బంగారం ధరలు భారీగా పెరుగుతున్న తరుణంలో.. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' తన ఎక్స్ ఖాతాలో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. భవిష్యత్తులో బంగారం ఎక్కడికి చేరుతుందో అనే విషయాన్ని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
బంగారం ధర 5000 డాలర్ల కంటే ఎక్కువగా పెరిగింది. రాబోయే రోజుల్లో 27,000 డాలర్లకు చేరుతుందని కియోసాకి వెల్లడించారు. ఇప్పటికే పలు మార్లు వెండి ధరలు పెరుగుతాయని చెప్పిన కియోసాకి.. ఇప్పుడు గోల్డ్ రేటు భారీగా పెరుగుతుందని పేర్కొన్నారు. నిజంగానే ఆయన చెప్పిన మాటలు బంగారం విషయంలో జరుగుతాయా?, లేదా అనేది తెలియాల్సి ఉంది.
GOLD soars over $5000.
Yay!!!!
Future for gold $27,000.— Robert Kiyosaki (@theRealKiyosaki) January 26, 2026
భారతదేశంలో బంగారం, వెండి ధరలు
ఇండియన్ మార్కెట్లో రోజు రోజుకి పెరుగుతున్న గోల్డ్ రేటు.. ఈ రోజు (జనవరి 26) కూడా పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,950 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,48,450 రూపాయల వద్ద నిలిచింది. సిల్వర్ రేటు రూ. 10వేలు పెరగడంతో.. కేజీ వెండి ధర రూ. 3.75 లక్షలకు చేరింది.
బంగారం ధరలు పెరగడానికి కారణాలు
ద్రవ్యోల్బణం, డాలర్ విలువ తగ్గడం, భౌగోళిక & రాజకీయ కారణాలు, కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు, బంగారం సరఫరా పరిమితి, బంగారం పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్ల సంఖ్య పెరగడం మొదలైన కారణాల వల్ల బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.
ఇదీ చదవండి: 168 గంటల్లో రూ. 16వేలు పెరిగిన గోల్డ్ రేటు!


