వెండి కిందికి.. బంగారం పైకి.. | Silver Falls for Third Day Gold Edges Higher | Sakshi
Sakshi News home page

వెండి కిందికి.. బంగారం పైకి..

Mar 10 2026 5:13 AM | Updated on Mar 10 2026 5:15 AM

Silver Falls for Third Day Gold Edges Higher

న్యూఢిల్లీ: వెండి వరుసగా మూడో రోజు అమ్మకాలతో నష్టపోయింది. ఢిల్లీ మార్కెట్లో కిలోకి రూ.3,400 తగ్గి (1.3 శాతం) రూ.2,68,300 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాములకు రూ.200 పెరిగి రూ.1,64,300 స్థాయికి చేరింది.

‘‘ముడి సరుకుల ధరలు గణనీయంగా పెరగడంతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు మరోసారి తీవ్రతరమయ్యాయి. దీంతో యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్ల తగ్గింపు జాప్యం కావొచ్చన్న అంచనాలు పెరిగాయి. ఈ పరిస్థితులు యూఎస్‌ డాలర్, ట్రెజరీ ఈల్డ్స్‌కు మద్దతునిస్తున్నాయి. ఈ ప్రభావం బంగారం, వెండి ధరలపై పడుతోంది’’అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కమోడిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ తెలిపారు.

అంతర్జాతీయంగా చూస్తే స్పాట్‌ గోల్డ్‌ ఔన్స్‌కు 65 డాలర్లు నష్టపోయి 5,105 డాలర్ల స్థాయిలో, వెండి ఔన్స్‌కు అర డాలర్‌ తగ్గి 83.92 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. మార్కెట్‌వ్యాప్తంగా అమ్మకాలతో మార్జిన్‌కాల్స్‌ ఎదురై, పొజిషన్లను బలవంతంగా విక్రయించుకోవాల్సి రావడం సైతం బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపించినట్టు కోటక్‌ సెక్యూరిటీస్‌ కమోడిటీ విభాగం ఏవీపీ కేనత్‌ చైన్‌వాలా తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement