ప్రస్తుతానికి పెట్రోల్‌ రేట్లు పెరగవు | India will not raise petrol prices despite global crude headwinds | Sakshi
Sakshi News home page

ప్రస్తుతానికి పెట్రోల్‌ రేట్లు పెరగవు

Mar 10 2026 2:54 AM | Updated on Mar 10 2026 2:55 AM

India will not raise petrol prices despite global crude headwinds

న్యూఢిల్లీ: ముడిచమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ దేశీయంగా ప్రస్తుతానికైతే పెట్రోల్, డీజిల్‌ ధరలను పెంచే యోచనేదీ కేంద్రానికి లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికైతే ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలే అదనపు భారాన్ని భరించనున్నట్లు వివరించాయి. 

మరోవైపు, వంటగ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌ విషయంలో కనీస వెయిటింగ్‌ పీరియడ్‌ను 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా, అక్రమంగా నిల్వ చేయడాన్ని అడ్డుకోవడానికే ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఆయిల్‌ కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని తెలిపాయి. 

Advertisement
 
Advertisement
Advertisement