కార్మికుల భాగస్వామ్యం 60 శాతానికి పెరగాలి
అందులో మహిళల పాత్ర కీలకం
యాక్సిస్ బ్యాంక్ అధ్యయనం వెల్లడి
వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు మహిళల భాగస్వామ్యం ఎంతో కీలకమని యాక్సిస్ బ్యాంక్ అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా చెల్లింపు పనుల్లో కార్మికుల భాగస్వామ్యం ప్రస్తుతమున్న 47 శాతం నుంచి 60 శాతానికి పెరగాలని సూచిస్తూ, ఈ విషయంలో మహిళల పాత్ర ఎంతో అవసరమని సూచించింది. జీ–20 దేశాల్లో మహిళా కార్మికుల భాగస్వామ్య రేటు భారత్‌లోనే చాలా తక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. అందులోనూ వ్యవసాయం, స్వయం ఉపాధి లేదా చెల్లింపుల్లేని పనుల్లోనే మహిళలు ఎక్కువగా భాగస్వాములై ఉన్నట్టు తెలిపింది.
దేశవ్యాప్తంగా 42 పట్టణాల్లో కాలేజీ విద్య అర్హత కలిగిన 11,000 మందిని సర్వే చేసి ఈ వివరాలను యాక్సిస్ బ్యాంక్ విడుదల చేసింది. చదువుకున్న 12.5 కోట్ల మంది మహిళలు ఉద్యోగాలకు దూరంగా ఉన్నారని, 60 శాతం పట్టభద్రులు పారితోíÙకంతో కూడిన పనుల్లో పాలు పంచుకోవడం లేదని ఈ అధ్యయన నివేదిక తెలిపింది.
భద్రతా సవాళ్లు..
ఉద్యోగాలకు వెళ్లకపోవడానికి భద్రత, రవాణా పరమైన సవాళ్లను మహిళలు ప్రధానంగా ప్రస్తావించారు. ‘‘వచ్చే 25 ఏళ్ల పాటు జీడీపీ వృద్ధి రేటును 7 శాతం స్థాయిలో కొనసాగేందుకు వీలుగా పారితోíÙకం ఇచ్చే పనుల్లో కారి్మకుల భాగస్వామ్యం తప్పనిసరిగా 47 శాతం నుంచి 60 శాతానికి పెరగాల్సిందే. ఇందుకు గాను మహిళల భాగస్వామ్యం ఎంతో కీలకం’’అని ఈ నివేదిక వెల్లడించింది. వచ్చే దశాబ్దంలో వృద్ధి అన్నది మరింత మంది మహిళలు ఉద్యోగాల్లో చేరే విధంగా కెరీర్‌లను తీర్చిదిద్దే సంస్థలకే చెందుతుందని యాక్సిస్ బ్యాంక్ మానవ వనరుల విభాగం గ్రూప్ ఎగ్జిక్యూటివ్ రాజ్‌కమల్ వెంపటి పేర్కొన్నారు. 22 శాతం మహిళా కారి్మకుల భాగస్వామ్యం అన్నది సామాజిక లక్ష్యమే కాదని, అత్యంత కీలకమైన ఆర్థిక చోదకమన్నారు.
వివాహం, తల్లికావడం వల్ల మహిళలు కెరీర్ అవకాశాలను కోల్పోతున్నారని, ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారని ఈ నివేదిక పేర్కొంది. కనుక ఈ సమస్యలకు పరిష్కారంగా ఉద్యోగాలను రూపొందించాలని సూచించింది. పిల్లల సంరక్షణ విషయంలో మద్దతునిస్తూ, తిరిగి ఉద్యోగాల్లో చేరేందుకు వీలుగా వారిని ప్రోత్సహించాలని అభిప్రాయపడింది. ‘‘ఉద్యోగాలకు డిమాండ్‌ను పెంచాలి. పట్టణ మౌలిక వసతులను మెరుగుపరచాలి. కాలం చెల్లిన చట్టపరమైన అవరోధాలను తొలగించాలి. పిల్లల సంరక్షణ వసతులు, పని ప్రదేశాల్లో సౌకర్యాలపై దృష్టి పెట్టాలి. అప్పుడే మహిళల భాగస్వామ్యాన్ని పెంచగలం’’అని యాక్సిస్ బ్యాంక్ ముఖ్య ఆర్థికేవత్త నీలకాంత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. మహిళలు మరింతగా పనిచేయగలిగిన రంగాల్లో వారికి అవకాశాలు పెంచాలని, పార్ట్‌టైమ్ అవకాశాలు కలి్పంచాలని ఈ నివేదిక సూచించింది.
ఇదీ చదవండి: బెంగళూరులో హోటళ్లు బంద్!?


