. -
పింఛన్ల దరఖాస్తుకు నేటితో ఆఖరు
తిరుపతి అర్బన్: ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏడాదికి రెండు సార్లు ( 6 నెలలకు ఒకసారి) కొత్త పింఛన్లు మంజూరు చేస్తూ వచ్చారు. పింఛన్ల జారీకి సంబందించి దశాబద్దాలుగా ఇదే తంతు కొనసాగుతుంది. అయితే చంద్రబాబు సర్కార్ 2024 జూలై 12న కొలువుదీరిన నాటి నుంచి ఇప్పటి వరకు కొత్త పింఛన్లకు చాన్స్ ఇవ్వలేదు. 27 నెలలు తర్వాత తాజాగా ఈనెల 7 నుంచి 16వ తేది వరకు కొత్త పింఛన్ల దరఖాస్తులు కూటమి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే 12,13,14 తేదీల్లో సెలువులు రావడంతో కేవలం 7 రోజులు మాత్రమే గ్రామ, వార్డు సచివాల యాల్లో దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే తక్కువ సమయం ఇచ్చారంటూ పలువురు గగ్గొలు పెడుతున్నారు. జిల్లాలో సుమారుగా 60 వేల మంది వరకు కొత్త పింఛన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి సిద్దంగా ఉన్నారు. అయితే ఇప్పటి( మంగళవారం) వరకు 41,260 మంది మాత్రమే దరఖాస్తులు చేసుకున్నారు. బుధవారంతో దరఖాస్తుకు గడువు ముగుస్తోంది. దాదాపుగా ఇంకా 19 వేల మందికి పైగా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉందని తెలుస్తుంది. ఒక్క రోజులో వీరందరు దరఖాస్తులు చేసుకోవడం సాధ్యంకాదని పలువురు ఆందోళన చెందుతున్నారు. కొత్త పింఛన్లకు దరఖాస్తులు ఇలా... వృద్ధాప్య పింఛన్‌కు 22,411 మంది వితంతువులుు 10,482 వికలాంగులు 4,369 డప్పు కళాకారులు 1881 నేత కార్మికులు 657 చర్మకారులు 533 కల్లుగీత కార్మికుల 374 ఫిషర్స్ మెన్స్ 308 ఒంటరి మహిళలు 221 ట్రాన్స్‌జెండర్స్ 24 మంది మొత్తం 41,260 మంది దరఖాస్తులు చేసుకున్నారు -
బ్రహ్మోత్సవ తేజం..
అంగరంగ వైభవంగా ధ్వజారోహణం స్వర్ణకాంతుల్లో శ్రీవారి ఆలయం బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మహద్వారం నుంచి ఆలయ ప్రాకారాల వరకు పుష్పాలు, విద్యుత్ దీపాలంకరణలతో అలంకరించారు. హథీరాంజీ మఠం, ఆస్థాన మండపం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు భక్తులను ఆకట్టుకున్నాయి. పుష్ప ప్రదర్శనశాలలో దేశీయ పుష్పాలతోపాటు వివిధ రకాల విదేశీ పుష్పాలతో ప్రత్యేక ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. ఫొటో ఎగ్జిబిషన్‌న్, కళా ప్రదర్శనలకు కూడా సన్నాహాలు పూర్తయ్యాయి. తిరుమల:తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టారు. మంగళవారం సాయంత్రం ధ్వజారోహణ ఘట్టాన్ని పూర్తిచేశారు. మీన లగ్నంలో పవిత్ర గరుడ పతాకాన్ని బంగారు ధ్వజస్తంభ శిఖరాగ్రాన అర్చకులు ఆవిష్కరించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ గరుడ పతాకం ఎగరడంతో బ్రహ్మోత్సవాలకు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ధ్వజస్తంభంపై ఎగిరే గరుడ పతాకమే ముక్కోటి దేవతలకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రంగా భావిస్తారు. గరుడుడి ఆహ్వానాన్ని అందుకుని దేవతలు, అష్టధిక్పాలకులు, దేవగణాలు తొమ్మిది రోజులపాటు తిరుమలలో జరిగే శ్రీవారి ఉత్సవాలను తిలకిస్తారని పురాణాలు పేర్కొంటున్నాయి. ధ్వజారోహణానికి ముందు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు పరివార దేవతలతో కలిసి తిరుచ్చి వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగారు. భక్తుల వీక్షణ.. విష్వక్సేనుడి పర్యవేక్షణ సోమవారం సాయంత్రం శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమాన్ని వైఖానస ఆగమశాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించే కార్యక్రమానికి అంకురార్పణతో శ్రీకారం చుట్టారు. ముందుగా విష్వక్సేనుడు ఛత్రచామరాలు, మేళతాళాల నడుమ ఆలయ పురవీధుల్లో ఊరేగారు. అనంతరం యాగశాలకు చేరుకుని భూమిపూజ నిర్వహించారు. నిర్ణీత పాళికల్లో శాలి, వ్రీహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు తదితర నవధాన్యాలతో బీజావాపం చేశారు. పాళికల్లో వేసిన విత్తనాలు శుక్లపక్ష చంద్రునిలా దినదినాభివృద్ధి చెందాలని, బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని అర్చకులు ప్రార్థించారు. అనంతరం రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహించారు. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమలకు విచ్చేసి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనం అందజేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపల జరిగిన పెద్ద శేష వాహన సేవను సీఎం వీక్షించి తరించారు. పెద్ద శేష వాహనంపై అభయముద్ర బ్రహ్మోత్సవాలలో తొలి రోజు మంగళవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు ఏడు తలల పెద్ద శేష వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ దాస్యభక్తికి ప్రతీకగా నిలుస్తాడు. పటిష్ట బందోబస్తు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసు, టీటీడీ విజిలె న్స్, ఎస్పీఎఫ్, ట్రాఫిక్, అగ్నిమాపక, వైద్య తదితర విభాగాల సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. -
సిద్ధార్థలో భారత విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయాగం
నారాయణవనం: మండలంలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో నవాహ్నిక భారత విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయాగం మంగళవారం ప్రారంభమైంది. కళాశాల చైర్మన్ అశోకరాజు దంపతుల ఆధ్వర్యంలో 225 మంది వేద పండితుల సమక్షంలో యాగానికి అంకురార్పణ చేపట్టారు. యాగశాలలో శ్రీదేవీ, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామికి తిరుమంజం నిర్వహించి, ఆకల్పాంత హోమం, పంచగవ్య ప్రాశన, వాస్తు హోమం, దీక్షా ధారణ, కంకణ ధారణ పూర్తిచేశారు. సాయంత్రం అంబటిపూడి రాధాకృష్ణేశ్వర్ ‘భారత విశ్వ గురుత్వము, సనాతన ధర్మం‘ పై ప్రవచనం అనంతరం వివిధ రకాల పూజలు చేశారు. అశోకరాజు మాట్లాడుతూ మంగళవారం నుంచి 23వ తేదీ వరకు హోమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. లోక కళ్యాణానికి, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షల మేరకు భారత్ ‘విశ్వగురు’గా నిలవాలనే సంకల్పంతో ఈ యాగాన్ని తలపెట్టినట్లు తెలిపారు. ఆధ్యాత్మిక క్రతువులో అందరూ పాల్గొని దైవానుగ్రహం పొందాలని ఆయన కోరారు. -
తూకమేస్తున్నారు!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: పేదలకు పంపిణీ చేసే బియ్యం మధ్యలోనే సగం మాయం అవుతోంది. స్టాక్ పాయింట్ల నుంచి రేషన్ డీలర్‌కు చేరవేసే మసయంలో భారీ తేడాలు వస్తున్నాయి. ప్రతి నెలా వచ్చే ఈ తేడాల కారణంగా అనేక మంది డీలర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. మధ్యలో ఉన్న వారు మాత్రం బియ్యాన్ని నొక్కేసి బ్లాక్ మార్కెట్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని డీలర్లు ఆరోపిస్తున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మండల స్థాయి రేషన్ స్టాక్ పాయింట్లు అవకతవకలకు అడ్డాలుగా మారాయి. గోదాముల నుంచి వచ్చే బియ్యాన్ని కాటా వేయకుండానే నేరుగా ఎఫ్పీ (రేషన్) షాపులకు తరలిస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తూకం లేదు .. కొలత లేదు స్టేజ్–1 గోదాముల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు వచ్చే బియ్యం లోడులను నిబంధనల ప్రకారం కాటా వేసి గోదాముల్లో దించాల్సి ఉంది. అయితే అవేవీ పట్టించుకోకుండా అసలు తూకమే వేయకుండా అన్న్లోడ్ చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా స్టేజ్–1 లారీల నుంచి నేరుగా ఎఫ్పీ షాపులకు వెళ్లే లారీల్లోకి బస్తాల ను మార్చేసి పంపించేస్తున్నారు. ఈ దందా వల్ల ప్రతి బస్తాకు 2 నుంచి 3 కిలోల వరకు బియ్యం తక్కువ వస్తోందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలపైనే తరుగు భారం! ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి తక్కువ తూకంతో బియ్యం వస్తుండడంతో ఎఫ్పీ షాపు డీలర్లు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. చివరకు డీలర్లు కూడా కార్డుదారులకు ఇచ్చే కోటాలో కోతలు విధించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. అంతిమంగా ఈ తూకాల తరుగు భారం మొత్తం పేద ప్రజల మీదే పడుతోంది. కార్డుదారులకు పూర్తి కోటా అందకపోవడంతో రేషన్ దుకాణాల వద్ద నిత్యం వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. రేషన్ షాపులకు బియ్యం సరఫరాలో తేడాలు ఇలా చేయకపోతే మామూళ్లు ఎవరిస్తారు?ఈ తూకాల లోపాలపై రేషన్ డీలర్లు ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్‌చార్జ్‌లను నిలదీస్తే.. వారు ‘మా పైవాళ్లకు నెల నెలా మామూళ్లు ఎవరు ఇవ్వాలి?.. మా జేబులో నుంచి ఇవ్వాలా?’ అంటూ డీలర్లపై కేకలు వేస్తున్నట్లు తెలిసింది. పై వాళ్లకు మామూళ్లు కావాలంటే.. బస్తాల్లో రెండు, మూడు కిలోలు తీసేస్తేనే కాదా? ఇవ్వగలం. కాబట్టి మేము ఇలాగే ఇస్తాం, మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి’ అంటూ దబాయిస్తున్నట్లు డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు జిల్లా ఉన్నతాధికారుల అండదండలతోనే తూకాల్లో భారీ మోసం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. తక్షణమే ఉన్నతాధికారులు, విజిలెన్స్ విభాగం స్పందించి ఎంఎల్ఎస్ పాయింట్లలో వేబ్రిడ్జి తూకం వేయాలని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. -
ఆరోగ్యశ్రీ నిధులు గోల్మాల్
సాక్షి, టాస్క్‌ఫోర్స్: శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో భారీ అవినీతి కుంభకోణం బయటపడింది. ఆరోగ్యశ్రీ, ఏపీవీపీ నిధులను ఇద్దరు ఉద్యోగులు స్వాహా చేసినట్టు తేలింది. ప్రాథమిక విచారణలో స్వాహా సొమ్ము రూ.25 లక్షలుగా తేలిందని, మరింత లోతుగా విచారణ చేస్తే రూ.కోటి వరకు అవినీతి బయటపడవచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆ మేరకు అవినీతికి పాల్పడ్డ ఇద్దరు ఉద్యోగులపై మంగళవారం టూ టౌన్ పోలీసులకు ఆస్పత్రి సూపరింటెండెంట్ మురళి ఫిర్యాదు చేశారు. వివరాలు.. ఆస్పత్రి పరిపాలనా సౌలభ్యంలో భాగంగా ఆర్థిక లావాదేవీల పనులను ఎల్డీసీగా ఉన్న లక్ష్మీప్రసన్న, పోస్టుమార్టం అసిస్టెంట్‌గా ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చందుకు యాజమాన్యం అప్పగించింది. ఈ క్రమంలో లక్ష్మీప్రసన్న ప్రస్తుతం మెటర్నిటీ సెలవులో ఉండగా చెక్కుల డ్రా చేసే పనిని చందూకు అప్పగించారు. ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ నిధుల్లో గోల్మాల్ జరిగినట్టు బయటకు పొక్కడంతో సంబంధిత అధికారులకు అనుమానం వచ్చి విచారణ చేపట్టారు. ఇందులో ప్రాథమికంగా రూ.25 లక్షలు స్వాహా చేసినట్టు తేలింది. ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా ఆ స్థాయిలో నిధులు స్వాహా చేసి ఉంటారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి చైర్మన్‌గా, ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరు నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది. కూటమి నేతలు సభ్యులుగా ఉన్న ప్రభుత్వాస్పత్రిలో ఇంత పెద్ద మొత్తంలో నిధులు గోల్మాల్ కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
వైభవంగా కల్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు
ధ్వజారోహణంతో ముక్కోటి దేవతలకు ఆహ్వానం తిరుపతి రూరల్: తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం సాయంత్రం ఆగమోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్టించారు. అంతకుముందు భేరిపూజ, భేరితాడనం, ధ్వజపటం, నవసంధి, మాడవీధి ఉత్సవం, ఆస్థానం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద శేషునిపై పరమాత్ముడు బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు రాత్రి పెద్ద శేష వాహన సేవ కన్నులపండువగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారు ఏడుతలల పెద్దశేష వాహనంపై పరమపదనాథుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7.30 నుంచి 9.30 గంటల వరకు జరిగిన వాహన సేవకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి పాల్గొన్నారు. కంకణ ధారణ శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలనే సంకల్పంతో ఆలయ వ్యవస్థాపకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మి దంపతులు కంకణధారణ చేసుకున్నారు. ధ్వజారోహణం సందర్భంగా కంకణం కట్టుకుని దీక్ష చేపట్టారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలకు సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. అనంతరం విశ్వక్సేనులవారు తుమ్మలగుంట గ్రామంలో విహరిస్తూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పట్టువస్త్రాలు సమర్పణ తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి పెద్ద శేష వాహన సేవకు పాకాల మండలం దామలచెరువు, ఉప్పరపల్లి, పెద్ద రామాపురం, కొత్త వడ్డేపల్లి, మొగరాల, రమణయ్యగారిపల్లి, గానుగపెంట, ఇ.పాలగుట్టపల్లి, వల్లివేడు, పేరసానిపల్లి, మద్దినాయునిపల్లి, పదిపుట్లబైలు గ్రామాలకు చెందిన భక్తులు పట్టువస్త్రాలు తీసుకువచ్చి సమర్పించారు. సారె తెచ్చిన భక్తులకు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఎదురేగి స్వాగతం పలికారు. -
మెడి‘కల’ నెరవేరె
మాట్లాడుతున్న ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు తిరుపతి తుడా: ఎస్వీ వైద్య కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి నీట్ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు తరగతులు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాని ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు తెలిపారు. ఈ మేరకు కళాశాలలో ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమానికి ఆయన హాజరై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. నీట్ ఆదేశాల మేరకు నూతన ఎంబీబీఎస్ వైద్య విద్యార్థులకు అవగాహన, ఓరింటేషన్ తరగతులు 15 రోజులు పాటు నిర్వహించనున్నట్టు తెలిపారు. కళాశాలలో ఎంబీబీఎస్ వైద్య విద్యతో పాటు, పరిశోధనలకు పెద్దపీట వేస్తామన్నారు. ఎస్వీ వైద్య కళాశాల ఆల్ ఇండియా ర్యాంకింగ్‌లో 69వ స్థానం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5వ స్థానం ఎస్వీ వైద్య కళాశాలకు ఇవ్వడం గర్వకారణమన్నారు. -
నేడు వెంకటగిరి పోలేరమ్మ జాతర చాటింపు
సైదాపురం/వెంకటగిరి రూరల్: వెంకటగిరి శక్తిస్వరూపిణి శ్రీ పోలేరమ్మ తల్లి జాతరకు ఏట్లు పూర్తయ్యాయి. నేడు జాతర చాటింపుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలిరానున్నారు. బుధవారం వెంకటగిరి రాజాల నుంచి తాంబులాలు పుచ్చుకొని రాజర నిర్వహణకు అనుమతి తీసుకొని జాతరకు సంబంఽధించి తొలి చాటింపు వేయనున్నారు. 23 రెండో చాటింపు, 27 ఘటోత్సవం, 30 అమ్మవారి నిలుపు, అక్టోబర్ 1న అమ్మవారి సాగనంపు జరగనుంది. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తాంబూలం స్వీకరణ నేడు ప్రతి ఏటా వెంకటగిరిలో జరగనున్న పోలేరమ్మతల్లి జాతరకు సంబంఽధించి వెంకటగిరి రాజా కుటుంబీకుల వద్ద నుంచి అమ్మవారి సేవకులు, రెడ్డి పెత్తందారలకు రాజా ప్యాలెస్‌లోని బొడ్డిచావిడి వద్ద దేవదాయశాఖ అధికారుల సమక్షంలో జాతర నిర్వహణకు తాంబూలం స్వీకరించనున్నారు. అనంతరం జాతరకు సంబంధించి మొదటి చాటింపు అదేరోజు అర్ధరాత్రి వేస్తారు. దీంతో వెంకటగిరిలో అమ్మవారి జాతర ప్రారంభమవుతుంది. -
బైక్‌ను ఢీకొన్న కారు
– వృద్ధుడి మృతి నాయుడుపేటటౌన్: మండల పరిధిలోని మేనకూరు సెజ్ వద్ద లాయల్ పరిశ్రమ సమీపంలో రహదారిపై సోమవారం సాయంత్రం బైక్‌ను కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓజిలి మండలం, మానవాలి గ్రామానికి చెందిన ముసులూరు గోపాలయ్య(65) మృతిచెందాడు. పోలీసుల కథనం.. మానవాలి గ్రామానికి చెందిన గోపాలయ్య బైక్‌పై మేనకూరు గ్రామానికి వస్తున్నారు. మార్గమధ్యంలో రాయల్ టైక్స్టైెల్స్ పరిశ్రమ సమీపంలో రహదారి వద్దకు వచ్చే సరికి వెనుక నుంచి వస్తున్న కారు వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో గోపాలయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ శివశంకర్ తెలిపారు. పోక్సో కేసుపై విచారణ నాయుడుపేట టౌన్: పోక్సో కేసుపై నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు విచారణ చేపట్టారు. మండల పరిధిలోని మేనకూరు గ్రామానికి చెందిన కందాటి రజనీపై ఇటీవల పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన ప్రదేశం, తదితర ప్రదేశాలను డీఎస్పీ ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించారు. డీఎస్పీతో పాటు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శివశంకర్ ఉన్నారు. -
శ్రీవారి దర్శనానికి 4 గంటలు
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. సోమ వారం అర్ధరాత్రి వరకు 88,210 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,192 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.23 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తు లకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడాని కి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవే శ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 1 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. నేటి నుంచి వీఆర్ఏల సహాయ నిరాకరణ రామచంద్రాపురం: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు సహాయ నిరాకరణ చేపట్టనున్నట్టు వీఆర్ఏల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని, తెలంగాణ తరహాలో పే స్కేల్ అమలు చేయాలని కోరుతూ మంగళవారం స్థానిక తహసీల్దార్ మధుసూదన్‌రావుకు వినతి పత్రం అందజేశారు. వీఆర్ఏల అధ్యక్షుడు మాట్లాడుతూ ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం తమ డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించే వరకు రాష్ట్ర వ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపడుతామని ఆయన స్పష్టం చేశారు. తుది విడతపైనే ఆశలు – నేడు చివరి విడత ఇంజినీరింగ్ ప్రవేశాల మెరిట్ లిస్ట్ విడుదల తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, డీమ్డ్, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల్లో పలు బీటెక్ కోర్సుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి సాంకేతిక విద్యాశాఖ మూడవ, తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి మెరిట్ లిస్ట్‌ను బుధవారం విడుదల చేయనుంది. చివరి విడతలో కన్వీనర్ కోటా సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో ఈనెల 19వ తేదీలోపు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. కాగా ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసినా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రవేశాలు లేకపోవడంతో మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రయివేటు కళాశాలల పరిస్థితి దారుణం జిల్లాలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల్లో మాత్రం ప్రవేశాలు 85 శాతం పైగా సీట్లు భర్తీ కాగా మిగిలిన ప్రైవేటు కళాశాల పరిస్థితి దారుణంగా ఉంది. జిల్లాలో రెండు విడతల్లో కన్వీనర్ కోటా కింద రెండు డీమ్డ్ వర్సిటీలలో 80 శాతం సీట్లు, ఐదు అటానమస్ కళాశాలల్లో 75 శాతం ప్రవేశాలు జరిగినట్లు సమాచారం. కాగా జిల్లాలోని 11 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇప్పటి వరకు పలు బీటెక్ కోర్సుల్లో 60 శాతం సీట్లు కూడా భర్తీ కాలేదని యాజమాన్యాలు వాపోతున్నాయి. కన్వీనర్ కోటా మూడో విడతపైనే ఆశలన్నీ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తుదివిడత అనంతరం జరిగే స్పాట్ అడ్మిషన్లకు సైతం ఈ ఏడాది అంతగా స్పందన ఉండకపోవచ్చని అధ్యాపకులు అంచనా వేస్తున్నారు. భక్తుల సురక్షిత ప్రయాణమే లక్ష్యం తిరుపతి మంగళం : భక్తుల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా డ్రైవర్లు వాహనాలు నడపాలని జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ ఆదేశించారు. మంగళవారం తిరుపతి జిల్లా రవాణా, పోలీస్ శాఖలు సమన్వయంతో ప్రత్యేక రహదారి భద్రతా చర్యలు చేపట్టారు. గత పది రోజులుగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వస్తున్న 61 కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులను మోటార్ వెహికల్ ఇన్‌న్‌స్పెక్టర్లు తనిఖీలు నిర్వహించారు. పర్మిట్ లేకుండా ఉన్న మూడు వాహనాలు, వాణిజ్యపరమైన సరుకు తీసుకెళ్తున్న 18 వాహనాలు, అధిక చార్జీలు వసూలు చేస్తున్న 4 వాహనాలు, అలాగే మోటార్ వాహన నిబంధనలను ఉల్లంఘించిన మరో 36 వాహనాలపై కేసులు నమోదు చేసి మొత్తం రూ.6 లక్షల అపరాధ రుసుము వసూలు చేసినట్లు జిల్లా రవాణాశాఖాధికారి తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుపతి జిల్లా పరిధిలోని అన్ని చోట్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు విస్తృత తనిఖీలు చేపడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. -
బస్సు ఇంజిన్‌లో చెలరేగిన మంటలు
నాయుడుపేట టౌన్: మండల పరిధిలోని పుదూరు గ్రామ సమీపంలో గోశాల వద్ద ఆర్టీసీ బస్సు ఇంజిన్‌లో నుంచి చిన్నపాటిగా పొగలు చెలరేగాయి. దీంతో బస్సు డ్రైవర్ పి.మురుగన్ చాకచక్యంగా బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందికి దించివేసి అప్రమత్తం చేశారు. వివరాలు.. వాకాడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శనివారం సాయంత్రం నాయుడుపేట నుంచి ప్రయాణికులను తీసుకుని మల్లాంకు బయలుదేరింది. ఈ బస్సులో 73 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. బస్సు పుదూరు గ్రామం దాటిన తర్వాత ఇంజిన్‌లో నుంచి చిన్నపాటి పొగ, మంటలు రావడంతో డైవర్ అప్రమత్తమయ్యారు. బస్సు ఇంజిన్ వద్ద వైర్ల రాపిడి వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని డ్రైవర్ తెలిపారు. ఈ విషయమై డ్రైవర్‌తో పాటు కండెక్టర్ కె.కోటయ్య వాకాడు డిపో మేనేజర్‌కు సమాచారం అందించడంతో ఆయన వెంటనే స్పందించి మెకానిక్‌ను పంపించారు. అయితే అరగంట తర్వాత బస్సును స్టార్ట్ చేయడంతో స్టార్ అయ్యిందని, మంటలు రాలేదని కండెక్టర్ వెల్లడించారు. -
లోక్ అదాలత్‌లో 3,442 కేసుల పరిష్కారం
తిరుపతి లీగల్: తిరుపతి కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్‌అదాలత్‌లో 3,442 కేసులు పరిష్కారమైనట్టు తిరుపతి మూడవ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ ఎం.గురునాథ్ మీడియాకు తెలిపారు. పరిష్కారమైన కేసుల్లో కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 249 కేసులు, వ్యాజ్యం వేయని బ్యాంకు, బీఎస్ఎన్ఎల్కు సంబంధించిన 22 కేసులు, మొదటి ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టుకు సంబంధించి జరిమానా చెల్లించే 1,395 కేసులు, రెండవ ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టుకు సంబంధించిన జరిమానా చెల్లించే 1,776 కేసులు ఉన్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. కేసుల పరిష్కారం కోసం ఐదు బెంచులను ఏర్పాటు చేసినట్టు న్యాయమూర్తి తెలిపారు. తనతోపాటు ఆ బెంచ్‌లకు అధ్యక్షులుగా తిరుపతి నాల్గవ అదనపు జిల్లా జడ్జి అర్చన, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వెన్నెల, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ లెనిన్ బాబు, మొదటి జూనియర్ సివిల్ జడ్జి రమాదేవి వ్యవహరించారన్నారు. ‘ఆర్ఐఎంసీ’కి 30 వరకే గడువు తిరుపతి అర్బన్: రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (ఆర్ఐఎంసీ) 2027 విద్యా సంవత్సరంలో 8వ తరగతి ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష దరఖాస్తుకు ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఉందని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యాక్షులు, విశ్వం విద్యాసంస్థల అధినేత విశ్వనాథ్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 6న పరీక్ష ఉంటుందని చెప్పారు. ఈ పరీక్షకు 2013 జూలై 2 నుంచి 2015 జనవరి 1 మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. పరీక్షకు మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ ప్రధాన అంశాలుగా ఉంటాయని వివరించారు. అదనపు సమాచారం కోసం 8688888802, 9399976999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
కిక్కు.. తమ్ముళ్లకే లక్కు!
తిరుపతి అర్బన్: మళ్లీ మద్యం దుకాణాలను తమ్ముళ్లకే కట్టబెట్టేశారు. టెండర్లు పిలవకుండా, లక్కీ డిప్‌నకు ఛాన్స్ లేకుండా, ఽలైసెన్స్ ధరలు పెంచకుండా తమ్ముళ్లకే అప్పగించేశారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాల లైసెన్స్‌ను ఈ నెల 12 నుంచి 21వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు పునరుద్ధరణ చేసుకోవాలని తిరుపతి, చిత్తూరు జిల్లాల ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ వెల్లడించారు. శనివారం ఆయన కలెక్టరేట్లోని ఎకై ్సజ్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో 233 మద్యం దుకాణాలు ఓపెన్ కేటగిరిలోను, 22 దుకాణాలు గీత కులాల వారి పరిధిలో నడుస్తున్నాయని చెప్పారు. ఈ నెల 30వ తేదీకి లైసెన్స్ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ నెల 12 నుంచి 21వ తేదీ వరకు ఆప్లైన్ లేదా ఆన్లైన్ ద్వారా తమ లైసెన్స్‌ను 2026–27కి సంబంధించి రెన్యూవల్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. రెన్యూవల్ చేసుకోకుంటే వాటిని ఖాళీలుగా చూపించి కొత్తగా టెండర్లు ఆహ్వానించడం జరుగుతుందని స్పష్టం చేశారు. లైసెన్స్ మొత్తాన్ని నాలుగు దశల్లో చెల్లించే సౌకర్యం కల్పించామని వెల్లడించారు. 2026–27కు సంబంధించి వార్షిక రిటైల్స్ ఎకై ్సజ్ పన్నులో ఎలాంటి మార్పులు చేయకుండా గతంలో ఉన్న ధరలే నిర్ణయించినట్లు చెప్పారు. -
తుమ్మలగుంటలో.. విభూది వినాయకుడు
తిరుపతి రూరల్: విభూది పరిమళం.. మంచు కొండల నడుమ గణనాథుడి దివ్యరూపం.. భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా తుమ్మలగుంటలో ఈ ఏడాది విభూది వినాయకుడు కొలువు దీరనున్నాడు. ప్రముఖ శైవక్షేత్రాల నుంచి సేకరించిన పవిత్ర విభూదిని వినాయకుని ప్రతిమ తయారీకి వినియోగిస్తున్నారు. అత్యద్భుతంగా రూపుదిద్దుకునే విభూది వినాయకున్ని చూసేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత 15 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్ చెవిరెడ్డి కుటుంబీకుల సహకారంతో బాల వినాయక కమిటీ సభ్యులు విభిన్న ఆకృతులతో గణపతి ప్రతిమలను తయారు చేయించి భక్తులకు కనువిందు కలిగించడం ఆనవాయితీగా వస్తోంది. వినాయక చవితి నుంచి 9 రోజుల పాటు ప్రత్యేకంగా పూజలు చేస్తూ గణేశుని దర్శనభాగ్యం కలిగిస్తున్నారు. అంతేగాక ఆ వినాయకుని ప్రతిమ తయారీలో ఎలాంటి రసాయనాలకు తావులేకుండా మట్టి, గడ్డి, చెక్కను మాత్రమే వినియోగిస్తున్నారు. తుమ్మలగుంటలో వరుసగా ఐదేళ్లు పాటు ఏర్పాటు చేసిన వినాయకుని ప్రతిమల జాబితాను పరిశీలిస్తే పైనాపిల్ వినాయకుడు, నారికేళ వినాయకుడు, తమలపాకు వినాయకుడు, నెమలి పింఛ వినాయకుడు, తుంబుర వినాయకుని ప్రతిమలను భక్తులు దర్శించారు. అదే సమయంలో ఈ ఏడాది విభూది వినాయకుని ప్రతిమను తయారు చేయించి చవితి రోజున భక్తులకు దర్శనభాగ్యం కలిగించనున్నారు. కల్యాణ మండపంలో కొలువు ఈ ఏడాది వినాయక చవితి పర్వదినం రోజునే తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం కానున్నాయి. దీంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విభూది వినాయకుడిని ఆలయంలోని కల్యాణ మండపంలో ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. 7 టన్నుల విభూదితో.. ప్రముఖ శైవక్షేత్రాల నుంచి సేకరించిన సుమారు 7 టన్నుల విభూదిని ఉపయోగించి 11 అడుగుల ఎత్తు, 7 అడుగుల వెడల్పుతో విభూది వినాయకుడి ప్రతిమను రూపొందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన 16 మంది కళాకారులు వారం రోజులుగా విగ్రహ తయారీలో నిమగ్నమయ్యారు. మంచుకొండల మధ్య విభూది వినాయకుడు కొలువుదీరినట్టుగా ప్రతిమను తీర్చిదిద్దుతున్నారు. విగ్రహం తయారీ పనులను బాల వినాయక కమిటీ సభ్యులు దగ్గరుండి పర్యవేక్షిస్తుండగా చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. -
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 72,408 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,691 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.39 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. 21 నుంచి వస్త్రాల ఈ–వేలం తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు ఈ – వేలం వేయనున్నారు. కొత్తవి ఆర్ట్ సిల్క్ శారీస్ 132 లాట్లు ఉన్నాయి. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయం (వేలములు) 0877–2264429 నంబరులో గానీ, టీటీడీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆదాయ పన్ను చెల్లించండి తిరుపతి అర్బన్: ముందస్తు ఆదాయ పన్ను చెల్లించడం ద్వారా పలు ప్రయోజనాలు ఉన్నాయని ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ లోకేష్, తిరుపతి ఆదాయపు పన్ను అధికారి వసంతలక్ష్మి తెలిపా రు. శనివారం తిరుపతిలో చాంబర్ ఆప్ కామర్స్ ఆధ్వర్యంలో నగరంలోని వ్యాపారులకు ఆదాయ పన్ను చెల్లింపుపై అవగాహన కల్పించారు. ఈ నెల 15న రెండవ కంతు కట్టుకునే అవకాశం ఉందని వివరించారు. వ్యాపారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 14న పీజీఆర్ఎస్ రద్దు తిరుపతి అర్బన్: జిల్లా కలెక్టరేట్‌తోపాటు మండల, డివిజన్ కేంద్రాల్లో ఈనెల 14 సోమవారం నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ను వినాయకచవితి పండుగ నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అంశాన్ని గుర్తించాలని సూచించారు. నీళ్ల సీసాలపై ఆరోగ్యశాఖ కొరడా తిరుమల : తిరుమలలో తాగునీటి గ్లాస్ వాటర్ బాటిళ్లను సరఫరా చేసే కంపెనీలపై ఆరోగ్యశాఖ కొరడా ఝుళిపించింది. తిరుమలకు వాటర్ బాటిళ్లు సరఫరా చేస్తున్న నాలుగు కంపెనీలకు సంబంధించిన వాటర్ బాటిళ్లను ఆరోగ్యశాఖ అధికారులు ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్‌లో తనిఖీలు చేపట్టారు. సదరు వాటర్ బాటిళ్లలోని నీటిలో ఎఫ్ఎస్ఎస్సీఐ ప్రమాణాలకు తగిన విధంగా మినరల్స్ అందుబాటులో లేవని తేలింది. అదేవిధంగా సరైన నాణ్యత లేకపోవడంతో వాటిని తిరుమలకు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేసినట్లు టీటీడీ ఆరోగ్యశాఖ డిప్యూటీవో సోమన్నారాయణ తెలిపారు. తిరిగి తగిన ప్రమాణాలను ల్యాబ్ నివేదికలో నిరూపించుకున్న కంపెనీలకు అనుమతిస్తామని తెలిపారు. -
4.6 కిలోల గంజాయితో మహిళ అరెస్ట్
– గతంలోనూ దొంగతనాలు, గంజాయి కేసుల్లో నిందితురాలు తిరుపతి: గంజాయిని తరలిస్తున్న ఓ మహిళను ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి 4.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీకాం కళాశాల సమీపంలో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడ నిఘా పెట్టి గంజాయితో పట్టుబడిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా, మంగసముద్రానికి చెందిన లక్ష్మీదేవి గంజాయి తరలిస్తూ పట్టుబడింది. ఆమైపె గతంలోనూ పలు దొంగతనాలు, గంజాయి కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఆయా కేసుల్లో అరైస్టె జైలు జీవితం గడిపినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితురాలిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్వీ యూనివర్సిటీ సీఐ నరేష్ తెలిపారు. లారీ అదుపు తప్పి వ్యక్తి మృతి ఓబులవారిపల్లె : చిన్నఓరంపాడు–ముక్కావారిపల్లి జాతీయ రహదారిపై శనివారం లారీ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ బీ.మురళి (50) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ సుజున్కుమార్ కథనం మేరకు.. తాడిపత్రికి చెందిన లారీ డ్రైవర్ మురళి లోడ్డుతో చైన్నెకి బయల్దేరాడు. మార్గమధ్యంలోని చిన్న ఓరంపాడు వద్ద రోడ్డు మరమ్మతుల కారణంగా లారీ కల్వర్టు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. విషయాన్ని గమనించిన డ్రైవర్ మురళి కుడివైపునకు దూకగా లారీ అతనిపైకే వెళ్లి పడింది. దీంతో మురళి అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు దర్యాప్తులో ఉంది. వృద్ధురాలిపై దాడి చేసి.. బంగారు నగలు అపహరించి.. నాగలాపురం: పట్టపగలే గుర్తుతెలియని మహిళ ఓ వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి దాడి చేసి, బంగారు ఆభరణాలు అపహరించుకెళ్లిన ఘటన శనివారం మధ్యాహ్నం నాగలాపురం బజారు వీధిలో చోటుచేసుకుంది. బాధితురాలు ఉష (72) తెలపిన వివరాల ప్రకారం.. ఓ గుర్తుతెలియని మహిళ శనివారం ఉదయం నుంచి ఇంటికి ఎదురుగా ఉన్న కాయగూరల దుకాణం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించింది. మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయంలో ఉష ఇంట్లోకి వెళ్లిన వెంటనే ఆ మహిళ చొరబడి ఆమైపె దాడి చేసి మెడలో ఉన్న మూడు సవరల బంగారు చైను, చెవి కమ్మలు అపహరించుకొని పరారైంది. ఉష ఇంటి నుంచి బయటకు వచ్చి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సునీల్ తెలిపారు. ఫ్రీ మెడికల్ చెకప్ పేరుతో చంపేశారు! – ప్రెస్‌క్లబ్‌లో కుటుంబ సభ్యుల ఆరోపణ తిరుపతి అన్నమయ్యసర్కిల్: ఫ్రి మెడికల్ చెకప్ పేరుతో రేణిగుంట బాలాజీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ అండ్ రీసెర్స్ ఇన్స్టిట్యూట్ వారు తీసుకెళ్లి తమ తండ్రి ఆర్.గోవిందస్వామి (72)ని చంపేశారని కేవీబీపురం మండలం, రాజులకండ్రిగ గ్రామానికి చెందిన కుమారుడు గిరి, కుటుంబ సభ్యులు ఆరోపించారు. శనివారం సాయంత్రం వారు తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. గత నెల ఆగస్టు 10వ తేదీన రాజులకండ్రిగకు వచ్చిన హాస్పిటల్ సిబ్బంది ఉచిత వైద్య పరీక్షల పేరుతో ఆరోగ్యంగా ఉన్న తమ తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లారని చెప్పారు. ఆపై 13వ తేదీన మీ తండ్రి చనిపోయాడని కబురు వచ్చినట్టు పేర్కొన్నారు. మరణ ధ్రువీకరణ పత్రంలోనూ వేర్వేరు సమయాలు ఉండడం అనుమానాలకు తావిస్తోందన్నారు. తమ తండ్రి మృతిపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
నైలెట్పై సందిగ్ధం
●తిరుపతి సిటీ: తిరుపతి నుంచి నైలెట్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్‌ను అమరావతికి తరలిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఎస్వీయూ వద్ద జెన్‌జెడ్ భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీలకతీతంగా యువత, స్థానికులు, విద్యార్థి, యుజవన సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. దీంతో ప్రభుత్వం తర్జన భర్జనలో పడింది. ఆగమేఘాల మీద నైలెట్ తాత్కాలిక క్యాంపస్ డైరెక్టర్‌తో ప్రెస్‌మీట్ పెట్టించి వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. అబ్బే...అదేం లేదు! తిరుపతి నైలిట్ కేంద్రం తరలింపు అపోహ మాత్రమేనని.. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్వీయూలోని నైలెట్ కార్యాలయ డైరెక్టర్ శశికుమార్ తెలిపారు. శనివారం ఆయన ఎస్వీయూలోని నైలెట్ క్యాంపస్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నైలెట్ శాశ్వత క్యాంపస్ కోసం స్థలం కేటాయించాలని విన్నవించామని, కుర్రకాలువ వద్ద ఉన్న స్థలం చూపించారని తెలిపారు. ఆ స్థలం పరిశీలించామని తిరుపతికి రిమోట్ ఏరియాలో ఉందని నైలెట్‌కు అంత అనువుగా లేదని తెలిపారు. ఎస్వీయూ పరిసరాలలో 5 ఎకరాలు స్థలం కేటాయించాలని విన్నవించామని, ప్రస్తుతం ఆ దిశగా అధికారులు పరిశీలిస్తున్నారని చెప్పారు. నైలిట్కు కేంద్రం 2024 జనవరి 4న ఆమోదం లభించిందని, నిర్వహణ బాధ్యతలను నైలిట్ చైన్నె విభాగానికి అప్పగించారన్నారు. తాత్కాలికంగా 8 వేల చ.అ.వి పదేళ్ల అగ్రిమెంట్‌తో కేంద్రం కార్యకలాపాలు ప్రారంభించిందని, మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.850.09 లక్షలు కాగా, ఇందులో మైటీ వాటా రూ.693.25 లక్షలని తెలిపారు. ఇప్పటివరకు విద్యార్థులు, నిరుద్యోగులు, అధ్యాపకులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు, పోలీసులు అధికారులకు సుమారు 4,300 మందికి పైగా వివిధ సాంకేతిక శిక్షణ కార్యక్రమాలు అందించారన్నారు. త్వరలో ఇండియా ఏఐ ల్యాబ్‌ను సైతం నైలెట్‌లో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. స్పష్టత ఏదీ? తిరుపతి ప్రజలను, రాయలసీమ యువతను మభ్యపెట్టే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోంది. నైలెట్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ తిరుపతిలోనే ఏర్పాటు చేస్తున్నట్లు గతంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ దిశగా తిరుపతిలో నైలెట్ ఏర్పాటుకు స్థలం కేటాయించకుండా బుకాయింపు మాటలు చెప్పడం దారుణం. అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీ అంటూ నైలెట్ డీమ్డ్ వర్సిటీకి సీఆర్డీఏ నుంచి 8 ఎకరాలు స్థలం కేటాయించినట్లు మంత్రి స్పష్టం చేయడం వెనుక ఆంతర్యమేమిటి. తిరుపతిలో నైలెట్ డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వకుండా దాటవేత ధోరణిని ప్రదర్శించడంతోనే ప్రభుత్వ వైఖరి స్పష్టమవుతోంది. – ఎం.గురుమూర్తి, ఎంపీ, తిరుపతి -
కన్నీరే మిగిలిందిక నేస్తం!
కలిసిరాని నిమ్మ సైదాపురం: ఎల్‌నినో ప్రభావం నిమ్మ రైతులను తీవ్ర నష్టాల్లో ముంచేసింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా సైదాపురం మండలంలో నిమ్మచెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. నిమ్మ రైతులు భగీరథయత్నాలు చేసినా ప్రయోజనం లేదు. చినకు కోసం పరితపించినా చివరకు కన్నీరే మిగులుతోంది. పసిబిడ్డలా పెంచిన చెట్లు తమకళ్లెదుటే నిలు వునా వాడిపోతుండడంతో కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తోంది. కండలేరు జలాయశం కూడా అడుగంటడంతో చెరువులు సైతం ఎండిపోతున్నాయి. ధరలు బాగు.. వర్షాలు జాగు సైదాపురం, డక్కిలి, బాలాయపల్లి, రాపూరు, వెంకటగిరి, కలువాయి మండలాల్లో సుమారు 25వేల హెక్టార్లులో నిమ్మ తోటలు సాగు చేస్తున్నారు. గడిచిన మూడేళ్లుగా అతివృష్టి, అనావృష్టి కారణంగా నిమ్మతోటల రైతులకు కష్టాలే మిగులుతున్నాయి. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. వేలకు వేలు ఖర్చుపెట్టి బోర్లు వేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. బస్తా రూ.25 వేల వరకు పలికినా ఫలితం లేదు. కాలం కలిసిరాక.. చెట్లకు కాయల్లేక దిగాలు చెందాల్సి వస్తోంది. ఈ ఫొటోలో ఉన్న రైతు పేరు ఆవుల జయరామయ్య. ఊరు సైదాపురం. ఆయన గత 15 ఏళ్లుగా నిమ్మతోటలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం నిమ్మ ఽకాయల ధరలు ఆకాశాన్ని అంటగా.. చెట్లకు కాయలు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాభావం కారణంగా తమ కళ్లెదుటే చెట్లకు సాగు నీరందక ఎండిపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. మూడు బోర్లు వేసినా చుక్క నీరు రాక అప్పుల్లో కూరుకుపోయాడు. గత కొద్ది రోజుల నుంచి కాస్తున్న ఎండలకు చెట్ల ఆకులు సైతం ఎండిపోయి రాలిపోవడంతో చూస్తూ కుమిలిపోతున్నాడు. -
ప్రభుత్వ లాగిన్‌తో ‘పచ్చ’ రాజకీయం!
తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం, మల్లంగుంట గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌కు సంబంధించిన ప్రభుత్వ లాగిన్న్ను టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి వినియోగించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. రెండో శనివారం సెలవు రోజున సచివాలయంలో ఉద్యోగులు లేకపోయినా.. ఓ వ్యక్తి డిజిటల్ అసిస్టెంట్ సీటులో కూర్చొని పింఛన్లకు సంబంధించిన వివరాలను ప్రభుత్వ లాగిన్న్లో నమోదు చేస్తుండడాన్ని గ్రామస్తులు గుర్తించి నిలదీశారు. లాగిన్ ఉద్యోగిది.. పెత్తనం పార్టీదా? మల్లంగుంట సచివాలయంలో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్ పదోన్నతితో బదిలీ కాగా ఆమె స్థానంలో మహిళా పోలీసుకు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఆమె కూడా ప్రస్తుతం మెటర్నిటీ సెలవులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగికి చెందిన లాగినన్ ఓ టీడీపీ కార్యకర్త చేతిలోకి ఎలా వెళ్లిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ లాగిన్‌తో ఎవరెవరి పింఛన్ల వివరాలు నమోదు చేశారు? ఎంత మంది దరఖాస్తులు స్వీకరించారు? వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుల పింఛన్లు తొలగించారా..? అనే అంశాలపై జిల్లా అధికారులు సమగ్రంగా పరిశీలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
పరిహారం ఆరగించి.. కబ్జాకు తెరలేపి!
రామచంద్రాపురం: కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని పరిహారంగా తీసుకుని మళ్లీ ఆ భూమి తనదేనంటూ ఓ వ్యక్తి ఆక్రమణకు తెరలేపిన ఘటన మండలంలో కలకలం రేపింది. కూటమి నేతల అండదండలతో సదరు రైతు కబ్జాకు పాల్పడడం విమర్శలకు తావిస్తోంది. వివరాలు.. మండలంలోని పీవీపురం పంచాయతీ, బలిజపల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.210, 211, 212లో ఎనిమిది ఎకరాల భూమిని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు అందించే లక్ష్యంతో ‘జగనన్న కాలనీ‘ కోసం సేకరించారు. సదరు భూమికి సంబంధించి యజమాని లోకనాథ్‌రెడ్డికి అప్పటి మార్కెట్ విలువ ప్రకారం కోటి రూపాయలకు పైగా చెల్లించారు. అయితే ఇప్పుడు అధికార పార్టీ అండదండలతో సదరు వ్యక్తి ఆ భూమి తనదేనంటూ శనివారం కబ్జాకు యత్నించాడు. తాను ప్రభుత్వానికి ఇచ్చినదే గాక అధనంగా మరో నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమతులు లేకుండానే విద్యుత్ లైన్ ఏర్పాటు ఎలాంటి అనుమతులు లేకుండానే కబ్జాదారుడు విద్యుత్ లైన్‌ను లాగేశాడు. అంతేకాకుండా, హడావుడిగా బోర్ మోటార్ బిగించి, జేసీబీల సాయంతో భూమిని చదును చేసేందుకు భారీ ప్లాన్ వేశాడు. తహసీల్దార్ వార్నింగ్ ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ మధుసూదన్‌రావు హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, జగనన్న కాలనీ కోసం కేటాయించిన భూమి జోలికి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. నేరుగా జైలుకే వెళ్తావంటూ గట్టిగా హెచ్చరించడంతో కబ్జాదారుడు వెనక్కితగ్గాడు. గతంలో జగనన్న కాలనీకి ఎనిమిది ఎకరాల సేకణ -
క్యాంపస్ డ్రైవ్‌లో ‘శ్రీరామ’ విద్యార్థుల ప్రతిభ
తిరుపతి సిటీ: కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం యత్వా ఎనర్జీ సొల్యూ షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్‌లో పలువురు విద్యార్థులు ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కళాశాల చైర్మన్ మన్నెం రామిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సాంకేతిక విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి, ప్లేస్మెంట్ శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. సక్రటరీ మన్నెం రామసుబ్బారెడ్డి, డైరెక్టర్ మన్నెం అరవిందుకుమార్ రెడ్డి, ప్రిన్సిపల్ జయచంద్ర, వైస్ ప్రిన్సిపల్ వాసు, ప్లేస్మెంట్ ఆఫీసర్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎండీ రవిమారుతి రెడ్డి పాల్గొన్నారు. -
చంద్రగిరి నుంచే టీడీపీ పతనం
చంద్రగిరి: చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి నుంచే టీడీపీ పతనం ఆరంభం కావాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక్క ఎన్నిక కూడా ఏకగ్రీవం కాకుండా ప్రతి పంచాయతీలో వైఎస్సార్సీపీ అభ్యర్థులను బరిలోకి దించి గెలిపించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. చంద్రగిరిలో అత్యధిక స్థానాలను కై వసం చేసుకుని ఆ విజయాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డికి కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. చంద్రగిరిలో శుక్రవారం జరిగిన వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు, కరువు కవల పిల్లలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పుట్టిన నారావారిపల్లిలోనే రైతులకు నీటి కష్టాలు తప్పడం లేదన్నారు. కల్యాణీ రిజర్వాయర్‌లో నీరు లేక ఎండిపోతోందని తెలిపారు. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కరువు విలయతాండవం చేస్తుందని విమర్శించారు. ఒక్కటి కూడా ఏకగ్రీవం కాకూడదు స్థానిక ఎన్నికల్లో ఎక్కడా ఏకగ్రీవం కాకూడదన్న లక్ష్యంతో ప్రతి పంచాయతీలో అభ్యర్థులను బరిలోకి దించాలని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చంద్రగిరి నుంచే టీడీపీ పతనం ప్రారంభమవుతుందనే విషయాన్ని ఈ ఎన్నికల ద్వారానే ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. అభ్యర్థులను గెలిపించే వరకు వెన్నంటే ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. సమన్వయ కమిటీలతో సమీక్షలు ప్రతి పంచాయతీలో ఎన్నికలు ముగిసే వరకు తరచూ సమీక్షలు నిర్వహించాలని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తుడా ద్వారా చంద్రగిరి నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను ప్రతి గడపకూ చేర్చాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి కుటుంబం చేసిన మంచి దేశంలో ఏ నియోజకవర్గంలో జరగలేదన్నారు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డితో పాటు ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మహిళలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. -
వినాయక మండపాలకు ఉచిత విద్యుత్
తిరుపతి రూరల్: వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్టు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే మండపాల్లో విద్యుత్ ప్రమాదాలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వినాయక మండపాలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 కిలోవాట్లు, పట్టణ ప్రాంతాల్లో 5 కిలోవాట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అత్యవసర సమాచారం కోసం 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. 14న స్విమ్స్ ఓపీ, ఓటీలకు సెలవు తిరుపతి తుడా: వినాయక చవితి పర్వదినం సందర్భంగా స్విమ్స్ ఓపీ, ఓటీ విభాగాలకు సెలవు ప్రకటించినట్టు డైరెక్టర్ డాక్టర్ జగదీష్ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర సేవలు యథాతథంగా కొనసాగుతాయన్నారు. -
శ్రీవారి దర్శనానికి 20 గంటలు
● రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం 6.94 తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 29 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. గురువారం అర్ధరాత్రి వరకు 69,771 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,888 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో రికార్టు స్థాయిలో హుండీలో రూ.6.94 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారికి 3 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. -
వైరాలజీ ప్రయోగశాలకు ఐఎస్ఓ గుర్తింపు
తిరుపతి సిటీ: ఎస్వీయూ వైరాలజీ విభాగం ప్రయోగశాలలకు ఐఎస్ఓ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా అక్రిడిటేషన్‌తో పాటు, విద్యాసేవలు, శక్తి నిర్వహణ, పర్యావరణ నిర్వహణ, లింగ సున్నితత్వానికి సంబంధించిన మూడు ధ్రువీకరణ పత్రాలను ప్రయోగశాలకు అందజేశారు. ఐఎస్ఓ గుర్తింపు రావడం పట్ల వీసీ టాటా నర్సింగరావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు. పరిశోధన అవకాశాలపై వర్క్‌షాపు తిరుపతి సిటీ: ఎస్వీయూ వైరాలజీ విభాగం విద్యార్థులు, పరిశోధకులలో అంతర్జాతీయ పరిశోధనా అవకాశాల గురించి అవగాహన కల్పించడం, సమర్థవంతమైన ప్రాజెక్ట్ ప్రతిపాదనలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో జర్మనీలో పరిశోధనా అవకాశాలు, ప్రాజెక్ట్ ప్రతిపాదన రచన అనే అంశంపై వర్సిటీలో వర్క్‌షాపు నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి సైన్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఆచార్య ఓవీఎస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పరిశోధనా నైపుణ్యాలను బలోపేతం చేసుకోవాలని సూచించారు. చైన్నెకి చెందిన డీఏఏడీ సమాచార కేంద్రం ప్రాంతీయ అధికారిణి ఆచార్య ఆంటోనెట్ స్టీఫెన్ జర్మనీలో ఉన్నత విద్య, పరిశోధన అవకాశాలు, విద్యార్థులు, పరిశోధకులకు అందుబాటులో ఉన్న వివిధ మార్గాలు, విద్యా, పరిశోధనా సహకారాలకు మద్దతు ఇవ్వడంలో డీఏఏడీ పాత్ర గురించి విలువైన సమాచారాన్ని అందించారు. ప్రొఫెసర్ వసుధారాణి దేవనాథన్, ప్రొఫెసర్ రజని, అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారు. -
గర్జించిన.. జెన్‌జెడ్
జిల్లా కేంద్రం తిరుపతిలో విద్యార్థిలోకం భగ్గుమంది. రాయలసీమ యువతకు ఉపాధి అవకాశాల కోసం శిక్షణనిచ్చే నైలెట్ శాశ్వత క్యాంపస్ తరలింపుపై గర్జించింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కుట్రలపై గళమెత్తింది. సీఎం సొంత జిల్లాకు ద్రోహం చేస్తారా..? అంటూ మండింది. న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన కాక్రొచ్ జెన్‌జెడ్ పోరును తలపించేలా కాక్రొచ్ ప్లకార్డులు చేతబూని ప్రభుత్వ వైఖరి ఖండించింది. నైలెట్ జోలికొస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేసింది. తిరుపతి సిటీ: నైలెట్ శాశ్వత క్యాంపస్‌ను తిరుపతి నుంచి అమరావతికి తరలింపునకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీల కతీతంగా జరిగిన జెన్‌జెడ్ ర్యాలీకి విశేష స్పందన లభించింది. శుక్రవారం ఎస్వీయూ రెండవ గేటు నుంచి వర్సిటీ ప్రధాన ద్వారం వరకు జరిగిన భారీ ర్యాలీకి తిరుపతి స్థానికులతో పాటు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందం తరలివచ్చి మద్దత్తు పలికారు. సుమారు మూడు వేల మందికి పైగా హాజరయ్యారు. ఈ ర్యాలీకి తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు, మాజీ మేయర్ డాక్టర్ శిరీష, సుమారు 16 విద్యార్థి సంఘాల నేతలు, నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు. జన్మనిచ్చిన జిల్లాకే ద్రోహం చేస్తారా? సీఎం చంద్రబాబుకు జన్మనిచ్చిన సొంత జిల్లా తిరుపతికి ద్రోహం చేయడంపై విద్యార్థులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హాయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఎంపీ గురుమూర్తి పోరాటంతో కేంద్రమంత్రులను ఒప్పించి తిరుపతికి ప్రతిష్టాత్మక నైలెట్‌ను తీసుకొస్తే సహించని కూటమి సర్కార్ పగపట్టి తరలించుకుపోవడం దారుణమని మండిపడ్డారు. జిల్లాలో ఏర్పేడు వద్ద రూ.100 కోట్లతో స్థాపించిన స్కిల్ డెవలెప్మెంట్ యూనివర్సిటీని సైతం అమరావతి తరలించారని మండిపడ్డారు. అలాగే నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీని సైతం తీసుకెళ్లారని ఆరోపించారు. ప్రస్తుతం వర్సిటీలో ఏర్పాటు చేసిన నైలెట్ సంస్థపై కన్నుపడిందని, దానిని సైతం అమరావతికి తరలించేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక ఆకర్షణగా కాక్రొచ్ ప్లకార్డులు జెన్‌జెడ్ ర్యాలీలో కాక్రొచ్ ప్లకార్డులు హల్చల్ చేశాయి. పార్టీలకతీతంగా పాల్గొన్న యువత, విద్యార్థులు, స్థానిక ప్రజలు ర్యాలీలో బాబు సర్కార్‌ను విమర్శిస్తూ కాక్రొచ్ చిత్రపటాలతో హెచ్చరించారు. తిరుపతి ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా కూటమి సర్కార్ వ్యవహరిస్తే కాక్రొచ్లు పుట్టుకొచ్చి నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. -
నువ్వా.. నేనా?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అతిముఖ్యమైన తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల వేడి రాజుకుంది. గత పాలక వర్గం చేసిన గ్రేటర్ తిరుపతి తీర్మానంపై టీడీపీ, జనసేన నేతలు పథకం ప్రకారం నీళ్లు చల్లి మహానగరం విస్తరణకు మోకాలొడ్డారు, గ్రేటర్ చేసే ప్రక్రియలో భాగంగా చంద్రగిరి, తిరుపతి రూరల్, రామచంద్రాపురం, రేణిగుంట మండలాల్లోని 160కి పైగా పంచాయతీలను తిరుపతి కార్పొషన్‌లో విలేనం చేసే ప్రక్రియ జరిగింది. అయితే అధికార పార్టీకి చెందిన నాయకులు అభ్యంతరాలు తెలిపారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైంది. దీంతో గ్రేటర్ ప్రతిపాదనకు బ్రేక్ పడింది. 50 డివిజన్ల నుంచి 66 డివిజన్లతో కార్పొరేషన్ ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. అందుకు సంబంధించి ఓటర్ల విభజన జరిగిపోయింది. అయితే డివిజన్ల పునర్విభజన సరిగా జరగలేదని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ఆ పిటిషన్లను కొట్టివేయడంతో కార్పొరేషన్ ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఆశావహులు అధికం తిరుపతి మేయర్ కుర్చీ కోసం కూటమిలోని మూడు పార్టీల నేతలు కుస్తీపడుతున్నారు. రిజర్వేషన్ల విషయం కొలిక్కిరాకముందే నువ్వా.. నేనా అంటూ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. గ్రేటర్ తిరుపతి విషయాన్ని పక్కనబెట్టి మేయర్ కుర్చీ కోసం పాకులాడుతున్నారు. స్థానికంగా జనసేన ఎమ్మెల్యే ఉండడంతో మేయర్ పీఠం కూడా జనసేనకే కేటాయించాలని పట్టుబడుతుండగా.. ఎమ్మెల్యే జనసేనకు కేటాయించారు కాబట్టి ఈ సారి మేయర్ పీఠం తమకే ఇవ్వాలని టీడీపీ నేతలు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. బీజేసీ నేతలు కూడా తమ పలుకుబడిని ఉపయోగించి మేయర్ పీఠాన్ని అధిరోహించేందుకు గట్టిగానే కృషి చేస్తున్నట్టు సమాచారం. మూడు పార్టీల నుంచి పోటీ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికారాలన్నీ ఉపయోగించి మేయర్ పీఠం దక్కించుకోవాలని కూటమిలోని మూడు పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నాయి. మేయర్ పీఠం తమకే కావాలని జనసేన నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యేగా జనసేన అభ్యర్థి ఉన్న సమయంలో మేయర్ కూడా అదే పార్టీకి చెందిన వారు ఉంటే బాగుంటుందని, అభివృద్ధి విషయంలో కూడా చేదోడు వాదోడుగా ఉంటామని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. జనసేనకు ఎమ్మెల్యే ఇచ్చామని, మేయర్ టీడీపీకి ఇవ్వాలంటే కుదరదని పట్టుబడుతున్నారు. ఇదిలా ఉంటే మరో వైపు బీజేపీ కూడా మేయర్ పీఠాని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మేయర్ పీఠం కోసం కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఎవరికి వారు ఆశలు పెట్టుకున్నారు. అందు కోసం రిజర్వేషన్ల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్లు పక్కన పెడితే.. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు రిజర్వు (జనరల్) అయితే.. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మనుమరాలు కీర్తి ముందు వరుసలో ఉన్నారు. జనసేన వైపు నుంచి అన్నా అనిత మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇంకా టీడీపీ మహిళా జిల్లా మాజీ అధ్యక్షురాలు పుష్పావతి పేర్ల ప్రచారంలో ఉంది. లేదా జనరల్‌కు కేటాయిస్తే.. మబ్బు దేవనారాయణరెడ్డి కుటుంబం నుంచి, జేబీ శ్రీనివాసులు, కోడూరు బాలసుబ్రమణ్యం, నరసింహయాదవ్ కుటుంబం నుంచి ఒకరు పోటీలో ఉండే అవకాశం ఉంది. ఇంకా దంపూరి భాస్కర్ యాదవ్, కృష్ణయాదవ్, ఆర్సీ మునికృష్ణ తదితరులు మేయర్ పీఠాన్ని ఆశిస్తున్నారు. అనూహ్యంగా ఈ సారి బీజేపీ నుంచి కూడా మేయర్ పీఠాన్ని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్‌రెడ్డి పదవీ కాలం ముగియనుండడంతో ఈ సారి మేయర్ పీఠంపై కూర్చోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా సామంచి శ్రీనివాసులు కూడా మేయర్ పీఠాన్ని ఆశిస్తున్నట్లు తెలిసింది. భాను మాత్రం.. తన పలుకుబడిని ఉపయోగించి.. కేంద్రం నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే.. డివిజన్ల కేటాయింపులోనూ మూడు పార్టీల దారులు ఒక్కో రకంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ అడిగేవే జనసేన కూడా అడుతున్నట్లు తెలుస్తోంది. మరో వైపు బీజేపీ కూడా కార్పొరేషన్ ఎన్నికల్లో కొన్ని డివిజన్లు అడుగుతున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. మొత్తానికి తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు.. కూటమికి చిక్కులు తప్పేలా లేవని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. -
40 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
తొట్టంబేడు (శ్రీకాళహస్తి రూరల్): శ్రీకాళహస్తి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అటవీశాఖ అధికారులు ముందస్తు సమాచారం మేరకు శుక్రవారం దాడులు నిర్వహించి 40 ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అటవీశాఖ అధికారి లోకేష్ మాట్లాడుతూ.. అక్రమంగా తరలించేందుకు సిద్ధంచేసిన 40 దుంగలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వాటి బరువు 350 నుంచి 400 కిలోలు, వాటి విలువ రూ.1.5 లక్షలు ఉంటుందన్నారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఎస్వీయూ వీసీకి అరుదైన గౌరవం తిరుపతి సిటీ: ప్రముఖ అంతర్జాతీయ సైంటిస్ట్, ఎస్వీయూ వీసీ టాటా నరసింగరావుకు అరుదైన గౌరవ లభించింది. భారత జాతీయ సైన్స్ అకాడమీ ఆఫ్ సైన్స్ సంస్థ ఫెలో ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ హోదాకు ఎంపికచేశారు. భారతదేశంలో ప్రసిద్ధి చెంది, 1930లో స్థాపించబడిన నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో 2026, డిసెంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించనున్న 96వ సంవత్సరిక సదస్సులో దీనిని అందజేయనున్నట్లు అకాడమీ ప్రకటించింది. దేశంలో ఇలాంటి ఫెలోషిప్ హోదా పొందిన కొద్ది మంది సైంటిస్టుల జాబితాలో వర్సిటీ ఉపకులపతి ఆచార్య టాటా నరసింగరావు చేరడం పట్ల పలువురు వర్సిటీ అధికారులు, అధ్యాపకులు హర్షం వ్యక్తంచేశారు. -
అక్రమ కేసులతో భయపెట ్టలేరు
నాయుడుపేట టౌన్: అక్రమ కేసులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలను భయపెట్టలేరని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యలు తేల్చిచెప్పారు. శుక్రవారం నాయుడుపేట పట్టణంలోని ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ పెళ్లకూరు మండల పరిధిలోని చిల్లకూరులో జరిగిన చిన్నపాటి ఘటనను పెద్దదిగా చూపించి, ఒత్తిడితో మృతి చెందిన విషయాన్ని హత్యాయాత్నంగా చిత్రీకరించి తీవ్రమైన సెక్షన్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై నమోదు చేయడం దారుణమన్నారు. ఈ ఘటనతో సంబంధం లేని వ్యక్తులను సైతం కేసుల్లో ఇరికిస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణరెడ్డిపై అక్రమ కేసు నమోదు చేయడాన్ని ఖండించారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఇక్కడి పోలీసుల తీరుపై గవర్నర్‌తో పాటు డీజీపీ, ఎస్పీలకు ఫిర్యాదు చేస్తామన్నారు. అవసరమైతే ప్రైవేట్ కేసులు సైతం దాఖలు చేసి న్యాయపోరాటానికి సన్నద్ధమవుతామని వారు స్పష్టం చేశారు. యథేచ్ఛగా ఇసుక, మట్టి దందా నియోజకవర్గంలో ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ దందాతో సాగుతోందని మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య ఆరోపించారు. అక్రమాలను ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేసి భయపెట్టాలని చూడడం అవివేకమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్యనారాయణరెడ్డి మండలంలో ఉంటే టీడీపీ, కూటమి నాయకుల నాటకాలు సాగవనే దుర్బుద్ధితో టీడీపీ నేతలు ఆయనపై అక్రమ కేసులు బనాయించి రిమాండ్‌కు పంపారని తెలిపారు. ఘనంగా ఎంపీ మిథున్‌రెడ్డి జన్మదిన వేడుకలు నాయుడుపేట ఆర్అండ్బీ అథితిగృహం వద్ద రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి జన్మదిన వేడుకలను తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సారథ్యంలో నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్‌చేసి మిథున్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు కలిక మాధవరెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కామిరెడ్డి రాజారెడ్డి, మద్దాల సోమశేఖర్‌రెడ్డి, ఓజిలి మండల పార్టీ అధ్యక్షుడు పాదర్తి హరినాథ్‌రెడ్డి, పెళ్లకూరు ఎంపీపీ శేఖర్‌రెడ్డి, పెళ్లకూరు పార్టీ అధ్యక్షుడు ఒబ్బు వెంకటరత్నం, ఈదా రత్నశ్రీ, చదలవాడ కుమార్, పట్టాభిరెడ్డి పాల్గొన్నారు. -
చోరీ సొత్తు స్వాధీనం
తిరుపతి క్రైం : సీసీ కెమెరాలు, జీపీఎస్, ఇతర సాంకేతిక ఆధారాలను ఉపయోగించి తిరుపతి ఈస్ట్ పోలీసులు పలు దొంగతనం కేసులను ఛేదించారు. ఐదు కేసుల్లో నలుగురు నిందితులను అరెస్టు చేసి.. ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, బంగారు గొలుసు తదితరాలు కలిపి సుమారు రూ.13.8 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ఈస్ట్ పోలీస్ స్టేషన్న్ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసుల దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో పాటు స్థానికంగా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి నిందితులను గుర్తించారు. కేసుల వివరాలను తిరుపతి జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ (అడ్మినిస్ట్రేషన్న్) ఆర్ల శ్రీనివాసులు, అడిషనల్ ఎస్పీ (లా అండ్ ఆర్డర్) కె.రవిమనోహరాచారి వెల్లడించారు. ట్రాక్టర్ చోరీ కేసులో.. జమ్మలమడుగుకు చెందిన గొంగాటి మల్లికార్జున్న్రెడ్డి (38)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు రూ.9 లక్షల విలువైన ట్రాక్టర్, ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అలిపిరి పోలీస్ స్టేషన్న్ పరిధిలో జరిగిన మరో ట్రాక్టర్ చోరీ కేసులో ఇంజిన్‌ను కూడా దొంగిలించినట్లు వెల్లడైంది. దీంతో ఆ కేసుకు సంబంధించిన సుమారు రూ.1.5 లక్షల విలువైన ఇంజిన్, ట్రాలీని రికవరీ చేశారు. మూడు బైక్‌లు స్వాధీనం రోడ్డుపై తాళాలు వేసి నిలిపిన ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న దాయనబోయిన రవి (55)ని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు రూ.50 వేల విలువైన హీరో ప్లెజర్, మరో రూ.50 వేల విలువైన హీరో స్ల్పెండర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా పిడుగురాళ్లకు చెందిన శివరాత్రి చందు (23) దొంగిలించిన రాయల్ ఎన్న్ఫీల్డ్ బైక్‌ను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.90 వేల విలువైన బైక్‌లను రికవరీ చేశారు. చైన్‌స్నాచింగ్ కేసు ఛేదన వృద్ధురాలి మెడలోని 35 గ్రాముల బంగారు గొలుసును అపహరించిన కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. తిరుపతి డీఎస్పీ పర్యవేక్షణలో ఈస్ట్ సీఐ, ఎస్ఐలు, ఐడీ పార్టీ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలను విశ్లేషించి గిద్దలూరుకు చెందిన కొప్పాలి గీత (25)ను గుర్తించి అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి సుమారు రూ.1.4 లక్షల విలువైన 35 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. -
నిందితులకు ఐదేళ్ల జైలు
తిరుపతి లీగల్ : ఎరచ్రందనం దుంగల అక్రమ రవాణా కేసులో తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లా, పోలూరు తాలూకా, కోయిలాంబూర్కు చెందిన ముత్తుస్వామినాథన్కు ఐదేళ్ల జైలు శిక్ష, ఆరు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తిరుపతి నాల్గవ అదనపు జిల్లా జడ్జి, రాష్ట్ర ఎరచ్రందనం కేసుల విచారణ సెషనన్ జడ్జి కోర్టు ఇన్చార్జ్ జడ్జి అర్చన శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం.. ఎరచ్రందనం అక్రమ నిరోధక దళం 2018లో శేషాచలం, టీఎన్ పాలెం సెక్షన్, మేకలబండ అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలో స్వామినాథన్ ఎరచ్రందనం దుంగలు తరలిస్తూ సిబ్బందికి పట్టుబడ్డాడు. ఫారెస్ట్ సిబ్బంది అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. నేరం అతనిపై రుజువు కావడంతో న్యాయమూర్తి అతనికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. అలాగే మరో కేసులో వైఎస్సార్ కడప జిల్లా, సానిపయ్య రేంజ్, పింఛ సెక్షన్, దిన్నెలబీట్, ఏడు ఆవుల ధర్తీ అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి ఏడు ఎరచ్రందనం దుంగలను తరలిస్తున్న కేసులో తమిళనాడు, విల్లుపురం జిల్లా, చిన్న సేలం తాలూకా, ఇన్నాడు గ్రామానికి చెందిన కె.రాజీవ్‌గాంధీకి ఐదేళ్ల జైలు శిక్ష, ఆరు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
20 మంది రైతులపై అక్రమ కేసులు
రామచంద్రాపురం: రామచంద్రాపురం మండలం, అనుపల్లి రెవెన్యూ పరిధి, ఉప్పులవంక గ్రామంలో ఇటీవల జరిగిన భూ వివాదంలో ఏకంగా 20 మంది రైతులపై అక్రమ కేసులు బనాయించడం విస్మయానికి గురిచేస్తోంది. బాధితుల కథనం.. ఉప్పులవంక గ్రామంలోని సర్వే నం.318కి సంబంధించి నెలకొన్న వివాదంపై రైతులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఓ వినతిపత్రం సమర్పించారు. ఈ ఫిర్యాదు మేరకు తహసీల్దార్ మధుసూదనరావు ఈనెల 1న గ్రామ సర్వేయర్‌తో కలిసి క్షేత్ర స్థాయి విచారణకు వెళ్లారు. ఆపై అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి సమస్యను పరిష్కరించకుండానే అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేశారు. దీంతో బాధిత రైతులు తహసీల్దార్ కారు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తహసీల్దార్ విధులకు ఆటంకం కలిగించారనే నెపంతో పోలీసులు ఏకంగా 20 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో నలుగురు మహిళలు, ఓ చంటిబిడ్డ తల్లి ఉన్నారు. ఓ ప్రజాప్రతినిధి భార్య ఒత్తిడితోనే కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. ఓ పత్రిక విలేకరి (సాక్షి కాదు)పై కూడా కేసు నమోదు చేశారు. -
బాధ్యతల స్వీకరణ
తిరుపతి అర్బన్: తిరుపతి సెట్విన్ సీఈవోగా పనిచేస్తున్న యశ్వంత్‌కు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. ఆ మేరకు ఆయన కలెక్టరేట్లోని సోషల్ వెల్పేర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి హరీష్ శిక్షణ నిమిత్తం దీర్ఘకాలిక సెలవులో వెళ్లడంతో ఆ బాధ్యతలను సెట్విన్ సీఈవోకు అదనంగా అప్పగించారు. రైలు కిందపడి గుర్తుతెలియని మహిళ మృతి సూళ్లూరుపేట: పట్టణం పరిధిలోని ఇసుకమిట్ట సమీపంలో దిగువ రైల్వేలైన్, గూడూరు–చైన్నె మార్గంలో సుమారు 50 నుంచి 55 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని మహిళ శుక్రవారం రైలు కిందపడి మృతి చెందింది. రైల్వే పోలీసుల కథనం.. గుర్తు తెలియని మహిళ తెలుపు రంగుపై బ్లూ కలర్ , ఫింక్ కలర్ పూల డిజైన్ కలిగిన చీర, తెలుపు రంగు జాకెట్, పసుపు రంగు లంగా ధరించి ఉంది. కుడి ఛాతీపై ఒక నల్లని పుట్టుమచ్చ, ఎడమ మో చేయి పైన పుట్టు మచ్చలు ఉన్నాయి. మృతురాలిని గుర్తించేందుకు ఎటువంటి ఆధారాలు దొరక్కపోవడంతో మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతురాలి ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ కే శ్రీనివాసరావునను సంప్రదించాలని, లేదంటే 70360 43535, 95732 45266 నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు. నేడు జాతీయ లోక్‌అదాలత్ తిరుపతి లీగల్ : తిరుపతి కోర్టు ఆవరణలో శనివారం ఉదయం 10.30 నుంచి జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహించనున్నట్టు తిరుపతి మూడవ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ ఎం.గురునాథ్ శుక్రవారం తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవ సంస్థ ఆదేశాల మేరకు ఈ జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహించనున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. కేసుల పరిష్కారం కోసం ఈ లోక్‌అదాలత్‌లో ఐదు బెంచులను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆ బెంచులకు అధ్యక్షులుగా తనతో పాటు తిరుపతి నాల్గవ అదనపు జిల్లా జడ్జి అర్చన, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్పిడి.వెన్నెల, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లెనిన్‌బాబు, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి రమాదేవి వ్యవహరిస్తారన్నారు. కోర్టులలో పెండింగ్‌లో ఉన్న సివిల్ కేసులు, రాజీ కాదగిన క్రిమినల్ కేసులు, వివాహ సంబంధ కేసులు, మోటార్ వాహన ప్రమాద కేసులు, వ్యాజ్యం వేయని కేసులు తదితర కేసులను ఈ లోక్ అదాలత్ లో పరిష్కరిస్తామన్నారు గంజాయి కేసులో మహిళకు రిమాండ్ తిరుపతి లీగల్ : ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు కిలోలకు పైగా గంజాయిని తరలిస్తున్న కేసులో చిత్తూరు, మంగసముద్రం, లెనిన్ నగర్‌కు చెందిన బి.లక్ష్మీదేవికి 14 రోజులపాటు రిమాండ్ విధిస్తూ తిరుపతి మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి రమాదేవి శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. -
ఆటోను ఢీకొట్టిన పాల లారీ
నాయుడుపేట టౌన్: మండల పరిధిలోని పండ్లూరు గ్రామ సమీపంలో జాతీయ రహదారి పక్కనే నిలబెట్టి ఉన్న ఆటోను వెనుక నుంచి వస్తున్న పాల లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఓజిలి మండలం, ఆచర్ల పార్లపల్లి గ్రామానికి చెందిన రమేష్(32) తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మరో కార్మికుడు సుబ్బయ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆటోలో ఉన్న మరో ఐదుగురు కార్మికులకు గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం.. ఆచర్లపార్లపల్లి గ్రామం వద్ద నుంచి మండల పరిధిలోని అయ్యప్పరెడ్డిపాళెం గ్రామ సమీపంలో ఎంపీ షుగర్ పరిశ్రమ వద్ద చెట్లను నరికేందుకు కూలీలను తీసుకుని ఆటో బయలుదేరింది. పండ్లూరు గ్రామ సమీపంలోని జాతీయ రహదారి పక్కన నిలబెట్టుకుని కార్మికులకు టిఫిన్స్లు కట్టించుకునేందుకు ఇద్దరు కిందకు దిగారు. ఈ క్రమంలో గూడూరు వైపు నుంచి వేగంగా వస్తున్న పాల లారీ రోడ్డు పక్కన నిలబెట్టిన ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ క్రమంలో ఆటో పక్కన నిలబడి ఉన్న రమేష్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సుబ్బయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ఉన్న మరో ఐదుగురు కూలీలకు రక్తగాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్స్‌తో పాటు హైవే అంబులెన్స్‌లలో నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన పాల లారీని అదుపులోకి తీసుకున్నారు. సుబ్బయ్యను మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
సెల్‌ఫోన్ కోసం బావిలోకి దిగి ఇద్దరి మృతి
తిరుపతి క్రైం : సెల్‌ఫోన్ కోసం బావిలోకి దిగిన ఇద్దరు వలస కూలీలు విషవాయువులు పీల్చి మృతి చెందిన ఘటన తిరుపతిలో శుక్రవారం చోటుచేసుకుంది. అలిపిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎస్బీఐ ట్రైనింగ్ సెంటర్ వెనుక ఉన్న బావిలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా విషాదం అలముకుంది. మృతులను ఒడిశా రాష్ట్రానికి చెందిన వలస కూలీలు భీమ్రాజ్ (36), నరేష్ (21)గా గుర్తించారు. బావిలో సెల్‌ఫోన్ పడిపోవడంతో దానిని తీసేందుకు భీమ్రాజ్ దుప్పట్లను తాడులా కట్టి బావిలోకి దిగాడు. అయితే ఎంతసేపటికీ అతడు బయటకు రాకపోవడంతో నరేష్ కూడా అతడిని కాపాడేందుకు బావిలోకి దిగాడు. ఈ క్రమంలో విషవాయువులు పీల్చడంతో ఇద్దరూ బావిలోనే మృతి చెందినట్లు సమాచారం. అలిపిరి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బావిలో విషవాయువులు ఉన్నట్లు గుర్తించడంతో ఫైర్ సిబ్బంది లోపలికి దిగేందుకు సాహసించ లేదు. అనంతరం పాతాళభేరి సహాయంతో మృతదేహాలను బావిలో నుంచి వెలికితీశారు. మృతి చెందిన యువకులు -
బాబు పాలనలో కరువు విలయతాండవం
తిరుపతి మంగళం : చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసిన దాఖలాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాడంటే ఇక పంటల పరిస్థితి ఏమిటి దేవుడా అంటూ రైతుల గుండెల్లో దడ పుడుతుందన్నారు. చంద్రబాబు పాలనలో అతివృష్టి, అనావృష్టే తప్ప సమృద్ధిగా వర్షాలు కురిసే పరిస్థితి ఉండదన్నారు. ఎకనామిక్స్ టైమ్స్ పత్రిక వారు చంద్రబాబుకు వాటర్‌మెన్ బిరుదును ఎగతాళితో ఇచ్చినట్లుగా అనిపిస్తోందన్నారు. సకాలంలో వర్షాలు లేక కరువు విలయతాండవం చేస్తోందన్నారు. డ్యామ్‌లు, చెరువులు ఎండిపోయి సాగు, తాగునీరు లేక అటు రైతులు, ఇటు ప్రజలు అల్లాడుతున్నారని వాపోయారు. 1995– 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ఉన్నపుడు 1,400 మండలాలకు గాను 1200 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించారని గుర్తుచేశారు. 2014–19వరకు కరువు, అతివృష్టి వచ్చిందన్నారు. చంద్రబాబు, కరువు ఒకే కడుపున పుట్టిన కవల పిల్లలు అని ఎద్దేవా చేశారు. స్వామి భక్తి కన్నా చంద్రబాబు భక్తే ఎక్కువా? తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ డిప్యూటీ ఈవోగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన భాస్కర్‌కు స్వామి భక్తి కన్నా చంద్రబాబు భక్తే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోందని భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపైన ఎంత అపారమైన భక్తి ఉన్నా దానిని మనసులో దాచుకోవాలే తప్ప మీ ఫోన్ వాట్సాప్ డీపీలో చంద్రబాబుతో కలిసి ఉన్న ఫొటోను పెట్టుకోవడం స్వామి సేవకుడిగా, టీటీడీ ఉద్యోగిగా సరికాదన్నారు. ఇప్పటికే పూర్వ డిప్యూటీవో లోకనాథన్యాదవ్ మీద దాడి చేయడం వెనుక చాలా పేర్లు బయటికి వస్తున్నాయని, వీళ్లందరూ ఆ ఉద్యోగం కావాలనుకున్నవారేనన్నారు. -
అంతా ఉత్తిదే
● టీడీఆర్ బాండ్లలో అవకతవకలు మా దృష్టికి రాలేదు సాక్షి టాస్క్‌ఫోర్స్: తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గత ప్రభుత్వ హయాంలో మాస్టర్ ప్లాన్ రోడ్ల కోసం జారీచేసిన ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) బాండ్లలో అవకతవకలు జరిగాయని, ఇందులో ప్రజాప్రతినిధులు, అధికారుల ప్రమేయం ఉందంటూ వచ్చిన ఆరోపణలు అసెంబ్లీ సాక్షిగా అసత్యాలని తేలిపోయాయి. ఈ విషయంపై తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సంబంధిత మంత్రిత్వ శాఖకు లిఖిత పూర్వక జవాబు కోసం నోటీసు అందించంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ అధికారులు ఎమ్మెల్యే నోటీసుకు జవాబు ఇస్తూ తమకు విజిలెన్స్ శాఖ నుంచి టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి సంబంధించి ప్రజాప్రతినిధులు, అధికారులపైన ఎటువంటి రిపోర్టులు అందలేదని సమాధానం ఇచ్చారు. దీంతో టీడీఆర్ బాండ్ల కుంభకోణం అంటూ అసత్య ప్రచారం ఉత్తదే అని తేలిపోయింది. కొనసాగుతున్న బిల్ కలెక్టర్ల దీక్ష తిరుపతి రూరల్: డిజిటలైజేషన్ పేరుతో ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు బిల్ కలెక్టర్లను ఉద్యోగం నుంచి తొలగించడంతో వారి కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి. ఉద్యోగం తిరిగి ఇవ్వాలని, లేదంటే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ గత 25 రోజులుగా కుటుంబాలతో కలిసి దీక్ష కొనసాగిస్తున్నారు. గురువారం పుత్తూరు, నాగలాపురం, పిచ్చాట్టూరు ప్రాంతాలకు చెందిన బిల్కలెక్టర్లు, వారి కుటుంబీకులు పాల్గొన్నారు. -
సన్నగా దండుకో
తిరుమలలో మాక్ డ్రిల్ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు మాక్ డ్రిల్ నిర్వహించారు. సన్న బియ్యం పంపిణీ గాలికి! సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి జిల్లాలో పౌరసరఫరాల శాఖ తీరు అధ్వాన్నంగా మారింది. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు సన్న రకం బియ్యం అందజేస్తామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ప్రచారానికే పరిమితమైంది. ఒక ప్రజాప్రతినిధి, జిల్లా ఉన్నతాధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ పేదల ప్రయోజనాలను గాలికి వదిలేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మిల్లర్లతో కుమ్మకై ్క నాసిరకం బియ్యాన్ని ప్రజలకు అంటగడుతూ కోట్లాది రూపాయల దందా నడిపిస్తున్నారని లబ్ధిదారులు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. దందా షురూ గతంలో కాకినాడలో పనిచేసిన సమయంలో తీవ్ర అక్రమాలకు పాల్పడిన ఒక వివాదాస్పద అధికారిని ఏరికోరి ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన తిరుపతికి బదిలీ చేయడం వెనుక ఉన్న మర్మమేమిటని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఇక్కడ కూడా మిల్లర్లతో చేతులు కలిపి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాల్సిన మరొక అధికారి గతంలో నెల్లూరులో అడ్డగోలు వ్యవహారాలు నడిపి, ఇప్పుడు తిరుపతిలో నాణ్యత లేని బియ్యానికి మంచి మార్కులు ఇస్తూ మిల్లర్ల నుంచి భారీగా ముడుపులు దండుకుంటున్నారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం బియ్యం రైస్ మిల్లుల వద్ద ప్రత్యేక కౌంటర్లు తెరిచి సన్న బియ్యం పంపిణీ చేయాలన్న కూటమి ప్రభుత్వ ప్రకటనలు కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయి. కౌంటర్లు తెరిచామని కాగితాల్లో లెక్కలు చూపుతున్న అధికారులు, వాస్తవానికి నాణ్యమైన బియ్యం అందకుండా గండికొడుతున్నారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న బియ్యం తినడానికి పనికిరావడం లేదని, వండినా ఉడకక దుర్వాసన వస్తుండడంతో పశువుల దాణాకు తప్ప మనుషులకు ఉపయోగపడడం లేదని కార్డుదారులు వాపోతున్నారు. మంత్రి అండదండలతో అవినీతి అధికారుల లాలూచీ వల్ల పేదల కడుపు కొడుతున్నారని ప్రజలు ధ్వజమెత్తుతున్నారు. సీఎం సొంత జిల్లాలోనే ఇలాంటి అక్రమాలు జరగడం సిగ్గుచేటని, తక్షణమే విచారణ జరిపి బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేసి, నాణ్యమైన సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
బాబు, కరువు కవలలు!
తిరుపతి మంగళం : రాష్ట్రంలో చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువు పలకరిస్తుందని, దాంతో రాష్ట్ర ప్రజలంతా అల్లాడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాయం వద్ద గురువారం వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ మేయర్ శిరీష, పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నీలం బాలాజీతో పాటు పార్టీ శ్రేణులు అధిక సంఽఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ అధికార దాహంతో ప్రజలకు చంద్రబాబు చేస్తున్న ద్రోహం, వంచనపై భగవంతునికి, ప్రకృతికి సైతం కోపం వచ్చిందని, దాంతో సకాలంలో వర్షాలు కురవక ప్రజలు తాగునీరు కూడా లేక అల్లాడిపోతున్నారన్నారు. చంద్రబాబు ఎప్పుడూ అధికార కోసం తప్ప ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించరన్నారు. అందుకే రాష్ట్రంలో 120 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా కరువుతో, ఏడాది పొడువునా ఉక్కపోతతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1,400 మండలాల్లో 1,250 మండలాలను కరువు మండలాలుగా, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 67 మండలాలు ఉంటే 66 మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తున్నారంటే చంద్రబాబుపై ప్రకృతి కూడా ఏ విధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోందో అర్థమవుతోందన్నారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రమంతా కరువే అపరభగీరథుడు వైఎస్సార్ రాష్ట్రంలో ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించడానికి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చిన భగీరథుడు వైఎస్.రాజశేఖరరెడ్డి అని భూమన గుర్తుచేశారు. అప్పట్లో కండలేరు రిజర్వాయర్ దగ్గర పైప్ లైన్ ద్వారా నీరు తరలించాలని పోరాటం చేశామని, గాలేరు– నగరి కోసం 600 కి.మీ పాదయాత్ర చేశామని గుర్తుచేశారు. 2వ పైప్‌లైన్ ద్వారా తెలుగు గంగ నీటిని తిరుపతి ప్రజలకు అందించడానికి టీటీడీ ద్వారా రూ.50 కోట్లు తాము తీసుకొస్తే వాటిని రాజకీయ కక్షతో ఆపేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఇప్పటికే తిరుమలలో ఉన్న రెండు డ్యామ్‌లు మూడు నెలలకే సరిపోతాయని అధికారులు ప్రకటించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. 25 ఏళ్ల క్రితం తిరుమలకు తాగునీటి సమస్య రావడంతో ట్యాంకర్లతో నీటిని తరలించిన పరిస్థితి చంద్రబాబు పాలనలోనే అన్న విషయాన్ని గుర్తుచేశారు. తాగునీటి సమస్యపై ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు. తిరుపతిలో ఆందోళనలు చేపడుతున్నామన్న కక్షతో తమ కుటుంబ ఆస్తులపై దౌర్జన్యం చేస్తూ, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ జైళ్లకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొని వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు. -
క్లస్టర్ టీచర్ల పరిస్థితి అయోమయం
● ఒక్కోరోజు ఒక్కో పాఠశాలలో విధులు ● ఎవరైనా సెలవు పెడితే ఆ పాఠశాలలో విధి నిర్వహణ ● స్కూల్ అసిస్టెంట్ అయ్యుండి.. 1, 2 తరగతులకు బోధన తిరుపతి ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లో మిగులుగా ఉన్న క్లస్టర్ టీచర్ల పరిస్థితి అయోమయంగా మారింది. విద్యార్థులు, ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం జిల్లా వ్యాప్తంగా 117 మందికిపైగా టీచర్లు మిగులుగా ఉన్నారు. వీరందరినీ క్లస్టర్ పాఠశాలలకు అనుసంధానించారు. క్లస్టర్ ప్రధానోపాధ్యాయుల పరిధిలో ఉంటూ పని చేయాలని నిబంధన పెట్టి మొబైల్ టీచర్ విధానంలా క్లస్టర్ టీచర్ విధానాన్ని తీసుకొచ్చారు. కష్టాలు ఎన్నో క్లస్టర్ టీచర్ విధానంతో క్షేత్ర స్థాయిలో క్లస్టర్ టీచర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి క్లస్టర్ పరిధిలోని ఏదేని పాఠశాలలో టీచర్ సెలవు పెడితే ఆ పాఠశాలకు వెళ్లి విధులు నిర్వహించాలి. విద్యార్థుల సంఖ్య పెరిగితే ఆ పాఠశాలకు వెళ్లి బోధించాలి. విధులు లేకుంటే క్లస్టర్ పాఠశాలలోనే ఉండాల్సి వస్తోంది. కొన్నిమార్లు స్కూల్ అసిస్టెంట్లు అయ్యుండి 1, 2 తరగతులకు బోధించాల్సి రావడం బాధాకరమంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్లస్టర్ టీచర్ల విషయంలో ఏ క్లస్టర్ పాఠశాల నిర్ధిష్ట ప్రణాళిక పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్దుబాటు చేయాలి ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో 60 మందికిపైగా విద్యార్థులుంటే తరగతికి ఒక టీచర్‌ను కేటాయిస్తున్నారు. ఇదే విధానాన్ని బేసిక్ ప్రాథమిక పాఠశాలల కు వర్తింపజేసి, అవసరమైనచోట క్లస్టర్ టీచర్లను సర్దు బాటు చేయాలని పలువురు టీచర్లు సూచిస్తున్నారు.జిల్లా సమాచారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 1,993 ప్రాథమికోన్నత పాఠశాలలు 12 ఉన్నత పాఠశాలలు 304 హైస్కూల్ ప్లస్‌లు 54 మొత్తం పాఠశాలల సంఖ్య 2,363 విద్యార్థుల సంఖ్య 1,47,050 క్లస్టర్ పాఠశాలల సంఖ్య 130 క్లస్టర్ టీచర్ల సంఖ్య 117అప్పటికప్పుడు పాఠశాలకు పయనం ఏ పాఠశాలకు వెళ్లాలన్న సమాచారం లేకపోవడంతో క్లస్టర్ టీచర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. డెప్యుటేషన్ వేసినట్లుగా క్లస్టర్ పాఠశాలకు వెళ్లినప్పుడు పలాన పాఠశాలకు వెళ్లాలని చెబుతారని, అప్పటికప్పుడు హుటాహుటిన ఆ పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందని పలువురు పేర్కొంటున్నారు. ఆ పాఠశాల వాతావరణం, విద్యార్థులతో మమేకమయ్యేందుకు క్లస్టర్ టీచర్లకు వీల్లేకుండా పోతోంది. దీంతో నాణ్యమైన బోధన ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. -
నైలెట్ తరలింపుపై నేడు జెన్‌జెడ్ ర్యాలీ
తిరుపతి సిటీ: ‘‘ఇది రాజకీయ కార్యక్రమం కాదు.. పార్టీల జెండాలు అసలే ఉండవు.. యువత భవిష్యత్తుకు భరోసానిచ్చే నైలెట్ శాశ్వత క్యాంపస్‌ను కుట్రతో తిరుపతి నుంచి తరలించే ప్రయత్నాన్ని అడ్డుకుందాం.. తిరుపతి ఆత్మ గౌరవాన్ని నిలబెడదాం.. ఎస్వీయూకు తలమానికంగా నిలిచిన కేంద్ర ప్రభుత్వ సంస్థను తిరుపతి నుంచి తరలించవద్దని ప్రభుత్వాన్ని నిలదీయడం.. తరలింపు కుట్రను అడ్డుకోవడం.. ఇదే జన్‌జెడ్ భారీ ర్యాలీ ప్రధాన ఉద్దేశం’’ అని విద్యార్థి, యుజవన సంఘాల నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం 10గంటలకు ఎస్వీయూ రెండో గేటు నుంచి వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద వరకు భారీ ఎత్తున విద్యార్థులు, నిరుద్యోగ యువతతో జెన్‌జెడ్ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం ఎస్వీయూ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ ర్యాలీలో పార్టీల కతీతంగా యువత, విద్యార్థులు, పలు పార్టీలకు చెందిన నేతలు, మేధావులు, స్థానికులు హాజరై ప్రభుత్వ కుట్రపై గళమెత్తనున్నారు. -
పింఛన్.. కష్టాలు పెంచెన్
తిరుపతి అర్బన్: చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన 27 నెలలు తర్వాత కొత్త పింఛన్ల దరఖాస్తుకు అవకాశం కల్పించింది. అయితే అర్హుత ఉన్న పింఛన్‌దారులు దరఖాస్తు చేసుకోవడానికి నానా తిప్పులు పడుతున్నారు. ఈనెల 16వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తుకు గడువు ఉండడం.. మధ్యలో శని, ఆది, సోమవారాలు సెలవు రోజులు కావడంతో అర్హులైన వారు ఆందోళనలో మునిగిపోయారు. ఇబ్బందులెన్నో? ఒక్కో సచివాలయంలో పింఛన్ల దరఖాస్తు వ్యవహారాలను చూడడానికి ఒక్కో డిజిటల్ అసిస్టెంట్ (డీఏ)ను మాత్రమే అందుబాటులో ఉంచారు. పలు సచివాలయాల్లో డీఏలకు చెందిన కంప్యూటర్లు పనిచేయడంలేదు. దీంతో వారు మరొకరి కంప్యూటర్ను వినియోగించాల్సి వస్తోంది. అంతేకాకుండా పలు కంప్యూటర్లకు ఇచ్చిన నెట్ కనెక్షన్లు సక్రమంగా పనిచేయడం లేదు. దీంతో డీఏ తమ మొబైల్ ద్వారా నెట్‌కు కనెక్షన్ ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో సర్వర్ సమస్యలు తలెత్తున్నాయి. ఒక్కో దరఖాస్తుకు సాధారణంగా 15 నిమిషాల సమయం పడుతుంది. అయితే నెట్, సర్వర్ ఇబ్బందులతో 20 నిమిషాల వరకు తీసుకుంటోంది. గంటకు నాలుగు దరఖాస్తులు చేసినా ఆరు గంటలకు 24 లేదా 25 దరఖాస్తులు మాత్రమే చేయడానికి వీలుగా ఉంటుంది. ఒక్కో గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో 200 నుంచి 240 మందికిపైగా అర్హులు ఉన్నారు. డప్పు కళాకారుల దరఖాస్తుల నిరాకరణ ప్రతి గ్రామ, వార్డు పరిధిలో డప్పు కళాకారులు ఉన్నారు. సచివాలయంలో వారి దరఖాస్తులను స్వీకరించడం లేదు. సచివాలయ ఉద్యోగులను వారు గట్టిగా ప్రశ్నిస్తే కలెక్టరేట్‌కు వెళ్లి ఐడీ కార్డులతోపాటు ఆర్డర్ కాపీలు తీసుకురావాలని సూచిస్తున్నారు. దీంతో గురువారం పలువురు డప్పు కళాకారులు కలెక్టరేట్‌కు వచ్చి తమ అర్జీలను ఇవ్వాల్సి వచ్చింది. కొత్త పింఛన్ల దరఖాస్తులకు సవాలక్ష సమస్యలు న్యాయం చేయండి పింఛన్ దరఖాస్తు కోసం సచివాలయానికి వెళ్లాం. అయితే వారు సోషల్వెల్ఫేర్ అధికారి నుంచి అనుమతి తీసుకురావాలని సూచిస్తున్నారు. లేదంటే కలెక్టరేట్‌కు వెళ్లి ఆర్డర్ తీసుకురావాలని ఆదేశిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో కలెక్టరేట్‌కు వచ్చి అర్జీ ఇచ్చాం. వీళ్లు ఆర్డర్ ఎప్పుడు ఇస్తారా తెలియడం లేదు. టెన్షన్‌గా ఉంది. – మస్తానయ్య, శ్రీకాళహస్తి మండలం దరఖాస్తు తీసుకోవడం లేదు ఒంటరి మహిళకు 40 ఏళ్ల వయస్సు ఉంటే పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే సచివాలయ ఉద్యోగులు 50 ఏళ్లు ఉంటేనే ఒంటరి మహిళ పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవాలంటూ నిబంధన పెట్టారు. సచివాలయ ఉద్యోగులు దరఖాస్తును స్వీకరించ లేదు. దీంతో కలెక్టరేట్‌కు వచ్చాం. –వాణి, ఒంటరి మహిళ, శ్రీకాళహస్తి మండలం -
గల్లా రామచంద్ర నాయుడుకు నాయుడమ్మ స్మారక పురస్కారం
రేణిగుంట : అమర రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపక చైర్మన్ డా.గల్లా రామచంద్ర నాయుడుకు ప్రతిష్టాత్మక పద్మశ్రీ డా. యలవర్తి నాయుడమ్మ స్మారక పురస్కారం–2026 మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అందుకున్నట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు. తెనాలిలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో డా.యలవర్తి నాయుడమ్మ సైనన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ యడ్లపాటి రఘునాథ బాబు అధ్యక్షత గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త, పద్మశ్రీ డా.యలవర్తి నాయుడమ్మ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖ వ్యక్తికి ఈ స్మారక పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. అందులో భాగంగా వివిధ సేవారంగాల్లో రాణిస్తున్న డా.గల్లా రామచంద్రనాయుడును ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. -
సూపర్వైజర్ ఆత్మహత్య
నాయుడుపేట టౌన్: మేనకూరు సెజ్ పరిధిలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో సూపర్వైజర్గా పనిచేస్తున్న లోకేశ్వరన్బాబు(35) ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం.. తమిళనాడు రాష్త్రం, రాణిపేట జిల్లా, తెరుంబలిపాకం గ్రామానికి చెందిన లోకేశ్వరన్ మేనకూరు సెజ్ పరిధిలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాయుడుపేట పట్టణంలోని రాజగోపాలపురం 4వ వీధిలోని ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు. రెండు రోజుల నుంచి లోకేశ్వరన్ బాబు ఫోన్ తీయక పోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి గురువారం నాయుడుపేటకు వచ్చి ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఇంట్లో నైలాన్ తాడుతో ఆత్మహత్య చేసుకుని ఉండడాన్ని గుర్తించారు. ఆత్మహత్యకు సంబంధించి కారణాలు తెలియరాలేదు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఎస్వీ మ్యూజియం పరిశీలన
తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి గురువారం ఉదయం మ్యూజియంలోని ఏర్పాట్లను పరిశీలించారు. మ్యూజియంలో ఏర్పాటు చేసిన గ్యాలరీలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో టీటీడీ ఇన్చార్జ్ సీఈ మనోహరం, డిప్యూటీ ఈవో సోమన్నారాయణ, వీజీఓ సురేంద్ర పాల్గొన్నారు. నూతన విమాన సర్వీస్ ప్రారంభం రేణిగుంట: హైదరాబాద్ నుంచి విజయవాడను కలుపుతూ తిరుపతి విమానాశ్రయం నుంచి గురువారం నూతన విమాన సర్వీసును ప్రారంభించారు. ఫ్లై–91 తొలి విమాన సర్వీసును తిరుపతి విమానాశ్రయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు వర్చువల్‌గా ప్రారంభించారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి అగ్నిమాపక విభాగం సంప్రదాయబద్ధంగా వాటర్ కెనాన్ సెల్యూట్‌తో తొలి విమానానికి స్వాగతం పలికారు. విమానాశ్రయ డైరెక్టర్ భూమినాథన్, ఇతర ప్రముఖులు ప్రయాణికులకు మొదటి బోర్డింగ్ పాస్‌ను అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి కొత్త సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఫ్లై–91 ద్వారా విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్‌కు ఈ అదనపు ప్రత్యక్ష కనెక్టివిటీ భక్తులకు వేగవంతమైన, మరింత సౌకర్యవంతమైన ప్రయాణ మార్గాలను అందిస్తుందని తెలిపారు. -
గురుకులంలో గురువుపై దాడికి యత్నం
రేణిగుంట: గిరిజన గురుకుల ఉపాధ్యాయుడిపై అధికార పార్టీకి చెందిన ఎస్సీ సంఘం నాయకుడు దాడికి యత్నించడం రేణిగుంట మండలంలో చర్చనీయాంశమైంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఏపీ గిరిజన గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలోని ఉపాధ్యాయులకు నాలుగు నెలలకు ముందు క్వార్టర్స్‌ను కేటాయించారు. ఆ తర్వాత ఇక్కడ తాత్కాలికంగా ఇద్దరు టీచర్లను నియమించారు. వారికి క్వార్టర్స్‌ను ఇవ్వకుండా నిరాకరించారు. అందులో ఒక టీచర్ భర్త తిరుపతిలోని అధికార పార్టీ నాయకుడికి అనుచరుడుగా ఉన్నారు. దీంతో అతను సీనియర్ ఉపాధ్యాయులను క్వార్టర్స్ ఖాళీ చేయాలని బెదిరింపులకు దిగాడు. ఈనెల ఆరో తేదీన సదరు నాయకుడు పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపల్ ముందే ఒక ఉపాధ్యాయుడిపై దాడికి యత్నించాడు. ‘నువ్వు ఇక్కడ ఎలా ఉద్యోగం చేస్తావో నేను చూస్తా’ అంటూ బెదిరింపులకు దిగాడు. విషయాన్ని బాధిత ఉపాధ్యాయులు జిల్లా అధికారులకు నివేదించినట్లు తెలిసింది. ఈ విషయం బయటికి రావడంతో జిల్లా అధికారులు తొక్కిపెట్టారు. సదరు అధికార పార్టీ నాయకుడిని కాపాడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదంతా ప్రిన్సిపల్ గదిలో ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజ్‌ని పరిశీలిస్తే అసలు విషయం తెలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై ప్రిన్సిపల్ రవికాంత్‌ను వివరణ కోరగా బదులు ఇవ్వకుండా మాట మార్చి జారుకున్నారు. -
అడ్మిషన్లు అంతంతమాత్రమే
తిరుపతి సిటీ: జిల్లాలో ప్రభుత్వ, టీటీడీ, ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ ప్రవేశాల కోసం ఓఏఎమ్‌డీసీ విడుదల చేసిన తొలి విడిత మెరిట్ లిస్ట్ ప్రవేశాలు గురువారం ముగిశాయి. ప్రభుత్వ కళాశాలల్లో తొలి విడత ప్రవేశాలలో కనీసం 40 శాతం సీట్లు భర్తీ కాకపోవడం గమనార్హం. అలాగే టీటీడీ ఆధ్వర్యంలో నడస్తున్న ఎస్పీడబ్ల్యూ, ఎస్వీ ఆర్ట్స్, ఎస్జీఎస్ కళాశాల్లో మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రవేశాలు జరిగినట్లు తెలుస్తోంది. అలాగే జిల్లాలోని ప్రైవేటు డిగ్రీ కళాశాల సైతం తొలి విడతలో అంతంతమాత్రంగానే ప్రవేశాలు జరిగాయని గత ఏడాది కంటే పరిస్థితి దారుణంగా ఉందని యాజమాన్యాలు వాపోతున్నాయి. రెండవ విడత ప్రవేశాల ప్రక్రియ వచ్చేవారం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.టీటీడీ విద్యాసంస్థల్లో తొలి విడతలో జరిగిన ప్రవేశాల వివరాలు డిగ్రీ కళాశాల మొత్తం సీట్లు తొలివిడతలో కేటాయించినవి భర్తీ అయిన సీట్లు మిగిలినవి ఎస్జీఎస్ 1068 703 444 624 ఎస్వీ ఆర్ట్స్ 1417 1206 848 569 ఎస్పీడబ్ల్యూ 1550 1354 1115 435 -
కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిపై మరో అక్రమ కేసు, అరెస్టు
పెళ్లకూరు: టీడీపీ నాయకులు చేసిన రౌడీయిజానికి వత్తాసు పలికిన పోలీసులు పెళ్లకూరు మండలంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిపై మరోమారు నాన్‌బెయిల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆయనను కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో గురువారం నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. గ్రామంలోని సర్వే నంబరు 17లో ఉన్న సత్యనారాయణరెడ్డి భూములకు సంబంధించిన పంటకాలువ వద్ద బుధవారం సిమెంట్ పైపులు ఏర్పాటు చేసుకొని రోడ్డు నిర్మాణ పనులు చేయించుకుంటున్నారు. అదే సమయంలో గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రాకేష్‌రెడ్డి, కృష్ణారెడ్డి, చైతన్యకృష్ణారెడ్డి తమ అనుచరులతో కలిసి సంబంధిత భూముల వద్దకు చేరుకుని అనవసర రాద్ధాంతం చేస్తూ రౌడీయిజానికి దిగారు. దాడులకు తెగబడ్డారు. అదే సమయంలో వడ్డిపాళెం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వలిపి బాలయ్య(55).. కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని దుర్భాషలాడుతూ సంఘటనా స్థలానికి వెళుతూ సుమారు 50 మీటర్లు దూరంలో ఒక్కసారిగా స్పృహతప్పి కుప్పకూలిపడిపోయాడు. పోలీసులు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో పాటు ఘటనా స్థలంలోని వారంతా చూస్తుండగా కిందపడిపోయిన బాలయ్యను చికిత్సల నిమిత్తం వైద్యశాలకు తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. మరోమారు అక్రమ కేసులు ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్త బాలయ్య మృతికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేకపోయినా పోలీసులు మాత్రం 103(1), ఆర్/డబ్ల్యూ 3(5) సెక్షన్ల కింద కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, మద్దూరు భాస్కర్, మద్దూరు చందు, మద్దూరు శ్రీనివాసులు, మల్లి ధయాకర్, బండి శివకుమార్, బెల్లంకొండ రవిపై అక్రమ కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. సత్యనారాయణ రెడ్డిని 14రోజులు రిమాండ్ విధించి నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. మిగిలిన వారిని పోలీసు కస్టడీలో ఉంచారు. అనారోగ్య సమస్యతో బాలయ్య మరణిస్తే ఈ నెపాన్ని టీడీపీ నేతల ప్రోద్బలంతో పోలీసులు వైఎస్సార్సీపీ నేతలపై నెడుతూ అక్రమ కేసులు నమోదు చేయడం దారుణమని వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే మార్చి 14న కలవకూరు గ్రామం వద్ద స్వర్ణముఖినదిలో కూటమి నాయకులు చేస్తున్న ఇసుక దోపిడిపై ప్రశ్నించినందుకు సత్యనారాయణరెడ్డితో పాటు రైతులతో కలిపి మొత్తం 26మందిపై అక్రమ కేసులు పెట్టి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఆటోలో జైలుకు వెళ్లేందుకు కామిరెడ్డి నిరాకరణ వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని రిమాండ్ నిమిత్తం నెల్లూరు సబ్ జైలుకు ఆటోలో తీసుకెళ్లేందుకు పోలీసులు సిద్ధపడడంతో సత్యనారాయణరెడ్డి అభ్యంతరం చెప్పారు. నాయుడుపేట నుంచి నెల్లూరుకు ఆటో ప్రయాణం ప్రమాదకరమని, ఆర్టీసీ బస్సులో అయినా తీసుకెళ్లాలని స్థానిక ఎస్ఐ ఆదిలక్ష్మిని కోరారు. దీంతో ఏసీ వాహనాలు, లగ్జరీ వాహనాల్లో తీసుకెళ్లలేమని ఎస్ఐ ఆదిలక్ష్మి రుసరుసలాడారు. కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధులపైనా ఫొటోలు ఎందుకు తీస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు పోలీసు జీపులో సత్యనారాయణరెడ్డిని నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. -
గొల్లపల్లి సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు
తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం సి.గొల్లపల్లిలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో గురువారం క్యాంపస్ ఇంటర్వూలు నిర్వహించారు. బెంగళూరుకు చెందిన ప్రముఖ ‘గ్లోబల్ క్వస్ట్ టెక్నాలజీస్’ సంస్థ వారు ఇంజినీరింగ్ నాలుగవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. అన్ని రౌండ్లలో విశేష ప్రతిభ కనబరచిన 25 మంది విద్యార్థులు ఉద్యోగ అర్హత సాధించగా వారందరికీ నియామక పత్రాలను అందించారు. కళాశాలలో జరిగిన అభినందన సభలో ఉద్యోగ అర్హత సాధించిన విద్యార్థులను కళాశాల సెక్రటరీ వై.ఆనందరెడ్డి, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాజశేఖర్, ప్లేస్‌మెంట్స్ డైరెక్టర్ స్వామినాథ్, టీపీఓ భాస్కర్ తదితరులు అభినందించారు. -
వేడి సాంబార్ పడి ఒకరికి గాయాలు
తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్–2లో ప్రమాదవశాత్తు వేడి సాంబార్ ఒలికిపడి పడింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎన్.హరీశ్‌కుమార్ గాయపడ్డారు. అన్నప్రసాదం పంపిణీ సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. వెంటనే స్పందించిన టీటీడీ సిబ్బంది, భక్తులు హరీశ్‌కుమార్‌ను చికిత్స నిమిత్తం తిరుమల అశ్విని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలైనట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ‘రెవెన్యూ’కు సంజాయిషీ నోటీసులు సైదాపురం: మండలంలో రీసర్వే నత్తనడకన సాగుతుండడంతో సంబధిత రెవెన్యూ అధికారులకు నెల్లూరు ఆర్డీఓ అనూష గురువారం సంజాయిషీ నోటీసులను జారీచేశారు. రీ సర్వే ప్రక్రియలో 10(1) నోటీసులో ఉన్న వివరాలనే డీఎల్ఆర్ ఎంట్రీలకు కాపీ చేస్తున్నారని, క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించకుండానే కార్యాలయంలోనే నిర్వహిస్తున్నారంటూ పలువురు ఫిర్యాదు చేయడంతో ఈ నోటీసులు జారీ చేశారు. సైదాపురం తహసీల్దార్ కార్యాలయ అధికారులకు నోటీసులు అందాయి. క్షేత్ర స్థాయిలో అధికారులు రీసర్వే పనుల్లో తీవ్ర జాప్యం చేయడంతో నాలుగో విడత రీసర్వే గ్రామాలైన పాతాళపల్లి, మిట్టపల్లి, నల్లబొట్లపల్లి, ఓరుపల్లి, కేజీఆర్పాళెం డీఎల్ఆర్లోనే ఉండిపోయాయి. అలాగే మొలకలపూడి, పొక్కందల, ఈదలకండ్రిగ, తోచాం, కృష్ణారెడ్డిపల్లి గ్రామాల్లో జరిగిన సర్వే వీఆర్వో, వీఎస్ లాగిన్‌లోనే ఉండడంతో ఈ నోటీసులను జారీ చేసినట్టు తెలిసింది. జాతీయ స్థాయి కరాటే పోటీల్లో బంగారు పతకం తిరుపతి సిటీ: హైదరాబాద్ వేదికగా ఈనెల 5వ తేదీ నుంచి రెండు రోజుల పాటు జరిగిన ఆల్ ఇండియా కరాటే చాంపియన్‌షిప్‌లో తిరుపతి విశ్వసాయి జూనియర్ కళాశాల విద్యార్థి టీ.జశ్వంత్‌రెడ్డి గోల్డ్‌మెడల్ సాధించారు. ఈ సందర్భంగా విశ్వసాయి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ, వైస్ చైర్మన్ కృష్ణమోహన్, డైరెక్టర్ శివసంకేత్ మాట్లాడుతూ తిరుపతి బ్రాంచ్‌కు చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విద్యార్థి జశ్వంత్‌రెడ్డి జాతీయ స్థాయి కరాటే పోటీలలో రెండు ఈవెంట్లలోనూ గోల్డ్‌మెడల్స్ సాధించండం కళాశాలకు గర్వకారణమన్నారు. తమ కళాశాలలో అకడమిక్ విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులను ప్రొత్సహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా గోల్డ్‌మెడల్ సాధించిన విద్యార్థిని ప్రిన్సిపల్, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది ఘనంగా సత్కరించి అభినందించారు. ముక్కంటి సేవలో శ్రియా చరణ్ శ్రీకాళహస్తి రూరల్: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని గురువారం ప్రముఖ సినీనటి శ్రియా చరణ్ దర్శించుకున్నారు. దక్షిణగోపురం వద్ద ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం మృత్యుంజయ స్వామి సన్నిధి వద్ద వేదపండితులు ఆమెను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యురాలు కోలా వైశాలి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
పుష్ప ప్రదర్శన ఏర్పాట్లు ముమ్మరం
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమలలోని పురోహిత సంఘం వద్ద ప్రత్యేక పుష్ప ప్రదర్శనకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక ఆకృతులను తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భక్తులకు ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించేలా పుష్ప ప్రదర్శనను అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే ప్రదర్శన ఏర్పాట్లకు సంబంధించిన పనులు ప్రారంభం కాగా, సిబ్బంది వాటిని వేగవంతం చేశారు. పుష్పాల ఎంపిక, అలంకరణ, వివిధ ఆకృతుల రూపకల్పన పనులు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే నాటికి పుష్ప ప్రదర్శనను పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు నిర్వాహకులు చర్యలు చేపడుతున్నారు. – తిరుమల -
కొత్తమార్గాలకు లైన్ క్లియర్!
రాజంపేట: దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే మార్గాల్లో ఒకటైన రేణిగుంట–గుంతకల్లు సెక్షన్‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది. బంగాళాఖాతం – అరేబియా మహాసముద్రాలను అనుసంధానించే అత్యంత కీలకమైన ముంబయి–చైన్నె రైల్వే కారిడార్‌లో కొత్తగా మూడు, నాలుగు లైన్ల నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దాదాపు రూ.4,500 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంత ప్రజల 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ప్రతి 7.5 నిమిషాలకో రైలు 310 కిలోమీటర్ల పొడవు కలిగిన రేణిగుంట–గుంతకల్ సెక్షన్ మధ్య ప్రస్తుతం రెండు లైన్లు మాత్రమే ఉన్నాయి. ఈ మార్గంలో ప్రతిరోజూ దాదాపు 190 రైళ్లు నడుస్తున్నాయి. అంటే సగటున ప్రతి 7.5 నిమిషాలకు ఒక రైలు ఈ ట్రాక్‌పై ప్రయాణిస్తోంది. రైల్వే భద్రతా ప్రమాణాల ప్రకారం ఒక రైలుకు, మరో రైలుకు మధ్య కనీసం 15 నిమిషాల వ్యవధి ఉండాలి. కానీ, ప్రస్తుత రద్దీ వల్ల ప్రమాదకర పరిస్థితులు నెలకొనడమే కాకుండా, రైళ్లను చిన్న చిన్న స్టేషన్లలో లేదా ఔటర్లలో గంటల తరబడి నిలిపివేయాల్సి వస్తోంది. కొత్తగా 3, 4 లైన్లు అందుబాటులోకి వస్తే ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం లభించనుంది. కృష్ణపట్నం పోర్టుకు మహర్దశ ఈ లైన్ల నిర్మాణం పూర్తయితే కృష్ణపట్నం ఓడ రేవుకు గూడ్స్ రైళ్ల ద్వారా సరుకులను అత్యంత వేగంగా చేరవేసే వెసులుబాటు కలుగుతుంది. ఈ కొత్త లైన్లలో రైళ్లు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా అధునాతన సాంకేతికతతో నిర్మించనున్నారు. ఈ మార్గంలో సున్నపు రాయి, సిమెంట్, ఇనుప ఖనిజం, ఉక్కు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల రవాణా వేగవంతం కావడం వల్ల రైల్వే శాఖకు ఆదాయం భారీగా పెరుగుతుంది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సకాలంలో నగరాలకు చేర్చవచ్చు. ఈ కారిడార్ వెంబడి ఉన్న పలు గ్రామాలు పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందనున్నాయి. రంగంలోకి యంత్రాంగం ఈ మెగా ప్రాజెక్టు కోసం ఆరు నెలల కిందటే రైల్వే అధికారులు క్షేత్రస్థాయి సర్వే పూర్తి చేశారు. తాజాగా కేంద్ర అనుమతులు రావడంతో, రైల్వే చట్టం 1989 సెక్షన్ 2(37ఎ) కింద దీనిని ఒక ప్రత్యేక ప్రాజెక్టుగా ప్రకటిస్తూ భూసేకరణకు అధికారులు ముందడుగు వేశారు. ఈ మేరకు వైఎస్సార్ కడప, తిరుపతి, అనంతపురం జిల్లాల పరిధిలో అవసరమైన భూమిని సేకరించేందుకు రైల్వే యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రేణిగుంట–గుంతకల్లు మధ్య 3, 4 లైన్ల మార్గం నేతల హర్షం ముంబయి–చైన్నె రైల్వే కారిడార్‌లో అత్యంత కీలకమైన రేణిగుంట–గుంతకల్లు మధ్య 3, 4 లైన్ల నిర్మాణానికి కేంద్రం అనుమతించడంపై రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఈ 310 కిలోమీటర్ల మార్గంలో నిత్యం ప్రయాణికులు, సరకు రవాణా రైళ్ల ఒత్తిడి ఎక్కువగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ ఫోర్‌లైన్ నిర్మాణం పూర్తయితే రైళ్లు గంటల తరబడి ఔటర్లలో వేచి ఉండే ఇబ్బందులు తొలగిపోతాయని, ప్యాసింజర్, గూడ్స్ రైళ్ల రాకపోకలు ఎలాంటి అంతరాయం లేకుండా సాఫీగా సాగుతాయని నేతలు స్పష్టం చేశారు. రైలుమార్గం కి.మీ గుంతకల్–రేణిగుంట 298 సెష్టన్లు 36 రైళ్ల వేగం 150 ప్రధాన రైల్వే కేంద్రాలు కడప, నందలూరు, రేణిగుంట, గుత్తి, గుంతకల్లు, ఎర్రగుంట్ల మార్గంలో –150 ప్యాసింజర్‌రైళ్లు..40 ఎక్స్‌ప్రెస్ రైళ్లు –డైలీ 40 గూడ్స్ రైళ్లకు 1.20లక్షల టన్నుల రవాణా రవాణా బాక్స్ ఎన్లోడ్స్, బీసీ ఎన్లోడ్స్ ఆయిల్ ట్యాంక్ లోడ్స్, కంటైయినర్ లోడ్స్ -
సృజనశీలురు.. బాల మేధావులు
గ్రీన్హౌస్ పర్యావరణాన్ని నియంత్రించేరోబోట్ మానవ రహిత టాయ్‌లెట్ క్లీనింగ్జిల్లాకు చెందిన చిన్నారులు తమ మేధస్సుకు పదును పెట్టి రూపొందించిన నమూనాలు జాతీయ స్థాయికి ఎంపికయ్యాయి. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో లభించిన కఠిన శిక్షణ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాము ఏకాగ్రతతో నమూనాలు రూపొందించడం వల్లే విజయం సాధ్యమైందని చిన్నారులు చెబుతున్నారు. భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశానికి సేవ చేస్తామని సగర్వంగా చెబుతున్నారు. తిరుపతి ఎడ్యుకేషన్ : ఓ చిన్ని ఐడియా జీవితాన్నే మార్చివేస్తుందన్నట్టు విద్యార్థుల్లో మొలకెత్తే ఆలోచనలకు పదును పెట్టిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం విద్యార్థులతో అడుగులు వేయిస్తోంది. ప్రతి ఏటా ఇన్స్పైర్ పేరుతో విద్యార్థులతో ప్రాజెక్టులు తయారుచేయిస్తోంది. వీటిలోని ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేసి వారిని ఆర్థికంగా, విద్యాపరంగా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా 2023–2024 విద్యా సంవత్సరం, 2024–2025 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రస్థాయి ప్రదర్శనను ఆన్లైన్ ప్రాతిపదికన నిర్వహించారు. ఇందులో 2023–24కు సంబంధించి 3 ప్రాజెక్టులు, 2024–25కు సంబంధించి 2 ప్రాజెక్టులు, మొత్తం 5 ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపికై నట్లు ఇటీవలే ప్రకటించారు. వ్యక్తిగత, పబ్లిక్ టాయ్లెట్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడం, దుర్వాసనను నివారించడం, టాయ్లెట్ల నుంచి వ్యాపించే వ్యాధులను నివారించడమే ఆటోమేటిక్ టాయ్‌లెట్ ఫ్లషింగ్ సిస్టం ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టును వరదయ్యపాళెం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని ఎం.గౌతమి గైడ్ టీచర్ ఎం.సుబ్బరామయ్య మార్గనిర్దేశంతో రూపొందించింది. 2024–25విద్యా సంవత్సరానికి సంబంధించి జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికయ్యింది. మానవ రహిత టాయ్‌లెట్ క్లీనింగ్ ద్వారా టాయ్‌లెట్‌కు వెళ్లిన ప్రతిమారు చేతితో ఫ్లష్‌ను నొక్కాల్సిన అవసరం ఉండదు. ఈ సిస్టంను వ్యక్తిగత, పబ్లిక్ టాయ్లెట్స్తోపాటు పాఠశాలలు, రైళ్లు, బస్టాండ్లలో ఉపయోగించడం ద్వారా టాయ్లెట్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంటూ దుర్వాసన రాకుండా ఉండడంతో పాటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉంటుంది. ఈ సిస్టం తక్కువ నీటిని వినియోగించుకోవడంతో నీటిని ఆదా చేసుకోవచ్చు. గ్రీన్హౌస్ వాతావరణ నియంత్రణ రోబోట్ వర్కింగ్ మోడల్‌ను తిరుపతిలోని సెవెన్ హిల్స్ హైస్కూల్ విద్యార్థిని ఎస్.విజయసాయి గైడ్ టీచర్ డి.భువనేశ్వరి పర్యవేక్షణలో రూపొందించింది. 2023–2024 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ ప్రాజెక్టు జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికయ్యింది. ఈ పరికరంలో ఏర్పాటుచేసిన వివిధ సెన్సార్లు వాతావరణంలోని ఉష్ణోగ్రత, తేమ, కాంతి తీవ్రత, నేలలోని తేమ వంటి కీలకమైన వాతావరణ, నేల పారా మీటర్లను పర్యవేక్షిస్తుంది. అలాగే వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ నమోదు చేస్తుంది. ఈ పరికరం గ్రీన్హౌస్ వాతావరణాన్ని నియంత్రించేందుకు అనువుగా రూపొందించారు. తద్వారా వాతావరణంలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని వాతావరణ సమతుల్యత చేపట్టవచ్చు. -
పేషెంట్ మానిటరింగ్ సిస్టమ్ విత్ ఆటోమేటిక్ ఎస్ఎంఎస్ అలెర్ట్
పేషెంట్ మానిటరింగ్ సిస్టమ్ విత్ ఆటోమేటిక్ ఎస్ఎంఎస్ అలెర్ట్ వర్కింగ్ మోడల్‌ను వడమాలపేట మండలనం, ఎస్వీ పురం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని ఎన్.మేఘన గైడ్ టీచర్ ఎం.నరసింహారెడ్డి పర్యవేక్షణలో రూపొందించింది. 2023–2024 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఈ ప్రాజెక్టు జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికయ్యింది. ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం రోగి శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందన రేటును నిరంతరం పర్యవేక్షిస్తుంది. వివిధ సెన్సార్ల ద్వారా సేకరించిన సమాచారాన్ని మైక్రో కంట్రోలర్ ద్వారా ప్రాసెస్ చేస్తుంది. ఏదేని అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు వెంటనే ఈ పరికరం స్పందించి సంబంధిత డాక్టర్‌ను ఎస్ఎంఎస్ రూపంలో అలెర్ట్ చేస్తుంది. తద్వారా ఆ రోగిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడేందుకు దోహదపడుతుంది. పంట పొలాల్లో పనిచేసే రైతులు, ముఖ్యంగా రాత్రి వేళల్లో పాము కాటు నుంచి తప్పించుకోవడానికి రూపొందించిందే ఈ రక్షణ బూటు. ఈ వర్కింగ్ మోడల్‌ను తడ మండలం, వటంబేడు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థి ఎన్.ధనుష్ గైడ్ టీచర్ వై.వెంకటరమణయ్య పర్యవేక్షణలో తయారుచేశాడు. 2024–25కు సంబంధించి జాతీయ స్థాయికి ఈ ప్రాజెక్టు ఎంపికయ్యింది. గట్టి లెదర్‌తో ఈ షూను రూపొందించాడు. షూ ముందువైపు ఆన్/ఆఫ్ చేసుకునేలా చిన్న లైటు, చిన్న బర్జర్‌ను అమర్చాడు. రాత్రి వేళల్లో రైతులు పొలాలకు వెళ్లినప్పుడు గట్టుపై ఉన్న పాములు ఈ షూ నుంచి వచ్చే కాంతి, అలాగే బర్జర్ సౌండ్‌తో దూరంగా వెళతాయి. తద్వారా పాము కాటు బారిన పడరు. ఈ షూ గట్టి లెదర్‌తో చేయడంతో దీర్ఘకాలిక మన్నిక ఉంటుంది. చేతిలో టార్చ్‌లైట్, గట్టిగా శబ్ధం చేయాల్సిన పని నుంచి రైతుకు ఉపశమనం లభిస్తుంది. స్మార్ట్ అలారం ఫర్ ది క్రేజీ చెఫ్ వంట చేసేటప్పుడు ఆహారం వృథా కాకుండా చేయడమే ‘‘స్మార్ట్ అలారం ఫర్ ది క్రేజీ చెఫ్’’ లక్ష్యం. తిరుపతి భారతీయ విద్యాభవన్ విద్యార్థిని సీహెచ్‌కే శ్రీహిత గైడ్ టీచర్ విజయలక్ష్మి పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టును రూపొందించింది. 2023–2024కు సంబంధించి ఈ ప్రాజెక్టు జాతీయ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌కు ఎంపికయ్యింది. ఆహారం వృథా కాకుండా, మాడిపోకుండా ఉండేందుకు వంట చేసే వ్యక్తికి ఆ వంటకం ఉష్ణోగ్రత స్థితిని తెలియజేసేదే ఈ పరికరం ఉద్ధేశం. ఈ పరికరం వంట చేసే వ్యక్తి నమోదు చేసిన ఉష్ణోగ్రత ఆదేశాల మేరకు పనిచేస్తుంది. గ్యాస్ స్టవ్‌పై వంటకం ఉంచి అవసరమైన ఉష్ణోగ్రతను ఈ పరికరంలో నమోదు చేయాలి. స్టవ్‌ను ఆఫ్ చేయడం మరిచిపోతే వెంటనే ఈ పరికరం నుంచి అలారం వస్తుంది. తద్వారా స్టవ్‌ను ఆఫ్ చేయవచ్చు. ఈ పరికరం వంట చేస్తున్న విషయాన్ని విషయాన్ని మరిచిపోయే స్వల్పకాలిక జ్ఞాపకశక్తి సమస్య ఉన్న వారికి ఈ పరికరం ఎంతో ఉపయోగకరం. పాము కాటు నుంచి రైతుకు రక్షణ బూటు -
టీడీపీ గుండాయిజం
పెళ్లకూరు: మండలంలోని చిల్లాకూరు గ్రామంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి బుధవారం తన వ్యవసాయ భూములకు చెందిన పంట కాలువ పనులు చేస్తుండగా స్థానిక టీడీపీ నాయకులు రాకేష్‌రెడ్డి, చైత్యకృష్ణారెడ్డి తదితరులతో కలిసి పనులను అడ్డుకుని రౌడీయిజం చేశారు. గ్రామంలో ఉన్న సత్యనారాయణరెడ్డి కుమార్తెకు చెందిన వ్యవసాయ భూములకు సాగు నీరు అందించే పంట కాలువ పనులను కూలీలతో చేయించుకుంటున్నారు. దాంతో స్థానిక టీడీపీ నాయకులు అల్లరిమూకలతో కలిసి పనులను అడ్డుకున్నారు. సత్యనారాయణరెడ్డి అనుచరులపై దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివాదాన్ని సర్దుబాటు చేశారు. టీడీపీ దుష్ప్రచారం చిల్లకూరు వడ్డిపాళెం గ్రామానికి చెందిన వలిపి బాలయ్య(55) మృతిపై గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారం మంచిది కాదని స్థానికులు అంటున్నారు. బుధవారం వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి పంట కాలువ పనులను చేయించుకుంటుండగా గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు రాకేష్‌రెడ్డి, చైత్యకృష్ణారెడ్డి, కృష్ణారెడ్డి, లోకేష్‌నాయుడు పలువురు ఆ పార్టీ అల్లరిమూకలతో కలిసి అక్కడికి చేరుకుని రౌడీయిజం చేశారు. ఈక్రమంలో చిల్లకూరు వడ్డిపాళెం గ్రామానికి చెందిన బాలయ్య ఘర్షణ సమయంలో దూరంగా నిలబడి చూస్తుండగా అనారోగ్య సమస్యలతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీన్ని గుర్తించిన స్థానికులు, పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న బాలయ్యను హుటాహుటిన పెళ్లకూరు పీహెచ్‌సీకి చికిత్స నిమిత్తం తరలించారు. పరిశీలించిన వైద్యులు అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. కాని టీడీపీ శ్రేణులు మాత్రం శవ రాజకీయాలు చేస్తూ ఆపార్టీకి చెందిన సోషల్ మీడియా గ్రూపుల్లో బాలయ్య మృతి పట్ల తీవ్ర దుష్ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఏమిటో పోలీసులకు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పూర్తిగా తెలిసినప్పటికీ లేనిపోని ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
బ్రహ్మోత్సవాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్
పైసలిస్తేనే ఫైళ్లు కదిలేది! సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఏదైనా ఫైలు కదలాలంటే సిబ్బందికి ముడుపులు చెల్లించాల్సిందే.పుస్తకాలతో స్నేహం చేయించాలి విద్యార్థులను మొబైల్‌కు దూరంచేసి పుస్తకాల తో స్నేహం చేసేలా మార్చాలని డీఈవో ఉపాధ్యాయులకు సూచించారు.సర్టిఫికెట్లలో కూలాలు మారిపోతున్నాయి ఉద్యోగులు చేసిన తప్పులకు ప్రజలకు అవస్థలు ●గురువారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026పుట్టింది ఓ కులం.. ధ్రువీకరణపత్రంలో మరోకులం. పింఛన్‌కు అర్జీ ఇవ్వాలంటే కుదరదు. సంక్షేమ పథకంలో లబ్ధిపొందాలంచే వీలుకాదు.. చివరికి తానను తానే అని నిరూపించుకోవాలన్నా.. సాధ్యంకావడం లేదు. ఇందంతా ఏ ఒక్కరి సమస్యో కాదు.. అధికారులు తప్పుల తడకగా కుల ధ్రువీకరణ పత్రాలివ్వడం వల్ల జిల్లా వ్యాప్తంగా వందలాది మంది పడుతున్న నరకయాతన. ఇక కులధ్రువీకరణం పత్రం సవరణ కోసం.. వారు పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో వీఆర్ఓ, తహసీల్దార్, ఆర్డీఓ సహా చివరికి జాయింట్ కలెక్టర్ కార్యాలయం వరకూ సగటున రెండు నెలలకు పైగా కాళ్లరిగేలా తిరుగుతున్నా.. ప్రయోజనం కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో పేరెన్నికగన్న కపట కూటమి ప్రభుత్వం ఈనెల 16 వరకే అర్జీలు స్వీకరిస్తామని హుకుం జారీ చేయడంతో.. అర్హులంతా.. హలో లక్షణా.. హథవిథీ అంటూ సకాలంలో దరఖాస్తులందజేయలేక.. అల్లాడిపోతున్నారు. వీరి పట్టించుకునే నాథుడుకానీ.. సమస్యను పరిష్కరించే నాయకుడు గానీ ప్రభుత్వంలో కనిపించడం లేదంటే అతిశయోక్తికాదు. ఇంకా ఎంత కాలం తిరగాలో? మా కులం ఈడిగ (బీసీ–బీ). అయితే రెండు నెలల క్రితం మా పిల్లలు మా పాఠశాలలో చేర్పించడానికి కులధృవీకరణ పత్రం కోసం సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నాం. అయితే వారు మా కులం ఈడిగ కాకుండా ఆన్లైన్లో జంగమ (బీసీ–బీ) అని ఉందని అలా ఇస్తామని లేదంటే జాయింట్ కలెక్టర్ లాగిన్‌లో మార్పు చేయించుకోవాలని చెప్పారు. దీంతో రెండు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. నా తోపాటు మా భర్త, మా ఇద్దరు పిల్లల కులం కూడా జంగమ గా మారిపోయింది. ఇప్పటికే రెండు నెలలు నుంచి తిరుగుతున్నాం. ఇంకా ఎంతకాలం పడుతుందో తెలియడం లేదు. – భువనేశ్వరి, పాండూరు గ్రామం, వరదయ్యపాళెం మండలం ఇంతమంది వద్దకు తిరగాలా? మా కమ్యూనిటీ రెడ్డి (ఓసీ), అయితే కమ్మ (ఓసీ)గా మారిపోయింది. ఆ తర్వాత వీఆర్వో నుంచి తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్ సీ సెక్షన్, డీఆర్వో, జాయింట్ కలెక్టర్ ఇంతమంది అధికారుల పర్యవేక్షణ అనంతరం ఎట్టకేలకు కమ్యూనిటీని మార్పు చేయించుకున్నాం. క్షేత్రస్థాయి నుంచి జాయింట్ కలెక్టర్ వరకు ఆరుగురు అధికారుల వద్దకు వెళ్లి తప్పుగా పడిన కమ్యూనిటీని మార్పు చేసుకోవడానికి నానా తంటాలు పడ్డాం. ఎక్కడ పొరపాటు జరిగిందే గానీ తహసీల్దార్ పరిధిలోనే తప్పును సవరిస్తే కాస్తా ఇబ్బందులు తప్పుతాయని అంతా భావిస్తున్నాం. – రత్నం, శ్రీకాళహస్తి మండలం బీసీ(ఏ) అయితే బీసీ(డీ)గా మార్చేశారు మా కమ్యూనిటీ బీసీ(ఏ) అయితే బీసీ(డీగా మా కుమార్తె సర్టిఫికేట్లో మా ర్పుచేశారు. బీసీ ఏ అయితే ఇంజినీరింగ్‌లో మంచి కాలే జ్లో సీటు వస్తుంది. అయి తే బీసీ డీ అయితే సీటు రాదు. దాంతో కమ్యూనిటీ సర్టిఫికెట్‌ను మార్పు చేసుకోవడానికి అధికారుల చుట్టు తిరుగుతున్నాను. ఇలా ఎందుకు జరిగిందో తెలియం లేదు. చాలామంది తమ పిల్లల సర్టి ఫికెట్స్ కోసం సచివాలయంకు వెళితే కమ్యూనిటీ మారిపోయినట్లు చెబుతున్నారు. – జయరాం, ఏర్పేడు మండలం తిరుపతి అర్బన్: పిల్లల చదువుల కోసం, ఉద్యోగాల కోసం, పింఛన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి పలువురు తమ కుల ధ్రువీకరణ పత్రాన్ని పొందడానికి సచివాలయాలకు వెళుతున్నారు. అయితే ఆన్లైన్లో వారి కులం మారిపోయి ఉండడంతో లబోదిబోమంటూ వాపోతున్నారు. సచివాలయ ఉద్యోగులు మాత్రం జేసీ లాగిన్‌లో మార్పు చేసుకోండి అంటూ సలహాలు ఇచ్చేస్తున్నారు. మార్పు చేయడానికి వీఆర్వో వద్ద నుంచి మొదలుపెట్టి తహసీల్దార్, తర్వాత ఆర్డీవో, అక్కడి నుంచి కలెక్టరేట్ సీ–సెక్షన్‌కు ఆ తర్వాత డీఆర్వో నుంచి జాయింట్ కలెక్టర్ లాగిన్‌కు ఫైల్ వెళ్లాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి పేదలకు నెల నుంచి రెండు నెలల సమయం పడుతోంది. దీంతో పేద, సామాన్య, మధ్య తరగతికి చెందిన వారు అల్లాడిపోతున్నారు. తప్పులను తహసీల్దార్ పరిధిలో సవరిస్తే అందరికి అనుకూలంగా ఉండేదని ఆవేదన చెందుతున్నారు. ఎన్నో అవస్థలు కొందరు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఎస్సీలుగా మారిపోవడంతో వారు పింఛను దరఖాస్తులు చేసుకోలేకవాపోతున్నారు. ఎస్టీలకు 50ఏళ్లకు పింఛనుకు దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఉంది. ఎస్సీలు అయితే 60ఏళ్లకు పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఎస్టీలకు ఆన్లైన్లో ఎస్సీలుగా కమ్యూనిటీ మారిపోయి ఉండడంతో దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఈ అంశాన్ని గుర్తించి తహసీల్దార్ పరిధిలోనే కులధ్రువీకరణలో చోటుచేసుకున్న పొరబాట్లుకు పరిష్కారం చూపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. 30 నుంచి 40 రోజులు సర్టిఫికెట్లలో సవరణలకు ఆరుగురు అధికారులు.. పర్యవేక్షణ చేసి అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ వారంతా తప్పులతో ఉన్న పాత సర్టిఫికెట్‌ను రిజెక్ట్ కొట్టాల్సి ఉంది. అనంతరం కొత్తగా తప్పులు లేకుండా సచివాలయంలో సర్టిఫికెట్లకు దర ఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ప్రతిరోజూ అధికారుల చుట్టూ తిరిగినా కనీసం.. సర్టిఫికెట్‌ను సవరించుకోవడానికి 30 నుంచి 40 రోజుల సమయం పడుతోంది. ఈ ప్రభుత్వంలో తహసీల్దార్‌కు, ఆర్డీవోకు పూర్తి అధికారాలు ఇచ్చేశామంటూ ఏడాదిగా ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. చిన్నపాటి సర్టిఫికెట్లో పొరబాటు ను సవరించడానికి తహసీల్దార్‌కు, ఆర్డీవోకు పవర్ లేదు.. జాయింట్ కలెక్టర్ వద్దకు వెళ్లి రావాల్సి ఉంది. దీంతో పలువురు మండిపడుతున్నారు. – జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ తిరుపతి మంగళం:తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవా ల్లో నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా వాహనాలు నడిపితే అలాంటి వాహనాలను సీజ్ చేస్తామని జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ హెచ్చరించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో బుధవారం తిరుమల ఘాట్ రోడ్డులో రవాణా, పోలీస్ శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ప్రపంచ నలుమూలల నుంచి వేలాది మంది భక్తు లు తిరుమలకు విచ్చేస్తుంటారని, వారిని సురక్షితంగా వారి గమ్యాలకు చేర్చే బాధ్యత ట్యాక్సీ వాహనదారులపై ఉందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే అలాంటి వాహనాలను సీజ్‌చేసి జరిమానా విధించి, ఆ వాహనాలను తిరుమలకు వెళ్లకుండా నిషేధిస్తామని హెచ్చరించారు. వాహనదారులు చేసే చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని ప్రతి వాహనదారుడు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఈ ప్రత్యేక తనిఖీలలో ఎంవీఐ, వెంకటరమణ నాయక్, ఎ ఎంవీఐ ప్రసాద్ వర్మ, ట్రాఫిక్ ఎస్ఐ , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కులం మార్పు చేశారు.. పింఛన్ కోల్పోతున్నా ఎస్టీలకు 50 ఏళ్లు నిండితే వృద్ధాప్య పింఛనుకు వర్తిస్తుంది. నాకు 51 ఏళ్లు. పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి సచివాలయానికి వెళ్లాను. సచివాలయ ఉద్యోగులు ఆన్లైన్లో నా కులం ఎస్సీగా ఉందని చెప్పారు. ఎస్సీలకు 60ఏళ్లు నిండి ఉంటేనే పింఛన్ వస్తుందని చెబుతున్నారు. నేను ఎస్సీ కాదు ఎస్టీ అంటూ మొత్తుకున్నాను. వారు జాయింట్ కలెక్టర్ లాగిన్‌కి వెళ్లి కమ్యూనిటీని మార్పు చేసుకుని వస్తే.. దరఖాస్తు చేస్తామని చెబుతున్నారు. మార్పు చేసుకోవాలంటే రెండు నెలలు సమయం పడుతుందని అంతా చెబుతున్నారు. అయితే ఈ నెల 16 వరకు మాత్రమే పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఇచ్చారు. నాకు న్యాయం చేయండి స్వామీ. – గంగయ్య, వెన్నలకంటి రాఘవయ్య ఎస్టీకాలనీ -
ముక్కంటి హుండీ ఆదాయం రూ.1.51కోట్లు
శ్రీకాళహస్తి రూరల్: శ్రీకాళహస్తీశ్వరాలయ హుండీ ఆదాయం రూ.1,51,82,310 వచ్చినట్లు ఈవో బీకే వెంకటేశులు తెలిపారు. బుధవారం ఆలయ ఆవరణంలోని కొట్టు మండపంలో హుండీ కానుకలను లెక్కించారు. ప్రధాన హుండీలతో పాటు పరివార దేవతల వద్ద ఉన్న హుండీల ద్వారా బంగారం 22 గ్రాములు, వెండి 360 కేజీలు, విదేశీ కరెన్సీ నోట్టు 103 వచ్చాయి. ఈ కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ముగిసిన గ్రంథాలయ జాతీయ సదస్సు తిరుపతి సిటీ: ఎస్వీయూలో మూడు రోజుల పాటు నిర్వహించిన గ్రంథాలయ జాతీయ సదస్సు బుధవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ఎస్వీయూ రిజిస్ట్రార్ భూపతినాయుడు, శ్యాప్ చైర్మన్ రవినాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో పలు విశ్వవిద్యాలయాల నుంచి గ్రంథాలయ మేధావులు ఇచ్చిన అతిథి ఉపన్యాసాలు ఎంతో ఉపయోగకరంగా, ఆధునికంగా ఉన్నాయని అలాగే వివిధ గ్రంథాలయాధికారులు, పరిశోధనా విద్యార్థులు సమర్పించిన పరిశోధనా పత్రాలు ఎంతో గుణాత్మకంగా ఉన్నాయని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రంథాలయాలను ఆధునీకరించవలసిన అవసరం ఏంతైనా ఉందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర గ్రంథాలయాల అభ్యున్నతి కోసం ఎంతగానో పాటుపడుతుందని తెలియజేశారు. అమరావతిలో దేశంలోనే అతి పెద్ద గ్రంథాలయాన్ని నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెమినార్ డైరెక్టర్ డాక్టర్ కె. నాగేశ్వరరావు, ద్రవిడ విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి ఆచార్య ఎం.దొరస్వామి, సెమినార్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఆచార్య కొంగర సురేంద్రబాబు, గ్రంథాలయశాస్త్ర శాఖాధిపతి డాక్టర్ ప్రశాంత కుమారి, అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారు. తహసీల్దార్‌కు తృటిలో తప్పిన ప్రమాదం సూళ్లూరుపేట: సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీచెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం దక్షిణం వైపు ఆర్చి వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తహసీల్దార్ గోపాలకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది. సూళ్లూరుపేట నుంచి చైన్నె వెళ్లేందుకు ఆర్చి వద్ద మలుపు తిరుగుతున్న సమయంలో నెల్లూరునుంచి చైన్నె వైపు వెళ్లే మినీ లారీ కారును ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. మినీ లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయింది. ప్రమాదం జరిగిన సమయంలో గోపాలకృష్ణ ఒక్కరు కారులో ఉండడంతో అదృష్టవశాత్తూ ఆయనకు ఎలాంటి గాయాలు లేకుండా ప్రమాదం నుంచి బయటపడ్డారు. -
అభివృద్ధి పేరుతో ప్రజాధనం స్వాహా
నాయుడుపేట టౌన్: చంద్రబాబు ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో సూళ్లూరుపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పేరుతో కోట్లాది రూపాయల నిధులు ప్రజాధనం స్వాహా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య తీవ్రస్థాయిలో విమర్శించారు. బుధవారం పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సూళ్లూరుపేట, ఓజిలితో పాటు పలు మండలాల్లో చేపడుతున్న ఎఫ్డీఆర్ పనుల్లో సుమారు రూ.20 కోట్లకు పైగా అవకతవకలు జరుగుతున్నాయన్నారు. ఆర్ఆర్ పనులకు కేటాయించిన రూ.10 కోట్ల నిధుల వ్యయంలోనూ అక్రమాలు జరుగుతున్నాయని సంజీవయ్య విరుచుకు పడ్డారు. ఎమ్మెల్యే అనుచరులకు బినామీ పేర్లతో స్థలాలు కేటాయించి ప్రజా ఆస్తులను సైతం దోచుకుంటున్నారని విమర్శించారు. ఓజిలి మండలంలోని కుందాం, మాచవరం తదితర గ్రామాల్లోని సెజ్ భూముల్లో ప్రభుత్వ అసైన్మెంట్ భూములను ప్రభుత్వ బినామీ పేర్లతో మార్చి కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం లూటీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో ఇసుక, మట్టి, గ్రావెల్ పేరుతో ప్రభుత్వానికి ఎటువంటి పన్ను చెల్లించకుండానే కోట్ల రూపాయలు దోచుకుంటున్నారన్నారు. ఉచిత ఇసుక పథకం మాటున అక్రమ వసూళ్లు, దోపిడీ జరుగుతోందని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురిస్తున్నా అధికారులు స్పందించడం లేదని సంజీవయ్య ఆరోపించారు. ఒక్క ఓజిలి మండలంలోనే సగుటూరు చెరువులో ఎఫ్డీఆర్ నిధులు రూ.10కోట్లు కేటాయించినా అందులోను ఎమ్మెల్యే అనుచరులు దిగమింగుతున్నారని రుజువులతో సహా సంజీవయ్య విలేకరులకు చూపించారు. ఒక్క సగుటూరు చెరువు కట్టపై ఉన్న విలువైన నల్లకర్ర తుమ్మ తదితర చెట్లను పంచాయతీ అనుమతులు లేకుండానే నరికివేసి సుమా రు రూ.50 లక్షలకు పైగా స్వాహా చేశారని ఆరోపించారు. ఇందకు సంబంధించిన సాక్ష్యాలు సైతం ఉన్నాయని సంజీవయ్య చూపించా రు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు సంబంధించి బినా మీ కాంట్రాక్టర్ల ఒత్తిళ్లతో అధికారులు సైతం భయపడుతున్నారన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు వెలుగులోకి వస్తున్నప్పటికీ జిల్లా కలెక్టర్‌తో పాటు ఆర్డీవో, తదితర శాఖల అధికారులు సైతం స్పందించక పోవడం బాధకరమన్నారు. విచారణ జరిపించండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, బినామీలు చేస్తున్న అవినీతిపై ఎమ్మెల్యేకి ఎలాంటి ప్రమేయం లేకపోతే వారం రోజుల్లోగా జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సమగ్రంగా విచారణ జరిపించి ప్రజలకు పత్రికా ముఖంగా వెల్లడించాలని సంజీవయ్య డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు పార్టీ అధినాయకులు రుజువులు సైతం చూపిస్తున్న విషయం తెలిసిందేనని సంజీవయ్య వెల్లడించారు. దీనిపై నిరాహార దీక్షలు, ర్యాలీలు నిర్వహిస్తూ సీబీఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. తప్పుచేయని వారు సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అవినీతి అక్రమాలకు అడ్డాగా సూళ్లూరుపేట కార్యకర్తల జోలికొస్తే ఉపేక్షించం స్వర్ణముఖి నదిని ధ్వంసం చేస్తున్న టీడీపీ నేతలను పట్టించుకోని సంబంధిత శాఖల అధికారులు వైఎస్సార్సీపీకి చెందిన రైతులు, నాయకులపై అక్రమంగా బైయిండోవర్ కేసులు నమోదు చేయడం తగదన్నారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే ఉపేక్షించమన్నారు. ఈ విషయమై డీఎస్పీతో పాటు ఆర్డీవోలను కలిసి అక్రమ కేసులపై ఫిర్యాదు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ పట్టణ, మండల అధ్యక్షులు కలికి మాధవరెడ్డి, ఒట్టూరు కిషోర్‌యాదవ్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కామిరెడ్డి రాజారెడ్డి, నాయకులు మద్దాల సోమశేఖర్‌రెడ్డి, ఓజిలి, దొరవారిసత్రం మండల పార్టీ అధ్యక్షులు పాదర్తి హరినాథరెడ్డి, అల్లూరు రాహుల్‌రెడ్డి, బైనా మల్లికార్జునరెడ్డి, కటకం జయరామయ్య, పేట చంద్రారెడ్డి, వేణుంబాక మునస్వామి నాయుడు, ఎంపీపీలు కురుగొండ ధనలక్ష్మి, గడ్డం అరుణారెడ్డి, లీగల్ సెల్ కన్వీనర్ చదలవాడ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చనిపోయిన వారి జాబితాతో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారా?
చేనేత కార్మికుల కడుపు కొడుతున్న కూటమి ప్రభుత్వం వెంకటగిరి(సైదాపురం): స్థానిక సంస్థ ఎన్నికల్లో పారదర్శకంగా నిర్వహించాలని పదే పదే వైఎస్సార్సీపీ కోరుతున్నా.. మృతి చెందినవారితోపాటు వలస వెళ్లిన ఓటర్ల జాబితాతో స్థానిక ఎన్నికల నిర్వహణ ఎలా చేస్తారంటూ వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పట్టణంలోని ఎన్‌జేఆర్ భవనంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సర్ పక్రియలో భాగంగా ఓటర్ల జాబితా సవరణలు పూర్తవుతున్నాయని ఈ మేరకు కొత్త ఓటర్ల జాబితా వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వైఏస్సార్సీపీ కోరుతున్నట్లు తెలిపారు. ఇందుకు భిన్నంగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఉన్నపళంగా ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఇప్పటికే వెంకటగిరి నియోజకవర్గంలో 36వేల ఓట్లు అనర్హుల ఓట్లను అధికారులు గుర్తించారన్నారు. అదేవిధంగా మున్సిపాల్టీలో 8వేల ఓట్లు అనర్హత ఓట్లుగా గుర్తించి నివేదికలను అందజేయడం జరిగిందన్నారు. గతంలో 44 వేల ఓటర్లు ఉన్న మున్సిపాలిటీలో అధికారుల గణాంకాల లెక్కల ప్రకారం ప్రస్తుతం 36వేల ఓటర్లు అధికారంగా ఉన్నట్లు నిగ్గు తేల్చారన్నారు. ఈ ఓటర్ల ఆధారంగా ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తాము సంపూర్ణ మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపారు. 25 వార్డులుగా ఉన్న వెంకటగిరి మున్సిపాలిటీ గెజిట్ ప్రకారం 36 వార్డులుగా విభజించేందుకు మే నెలలో అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారన్నారు. ఈ సమయంలో వార్డుల విభజన పారదర్శకంగా నిర్వహించాలని వినతిపత్రం ద్వారా మున్సిపల్ అధికారులకు నివేదికలను సమర్పించామని అయినప్పటి తన నివేదికలను పక్కన పెట్టి వార్డుల విభజనలో ఇష్టారాజ్యాంగా వ్యవహరించారని ఆరోపించారు. ఒక వార్డుల్లో 1400 ఓట్లు, మరో వార్డులో 750 ఓట్ల జనాభాతో, వార్డులోని సంబంధంలేని వ్యక్తులకు కూడా వేరే వార్డుల్లో ఓటు హక్కు కల్పిచడం వంటి అవకతవకలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇదంతా స్థానిక ప్రజా ప్రతినిధికి తెలియకుండా జరుగుతుందా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు తెలియజేశారు. అధికార పార్టీ నేతల అండదండలతో ప్రజలకు న్యాయం చేయకుండా ప్రశ్నించినా ప్రజలపై తప్పుడు కేసులు బనాయిస్తున్న అధికారులు మూల్యం చెల్లించక తప్పదని నేదురుమల్లి హెచ్చరించారు. నేతన్న సేవలో నిధులను కూటమి నేతల కనుసన్నల్లో మృతి చెందిన వారికి సైతం నిధులు జమ చేశారని ఆరోపించారు. దీంతో కడుపుమంటతో రోడ్డెక్కిన చేనేత కార్మికులపై పోలీసులు కేసు నమోదు చేయడం సరికాదన్నారు. ప్రజలకు వైఎస్సార్సీపీ అండగా ఉండి పోరాటాలు సైతం కొనసాగిస్తామన్నారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేశారు. నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా, బఫర్ జోన్లలో సైతం అక్రమ నిర్మాణాలు, భూకబ్జాలు వంటివి మితిమీరిపోతున్నాయని వాటిని నివారించాల్సిన సంబంధిత శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఏపీ డీఎస్సీ స్కామ్‌లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. స్పోర్ట్స్ కోటాలో క్రీడలు ఆడని వారు, ఉపాధ్యాయులుగా అర్హతే లేని వారిని ఉపాధ్యాయులుగా ఏంపిక చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు పులి ప్రసాద్‌రెడ్డి, బాలాయపల్లి, డక్కిలి మండలాల అధ్యక్షులు వెందోటి కార్తీక్‌రెడ్డి, చింతల శ్రీనివాసులరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు చిట్టేటి హరికృష్ణ, సేతరాసి బాలయ్య, సదానందరెడ్డి, కందాటి రాజారెడ్డి, ఆటంబాకం శ్రీనివాసులు రెడ్డి, రొంటాల చిన్నా, గోపాల్ యాదవ్, ములవాయిల వెంకటేశ్వర్లు, సతీష్, రౌవరత్ కుమార్, కాసారం నీలకంఠం, వెందోటి బాబు, పూజారి లక్ష్మి, కాటూరు రామతులసి, సుకన్య, కందాటి కళ్యాణి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. తప్పుచేసిన అధికారులు మూల్యం చెల్లించక తప్పదు -
ఎంపీ పేరు లేకుండానే ఆహ్వానపత్రికలు
చిట్టమూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో దేవదాయ శాఖ అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల గూడూరు, చిల్లకూరు మండలాల్లోని పలు ఆలయాల్లో నిర్వహించిన కుంభాభిషేక వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలు, వాల్‌పోస్టర్లలో తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి పేరును ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా చిట్టమూరు మండలం మల్లాంలోని ప్రసిద్ధ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలు, వాల్పోస్టర్లలోనూ ఎంపీ పేరును ప్రస్తావించలేదు. ఆలయంలో బుధవారం వాటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీ పేరు ఎందుకు ముద్రించలేదని ఈఓ కుడారి పెంచల వరప్రసాద్‌ను ప్రశ్నించగా.. తనకు తెలియకుండానే ఆహ్వాన పత్రికలు ముద్రించారని సమాధానం ఇచ్చారు. -
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం
– బ్రేక్ ఫెయిల్ కావడంతో డివైడర్‌పైకి ఎక్కిన కారు తిరుమల: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో బుధవా రం ప్రమాదం చోటుచేసుకుంది. చైన్నెకి చెందిన ఓ కుటుంబం శ్రీవారి దర్శనం అనంతరం తిరుగు ప్రయా ణంలో వారు వస్తున్న కారుకు మొదటి మలుపు వద్ద బ్రేక్ ఫెయిల్ అయ్యింది. దీంతో కారు అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కింది. కారులో దంపతులతో పాటు వారి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాద ఘటనతో ఘాట్ రోడ్డులో కొద్దిసేపు ఆందోళన నెలకొంది. అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం తిరుపతి రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ గణాంక అధికారుల సంఘం ఏపీఎస్పీడీసీఎల్ యూనిట్‌కు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ మేరకు సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్.నరేంద్ర నాయుడు బుధవారం ప్రకటన విడుదల చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా టీ. రవికుమార్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎం. శివకుమార్, కోశాధికారిగా ఎం.ఎన్.పి. శైలజ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా జె. సుభాష్ చంద్రబోస్, ఎస్.సిన్హా, సంయుక్త కార్యదర్శులుగా సీహెచ్ అనిల్‌కుమార్, కేవీ సుబ్బారావు, సంస్థాగత కార్యదర్శులుగా వై.ఆర్. రవికుమార్‌రెడ్డి, ఆర్.పాపయ్య, మహిళా ప్రతినిధిగా ఎస్. ప్రశాంతి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా టీ.వెంకట సుబ్బయ్య, సి.శ్రీనివాసులు, జె.రామకృష్ణ, ఎస్.వెంకటేశ్వర్లు, ఎన్.అశోక్ వర్ధన్ గుప్తా ఎన్నికయ్యారు. ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్లు ఎం.మురళీకుమార్, ఎం.శ్రీకాంత్ సమక్షంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.మధుసూదన్, సంయుక్త కార్యదర్శి పి.బాలాజీ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. -
40 ఏళ్లల్లో ఎన్నడూ లేనంత అభివృద్ధి
● రేణిగుంటలో టౌన్ బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభించడం అభినందనీయం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి రేణిగుంట: తిరుపతి కో–ఆపరేటివ్ బ్యాంక్ రేణిగుంటలో ఏర్పాటు చేసిన నూతన బ్రాంచ్‌ను బుధవారం వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 40 ఏళ్లల్లో ఎన్నడూ లేనంతగా ప్రస్తుత పాలకవర్గం చేస్తున్న అభివృద్ధి అభినందనీయమన్నారు. తిరుపతి కో–ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రేణిగుంటలో నూతన బ్రాంచ్‌ను ఏర్పాటు చేయడం ఓ మైలురాయి అన్నారు. ఈ పాలకవర్గం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాజకీయాలకు అతీతంగా బ్యాంక్ అభివృద్ధే లక్ష్యంగా, ఖాతాదారులకు విశేష సేవలందించడమే పరమావధిగా పనిచేస్తున్నారన్నారు. 40ఏళ్ల తర్వాత బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి కృషితో నూతన బ్రాంచ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దాంతోపాటు రూ.47కోట్ల బకాయిల్లో రూ.43 కోట్లు వసూలు చేయడంలోనూ, ఖాతాదారులకు డివిడెంట్లు ఇప్పించడంలోనూ పాలకవర్గం, అధికారులు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. బ్యాంక్ అభివృద్ధికి కృషి చేస్తున్న అధికారులు, పాలకవర్గం, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 29 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 71,297 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 32,783 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.5.59 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరి, ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలు, ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపా రు. కాగా, ఆలయంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఆ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తయిన తర్వాత నామకోపు, చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను నిర్వహించారు. ఆ తరువాత భక్తులను దర్శనానికి అనుమతించారు. పలువురు బోర్డు సభ్యులు, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో భాస్కర్ పాల్గొన్నారు. -
టీటీడీకి రూ.10 లక్షల విరాళం
తిరుమల: టీటీడీ శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు మంగళవారం టీటీడీ బోర్డు సభ్యులు దర్శన్ సతీమణి యశోద దర్శన్ రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాతలు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్యచౌదరికి విరాళం డీడీని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో డాక్టర్ శరత్ పాల్గొన్నారు. బంగారు ఆభరణాల అప్పగింత తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుమలకు వెళ్తున్న తమిళనాడుకు చెందిన భక్తుడు పి.కార్తికేయన్సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో చెక్‌పాయింట్ వద్ద తన బ్యాగును పొరపాటున మరిచిపోయి వెళ్లారు. వెంటనే సిబ్బంది బ్యాగును గుర్తించి, అందులో లభించిన వివరాల ఆధారంగా భక్తుడిని సంప్రదించి అలిపిరి చెక్‌పాయింట్ వద్దకు రావాలని సమాచారం అందించారు. ఆ మేరకు చేరుకున్న భక్తుడు బ్యాగులోని వస్తువులను గుర్తించి ధృవీకరించిన అనంతరం బ్యాగును సురక్షితంగా ఆయనకు అప్పగించారు. బ్యాగులో రూ.10,900 నగదుతో పాటు రెండు గాజులు, ఒక బంగారు గొలుసు, రెండు బంగారు ఉంగరాలు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని టీటీడీ సెక్టార్–5 ఏవీఎస్వో రమేష్ తెలిపారు. విజిలెన్స్ అధికారులు, సిబ్బంది చూపిన అప్రమత్తత, నిజాయితీతో విలువైన వస్తువులను తిరిగి అప్పగించడంతో భక్తుడు కృతజ్ఞతలు తెలిపారు. వృద్ధురాలి హత్య – ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ముమ్మరం రైల్వేకోడూరు: రైల్వేకోడూరు పట్టణంలోని వినాయక నగర్లో రాజుపాళెం మంగమ్మ (70) అనే వృద్ధురాలు హత్యకు గురైన ఘటనపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు ఒంటరిగా నివసిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతురాలి వద్ద ఉండాల్సిన సుమారు నాలుగు తులాల బంగారు ఆభరణాలు, చెవి దిద్దులు, ఉంగరం, చంద్రముఖి మోడల్ గొలుసు కనిపించకపోవడంతో బంగారు ఆభరణాల కోసం హత్య జరిగి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్టు చేయడంతోపాటు చోరీకి గురైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకునేందుకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. వ్యభిచార గృహంపై దాడి తిరుపతి క్రైం: నగరంలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు మంగళవారం ఓ లాడ్జీపై దాడి చేసి కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. శ్రీసాయి లక్ష్మి లాడ్జీలో వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో బుధవారం మధ్యాహ్నం 12.15 నుంచి 1.45 గంటల మధ్య ఈస్ట్ ఇన్‌న్‌స్పెక్టర్, ఈస్ట్ డబ్ల్యూఎస్ఐ సుమతి, సిబ్బంది కలిసి దాడి చేశారు. ఈ సందర్భంగా లాడ్జీలోని రూమ్ నం.201లో ఓ మహిళ, వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో శ్రీనివాసులు, అతని భార్య సుకన్య వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు, లాడ్జీ మేనేజర్ కూడా ఇందులో పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన వారిని పోలీస్ స్టేషన్‌న్‌కు తరలించి సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, శ్రీనివాసులుపై గతంలోనూ వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదైనట్లు విచారణలో తేలింది. 2016లో ధర్మస్థల పోలీస్ స్టేషన్లో నమోదైన ఓ కేసులో కోర్టుకు హాజరుకాకపోవడంతో 2026 జూన్ 30న కర్ణాటక పోలీసులు అతడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన తర్వాత కూడా నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉందన్నారు. అతడిపై చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషనన్లోనూ కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. -
పింఛన్ కోసం పాట్లు
తిరుపతి అర్బన్: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొత్త పింఛన్ల కోసం వేలాది మంది సచివాలయంతోపాటు మండల, డివిజన్ కార్యాలయాల్లోనే కాకుండా ఏకంగా కలెక్టరేట్లో పీజీఆర్ఎస్కు విచ్చేసి అర్జీలు సమర్పిస్తున్నారు. అందులో ఓ కుటుంబానికి చెందిన భార్యాభర్తలు సోమవారం కలెక్టరేట్లో అధికారులను కలిసి తమ బాధలు ఏకరువు పెట్టారు. మాకు న్యాయం చేయండి అంటూ రెండు చేతులు జోడించి అధికారులను వేడుకున్నారు. ప్రతి గ్రీవెన్స్‌లో అర్జీలు సత్యవేడు మండలం, ఆరంబాకానికి చెందిన రాజాకు రెండు కాళ్లులేవు. దివ్యాంగుడైన అతను రెండేళ్లుగా తన భార్య పుష్పతో కలసి కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్‌కు విచ్చేస్తున్నారు. సత్యవేడు నుంచి తిరుపతి రావడానికి 80 కి.మీ ప్రయాణించి అర్జీలు సమర్పిస్తున్నారు. వారు సోమవారం కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఆపై కలెక్టరేట్లో అధికారులను కలిసి తమకు న్యాయం చేయాలని ప్రాధేయపడ్డారు. తిరుపతిలో రేషన్ రచ్చ తిరుపతి అర్బన్: ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి నగరంలో రేషన్ బియ్యం రచ్చ రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది. స్థానికేతరులు డీలర్ల వద్దకెళ్లడం.. వారు ఇవ్వకపోవడం షరామామూలుగా సాగుతోంది. వివరాల్లోకి వెళితే.. బతుకుదెరువు కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు రెండు వేల కుటుంబాలు తిరుపతిలో నివాసముంటున్నాయి. వారిలో చాలా మంది వైట్ రేషన్ కార్డు కలిగిన వారే ఉన్నారు. వీరందరికీ రేషన్ బియ్యం ఇవ్వాల్సిన డీలర్లు సివిల్ సప్లయ్ అధికారులు ఇవ్వలేదంటూ చేతులెత్తేస్తున్నారు. అధికారులనడిగితే డీలర్లు ఎవ్వరూ తమను అడగలేదని అంటున్నారు. ఇటు డీలర్లు, అటు అధికారుల మధ్య కార్డుదారులు బలైపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. -
విద్యుత్ స్తంభానికి ఢీకొని వ్యక్తి మృతి
గంగాధరనెల్లూరు:మండలంలోని తూగుండ్రం పంచాయతీ బాల య్య కొత్తూరు వద్ద బైక్ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. పాలసముద్రం మండలం రంగాపురం గ్రామానికి చెందిన గుణశేఖర్ మంగళవారం ద్విచక్రవాహనంపై వెళుతుండగా ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన గుణశేఖర్ గంటకు పైగా రక్తస్రావంతో ప్రమాద స్థలంలోనే పడి ఉన్నాడు. స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించినప్పటికీ, సమయానికి రాలేదు. ఆర్తనాదాలు చేస్తున్న క్షతగాత్రుడిని స్థానికులే ఓ ప్రైవేట్ వాహనంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు. సకాలంలో 108 వచ్చి ఉంటే ప్రాణాలు కాపాడి ఉండవచ్చని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. -
వ్యవసాయ మోటార్ల చోరీ
తొట్టంబేడు (శ్రీకాళహస్తి రూరల్): తొట్టంబేడు మండలంలోని విరూపాక్షాపురంలో సోమవారం రాత్రి ఒకేసారి 8 మంది రైతులకు చెందిన విద్యుత్ మోటార్లను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధిత రైతులు వెంకటేష్, రమణయ్య, కాటయ్య, మనోహర్, పరమేష్ రెడ్డి, బత్తయ్య, సుబ్రహ్మణ్యం, రమేష్ మంగళవారం ఉదయం పొలాలకు వెళ్లి చూడగా స్టార్టర్ బాక్సులు పగలగొట్టి వైర్లు కత్తిరించి మోటార్లు చోరీ చేసినట్లు గుర్తించారు. ఇటీవలే చిట్టత్తూరులో నలుగురు రైతుల మోటా ర్లు చోరీ కాగా ఇప్పుడు విరూపాక్షీపురంలో ఏకంగా 8 మోటార్లు మాయం కావడంతో రైతులు భ యాందోళనకు గురవుతున్నారు. పక్కా ప్రణాళిక తో ఒకే ముఠా ఈ చోరీలకు పాల్పడుతోందని అ నుమానిస్తున్నారు. వర్షాలు లేక అప్పులతో ఇబ్బంది పడుతున్న తరుణంలో లక్షల విలువైన మోటా ర్లు దొంగలించడంతో తీవ్రంగా నష్టపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అభివృద్ధి పథంలో గ్రంథాలయాలు
తిరుపతి సిటీ: గ్రంథాలయాలు అప్పటికీ, ఇప్పటికీ ఎంతో అభివృద్ధి చెందాయని ఎస్వీ వీసీ టాటా నర్సింగరావు పిలుపునిచ్చారు. ఎస్వీయూలో బ్రిడ్జింగ్ ది డిజిటల్ డివైడ్ టెక్నాలజీ అప్లికేషన్ ఇన్ పబ్లిక్ అండ్ అకడమిక్ లైబ్రరీస్ అనే అంశంపై జరుగతున్న జాతీయ సదస్సు రెండో రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు గతానికి ఇప్పటికీ డిజిటల్, సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ గ్రంథాలయ శాస్త్ర ఆచార్యులు ఆర్కె భట్ మాట్లాడుతూ పౌర గ్రంథాలయ యాక్ట్‌లు చాలా ఉన్నాయని, అయితే అవి సమర్థవంతంగా పనిచేయడంలేదని చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గురవారెడ్డి ప్రసంగిస్తూ ప్రతి గ్రామంలో పౌర గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి, ప్రజలలో చదివే అలవాటును పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ మధుసూదన్, సెమినార్ డైరెక్టర్ ఆచార్య శ్రీనివాస రాఘవన్, సెమినార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆచార్య కే.సురేంద్రబాబు, గ్రంథాలయ శాస్త్ర శాఖాధిపతి ప్రశాంతికుమారి, దేశంలో పలు ప్రాంతాల నుంచి విచ్చేసి గ్రంథాలయాధికారులు, మేథావులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 69,440 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 36,255 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.75 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. జాప్యం చేయొద్దు తిరుపతి అర్బన్: జాతీయ రహదారికి సంబంధించి భూసేకరణతోపాటు రైతులకు ఇవ్వాల్సిన పరిహారం పంపిణీలో జాప్యం చేయొద్దని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్లో జేసీ గోవిందరావుతో కలసి ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూసేకరణలో సమస్యలు ఉన్నా.. అలాగే పరిహారం విషయంలో ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రధానంగా పుల్లంపేట, ఓబులవారిపల్లి, కోడూరు ప్రాంతాల్లో భూసేకరణ పనుల్లో పెద్ద ఎత్తున జాప్యం జరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇచ్చిన గడువులోపు భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. వేడుకగా గంధోత్సవం తిరుపతి కల్చరల్: కులమతాలకు అతీతంగా ముస్లింలు గురువుల పట్ల అత్యంత భక్తితో గంధోత్సవం నిర్వహించడం ఆనవాయితీ అని, సేవ జీవిత సార్థకతకు మార్గదర్శకమని ఖాదరీ పీఠాధిపతి, ప్రభుత్వ ఖాజీ సయ్యద్‌షఫీ అహ్మద్ఖాదిరి తెలిపారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ఎదురుగానున్న దర్గాలో హజ్రత్ ఫీర్ సయ్యద్ అమానుల్లాషా ఖాదరి 80వ గంధోత్సవాన్ని మంగళవారం రాత్రి అత్యంత వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేపట్టారు. ఉర్దూ గాయకుల బృందం ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డాక్టర్ నజీర్‌ఖాన్, డాక్టర్ మొహద్దీన్బాషా, డాక్టర్ అమీనుల్లా, ముస్తఫా, కలాం, నవీన్, చాంద్‌బాషా, ఖాదర్‌బాషా, హిమబిందు, దినేష్ సింగ్, నవీన్ సింగ్, ముస్లింలు పాల్గొన్నారు. -
ఆక్రమించినోడిదే భూమి!
వరదయ్యపాళెం: మండలంలోని చిన్న పాండూరు పంచాయతీ వీకేఆర్‌వై కాలనీ భూ ఆక్రమణలకు అడ్డాగా మారింది. ఈ పరిసర ప్రాంతాల్లో విరివిగా పరిశ్రమలు రావడంతో అక్కడ పొలానికి ఎక్కడలేని గిరాకీ ఏర్పడింది. ప్రభుత్వ డీకేటీ భూమి ఎకరం కోట్లకు పడగలెత్తింది. ఊహించని విధంగా ఈ ప్రాంతంలో భూమి ధరలకు ఒక్కసారిగా రెక్కలు రావడంతో అక్రమార్కుల కళ్లు ఆ భూములపై పడ్డాయి. ఇన్నాళ్లు వీకేఆర్‌వై కాలనీలో గిరిజనులకు కేటాయించిన ఇంటి స్థలాలను దర్జాగా కొనుగోళ్ల పేరుతో ఆక్రమించుకున్నారు. తాజాగా సమీపంలోని పాదిరికుప్పం రెవెన్యూలో గల 1,056 ఎకరాల శోత్రియం భూములపై అక్రమార్కులు పాగా వేస్తున్నారు. ఆ దిశగా గత నాలుగు రోజులుగా పట్టపగలే శోత్రియ భూముల్లో ఓ వైపు పొలం దన్నకాలు చేపట్టి ఆక్రమణ దిశగా పావులు కదుపుతున్నారు. దున్నిన పొలం సత్యవేడు–చిన్న పాండూరు ప్రధాన రోడ్డు మార్గానికి ఆనుకుని ఉండడంతో ఆ భూములను కబ్జా చేసేందుకు తెరవెనుక కొందరు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమేరకు షికారీలు ఆక్రమించుకుని, ఆ భూమి తమ పూర్వీకులకు చెందినదిగా బుకాయిస్తూ గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. ఇలాగే కొనసాగితే శోత్రియ భూములు పూర్తిగా అక్రమార్కుల పాలయ్యే ప్రమాదం ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. కనిపించలేదా? శోత్రియ భూములు ఆక్రమణకు గురవుతున్నా తమకేమీపట్టనట్లు రెవెన్యూ యంత్రాంగం వ్యవహరిస్తోంది. పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో అనువైన ప్రాంతంగా ఉన్న శోత్రియ భూములు విచ్చలవిడిగా ఆక్రమణలకు గురవుతున్నాయి. ఓ వైపు దుక్కి దున్నకాలు, మరో వైపు షికారీల గుడిసెలు.. ఇలా ఆక్రమించినోడిదే భూమి అన్న చందాన అక్రమార్కులు చెలరేగిపోతుఆన్నరు. ఎంతో విలువైన భూములు అన్యాక్రాంతమవుతుంటే నియంత్రించాల్సిన రెవెన్యూశాఖ చోద్యం చూడడం విమర్శలకు తావిస్తోంది. ప్రధాన రోడ్డుకు రెండు వైపులా ఆక్రమణలు చిన్న పాండూరు–సత్యవేడు ప్రధాన రోడ్డు మార్గంలోని వీకేఆర్‌వై కాలనీ సమీపంలో రోడ్డుకు తూర్పు, పడమర రెండు వైపుల సుమారు 100 ఎకరాలకు పైగా గత కొద్ది రోజులుగా దుక్కి దున్నకాలు చేపడుతూ ఆక్రమణలకు సిద్ధం చేసుకుంటున్నారు. అంతేగాక దుక్కి దున్నకాలు చేపట్టిన ఆక్రమిత భూమిలో పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు. ఎకరా రూ.10కోట్లకు పైగా విలువ కలిగిన ఈ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఆక్రమణ జరుగుతున్నా కట్టడి చేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం మిన్నకుండిపోవడం గమనార్హం. శోత్రియం భూముల్లో దొంగలు పడ్డారు -
ఇంటి పట్టాల పంపిణీ
విధి నిర్వహణలో వీరమరణం పొందిన అటవీశాఖ అధికారుల కుటుంబాలకు కలెక్టర్ ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. బుధవారం శ్రీ 9 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026శెట్టిపల్లి భూ సమస్యకు చంద్ర గ్రహణం పట్టుకుంది. గత ప్రభుత్వ క్రెడిట్‌ని చోరీ చేసేందుకు బాబు సర్కార్ ఇటీవల శెట్టిపల్లి భూ బాధితులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసి చేతులు దులుపుకుంది. అయితే లబ్ధిదారుల ప్లాటు ఎక్కడన్నది కనుగొనే పరిస్థితి ఇప్పట్లో కనిపించేలా లేదు. వెంచర్లను అభివృద్ధి చేయాలంటే తుడా కనీసం రూ.100 కోట్లు ఖర్చు పెట్టాలి. ప్రస్తుతం అంత డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి తుడాకు లేకపోవడంతో శెట్టిపల్లి భూ సమస్య ఎక్కడ వేసినగొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు సాగదీసేందుకు యత్నిస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. లబ్ధిదారులకు కేటాయించే శెట్టిపల్లి భూమి చెప్పింది ఎక్కువవెంచర్ల అభివృద్ధి లెనట్టే శెట్టిపల్లి లబ్ధిదారులకు కేటాయించిన ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మాత్రమే చేసిన కూటమి ప్రభుత్వం వెంచర్లను అభివృద్ధి చేసి ప్లాట్లను చూపించే ప్రక్రియ ఇప్పట్లో పూర్తిచేసేలా కనిపించడం లేదు. స్థలాలు రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్లను యజమానులు ఇది నాది అని చూసుకునే ఆశ ఇప్పట్లో తీరేలా లేదు. ముళ్లపదల్లోనే ప్లాట్లు ఉండడంతో భూ సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. వెంటనే ప్లాట్లను అభివృద్ధి చేసి తమకు అప్పగించాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇలానే నిర్లక్ష్యం చేస్తే సహించబోమని హెచ్చరిస్తున్నారు. తిరుపతి తుడా : శెట్టిపల్లి భూ సమస్య ఏడు దశాబ్దాల నాటిది. 636 ఎకరాల భూమి వివిధ కారణాలతో అన్ సెటిల్మెంట్గానే మిగిలిపోయింది. స్థానిక రైతులు, ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కొనుగోలు చేసిన ప్లాట్లు అలాగే ఉండిపోయాయి. ఇలా నాటి నుంచి ఆ భూములపై రైతులకు ఎలాంటి హక్కులు కల్పించకుండా అన్ సెటిల్మెంట్ గానే ప్రభుత్వాలు పరిగణిస్తూ వచ్చాయి. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో స్థానిక భూ బాధితులు నాటి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డిని కలిసి సమస్యను వివరించారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చలు జరిపి, లబ్ధిదారులను ఒప్పించి, లీగల్ సమస్యలను అధిగమించేందుకు దాదాపు రెండేళ్లు పట్టింది. ఈ క్రమంలో 2023 డిసెంబర్ 15న రాష్ట్ర క్యాబినెట్ శెట్టిపల్లె భూసమస్యకు పరిష్కారం చూపుతూ ఉత్తర్వులు జారీచేసింది. ఉన్న భూముల్లో వ్యవసాయ రైతులకు 30 శాతం (ప్రభుత్వానికి మిగిలేది 70 శాతం), లే అవుట్ల ద్వారా ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసిన వారికి 50 శాతం (ప్రభుత్వానికి మిగిలేది 50 శాతం) గా నిర్ణయించింది. రికార్డులను పరిశీలించి అంతే వేగంగా 2024 ఫిబ్రవరిలో లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన భూ హక్కులను కల్పిస్తూ ప్రొసీడింగ్స్‌ను అందజేశారు. ఇంతలో ఎన్నికల కోడ్ రావడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగింది. మిగిలిన ప్రక్రియలన్నీ పూర్తిగా గత ప్రభుత్వ హయాంలోనే పరిష్కరిం చేశారు. క్రెడిట్ చోరీకి యత్నం గత ప్రభుత్వ హాయంలో శెట్టిపల్లె భూ సమస్యకు దాదాపు పరిష్కారం చూపేశారు. అప్పటికే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు శెట్టిపల్లె భూ సమస్యను పరిష్కరించేందుకు ఏనాడూ ముందుకు రాలేదు. ప్రతి ఎన్నికల ముందు హడావిడిగా ప్రకటనలు చేయడం ఆపై వాటిని విస్మరించడం బాబు ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వనప్పటికే దాదాపు పూర్తయిన ఈ సమస్యను తానే పరిష్కరిస్తున్నట్లు మరో క్యాబినెట్ తీర్మానం చేయించారు. గత ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం, ప్రొసీడింగ్స్ ఆధారంగా ప్లాట్స్ కొనుగోలు చేసిన యజమానులకు రిజిస్ట్రేషన్ లను చేపట్టింది. ఇక ఈ సమస్యను అక్కడితో వదిలేసి చేతులు దులుపుకుంది. రైతులకు సంబంధించిన మరో 22 ఎకరాల భూ సమస్యను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. శెట్టిపల్లికి చంద్ర గ్రహణం రూ.100 కోట్లు అవసరం శెట్టిపల్లి లబ్ధిదారులకు దాదాపు 60 ఎకరాల్లో నాలుగు వెంచర్లను వేశారు. ఈ వెంచర్లు కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ వెంచర్లలో ఫ్లాట్లు విభజన రోడ్లు, యూడీఎస్, కాలువలు అభివృద్ధి చేయాలంటే తుడా కనీసం రూ.100 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో తుడా లేకపోవడంతో ఇప్పట్లో వెంచర్లు అభివృద్ధి చేసే అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. టౌన్షిప్ నిర్మాణం కోసం తుడాకు కేటాయించిన దాదాపు 90 ఎకరాలను అభివృద్ధి చేసి, వాటిని విక్రయించాలంటే కనీసం ఏడాదన్నర పడుతుంది. అలా విక్రయాల ద్వారా వచ్చిన డబ్బుతోనే వెంచర్లను అభివృద్ధి చేసి ఫ్లాట్లు చూపించే అవకాశం ఉంటుంది. అంతకుమించి తుడాకు అభివృద్ధి చేసేందుకు ఏ అవకాశం లేదు. దీంతో ప్లాట్లు చూసే అవకాశం లబ్ధిదారులకు ఇప్పట్లో లేనట్టే. వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు శెట్టిపల్లి ఫ్లాట్లను అభివృద్ధి చేసేందుకు హడావిడి చేసి లబ్ధి పొందాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది -
పది విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
శ్రీకాళహస్తి రూరల్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రతి పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.ఎన్. కుమార్ అన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులకు తగిన అవగాహన కల్పిస్తూ, ఆయా సబ్జెక్టుల్లో మెరుగైన మార్కులు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మంగళవారం శ్రీకాళహస్తి పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో సబ్జెక్టుల వారీగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వరదయ్యపాలెం, బీఎన్‌కండ్రిగ, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, కె.వి.బి.పురం మండలాలకు చెందిన ఉపాధ్యాయులకు పదవ తరగతి విద్యార్థులు మెరుగైన మార్కులు సాధించేందుకు అనుసరించాల్సిన మెలకువలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బ్లూప్రింట్, మిషన్ మార్చి–2027 తదితర అంశాలపై సబ్జెక్టు నిపుణులు ఉపాధ్యాయులకు వివరణాత్మకంగా శిక్షణ ఇచ్చారు. విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎంఈవో బాలయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీగల వెంకటయ్య, విషయం నిపుణులు యువశ్రీ మురళి, మూర్తి, మునీశ్వరరెడ్డి, రవి, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీనియర్స్ బేస్ బాల్ జిల్లా జట్ల ఎంపిక
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి మంగళం ట్రెండ్స్ పాఠశాల ఆవరణలో మంగళవారం సీనియర్స్ బేస్ బాల్ తిరుపతి జిల్లా జట్లు ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. ఈ ఎంపిక పోటీలకు జిల్లా నలుమూలల నుంచి బాలబాలికలు 150 మందికిపైగా హాజరైనట్లు తిరుపతి జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సోము రవికుమార్, సాంబశివరావు తెలిపారు. బాలబాలికలకు విడివిడిగా ఎంపిక ప్రక్రియను నిర్వహించినట్లు తెలిపారు. వీరిలో ప్రతిభ కనబరచిన బాలురు 18 మంది, బాలికలు 18 మందితో జిల్లా జట్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికై న జట్లు ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు సత్యసాయి జిల్లా, పుట్టపర్తిలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి బేస్ బాల్ పోటీల్లో జిల్లా తరఫున పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. జట్టు ఎంపిక కమిటీ సభ్యులుగా రామకృష్ణ, సత్య, లోకనాథం, దశరథ, అమ్ములు, విద్యాలత, ప్రమీల, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులుగా పీడీలు సురేష్, రూపలత వ్యవహరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం మురళి, ఇన్చార్జ్ హెచ్ఎం సుభాష్చంద్రదాస్, సీనియర్ క్రీడాకారులు డేవిడ్, హేంబాబులు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఇంటి పట్టాల పంపిణీ తిరుపతి అర్బన్: విధి నిర్వహణలో వీరమరణం పొందిన అటవీశాఖ అధికారుల కుటుంబాలకు 13 ఏళ్ల తర్వాత కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ వారికి అండగా నిలిశారు. మంగళవారం కలెక్టరేట్లో వారికి ఇంటి పట్టాలను అందించారు. వివరాల్లోకి వెళితే.. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. 2013లో శేషాచలం కొండల్లో జరిగిన ఈ ఘటనలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎన్ఆర్.శ్రీధర్, అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎన్.డేవిడ్ కరుణాకరన్ ప్రాణాలు కోల్పోయారు. ఆ రెండు కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటిపట్టా భూమి న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకోవడంతో ఆ కేటాయింపులు అలానే నిలిచిపోయాయి. ఇటీవల కాలంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎన్ఆర్.శ్రీధర్ సతీమణి ఇందిర, అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎన్.డేవిడ్ కరుణాకరన్ సతీమణి ఎన్.హెలెన్ మేరీ తమ సమస్యను కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కలెక్టరేట్ ప్రత్యేక శ్రద్ధతో ఆ సమస్యకు పరిష్కారం చూపించింది. వారి ఇంటి స్థలానికి సంబంధించిన ఇంటి పట్టాను మంగళవారం కలెక్టరేట్లో వారికి అందించారు. -
భక్తులకు సజావుగా దర్శన భాగ్యం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తలకు సజావుగా దర్శన భాగ్యం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కలెక్టర్ వెంకటేశ్వర్, అదనపు ఈవో వెంకయ్యచౌదరి వెల్లడించారు. మంగళవారం సాయంత్రం అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్‌లో శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ అదనపు ఈవో, సీవీఎస్వో మురళీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ జయకృష్ణతో కలసి నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ ఏడాది తిరుమల శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈవో ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహించడంతో పాటు క్షేత్ర స్థాయి పరిశీలనలు పూర్తి చేసినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల తొలి రోజు ముఖ్యమంత్రి తిరుమలలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. వాహన రద్దీ నియంత్రణకు తిరుపతి అలిపిరి చెక్‌పాయింట్, జూ పార్క్ సమీపంలోని టీటీడీ స్థలాలు, నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ తదితర ప్రాంతాల్లో పార్కింగ్, హోల్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. గరుడ సేవకు తిరుమల, తిరుపతిలో తగిన పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఎస్పీ మాట్లాడుతూ రాబోయే వినాయక చవితి ఉత్సవాలు, శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 19న నిర్వహించనున్న గరుడ సేవ నేపథ్యంలో పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో సమన్వయంగా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. సమావేశంలో టీటీడీ జేఈవో డాక్టర్ శరత్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ప్రతిపక్షం గొంతు నొక్కేందుకే దాడులు
తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షం గొంతునొక్కేందుకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ గూండాలు దాడులకు తెగబడుతున్నారని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రామకుప్పం మండలం, పెద్దూరు ఎంపీటీసీ వెంకటరమణారెడ్డిపై టీడీపీ గూండాలు దాడి చేసి కారు అద్దాలు పగులగొట్టి విధ్వంసం సృష్టించడాన్ని ఆయన ఖండించారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంలో, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయడంలో చంద్రబాబు శ్రద్ద చూపడం లేదన్నారు. ఎంతసేపు వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డిని దూషించడం, పార్టీ శ్రేణులపై దాడులకు తెగబడడం, అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారని, కుప్పంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త, ఎమ్మెల్సీ భరత్, జిల్లా పరిషత్ చైర్మన్లు నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారని తెలిపారు. ఆ సమావేశానికి వెళ్లి వస్తున్న తమ పార్టీ ఎంపీటీసీ వెంకటరమణారెడ్డిపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. కుప్పంలోనే టీడీపీ గూండాలు చేస్తున్న అరాచకాలు, దాడులను అదుపుచేయాల్సిన చంద్రబాబు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. కూటమి బెదిరింపులు, దాడులు, అక్రమ కేసులకు వైఎస్సార్సీపీలో భయపడేవాళ్లెవ్వరూ లేరని హెచ్చరించారు. మీరు ఎన్ని దాడులు చేసినా ప్రజావ్యతిరేక విధానాలపై వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన నిలబడి ఉద్యమ పోరాటాలు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. కుప్పంలో రెచ్చిపోతున్న టీడీపీ గూండాలు -
ప్రజలంటే వెటకారం!
సొంతూరిపై మమకారం.. తిరుపతి అర్బన్: సీఎం చంద్రబాబునాయుడు సొంత మండలమైన చంద్రగిరికి జెడ్పీ కార్యాలయాన్ని కేటాయించారు. సాధారణంగా ఏ జిల్లాలో అయినా జిల్లా కేంద్రంలోనే జెడ్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుంటారు. జిల్లా కేంద్రం తిరుపతిలో అన్ని కార్యాలయాలు ఉంటున్న తరుణంలో జెడ్పీ కార్యాలయాన్ని కూడా తిరుపతిలో ఏర్పాటు చేస్తారని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా సీఎం చంద్రబాబునాయుడు తమ సొంత మండలం చంద్రగిరిలో జెడ్పీ కార్యాలయం ఏర్పాటు చేయడంపై పలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అందరికీ సౌకర్యవంతంగా ఉండేందుకు జిల్లా కేంద్రమైన తిరుపతిలో లేదా జిల్లాకు మధ్య భాగంగా ఉన్న ఏర్పేడు, రేణిగుంట, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో జెడ్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని చెబుతున్నారు. సీఎం చంద్రబాబునాయుడు జిల్లా ప్రజల సౌకర్యాన్ని పట్టించుకోకుండా తన సొంత మండలంలో జెడ్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంపై జిల్లా వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రగిరి నుంచే పాలన జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయాన్ని చంద్రగిరి ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు పనులు చకచకా సాగుతున్నాయి. ఈ నెల 24తో ఉమ్మడి చిత్తూరు జిల్లా జెడ్పీ పాలకవర్గం గడువు ముగియనుంది. దీంతో చిత్తూరు జిల్లా పరిషత్‌ను మూడు విభాగాలుగా విభజించారు. ఇందులో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లా(మదనపల్లిలో)గా విభజించి జెడ్పీ సీఈవోలు, డిప్యూటీ సీఈవోలు, ఇతర ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపట్టారు. ఈ నెల 25 నుంచి చంద్రగిరి నుంచే జెడ్పీ పాలన సాగించడానికి అధికారులు నిర్ణయించారు. ఇది తగునా బాబూ? 24 లక్షల జనాభా కలిగిన తిరుపతి జిల్లా ఎంతో విశాలంగా ఉంది. మూడు రెవెన్యూ డివిజన్లు, 36 మండలాలు, తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి, రైల్వేకోడూరు, సత్యవేడు, సూళ్లూరుపేట నియోజకవర్గాలు పూర్తిగా.. వెంకటగిరి, నగరి, గూడూరు నియోజకవర్గాలు పాక్షికంగా తిరుపతి జిల్లాలో ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని జెడ్పీ కార్యాలయాన్ని కేటాయించే బాగుండేదనే వాదన బలంగా వినిపిస్తోంది. వీటినేటినీ పట్టించుకోకుండా సీఎం చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం జెడ్పీ కార్యాలాయన్ని తన సొంత మండలానికి కేటాయించారని జిల్లా ప్రజలు విమర్శిస్తున్నారు.జెడ్పీ విభజన తర్వాత స్థానిక ఎన్నికలు జెడ్పీ విభజన తర్వాత స్థానిక సంస్థ ఎన్నికల్లోకి వెళ్లడానికి సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 65 జెడ్పీటీసీలు ఉండేవి. అయితే జిల్లా పునర్విభజన నేపథ్యంలో తిరుపతి జిల్లాలో 36 మండలాలు ఉన్నప్పటికీ తిరుపతి కార్పొరేషన్‌ను మినాహాయిస్తే మిగిలిన 35 మండలాల్లో జెడ్పీటీసీ ఎన్నికలు చేపట్టనున్నారు. అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 877 ఎంపీటీసీలు ఉండేవి. తిరుపతి జిల్లాను పరిశీలిస్తే 253 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హడావుడిగా జెడ్పీల విభజన జరిగినట్లు చర్చసాగుతుంది. తిరుపతి జెడ్పీ చైర్మన్.. రిజర్వేషన్ ఎవరికో? జెడ్పీ విభజన ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా జెడ్పీ చైర్మన్ బీసీ సామాజిక వర్గానికి కేటాయించారు. ఈ సారి ఎవరికి కేటాయిస్తారనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఎవరికి వారు తమ కమ్యూనిటీకే జెడ్పీ చైర్మన్ గిరి దక్కుతుందని ఆయా వర్గాలకు చెందిన వారు చర్చించుకంఉటున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఐఐటీ విద్యార్థికి తీవ్ర గాయాలు
నాయుడుపేటటౌన్: రోడ్డు ప్రమాదంలో ఐఐటీ విద్యార్థి తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం మండలంలోని అయ్యప్పరెడ్డిపాళెం క్రాస్ రోడ్డు చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన పవన్‌కుమార్ చైన్నెలో ఐఐటీ చదువుతున్నాడు. మంగళవారం చైన్నె నుంచి తన బైక్‌పై స్వగ్రామానికి వస్తుండగా మార్గమఽధ్యంలో అయ్యప్పరెడ్డిపాళెం గ్రామ జాతీయ రహదారి కూడలి వద్ద ఓ యాచకుడు అడ్డు రావడంతో బైక్ అతనిని ఢీకొంది. ఈ ప్రమాదంలో పవన్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే యాచకుడు చెంచయ్యకూ గాయాలయ్యాయి. ఇద్దరినీ 108 అంబులెన్సులో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పవన్‌ను నెల్లూరు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలకు ఎంపిక
చిట్వేలి: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు మంగళవారం మదనపల్లిలో జరిగిన జిల్లా స్థాయి యోగాసన పోటీల్లో పాల్గొని విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఫిజికల్ డైరెక్టర్ రమాదేవి తెలిపారు. పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న సింధు, దిలీప్, సమద్, ఏడో తరగతి విద్యార్థులు లక్ష్మీనారాయణ, లాస్యకుమార్, శివనందు, ఎనిమిదో తరగతి చదువుతున్న హర్షవర్దన్, తొమ్మిదో తరగతి చదువుతున్న తనూజ, గ్రీస్మిత సాయి యోగాసన జిల్లా స్థాయి పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించినట్టు వెల్లడించారు. యోగాసన స్టేట్ మీట్‌కు ఎంపికై న విద్యార్థినీ విద్యార్థులను ఇన్చార్జ్ హెడ్మాస్టర్ సోఫియా అభినందించారు. -
పెన్షన్.. టెన్షన్
కొత్త పింఛన్ల దరఖాస్తుకు 16 వరకే గడువు తిరుపతి అర్బన్: కొత్త పింఛన్ దరఖాస్తుల గడువు సమీపిస్తుండడంతో అర్హులైన వారిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండున్నరేళ్ల తర్వాత కొత్త పింఛన్ల దరఖాస్తుకు అవకాశం కల్పించింది. సచివాలయాల్లో ఈ నెల 7 నుంచి 16వ తేదీ వరకు మాత్రమే గడువు విదించింది. కేవలం పది రోజులు సమయం ఉండడం.. అందులో మూడు రోజులు సెలవులు మినహాయిస్తే ఏడు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే రెండు రోజులు గడిచిపోయింది. ఇక ఐదు రోజులు మాత్రమే అవకాశం ఉంది. జిల్లాలో 30 వేల నుంచి 35 వేల మంది దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. మరో వైపు దరఖాస్తు సమయంలో ఆధార్–మొబైల్‌కు అనుసంధానం చేసి ఉండాలి.. లేదంటే ఓటీపీ చెప్పకపోవడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి ముందస్తుగా జాగ్రత్తులు తీసుకోవాల్సి ఉంది. తొలి రోజు నుంచే సర్వర్ సమస్యలు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి తొలి రోజు నుంచే సర్వర్ మొరాయించడంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా సర్వర్ సమస్యలు చోటుచేసుకోవడంతో 2,669 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. రెండో రోజు వివిధ సమస్యల కారణంగా 735 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. సెలవు రోజులు మినహాయిస్తే మిగిలిన రోజుల్లో సర్వర్ సమస్యలు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండేనా? పలువురు సచివాలయ ఉద్యోగులు బీఎల్వోలుగా పనిచేస్తున్న క్రమంలో వారు ఇంటింటా సర్వే, పోలింగ్ బూత్‌ల పరిశీలన, ఇతర సర్వేల పేరుతో సచివాలయంలో అందుబాటులో ఉండడం లేదు. ఈ క్రమంలో సచివాలయ ఉద్యోగులను ఈ నెల 16వ తేదీ వరకు సచివాలయంలో అందుబాటులో ఉంచాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
పులికాట్ సరిహద్దులు తేల్చండి
పులికాట్ సరస్సులో చేపల వివాదానికి సంబంధించి తమిళనాడు–ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్స్యకారుల మధ్య తరచూ జరుగుతున్న వివాదాల నేపథ్యంలో సరిహద్దులు తేల్చాలని మత్స్యకారులు పట్టుబట్టారు. ఆరు నెలలుగా క్రమంతప్పకుండా కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు వస్తున్నా ఫలితం లేదని వాపోయారు. పులికాట్ సరస్సు ఆధారంగా 17 గ్రామాలకు చెందిన వేలాది మంది మత్స్యకారులు చేపల వేట ఆధారంగా జీవనం సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. తమిళనాడు మత్స్యకారులు తమపై దాడులు చేయడంతోపాటు కేసులు పెడుతున్నారని వాపోయారు. ప్రధానంగా మంగోడు, చిన్న మంగోడు, కీర పుదుకుప్పం ప్రాంతాల్లో సరిహద్దు వివాదాలు అధికంగా ఉన్నట్లు వివరించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. మత్స్యకారుల సంఘం నేతలు ఏే.వాసు, మూర్తి, కే.వాసు, శివలింగం, రాజేంద్రన్, సంజయ్, వినోద్, ఆర్ముగం స్పష్టం చేశారు. -
పుస్తకావిష్కరణ
తిరుపతి కల్చరల్:జ్ఞాన ముక్తి సాధనంగా అన్నమయ్య కు పదార్చన పుస్తకాన్ని వెంకటపతి స్వామి రచించార ని ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ వీసీ ఆచార్య రాణి సదాశిమూర్తి తెలిపారు. విశ్వామిత్ర సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో వేంకటపతి స్వామి రచించిన ‘అన్నమయ్యకు పదార్చన’ పుస్తకావిష్కరణ ఆదివారం శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నమయ్యకు పదార్చన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆలిండియా రేడియో మాజీ డైరెక్టర్ మల్లేశ్వరరావు సమన్వ య కర్తగా వ్యవహరించగా ఆచార్య గార్లపాటి దామోదర నాయుడు, రిటైర్డ్ ప్రిన్సిపల్ గాలి గుణశేఖర్, సూ ర్యచంద్ర ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఏనుగు అంకమ నాయుడు, సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ కే.సుబ్రమణ్యం, పరిహార సేవ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ బి.చక్రపాణి పాల్గొన్నారు. ప్రముఖ గాయకులు మధు సూదన్, ప్రియాంక, డాక్టర్ ఆశాదీపిక, కుమారి రిషిత ఆలపించిన సంకీర్తనలు శ్రోతులను అలరించాయి. -
ఆప్సీ చైర్మన్‌గా విజయభాస్కర్‌రావు
తిరుపతి సిటీ: రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇన్చార్జి చైర్మన్‌గా ప్రొఫెసర్ విజయ భాస్కర్ రావు బాధ్యతలు చేపట్టారు. గతంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్‌గా సేవలందిస్తున్న ఆయనను ఆప్సీ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత విద్య, పరిశోధన, వాతావరణ శాస్త్రం, రేడియో కమ్యూనికేషన్, అంతరిక్ష సాంకేతిక రంగాల్లో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. ఎస్వీయూ ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన ఉన్నత విద్యారంగంలో పలు ఉన్నత హోదాలలో సేవలందించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ స్థాయికి చేరుకోవడంపై ఫిజిక్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ బీ దేవప్రసాద్‌రాజు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఆయన ఆధ్వర్యంలో 150 కి పైగా పరిశోధనా పత్రాలను, 35 మంది పీహెచ్డీ, ఆరుగురు ఎంఫిల్ విద్యార్థులకు పరిశోధనా మార్గదర్శకత్వం అందించారని, 2012, 201లో నిర్వహించిన 104వ ఇండియన్ సైన్‌న్స్ కాంగ్రెస్‌కు ఆర్గనైజింగ్ సెక్రటరీగా వ్యవహరించి తన నిర్వహణ సామర్థ్యాన్ని చాటుకున్నారని కొనియాడారు. -
ధాన్యం నగదు ఇప్పించండి
పీజీఆర్ఎస్కు క్యూ కట్టిన అర్జీదారులు తిరుపతి అర్బన్: గత ఏడాది జూలై, ఆగస్ట్ నెలల్లో 40 మందికి పైగా రైతులు పండించిన వరిధాన్యాన్ని తొట్టంబేడు మండలంలోని పెద్దకన్నలి గ్రామానికి చెందిన ఓ వ్యాపారికి విక్రయించామని, వారం రోజుల్లో ధాన్యం డబ్బులు ఇస్తామని చెప్పిన ఆ వ్యాపారి ఆ తర్వాత వాయిదాలు వేస్తూ వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి వ్యాపారి సమాధానం చెప్పకపోవడంతో సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్‌లో జేసీకి న్యా యం చేయాలని వినతిపత్రాన్ని ఇచ్చామని రైతులు వివరించారు. సుమారుగా రూ.2.2 కోట్లు రైతులకు వ్యాపారి ఇవ్వాల్సి ఉందని వాపోయారు. న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు. ప్రధానంగా పూడి, యార్లపూడి, సుబ్బానాయుడుకండ్రిగ, వెంకటాపురం, చిట్టత్తూరు, అంజిమేడు, పుల్లూరు తదితర గ్రామాలకు చెందిన రైతులు కన్నీరుపెట్టుకున్నారు. పీజీఆర్ఎస్కు 275 అర్జీలు కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు జిల్లా వ్యాప్తంగా మొత్తం 275 అర్జీలు రాగా.. అందులో రెవెన్యూ సమస్యలపైనే 152 అర్జీలు వచ్చినట్టు కలెక్టరేట్ అధికారులు తెలిపారు. ప్రతి అర్జీకి న్యాయం చేయాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ గోవిందరావు, డీఆర్వో నరసింహులు, పలువురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అర్జీలు స్వీకరించారు. పనిభారం తగ్గించండి పనిభారం తగ్గించాలంటూ ఆశావర్కర్లు కలెక్టరేట్లో అధికారులకు మొరపెట్టుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ విధులకు సంబంధం లేని పనులు అప్పగించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో డ్యూటీలను వేయరాదన్నారు. అనంతరం డీఆర్వో నరసింహులకు వినతిపత్రాన్ని అందించారు. ఆశా వర్కర్ల యూనియన్ నేతలు హైమావతి, చాముండేశ్వరి, ధనలక్ష్మి, మారెమ్మ పాల్గొన్నారు. ఇంటిపట్టాలకు భద్రత కల్పించాలంటూ ధర్నా చేస్తున్న గ్రామీణ వాసులు రక్షణ కల్పించండి దశాబద్దాల క్రితం ప్రభుత్వం ఇచ్చిన ఇంటిపట్టాలకు సరైన రికార్డులు లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నామని, వాటికి రక్షణ కల్పించాలని వడమాలపేట మండలంలోని ఎస్బీఆర్పురం, అంబేద్కర్‌కాలనీ, చెంచులక్ష్మి కాలనీకి చెందిన వారు ఆవేదన చెందారు. ఆ మేరకు తమకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. 180 మందికి ఇంటి పట్టాలు ఇచ్చినప్పటికీ రికార్డులో నమోదు చేయలేదని వాపోయారు. జరిమానాలు సరికాదు పదేపదే వాహనాల తనిఖీలు చేపట్టడం, చిన్న పొరబాట్లకు భారీ మొత్తంలో జరిమానాలు విధించడం సరికాదని ఆటో అండ్ మోటార్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్‌రెడ్డి, రాధాకృష్ణ మాట్లాడుతూ ఆటోలు, క్యాబ్‌లు, లారీలు, మినీ వ్యాన్లు, అంబులెన్సులకు భారీ ఈ–చలానాలు, తనిఖీల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన చెందారు. ఆ మేరకు డీఆర్వోకు వినతిపత్రాన్ని అందించారు.


