ఏం సమాధానం చెబుతారో?
పవిత్రమైన తిరుమల ప్ర సాదంపై గుడిమెట్లు కడిగి మరీ సీఎం, డెప్యూటీ సీఎంలు దుష్ప్రచారం చే శారు. అసత్యపు ఆరోపణ లు చేశారు. అయితే విచా రణలో సీబీఐ ఎటువంటి కొవ్వు కలపలేదని తేల్చింది. ఇప్పుడు సీఎంచంద్రబాబు, డెప్యూటీ సీ ఎం పవన్‌కళ్యాణ్ ఏం సమాధానం చెబుతారు. వా స్తవాలు బయటకు రాకుండా ఉండేందుకు ఉద యం నుంచి డైవర్షన్ పాలిటిక్స్‌పై ఫోకస్ పెట్టారు. సనాతన ధర్మం అంటూ మాట్లాడుతున్న పవన్‌కల్యాణ్, చంద్రబాబు భక్తులకు బహిరంగంగా క్షమా పణ చెప్పాలి. – నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి,
వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త
అప్పుడస్సలు నమ్మలేదు
గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని విచారణ చేపట్టక ముందే కూటమి ప్రధాన నేతలు దారుణంగా ప్రకటనలు చేశారు. శ్రీవారి భక్తులుగా మా కుటుంబం నమ్మలేదు కానీ కొందరు భక్తులు ఆందోళనకు గురయ్యారు. శ్రీవారి లడ్డూ తో రాజకీయాలు చేయడం బాధగా అనిపించింది. రెండేళ్లుగా సీబీఐ విచారణ కోసం ఎదురు చూస్తున్నా. నివేదికలో జంతు కొవ్వు పదార్థాలు నెయ్యిలో కలవలేదని తేల్చింది. చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వాలు ఏవైనా శ్రీవారిని రాజకీయాలకు వాడుకోవడం మంచిది కాదు.
– శ్రీనివాసన్, తమిళ భక్తుడు, తిరుపతి
●


