‘మోదీ ఒక్క ఫోన్‌ చేస్తే యుద్ధం మొత్తం..’ | One Phone Call From Modi To Israel And Iran Can End Issue UAE Envoy | Sakshi
Sakshi News home page

‘మోదీ ఒక్క ఫోన్‌ చేస్తే యుద్ధం మొత్తం..’

Mar 9 2026 7:27 PM | Updated on Mar 9 2026 7:45 PM

One Phone Call From Modi To Israel And Iran Can End Issue UAE Envoy

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇజ్రాయెల్-ఇరాన్ ఇష్యూ మొత్తం ముగియవచ్చని భారత్‌లోని యూఏఈ తొలి రాయబారి హుస్సేన్ హసన్ మిర్జా అన్నారు. ఇవాళ ఓ ఇంటర్వ్యూలో మిర్జా మాట్లాడారు. యూఏఈకి ప్రధాని నరేంద్ర మోదీతో ఉన్న సంబంధాల గురించి ప్రశ్నించగా.. మోదీ అంటే గల్ఫ్ నాయకులకు మాత్రమే కాదని,. ఆయా దేశాల ప్రజలు, వ్యాపార వర్గాల్లో కూడా ఆయనకు చాలా గౌరవం ఉందని మిర్జా చెప్పారు.  

“ఇరాన్, ఇజ్రాయెల్ అధినేతలకు మోదీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ సమస్య ముగుస్తుంది. ఒక ఫోన్ కాల్ చాలు” అని మిర్జా చెప్పారు. ప్రస్తుతం యుద్ధం చేస్తున్న ఇరాన్‌- ఇజ్రాయెల్‌ నాయకులతో మోదీకి ఉన్న సత్సంబంధాలపై ఇది ఆధారపడి ఉందని ఆయన చెప్పారు.

‘ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణలో  చేరాలన‍్న ఆసక్తి యూఏఈకి లేదు. మా భూభాగాన్ని దాడుల కోసం వాడుకోవడానికి ఇరు పక్షాలకు అనుమతి ఇవ్వము. నిజంగా చెప్పాలంటే ఇందులో మేమెందుకు చేరుతున్నామో నాకు స్పష్టంగా తెలియదు. ఈ ఘర్షణలో యూఏఈ జోక్యం చేసుకోవాల్సిన కారణం ఏమీ లేదు” అని మిర్జా వ్యాఖ్యానించారు. రెండు పక్షాలతో తాము చర్చలు జరపగలమని అన్నారు.

యూఏఈ సున్నితమైన భౌగోళిక-రాజకీయ పరిస్థితుల్లో ఉంది. అది ఇరాన్ పక్కన ఉన్న దేశం. అలాగే అబ్రహామ్ ఒప్పందాల కింద ఇజ్రాయెల్‌తో యూఏఈ పార్ట్‌నర్‌షిప్‌ కొనసాగిస్తోంది. అబ్రహామ్ ఒప్పందాలు అంటే కొన్ని అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌తో సంబంధాలు సాధారణం చేసుకోవడానికి కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందాలు.

“వాళ్లు మా భూభాగంగాపై పరస్పరం యుద్ధం చేస్తున్నారు. దీన్ని మేము అంగీకరించలేం” అని మిర్జా చెప్పారు. ఇప్పటివరకైతే నష్టం తక్కువగానే ఉన్నట్టు తెలుస్తోందని అన్నారు.

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మోజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్‌పై మరోసారి దాడులు చేసింది. బీరూట్‌లో హిజ్బుల్లా మౌలిక సదుపాయాలపై కూడా దాడి చేసింది. ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి చెప్పిన వివరాల ప్రకారం యుద్ధంగా వల్ల ఇప్పటివరకు ఇరాన్‌లో 1,332 మంది సాధారణ ప్రజలు మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement