ఏపీ రైతులపై అత్యధిక అప్పుల భారం.. | Andhra Pradesh Farmers in Debt Trap Under Chandrababu Ruling | Sakshi
Sakshi News home page

ఏపీ రైతులపై అత్యధిక అప్పుల భారం..

Mar 9 2026 4:01 PM | Updated on Mar 9 2026 4:17 PM

Andhra Pradesh Farmers in Debt Trap Under Chandrababu Ruling

ఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్ రైతులు దేశంలోనే అత్యధిక అప్పుల భారాన్ని మోస్తున్నారు. 2025, డిసెంబర్ 31 నాటికి ఏపీలో రైతన్నల నెత్తిన 3,75,254 కోట్ల రూపాయల అప్పుల భారం  పడింది. ఈ పరిస్థితిని కేంద్ర వ్యవసాయశాఖ పార్లమెంట్‌లో అధికారికంగా వెల్లడించింది. లోక్ సభలో లిఖిత పూర్వక ప్రశ్నకు  కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి  సమాధానం ఇచ్చారు. 

రైతుల పై 2,01,744 కోట్ల రూపాయల పంట రుణాల భారం ఉండగా,  టర్మ్ లోన్ భారం 1,73,510 కోట్ల  రూపాయలగా ఉంది. మొత్తం కలిపి రైతులపై 3,75,254 కోట్ల రూపాయల రుణ భారంగా మారింది. దేశంలో తమిళనాడు తర్వాత రుణభారం లో తల్లడిల్లుతున్నారు ఏపీ రైతులు.

ఫలితంగా దేశంలోనే రైతుల రుణభారంలో రెండో స్థానంలో ఏపీ ఉంది.  చంద్రబాబు నాయుడు పరిపాలనలో రైతులకు ఆదరణ కరువు అన్న దానికి ఇది సంకేతంగా నిలుస్తుంది. అరకొరగా రైతులకు వాగ్దానాలు అమలు చేస్తుండటంతో ఏపీ రైతులపై అప్పుల భారం తడిపి మోపడైంది. ఇక పక్క రాష్ట్రం తెలంగాణలో రైతులపై 1,75,960 కోట్ల రూపాయల అప్పుల భారం ఉంది. తెలంగాణలో రైతులపై క్రాప్ లోన్ 95,167 కోట్లు రూపాయలు, 80,792 కోట్ల రూపాయల టర్మ్ లోన్ గా ఉంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement