తల్లీబిడ్డల ‘ఎల్లిపాయ కారం’ | Mancherial Mother Daughter Runner Up Masterchef india Season-9 | Sakshi
Sakshi News home page

తల్లీబిడ్డల ‘ఎల్లిపాయ కారం’

Mar 9 2026 9:29 AM | Updated on Mar 9 2026 9:29 AM

Mancherial Mother Daughter Runner Up Masterchef india Season-9

వంటల్లో రాణిస్తున్న మంచిర్యాలకు చెందిన చందన, సాయిశ్రీ 

సోనీ టీవీ మాస్టర్‌ చెఫ్‌ ఇండియా షోతో మరింత ఫేమ్‌

 

 

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల నగరానికి చెందిన తల్లీకూతుళ్లు రాచకొండ చందన, సాయిశ్రీ కొత్త రకం వంటలను రుచి చూపిస్తూ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నారు. ఇటీవల సోనీ టీవీ మాస్టర్‌ చెఫ్‌ ఇండియా సీజన్‌–9 వంటల రియాలిటీ షోలో రన్నరప్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్శించారు. గతంలోనే ఎల్లిపాయ కారంతో వైరెటీలు చేస్తూ కొత్త రుచులను పరిచయం చేశారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లో ఎల్లిపాయ కారం పేరుతో ఓ రెస్ట్రారెంట్‌ నిర్వహిస్తున్నారు.

 చందన తన భర్త రవీందర్‌ సహకారంతో మంచిర్యాలలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఇక కూతురు సాయిశ్రీ బీటెక్‌ చేయగా.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగావకాశాలు వచ్చాయి. కానీ తనకు ఇష్టమైన వంటల రంగాన్నే ఎంచుకున్నారు. నాలుగో తరగతి నుంచే వంట చేసేందుకు ఆసక్తి చూపడంతో తల్లిదండ్రులు అదే దిశగా ప్రోత్సాహించారు. గతంలో జెమిని టీవీలో తెలుగు మాస్టర్‌లో పాల్గొన్నప్పటికీ ఫైనల్‌ వరకు చేరలేదు. తాజాగా తల్లీకూతురు మాస్టర్‌ ఇండియా చెఫ్‌ జోడిగా కొనసాగిన 45ఎపిసోడ్స్‌లో వంటల్లో వైవిధ్యతను ప్రదర్శించారు.

పుష్పరాజ్‌ చికెన్‌, స్పెషల్‌ లడ్డు
రియాలిటీ షోలో కఠిన పరీక్షలైన అగ్ని పరీక్ష, నీరు లేకుండా వంట, కట్టల పొయ్యిపై వండడం, వెజ్‌, నాన్‌వెజ్‌ వంటకాలు చేశారు. దేశంలో పలు ప్రాంతాల వంటకాల్లో మసాలాలు, పదార్థాలతో కొత్త రుచులు వచ్చేలా చేసి సత్తా చాటారు. ప్రఖ్యాత చెఫ్‌ సంజీవ్‌ కపూర్‌తోపాటు న్యాయనిర్ణేతలు వికాస్‌ ఖన్నా, రణవీర్‌ బ్రార్‌, కునాల్‌ కపూర్‌ నుంచి ప్రశంసలు అందుకున్నారు.

ఆ సమయంలో పుష్పరాజ్‌ పేరుతో వండిన చికెన్‌తో న్యాయనిర్ణేతలను ఆకర్షించారు. ‘మా రెస్టారెంట్‌లో లడ్డుకు ప్రత్యేక ఆదరణ ఉంది. మహిళలు వంట తెలియకుండానే నేర్చుకునే ఓ గొప్ప నైపుణ్యం. మా పాప అభిరుచి కోసం నేను తోడుగా నిలిచా’ అని తల్లి చందన చెబుతుంటే, అమ్మ అందించిన ప్రోత్సాహంతోనే తనకు దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తోందని సాయిశ్రీ అంటున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement