లిక్కర్‌ స్కాం​ కేసు.. వారికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు | Delhi High Court Notice To Arvind Kejriwal And Manish Sisodia Kavitha | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ స్కాం​ కేసు.. వారికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

Mar 9 2026 12:50 PM | Updated on Mar 9 2026 3:56 PM

Delhi High Court Notice To Arvind Kejriwal And Manish Sisodia Kavitha

సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తాజాగా కేజ్రీవాల్, కవిత, మనీశ్ సిసోడియా సహా మొత్తం 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ కేసులో ప్రతివాదుల నుంచి ఢిల్లీ హైకోర్టు సమాధానాలు కోరింది.

కాగా, ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో నిందితులందరినీ డిశ్చార్జ్ చేస్తూ ట్రయల్ కోర్టు(రౌస్ ఎవెన్యూ కోర్టు) ఇచ్చిన తీర్పును హైకోర్టులో సీబీఐ సవాల్ చేసిన విషయం తెలిసిందే. సీబీఐ పిటిషన​్‌పై ఈరోజు ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ సందర్బంగా ట్రయల్ కోర్టు తీర్పులో సీబీఐపై చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ట్రయల్ కోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు, వ్యాఖ్యలపై సొలిసిటర్ జనరల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈడీ కేసు విచారణ వాయిదా వేయాలని ట్రయల్ కోర్టుకు సూచిస్తూ తదుపరి విచారణ వారం రోజులు వాయిదా వేసింది. వచ్చే సోమవారం(మార్చి 16) తదుపరి విచారణ చేపట్టనుంది.  

 

Advertisement
 
Advertisement
Advertisement