డేటా అక్కర్లేని వారి కోసం జియో ప్రత్యేక ప్లాన్లు! | Reliance Jio Launches Two Call Only Prepaid Plans as per TRAI Guidelines | Sakshi
Sakshi News home page

డేటా అక్కర్లేని వారి కోసం జియో ప్రత్యేక ప్లాన్లు!

Mar 9 2026 8:10 PM | Updated on Mar 9 2026 8:10 PM

Reliance Jio Launches Two Call Only Prepaid Plans as per TRAI Guidelines

డేటాతో పనిలేకుండా కేవలం కాలింగ్ ప్రయోజనాలు మాత్రమే కోరుకునే వారి కోసం రిలయన్స్‌ జియో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) ఆదేశాల మేరకు వినియోగదారులపై అనవసరమైన డేటా భారాలను తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

చాలా కాలంగా టెలికాం కంపెనీలు వాయిస్ కాల్స్‌ను డేటాతో కలిపి విక్రయిస్తున్నాయి. దీనివల్ల ఇంటర్నెట్ వాడకం లేని వారు కూడా అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. ‘వినియోగదారులకు తమకు నచ్చిన సర్వీసులను ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలి’ అన్న ట్రాయ్ సూచనతో జియో రూ.1,178, రూ.448 ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పింది.

రూ.1,178 ప్లాన్..

దీర్ఘకాలిక వాలిడిటీని కోరుకునే వారికోసం ఈ ప్లాన్ చాలా ఉపయోగమని కంపెనీ చెప్పింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధులకు, కేవలం కాల్స్ కోసం ఫోన్ వాడే వారికి ఇది సరైన ఎంపికని తెలిపింది. దీని వాలిడిటీ 336 రోజులు. ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, మొత్తం వాలిడిటీ కాలానికి 3,600 ఎస్ఎంఎస్‌లు పొందవచ్చు.

రూ.448 ప్లాన్..

మూడు నెలల కాలపరిమితితో తక్కువ బడ్జెట్‌లో కాలింగ్ సేవలు పొందాలనుకునే వారికి ఇది అనుకూలమని కంపెనీ చెప్పింది. వాలిడిటీ 84 రోజులు. అపరిమిత వాయిస్ కాల్స్, మొత్తం 1,000 ఎస్ఎంఎస్‌లు పొందవచ్చు. అందులో ఇందులో జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ వంటి యాడ్ ఆన్ సేవలకు యాక్సెస్ ఉంటుంది.

డేటా కావాలంటే ఏం చేయాలి?

ఈ ప్లాన్లలో ప్రాథమికంగా డేటా ఉండదు. అయితే, ఒకవేళ అత్యవసరంగా ఇంటర్నెట్ అవసరమైతే వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదని జియో తెలిపింది. నేరుగా కంపెనీ అందిస్తున్న డేటా వోచర్లతో రీఛార్జ్‌ చేసుకోవచ్చని చెప్పింది.

ఇదీ చదవండి: నగరాల్లో వంటగ్యాస్ సంక్షోభం!

Advertisement
 
Advertisement
Advertisement