సైన్స్‌ సెంటర్‌లో జిల్లా స్థాయి క్విజ్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

సైన్స్‌ సెంటర్‌లో జిల్లా స్థాయి క్విజ్‌ పోటీలు

Feb 3 2026 8:00 AM | Updated on Feb 3 2026 8:00 AM

సైన్స్‌ సెంటర్‌లో జిల్లా స్థాయి క్విజ్‌ పోటీలు

సైన్స్‌ సెంటర్‌లో జిల్లా స్థాయి క్విజ్‌ పోటీలు

తిరుపతి ఎడ్యుకేషన్‌ : జూపార్కు రోడ్డులోని రీజినల్‌ సైన్స్‌ సెంటర్‌లో ఈ నెల 14 నుంచి మార్చి 14వ తేదీ వరకు నెల రోజుల పాటు 5వ జిల్లాస్థాయి సైన్స్‌ క్విజ్‌ పోటీలను నిర్వహించనున్నట్లు సైన్స్‌ సెంటర్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ కె.శ్రీనివాస నెహ్రు తెలిపారు. ఈ సైన్స్‌ క్విజ్‌ పోటీలను లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ గరుడాద్రి తిరుపతి, జూనియర్‌ ఛాంబర్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలతో కలిసి సైన్స్‌ సెంటర్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీలకు సంబంధించిన వాల్‌ పోస్టర్లను సోమవారం సైన్స్‌ సెంటర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగున్న శాసీ్త్రయ పరిజ్ఞానాన్ని వెలికితీయడంతోపాటు వారిలో పోటీ స్ఫూర్తిని రగిలించేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో 8 నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు పాల్గొనవచ్చని, ఒక్కో పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులతో కూడిన బృందంగా హాజరుకాచ్చని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 14న ప్రిలిమినరీ రౌండ్‌, 21, 22, మార్చి 1, 2వ తేదీల్లో క్వాలిఫైయింగ్‌ రౌండ్స్‌, మార్చి 7, 8వ తేదీల్లో సెమీఫైనల్‌, మార్చి 14న ఫైనల్‌ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు ఎటువంటి రిజిస్ట్రేషన్‌ ఫీజులు లేవని, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 12వ తేదీలోపు ‘‘హెచ్‌టీటీపీఎస్‌://టీఐఎన్‌వైయుఆర్‌ఎల్‌.కామ్‌/ఆర్‌ఎస్‌సీటీఏఎన్‌ఎన్‌యూఏఎల్‌ క్విజ్‌’’ అనే వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో, అలాగే సైన్స్‌ సెంటర్‌లో నేరుగాను దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు 0877–2286 202, 79896 94681 నంబర్లలో, అలాగే ‘‘ఆర్‌ఎస్‌సీటీఈడీయుపీఆర్‌ఓ:జీమెయిల్‌.కామ్‌’’ ఈమెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ గరుడాద్రి ప్రతినిధులు మక్కిన భాస్కర్‌, బండి మధుసూదనరెడ్డి, చక్రవర్తి చెన్నుపాటి, జేసీఐ ప్రతినిధులు మక్కిన జె.లక్ష్మీతేజ, ఉమామహేశ్వర్‌, జి.శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement