breaking news
Tirupati District News
-
వేదిక్ వర్సిటీ వీసీగా గణపతి భట్
తిరుపతి సిటీ: శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం నూతన వైస్ చాన్సలర్‌గా జాతీయ సంస్కృత వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కే.గణపతి భట్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర గవర్నర్, వర్సిటీ ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత వీసీ రాణి సదాశివమూర్తి పదవీకాలం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో నూతన వీసీగా గణపతి భట్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రొఫెసర్ గణపతి భట్ గత 25 సంవత్సరాలుగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని అద్వైత వేదాంత విభాగంలో ఆచార్యుడిగా సేవలందిస్తున్నారు. అకడమిక్ డీన్‌గా, వేదం, వేదాంతం, జ్యోతిష శాస్త్రాలలో విశేష పాండిత్యం గడించారు. -
కుర్చీ ఇస్తారా? ఎంతైనా ఖర్చు పెడతాం
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పేలా లేదు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఎవరికి వారు పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. మేయర్, మున్సిపల్ చైర్మన్ కుర్చీల కోసం పైరవీలు, బేరసారాలు మొదలు పెట్టేశారు. కుర్చీ కోసం ఎన్ని కోట్లయినా పెట్టుకుంటామని చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగారు. అధికారం చేజిక్కించుకున్నాక పాలనా వ్యవహారాలు, పదవులు, పనుల పంపకాల్లో నువ్వా నేనా అంటూ పోటీపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మూడు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో ‘మేము లేకపోతే మీరు గెలిచే వారు కాదు, పదవులు అనుభవించేవారు కాదు’ అంటూ మూడు పార్టీ శ్రేణులు నువ్వెంత అంటే.. నువ్వెంత అని మాట్లాడుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా తమ బలాన్ని నిరూ పించుకోలేకపోతే అధికారంలో ఉన్నన్ని రోజులు మా దయా దాక్షిణ్యాలతో పదవులు అనుభవిస్తున్నారని ఎత్తిపొడుస్తూనే ఉంటారని కూటమిలోని మూడు పార్టీల శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో తిరుపతి, చిత్తూరు జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో తమ బలం ఏమిటో నిరూపించుకోవాలని జనసేన ఉవ్విళ్లూరుతోంది. పార్టీ శ్రేణుల ఒత్తిడి మేరకు అధిష్టానం నుంచి కూడా సంకేతాలు అందినట్టు విశ్వసనీయ సమాచారం. ఆమేరకు జనసేన శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రయాత్నాలు మొదలుపెట్టారు. ఎన్నికల్లో పోటీచేయకపోతే పరువు పోతుందని బీజేపీ భావిస్తోంది. తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీల ఎన్నికల్లో బరిలో దిగాలని భావిస్తోంది. పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయోనని ఎవరికి వారు బృందాలను ఏర్పాటు చేసి సర్వేలు చేయించుకుంటున్నారు.తిరుపతి, చిత్తూరు మేయర్ స్థానాలతో పాటు జిల్లాలోని మున్సిపాలిటీల చైర్మన్ పీఠాల కోసం టీడీపీ, జనసేన నేతల నుంచి తీవ్రమైన పోటీ ఉంది. కుర్చీలు కావాలంటే భారీగా ఖర్చు అవుతుందని ముఖ్య నాయకులు చెబితే.. అందుకు సరే పెట్టుకుంటాం అంటూ స్పష్టం చేసినట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. తిరుపతి మేయర్ పీఠం కోసం టీడీపీ నుంచి 11 మంది, జనసేన నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఇద్దరు పోటీపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తిరుపతి మేయర్ కోసం బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి తన కుమారుడి కోసం ప్రయత్నించినట్లు తెలిసింది. డిప్యూటీ మేయర్ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అదేవిధంగా మరో బీజేపీ నేత కూడా మేయర్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. చిత్తూరు మేయర్ పీఠం కోసం టీడీపీ నుంచి ఐదుగురు, జనసేన నుంచి ఇద్దరు పోటీపడుతున్నారు. తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్ మేయర్ల కుర్చీ కోసం పోటీ పడుతున్న టీడీపీ, జనసేన పార్టీలో ఐదుగురు నాయకులు ఒక్కొక్కరు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధిష్టానానికి సంకేతాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మున్సిపల్ చైర్మన్ కుర్చీల కోసం రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్లు పెట్టేందుకు కొందరు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠం కోసం బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా తమ పార్టీ కార్యకర్తలు కూడా వార్డుల్లో పోటీచేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. నగరి, పలమనేరు, కుప్పంలోనూ జనసేన నేతలు కొందరు పోటీ చేయాలని ఆశపడుతున్నారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యేల అభిప్రాయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా రిజర్వేషన్లు ఖరారు అయ్యాక మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కూటమి కుమ్ములాట అసెంబ్లీ ఎన్నికల్లో కలిసికట్టుగా కొట్టాం.. అధికారం తెచ్చాం.. అని సంబరపడిన కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ఇప్పుడు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వే అసలు రంగు బయటపడుతోంది. నగరపాలక పీఠంపై జెండా పాతేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఎవరికి వారు కత్తులు నూరుకుంటున్నారు. మా బలం లేకపోతే మీరు గెలిచేవారా? అంటూ ఒకరికొకరు ఎత్తిపొడుపులకు దిగుతున్న నేతలు, కుర్చీ కోసం కోట్లు కుమ్మరించడానికై నా వెనుకాడబోమని బాహాటంగానే ప్రకటిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ మార్కుల చూపించుకోకపోతే భవిష్యత్తు శూన్యమనే భావన క్యాడర్లో బలంగా నాటుకుకోయింది. మిత్ర పక్షాల ముసుగులో సాగుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. -
పింఛన్ల పంపిణీలో మార్పులు
తిరుపతి అర్బన్ : సామాజిక పింఛన్ల పంపిణీలో నవంబర్ నెల నుంచి పలు మార్పులు చేయనున్నారు. అక్టోబర్ నుంచి విజయనగరం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు పేరుతో మార్పులను అమలు చేస్తున్నారు. అనంతరం అన్ని జిల్లాల్లో అమలు చేయనున్నారు. ప్రధానంగా వృద్ధాప్య పింఛన్‌కు సంబందించి (60–79) రూ.200లను బ్యాంకులో జమ చేస్తారు. మిగిలిన రూ.3,800 చేతికి అందజేస్తారు. అలాగే 80 ఏళ్లు పైబడిన వారికి రూ.500 బ్యాంకులోను, రూ.3,500 చేతికి ఇస్తారు. వితంతు పింఛన్‌కు సంబందించి (80 ఏళ్లు పైబడిన వారికి) రూ.500 బ్యాంకులోను, రూ.3,500 చేతికి ఇవ్వనున్నారు. వికలాంగుల పింఛన్‌కు సంబందించి (18–79) వయస్సు వారికి రూ.300 బ్యాంకులోను, రూ.5,700 చేతికి ఇవ్వనున్నారు. వికలాంగుల పింఛన్‌కు సంబందించి (80 ఏళ్లు పైబడిన వారికి) రూ.500 బ్యాంకులోను, రూ.5,500 చేతికి ఇస్తారు. ఆ దిశగా జిల్లాలోని గ్రామీణాభివృద్ధి శాఖ కసరత్తు చేస్తోంది. గ్రామీణ విలేకరులకు పునశ్చరణ తరగతులు తిరుపతి అర్బన్: జిల్లాలోని గ్రామీణ విలేకరులకు అక్టోబర్ 3, 4 తేదీల్లో పునశ్చరణ తరగతులు నిర్వహించనున్నట్టు సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్‌కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతిలోని ఎస్వీయూలో ఉన్న సెనేట్ హాల్లో తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. ఇందులో అనుభవజ్ఞులైన పాత్రికేయులు పత్రికా కథనాలకు సంబందించి వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తారని వివరించారు. త్వరిగతిన పెండింగ్ ప్రాజెక్టుల పనులు తిరుపతి తుడా: స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా తిరుపతి నగరంలో పెండింగులో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని స్మార్ట్ సిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. ఆయన గురువారం 45వ స్మార్ట్ సిటీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.జయకృష్ణ ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ సమావేశంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. సిటీ ఆపరేషన్ సెంటర్ బిల్డింగ్ పనులను పూర్తి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. స్మార్ట్ సిటీ ద్వారా చేపట్టిన ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, గ్లో గార్డెన్, వినాయక సాగర్ ప్రాజెక్టుల నిర్వహణపై చర్చించారు. బోర్డు సమావేశంలో ఎస్పీ సుబ్బరాయుడు, తుడా వైస్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, ఇంజినీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్‌రావు, అదనపు కమిషనర్ శారదా దేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎస్పీడబ్ల్యూ విద్యార్థులు తిరుపతి సిటీ: సెట్విన్ ఆధ్వర్యంలో ఎస్వీ పశువైద్య కళాశాల వేదికగా బుధవారం నిర్వహించిన యువజనోత్సవ పోటీల్లో పద్మావతి మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ భువనేశ్వరి మాట్లాడుతూ జిల్లా యువజనోత్సవాల్లో గ్రూప్ డ్యాన్స్ జానపద విభాగంలో కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించారని తెలిపారు. వారు త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులను అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు. 28 వరకు డీఫార్మసీ స్పాట్ అడ్మిషన్లు తిరుపతి సిటీ: తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల కాలవ్యవధితో నడుస్తున్న డీఫార్మసీ కోర్సులో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 28వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఎస్.శ్రీనివాసులు తెలిపారు. డీఫార్మసీ కోర్సులో చేరదలిచిన విద్యార్థులు ఒరిజనల్ ధ్రువీకరణ పత్రాలతో కళాశాలలో సంప్రదించాలని కోరారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మూడో రోజైన గురువారం పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్య పూజల్లో జరిగే దోషాలను సరిచేసేందుకు ఈ పూజలు చేస్తారు. ఇందులో భాగంగా ఆలయంలోని యాగశాలలో వేదపండితులు, అర్చకులు శ్రీ–కాళ–హస్తి, భరద్వాజ మహర్షికి అభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వరాలయ అధికారులు పూజా ద్రవ్యాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో బీకే వెంకటేశులు, పాలకమండలి సభ్యులు, వేదపండితులు, అర్చకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
రసాయన రహిత మామిడితో ఆదాయం
తిరుపతి కల్చరల్: రైతులు రసాయన అవశేషాలు లేని, నాణ్యత కలిగిన మామిడి ఉత్పత్తులు పండించినప్పుడే మంచి గిట్టుబాటు ధరతో పాటు, ఎలాంటి ఆటంకాలు లేకుండా విదేశాలకు మామిడి ఉత్పత్తులు ఎగుమతి చేసి ఆదాయం పొందవచ్చని రాస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.వెంకటరత్నం తెలిపారు. రాస్, రాస్ కృషి విజ్ఞానకేంద్రం ఆధ్వర్యంలో కోకాకోలా ఇండియా పౌండేషన్, న్యూడిల్లీ వారి సహకారంతో గురువారం రాస్ సేవా నిలయంలో మామిడిలో సుస్థిర ఆదాయ మెలకువలపై రైతులకు శిక్షణ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ రైతులు శాస్త్రవేత్తలు సూచించిన ప్రకారం యాజమాన్య పద్దతులు పాటించి, జీవన ఎరువులు ,సూక్ష్మ పోషకాలు వాడాలని తెలిపారు. సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఉన్నతి మ్యాంగో ప్రాజెక్టులో భాగంగా ఇది వరకే చేపట్టిన వివిధ కార్యక్రమాలు, వాటి ప్రభావం గురించి వివరించారు. ఉద్యాన శాస్త్రవేత్త పీఎస్.సుధాకర్ మాట్లాడుతూ కొమ్మ కత్తిరింపులు చేసిన తోటలలో యూరియా 10 గ్రాములు, సూఓ్మపోషకాల మిశ్రమం 5 గ్రాముల చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేస్తే త్వరగా కొత్త చిగురు పెరిగి పూత తొందరగా వస్తుందని తెలిపారు. జీవన ఎరువులైన అజోస్పైరిల్లం, ఫాస్పోబాక్టిరియా, పొటాషియం మొబిలైజింగ్ బాక్టీరియాల మిశ్రమాన్ని వినియోగించటం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందవచ్చని తెలిపారు. విస్తరణ శాస్త్రవేత్త రాముకుమార్ మాట్లాడుతూ కృషి విజ్ఞాన కేంద్రం చేపడుతున్న భూసార పరీక్ష ఆధారిత ఎరువుల యాజమాన్యం, ఆహార ఉద్యాన పంటలలో ఎల్‌నినో పరిస్థితుల్లో తీసుకోవాల్సిన మెలకువలు, వ్యవసాయ డ్రోన్ సాంకేతికత గురించి వివరించారు. ఈ సందర్భంగా వంద మంది మామిడి రైతులకు ప్రదర్శనా క్షేత్రాల నిర్వహణ కోసం ఎన్పీకే జీవన ఎరువుల మిశ్రమం, కానుగ నూనె, సూక్ష్మ పోషకాల మిశ్రమం, మ్యాంగో స్పెషల్ పంపిణీ చేశారు. -
తెరుచుకున్న రైల్వే అండర్‌పాస్
తిరుపతి మంగళం : తిరుపతి నగర ప్రజల రాకపోకలు సులభతరం చేసేందుకు తిరుపలి కులశేఖర్ ఆళ్వార్ మార్గంలో నిర్మించిన రైల్వే అండర్ పాస్‌ను ప్రారంభించాలని గురువారం వైఎస్సార్ సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి, పార్టీ శ్రేణులు, స్థానికులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. భూమన అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ జగనన్న పాలనలో రైల్వే అండర్ పాస్ నిర్మాణ పనులు చేపట్టినట్టు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధిని పక్కన పెట్టి రాజకీయ కక్షలు, అరాచకాలు సాగిస్తున్నారన్నారు. రైల్వే అండర్ పాస్ నిర్మాణ పనులు పూర్తయి మూడు నెలలు గడిచినా ప్రారంభించకుండా అధికారులు, నాయకులు మీనమేషాలు లెక్కిస్తున్నారని దుయ్యబట్టారు. అండర్‌పాస్‌లో వర్షపునీరు నిలవకుండా మోటార్లు ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు లేఖ రాసినప్పటికీ పట్టించుకోలేదని ఆరోపించారు. వైఎస్సార్సీపీ పాలనలో తాము 22 మాస్టర్ ప్లాన్ రోడ్లను నిర్మిస్తే, కూటమి ప్రభుత్వం రైల్వే అండర్ పాస్ వద్ద మోటార్లు ఏర్పాటు చేయలేరా? అని ప్రశ్నించారు. తిరుపతి నగరంలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నెల రోజుల్లో సమస్య పరిష్కరించకుంటే కార్పొరేషన్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఖాళీ బిందెలతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. తెరుచుకున్న రైల్వే అండర్ పాస్ వైఎస్సార్సీపీ ధర్నాతో కార్పొరేషన్ అధికారులు స్పందించి రైల్వే అండర్ పాస్‌ను తెరిచారు. అధికారులు రైల్వే అండర్ పాస్‌ను ప్రారంభించడం అభినందనీయమని చప్పట్లతో వారికి అభినందనలు తెలిపారు. మాజీ మేయర్ శిరీష మాట్లాడుతూ జగనన్న పాలనలో అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సహకారంతో డిప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి చొరవతో తిరుపతి నగర అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్లామన్నారు. పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ తిరుపతిలో రౌడీలకు టీడీపీ ఇన్చార్జ్ పదవులు ఇస్తే అరాచకాలు, దాడులు చేయడం తప్ప ప్రజాసమస్యలను ఎక్కడ పట్టించుకుంటారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుపతి నగరంలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నీలం బాలాజీ, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు కేతం జయచంద్రారెడ్డి, ఆరే అజయ్‌కుమార్, పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు బత్తల గీతాయాదవ్, పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. -
28న జాబ్ మేళా
తిరుపతి అర్బన్: రైల్వే కోడూరులోని శ్రీసాయి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఈ నెల 28వ తేదీ ఉదయం 8.30 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. ఆయన గురువారం జేసీ గోవిందరావుతో కలిసి కలెక్టరేట్లో జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ 12 ప్రముఖ బహుళజాతి కంపెనీల ప్రతినిధులు జాబ్ మేళాలో పాల్గొని వివిధ విభాగాల్లో ఉద్యోగాల కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తారని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులై, 18 నుంచి 35 ఏళ్లలోపు యువతీ, యువకులు ఇంటర్వ్యూలకు హాజరుకావొచ్చని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా ఉందని సూచించారు. అదనపు సమాచారం కోసం 9052717078, 9988853335 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎల్డీఎం రవికుమార్, జిల్లా నైపుణ్యాభివృద్ధి విభాగం అధికారి ఆర్.లోకనాథం, ప్లేస్మెంట్ ఆఫీసర్లు సునేష్ బాబు, సులేమాన్ బాష పాల్గొన్నారు. -
మాఊరి ఆడపడుచు పోలేరమ్మ
వెంకటగిరి(సైదాపురం): వెంకటగిరి పోలేరమ్మ జాతరకు రాష్ట్రంలోనే ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ జారతకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. రెండు రోజులు ఇసుక వేస్తే రాలనంత జనం వెంకటగిరిలో ఉంటుంది. అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిచి పండుగ జరుపుకుంటారు. కోరిన కోర్కెలు తీరిన వారు మొక్కులు చెల్లిస్తారు. ఈ నెల 30వ తేదీ రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు జాతర మహోత్సవం వైభవంగా జరగనుంది. ఈ మేరకు అధికారులు, నిర్వాహకులు ఏర్పాటుచేశారు. 1917లో వెంకటగిరి సంస్థానంలో కలరా, మశూచి విజృంభించడంతో వందలాది మంది మరణించారు. అప్పటి రాజా వారు ప్రజలను కాపాడుకునేందుకు శాతల యాగం, అష్టదిగ్బంధనం యంత్రాల ప్రతిష్ట చేశారు. కలరా తగ్గకపోవడంతో పోలేరమ్మ జాతర చేశారు. ప్రజలు విపత్తు నుంచి బయట పడడంతో 1919 నుంచి జాతర నిర్వహించడం ఆనవాయితీగా మారింది. 33 తరాల నుంచి రాజులు పోలేరమ్మ జాతరను నిర్వహిస్తున్నట్టు శాసనాలు ఉన్నాయి. కుమ్మరి చేతిలో పుట్టిన తల్లి కుమ్మరి రోడ్డులోని కుమ్మరులు పుట్ట మట్టితో విగ్రహం చేస్తారు. మొదట కళ్లు లేకుండా ఉంచి, జీనిగవారి వీధలో అత్తాగారింటికి పంపుతారు. అక్కడ అర్ధరాత్రి 12 గంటల తర్వాత గాలిగంగ అనే వంశీయులు కళ్లు, దిష్టి చుక్క పెడతారు. దాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తారు. 2023లో రాష్ట్ర పండుగగా గుర్తింపు 2023లో అప్పటి వైఎస్సార్ సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని నాటి ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డితో మాట్లాడి జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించేలా చేశారు. ఈ క్రమంలో భాగంగా రాష్ట్ర పండుగగా నేడు నాలుగో ఏట జాతరను నిర్వహిస్తున్నారు. నిమజ్జనంలో మట్టే బంగారం అమ్మవారి ఊరేగింపు మల్లమ్మ గుడివీధి వద్ద ఉన్న నిష్క్రమణ మండపం వద్దకు చేరుకోగానే అమ్మవారు కళ్లు తొలగిస్తారు. ఆ సమయంలో పోలేరమ్మ విగ్రహం మట్టిని తీసుకునేందుకు భక్తులు పోటీ పడతారు. దాన్ని పూజ గదిలో ఉంచుకుంటే శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. దీంతో పోలేరమ్మ జాతర ముగుస్తుంది.జాతర విశేషాలు వినాయక చవితి తర్వాత వచ్చే మొదటి బుధవారం 1వ చాటింపు, రెండో బుధవారం 2వ చాటింపు వేస్తారు. ఆది, సోమ, మంగళవారాల్లో ఘటోత్సవం, బుధ, గురువారాల్లో జాతర ఉంటుంది. కుమ్మరివీధిలో పుట్ట మట్టితో అమ్మవారి విగ్రహాన్ని కళ్లు లేకుండా తయారు చేస్తారు. అమ్మవారికి ముసుగు కప్పి, పల్లకిలో అత్తవారి ఇల్లుగా భావించే జీనిగవారి వీధికి తీసుకెళ్తారు. అర్ధరాత్రి అద్దంలో చూస్తూ వెనుక నుంచి అమ్మవారికి కళ్లు పెడతారు. అమ్మవారి ఉగ్రరూపాన్ని నేరుగా చూడలేరని నమ్మకం. తర్వాత తెల్లవారు జాము నుంచి దర్శనం, సాయంత్రం భారీ నిమజ్జన ఊరేగింపు చేపడతారు. పోలేరమ్మ జాతరను 1992 నుంచి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. తొలిపూజ మాత్రం ఇప్పటికీ వెంకటగిరి రాజా వారిదే. -
అరుదైన శస్త్రచికిత్స విజయవంతం
తిరుపతి తుడా: ఎస్వీ వైద్య కళాశాల ప్రసూతి ప్రభుత్వ ఆస్పత్రిలో క్లిష్టమైన సర్వైకల్ ఫైబ్రాయిడ్ అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. కార్వేటినగరం మండలం పోడలపల్లికి చెందిన మహిళకు (55) గర్భాశయంలో సుమారు 3 కిలోల బరువున్న భారీ గర్భాశయ ఫైబ్రాయిడ్ కణితికి హిస్టరెక్టమీ శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా చేశారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద ఉచితంగా శస్త్ర చికిత్సను నిర్వహించి రోగి ప్రాణాలను కాపాడారు. వైద్యబృందాన్ని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవిప్రభు, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రమీల దేవి, వైధ్యాధికారులు అభినందించారు. -
రూ.5 కోసం వృద్ధుడిపై కండక్టర్ దాడి
తిరుపతి రూరల్: పాకాల బస్టాండ్‌లో గురువారంచిల్లర విషయంలో తలెత్తిన వివాదం వృద్ధ ప్రయాణికుడిపై ఆర్టీసీ బస్సు కండక్టర్ చేయిచేసుకునే వరకు వెళ్లింది. బాధితుని వివరాల మేరకు.. పుంగనూరు డిపో బస్సులో ప్రయాణించిన ఒక వృద్ధుడు తనకు రూ.5 చిల్లర ఇవ్వాలని పదేపదే అడిగాడు. దీంతో కండక్టర్ ఆగ్రహానికి గురై చేయిచేసుకోవడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించాడు. కండక్టర్‌పై తోటి ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిల్లర విషయంలో వృద్ధుడిపై దాడికి పాల్పడటం ఏమిటని ప్రశ్నించారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి, సంబంధిత కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కండెక్టర్ దాడి చేసిన ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
ప్రజాధనంతో సొంత ప్రచారం!
తిరుపతి సిటీ: ఉద్యోగం వచ్చినంత వరకు కుటుంబంలోని ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేలు భృతి అందజేస్తాం. కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉంటే అందరికీ ఆడబిడ్డ నిధి పేరుతో నెలకు రూ.1500 ఇచ్చితీరుతాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 45 ఏళ్లకే పింఛన్లు ఇస్తాం అని సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కో ప్రగల్భాలు పలికి యువతను, మహిళలను, వెనుకబడిన తరగతులను మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా హామీల ఊసే ఎత్తడం లేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేమంటూ చేతులెత్తేశారు. ఆడబిడ్డనిధి, పింఛన్లపై యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు స్థానిక ఎన్నికల నేపథ్యంలో యువతకు గాలం వేసేందుకు సరికొత్త ఎత్తుగడ వేశారు. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ పాలసీ పేరుతో కూటమి సర్కార్ ప్రచారం కోసం వ్యూస్, ఫాలోవర్స్‌ను ప్రాతిపదికగా తీసుకుని రూ.15 వేలు ఇస్తామంటూ కుట్రకు తెరలేపారు. ఇందులో అధికార పార్టీకి చెందిన కార్యకర్తలను భాగస్వామ్యులను చేసి ప్రచారం చేసుకుని ప్రజాధనాన్ని స్వాహా చేసేందుకు పన్నాగం పన్నారు. రాజకీయ లబ్ధికోసం కూటమి కుట్రలో ఇదో భాగమని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు నేతలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల కుట్రలో భాగమే తాము ఏదో చేశామని ప్రజలను సోషల్ మీడియా ద్వారా మభ్యపెట్టేందుకు ప్రభుత్వం పన్నిన ఎత్తుగడే సోషల్ ఇన్ఫ్లూయెన్సర్ పాలసీ. గతంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఇచ్చిన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి హామీలకు చరమగీతం పాడేశారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో వ్యతిరేకత రాకుండా సోషల్ మీడియాను వేదికగా చేసుకోవాలనే కుట్ర చేస్తున్నారు. ఈ పాలసీ వల్ల ప్రజలకు, యువతకు ఒరిగేదేమీ లేదు. – జే.విశ్వనాథ్, సీపీఐ నగర కార్యదర్శి, తిరుపతి టీడీపీ కార్యకర్తలకు దోచిపెట్టడానికే.. టీడీపీ కార్యకర్తలకు మేలు చేసేందుకు బాబు పన్నిన కుట్ర ఇది. సోషల్ మీడి యా ద్వారా బాబు సర్కార్ తమ పార్టీ ప్రచారాన్ని చేసు కునేందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అల్లాడుతున్నారు. మహిళలు ఆడబిడ్డ నిధి కోసం ఎదురుచూస్తున్నారు. వారిని పట్టించుకోకుండా టీడీపీ కార్యకర్తలను స్థానిక ఎన్నికల కోసం వాడుకునేందుకు బాబు మరో ఎత్తుగడ వేస్తున్నారు. – బి.ఓబుల్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తిరుపతి నిరుద్యోగభృతికి అతీగతిలేదు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ పాలసీ అంటూ ప్రజాధనాన్ని తమ అనుచవర్గానికి దోచిపెట్టే ప్రయత్నం దారుణం. నిరుద్యోగులు భృతి కోసం ఎదురుచూస్తున్నారు. ఆడబిడ్డ నిఽధి నెలకు రూ.1500, వెనుకబడిన వర్గాల వారికి 45 ఏళ్లకే పింఛన్లు అని ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఇన్ఫ్లూయెన్సర్ పాలసీ అంటూ ప్రజాధనాన్ని ఉన్నవారికి కట్టబెట్టడం దారుణం. – అక్బర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, తిరుపతి నిరుద్యోగ భృతి బకాయిలు చెల్లించండి యువగళంలో లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు చెల్లించాలి. ఏడాదికి 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రామిస్ చేశారు. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి లేదు. మెగా డీఎస్సీ అంటూ దగా డీఎస్సీగా మార్చారు. ఇప్పుడు ఎన్నికల కోసం యువతను మభ్యపెట్టేందుకు సరికొత్త పాలసీని తెస్తున్నారు. టీడీపీ కార్యకర్తలతో మళ్లీ ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్న కుట్ర ఇది. – శివబాలాజీ, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు, తిరుపతి -
ఎస్వీసీఈలో రక్తదాన శిబిరం
తిరుపతి సిటీ: స్థానిక కరకంబాడి రోడ్డులోని ఎస్వీసీఈ కళాశాలలో ఎన్ఎస్ఎస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహించారు. అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సుమారు 100 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. ప్రిన్సిపాల్ కే చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని తెలిపారు. కార్యక్రమంలో రుయా మోడల్ బడ్ల్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భార్గవి, రుయా వైద్య సిబ్బంది, ఎన్ఎస్ఎస్ అధికారులు చంద్రయ్య, డాక్టర్ సుజన్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
శాస్త్రాల సమన్వయంతోనే..
శాస్త్రాల సమన్వయంతోనే పరిశోధనలకు కొత్త రూపు వస్తుందని బెంగళూరు ఐఐఎస్సీ ప్రొఫెసర్ రంగరాజన్ తెలిపారు.అర్హులందరికీ ఓటు హక్కు బుచ్చినాయుడుకండ్రిగ: ఓటర్ల జాబితాను సమగ్రంగా పరిశీలించి, అర్హుల పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడడమే సర్ ఉద్దేశమని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు గంధం చంద్రుడు తెలిపారు. ఆయన గురువారం బుచ్చినాయుడుకండ్రిగలో పలు ఇళ్లకు వెళ్లి ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ఓటర్ల వివరాల్లో తప్పులు, మార్పులు, పేర్లు నమోదు వంటి సమస్యలుంటే సర్కార్యక్రమంలో అధికారులు పరిశీలించి,సరిచేస్తారని తెలిపారు. ఓటర్లు తమ ఓటు వివరాలను పరిశీలించుకోవాలని, ఓటు సవరణలు, అభ్యంతరాలుంటే సంబంధిత ఫారాలను సమర్పించాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్ఓ శ్రీనివాసులు, ఈఆర్ఓ నాగార్జున్, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఆర్ఐ నల్లయ్య, వీఆర్ఓ బాలమురళి, కంప్యూటర్ ఆపరేటర్ కిరణ్‌కుమార్, వీఆర్ఏలు పాల్గొన్నారు. స్విమ్స్‌లో ఉచిత వినికిడి పరీక్షలు తిరుపతి తుడా: స్విమ్స్ ఆస్పత్రిలో శనివారం ఉదయం పది గంటలకు అంతర్జాతీయ బధిరుల వారోత్సవాల సందర్భంగా ఉచిత వినికిడి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఈఎన్టీ వైద్య విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. పద్మావతి ఈఎన్టీ ఓపీడీ విభాగంలో ఆడియాలజికల్ స్క్రీనింగ్, వినికిడి మదింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. వినికిడి లోపం ఉన్నవారు, వినికిడి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
నేడు పీటీసీలో పాసింగ్ అవుట్ పరేడ్
చంద్రగిరి: పోలీసు శిక్షణ తరగతులను పూర్తి చేసుకున్న అభ్యర్థులకు శుక్రవారం పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించనున్నారు. కల్యాణి డ్యామ్ సమీపంలోని పోలీసు ట్రైనింగ్ కళాశాల(పీటీసీ)లో శుక్రవారం ఉదయం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. పీటీసీ ప్రిన్సిపాల్ మహేష్ కుమార్ గురువారం మైదానంలో నిర్వహిస్తున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి మండపల్లి రాం ప్రసాద్ రెడ్డి, ఎంపీ ప్రసాద రావు, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడుతో పాటు ఇతర ప్రముఖులు హాజరుకానున్నారని తెలిపారు. ఆయన వెంట వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు గారు, అడిషన్ ఎస్పీ రాజగోపాల్ రెడ్డి, హెచ్ఎల్ఐలు వెంకటేశ్వర్లు, నీలయ్య సిబ్బంది పాల్గొన్నారు. స్విమ్స్‌లో రాష్ట్ర స్థాయి పీజీ క్విజ్ పోటీలు తిరుపతి తుడా: నేషనల్ కాలేజ్ ఆఫ్ చెస్ట్ ఫిజీషియన్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ సంయుక్తంగా గురువారం స్విమ్స్‌లో రాష్ట్రస్థాయి పీజీ క్విజ్ పోటీలు నిర్వహించినట్లు డీన్ అలోక్ సచన్ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ వైద్య కళాశాలలకు చెందిన పీజీ వైద్య విద్యార్థులు పోటీలో పాల్గొని ప్రతిభ చూపారని చెప్పారు. విశాఖకు చెందిన ఎన్ఆర్ఐఐఎంకు చెందిన డాక్టర్ మునుసూరు భావన ప్రథమ స్థానంలో నిలిచి రూ.5 వేల నగదు బహుమతి, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారని తెలిపారు. అలాగే రెండవ బహుమతిని విశాఖకు చెందిన జీవీపీఐహెచ్సీఎంటీకి చెందిన డాక్టర్ వెంకటసాయి నిఖిల్ గెలుచుకున్నారని తెలిపారు. మెడిసిన్ విభాగాధిపతి సీనియర్ గ్రేడ్ ప్రొఫెసర్ డాక్టర్ అల్లాడి మోహన్, వైద్యులు భార్గవ్, ఎంసీఆర్ రామ తదితరులు పాల్గొన్నారు. -
కేతన్ క్రిష్ రెడ్డికి రూ.4.10 లక్షల రీసెర్చ్ గ్రాంట్
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతికి చెందిన పదో తరగతి విద్యార్థి బి.కేతన్ క్రిష్రెడ్డి రూ.4.10 లక్షల అమెరికన్ రీసెర్చ్ గ్రాంట్‌ను అందుకున్నాడు. బాలుడు అకార్డ్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అంగారక గ్రహంపై అణు విద్యుత్ లూప్లకు హీట్ సింక్‌పై అతను రాసిన శాసీ్త్రయ సారాంశానికి అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ (ఐఏఎఫ్) ప్రశంసలు కురిపించింది. అక్టోబరులో టర్కీలో అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ (ఐఏఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించనున్న 77వ అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్ (ఐఏసీ–2026)కు ఆహ్వానించింది. అతన్ని ప్రోత్సహిస్తూ అమెరికాలోని వాషింగ్టన్ నగరంలో ఉన్న జార్జ్ మేసన్ యూనివర్సిటీ రూ.4.10 లక్షలు మంజూరుచేసింది. కేతన్ క్రిష్ రెడ్డి ఇదివరకే ఇస్రో ప్రతిష్టాత్మకమైన యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ యువికా 2026కు ఎంపికయ్యాడు. నేటి నుంచి జాతీయ స్థాయి ఆదివాసీ మహోత్సవాలు తిరుపతి సిటీ: ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎస్వీయూలోని శ్రీనివాసా ఆడిటోరియంలో జాతీయస్థాయి ఆదివాసీ సాంస్కృతిక మహోత్సవాలు శుక్రవారం ప్రారంభించనున్నట్టు టీఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు అక్కులప్ప నాయక్ తెలిపారు. ఆయన గురువారం వర్సిటీ ప్రధాన ద్వారం ఎదుట పోస్టర్లు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఉత్సవాల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆదివాసీ, గిరిజన కళాకారులు పాల్గొని తమ సంప్రదాయ కళలు, జానపద నృత్యాలు, సంగీతం, కళారూపాలను ప్రదర్శిస్తారని తెలిపారు. ఆదివాసీల విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాన్ని ప్రజలకు పరిచయం చేయడమే మహోత్సవాల ఉద్దేశమని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు రాగిరి చంద్రప్ప, రాష్ట్ర కార్యదర్శి విష్ణు నాయక్, తెలంగాణ అధ్యక్షుడు నరేష్ నాయక్ పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
రేణిగుంట: మండలంలోని పిల్లపాళ్యం దళితవాడలో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. రేణుకార్జున్ (47) అనే వ్యక్తి తన భార్య రూప కూతురు భవ్యతో కలిసి పంచాయతీ వాటర్ ట్యాంక్ పక్కన కాపురం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి వాటర్ ట్యాంక్ నిండి నీరు కిందపడుతుండడంతో రేణుకార్జున్ మోటార్ ఆఫ్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలింది. కుటుంబీకులు వెంటనే స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ రేణుకార్జున్ మరణించాడు. మృతుడి భార్య రూప ఫిర్యాదు మేరకు గాజులమండ్యం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేటి నుంచి ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు
తిరుపతి సిటీ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ చదువుతున్న జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 2027 పబ్లిక్ పరీక్షలకు గురువారం నుంచి ఫీజు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ ఎటువంటి అపరాధ రుసుము లేకుండా అక్టోబర్ 29లోపు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని కళాశాల యాజమాన్యాలకు ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. రూ.వెయ్యి అపరాధ రుసుముతో నవంబర్ 11వరకు గడువు ఉంటుందని వివరించారు. ఆలయంలో చోరీ నారాయణవనం: మండలంలోని అరణ్యంకండ్రిగలో ఉన్న గణపతి ఆలయంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బుధవారం ఈ విషయాన్ని గ్రామస్తులు గుర్తించారు. దుండగులు హుండీని పగులగొట్టి కానుకలను అపహరించినట్లు వెల్లడించారు. వినాయకచవితి నేపథ్యంలో హుండీలోనే సుమారు రూ.15వేల నగదు ఉంటుందని వివరించారు. అలాగే ఆలయంలో రూ.35వేల ఆంప్లిఫయర్ను సైతం చోరీ చేశారని తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చంద్రగిరి : మండలంలోని పనపాకం పంచాయతీ జక్కలవారిపల్లె వద్ద రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. పనపాకం పాతపేటకు చెందిన జి. ప్రసాద్(35) వ్యక్తి రైలు కింద పడి బలవన్మరణం చెందినట్లు రైల్వేపోలీసులు తెలిపారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించినట్లు వెల్లడించారు. చిత్తూరు రైల్వే ఎస్ఐ వెంకట నరసింహా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాటర్ ట్యాంక్ కూల్చివేత పెళ్లకూరు : మండలంలోని చిల్లకూరులో జాతీయ రహదారికి అత్యంత సమీపంలో ఉన్న ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్‌ను బుధవారం సంబంధిత శాఖ అధికారులు కూల్చివేశారు. 40వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన ఓవర్‌హెడ్ ఓటర్ట్యాంక్ను 1998లో రూ.40లక్షల వ్యయంతో నిర్మించారు. అయితే జాతీయ రహదారి రోడ్డు విస్తరణ కారణంగా వాటర్ ట్యాంక్‌ను కూల్చివేశారు. ఎస్వీయూ క్రీడా బడ్జెట్ రూ.70.89 లక్షలు తిరుపతి సిటీ : ఎస్వీయూ క్రీడా బడ్జెట్ కింద రూ.70.89లక్షలు కేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం లభించింది. బుధవారం ఈ మేరకు ఎస్వీయూ వీసీ నర్సింగరావు అధ్యక్షతన క్రీడామండలి సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా ఎస్వీయూ అంతర్ కళాశాలల పురుషుల వాలీబాల్, చెస్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించే బాధ్యతను పలమనేరు ఎస్వీసీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అప్పగించారు. అలాగే పురుషుల హాకీ, ఫుట్‌బాల్, బాల్ బ్యాడ్మింటన్ పోటీల నిర్వహణను ఎస్వీ ఆర్ట్స్ కళాశాలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన అన్ని క్రీడలను, అథ్లెటిక్స్ను ఎస్వీయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించాలని నిర్ణయించారు. శారీరక విద్యా విభాగం మాజీ డైరెక్టర్ దివంగత ఎంఎస్ శివశంకరయ్య కుటుంబీకుల అభ్యర్థన మేరకు ఆయన జ్ఞాపకార్థం టెన్నిస్ మహిళల సింగిల్స్ షీల్డ్, పురుషుల క్రికెట్ జట్టు షీల్డ్‌ను ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపారు. సమావేశంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి ప్రొఫెసర్ శివశంకర్‌రెడ్డి పాల్గొన్నారు. స్విమ్స్‌లో క్లిష్టమైన శస్త్రచికిత్సలు తిరుపతి తుడా : స్విమ్స్ న్యూరోసర్జరీ విభాగం క్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించిందని ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ జగదీష్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ సత్యసాయి జిల్లా ఉడుమలకుర్తికి చెందిన 67 ఏళ్ల నాగిరెడ్డి సిద్ధారెడ్డి మెడ భాగంలో తీవ్రమైన నొప్పి, ఇతర సమస్యలతో స్విమ్స్‌కు వచ్చారన్నారు. వైద్య పరీక్షలు, అవసరమైన స్కానింగ్‌ల అనంతరం రోగి పరిస్థితిని న్యూరోసర్జరీ వైద్యులు సమగ్రంగా పరిశీలించి ప్రాణదానం పథకం కింద ఉచితంగా శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారని వెల్లడించారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాళెం గ్రామానికి చెందిన 23 ఏళ్ల బొక్క నాగ సతీష్‌కు స్విమ్స్ న్యూరోసర్జరీ విభాగంలో అత్యాధునిక న్యూరోమోడ్యులేషన్ చికిత్స అందించారని వివరించారు. ఈ మేరకు వైద్య బృందానికి అభినందనలు తెలిపారు. -
ఘనంగా ఔషధ గణపతి నిమజ్జనం
తిరుపతి కల్చరల్ : తిరుపతి సప్తగిరి నగర్లో ఔషధ గుణాల ముల్తానీ మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమను బుధవారం ఘనంగా నిమజ్జనం చేశారు. తొమ్మిది రోజుల పాటు పూజించిన విగ్రహాన్ని అక్కడే నీటితో కరిగించారు. ఈ మట్టి కోసం భక్తులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా శ్రీసర్వసిద్ధి వినాయక చతుర్థి కమిటీ అధినేత విశ్వనాథ్ మాట్లాడుతూ ఈ మట్టిని చర్మ సౌందర్యం కోసం ఎక్కువగా ఉపయోగిస్తారని తెలిపారు. కమిటీ సభ్యులు కీర్తి వెంకయ్య, కమల్, లక్ష్మణ్, శరవణ, మోహన్, రమణ, వెంకట్, వినాయక్, సోనీ పాల్గొన్నారు. -
పట్టా భూములుగా ‘మేత’
పెళ్లకూరు: మండలంలోని తాళ్వాయిపాడు వద్ద సర్వే నంబర్ 68/1లోని 55.15 ఎకరాల విలువైన మేత పోరంబోకు భూములను పట్టా భూములుగా మార్చేసి కొందరు స్వాహా చేసినట్లు ఇటీవలే బట్టబయలైంది. గ్రామానికి చెందిన 9మందికి ఈ భూములకు సంబంధించి పట్టాలు మంజూరు చేసిన విషయం సూళ్లూరుపేట ఆర్డీఓ దేవందర్‌రెడ్డి పరిశీలనలో వెల్లడైంది. ఈ భూములు ఇప్పటికే పలువురి చేతులు మారడం విశేషం. నాయుడుపేట పట్టణానికి అత్యంత సమీపంలోని భూముల ధర ఇటీవల హైవే నిర్మాణంతో ఎకరా రూ.3కోట్ల నుంచి రూ.5కోట్ల వరకు పెరిగిపోయింది. రెండు పర్యాయాలు రీసర్వేలు చేపట్టిన స్థానిక రెవెన్యూ అధికారులు వీటిని ప్రభుత్వ మేత భూములను గుర్తించకుండా పట్టా భూములుగా కొనసాగించడం గమనార్హం. జాతీయ రహదారి రోడ్డు విస్తరణలో భాగంగా ఇక్కడి నిర్వాసితులకు పట్టాభూముల మాదిరిగానే పరిహారం చెల్లించడం విశేషం. ల్యాండ్ కన్వర్షన్ విషయమై కొందరు తిరుపతి, నెల్లూరు కలెక్టర్ కార్యాలయాలను సంప్రదించడంతో అసలు విషయం బయటపడినట్లు ఆర్డీఓ వెల్లడించారు. తాళ్వాయిపాడు గ్రామం సర్వే నంబరు 68/1లో ఉన్న 55.15ఎకరాల ప్రభుత్వ మేత భూమిపై కలెక్టర్‌కు నివేదిక అందించినట్లు వివరించారు. -
తమ్ముళ్ల చెరలో రాణీగారి భూములు!
పెళ్లకూరు: నిరుపేదలైన దళితులకు మంజూరు చేసిన భూములను ఎన్నో ఏళ్లుగా టీడీపీ నేతలు ఆక్రమించుకుని అనుభవిస్తున్నారు. పెళ్లకూరు గ్రామ రెవెన్యూ పరిధిలో వెంకటగిరి రాణీగారి భూములకు సంబంధించి సర్వే నంబరు 1/1నుంచి 1/5వరకు 316.15ఎకరాలు ఉన్నాయి. ఈ భూములను వెంకటగిరి సంస్థానానికి చెందిన వెలుగోటి సామ్రాజ్యలక్ష్మి 1973 సీలింగ్ చట్టం కింద ప్రభుత్వానికి అప్పగించింది. అయితే కప్పగుంటకండ్రిగ, పాలచ్చూరు ప్రాంతాలకు చెందిన పలువురు అగ్రవర్ణాలకు చెందిన వారు సదరు భూములను కబ్జా చేసేశారు. దీనిపై దళితులు హైకోర్టును ఆశ్రయించారు. 2008లో హైకోర్టు ఆదేశాలతో అప్పటి గూడూరు సబ్‌కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న భూస్వాముల నుంచి భూములను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలోని దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు చెందిన 125మందికి ఒక్కొక్కరికి 0.50 ఎకరాల చొప్పున మొత్తం 63ఎకరాలు సీజేఎఫ్ఎస్ కింద పట్టాలు మంజూరు చేశారు. పాలచ్చూరు, కప్పగుంటకండ్రిగ గ్రామాలకు చెందిన టీడీపీ నేతలు 2012లో అప్పటి తహసీల్దార్ సహాయంతో బోగస్ పాసుపుస్తకాలు సృష్టించి అడంగళ్‌లో పేర్లు నమోదు చేసుకుని బ్యాంకుల్లో భారీగా వ్యవసాయ రుణాలు పొందారు. అలాగే సర్వే సబ్ డివిజన్ 164 నుంచి 170లోని సుమారు 40 ఎకరాలను పెరుమాళ్లపల్లెకు చెందిన టీడీపీ నాయకులు అప్పట్లో రెవెన్యూ అధికారుల సహాయంతో బోగస్ అడంగల్ సృష్టించి నేటికీ సాగుదారులుగా కొనసాగుతున్నారు. దశాబ్దాలుగా చేసిన భూపోరాటం ఒకప్పటి వెంకటగిరి రాణి వెలిగోడు సామ్రాజ్యలక్ష్మికి చెందిన ఇక్కడి భూములను 1973 రెవెన్యూ చట్టం ప్రకారం గతంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అప్పట్లో వెంకటగిరి రాణి తమ భూములు పేదలకు దక్కాలనే లక్ష్యంతో వంద ఎకరాలను అర్హులైన పేదలకు చెందాలని వీలునామా రాసినట్లు సమాచారం. ఇక్కడి భూములను దశాబ్దాలుగా టీడీపీకి చెందిన పెత్తందారులు అనుభవిస్తుండడంతో నిరుపేద దళితులు చాలాకాలంగా భూపోరాటాలు చేసి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అప్పట్లో సీపీఎం నేత జక్కా వెంకయ్య ఆధ్వర్యంలో చేసిన దళితుల పోరాట ఫలితంగా ప్రభుత్వం స్పందించి పేదలకు పట్టాలు మంజూరు చేసింది. ఈ పోరాటాల్లో భాగంగానే పలువురు దళితులపై అగ్రవర్ణాల వారు తప్పుడు కేసులు బనాయించడంతో నేటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.ఫ్రీహోల్డ్తో సెట్టింగ్‌కు యత్నం ఫ్రీహోల్డ్ ఉత్తర్వులతో ఇక్కడి భూములను టీడీపీకి చెందిన స్థానికేతరులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నాలు తీవ్రతరం చేస్తున్నారు. ఆక్రమణదారులంతా టీడీపీ స్థానికేతర నాయకులు కావడం విశేషం. అలాగే మరికొందరు ఏపార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీలో చేరిపోయి అక్రమణ భూములకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఫ్రీహోల్డ్ ఆదేశాలతో భూములను సొంతం చేసుకునే ప్రయత్నంలో ఓప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు పరోక్షంగా భూస్వాములకు సాయం చేస్తున్నట్లు సమాచారం. ఈవిషయమై స్థానిక తహసీల్ధార్ హరికృష్ణను వివరణ కోరగా రాణిగారి భూములకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని, పూర్తి స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
విభూది గణపతికి వీడ్కోలు
తిరుపతి రూరల్ : వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా తుమ్మలగుంటలో కొలువుదీరిన విభూది విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో బుధవారం ఘనంగా వీడ్కోలు పలికారు. 10 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాథుడి నిమజ్జనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. నిమజ్జనకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి హాజరై విభూది వినాయకుడిని దర్శించుకున్నారు. బాల వినాయక కమిటీ చైర్మన్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. చక్రతీర్థంతో ప్రత్యేక అభిషేకం తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం చక్రస్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా లభించిన చక్రతీర్థంతో విభూది వినాయకుడికి ప్రత్యేక అభిషేకం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిమజ్జనోత్సవానికి శ్రీకారం చుట్టారు. మోహిత్ రెడ్డి, హర్షిత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విగ్రహంలోని పవిత్ర విభూదిని ప్రసాదంగా స్వీకరించేందుకు భక్తులు పోటీపడ్డారు. ప్రతి ఒక్కరికీ పవిత్ర విభూదిని ప్రసాదంగా అందించేలా కమిటీ సభ్యులు చర్యలు చేపట్టారు. -
సామాన్య భక్తులకే ప్రాధాన్యం
సైదాపురం/వెంకటగిరి రూరల్ : రాష్ట్ర పండుగ హోదాలో ఈ నెల 27 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు వెంకటగిరిలో పోలేరమ్మతల్లి జాతరను నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా సామాన్య భక్తులకే ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం పట్టణంలోని పింజల వీరయ్య కల్యాణ మండపంలో అధికారుల సమన్వయకమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 27న అమ్మవారి ఘటోత్సవం నుంచి 1వ తేదీ నిష్క్రమణ వరకు ఐ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 1,200 మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నట్లు తెలిపారు. సర్వదర్శనం, రూ. 100, రూ.300 చొప్పున మూడు క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నామని వీఐపీ దర్శనాలు ఉదయం 6 నుంచి 9 వరకు మాత్రమే ఉంటాయని వివరించారు. మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చే అవకాశమున్నందున 150 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపారు. భద్రతపై ప్రత్యేక దృష్టి పోలేరమ్మ జాతరలో అన్నిశాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఈ ఏడాది పోలేరమ్మతల్లి జాతరను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు వివరించారు. ఘటోత్సవం రోజు ఆదివారం విశ్వోదయ కళాశాల మైదానంలో సినీ గాయకులతో పాటకచ్చేరి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి దర్శన టికెట్లను ముందస్తుగా విక్రయిస్తున్నామని వెల్లడించారు. ఏఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీలు చెంచుబాబు, గీతాకుమారి, డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్, డీసీహెచ్ఎస్ ఆనందమూర్తి, శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాష్‌రెడ్డి, ఆలయ ఈఓ శ్రీనివాసులరెడ్డి, కమిటీ అధ్యక్షుడు మురళి పాల్గొన్నారు.సంప్రదాయబద్ధంగా రెండో చాటింపువెంకటగిరి పోలేరమ్మతల్లి జాతర రెండో చాటింపును సంప్రదాయబద్ధంగా బుధవారం అర్ధరాత్రి నిర్వహించారు. తొలుత కాపాళెంలోని గాలిగంపుల పోలేరమ్మ , కామాక్షమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. జాతర పనిబాపన వాళ్లు డప్పులు కొడుతూ చాటింపు వేశారు. కాంపాళెంలోని ప్రధాన మార్గం నుంచి వరదరాజస్వామి ఆలయం, బజారువీధి మీదుగా పోలేరమ్మ ఆలయం, ఆర్చి, కాశీపేట కూడలి మీదుగా పెద్ద శివాలయం వరకు చాటింపు చేపట్టారు. -
‘త్రిశూల్’ అమలు తప్పనిసరి
తిరుపతి అర్బన్ : జిల్లాలో ఆపరేషన్ త్రిశూల్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో డ్రగ్స్ వద్దు బ్రో పేరిట బ్యానర్‌ను ఎస్పీ సుబ్బరాయుడుతో కలసి ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా ప్రధానంగా డ్రగ్స్ నివారణ, మహిళలు, పిల్లలకు రక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. గ్రామ, వార్డు స్థాయి నుంచి ఈ అంశంపై అంగన్వాడీ, ఆశా వర్కర్లు అవగాహన కల్పించాలని సూచించారు. గతంలో 48 ప్రమాదకరమైన మలుపులను గుర్తించామని, ఆ మేరకు బ్లాక్స్ స్పాట్ల వద్ద చేపట్టే పనులు సంతృప్తికంగా ఉండాలని స్పష్టం చేశారు. ఆర్టీఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు బ్లాక్‌స్పాట్స్‌ను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరారు. అలాగే ప్రమాదం జరిగిన సమయంలో గోల్డెన్ అవర్‌తో అత్యవసర సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ డ్రగ్స్ నియంత్రణకు పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆపరేషన్ త్రిశ్రూల్లో భాగంగా డ్రగ్స్‌తోపాటు రోడ్డు ప్రమాదాల నివారణకు, మహిళా భద్రతకు ప్రత్యేక నిఘా పెడతామని వివరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, శ్రీలత, డీటీసీ మురళీమోహన్, డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్, డీఈఓ కేవీఎన్ కుమార్ పాల్గొన్నారు. -
పోలీసింగ్‌లో నవశకం
తిరుపతి క్రైమ్ : ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి ప్రత్యేక పోలీస్ కమిషనరేట్ మంజూరైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తిరుపతి సహా రాష్ట్రంలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. దీంతో ఇప్పటివరకు ఎస్పీ నేతృత్వంలోని జిల్లా పోలీసింగ్‌లో కీలకంగా ఉన్న తిరుపతి.. ఇక ప్రత్యేక కమిషనరేట్ పోలీసింగ్ వైపు అడుగులు వేయనుంది. వేగంగా విస్తరిస్తున్న నగరం, దేశవిదేశాల నుంచి నిత్యం తరలివచ్చే శ్రీవారి భక్తులు, పెరుగుతున్న ట్రాఫిక్, భారీ ఉత్సవాలు, వీఐపీ పర్యటనలు, సైబర్ నేరాలు, శ్రీ సిటీ వంటి పారిశ్రామిక ప్రాంతాల భద్రతను ఒకే సమన్వయ వ్యవస్థలోకి తీసుకురావడమే పోలీస్ కమిషనరేట్ ప్రధాన ఉద్దేశంగా అధికారులు వెల్లడిస్తున్నారు. నాలుగు జోన్లు.. ఒకే కమాండ్ తాజాగా వెలువడిన వివరాల ప్రకారం ప్రతిపాదిత తిరుపతి కమిషనరేట్‌ను నాలుగు జోన్లుగా రూపొందించనున్నారు. తిరుమల–తిరుపతి, శ్రీ సిటీ, శ్రీకాళహస్తి ప్రాంతాలను ఇందులో చేర్చనున్నారు. ప్రతి జోన్‌్ కు ప్రత్యేక పోలీస్ పర్యవేక్షణ ఉండేలా వ్యవస్థను రూపొందించే అవకాశముంది. అయితే జోనన్ల కచ్చిత సరిహద్దులు, ఒక్కో జోన్న్లోకి వచ్చే పోలీస్ స్టేషన్లు, డివిజన్ల సంఖ్యపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. అవసరం ఎందుకంటే..! తిరుపతి పరిస్థితులు సాధారణ నగరాల కంటే భిన్నం. శ్రీవారి దర్శనం కోసం రోజూ భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. బ్రహ్మోత్సవాలు, గరుడసేవ, రథోత్సవం, వైకుంఠ ఏకాదశి వంటి సందర్భాల్లో రద్దీ మరింత పెరుగుతుంది. రైల్వే స్టేషన్‌్ , ఆర్టీసీ బస్టాండ్, అలిపిరి, ప్రధాన మార్కెట్లు, తిరుమల మార్గాలతో పాటు రేణిగుంట ఎయిర్‌పోర్టు దిశలో వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయి. బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల, తిరుపతిలో భారీ పోలీస్ బందోబస్తు అవసరమవుతుంది. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల కోసం తిరుమల, తిరుపతిలో 6,071 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగించినట్లు అధికారులు వెల్లడించారు. శ్రీసిటీకి ప్రత్యేక భద్రత తిరుపతి కమిషనరేట్‌కు మరో ప్రత్యేకత శ్రీ సిటీ. తిరుమల–తిరుపతి ఆధ్యాత్మిక ప్రాధాన్యంతో పాటు శ్రీ సిటీ పారిశ్రామిక కార్యకలాపాలకు కీలక కేంద్రంగా ఉంది. పారిశ్రామిక సంస్థలు, ఉద్యోగుల రాకపోకలు, పెట్టుబడులు, రవాణా, పారిశ్రామిక భద్రత వంటి అంశాలు కూడా కొత్త కమిషనరేట్ పరిధిలో పోలీసింగ్‌కు ప్రత్యేక సవాలుగా మారనున్నాయి. అందువల్ల ఆధ్యాత్మిక నగరం– పారిశ్రామిక ప్రాంతం రెండింటినీ కలిపిన భిన్నమైన పోలీసింగ్ నమూనా తిరుపతిలో రూపుదిద్దుకోనుంది. పోస్టులపై ఉత్కంఠ కమిషనరేట్ ఏర్పాటుపై కేబినెట్ ఆమోదం లభించినా డీసీపీ పోస్టులు, ఏసీపీ పోస్టులు, ఇన్స్పెక్టర్, ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని మంజూరు చేస్తారన్నది ఇంకా స్పష్టంగా వెల్లడి కాలేదు. అలాగే ప్రస్తుత సిబ్బందిలో ఎంతమందిని పునర్విభజిస్తారు, కొత్తగా ఎన్ని పోస్టులు సృష్టిస్తారు అన్నదీ తేలాల్సి ఉంది. ఇవన్నీ ప్రభుత్వం జారీ చేసే తుది ఉత్తర్వులు, పోలీస్ శాఖ రూపొందించే కమిషనరేట్ నిర్మాణంలో స్పష్టమవుతాయి. ఏ ప్రాంతాలు.. ఏ విధంగా? తాజా కేబినెట్ నిర్ణయంపై వెలువడిన వివరాల ప్రకారం తిరుమల, తిరుపతి, శ్రీ సిటీ, శ్రీకాళహస్తి నాలుగు జోన్లుగా ప్రతిపాదించబడ్డాయి. అయితే ఒక్కో జోన్ కింద ఏయే పోలీస్ స్టేషన్లు వస్తాయి? సరిహద్దులు ఎక్కడివరకు ఉంటాయి? ఏ డివిజన్ ఏ జోనన్లో ఉంటుంది? అనే విషయాలు అధికారికంగా నోటిఫై కావాల్సి ఉంది. గతంలోనే ప్రతిపాదిత కమిషనరేట్ పరిధులు, మౌలిక వసతులు, అవసరమైన వనరులను అంచనా వేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లు నివేదికలు వచ్చాయి. ఇప్పటి వ్యవస్థకు కొనసాగింపా? కమిషనరేట్ ఏర్పాటుతో ప్రస్తుతం ఉన్న పోలీస్ వ్యవస్థ ఒక్కరోజులో పూర్తిగా మారిపోదు. తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయం, అర్బన్న్ పోలీస్ యూనిట్, కమాండ్ కంట్రోల్ సెంటర్, సైబర్ సెల్ తదితర మౌలిక వ్యవస్థలు ఇప్పటికే ఉన్నాయి. కొత్త కమిషనరేట్ నిర్మాణానికి అనుగుణంగా వాటిని పునర్వ్యవస్థీకరించడం, అవసరమైన కొత్త విభాగాలు ఏర్పాటు చేయడం తర్వాత దశలో చేపట్టనున్నారు.కొత్త మలుపు తిరుపతి అర్బన్ పోలీస్ డిస్ట్రిక్ట్ 2010లో ఏర్పడింది. తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి పోలీస్ సబ్ డివిజన్లను కలిపి ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2016 జనవరి నుంచి సిబ్బంది, వనరుల కేటాయింపుతో ఇది పూర్తిస్థాయిలో పనిచేసింది. 2022లో జిల్లా పునర్వ్యవస్థీకరణతో తిరుపతి ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది. ఇప్పుడు కమిషనరేట్ ఆమోదంతో పోలీసింగ్ వ్యవస్థ మరో కీలక దశలోకి వెళుతోంది. తిరుపతి పోలీస్ కమిషనరేట్ కేవలం అధికారుల హోదాలు మారడం మాత్రమే కాదు. తిరుమల భక్తుల రద్దీ, నగర ట్రాఫిక్, నేర నియంత్రణ, సైబర్ మోసాలు, పారిశ్రామిక భద్రత, భారీ ఉత్సవాలు, వీఐపీ పర్యటనలు వంటి విభిన్న అవసరాలను ఒకే పోలీస్ కమాండ్‌లో సమన్వయం చేయాల్సిన కొత్త బాధ్యత. కేబినెట్ ఆమోదంతో తొలి అడుగు పడింది. ఇక పరిధి.. పోస్టులు.. అధికారులు.. పోలీస్ స్టేషన్లు.. సిబ్బంది.. ప్రత్యేక విభాగాలు ఖరారైతే తిరుపతి కమిషనరేట్ పూర్తి రూపం తెలియనుంది. -
పవిత్రోత్సవాలకు అంకురార్పణ
చంద్రగిరి : తిరుచానూరు పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను జరిపించనున్నారు. అందులో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం, పవిత్ర అధివశం చేపట్టారు. గురువారం పవిత్రప్రతిష్ఠ, 25న పవిత్ర సమర్పణ, 26న పూర్ణాహుతి నిర్వహించనున్నారు. భక్తులు రూ.750 చెల్లించి ఒకరోజు ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చునని ఆలయ అధికారులు తెలిపారు. గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలను బహుమానంగా అందజేయనున్నట్లు వెల్లడించారు. ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్ర నాథ్ పాల్గొన్నారు. -
వైభవంగా పవిత్రోత్సవాలు
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయంలో రెండో రోజు బుధవారం పవిత్రోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో వేదపండితులు శ్రీ–కాళ–హస్తి, భరద్వాజ మహర్షికి విశేష అభిషేకాలు చేపట్టారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి ధూప, దీప నైవేద్యాలను సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వరాలయ అధికారులు పూజా ద్రవ్యాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, ఈఓ బీకే వెంకటేశులు పాల్గొన్నారు. ఉచిత నైపుణ్య శిక్షణకు దరఖాస్తులు తిరుపతి సిటీ : రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసులు బుధవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువతను గుర్తించి ఆయా ప్రాంతాల్లోని పరిశ్రమలకు కావలసిన నైపుణ్యాలకు అనుగుణంగా శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం స్కిల్ హబ్‌లో శిక్షణ తరగతులు చేపడుతున్నట్లు చెప్పారు. స్కిల్ హబ్‌లో జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సు 360 రోజుల కాలవ్యవధితో నిర్వహించనున్నట్లు వివరించారు. ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిక్షణ కోసం అభ్యర్థులు ఈనెల 30లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 8143576866 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఉద్యోగ నియామక డ్రైవ్ రద్దు తిరుపతి అర్బన్ : కలెక్టరేట్లో గురువారం నిర్వహించాల్సిన ఉద్యోగ నియామక డ్రైవ్‌ను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రెండు రోజుల క్రితం ఉద్యోగ నియామక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే తుపాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రస్థాయి అధికారుల సూచనల మేరకు రద్దు చేసినట్లు వివరించారు. తర్వాత ఎప్పుడు నిర్వహించే వివరాలను మీడియా ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు. -
● పవిత్రం.. పునీతం
శ్రీవారి పుష్కరిణికి పోటెత్తిన భక్తులు (ఇన్సెట్) చక్రస్నానం నిర్వహిస్తున్న వేద పండితులుతిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం ఉదయం శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.. విశేష సంఖ్యలో భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానమాచరించారు. ఈ క్రమంలోనే వేకువజామున శ్రీవారికి పల్లకీ ఉత్సవం జరిపించారు. భూవరాహస్వామివారి ఆలయ ముఖమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు, సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం చేపట్టారు.అభిషేకానంతరం పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి దివ్యప్రబంధ పాశురాలను పఠించారు. అనంతరం సుదర్శన చక్రత్తాళ్వార్లను శ్రీవారి పుష్కరిణికి తీసుకువచ్చి పవిత్ర జలాల్లో స్నానం చేయించారు. రాత్రి 7 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. అనంతరం ధ్వజావరోహణంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఏమి మా భాగ్యము.. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ భువి వైకుంఠంలో అడుగిడిన మా జీవితము ధన్యము.. చక్రత్తాళ్వార్‌ను స్పృశించిన పవిత్రజలములో స్నానమాచరించిన మాదే కదా పుణ్యము.. ఉభయ దేవేరీ సమేతంగా కొలువుదీరిన శ్రీమలయప్పస్వామివారి తిరుమంజన సేవ వీక్షణంతో తరించెను మా జన్మము.. అంటూ భక్తజనులు పరవశించారు. వైకుంఠనాథుని వైభవోత్సవంలో పాలుపంచుకుని పులకించారు. ఆనందనిలయంలో కొలువుదీరిన శ్రీవేంకటేశ్వరుని దివ్యతేజోవిరాజిత మూర్తిని దర్శించుకుని పునీతులయ్యారు. -
శాస్త్రోక్తం.. చక్రస్నానం
తిరుపతి రూరల్ : తుమ్మలగుంట శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు బుధవారంతో విజయవంతంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజు ఉదయం పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం, మహా పూర్ణాహుతి చేపట్టారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి, సుదర్శన చక్రత్తాళ్వార్లకు వేడుకగా స్నపన తిరుమంజనం జరిపించారు. అనంతరం పుష్కరణి సంప్రోక్షణ, హారతి సమర్పించారు. సుదర్శన చక్రాన్ని పుష్కరిణిలోకి తీసుకువెళ్లి పవిత్ర స్నానం చేయించారు. అనంతరం భక్తులు గోవింద నామస్మరణతో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, లక్ష్మి దంపతులు, మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డి, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. లోక సంక్షేమం కోసం.. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి వెన్నంటి ఉండి వాహన సేవలు, వైదిక క్రతువుల్లో పాల్గొన్న చక్రతాళ్వార్‌కు చక్రస్నానం నిర్వహించడం ఆనవాయితీ. లోక సంక్షేమం, భక్తుల సుఖశాంతులను కాంక్షిస్తూ ఈ పవిత్ర క్రతువును నిర్వహిస్తారు. అనంతరం తిరుచ్చి వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి, చక్రతాళ్వార్ విహరించారు. యాగశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించి, కుంభజలంతో గర్భాలయంలో సంప్రోక్షణ చేపట్టారు. సాయంత్రం 7 నుంచి 9గంటల మధ్య ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు సంపూర్ణమయ్యాయి. అందరి సహకారంతోనే.. తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గ్రామస్తులు, భక్తులు, ప్రజలు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు, ఆలయ సిబ్బంది అందరి సహకారంతో విజయవంతంగా ముగిశాయని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
ముగిసిన విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయాగం
నారాయణవనం: విశ్వగురు సంకల్పం సిద్ధించాలని, దైవబలం చేకూరాలని స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న ‘భారత విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయాగం‘ పూర్ణాహుతితో బుధవారం ముగిసింది. ఉదయం ఆగమ వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సర్వ దేవత మూల మంత్ర హోమం, మహా శాంతి యాగం నిర్వహించారు. కళాశాల చైర్మన్ అశోక్‌రాజు దంపతులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, నేత రమేష్ నాయుడు తదితరులు పాల్గొని హోమ గుండంలో పూర్ణాహుతి సమర్పించారు. యాగ నిర్వాహకులు అశోక్ రాజు దంపతులు మాట్లాడుతూ దేశ ప్రయోజనాల కోసం శ్రమిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి సర్వశక్తులనూ ప్రసాదించాలని, భారత దేశం విశ్వగురుగా నిలవాలనే సంకల్పం నెరవేరాలని ఈ యాగం తలపెట్టినట్లు వివరించారు. తొమ్మిది రోజుల పాటు వేద పండితుల మంత్రోచ్ఛారణలతో సుదర్శన, ధన్వంతరి, మహాలక్ష్మి, ఆయుష్యు, అకల్మష, శాంతి, సంకల్పసిద్ది హోమాలను, వెంకటేశ్వరస్వామి, సీతా రాముల కల్యాణం, సుందరకాండ పారాయణంతో పాటు ప్రముఖుల ధార్మిక ప్రవచనాలతో ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మికమయమైదని వెల్లడించారు. -
జిల్లాలో రూ.206 కోట్ల అభివృద్ధి పనులు
తిరుపతి రూరల్: పట్టణాల రూపురేఖలు మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా తిరుపతి జిల్లాకు రూ.206 కోట్ల విలువైన పనులు మంజూరయ్యాయని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం కుప్పం నుంచి వర్చువల్‌గా హెచ్ఏఎం కార్యక్రమాన్ని ప్రారంభించారు. తిరుపతి మహిళా యూనివర్సిటీలోని ఆడిటోరియంలో జరిగిన ఆ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో ఒక్క తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోనే రూ.106 కోట్ల విలువైన పనులు ఉన్నాయన్నారు. పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) విధానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ జయకృష్ణ, తుడా చైర్మన్న్ డాలర్స్ దివాకర్‌రెడ్డి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎస్వీబీసీ చైర్మనన్ శ్రీధర్‌వర్మ, బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ ఆర్.సి.మునిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఇంజినీరింగ్ తుస్!
జిల్లాలో ఇంజినీరింగ్ విద్య తుస్ మంటోంది. ఒకప్పుడు ఇంజినీరింగ్ సీట్లకు ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. ఇప్పుడు కళాశాలలు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకు రావడం.. దానికి తగట్టుగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యకు ముఖం చాటేస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలో ఈఏపీసెట్ మూడు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసినా కన్వీనర్ సీట్లు కూడా పూర్తి స్థాయిలో భర్తీ కాలేదు. ఇక స్పాట్ అడ్మిషన్లపైనే ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలల భవితవ్యం ఆధారపడి ఉన్నందని నిపుణులు విశ్లేషించుకుంటున్నారు. తిరుపతి సిటీ: జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇంజినీరింగ్ కళాశాలలు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకురావడం, కోర్సు పూర్తి చేసినా ఉపాధి దొరకకపోవడంతో సాధారణ డిగ్రీ కోర్సుల కంటే ఇంజినీరింగ్ కోర్సుల పరిస్థితి గందరగోళంగా మారింది. 2026–27 విద్యాసంవత్సరంలో కన్వీనర్ కోటా కింద జిల్లాలో 70శాతం సీట్లు భర్తీ కావాల్సి ఉండగా కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసేనాటికి 55 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయినట్లు తెలుసుస్తోంది. ఇక యాజమాన్య కోటా సీట్ల భర్తీ చెప్పాల్సిన పనిలేదు. మూడు విడతలు కౌన్సెలింగ్ చేపట్టినా... 2026–27 విద్యాసంవత్సరంలో ఏపీఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ మూడు విడతలుగా కొనసాగింది. గతంలో రెండు విడతలకే కన్వీనర్ కోటా సీట్లు కేటాయింపు ముగిసేది. కానీ ఈ ఏడాది అడ్మిషన్లు అంతంతమాత్రంగా ఉండడంతో సాంకేతిక విద్యాశాఖ మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ సైతం చేపట్టింది. కానీ ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు జరగలేదు. ప్రధానంగా జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో సైతం పలు బీటెక్ కోర్సుల్లో కన్వీనర్ కోటా కింద సీట్లు మిగిలిపోవడం ఆశ్చర్యకరం. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 24 వేలకు పైగా సీట్లు ఉండగా ఇందులో కన్వీనర్ కోటా సీట్లు 15 వేల వరకు ఉన్నట్లు సమాచారం. కాగా ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూరైనా ఇప్పటీకి కన్వీనర్ కోటా కింద జిల్లాలో సుమారు 2 వేల సీట్లు మిగిలిపోవడం గమనార్హం. ‘ప్రైవేటు’ దయనీయం గతంలో డీమ్డ్, ప్రభుత్వ, అటానమస్ కళాశాలల్లో 90 శాతం వరకు సీట్లు భర్తీకాగా ఈ ఏడాది కనీసం 79 శాతానికి మించలేదు. అలాగే ప్రైవేటు కళాశాలల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పేరొందిన కళాశాలల్లో 60శాతం సీట్లు మాత్రమే భర్తీకాగా మిగిలిని కళాశాలల్లో అడ్మిషన్లు 50 శాతానికి పడిపోయాయి. ప్రస్తుతం భర్తీ అయిన సీట్లు కేవలం సీఎస్ఈ బ్రాంచ్‌కు సంబంధించి ఏఐ, ఎమ్ఎల్, సైబర్ సెక్యూరిటీ, సీఎస్ఈ కోర్ తోపాటు ఈసీఈ, ఈఈఈ బ్రాంచ్‌లలో మాత్రం 95 శాతం సీట్లు భర్తీ కాగా మిగిలిన బ్రాంచ్‌లలో 40 శాతం సైతం సీట్లు భర్తీ కాకపోవడం విశేషం. ఉపాధి లేకపోవడమే కారణమా? ఆశలన్నీ ‘స్పాట్’పైనే ఈఏపీసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టినప్పటికీ తిరుపతి జిల్లా నుంచి 438 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆదివారం విడుదలైన మెరిట్ లిస్ట్ ప్రకారం 295 మందికి మాత్రమే సీట్లు లభించినట్లు సమాచారం. కన్వీనర్ కోటా సీట్లు సైతం పూర్తి స్థాయిలో భర్తీకాని నేపథ్యంలో వచ్చేవారం నుంచి స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియకు అనుమతులు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్పాట్ అడ్మిషన్లలోనైనా 80శాతం సీట్లు భర్తీ అవుతాయా..? అనే మీమాంసలో ప్రైవేటు యాజమాన్యాలు తలలుపట్టుకుంటున్నాయి. జిల్లాలో ప్రతి ఏటా వేలాది మంది బీటెక్ కోర్సులు పూర్తి చేసుకుని ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. కానీ వందల సంఖ్యలో మాత్రమే విద్యార్థులకు పలు పరిశ్రమలు ఉపాధి కల్పిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం కోర్సు పూర్తి చేసిన విద్యార్థుల్లో పరిశ్రమ అవసరాలకు తగ్గట్టు నైపుణ్యం లేకపోవడమే. అలాగే వేలాది మంది కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు తగ్గట్టు పారిశ్రామిక రంగం ఆ స్థాయిలో అభివృద్ధి కాకపోవడం రెండవ కారణంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆధునిక పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనే సాంకేతిక పరిజ్ఞానం, స్కిల్స్ ఆశించిన స్థాయిలో ప్రస్తుత ఇంజినీరింగ్ కళాశాలల్లో కొరవడిందని, నిపుణులైన అధ్యాపకులు సైతం పలు కళాశాలల్లో లేకపోవడం మరో కారణమని మేధావులు అభిప్రాయపడుతున్నారు. -
‘విశ్రాంతి’లో అశాంతి
తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీటీడీ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘ సభ్యుల్లో అసంతృప్తి సెగలు భగ్గుమన్నాయి. ఇంతకాలంగా అంతర్గతంగా నెలకొన్ని విభేదాలు బహిర్గతం కావడంతో సంఘ అధ్యక్షుడు ఆర్.ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మునిరెడ్డి తమ పదవులకు రాజీనామా చేశారని తెలుస్తోంది. విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన ఇంటి స్థలాల కేటాయింపులో చోటు చేసుకున్న పరిణామాలు రాజీనామాల పర్వానికి తెర తీసిందనే ప్రచారం వినిపిస్తోంది. మరోవైపు సంఘంలో కీలకంగా ఉన్న కోశాధికారి దాస్ కూడా అదే బాటలో తన పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే టీటీడీ విశ్రాంత ఉద్యోగుల సంఘం పూర్తిగా రద్దయినట్టేనని చర్చనడుస్తోంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే టీటీడీలో విశ్రాంత ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న సంక్షేమ సంఘంలో 8,500 మందికి పైగా సభ్యత్వం కలిగి ఉన్నారు. వీరు పదవీ విరమణకు ముందే సర్వీసులో ఉన్నపుడు చాలావరకు సీనియారిటీ కలిగిన వారున్నారు. అయితే రెండున్నరేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం మార్కెట్ ధరకు ఇంటి స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకుంది. ఏర్పేడు మండలం, పల్లం గ్రామ పరిధిలో ఒక్కొక్కరికీ 50 అంకణాల చొప్పున 3,500 మంది విశ్రాంత ఉద్యోగులకు స్థలం కేటాయిస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అయితే అప్పటికే సర్వీసులో ఉన్న ఉద్యోగుల్లో చాలామంది సీనియర్లు ఉన్నా అలాంటి వారికి స్థలాల కేటాయింపు ప్రక్రియలో నిరాశ ఎదురైంది. అయితే స్థల విస్తీర్ణం, ప్లాట్లు వంటివి కేటాయించాలనే సమయంలో సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అది కాస్తా పెండింగ్‌లో ఉండిపోయింది. ఇప్పటికీ ఇది పరిష్కారం కాలేదు సర్వీసు ఉద్యోగులకు ఊరట కాగా అదే సమయంలోఅప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం సర్వీసులో కొనసాగుతున్న ఉద్యోగులకు వడమాలపేట మండలం పాదిరేడు, పల్లం గ్రామ పరిధిలో 432.27 ఎకరాల విస్తీర్ణంలో ఇంటి స్థలాలను కేటాయించి ప్లాట్ల రిజిష్టేషన్ కూడా చేయించింది. ఆ తర్వాత ప్రబుత్వం మారడంతో టీటీడీ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ పలుమార్లు ప్రభుత్వం, టీటీడీ యాజమాన్యం దృష్టికి సమస్యను తీసుకెళ్లి ఎట్టకేలకు ఇంటి స్థలాల అభివృద్ధి పనులకు ఇటీవల నిధుల మంజూరుకు అనుమతి పొందింది. అసలు సమస్య ఇక్కడే సర్వీసులో ఉన్నపుడు తమకు సీనియారిటీ ప్రాతిపదికన ఇంటి స్ధలాల కేటాయింపులో నిబంధనలు పాటించలేదనే అంశాలపై క్రింది స్థాయిలో పదవీ విరమణ పొంది ప్రస్తుతం విశ్రాంత ఉద్యోగుల సంఘంలో ఉన్న వారు అసంతృప్తితో రగిలిపోతున్నారనే విషయం బాహటంగా వినిపిస్తోంది. అయితే ఎంతో పటిష్టంగా ఉన్నటువంటి విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘంలో ఇంకా నాలుగు వేల మందికి పైగా ఇంటి స్థలాలు పొందలేని వారున్నారు. ఇంత కాలం అంతర్గతంగా రగిలిపోతున్న వారిలో వ్యతిరేక స్వరం బహిర్గతం కావడంతో సంఘ పెద్దలకు సమస్యగా మారింది. సర్వీసులోని ఉద్యోగులు పొందిన ఇంటి స్థలాల అభివృద్ధి పనులకు ఆయా సంఘాల నాయకుల కృషిని గుర్తుచేస్తూ విశ్రాంత సంఘంలో ఆ విధమైన కృషి సంఘ పెద్దలు ఎందుకు చేయలేదంటూ ఘాటుగా ప్రశ్నించడం వంటి పరిణామాలు కలకలం రేపడంతో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజీనామా చేయాల్సి వచ్చినట్టు సమాచారం. టీటీడీ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతి ఏటా రెన్యూవల్ చేయించాలనే విషయాన్ని పక్కదారి పట్టింది. నాలుగేళ్లు అవుతున్నా రెన్యూవల్ చేయించాలనే దిశగా ఆలోచన చేయకపోవడం ఏమిటని పలువురు సంఘ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. సంఘ బైలా ప్రకారం కార్యవర్గ కమిటీలో 15 మంది మాత్రమే ఉండాలి. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య 33కు చేరుకోవడంతో రెన్యూవల్ చేయించడంతో నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. దీంతో నాలుగేళ్లుగా పేరుకే సంఘం ఉన్నట్లుగా గొప్పగా ప్రచారం చేసుకున్నట్టు టీటీడీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. -
ఎంఎంబీజీకి ఎక్స్‌లెన్సీ అవార్డు
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతిలోని మేక్ మై బేబీ జీనియస్ పాఠశాలకు జాతీయ స్థాయి ప్రతిష్టాతమ్మకమైన ఎక్స్‌లెన్స్ ఇన్ అకడమిక్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు లభించింది. విద్యారంగంలో వినూత్న బోధనా విధానాలు, ఆధునిక విద్యాప్రమాణాలు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి చేస్తున్న కృషికి ఈ అవార్డు లభించినట్టు ఆ పాఠశాల చైర్మన్ సంగరాజు భాస్కరరాజు, డైరెక్టర్ సంగరాజు అశ్వినీ తెలిపారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం, నైనిటాల్లో ఆదివారం నిర్వహించిన ఎన్ఐఎస్ఏ జాతీయ సమ్మిట్–2.0లో ఈ అవార్డును మేజర్ జనరల్ వీఎన్.చతుర్వేది, ఎన్ఐఎస్ఏ అధ్యక్షుడు డాక్టర్ కులభూషణ్‌శర్మ చేతుల మీదుగా అందుకున్నట్లు వారు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ‘ఎడిఫై’కి ప్రతిష్టాత్మక గుర్తింపు తిరుపతి గాంధీ రోడ్డు: తిరుపతి విద్యారంగంలో ఎడిఫై పాఠశాల మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపు సాధించింది. దేశ వ్యాప్తంగా పాఠశాలల విద్యా ప్రమాణాలను అంచనా వేసి అందించే ప్రతిష్టాత్మక సీ–ఫోర్ పాఠశాలల అత్యుత్తమత పురస్కారాలు–2026లో భారతీయ పాఠ్య ప్రణాళికను అనుసరిస్తున్న ఉత్తమ సహవిద్యా పాఠశాలల విభాగంలో ఎడిఫై పాఠశాల జాతీయ స్థాయిలో 10వ స్థానాన్ని, తిరుపతి నగర స్థాయిలో ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుంది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ఎడిఫై పాఠశాల అధినేత ప్రణీత్ న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో స్వీకరించారు. జాతీయ స్థాయిలో ఎడిఫై పాఠశాల గుర్తింపు పొందడం తిరుపతి విద్యారంగానికి గర్వకారణమని పలువురు అభినందనలు తెలిపారు. -
వైభవం.. కల్యాణ వెంకన్న రథోత్సవం
తిరుపతి రూరల్: తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రథోత్సవం వైభవంగా సాగింది. ఎనిమిదో రోజు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు బ్రహ్మరథంపై కొలువుదీరి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి రథాన్ని భక్తులు గోవింద నామస్మరణలతో లాగుతూ మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం 7 గంటలకు ఆలయం నుంచి బయలుదేరిన మహా రథం గ్రామంలోని ప్రధాన వీధుల మీదుగా సాగి 11.30 గంటలకు ఆలయానికి చేరుకుంది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. రథంపైకి ఉప్పు, మిరియాలు చల్లుతూ గోవింద, గోవిందా అంటూ ముందుకు కదిలారు. రథోత్సవానికి ముందు కళాబృందాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కల్కీ కటాక్షం ఉత్సవాల్లో ఎనిమిదవ రోజు మంగళవారం రాత్రి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు అశ్వ వాహనంపై కల్కీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కలియుగంలో దుష్టశిక్షణ.. శిష్ట రక్షణ కోసం కల్కీ అవతారంలో అశ్వ వాహనంపై స్వామివారు విహరిస్తూ కనువిందు చేశారు. రథోత్సవంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మి దంపతులు, కుమారులు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారునేడు తుమ్మలగుంటలో చక్రస్నానం తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 9వ రోజైన బుధవారం ఉదయం 7 నుంచి 9గంటల మధ్యన చక్రస్నానం నిర్వహించనున్నారు. ఆలయ వ్యవస్థాపకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందుకు తగిన ఏర్పాట్లు అన్నీ పూర్తిచేశారు. -
ఆక్రమణలో కుమారస్వామి తిప్ప!
శ్రీకాళహస్తి: పట్టణ నడిబొడ్డున ఉన్న కుమారస్వామి తిప్పపై అక్రమ నిర్మాణాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిర్మాణం కోసం కొండను బ్రేకర్ యంత్రంతో తొలిచే పనులు చేపట్టగా ఆలయ సిబ్బంది ఆదివారం అడ్డుకున్నట్టు తెలుస్తోంది. అయితే దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఆలస్యంగా వెలుగు చూశాయి. ఎవరో కుమారస్వామి కొండను బ్రేకర్లతో తొలుస్తుంటే ఆలయ సిబ్బంది అడ్డుకున్నట్లు తెలిసింది. అయితే ఈ ఘటన బయటకు రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ బ్రేకర్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తుఫాన్ సెంటర్లోనూ నిర్మాణాలు? ఇదిలా ఉండగా తుఫాన్ సెంటర్ ప్రాంతంలో ఆలయానికి సంబంధించిన భూముల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. విషయం గుర్తించిన ఆలయ సిబ్బంది అక్కడ కూడా పనులను అడ్డుకున్నట్లు సమాచారం. ఊరికి దూరంగా రాజీవ్ నగర్ ప్రాంతంలో అక్రమణాలు జరిగాయి అంటూ 250 పైగా పునాదులు, ఇళ్లు కూల్చారు. మరి ఇది కనబడడం లేదా..? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
వైభవంగా విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయాగం
నారాయణవనం: స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో జరుగుతున్న నవాహ్నిక భారత విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయాగంలో మంగళవారం ఉదయం ఆకల్మష హోమం, సాయంత్రం చతుర్వేదాల నడుమ వైభవంగా మహా పుష్పయాగం నిర్వహించారు. అంతకుముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఆధ్యాత్మిక, ఆధునిక పోకడలపై ఉపన్యసించారు. ఉదయం 8 గంటలకు హోమశాలలో 108 హోమ గుండాలలో రిత్వికులు ఆకల్మష యాగాన్ని నిర్వహించారు. పూర్ణాహుతి క్రతువులో టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు. సాయంత్రం నిర్వహించిన ప్రవచన కార్యక్రమంలో ముఖ్యవ్యక్తగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ హాజరై ప్రసంగించారు. ప్రధాని నరేంద్రమోదీ ఆయురారోగ్యాలు, 2047 వరకు ఆయన నాయకత్వంలో దేశాభివృద్ధి, వర్షాలు సమృద్ధిగా కురిసి దేశం సస్యశ్యామలంగా ఉండాలని కోరుతూ కళాశాల చైర్మన్ అశోక్‌రాజు దంపతులు ఈ నవాహ్నిక దీక్షలు చేపట్టారని తెలిపారు. మత సామరస్యాన్ని చాటుతూ ముస్లిం సోదరులు మహాయాగంలో పాల్గొన్నారు. మనుష్యుల్లో కల్మషాలు తొలగి ఐక్యత పెరగడానికి ఆకల్మష హోమం, యాగ నిర్వహణలోని లోటుపాట్ల నివృత్తికి, ఉపశమనానికి మహా పుష్పయాగం నిర్వహించినట్లు అశోక్ రాజు తెలిపారు. నవాహ్నిక యాగాలలో చివరి రోజైన బుధవారం ఉదయం మహా పూర్ణాహుతి, సాంస్కృతిక కార్యక్రమాలలో భక్తులందరూ పాల్గొనాలని అశోక్‌రాజు కోరారు. -
రోడ్డునే మింగేస్తున్నారు!
భాకరాపేట: గత ప్రభుత్వ హయాంలో కొత్తపల్లి నుంచి మద్దిరెడ్డిగారిపల్లి వరకు కమళ్ల సచివాలయం మీదుగా సుమారు రూ.1.1 కోట్లతో తారు రోడ్డు నిర్మించారు. అయితే అదే పంచాయతీకి చెందిన ఓ వ్యక్తి తన భూమిని విస్తరించుకునేందుకు రహదారి కింద భాగంలోని మట్టిని తవ్వి పొలంలోకి తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రోడ్డుపై ఉన్న తారు పొరను అలాగే ఉంచి కింద మట్టిని తొలగించడంతో రహదారి అంచులు బలహీనంగా మారాయి. వాహనాలు వెళ్లే సమయంలో రోడ్డు కుంగిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రహదారి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాల చుట్టూ మట్టిని తవ్వేయడంతో వాటి పునాదులు బలహీనపడి ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి. 45 ఎకరాలపై ఆరోపణలు ఎస్టీ కాలనీ భూముల విషయంలోనూ సదరు వ్యక్తిపై గ్రామస్తులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కాలనీ వాసులను ఖాళీ చేయించి, వారు నివసించిన భూములను తమ ఆధీనంలోకి తీసుకుని వ్యవసాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వివిధ ప్రభుత్వాల హయాంలో రాజకీయ అండదండలు పొందుతూ సుమారు 45 ఎకరాల మేర డీకేటీ పట్టాలను సృష్టించి భూములను తన ఆధీనంలోకి తీసుకున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ భూ వ్యవహారంపై హైకోర్టు లోకాయుక్తలో కేసులు నడుస్తున్నాయని వారు పేర్కొంటున్నారు. ప్రజాధనం వృథా కాకుండా చూడాలి ప్రజాధనంతో నిర్మించిన రహదారిని వ్యక్తిగత భూమి కోసం ధ్వంసం చేస్తున్నారనే ఆరోపణలపై అధికారులు వెంటనే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. రహదారిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి, జరిగిన నష్టాన్ని అంచనా వేయడంతో పాటు విద్యుత్ స్తంభాలకు ఏర్పడిన ముప్పును తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజాధనం వృథా కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల రాకపోకల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన రహదారికే ఆక్రమణల బెడద మొదలైంది. రోడ్డును యంత్రాలతో తవ్వి.. కింద మట్టిని తొలగించి పక్కనే ఉన్న పొలంలోకి కలిపేస్తున్నారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎర్రవారిపాళెం మండలం, కమళ్ల పంచాయతీ పరిధిలోని మద్దిరెడ్డిగారిపల్లి ఎస్టీ కాలనీ వద్ద ఈ వ్యవహారం వెలుగుచూసింది. -
కోల్ ఇండియాతో ఒప్పందం
తిరుపతి అర్బన్: తిరుపతి జిల్లాలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మినరల్ బ్లాక్‌కు సంబంధించి జిల్లా గనుల, భూగర్భ శాఖ.. కోల్ ఇండియా లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరక కలెక్టరేట్లో మంగళవారం కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సమక్షంలో ఇరువురు ఒప్పందపు పత్రాలను అందుకున్నారు. మూడేళ్ల ఒప్పందంలో భాగంగా కోల్ ఇండియా కంపెనీ తిరుపతి జిల్లాలోని చంద్రగిరి, రామచంద్రాపురం, పాకాల మండలాలు, అలాగే చిత్తూరు జిల్లాలోని పెనుమూరు, వేదురుకుప్పం మండలాల పరిధిలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ఖనిజాల ఉనికి, నాణ్యత, పరిమాణం, భౌగోళిక వివరాలను శాసీ్త్రయ పద్ధతుల్లో పరిశీలించనున్నారు -
అక్రమ కేసులకు భయపడం
తిరుపతి లీగల్: కూటమి ప్రభుత్వంలో నాయకులు చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తే వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం, ఎదురుదాడి చేయడం తప్ప ప్రజలకు ఎటువంటి సేవలు అందడం లేదని తిరుపతి వైఎస్సార్సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులు పసుపులేటి సురేష్, వాసు యాదవ్‌తో పాటు మరికొంతమంది తిరుపతి టీడీపీ ఇన్చార్జ్ శ్రీనివాస్ ఇంటి వద్ద దాడికి పాల్పడ్డారన్న అభియోగం కింద కేసు నమోదు చేయడం తెలిసిందే. ఆ కేసులో ఆరుగురు వైఎస్సార్సీపీ నాయకులు, ఓ మీడియా ప్రతినిధి తిరుపతి సబ్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. మంగళవారం భూమన అభినయ్ స్థానిక సబ్ జైల్లో వైఎస్సార్సీపీ నాయకులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమ నియామకాల పట్ల సీబీఐ దర్యాప్తు చేయాలని జగనన్నతోపాటు డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేస్తుంటే కూటమి నాయకులు వారిపై ఎదురుదాడి చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ దాడులను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో తిరుపతి జిల్లా వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఐ.చంద్రశేఖర్‌రెడ్డి, నరహరరెడ్డి, దొరబాబు, కొత్తపల్లి విజయకుమార్, రాజశేఖర్, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
‘జాతర’ సమన్వయ సమావేశం నేడు
వెంకటగిరి రూరల్: వెంకటగిరి పోలేరమ్మతల్లి జాతర ఈ నెల 30, అక్టోబర్ 01వ తేదీ జరగనున్న నేపథ్యంలో కలెక్టర్ వెంకటేశ్వర్ అధ్యక్షతన పలు శాఖల అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు ఆల య ఈఓ వెంకట శ్రీనివాసులురెడ్డి, పాలకవర్గం అఽధ్యక్షుడు మురళి తెలిపారు. సోమవారం శ్రీకాళహస్తి ఆర్డీవో అధ్యక్షతన నిర్వహించిన సమావేశం పలు విమర్శలకు తావిచ్చంది. ‘సొంత కార్యక్రమంలా జాతర సమీక్ష సమావేశం’ శిర్షీకతో సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన కలెక్టర్ పట్టణంలోని పింజల వీరయ్య కల్యాణ మండపంలో బుధవారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. -
కడుపు నొప్పితో మహిళ ఆత్మహత్య
నాగలాపురం: కడుపు నొప్పి తాళలేక విషం తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని అయ్యప్పనాయుడుకండ్రిగలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. ఇదే గ్రామానికి చెందిన మణినాయుడు భార్య రత్నమ్మ (51) గత కొంత కాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఆదివారం ఉదయం నొప్పి తీవ్రం కావడంతో ఇంట్లోనే విషం తాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను నాగలాపురం ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం తమిళనాడులోని చైన్నె ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం రత్నమ్మ మృతి చెందారు. కేసు దర్యాప్తులో ఉంది. స్థిరత్వ విశ్లేషణపై వర్క్‌షాప్ ఏర్పేడు: ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో మంగళవారం తిరుపతి ఐఐటీ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ ట్రాన్స్ కో) ఉద్యోగుల కోసం ‘అధిక పునరుత్పాదక ఇంధన వినియోగంతో స్థిరత్వ విశ్లేషణ’ అంశంపై మూడు రోజుల వర్క్‌షాప్ ప్రారంభమైంది. ప్రారంభోపన్యాస కార్యక్రమానికి తిరుపతి ఐఐటీ కాంపిటెన్సీ డెవలప్మెంట్ – అవుట్‌రీచ్ డీన్ ప్రొఫెసర్ అరుణ్‌కుమార్ తంగిరాల, ఐఐటీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ కె.పి.నవీన్, ఏపీ ట్రాన్స్‌కో ఎస్ఈ ఎన్.శామ్యూల్ రాజు, ఐఐటీ ప్రోగ్రామ్ లీడ్ డాక్టర్ విఘ్నేష్ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు, వివిధ విభాగాలకు చెందిన సుమారు 30 మంది ట్రాన్స్‌కో ఉద్యోగులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పెరగడం వల్ల తలెత్తే విద్యుత్ వ్యవస్థ స్థిరత్వ సమస్యలపై అవగాహనతో పాటు ఆచరణాత్మక, ప్రత్యక్ష అనుభవాన్ని అందించేలా కార్యక్రమం జరిగింది. యువజన ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ తిరుపతి అర్బన్: జిల్లాలోని యువతలో సృజనాత్మకత, ప్రతిభ, సాంస్కృతిక నైపుణ్యాలను వెలికితీసే లక్ష్యంతో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా స్థాయి యువజన ఉత్సవాల పోస్టర్‌ను సెట్విన్ సీఈ యశ్వంత్‌కుమార్‌తో కలసి ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు ఈ నెల 23న శ్రీ వేంకటేశ్వర పశు వైద్య కళాశాల ఆడిటోరియంలో ప్రారంభమవుతాయని, జిల్లాలోని 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతీ యువకులు పాల్గొనవచ్చని తెలిపారు. -
రేపటి నుంచి లాసెట్ కౌన్సెలింగ్
తిరుపతి సిటీ: ఎట్టకేలకు లాసెట్–2026 కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం తేదీలను విడుదల చేసింది. గత మూడు నెలలుగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు కాస్త ఊరట లభించింది. ఈనెల 24 నుంచి 29వ తేదీ వరకు ఏపీ లాసెట్‌కు సంబంధించి యూజీ, పీజీ కోర్సుల ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. 29 నుంచి బీఈడీ ప్రవేశాలకు.. ఏపీ ఎడ్‌సెట్–2026కు సంబంధించి ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియను ఈనెల 29వ తేదీ నుంచి చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా 29 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుందని, 5 నుంచి 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుందని, వచ్చే నెల 12న తొలి విడతలో సీట్లు సాధించిన విద్యార్థుల మెరిట్ లిస్ట్ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు తిరుపతి మంగళం : డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్‌ను సెప్టెంబర్ 25లోపు అప్డేట్ చేయకపోతే లైసెన్‌న్స్ రద్దవుతుందని, చెల్లుబాటు కోల్పోతుందని సోషల్ మీడి యా, వాట్సాప్‌లలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తిరుపతి జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ తెలిపారు. తిరుపతి జిల్లా రవాణా శాఖ కార్యాయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఈ ప్రచా రాన్ని నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే రవాణా శాఖ సేవలు, చలానాలు, రెన్యూవల్ తదితర సమాచారాన్ని సకాలంలో పొందేందుకు డ్రైవింగ్ లైసెన్స్‌కు ప్రస్తుత మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకోవడం ప్రయోజనకరమని తెలిపారు. ముగిసిన శిక్షణ తిరుపతి తుడా: స్విమ్స్ మైక్రోబయాలజీ, క్లినికల్ వైరాలజీ సంయుక్త ఆధ్వర్యంలో జూనోటిక్ వ్యాధుల సెరోలాజికల్ నిర్ధారణపై ప్రయోగశాల సాంకేతిక వైద్య సిబ్బందికి రెండు రోజులు పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం మంగళవారం ముగిసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 24 మంది అతిథులు, నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒన్ హెల్త్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అంజువర్మ మాట్లాడుతూ ప్రయోగశాల సాంకేతిక సిబ్బందికి జూనోటిక్ వ్యాధుల సెరోలాజికల్ నిర్ధారణ, నమూనాల సేకరణ, నమూనాల రవాణా, నిర్వహణ, వివిధ ప్రయోగశాలల పరీక్షా విధానాలపై శిక్షణ అందించినట్లు తెలిపారు. అనంతరం శిక్షణలో పాల్గొన్న సిబ్బందికి ధృవపత్రాలను అందజేశారు. వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం తిరుపతి ఎడ్యుకేషన్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షలో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని డీఈఓ కేవీఎన్.కుమార్ పిలుపునిచ్చారు. డీఈఓ కార్యాలయంలో మంగళవారం ఆన్లైన్ ద్వారా జిల్లాలోని 320 ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాలు, పదో తరగతి బోధించే 2,500 మంది ఉపాధ్యాయులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ పరీక్షల ముందు హడావుడి కాకుండా ఇప్పటి నుంచే విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధం చేయాలని తెలిపారు. ప్రతి విద్యార్థి సామర్థ్యాన్ని పరిశీలించి, ఎక్కడ వెనుకబడ్డారో గుర్తించాలన్నారు. అలాంటి వారికి ప్రత్యేక బోధన అందించాలని సూచించారు. -
పవిత్రోత్సవాలు ప్రారంభం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. నిత్యపూజల్లో జరిగే దోషాలను నివారించి మూలవిరాట్లకు పునరుత్తేజం తెచ్చే విధంగా ఈ పూజలు చేశారు. ఐదు రోజుల పాటు ఈ పూజలు జరగనున్నాయి. తొలి రోజు ఆలయ ప్రధాన అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో గురుదక్షిణా మూర్తి సన్నిధి వద్ద శ్రీ–కాళ–హస్తి, భరద్వాజ మ హర్షి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశేష అభిషేక పూజలు చేపట్టారు. ఉత్సవర్లకు వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పూర్ణహారతులు సమర్పించా రు. తర్వాత శ్రీ– కాళ– హస్తి, భరద్వాజ ఉత్సవమూర్తులను పురవీధు ల్లో ఊరేగించారు. భక్తు లు పెద్ద సంఖ్యలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పాలకమండలి సభ్యులు, ప్రధాన అర్చకులు స్వామినాథన్ గురుకుల్ పాల్గొన్నారు. -
సిద్ధార్థలో వైభవంగా సీతారాముల కల్యాణం
నారాయణవనం: స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న నవాహ్నిక‘మహా సంకల్పసిద్ధి మహాయాగం’లో భాగంగా సోమవారం సీతారాముల కల్యాణం కన్నుల పండువగా సాగింది. ఉదయం సుందరకాండ సంపూర్ణ పారాయణం, సంపూర్ణ పారాయణ యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక క్రతువులో రాష్ట్ర వైద్య విద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషితరాజు దంపతులు, మాజీ శాసన సభ్యులు జీవీ శ్రీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ మట్లాడుతూ భారత ప్రధాని నరేంద్రమోదీ శ్రేయస్సును కోరుతూ, లోక కళ్యాణార్థం ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్న అశోక్ రాజును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సాయంత్రం వేళ సీతారామ పట్టాభిషేకం, శ్రీరాముల వరి పల్లకీ ఉత్సవం నిర్వహించగా, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి మంత్రోచ్ఛారణల మధ్య శ్రీరామ మూల మంత్ర యజ్ఞం సాగింది. -
చెరువులు చెర‘బట్టీ’
అధికార అండతో కూటమి నేతలు చెలరేగిపోతున్నారు. పెళ్లకూరు మండలంలోని కొండలు, గుట్టలు, చెరువులను చెరబడుతున్నారు. కాలువలు, అటవీ భూముల్లో వాలిపోతున్నారు. భారీ యంత్రాలతో అక్రమంగా మట్టిని తవ్వి ఇటుక బట్టీలు, వెంచర్లు, పరిశ్రమలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రావులపాడు, రాజుపాళెం, చెంబేడు, పునబాక చెరువుల్లో ఇప్పటికే తవ్వకాలు సాగుతుండగా.. అటవీ భూములు, అసైన్మెంట్ భూములే లక్ష్యంగా చేసుకుని ఇబ్బడిముబ్బడిగా లోడేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. పెళ్లకూరు: మండలంలో అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు బరితెగించేశారు. అధికారం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని తహతహలాడుతున్నారు. తమకెదురే లేదన్న రీతిలో మట్టి తవ్వకాలకు పూనుకుంటున్నారు. నాయుడుపేట, మేనకూరు ప్రాంతాల పరిధిలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న లేఅవుట్లకు శిరసనంబేడు, రాజుపాళెం, రోసనూరు గ్రామాల్లోని చెరువులు, తెలుగుగంగ కాలువ గట్లు, ప్రభుత్వ భూముల్లోని గ్రావెల్‌ను తవ్వేసి తరలించేస్తున్నారు. చెరువుల్లో గ్రావెల్, మట్టి తవ్వకాలు చేపట్టరాదని కోర్టు ఆదేశాలున్నా ఇక్కడి అధికార పార్టీ నేతలు పట్టించుకోవడం లేదు. పట్టించుకోని అధికారులు స్వర్ణముఖి నది నుంచి ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నా.. రావులపాడు, రాజుపాళెం, శిరసనంబేడు గ్రామాల నుంచి మట్టి, గ్రావెల్ ఎత్తుకెళ్తున్నా ఇక్కడి అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మైనింగ్, రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులు తూతూమంత్రంగా దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇక్కడి వ్యాపారుల నుంచి వివిధ శాఖల అధికారులు భారీగా ముడుపులు తీసుకుంటున్న తెలుస్తోంది. రావులపాడు కేంద్రంగా మట్టి తవ్వకాలు మండలంలోని రావులపాడు గ్రామంలో అసైన్మెంట్ పొలాల నుంచి చెరువు కట్టలను తవ్వేసి లారీలతో మట్టి తరలిస్తున్నారు. శిరసనంబేడు గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత గ్రామ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములు, చెరువులను లక్ష్యంగా చేసుకుని లారీలు, టిప్పర్లతో మట్టి తరలిస్తున్నారు. ఆ మట్టిని బట్టీలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మట్టి రవాణా కోసం చెరువులో తాత్కాలికంగా రోడ్డు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి తాళ్వాయి పాడు, పెన్నేపల్లి ప్రాంతాల్లోని ఇటుక బట్టీలతో పాటు దొరవారిసత్రం, నాయుడుపేటలో ఉన్న ఇటుక బట్టీలకు లారీలతో మట్టి తరలిస్తున్నారు. స్థానిక రైతుల ముసుగులో కొందరు టీడీపీ నాయకులు రెవెన్యూ అధికారుల నుంచి తాత్కాలిక అనుమతులు పొంది అక్రమాలకు పాల్పడుతున్నారు. దీని వెనుక అధికార పార్టీకి చెందిన ఓ అగ్రనేత ఉన్నట్టు సమాచారం. మట్టి అక్రమ రవాణాతో రోడ్లు కూడా దెబ్బతిన్నాయని స్థానికులు వాపోతున్నారు. చర్యలు తీసుకుంటాం రావులపాడు గ్రామంలో వ్యవసాయ భూములు లెవలింగ్ పనుల కోసం నాలుగు రోజులు మట్టి తరలింపులకు అనుమతులు పొందారు. కానీ ఇటుక బట్టీలకు మట్టి తరలిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. అలాగే రోసనూరు, శిరసనంబేడు, రాజుపాళెం చెరువులు, పలు ప్రాంతాల్లోని అటవీ భూములు, అసైన్మెంట్ భూములు, తెలుగుగంగ పొర్లు కట్టలు, చెరువుల్లో మట్టి, గ్రావెల్ త్రవ్వకాలు, స్వర్ణముఖినది నుంచి అక్రమ ఇసుక రవాణాపై ఫిర్యాదులు వస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు చేపడుతాం. – హరికృష్ణ, తహసీల్దార్, పెళ్లకూరు -
ఆట్రిసోల్ టెక్నాలజీస్‌తో శ్రీరామ కళాశాల ఒప్పందం
తిరుపతి సిటీ: పరిశ్రమ, విద్యాసంస్థల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, విద్యార్థులకు మెరుగైన అవకాశాలను కల్పించే లక్ష్యంతో స్థానిక కరకంబాడి రోడ్డులోని శ్రీ రామ ఇంజినీరింగ్ కాలేజ్, ఆట్రిసోల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు సంబంధిత ప్రతినిధులు కళాశాల యాజమాన్యంతో సోమవారం ఒప్పందపు పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మన్నెం రామిరెడ్డి మాట్లడుతూ ఈ అవగాహన ఒప్పందం ద్వారా విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాభివృద్ధి, ఇంటరాక్షన్, శిక్షణ, ప్లేస్మెంట్ సహకారం, పరిశ్రమకు అనుగుణమైన అభ్యసన అవకాశాలు అందుతాయన్నారు. విద్యార్థులు తరగతి గదిలో పొందే విద్యను పరిశ్రమ అవసరాలతో అనుసంధానం చేయడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ యమన్నెం రామసుబ్బారెడ్డి, డైరెక్టర్ మన్నెం అరవిందుకుమార్రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ జయచంద్ర, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వాసు పాల్గొన్నారు -
సొంత కార్యక్రమంలా జాతర సమీక్ష సమావేశం
సాక్షి టాస్క్‌ఫోర్స్ : వెంకటగిరి పోలేరమ జాతర ఏర్పాట్లపై సోమవారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో చేపట్టిన సమీక్ష సమావేశం అధికారుల సొంత కార్యక్రమంలా జరిగింది. కింద స్థాయి అధికారులు, విలేకరులు సమావేశం నుంచి వెళ్లిపోవాలని ఆర్డీవో హుకుం జారీచేశారు. దీంతో అక్కడున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు విస్తుపోయారు. అమ్మవారి జాతర రాష్ట్ర పండుగ అయినప్పిటి నుంచి ప్రత్యేక బాధ్యతలు వహిస్తూ జాతరకు సంబధించిన అన్నీ అంశాలు విలేకరులతో పంచుకునేవారు. అయితే ఈ ఏడాది దానికి భిన్నంగా మున్సిపల్ కార్యాలయంలోని ఓ చిన్న గదిలో సమావేశం నిర్వహించారు. దానికి తోడు దేవదాయశాఖ పర్యవేక్షణలో జరిగే ఈ జాతరలో ఆ శాఖ అధికారి, కమిటీ అధ్యక్షులు సమావేశానికి అన్ని శాఖల అధికారులు, పాత్రికేయులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆ డివిజన్ అధికారి ఆదేశంతో పలుశాఖల అధికారులు వెళ్లిపోగా పాత్రికేయులు గంటల తరబడి వెలుపలే నిరీక్షించారు. -
శ్రీహరి రాజసం
ప్రభల తేజసం..ఘటాటోపం నీడన చంద్ర ప్రభ వాహన సేవ(ఇన్సెట్) ప్రత్యేక అలంకరణలో మలయప్పతిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవా లు అంగరంగ వైభవంగా సాగుతున్నా యి. ఏడో రోజు సోమవారం ఉదయం సూర్య ప్రభపై తేజోమయంగా, రాత్రి చంద్ర ప్రభపై చల్లని వెన్నెల కాంతుల్లో శ్రీమలయప్పస్వామి దేదీప్యమానంగా ఊరేగుతూ కనువిందు చేశారు. సూర్యప్రభ వాహనంపై స్వర్ణకాంతులు వెదజల్లుతూ భక్తకోటిని కటాక్షించిన స్వామివారు.. రాత్రి చంద్ర ప్రభపై శ్వేతవర్ణ పుష్పాలంకరణలో సాక్షాత్తు చల్లని చంద్రుడిని తలపించారు. వాహన సేవకు ముందే వర్షం రావడంతో ఘటాటోపం నీడలో చంద్రప్రభ వాహన సేవ సాగింది. స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం మహారథోత్సవం, రాత్రి అశ్వవాహన సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. బుధవారం చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. వాహన సేవల ముందు వివిధ కళాబృందాల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. వాహన సేవల్లో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్యచౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ పాల్గొన్నారు. -
హృదయమనే కోవెలలో..
తిరుపతి తుడా: టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ ఆధ్వర్యంలోని తిరుపతి శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయ చికిత్సా కేంద్రంలో 27వ గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. గుండె మార్పిడి కోసం ఎదురుచూస్తున్న 14 ఏళ్ల బాలికకు గుంటూరులో లభించిన దాత గుండెను సకాలంలో తిరుపతికి తరలించి విజయవంతంగా మార్పిడి చేశారు. గుంటూరులోని కిమ్స్ ఆస్పత్రిలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించిన 38 ఏళ్ల వ్యక్తి కుటుంబం అవయవదానానికి ముందుకు వచ్చింది. వారి మానవతా నిర్ణయం మరో చిన్నారికి ప్రాణం పోసింది. ఎయిర్ అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో టీటీడీ రవాణా విభాగం వాహనంలో ఈనెల 20న మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు నుంచి గుండెను రోడ్డు మార్గంలో తిరుపతికి తరలించారు. ఎస్పీసీహెచ్సీకి చెందిన ఫిజీషియన్ అసిస్టెంట్ విజయ్, శ్యామ్‌బాబు గుండెతో పాటు ప్రయాణించి, వైద్య బృందంతో నిరంతర సమన్వయం చేశారు. సోమవారం సాయంత్రం 7 గంటలకు గుండె తిరుపతికి చేరుకోగా, వైద్య బృందం వెంటనే మార్పిడి ప్రక్రియను ప్రారంభించింది. సుమారు ఎనిమిది గంటలపాటు జరిగిన సంక్లిష్ట శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తిచేశారు. పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి సమన్వయంతో, చీఫ్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ దీపేష్ త్రివేది నేతృత్వంలో కార్డియాక్ అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ మధుయాదవ్‌తో పాటు కార్డియాక్ సర్జన్లు, కార్డియాలజిస్టులు, వైద్య బృందం విజయంతంగా బాలికకు గుండె మార్పిడి చేసి ప్రాణం పోశారు. -
సూర్య తేజం.. చంద్ర వికాసం
తిరుపతి రూరల్: తుమ్మలగుంటలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన సేవలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై అనంత తేజోమయుడిగా స్వామివారు భక్తులకు దర్శనమివ్వగా.. రాత్రి చంద్రప్రభ వాహనంపై చల్లనయ్యగా కటాక్షించారు. ఉదయం సూర్యప్రభ వాహన సేవ సందర్భంగా సరిగ్గా 6.45 గంటలకు సూర్యకిరణాలు స్వామివారి పాదాలు తాకిన సమయంలో అర్చకులు ప్రత్యేక హారతులు సమర్పించారు. ఈ అపురూప దృశ్యాన్ని తిలకించి భక్తులు పరవశించిపోయాయి. చంద్రప్రభపై.. చల్లనయ్యగా.. సోమవారం రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి విహరిస్తూ భక్తులను కటాక్షించారు. సూర్యప్రభ వాహన సేవకు చంద్రగిరి మండలంలోని చంద్రగిరి, రెడ్డివారిపల్లి, నరసింగాపురం, రాయలపురం, తిరుపతి రూరల్ మండలం నుంచి గాంధీపురం గ్రామాలకు చెందిన భక్తులు సారె తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. సారె తెచ్చిన భక్తులకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సాదర స్వాగతం పలికారు. చంద్రప్రభ వాహన సేవకు రామచంద్రాపురం మండలం నెన్నూరు, నడవలూరు, సొరకాయలపాలెం, దేసూరికండ్రిగ, సి.రామాపురం, పి.వి.పురం గ్రామాలకు చెందిన భక్తులు సారె సమర్పించారు. చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి వాహన సేవల్లో పాలు పంచుకున్నారు. నేడు రథోత్సవం బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం 6 గంటలకు రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. స్వామివారు రథంపై ఆశీనులై పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే రాత్రి 7 గంటలకు అశ్వ వాహన సేవ నిర్వహించనున్నారు. -
నేటి నుంచి పవిత్రోత్సవాలు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం నుంచి 26వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పవిత్రోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ యాగశాల నుంచి పట్టువస్త్రాలు, పట్టు పవిత్రాలు, పాదుకలు, సుగంధ ద్రవ్యాలు తదితర పూజా సామగ్రిని ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి వినాయకస్వామి, చెంగల్రాయస్వామి, శ్రీకాళహస్తీశ్వరస్వామి, జ్ఞానప్రసూనాంబ గర్భాలయాల్లో ఉంచి విశేష పూజలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటలు వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు గర్భాలాయల్లో విశేషాధిపూజా కార్యక్రమాలు నిర్వహించనున్న ఆ సమయాల్లో అంతరాలయ దర్శనం ఉండదన్నారు. ప్రతిరోజూ ఉదయం 10గంటలకు నిర్వహించే ఉచ్ఛికాల అభిషేకం పవిత్రోత్సవాల సందర్భంగా ఉదయం 9.30గంటలకు నిర్వహిస్తారన్నారు. సాయంత్రం దీపారాధణ సేవ టిక్కెట్లు కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. -
మోహన్‌బాబు యూనివర్సిటీతో ‘ఫిజిక్స్ వాలా’ ఒప్పందం
చంద్రగిరి: మోహన్ బాబు యూనివర్సిటీ ప్రాంగణం సోమవారం ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా నిలిచింది. దేశంలోనే ప్రముఖ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ ‘ఫిజిక్స్ వాలా’, మోహన్‌బాబు యూనివర్సిటీల మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రో ఛాన్స్లర్ మంచు విష్ణు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఛాన్స్లర్, పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్‌బాబు, ఫిజిక్స్ వాలా వ్యవస్థాపకుడు అలఖ్ పాండే, డైరెక్టర్ వినయ్ మహేశ్వరి, వైస్ ఛాన్స్లర్ పి.వి.రమణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఛాన్స్లర్ మోహన్‌బాబు మాట్లాడుతూ.. నేటి తరం విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందనే విషయాన్ని గుర్తుచేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మోహన్‌బాబు యూనివర్సిటీలో ప్రతి ఏటా సరికొత్త సాంకేతికతను, డిజైన్లను అందుబాటులోకి తెస్తూ దేశంలోనే మొదటి సారిగా వినూత్న విద్యా విధానాలను అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఫిజిక్స్ వాలా వ్యవస్థాపకుడు అలఖ్ పాండే మాట్లాడుతూ.. యూట్యూబ్‌లో 6.5 కోట్లకు పైగా, యాప్‌లో 60 లక్షల మందికి పైగా విద్యార్థులకు 54 రకాల పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తూ ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించామని తెలిపారు. అనంతరం ఎంఓయూలను చేసుకున్నారు. -
ఈకేవైసీ పూర్తి చేయండి
తిరుపతి అర్బన్: జిల్లా వాప్యంగా రైతులు సాగుచేసిన పంటలకు సంబంధించి వంద శాతం ఈకేవైసీ ప్రక్రియను వ్యవసాయశాఖ నేతృత్వంలో పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ గోవిందరావు స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని జేసీ చాంబర్లో సోమవారం వరి ధాన్యం కొనుగోలుతోపాటు ఈకేవైసీ పూర్తి చేయడానికి అధికారులతో సమీక్షించారు. జేసీ మాట్లాడుతూ ఈకేవైసీ ఉంటేనే వరి ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తుందనే విషయాన్ని రైతులకు ముందుగానే స్పష్టంగా తెలియజేయాలన్నారు. అలాగే 2026–27 రబీకి సంబంధించి వరి ధాన్యం కొనుగోలు చేయడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్వో శేషాచలం రాజు, డీఎం దేవుళ్ల నాయక్, అగ్రికల్చర్ జేసీ ప్రసాద్‌రావు పాల్గొన్నారు. ఫిజియోథెరపిస్ట్ మెరిట్ లిస్ట్ విడుదల తిరుపతి తుడా: కాంబియైండ్ నోటిఫికేషన్ – 2025లో భాగంగా ఫిజియోథెరపిస్ట్ పోస్టుకు సంబంధించి మెరిట్ లిస్ట్‌ను విడుదల చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ పర్మిషన్ మేరకు మెరిట్ లిస్టును స్విమ్స్ అధికారిక వెబ్సైట్లో ఉంచారు. ఫైనల్ లిస్ట్‌కు సంబంధించి అభ్యర్థులకు ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా మంగళవారం సాయంత్రం 5గంటల్లోపు ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. వర్షాలపై విద్యుత్‌శాఖ అప్రమత్తం తిరుపతి రూరల్: భారీ వర్షాలు, బలమైన గాలుల నేపథ్యంలో ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేలా ముందస్తు చర్యలు చేపట్టాలని సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో అధికారులుతో సోమవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. స్తంభాలు కూలిపోవడం, విద్యుత్ తీగలు తెగిపడటం వంటి ఘటనలు కనిపిస్తే వెంటనే సమీప విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే 1912, 1800 425 155333 టోల్‌ఫ్రీ నంబర్లకు లేదా 91333 31912 వాట్సాప్ నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. అంతకుముందు గురజాడ అప్పారావు చిత్రపటానికి నివాళి అర్పించారు. డయల్ యువర్ సీఎండీకి 103 వినతులు ‘డయల్ యువర్ సీఎండీ’, ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాలకు 103 మంది వినియోగదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వివిధ సమస్యలపై వినతులు అందినట్లు సీఎండీ శివశంకర్ తెలిపారు. పరిశ్రమల్లో పటిష్ట భద్రత తిరుపతి అర్బన్: పరిశ్రమల్లో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ వెల్లడించారు. సోమవారం ఆయన కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమీక్షా సమావేశాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగల్ డెస్క్ విధానంలో 190 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. అందులో 151కి అనుమతులు ఇచ్చామని తెలిపారు. దీంతో పలువురుకి ఉద్యోగ ఉపాధి లభిస్తుందని వివరించారు. మున్సిపల్ కమిషనర్ జయకృష్ణ, జిల్లా పరిశ్రమల జీఎం చంద్రశేఖర్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ విజయభరత్‌రెడ్డి, అగ్రిమాపక అధికారి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 6 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 72,019 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,431 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.50 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 6 గంటల సమయం పడుతోంది. -
వివాహితపై లైంగిక దాడికి యత్నం
దొరవారిసత్రం: బహిర్భూమికి వెళ్లిన వివాహితపై లైంగికదాడికి యత్నించిన ఘటన సోమవారం తెల్లవారు జామున బురదమడుగు గ్రామంలో చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసుల కథనం..బురదమడుగు గ్రామానికి చెందిన వివాహిత రోజూలాగే గ్రామ సమీపంలో బహిర్భూమికి వెళ్లింది. అక్కడే కాపుకాసిన అదే గ్రామానికి చెందిన మొడెం చెంగయ్య ఆమైపె లైంగికదాడికి యత్నించాడు. కేకలు వేయడంతో ఆమె భర్త ఘటనా స్థలానికి చేరుకోవడంతో చెంగయ్య పరారయ్యాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పేలిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ సూళ్లూరుపేట: సూళ్లూరుపేట పట్టణంలోని బజారువీధిలో సోమవారం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలడంతో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. అధికలోడు పడి పేలిపోయినట్టు సమాచారం. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఐదుగురిపై కేసు సైదాపురం: ఆస్తి తగదా విషయంలో మండలంలోని మర్లపూడి గ్రామానికి చెందిన మాదిరెడ్డి సుశీలమ్మపై దాడి చేసిన ఐదుగురిపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ బాధితురాలు సుశీలమ్మకు.. ఆమె చెల్లెలు రత్నమ్మ మధ్య ఆస్తి విషయంలో వివాదం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సుశీలమ్మపై ఒక్కసారిగా మాదిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అతని కుమారుడు వెంకటేష్, చీర్ల అయ్యప్పరెడ్డి, చీర్ల పెంచలరెడ్డి, చీర్ల రాజేశ్వరి తదితరులు కలిసి రాళ్లు, చాకులతో దాడి చేయడంతో సుశీలమ్మ తీవ్రంగా గాయపడిందన్నారు. గాయపడిన సుశీలమ్మను కుటుంబ సభ్యులు గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారని, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్లారని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. రుయాలో హోమ్ కేర్ నర్సింగ్ కోర్సు తిరుపతి తుడా: రుయా ఆసుపత్రిలో హోమ్ కేర్ నర్సింగ్ ఎయిడ్ సర్టిఫికెట్ కోర్సు ప్రారంభించినట్లు ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీ.రవిప్రభు తెలిపారు. రుయా ఆస్పత్రి, రోటరీ క్లబ్ ఆఫ్ తిరుపతి, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో మూడు నెలల కాలవ్యవధితో హోమ్ కేర్ నర్సింగ్ ఎయిడ్ సర్టిఫికెట్ కోర్సును వైద్యాధికారులతో కలిసి ఆయన సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాలియేటివ్ కేర్ రోగులకు సేవలందించేందుకు శిక్షణ పొందిన సంరక్షకుల అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. రుయా సూపరింటెండెంట్ డాక్టర్ బీ.మనోహర్ మాట్లాడుతూ ఆస్పత్రితో పాటు ఇంటి వద్ద పాలియేటివ్ కేర్ అవసరమైన రోగులకు మెరుగైన సేవలందించగల నైపుణ్యం కలిగిన నర్సింగ్ సహాయకులను తీర్చిదిద్దడం ఈ కోర్సు ప్రధాన ఉద్దేశమన్నారు. -
ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
భాకరాపేట: భాకరాపేట సబ్స్టేషన్న్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి పీలేరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు గాయపడ్డారు. ప్రమాదంలో చెట్టేవారిపాళెం గ్రామపంచాయతీ తొగుటపల్లికి చెందిన శంకరయ్య (60), సుబ్రహ్మణ్యం (65), విమలమ్మ (50), స్రవంతి (35), చైతన్య (6) గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే చిన్నగొట్టిగల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
చిన్న సూక్ష్మజీవులు.. గొప్ప ప్రభావం
తిరుపతి రూరల్: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సూక్ష్మజీవుల దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. అప్లైడ్ మైక్రోబయాలజీ విభాగం– సూక్ష్మవీక్షణ విద్యార్థి విభాగం, మైక్రోబయాలజిస్ట్స్ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో ‘చిన్న సూక్ష్మజీవులు–గొప్ప ప్రభావం’ ఇతివృత్తంతో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘సూక్ష్మజీవ ప్రపంచం – చిన్న సూక్ష్మజీవులు, గొప్ప ప్రభావం’ అనే అంశంపై రంగోలి పోటీ నిర్వహించారు. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, రంగురంగుల చిత్రాల ద్వారా సూక్ష్మజీవుల ప్రాధాన్యతను చాటిచెప్పారు. అప్లైడ్ మైక్రోబయాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ పి.సువర్ణలతాదేవి, ప్రొఫెసర్లు ఉమామహేశ్వరి, జయమాధురి, ఎంఎస్‌బీఐ విద్యార్థి విభాగం ప్రతినిధులు సాయిభార్గవి, గీత, సుస్రోనియా పాల్గొన్నారు. గొర్రెపాటికి జైలు శ్రీకాళహస్తి: మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన గొర్రెపా టి సురేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ నరసింహమూర్తి తెలిపా రు. సోమవారం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇద్దరు మహిళల ఫిర్యాదు మేరకు అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. -
సమస్యలు అనేకం.. పరిష్కారం నామమాత్రం
పింఛన్ ఇప్పించండి సారూ మాది వెంకటగిరి. నా భర్త మృతి చెందారు. రెండేళ్లుగా వితంతు పింఛన్ కోసం ఎదురుచూస్తున్నాను. అయితే ఇటీవల పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సచివాలయానికి వెళితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సమయంలో నేను మా అమ్మ రేషన్ కార్డులో ఉన్నట్లు నమోదు చేశారు. మా అమ్మకు పింఛన్ వస్తున్న నేపథ్యంలో నేను దరఖాస్తు చేసుకోవడానికి వీలులేకుండా పోయింది. మాకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు. నాకు పింఛన్ ఇప్పించాలని వేడుకుంటున్నా. –తమ బిడ్డలతో పార్వతి, వెంకటగిరి తిరుపతి అర్బన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు అర్జీదారులు క్యూ కట్టారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 437 అర్జీలను కలెక్టర్ వెంకటేశ్వర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ గోవిందరావు, డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్‌నాయక్, భరత్ నాయక్, రామాంజనమ్మ అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అర్జీదారులు తమ సమస్యలను అధికారులకు ఏకరువు పెట్టారు. వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కలుజు కాలువ ఆక్రమణ రేణిగుంట మండలం, వెంకటాపురం కలుజు కాలువను సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం సర్వే నం.227లో 74 సెంట్లు ఆక్రమించిందని స్థానికులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఆనేక కుటుంబాలు కలుజు కాలువ ఆక్రమణలో ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటాపురంతోపాటు కరకంబాడి, తిమ్మాయిగుంట, అంకమ్మనాయుడుమిట్ట, ఆర్ అగ్రహారం తదితర చెరువులకు సురక్షితంగా నీరు చేరాలంటే ఈ కలుజు కాలువ ఎంతో ఆదారమన్నారు. అధికార పార్టీకి చెందిన కొందరి అండదండలతోనే ఆక్రమణ జరిగిందని ఆరోపించారు. డీలర్లకు నేరుగా ఎరువులు ఇవ్వండి కంపెనీల నుంచి నేరుగా చిట్టమూరు మండలంలోని రసాయనిక ఎరువుల దుకాణాలకు ఎరువులతోపాటు పురుగు మందులు అందించాలని డీలర్లు అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు బాబురెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పీజీఆర్ఎస్ సందర్భంగా అగ్రికల్చర్ జేడీ ప్రసాద్‌రావుకు వినతిపత్రాన్ని అందించారు. నెల్లూరు నుంచి సరఫరా చేస్తే బస్తాకు రవాణా చార్జీ అదనంగా రూ.45, రేణిగుంట నుంచి సరఫరా చేస్తే బస్తాపై రవాణా చార్జీ రూ.60 పడుతుందని చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీకి విక్రయిస్తే తమకు బస్తాపై రూ.50 నుంచి రూ.60 నష్టం వస్తోందని వాపోయారు. ఎమ్మార్పీకే ఎరువులు విక్రయించాలంటే నేరుగా చిట్టిమూరు మండలంలోని డీలర్ల దుకాణాల వద్ద ఎరువులు దించాలని డిమాండ్ చేశారు. డీలర్స్ అసోసియేషన్ యూనియన్ నాయకులు భాస్కర్, సాయిరాం కృష్ణ, సుబ్బారావు, మహేష్‌నాయుడు, వేణురెడ్డి, సుబ్రహ్మణ్యం, ఎస్.కే.జలీల్, ఎస్.కే.కరిముల్లా, రాజేష్ నాయుడు, రవీంద్రబాబు పాల్గొన్నారు.కోట్ల విలువ చేస్తే భూములు కబ్జా రైల్వేకోడూరు మండలంలోని వీవీ కండ్రిక గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్లు 130, 142లో ఉన్న కోట్ల విలువచేసే సుమారు 350 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమిస్తున్నారని దళిత నిరుపేద మహిళలు తిరుపతి కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. తమకు సెంటు భూమి లేదని, ఉపాధి హామీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించి హద్దులు ఏర్పాటు చేసుకోవడంతో పాటు జేసీబీలతో భూమిని చదును చేసి మామిడి మొక్కలు నాటుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా అడ్డుకోవాలని రాధిక, శివమ్మ, ఉమామహేశ్వరి, నదియా, కుమారి, దేవమ్మ, పార్వతి, ఇందిరమ్మ, వెంకటమ్మ, రాజమ్మ తదితరులు డిమాండ్ చేశారు. -
చిన్నారులకు అరుదైన చికిత్స
తిరుపతి తుడా: స్విమ్స్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారులకు అరుదైన క్లిష్టమైన శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారని డైరెక్టర్ డాక్టర్ జగదీష్ తెలిపారు. అన్నమయ్య జిల్లా, రాయచోటికి చెందిన రెండేళ్ల బాలిక కడుపులో అసాధారణంగా మాస్ గుర్తించడంతో తల్లిదండ్రులు చిన్నారిని స్విమ్స్‌కు తీసువచ్చారని తెలిపారు. వైద్య పరీక్షలు, స్కానింగ్ అవసరమైన ఇతర నిర్ధారణ పరీక్షల అనంతరం చిన్నారి కుడి కిడ్నీలో విల్మ్స్ ట్యూమర్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించి మెడికల్ ఆంకాలజీ విభాగానికి చెందిన డాక్టర్ భార్గవి ఆధ్వర్యంలోని వైద్య బృందం చిన్నారికి నాలుగు సైకిళ్ల కీమోథెరపీ చికిత్సను పూర్తి చేశారని తెలిపారు. అలాగే తిరుపతి జిల్లా, పుత్తూరు మండలానికి చెందిన రెండేళ్ల బాలుడు విల్మ్స్ ట్యూమర్‌తో స్విమ్స్‌లో చేరారని, మూడు నెలల క్రితం ఈ చిన్నారికి మెడికల్ ఆంకాలజీ విభాగం డాక్టర్ భార్గవి బృందం కీమోథెరపీ అందించగా, అనంతరం సర్జికల్ ఆంకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మణిలాల్ నేతృత్వంలోని విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించినట్టు తెలిపారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొని యువకుడి మృతి
చంద్రగిరి: ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన విషాద ఘటన చంద్రగిరి సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. చంద్రగిరి మండలం ఐతేపల్లి గ్రామానికి చెందిన బొబ్బిలి రవితేజ (18) తిరుపతి నుంచి తన స్వగ్రామమైన ఐతేపల్లికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మార్గం మధ్యలోని చంద్రగిరి సమీపంలో ఫ్లైఓవర్ వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీని రవితేజ నడుపుతున్న ద్విచక్ర వాహనం ఢీకొంది. అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతరం చైన్నెలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడ చికిత్స పొందుతున్న రవితేజ శనివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. యువకుడి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రవితేజ ప్రమాద సమయంలో హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉండేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. -
నకిలీ బంగారం కుదువబెట్టి మోసం
నాయుడుపేట టౌన్: పట్టణంలోని సత్యసాయి కుదువ దుకాణంలో గంగసాయి అనే వ్యక్తి నకిలీ నకిలీ బంగా రం పెట్టి రూ.2లక్షలకు పైగా నగదు తీసుకుని మోసం చేసినట్లు దుకాణ యజమాని సముద్రాల మురళీకృష్ణ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిట్టమూరు మండలం యాకసిరి పాటిమిట్టకు చెందిన గంగసాయి అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం బంగారు గాజులు తీసుకువచ్చి కుదువపెట్టాలని చెప్పి సుమారు రూ.2లక్షల కు పైగా నగదు తీసుకున్నట్లు తెలిపారు. మరలా మరో బంగారు చైను తీసుకురావడంతో అనుమానం వచ్చి ఆ చైను పరిశీలించగా నకిలీ బంగారంగా తేలిందన్నారు. అంతేకాకుండా ఇటీవల పెట్టిన బంగారు గాజులు కూడా నకిలీవిగా తేలడంతో అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయినట్లు మురళీకృష్ణ పోలీసుల కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
చంద్రాపచారం
సాక్షి టాస్క్‌ఫోర్స్: చంద్రబాబు, కూటమి నేతలు చేసిన దిగజారుడు డైవర్షన్ డ్రామా బెడిసికొట్టింది. గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి ప్రసాదం లడ్డూలో వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందంటూ సాక్ష్యాత్తు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు కూటమి నేతలు రాజకీయ స్వార్థం కోసం శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని వాడుకోవడంపై భక్తకోటి ఆగ్రహించింది. ఈ ఘటనపై సుదీర్ఘ విచారణ జరిపిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లడ్డూకి వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు ఆనవాళ్లే లేవని స్పష్టం చేసింది. శ్రీవారి ప్రసాదంపై కూటమి నేతలు దుష్ప్రచారం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, లడ్డూ తయారు చేసే పోటు కార్మికులను సైతం అవమానించారని ప్రజా సంఘాలు, మేధావులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా హిందూ భక్తుల ఆరాద్యదైవం శ్రీవారికి రాజకీయాలు ఆపదించి భక్తుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నాలు విరమించుకోవాలని వారు కోరుతున్నారు. మౌనం వీడి వాస్తవాలు భక్తులకు తెలపాలి గత ప్రభుత్వ పాలనలో శ్రీవారి లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిసిందంటూ అవాస్తవాలను కూటమి నేతలు దుష్ప్రచారం చేయడంతో కోడై కూసిన కొన్ని పచ్చ మీడియా యాజమాన్యాలు ప్రస్తుతం మౌనం పాటిస్తున్నాయి. జంతుకొవ్వు ఆనవాళ్లు లేవని ఈడీ సైతం స్పష్టం చేయడంతో వాస్తవాలను ప్రచారం చేసేందుకు ఎందుకు వెనుకాడుతున్నాయో అర్థం కాలేదని భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సీఎం, డిప్యూటీ సీఎం వంటి అత్యున్నత పదవుల్లో కొనసాగుతున్న వ్యక్తులు మౌనం వీడి దెబ్బతిన్న భక్తుల మనోభావాలపై స్పందించి క్షమాపణలు చెప్పాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. శ్రీవారి ప్రసాదంపై కూటమి విషం భక్తులతో పాటు పోటు కార్మికులకు అవమానం శ్రీవారి లడ్డూకు వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిపారని శ్రీవారి భక్తులను భయభ్రాంతులకు గురిచేశారు. తిరుమలలో లడ్డూ తయారు చేసే పోటు కార్మికులను సైతం అవమానించారు. సాక్ష్యాత్తు సీఎం, డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తులు వాస్తవాలు గ్రహించకుండా మాట్లాడడం దారుణం. ఈడీ విచారణతో జంతు కొవ్వు కలవలేదని వాస్తవాలు బయటపడ్డాయి. దుష్ప్ర చారం చేసిన వ్యక్తులు శ్రీవారి భక్తులకు, పోటు కార్మికులకు ఏం సమాధానం చెబుతారు? వాస్తవాలు తెలుసుకోకుండా రాజ కీయ స్వార్థం కోసం ఇష్టానుసారంగా మాట్లాడి భక్తుల మనోభావాలతో ఆడుకోవడం నిలిపివేసి ప్రజాశ్రేయస్సుపై దృష్టి పెట్టాలి. – జే విశ్వనాథ్, సీపీఐ నగర కార్యదర్శి, తిరుపతి -
వాస్తవాలు తెలుసుకున్న భక్తులు
గత ప్రభుత్వ హయాంలో ఏదో జరిగిపోయిందని హంగామా చేసిన కూటమి నేతలకు కనువిప్పు కలిగింది. నెయ్యిలో జంతు కొవ్వు ఆనవాళ్లు లేవని ఈడీ నిర్ధారించింది. వాస్తవాలను టీటీడీతో పాటు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం భక్తులకు తెలియజేయాలి. వారు చేసిన ఆరోపణలు అవాస్తవమని ప్రకటించాలి. అప్పుడే పాలకుల నిజాయితీపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది. పాలకులు వాస్తవాలను ప్రజలకు చేరవేశారని, నిజాయితీపరులని ప్రజలు నమ్ముతారు. – శివసుబ్రమణ్యం, సాఫ్ట్వేర్ ఇంజినీర్, తమిళనాడు భక్తుడు. శ్రీవారితో రాజకీయం తగదు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి శక్తితో ప్రపంచం నడుస్తోంది. ఆయనను రాజకీయాలకు అతీతంగా కొలవాలి. గతంలో లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ప్రచారం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు బాధపడ్డారు. ఈడీ విచారణలో జంతుకొవ్వు లేదని తేలడం శుభపరిణామం. అసత్య ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీయడం బాధ కలిగించే విషయం. – పద్మావతమ్మ, భక్తురాలు, తిరుపతి -
గరుడ గోవిందం
ఆరు గంటలపాటు వైభవంగా గరుడోత్సవం తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడవాహన సేవ శనివారం రాత్రి అశేష భక్తజనుల మధ్య వైభవంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. పల్లకీపై మోహినీ అవతారంలో ఊరేగుతున్న స్వామివారిని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వాహన సేవ సాగేంతసేపూ మాడ వీధులు గోవింద నామస్మరణలు, వేద విద్యార్థుల మంత్ర పఠనంతో మార్మోగాయి. హారతులు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ వాహన సేవ వైభవంగా కొనసాగింది. పల్లకీసేవకు తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం, చిగురువాడ, మల్లంగుంట, దుర్గసముద్రం, కేసీపేట, రామానుజపల్లి, సి.గొల్లపల్లి, పైడిపల్లి, పాతకాల్వ పంచాయతీల నుంచి భక్తులు సారె తీసుకువచ్చి సమర్పించారు. గోవింద నామస్మరణతో పులికించిన తుమ్మలగుంట శనివారం రాత్రి తుమ్మలగుంటలో శ్రీవారికి అత్యంత ప్రీతికరమైన గరుడ వాహనంపై కల్యాణ వేంకటేశ్వర స్వామి విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి గరుడవాహన సేవను తిలకించేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో తుమ్మలగుంట వీధులన్నీ జనసంద్రంగా మారాయి. గరుడునిపై గోవిందుడు విహరిస్తుండగా భక్తులు గోవింద నామస్మరణతో పరవశించారు. సుమారు ఆరు గంటల పాటు సాగిన గరుడోత్సవం ముగిసే సమయానికి సుమారు 70 వేల మందికిపైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు సమాచారం. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను కఠినంగా అమలు చేశారు. గరుడవాహన సేవలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భక్తులందరికీ సంతృప్తికరమైన దర్శనం కల్పించేలా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
కమలమ్మకు భూమన నివాళి
తిరుపతి మంగళం : దివంగత వైఎస్ రాజారెడ్డి సోదరి కమలమ్మ మృతి చెందారు. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి శనివారం పులివెందులలో కమలమ్మ పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాతృమూర్తి అయిన వైఎస్ విజయమ్మతో భూమన కరుణాకరరెడ్డి మాట్లాడారు. కమలమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కామెర్ల మందుకు వెళ్లిన యువకుడి అదృశ్యం తొట్టంబేడు (శ్రీకాళహస్తి రూరల్): తొట్టంబేడు మండలం కొత్త కన్నలి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, మునెమ్మ దంపతుల కుమారుడు పి.మునిశేఖర్ (30) కనబడడం లేదని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈనెల 17వ తేదీ సాయంత్రం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. మునిశేఖర్ కొంతకాలంగా కామెర్ల వ్యాధితో బాధపడుతున్నాడు.ఈనెల 12వ తేదీ ఉదయం కామెర్లకు మందులు తీసుకురావడానికి తమిళనాడు రాష్ట్రంలోని వాలాజీ గ్రామానికి వెళ్తున్నట్టు కుటుంబ సభ్యులకు తెలిపి ఇంటి నుంచి బయలుదేరాడు. అయితే అతను తిరిగి ఇంటికి రాలేదని, కుటుంబ సభ్యులందరూ వాలాజీ, తిరుత్తణి పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా అతని జాడ తెలియలేదు. గతంలో కూడా అతను రెండుసార్లు కామెర్ల మందుల కోసం వాలాజీ గ్రామానికి వెళ్లి వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి గల్లంతయిన మునిశేఖర్ ఆచూకీ కోసం వివిధ కోణాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు. సీటు కోసం మహిళల ఘర్షణరైల్వేకోడూరు అర్బన్: తిరుపతి నుంచి రైల్వే కోడూరుకు మహిళలు ఉచిత బస్సులో ప్రయాణం చేస్తుండగా కొందరు కోడూరుకు చెందిన మహిళలు సీట్లకోసం తగువులాడుకుంటూ శుక్రవారం రాత్రి ఘర్షణకు దిగారు. చివరకు జుట్లు పట్టుకుని కొట్టుకొనే వరకు వెళ్లారు. కొందరు మహిళలు ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. వారి బంధువులకు ఫోన్లు చేసి పిలవడంతో మాధవరం పోడువద్ద బస్సును ఆపేశారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని బస్సును పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకువచ్చి విచారించారు. కొందరు మహిళలు 3 తులాల బంగారు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ప్రజా ఉద్యమంగా స్వచ్ఛతా హి సేవా తిరుపతి అర్బన్: పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన తిరుపతి జిల్లా సాధన దిశగా స్వచ్ఛతా హి సేవా– 2026ను ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన కలెక్టరేట్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా మండల, మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అన్ని శాఖలు, స్థానిక సంస్థలు సమన్వయంతో సమర్థవంతంగా నిరహించాలని ఆదేశించారు. నిర్దేశించిన కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో స్పష్టమైన, శాశ్వతమైన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చ్ఛతా హి సేవా కార్యక్రమాల అమలును అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, నిర్వహించిన కార్యక్రమాలను సమగ్రంగా డాక్యుమెంట్ చేసి, నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం నివేదికలు సమర్పించాలని వివరించారు. -
ఆంక్షలతో శ్రీవారి భక్తుల సతమతం
● గరుడోత్సవ దర్శనానికి తప్పని తిప్పలు ● తిరుమల ఔటర్ రింగ్ రోడ్డులో వాహనాల కట్టడి ● ప్రయాణికులను సైతం అక్కడే దించేసిన ఆర్టీసీ సాక్షి టాస్క్‌ఫోర్స్: గరుడ సేవ తిలకించడానికి తిరుమల చేరుకున్న సాధారణ భక్తుల పాట్లు అన్నీ ఇన్నీ కావు. తిరుమలలో అడుగడుగునా పోలీసుల ఆంక్షలు.. సరైన సమాచారం అందించే హెల్ప్ డెస్క్‌లు లేకపోవడం వంటి పరిణామాలతో శనివారం రాత్రి భక్తులు సతమతం అయ్యారు. ఆపై ప్రైవేట్ టాక్సీలకు అనుమతించగా పోగా టీటీడీ ఉచిత బస్సుల సేవలు అందుబాటులో లేకపోవడంతో వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు నడవడానికి ఇబ్బందులు పడ్డారు. గురుడ సేవ రోజున శనివారం రాత్రి సొంత వాహనాల్లో తిరుమలకు వచ్చిన వారు, ఆర్టీసీ బస్సుల్లో విచ్చేసిన ప్రయాణికులను తిరుమల ఔటర్ రింగ్ రోడ్డులో వదిలేశారు. దీంతో వారు ఆయా మార్గాల్లో లగేజీని చేతపట్టి నడవడానికి కష్టాపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎలాగో రామబంగీచా బస్టాండ్ ప్రాంతానికి చేరుకున్న భక్తులు గరుడసేవ చూసేందుకు మాడ వీధుల్లోకి చేరుకునే క్రమంలో నిర్ధిష్టమైన సూచిక బోర్డులు లేక, సమాచారం అందించే సహాయ కేంద్రాలు కనిపించకపోవడంతో కొందరు తీవ్ర అసహనానికి గురయ్యారు. మరోవైపు సర్వదర్శనానికి వెళ్లే భక్తుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ప్రధానంగా రాంబగీచా బస్టాండు, బాలాజీ బస్టాండులో దిగిన ప్రయాణికులకు టీటీడీ ఉచిత బస్సుల సేవలు, ప్రైవేట్ క్యాబ్‌లు అందుబాటు లేవు. దీంతో సర్వదర్శనం వైకుంఠం కాంప్లెక్స్ వద్దకు చేరుకోవడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. తిరుమలలోని ప్రధాన మార్గాల్లో భక్తులు నడవలేక కాళ్ల నొప్పులతో కాసేపు కూర్చుందామనే లోపు అక్కడే బందోబస్తులో ఉంటున్న పోలీసులు లేవయ్యా.. లేవమ్మా అంటూ పక్కకు వెళ్లండంటూ ఆంక్షలు విధించారు. మరికొందరు భక్తులు గదులు పొందడానికి మార్గాలు తెలియక ఆపసోపాలు పడ్డారు. టీటీడీ ఉద్యోగులు, పోలీసులు, మీడియా గ్యాలరీల్లో వెళ్లే ప్రవేశ ద్వారం వద్ద కూడా గందరగోళ వాతావరణం నెలకొంది. తాము టీటీడీలో పనిచేస్తున్నా ఎందుకు ప్రవేశ ద్వారం వద్ద ఆంక్షలు పెట్టారంటూ కొందరు తమ గుర్తింపు కార్డులతో ప్రశ్నించినప్పటికీ.. పక్కన ఉండాలనే సమాధానం అసంతృప్తికి గురిచేసింది. -
సున్నిత అంశాలపై ఆరోపణలు మానుకోవాలి
గత ప్రభుత్వంలో పాలకులు శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతుకొవ్వు కలిపారని నానా హంగామా చేయడంతో భక్తులు భయభ్రాంతులకు లోనయ్యారు. అలాంటి సున్నితమైన విషయంపై వాస్తవాలు తెలుసుకోకుండా పాలకులు జంతుకొవ్వు కలిసిందని వ్యాఖ్యానించడం బాధాకరం. ఈ విషయంపై ఈడీ విచారణతో వాస్తవాలు బయటపడ్డాయి. నెయ్యిలో జంతుకొవ్వు కలపలేదని అన్ని నిరాధార ఆరోపణలేనని స్పష్టమైంది. ఇప్పటికై నా రాజకీయ పార్టీ నేతలు కలియుగ దైవంతో రాజకీయాలు చేయడం మానుకోవాలి. – రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ టీచర్, తిరుపతి ధర్మం గెలిచింది వేలాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా శ్రీవారి లడ్డూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. అలాంటి లడ్డూలో గత ప్రభుత్వ హయాంలో జంతుకొవ్వు కలిపా రని నిందలు వేశారు. కూటమి ప్రభుత్వం చేసిన ప్రచారం అసత్యమని నెయ్యి లో జంతు కొవ్వు కలవలేదని ఈడీ విచారణలో తేలింది. దీంతో ధర్మం గెలిచిందని నమ్ముతున్నాం. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ప్రభుత్వం, టీటీడీ అధికారులు నిర్ణయించాల్సిన అవసరం ఉంది. – రాపూరి ప్రసాద్‌బాబు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యుడు, తిరుపతి -
జాతీయ స్థాయిలో నిత్య హాసిని సత్తా
శ్రీకాళహస్తి: అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పుదుచ్చేరిలో నిర్వహించిన సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ నేషనల్ చాంపియన్‌షిప్–2026లో శ్రీకాళహస్తికి చెందిన పత్తి నిత్య హాసిని అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. శ్రీకాళహస్తిలోని ఫిట్నెస్ సెంటర్ నిర్వాహకులు జ్యోతిరావు, రూపాదేవి దంపతుల కుమార్తె నిత్య హాసిని ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ జాతీయ స్థాయి పోటీల్లో షాట్‌పుట్, డిస్కస్ త్రో రెండు విభాగాల్లో పాల్గొన్నారు. షాట్‌పుట్‌లో 12.12 మీటర్లు విసిరి ద్వితీయ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించారు. డిస్కస్ త్రోలో 33.85 మీటర్ల దూరం విసిరి నాలుగో స్థానాన్ని కై వసం చేసుకున్నారు. షాట్‌పుట్‌లో రాష్ట్ర స్థాయి పోటీల్లో నిత్య 11.21 మీటర్లు సాధించగా.. జాతీయ స్థాయిలో తన ప్రదర్శనను 12.12 మీటర్లకు మెరుగుపరుచుకున్నారు. అంటే ఏకంగా 91 సెంటీమీటర్ల మెరుగుదల సాధించడం విశేషం. అదేవిధంగా డిస్కస్ త్రోలో రాష్ట్ర స్థాయిలో 31.40 మీటర్లు సాధించిన నిత్య.. జాతీయ స్థాయిలో 33.85 మీటర్లు విసిరి తన ప్రదర్శనను మరింత మెరుగుపరుచుకున్నారు. శ్రీకాళహస్తి పట్టణవాసులు సైతం నిత్య విజయాన్ని ప్రశంసిస్తూ భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
గ్రామీణ వారసత్వ సంపదను పరిరక్షిద్దాం
– గ్రామీణ వారసత్వం మోనోగ్రాఫ్ను ఆవిష్కరించిన కలెక్టర్ తిరుపతి అర్బన్: గ్రామీణ వారసత్వ సంపదను సమన్వయంతో సమష్టిగా పరిరక్షిద్దామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో రూపొందించిన ‘తిరుపతి జిల్లా గ్రామీణ వారసత్వం’ మోనో గ్రాఫ్‌ను కలెక్టరేట్లో శనివారం కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని చారిత్రక కట్టడాలు , సాంస్కృతిక సంప్రదాయాలతోపాటు పురావస్తు సంపదను గుర్తించి, వాటికి సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా సేకరించి, డాక్యుమెంట్ చేయడం అభినందనీయమన్నారు. గ్రామీణ వారసత్వ సంపదను పరిరక్షించడంతో పాటు, దాని ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసేందుకు ఇలాంటి ప్రచురణలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మోనోగ్రాఫ్ రూపకల్పనలో కృషి చేసిన జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారులు, సిబ్బందిని జిల్లా కలెక్టర్ అభినందించారు. -
నేడు తుమ్మలగుంటలో గరుడోత్సవం
తిరుపతి రూరల్: తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి గరుడోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. వైఖానస ఆగమోక్తంగా విశేష అలంకరణలతో గరుడోత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. శనివారం రాత్రి 7 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు స్వామివారు గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. తిరుమలలో గరుడసేవను దర్శించలేని శ్రీవారి భక్తులు తుమ్మలగుంటకు విచ్చేసి గరుడ వాహన సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఏర్పాట్లుపై చెవిరెడ్డి ఆలయ అధికారులు, గ్రామ పెద్దలతో సమీక్షించారు. సమావేశంలో తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డితో పాటు ఉత్సవ నిర్వాహకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. రెండో విడత డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, టీటీడీ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు ఓఏఎమ్‌డీసీ శుక్రవారం నుంచి ఈనెల 21 వతేదీ సోమవారం వరకు విద్యార్థులు రిజి స్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈనెల 20 నుంచి 24వ తేదీవరకు ఆన్లైన్ ధ్రువపత్రాల వెరిఫికేషన్, 21 వతేది నుంచి 23 వరకు వెబ్ ఆప్షన్లు, 24న ఆప్షన్ల మార్పునకు అవకాశం కల్పించి, 27వ తేదీన రెండో విడతలో సీట్లు పొందిన విద్యార్థుల మెరిట్ జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలలో 28వ తేదీ నుంచి 30వ తేదీ లోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 21న డీఫార్మసీ స్పాట్ అడ్మిషన్లు తిరుపతి సిటీ: ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల కాల వ్యవధితో కూడిన డీఫార్మసీ కోర్సులో మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం సోమవారం స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఉత్తీర్ణులైన ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియకు హాజరుకానున్న అభ్యర్థులు ఒరిజనల్ ధ్రువపత్రాలతో ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉదయం 10గంటలకు హాజరుకావాల్సి ఉంటుందని తెలిపారు. -
సేవా ‘కీర్తన’!
సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి శుక్రవారం చివరి తేదీ కావడంతో తిరుపతి అర్బన్‌కు చెందిన ఎడ్యుకేషన్ డేటా ఎంట్రీ సెక్రటరీ కీర్తనబాబు ఆస్పత్రిలో డయాలసిస్ చేసుకుంటూనే విధులు నిర్వహించారు. తిరుపతిలోని మధురానగర్ సచివాలయం పరిధిలో పనిచేస్తున్న ఆయన వారానికి రెండుసార్లు ఆస్పత్రికి వెళ్లి డయాలసిస్ చేసుకుంటున్న తరుణంలో శుక్రవారం డయాలసిస్‌కు వెళ్లాల్సి వచ్చింది. దీంతో తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మొబైల్ ద్వారా పింఛన్ల దరఖాస్తుల సమాచారాన్ని సేకరిస్తూ.. కంప్యూటర్లో నమోదు చేశారు. – తిరుపతి అర్బన్ -
రాజమన్నార్ రాజసం.. సర్వభూపాల తేజసం
తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజైన శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకరణలో కల్యాణ వెంకన్న భక్తులను కటాక్షించారు. రాత్రి ఉభయదేవేరులతో కలిసి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి సర్వభూపాల వాహనంపై సర్వభూపాలునిగా పురవీధుల్లో విహరిస్తూ కనువిందు చేశారు. కల్పవృక్ష వాహన సేవకు తిరుపతి రూరల్ మండలం అవిలాల, గాంధీపురం, సాయినగర్, లింగేశ్వరనగర్, వెంకటపతినగర్, పేరూరు పంచాయతీలకు చెందిన భక్తులు సారెను సమర్పించారు. అలాగే రాత్రి జరిగిన సర్వభూపాల వాహనంకు చిన్నగొట్టిగల్లు మడలానికి చెందిన చిన్నగొట్టిగల్లు, జంగావాండ్లపల్లి, రంగన్నగారిగడ్డ, కోటబైలు, భాకరాపేట, దేవర కొండ, దీన్దార్లపల్లి, చిట్టేచర్ల, చట్టేవారిపాలెం, తిప్పిరెడ్డిగారిపల్లి, దిగవూరు, ఎగవూరు, నెల్లుట్ల వారిపల్లి గ్రామాలకు చెందిన భక్తులు సారె తీసుకువచ్చారు. అలాగే ఇస్కాన్ అధ్యక్షులు రేవతిరమణదాస్, వారి శిష్య బృందం ఆలయం వద్దకు చేరుకుని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ వ్యవస్థాపకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి సాదరస్వాగతం పలికారు. – తిరుపతి రూరల్ -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
రేణిగుంట: మండలంలోని పుత్తూరు–రేణిగుంట రహదారి కాటన్ మిల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంజయ్ అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. గురువారం రాత్రి రేణిగుంట పంచాయతీలోని నేతాజీ కాలనీకి చెందిన సంజయ్ (17) ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కాటన్ మిల్లు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి అడ్డురావడంతో అతడిని తప్పించబోయి అదుపుతప్పి కింద పడ్డాడు. తలకి తీవ్ర గాయమైంది. స్థానికులు సమీపంలోని ప్రయివేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సంజయ్ మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గాజులమండ్యం పోలీసులు తెలిపారు. ఆర్డీఎస్ఎస్ పనులు వేగవంతం చేయండి తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో ఆర్డీఎస్ఎస్ (పునర్వ్యవస్థీకరణ విద్యుత్ పంపిణీ పథకం) కింద చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి ఆదేశించారు. శుక్రవారం కార్పొరేట్ కార్యాలయం నుంచి అధికారులు, కాంట్రాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనుల పురోగతిని సమీక్షించారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ, మౌలిక వసతుల బలోపేతం, విద్యుత్ నష్టాల నియంత్రణ, వినియోగదారులకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా లక్ష్యంగా చేపట్టిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో డైరెక్టర్ పి.అయూబ్ ఖాన్న్తో పాటు సీఎజీఎంలు, జీఎంలు, తొమ్మిది జిల్లాల ఎస్ఈలు, ఈఈలు, ఆర్డీఎస్ఎస్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. వైభవంగా మహాలక్ష్మియాగం నారాయణవనం: మండలంలోని సిద్ధార్థ కళాశాలలో తొమ్మిది రోజుల పాటు నిర్వహించనున్న నవాహ్ని హోమ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం మహాలక్ష్మి యాగాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే సాయంత్రం లక్ష కుంకుమార్చన, ఆధ్యాత్మిక ప్రవచనాలు వైభవంగా జరిగాయి. ఉదయం 8.30 గంటలకు కళాశాల చైర్మన్ అశోక్‌రాజు దంపతుల ఆధ్వర్యంలో ఆగమ వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ మహాలక్ష్మి యాగం, లక్ష కుంకుమార్చన పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 4 నుంచి రెండు గంటల పాటు ‘యజ్ఞఫలం – లోకక్షేమం’ అంశంపై డాక్టర్ శేషచార్యులు ప్రవచించారు. అనంతరం మహాలక్ష్మి అమ్మవారి పల్లకీ సేవను నిర్వహించారు. అశోక్‌రాజు మాట్లాడుతూ మహాలక్ష్మి యాగంతో ప్రజలందరికీ ధార్మిక, ఆర్థిక, సాంస్కృతిక, జ్ఞాన, విజ్ఞాన, సిరిసంపదలు చేకూరుతాయన్నారు. వరకట్నం కేసులో ఇద్దరికి మూడేళ్ల జైలు డక్కిలి: వరకట్నం కేసులో భర్త, అత్తకు మూడేళ్ల జైలుశిక్ష, ఒక్కొక్కరికీ రూ.15వేలు జరిమానా విధిస్తూ వెంకటగిరి జూనియర్ సివిల్‌జడ్జి న్యాయమూర్తి విష్ణువర్మ శుక్రవారం తీర్పునిచ్చారు. వివరాలు.. డక్కిలి మండలంలోని మిట్టపాళెం గ్రామానికి చెందిన రంగినేని మంజులను 13 ఏళ్ల క్రితం నెల్లూరు బీవీ నగర్‌కు చెందిన రంగినేని ప్రదీప్‌రెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు. కొన్ని సంవత్సారాల నుంచి మంజులను భర్త, అత్త మనసికంగా, శారీరకంగా వేధించేవారు. దీనిపై 2018లో డక్కిలి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. అప్పటి ఎస్ఐ మరిదినాయుడు గృహ హింస, వరకట్నం వేధింపుల కింద కేసు నమోదు చేశారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన పిదప తల్లి, కుమారుడికి జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. బాధితురాలి తరఫున ఏపీపీ వీ.రోహిత్ వాదనలు వినిపించారు. -
అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి అర్బన్: జిల్లా వ్యాప్తంగా 12 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 32 అంగన్వాడీ వర్కర్లు, 166 అంగన్వాడీ హెల్పర్ల పోస్టులు భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ వసంతబాయి తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 21 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు మీ పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టులో అందజేయాలని సూచించారు. పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలని చెప్పారు. 01.07.2026 నాటికి 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు అర్హులని తెలిపారు. స్థానిక వివాహితులు అర్హులని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 10వ తరగతి ఉత్తీర్ణత లేకుంటే 8వ తరగతి వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. నాయుడుపేట, సూళ్లురుపేట, సత్యవేడు, కోట, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, పిచ్చాటూరు, చంద్రగిరి, పుత్తూరు, రైలేకోడూరు, చిట్వేలి మండలాల పరిధిలో ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. గరుడ సేవకు కట్టుదిట్టమైన భద్రత తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడసేవకు తిరుమల సిద్ధమైంది. గరుడ వాహనంపై కొలువుదీరే శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. దాదాపు రెండు లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉండే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తోంది. గరుడ వాహన సేవను రాత్రి 6.30 గంటలకు ప్రారంభించనున్నట్టు అదనపు ఈఓ వెంకయ్య చౌదరి తెలిపారు. 1,200 మంది పోలీసులతో అదనపు భద్రత బ్రహ్మోత్సవాల భద్రతను జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ పర్యవేక్షిస్తున్నారు. టీటీడీ నిఘా, భద్రతా సిబ్బంది సుమారు 1,130 మందితోపాటు 3,600 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. గరుడసేవకు ప్రత్యేకంగా మరో 1,200 మంది పోలీసులతో అదనపు భద్రత కల్పించారు. 2,770 సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించనున్నారు. శుక్రవారం సాయంత్రం 6 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఘాట్‌రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను రద్దు చేశారు. విశేష విహారం కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మో త్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉత్సవాల్లో భాగంగా స్వామివారు ఉదయం బంగారు చిన్న శేష వాహనంపై ఊరేగారు. రాత్రి ఉభయకర్తల ఆధ్వర్యంలో బంగారు పెద్ద శేష వాహనంపై వినాయకస్వామిని కొలువుదీర్చి గ్రామోత్సవం జరిపించారు. -
రాజమన్నార్ కటాక్షం.. గజేంద్ర మోక్షం!
సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకరణలో మలయప్పతిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజు శుక్రవారం రాత్రి స్వామివారు సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకరణలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఉదయం కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకరణలో అభయమిచ్చారు. వాహన సేవల ముందు కళాబృందాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శనివారం రాత్రి స్వామివారు తనకిష్టమైన గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. – తిరుమల -
టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలపై.. బాబు పచ్చి అబద్ధాలు
తిరుపతి మంగళం : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు శ్రీవారి సన్నిధిలో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది తానేనని పచ్చి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా, తాను టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడే టీటీడీ ఉద్యోగులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సంకల్పించినట్టు గుర్తుచేశారు. ఆయన అకాల మరణం చెందడం, కోర్టు వ్యాజ్యాలతో ఆ కార్యాచరణను పూర్తి చేయలేకపోయామన్నారు. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, తాను శాసనసభ్యుడిగా, టీటీడీ అధ్యక్షుడిగా ఉండి టీటీడీ ఉద్యోగుల ఇళ్ల పట్టాల కల నెరవేర్చాలా చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. 12 ఎకరాలు యుద్ధప్రాతిపదికన సమీకరించి 2023లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదగా టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు అందించామన్నారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో టీటీడీ ఉద్యోగులకు ఆ తర్వాత చేయాల్సిన పనులన్నీ నిలిచిపోయాయన్నారు. 17 సంవత్సరాలు పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏనాడైనా టీటీడీ ఉద్యోగుల బాగు కోరుకున్నారా? అని ప్రశ్నించారు. 1989లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న మర్రి చెన్నారెడ్డి తిరుపతి బైరాగిపట్టెడలో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని, ఆ తర్వాత టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల సంకల్పం వైఎస్ రాజశేఖరరెడ్డిదైతే ఆ కార్యాచరణను పూర్తిచేసిన ఘనత జగనన్నదని పేర్కొన్నారు. టీటీడీలో శాశ్వత ఉద్యోగులు ఉండకూడదా?. శాశ్వతంగా చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోవచ్చు కానీ, టీటీడీలో శాశ్వత ఉద్యోగులు ఉండకూడదా? అని భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. శ్రీవారి సేవకులతో సేవ చేయించుకుంటే సరిపోదా అని చంద్రబాబు మాట్లాడిన మాటలు బాధాకరమన్నారు. చంద్రబాబు జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటారు కానీ టీటీడీ ఉద్యోగులు మాత్రం సేవకులుగా పనిచేయాలా..? అని భూమన ప్రశ్నించారు. జగనన్న అధికారంలోకి రాగానే టీటీడీలో ఖాళీగా ఉన్న 7వేల పోస్టులను భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అందులో స్థానికులకు 75శాతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో ఓట్లు కోసం టీటీడీ ఉద్యోగులకు చంద్రబాబు పట్టాలు ఇచ్చినట్లుగా పచ్చి అపద్ధాలు చెబుతున్నారని భూమన మండిపడ్డారు. -
స్వచ్ఛతా ప్రతిజ్ఞ
ఏర్పేడు: స్వచ్ఛతా హి సేవా 2026 ప్రచారంలో భాగంగా శుక్రవారం ఏర్పేడు మండలం, జంగాలపల్లి సమీపంలోని తిరుపతి ఐసర్‌లో విద్యార్థులచేత స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యం, బాధ్యతాయుతమైన పౌర భాగస్వామ్యం పట్ల తమ నిబద్ధతను ధృవీకరిస్తూ తిరుపతి ఐసర్ రిజిస్ట్రార్ (ఇన్చార్జ్) లెఫ్టినెంట్ కమాండర్ కుమార్ హిమాంశు శేఖర్ (రిటైర్డ్), జాయింట్ రిజిస్ట్రార్ రమేష్ విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగింది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. గురువారం అర్ధరాత్రి వరకు 68,265 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 26,959 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ద్వారా రూ.4.16 కోట్ల కానుకలు లభించాయి. టైమ్‌స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లో దర్శనం చేసుకోగలుగుతున్నారు. -
రేణిగుంట రైల్వేస్టేషన్లో వ్యక్తి హల్చల్
రేణిగుంట: రేణిగుంట రైల్వే స్టేషన్లో పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి విద్యుత్ వైర్లు పట్టుకునేందుకు ప్రయత్నించి హల్చల్ సృష్టించాడు. అతికష్టం మీద రైల్వే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని తిరుపతి రుయా హాస్పిటల్‌లోని మానసిక వైద్యశాలకు తరలించారు. స్థానికుల కథనం.. పశ్చిమబెంగాల్‌కు చెందిన ప్రకాష్‌రాయ్ (35) కేరళలో వంట మాస్టర్. సొంత ఊరికి వెళ్లేందుకు కేరళ నుంచి కేరళ ఎక్స్‌ప్రెస్‌లో వస్తుండగా శుక్రవారం ఉదయం రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలో జనరల్ బోగీలో అతడికి మిగిలిన ప్రయాణికులకు గొడవ జరిగినట్లు సమాచారం. రైల్వే స్టేషన్లో అతడిపై పోలీసులకు సమాచారం ఇస్తారేమోనని ముందుగానే రైలు దిగి స్టేషన్‌లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైకి ఎక్కి అక్కడి నుంచి విద్యుత్ లైన్లు పట్టుకుంటానని బెదిరించాడు. అధికారులు స్పందించి విద్యుత్ సరఫరాను నిలుపుదల చేశారు. బ్రిడ్జ్ పైనుంచి వేలాడుతూ రైలు పైకి దూకి పరుగులు తీయగా స్థానికుల సహాయంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి వెళ్లే రైళ్లన్నీ దాదాపు గంటకు పైగా ఆలస్యంగా నడిచాయి. ఎంతటి పోలీసులకు అతడి వివరాలు తెలపకపోవడంతో అతడి వద్ద ఉన్న సిమ్ కార్డ్ ఆధారంగా అతడు వివరాలను పోలీసులు సేకరించారు. మతిస్థిమితం సరిగ్గా లేని కారణంగా అతడిని తిరుపతి రుయా హాస్పిటల్‌లోని మానసిక వైద్య విభాగంలో చేర్పించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. -
మత్తు పదార్థాలు తరలిస్తున్న ముగ్గురి అరెస్టు
తిరుత్తణి: ఆంధ్రా నుంచి కాంచీపురానికి ప్రయివేటు బస్సులో నిషేధిత మత్తు పదార్థాలు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను తిరుత్తణి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తిరుత్తణి సమీపంలోని చైన్నె – తిరుపతి జాతీయ రహదారిలోని పొన్పాడి చెక్ పోస్టు వద్ద గురువారం రాత్రి పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రాలోని నగరి నుంచి తిరుత్తణి మార్గంలో కాంచీపురం వెళుతున్న ప్రయివేటు బస్సులో నిషేధిత గుట్కా, పొగాకు ప్యాకెట్లు ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు కారణమైన ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఇన్స్పెక్టర్ శివకుమార్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చైన్నెకి చెందిన శరవనన్(47), అరక్కోణంకు చెందిన కమల్‌రాజ్(42), తిరువణ్ణామలైకు చెందిన రామమూర్తి(35) ఆంధ్రాలోని తిరుపతిలో మత్తు పదార్థాలు కొనుగోలు చేసి కాంచీపురం తరలిస్తున్నట్లు తేలింది. వారిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. -
కలెక్టర్ విస్తృత పర్యటన
రామచంద్రాపురం: మండలంలో శుక్రవారం కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ విస్తృతంగా పర్యటించారు. ఉపాధి హామీ పనులతో పాటు, భూముల రీ–సర్వే ప్రక్రియను ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మండలంలోని కమ్మపల్లి గ్రామ పంచాయతీలో జరుగుతున్న నీటి కుంటలు, వ్యవసాయ కుంట నిర్మాణ పనులను డ్వామా పీడీ మద్దిలేటి, సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలకు ఏడాదిగా లభించిన పని దినాలు, రోజువారీ సగటు వేతనం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కమ్మపల్లి పంచాయతీలో రీ–సర్వే తరువాత తలెత్తిన భూ అభ్యంతరాలు, సర్వే నంబర్లలోని వ్యత్యాసాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, అడంగల్ తదితర రికార్డులను రెవెన్యూ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ మధుసూదన్, ఎంపీడీవో పులి రాంసింగ్, మండల స్వర్ణ గ్రామ అధికారి తేజోవతి, ఏపీవోలు, వీఆర్వోలు, సర్వేయర్లు పాల్గొన్నారు. -
లక్ష్యం చేరే వరకు శ్రమించండి
తిరుపతి సిటీ: స్థానిక కరకంబాడి రోడ్డులోని ఎస్వీసీఈ కళాశాల యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్ సెల్, ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు డ్రీమ్స్ టు డీడ్స్ ప్రేరణాత్మక సదస్సు నిర్వహించారు. శుక్రవారం కళాశాలలో నిర్వహించిన ఈ సదస్సుకు హైదరాబాద్‌కు చెందిన రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి భోదమయానందజీ మహారాజ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల నుద్దేశించి ప్రసంగించారు. కృషి, పట్టుదల, క్రమశిక్షణతో విద్యార్థులు తమ కలలను సాకరం చేసుకునేందుకు శ్రమించాలని సూచించారు. స్వామి వివేకానంద బోధించిన లేవండి మేల్కొనండి లక్ష్యం చేరే వరకు శ్రమించండి అనే దివ్య మంత్రాన్ని విద్యార్థులు తమ జీవితంలో ప్రతి నిత్యం గుర్తించుకోవాలని సూచించారు. ఈ సదస్సులో ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం ఆఫీసర్ డాక్టర్ చంద్రయ్య, యూహెచ్వీ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ సుజన్‌కుమార్, అధ్యాపకులు, ప్రథమ సంవత్సంరంలో ప్రవేశాలు పొందిన బీటెక్ విద్యార్థులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్‌కు రెండు ప్రాజెక్టులు
తిరుపతి ఎడ్యుకేషన్ : జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ పోటీల్లో రెండు ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. రీజనల్ సైన్స్ సెంటర్, జిల్లా విద్యాశాఖ సంయుక్తంగా శుక్రవారం తిరుపతిలోని రీజనల్ సైన్స్ సెంటర్లో జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ పోటీలను నిర్వహించాయి. ఈ ఏడాది భారతదేశ ఇంధన శక్తి వనరుల సముదాయం 2027–అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై నిర్వహించిన పోటీలకు జిల్లా నుంచి 45 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. వీరు రూపొందించిన ప్రాజెక్టుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్, వ్యాసరచన ద్వారా వివరించారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన శ్రీకాళహస్తి బాలికోన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని ఎం.సిరి, గైడ్ టీచర్ పద్మజ మొదటి స్థానం సాధించగా, సూళూరుపేట జెడ్పీ హైస్కూల్ పదో తరగతి విద్యార్థిని బి.లక్ష్మీప్రసన్న దుర్గ, గైడ్ టీచర్ మంజుల ద్వితీయ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్‌కు ఎంపికయ్యారు. ఈ నెల చివరి వారం విజయవాడలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. మొదటి రెండు స్థానాలు సాధించిన విద్యార్థినీలను డీఈఓ కేవీఎన్.కుమార్, ఎస్ఎస్ ఏపీసీ ఎం.భరత్‌కుమార్‌రెడ్డి, సైన్స్ సెంటర్ డైరెక్టర్ శ్రీనివాస నెహ్రూలు అభినందించి సర్టిఫికెట్లు, బహుమతులను అందించారు. -
కలుజును అమ్మేశారు!
సాక్షి, టాస్క్‌ఫోర్స్: రేణిగుంట మండలం, వెంకటాపురం చెరువు కలుజు భూమిని అంతా కుమ్ముకై ్క ఓ ప్రైవేటు కళాశాలకు అమ్మేసినట్లు విశ్వసనీయ సమాచారం. చెరువు నీరు వెళ్లకుండా కళాశాల యాజమాన్యం కలుజుపై ప్రహరీ నిర్మాణానికి పూనుకుంది. కలుజు కాలువ అని తెలిసినా.. రెవెన్యూ అధికారులు నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నారు. తిరుపతి– కరకంబాడి మార్గంలోని వెంకటాపురం సర్వే నం.227లో 74 సెంట్ల కలుజు కాలువను టీడీపీ నేతలు ఓ ప్రైవేటు కళాశాలకు గుట్టుచప్పుడు కాకుండా విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కలుజు దురాక్రమణ విషయం పత్రికలు, మీడియాలో ప్రసారం కావడంతో కళాశాల యాజమాన్యం లబోదిబోమంటున్నట్లు తెలిసింది. టీడీపీ, కొందరు రెవెన్యూ అధికారులను నమ్మి కొనుగోలు చేస్తే ఇలా అయ్యిందేంటని అంటున్నారు. కలుజు కాలువను అక్రమంగా అమ్మడమే కాకుండా.. మరింత నగదు రాబట్టుకునేందుకు కొన్ని యూటూబ్ చానల్స్ వారిని కళాశాల యాజమాన్యం వద్దకు పంపి బ్లాక్మైయిల్ చేసినట్లు వెంకటాపురంలో ప్రచారం జరుగుతోంది. రూ.3 కోట్ల విలువచేసే కలుజు కాలువ విషయం వెలుగులోకి రావడంతో రెవెన్యూ అధికారులు తూతూమంత్రంగా పర్యటించి.. వాస్తవాలు తెలుసుకునేందుకు కమిటీని వేసినట్లు తెలిసింది. కలుజు కాలువ అని స్పష్టంగా రికార్డుల్లో ఉన్నా.. రెవెన్యూ అధికారులు కమిటీ వేసి నాన్చివేత ధోరణి అవలంభించడంపై స్థానికులు మండిపడుతున్నారు. కలుజు కాలువ ఇరిగేషన్కి సంబంధించింది అయినా.. సంబంధిత అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నిమజ్జనం వేళ కత్తితో దాడి
– యువకుడికి గాయాలు సైదాపురం : గణేష్ నిమజ్జనం వేళ ఇద్దరి మధ్య వివాదం జరగడంతో ఓ యువకుడు మరో యువకుడిని కత్తితో దాడి చేసి గాయపరిచిన ఘటన మండల కేంద్రమైన సైదాపురంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ దుర్గాప్రసాద్ కథనం.. మండల కేంద్రమైన సైదాపురం బస్టాండు సమీపంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద బుధవారం రాత్రి గణేష్ విగ్రహంతో ఊరేగింపుగా నిమజ్జనానికి బయలు దేరారు. ఆ సమయంలో యువకులు డ్యాన్స్‌లు వేస్తుండగా పలవారి వెంకి కాలును డేగా మహేష్ తొక్కాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. వెంకీ ఆగ్రహానికి గురై మహేష్‌పై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మహేష్ ప్రస్తుతం నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష అమీర్‌పేట (హైదరాబాద్): చేపల వ్యాపారి హత్య కేసులో నింధితుడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష, జరిమానా విధించింది. ఎస్ఆర్నగర్ ఇన్‌స్పెపెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏజీ కాలనీ సమీపంలోని వికాస్పురి కాలనీకి చెందిన చేపల వ్యాపారి పాంపరి రమేష్ (50) 2020 యూసుఫ్‌గూడ జవహర్‌నగర్‌లో హత్యకు గురయ్యాడు. ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం బోరబండ వెళ్తున్నానని రమేష్ ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. అదే రోజు రాత్రి 8.30 గంటల సమయంలో ఆయన స్నేహితుడైన సాయి ఫోన్ చేయగా, తాను స్నేహితుడి ఇంట్లోనే ఉన్నానని రమేష్ తెలిపాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో అనుమానం వచ్చిన కుమారుడు పాంపరి ప్రదీప్ 2వ తేదీన ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు 4వ తేదీన జవహర్‌నగర్‌లోని ఓ ఇంట్లో రమేష్ మృతదేహన్ని గుర్తించారు. కాళ్లను తాళ్లతో కట్టి, రెండు చేతులను నరికిన స్థితిలో మృతదేహం లభించింది. డబ్బుల కోసం హత్య తిరుపతి ఎస్.వి.నగర్‌కు చెందిన నిందితుడైన మూడే రాజునాయక్‌కు రమేష్‌తో గతంలో పరిచయం ఉంది. డబ్బుల కోసం రమేష్‌ను కిడ్నాప్ చేసి డిమాండ్ చేయాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా యూసుఫ్‌గూడలో ఇంటిని అద్దెకు తీసుకుని, రమేష్‌ను మద్యం తాగేందుకు అక్కడికి పిలిచాడు. మద్యంలో నిద్రమాత్రలు కలపడంతో రమేష్ స్పృహ కోల్పోయాడు. అనంతరం సుత్తితో తలపై కొట్టి హత్య చేశాడు. రమేష్ వద్ద ఉన్న బంగారు గొలుసు, ఉంగరం, ఏటీఎం కార్డు, సెల్ఫోన్లు తీసుకున్నాడు. మృతదేహాన్ని గదిలో ఉంచి తాళం వేసి వెళ్లిపోయాడు. రమేష్ కోడలి సెల్‌కు వాట్సాప్ సందేశాలు పంపి, కిడ్నాప్ చేశానని, విడిచిపెట్టాలంటే రూ.90 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు విచారణలో తేలింది. శాసీ్త్రయ ఆధారాలతో నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. నాంపల్లి నాలుగో అదనపు సెషన్స్ కోర్టులో నింధితుడిపై చార్జిషీట్ దాఖలు చేయగా జీవిత ఖైదుతో పాటు రూ.16 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి జె.విక్రమ్ తీర్పు వెలువరించారు. -
కొత్త ఉద్యోగాలు
‘శ్రీవారి దగ్గర సేవ చేయాలి.. ఉద్యోగం కాదు. కొత్తగా ఉద్యోగాలిస్తే.. వచ్చే ఆదాయం వారి జీతాలకే వెళ్తుంది. ఇప్పటికే 50 శాతం వరకు ఉద్యోగుల జీతాలకు ఖర్చు చేస్తున్నాం.’ అంటూ సీఎం చంద్రబాబు చేసిన వాఖ్యలపై నిరుద్యోగులు రగిలిపోతున్నారు. ఎన్నికల ముందు సవాలక్ష హామీలిచ్చి.. నిరుద్యోగ భృతి అంటూ మభ్యపెట్టి ఓట్లు దండుకుని అధికార పీఠం ఎక్కాక శాశ్వత ఉద్యోగులు వద్దన్న రీతిలో వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఉద్యోగులు, కార్మికులు, శ్రీవారి సేవకుల మధ్య విబేధాలు సృష్టించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని హితవు పలుకుతున్నారు. శాశ్వత ఉద్యోగాలకు చెక్ కొద్దిపాటి ఉద్యోగులను భర్తీ చేసి.. శ్రీవారి సేవకుల సేవల్ని ఉచితంగా వినియోగించుకునే విధానం అమలు చేయాలని సీఎం చెప్పడం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. ఇప్పటికే టీటీడీలో శ్రీవారి సేవకులతో అన్నదానం, క్యూలైన్ మేనేజ్మెంట్ వినియోగిస్తున్నారు. అన్నదానంలో కూరగాయలు తరగడం నుంచి, వడ్డించే వరకు శ్రీవారి సేవకులే విధులు నిర్వహిస్తున్నారు. మరో వైపు శ్రీవారి భక్తులకు గుండుకొట్టే కళ్యాణ కట్ట క్షురకుల్లో కూడా కేవలం పీస్ రేట్ కింద శ్రీవారి సేవకుల్ని వినియోగించుకుంటుఊ.. శాశ్వత ఉద్యోగాల భర్తీకి చెక్ పెట్టారు. రానున్న రోజుల్లో ఇదే విధానం అన్ని విభాగాల్లో అమలు చేసే దిశగా అడుగులు వేస్తే తమ పరిస్థితి ఏంటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. సాక్షి, టాస్క్‌ఫోర్స్: టీటీడీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. టీటీడీలో ఇకపై శాశ్వత ఉద్యోగాలు భర్తీ లేకుండా శ్రీవారి సేవకులతో భర్తీ చేసే విధానం అమలు చేస్తామని సీఎం వ్యాఖ్యానించడంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఆ వ్యాఖ్యలు ఉద్యోగులు, కార్మికులు, శ్రీవారి సేవకుల మధ్య భేదాభిప్రాయాలు సృష్టించే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నాయి. బాబొస్తే జాబు పోయినట్టేనా? బాబొస్తే జాబు వస్తుంది అంటూ 2014–19 ఎన్నికల్లో ఊదరగోట్టారు. బాబు వచ్చారు.. నిరుద్యోగ యువతకు జాబు రాలేదు. అలాగే 2024 ఎన్నికల్లో సంపద సృష్ట్టిస్తా, ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా.. అంటూ జబ్బలు చరిచారు. అంతవరకు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానంటూ కాకమ్మ కబుర్లు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టించడం పక్కనబెట్టి, దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయా..? అంటే అదీ లేదు. తాజాగా టీటీడీలో శాశ్వత ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులపై భారం పడుతోంది. దుమారం రేపిన సీఎం వ్యాఖ్యలు ‘తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వచ్చిన సీఎం చంద్రబాబునాయుడు బుధవారం టీటీడీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘శ్రీవారి దగ్గర సేవ చేయాలి. ఉద్యోగం కాదు. శ్రీవారి సేవకోసం వైద్య, విద్య సేవకులు ముందుకొస్తున్నారు. సత్యసాయి ట్రస్ట్‌లో భక్తులకు ఎలాగైతే సేవ చేస్తున్నారో అదేవిధానం తిరుమలలో మరింత పెంచేలా శ్రీవారి సేవకులకు శిక్షణ ఇచ్చి వారిని వినియోగించుకోవాలని. టీటీడీలో ఇప్పటికే దాదాపు 12 లక్షల మంది శ్రీవారి సేవకులుగా నమోదు చేసుకున్నారు. వీరిని ఆలయ సేవా కార్యక్రమాలకు అనుసంధానం చేస్తాం. వైద్యులను కూ డా శ్రీవారి సేవకులుగా అనుసంధానం చేసి టీటీడీ ఆస్పత్రుల్లో సేవలందించేలా చర్యలు చేపడుతాం’. అంటూ సీఎం స్థాయి వ్యక్తి వ్యాఖ్యలు చేయడం నిరుద్యోగులను తీవ్ర నిరాశలో పడేసింది.టీటీడీలో కొత్త ఉద్యోగాలకు గండి ఆ వ్యాఖ్యలు ఉప సంహరించుకోవాలి టీటీడీ ఉద్యోగులపై సీఎం చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. శ్రీవారి సేవకుల పేరుతో శాశ్వత ఉద్యోగాలను తగ్గించే ఆలోచన సరికాదు. తిరుమలలో శాశ్వత ఉద్యోగుల సంఖ్యను పరిమితం చేసి, పనులను శ్రీవారి సేవకులతో చేయించుకోవాలనే విధంగా సీఎం చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. భక్తులకు నిరంతరం సేవలందించే టీటీడీ ఉద్యోగులను తక్కువ చేసి మాట్లాడడం వారి మనోభావాలను గాయపరుస్తోంది. శ్రీవారి సేవకులు స్వచ్ఛందంగా అందిస్తున్న సేవలను గౌరవిస్తాం. అయితే, వారి సేవను శాశ్వత ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా చూపడం సరికాదు. పారిశుద్ధ్యం సహా తిరుమలలో రోజూ నిర్వహించాల్సిన పనులకు తగిన సంఖ్యలో ఉద్యోగులు, కార్మికులు అవసరం. ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, శ్రీవారి సేవకుల మధ్య పోటీ పెట్టే విధానాన్ని ప్రభుత్వం విడనాడాలి. 2025–26 బడ్జెట్లో జీతాలు, ఇతర సిబ్బంది చెల్లింపులకు కేటాయించిన మొత్తం సుమారు 34 శాతం. ఈ కేటాయింపులో జీతాలతో పాటు ఇతర సిబ్బంది చెల్లింపులూ ఉన్నాయి. దాన్నంతటినీ సాధారణ ఉద్యోగుల జీతంగా చూపడం సరైంది కాదు. వెంటనే ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. – కందారపు మురళి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు, తిరుపతి -
రాష్ట్ర గవర్నర్‌కు సాదర స్వాగతం
రేణిగుంట: తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు, తదితరులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ రోడ్డు మార్గాన తిరుపతికి బయల్దేరి వెళ్లారు. రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, సెట్విన్ సీఈఓ యస్వంత్, విమానాశ్రయ అధికారులు, తహసీల్దార్ శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు. ఓపెన్ వర్సిటీ స్టడీసెంటర్ కో–ర్డినేటర్గా కిరణ్‌కుమార్ తిరుపతి సిటీ: ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రం కో–ఆర్డినేటర్‌గా డాక్టర్ ఎం.కిరణ్‌కుమార్‌రాజు నియమితులయ్యారు. గతంలో ఉన్న డాక్టర్ జీ. కిషన్ ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్‌గా నియామకం కావడంతో ఆయన స్థానంలో డాక్టర్ కిరణ్‌కుమార్ రాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రాన్ని అందరి సహకారాలతో మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కిషన్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వై మల్లికార్జునరావు, డాక్టర్ ఎం.ప్రసాద్‌రావు, అధ్యాపకులు, సిబ్బంది ఆయనను ఘనంగా సత్కిరంచారు. పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్ నాయుడుపేట టౌన్ : పోక్సో కేసులో నిందితుడుగా ఉన్న మండల పరిధిలోని మేనకూరు గ్రామానికి చెందిన కందాటి నజీర్‌ను అరెస్టు చేసి గురువారం కోర్టులో హాజరు పరిచినట్టు నాయుడుపేట అర్బన్ సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. పోక్సో కేసు దర్యాప్తు చేస్తున్న నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు సారథ్యంలో నజీర్‌ను పట్టణ పరిధిలోని శివాలయం సమీపంలో అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఏడేళ్ల చిన్నారులపై లైంగిక దాడి జరిపిన ఘటనపై నజీర్పై పోక్సో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందె. గురువారం కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించినట్టు సీఐ పేర్కొన్నారు. బీవీపాళెంలో పర్యటన తడ: మండలంలోని బీవీపాళెం, సూళ్లూరుపేట మండలం అటకానితిప్ప, దొరవారిసత్రం మండలం నేలపట్టు గ్రామాల్లోని టూరిజం కేంద్రాలను రాష్ట్ర టూరిజం శాఖ కార్యదర్శి, ఐఏఎస్ అధికారి ఎస్ఎస్ రావత్ గురువారం పర్యటించారు. ఈ ప్రాంతాల్లో నెలకొల్పిన టూరిజం రిసార్టులు, టూరిస్టుల కోసం ఏర్పాటు చేసిన వసతులు కొనసాగుతున్న తీరును ఆయన పరిశీలించారు. ఆయన వెంట టూరిజం శాఖ ఎండీ తదితరులు ఉన్నారు. పిచ్చి కుక్క బీభత్సం – 13 మందిని కరిచిన శునకం నాగలాపురం: నాగలాపురం పట్టణంలోని ఈస్ట్ దళితవాడలో గురువారం ఉదయం ఓ పిచ్చి కుక్క బీభత్సం సృష్టంచింది. వీధుల్లో తిరుగుతూ ఏకంగా 13 మందిని కరిచింది. కుక్క కాటుకు గురైన బాధితులు నాగలాపురం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందారు. ఒకే ప్రాంతంలో వరుసగా పలువురిని కుక్క కరవడంతో స్థానికులు ఆందోళనలో పడ్డారు. అప్పు ఇవ్వలేదని..! – వివాహిత ఆత్మహత్యాయత్నం వరదయ్యపాలెం: ఇచ్చిన అప్పు వసూలు కాక మనస్తాపానికి గురైన ఓ వివాహిత పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వరదయ్యపాలెం మండలంలో గురువారం వెలుగు చూసింది. మండలంలోని సీఎల్ఎన్పల్లెకు చెందిన మౌనిక, ప్రవీణ్ దంపతులు ప్రస్తుతం వరదయ్యపాళెం ప్రకాశం వీధిలో నివాసం ఉంటున్నారు. కొంతకాలం క్రితం పట్టణంలోని బీసీ కాలనీ, బలిజపాలెం విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలోని రియల్ ఎస్టేట్ భూమి వ్యవహారంలో స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి, రాజకీయ నాయకుడికి రూ.40 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు బాధితురాలు తెలిపింది. అయితే ఆ భూమి వివాదంలో చిక్కుకోవడంతో అప్పు తిరిగి చెల్లించడం లేదని ఆరోపిస్తున్నారు. పలుమార్లు ఇంటి చుట్టూ తిరిగినా రాజకీయ, అధికార బలంతో బెదిరిస్తున్నారని బాధితురాలు వాపోయింది. గతంలో పోలీస్ స్టేషన్లో పంచాయితీ జరిగి గడువు ఇచ్చినా అమలు కాలేదని పేర్కొంది. దీంతో మనస్తాపానికి గురై గురువారం ఇంట్లోనే పురుగుమందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
ముత్యపు పందిరిలో మురిపాల రేడు
సింహ వాహనంపై యోగనరసింహుని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న కల్యాణ వేంకటేశ్వరుడు తుమ్మలగుంటలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు మంగళవారం రాత్రి దేవేరులతో కలిసి శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు ముత్యపు పందిరి వాహనంపై బాలకృష్ణుడి అవతారంలో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం స్వామివారు యోగ నరసింహుని అవతారంలో సింహ వాహనంపై కొలువుదీరి భక్తులను కటాక్షించారు. తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి సైతం యువకులతో కలిసి వాహనాన్ని మోశారు. సింహ వాహన సేవకు తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు, ముండ్లపూడి, బ్రాహ్మణపట్టు, పాడిపే ట ప్రాంతాల నుంచి భక్తులు సారెను తీసుకొచ్చి స్వామి వారికి సమర్పించారు. రాత్రి ముత్యపు పందిరి వాహన సేవకు ఎర్రావారిపాళెం మండలంలోని ఎర్రావారిపాళెం, చెరుకువారిపల్లి, యల్లమంద, ఉదయమాణిక్యం, ఉస్తికాయలపెంట, కోటకాడపల్లి, యల్లమంద, బోడేవాండ్లపల్లి, వీఆర్ అగ్రహారం, నెరబైలు, చింతగుంట, కూరపర్తివారిపల్లి, చెరకువారిపల్లికి చెందిన భక్తులు వస్త్రాలు తీసుకువచ్చి సమర్పించారు. వాహనసేవల్లో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మి దంపతులు, ఈవో సుబ్రమణ్యంరెడ్డి పాల్గొన్నారు. – తిరుపతి రూరల్ -
సైన్స్ సెమినార్లో విద్యార్థుల ప్రతిభ
కేవీబీపురం: జాతీయ సైన్స్ సెమినార్–2026లో కేవీబీపురం మండల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్, తిరుపతి జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్ ఆదేశాల మేరకు కేవీబీపురం మండల విద్యాశాఖ అధికారి రవికుమార్ ఆధ్వర్యంలో కేవీబీపురం ఉన్నత పాఠశాల వేదికగా గురువారం మండల స్థాయి సైన్స్ సెమినార్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో కేవీబీపురం ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి ప్రజ్వల్రాజు ప్రథమ బహుమతి సాధించగా, అదే పాఠశాలకు చెందిన విద్యార్థిని ఎన్.యాన్సీమేరీ ద్వితీయ బహుమతి సాధించింది. ఇద్దరు విద్యార్థులు తమ ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. హెచ్ఎం కూనాటి సురేష్, సైన్స్ ఉపాధ్యాయులు సత్య, సుబ్రహ్మణ్యం, ప్రకాష్, విజయ, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులు జిల్లా స్థాయి జాతీయ సైన్‌న్స్ సెమినార్–2026లో పోటీల్లో పాల్గొననున్నట్టు ఎంఈఓ తెలిపారు. -
సింహ వాహనంపై యోగనరసింహుడి రూపంలో మలయప్ప
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజు గురువారం రాత్రి మలయప్ప స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై శ్రీమన్నారాయణుడి అలంకరణలో తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఉదయం సింహ వాహనాన్ని అధిష్టించి యోగనరసింహుడి రూపంలో కనువిందు చేశారు. వాహన సేవల ముందు కళాబృందాల ప్రదర్శన ఆకట్టుకుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనాన్ని అధిరోహించి మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు. – తిరుమల -
బిల్ కలెక్టర్లకు బిగ్ రిలీఫ్
● తొలగింపులు ఉండవు.. అందరినీ కొనసాగిస్తాం తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న 134 మంది బిల్ కలెక్టర్లకు భారీ ఊరట లభించింది. ఉద్యోగం నుంచి ఎవ్వరినీ తొలగించబోమని, అందరినీ కొనసాగిస్తామని ఆ సంస్థ సీఎండీ శివశంకర్ హామీ ఇచ్చారు. బిల్ కలెక్టర్లను కొనసాగించడంతో పాటు ప్రత్యామ్నాయ విధులపై నవంబర్1వ తేదీన జరిగే చర్చలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గతంలో జారీ చేసిన తొలగింపు ఉత్తర్వులను ఉపసంహరించుకుంటామని స్పష్టం చేశారు. దీంతో తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట 31 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలను బిల్ కలెక్టర్లు విరమించారు. చర్చల అనంతరం సంస్థ డైరెక్టర్ గురవయ్య, సీజీఎంలు మురళి, రామచంద్రయ్య, ప్రసాద్ తదితర అధికారులు దీక్షా శిబిరానికి చేరుకుని యాజమాన్యం నిర్ణయాన్ని వివరించారు. అనంతరం డైరెక్టర్ గురవయ్య నిమ్మరసం ఇచ్చి బిల్ కలెక్టర్ల దీక్షలను విరమింపజేశారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి, ఏపీ బిల్ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణతోపాటు తొమ్మిది జిల్లాలకు చెందిన బిల్ కలెక్టర్లు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
స్విమ్స్‌లో అరుదైన శస్త్ర చికిత్స
తిరుపతి తుడా: స్విమ్స్‌లో టీటీడీ ప్రాణదాన పథకం కింద పేద రోగికి ఉచితంగా లక్షల విలువ చేసే అరుదైన శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తిచేశారు. ప్రకాశం జిల్లా, కోమరోలు మండలం, మాధవపల్లి చెందిన రోగి ఎం.తిరుమలేశ్వర్‌రెడ్డి (25) గతనెలలో స్విమ్స్‌లో న్యూరో సర్జరీ విభాగంలో అడ్మిషన్ పొందారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి, సర్జరీ అవసరమని నిర్ణయించి ప్రాణదాన పథకం కింద విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ స్విమ్స్‌లో వైద్యసేవ అంటే కేవలం వ్యాధికి చికిత్స చేయడం మాత్రమే కాదని, ఆపదలో ఉన్న రోగికి, అతని కుటుంబానికి భరోసాగా నిలవడం కూడా తమ బాధ్యతన్నారు. -
గరుడ సేవకు పటిష్ట భద్రత
తిరుపతి అర్బన్: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవ (ఈనెల 19వ తేది శనివారం) సందర్భంగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టనున్నట్టు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ జిల్లా అధికార యంత్రాంగంతోపాటు ప్రధానంగా టీటీడీ, విజిలెన్స్ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ భద్రతా చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రైవేటు వాహనాల పైన ఆంక్షలు విధిస్తున్నామని, భక్తులకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సులు, టీటీడీ వాహనాల ద్వారా తిరుమలకు చేరుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదు ఈనెల 18వ తేదీ రాత్రి 9 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనాలకు బాలాజీ లింక్ బస్తాండ్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, ఎస్వీ మెడికల్ కాలేజీ గ్రౌండ్, ఇస్కాన్ గ్రౌండ్, వద్ద పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఆర్టీసీ బస్సుల మళ్లింపు -
దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి ఎడ్యుకేషన్ : నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ కేవీఎన్.కుమార్ తెలిపారు. నవంబర్ 15న నిర్వహించే ఈ పరీక్షకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 8వ తరగతి చదువుతూ వార్షిక కుటుంబ ఆదాయం రూ.3.5 లక్షల లోపున్న విద్యార్థులు అర్హులని తెలిపారు. ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఇన్’ వెబ్సైట్ ద్వారా అక్టోబర్ 12వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, అలాగే దరఖాస్తు రుసుమును ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 అక్టోబర్ 13వ తేదీలోపు ఎస్బీఐ కలెక్ట్ లింకు ద్వారా చెల్లించాలని పేర్కొన్నారు. నామినల్ రోల్‌ను సంబంధిత ప్రధానోపాధ్యాయులు ధృవీకరించి, ఆ ధృవపత్రాలను డీఈఓ కార్యాలయంలో అక్టోబర్ 14వ తేదీలోపు అందజేయాలని ఆయన సూచించారు. రెండు బస్సులు ఢీ – తప్పిన పెను ప్రమాదం తడ: జాతీయ రహదారిపై రెండు బస్సులు ఢీకొన్న ఘటన మండలంలోని కొండూరు గ్రామం వద్ద గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. టైర్ పంక్చర్ కావడంతో పరిశ్రమలకు కార్మికులను తరలించే బస్సు ఓ లారీ పక్కన రోడ్డుపై నిలిచిపోయింది. అదే సమయంలో తమిళనాడుకు ప్రయాణికులతో వెళుతున్న ట్రావెల్స్ బస్సు దాన్ని అంచనా వేయలేక కార్మికుల బస్సును ఢీకొట్టింది. ట్రావెల్స్ బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. -
ఇదేంది డ్రైవరన్నో?
నాగలాపురం: డ్యూటీలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ తన వ్యక్తిగత సమస్యపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ఏకంగా ప్రయాణికులను స్టేషన్ వద్దకు తీసుకొచ్చిన ఘటన నాగలాపురంలో చోటు చేసుకుంది. పిచ్చాటూరు మండలం, రామగిరి గ్రామానికి చెందిన వికేష్నాయుడు తిరుమల డిపోకు చెందిన చైన్నె–తిరుమల ఎక్స్‌ప్రెస్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం డ్యూటీలో ఉన్న సమయంలో తన వ్యక్తిగత సమస్యకు సంబంధించి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు బస్సులో ప్రయాణికులని తిరుమల నుంచి ఎక్కించుకొని నాగలాపురం పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు ఇచ్చి వెళ్లాడు. బస్సులో ఉన్న ప్రయాణికులు కొంతసేపు పోలీసు స్టేషన్ వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. డ్యూటీ సమయంలో వ్యక్తిగత సమస్య పరిష్కారం కోసం పోలీసు స్టేషన్‌కు రావడం వల్ల కొందరు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. -
ఘనంగా ఆయుష్య హోమాలు, కోటి దీపోత్సవం
నారాయణవనం : స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో తొమ్మిది రోజుల పాటు తలపెట్టిన నవాహ్నిక హోమ కార్యక్రమంలో భాగంగా గురువారం హోమాలు, ధార్మికోపన్యాసం, సాయంత్రం దీపోత్సవం, వేణుగోపాలస్వామి ఊరేగింపు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. చైర్మన్ అశోకరాజు ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోదీ పేరున ఉదయం ఆయుష్య హోమం, మృత్యుంజయ హోమం లక్ష తులసి అర్చనలను నిర్వహించారు. సాయంత్రం ప్రవచనకర్త కుప్పా విశ్వనాథ శాస్త్రిచే ‘ధర్మము – పునరవలోకనం‘ ప్రవసచనం కొనసాగింది. సాయంత్రం హోమ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరై శ్రీకృష్ణ వేణుగోపాలస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించి, గోపూజ నిర్వహించారు. దీపో త్సవం అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి (వేణుగోపాల అలంకారంలో) పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్, అశోకరాజు మాట్లాడుతూ 25 ఏళ్ల సూదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా పనిచేస్తున్న నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం విశ్వగురు స్థానానికి చేరుకుంటుందన్నారు. ఆధ్యాత్మిక వేడుకల్లో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, భక్తులు పాల్గొని స్వామివారి దివ్యాశీస్సులు అందుకున్నారు. -
ఎస్వీయూలో జాబ్‌మేళా రేపు
తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో శనివారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టీ.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. పేరొందిన ఎమ్ఎన్సీ కంపెనీ ప్రతినిధులు జాబ్‌మేళాలో పాల్గొని సుమారు 500 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనట్లు తెలిపాశారు. ఎస్ఎస్స్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లొమో, ఏదేని డిగ్రీ, డీ, బీ, ఎమ్ ఫార్మసీ, బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీవారి దర్శనానికి 4 గంటలు తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 4 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 71,196 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 22,581 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.246 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 04 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. బాధ్యతల స్వీకరణ తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుపతి రైల్వేస్టేషన్ నూతన డైరెక్టర్‌గా రంజిత్‌కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఇక్కడ పనిచేసిన కుప్పాల సత్యనారాయణ ఉద్యోగోన్నతిపై గుంతకల్ రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎంగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విజయవాడ రైల్వేలో అసిస్టెంట్ ఆపరేషన్ మేనేజర్‌గా పనిచేస్తున్న రంజిత్‌కుమార్‌ను ఆ శాఖ ఉన్నతాధికారులు నియమించారు. ఆ మేరకు ఆయన బాధ్యతలు చేపట్టారు. కాణిపాక వినాయకునికి ముక్కంటి సారె శ్రీకాళహస్తి: వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని కాణిపాక వరసిద్ధి వినాయకస్వామివారికి ముక్కంటి ఆలయ సారెను గురువారం పాలక మండలి చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, ఈవో బీకే.వెంకటేశులు అందజేశారు. వారికి ఆలయం వద్ద ఈవో, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేదమంత్రో చ్ఛారణల నడుమ వారు ఆలయానికి పట్టు వస్త్రాలను అందజేశారు. వేదపండితులు వారిని ఆశీర్వదించి స్వామివారి జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలు అందజేశారు. పాలకమండలి సభ్యులు గుర్రప్పశెట్టి, విజయమ్మ, హైమావతి, పగడాల మురళి, అధికారులు శ్రీనివాసరాజు, మోహన్ పాల్గొన్నారు. జనవరి 22 నుంచి జేఈఈ మెయిన్స్ తిరుపతి సిటీ: ఐఐటీ, ఎన్ఐటీ సంస్థల్లో ఇంజినీరింగ్ విద్యనభ్యసించాలనే కలను విద్యార్థులు నెరవేర్చుకునేందుకు సమయం ఆసన్నమైంది. ఈ మేరకు జేఈఈ మెయిన్స్–2027 పరీక్షల తేదీలను ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి, ఏప్రిల్ మాసాలలో రెండు సెషన్స్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. తొలి సెషన్ పరీక్షలు జనవరి 22 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనన్నట్లు ప్రకటించారు. అలాగే రెండవ సెషన్ పరీక్షలను ఏప్రిల్ మొదటి వారంలో నిర్వహించేందుకు సిద్ధమవతున్నట్లు వెల్లడించారు. తొలి సెషన్ పరీక్షల కోసం అక్టోబర్ మొదటి వారంలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. పింఛన్ల దరఖాస్తుకు నేటితో ఆఖరు తిరుపతి అర్బన్: కొత్త పింఛన్ల దరఖాస్తుకు శుక్రవారంతో గడువు పూర్తికానుంది. ఇప్పటివరకు 49,205 మంది దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. జిల్లాలో సుమారు 60 వేల మంది వరకు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఇంకా 11 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. -
శ్రీసిటీ సందర్శన
శ్రీసిటీ (వరదయ్యపాళెం): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర అమెరికా పెట్టుబడుల ప్రధాన అనుసంధానకర్త సతీష్ మండువ గురువారం శ్రీసిటీని సందర్శించారు. రాష్ట్రానికి ఉత్తర అమెరికా పెట్టుబడులను ఆకర్షించేందుకు నియమితులైన ఆయన యూఎస్–ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా, ఇంటెలిసాఫ్ట్ టెక్నాలజీస్ సీఈఓగా కొనసాగుతున్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్‌తో అనుబంధంతో పాటు ఉత్తర అమెరికా వ్యాపార వర్గాల్లో విస్తృత పరిచయాలు, అనుభవం ఉన్నాయి. శ్రీ సిటీకి చేరుకున్న సతీష్ మండువకు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవకాశాలను ఉత్తర అమెరికా పెట్టుబడిదారులకు పరిచయం చేయడంలో ఆయన చేస్తున్న కృషి అభినందించారు. మోడల్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌గా శ్రీసిటీని అభివృద్ధి చేయడంలో డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి దూరదృష్టి, పట్టుదలను అభినందించారు. పర్యటనలో భాగంగా స్థానిక డైకిన్ పరిశ్రమను సందర్శించి, అక్కడ సంస్థ ప్రతినిధులతో చర్చించారు. -
డయల్ యువర్ సీఎండీకి 2,249 ఫిర్యాదులు
తిరుపతి రూరల్: ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమానికి వివేష స్పందన లభిస్తోందని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. 9 జిల్లాల పరిధిలో ఇప్పటివరకు 2,249 ఫిర్యాదులు అందగా, 1,898 సమస్యలు పరిష్కరించినట్లు వెల్లడించారు. గురువారం ఏపీఎస్పీడీసీఎల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎండీ.. ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమంలో నమోదైన ఫిర్యాదులు, పరిష్కార స్థితి, పెండింగ్ అంశాలపై సమీక్షించారు. 2025 నవంబర్ 3 నుంచి 2026 సెప్టెంబర్ 14 వరకు 2,249 ఫిర్యాదులు నమోదైనట్లు తెలిపారు. 9 జిల్లాల్లో ‘డయల్ యువర్ సీఎండీ’, ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాల ద్వారా నమోదవుతున్న ఫిర్యాదులపై నోడల్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సీఎండీ ఆదేశించారు. సంస్థ డైరెక్టర్ కె.గురవయ్య, చీఫ్ జనరల్ మేనేజర్లు, జనరల్ మేనేజర్లు, 9 జిల్లాల సూపరింటెండింగ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. -
బ్రహ్మాండోత్సవం
రూ.కోట్ల కాలువ కబ్జా! తిరుపతి– కరకంబాడి మార్గంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం యథేచ్ఛగా కబ్జాకు పాల్పడుతోంది.తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉభయ దేవేరీ సమేతంగా శ్రీమలయప్పస్వామివారు విశేష వాహనాల్లో కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. బుధవారం ఉదయం చిన్నశేష వాహనంపై ఊరేగుతూ అశేష జనులను కటాక్షించారు. రాత్రి వీణాపాణి అలంకారంలో హంస వాహనంపై విహరించారు. భువి వైకుంఠంలో ఏడుకొండలస్వామి దివ్యతేజోవిరాజిత మూర్తిని వీక్షించి భక్తకోటి పులకించింది. మహిమాన్విత మాడవీధుల్లో దేదీప్యంగా ప్రకాశిస్తున్న తిరుమలేశుని దర్శించి పరవశించింది. ఎన్ని జన్మల ఫలమో కదా.. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని సేవించు భాగ్యము దక్కిందంటూ మురిసిపోయింది. – తిరుమల భక్తుల సౌకర్యాలకే ప్రాధాన్యం తిరుమలలో భక్తుల సౌకర్యాలకే ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గురువారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026 -
ఉపాధి అవకాశాల విధ్వంసం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: కేంద్రంలోని మోడీ పాలనలో ఉపాధి అవకాశాలు విధ్వంసమయ్యాయని ప్రగతిశీ ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్ తెలిపారు. బుధవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, కూటమి ప్రభుత్వం అరకొరగా భర్తీ చేస్తోందని విమర్శించారు. అందుకే శాశ్వతమైన, గౌరవప్రదమైన ఉపాధి ప్రతి విద్యార్థి హక్కు నినాదంతో డిసెంబర్ 11 నుంచి 13వ తేదీ వరకు తిరుపతిలో 24వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా మేధావులు, పీడీఎస్‌యూ ప్రతినిధులు మహాసభలకు హాజరు కానున్నట్లు చెప్పారు. మంత్రి నారా లోకేష్ జీవో నంబర్ 77ను రద్దు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు. అలాగే పెండింగ్‌లోని రూ.64 వేల కోట్ల ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్క యూనివర్సిటీకి రూ. 200 కోట్లు నిధులు కేటాయించాలని కోరారు. -
నిమజ్జనోత్సాహం
తిరుపతి నగరంలో వినాయక నిమజ్జనోత్సవం వైభవంగా సాగుతోంది. బుధవారం ఈ మేరకు గణపతి విగ్రహాలను ఊరేగింపుగా తరలించారు. బాణసంచా పేలుస్తూ.. డప్పు వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ.. రంగులు చల్లుకుంటూ యువత ఉత్సాహంగా గణేశుని నిమజ్జనానికి బయలుదేరింది. ఈ క్రమంలోనే గణేశుని ప్రతిమలను గంగమ్మ ఒడికి చేర్చేందుకు నగరపాలక సంస్థ అధికారులు వినాయకసాగర్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వినాయక నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో మంగళం రోడ్డు వద్ద ఓ వేదిక ఏర్పాటు చేసి విశేష విగ్రహాలకు మంగళ హారతి సమర్పించి వీడ్కోలు పలికారు. చవితి వేడుకుల సందర్భంగా తిరుపతిలో సుమారు 2,500 విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు 80శాతం వరకు ప్రతిమలను నిమజ్జనం చేశారు. భారీ క్రేన్ల సాయంతో సురక్షితంగా ప్రక్రియను పూర్తి చేశారు. – తిరుపతి మంగళం/ తిరుపతి తుడా -
ఐక్య పోరాటంతోనే వివక్ష అంతం
తిరుపతి సిటీ : ఐక్య పోరాటంతోనే కుల వివక్ష అంతమవుతుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తెలిపారు. బొజ్జాతారకం పదో వర్ధతిని పురస్కరించుకుని బుధవారం ఎస్వీయూ సెనెట్ హాల్లో దళిత సాహిత్యం, ప్రజా ఉద్యమాలు అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ముందుగా బొజ్జాతారకం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాఘవులు మాట్లాడుతూ బొజ్జా తారకంతో కలిసి ఉద్యమాలు చేసిన సందర్భాలను గుర్తు చేశారు. దళితుల కోసం ఆయన సృష్టించిన సాహిత్యాన్ని మేళవించి ముందుకెళ్లితేనే దళితుల సమస్యను అరికట్టవచ్చని తెలిపారు. దళిత అభ్యుదయ సాహిత్య రచనలను వినూత్నంగా తీసుకురావల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ప్రస్తుతం దళిత సంఘాల్లో విభజన ద్వారా రాజకీయ స్వార్థం పెచ్చు మీరుతోందని, దళితులందరూ ఐకమత్యంగా ప్రజా ఉద్యమాలను సాగించాలని పిలుపునిచ్చారు. సదస్సులో దక్షిణ భారత రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు అంజయ్య, ఉమ్మడి చిత్తూరు జిల్లా జెడ్పీ మాజీ సీఈఓ వెంకట నారాయణ, ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షుడు పిట్టా వరప్రసాద్, రచయిత గోవిందయ్య పాల్గొన్నారు. పింఛన్ల దరఖాస్తుకు గడువు పెంపు – 18 వరకు అవకాశం తిరుపతి అర్బన్:కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు మరో రెండు రోజులు అవకాశం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం వారు మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీలోపు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
రాపూరు : పట్టణంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. వివరాలు.. స్థానిక పడమటి అగర్తకట్టకు చెందిన భూపతి శ్రీదేవి (53) ఇంటి నుంచి బజారుకు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా మోటార్ సైకిల్ ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని ఆదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిరుమలరావు తెలిపారు. ఫాస్ట్‌ఫుడ్ తయారీపై ఉచిత శిక్షణ చంద్రగిరి : యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చంద్రగిరిలో ఈనెల 21వ తేదీ నుంచి 12 రోజుల పాటు పురుషులు, మహిళలకు ఫాస్ట్ ఫుడ్ తయారీపై ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సంస్థ డైరెక్టర్ పి. సురేష్ బాబు బుధవారం తెలిపారు. తెల్ల రేషన్ కార్డు గల గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు కలిగిన నిరుద్యోగ పురుషులు, మహిళలు అర్హులన్నారు. కనీసం 8వ తరగతి చదువుకుని ఉండాలని చెప్పారు. ట్రైనీస్‌కి ఉచిత భోజనం, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందించనున్నట్లు తెలిపారు. ఆసక్తిగలవా రు ఆధార్ కార్డు, రేషన్ కార్డు జెరాక్స్ కాపీలు, 4 పాసుపోర్టు సైజు ఫొటోలతో సంస్థకి వచ్చి పేరు నమోదు చేయించుకోవాలని కోరారు. ముందుగా పేరు నమోదు చేసుకున్న ప్రాధాన్యతనిస్తామన్నారు. ఇతర వివరాలకు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, 11–48 ద్వారకానగర్ (రాయల్ విక్టరీ స్కూల్ దగ్గర) కొత్తపేట, చంద్రగిరి. 79896 80587, 91775 43543, 63017 17672 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. భక్తుడికి నగల బ్యాగు అప్పగింత తిరుపతి అన్నమయ్యసర్కిల్ : అలిపిరి చెక్ పాయింట్ వద్ద బంగారు నగలు, నగదుతో కూడిన బ్యాగును మరచివెళ్లన భక్తుడికి తిరిగి బ్యాగును అప్పగించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా పీర్లగూడానికి చెందిన జనార్ధన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి బుధవారం ఉదయం అలిపిరి చెక్‌పాయింట్ వద్ద తమ బ్యాగును మరిచి తిరుమలకు చేరుకున్నారు.భద్రతా సిబ్బంది సదరు బ్యాగును సెక్టార్ కార్యాలయానికి చేర్చారు. అందులో నగదు రూ. 32 వేలు, సుమారు 30 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. బ్యాగును మరిచిపోయిన వారు తిరిగి అలిపిరి చెక్‌పాయింట్ వద్దకు చేరుకున్నారు. వారి వివరాలను నిర్ధారించుకుని ఏవీఎస్ఓ రమేష్‌కుమార్ ఆ బ్యాగ్‌ను తిరిగి అప్పగించారు. రైల్వేట్రాక్‌పై గుర్తుతెలియని మృతదేహం తిరుపతి అర్బన్ : తిరుపతి– తిరుచానూరు రైల్వే స్టేషన్ మధ్య చింతల చేను వద్ద గుర్తుతెలియని వ్యక్తి (సుమారు 35 ఏళ్లు) మృతదేహం ఉందని రైల్వే ఇన్స్పెక్టర్ వరప్రసాద్ బుధవారం తెలిపారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని వెల్లడించారు. మృతుడి వివరాలు తెలియలేదని, ఈ మేరకు కేసు నమోదు చేసి ఎస్వీ మెడికల్ కళాశాల మార్చురీకి మృతదేహం తరలించినట్లు వివరించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9247575618 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. విద్యుదాఘాతానికి యువకుడి బలి సైదాపురం : మండలంలోని తురిమెర్లలో మంగళవారం అర్ధరాత్రి విద్యుదాఘాతానికి ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. సైదాపురానికి చెందిన కాకాణి నాగరాజు, ప్రమీల దంపతులకు ముగ్గురు కుమార్తెలు. నాగరాజు కొంతకాలంగా తురిమెర్లలోని అత్తగారింట్లోనే కాపురం ఉంటున్నాడు. కూలి పనులకు వెళ్లి జీవనం సాగించేవాడు. మంగళవారం రాత్రి ఆరు బయట ఫ్యాన్ పెట్టుకుని కుటుంబ సమేతంగా పడుకున్నాడు. అర్ధరాత్రి దాహం వేసి నీరు తాగేందుకు ఇంట్లోకి వెళ్లి వస్తుండగా తలుపులు తగిలి ప్లగ్‌బాక్స్ వైర్ తెగిపోయింది. దానికి మరమ్మతు చేస్తుండగా కరెంట్ షాక్‌కు గురయ్యాడు. కుటుంబీకులు వెంటనే ఆస్పత్రికి తరలించేందుక యత్నించగా అప్పటికే మరణించాడు. సమాచారం అందుకునన స్టేషన్ ఇన్చార్జి శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ పెద్ద మృత్యువాత పడడంతో భార్యాబిడ్డలు కన్నీరుమున్నీరవుతున్నారు. -
శ్రీవారి దర్శనానికి 4 గంటలు
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 61,361 మంది స్వామివారిని దర్శించుకోగా 18,722 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.70 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 04 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది. ముక్కంటి సేవలో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీకాళహస్తి : జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారిని బుధవారం దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కన్నబాబు సేవించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద ఆయనకు ఆలయ పాలకమండలి చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, ఈఓ బీకే వెంకటేశులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. మృత్యుంజయస్వామి సన్నిధిలో వేదపండితులు ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ పరిపాలన భవనంలో చైర్మన్, ఈఓతో కలిసి అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆలయ నిర్వహణ, భక్తులకు అందుతున్న సౌకర్యాలు, అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. భక్తులకు మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. జాతర నిర్వహణకు అనుమతి వెంకటగిరి(సైదాపురం) : గ్రామశక్తి పోలేరమ్మతల్లి జాతరను వైభవంగా నిర్వహించాలని వెంకటగిరి రాజా కుటుంబీకులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వీబీ సాయికృష్ణ యాచేంద్ర సూచించారు. బుధవారం ఈ మేరకు వెంకటగిరి రాజా ప్యాలెస్‌లోని మండపంలో వెంకటగిరి గ్రూప్ దేవస్థానం ఈఓ శ్రీనివాసులరెడ్డి, సీఐ రోశయ్యకు సాయికృష్ణయా చేంద్ర తాంబులం అందించి జాతర నిర్వహణ కు అనుమతి ఇచ్చారు. సాయికృష్ణ యాచేంద్ర మాట్లాడుతూ సాంప్రదాయలను గౌరవిస్తూ ప్రజా ప్రతినిధుల సమక్షంలో దేవదాయ, పోలీ సు, ఇతర శాఖల అధికారులు సమన్వయం చేసు కుని జాతరను విజయవంతం చేయాలని కోరా రు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. -
రూ.కోట్ల కాలువ కబ్జా!
రేణిగుంట : తిరుపతి– కరకంబాడి రహదారిలోని రేణిగుంట మండలం వెంకటాపురం చెరువు కలుజు నుంచి నీరు వెళ్లే కాలువను ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం కబ్జా చేసేస్తోంది. 227 సర్వే నంబర్లోని 74 సెంట్లను టీడీపీ స్థానిక నేతల అండతో ఆక్రమించుకుని ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టింది. కబ్జాకు సహకరిస్తున్నందుకు సదరు పచ్చనేతలు భారీగా ముడుపులు తీసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు రూ.3కోట్ల విలువైన భూమి కబ్జాకు గురైనప్పటికీ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానిక రైతులు మండిపడుతున్నారు. పేదలు రెండు సెంట్ల పోరంబోకు భూమిలో ఇల్లు కట్టుకుంటేనే కూల్చి వేసే అధికారులు ఇప్పుడు రూ.కోట్ల స్థలం చెరబడుతున్నప్పటికీ ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటికి దారేది..? వెంకటాపురం చెరువు నుంచి ఈ కాలువ ద్వారా మరో రెండు చెరువులకు నీరు వెళుతుంది, ఇప్పుడు కాలువను కబళించేసి ప్రహరీ గోడ నిర్మిస్తే నీరు దిగువకు ఎలా వెళుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. కింది చెరువుల ఆయకట్టు రైతులు పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. ఆక్రమణ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఉన్నతాధికారులైనా స్పందించాలని కోరుతున్నారు. గతంలో సైతం ఆక్రమణ సదరు ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం గతంలో సైతం వెంకటాపురం చెరువుకు సంబంధించి సర్వే నంబర్ 225/1లో ఒక ఎకరా ఆక్రమించుకొని ప్రహరీ గోడ నిర్మించుకున్నారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. అదే విధంగా మళ్లీ కబ్జాకు తెగబడుతున్నారని ఆరోపిస్తున్నారు. అధికారలు వెంటనే పూర్తిస్థాయిలో సర్వే చేయించి చెరువు భూమిని కాపాడాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే దీనిపై తహసీల్దార్ శ్రావణ్‌కుమార్ వివరణ తీసుకునేందుకు యత్నించగా, ఆయన స్పందించలేదు. వెంకటాపురం చెరువు కలుజు -
సంప్రదాయబద్ధంగా వెంకటగిరి జాతర చాటింపు
వెంకటగిరిరూరల్ : వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మతల్లి జాతర మొదటి చాటింపు బుధవారం అర్ధరాత్రి సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ముందుగా కాపాళెంలోని గాలిగంపుల పోలేరమ్మ, కామాక్షమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం జాతరకు చాటింపు వేశారు. కాంపాళెంలోని ప్రధాన మార్గం మీదుగా వరదరాజస్వామి ఆలయం, బజారువీధి మీదుగా పోలేరమ్మతల్లి ఆలయం, ఆర్చి, కాశీపేట కూడలి మీదుగా చాటింపును కొనసాగించారు. శ్రీనివాసులరెడ్డి, సీఐ రోశయ్య పర్యవేక్షించారు. 19న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు తిరుపతి అర్బన్: ఇంటర్ 2025–26లో 75శాతం మార్కులతో ఉత్తీర్ణులైన నాన్ మ్యాథ్స్ గ్రూప్ విద్యార్థులకు హెస్‌సీఎల్ కంపెనీ అసోసియేట్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆర్ఈఓ గోపాల్‌రెడ్డి, డీఎస్డీఓ లోకనాథం తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుపతిలోని కరకంబాడి మార్గంలో ఉన్న శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు. ఆసక్తిగల విద్యార్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వివరాలకు 8019913422 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
జిల్లా హౌసింగ్ హెడ్ పోస్టుతో ఆటలు
● 6 నెలలకు ఒకసారి మారుతున్న అధికారులు ● ముందుకు సాగని గృహ నిర్మాణాలు నిరుపేదల సొంతింటి కలలను చంద్రబాబు ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ఇప్పటికే గత వైఎస్సార్సీపీ హయాంలో మంజూరైన ఇళ్ల నిర్మాణంపై శీతకన్ను వేసింది. ఈ క్రమంలోనే హౌసింగ్‌శాఖ జిల్లా హెడ్ పోస్టును సైతం ఇష్టారాజ్యం చేసేస్తోంది. పక్కా గృహాల పురోగతిని పర్యవేక్షించాల్సిన కీలక అధికారిని సక్రమంగా పనిచేయకుండా మోకాలడ్డుతోంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్త వారిని నియమిస్తూ ఆటలాడుకుంటోంది. టీడీపీ నేతల సిఫార్సు ఉంటే చాలు ఎవరికై నా సదరు పోస్టును కట్టబెట్టేస్తోంది. సామర్థ్యం.. పనితీరుతో సంబంధం లేకుండా రికమండేషన్లకు ప్రాధాన్యమిస్తోంది. చివరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారైనా సరే పలుకుబడి ఉంటే చాలు వెంటనే జిల్లా అధికారి స్థానంలో కూర్చోబెట్టేస్తోంది.హౌసింగ్ జిల్లా సమాచారం గత వైఎస్సార్సీపీ హయాంలో మంజూరు చేసిన ఇళ్లు 69,215 పూర్తి చేసినవి 25,450 ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేసినవి 10,132 భూమి పూజ చేసినవి 4,385 పునాదుల్లోనే ఉన్నవి 3,500 బేసిమెంట్ దశలోవి 13,313 గోడల దశలోని ఇళ్లు 7,902 శ్లాబ్ దశలో ఉన్నవి 4,533తిరుపతి అర్బన్:చంద్రబాబు ప్రభుత్వంలో జిల్లా స్థాయి అధికారి పోస్టును.. కాస్త సిఫార్సు ఉంటే చాలు సులభంగా తెచ్చుకోవచ్చునంటూ హౌసింగ్ డిపార్ట్ మెంట్లో జోరుగా చర్చసాగుతోంది. అందుకు జిల్లా హౌసింగ్ హెడ్ (డీహెచ్‌హెచ్) పోస్టును ఉదాహరణ గా చూపుతున్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హౌ సింగ్ కార్యాలయంలోని ఉద్యోగులు పదే పదే డీహెచ్‌హెచ్ పోస్టును మార్పు చేయడంపై మండిపడుతున్నారు. అవినీతి అరోపణలతో సంబంధం లేదు.. ఆప్షన్–3 ఇంటి నిర్మాణాల్లో దోపిడీకి పాల్పడినా ఏ మా త్రం పట్టించుకోకుండా రికమండేషన్‌తో సులవుగా జిల్లా అధికారి పోస్టును సంపాదించుకుంటున్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. జిల్లా హౌసింగ్ హెడ్‌ను తరచూ మారుస్తుండడంతో పక్కా గృహాల నిర్మాణాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారయ్యాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీహెచ్హెచ్కు సైతం తమ పోస్టును కాపాడుకునేందుకే సమయం గడచిపోతోందని ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారి పర్యవేక్షణ లేకపోవడంతో పలువురు ఉద్యోగులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. డీహెచ్‌హెచ్ మహా ఉంటే మూడు నెలలు ఉంటారు.. ఆయనను పట్టించుకునేది ఏముంటదిలే అని తూతూమంత్రంగా విధులు నిర్వర్తిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పూర్తి బాధ్యతలతో కీలకమైన హౌసింగ్ జిల్లా అధికారి పోస్టును భర్తీ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే పేదల ఇళ్ల అసంపూర్తిగానే మిగిలిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. బేసిమెంట్ దశలో ఆగిన ఇంటి నిర్మాణాలు తాజాగా శ్రీనివాసరావు నియామకం డీహెచ్‌హెచ్‌గా ఏ.శ్రీనివాసరావును బుధవారం నియమించారు. ఆయన ఏడాది క్రితం ఉద్యోగ విమరణ పొందారు. అయితే మూడు నెలల క్రితం హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల విరమణ వయసును 62 ఏళ్లకు పెంచారు. దీంతో పదలు సంఖ్యలో ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరారు. ఈ క్రమంలో శ్రీనివాసరావు సైతం తిరుపతి ఈఈగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం తిరుపతి ఈఈతోపాటు జిల్లా హౌసింగ్ హెడ్‌గా ఇన్చార్జి బాద్యతలు అప్పగించారు. అయితే మూడు నెలల నుంచి ఇప్పటి వరకు ఇన్చార్జి డీహెచ్‌హెచ్‌గా విధులు నిర్వర్తించిన గోపాల్‌నాయక్‌ను తిరిగి గూడూరు ఈఈగా పంపించారు. గోపాల్‌నాయక్‌కు ముందు రైల్వేకోడూరు హౌసింగ్ ఈఈ శ్రీరాములురెడ్డి డీహెచ్‌హెచ్‌గా పనిచేశారు. -
వైభవోత్సవం
తుమ్మలగుంట శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండో రోజు బుధవారం ఉదయం చిన్నశేష వాహనంపై వెంకన్న విహరించారు. రాత్రి హంస వాహనంపై సరస్వతీ స్వరూపంగా దర్శనమిచ్చారు. ఈ క్రమంలోనే ఉదయం 11 గంటలకు దేవదేవేరులనను కల్యాణ మండపానికి వేంచేపు చేశారు. వేడుకగా స్నపన తిరుమంజనం జరిపించారు. సాయంత్రం కనులపండువగా ఊంజల్ సేవ నిర్వహించారు. ఈ క్రమంలోనే చిన్నశేష వాహన సేవకు తిరుపతి రూరల్ మండలానికి చెందిన భక్తులు సారె తీసుకువచ్చారు. హంస వాహన సేవకు పాకాల మండలానికి చెందిన వారు సారె సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కుటుంబీకులు పర్యవేక్షించారు. – తిరుపతి రూరల్ లారీని ఢీకొన్న తమిళనాడు ఆర్టీసీ బస్సుఆదేశాల అమలు తప్పనిసరి నాయుడుపేట టౌన్ : ఎన్నికల కమిషన్ ఆదేశాలను మున్సిపల్‌శాఖ అధికారులు తప్పనిసరిగా అమలు చేయాలని మున్సిపల్ అడ్మినిస్టేషన్ కమిషనర్ సంపత్‌కుమార్ స్పష్టం చేశారు. బుధవారం నాయుడుపేట మున్సిపల్ కార్యాలయంలో నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి కమిషనర్లు షేక్ ఫజులుల్లా, చిన్నయ్య, కిరణ్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందిగా నిర్వహించాలని సూచించారు. పురపాలక సంఘాల్లో తాగునీటి సరఫరాతో పాటు పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కోరారు. అనంతరం పట్టణంలోని పాతబస్టాండ్ వద్ద అన్నా క్యాంటీన్‌కు మధ్యాహ్న భోజనం పంపిణీని పరిశీలించారు. మున్సిపల్ మేనేజర్ ఊరుకుందమ్మ పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలోకి పాముపుల్లంపేట :ప్రభుత్వ పాఠశాల ఆవరణలోకి పాము రావడంతో విద్యార్ధులు భయాందోళనకు గురయ్యారు. బుధవారం ఉదయం సాతువారిపల్లె ప్రాథమిక పాఠశాల గేటు తీయగానే రక్తపింజరి పాము కనిపించడంతో విద్యార్ధులు కేకలు వేస్తూ పరుగులు తీశారు. గ్రామస్తులు వెంటనే అక్కడకు చేరుకుని పాముని కొట్టి చంపేశారు. పాఠశాల సమీపంలో ముళ్లపొదలు అధికంగా ఉండడం, పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడంతో విషజీవుల సంచారం అధికమైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల ప్రాంగణంలోనే అంగన్వాడీ కేంద్రం కూడా ఉండడంతో చిన్నారుల భద్రతపై దృష్టి సారించాలని కోరుతున్నారు. శిథిలావస్థలోని పాఠశాల భవనానికి మరమ్మతులు చేయించడంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా మార్చేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నాయుడుపేట టౌన్ : మండలంలోని నరసారెడ్డి కండ్రిగ వద్ద జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని కంటైనర్ లారీని తమిళనాడు ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. తమిళనాడుకు చెందిన 103 బస్సు నెల్లూరు నుంచి 50 మంది ప్రయాణికులతో చైన్నెకు బయలుదేరింది. మార్గం మధ్యలో ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ సెల్‌ఫోన్ చూస్తూ అజాగ్రత్తగా నడపడం వల్లే యాక్సిడెంట్ జరిగిందని ప్రయాణికులు వెల్లడించారు. బస్సు వేగంగా వెళుతున్న సమయంలో కాల్ రావడంతో డ్రైవర్ ఫోన్ చూస్తూ రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఢీకొట్టాడని చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగంలో కూర్చుని ఉన్న కండక్టర్ షణ్ముగంతోపాటు ఇందుకూరు పేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు తిరుమలశెట్టి మల్లికార్జున, పొదలకూరు ప్రాంతానికి చెందిన శ్రీనివాసులు, సూళ్లూరుపేటకు చెందిన ఎస్కే షేక్ సద్దార్, తడ మండలం చెరివి గ్రామానికి చెందిన శ్రీరాఘవేంద్ర, నాయుడుపేటకు చెందిన ఎన్.నరేంద్రకుమార్‌లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక మహాలక్ష్మీనగర్ కాలనీకి చెందిన యువత, హైవే మొబైల్, 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.తీవ్రంగా గాయపడిన కండక్టర్ షణ్ముగాన్ని మెరుగైన చికిత్స నిమిత్తం చైన్నెకు తీసుకెళ్లార. ప్రయాణికులు మరో బస్సులో చైన్నెకు తరలివెళ్లారు. సీఐ వెంకటేశ్వరరావు, ఏఎస్ఐ రామ్మూర్తి, పోలీస్ సిబ్బంది ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కండక్టర్ వద్ద ఉన్న రూ.15వేల నగదు 108 ఈఎంటీ బల్లి కిరణ్‌కుమార్, పైలెట్ సుబ్బారావుకు దొరికింది. వారు ఆ నగదును ప్రభుత్వ వైద్యశాలలో బస్ డ్రైవర్ జ్ఞానప్రకాష్కు అందజేశారు. రోడ్డు ప్రమాదంలో ఎస్బీఐ మేనేజర్ దుర్మరణం వెంకటగిరి రూరల్:వెంకటగిరి– తిరుపతి జాతీయ రహదారిపై బుధవారం శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లె వద్ద గుర్తుతెలియని వాహ నం ఢీకొని ఎస్బీఐ వెంకటగిరి శాఖ మేనేజర్ మృతి చెందారు. వివరాలు.. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన దీపక్ (35) వెంకటగిరి స్టేట్ బ్యాంకులో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దీపక్ వాకింగ్ వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగింది. స్ధానికులు 108లో వైద్యశాలకు తరలించగా దీపక్ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. లారీ ఢీకొని అర్చకుడి మృతి శ్రీకాళహస్తి: ఏర్పేడు నుంచి వెంకటగిరికి వెళ్లే ప్రధాన రహదారిలో మంగళవారం అర్ధరాత్రి లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంలో వస్తున్న అర్చకుడు కళ్యాణ్ కుమార్ శర్మ (29) అక్కడకక్కడే మృతి చెందాడు. వివరాలు.. పల్లం గ్రామానికి చెందిన పులివెందుల కళ్యాణ్ కుమార్ శర్మ వెంకటగిరి వెళ్లి తిరిగి వస్తుండగా పల్లంపేట పెట్రోల్ బంకు వద్ద ప్రమాదం జరిగింది. ఏర్పేడు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సిద్ధార్థలో భారత విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయాగం
నారాయణవనం: మండలంలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో నవాహ్నిక భారత విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయాగం మంగళవారం ప్రారంభమైంది. కళాశాల చైర్మన్ అశోకరాజు దంపతుల ఆధ్వర్యంలో 225 మంది వేద పండితుల సమక్షంలో యాగానికి అంకురార్పణ చేపట్టారు. యాగశాలలో శ్రీదేవీ, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామికి తిరుమంజం నిర్వహించి, ఆకల్పాంత హోమం, పంచగవ్య ప్రాశన, వాస్తు హోమం, దీక్షా ధారణ, కంకణ ధారణ పూర్తిచేశారు. సాయంత్రం అంబటిపూడి రాధాకృష్ణేశ్వర్ ‘భారత విశ్వ గురుత్వము, సనాతన ధర్మం‘ పై ప్రవచనం అనంతరం వివిధ రకాల పూజలు చేశారు. అశోకరాజు మాట్లాడుతూ మంగళవారం నుంచి 23వ తేదీ వరకు హోమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. లోక కళ్యాణానికి, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షల మేరకు భారత్ ‘విశ్వగురు’గా నిలవాలనే సంకల్పంతో ఈ యాగాన్ని తలపెట్టినట్లు తెలిపారు. ఆధ్యాత్మిక క్రతువులో అందరూ పాల్గొని దైవానుగ్రహం పొందాలని ఆయన కోరారు. -
శ్రీవారి దర్శనానికి 4 గంటలు
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. సోమ వారం అర్ధరాత్రి వరకు 88,210 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,192 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.23 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తు లకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడాని కి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవే శ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 1 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. నేటి నుంచి వీఆర్ఏల సహాయ నిరాకరణ రామచంద్రాపురం: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు సహాయ నిరాకరణ చేపట్టనున్నట్టు వీఆర్ఏల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని, తెలంగాణ తరహాలో పే స్కేల్ అమలు చేయాలని కోరుతూ మంగళవారం స్థానిక తహసీల్దార్ మధుసూదన్‌రావుకు వినతి పత్రం అందజేశారు. వీఆర్ఏల అధ్యక్షుడు మాట్లాడుతూ ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం తమ డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించే వరకు రాష్ట్ర వ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపడుతామని ఆయన స్పష్టం చేశారు. తుది విడతపైనే ఆశలు – నేడు చివరి విడత ఇంజినీరింగ్ ప్రవేశాల మెరిట్ లిస్ట్ విడుదల తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, డీమ్డ్, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల్లో పలు బీటెక్ కోర్సుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి సాంకేతిక విద్యాశాఖ మూడవ, తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి మెరిట్ లిస్ట్‌ను బుధవారం విడుదల చేయనుంది. చివరి విడతలో కన్వీనర్ కోటా సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో ఈనెల 19వ తేదీలోపు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. కాగా ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసినా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రవేశాలు లేకపోవడంతో మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రయివేటు కళాశాలల పరిస్థితి దారుణం జిల్లాలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల్లో మాత్రం ప్రవేశాలు 85 శాతం పైగా సీట్లు భర్తీ కాగా మిగిలిన ప్రైవేటు కళాశాల పరిస్థితి దారుణంగా ఉంది. జిల్లాలో రెండు విడతల్లో కన్వీనర్ కోటా కింద రెండు డీమ్డ్ వర్సిటీలలో 80 శాతం సీట్లు, ఐదు అటానమస్ కళాశాలల్లో 75 శాతం ప్రవేశాలు జరిగినట్లు సమాచారం. కాగా జిల్లాలోని 11 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇప్పటి వరకు పలు బీటెక్ కోర్సుల్లో 60 శాతం సీట్లు కూడా భర్తీ కాలేదని యాజమాన్యాలు వాపోతున్నాయి. కన్వీనర్ కోటా మూడో విడతపైనే ఆశలన్నీ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తుదివిడత అనంతరం జరిగే స్పాట్ అడ్మిషన్లకు సైతం ఈ ఏడాది అంతగా స్పందన ఉండకపోవచ్చని అధ్యాపకులు అంచనా వేస్తున్నారు. భక్తుల సురక్షిత ప్రయాణమే లక్ష్యం తిరుపతి మంగళం : భక్తుల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా డ్రైవర్లు వాహనాలు నడపాలని జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ ఆదేశించారు. మంగళవారం తిరుపతి జిల్లా రవాణా, పోలీస్ శాఖలు సమన్వయంతో ప్రత్యేక రహదారి భద్రతా చర్యలు చేపట్టారు. గత పది రోజులుగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వస్తున్న 61 కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులను మోటార్ వెహికల్ ఇన్‌న్‌స్పెక్టర్లు తనిఖీలు నిర్వహించారు. పర్మిట్ లేకుండా ఉన్న మూడు వాహనాలు, వాణిజ్యపరమైన సరుకు తీసుకెళ్తున్న 18 వాహనాలు, అధిక చార్జీలు వసూలు చేస్తున్న 4 వాహనాలు, అలాగే మోటార్ వాహన నిబంధనలను ఉల్లంఘించిన మరో 36 వాహనాలపై కేసులు నమోదు చేసి మొత్తం రూ.6 లక్షల అపరాధ రుసుము వసూలు చేసినట్లు జిల్లా రవాణాశాఖాధికారి తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుపతి జిల్లా పరిధిలోని అన్ని చోట్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు విస్తృత తనిఖీలు చేపడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. -
అవినీతి తప్ప అభివృద్ధి ఎక్కడ?
సూళ్లూరుపేట: రెండున్నరేళ్లు కూటమి ప్రభుత్వ హయాంలో అవినీతి తప్ప అభివృద్ధి కనిపించడం లేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ కిలివేటి సంజీవయ్య ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన స్థానిక నాయకులతో కలిసి శిథిలావస్థకు చేరుకున్న కాళంగి వంతెనను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ కుటుంబ సభ్యులు నియోజకవర్గాన్ని అవినీతి పథంలో నడిపిస్తున్నారని విమర్శించారు. సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీచెంగాళమ్మ పరమేశ్వరి ఆలయ సమీపంలో కాళంగి నదిపై నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరుకున్నా ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వంతెన గురించి నాటి ముఖ్యమంత్రి మా జగనన్నకు చెప్పి 2023 నవంబర్ 6 జీఓ ఆర్టీ నం.325 ద్వారా రూ.35 కోట్లు మంజూరు చేస్తే.. దానికి టెక్నికల్ మంజూరు చేయించుకునే లోపు ఎన్నికల కోడ్ రావడం, ఎన్నికల్లో ఓడిపోవడంతో మేము పనులు చేయలేకపోయామన్నారు. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయకుండా సీఎంతో మాట్లాడాను అని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. ఎంతసేపు ఎమ్మెల్యే కుటుంబం ప్రకృతి వనరుల్ని పర్సెంటేజీలకు అమ్మేయడమే పనిగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. రెండున్నరేళ్ల పాలనలో ఏం చేశారో చెప్పండి? అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరింపులా? ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరించడం ఏమిటని కిలివేటి అన్నారు. మా నాయకుడు సత్యనారాయణరెడ్డిపై తప్పుడు కేసులు నమోదు చేసి రెండోసారి జైలుకు పంపడం వెనుక కుట్రకోణం దాగి ఉందన్నారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు అల్లూరు అనిల్‌కుమార్‌రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు వేళ్లపాళెం కృపాకర్‌రెడ్డి, నాయకులు స్వామిరెడ్డి, జెట్టి వేణుయాదవ్, మీజూరు రామకృష్ణారెడ్డి, అలవల సురేష్, వాకాటి బాబురెడ్డి, బద్దెపూడి మోహన్‌రెడ్డి, మల్లిరెడ్డి, చిలకా యుగంధర్, అయితా శ్రీధర్, కాకి శ్రీరామ్మూర్తి, మాదరపాక సురేష్ పాల్గొన్నారు. -
డయల్ యువర్ సీఎండీకి 75 వినతులు
తిరుపతి రూరల్: డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమానికి 75 వినతులు వచ్చినట్టు సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. ప్రతి సోమవారం ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో నిర్వహించే డయల్ యువర్ సీఎండీ, డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని వినాయక చవితి సందర్భంగా సోమవారం సెలవుదినం కావడంతో మంగళవారం నిర్వహించారు. సంస్థ పరిధిలోని 9 జిల్లాల నుంచి 75 మంది వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను సీఎండీకి విన్నవించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు పి.అయూబ్‌ఖాన్, కె.గురవయ్య, చీఫ్ జనరల్ మేనేజర్లు జె.రమణాదేవి, ఎన్.శోభా వాలెంటీనా, ఆర్.పద్మ, ఎం.మురళీకుమార్, సిహెచ్ రామచంద్రరావు, కే.సంపత్ కుమార్, ఎస్.రమణ, ఎం.శ్రీకాంత్, ఏ.శ్రీనివాసబాబు, జనరల్ మేనేజర్లు జగదీష్, భాస్కర్‌రెడ్డి, హేమలత, సురేష్ తదితరులు పాల్గొన్నారు. బీజీపీ నేత బైక్ దగ్ధం చంద్రగిరి: మండల బీజేపీ నేత ద్విచక్ర వాహనానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పటించిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. చంద్రగిరి శ్రీనివాసశెట్టి సందు వీధికి చెందిన కాకిమాను మునిరాజ బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున తన ఇంటి సమీపంలో ఉంచిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై పెట్రోల్ పోసి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటనలో బైక్ పూర్తిగా కాలిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించారు. వినాయక చవితి పండుగకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్యానర్లు పెట్టామనే కక్షతో తన బైక్‌కే నిప్పటించారని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. బైక్‌ను ఢీకొన్న శ్రీసిటీ బస్సు – వ్యక్తికి తీవ్ర గాయాలు చిట్టమూరు: నాయుడుపేట–మల్లాం రహదారిలో చిట్టమూరు మండలం, బయ్యవారికండ్రిగ గ్రామం వద్ద సోమవారం శ్రీసిటీకి వెళ్తున్న బస్సు మోటార్ బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పెళ్లకూరు మండలం, చెంబేడుకు చెందిన రామచంద్రయ్య మోటార్ బైక్‌పై నాయుడుపేట నుంచి మల్లాం వైపు వస్తుండగా, తడ మండలం నుంచి శ్రీసిటీలోని ఓ కంపెనీకి ఉద్యోగులను తీసుకెళ్తున్న బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో మోటార్ బైక్‌పై వెళ్తున్న రామచంద్రయ్యకు గాయాలు కావడంతో వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, బస్సును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తిరుపతిలో ట్రెకింగ్–ఐ తిరుపతి సిటీ: తిరుపతి ఎన్సీసీ నగర్లో ఆల్ ఇండియా ఎన్సీసీ ఏపీ ట్రెక్–ఐ పేరుతో ఇండియన్ సీనియర్, జూనియర్ డివిజన్ ఎన్సీసీ క్యాడెట్లకు ట్రెకింగ్ యాత్ర చేపట్టారు. ఈనెల 12 ప్రారంభమైన యాత్ర ఈనెల 19 వరకు జరగనుంది. తిరుపతి ఎన్సీసీ గ్రూప్ హెడ్‌క్వార్టర్స్ 5వ ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ నిర్వహిస్తున్న ట్రెకింగ్ యాత్రలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, కేరళ, లక్ష్యదీప్, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర డైరెక్టరేట్లకు చెందిన 510 మంది ఎన్సీసీ క్యాడెట్లు, 15 మంది ఎన్సీసీ అధికారులు పాల్గొంటున్నారు. ట్రెకింగ్ షెడ్యూల్లో భాగంగా క్యాడెట్లు తిరుమల, జూపార్క్, సైన్స్ సెంటర్ వంటి కేంద్రాల్లో శిక్షణ, సాహస కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఎన్సీసీ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ గ్రూప్ కమాండర్, ట్రెక్ మేనేజర్ కల్నల్ ఎకే.శర్మ పాల్గొన్నారు. -
తూకమేస్తున్నారు!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: పేదలకు పంపిణీ చేసే బియ్యం మధ్యలోనే సగం మాయం అవుతోంది. స్టాక్ పాయింట్ల నుంచి రేషన్ డీలర్‌కు చేరవేసే మసయంలో భారీ తేడాలు వస్తున్నాయి. ప్రతి నెలా వచ్చే ఈ తేడాల కారణంగా అనేక మంది డీలర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. మధ్యలో ఉన్న వారు మాత్రం బియ్యాన్ని నొక్కేసి బ్లాక్ మార్కెట్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని డీలర్లు ఆరోపిస్తున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మండల స్థాయి రేషన్ స్టాక్ పాయింట్లు అవకతవకలకు అడ్డాలుగా మారాయి. గోదాముల నుంచి వచ్చే బియ్యాన్ని కాటా వేయకుండానే నేరుగా ఎఫ్పీ (రేషన్) షాపులకు తరలిస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తూకం లేదు .. కొలత లేదు స్టేజ్–1 గోదాముల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు వచ్చే బియ్యం లోడులను నిబంధనల ప్రకారం కాటా వేసి గోదాముల్లో దించాల్సి ఉంది. అయితే అవేవీ పట్టించుకోకుండా అసలు తూకమే వేయకుండా అన్న్లోడ్ చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా స్టేజ్–1 లారీల నుంచి నేరుగా ఎఫ్పీ షాపులకు వెళ్లే లారీల్లోకి బస్తాల ను మార్చేసి పంపించేస్తున్నారు. ఈ దందా వల్ల ప్రతి బస్తాకు 2 నుంచి 3 కిలోల వరకు బియ్యం తక్కువ వస్తోందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలపైనే తరుగు భారం! ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి తక్కువ తూకంతో బియ్యం వస్తుండడంతో ఎఫ్పీ షాపు డీలర్లు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. చివరకు డీలర్లు కూడా కార్డుదారులకు ఇచ్చే కోటాలో కోతలు విధించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. అంతిమంగా ఈ తూకాల తరుగు భారం మొత్తం పేద ప్రజల మీదే పడుతోంది. కార్డుదారులకు పూర్తి కోటా అందకపోవడంతో రేషన్ దుకాణాల వద్ద నిత్యం వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. రేషన్ షాపులకు బియ్యం సరఫరాలో తేడాలు ఇలా చేయకపోతే మామూళ్లు ఎవరిస్తారు?ఈ తూకాల లోపాలపై రేషన్ డీలర్లు ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్‌చార్జ్‌లను నిలదీస్తే.. వారు ‘మా పైవాళ్లకు నెల నెలా మామూళ్లు ఎవరు ఇవ్వాలి?.. మా జేబులో నుంచి ఇవ్వాలా?’ అంటూ డీలర్లపై కేకలు వేస్తున్నట్లు తెలిసింది. పై వాళ్లకు మామూళ్లు కావాలంటే.. బస్తాల్లో రెండు, మూడు కిలోలు తీసేస్తేనే కాదా? ఇవ్వగలం. కాబట్టి మేము ఇలాగే ఇస్తాం, మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి’ అంటూ దబాయిస్తున్నట్లు డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు జిల్లా ఉన్నతాధికారుల అండదండలతోనే తూకాల్లో భారీ మోసం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. తక్షణమే ఉన్నతాధికారులు, విజిలెన్స్ విభాగం స్పందించి ఎంఎల్ఎస్ పాయింట్లలో వేబ్రిడ్జి తూకం వేయాలని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. -
మెడి‘కల’ నెరవేరె
మాట్లాడుతున్న ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు తిరుపతి తుడా: ఎస్వీ వైద్య కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి నీట్ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు తరగతులు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాని ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు తెలిపారు. ఈ మేరకు కళాశాలలో ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమానికి ఆయన హాజరై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. నీట్ ఆదేశాల మేరకు నూతన ఎంబీబీఎస్ వైద్య విద్యార్థులకు అవగాహన, ఓరింటేషన్ తరగతులు 15 రోజులు పాటు నిర్వహించనున్నట్టు తెలిపారు. కళాశాలలో ఎంబీబీఎస్ వైద్య విద్యతో పాటు, పరిశోధనలకు పెద్దపీట వేస్తామన్నారు. ఎస్వీ వైద్య కళాశాల ఆల్ ఇండియా ర్యాంకింగ్‌లో 69వ స్థానం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5వ స్థానం ఎస్వీ వైద్య కళాశాలకు ఇవ్వడం గర్వకారణమన్నారు. -
బ్రహ్మోత్సవ తేజం..
అంగరంగ వైభవంగా ధ్వజారోహణం స్వర్ణకాంతుల్లో శ్రీవారి ఆలయం బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మహద్వారం నుంచి ఆలయ ప్రాకారాల వరకు పుష్పాలు, విద్యుత్ దీపాలంకరణలతో అలంకరించారు. హథీరాంజీ మఠం, ఆస్థాన మండపం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు భక్తులను ఆకట్టుకున్నాయి. పుష్ప ప్రదర్శనశాలలో దేశీయ పుష్పాలతోపాటు వివిధ రకాల విదేశీ పుష్పాలతో ప్రత్యేక ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. ఫొటో ఎగ్జిబిషన్‌న్, కళా ప్రదర్శనలకు కూడా సన్నాహాలు పూర్తయ్యాయి. తిరుమల:తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టారు. మంగళవారం సాయంత్రం ధ్వజారోహణ ఘట్టాన్ని పూర్తిచేశారు. మీన లగ్నంలో పవిత్ర గరుడ పతాకాన్ని బంగారు ధ్వజస్తంభ శిఖరాగ్రాన అర్చకులు ఆవిష్కరించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ గరుడ పతాకం ఎగరడంతో బ్రహ్మోత్సవాలకు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ధ్వజస్తంభంపై ఎగిరే గరుడ పతాకమే ముక్కోటి దేవతలకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రంగా భావిస్తారు. గరుడుడి ఆహ్వానాన్ని అందుకుని దేవతలు, అష్టధిక్పాలకులు, దేవగణాలు తొమ్మిది రోజులపాటు తిరుమలలో జరిగే శ్రీవారి ఉత్సవాలను తిలకిస్తారని పురాణాలు పేర్కొంటున్నాయి. ధ్వజారోహణానికి ముందు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు పరివార దేవతలతో కలిసి తిరుచ్చి వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగారు. భక్తుల వీక్షణ.. విష్వక్సేనుడి పర్యవేక్షణ సోమవారం సాయంత్రం శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమాన్ని వైఖానస ఆగమశాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించే కార్యక్రమానికి అంకురార్పణతో శ్రీకారం చుట్టారు. ముందుగా విష్వక్సేనుడు ఛత్రచామరాలు, మేళతాళాల నడుమ ఆలయ పురవీధుల్లో ఊరేగారు. అనంతరం యాగశాలకు చేరుకుని భూమిపూజ నిర్వహించారు. నిర్ణీత పాళికల్లో శాలి, వ్రీహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు తదితర నవధాన్యాలతో బీజావాపం చేశారు. పాళికల్లో వేసిన విత్తనాలు శుక్లపక్ష చంద్రునిలా దినదినాభివృద్ధి చెందాలని, బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని అర్చకులు ప్రార్థించారు. అనంతరం రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహించారు. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమలకు విచ్చేసి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనం అందజేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపల జరిగిన పెద్ద శేష వాహన సేవను సీఎం వీక్షించి తరించారు. పెద్ద శేష వాహనంపై అభయముద్ర బ్రహ్మోత్సవాలలో తొలి రోజు మంగళవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు ఏడు తలల పెద్ద శేష వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ దాస్యభక్తికి ప్రతీకగా నిలుస్తాడు. పటిష్ట బందోబస్తు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసు, టీటీడీ విజిలె న్స్, ఎస్పీఎఫ్, ట్రాఫిక్, అగ్నిమాపక, వైద్య తదితర విభాగాల సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. -
బైక్‌ను ఢీకొన్న కారు
– వృద్ధుడి మృతి నాయుడుపేటటౌన్: మండల పరిధిలోని మేనకూరు సెజ్ వద్ద లాయల్ పరిశ్రమ సమీపంలో రహదారిపై సోమవారం సాయంత్రం బైక్‌ను కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓజిలి మండలం, మానవాలి గ్రామానికి చెందిన ముసులూరు గోపాలయ్య(65) మృతిచెందాడు. పోలీసుల కథనం.. మానవాలి గ్రామానికి చెందిన గోపాలయ్య బైక్‌పై మేనకూరు గ్రామానికి వస్తున్నారు. మార్గమధ్యంలో రాయల్ టైక్స్టైెల్స్ పరిశ్రమ సమీపంలో రహదారి వద్దకు వచ్చే సరికి వెనుక నుంచి వస్తున్న కారు వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో గోపాలయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ శివశంకర్ తెలిపారు. పోక్సో కేసుపై విచారణ నాయుడుపేట టౌన్: పోక్సో కేసుపై నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు విచారణ చేపట్టారు. మండల పరిధిలోని మేనకూరు గ్రామానికి చెందిన కందాటి రజనీపై ఇటీవల పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన ప్రదేశం, తదితర ప్రదేశాలను డీఎస్పీ ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించారు. డీఎస్పీతో పాటు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శివశంకర్ ఉన్నారు. -
వైభవంగా కల్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు
ధ్వజారోహణంతో ముక్కోటి దేవతలకు ఆహ్వానం తిరుపతి రూరల్: తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం సాయంత్రం ఆగమోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్టించారు. అంతకుముందు భేరిపూజ, భేరితాడనం, ధ్వజపటం, నవసంధి, మాడవీధి ఉత్సవం, ఆస్థానం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద శేషునిపై పరమాత్ముడు బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు రాత్రి పెద్ద శేష వాహన సేవ కన్నులపండువగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారు ఏడుతలల పెద్దశేష వాహనంపై పరమపదనాథుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7.30 నుంచి 9.30 గంటల వరకు జరిగిన వాహన సేవకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి పాల్గొన్నారు. కంకణ ధారణ శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలనే సంకల్పంతో ఆలయ వ్యవస్థాపకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మి దంపతులు కంకణధారణ చేసుకున్నారు. ధ్వజారోహణం సందర్భంగా కంకణం కట్టుకుని దీక్ష చేపట్టారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలకు సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. అనంతరం విశ్వక్సేనులవారు తుమ్మలగుంట గ్రామంలో విహరిస్తూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పట్టువస్త్రాలు సమర్పణ తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి పెద్ద శేష వాహన సేవకు పాకాల మండలం దామలచెరువు, ఉప్పరపల్లి, పెద్ద రామాపురం, కొత్త వడ్డేపల్లి, మొగరాల, రమణయ్యగారిపల్లి, గానుగపెంట, ఇ.పాలగుట్టపల్లి, వల్లివేడు, పేరసానిపల్లి, మద్దినాయునిపల్లి, పదిపుట్లబైలు గ్రామాలకు చెందిన భక్తులు పట్టువస్త్రాలు తీసుకువచ్చి సమర్పించారు. సారె తెచ్చిన భక్తులకు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఎదురేగి స్వాగతం పలికారు. -
నేడు వెంకటగిరి పోలేరమ్మ జాతర చాటింపు
సైదాపురం/వెంకటగిరి రూరల్: వెంకటగిరి శక్తిస్వరూపిణి శ్రీ పోలేరమ్మ తల్లి జాతరకు ఏట్లు పూర్తయ్యాయి. నేడు జాతర చాటింపుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలిరానున్నారు. బుధవారం వెంకటగిరి రాజాల నుంచి తాంబులాలు పుచ్చుకొని రాజర నిర్వహణకు అనుమతి తీసుకొని జాతరకు సంబంఽధించి తొలి చాటింపు వేయనున్నారు. 23 రెండో చాటింపు, 27 ఘటోత్సవం, 30 అమ్మవారి నిలుపు, అక్టోబర్ 1న అమ్మవారి సాగనంపు జరగనుంది. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తాంబూలం స్వీకరణ నేడు ప్రతి ఏటా వెంకటగిరిలో జరగనున్న పోలేరమ్మతల్లి జాతరకు సంబంఽధించి వెంకటగిరి రాజా కుటుంబీకుల వద్ద నుంచి అమ్మవారి సేవకులు, రెడ్డి పెత్తందారలకు రాజా ప్యాలెస్‌లోని బొడ్డిచావిడి వద్ద దేవదాయశాఖ అధికారుల సమక్షంలో జాతర నిర్వహణకు తాంబూలం స్వీకరించనున్నారు. అనంతరం జాతరకు సంబంధించి మొదటి చాటింపు అదేరోజు అర్ధరాత్రి వేస్తారు. దీంతో వెంకటగిరిలో అమ్మవారి జాతర ప్రారంభమవుతుంది. -
ఆరోగ్యశ్రీ నిధులు గోల్మాల్
సాక్షి, టాస్క్‌ఫోర్స్: శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో భారీ అవినీతి కుంభకోణం బయటపడింది. ఆరోగ్యశ్రీ, ఏపీవీపీ నిధులను ఇద్దరు ఉద్యోగులు స్వాహా చేసినట్టు తేలింది. ప్రాథమిక విచారణలో స్వాహా సొమ్ము రూ.25 లక్షలుగా తేలిందని, మరింత లోతుగా విచారణ చేస్తే రూ.కోటి వరకు అవినీతి బయటపడవచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆ మేరకు అవినీతికి పాల్పడ్డ ఇద్దరు ఉద్యోగులపై మంగళవారం టూ టౌన్ పోలీసులకు ఆస్పత్రి సూపరింటెండెంట్ మురళి ఫిర్యాదు చేశారు. వివరాలు.. ఆస్పత్రి పరిపాలనా సౌలభ్యంలో భాగంగా ఆర్థిక లావాదేవీల పనులను ఎల్డీసీగా ఉన్న లక్ష్మీప్రసన్న, పోస్టుమార్టం అసిస్టెంట్‌గా ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చందుకు యాజమాన్యం అప్పగించింది. ఈ క్రమంలో లక్ష్మీప్రసన్న ప్రస్తుతం మెటర్నిటీ సెలవులో ఉండగా చెక్కుల డ్రా చేసే పనిని చందూకు అప్పగించారు. ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ నిధుల్లో గోల్మాల్ జరిగినట్టు బయటకు పొక్కడంతో సంబంధిత అధికారులకు అనుమానం వచ్చి విచారణ చేపట్టారు. ఇందులో ప్రాథమికంగా రూ.25 లక్షలు స్వాహా చేసినట్టు తేలింది. ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా ఆ స్థాయిలో నిధులు స్వాహా చేసి ఉంటారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి చైర్మన్‌గా, ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరు నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది. కూటమి నేతలు సభ్యులుగా ఉన్న ప్రభుత్వాస్పత్రిలో ఇంత పెద్ద మొత్తంలో నిధులు గోల్మాల్ కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
తిరుపతి @ 66 డివిజన్లు
తిరుపతి తుడా: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 66 డివిజన్లకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం రాజముద్ర వేసింది. కార్పొరేషన్ 50 డివిజన్ల నుంచి 66కు పెంచుతూ ఫైనల్ నోటిఫికేషన్‌తో కూడిన గెజిట్‌ను మంగళవారం విడుదల చేసింది. ఇటీవల అభ్యంతరా లు, సూచనలు ఉంటే చేయాలని ఏడు రోజుల పాటు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మొత్తం 33 ఫిర్యాదులు, అభ్యంతరాలు కార్పొరేషన్‌కు అందాయి. వాటిని పరిశీలించిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చిన్న మార్పులు, చేర్పులు చేసి ప్రభుత్వానికి నివేదించారు. ఈ క్రమంలో ప్రభుత్వం 66 డివిజన్లకు ఆమోదం తెలిపింది. -
పింఛన్ల దరఖాస్తుకు నేటితో ఆఖరు
తిరుపతి అర్బన్: ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏడాదికి రెండు సార్లు ( 6 నెలలకు ఒకసారి) కొత్త పింఛన్లు మంజూరు చేస్తూ వచ్చారు. పింఛన్ల జారీకి సంబందించి దశాబద్దాలుగా ఇదే తంతు కొనసాగుతుంది. అయితే చంద్రబాబు సర్కార్ 2024 జూలై 12న కొలువుదీరిన నాటి నుంచి ఇప్పటి వరకు కొత్త పింఛన్లకు చాన్స్ ఇవ్వలేదు. 27 నెలలు తర్వాత తాజాగా ఈనెల 7 నుంచి 16వ తేది వరకు కొత్త పింఛన్ల దరఖాస్తులు కూటమి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే 12,13,14 తేదీల్లో సెలువులు రావడంతో కేవలం 7 రోజులు మాత్రమే గ్రామ, వార్డు సచివాల యాల్లో దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే తక్కువ సమయం ఇచ్చారంటూ పలువురు గగ్గొలు పెడుతున్నారు. జిల్లాలో సుమారుగా 60 వేల మంది వరకు కొత్త పింఛన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి సిద్దంగా ఉన్నారు. అయితే ఇప్పటి( మంగళవారం) వరకు 41,260 మంది మాత్రమే దరఖాస్తులు చేసుకున్నారు. బుధవారంతో దరఖాస్తుకు గడువు ముగుస్తోంది. దాదాపుగా ఇంకా 19 వేల మందికి పైగా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉందని తెలుస్తుంది. ఒక్క రోజులో వీరందరు దరఖాస్తులు చేసుకోవడం సాధ్యంకాదని పలువురు ఆందోళన చెందుతున్నారు. కొత్త పింఛన్లకు దరఖాస్తులు ఇలా... వృద్ధాప్య పింఛన్‌కు 22,411 మంది వితంతువులుు 10,482 వికలాంగులు 4,369 డప్పు కళాకారులు 1881 నేత కార్మికులు 657 చర్మకారులు 533 కల్లుగీత కార్మికుల 374 ఫిషర్స్ మెన్స్ 308 ఒంటరి మహిళలు 221 ట్రాన్స్‌జెండర్స్ 24 మంది మొత్తం 41,260 మంది దరఖాస్తులు చేసుకున్నారు -
4.6 కిలోల గంజాయితో మహిళ అరెస్ట్
– గతంలోనూ దొంగతనాలు, గంజాయి కేసుల్లో నిందితురాలు తిరుపతి: గంజాయిని తరలిస్తున్న ఓ మహిళను ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి 4.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీకాం కళాశాల సమీపంలో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడ నిఘా పెట్టి గంజాయితో పట్టుబడిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా, మంగసముద్రానికి చెందిన లక్ష్మీదేవి గంజాయి తరలిస్తూ పట్టుబడింది. ఆమైపె గతంలోనూ పలు దొంగతనాలు, గంజాయి కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఆయా కేసుల్లో అరైస్టె జైలు జీవితం గడిపినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితురాలిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్వీ యూనివర్సిటీ సీఐ నరేష్ తెలిపారు. లారీ అదుపు తప్పి వ్యక్తి మృతి ఓబులవారిపల్లె : చిన్నఓరంపాడు–ముక్కావారిపల్లి జాతీయ రహదారిపై శనివారం లారీ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ బీ.మురళి (50) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ సుజున్కుమార్ కథనం మేరకు.. తాడిపత్రికి చెందిన లారీ డ్రైవర్ మురళి లోడ్డుతో చైన్నెకి బయల్దేరాడు. మార్గమధ్యంలోని చిన్న ఓరంపాడు వద్ద రోడ్డు మరమ్మతుల కారణంగా లారీ కల్వర్టు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. విషయాన్ని గమనించిన డ్రైవర్ మురళి కుడివైపునకు దూకగా లారీ అతనిపైకే వెళ్లి పడింది. దీంతో మురళి అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు దర్యాప్తులో ఉంది. వృద్ధురాలిపై దాడి చేసి.. బంగారు నగలు అపహరించి.. నాగలాపురం: పట్టపగలే గుర్తుతెలియని మహిళ ఓ వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి దాడి చేసి, బంగారు ఆభరణాలు అపహరించుకెళ్లిన ఘటన శనివారం మధ్యాహ్నం నాగలాపురం బజారు వీధిలో చోటుచేసుకుంది. బాధితురాలు ఉష (72) తెలపిన వివరాల ప్రకారం.. ఓ గుర్తుతెలియని మహిళ శనివారం ఉదయం నుంచి ఇంటికి ఎదురుగా ఉన్న కాయగూరల దుకాణం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించింది. మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయంలో ఉష ఇంట్లోకి వెళ్లిన వెంటనే ఆ మహిళ చొరబడి ఆమైపె దాడి చేసి మెడలో ఉన్న మూడు సవరల బంగారు చైను, చెవి కమ్మలు అపహరించుకొని పరారైంది. ఉష ఇంటి నుంచి బయటకు వచ్చి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సునీల్ తెలిపారు. ఫ్రీ మెడికల్ చెకప్ పేరుతో చంపేశారు! – ప్రెస్‌క్లబ్‌లో కుటుంబ సభ్యుల ఆరోపణ తిరుపతి అన్నమయ్యసర్కిల్: ఫ్రి మెడికల్ చెకప్ పేరుతో రేణిగుంట బాలాజీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ అండ్ రీసెర్స్ ఇన్స్టిట్యూట్ వారు తీసుకెళ్లి తమ తండ్రి ఆర్.గోవిందస్వామి (72)ని చంపేశారని కేవీబీపురం మండలం, రాజులకండ్రిగ గ్రామానికి చెందిన కుమారుడు గిరి, కుటుంబ సభ్యులు ఆరోపించారు. శనివారం సాయంత్రం వారు తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. గత నెల ఆగస్టు 10వ తేదీన రాజులకండ్రిగకు వచ్చిన హాస్పిటల్ సిబ్బంది ఉచిత వైద్య పరీక్షల పేరుతో ఆరోగ్యంగా ఉన్న తమ తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లారని చెప్పారు. ఆపై 13వ తేదీన మీ తండ్రి చనిపోయాడని కబురు వచ్చినట్టు పేర్కొన్నారు. మరణ ధ్రువీకరణ పత్రంలోనూ వేర్వేరు సమయాలు ఉండడం అనుమానాలకు తావిస్తోందన్నారు. తమ తండ్రి మృతిపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
తుమ్మలగుంటలో.. విభూది వినాయకుడు
తిరుపతి రూరల్: విభూది పరిమళం.. మంచు కొండల నడుమ గణనాథుడి దివ్యరూపం.. భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా తుమ్మలగుంటలో ఈ ఏడాది విభూది వినాయకుడు కొలువు దీరనున్నాడు. ప్రముఖ శైవక్షేత్రాల నుంచి సేకరించిన పవిత్ర విభూదిని వినాయకుని ప్రతిమ తయారీకి వినియోగిస్తున్నారు. అత్యద్భుతంగా రూపుదిద్దుకునే విభూది వినాయకున్ని చూసేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత 15 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్ చెవిరెడ్డి కుటుంబీకుల సహకారంతో బాల వినాయక కమిటీ సభ్యులు విభిన్న ఆకృతులతో గణపతి ప్రతిమలను తయారు చేయించి భక్తులకు కనువిందు కలిగించడం ఆనవాయితీగా వస్తోంది. వినాయక చవితి నుంచి 9 రోజుల పాటు ప్రత్యేకంగా పూజలు చేస్తూ గణేశుని దర్శనభాగ్యం కలిగిస్తున్నారు. అంతేగాక ఆ వినాయకుని ప్రతిమ తయారీలో ఎలాంటి రసాయనాలకు తావులేకుండా మట్టి, గడ్డి, చెక్కను మాత్రమే వినియోగిస్తున్నారు. తుమ్మలగుంటలో వరుసగా ఐదేళ్లు పాటు ఏర్పాటు చేసిన వినాయకుని ప్రతిమల జాబితాను పరిశీలిస్తే పైనాపిల్ వినాయకుడు, నారికేళ వినాయకుడు, తమలపాకు వినాయకుడు, నెమలి పింఛ వినాయకుడు, తుంబుర వినాయకుని ప్రతిమలను భక్తులు దర్శించారు. అదే సమయంలో ఈ ఏడాది విభూది వినాయకుని ప్రతిమను తయారు చేయించి చవితి రోజున భక్తులకు దర్శనభాగ్యం కలిగించనున్నారు. కల్యాణ మండపంలో కొలువు ఈ ఏడాది వినాయక చవితి పర్వదినం రోజునే తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం కానున్నాయి. దీంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విభూది వినాయకుడిని ఆలయంలోని కల్యాణ మండపంలో ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. 7 టన్నుల విభూదితో.. ప్రముఖ శైవక్షేత్రాల నుంచి సేకరించిన సుమారు 7 టన్నుల విభూదిని ఉపయోగించి 11 అడుగుల ఎత్తు, 7 అడుగుల వెడల్పుతో విభూది వినాయకుడి ప్రతిమను రూపొందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన 16 మంది కళాకారులు వారం రోజులుగా విగ్రహ తయారీలో నిమగ్నమయ్యారు. మంచుకొండల మధ్య విభూది వినాయకుడు కొలువుదీరినట్టుగా ప్రతిమను తీర్చిదిద్దుతున్నారు. విగ్రహం తయారీ పనులను బాల వినాయక కమిటీ సభ్యులు దగ్గరుండి పర్యవేక్షిస్తుండగా చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. -
కన్నీరే మిగిలిందిక నేస్తం!
కలిసిరాని నిమ్మ సైదాపురం: ఎల్‌నినో ప్రభావం నిమ్మ రైతులను తీవ్ర నష్టాల్లో ముంచేసింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా సైదాపురం మండలంలో నిమ్మచెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. నిమ్మ రైతులు భగీరథయత్నాలు చేసినా ప్రయోజనం లేదు. చినకు కోసం పరితపించినా చివరకు కన్నీరే మిగులుతోంది. పసిబిడ్డలా పెంచిన చెట్లు తమకళ్లెదుటే నిలు వునా వాడిపోతుండడంతో కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తోంది. కండలేరు జలాయశం కూడా అడుగంటడంతో చెరువులు సైతం ఎండిపోతున్నాయి. ధరలు బాగు.. వర్షాలు జాగు సైదాపురం, డక్కిలి, బాలాయపల్లి, రాపూరు, వెంకటగిరి, కలువాయి మండలాల్లో సుమారు 25వేల హెక్టార్లులో నిమ్మ తోటలు సాగు చేస్తున్నారు. గడిచిన మూడేళ్లుగా అతివృష్టి, అనావృష్టి కారణంగా నిమ్మతోటల రైతులకు కష్టాలే మిగులుతున్నాయి. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. వేలకు వేలు ఖర్చుపెట్టి బోర్లు వేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. బస్తా రూ.25 వేల వరకు పలికినా ఫలితం లేదు. కాలం కలిసిరాక.. చెట్లకు కాయల్లేక దిగాలు చెందాల్సి వస్తోంది. ఈ ఫొటోలో ఉన్న రైతు పేరు ఆవుల జయరామయ్య. ఊరు సైదాపురం. ఆయన గత 15 ఏళ్లుగా నిమ్మతోటలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం నిమ్మ ఽకాయల ధరలు ఆకాశాన్ని అంటగా.. చెట్లకు కాయలు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాభావం కారణంగా తమ కళ్లెదుటే చెట్లకు సాగు నీరందక ఎండిపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. మూడు బోర్లు వేసినా చుక్క నీరు రాక అప్పుల్లో కూరుకుపోయాడు. గత కొద్ది రోజుల నుంచి కాస్తున్న ఎండలకు చెట్ల ఆకులు సైతం ఎండిపోయి రాలిపోవడంతో చూస్తూ కుమిలిపోతున్నాడు. -
బస్సు ఇంజిన్‌లో చెలరేగిన మంటలు
నాయుడుపేట టౌన్: మండల పరిధిలోని పుదూరు గ్రామ సమీపంలో గోశాల వద్ద ఆర్టీసీ బస్సు ఇంజిన్‌లో నుంచి చిన్నపాటిగా పొగలు చెలరేగాయి. దీంతో బస్సు డ్రైవర్ పి.మురుగన్ చాకచక్యంగా బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందికి దించివేసి అప్రమత్తం చేశారు. వివరాలు.. వాకాడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శనివారం సాయంత్రం నాయుడుపేట నుంచి ప్రయాణికులను తీసుకుని మల్లాంకు బయలుదేరింది. ఈ బస్సులో 73 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. బస్సు పుదూరు గ్రామం దాటిన తర్వాత ఇంజిన్‌లో నుంచి చిన్నపాటి పొగ, మంటలు రావడంతో డైవర్ అప్రమత్తమయ్యారు. బస్సు ఇంజిన్ వద్ద వైర్ల రాపిడి వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని డ్రైవర్ తెలిపారు. ఈ విషయమై డ్రైవర్‌తో పాటు కండెక్టర్ కె.కోటయ్య వాకాడు డిపో మేనేజర్‌కు సమాచారం అందించడంతో ఆయన వెంటనే స్పందించి మెకానిక్‌ను పంపించారు. అయితే అరగంట తర్వాత బస్సును స్టార్ట్ చేయడంతో స్టార్ అయ్యిందని, మంటలు రాలేదని కండెక్టర్ వెల్లడించారు. -
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 72,408 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,691 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.39 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. 21 నుంచి వస్త్రాల ఈ–వేలం తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు ఈ – వేలం వేయనున్నారు. కొత్తవి ఆర్ట్ సిల్క్ శారీస్ 132 లాట్లు ఉన్నాయి. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయం (వేలములు) 0877–2264429 నంబరులో గానీ, టీటీడీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆదాయ పన్ను చెల్లించండి తిరుపతి అర్బన్: ముందస్తు ఆదాయ పన్ను చెల్లించడం ద్వారా పలు ప్రయోజనాలు ఉన్నాయని ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ లోకేష్, తిరుపతి ఆదాయపు పన్ను అధికారి వసంతలక్ష్మి తెలిపా రు. శనివారం తిరుపతిలో చాంబర్ ఆప్ కామర్స్ ఆధ్వర్యంలో నగరంలోని వ్యాపారులకు ఆదాయ పన్ను చెల్లింపుపై అవగాహన కల్పించారు. ఈ నెల 15న రెండవ కంతు కట్టుకునే అవకాశం ఉందని వివరించారు. వ్యాపారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 14న పీజీఆర్ఎస్ రద్దు తిరుపతి అర్బన్: జిల్లా కలెక్టరేట్‌తోపాటు మండల, డివిజన్ కేంద్రాల్లో ఈనెల 14 సోమవారం నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ను వినాయకచవితి పండుగ నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అంశాన్ని గుర్తించాలని సూచించారు. నీళ్ల సీసాలపై ఆరోగ్యశాఖ కొరడా తిరుమల : తిరుమలలో తాగునీటి గ్లాస్ వాటర్ బాటిళ్లను సరఫరా చేసే కంపెనీలపై ఆరోగ్యశాఖ కొరడా ఝుళిపించింది. తిరుమలకు వాటర్ బాటిళ్లు సరఫరా చేస్తున్న నాలుగు కంపెనీలకు సంబంధించిన వాటర్ బాటిళ్లను ఆరోగ్యశాఖ అధికారులు ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్‌లో తనిఖీలు చేపట్టారు. సదరు వాటర్ బాటిళ్లలోని నీటిలో ఎఫ్ఎస్ఎస్సీఐ ప్రమాణాలకు తగిన విధంగా మినరల్స్ అందుబాటులో లేవని తేలింది. అదేవిధంగా సరైన నాణ్యత లేకపోవడంతో వాటిని తిరుమలకు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేసినట్లు టీటీడీ ఆరోగ్యశాఖ డిప్యూటీవో సోమన్నారాయణ తెలిపారు. తిరిగి తగిన ప్రమాణాలను ల్యాబ్ నివేదికలో నిరూపించుకున్న కంపెనీలకు అనుమతిస్తామని తెలిపారు. -
ప్రభుత్వ లాగిన్‌తో ‘పచ్చ’ రాజకీయం!
తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం, మల్లంగుంట గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌కు సంబంధించిన ప్రభుత్వ లాగిన్న్ను టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి వినియోగించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. రెండో శనివారం సెలవు రోజున సచివాలయంలో ఉద్యోగులు లేకపోయినా.. ఓ వ్యక్తి డిజిటల్ అసిస్టెంట్ సీటులో కూర్చొని పింఛన్లకు సంబంధించిన వివరాలను ప్రభుత్వ లాగిన్న్లో నమోదు చేస్తుండడాన్ని గ్రామస్తులు గుర్తించి నిలదీశారు. లాగిన్ ఉద్యోగిది.. పెత్తనం పార్టీదా? మల్లంగుంట సచివాలయంలో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్ పదోన్నతితో బదిలీ కాగా ఆమె స్థానంలో మహిళా పోలీసుకు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఆమె కూడా ప్రస్తుతం మెటర్నిటీ సెలవులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగికి చెందిన లాగినన్ ఓ టీడీపీ కార్యకర్త చేతిలోకి ఎలా వెళ్లిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ లాగిన్‌తో ఎవరెవరి పింఛన్ల వివరాలు నమోదు చేశారు? ఎంత మంది దరఖాస్తులు స్వీకరించారు? వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుల పింఛన్లు తొలగించారా..? అనే అంశాలపై జిల్లా అధికారులు సమగ్రంగా పరిశీలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
పరిహారం ఆరగించి.. కబ్జాకు తెరలేపి!
రామచంద్రాపురం: కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని పరిహారంగా తీసుకుని మళ్లీ ఆ భూమి తనదేనంటూ ఓ వ్యక్తి ఆక్రమణకు తెరలేపిన ఘటన మండలంలో కలకలం రేపింది. కూటమి నేతల అండదండలతో సదరు రైతు కబ్జాకు పాల్పడడం విమర్శలకు తావిస్తోంది. వివరాలు.. మండలంలోని పీవీపురం పంచాయతీ, బలిజపల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.210, 211, 212లో ఎనిమిది ఎకరాల భూమిని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు అందించే లక్ష్యంతో ‘జగనన్న కాలనీ‘ కోసం సేకరించారు. సదరు భూమికి సంబంధించి యజమాని లోకనాథ్‌రెడ్డికి అప్పటి మార్కెట్ విలువ ప్రకారం కోటి రూపాయలకు పైగా చెల్లించారు. అయితే ఇప్పుడు అధికార పార్టీ అండదండలతో సదరు వ్యక్తి ఆ భూమి తనదేనంటూ శనివారం కబ్జాకు యత్నించాడు. తాను ప్రభుత్వానికి ఇచ్చినదే గాక అధనంగా మరో నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమతులు లేకుండానే విద్యుత్ లైన్ ఏర్పాటు ఎలాంటి అనుమతులు లేకుండానే కబ్జాదారుడు విద్యుత్ లైన్‌ను లాగేశాడు. అంతేకాకుండా, హడావుడిగా బోర్ మోటార్ బిగించి, జేసీబీల సాయంతో భూమిని చదును చేసేందుకు భారీ ప్లాన్ వేశాడు. తహసీల్దార్ వార్నింగ్ ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ మధుసూదన్‌రావు హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, జగనన్న కాలనీ కోసం కేటాయించిన భూమి జోలికి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. నేరుగా జైలుకే వెళ్తావంటూ గట్టిగా హెచ్చరించడంతో కబ్జాదారుడు వెనక్కితగ్గాడు. గతంలో జగనన్న కాలనీకి ఎనిమిది ఎకరాల సేకణ -
కిక్కు.. తమ్ముళ్లకే లక్కు!
తిరుపతి అర్బన్: మళ్లీ మద్యం దుకాణాలను తమ్ముళ్లకే కట్టబెట్టేశారు. టెండర్లు పిలవకుండా, లక్కీ డిప్‌నకు ఛాన్స్ లేకుండా, ఽలైసెన్స్ ధరలు పెంచకుండా తమ్ముళ్లకే అప్పగించేశారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాల లైసెన్స్‌ను ఈ నెల 12 నుంచి 21వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు పునరుద్ధరణ చేసుకోవాలని తిరుపతి, చిత్తూరు జిల్లాల ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ వెల్లడించారు. శనివారం ఆయన కలెక్టరేట్లోని ఎకై ్సజ్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో 233 మద్యం దుకాణాలు ఓపెన్ కేటగిరిలోను, 22 దుకాణాలు గీత కులాల వారి పరిధిలో నడుస్తున్నాయని చెప్పారు. ఈ నెల 30వ తేదీకి లైసెన్స్ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ నెల 12 నుంచి 21వ తేదీ వరకు ఆప్లైన్ లేదా ఆన్లైన్ ద్వారా తమ లైసెన్స్‌ను 2026–27కి సంబంధించి రెన్యూవల్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. రెన్యూవల్ చేసుకోకుంటే వాటిని ఖాళీలుగా చూపించి కొత్తగా టెండర్లు ఆహ్వానించడం జరుగుతుందని స్పష్టం చేశారు. లైసెన్స్ మొత్తాన్ని నాలుగు దశల్లో చెల్లించే సౌకర్యం కల్పించామని వెల్లడించారు. 2026–27కు సంబంధించి వార్షిక రిటైల్స్ ఎకై ్సజ్ పన్నులో ఎలాంటి మార్పులు చేయకుండా గతంలో ఉన్న ధరలే నిర్ణయించినట్లు చెప్పారు. -
నైలెట్పై సందిగ్ధం
●తిరుపతి సిటీ: తిరుపతి నుంచి నైలెట్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్‌ను అమరావతికి తరలిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఎస్వీయూ వద్ద జెన్‌జెడ్ భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీలకతీతంగా యువత, స్థానికులు, విద్యార్థి, యుజవన సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. దీంతో ప్రభుత్వం తర్జన భర్జనలో పడింది. ఆగమేఘాల మీద నైలెట్ తాత్కాలిక క్యాంపస్ డైరెక్టర్‌తో ప్రెస్‌మీట్ పెట్టించి వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. అబ్బే...అదేం లేదు! తిరుపతి నైలిట్ కేంద్రం తరలింపు అపోహ మాత్రమేనని.. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్వీయూలోని నైలెట్ కార్యాలయ డైరెక్టర్ శశికుమార్ తెలిపారు. శనివారం ఆయన ఎస్వీయూలోని నైలెట్ క్యాంపస్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నైలెట్ శాశ్వత క్యాంపస్ కోసం స్థలం కేటాయించాలని విన్నవించామని, కుర్రకాలువ వద్ద ఉన్న స్థలం చూపించారని తెలిపారు. ఆ స్థలం పరిశీలించామని తిరుపతికి రిమోట్ ఏరియాలో ఉందని నైలెట్‌కు అంత అనువుగా లేదని తెలిపారు. ఎస్వీయూ పరిసరాలలో 5 ఎకరాలు స్థలం కేటాయించాలని విన్నవించామని, ప్రస్తుతం ఆ దిశగా అధికారులు పరిశీలిస్తున్నారని చెప్పారు. నైలిట్కు కేంద్రం 2024 జనవరి 4న ఆమోదం లభించిందని, నిర్వహణ బాధ్యతలను నైలిట్ చైన్నె విభాగానికి అప్పగించారన్నారు. తాత్కాలికంగా 8 వేల చ.అ.వి పదేళ్ల అగ్రిమెంట్‌తో కేంద్రం కార్యకలాపాలు ప్రారంభించిందని, మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.850.09 లక్షలు కాగా, ఇందులో మైటీ వాటా రూ.693.25 లక్షలని తెలిపారు. ఇప్పటివరకు విద్యార్థులు, నిరుద్యోగులు, అధ్యాపకులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు, పోలీసులు అధికారులకు సుమారు 4,300 మందికి పైగా వివిధ సాంకేతిక శిక్షణ కార్యక్రమాలు అందించారన్నారు. త్వరలో ఇండియా ఏఐ ల్యాబ్‌ను సైతం నైలెట్‌లో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. స్పష్టత ఏదీ? తిరుపతి ప్రజలను, రాయలసీమ యువతను మభ్యపెట్టే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోంది. నైలెట్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ తిరుపతిలోనే ఏర్పాటు చేస్తున్నట్లు గతంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ దిశగా తిరుపతిలో నైలెట్ ఏర్పాటుకు స్థలం కేటాయించకుండా బుకాయింపు మాటలు చెప్పడం దారుణం. అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీ అంటూ నైలెట్ డీమ్డ్ వర్సిటీకి సీఆర్డీఏ నుంచి 8 ఎకరాలు స్థలం కేటాయించినట్లు మంత్రి స్పష్టం చేయడం వెనుక ఆంతర్యమేమిటి. తిరుపతిలో నైలెట్ డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వకుండా దాటవేత ధోరణిని ప్రదర్శించడంతోనే ప్రభుత్వ వైఖరి స్పష్టమవుతోంది. – ఎం.గురుమూర్తి, ఎంపీ, తిరుపతి -
లోక్ అదాలత్‌లో 3,442 కేసుల పరిష్కారం
తిరుపతి లీగల్: తిరుపతి కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్‌అదాలత్‌లో 3,442 కేసులు పరిష్కారమైనట్టు తిరుపతి మూడవ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ ఎం.గురునాథ్ మీడియాకు తెలిపారు. పరిష్కారమైన కేసుల్లో కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 249 కేసులు, వ్యాజ్యం వేయని బ్యాంకు, బీఎస్ఎన్ఎల్కు సంబంధించిన 22 కేసులు, మొదటి ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టుకు సంబంధించి జరిమానా చెల్లించే 1,395 కేసులు, రెండవ ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టుకు సంబంధించిన జరిమానా చెల్లించే 1,776 కేసులు ఉన్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. కేసుల పరిష్కారం కోసం ఐదు బెంచులను ఏర్పాటు చేసినట్టు న్యాయమూర్తి తెలిపారు. తనతోపాటు ఆ బెంచ్‌లకు అధ్యక్షులుగా తిరుపతి నాల్గవ అదనపు జిల్లా జడ్జి అర్చన, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వెన్నెల, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ లెనిన్ బాబు, మొదటి జూనియర్ సివిల్ జడ్జి రమాదేవి వ్యవహరించారన్నారు. ‘ఆర్ఐఎంసీ’కి 30 వరకే గడువు తిరుపతి అర్బన్: రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (ఆర్ఐఎంసీ) 2027 విద్యా సంవత్సరంలో 8వ తరగతి ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష దరఖాస్తుకు ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఉందని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యాక్షులు, విశ్వం విద్యాసంస్థల అధినేత విశ్వనాథ్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 6న పరీక్ష ఉంటుందని చెప్పారు. ఈ పరీక్షకు 2013 జూలై 2 నుంచి 2015 జనవరి 1 మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. పరీక్షకు మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ ప్రధాన అంశాలుగా ఉంటాయని వివరించారు. అదనపు సమాచారం కోసం 8688888802, 9399976999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
క్యాంపస్ డ్రైవ్‌లో ‘శ్రీరామ’ విద్యార్థుల ప్రతిభ
తిరుపతి సిటీ: కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం యత్వా ఎనర్జీ సొల్యూ షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్‌లో పలువురు విద్యార్థులు ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కళాశాల చైర్మన్ మన్నెం రామిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సాంకేతిక విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి, ప్లేస్మెంట్ శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. సక్రటరీ మన్నెం రామసుబ్బారెడ్డి, డైరెక్టర్ మన్నెం అరవిందుకుమార్ రెడ్డి, ప్రిన్సిపల్ జయచంద్ర, వైస్ ప్రిన్సిపల్ వాసు, ప్లేస్మెంట్ ఆఫీసర్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎండీ రవిమారుతి రెడ్డి పాల్గొన్నారు. -
వినాయక మండపాలకు ఉచిత విద్యుత్
తిరుపతి రూరల్: వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్టు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే మండపాల్లో విద్యుత్ ప్రమాదాలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వినాయక మండపాలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 కిలోవాట్లు, పట్టణ ప్రాంతాల్లో 5 కిలోవాట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అత్యవసర సమాచారం కోసం 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. 14న స్విమ్స్ ఓపీ, ఓటీలకు సెలవు తిరుపతి తుడా: వినాయక చవితి పర్వదినం సందర్భంగా స్విమ్స్ ఓపీ, ఓటీ విభాగాలకు సెలవు ప్రకటించినట్టు డైరెక్టర్ డాక్టర్ జగదీష్ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర సేవలు యథాతథంగా కొనసాగుతాయన్నారు. -
గర్జించిన.. జెన్‌జెడ్
జిల్లా కేంద్రం తిరుపతిలో విద్యార్థిలోకం భగ్గుమంది. రాయలసీమ యువతకు ఉపాధి అవకాశాల కోసం శిక్షణనిచ్చే నైలెట్ శాశ్వత క్యాంపస్ తరలింపుపై గర్జించింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కుట్రలపై గళమెత్తింది. సీఎం సొంత జిల్లాకు ద్రోహం చేస్తారా..? అంటూ మండింది. న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన కాక్రొచ్ జెన్‌జెడ్ పోరును తలపించేలా కాక్రొచ్ ప్లకార్డులు చేతబూని ప్రభుత్వ వైఖరి ఖండించింది. నైలెట్ జోలికొస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేసింది. తిరుపతి సిటీ: నైలెట్ శాశ్వత క్యాంపస్‌ను తిరుపతి నుంచి అమరావతికి తరలింపునకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీల కతీతంగా జరిగిన జెన్‌జెడ్ ర్యాలీకి విశేష స్పందన లభించింది. శుక్రవారం ఎస్వీయూ రెండవ గేటు నుంచి వర్సిటీ ప్రధాన ద్వారం వరకు జరిగిన భారీ ర్యాలీకి తిరుపతి స్థానికులతో పాటు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందం తరలివచ్చి మద్దత్తు పలికారు. సుమారు మూడు వేల మందికి పైగా హాజరయ్యారు. ఈ ర్యాలీకి తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు, మాజీ మేయర్ డాక్టర్ శిరీష, సుమారు 16 విద్యార్థి సంఘాల నేతలు, నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు. జన్మనిచ్చిన జిల్లాకే ద్రోహం చేస్తారా? సీఎం చంద్రబాబుకు జన్మనిచ్చిన సొంత జిల్లా తిరుపతికి ద్రోహం చేయడంపై విద్యార్థులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హాయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఎంపీ గురుమూర్తి పోరాటంతో కేంద్రమంత్రులను ఒప్పించి తిరుపతికి ప్రతిష్టాత్మక నైలెట్‌ను తీసుకొస్తే సహించని కూటమి సర్కార్ పగపట్టి తరలించుకుపోవడం దారుణమని మండిపడ్డారు. జిల్లాలో ఏర్పేడు వద్ద రూ.100 కోట్లతో స్థాపించిన స్కిల్ డెవలెప్మెంట్ యూనివర్సిటీని సైతం అమరావతి తరలించారని మండిపడ్డారు. అలాగే నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీని సైతం తీసుకెళ్లారని ఆరోపించారు. ప్రస్తుతం వర్సిటీలో ఏర్పాటు చేసిన నైలెట్ సంస్థపై కన్నుపడిందని, దానిని సైతం అమరావతికి తరలించేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక ఆకర్షణగా కాక్రొచ్ ప్లకార్డులు జెన్‌జెడ్ ర్యాలీలో కాక్రొచ్ ప్లకార్డులు హల్చల్ చేశాయి. పార్టీలకతీతంగా పాల్గొన్న యువత, విద్యార్థులు, స్థానిక ప్రజలు ర్యాలీలో బాబు సర్కార్‌ను విమర్శిస్తూ కాక్రొచ్ చిత్రపటాలతో హెచ్చరించారు. తిరుపతి ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా కూటమి సర్కార్ వ్యవహరిస్తే కాక్రొచ్లు పుట్టుకొచ్చి నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. -
చంద్రగిరి నుంచే టీడీపీ పతనం
చంద్రగిరి: చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి నుంచే టీడీపీ పతనం ఆరంభం కావాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక్క ఎన్నిక కూడా ఏకగ్రీవం కాకుండా ప్రతి పంచాయతీలో వైఎస్సార్సీపీ అభ్యర్థులను బరిలోకి దించి గెలిపించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. చంద్రగిరిలో అత్యధిక స్థానాలను కై వసం చేసుకుని ఆ విజయాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డికి కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. చంద్రగిరిలో శుక్రవారం జరిగిన వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు, కరువు కవల పిల్లలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పుట్టిన నారావారిపల్లిలోనే రైతులకు నీటి కష్టాలు తప్పడం లేదన్నారు. కల్యాణీ రిజర్వాయర్‌లో నీరు లేక ఎండిపోతోందని తెలిపారు. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కరువు విలయతాండవం చేస్తుందని విమర్శించారు. ఒక్కటి కూడా ఏకగ్రీవం కాకూడదు స్థానిక ఎన్నికల్లో ఎక్కడా ఏకగ్రీవం కాకూడదన్న లక్ష్యంతో ప్రతి పంచాయతీలో అభ్యర్థులను బరిలోకి దించాలని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చంద్రగిరి నుంచే టీడీపీ పతనం ప్రారంభమవుతుందనే విషయాన్ని ఈ ఎన్నికల ద్వారానే ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. అభ్యర్థులను గెలిపించే వరకు వెన్నంటే ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. సమన్వయ కమిటీలతో సమీక్షలు ప్రతి పంచాయతీలో ఎన్నికలు ముగిసే వరకు తరచూ సమీక్షలు నిర్వహించాలని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తుడా ద్వారా చంద్రగిరి నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను ప్రతి గడపకూ చేర్చాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి కుటుంబం చేసిన మంచి దేశంలో ఏ నియోజకవర్గంలో జరగలేదన్నారు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డితో పాటు ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మహిళలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. -
నువ్వా.. నేనా?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అతిముఖ్యమైన తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల వేడి రాజుకుంది. గత పాలక వర్గం చేసిన గ్రేటర్ తిరుపతి తీర్మానంపై టీడీపీ, జనసేన నేతలు పథకం ప్రకారం నీళ్లు చల్లి మహానగరం విస్తరణకు మోకాలొడ్డారు, గ్రేటర్ చేసే ప్రక్రియలో భాగంగా చంద్రగిరి, తిరుపతి రూరల్, రామచంద్రాపురం, రేణిగుంట మండలాల్లోని 160కి పైగా పంచాయతీలను తిరుపతి కార్పొషన్‌లో విలేనం చేసే ప్రక్రియ జరిగింది. అయితే అధికార పార్టీకి చెందిన నాయకులు అభ్యంతరాలు తెలిపారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైంది. దీంతో గ్రేటర్ ప్రతిపాదనకు బ్రేక్ పడింది. 50 డివిజన్ల నుంచి 66 డివిజన్లతో కార్పొరేషన్ ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. అందుకు సంబంధించి ఓటర్ల విభజన జరిగిపోయింది. అయితే డివిజన్ల పునర్విభజన సరిగా జరగలేదని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ఆ పిటిషన్లను కొట్టివేయడంతో కార్పొరేషన్ ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఆశావహులు అధికం తిరుపతి మేయర్ కుర్చీ కోసం కూటమిలోని మూడు పార్టీల నేతలు కుస్తీపడుతున్నారు. రిజర్వేషన్ల విషయం కొలిక్కిరాకముందే నువ్వా.. నేనా అంటూ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. గ్రేటర్ తిరుపతి విషయాన్ని పక్కనబెట్టి మేయర్ కుర్చీ కోసం పాకులాడుతున్నారు. స్థానికంగా జనసేన ఎమ్మెల్యే ఉండడంతో మేయర్ పీఠం కూడా జనసేనకే కేటాయించాలని పట్టుబడుతుండగా.. ఎమ్మెల్యే జనసేనకు కేటాయించారు కాబట్టి ఈ సారి మేయర్ పీఠం తమకే ఇవ్వాలని టీడీపీ నేతలు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. బీజేసీ నేతలు కూడా తమ పలుకుబడిని ఉపయోగించి మేయర్ పీఠాన్ని అధిరోహించేందుకు గట్టిగానే కృషి చేస్తున్నట్టు సమాచారం. మూడు పార్టీల నుంచి పోటీ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికారాలన్నీ ఉపయోగించి మేయర్ పీఠం దక్కించుకోవాలని కూటమిలోని మూడు పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నాయి. మేయర్ పీఠం తమకే కావాలని జనసేన నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యేగా జనసేన అభ్యర్థి ఉన్న సమయంలో మేయర్ కూడా అదే పార్టీకి చెందిన వారు ఉంటే బాగుంటుందని, అభివృద్ధి విషయంలో కూడా చేదోడు వాదోడుగా ఉంటామని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. జనసేనకు ఎమ్మెల్యే ఇచ్చామని, మేయర్ టీడీపీకి ఇవ్వాలంటే కుదరదని పట్టుబడుతున్నారు. ఇదిలా ఉంటే మరో వైపు బీజేపీ కూడా మేయర్ పీఠాని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మేయర్ పీఠం కోసం కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఎవరికి వారు ఆశలు పెట్టుకున్నారు. అందు కోసం రిజర్వేషన్ల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్లు పక్కన పెడితే.. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు రిజర్వు (జనరల్) అయితే.. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మనుమరాలు కీర్తి ముందు వరుసలో ఉన్నారు. జనసేన వైపు నుంచి అన్నా అనిత మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇంకా టీడీపీ మహిళా జిల్లా మాజీ అధ్యక్షురాలు పుష్పావతి పేర్ల ప్రచారంలో ఉంది. లేదా జనరల్‌కు కేటాయిస్తే.. మబ్బు దేవనారాయణరెడ్డి కుటుంబం నుంచి, జేబీ శ్రీనివాసులు, కోడూరు బాలసుబ్రమణ్యం, నరసింహయాదవ్ కుటుంబం నుంచి ఒకరు పోటీలో ఉండే అవకాశం ఉంది. ఇంకా దంపూరి భాస్కర్ యాదవ్, కృష్ణయాదవ్, ఆర్సీ మునికృష్ణ తదితరులు మేయర్ పీఠాన్ని ఆశిస్తున్నారు. అనూహ్యంగా ఈ సారి బీజేపీ నుంచి కూడా మేయర్ పీఠాన్ని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్‌రెడ్డి పదవీ కాలం ముగియనుండడంతో ఈ సారి మేయర్ పీఠంపై కూర్చోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా సామంచి శ్రీనివాసులు కూడా మేయర్ పీఠాన్ని ఆశిస్తున్నట్లు తెలిసింది. భాను మాత్రం.. తన పలుకుబడిని ఉపయోగించి.. కేంద్రం నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే.. డివిజన్ల కేటాయింపులోనూ మూడు పార్టీల దారులు ఒక్కో రకంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ అడిగేవే జనసేన కూడా అడుతున్నట్లు తెలుస్తోంది. మరో వైపు బీజేపీ కూడా కార్పొరేషన్ ఎన్నికల్లో కొన్ని డివిజన్లు అడుగుతున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. మొత్తానికి తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు.. కూటమికి చిక్కులు తప్పేలా లేవని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. -
శ్రీవారి దర్శనానికి 20 గంటలు
● రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం 6.94 తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 29 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. గురువారం అర్ధరాత్రి వరకు 69,771 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,888 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో రికార్టు స్థాయిలో హుండీలో రూ.6.94 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారికి 3 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. -
వైరాలజీ ప్రయోగశాలకు ఐఎస్ఓ గుర్తింపు
తిరుపతి సిటీ: ఎస్వీయూ వైరాలజీ విభాగం ప్రయోగశాలలకు ఐఎస్ఓ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా అక్రిడిటేషన్‌తో పాటు, విద్యాసేవలు, శక్తి నిర్వహణ, పర్యావరణ నిర్వహణ, లింగ సున్నితత్వానికి సంబంధించిన మూడు ధ్రువీకరణ పత్రాలను ప్రయోగశాలకు అందజేశారు. ఐఎస్ఓ గుర్తింపు రావడం పట్ల వీసీ టాటా నర్సింగరావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు. పరిశోధన అవకాశాలపై వర్క్‌షాపు తిరుపతి సిటీ: ఎస్వీయూ వైరాలజీ విభాగం విద్యార్థులు, పరిశోధకులలో అంతర్జాతీయ పరిశోధనా అవకాశాల గురించి అవగాహన కల్పించడం, సమర్థవంతమైన ప్రాజెక్ట్ ప్రతిపాదనలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో జర్మనీలో పరిశోధనా అవకాశాలు, ప్రాజెక్ట్ ప్రతిపాదన రచన అనే అంశంపై వర్సిటీలో వర్క్‌షాపు నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి సైన్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఆచార్య ఓవీఎస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పరిశోధనా నైపుణ్యాలను బలోపేతం చేసుకోవాలని సూచించారు. చైన్నెకి చెందిన డీఏఏడీ సమాచార కేంద్రం ప్రాంతీయ అధికారిణి ఆచార్య ఆంటోనెట్ స్టీఫెన్ జర్మనీలో ఉన్నత విద్య, పరిశోధన అవకాశాలు, విద్యార్థులు, పరిశోధకులకు అందుబాటులో ఉన్న వివిధ మార్గాలు, విద్యా, పరిశోధనా సహకారాలకు మద్దతు ఇవ్వడంలో డీఏఏడీ పాత్ర గురించి విలువైన సమాచారాన్ని అందించారు. ప్రొఫెసర్ వసుధారాణి దేవనాథన్, ప్రొఫెసర్ రజని, అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారు. -
నిందితులకు ఐదేళ్ల జైలు
తిరుపతి లీగల్ : ఎరచ్రందనం దుంగల అక్రమ రవాణా కేసులో తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లా, పోలూరు తాలూకా, కోయిలాంబూర్కు చెందిన ముత్తుస్వామినాథన్కు ఐదేళ్ల జైలు శిక్ష, ఆరు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తిరుపతి నాల్గవ అదనపు జిల్లా జడ్జి, రాష్ట్ర ఎరచ్రందనం కేసుల విచారణ సెషనన్ జడ్జి కోర్టు ఇన్చార్జ్ జడ్జి అర్చన శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం.. ఎరచ్రందనం అక్రమ నిరోధక దళం 2018లో శేషాచలం, టీఎన్ పాలెం సెక్షన్, మేకలబండ అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలో స్వామినాథన్ ఎరచ్రందనం దుంగలు తరలిస్తూ సిబ్బందికి పట్టుబడ్డాడు. ఫారెస్ట్ సిబ్బంది అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. నేరం అతనిపై రుజువు కావడంతో న్యాయమూర్తి అతనికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. అలాగే మరో కేసులో వైఎస్సార్ కడప జిల్లా, సానిపయ్య రేంజ్, పింఛ సెక్షన్, దిన్నెలబీట్, ఏడు ఆవుల ధర్తీ అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి ఏడు ఎరచ్రందనం దుంగలను తరలిస్తున్న కేసులో తమిళనాడు, విల్లుపురం జిల్లా, చిన్న సేలం తాలూకా, ఇన్నాడు గ్రామానికి చెందిన కె.రాజీవ్‌గాంధీకి ఐదేళ్ల జైలు శిక్ష, ఆరు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
బాబు పాలనలో కరువు విలయతాండవం
తిరుపతి మంగళం : చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసిన దాఖలాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాడంటే ఇక పంటల పరిస్థితి ఏమిటి దేవుడా అంటూ రైతుల గుండెల్లో దడ పుడుతుందన్నారు. చంద్రబాబు పాలనలో అతివృష్టి, అనావృష్టే తప్ప సమృద్ధిగా వర్షాలు కురిసే పరిస్థితి ఉండదన్నారు. ఎకనామిక్స్ టైమ్స్ పత్రిక వారు చంద్రబాబుకు వాటర్‌మెన్ బిరుదును ఎగతాళితో ఇచ్చినట్లుగా అనిపిస్తోందన్నారు. సకాలంలో వర్షాలు లేక కరువు విలయతాండవం చేస్తోందన్నారు. డ్యామ్‌లు, చెరువులు ఎండిపోయి సాగు, తాగునీరు లేక అటు రైతులు, ఇటు ప్రజలు అల్లాడుతున్నారని వాపోయారు. 1995– 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ఉన్నపుడు 1,400 మండలాలకు గాను 1200 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించారని గుర్తుచేశారు. 2014–19వరకు కరువు, అతివృష్టి వచ్చిందన్నారు. చంద్రబాబు, కరువు ఒకే కడుపున పుట్టిన కవల పిల్లలు అని ఎద్దేవా చేశారు. స్వామి భక్తి కన్నా చంద్రబాబు భక్తే ఎక్కువా? తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ డిప్యూటీ ఈవోగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన భాస్కర్‌కు స్వామి భక్తి కన్నా చంద్రబాబు భక్తే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోందని భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపైన ఎంత అపారమైన భక్తి ఉన్నా దానిని మనసులో దాచుకోవాలే తప్ప మీ ఫోన్ వాట్సాప్ డీపీలో చంద్రబాబుతో కలిసి ఉన్న ఫొటోను పెట్టుకోవడం స్వామి సేవకుడిగా, టీటీడీ ఉద్యోగిగా సరికాదన్నారు. ఇప్పటికే పూర్వ డిప్యూటీవో లోకనాథన్యాదవ్ మీద దాడి చేయడం వెనుక చాలా పేర్లు బయటికి వస్తున్నాయని, వీళ్లందరూ ఆ ఉద్యోగం కావాలనుకున్నవారేనన్నారు. -
అక్రమ కేసులతో భయపెట ్టలేరు
నాయుడుపేట టౌన్: అక్రమ కేసులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలను భయపెట్టలేరని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యలు తేల్చిచెప్పారు. శుక్రవారం నాయుడుపేట పట్టణంలోని ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ పెళ్లకూరు మండల పరిధిలోని చిల్లకూరులో జరిగిన చిన్నపాటి ఘటనను పెద్దదిగా చూపించి, ఒత్తిడితో మృతి చెందిన విషయాన్ని హత్యాయాత్నంగా చిత్రీకరించి తీవ్రమైన సెక్షన్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై నమోదు చేయడం దారుణమన్నారు. ఈ ఘటనతో సంబంధం లేని వ్యక్తులను సైతం కేసుల్లో ఇరికిస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణరెడ్డిపై అక్రమ కేసు నమోదు చేయడాన్ని ఖండించారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఇక్కడి పోలీసుల తీరుపై గవర్నర్‌తో పాటు డీజీపీ, ఎస్పీలకు ఫిర్యాదు చేస్తామన్నారు. అవసరమైతే ప్రైవేట్ కేసులు సైతం దాఖలు చేసి న్యాయపోరాటానికి సన్నద్ధమవుతామని వారు స్పష్టం చేశారు. యథేచ్ఛగా ఇసుక, మట్టి దందా నియోజకవర్గంలో ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ దందాతో సాగుతోందని మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య ఆరోపించారు. అక్రమాలను ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేసి భయపెట్టాలని చూడడం అవివేకమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్యనారాయణరెడ్డి మండలంలో ఉంటే టీడీపీ, కూటమి నాయకుల నాటకాలు సాగవనే దుర్బుద్ధితో టీడీపీ నేతలు ఆయనపై అక్రమ కేసులు బనాయించి రిమాండ్‌కు పంపారని తెలిపారు. ఘనంగా ఎంపీ మిథున్‌రెడ్డి జన్మదిన వేడుకలు నాయుడుపేట ఆర్అండ్బీ అథితిగృహం వద్ద రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి జన్మదిన వేడుకలను తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సారథ్యంలో నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్‌చేసి మిథున్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు కలిక మాధవరెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కామిరెడ్డి రాజారెడ్డి, మద్దాల సోమశేఖర్‌రెడ్డి, ఓజిలి మండల పార్టీ అధ్యక్షుడు పాదర్తి హరినాథ్‌రెడ్డి, పెళ్లకూరు ఎంపీపీ శేఖర్‌రెడ్డి, పెళ్లకూరు పార్టీ అధ్యక్షుడు ఒబ్బు వెంకటరత్నం, ఈదా రత్నశ్రీ, చదలవాడ కుమార్, పట్టాభిరెడ్డి పాల్గొన్నారు. -
చోరీ సొత్తు స్వాధీనం
తిరుపతి క్రైం : సీసీ కెమెరాలు, జీపీఎస్, ఇతర సాంకేతిక ఆధారాలను ఉపయోగించి తిరుపతి ఈస్ట్ పోలీసులు పలు దొంగతనం కేసులను ఛేదించారు. ఐదు కేసుల్లో నలుగురు నిందితులను అరెస్టు చేసి.. ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, బంగారు గొలుసు తదితరాలు కలిపి సుమారు రూ.13.8 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ఈస్ట్ పోలీస్ స్టేషన్న్ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసుల దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో పాటు స్థానికంగా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి నిందితులను గుర్తించారు. కేసుల వివరాలను తిరుపతి జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ (అడ్మినిస్ట్రేషన్న్) ఆర్ల శ్రీనివాసులు, అడిషనల్ ఎస్పీ (లా అండ్ ఆర్డర్) కె.రవిమనోహరాచారి వెల్లడించారు. ట్రాక్టర్ చోరీ కేసులో.. జమ్మలమడుగుకు చెందిన గొంగాటి మల్లికార్జున్న్రెడ్డి (38)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు రూ.9 లక్షల విలువైన ట్రాక్టర్, ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అలిపిరి పోలీస్ స్టేషన్న్ పరిధిలో జరిగిన మరో ట్రాక్టర్ చోరీ కేసులో ఇంజిన్‌ను కూడా దొంగిలించినట్లు వెల్లడైంది. దీంతో ఆ కేసుకు సంబంధించిన సుమారు రూ.1.5 లక్షల విలువైన ఇంజిన్, ట్రాలీని రికవరీ చేశారు. మూడు బైక్‌లు స్వాధీనం రోడ్డుపై తాళాలు వేసి నిలిపిన ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న దాయనబోయిన రవి (55)ని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు రూ.50 వేల విలువైన హీరో ప్లెజర్, మరో రూ.50 వేల విలువైన హీరో స్ల్పెండర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా పిడుగురాళ్లకు చెందిన శివరాత్రి చందు (23) దొంగిలించిన రాయల్ ఎన్న్ఫీల్డ్ బైక్‌ను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.90 వేల విలువైన బైక్‌లను రికవరీ చేశారు. చైన్‌స్నాచింగ్ కేసు ఛేదన వృద్ధురాలి మెడలోని 35 గ్రాముల బంగారు గొలుసును అపహరించిన కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. తిరుపతి డీఎస్పీ పర్యవేక్షణలో ఈస్ట్ సీఐ, ఎస్ఐలు, ఐడీ పార్టీ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలను విశ్లేషించి గిద్దలూరుకు చెందిన కొప్పాలి గీత (25)ను గుర్తించి అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి సుమారు రూ.1.4 లక్షల విలువైన 35 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. -
20 మంది రైతులపై అక్రమ కేసులు
రామచంద్రాపురం: రామచంద్రాపురం మండలం, అనుపల్లి రెవెన్యూ పరిధి, ఉప్పులవంక గ్రామంలో ఇటీవల జరిగిన భూ వివాదంలో ఏకంగా 20 మంది రైతులపై అక్రమ కేసులు బనాయించడం విస్మయానికి గురిచేస్తోంది. బాధితుల కథనం.. ఉప్పులవంక గ్రామంలోని సర్వే నం.318కి సంబంధించి నెలకొన్న వివాదంపై రైతులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఓ వినతిపత్రం సమర్పించారు. ఈ ఫిర్యాదు మేరకు తహసీల్దార్ మధుసూదనరావు ఈనెల 1న గ్రామ సర్వేయర్‌తో కలిసి క్షేత్ర స్థాయి విచారణకు వెళ్లారు. ఆపై అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి సమస్యను పరిష్కరించకుండానే అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేశారు. దీంతో బాధిత రైతులు తహసీల్దార్ కారు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తహసీల్దార్ విధులకు ఆటంకం కలిగించారనే నెపంతో పోలీసులు ఏకంగా 20 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో నలుగురు మహిళలు, ఓ చంటిబిడ్డ తల్లి ఉన్నారు. ఓ ప్రజాప్రతినిధి భార్య ఒత్తిడితోనే కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. ఓ పత్రిక విలేకరి (సాక్షి కాదు)పై కూడా కేసు నమోదు చేశారు. -
40 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
తొట్టంబేడు (శ్రీకాళహస్తి రూరల్): శ్రీకాళహస్తి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అటవీశాఖ అధికారులు ముందస్తు సమాచారం మేరకు శుక్రవారం దాడులు నిర్వహించి 40 ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అటవీశాఖ అధికారి లోకేష్ మాట్లాడుతూ.. అక్రమంగా తరలించేందుకు సిద్ధంచేసిన 40 దుంగలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వాటి బరువు 350 నుంచి 400 కిలోలు, వాటి విలువ రూ.1.5 లక్షలు ఉంటుందన్నారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఎస్వీయూ వీసీకి అరుదైన గౌరవం తిరుపతి సిటీ: ప్రముఖ అంతర్జాతీయ సైంటిస్ట్, ఎస్వీయూ వీసీ టాటా నరసింగరావుకు అరుదైన గౌరవ లభించింది. భారత జాతీయ సైన్స్ అకాడమీ ఆఫ్ సైన్స్ సంస్థ ఫెలో ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ హోదాకు ఎంపికచేశారు. భారతదేశంలో ప్రసిద్ధి చెంది, 1930లో స్థాపించబడిన నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో 2026, డిసెంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించనున్న 96వ సంవత్సరిక సదస్సులో దీనిని అందజేయనున్నట్లు అకాడమీ ప్రకటించింది. దేశంలో ఇలాంటి ఫెలోషిప్ హోదా పొందిన కొద్ది మంది సైంటిస్టుల జాబితాలో వర్సిటీ ఉపకులపతి ఆచార్య టాటా నరసింగరావు చేరడం పట్ల పలువురు వర్సిటీ అధికారులు, అధ్యాపకులు హర్షం వ్యక్తంచేశారు. -
సెల్‌ఫోన్ కోసం బావిలోకి దిగి ఇద్దరి మృతి
తిరుపతి క్రైం : సెల్‌ఫోన్ కోసం బావిలోకి దిగిన ఇద్దరు వలస కూలీలు విషవాయువులు పీల్చి మృతి చెందిన ఘటన తిరుపతిలో శుక్రవారం చోటుచేసుకుంది. అలిపిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎస్బీఐ ట్రైనింగ్ సెంటర్ వెనుక ఉన్న బావిలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా విషాదం అలముకుంది. మృతులను ఒడిశా రాష్ట్రానికి చెందిన వలస కూలీలు భీమ్రాజ్ (36), నరేష్ (21)గా గుర్తించారు. బావిలో సెల్‌ఫోన్ పడిపోవడంతో దానిని తీసేందుకు భీమ్రాజ్ దుప్పట్లను తాడులా కట్టి బావిలోకి దిగాడు. అయితే ఎంతసేపటికీ అతడు బయటకు రాకపోవడంతో నరేష్ కూడా అతడిని కాపాడేందుకు బావిలోకి దిగాడు. ఈ క్రమంలో విషవాయువులు పీల్చడంతో ఇద్దరూ బావిలోనే మృతి చెందినట్లు సమాచారం. అలిపిరి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బావిలో విషవాయువులు ఉన్నట్లు గుర్తించడంతో ఫైర్ సిబ్బంది లోపలికి దిగేందుకు సాహసించ లేదు. అనంతరం పాతాళభేరి సహాయంతో మృతదేహాలను బావిలో నుంచి వెలికితీశారు. మృతి చెందిన యువకులు -
ఆటోను ఢీకొట్టిన పాల లారీ
నాయుడుపేట టౌన్: మండల పరిధిలోని పండ్లూరు గ్రామ సమీపంలో జాతీయ రహదారి పక్కనే నిలబెట్టి ఉన్న ఆటోను వెనుక నుంచి వస్తున్న పాల లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఓజిలి మండలం, ఆచర్ల పార్లపల్లి గ్రామానికి చెందిన రమేష్(32) తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మరో కార్మికుడు సుబ్బయ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆటోలో ఉన్న మరో ఐదుగురు కార్మికులకు గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం.. ఆచర్లపార్లపల్లి గ్రామం వద్ద నుంచి మండల పరిధిలోని అయ్యప్పరెడ్డిపాళెం గ్రామ సమీపంలో ఎంపీ షుగర్ పరిశ్రమ వద్ద చెట్లను నరికేందుకు కూలీలను తీసుకుని ఆటో బయలుదేరింది. పండ్లూరు గ్రామ సమీపంలోని జాతీయ రహదారి పక్కన నిలబెట్టుకుని కార్మికులకు టిఫిన్స్లు కట్టించుకునేందుకు ఇద్దరు కిందకు దిగారు. ఈ క్రమంలో గూడూరు వైపు నుంచి వేగంగా వస్తున్న పాల లారీ రోడ్డు పక్కన నిలబెట్టిన ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ క్రమంలో ఆటో పక్కన నిలబడి ఉన్న రమేష్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సుబ్బయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ఉన్న మరో ఐదుగురు కూలీలకు రక్తగాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్స్‌తో పాటు హైవే అంబులెన్స్‌లలో నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన పాల లారీని అదుపులోకి తీసుకున్నారు. సుబ్బయ్యను మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
బాధ్యతల స్వీకరణ
తిరుపతి అర్బన్: తిరుపతి సెట్విన్ సీఈవోగా పనిచేస్తున్న యశ్వంత్‌కు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. ఆ మేరకు ఆయన కలెక్టరేట్లోని సోషల్ వెల్పేర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి హరీష్ శిక్షణ నిమిత్తం దీర్ఘకాలిక సెలవులో వెళ్లడంతో ఆ బాధ్యతలను సెట్విన్ సీఈవోకు అదనంగా అప్పగించారు. రైలు కిందపడి గుర్తుతెలియని మహిళ మృతి సూళ్లూరుపేట: పట్టణం పరిధిలోని ఇసుకమిట్ట సమీపంలో దిగువ రైల్వేలైన్, గూడూరు–చైన్నె మార్గంలో సుమారు 50 నుంచి 55 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని మహిళ శుక్రవారం రైలు కిందపడి మృతి చెందింది. రైల్వే పోలీసుల కథనం.. గుర్తు తెలియని మహిళ తెలుపు రంగుపై బ్లూ కలర్ , ఫింక్ కలర్ పూల డిజైన్ కలిగిన చీర, తెలుపు రంగు జాకెట్, పసుపు రంగు లంగా ధరించి ఉంది. కుడి ఛాతీపై ఒక నల్లని పుట్టుమచ్చ, ఎడమ మో చేయి పైన పుట్టు మచ్చలు ఉన్నాయి. మృతురాలిని గుర్తించేందుకు ఎటువంటి ఆధారాలు దొరక్కపోవడంతో మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతురాలి ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ కే శ్రీనివాసరావునను సంప్రదించాలని, లేదంటే 70360 43535, 95732 45266 నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు. నేడు జాతీయ లోక్‌అదాలత్ తిరుపతి లీగల్ : తిరుపతి కోర్టు ఆవరణలో శనివారం ఉదయం 10.30 నుంచి జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహించనున్నట్టు తిరుపతి మూడవ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ ఎం.గురునాథ్ శుక్రవారం తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవ సంస్థ ఆదేశాల మేరకు ఈ జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహించనున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. కేసుల పరిష్కారం కోసం ఈ లోక్‌అదాలత్‌లో ఐదు బెంచులను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆ బెంచులకు అధ్యక్షులుగా తనతో పాటు తిరుపతి నాల్గవ అదనపు జిల్లా జడ్జి అర్చన, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్పిడి.వెన్నెల, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లెనిన్‌బాబు, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి రమాదేవి వ్యవహరిస్తారన్నారు. కోర్టులలో పెండింగ్‌లో ఉన్న సివిల్ కేసులు, రాజీ కాదగిన క్రిమినల్ కేసులు, వివాహ సంబంధ కేసులు, మోటార్ వాహన ప్రమాద కేసులు, వ్యాజ్యం వేయని కేసులు తదితర కేసులను ఈ లోక్ అదాలత్ లో పరిష్కరిస్తామన్నారు గంజాయి కేసులో మహిళకు రిమాండ్ తిరుపతి లీగల్ : ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు కిలోలకు పైగా గంజాయిని తరలిస్తున్న కేసులో చిత్తూరు, మంగసముద్రం, లెనిన్ నగర్‌కు చెందిన బి.లక్ష్మీదేవికి 14 రోజులపాటు రిమాండ్ విధిస్తూ తిరుపతి మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి రమాదేవి శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. -
నైలెట్ తరలింపుపై నేడు జెన్‌జెడ్ ర్యాలీ
తిరుపతి సిటీ: ‘‘ఇది రాజకీయ కార్యక్రమం కాదు.. పార్టీల జెండాలు అసలే ఉండవు.. యువత భవిష్యత్తుకు భరోసానిచ్చే నైలెట్ శాశ్వత క్యాంపస్‌ను కుట్రతో తిరుపతి నుంచి తరలించే ప్రయత్నాన్ని అడ్డుకుందాం.. తిరుపతి ఆత్మ గౌరవాన్ని నిలబెడదాం.. ఎస్వీయూకు తలమానికంగా నిలిచిన కేంద్ర ప్రభుత్వ సంస్థను తిరుపతి నుంచి తరలించవద్దని ప్రభుత్వాన్ని నిలదీయడం.. తరలింపు కుట్రను అడ్డుకోవడం.. ఇదే జన్‌జెడ్ భారీ ర్యాలీ ప్రధాన ఉద్దేశం’’ అని విద్యార్థి, యుజవన సంఘాల నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం 10గంటలకు ఎస్వీయూ రెండో గేటు నుంచి వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద వరకు భారీ ఎత్తున విద్యార్థులు, నిరుద్యోగ యువతతో జెన్‌జెడ్ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం ఎస్వీయూ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ ర్యాలీలో పార్టీల కతీతంగా యువత, విద్యార్థులు, పలు పార్టీలకు చెందిన నేతలు, మేధావులు, స్థానికులు హాజరై ప్రభుత్వ కుట్రపై గళమెత్తనున్నారు. -
బాబు, కరువు కవలలు!
తిరుపతి మంగళం : రాష్ట్రంలో చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువు పలకరిస్తుందని, దాంతో రాష్ట్ర ప్రజలంతా అల్లాడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాయం వద్ద గురువారం వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ మేయర్ శిరీష, పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నీలం బాలాజీతో పాటు పార్టీ శ్రేణులు అధిక సంఽఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ అధికార దాహంతో ప్రజలకు చంద్రబాబు చేస్తున్న ద్రోహం, వంచనపై భగవంతునికి, ప్రకృతికి సైతం కోపం వచ్చిందని, దాంతో సకాలంలో వర్షాలు కురవక ప్రజలు తాగునీరు కూడా లేక అల్లాడిపోతున్నారన్నారు. చంద్రబాబు ఎప్పుడూ అధికార కోసం తప్ప ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించరన్నారు. అందుకే రాష్ట్రంలో 120 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా కరువుతో, ఏడాది పొడువునా ఉక్కపోతతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1,400 మండలాల్లో 1,250 మండలాలను కరువు మండలాలుగా, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 67 మండలాలు ఉంటే 66 మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తున్నారంటే చంద్రబాబుపై ప్రకృతి కూడా ఏ విధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోందో అర్థమవుతోందన్నారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రమంతా కరువే అపరభగీరథుడు వైఎస్సార్ రాష్ట్రంలో ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించడానికి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చిన భగీరథుడు వైఎస్.రాజశేఖరరెడ్డి అని భూమన గుర్తుచేశారు. అప్పట్లో కండలేరు రిజర్వాయర్ దగ్గర పైప్ లైన్ ద్వారా నీరు తరలించాలని పోరాటం చేశామని, గాలేరు– నగరి కోసం 600 కి.మీ పాదయాత్ర చేశామని గుర్తుచేశారు. 2వ పైప్‌లైన్ ద్వారా తెలుగు గంగ నీటిని తిరుపతి ప్రజలకు అందించడానికి టీటీడీ ద్వారా రూ.50 కోట్లు తాము తీసుకొస్తే వాటిని రాజకీయ కక్షతో ఆపేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఇప్పటికే తిరుమలలో ఉన్న రెండు డ్యామ్‌లు మూడు నెలలకే సరిపోతాయని అధికారులు ప్రకటించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. 25 ఏళ్ల క్రితం తిరుమలకు తాగునీటి సమస్య రావడంతో ట్యాంకర్లతో నీటిని తరలించిన పరిస్థితి చంద్రబాబు పాలనలోనే అన్న విషయాన్ని గుర్తుచేశారు. తాగునీటి సమస్యపై ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు. తిరుపతిలో ఆందోళనలు చేపడుతున్నామన్న కక్షతో తమ కుటుంబ ఆస్తులపై దౌర్జన్యం చేస్తూ, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ జైళ్లకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొని వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు. -
సన్నగా దండుకో
తిరుమలలో మాక్ డ్రిల్ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు మాక్ డ్రిల్ నిర్వహించారు. సన్న బియ్యం పంపిణీ గాలికి! సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి జిల్లాలో పౌరసరఫరాల శాఖ తీరు అధ్వాన్నంగా మారింది. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు సన్న రకం బియ్యం అందజేస్తామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ప్రచారానికే పరిమితమైంది. ఒక ప్రజాప్రతినిధి, జిల్లా ఉన్నతాధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ పేదల ప్రయోజనాలను గాలికి వదిలేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మిల్లర్లతో కుమ్మకై ్క నాసిరకం బియ్యాన్ని ప్రజలకు అంటగడుతూ కోట్లాది రూపాయల దందా నడిపిస్తున్నారని లబ్ధిదారులు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. దందా షురూ గతంలో కాకినాడలో పనిచేసిన సమయంలో తీవ్ర అక్రమాలకు పాల్పడిన ఒక వివాదాస్పద అధికారిని ఏరికోరి ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన తిరుపతికి బదిలీ చేయడం వెనుక ఉన్న మర్మమేమిటని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఇక్కడ కూడా మిల్లర్లతో చేతులు కలిపి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాల్సిన మరొక అధికారి గతంలో నెల్లూరులో అడ్డగోలు వ్యవహారాలు నడిపి, ఇప్పుడు తిరుపతిలో నాణ్యత లేని బియ్యానికి మంచి మార్కులు ఇస్తూ మిల్లర్ల నుంచి భారీగా ముడుపులు దండుకుంటున్నారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం బియ్యం రైస్ మిల్లుల వద్ద ప్రత్యేక కౌంటర్లు తెరిచి సన్న బియ్యం పంపిణీ చేయాలన్న కూటమి ప్రభుత్వ ప్రకటనలు కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయి. కౌంటర్లు తెరిచామని కాగితాల్లో లెక్కలు చూపుతున్న అధికారులు, వాస్తవానికి నాణ్యమైన బియ్యం అందకుండా గండికొడుతున్నారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న బియ్యం తినడానికి పనికిరావడం లేదని, వండినా ఉడకక దుర్వాసన వస్తుండడంతో పశువుల దాణాకు తప్ప మనుషులకు ఉపయోగపడడం లేదని కార్డుదారులు వాపోతున్నారు. మంత్రి అండదండలతో అవినీతి అధికారుల లాలూచీ వల్ల పేదల కడుపు కొడుతున్నారని ప్రజలు ధ్వజమెత్తుతున్నారు. సీఎం సొంత జిల్లాలోనే ఇలాంటి అక్రమాలు జరగడం సిగ్గుచేటని, తక్షణమే విచారణ జరిపి బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేసి, నాణ్యమైన సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
అంతా ఉత్తిదే
● టీడీఆర్ బాండ్లలో అవకతవకలు మా దృష్టికి రాలేదు సాక్షి టాస్క్‌ఫోర్స్: తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గత ప్రభుత్వ హయాంలో మాస్టర్ ప్లాన్ రోడ్ల కోసం జారీచేసిన ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) బాండ్లలో అవకతవకలు జరిగాయని, ఇందులో ప్రజాప్రతినిధులు, అధికారుల ప్రమేయం ఉందంటూ వచ్చిన ఆరోపణలు అసెంబ్లీ సాక్షిగా అసత్యాలని తేలిపోయాయి. ఈ విషయంపై తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సంబంధిత మంత్రిత్వ శాఖకు లిఖిత పూర్వక జవాబు కోసం నోటీసు అందించంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ అధికారులు ఎమ్మెల్యే నోటీసుకు జవాబు ఇస్తూ తమకు విజిలెన్స్ శాఖ నుంచి టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి సంబంధించి ప్రజాప్రతినిధులు, అధికారులపైన ఎటువంటి రిపోర్టులు అందలేదని సమాధానం ఇచ్చారు. దీంతో టీడీఆర్ బాండ్ల కుంభకోణం అంటూ అసత్య ప్రచారం ఉత్తదే అని తేలిపోయింది. కొనసాగుతున్న బిల్ కలెక్టర్ల దీక్ష తిరుపతి రూరల్: డిజిటలైజేషన్ పేరుతో ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు బిల్ కలెక్టర్లను ఉద్యోగం నుంచి తొలగించడంతో వారి కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి. ఉద్యోగం తిరిగి ఇవ్వాలని, లేదంటే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ గత 25 రోజులుగా కుటుంబాలతో కలిసి దీక్ష కొనసాగిస్తున్నారు. గురువారం పుత్తూరు, నాగలాపురం, పిచ్చాట్టూరు ప్రాంతాలకు చెందిన బిల్కలెక్టర్లు, వారి కుటుంబీకులు పాల్గొన్నారు.


